Skip to content
Transcript తెలుగు
శిరిడి బాబా వారు సత్య సాయి బాబా వారే అనటానికి ఒక చిన్న anecdote చెప్తాను. ఉమ్ ఒకసారి విజయదశమికి ముందు నాలుగైదు రోజుల ముందుగా నేను పుటపర్తి వెళ్ళాను. వెళితే రోజు స్వామి నాతో నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే "పాత మందిరం చూశావా?" అన్నారు. ఉమ్ పాత మందిరం అంటే బాబా గారు పుటపర్తి లో పుట్టిన ప్రదేశం. ఉమ్ అక్కడ first భజన మానస భజరే గురు చరణం రాశ్రీ tune చేసినటువంటి place అది. పాత మందిరం అంటే అందరికీ తెలుసు. ఇదేమిటి నన్నీ ఇలా అంటారు ఇప్పటికో వందసార్లే చూసుంటాను అది "కాదు కాదు నువ్వు పాత మందిరం చూశావా" అన్నారు. ఉమ్ క్యాచ్ చేశారు. నేను స్వామిని నెమ్మదిగా అడిగా "షిరిడియా స్వామి?" "ఆ" అన్నారు. ఉమ్ "నేను" "ఊ చూసిరా" అన్నారు. మూడు రోజుల్లో విజయదశమి మహోత్సవం షిరిడి లో నాకేం తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు. సరే హైదరాబాద్ రావటం నేను పూనా వెళ్ళటం పూనా లో మాకు తెలిసిన ఒకాయన customer ఉంటే ఆయన "మా car తీసుకెళ్ళండిలే" అని అన్నాడు. నేను విజయదశమి నాడు పొద్దున ఏడు గంటలకి షిరిడి ప్రవేశం చేశా. అప్పటికే రెండు కిలోమీటర్ల దూరంలో మనుషులున్నారు పోలీసుల హడావుడి చాలా తీవ్రంగా ఉంది ఎక్కడ కార్లను ఎక్కడెక్కడో ఆపేస్తున్నారు మామూలే మామూలుగా జరిగేదే. driver ఏమన్నాడంటే "సార్ మీకు విజయదశమి importance తెలియక వచ్చారు షిరిడి ఇంకోసారి వద్దురు గాని మనం వెళ్ళలేము లోపలికి impossible" అన్నాడు. నేను అన్నా "నాకేం తెలియదు వచ్చాను చూద్దాం" అన్నా. దీనికి మనం పెద్ద miracle అని పేరు పెట్టుకోవద్దు co-incidence అని కూడా పెట్టద్దు అలా జరిగింది అంతే. నా పక్క నుంచి నా car పక్క నుంచి ఒక police van వెళ్ళింది. police van వెళ్ళగానే driver slow చేశాడు అతని దగ్గర ఏదో paper ఉన్నాయో లేదో అసలు driving license వాళ్ళ భయం అదే కదా. అవును అప్పటిదాంట్లో ఉన్నాయన ఒక పెద్ద officer. ఆయన ఠక్కున driver తో మరాఠీ లో ఏం చెప్పారంటే "you follow my jeep" అన్నారు. వీడికి ఉణుకు వచ్చింది భయపడిపోయాడు ఏంటంటే follow అంటే ఏముంది దీని మీద number మీద ఏం జరిగిందో తెలియదు కదా. ఉమ్ సరే వెళ్ళాం. వెళ్ళేసరికి షిరిడి బాబా మందిరానికి ఒక పది అడుగుల దూరంలో నా car ఆగింది. ఉమ్ ఆయన కూడా ఉన్నారు police officer ఉండి "car ఇక్కడ park చేసుకొని మీరు వెళ్లి దర్శనం చేసుకోండి" అన్నారు. ఆయన ఎవరు తెలియదు నాకు, కదా. ఆయనేం మహిమ ఆకాశం నుంచి దిగలా he is a police officer on duty. అవును సరే నేను దిగాను. దిగాను గాని గుళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియదు మందిరంలోకి ఎలా వెళ్ళాలో తెలియదు driver He was relieved మన car కి దగ్గరే ఉంది అని car లో ఉండిపోయాడు. అదే సమయంలో the chief priest ఉమ్ Of the temple ఆయన లోపలికి వెళుతూ "అయే మీరే సాత్" నాతో రండి అన్నారు. నాతో రండి అనటానికి కనిపించుకునే VIP ని కాదు నేను. కానీ ఆయన పిలిచాడు నేను వెళ్ళా. నాకు హిందీ వచ్చు కాబట్టి follow అయినా. వెళ్ళాము అప్పుడు ఆయన నాకు షిరిడి బాబా శిరస్సు ఎక్కడ పాదాలు ఎక్కడ సమాధి importance ఒక పది నిమిషాలు మాట్లాడారు. ఉమ్ ఒక మూలగా ఒక పెద్దావిడ పెద్దావిడకు ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయి. ఆవిడ నుంచుని ఉన్నారు చేతిలో ఒక చాపరు