Skip to content
Transcript తెలుగు
నాకు అనిపిస్తుంది గురువు గారు బాబా వారే మీ ద్వారా చాలా విషయాలు ఈరోజు చెప్పిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇలాగ materialize అవ్వడం అవును మీరు కూడా అంగీకరించడం అసలు వెంటనే I never thought I will come to I dream number one whenever I felt like ఎక్కడైనా నమ్మా అన్నా అంతేనా ఇక్కడే అని నేనేం అనలే ఎందుకంటే నాకు I dream ఏముంటో తెలీదు. వచ్చాను వచ్చి సత్యం కూడా నేను ఇప్పటికీ చెప్పకపోతే ఏమిటి ప్రయోజనం ఏంటి? ఉమ్ సత్యం చెప్పాలి లోకానికి ఉమ్ అసలు వారి లాగా గనక జీవించగలిగితే అమ్మా అసలు అంతా ఆనందమే ఉమ్ ఉమ్ నాకు ఒక వస్తువు దొరికే దాకా యాతన పడతాం. దొరికిన తర్వాత నిలబెట్టుకోవటానికి యాతన పడతాం. కడగా అది మన దగ్గర ఉండేది కాదు. పోయిన తర్వాత ఏం మిగులుతుందమ్మా? యాతన, ఆందోళన, ఆతృత పొందానన్న అహం, పోగొట్టుకున్నానన్న దుఃఖం ఇందులో ఒక లవలేశమైన ఆనందాన్ని ఇది నాకు చూపించండి ఎక్కడుందా? Yes అందువల్ల వస్తుంటాయి పోతుంటాయి అన్నట్లుగా ఉండగలిగే-- వారు అలా ఉన్నారు. ఉమ్ ఉమ్ ఎలా అయితే రాములవారు ఉమ్ ఉత్తమమైన జీవన విధానం అవును ధర్మబద్ధమైన జీవనం ఎలా ఉండాలో ఉమ్ ప్రేమ, సేవా బద్ధమైన జీవితం ఎలా ఉండొచ్చో అవును బాబా వారు చూపించారని అనిపిస్తాది గురువు గారు అంతే నేను గ్రహించిన చిన్న నిజం, నిజం రామాయణ ప్రమాణం కూడా ఒకటి ఉందమ్మా. ఏంటో తెలుసా అది? యుద్ధం అయిపోయింది, రావణుడు నశించాడు, పోయాడు. ఆయన పట్టాభిషేకానికి వచ్చారు. మొత్తం అయోధ్య నగరం అంతా అలంకరణ చేయబడింది. శ్రీరాముడి పట్టాభిషేకం. అంతఃపుర స్త్రీలంతా కూడా పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని మంగళ స్వరూపాన్ని చూస్తున్నారు అంతఃపుర స్త్రీలు, ఋషులు తర్వాత కిష్కింధ నుంచి వచ్చిన వానరులు, మిగిలిన వానరులు, లంక నుంచి తిరిగి వచ్చిన వీళ్ళంతా ఉన్నారు. ఉంటే అందరి కళ్ళు రాముడి మీద ఉన్నాయి. ఉమ్ రాముడి కళ్ళు దేన్నో వెతుకుతున్నాయి. పక్కనున్న సీత మీద లేదు, సింహాసనం మీద లేదు, స్త్రీల మీద లేదు, అంతఃపురం మీద లేదు, రాజభోగం మీద లేదు, రాజ వేషం మీద లేదు. కళ్ళు వెతుకుతున్నాయి. దూరంగా రెండు సింహాసనాల వెనక రాముడి కన్ను పడింది. అంటే పరమేశ్వరుడి కన్ను జగద్రక్షకుడు, జగదక్షుడు ఆయనే కదా. అవును కంటి చూపు నుంచి ఎవ్వరం తప్పించుకోలేం కదా. సింహాసనం వదిలి గబగబా కిందకు వచ్చాడు. వస్తే అందరూ చూస్తున్నారు. "హనుమా" అన్నాడు. ఉలుకూ పలుకూ లేదు. తాకాడు. భుజం తట్టి "హనుమా! నేను రాముడిని వచ్చాను" అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? "నీ నామంతో, నీ రూపంతో, నీ భావంతో నా కళ్ళ నిండా నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. ఉమ్ "కన్నీరు తప్పించిన నీవే రామా! కన్నీరు తప్పించు." కంట్లో నీరుండగా మసకబారిపోతుంది, వస్తువును చూడలేం. అవును తప్పించమన్నాడు. "లే" అన్నాడు. పరిహాసం చేస్తూ "లే లే" అన్నాడు. అంటే నేనే తప్పిస్తాను ఇవన్నీ చెప్పలా. "లే" అన్నాడు. లేచి చిటికెన వేలు పట్టుకొని సింహాసనం వైపు నడిపించాడు. అక్కడ ఒక శ్లోకం ఉందమ్మా. అప్పుడు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కృతం హనుమతా కార్య సమవిద్ధుః దుష్కరం మనసాపి యదన్యయైన శక్యం ధరణీతలే. అందరికీ ఆశ్చర్యం ఎవరితను, ఎవరితను, ఏమిటి ఇటువంటి కోతిలాగున్నాయన్ని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు రాముడు అని. ప్రపంచంలో శ్రీరామచంద్రుడికి ఎవరైనా సేవ చేస్తే, చేయగలిగితే, చేసినవాడు అంటూ ఉంటే అది ఒక్క హనుమ మాత్రమే. కృతం హనుమతా కార్య సమవిద్ధుః దుష్కరం ఇట్లా ఎవరూ చేయలేరు. ఆహా ధరణీతలంలో ఎవడూ లేడన్నారు. అంటే భగవంతుడి లక్షణం ఏంటంటే కృతజ్ఞత. కృతజ్ఞత. మీరే ప్రశాంతి నిలయానికి వెళ్లారు. ఉరికే అనుకుందాం. సుభలక్ష్మి గారు వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. మీరు చిన్న అమ్మాయి వెళ్లారు. వెళ్లి స్వామి దగ్గర ఒక పాట పాడారు. స్వామి మీ-మీ పట్ల ప్రదర్శించేటువంటి ఆదరణ, ప్రేమ, కురిపించే కరుణ మిమ్మల్ని ముంచెత్తుతాయి. ముంచెత్తుతాయి. ఎందుకు అంటే ఆయన ఏమంటారో తెలుసా? మీరు తప్పులు పాడి ఉండొచ్చు, అపస్వరాలు ఉండొచ్చు. ఎందుకుంటాయి ఉండవు. ఒకవేళ ఉన్నా ఆయన ఏమంటారంటే తండ్రి ముందు బిడ్డ పాడినట్లు అంటారు. ఎంత బాగుంది. ముద్దు మాట. అంతే కదా? అంతే సరే ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత అంతటితో మిమ్మల్ని పంపరు. అనుగ్రహం అంతటితో ఆగదు. ఇస్తూ ఉంటారు వస్తువులు. అవి చీరలు కావచ్చు, సారాలు కావచ్చు, ఇంకోటి ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చి- సంతోష పెట్టడం ఇష్టం సంతోష పెట్టి ఏమంటారంటే మళ్ళీ తూరి రా అంటారు. అంటే ఈసారి. ఉమ్ రాయలసీమలో తూరి అంటారుగా ఉమ్ తూరి రా అంటారు. It's a standing invitation. మళ్ళీ మీకేం ఉత్తరాలు రావు. తూరి రా అంటే మీరు వస్తారు అంతే. అక్కడున్న వాళ్ళందరూ మర్చిపోయినా వాక్యం ఫలించి మీరు time కి అక్కడ ఉంటారు. ఉమ్ ఏం కావాలి ఇది? అంటే కృతజ్ఞత స్వామి నుంచి నేను నేర్చుకున్నానమ్మా. ఉమ్ చిన్నది మీరు పాట పాడారు అంతే. మీలాగే చాలామంది వెయ్యి మంది పాడి వెళ్లిపోయారు. కానీ వెయ్యి మందిది ప్రత్యేకమైన అనుభవం unique. అది one to one. ఆహ్ ఎంత basic simple things but which can make life so glorious అని అనిపిస్తాది. Yes highly glorious అంటే ఇలాంటి చిన్న విషయాలు మనం గ్రహించట్లేదా అని ఇంత సమయం కోల్పోయామే అని ఒక దిగులు కలుగుతుంది. అవును. అంటే మనం ఒక సభలో పొందే సత్కారం మనిషి వాడు అవసరాన్ని బట్టి మనల్ని పొగుడుతాడమ్మా. ఉమ్ అవును అంతేనా? లేదు వాడికి తెలిసో తెలియకో మన మీద మనం మంచి పుస్తకం రాస్తాం. ఏమీ తెలియనోడు book గురించి బాగా మాట్లాడేసి వెళ్లిపోతాడు. వాడికేం తెలీదు. అన్నీ తెలిసినటువంటి ఒక పరమాత్మ మీరు చేసినటువంటి ఒక దాన్ని గనక ఒప్పుకున్నట్లయితేబాగా చేశావు అన్నట్లయితే నేను ఎప్పుడు అనుకుంటా లోకం మెచ్చటం నాకొద్దు లోకేశ్వరుడు మెచ్చితే చాలు ఉహు