Skip to content
Transcript తెలుగు
సాయిరాం అనీల్ కుమార్ గారు సాయిరాం సార్ ఈరోజు సత్యసాయి భగవాన్ ని సత్య సాయి వాణి పేరు మీద నిన్న మొన్నటి వరకు రేడియో సాయి గా ఉన్నటువంటిది రూపాంతరం చెందింది సత్యసాయి అవతార వైభవంలో ఇది ఒక వినూత్నమైనటువంటి సన్నివేశం మంగళ సన్నివేశం కూడా ఇందులో సుదీర్ఘకాలం పరమాత్మతో కూడి ఉండి అనేక అనుభవాలు పొందిన మిమ్మల్ని ఆంధ్రదేశం విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా సంపూర్ణంగా అర్థం చేసుకునే దిశగా మీ ద్వారా స్ఫూర్తి పొందే దిశగా మనం కాసేపు ముచ్చటించుకుందాం అనిల్ కుమార్ గారు అనగానే స్వామి బహిర్వాణి గా బయటకు వినిపించే శబ్దంగా ప్రపంచం గుర్తించింది అది అందరం తెలుసుకున్నటువంటి విషయం అయితే స్వామి దగ్గరకు రావటానికి ముందు అసలు మీ కుటుంబ లేదా మీ వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక నేపథ్యం ఏమిటి సాయిరాం అండి చాలా చక్కని ప్రశ్న వేశారు కుటుంబ నేపథ్యం ఎంతైనా వ్యక్తిగత జీవితం పైనా ప్రభావాన్ని తప్పక కలిగి ఉంటుంది నా సంగతి చెప్పాలంటే మా తాతగారు ఇద్దరు మాతా మహులు పితామహులు ఇద్దరు కూడా సుప్రసిద్ధ బ్రహ్మ సమాజికులు ఆంధ్రదేశంలో ఇద్దరు కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారికి చాలా సన్నిహితులు గోదావరి జిల్లాలకు అంతా బ్రహ్మ సమాజాన్ని విస్తృత పరిచిన వారు మా తండ్రి గారి తండ్రి కామరాజు హనుమంతరావు గారు గుంటూరు కృష్ణా జిల్లాలంతా వ్యాప్తం చేసిన వారు మా అమ్మ నాన్న గారు శ్రీ పాలపర్తి నరసింహం గారు వీళ్లిద్దరూ ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం వ్యాప్తం చేశారు కలకత్తాలో ట్రైనింగ్ తీసుకున్నారు స్పెషల్ గా అందువల్ల ఇద్దరు కూడా బెంగాలీ భాషలో బాగా పరిచయం ఉన్నది రాస్తారు మాట్లాడతారు తర్వాత సంస్కృతం ఇంగ్లీషు తెలుగు ఇద్దరు దిట్టలు ధర్మజ్యోతి పత్రికా సంపాదకులుగా ఉన్నారు కామరాజు హనుమంతరావు గారు ధర్మ సాధానికి పత్రికా సంపాదకులుగా ఉన్నారు పాలపర్తి నరసింహం గారు ఇద్దరు యాభై, యాభై సంవత్సరాలు పత్రికా వ్యాస సంఘంలో ఉన్నారు అయితే వాళ్ళ జీవితాలన్నీ అది కష్టాల కడలి రోజుల్లో బ్రహ్మ సమాజంలో ఉండటం అంటే సామాన్య విషయం కాదు అవును ఎందుకంటే సాంఘిక దురాచారాలన్నీ కాదని వర్ణ వ్యవస్థలంతా కాదని కర్మకాండ క్రతువులు ఇలాంటివన్నీ కాదని కేవలం ఈశ్వర తత్వాన్ని నిరాకారంగా నిర్గుణంగా రకంగా ఉపనిషత్ విధానంలో ఉపాసించే అటువంటి పద్ధతి బ్రహ్మ సమాజం మరి ఇవన్నీ కాదంటే ఎంత కష్టం ఆలోచించండి అంచేత వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకే వాళ్ళు పనికిరాకుండా పోయారు మా తాత గారికి వాళ్ళ అమ్మా నాన్న వరండాలో అన్నం పెట్టేవారట ఎందుకంటే ఈయన విగ్రహారాధన వద్దన్నాడు అన్నారు జంజాట్ తెంపేశాడని వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు ఆయన చాలా కష్టాలు పడ్డారు అందులో ఎంతవరకు ఉన్నారంటే మా అమ్మగారు ఆవిడకు మస్సూజికి వస్తే ఆవిడని అలా వదిలేసి కలకత్తా ట్రైన్ కి వెళ్ళాడు మా తాతగారు అలా ఆవిడను వదిలేసి అలాగే మా అమ్మమ్మ గారికి టీబీ వచ్చింది మదనపల్లి అడ్మిట్ చేసి ఆయన ఇలా బ్రహ్మ సమాజ వ్యాప్తి చేయడానికి వెళ్ళేవారు అంటే వాళ్ళ జీవితాల్లో నేను గ్రహించింది ఏంటంటే ఆధ్యాత్మికం అంటే త్యాగమే త్యాగం లేని ఆధ్యాత్మికం అది ఆధ్యాత్మికం కాదు అని వాళ్ళ జీవితాలనుండి నేను గ్రహించాను చాలా నిరాడంబర జీవితం ఇంట్లో అంతా చాపలు పీటలు తప్ప పెద్దగా ఫర్నీచర్ ఏం లేదు పెంకుటిల్లు కానీ ఇద్దరు కూడా ఎంతో విశేషమైన గౌరవాన్ని ఆదరణను పొందినవారు మాటిమాటికీ ఎప్పుడూ ప్రార్థనలోనే