పట్టుకొని. She was waiting for the priest. ఉమ్ ఆవిడ చాపరు కప్పాలి. ఉమ్ ఈన అన్నారు అప్పుడు ప్రదక్షిణ చేయటానికి అవకాశం ఉండేది. ఆ. ఉమ్ షిరిడి బాబా సమాధి ప్రదక్షిణ లోపలే ఉమ్ చేసుకుని నేను మామూలుగా వచ్చాను నాకేం తెలియటం లే everything is happening. ఇంతలో కావిడ ఏం చేశారంటే ఒక మంచి చాపరు మీద ఉమ్ ముత్యాలు కెంపులు ఉమ్ అన్నీ పొదిగి ఒక అద్భుతమైన చాపరు తయారు చేశారు. ఆవిడ last year వచ్చినప్పుడు బాబా కి ఏదో చెప్పుకున్నారట. ఈసారి చాపరు నేను పరుస్తాను అని. అందుకనే ఆమెకు వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే నేను ఇలా ప్రదక్షిణ చేసి వచ్చి ఇలా నుంచున్నాను. ఆమె అక్కడి నుంచి కదిలి వచ్చారు. కదిలి వచ్చి ఆమె కష్టమంతా నా చేతిలో పెట్టింది. అబ్బా అది ఎలా పరచాలో తెలియదు నాకు. నాకు మర్యాద సంప్రదాయం తెలియదు. అనేప్పటికీ నేను అన్నాను మాజీ ఆప్ కీజియే నా నై నై ఆప్ సే హోనా హై ఆప్ కే హాత్ సే హోనా హై ఆప్ కర్లో నా మై ఇధర్ హి హూ అంది. అప్పుడు నేను అతన్ని పురోహిత్ help తీసుకుని చాపరు కప్పి నేను మళ్ళీ బయటికి వచ్చాను. నాకు ప్రసాదం అది ఇచ్చారు. ఇస్తే driver he was shocked. ఇదంతా ఎంత ఎన్ని నిమిషాల్లో జరిగిందో పద్దెనిమిది నిమిషాల్లో చెప్పిందంతా అయిపోయింది. అబ్బా అయిపోయింది అయిన తర్వాత ఎవరైతే police officer అయితే నన్ను ఇలా guide చేశారో తీసుకొచ్చారో ఆయన మళ్ళీ అదే సమయానికి ఆయన అక్కడికి వచ్చారు. వచ్చి "దర్శనం అయ్యిందా" అని "చాలా బాగా అయ్యింది అద్భుతంగా" అని మీతో చెప్పిన రెండు విషయాలు చెప్పాను. "బాబా మెహర్ మీ మీద ఉంది మీరు వెళ్ళి రండి" అన్నారు. doubt నాకు doubt ఏంటంటే rear mirror ముందు కూర్చున్నాను rear mirror ఎటు తిప్పి అని చూస్తే ఆయన అన్న అంటే మన వాళ్ళు చెప్తారు కదా ఉమ్ jeep ఎలా వచ్చిందో ఉందో ఆకాశంలోకి మాయమైపోయింది బాబా గారే అలా రూపంలో వచ్చారు ఇవన్నీ మనం వింటాం. అవును నేను నమ్మను కదా. నాకు కావాలి fact and truth కావాలి. వెనక్కి తిరిగి చూస్తే ఆయన అక్కడ ఆయన duty లో ఆయన పని చేసుకుంటున్నారు He was still there. అంటే ఏమిటంటే భగవంతుడు అనేటువంటి ఒక శక్తి for me అదొక శక్తి అండి. అదొక cosmic energy దానికి మీరు రూపం పెట్టుకొని పేరన్నా పెట్టుకోండి. cosmic energy మన బోటి వాడు అంటే జీవుడు వాడు ప్రపంచంలో పని చేయవలసి ఉన్నదో అది జరగటానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఆయన సృష్టిస్తాడు. Through people Through people Not through anybodyమరి driver ఏమిటి? police officer ఏమిటి? నాకు తెలియని మాత్రము పరిచయం లేని షిరిడి ఏమిటి? అసలు సంబంధం లేని మహారాష్ట్ర ఏమిటి? ఇది ఎలా జరిగింది? అని ప్రశ్నించుకున్నప్పుడు "I don't want to just use a word called miracle performed by షిరిడి బాబా" అనను. అది వారి అనుగ్రహంగా భావన చేశా. చెప్తుంటేనే అసలు తన్మయత్వం ఒకలాంటి- అవును అమ్మా అద్భుతం. నిజం గురువు గారు. గురువు గారు connecting the dots అన్నది- ఉమ్ బాబా వారు చెప్పారు మీరు ఇలా వచ్చారు అన్నది అది మీకు అప్పుడప్పుడే బోధపడుతూ వచ్చిందా? వచ్చింది తర్వాత అవలోకనం చేసుకున్నప్పుడు- లేదు లేదు. వారు పాత మందిరం అన్నప్పుడే లేకపోతే పాత మందిరం షిరిడియా అని నేను అడగగలిగా కదా. ఉమ్ అంటే అప్పటికి షిరిడి బాబాకి వీరికి connection ఏదో ఉందని, ఏదో ఉంది అని. ఉమ్ కానీ అది ఎలా demonstrate అవుతుందో మనకు తెలియదు. ఉమ్ మళ్ళీ రూపంలో వచ్చిన ఒకవేళ నేను అలా కళ్ళు మూసుకున్నాను. బాబా గారు మాయమైపోయి బాబా వారు వచ్చారు అన్నాను అనుకోండి. అది నా mind చేసే గారడీ కావచ్చుగా. అద్భుతం. కదా గురువు గారు దానికి ఒక పెద్ద issue చేసుకుని నేను షిరిడి బాబా సశరీరంగా దర్శనం చేశానని లోకానికి చెప్పుకోవటం ఆత్మవంచనే కదా. ఉమ్ చెప్పినప్పుడు అది జగద్వంచనే కదా. ఉమ్ రెండూ కాకుండా సత్యార్థ దర్శనం గనక నేను చేసుకోగలిగితే, two aspects అంటే ఏమిటి "ఏకోహం బహుష్యాం" అని మనకు మాట ఉందమ్మా. ఉమ్ ఒకే వస్తువు అనేక రూపాలలో కనిపిస్తుంది. నీరు కాచాం. వాయిలయింది. ఆవిరయింది కదా. లేదు freeze చేశాం. మంచుగడ్డ అయింది కదా. కానీ మూలం ఏమిటి? నీరేగా. వాయు ఘన రూపాలు తీసుకున్నది ఒకటి. కానీ మూలం ఏమిటంటే దీన్నేమో మంచు ముక్క అన్నాం. ఉమ్ Ice cube అన్నాం లేకపోతే. అదేమో ఆవిరి పట్టాం అంటున్నాం. కానీ ఉన్నది ఏమిటి అంటే మూలమే కదా. కనుక షిరిడి సాయి, సత్య సాయి వారు one and the same అని క్షణాన నేను మెమేయించుకున్నా. గురువు గారు మీది సత్య సాయిబాబా వారితో ఉండే అనుబంధాన్ని మీరు గురు శిష్యులు అంటారా? భగవాన్ భక్తులది అంటారా? స్నేహితులది అంటారా? మరొకటి ఇంకొక పేరేమైనా అనుకున్నారా ఎప్పుడైనా? అది ఎటువంటి బంధం అని. అసలు ఒక బంధం ఉన్నది అనుకున్నట్లయితే నేను ముక్తుడిని అయ్యేవాడిని కాదు. కానీ ఏదో relation ఉండాలిగా. అణువుకి అణువుకి relation ఉంటుందిగా. ఉమ్ పోనీ నేను ఆత్మని ఆయన పరమాత్మ అనుకున్నట్లయితే ఇది ఆత్మ పరమాత్మ జీవాత్మల సంబంధం అనుకోవచ్చుగా. అవును ఇవన్నీ- ఇప్పుడు మీరు చెప్పిన గురువు శిష్యుడు తండ్రి బ-బిడ్డ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును అవును. దక్షిణామూర్తి స్తోత్రంలో "స్వస్వామి సంబంధతః" అని ఒక మాట ఉందమ్మా. ఉమ్ స్వస్వామి సంబంధతః అంటే ఏంటంటే, ఆత్మ ఆత్మతో ఒనగూడి ఉన్నది. అంతే. దానికి మిగతావన్నీ మనం పెట్టుకునేవే. ఆయన నా గురువు, సద్గురువు, జగద్గురువు ఇవన్నీ మనము అనుకునేవి. కానీ ఇది ఆత్మైక సంబంధం. ఎందుకంటే దీనికి తావు physics లో, ఇక్కడ ఒక atom ఉంది. క్షణం మాట్లాడుతున్న గదిలో ఒక atom ఉంది. ఎనిమిది లక్షల మైళ్ళ దూరంలో ఇంకొక atom కూడా ఉంది. అది పరిభ్రమిస్తున్నది. ఇది పరిభ్రమిస్తోందో, పరిక్రమిస్తోందో ఇది ఉంది అది ఉంది. రెండూ కలవవలసి ఉంటే, affinity అంటూ ఉంటే అవి ఎప్పటికైనా కలిసి తీరుతాయి. ఉమ్ ఇది answer. కాబట్టి వారు ఎన్ని జన్మలు ఎత్తుకొచ్చారో మనకు తెలియదు. ఉమ్ నేను ఎన్ని ఎత్తుకొచ్చానో నాకు తెలియదు. నాకు అవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రపంచం అది. ఉమ్ ఇది వాస్తవంలో బాబా వారు అక్కడ ఉన్నారు, నేను అక్కడ ఉన్నాను. మరి దీనికి మళ్ళీ నేను అత్యద్భుతమైనటువంటి ఒక సంబంధాన్ని, బంధం కాదు సంబంధాన్ని నేను మళ్ళీ దాన్ని గురు శిష్యులని ఎందుకు దా-చిన్న పరిధిలో ఉంచుకోవాలి. పరిధి చిన్నదైపోతుంది. చిన్నదైపోతుంది. పేరు పెట్టినా కూడా. అంతే. పేరు పెట్టినా. నేను బాబా గారి అబ్బాయినో, అమ్మాయినో అనుకున్నట్లయితే, అవునా? మరి నేను ఎలా ఉన్నాను? తాన్ లో నుంచి నేను గనక వచ్చుంటే ఆయనలా ఉండాలిగా. ఉమ్ మరి ఆయనలా నేను ఎందుకు లేను? కనుక అది కాదు. గురు శిష్యులందామంటే, ఆయన చెప్పినవన్నీ నేను చేయగలిగానా? గురువు చెప్పింది శిష్యుడు వినాలని