ఉమ్ చాలా ఎంత beautiful గా ఉందంటే ఇవన్నీ చదువుతా ఉన్నా. నన్ను నన్ను కాదు నేను ఏర్పరిచిన మార్గాన్ని చూడు చూడు అవును నన్ను Don't look at me look at the Essence correct Essence అంటే మాట చెప్పకపోయినా స్వామి ఇంచుమించు వారి జీవన ప్రయాణం ప్రయాణం అలాగే శైలి లౌకిక శైలి శైలి అన్నీ కూడా వారి essence is still permeating all around which is the biggest phenomenon And it is much more now Much more now After the advent ఎనభై ఆరు ఏళ్లు అయిపోయి advent అయిపోయింది అక్కడికి దేహంలో లేరు నేను ఎందుకని అంటాను when he was in form బలమురళీకృష్ణ గారు అన్న మాట repeat చేస్తున్నా when he was in form he was formless to me when he is formless he is form to me ఉమ్ Form ఎవరు ఇవ్వాల మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా ఆయన manifestation కాదా? ఇది ఎవరు plan చేశారు? ఎలా plan అయింది? ఎలా plan అయింది? అవును దీని వెనక ఏమైనా డబ్బులున్నాయా? లౌకికమైనటువంటి అవసరాలు ఏవైనా ఉన్నాయా? ఏం లేవిది. ఇది ఒక తపస్సు అంతే It is a penance in some other form. Let us just accept that. ఉమ్ అయిపోయింది ఉమ్ స్వామి దర్శనం ఇచ్చినంత అద్భుతంగా ఉంది అమ్మా నాకైతే అందరికీ మా అందరికీ ఇక్కడ Yes, yes గురువు గారు ఇప్పుడు భక్తులకి చాలా painful విషయం ఇది ఉమ్ వారు తనూని వదిలిపెట్టి వెళ్ళిన సందర్భం [నిశ్వాసం] చాలా అంటే ఎంత devastate అయి ఉంటారు కొంతమంది అయినారు attachment వల్ల అయినారు అయినారు కదా అయినారు, అయినారు చాలా మంది అందరూ ఒక నిర్లిప్త నిస్తబ్ధ స్థితిలో ఉండలేరు కదమ్మ. భక్తికి భావం ఉంది, ఆవేశం ఉంది, ఆతృత ఉంది, ఆవేదన ఉంది ఉమ్ ఆర్తి ఉంది, ఆర్ద్రత ఉంది. ఇవన్నీ భక్తిలో పార్శ్వాలు. ప్రపన్నత ఉంది. ఉమ్ ఇవన్నీ ఉన్నాయి. కర్మ క్షేత్రంలో ఒక చైత్య పురుషుడు ప్రపంచాన్ని వదిలిపెట్టారు అని అనిపిస్తుంది. కానీ భక్తులు ఏమవుతుందో స్వామి లేని పుట్టపర్తి నేను ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా తిరిగి వచ్చేటప్పుడు నేను ఎదుర్కొనే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే పుట్టపర్తిలో అన్నీ బాగున్నాయి కదా, ఇదివరకు లాగా ఉంది కదా, ఏమీ అవలేదు కదా అంటే చెప్పాను యూనివర్సిటీ బాగా నడుస్తోంది, ఆసుపత్రి ఇంకా బాగా నడుస్తోంది, water ప్రవహిస్తోంది, ప్రశాంత నిలయంలో ప్రతి కార్యక్రమం అద్భుతంగా నడుస్తున్నాయి. నిజానికి ఒక మాట చెప్తున్నాను వారు దేహంలో ఉన్నప్పుడు వారు చూసుకుంటారులే అన్నటువంటి నిర్లిప్తత, అలత్ అలసత్వం ఉండేది మనకి. ఇప్పుడు వారు దేహంలో లేరు కనుక మనం ఇంకా మరింత బాధ్యతగా పనులు జరుగుతున్నాయి, ఇంకా విస్తృతంగా జరుగుతున్నాయి అని చెప్పా. That is the impact of a phenomenon. God యొక్క impact ఇలా ఉండదు. God అంటే ఏంటమ్మా మళ్ళీ భావనే భగవంతుడు అవును ఒక వ్యక్తిని మనం God చేసాం ఆయన్ను ఎవరూ God చేయలే. నన్ను ఇంకో ప్రశ్న అడుగుతారు, స్వామిని దేవుడిగా