No transcript for this section.
Transcript begins at 0:19.
గురువు గారు మరొక చాలా కీలకమైన విషయం సత్యసాయి విద్యాసంస్థలు ఉమ్ అంటే అక్కడ ఆ పెరిగిన పిల్లలు అందరూ కూడా వారికి ఒక ఒక జీవన విధానం ఒక క్రమశిక్షణ ప్రపంచం పట్ల ఒక ఒక విధమైన ఆలోచన ఇవన్నీ ఏర్పడతాయి దీన్ని design చేయడం వెనుకు ఉండే విషయాలు మీకు తెలిసే ఉంటాయి కదా అవును తెలుసు తెలుసు అమ్మ ఇప్పుడు గురుకుల విద్యా విధానం రావాలి పాత రోజులు తిరిగి రావాలి జరుగుతున్నదంతా బాగా లేదు మెకాలే education విధానం వల్ల మనకి ధర్మం దూరం అయిపోయింది ఇవన్నీ మనం అంటున్నాం ఉమ్ పరిష్కార మార్గం వీళ్ళకి ఎవరికీ తెలియలే చెప్తున్నారు చాలా వెనకబడిపోయినాం మనం westernise అయిపోయాం అనే లోగా globalise కూడా అయిపోయాం globalise అయ్యేలోగా liberalise కూడా అయిపోయాం మరి ఏం చేయాలి ఇప్పుడు కనుక ఆయన గురుకులాలు అంటే ఎక్కడో అరణ్యాల్లో గుడారాలు వేసి తల్లిదండ్రులకు పిల్లలను దూరం చేసి మీరు ఇలా ఈ వైరాగ్యంలో ఇప్పటి నుంచి బతకమని చెప్పలా కోటి తల్లుల ఒక ప్రేమ ఇవ్వగలిగితే ఆ ప్రేమని ఒక్క సత్యసాయి ప్రతి ఒక్క student కి ఇచ్చారు ఆహా ప్రతి student కి ఒక నైతిక భౌతిక లౌకిక ధార్మిక ఆధ్యాత్మిక దివ్య జీవన విధానాన్ని పిల్లలకి అక్కడ indirect గా అపరోక్షానుభూతిగా ఇలాగే ఉండాలి do's and don'ts లేవు అక్కడ ఉహు ఎలా ఉండాలో చెప్పి దాని ప్రకారంగా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో design చేశారు ఆ శిక్షణే తప్ప బయట ఉన్న శిక్షలు అక్కడ ఏం లేవు ఉహు ఉమ్ అంటే He has created very beautiful ideal system in which you can just get in and get out ఉహు Entirely dry clean and refined అంతే అండ్ వాళ్ళందరూ ఒకలా చూసుకుంటే అదే విధానాన్ని దూతలుగా ఆ ప్రపంచానికి చాటి చెప్పే ఆ వారందరికీ ఏం చెప్పారంటే వారందరికీ ఇప్పుడు మీరందరూ నా ప్రచారకులు కండి అని చెప్పలే ఉమ్ ఆయన ఏం చెప్పారంటే స్వామికి ఓ పేరు ఉందండి ఆ పేరు ఏంటంటే వారే చెప్పుకున్నారు చెప్పుకోవటం అంటే ఆ నేను యోగిని కాదు నేను దూతను గాను నేను స్త్రీని గాను పురుషుడిని గాను నేను నేనైన నేను అంటే ఆత్మని ప్రకటన చేసి అహం సత్యబోధకః అన్నారు సత్యం అంటే సతతము ఉండే సనాతన ధర్మాన్ని చెప్పటానికి వచ్చాను అని అన్నట్లు ఈ పిల్లలందరికీ వారు ఏం చెప్పారంటే అంటే three sixty degrees లో వాళ్ళని ఉద్దీపనం చేస్తారు ఉమ్ సంగీతం సాహిత్యం ఆటలు పాటలు పోటీలు వక్తృత్వాలు అన్నీ ఉంటాయి అక్కడ ఉమ్ ఆ అన్నింట్లో వాడు రాటుదేలి బయటికి వస్తాడు ఏమన్నారంటే సనాతన ధర్మాన్ని ప్రపంచం నిండా నింపండి అన్నారు అంతే