కదా. చెప్పినవన్నీ అర్థం అవుతున్నాయా? కాబట్టి అది కాదు. కనుక final conclusion ఏంటంటే "స్వస్వామి సంబంధతః". నాలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి component ఏదైతే ఉన్నదో. ఉమ్ దానితో దానికి relation ఉంది. ఉమ్ అది తనువుకి తనువుకి గనక సంబంధం ఉంటే, ఇవన్నీ ఏర్పడతాయి. ఉమ్ ఇది తనువుతో కూడిన బాంధవ్యాలన్నీ తనువుతో తెలవారిపోతాయి. ఉమ్ ఉమ్. వారు శరీరం చాలించారు. నేను చాలించలేదు. నేను ఉన్నాగా. అవును లేదా నేను చాలించాను. వారున్నారు. తనువులు మ-మాయమైపోయాయిగా. అవును ఒక తనువు పోయింది, ఒక తనువు ఉన్నది. మరి తనువు పోయినా ఏం మిగిలింది అంటే అది కాలాద్య విచ్ఛిన్నమైనటువంటి చిద్ఘనమైనటువంటి ఆత్మగా నేను భావన చేస్తూ cosmic energy తో ఇది align అయింది అని నేను అనుకున్నాను. అమ్మా. ఎంత సంపూర్ణంగా ఉందంటే గురువు గారు మీరు చెప్తూ ఉంటే మనసుకి పూర్తిగా ఎక్కడా ఒక ఒక iota of doubt కూడా ఆర్ question కూడా లేకుండా అక్కడికక్కడ అన్నీ సమాధాన పరచుకుంటున్నాం. అవునమ్మా మీరు చెప్పే గొప్ప అనుభవాలు. గురువు గారు cosmic energy మానవ రూపంలోనో ఒక physical manifestation లోనే మనకు వస్తుంది మన దగ్గరకు వస్తుందనేది ఒక aspect. కానీ బాబా వారు ఎందుకు అద్భుతాలు చేసేవారు? అని ఒక ప్రశ్న చాలా మంది అడిగారు. ఉమ్ దీనికి మీకు లభించిన ఆత్మజ్ఞానం ఏంటి గురువు గారు? ఇవన్నీ ఎందుకు చేశారు అన్నదానికి ఆత్మజ్ఞానానికి relation లేదమ్మా. ఉమ్ ఇది నా మనసుకి నా బుద్ధికి లోబడినటువంటి ఒక కార్యక్రమం. ఉమ్ ఎందుకు చేశారు అనేదానికి మాత్రం మనం సమాధానం తెచ్చుకోవాలి. ఉమ్ భగవంతుడు ఉన్నాడు మన గోడ మీద రాశాం. దేవుడున్నాడు. ఉమ్అనేక మంది దేవీదేవతలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి చెప్పబడ్డాయి. ఉమ్ నరనరాల్లో ఇంకిపోయి ఉంది మనకి. అవును దాన్నెవరూ కాదనలేరు. అవును అది ఎవరి అనుభవం వాళ్ళది. అనుభవం లేని వాడు ఏమంటున్నాడు అంటే "దేవుడు లేడు, ఏం లేదు" అంటున్నాడు. అనుభవం ఉన్నవాడు లేదా అనుభవం కోరి ఉన్నవాడు ఇంకా వాడికి కలగలా. ఉమ్ వాడు మాత్రం "దేవుడు ఉన్నాడు" అంటున్నాడు. ఉమ్ ఉన్నాడు లేడు పక్కన పెడితే, దైవం ఉన్నాడో లేదో లేడన్న వాడికి ఉన్నాడు అన్నవాడికి ఒక నిదర్శన కావాలి. proof కావాలి కదా. అవును, అవును proof ఎవరు చేయగలరు? మనం పెట్టే పరీక్షల్లో ఆయన నెగ్గటం కాదు. ఆయన చూపించేటువంటి ప్రదర్శన లో నుంచి అది కేవలం exhibition గా కాక, proof of the existence of the divine cosmic energy అది ఏమిటి అంటే దానికి వారు చేసిన అద్భుతాలు. అద్భుతం అంటే దాని అర్థమే మనం చేయలేనిది మరొకరు చేయగలిగినది అంతే కదా. ఉమ్ మరొకరు ఎవరంటే అది ఏమీ చేయలేదు అక్కడ మనం తల ఉంచుతాం. ఉమ్ accept చేస్తాం. ఆయన ఎందుకు చేశారంటే నాకు నమ్మకం కుదర్చటానికి. దైవ శక్తి ఇంత అపరిమితమైన అనంత శక్తి ఉన్నది, ఏముందో చిన్న వస్తువు సృష్టించటం పెద్ద విషయమా? అని చెప్పటానికి ఒకటి. తర్వాత దైవం ఉన్నాడు అనేటువంటి ఒక theory ని practical గా ఉమ్ "ఇదిగో దైవం అంటే ఇట్లా ఉంటుంది" అని చెప్పటానికి వారు అద్భుతాలు చేశారు. అద్భుతం అనే మాటలోనే ఏమున్నదయ్యా అంటే beyond human minds comprehension కదా. ఉమ్, ఉమ్ మన మన ఊహాతీతం. మనం చేయలే- comprehend చేయలేం. ఉమ్ చేయలేని దాన్ని "అది కాదు, అది కాదు, అట్లా కాదు, అలా miracles చేయకూడదు" అంటే రాముడు