ఎందుకు భావించాలి, ఎలా భావించాలి? అంటే నేనేమంటానంటే ఆయన దేవుడు కనుక ఇన్ని గొప్ప పనులు చేశాడు మనమేం చేయలేము ఆసుపత్రి కట్టలేము యూనివర్సిటీ పెట్టలేం అంటే ఆసుపత్రి కట్టలేం గాని ఒక bed sheet కొనివ్వగలంగా? ఉమ్ ఒక bed roll ఇవ్వగలంగా? ఒక instrument ఇవ్వగలంగా? medicines కొనివ్వగలంగా? యూనివర్సిటీ పెట్టలేకపోవచ్చు ఒక బీద పిల్లకో, పిల్లవాడికో చదువు చెప్పించగలం కదా. అట్లా అనుకోండి గానీ escape route పట్టుకోకండి. ఆయన దేవుడు కనుక చేసేశాడు అనకండి. ఇవన్నీ చేసినందు వల్ల ఆయన దేవుడయ్యాడని నిర్ణయించుకోండి అని చెప్పా. దేవుడు చేయడంలో గొప్ప ఏముందమ్మా? అవును దేవుడు మానవ రూపంలో వచ్చినప్పుడు దైవాతీతమైనటువంటి అతిమానుషమైన చర్యల ద్వారా ప్రపంచాన్ని ఒక ఆరోగ్యకరమైన మార్గంలో నడిపించడమే ఆయన చూపించిన సత్య మార్గం నా దృష్టిలో నువ్వు దైవము అనంగానే ఆయన నుంచి నీ అంతట నువ్వు విడిపోతున్నావు. అక్కడి నుంచి బద్దలు కొట్టుకుని బయటకు రా. దాన్ని ఆయన కాదని ఎవరన్నారు? ఇంకోటి, ఈయన దేవుడే అని నేను అన్నాననుకోండి ఎలా అన్నాను నేను? నాకక్కా qualification ఏంటి? Am I qualified to certify him? As God As God కాదు కదా! అంటే దైవ భూత్వా దేవం యజేత్ కదా. నేను దైవాన్ని అయితే ఆయన దైవం అని చెప్పలే ఇప్పుడు. స్వామి నన్ను రమణ మహర్షి దగ్గరికి వెళ్ళు అని పంపారు. ఆయన దైవం కనుక పంపించారు. అంతేనే. కాదు రమణ మహర్షి is not God, స్వామి is not God who am I? నాకా రెండు స్థితులు లేవు. కనుక నే అంతేనే ఆయన ఏంటో ఎలా చెప్తాం ఎలా చెప్తాం? ఇది చెప్పలేం కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చేసినటువంటి పనులన్నీ గనక మనం గమనించినట్లయితే ఒక్క దైవం మాత్రమే చేయగలడు అందువలన ఇన్ని పనులు చేసినందువలన ఆయన దేవుడయినాడు అంతే అదే possibility ని యావత్ ప్రపంచానికి చూపించారు స్వామి. దైవత్వాన్ని గ్రహించడం గ్రహించడం మనలో మన-మనకుండే శక్తిని అది ఇంకా శక్తి కూడా చిన్నపదం అయిపోతుందేమో దివ్య ప్రేమ ఇవ్వాళ ఆఫ్రికన్ countries లో నైరోబి వంటి countries లో South African or East African all over the world దానిలో స్వామిని చూసిన వాళ్ళు ఎంతమంది అమ్మా physical గా? చాలా తక్కువ. మనకిక్కడ లక్షలు కోట్లుగా కనిపించొచ్చు. కోటానుకోట్లలో కొ-కొంతమంది చూసి చూడగలిగారు. అక్కడ సత్యసాయి పేరు మీద జరుగుతున్నటువంటి విద్యా విధానం దాన్ని adapt చేసుకుంటున్నారు నైరోబిలో. ఇంకో country లో సేవా కార్యక్రమాలు నేను మలేషియా, సింగపూర్ అవన్నీ చూశా. చూస్తే ఇక్కడికంటే నిర్దుష్టంగా, ఇక్కడికంటే disciplined గా, పరమాద్భుతంగా, ఈర్ష్యలు, అసూయలు లేకుండా, ద్వేష రహితంగా, ప్రేమ పరంగా, సమాజ సేవలో నిమగ్నమై ఉన్నది ప్రపంచం. ఇది ఏమిటి impact?