No transcript for this section.
Transcript begins at 0:19.
గురువు గారు! ఉమ్ ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్న విషయం కొంత సున్నితమైనది. ఆ ఆ భగవాన్ సత్యసాయిబాబా వారిపై ఉమ్ ఆ ఒక-ఒక సందర్భంలో చాలా మంది విలేకర్లు కావచ్చు ఆ నమ్మకం లేని వాళ్ళు కావచ్చు అనేక విధాల ఆ విమర్శించారు. ఆ God man అన్న-- అంటే రకరకాలుగా సంబోధించారు. అవును ఆ సమయంలో మీ మనోస్థితి ఎలా ఉండింది? ఆ వాళ్ళు ఏమన్నారు అనే దాన్ని అది నన్నేం బాధించలే. ఉమ్ అస్సలు బాధించలే. ఉమ్ Honest గా ఉమ్ ఏంటి నా గురువు దైవం అనుకున్న ఆయన్ని ఇలా అంటున్నారు ఏమిటని అనిపించలే. ఉమ్ ఆయన ఏమిటో నేను చెప్తే వాళ్ళకు అర్థమవుతుందిగా అనుకున్నా. వారు దేహం వదిలిపెట్టినప్పుడు ఈ దేశంలో ప్రధానంగా తెలుగునాట పత్రికలు మీడియా మహా దుష్ప్రచారం చేసినాయి. ఉమ్ చేసినాయి. ఆ రోజున ఆ అంతకు ముందు నేను పన్నెండు రోజులు అక్కడే ఉన్నా. ఎన్నడూ అనే రోజు లేను వయస్సు వచ్చాక. ఎందుకో ఉన్నాను. ఇంతలోకు వారు hospitalize అయ్యారు. నేను ఇండియాకు మన ఇంటికి వచ్చేశా. వచ్చాక ఇవన్నీ వింటున్నప్పుడు సమాధానం చెప్పాలి అని అనిపించింది. సమాధానం చెప్పా. చెప్పి ఒక ప్రముఖ పత్రికను నేను ఒక ప్రశ్న వేశా. "మీరు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో, మీకు కూడా ఎనభై ఏళ్ళు వస్తున్నాయి కదా, ప్రశాంతిలయాన్ని physical గా ఎప్పుడన్నా మీరు visit చేశారా? అక్కడ ఏదన్నా ఏం జరుగుతున్నదో మీరు చూశారా?" ఉమ్ "వారి జీవన విధానాన్ని మీరు ఎప్పుడన్నా స్పష్టంగా గ్రహించారా? దేని ఆధారంగా ఇవన్నీ మీరు రాస్తున్నారు?" అని అడిగా. ఉమ్ ఆయనకి నా యందు అపారమైన గౌరవం ఉంది గనుక "రేపటి నుంచి ఇవి రాయబడవు" అన్నారు. ఉమ్ ఉమ్ ఇక రాయబడవు. ఎందుకంటే మీరు అన్నది నిజం. నేను వెళ్ళలేదు. నేను ఆయన్ని కలవలేదు, చూడలేదు. అంతే కదా? అవును. కాబట్టి ఆ చూడకుండా మన ఎన్ని ఊహ-- అవన్నీ కూడా మన ఆలోచనలని గనుక ఆ market లో commercialize చేసుకోవాలి అంటే ఇవాళ ఉన్న అనుకూల వాతావరణం వ్యాపారికి ఉన్నది. కానీ వ్యాపారిని దాటి ఆయన ఆ నేను ఒకాయన్ని అడిగాను. ఇరవై నాలుగు pages అప్పుడు print అయ్యి వచ్చేది paper. ఆయన university పెట్టారు. అనంతపురం జిల్లాకి, West Godavari జిల్లాకి, మహబూబ్ నగర్ జిల్లాకి Chennai కి water ఇచ్చారు. ఏ government చేయలేని పని ఆయన చక్కగా చేశారు, చూపించారు model. ఎక్కడా నేను ఒక square inch ఆ ప్రస్తావన మీ paper వాడు ఎక్కడా రాయలేదు. ఎప్పుడూ రాయలే. ఇప్పుడు ఆయన దగ్గర బంగారం ఉంది, డబ్బు ఉంది, కట్టలు కట్టలు ఉన్నాయి అని మీరు ఆ చూపిస్తున్నారు multi media ఉంది కాబట్టి. మీరు అక్కడికి వెళ్లి ఆ కట్టలు చూసి రాసి ఉంటే దానికి అప్పుడు నా దగ్గర సమాధానం ఉండేది కాదు. మీరు చూడలేదు, నేను చూశాను అని చెప్పా. ఆ తర్వాత అయిపోయినయిగా. ఉమ్ అది చేసిన వాడిని నేనే, నేనే. అట్లా అని నేను అదేదో defend చేయటానికి వెళ్ళలే. ఉన్న విషయం సత్యం చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. అది అది కానీ చాలా ఉమ్ చాలా మంది భక్తులు ఉమ్ ఆ విపరీతంగా భక్తితో విరాళాలు ఇచ్చేవారు అని-అని కూడా వినికిడి గురువు గారు. వాటిపై అంటే స్వామికి ఎంత వారు భగవత్ స్వరూపులే అని మనకు తెలిసినా ఇంత ఒక వ్యవస్థ దానంతట అది ఏర్పడినప్పుడు ఆయన ఎంత నమ్మకంతో భక్తులకు అది అప్పగించి ఉంటారు? ఆ trust కావచ్చు. అవును So I-I just wonder ఆయన-ఆయన ప్రణాళిక ఎలా ఉండింది ప్రపంచం కోసం అని. దీన్లో రెండు పారుశ్వాలున్నాయి. ఎందుకంటే ఇవాళ trust చెప్పలేదు మీతో. ఉమ్ చెబితే వాళ్ళని వాళ్ళు సమర్ధించుకున్నట్లు అంటారు కదా. అవును నేను ఒక neutral person గా నేను చెప్తా. సత్యసాయి భగవానుడు ఒక will రాయలే. ఉమ్ "నా తర్వాత వీడు" అని చెప్పలే. ఎవరినీ install చేయలే. తర్వాత పద్నాలుగు వేల ఏట కుటుంబంతో ఆయన సంబంధాలు తెంచుకున్నారు. అవును భక్తులు విరాళాలు ఇచ్చారు అంటే ఇచ్చారు. కాని కి-- కానీ ఆయన హుండీ పెట్టలే. ఉమ్ డబ్బు collect చేయలే. ఆహా! మీరు free గా ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు. ఊఁ సేవ చేయండి, ప్రేమగా ఉండండి, ఇవే చెప్పారు ఆయన. కానీ మన బోటి వాళ్ళం, వెళ్తాం. ఆయన అడిగినా అడక్కపోయినా పది రూపాయలు అక్కడ పెట్టి వచ్చాం. But I tell you everything is accounted for. ఉమ్ తర్వాత ఆ trust deed రాసినటువంటి చాలా గొప్ప న్యాయవాది ఎవరంటే Palquevala. ఆహా ఆనాటి ఆయన ఆదర్శాలకు Palquevala గారు చలించిపోయి ఆ వచ్చారు. వచ్చి స్వామికి అది ఇచ్చారు. ఇస్తే చదవన్నారు స్వామి, చదివారు. చాలా బాగా రాశారు. స్వామి భావాలకు అనుగుణంగా ఈ trust ఉంది. trust form చేశారు అప్పుడు. మరి దీనికి fees ఎంత ఇవ్వాలి అని అడిగారు స్వామి. "స్వామి మీ దగ్గర నేను fees తీసుకోవటమా? ఈ మీ ఆశయాలన్నీ నేను రాస్తూ ఉన్నప్పుడు నేను కూడా మీకు ఏదన్నా contribute చేయాలని అనుకున్నాను. అందుకనే ఇదిగో" అని ఒక చెక్కుని ఇచ్చేశారు ఆయన. "Swami is a giver never a taker" అన్నారు నవ్వుతూ. ఆ He never stretched his hand before the world అమ్మా. ఉమ్ చెప్పారు "మీకున్న కష్టము, సుఖము, మీ ఉద్వేగాలు ఇక్కడ పడేయండి ఆ మూటలు. ఇక్కడి నుంచి హాయిగా ఆనందంగా ప్రపంచంలోకి మళ్ళీ వెళ్లి మీ పని మీరు చేసుకోండి. గృహస్తులంతా సన్యాసులు కాకండి. అయిపోతే ఈ ప్రపంచం నడవదు. మీరు కర్మధీర వీర గంభీర స్థితిలో జీవితం గడపాలి. ఏమి సన్యాసులై పోతే ఏం ప్రయోజనం? మీరు నిజానికి ప్రపంచానికి భారం" అన్నారు. ఆయన్ని అర్థం చేసుకోవటం అంటే ఆయన్ని ఆయన కోసం propaganda చేయటం కాదమ్మా. నువ్-- ఇవాళ నేను చెప్తున్న ప్రతి వాక్యము నా హృదయంలో నుంచి వస్తున్నది. కాబట్టి అక్కడ ఏమీ బంగారాలు, వెండి బంగారాలు ఏవీ లేవు. సామాన్యమైన ఆయన నీలికమలు చేరవేంచి తర్వాత వేలు కుర్చీలు వేయించ- చేయించారేమో గానీ ఉమ్ పాపం ఆయన ఏనాడూ ఐదారు dresses తోఒక పుట్టు పండుగ నుంచి ఇంకో పుట్టు పండుగ వరకు అవే dress ఆయనకి అవును ఆ ఆయన-ఆయన అంటే అవన్నీ ఏమనుభవిస్తారు ఏమీ లేదు అసలు ఆయన-ఆయన ఎప్పుడూ ఆయ-ఆయన్ని ఆ ప్రపంచానికి అర్పించుకున్నారు అంతే తర్వాతే ఆయన చేతికి ఉంగరాలు లేవు, మెళ్ళో గొలుసులు లేవు, కాళ్ళకి చెప్పులు లేవు, ఏమీ లేవు ఉమ్ అన్నీ ఉన్న ఆయన ఏమీ లేనట్లు ఉండటం కష్టం కదా ఉమ్ ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూ ఇంత ఉదాత్తంగా ఇంత నిరాడంబరంగా నాకు రమణ మహర్షి ఇంకా వేరే స-అవకాశం లేదు ఆయన ఆత్మ స్వరూపంగా జ్ఞానిగా నిలకడ చెందారు. ఉమ్ ఈయన జ్ఞానాన్ని విజ్ఞాన భూమిక లోకి తీసుకు వచ్చి దాన్ని కర్మ క్షేత్రంలోకి తీసుకువచ్చారు ఉమ్ కర్మ క్షేత్రంలో నుంచి భక్తి క్షేత్రంలోకి భక్తి నుంచి జ్ఞానానికి వెళ్ళాలి జ్ఞానానికి వెళ్ళాక ఇంకేం లేదనుకుంటాం అవును కానీ బాబా గారు దాన్ని reverse చేసి జ్ఞాన భూమికని భక్తి భూమికగా భక్తిని కర్మభూమికగా మార్చారు అది మార్చారు that is the beauty of ఎంత beautiful అది అవును అవును నేను జ్ఞానిని అయిపోయాను అమ్మ నన్ను ఇంకేమీ నేను ఇట్లా interview అవి ఇవి ఉండటం లేదు ఉమ్ నేను మా ఇంట్లోనే కూర్చుంటాను alright కూర్చో ఏం ఉపయోగం ఈ ప్రపంచానికి ఉమ్ నేను రావాలిగా అవును రావటం అంటే పిలిచిన చోట చెప్పవలసిన చోట చెప్పాలిగా గురువుగారు అడిగిన దానికే జవాబు ఇవ్వాలిగా లేని కల్పనలు నేను చేయకూడదుగా ఉమ్ అన్వర్ధన చేస్తే పాపం నాదే కదా ఉమ్ మరి ఇన్ని తెలిసిన నేను సత్యం చెప్పకుండా ఎలా ఉంటాను ఉమ్ కానీ సత్యం చెప్పాలంటే నేను రావాలి ఉమ్ అంతే. "ప్రౌఢప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః స్వచ్ఛస్య బోధయాత్ సత్యం అస్లితా" అని అంటారు శంకరుడు. టెన్సింగ్ నార్వే మన చిన్నప్పుడు మొట్టమొదట ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు ఎక్కాడు అవును అవునా అక్కడే ఉన్నాడా? ఎక్కి ఎలా ఎక్కాలో, ఆ encounter ఏం చేశాడో ఉమ్ అక్కడ వాతావరణం తనని ఎంత బాధించిందో, అది సాధించినప్పుడు తనకు కలిగిన విజయం ఏమిటో "నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయవచ్చు" అని మళ్ళీ కిందకు వచ్చి చెప్పాడుగా అవును సత్యసాయిబాబా వారి స్థితి అదే ఆహా! [నవ్వు] ఉమ్ అబ్బా! చాలా మాటలు చాలట్లేదు గురువు గారు అమ్మా గురువు గారు ఒక ప్రశ్న బహుశా భక్తులందరికీ తెలుసున్న విషయమేమో ఇది. మామూలుగా ఇటువంటి ఒక అవతార మూర్తి మనకి దర్శనం ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఈ లోకంలో వారి శిష్యులు గాని ఎక్కువ ఇష్టమైన ఒక శిష్యుడో శిష్యురాలോ వారి తరువాత కొనసాగింపునకు చూసుకుంటారు. మరి స్వామికి ఆ తలంపు రాకపోవడానికి దాన్ని తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి? శంకర భగవత్పాదుల సమయంలో ఆయన భారతదేశాన్ని నాలుగు చెరగులు అంటామే ఉమ్ ఆముదాయ పీఠాలు పెట్టి అద్వైత సంప్రదాయానికి వాళ్ళకి ప-పీఠాధిపతులుగా నియమించారు. ఉమ్ అంటే ఒక పరిమితమైన ఒక భారతదేశానికి నాలుగు చెరగులా ఈ ధర్మ ప్రబోధం జరగాలి అని ఆయన నిర్ణయించారు ఉమ్ అంటే ఒక కంచె కట్టారు అంతే కదా ఉమ్ ఇది నూట ఎనభై ఎనిమిది దేశాలకు విస్తరించినటువంటి సాహిత్యం ఇది ఉమ్ దీనికి ఒక అడ్డుకట్ట వెయ్యటానికో కట్టలు కట్టడానికో లేదు. ఇది ప్రధానంగా ఏంటంటే transformation కోసం వచ్చిన అవతారం ఇది. ధర్మోద్ధరణ ఇవన్నీ మనం పెద్ద మాటలు చెప్పినా మనిషిలో ఒక పరిణామం జరగాలి. ఆ, ఒక అద్భుతమైన పరివర్తన రావాలి. తనలో ఉన్న దివ్యత్వాన్ని తాను అనుగ్రహ-ద-దర్శించగలగాలి. దానికి తనకై తాను సాధన చేసుకోవాలి. సాధన ఎలా చేయాలి? లోకమును వీడి రసము లేదు మళ్ళీ ఇక్కడే ఈ లోకంలో నుంచే చేయాలి కొండ మీద కూర్చుని ఇక లాభం లేదు లాభం లేదు ఉమ్ ప్రపంచంలోకి వెళ్ళాలి. వెళ్లి నువ్వు కర్మ క్షేత్రాన్ని అనేక క్షేత్రాలుగా మార్చుకుంటూ నీ లోపలికి నీవు ప్రవేశించిన