సత్యసాయికి ప్రచారం అక్కర్లేదు అన్నారు మీరు ప్రసారం చేయండి సరిపోతుంది అన్నారు ఆహా అది ప్రచారం ఏం చేసుకుంటాం అవును డబ్బు ప్రచారం చేయాలంటే వాళ్ళు డబ్బులు కావాలి అండ్ మీరు అన్నట్టు నూట ఎనభై దేశాలు ఆయన దగ్గరికి నూట ఎనభై ఎనిమిది దేశాలు ఆయన దగ్గరికి వచ్చి అందులో ముస్లిం countries ఉన్నాయి Christian countries ఉన్నాయి Zoroastrians ఉన్నారు బౌద్ధులు ఉన్నారు మతాలకు అతీతంగా వచ్చేవారు కదా అందరూ వచ్చేవారు మతాలకు అతీతంగా వచ్చేవారు వచ్చి వారి దగ్గర కూర్చునేవారు అలాగే ఎప్పుడైనా intricate questions like ఆ శంకర conquered Buddhism అని ఎవరో ఒక మాట అంటే ఆ మాట ఎప్పుడూ అనవద్దు ఎందుకంటే శంకరులది సమన్వయ దృష్టే తప్ప సంఘర్షణ దృష్టి కాదు ఇట్లా ఉండేవి ఎంత ఆయన ఎంత అసలు అంటే భగవత్ స్వరూపులకి మరి పరిధులు ఏముంటాయి గాని పరిధి ఆ అనర్గళంగా బోలెడు భాషలు మాట్లాడతారని ఇవన్నీ వినడమే గురువు గారు ఆయన ఒక great example అమ్మా ఇప్పుడు వారేం వేదాలు చదవలేదు అవును ఉపనిషత్తులు చదవలేదు చదవాలన్నా ఎంత time పడుతుంది time పడుతుంది పద్నాలుగో ఏటనే వారు ఆ వచ్చారు ఏ తర్వాత ఇంకోటి ఇవన్నీ చదువుకున్న వారు వారి దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కార మార్గం దొరికేది వాళ్ళకి అది ఉమ్ అది phenomenon అది phenomenon వచ్చేవారు ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు ఉంది అంటే దాని పేరే బృహత్ అరణ్యకం పెద్ద అరణ్యకం అది దానిలో ఉన్న quintessence మీరు చెప్పాలి అంటే ఎంత సంక్షిప్తంగా చెప్పిన వెయ్యి పేజీలు అవుతుంది దాన్ని మూడు లైన్లలో close చేసేవారు ఉహు ఆహా ఆ ఇప్పుడు కేనోపనిషత్తు ఉంది దీని సారం ఏమిటంటే ఆత్మ ఆత్మ కింద మనసు మనసుతో ఇంద్రియాలు ఇంద్రియాలతో కలచరణాది అవయవాలు ఇవన్నీ ఒకదాని నుంచి ఒకటి interconnect అయి operate అవుతాయి అది కేనోపనిషత్తు అన్నారు అయిపోయింది ఒక one minute ఏ పట్టింది చెప్పడానికి ఇది ఒక పండితుడు చెప్పడానికి నలభై రోజుల మండల దీక్ష కావాలి కదా ఉమ్ ఉమ్ ఎందుకని వాడు శబ్దార్థం దగ్గర విశేషార్థం దగ్గర ఆగిపోతాడు అంతరార్థం వైపు వెళ్ళలేడు కనుక ఉమ్ అది భగవత్ తత్వానికి ఇవన్నీ నిదర్శనం అవును ఇంకొకటి గురువు ఇప్పుడు రాముడున్నాడు ఉమ్ యోగవాశిష్టం ఆయన రాయలా ఉమ్ రాముడు ఆన్ వశిష్ఠ మహాముని మాట్లాడుకుంటే రాయబడింది ఉమ్ కృష్ణుడు గానీ అర్జునుడు గానీ భగవద్గీత రాయలే వాళ్ళిద్దరూ అనుకున్నారు రాసినవారెవరు వ్యాసులవారు అంటే కృష్ణుడు రాయలేదు రాముడు రాయలేదు కానీ బాబా రామకథా రసవాహిని రాశారు పదిహేను వాహినులు రాశారు బ్రహ్మసూత్ర భాష్యాలు