చందాలతో అవుతుందా? Donations తో అవుతుందా? అసలు biggest donation is వాళ్ళని వాళ్ళు అర్పించుకోవడం. అర్పించుకోవటం అది కదా energy spirit అదే Yes ఇలా మనం చేయాలి, ఇలా మనం చేయాలి. అందుకనే "న కర్మణా ప్రజయా ధనేన చాగేనైకే అమృతత్వమానశుః" అన్నటువంటి ఒక కైవల్యోపనిషత్తు లో ఒక మాట. అంటే ఏంటంటే అపారమైనటువంటి సత్కర్మలు చేశావ్, యాభై గుళ్ళు కట్టించావ్, నువ్వు అమృత పుత్రుడివి కావు, అమృతతుల్యుడివి కావు. ఒక సత్కార్యం చేశావ్. "న కర్మణా" "న ప్రజయా" నాకు రెండు లక్షల మందికి తెలిసిన very popular figure అంటామే, ఇవాళ రెండు words legend, celebrity [నవ్వు] ఆ, పిచ్చి మాటలు ఇవన్నీ చాలా అల్పమైన మాటలు. అవి దా వాడు అది అవుతున్నాడా? కాదు కదా. కాబట్టి వీళ్ళందరిలో ఎంతమంది మిగులుతారు చివరికి అంటే ఎవ్వరూ మిగలరు. నీలో ఉన్న పంచప్రాణాలే నీ ప్రాణం వదిలిపెట్టే సమయంలో సాక్షి. ఉమ్ ఇంకెవ్వరూ లేరు. అంతా బయట ఉండేవాళ్ళే. కదా. అంటే "న కర్మణా ప్రజయా ధనేన" వెళ్తుంది మీ దగ్గర, మీరు అమృత పుత్రులు అవుతారా? అవురు అవురు మరి ఎట్లా అవుతారంటే "చాగేనైకే అమృతత్వమానశుః" త్యాగం వలన మాత్రమే నువ్వు అమృత పుత్రుడువి అవుతావ్. అంటే అమృతత్వాన్ని పొందుతావ్, అమరత్వాన్ని పొందుతావ్. త్యాగం అంటే ఏంటంటే renunciation కాదు. త్యాగం అంటే ఏదో వదిలిపెట్టేసేయటం, కాశీలో కాకరకాయ వదిలిపెట్టినట్టు కాదు. కాదు కదా. ఉమ్ అది నీకు ఇష్టమని అనుకుని దాన్ని వదిలేశావు. కానీ వదిలేయటం ఒక నిమిషంలో వదిలావు గానీ జీవితాంతం వదిలాని, వదిలాని అని ఏడుస్తూనే ఉన్నావ్. ఉమ్ attachment ఎక్కడ పోయింది? "చాగేనైకే" నా కాలాన్ని, నాకున్నటువంటి సంపదలో ఒక fraction ని, నాకున్నటువంటి విజ్ఞానంలో కొంత భాగాన్ని, నేను అనుభవించినటువంటి జ్ఞానాన్ని నిరపేక్షంగా ప్రపంచానికి ఇవ్వగలిగితే అది త్యాగం. దాని వలన మాత్రమే నువ్వు అమృత పుత్రుడువి అవుతావ్. అది. వారి, వారి జీవితంలో కైవల్యోపనిషత్తు యొక్క సారానికి స్వరూపం ఏదన్నా ప్రపంచంలో ఉన్నదా అని మీరు నన్ను అడిగితే ఉమ్ స్వామి దగ్గర డబ్బు ఉంది. ఉమ్ కదా. స్వామికి నూట ఎనభై ఎనిమిది దేశాలలో ముప్పై ఎనిమిది కోట్ల మంది భక్తులు ఉన్నారు. అది వాళ్ళు ఉన్నారు. సత్కర్మలు బోలెడు చేశారు. వాటి వల్ల కాదాయన. "చాగేనైకే అమృతత్వమానశుః" ఇవేవీ నావి కాదన్నట్టుగా ఉన్నారు. అందువల్లనే నాయనా అమృతత్వాన్ని ప్రపంచానికి ఇవ్వగలిగారు. గొప్పగా ఉందండీ అబ్బా! [పాట] బ్రహ్మాండమంతయు వ్యాపించినావు ఉయ్యాలలూగుమా.. అవును కీర్తన బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నారాయన. మన perspective మారాలమ్మా. మారితే ఆయన అర్థం అవుతారు. ఏమి అర్థం కానీ బ్రహ్మ పదార్థం కాదది. అద్భుతమైన పదార్థం అది. ఒక phenomenon గురించి అసలు చెప్పే-- అంటే సంపూర్ణత్వం ఉండడమే గురువు గారు ఎంత గొప్ప, గొప్ప విషయం. అదృష్టం మీరు పొందారు. స్వామి సన్నిధి, స్వామితో కలిసి ప్రయాణించే యాభై నాలుగు ఏళ్ళ అదృష్టాన్ని మీరు పొందారు అంటే మీ జీవితంలోని సింహభాగం వారితోనే- అంతా మీ జీవితంలోని వ్యక్తిగత ఉమ్ విషయాలలో వారి ప్రమేయం ఉండేదా గురువు గారు? లేదమ్మా మీ వివాహం కావచ్చు అబ్బే అస్సలు లేదు zero zero నా zero అంటే ఎట్లా అంటే ఇన్ని సందర్భాలు, చనువులు