తర్వాత కూడా ప్రపంచంతో నువ్వు కూడి ఉండాలి. అందుకని వారు ఉపదేశించిన ఒక మార్గం ఏంటంటే ఇందాక help ever hurt never ఎట్లాగో love all serve all love all serve all సర్వీస్ లేని ప్రేమ ఒట్టి వృధా, కాల్పనికమైన భావన. నేను ఎవరినైనా ఒక పాప చిన్న పాపని నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ పాపకు ఒక chocolate ఇవ్వాలి. అవునా? ఇవ్వాలి. ఇస్తే నన్ను ప్రేమిస్తున్నారు ఈ తాతగారు అని అనుకుంటుంది. అంతేనా? ఉమ్ నేను ఏమీ ఇవ్వకుండా "I love you baby" అని యాభై సార్లు rhymes పాడిన దానికి అర్థం కాదు. అంటే ఏమిటంటుంది chocolate ఇస్తే అడగదు. ప్రేమ అంటే ఇదనుకుంటుంది. serve all అంటే సేవ చేయాలి. ఆ సేవ గనక చేసినట్లయితే ముందు మన అహంకారం, మమకారాలు రెండు నెమ్మదిస్తాయి. సేవలోనే చాకిరీలో విజృంభిస్తాయి. ఉమ్ చూశారా అవును అవును చాకిరీలో expectations, anticipations, ambitions, goals ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం లేదు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఎవరి కన్నీలో నేను తుడవగలిగాను, ఎవరి డొక్కో ఎండిపోతే పిడికెడు అన్నం పెట్టగలిగాను, చదువుకోవటానికి డబ్బు లేకపోతే రూపాయి ఇవ్వగలిగాను చాలుగా. ఇది నన్ను నేర్పారు. ఉమ్ ఉమ్ కాబట్టి love all serve all అనేటువంటిది ఆయన ఒక ఉదాత్త వైఖరి ఉమ్ అంతే ఆ స్వామి ఉమ్ అంటే వారు రాగద్వేషాలకి, భావోద్వేగాలకి అన్నిటికీ అతీతమైన ఉమ్ లౌకిక మార్గం ఉపదేశించారు కనుక ఆ వారిని కదిలించిన సన్నివేశాలు అంటే వారంటారు ఒక పాట కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక భక్తుడి ఆ ఆర్తి కావచ్చు ఆర్తి కావచ్చు ఏదైనా ఉమ్ మీకేమైనా గుర్తున్నాయా గురువుగారు అలాంటివి చాలా గుర్తున్నాయి ఆ ఎందుకు గుర్తున్నాయో చెప్తా ఆ రాముడు విలపించాడు అని కవులు రాస్తారు కదా. రామాయణం మనం చదువుకున్నప్పుడు సీత వెళ్ళిపోగానే అంటే రావణుడు ఎత్తుకెళ్ళినప్పుడు ఏడ్చాడు, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఏడ్చాడు ఆయన. మళ్ళీ రాజ్యం పోయినప్పుడు ఏడవలే. చూశారా ఉమ్ వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు లక్ష్మణుడు మూర్ఛపోయాడు బతుకుతాడో లేడో అన్నప్పుడు ఏడ్చాడు అని మనం చదివాం. ఉమ్ రాముడు ఏడ్చాడా? అభినయించాడా? ఉమ్ అభినయించాడు ఉమ్అనుభవించలే లోపల అనుభవించాడో మనకు తెలియదు స్వామి కూడా ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక గురువు దగ్గరికి గురువు అంటే ఒక స్థాయి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాం మన కష్టం వెళ్లబోసుకున్నాం "నీకేం పర్వాలేదు నేనున్నా" అంటాడు నా దృష్టిలో వాడు పెద్ద గురువు కాదు ఎందుకంటే నువ్వు అక్కడే ఉంటావు నేను ఇక్కడే ఉంటా నా కష్టం తీరేది కాదు ఆ అది నువ్వు ఆర్చలేవు తీర్చలేవు కానీ నేనున్నా అంటున్నావ్ కానీ స్వామి ఏం చేశారు ఒకవేళ నేను చూశాను కొంతమంది వచ్చి ఇలా ఇలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పటం నేను వినటం ఆయన అనేవారు ఒక మాట "కష్టాలు వస్తాయి" కలిసి పడదాం ఆహా మనకి కాకపోతే ఎవరికి వస్తాయి మనకి నీకు కాకపోతే అంటే సెపరేషన్ మనకి కాకపోతే ఎవరికి వస్తాయి ఆ కష్టాన్ని ఈదుతూ వెళ్ళిపోదాం కష్టం