రాశారు ఆహా ఆ భగవత వాహిని ఉపనిషద్ వాహిని గీతా వాహిని స్వయంగా రాశారు ఆయన hand writing తో ఉన్నాయి నాలుగు వేల ఎనిమిది వందల పేజీల hand written manuscript ఉంది ఇవాళ ప్రశాంతి నిలయంలో ఉమ్ ఉమ్ బాబాబా అది అంటే It's a proof that he spent his money in writing time in writing writing ఆ అసలు phenomenon అంటే ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి ఏం కావాలి అనిపిస్తుంది అవును గురువు గారు ఆత్మ పరిణితి అంటే మనకి spiritual evolution మనకి మరి తెలిసో తెలియకో సగం అజ్ఞానంతో పెట్టిన ఒక వ్యవస్థ అది దానికి తరగతుల గదుల్లాగామనకి ఈ చక్రం ఈ చక్రం ఇవన్నీ మనం ఎక్కడెక్కడో చదువుకున్నాం చదువుకున్నాం అవును అవి కొంత half baked ఏ నా వైపు నుంచి నేను చెప్పి అడిగినా కూడా కానీ స్వామి ప్రతిపాదించిన ఆ మోడల్ paradigm అంటే ఆత్మ పరిణితి తర్వాత చివరగా ఆత్మ పరమాత్మలో లీనమవడం ఇటువంటి విషయాలపై దృష్టి పెట్టి చెప్పేవారా? లౌకిక విధానంపై ఉత్తమమైన ఆదర్శవంతమైన జీవనంపై మాత్రమే కాదు కాదు physical level లో లౌకిక జీవన విధానం పవిత్రంగా ఉండాలి character కి ఆయన చాలా importance ఇచ్చారు ఉమ్ సచ్చీలత అంటే అదే ప్రమాణంగా ఉండాలి ఒకటి. అసలు పద్దెనిమిది పురాణాల సారం ఒక foreign devotee ఆయన్ని అడిగారు ఎక్కడ Bombay ధర్మక్షేత్రంలో. స్వామి మాకేదో ఒక గ్రంథం ఉంటుంది ఇదేంటి పద్దెనిమిది పురాణాలు అతను చదివే అడిగాడు. ఉమ్ ఏమిటి దీని మూలం ఏమిటి అని అడిగితే అతనికి అర్థమయ్యే భాషలో రెండు వాక్యాల్లో రెండు పదాలతో పూర్తి చేశారు ఉమ్ Help ever hurt never this is the quintessence of eighteen puranas Help ever hurt never Hurt never it is a great spiritual sadhana principle ఉమ్ అయిపోయింది. కానీ మనిషి మనస్సు మనోమయుడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే help never hurt ever [నవ్వు] just reverse it మరి ఆ కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని అటువంటి పరిస్-- సన్నివేశాలని జీవితంలో మనకు ఏర్పడే కురుక్షేత్ర యుద్ధాల్ని ఎలా ఆ విడమరచి చెప్పేవారు స్వామి అసలు మన జీవితంలో మన జీవితమే పెద్ద కురుక్షేత్రం అవునా? అవును ఈ కురుక్షేత్రంలో మనలోనే ఒక hundred negative elements మనలో ఉన్నాయి అవును పక్క వాళ్ళలో కాదు. ఆ తర్వాత మనలో hundred ఉన్నాయి కానీ దాంట్లోనే ఐదు మన యందే కూడి ఉన్నాయి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస practice చేయగలిగితే ఉమ్ మరి ఇటు వై-ఇటు వైపేమో వంద మంది అటు వైపేమో ఐదుగురే ఐదుగురు మరి మధ్యలో ఏం చేయాలంటే