చేశాడు. ఉమ్ సేతువు కట్టాడు కదా. ఉమ్ ఉమ్ కానీ యుగంలో మనం కళ్ళతో చూడగలగడం అనేది- ఇది ఇక్కడ యుగానికి, కాలానికి వచ్చేప్పటికి ఎక్కడ వచ్చిందంటే religion ఎక్కువ పాత్ర వహించింది. ఉమ్ religions భిన్నభిన్నమైన అటువంటి ఆలోచన రీతులు ఉన్న కారణంగా నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నమ్మని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఉమ్ ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రశ్న లేకుండా, ఎందుకంటే భక్తిలో ప్రశ్న లేదు కదమ్మా. అవును No question, no reason, no season. "నేను నమ్మాను" అంతే. కానీ "ఎలా నమ్మావు? ఎందుకు నమ్మావు? నా మనస్సు ఎందుకు ఇక్కడ నమ్మకంలో నిలబడింది?" అంటే నాకు ప్రాథమికంగా తొలినాళ్లలో నిదర్శన కావాలి. అందువల్ల అద్భుతాలు మొదట్లో అని- ఇప్పుడు నా చేతికి హల్వా రావటం అనేది ఒక అద్భుతం. అవును, అవును అంతే కదా. హల్వా రావాలంటే చేసేవాడు ఉండాలి, ingredients ఉండాలి. ఇదంతా అ-అవేమీ లేకుండా ఇది వచ్చింది కదా అది అద్భుతం. ఉమ్ కానీ నేను నా మనస్సు ఇంకా ఇటువంటి అద్భుతాలు కొన్ని చూద్దామని అనిపించాలి కదా చిన్న వయసుకి. అవును అనిపించలా. ఊహు ప్రశ్న లేదు అసలు అస్సలు లేదు, అస్సలు లేదు. క్షణానికి కూడా లేదు. ఉమ్ ఎందుకంటే అసలు మానవ జన్మ ఎత్తటమే అద్భుతం. మానవ జన్మ ఎత్తి ఒక cosmic energy తో కూడి ఉండటమే ఒక అద్భుతం. ఇంతకంటే ఆయన సృష్టించిన వస్తువులతో నాకేం పని. ఉమ్ అది. అక్కడ మనస్సు స్థిమితం అయిపోయింది. అది. గురువు గారు మరి సందర్భంలో బాబా వారు- ఉమ్ మానవ జన్మ గురించి cosmic energy గురించి ఏం చెప్పేవారు? అంటే ఇటువంటి ఒక అద్భుతం అందరిలో ఉందని చెప్పేవారా? అంటే అద్వైతం నేనే శివుడిని అని మనం ఇది theoretical మాత్రమే. ఎవరికి అనుభవంలోకి వస్తుందో మనకి తెలీదు. కాబట్టి బాబా వారు ఏం చెప్పేవారు ఈ, కోణంలో ఏమైనా చెప్పేవారా అసలు ఇటువంటి అంశాల గురించి? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. ఇది సత్య సాయి బాబా వారి యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే ప్రశ్న. ఏంటంటే "నేను భగవంతుడిని, నేను ఆత్మను అన్నది నాకు తెలుసు." ఉమ్ "మీరు భగవంతులే కానీ మీకు తెలియదు." అని చెప్పేవారా? ఆహా! త్వమేవాహం సంశయః. నేను, నువ్వు ఒక్కటే. I am you, you are me అంతే. నేను వేరు, మీరు నా శిష్యులన్లే, మీరు నా భక్తులన్లే. మీరు నా బిడ్డలని కూడా అనలే బిడ్డలు అస్సలు ఒక మాటే లేదు. వారు వాడిన పదం ఏంటంటే సంబోధన దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా. రెండే మాటలు. మనలో ఉన్న frame of the body ఆయనకి సంబంధం లేదు. నా కీర్తి, నా సౌందర్యం, నాకున్న డబ్బు, నాకున్న తెలివితేటలు, నాకున్న ప్రాథమికమైనటువంటి డిగ్రీలు సరే వాటితో రకమైన బంధం ఆయన పెట్టుకోలే. అసలు He has not recognised me through those. ఎలా అంటే I am you, you are me. ఆహా నీకు నాకు తేడాయే లేదు. నేను ఆత్మనని, భగవంతుడినని నాకు తెలుసు. మీరు తెలుసుకోండి. ఉమ్ ఇది. ఇది ఆయన చాలా స్పష్టంగా మీరు ఆత్మే, దివ్యమైనటువంటి ఒక ఆత్మ. The pristine pure self has taken a form and you are that. ఉమ్ దాన్లో ఏముండాలి? ఆత్మ అంటే జడం కదా, అనుకుంటాం కదా, దానికేం లేదని కదా. దివ్యాత్మ స్వరూపులారా అలా వచ్చారు గనుక- ఉమ్ ప్రేమాత్మ స్వరూపులై సంచరించండి. ఉమ్ ప్రేమతో సంచరించండి. You