వచ్చినప్పుడల్లా కర్మనిష్ఠగా భావన చేసుకో అంతా మీ దయ ఉంటే నా దయే కాదు మీరు కూడా పని చేసుకోవాలి వెరీ రేషనల్ ఉమ్ మీకేం పర్వాలేదు ఆయన డోల్ అవుట్ అని ఒక్కరోజు ఆయన మాట్లాడలేదు అండి మాట్లాడలేదు తర్వాత నువ్వు నీ సమస్య అని అనలేదండి ఏదో కొడుకును పోగొట్టాడు కూతుర్ని పోగొట్టుకున్నారు ఏదో ఆస్తులు పోయినాయి వాడు వచ్చి ఏడ్చాడు ఆయన మూవ్ అయినట్టు కనిపించేవారు మూవ్ అయినట్లు ఆ దుఃఖంలో మీ దుఃఖంలో నాది కూడా భాగం ఉంది నేనేమీ అతీతంగా లేనన్నట్లు ఉండేవారు అట్లా అని మనలాగా భోరున విలపించటాలు అలాంటి భావోద్వేగానికి లోను కావటం లేనేలేదు ఒక్క సందర్భం నేను చూడలే ఉమ్ ఉహు మీకు ఉదాహరణ చెప్తాను ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రశాంతి నిలయానికి వచ్చారు ఆరోజు స్వామి సడన్ గా ఆమెను మాట్లాడమన్నారు ఏదన్నా మాట్లాడు అన్నారు ఆమె నెమ్మదిగా స్వామి దగ్గరికి నడుచుకుంటూ వయసు వచ్చేసింది అప్పటికి మూడు మెట్లు ఎక్కాలి స్వామి దగ్గరికి వెళ్లాలంటే పాద నమస్కారం చేసుకొని అది ఒక ఒక మంచి కల్చర్ అది ఏమిటి మన పెద్దవాళ్ళకి నమస్కరించి పనిలోకి వెళ్ళటం ఆమె ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి దగ్గరికి నెమ్మదిగా ఎక్కుతుంటే అటూ ఇటూ ఇద్దరు పట్టుకున్నారు స్వామి తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచారు లేచి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారి వైపు వెళ్లి ఆమెకి చెయ్యి అందించి పైకి తెచ్చుకున్నారు ఆ ఆమె వృద్ధాప్యంలో వంగలేక స్వామి పాదాలు వంగితే తప్ప దొరకవు కదా వంగుతున్నది భుజం మీద భుజం పక్కన అటూ ఇటూ ఆమె పడిపోకుండా రెండు చేతులు పెట్టి మాట్లాడుతున్నారు అప్పుడు ఆమె హంబుల్ గా ఏమందంటే "పాడమంటే పాడతాను గాని మాటలు రావు స్వామి" ఆహా ఆ భక్తి అంటే "ఆహా లేదు నువ్వు మాట్లాడతావు" ఆ తమిళో మాట్లాడారు ఏం మాట్లాడారు అంటే "తల్లివి నువ్వే తండ్రివి నువ్వే నేను కొలిచే దైవతాన్ని నువ్వే అన్నీ నువ్వే అయినప్పుడు నీ గురించి ఏం చెప్పను" అంతే దిస్ వస్ ది స్పీచ్ స్వామి లాఫ్డ్ వెరీ హార్ట్లీ అంటే ఆయన దైవతం అని మనం అనుకున్నాం ఆయన దైవతాన్ని దాటి దైవ అమ్మ మాధవత్వాన్ని మించింది నా దృష్టిలో మానవత్వం ఉమ్ ఇది మన కంటికి కనిపిస్తున్నది మానవత్వం మాధవత్వం అందరికీ అర్థం కాదు కదా కృష్ణుడినో రాముడినో సాయినో పూజించటంతో మనం ఆగిపోతాం పూజింపబడిన వాడు మానవీయ కోణంలో ఎలా ఉన్నాడు అనేది నాకు ప్రశ్న దట్ ఐ కుడ్ ఎంజాయ్ ఫుల్లీ స్వామి ఉమ్ అబ్బా అసలు ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారి మాట ఎంత గొప్ప మాట చాలా ఎంత దీనికి ముందు ఇంకొకటి కూడా చెప్తాను చరిత్రబద్ధమైనటువంటి ఒక మహా పరిసత్యం మీకు చెప్తాను ఘంటసాల గారు అంటే స్వామికి ఇష్టం అని నేను చెప్పాను అవును చెప్పారు అవును ఆయన ఇష్టం కేవలం బాగా పాడతాడు అని కాదు కాకపోవచ్చు ఘంటసాల గారు వారికి కూడా ఆరోగ్యం బాగో-- అనారోగ్యం ఉన్నప్పుడు ప్రశాంతి నిలయం వచ్చి ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజుల్లో దర్శనం అవుతోంది మళ్ళీ రూమ్ కి వచ్చి పడుకుంటున్నారు స్వామి మాట్లాడటం లేదు ఈయనకు కూడా ఏదో చెప్పుకోవాలని ఏం లేదు ఆవరణలో ఉండి మళ్ళీ వెళ్లిపోదాం చెన్నై అని మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయిన తర్వాత మూడో రోజు మధ్యాహ్నం ఎరౌండ్ వన్ ఓ క్లాక్ ఇన్ ది ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ ఒకాయన ఘంటసాల గారికి కాళ్ళు ఒత్తుతూ ఆయన కాళ్ళు వాచి ఉన్నాయి ఒత్తుతూ ఉన్నారు ఆ గదిలో ఠక్కున తలుపు తెరుచుకుంది లోపలికి బాబా వచ్చారు ఘంటసాల రూమ్ లోకి ఉమ్ వచ్చి అన్నారు అతను సైలెంట్ గా లేచాడు దిగ్భ్రాంతికి లోనై బాబా రావటేంటి నా రూమ్ లో ఈ రూమ్ లోకి అని ఘంటసాల గారు మాగన్నుగా నిద్రలో ఉన్నారు ఆయన కాళ్ళు ఒత్తుతుంటే నిద్ర పెట్టేసింది ఆయనకి బిలీవ్ మీ ఒక క్షణం ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూస్తే భగవాన్ సత్యసాయిబాబా వారు ఘంటసాల పాదాలు ఒత్తుతూ అక్కడ కూర్చుని ఉన్నారు ఏడ్చేశాడు ఆయన "స్వామి ఏమిటిది" "ఘంటసాల నువ్వెవరో నాకు తెలుసు నేను ఎవరో నీకు తెలియదు కానీ" అన్నారు ఇదొక చారిత్రక మహా పరిసత్యం ఇవాళ చెప్పాలి ప్రపంచానికి అన్నప్పుడు ఘంటసాల గారు స్వామి కంటే గొప్పవారు అంటే గొప్పవారు తక్కువవారు కాదు తన ప్రియమిత్రుడు అయినటువంటి బాల్యమిత్రుడు అయినటువంటి కుచేలుడు తన ఇంటికి వచ్చినప్పుడు కృష్ణుడు సింహాసనం తను దిగి కుచేలుడ్ని తన సింహాసనంలో కూర్చోబెట్టి పాదాలు ఒత్తి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నాడు అది సత్యం అయినప్పుడు ఇది ఎందుకు సత్యం కాకూడదు అంటే ఇలా చెప్పినందువల్ల బాబా గారు తక్కువ అయిపోతారా తప్పది అంటే ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన పార్శ్వం ఘంటసాల గారి పాట మాత్రమే కాదు ఆయన లోకాలు ఈయనకు తెలుసు ఇది పరిసత్యం ఉమ్ ఉమ్ ఏ అసలు మాటలు రావట్లేదు గురువు గారు అంటే అక్కడ ఈయనకు భావోద్వేగం లేదు ఉమ్ తన భక్తుడు తన కోసమై మూడు రోజులు వచ్చారు అప్పుడే రాసుకున్నారు "నన్నే ఇలావా సత్యసాయిబాబా" పాటలు రాసుకున్నారాయన ఉమ్ ఆ నాకోసం శ్రమలో కూర్చిన రచించినాడుఅవన్నీ రాసుకున్నారు ఆయన అప్పటికప్పుడే. ఆయనే సంగీత నిధి. రాసుకున్నారు, స్వరకల్పన చేశారు, రికార్డ్ చేసుకున్నారు, చేసి ఇచ్చారు. ఆయన ఉన్నంత కాలము ప్రతి birthday కి ఘంటసాల గారి పాట ఉండేది. ఊ.. కచేరీ చేసేవారు బాబా గారి కంఠం కూడా అద్భుతమైన కంఠం అసలు అసలు త్యాగరాజ స్వామి, స్వామికి త్యాగరాజస్వామి అంటే చాలా ఇష్టం. ఊ.. వారు అవి పాడితే, ఇప్పుడు మీ బోటి వాళ్ళు సంగీతం తెలిసిన వాళ్ళు, సంగీతాన్ని ప్రేమించే వాళ్ళు, సంగీతంలో ఒక ఆనందాన్ని పొందే వాళ్ళు, ఆయన పాటలు గనక వింటే ఆ గమకాలు మామూలు వాడైతే వేయలేడు. ఆహా! మీరు technical గా అనేక instruments తో పాడే ఈ కచేరీలు కాదమ్మా, they are all technical. త్యాగరాజస్వామి యొక్క హృదయం రాముడి వైపు ఎట్లా ఉందో బాబా గారు పాడుతుండగా వినాలి. ఊ.. ఊ.. ఆ దర్శనం ఆయనకి జరిగింది కాబట్టి వారు అది. అసలు ఆ సాహిత్యం. ఊ.. గురువు గారు, బాలమురళి గారు, బాబా వారు, వారి కలయిక గురించి చెప్పగలుగుతారా? వారెప్పుడైనా- అయ్యో! ఖచ్చితంగా చెప్పగలను. మామూలుగా లోకానికి చాలా విషయాలు తెలియవమ్మా. ఊహాగానం చేస్తారు. అది గానం అంటే పాట కాదుగా. ఊహే గానమై అలా పల్లవిస్తుంటుంది. అంతే, అంతే. ఆ, బాలమురళి కృష్ణ గారికి బాబా గారికి పడదు. వీడెవడు చెప్పడానికి? ఏమిటి పడదు? ఎన్.టి.