ఆత్మ అనేటువంటి కృష్ణుడు సమన్వయం చేస్తాడు అదే సంస్కారం. కురుక్షేత్ర యుద్ధం లోపలే జరుగుతుంది కౌరవులు పోతారు పాండవులు మిగులుతారు కానీ కాలగమనంలో పాండవులు వెళ్ళిపోతారు. ఇంత చేసి, ఇంత బోధించి, ఇంత ఆచరించిన ఆచార్య సత్తవుడైన యోగీశ్వర కృష్ణుడు సత్యాచార్యుడు ఆయన ఉండడు. అవతారం చాలించి చాలించాలి. ఇది ఒక ప్రకృతికి సంబంధమైనటువంటి ఒక పరిణామం కాబట్టి జీవితంలో negativities అందుకనే ఆయన ఏమన్నారంటే పక్కవాడి లో ఉన్నటువంటి ఒక లోపాన్ని దూలంగా చూస్తున్నాం you are just looking it as a shaft మానేసేయ్. నీ కంటిలో ఉన్నటువంటి దాన్ని దూలంగా చూడటం నేర్చుకో ఎదుటివారిలోది చిన్న నలుసుగా చూడు. నలుసు ఏముంది రెండు నీ-నీళ్ళ చుక్కలు రాయగానే కొట్టుకుపోతుంది. నువ్వు అవతల వాడిలో ఆ చెడుని చూడటం మొదలు పెట్టాక నీ life అంతా పాడైపోతుంది. అబ్బా! ఎందుకు? Is there any purpose? నువ్వు అలా చూస్తున్నావని అవతల వాడికి తెలియదు కదా. వాడు వాడి పనుల్లో వాడు హాయిగా ఉన్నాడు. వాడు అలా ముందుకు వెళుతున్నాడు నువ్వు ఇంకా అక్కడే వాడి లోపాలు ఎన్నుతూ నీ జీవితం అంతా వృధా చేసుకుంటున్నావ్. ఇంతకంటే philosophy ఏం కావాలమ్మా. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఈ చక్రాలు. ఆయన ఒక నిర్దుష్టమైనటువంటి సాధన మరి మీరంతా ధ్యానంలో ఉండండి, మీరంతా ఇలా అతీంద్రియమైన శక్తులు సంపాదించేసేయండి, అందరికీ అనుభవాలన్నీ చెప్పండి ఇటువంటి చాలా ప్రాథమికమైనటువంటివి చెప్పలేదు. ఉమ్ ఆయన ఏం చెప్పారంటే "అంతరంగము కన్న జాపకుడు లేడు ఆ అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే" అయిపోయింది. ఉమ్ మిమ్మల్ని మీరు స్వాధ్యాయం చేయండి. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అధ్యయనం చేయండి. ఎవరో గురువు వాడో గురువు అందుకనే అన్-అన్నారు. కాలగమనంలో మీరు చూస్తూ ఉండండి. ఇదెప్పుడో వారికి నలభై ఏళ్ళు ఇంకా దేహానికి రాకుండా. విత్తాపహారులైన గురువులు పెరిగిపోతారు చిత్తాపహారుడు మీకు దక్కడు అన్నారు. ఇవ్వేళ చూస్తున్నాం చిత్తాపహారులు ఎవరైనా ఉన్నారా మనకి? ఉమ్ ఉమ్ విత్తాపహారులే ఉన్నారు. అవును అట్లానే ఆయన caution చేశారు. దాన్ని అందుకోవాలి మనం. ఉమ్ ఇప్పుడు నేను-నీవు నాకు చేతిలో కాసులు పెట్టు నీ చేతిలో తాయిత్తు ఇస్తా అంటే వాడేమి గురువు? ఉమ్ నీ డబ్బు ఇచ్చావు కొనుక్కున్నావు తైలు ఇచ్చుకున్నావు మంచిదైతే అయిందేమో అనుకున్నావు కాకపోతే కాలేదని ఆ తాయిత్తు బయట పడేసావు. వీటన్నింటికంటే ఆ తాయిత్తు ఏమిటంటే భగవంతుని యందు ఒక విశ్వాసం. ఈ జాతి యొక్క ఆత్మ లక్షణం అది. ఉమ్ దేవుడున్నాడు అదే