గడిపేవారు రచనా వ్యాస సంఘంలో గడిపేవారు అది తాతగారుల విషయం అది వారికి దాని యందు ఉన్నటువంటి నిబద్ధత నిబద్ధత నిబద్ధత విశ్వాసం నమ్మిన సిద్ధాంతం పట్ల వాళ్లకు ఉన్నటువంటి అపేక్ష ఆసక్తి అద్భుతం అవునండి అంచేత వాళ్ళ బిడ్డలు కానివ్వండి మరి మా అమ్మమ్మ నాయనమ్మ కానివ్వండి వాళ్లకు సహకారం అందించారు కష్టాల్లో పంచుకున్నారు పిల్లలు కూడా ఏదీ కోరుకోలేదు ఇది లేదు అని ఈనాటి వరకు కూడా అనుకోలేదు అది మా తాతగారు అమ్మమ్మ నాయనమ్మల యొక్క నేపథ్యం ఇంకా మా అమ్మానాన్న దగ్గరికి వచ్చేటప్పటికీ ఆంధ్రదేశంలో రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడం తప్పు అష్టావర్శిత్ భవేత్ కన్యా అని రోజులవి ఇంకా అవును చదవకూడదు కదా అవును చదువుకోకూడదు స్కూల్ కి వెళ్ళకూడదు కాలేజీకి వెళ్ళకూడదు అలాంటి పరిస్థితిలో ఫస్ట్ లేడీ గ్రాడ్యుయేట్ మా అమ్మ ఆంధ్రదేశంలో చాలా కామరాజు సరోజini దేవి అని చాలా సంతోషం చాలా ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయింది అయిన తర్వాత ఆవిడ మద్రాస్ క్వీన్ మేరీస్ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది ఆవిడకి గోల్డ్ మెడల్ అవి వచ్చాయి తర్వాత ఆవిడ విద్యా రంగంలో విద్యా వ్యాసంగంలో ట్రైనింగ్ కాలేజీలో అన్నింట్లో పనిచేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ గా రిటైర్ అయింది మా అమ్మగారు ఇంక మా నాన్నగారి విషయానికి వస్తే ఆయన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నారు అమ్మ వాళ్ళేమో బాపట్ల నాన్న వాళ్ళేమో రాజమండ్రిఅందులో నాలో అటు గోదావరి కృష్ణ రెండు ద్వారములు నాలో ఉంటాయి. చాలా మెత్తగా మాట్లాడినప్పుడల్లా గోదావరి తండ్రి చూస్తుంది. ఉమ్ గట్టిగా మాట్లాడినప్పుడు కృష్ణ కనబడుతుంది. పరవళ్ళు తొక్కుతుంది. అది. రెండు ఉన్నాయి నాలో. ఉమ్ నాన్నగారేమో రాజమండ్రి వాడు. ఆయన ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నారు. రోజుల్లోనే ఆయన వక్తృత్వ పోటీల్లో వాటిల్లో ఫస్ట్ వచ్చేవారు. మంచి ఆర్యేటర్ ఆయన. ఉమ్ చక్కని రైటర్. ఆయన ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేశారు. ఎంఎస్సీ హానర్స్ ఫిజిక్స్ చేశారు భగవంతం గారి దగ్గర. ఉమ్ తర్వాత బిఈడీ చేశారు. తరువాత డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేశారు. అబ్బా! ఉమ్ ఇవన్నీ ఆయన చదువుకున్నవి. విశాఖపట్నంలో చాలా కాలం గడిపారు ఆయన. ఉమ్ డిగ్రీలన్నీ అక్కడే. సందర్భంలో మహా కవులతో పాటు ఆయనకి పరిచయం. వాళ్ళతో ఉండటం జరిగింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఉమ్ మా నాన్నగారు వారు కూడా బ్రహ్మ సమాజంలో ఉండేవారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి గారు, గుడిపాటి వెంకటచలం గారు. ఉమ్ వీళ్లంతా మా నాన్నగారికి బాగా సన్నిహితులు. ఉమ్ తో ఆయన మెడికల్ కాలనీలో కొంతకాలం పనిచేశారు. అందువల్ల డాక్టర్ ఏచిరాజులు గారు కానివ్వండి, డాక్టర్ పినాకపాణి కానివ్వండి, అబ్బో! మహానుభావులు. ఉమ్ వాళ్లందరూ ఆయనకి బాగా పరిచయం. డాక్టర్ పెనుమొంది నర్సింహారావు గారు గాని, వీళ్లంతా సామాన్యులు గారు. అతిరథులు వైద్య రంగంలో. ఉమ్ అలా ఆయన ఉండేవారు. ఉమ్ ఇద్దరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు. నాన్నగారు కూడా ఆయన డిఈఓ చేశారు. వార్ధక్యంలో గాంధీ గారి సిద్ధాంతానికి ప్రభావితులై, ఈయన ఖద్దరు వేయడం ప్రారంభించారు లైఫ్ అంతా. ఓహో ఖద్దరు రాల్చి ఖద్దరు పైజామా అంతే. నేను చూసింది దగ్గర నుంచి. అలాగే ఆయన ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. తరువాత ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ చేశారు. తరువాత రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేశారు. అలా పదవీ విరమణ చేశారు నాన్నగారు. ఉమ్ ఇది అమ్మానాన్న సంగతి. ఇక్కడ మీ తల్లి గారి మీద కూడా బ్రహ్మ సమాజం ప్రభావం ఉందా? విపరీతంగా ఉంది. ఎంత విపరీతంగా ఉందంటే, నేను సందర్భోచితంగా చెప్తున్నాను. అదే అదే ఉమ్ స్వామివారేమో ఇంటర్వ్యూకి పిలిచారు. ఉమ్ పిలిచి అందరూ ఎదురుగుండా ఉమ్ ఆమె ఉమ్ అనిల్ కుమార్ మదరయ్య ఉమ్ చాలా తెలివిగాది. ఉమ్ ఇంగ్లీష్ లో దిట్ట. ఉమ్ చాలా strict disciplinarian. ఉమ్ డీఓ చేసింది. ఉమ్ ఇవి ఎప్పుడూ నేను స్వామికి చెప్పలేదు. ఉమ్ మా అమ్మ మొదటిసారి రావటం పుట్టపర్తి. ఆవిడకు ఒక్కదానికి కుర్చీ వేయించారు. ఉమ్ అందరికీ కూర్చోపెట్టి ఆవిడ గురించి చెప్పారు. మాటల సందర్భంలో ఉమ్ స్వామి నేను బ్రహ్మ సమాజాన్ని నమ్ముతున్నాను. ఉమ్ భగవంతుడికి ఎట్టి ఆకారం లేదు, అవతార వాదాన్ని మేము విశ్వసించము. ఉమ్ నిరాకారుడు, నిర్గుణుడు అయిన నా భావం అని. అప్పుడు బాబా గారు అన్నారు, "అమ్మా ఉమ్ వయసులో నువ్వు మార్చుకోనక్కర్లేదు. ఉమ్ నీ మార్గంలోనే ఉండు, అది ఉత్తమం" అని కూడా బాబా గారు చెప్పారు. ఎంత అద్భుతం! ఉమ్ అప్పుడు మా అమ్మ చమత్కరిస్తూ అంది ఉమ్ "మా వాడు అద్వైతం చెబుతూ ఉంటాడు స్వామి ఎక్కువగా" అంది మా అమ్మ. ఉమ్ వెంటనే స్వామి నావంక తిరిగి ఉమ్ "వాడు మాట్లాడతాడు గానీ అద్వైత అనుభూతి, అనుభవం ఏమీ లేదమ్మా. ఉమ్ నీ మార్గంలో నువ్వే ఉండు ఉత్తమం" అని చెప్పారు ఆయన. ఉమ్ అయి బ్రహ్మ సమాజ ప్రభావం మీ అమ్మగారి వరకు వచ్చాం. మీ మీద ఎలా ఉండేది మీ చిన్నప్పుడు మీ బాల్యంలో? అంటే క-కట్టుబాట్లు, కుటుంబ క్రమశిక్షణ ఒక ఎత్తు, వ్యక్తిపరంగా లోకలోకాంతర ప్రాణం అంటాం చూడండి, మీరు జీవులు మీ-మీ సంస్కారంతో మీరు వచ్చారు. మీరు కూడా ద-ఆ ప్రభావానికి లోనయ్యారా? మీరు నమ్మారా ఇది అన్న సత్యమని? లేదు కాదని ఎప్పుడన్నా లోపల విభేదించుకున్నారా? పుట్టడమే బ్రహ్మ సమాజికుల కుటుంబంలో పుట్టాను గనుక ఉమ్ ప్రభావం ఉంటుంది గుంటూరులో ఉమ్ ప్రార్థన సమాజం ఒకటుంది. ఉమ్ మందిరానికి మా తాతగారు తీసుకెళ్లేవారు నన్ను, మా తమ్ముడిని. మా తమ్ముడు డాక్టర్ రత్నాకర్. ఉమ్ హైదరాబాద్ లో ఉన్నాడు. నిమ్స్ లో డీన్ గా రిటైర్ అయ్యాడు. ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ రీసెర్చ్ వింగ్ లో ఉన్నాడు. డాక్టర్ రత్నాకర్, నేను ఉమ్ మా తాతగారికి కుడిపక్క, ఎడమపక్కన రోజూ ఆయన ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాళ్ళం. తమాషా ఏంటంటే ప్రార్థనలకు ముగ్గురు నలుగురు కన్నా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే బ్రహ్మ సమాజికులు తక్కువైపోతున్నారు. తక్కువ ఉన్నారు మా తాతగారేమో కళ్ళు మూసుకుని కన్నీళ్లు కారుస్తూ ప్రసంగం చేసేవారు ఒక వెయ్యి మంది ఉన్నట్లుగా. ఉమ్ అదేమిటని అడిగితే ఆయన అన్నాడు, "భగవంతుడు అన్నాక ఎక్కడో ఒకడు వింటున్నాడు కదా. ఇంత భగవంతుడు అంత మనుషులు ఉన్నట్టే. జనం బట్టి మాట్లాడేవాళ్ళు రాజకీయ నాయకులు. ఉమ్ భగవంతుడితో సంభాషణ జనం కంటే అధికం కదా" అనేవారు ఆయన. అందులో ఆయనతో పాటు తిరగడం వల్ల పూర్తిగా నాకు బ్రహ్మ సమాజం పైన నమ్మకం ఉన్నది. నిజం చెప్పాలంటే ఉమ్ ఈనాటికీ కూడా బ్రహ్మ సమాజ నరనరాల్లో ప్రవహిస్తూనే ఉన్నది ఈనాటికీ కూడా నాకు. ఎందుచేతనంటే ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు. వివాహ సమయంలో తెలుగులో చెప్తారు బ్రహ్మ సమాజంలో ఉమ్ అంటే క్రిస్టియన్ వివాహాల్లో లాగా అదే అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నావా? అబ్బాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నావా? నేను