love the whole world, the whole world will love you అంతే. ఇది మరీ మెదడుతో అడిగే ప్రశ్న అని అనుకోకపోతే గురువు గారు తమరు. ప్రేమని ఎలా నిర్వచించేవారు స్వామి? దానికి ఇది ఇందాక మనం దివ్య ప్రేమ. ప్రేమలో ఏముందంటే రాగము, అనురాగము, ప్రేమ అని మూడు స్థాయిలున్నాయమ్మ. ఉమ్ ఇవన్నీ మనం ప్రేమ అనుకుంటాం. నేను, నన్ను కన్న నా తల్లిదండ్రులు. నేను, నేను కన్న నా బిడ్డలు. ఉమ్ ఇది రాగం. రాగము అంటే రక్త బంధమే రాగం. అది ఎవరు చెరిపేది కాదు, పోయేది కాదు. ఊ. I am son of so and so. అదే కాబట్టి- I am mother or father of so and so. అది establish అయిపోయింది. అది physical level. ఇది కాలం ఎన్ని మార్పులు చెందినా రాగ బంధాలు ఎక్కడికి పోవు. ఉమ్ కాని స్థితిగతులు మారుతుంటాయి. ఉమ్ ఇవాళ ప్రేమిస్తాం, రేపు పొద్దున ప్రేమించం. లేదు మార్పు చెందుతుంటాయి relations ఉంటాయి, పోతాయి. ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. రాగము చాలా ప్రాథమికమైన భౌతిక స్థాయి. ఇక రెండవదిఅనురాగం ప్రపంచంతో ఉన్న ముడిపడి ఉన్నటువంటి మన relations బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ అనురాగాలు. రాగములో నుంచి పుట్టినది అనురాగం అంతే కదా! అంటే నాది కాని ఒక relation ని నాది అనుకోవటం. అది అవును. ప్రపంచం అంతా నాది కాదు కదా. అవును. ప్రపంచంలో నేను ఒక చిన్న స్వల్పమైన రేణువుని. కానీ నేను ఏమంటున్నానంటే ప్రపంచం అంతా నాదే దీంట్లో నేను విడిపోయి ఉన్న అని అనుకుంటున్నాం. దాన్లో మనకు నచ్చిన వాళ్ళు, మనల్ని మెచ్చుకున్న వాళ్ళు, అందరూ ఉన్నారు దీంట్లో. కానీ జాగ్రత్తగా గమనిస్తే మన స్థితిగతులు మారినప్పుడల్లా, మన ఆలోచనలు మారినప్పుడల్లా కనీసం ఒక దశాబ్ద కాలం నడిచి చాలా ఆహ్ ఇక వీళ్లిద్దరూ inseparable అని అనిపించుకున్న పదేళ్ల తర్వాత relation ఉంటుందో పోతుందో తెలియదు. ఇది అనురాగం ఇది transient and impermanent. ఉమ్ పైకి చాలా బలంగా కనిపించే బలహీనమైనటువంటి relation అనురాగం. అనురాగంలో విషాదం ఉంది, వియోగం ఉంది, ఎదురుచూపు ఉంది. Separation Separation ఉంది. pangs of separation దానిలో నుంచి వచ్చేటువంటి కొన్ని ఆతనులు ఉన్నాయి. రాగంలో అవేం లేవు we take it for granted. వీడు మా అబ్బాయి అయిపోయింది. ఇతను మా నాన్న అయిపోయింది. ఇదాన్ని ఎవరూ కాదనే వాడెవడు. ఇతను నా స్నేహితుడని కడదాకా చెప్పుకోవటానికి ఒక్కడు ఉండడే. ఉమ్ కదా! ఉమ్ కానీ మూడో స్థాయికి వచ్చేప్పటికి రాగ అనురాగాలు దాటిన తర్వాత ప్రేమ బంధం, ప్రేమ అనేటువంటిది ఉంది. ప్రేమ ఇవేళ సినిమాలలో, కాల్పనిక సాహిత్యంలో, కవితా ధోరణిలో మన మనస్సు చేసేటువంటి magic అంటాం the magic of the mind దానిలో నుంచి పుట్టేది ప్రేమ కాదు. అది కేవలము ఆహ్ ఆకర్షణ. అది ఒక అవసరానికి, ఒక సందర్భానికి, ఒక ఆవేశానికి, ఆలోచనారాహిత్యానికి, కావలసినటువంటి లౌకిక బంధానికి ముడిపడి ఉన్నటువంటిది లౌకిక ప్రేమ. గురువు గారు మరి దివ్య ప్రేమ ఎలా సాక్షాత్కరిస్తుందని expression అవసరమా అసలు? దివ్య ప్రేమ expression కి beyond అమ్మ. ఉమ్ అనుభూతి అనుభూతి ప్రధానమైనటువంటిదే దివ్య ప్రేమ. ఉమ్ అనుభూతి అనుభవంలో నుంచి పుడుతుందని వేదాంతం చెప్పినా, నా దృష్టిలో అనుభవం లేకుండా కూడా అనుభూతి కలగచ్చు. ఊహూ ఎట్లా అంటే మనం ఒక తోటలోకి వెళ్తాం. తోట నిండా పూలు వికసించి ఉన్నాయి. ఊమ్ ప్రభాత వేళ మనం