పంచాక్షరి. దేవుడున్నాడు. దీన్ని మించిన పంచాక్షరి ఇంక ఎక్కడుంది? ఉమ్ అయితే ఆ ఈ దేవుడు ఉన్నాడు లేడు అనేదాని మధ్య నా సమాధానం ఏంటంటే దేవుడు లేడన్న వాడిని కూడా నేను నిరసించనమ్మా ఉమ్ ఎందుకో చెప్పనా? వాడికి మనం ఒక ప్రత్యేకమైన title పెట్టేసాం హేతువాది అన్నాం ఆ ఆ నాస్తికుడు అన్నాం. ఆ హేతువాది ప్రశ్నించి దైవం ఉన్నాడు అని తెలుసుకొని నమ్మి నిలబడతాడు. అవును ప్రహ్లాదుడు తండ్రి గారిని అడిగినట్టేగా అంతేగా ఆయన చెప్పించినంత ఎవరూ చెప్పించలేదన్నట్టే చెప్పించలేదు కానీ అది ఏమైందో తర్వాత చెప్తా ఆ తండ్రిగారు దాని ఫలితం వేరే వచ్చింది. సరే ఈయన ఎప్పుడైతే హేతువాది ప్రశ్నించి దేవుడు లేడు లేడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని తెలుసుకుంటూ వాడు నిలకడ చెందాడు. ఉమ్ భక్తుడైన వాడు వాడికి పెద్ద mental exercise ఏం లేదు నమ్మాడు అదే ఓ రాయనో సాయినో నమ్మాడు. నమ్మాడు నిలబడ్డాడు. అంటే వీడు ప్రశ్నించకుండా నమ్మాడు వాడు ప్రశ్నించి తెలుసుకుని నమ్మాడు. ఇందులో ఎవరు గొప్పవాళ్ళుంటారు? ప్రశ్నించిన హేతువాది అవును ప్రశ్నించే అధికారం మనకు ఉపనిషత్తులు ఇచ్చినయి. ఉమ్ ఆ హేతువాదికి ఉపనిషత్తులు తెలియకపోవచ్చు అవును కానీ ఉపనిషత్తులు తెలిసిన వాడు వాడిని నిరసించటం మహా పాపం. ఆ-ఆ పాత్రలో అతన్ని వెళ్ళనివ్వండి, వెళ్తాడు అతనే తెలుసుకుంటాడు. ఉమ్ కదా? అవును ప్రహ్లాదుడి కథ వచ్చింది కదా. ఇది కూడా ఒక మంచి విశ్లేషణాత్మకమైనటువంటి కథ గురువుగారు ప్రహ్లాదుడు నిరంతరము హరినామస్మరణ చేశాడు ఉమ్ఇంట్లోనే ఆయనకి శత్రువు ఎవరు తండ్రి దేవుడు హరి లేడు అని ఇతను ఉన్నాడు అంటే హరే ఉన్నాడు అంతటా ఉన్నాడు అన్నిటా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని ఈయన ఈయన చెబుతున్నాడు మరి పరీక్ష ఎవరికి ఇప్పుడు మహావిష్ణువుకి పరీక్ష వచ్చింది అంతేగా ఉన్నాను అని చెప్పాలి ఆ వీడి భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టాలి నేనున్నాను నీ మనసు మార్చుకో అని చెప్పాలి హిరణ్యకశిపుడికి ఎవరో కట్టిన స్తంభంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు వస్తే మన వాళ్ళు కళాకారులు వీళ్ళంతా ఏం చెప్తున్నారమ్మా పంజా విసిరాడు చంపేశాడు పేగులు పి-చీల్చాడు ఇవన్నీ చెప్తున్నారు కదా అన్నీ చేశారు కానీ ఆయన ఏం చేశాడంటే పంజా విసిరి దూరంగా జరిగిపోతున్న హిరణ్యకశిపుడిని పట్టుకుని తెచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తన ఒడిలో పడుకోబెట్టుకున్నట్టు పడుకోబెట్టుకున్నాడు లోపల ఉన్న పేగులన్నీ కర్మమాలలవి దానిని తన కంఠమాలగా వేసుకున్నాడు ఆతనిలో ప్రవహిస్తున్న