క్రిస్టియన్ కాలేజ్ చదవడం వల్ల నాకు పద్ధతి అంతగా నచ్చలే. నేను హిందూ వ్యవస్థ ప్రకారం చేసుకోవాలి అని కాస్త పట్టుబట్టాను. ఉమ్ కాస్త మా తాతగారు వాళ్ళు పాపం కొంత బాధపడి కొద్దిగా రాజీ పడి ఉమ్ సరే పోన్లే పాపం అని అంగీకరించారు. అంగీకరించారు. అది వాళ్ళ ఔదార్యమే. బాగా అది బాగా అదే వాళ్ళు జంజాలు తంపుకుని బయటకు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నన్ను ఒప్పుకున్నారంటే పైగా అది వాళ్ళ ఔదార్యం పైగా వారి తరువాత తరం మీరు మూడో తరం దాన్ని అందిపుచ్చుకోవలసిన వారే ఉమ్ మీరు హికార ధోరణి ప్రదర్శించినా అంగీకరించడం వాళ్ళ గొప్పతనం. మా అమ్మమ్మ చలవ అండి. ఆవిడ చేత recommend చేయించాను. ఉమ్ ఆవిడ మెల్లిగా మా తాతగారి దగ్గరికి వెళ్ళి, "చూసారా, మీరు ఇవన్నీ కాదన్నప్పుడు మీ అమ్మానాన్న ఎంత బాధపడి ఉంటారో" ఉమ్ "వాళ్ళు సర్దుకోవాలే" అది "అలాగే మేము మనకది ఎందుకండీ అంటారు. ఉమ్ వాడిది పెళ్లి ఇలా జరగాలని ముచ్చట పడుతున్నాడు. ఉమ్ అలాగే కానివ్వండి" ఉమ్ అని చెప్పింది మా అమ్మమ్మకే. credit దక్కాలి. ఉమ్ చాలా బాగుంది. అసలు నిజానికి సగుణోపాసన నుంచి అద్వైతం గాని, హిందూ మతం, వేద మతం గానిఏం చేద్దాం నిర్గుణ పరా-- నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసన చేయమంటుందిగా అవును కత్తె సగుణం లేకుండా నిర్గుణం లేదని అద్వైతులు నిర్గుణం ultimate ఏదైతే ఉందో చివరి పతాక స్థాయిలో ముందే మొదలు పెట్టడమని బ్రహ్మ సమాజి వాది. ఇద్దరూ బ్రహ్మ వాదులే అవును ఇంత నేపథ్యం, ఇంత గాఢమైన నేపథ్యం, కుటుంబ నేపథ్యం అంటే రెండు తరాల ముందు ప్రభావితమై ఉన్నటువంటి మీరు భగవాన్ సత్యసాయిబాబా వారి గురించి ఎప్పుడు విన్నారు మొట్ట మొదట? అసలు వారి గురించి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? 1968 సంవత్సరం, గుంటూరు medical college లో doctor భగవంతం గారు ఉపన్యాసం ఇస్తారని తెలిసింది. వారితో పాటు ఆనాటి high court judge వల్లూరి పార్థసారథి గారు కూడా గుంటూరు రావడం జరిగింది. వీరిద్దరినీ పరిచయం చేసేవారు doctor అమరేంద్ర గారు. మా నాన్నగారు భగవంతం గారి శిష్యుడు అవడం వల్ల అమరేంద్ర గారు మా family friend అవడం వల్ల మా నాన్నగారు వెళ్లాలనుకున్నారు. మేము medical college లో వారి lectures వినడానికి వెళ్ళాము. అక్కడ భగవంతం గారు శాస్త్రీయ విధానంలో బాబా గారి గురించి ప్రసంగించినప్పుడు మొట్ట మొద అప్పుడే వినడం జరిగింది. విన్నప్పుడు భగవంతం గారి వంటి ఒక అంతర్జాతీయ స్థాయి శాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త సత్యసాయి భగవానుడి గురించి మాట్లాడినప్పుడు మీలో ఆహ్ ఏదన్నా ఒక చలనం, ఒక భావం, ఒక ప్రేరణ అటువంటిది ఏదన్నా కలిగిందా? నిజం చెప్పాలంటే మా నాన్నగారేమో గురు భక్తి వల్ల వెళ్లారు. భగవంతం గారి కోసం అని. మా నాన్నగారితో పాటు నేను వెళ్ళాను. భగవంతం గారంతా వారి స్వీయ అనుభవం చెప్పారు. ఆహా చాలా చక్కగా చెప్పారు. ఎలా అన్నారంటే, "మీలో ప్రతి ఒక్కరూ నా పరిస్థితిలో ఉంటే ఎలా చేసేవారు? ఇసుక తిన్నెల వైపు నడుస్తున్న బాబా గారు ఇసుకలోంచి భగవద్గీత తీశారంటే మీరే నేనైతే ఎలా స్పందిస్తారు? ఒక రాతి కట్టడం అయిన శివలింగానికి ఒక బంగారం తాపడాన్ని అతికిచ్చారంటే అది అసాధ్యం శాస్త్రంలో. మీరే నేనైతే ఏమనుకుంటారు? విధానంలో చెప్పారు. చాలా, చాలా అద్భుతం! మరి ఇది ఇట్లా సాగుతూ ఉండగా స్వామి దగ్గరకు వెళ్ళాలి అనటానికి మీకు కారణం ఏమిటి? ప్రేరణ ఏమిటి? నా భార్య విజయలక్ష్మి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మ, నాన్న