ఏర్పడ్డప్పుడు వారు నన్ను అడగాలి కదా. ఇల్లు ఎట్లా ఉంది, ఇల్లాలు ఎట్లా ఉంది, బిడ్డలు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ అడగాలి. అందర్నీ అడిగారాయన. ఉమ్ నన్ను మాత్రం అడగలేదు. అడగలేదు. In the same breath I want to tell you and tell the whole world నేను ఆయనకి ప్రార్థన ఎన్నడూ చేయలే. నేను ఆయన ముందు చేయి జాపలే. ఎందుకంటే ప్రార్థన చేసి నేను పొందితే నేను ప్రార్థనతోనే పొందుతూ ఉంటా. అలవాటు నేను ఎన్నడూ పెంచుకోలే. రెండవది అడగలేదు. ఎందుకు అడగలేదంటే అడక్కుండానే ఇచ్చారు. When you ask it is given. When you don't ask everything is yours. ఉమ్ When everything is yours there is nothing to ask. ఇది principle. కనుక ఆయన ఎన్నడూ-- నా చదువు విషయంలో స్వామికి ఖచ్చితమైన నమ్మకం. Very brilliant, very academic ఇవన్నీ కూడా స్వామికి తెలుసు. "నీకు ఎన్ని marks లు వచ్చాయి?" ఎన్నడూ అడగలేదు. "కుటుంబం బాగుంది కదా?" అడగలేదు. ఎందుకంటే బ్రహ్మాండంగా ఉంది గనుక. ఉమ్ ఊ. "అధ్యాత్మ సాధనలో నువ్వేం తలవారు సమయం లేస్తున్నావా? ఏమన్నా jogging చేస్తున్నావా? ధ్యానంలో ఉన్నావా?" ఒక్కనాడు అడగలేదు. ఎందుకంటే అవన్నీ సహజంగా అయి జరిగిపోతూ ఉన్నాయి గనుక. ఉమ్ ఏం అడిగారు- మరి ఏం అడిగేవారు గురువు గారు ఏం అడిగేవారు కాదు. కూర్చుంటే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలకి ఇవాళ మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నా, వారు నాకు అడక్కుండా చెప్పేవారు. ఉపనిషత్తుల మీద ఒక అరగంట వ్యాఖ్యానం చేసేవారు. I could grasp. I could grasp, understand and retain. I salute your unquestioning mind. అవునండి. I never questioned Which perhaps could have wondered wondered Why am I being called here? అది What is my role? urgent గా మనం ఉపయోగపడాలని కూడా తెగ ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకొకటి Sathya Sai Seva Organizations in India ఉమ్ కొన్ని బ్రా-- hundreds of branches గురువు గారు thousands of branches and all over the world. They all know me ఉమ్ But nowhere I was an office bearer. అవును లేదు. ఎందుకంటే office bearer అనంగానే నా పరిధి చిన్నది అయిపోతుంది. అవును మళ్ళీ నాకు పోటీతత్వం పెరుగుతుంది. నాలో లేనిపోని అనేక గుణాలు పూ-- లేనివి పుడతాయి. నాకవి లేవు.It is a relation between స్వామి and me ఒకటి. అయితే దానివలన నీకు లాభం అంటే కాదు నేను organization లో నేను తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఎందుకు లేరంటే నేను దాంతోనే ముడిపడి ఉన్న. For me organization is not different from స్వామి. ఉమ్ అంతే స్వామి సంకల్పంలో నుంచి అది పుట్టింది. చూడండి ప్రపంచంలో charitable trust లు ఉన్నాయి NGOs ఉన్నాయి లేదు ఇంకేదో building corporation లు ఉన్నాయి సేవకు ఒక organization ఎక్కడైనా ఉందమ్మా? సత్య సాయి సేవా organization. అంటే organized గా సేవ చేయండి అని చెప్పటానికి అది పెట్టారు ఆయన. And ఇవాళ భక్తులు కానివ్వండి organization కానివ్వండి They are cherishing and celebrating the very divine ideals of భగవాన్ no doubt about it. We express our immense gratitude గురువు గారు మా iDream తరపున మా అందరి తరపున మా For unveiling Wonderful A wonderful phenomenon called భగవాన్ సత్య సాయి బాబా సత్య సాయి బాబా భక్తులకి పుస్తకాలు చదివి తెలియడం వేరు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు పొందిన అనుభవాలు తెలియడం వేరు. కానీ ఇవాళ మీరు భగవాన్ పక్కనే కూర్చుని వారు వింటుండగా చెప్తున్నట్టు అనిపించింది మాకు. He is a silent listener He is a silent listener Yes వారు ఇక్కడే I feel his presence so strongly Yes మొన్నటి అంటే how మీరు అంటారు కదా గురువు గారు how do you feel the impact అని I just అంటే took స్వామి with me home అన్నట్టు అనిపించింది. అంటే అటు అంత సంపూర్ణమైన ఒక లీనమైపోయి వినే అవకాశం మాకు కలిగింది మీ వల్ల గురువు గారు. చాలా సంతోషం And I salute every aspect of what you have said. Your language మీ భాష మీ భావం మీ అంటే అసలు విధమైన స్వార్థం కూడా కాదు విధమైన vested interest ని ఏమంటారు అంతేగా విధమైన స్వార్థ ప్రయోజనం లేని లేని విధమైన ప్రయోజనం అసలు ప్రయోజనమే లేని అది ఏమీ లేని స్వప్రయోజనం ఏమీ లేని అసలు ఏమీ లేని అంతా ఉన్న అది అది గురువు గారు ఇవాళ్టికి స్వస్తి పలికి ఉమ్ మనము తర్వాత మీ స్పురణను బట్టి ఉమ్ అలాగే మా మాకు ఇంకా మరింత తెలుసుకోవాలనే తపన మళ్ళీ కలిగినప్పుడు మరొక సందర్భంలో మనం ఇది కొనసాగించవచ్చు అనే ఒక open door తో possibility తోటి తప్పకుండా చాలా reluctant గా స్వస్తి పలుకుతున్నా అట్లాగే శుభం శుభం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్
YouTube · audio

సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8

Home

సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8

Source: iDream Media on YouTube

0:00 / 21:16

More in this series

Remembering Sri Sathya Sai Baba — Aaraadhanaa Mahotsavam interviews

7 episodes · 3 hr 7 min

  1. 26 min 2

    Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2

  2. 38 min 3

    సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3

  3. 25 min 4

    యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4

  4. 26 min 5

    ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5

  5. 20 min 6

    భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6

  6. 25 min 7

    ఘంటసాల పాదాల‌ను ఒత్తుతూ భ‌గ‌వాన్ క‌నిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7

  7. 20 min 8

    సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8

    Now playing