చెడు రక్తాన్ని తాను తాగాడు తాగి సాయుజ్యం ఇచ్చాడు అప్పటిదాకా హరి ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని theoretical గా పద్యాలు పాడిన ప్రహ్లాదుడు సాక్షాత్తు నారాయణమూర్తి సొంత ఇంట్లోనే స్తంభంలో నుంచి బయటకు వస్తే భయపడి స్తంభం వెనక్కి వెళ్ళాడు వెళితే వాడిని పిలిచాడు భోగంలో ఉండాలి జీవించాలి అనుకున్న హిరణ్యకశిపుడికి యోగం ఇచ్చాడు యోగమే కావాలి పరమపదం కావాలన్న ప్ర-భక్త ప్రహ్లాదుడికి భోగం ఇచ్చాడు రాజ్యం ఏలుకోమన్నాడు ఇది వైచిత్రి ఆహా ఆహా గురువుగారు అమ్మా ఎంత ఎంత beautiful గా ఎంత wonderful గా ఉంది అది గురువు గారు ఇవన్నీ సాధన చేసే తీరిక ఇంత busy scientist గా ఉంటూ మీకు ఎలా కలిగింది గురువుగారు ఏ-ఎలా అంటే ఎన్ని ఎన్ని పార్శ్వాలు ఎన్ని layers లో నుంచి మీరు విద్వత్తు విషయం తర్వాత మళ్ళీ దాన్ని విజ్ఞానం అందుకోవడం వివేకం అన్ని కలగలిసి ఎలా వచ్చింది గురువుగారు మీకు అంటే science అనేటువంటిది ఒక ఉద్యోగం అనుకోండి ఒక degree అనుకోండి లేకపోతే దానిలో మనం చేసిన పని అనుకోండి దానికమ్మా పాయింట్ జీరో ఫైవ్ percent ఖర్చు పెడితే చాలు అంతేగా పాయింట్ జీరో ఫైవ్ మిగతా నా దగ్గర ఎంతుంది నా దగ్గర అంటే మనందరి దగ్గర మనం ఏమనుకుంటాం అంటే చాలా కష్టపడి ఈ పుస్తకం చదివానంటాం కాదు దానికి నువ్వు spend చేసింది నీకు తెలియకపోతే hundred percent దానికే ఖర్చు పెట్టాలి తెలుసుకుంటూ వెళుతున్నప్పుడు అవన్నీ దారులు తెరుచుకుంటాయి ఇప్పుడు వివేకానంద గురించి ఒక మాట వచ్చింది రమణ మహర్షి గురించి ఒక మాట వచ్చింది ఏమిటా మాట అంటే మన బోటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఒక book ఇచ్చేసి ఈ book మీరు చదివి ఉండకపోవచ్చు హాయిగా చదువుకోండి అని వాళ్ళకి ఇస్తే ఆ రోజుల్లో ఏడు వందల పేజీలు అంటే వివేకానందుడు ఇటు నుంచి అటు తిప్పి ఇది నలభైవ పేజీలో ఇరవై రెండో లైనో ఇరవై ఒకటో లైన్లో ఏముందో ఆయన repeat చేసేవాడు ఆ రమణ మహర్షికి ఒక భక్తుడు చాలా ఆయన మీద ప్రేమతో భగవాన్ మీరు ఈ పెరియపురాణం ఎప్పుడూ చదవలేదు చదవండి అనేకమంది మీ దగ్గరికి భక్తులు వస్తారు వాళ్ళకి జవాబులు ఇవ్వటానికి మీకు ఉపయోగిస్తుందని ఇచ్చాడు ఆయన అటు ఇటు చూసి ఇది ఎప్పుడో చదివినట్లే ఉందప్పా అని తిరిగి ఇచ్చేశారు కాబట్టి చదవటానికి మనకి వేళ time అక్కర్లేదమ్మా అంటే ఆ చదవబడటం అయిపోయిన తర్వాత జన్మ ఎత్తితే చదువులన్నీ చదివి చావంగానేటికి చావులేని చదువు చదువవలె అయితే ఇది అందరికీ అవుతుందా నిజంగా నా విషయంలో అయ్యిందా అంటే నేను వేదాలు చదవలే ఉపనిషత్తులు చదవలే కానీ ఉపనిషత్ సార సర్వస్వం రాశా ఎలా రాశారంటే