ఇదిగో మామూలు సాధారణ బ్రాహ్మణ కుటుంబాల లాగా త్రికాల స్నానాలు, త్రికాల సంధ్యలు ఆవిడకి అన్నీ పూజలు, పునస్కారాలు, నైవేద్యాలు అయితే గాని భోంచేయదు. మధ్యాహ్నం ఎప్పుడూ రోజు రెండున్నర, మూడే మధ్యాహ్నం భోజనాలు, రాత్రేమో పది. పూజలు ఇవన్నీ ఉండాలి. కుటుంబాన్ని నుంచి వచ్చింది ఈమె. మాదేమో బ్రహ్మ సమాజం. మా ఇంట్లో రాముడు, కృష్ణుడు పటాలు గాని, వెంకటేశ్వరం గాని ఇవేమీ ఉండవు. ప్రతిరోజూ ఏడు గంటలకు మాత్రం మా ఇంట్లో ప్రార్థన ఉంటుంది. అదంతా బ్రహ్మ సమాజ మార్గంలో ఉంటుంది. కానీ ఇవిడ ఇంటి నుంచి రావడం వల్ల వెంకటేశ్వర స్వామి photo తెచ్చుకుంది. తెచ్చుకొని బాహాటంగా తగిలించడానికి వీల్లేదు. అందువల్ల మా bedroom లో రహస్యంగా table మీద పెట్టుకుంది. మరి పెంకుటిల్లు చాలా చిన్నవి. అది ఒక పక్కన పెట్టుకుందన్నమాట. నేను ఏం చేసుకున్నా నాకు పెద్ద ఏమీ లేదు అసలు. సరే మా తప్పేముంది, అది తనకి దాని ఇష్టం. అది పెట్టుకుందని కూడా నాకు తెలీదు. ఒకరోజున మా తాతగారు చక్కని మందార పూలు ఏవో ఉంటే "అమ్మా" అని తీసుకొని ఇచ్చారు ఆవిడకి. ఈమె ఏం చేసింది తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టింది. మా తాతగారు చూశారట. "చూడమ్మా, అది నీకోసం ఇచ్చాను. నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది." ఇది ఎలా ఉంటుంది పాపం మాట్లాడకుండా కూర్చుంది. కనుక సాధారణమైనటువంటి పక్కా బ్రాహ్మణ కుటుంబం, అంతా జాడస్తాలు, మడి ఆచారాల కుటుంబాన్ని నుంచి వచ్చిన తాను, బ్రహ్మ సమాజంలో అట్లా, అట్లా, అట్లా ఉంటున్నది. వదిలి ఉన్నది. తనదేమో సంప్రదాయం, మాదేమో నూతన నవీన ఆధునిక విధి-విధానము బ్రహ్మ సమాజం. బాగుంది. అదే స్వామిని మీరు చూడాలి అని మీకు ఆహ్ భావం కలగటానికి ప్రేరణ ఏమిటి? దానికి ఏదన్నా ఒక కారణం ఉందా? సంఘటన ఉందా? ఒక నిమిత్తంగా జరిగింది అని ఒకటున్నది. 1972 సంవత్సరం అది ఏప్రిల్ మాసం. గుంటూరులో ఏప్రిల్ అంటే రాళ్లు కూడా పగులుతాయి. అవును రోకళ్ళు కూడా పగులుతాయి. అవును, అవును రోహిణి అంటే రోకళ్ళు పగిలేవని కూడా అటువంటి పేరున్నది. అలాంటి సమయంలో అంతకు రెండు, మూడు నెలల ముందు ఈవిడేమో "నాకు ఆహ్ ఉంట్లో బావుండలేదు" "నడుం నొప్పిగా ఉంటోంది" "ఏమీ సహించట్లేదు" అని మొదలు పెట్టింది. గుంటూరులో చాలా గొప్ప doctors. అప్పటికిప్పుడు కూడా అది వైద్య కేంద్రమే. విద్యా కేంద్రం, వైద్య కేంద్రం. బాగా ధనికులు కూడా ఉన్న place అది. అందువల్ల doctor దగ్గరికి తీసుకెళ్లి చూపించేవాళ్ళం. అందరి doctor దగ్గరికి తీసుకెళ్లాను. అందరూ ఏమన్నారంటే, uterus పైన ఒక ulcer లాంటిది బయలుదేరిందయ్యా, operation తప్పక చేసి తీరాలి. లేకపోతే cancer గా మారే ప్రమాదం ఉందని చెప్పారు. అందరూ doctor లూ ఇదే అభిప్రాయంలో ఉన్నారు. అందరూ top doctors. doctor కొడందరాం గారు, సామాజీ గారు అవును doctor సుభద్రాదేవి అంటే ఆల్ ఓవర్ ఇండియా పేరున్నటువంటి వాళ్ళు. world class gynecologist ఆవిడ. top most అవును, చాలా గొప్ప వాళ్ళందరూ అదే confirm చేశారు. సరే operation చేద్దాం అని నిశ్చయించుకున్నాం. నేను అప్పుడు చాలా Rotary club, Lions club, తర్వాత college లో Science association, బయట literary associations వాటిల్లో చాలా busy గా ఉండేవాడిని. ఊహూ College లో students union activities, A tutorial board వాటిల్లో ఉండేవాడిని. ఇదిగాక బాటనీ చెప్పడం, tutorial college లో చెప్పడం, ఇంట్లో private tuition చెప్పడం చాలా busy గా ఉండేవాడిని. ఈవిడ ఇంటికి వచ్చేవాడికి నలుగురు పిల్లలు కావలిచ్చుకొని ఏడుస్తూ ఉండే.