దానికి morning walk అని పేరు పెట్టుకున్నాం. ఊమ్ మనకి తోటంతా కూడా ఒక దివ్యమైనటువంటి ప్రదేశంగా ఉన్నది. పువ్వు వాడిపోతుందేమో కోసుకుని ఇంటికి తీసుకెళ్దాము అని మనసుకి అనిపించటం లేదు. దాన్ని చూస్తూ చూస్తూ ఒక భావ పరిమళం మనకు తెలియకుండా మనల్ని చుట్టుముడుతున్నది. What a beautiful morning is this అని mind అన్నది. ఇంకా నోట్లో నుంచి రాలే. పువ్వుకి మనకి relation లేదు. తోటకి మనకు relation లేదు. కానీ దానితో అనుబంధం ఎలా ఏర్పడింది అంటే అనుభవాన్ని దాటిన ఒక అనుభూతి లోపల కలిగింది గనుక దాని యందు ప్రేమ మనకి క్షణం కలుగుతుంది. ఎంత అందంగా పుట్టింది. ఎంత దివ్య పరిమళాన్ని, పరిమళం అన్నాం కదా, దివ్య పరిమళం అంటాం కదా. అవును పదం దానికే వాడతాం. అది ఒక పువ్వుకు వాడతాం. కాబట్టి ఇవన్నీ ఎట్లా అంటే ఎక్కడ తాత్వికమైనటువంటి చింతన ఉన్నదో ఎక్కడ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, అతీతమైన భావన ఉన్నదో దాని పేరు ప్రేమ. మనసుకు లోబడిందా రాగానురాగాలు bracket లో పెడదాం. అవును అంతేనా? అంతే గురువు గారు. ఆహ్ లేదు అనురాగం ఏర్పడిందా? ఏమో నా అవసరం వారికి, వారి అవసరం నాకు ఉంది గనుక మేము బతుకుతున్నాం, మేం జీవిస్తున్నాం, మేం కలిసి ఉన్నాం అనుకుంటున్నాం. అక్కడ కూడా చాలా పరిమితులు ఉన్నాయి కదా. అవును Any time it's so fragile any time it can break. కాదు దివ్య ప్రేమలో నాతో మాట్లాడని పువ్వు ఎట్లాగో, నా కంటికి కనపడని భగవంతుడితో నాకున్న అనుబంధమే దివ్య ప్రేమ. ఆయనకు నేను ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు. కానీ మనం స్వామి చమత్కారం కూడా ఆయనది ఒక part ఉంది. అవును చాలా అద్భుతమైన చమత్కారం. ఆయన అన్నారు ఒకసారి భజన పెట్టారు. భజన చివర్లో ప్రసాదం వితరణ చేయడానికి నైవేద్యం పెడతారు. చెప్పినప్పుడు అక్కడ బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః అని చదువుతారు. తర్వాత अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः। प्राणापानसमायुक्तं पचाम्यन्नं चतुर्विधम्। నీకు నైవేద్యం పెట్టింది నాలో ఉన్న వైశ్వానర రూపంలో ఉన్నటువంటి వాడికే భోజనం పెడుతున్నామని ప్రార్థన అర్థం. అక్కడ కూర్చుని ఉన్నారు బాబా. వారు ఎదురుగా రెండు ప్రార్థనలు జరిగినయి చూపిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత చాలా హాయిగా "అవునవును చూపులు నాకు మేపులు మీకు" అన్నారు. ఆహా [నవ్వు] ఆయన తినేదానిమీద లేదు అక్కడ. అంతే కదా! కాబట్టి దివ్య ప్రేమకు అర్థం ఏంటంటేనే అమ్మా mind ని దాటాలి. mind ని దాటని ప్రేమ mind కి లోబడే సంచారం చేస్తుంది అది. మనమేం చేయలేం. దివ్య ప్రేమలో నాతో రోజూ భగవంతుడు వచ్చి కాసేపు మాట్లాడతాడా? రోజు నేను ఆయనతో మాట్లాడతాను అసలు ఆయనా, ఆమే ఎక్కడున్నారు? నేను పెట్టుకున్న do అంటున్నాను, ఉన్నది అంటున్నాను. అన్నింటికీ మూలమైనటువంటి భావాతీతమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని గనక భగవంతుడు అనుకున్నట్లయితే భగవంతుడితో మనం ఒక relation మానసిక స్థాయిని దాటి ఏర్పరచుకుంటే తాత్విక చింతనా భూమికలో ఏర్పడినటువంటి ఒక relation దివ్యమైనటువంటి ప్రేమ. ఉదాహరణ బాబా గారి ముందు ముప్పై వేల మందో, మూడు లక్షల మందో భక్తులు కూర్చుని ఉన్నారు. A లేదు వారి చుట్టూ ఒక ముప్పై మంది కూర్చుని ఉన్నారు. B C ఆయన కంటే చాలా దూరంగా కూర్చున్నారు. ఆయనతో ఆవరణంలోనే వీరు ఎక్కడో ఉన్నారు. మూడు రకాల వాళ్ళున్నారు.