ధారణలో నుంచి ధారణ శక్తి అంటారే దానిలో నుంచి అవి వస్తాయి ఎట్లా వస్తాయి అంటే వాటికేం పెద్ద occult మహిమలు పూజలు వాటిమీద నేను అవన్నీ I never advocate I say keep your mind absolutely clean కళ్లటి తెరలాగా ఉంటే దానిమీద ఏ బొమ్మ అయినా అడించచ్చు అంటే clean అంటే you mean Free from thoughts Free from thoughts and Thoughts free from judgements ఆ అలాగే pronouncing on the other అది worst trait comparison another thing రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప షిరిడి సాయి సత్య సాయి ఒకటేనా ఇవి ప్రయోజన శూన్యమైన ప్రశ్నలేగా ఏముండాలంటే వాళ్ళు ఏ form లో వస్తే అంతర్లీనమైన ఆ చైతన్యం ఏమిటి అని నేను గ్రహించగలిగితే నాకు సాకేత రాముడికి సాయి రాముడికి తేడా లేదు తేడా ఉన్నది అంటే నాలో ఉందది వాళ్ళల్లో లేదు చాలా ఒక ప్రశ్న అడగబోయి ఇప్పుడు ఒక-ఒక క్షణం జంకుతున్నాను అడగండి అడిగేస్తాను నో నో please ఎందుకంటే చాలా మందికి ఈ ప్రశ్న కలదు Feel free మీరు రమణ మహర్షుల వారిని కూడా ప్రస్తావించారు కనుక ఆ భగవాన్ సత్య సాయిబాబా వారు inclusive అయితే వీరు reclusive అంటే ఒక విధంగా ఒక-ఒక నిరాడంబరమైన జీవన విధానాన్ని detachment ని ఆ స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు లౌకిక విధానానికి స్వామివారు ఇలా ప్రాధాన్యత ఇచ్చారు సో ఈ రెండూ వేర్వేరు పార్శ్వాలా నాణానికి రెండు వైపులు అంటారా రెండూ ఒకటే కానీ మనకి మార్గాలు వేరంటారా గురువు గారు మీ ప్రశ్నలో అన్ని సమాధానాలు వచ్చేశాయి అయ్యో గురువుగారు ఎందుకని అంటే నాణానికి రెండు రెండు వేల సంవత్సరంలో నేను ఒక book రాశాను ఆ book పేరు శ్రీ సాయి రమణీయం స్వామికి నేను రమణ మహర్షి title ఉన్నటువంటి book చేతిలో పెట్టా అది వారి అవతార పరిసమాప్తి వరకు వారి దగ్గర ఉంచుకున్నారు ఆ book దానిలో ఆ ఇద్దరి మధ్య ఒక అభేదమైనటువంటి అద్వైత స్థితిని నేను అనుభవించా కారణం ఏమిటి ఉండాలి కదా నేను రమణ మహర్షిని చూడలే వారు దేహం వదిలేశాక నేను పుట్టా భగవాన్ నా పద్దెనిమిదవ ఏట ఒకరోజున ఇట్లాగే కాసేపు మాట్లాడుతూ మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడు అరుణాచలానికి వెళ్ళాలి నువ్వు వెళ్ళు అన్నారునువ్వు వెళ్ళు అన్నారు మామూలుగా గనక అయితే when I have స్వామి before me why should I go to తిరువణ్ణామలై why should I think of రమణ మహర్షి అనుకుంటాం నా మనసుకు అది తట్టల వారు వెళ్ళమన్నారు అంటే అది ఎప్పుడో జరుగుతుంది వెళ్తానులే అనుకున్నా ఆ వెళ్ళటం వెళ్ళటం ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం నేను వెళ్ళా నూట ఎనభై ఎనిమిది రోజులు ఉన్నా అబ్బా ఆ తిరువణ్ణామలైలో ఆరు నెలలు ఆరు నెలలు ఉన్నా ఆరు నెలలు అయిన తర్వాత మొన్న మన కరోనా రాకముందు ఫిబ్రవరి ఆరో తారీఖుకి నూరు గిరి ప్రదక్షిణాలు చేసుకున్నా రమణ మహర్షి మీద ఎనిమిది పుస్తకాలు రాసా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు భేదభావం ఉంటే నేను బాబా గారి మీద ఒక బుక్కు రాసి వదిలేసేవాడిని కదా అంటే ఆ రెండు ఒకటే సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నది ఒక్కటే ఆ చైతన్యం అనేక రూపాలు తీసుకుంటుంది నన్ను గనక స్వామి అరుణాచలం నువ్వు వెళ్ళాలి అని అని ఉండకపోతే అసలు వెళ్ళేవాడిని కాదేమో లేదా నేను అరుణాచలం ఎప్పటికైనా వెళ్ళాలి గనక స్వామి చెప్పారేమో దాన్ని వదిలేద్దాం వారన్నారు నేను వెళ్ళాను నేను వెళ్ళాను లాభపడ్డాను అంతే కదా అది ఆ రెండు రెండు different ఇప్పుడు రాముడు ఉన్నాడమ్మా రాముడు రాజకుమారుడు ఆయన ఏం చేశారు బొట్టు పెట్టుకోవటానికి నాము నాము అంటే తెలుసుగా ఇప్పుడు ఈ తరానికి తెలియదు ఆ తరంలో ఒక సున్నపు రాయి అది అది నీళ్లలో తడిపి నేలమీద రాసి దానిలో నుంచి ఒక బొట్టు పెట్టుకునేవారు తెల్లటి చూర్ణం అంటామే నాము అంటారు దాన్ని నాముతో పెట్టుకున్నదే నామం అయింది రాముడు ఇది రాజకుమారుడు అయ్యుండి కృష్ణుడు ఆయన కూడా రాజకుమారుడు కింద లెక్కే గాని రాజ్యం ఏలిన వాడు కాదు ఆ lineage ఉన్నవాడు కాదు ఆయన ఏం ధరించాడు కస్తూరి తిలకం లలాట ఫలకే కస్తూరితో బొట్టు పెట్టుకున్నాడు ఇది భోగంగా కనిపించే యోగం అది యోగంగా కనిపించే భోగం అబ్బబ్బబ్బబ్బా And we are deceived by the apparent dispositions అంతే
YouTube · audio
భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6
భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6
Source: iDream Media on YouTube
0:00 / 20:52
More in this series
Remembering Sri Sathya Sai Baba — Aaraadhanaa Mahotsavam interviews
-
26 min 2 Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2
-
38 min 3 సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3
-
25 min 4 యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4
-
26 min 5 ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5
-
20 min 6 భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6
Now playing -
25 min 7 ఘంటసాల పాదాలను ఒత్తుతూ భగవాన్ కనిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7
-
20 min 8 సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8