ఏమిటంటే వీళ్ళెట్లా నాకైతే ఎట్లా నీకైతే ఎట్లా ఉమ్ ఇది రోజు. నేనేమో రంగ రంగేడిగా వచ్చేవాడిని. ఉమ్ ఇంటికొచ్చేటప్పటికల్లా ఇది కథ. దేవుడా అనుకున్నాను. ఉమ్ ఏం చేయాలి? ఉమ్ సరే ఆపరేషన్ చేద్దాం అని నిశ్చయించుకున్నాం. అప్పుడు వై.వి. సుబ్బారావు గారున్నారు. డాక్టర్ వై.వి. సుబ్బారావు. ఉమ్ గుంటూరులో చాలా పేరున్నవాడు. ఆయన ఆపరేషన్ చేశాడు. ఆయన హాస్పిటల్ పేరు సంజీవి క్లినిక్. క్లినిక్ చేశాడు ఆపరేషన్. నాకు ఎలాంటి వేదిక, ప్రసంగం- ఉమ్ చిన్నప్పుడు ఒక అభిరుచిగా ప్రారంభమై- ఉమ్ తర్వాత- ఉమ్ అదొక రకమైనటువంటి ఉత్సాహం, దానిపైన interest గా పెరిగి- ఉమ్ చివరికి వ్యసనంగా మారింది. ఉమ్ It has become a vice to speak in public. ఉమ్ అట్ల అయిపోయింది. ఈమెను హాస్పిటల్ కి తందానుతాను వెళ్ళింది. నేను ముందు రోజు- ఉమ్ ఏప్రిల్ ఐదవ తేదీ. ఆనాటి గవర్నర్ కండుబాయి దేశాయ్ గారు గుంటూరు వచ్చారు. ఉమ్ వారి ఉపన్యాసం translate చేస్తున్నా. ఓహో ఈవిడ హాస్పిటల్ కి వెళ్తే. అంతగా నాకు జనంతో తిరగడం- తిరగడం వ్యాసాలు ఉండేవి. ఉమ్ తెల్లారి హాస్పిటల్ కి వచ్చేసరికి తను తాను వెళ్ళిపోయింది థియేటర్ కి. ఉమ్ ఆపరేషన్ చేసి అయిపోయింది, బానే ఉంది. కనీసం ఇంటికి డిశ్చార్జ్ అయి వచ్చింది. వచ్చాక కొన్నాళ్ళాయాక- ఉమ్ నాకు మళ్ళీ నొప్పి అండం మొదలు పెట్టింది. ఉమ్ డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళాను. ఉమ్ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, అందరూ ఆయాచాయా బానే ఉంది, పైకి బానే ఉండేది. ఉమ్ నాకు ఏది తిన్నా- ఉమ్ పడదు. ఉమ్ నాకే కడుపులో మంట అని. ఉమ్ అందరూ ఏం లేదు బానే ఉందయ్యా అనేవారు. ఉమ్ కోదండరాం గారి బోటు వాళ్ళైతే హాస్యం చేసేవారు. ఎందుకో నువ్వు వంట చేస్తే- మీ ఆవిడ త్వరగా కోలుకుంటుందయ్యా అనేవారు. చమత్కారంగా! ఉమ్ నిజమేనండి నాకు చాటయింది. ఉమ్ instant coffee తప్ప వంట ఇంక రాదండి. ఉమ్ ఏం చేస్తాం మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది. ఉమ్ అత్తారింటి కూడా ఊళ్ళోనే ఉంది. ఉమ్ ఇక వంట చేసుకునే యోగ్యత గాని- ఉమ్ యోగం గానీ జన్మకు ఉన్నట్టు లేదనేవారు. ఉమ్ ఇట్లా అందరూ హాస్యం పట్టించేవారు. చివరికి ఇంట్లో వాళ్ళు కూడా నీకేం బానే ఉన్నావు కదా అని ఇంట్లో వాళ్ళు కూడా అనేవారు. ఉమ్ దాదాపు ఒక హాస్యాస్పదమైన వస్తువుగా మారిపోయా. మారిపోయావు. ఉమ్ ఈవిడకే మాత్రం ఒక problem ఉండేది, మధ్యాహ్నం ఏం తినేది కాదు. ఉమ్ ఇది లాభం లేదు. ఉమ్ ఏదో కాదు పూజా పునస్కారాలు ఇంటి నుంచి వచ్చిన మనిషి, ఏదో మనం చేయాలనుకొని- ఉమ్ ఒక రిక్షా, గంటకి రోజుల్లో రూపాయిన్నర. ఉమ్ అంటే రూపాయి యాభై పైసలు. పైసలు. ఉమ్ గంటకి. ఉమ్ అట్లా మాట్లాడుకున్నాను. ఈవిడ్ని, పిల్లల్ని ఎక్కించుకొని రోజుకొక్కోక్క గుడికి తీసుకెళ్లేవాడిని. గుడిలో నువ్వు కూర్చో, నేను పిల్లల్ని ఆడించుకుంటూ బయట ఉంటా, నేను గుళ్ళోకి రాను. నేను గుళ్ళోకి ఎప్పుడూ పోల. ఉమ్ ఈవిడ మాత్రం కాసేపు కూర్చునేది. నేను పిల్లల్ని ఆడిస్తూ ఉండేవాడిని. బానే ఉంది కాసరా, బానే ఉంది. కనీసం మనసు శాంతిగా ఉందనేది. ఉమ్ కానీ పూర్తిగా నివారణ కాలం కాలే. నొప్పులు ఉంటూనే ఉన్నాయి. ఉమ్ కానీ శాంతిగా ఉండేవి. ఉమ్ ఇలా రోజూ ఊరేగింపు, రిక్షా ఊరేగింపు సాగుతూ ఉండే. [నవ్వు] ఒకరోజు గుంటూరులో రైల్వే స్టేషన్ దగ్గరగా- ఉమ్ రామా వైశ్య ధర్మ సత్ర సంఘం అని ఉంది. వాళ్ళది పెద్ద చౌల్ట్రీ. హాస్పిటల్ కి వచ్చే వాళ్ళంతా అందులో దిగుతూ ఉంటారు. మేడ పైన- ఉమ్ పెద్ద భజన హాలు ఉన్నది. ఉమ్ అక్కడ భజన వినపడుతున్నది. మేము రిక్షాలో వస్తుంటే- ఉమ్ భజన వినపడుతుంటే అంది- ఉమ్ అక్కడికెళ్ళి చూద్దాం. ఏంటో చూద్దాం పైకెళ్ళాం. ఉమ్ వెళ్ళాక అది సత్యసాయి భజన. పెద్ద ఫోటో స్వామిది. ఉమ్ లేడీస్, జెంట్స్ కూర్చున్నారు భజన. ఉమ్ సచ్చాంరా బాబోయ్ ఇక్కడికొచ్చామేమిటి? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి కూడా పనికిరాదు. ఇక్కడికొచ్చాం, ఏదో నాకు పరీక్షా సమయంరా బాబోయ్ అనుకున్నా. భజనలో కూర్చుని ఇంటికొచ్చాక, నాకు చాలా బావుంది. ఉమ్ మనం పుట్టపర్తికి వెళ్దాం అన్నది. ఊమ్ నేను అన్నాను- ఉమ్ కైకేయి ఇలాగే కోరుకొని- ఉమ్ దశరథుడు మరణానికి కారణం అయింది. ఉమ్ కైకమ్మ కోరికలు కోరుకుంటున్నావు నువ్వు. ఉమ్ మా ఇంట్లో అలాంటి పనికిరావు నా ప్లీజ్. నన్ను వదిలిపెట్టు మనం వెళ్ళవద్దు. అలా కాసుమా? పిల్లలు కావాలా వద్దా నీకు? ఉమ్ వాళ్ళు బాగుండాలా లేదా? ఉమ్ వాళ్ళని నేను చూసుకునే స్థితిలో లేను. నేను ఉంటానూ అని నమ్మకం లేదు. ఏమంటావు? వెళ్ళొస్తానంటున్నావు కదా! ఉమ్ ఏం చేయను? అలాగే మెల్లలిగా గడిపా. ఉమ్ గడిపాక, త్వరగా వెళ్ళాలి వెళ్ళాలి అని రోజు మొదలు పెట్టింది. ఉమ్ మెల్లిగా నేను మా అమ్మమ్మకి దగ్గరికి వెళ్ళా. ఆవిడను ఒప్పించా. ఆవిడ మెల్లిగా మా తాతయ్యకి చెప్పింది. ఆయన సరే పోనీలే నా పో అన్నాడు. మెల్లిగా మా అమ్మానాన్నకి చెప్పా. మాది joint family. సరే వాళ్ళందరూ సరేలే అనుకున్నారు. నేను మాత్రం వాళ్ళందరికీ వాగ్దానం చేశాను. నేను మతం మార్చే ప్రశ్నే లేదు. ఉమ్ నేను వెంటనే అంగీకారం చేసే ప్రశ్నే లేదు. నేను బ్రహ్మ సమాజంలోగానే ఉంటాను. ఉమ్ దాన్ని బాగా నమ్మాను. ఉమ్ నరనరాల్లో అదే ఉంది. ఉమ్ రోజుల్లో బ్రహ్మ సమాజ వేదికలో మాట్లాడుతున్నప్పుడు, భావి భారత- ఉమ్ భాగ్యోదయం- ఉమ్ బ్రహ్మ సమాజ కార్యకర్త అనిల్ కుమార్ చరణ్ జీవ్ అని ఎన్నో నన్ను ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజ భక్తులు, కార్యకర్తలు భావించేవారు. ఉమ్ కానీ నేను మారే ప్రశ్నే ఉండదు- ఉమ్ అని వాళ్ళకి చెప్పా. వెళ్ళి మొత్తానికి మా అత్తగారిని తీసుకొని- ఉమ్ పిల్లలతో ఒక క్యారియర్, అందులో చింతకాయ పచ్చడి, అప్పడాలు, వడియాలు, మంచి చక్కని సామాగ్రి- ఉమ్ తీసుకొని వచ్చాం. డెబ్బై రెండులో. ఇన్ని buildings లేవు అప్పుడు కావు. ఇన్ని multi storied buildings కూడా లేవు. గేటు ఎదురుంగా రంగప్ప అనే ఒక చీరాల షాప్ ఉండేది. రంగప్ప చీరాల షాప్ లో ఆయన rooms ఉన్నాయి. అందులో ఒక room మాకిచ్చాడు. ఉమ్ అరేయ్ మాకు ఇచ్చాడు కదా అని చెప్పి room లో ఉన్నాం. room ఎంత చక్కగా ఉందంటే- ఉమ్ తలుపులు మన చేతికొచ్చేస్తాయి. ఉమ్, ఉమ్ హాయిగా తీసుకోవచ్చు. ఉమ్ అక్కడ తగిలించవచ్చు. ఉమ్ కిటికీలు కూడా వస్తుంటాయి. ఉమ్ అన్నీ removable, collapsible అలా ఉండేవి. ఉమ్ తర్వాత స్నానానికి- ఉమ్ పావలా ఇస్తే వేడినీళ్ళు ఇచ్చేవారు. ఉమ్ ఇరవై పైసలు.అన్నీ మా బయలు భూములే అన్నీ అవును అలా ఉండేది అవును అలా ఉన్నప్పుడు రోజు ఈవిడ దర్శనానికి వెళ్లి కూర్చునేది ఉమ్ మా అత్తగారు ఈవిడ వెళ్లేవారు ఉమ్ నేను మాత్రం మందిరం లోపలికి వెళ్ళలేదు ఉమ్ స్వామి దర్శనం కూడా చేయలేదు. బయటే చుట్టుపక్కల తిరుగుతూ ఆడిస్తూ ఉండేవాడిని. అంతే కానీ భోజనాల దగ్గర మాత్రం ఉమ్ మా ఇద్దరికీ ఒక heated discussion వచ్చేది ఉమ్ ఏం మందిరం లోపలికి వస్తే తప్పేమిటి అని ఆవిడది ఉమ్ నేనే అన్నాను ఉమ్ నువ్వు కావాలన్నావని కొచ్చాను. ఇవాళ వచ్చి వస్తే తప్పేమిటి అని అడిగితే తప్పది ఉమ్ I honour your feelings You respect my feelings That's all Correct Fifty fifty తప్ప అంతేగా As a unidirectional అది ఉండదు బాగుంది అని చెప్పా. తప్పేంటి స-స-సలా you go అని