రామారావు కి సత్యసాయిబాబా వారికి పడదు. మనం నిర్ణయించాం. పడటం కాదు. వాళ్ళిద్దరి విషయం చెప్తాను. సందర్భం. ఊ.. రాయలసీమ ప్రాంతానికి చెన్నైకి నీళ్ళు ఇవ్వాలి అనుకున్నప్పుడు తెలుగు గంగ project పెట్టినప్పుడు NTR was our Chief Minister of ఆంధ్రప్రదేశ్. అప్పటివరకూ private land ఎవరికీ కూడా government ఇచ్చేది కాదు. కానీ ఆ land గనక లేకపోతే pipeline లు వేయలేరు. ఊ.. సరే వీళ్ళు officers వెళ్లి ఇలా ఇలా. నో నో అలా వద్దు ఎవరికీ ఎవరు గానివ్వండి చేయొద్దు. ఎవరు కాదు అది బాబా గారు వారి సొంత డబ్బుతో, వారి భక్తుల డబ్బుతో ఇవన్నీ చేయబోతున్నారు. మరి ఏమవుతుంది, ఎలా చేస్తారు, అది ఇది అడిగాడాయన. అంటే వీళ్ళు explain చేశారు. ఒకే రోజున మూడు జీవోలు issue చేశారు. బాబా గారు చేస్తున్నారు గనుక ఈ జీవోలు issue చేయండి. ఊ.. అంటే నమ్మకం. అన్నప్పుడు మీరు ఇది అయిన తర్వాత ఒకసారి పుటపర్తి వచ్చి స్వామి దర్శనానికి రండి అని వీళ్ళు మర్యాదగా ఆహ్వానించారు. వారు ప్రపంచం మొత్తాన్ని కోసం పనిచేస్తున్నారు, మేము చిన్న రాష్ట్రానికి చేస్తున్నాం, వారిని మనం disturb చేయకూడదు అన్నాడు. ఊ.. అది రావట్లేదని చెప్పే- అది, ఆ, దానికి మన వాళ్ళు వక్ర భాష ఆయనకి ఇష్టం లేదు. అందుకనే పుటపర్తి రాలేదు. ఇవాళ దాని వెనుక ఉన్నదంతా కూడా governmental order ప్రకారమే జరిగినయి. ఊ.. ఇది ఒకటి. అంటే ఇది myth is broken. రెండు, బాలమురళి గారు కి వారి సంగీతంలో బాబా గారు ఆయనకి ముప్పై మూడు ఉత్తరాలు రాశారు అని నేను చెప్పినప్పుడు ఒక్కడు నమ్మలేదమ్మా. ఒక్కడు కూడా నమ్మల. అసంభవం అండి. అట్లయితే రోజూ వచ్చి పాడాలిగా ప్రశాంతి నిలయంలో. ఆయన పిలవలేదు, ఈయన రాలేదు అంటే ఏమిటి? అని వీళ్ళు ఆలోచించుకున్నారు. సరే ఒక సందర్భం ఏర్పడింది. అది conversation with బాలమురళి అని ఇవాళ YouTube లో ఉంది. ఆ నేనే, నేనే interview చేశా. బాలమురళి గారు. దాన్లోనమ్మా ఆయన చెప్పారు. "అవును ఇది నాకు బాబా గారికి తెలుసు మీకు ఎలా తెలుసు?" అని అడిగారు నన్ను బాలమురళి. ఊ.. నేను స్వామి ఉత్తరం రాస్తున్నప్పుడు నేనే లేను, అందుకున్నప్పుడు బాలమురళి గారి పక్కన నేనే లేను. ఊ.. కానీ నిజం కదా. నేను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినారాయన. చెన్నైలో ఆయన అడిగితే నేను అన్నాను, ఒకసారి ఏదో ప్రసంగ విశాఖ వచ్చి, బాలమురళి సరస్వతీ స్వరూపం, అతను చేసిన ప్రతి కచేరీకి నేను వెళ్లి కూర్చున్నాను, ప్రతి దాన్ని నేను విన్నాను, ఆ, నేనే రాశాను అని స్వామి చెప్పారు. అందువల్ల నాకు తెలిసింది అన్నా. ఇది సత్యం. ఆ interview లో ఉంది. వారి నోటి మీది, ఇది సత్యం. కచేరీ చేసి వచ్చేవాళ్ళని. రాగానే ఒక చిన్న కాగితం ముక్క పడే ఉండే, నాయనా! నీ కచేరీ విన్నాను. ఇవాళ అద్భుతంగా పాడావు. ఉ, ఆశీస్సులతో బాబా అని ఉండేది. ఆ ఉత్తరం ఎవరు రాశారు? కచేరీ ఎక్కడ జరిగింది? ఊ.. ఇది సత్యం. సరే. ఆ ఉత్తరాలన్నీ చాలా కాలం ఆయన ఉంచుకున్నారు. తర్వాత విచిత్రం, అవి ఎటు పోయినయో పోయినాయి. ఇవి ఎట్లా పోయినయో నాకిప్పటికీ తెలియదు అన్నారు. అని, ఆ, అన్న తర్వాత, నువ్వు ఇక్కడి నుంచి పిలుపు వస్తే తప్ప నువ్వు ప్రశాంతి నిలయానికి వచ్చి కచేరీ చేయొద్దు. ఆఖరికి నేను పిలిచినా సరే నువ్వు పిలిచే దాకా రావద్దు అన్నారు. ఊ.. అది ఎంత వరకు వెళ్ళిందంటే బాబా గారి అవతార పరిసమాప్తి వరకు బాలమురళి ఎంటర్ కాలే. 