ఈ మూడు రకాల వాళ్ళతో అత్యుత్తమమైన relation ఎవరితో ఉన్నదంటే దూరంగా ఉన్న వాళ్ళతో ఉంది. అతి దగ్గరగా ఉన్న వాళ్ళతో ఆయన కూడా రాగ బంధాన్నే ప్రదర్శిస్తారు. నువ్వు పని చెయ్, పని చెయ్, సేవ చెయ్, plan చెయ్ ఆయనకు బండి నడపాలి. ఇరవై ఐదు వేల మందిని చూసి మీరంతా నా భక్తులు అని ఆయన అనలేదు. ఇరవై ఐదు వేల మందిలో ఇతడే నా భక్తుడు అని చెప్పలేదు కాబట్టి అనురాగాన్ని దాటారు ఆయన. కానీ ఇరవై ఐదు వేల మందిలో వాళ్ళు ఏమన్నారంటే దేవుడు అంటూ ఉంటే ఆయన సత్యసాయి బాబా వారే అనుకున్నారు. దాంతో ఆయనే సంబంధం పెట్టుకున్నారు. నేను అన్నానా? నేను దేవుడిని అంటే debatable. మనమందరం ఆయన్ని దేవుడిని చేస్తే debate ఏముంది? మన faith and faith has neither a reason or a season nor a season ఇట్ ఇస్ ఓన్లీ యువర్ మెంటల్ condition and conviction. దాంతో ఆయనకు ఎట్టి సంబంధం లేదు. ఆయన తామరాకు మీద నీటి బొట్టు. అంతేగా అంతే ఆకు మీద పడింది ముత్యం లా మెరిసింది గాలి అడుగు నుంచి గాలి కొట్టింది ఆకు అటు చలాచదురు అయింది లేదా పైకి లేచింది మళ్ళీ మూలంలో ఉన్నటువంటి నీళ్ళలో బిందువు పడిపోయింది ముత్యము లేదు బిందువు లేదు నీరు లేదు ఆకు ఆకుగా ఉంది. ఆకుగా ఉన్నటువంటి పద్మ పత్రమే నేను బాబా గారిగా భావించా. కాబట్టి ఆకు మీద ఉన్నంత వరకు relation ఉన్నట్టు కనిపిస్తుంది కానీ it has no relation. Absolutely no relation. కాబట్టి దివ్య ప్రేమను మనం అలా అనుభవించగలిగితే దానికి శాస్త్రాలు పురాణాలు మనకు అక్కరకు రావు. అవును మనదైనటువంటి మానసిక సంస్కారం. మనకొక సంస్కారం ఉంది. సంస్కారం pollute కావచ్చు అనేక విధాల shadows దాని మీద పడొచ్చు అవును అనేకమంది మిగతా వాళ్ళ వలన ఇది కొద్దిగా చెడిపోవచ్చు లేదా చెదిరి పోవచ్చు కానీ చెదరని, బెదరని, అదరని, కదలని స్థిరమైనటువంటి సంస్థితమైనటువంటి ఒక బాంధవ్యం దేనితో ఉన్నదంటే with the unseen and the unmanifested. Manifest తో కూడి ఉన్న దానికి చాలా ఇబ్బందులున్నాయి. Unmanifest అనుకున్నట్లయితే నేను బాబా గారిని రూపంగా భావించి ఉన్నట్లయితే బహుశా దివ్య ప్రేమను నేను అనుభవించే వాడిని కాదేమో. It is a beyond form. The formless form. గొప్పగా ఉంది గురువు గారు అమ్మా
YouTube · audio

Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2

Home

Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2

Source: iDream Media on YouTube

0:00 / 27:51

More in this series

Remembering Sri Sathya Sai Baba — Aaraadhanaa Mahotsavam interviews

7 episodes · 3 hr 7 min

  1. 26 min 2

    Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2

    Now playing
  2. 38 min 3

    సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3

  3. 25 min 4

    యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4

  4. 26 min 5

    ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5

  5. 20 min 6

    భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6

  6. 25 min 7

    ఘంటసాల పాదాల‌ను ఒత్తుతూ భ‌గ‌వాన్ క‌నిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7

  7. 20 min 8

    సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8