అనేవాళ్ళు. గుంటూరు అని చెప్పాను ఉమ్ మందిరం లోపలికి రమ్మని అనవద్దు ఉమ్ ఆయనకి నమస్కరించమని అనవద్దు ఉమ్ నేను నాలుగైదు రోజుల కన్నా ఉండలేను ఉమ్ ఉద్యోగం పోతుంది అవును బాబా గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నెలలు నెలలు పడి ఉండేవారట ఉమ్ మనకేం ఆస్తులు లేవు ఉమ్ అమ్మా నాన్న ఉద్యోగం చదివి చోలు పెట్టారు. నీ ఉద్యోగం నువ్వు తెచ్చుకో ఉమ్ లేకపోతే రిక్షా తొక్కుకో. నాకు వచ్చిన ఉత్తరాలు అన్నీ అవే అవే రిక్షా తొక్కుకో అన్న ఉత్తరాలే ఉమ్ ఉమ్ నీ స్వశక్తిపై నిలబడు. లేకపోతే గోరింట అంతే ఉమ్ కనుక ఆవిడ clear గా చెప్పారు ఉమ్ మనకి ఆస్తులు లేవు ఉమ్ ఉద్యోగం ఊడుతుంది ఉమ్ నీ భర్త కోసం మాదాకాడం స్థితికి నన్ను దిగజార్చుకో ఉమ్ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తా. మొండొడు ఒప్పుకున్నాడులే అని పాపం ఒప్పుకుంది ఉమ్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు దర్శనం చేసి వస్తూ ఉండేవారు ఉమ్ నాకు ఇగ రేపే రేపు సాయంకాలం వెళ్ళాలి అనగా ఉమ్ ఈయన ఎట్లా ఉంటాడో చూస్తే బాగుండు కదా అనిపించింది నాకు ఉమ్ నేను ఎట్లా పడితే అట్లా విమర్శిస్తూ ఉండేవాడిని ఉమ్ రోజుల్లో ఆర్ కె కరంజియా విమర్శ పూరకమైనటువంటి అదే British paper అవును British లో సంపాదకులు Last page భయంకరంగా తిట్టేవాడు భయంకర అవును అవును విమర్శిస్తే కరంజియా లాగా విమర్శించాలి అవును కీర్తిస్తే కరంజియా లాగా కీర్తించాలి తర్వాత చేశారు మా ప్రశంస ముప్పై ఐదు మార్కులే ఉమ్ మా అభీశంస ముప్పై ఐదు మార్కులే అవును వాడు pass అయినట్టు కాదు తప్పినట్టు కాదు ఉమ్ కాదు అన్నవాడు తర్వాత అవునన్నాడు అవునన్నాడు అంత అవును అంత చాలా వ్యతిరేకంగా రాసేవాడు రోజుల్లో అవును అవును నేను బాగా చదివేవాడిని. అందుకు నాకు English భాష పైన కాస్త అభిలాష ఉన్నది. English literature చదువుదాం అనుకుంటే మా అమ్మ ఉమ్ అరే వద్దురా ఉద్యోగాలు రావు బాట్ నువ్వు చదువుతావా లేదా అని ఉమ్ సరే రోజుల్లో నేను నోరు మూసుకుని చదివాను ఉమ్ ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పినా ఎవడు వినేవాళ్ళు లేరు అవును అప్పుడు అలా ఉండేది ఉమ్ సరే వచ్చాను ఉమ్ ఆయన్ని చూద్దాం అనిపించి గుమ్మం దగ్గర నుంచొన్నా. స్వామి ఏమో భజనలో కూర్చున్నారు ఉమ్ సాయంకాలం. దర్శనం ఎలా ఉంటుంది ఏమిటి చూడాలా అనిపించింది విశేషాలు మెల్లిగా చెప్తాను మీకు అనిల్ కుమార్ గారు ఇవ్వేళ మీ నుంచి స్వామి గురించిన విశేషాలు వింటూ ఉంటే పందొమ్మిది వందల అరవై రెండు డెబ్బై రెండులో మధ్యలో ఉన్నటువంటి పుట్టపర్తి సాక్షాత్కరించింది. ఇంకా మీరు స్వామిని దర్శనం చేయలే, దర్శనం చేసినప్పుడు మీకు కలిగినటువంటి దివ్యమైనటువంటి అనుభవం అనండి, అసలు రకమైన అనుభవం లేని స్థితిగానివ్వండి అవి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సాయిరాం
SSSMC · audio

Interview with Prof. Kamaraju Anil Kumar - 01

Home

Interview with Prof. Kamaraju Anil Kumar - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 27:43

More in this series

Interview with Prof. Kamaraju Anil Kumar

5 episodes · 2 hr 16 min

  1. 27 min 1

    Interview with Prof. Kamaraju Anil Kumar - 01

    Now playing
  2. 28 min 2

    Interview with Prof. Kamaraju Anil Kumar - 02

  3. 27 min 3

    Interview with Prof. Kamaraju Anil Kumar - 03

  4. 26 min 4

    Interview with Prof. Kamaraju Anil Kumar - 04

  5. 25 min 5

    Interview with Prof. Kamaraju Anil Kumar - 05