2011 April 24 స్వామి అవతారం పూర్తయిపోయింది. ఊ.. June July వచ్చేసింది గురుపూర్ణిమ, తర్వాత November లో birthday. గురుపూర్ణిమ సందర్భంలో బాబా గారు April లో దేహం వదిలేస్తే నేను ఆయన్ని కలిసింది July నాలుగవ తారీఖు. July ఆరు బాలమురళి birthday. ఆ.. సరే, ఆయన చాలా ఆనందపడిపోయారు. ఆనందపడి అప్పుడు నేను చెప్పాను, ప్రపంచంలో ఉన్న సుప్రసిద్ధ కళాకారులంతా వారు దేహంలో ఉండగా వచ్చి పాడారు. స్వామిని ఆనందింపజేశారు. వాళ్ళు ఆనందపడ్డారు. మీరు ఒక్కరే రాలేదు exclusive. ఈ పాడిన వాళ్ళల్లో ఏ ఒక్కరికి ఆయన ఉత్తరం రాయలా. ముప్పై మూడు ఉత్తరాలు అందుకున్న మీరు మాత్రం పాడలేదు. ఇప్పుడు మీకు ఒక responsibility ఉంది, మీరు వచ్చి పాడాలి అన్నా. శిరోధార్యం అన్నాడు ఆయన. నేను దీనిని స్వామి ఆజ్ఞగానే భావించి ప్రశాంతి నిలయానికి వచ్చి నేను కచేరీ చేస్తా November స్వామి పుట్టు పండుగనాడు అని. వచ్చారు, పాడారు. కాబట్టి మనం తెలిసి తెలియక చిన్న చిన్న, అంటే రోజూ గనక ఆయన ప్రశాంతి నిలయానికి వెళ్ళి ఉంటే బాబా గారి భక్తుడిని అని చెప్పడమా? ఆయన భక్తుడు అవునో కాదో స్వామికి తెలుసు, ఆయనకు తెలుసు. ఊ.. అంతే కదా. మధ్యలో, అందువల్లనే మన సాధన కుంటుపడుతుంది అమ్మా. మనకి సత్యం పూర్తిగా తెలియదు, అసత్యాన్ని తొందరగా మనసు నమ్మేస్తుంది. అవును. ఊ? ఎంత వాస్తవం గురువుగారు. వాస్తవం. అసత్యం అది ఏమవుతుందంటే చిలవలు పలవలుగా అయిపోతుంది. సత్యం అది కాదు. ఆయన వచ్చారు. ఊ.. ప్రశాంతంగా ఉన్నారు. అప్పటికి ఆయన health నిజానికి కొద్దిగా బాలేదు. బాగా లేకపోయినా two and half hours కచేరీ చేశారు. ఊ.. ఊ.. ఎంత, మీరు ఈ, ఈ మాట నిజంగా గొప్ప సందేశం గురువుగారు. అమ్మా అసత్యాన్ని నమ్మేస్తాం. అవును. ఎందుకంటే ఆలోచనకి ఏదో ఒక విధమైన- ఏంలే, మనలో ఉన్నటువంటి ఒక కుసంస్కారానికి రూపమే ఈ పుకారు. మనం పుకారును గనక ఆశ్రయించామంటే మనమంతా కూడా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం. ఊ.. It's a wastage of quality time in life. క్షణం జారిపోతే మళ్ళీ రాదు కదమ్మా.
YouTube · audio
ఘంటసాల పాదాలను ఒత్తుతూ భగవాన్ కనిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7
ఘంటసాల పాదాలను ఒత్తుతూ భగవాన్ కనిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7
Source: iDream Media on YouTube
0:00 / 25:50
More in this series
Remembering Sri Sathya Sai Baba — Aaraadhanaa Mahotsavam interviews
-
26 min 2 Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2
-
38 min 3 సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3
-
25 min 4 యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4
-
26 min 5 ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5
-
20 min 6 భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6
-
25 min 7 ఘంటసాల పాదాలను ఒత్తుతూ భగవాన్ కనిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7
Now playing -
20 min 8 సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8