No transcript for this section.
సాయిరాం అనిల్ కుమార్ గారు సాయిరాం సర్ సాయి వాణి ఆ కార్యక్రమంలో మరొక అంశం మీరు సత్యసాయి భగవానుడికి ఆ దివ్యవాణి కి ఒక అనువాదకుడు గా నిజానికి చిన్న మాట దానికి ఇంకేదన్న ఒక మంచి ఉదాత్తమైన మాట ఉందా ఆలోచిస్తున్నాను చూద్దాం కానీ ప్రస్తుతం అలాగే అంటున్నారు గనుక స్వామి వాణిని అచ్చమైన అందమైన మధురమైనటువంటి తెలుగుని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ అర్థం అయ్యేటువంటి సరళ సుందరమైనటువంటి ఆంగ్ల భాషలోకి అనువదించి ప్రధాన ఆ ప్రముఖ అనువాదకులుగా మీరున్నారు అసలు అనువాదకులుగా ఉండాలని కానీ ఉండమని కానీ స్వామి ఎప్పుడో నిర్ణయించేశారు గుంటూరులో అమరేంద్ర గారి ఇంటికి భజనకి వెళ్ళేవాడిని అక్కడ ఒక పోస్ట్ కార్డు సైజులో స్వామి ప్రక్కన నిల్చుని ఆయన ఇచ్చే ప్రసంగం ఒక ఫోటో చూశాను ఊ ఈ జన్మలో నాకు ఒక ఫోటో వస్తుందా? ఊ ఈ జన్మలో వారి పక్కన నిలబడి మాట్లాడే అవకాశం వస్తుందా? ఊ అని ఒక్కటే కాస్త లీలా మాత్రంగా అనిపించింది ఊ అంతే ఊ 1988లో ఊ నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండగా ఊ మందిరంలో వరల్డ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఊ ఆ రోజుల్లో వరల్డ్ కౌన్సిల్ ఉండేది దానికి ఇందు లాల్ సర్ చైర్మన్ సర్ శ్రీనివాసన్ వైస్ చైర్మన్ ఆ మందిరంలో వరల్డ్ కౌన్సిల్ మీటింగ్ కి స్టేట్ ప్రెసిడెంట్ గా నేను కూడా వెళ్ళాను మందిరంలో స్వామి కూర్చున్నారు అటు ఇటు చూసి అన్నారు "ట్రాన్స్లేటర్ ఎవరు లేరే" అన్నారు "ఇప్పుడు ఎవరు లేరు" నన్ను పిలిచారు "చేస్తావా" అని అన్నారు ఊ మీదే స్వామి నేను చేశా ఊ స్వామి మాట్లాడినది ట్రాన్స్లేషన్ ఎయిటీ ఎయిట్ ప్రారంభమైంది ఎయిటీ ఎయిట్ అది అయిపోంగానే అన్నారు ఊ చివరికి వారి రిమార్క్స్ చెప్తున్నాను ఊ ఒకటే స్పీడ్ బంగారం ఊ చాలా స్పీడు ఊ అంతా ఎమోషన్ గా ఉంటూ ఉండాలి ఊ అట్లానా స్వామి ఊ మీరే నడిపించుకోవాలి అన్నారు ఊ ఈ సందర్భంలో ఊ మీరు ఏమనుకోకపోతే ఒక నగ్న సత్యాన్ని చెప్తున్నాను చెప్పండి ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ గుంటూరులో వీధి బడిలో చదువుకున్నాను ఊ తెలుగు మీడియం గుంటూరులో మాజేటి గరవయ్య హైస్కూల్లో చదువుకున్నాను ఊ తెలుగు మీడియం ఊ ఇంగ్లీష్ మీడియం ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ తోటే ప్రారంభమైంది ఊ 1957 అప్పటిదాకా అంతా తెలుగు మీడియమే ఊ అది గుంటూరు మామూలు టౌన్ మాత్రమే ఆ ఇదే హైదరాబాద్ బొంబాయి ఢిల్లీ అలా ధారాళంగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ పబ్లిక్ స్కూల్స్ ఆ వాతావరణం కాదు నాకు పరమ తెలుగు మీడియం వాడిని అలాంటి వాడిని యావత్ ప్రపంచం కూడా వినే రీతిలో ఇంగ్లీష్ లో తర్జుమా చేయించగలిగాడు అంటే అది సత్య సాయినాధుని యొక్క మహిమ తప్ప అనిల్ కుమార్ యొక్క శక్తి సామర్థ్యములు కానే కావు అని ముమ్మాటికీ మీకు చెప్పగలను చాలా సార్ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తానని కలలో కూడా కలలేదు ఊ కోరుకోలేదు ఊ నేను నా మై బ్యాక్గ్రౌండ్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ అది ఎలా చెప్పను ఏంటి అనుకుంటాను ఊ అలాగే చెప్పిస్తుంటారు ఇరవై రెండు సంవత్సరాలు ఊ వారి ట్రాన్స్లేషన్ చేశాను బహుశా నాటి బూర్గుల రామకృష్ణ రావు గారు తర్వాత కస్తూరి గారు ఆ తర్వాత భగవంతం గారు ఆ తర్వాత వచ్చినటువంటి నంజుండయ్య గారు నంజుండయ్య గారు లక్ష్మీమూర్తి గారు వీళ్ళందరినీ చూసుకుంటే ఊ ఇరవై రెండు సంవత్సరాలు ది లాంగెస్ట్ పీరియడ్ నా చేత ఒక పర్సన్ ఫ్రమ్ ఏ ముఫసిల్ టౌన్ విత్ ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ చేయించాడంటే సాయి యొక్క శక్తి పూజగ పుల్లను కూడా అలా నిలబెట్టగలదు అని తెలియజేస్తుందే తప్ప దానికి అర్హత ఉందని గానీ నేను చేశానని గానీ అనుకోను ఊ ప్రతి సందర్భం ఎప్పటికప్పుడు కొత్తే అనుకుంటా నేను ఇన్ని సంవత్సరాలు చెప్పానులే అనుకోను ఎప్పుడు ఇది కొత్త నువ్వే చెప్పించాలి అనుకుంటా నిజానికి ప్రతిసారి అను-- అనువదించవలసిన సమయం వచ్చినప్పుడల్లా అనుకుంటూనే ఉన్నారని అన్నారు ఓ రోజు అదే తర్వాత ఈ అనుభవంతో మీరు విదేశ పర్యటనలో ఆయా దేశాల్లో అనేక దేశాల్లో మేధావులందరినీ కలిశారు భక్తుల్ని కలిశారు మీరు స్వామి గురించి ఉపన్యసించిన తర్వాత ఇంటరాక్టివ్ సెషన్స్ ముఖాముఖి ప్రాసంగికంగా అయినప్పుడు ఆ భక్తులు లేదా మేధావులు స్వామిని గురించి ఎటువంటి అభిప్రాయాలు వెల్లడించేవారు? మేధావులందరూ ఆ స్వామి ముందు మేత ఆవులే ఏం లాభం లేదు ఊ ఆ విదేశాల్లో స్వామి నేను బెంగళూరులో ఉండగా జపాన్ థాయిలాండ్ హాంకాంగ్ స్వామి స్వయంగా పంపించారు అది ఆ వేడుక ఆ కళ ఆనందం ముద్దు ఆ ముచ్చట తర్వాత తెలుసుకున్నాం ఊ చాలా గొప్పగా ఉంటుంది ఊ చాలా రమణీయంగా ఉంటుంది ఆ వారు పంపిన పద్ధతి అది వేరే సంగతి ఆ తర్వాత కాలంలో ఈ మలేషియా ఇండోనేషియా సింగపూర్ ఇవన్నీ వెళ్ళాను కెనడా యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నీ చూటుంది చైనా తైవాన్ ఇవన్నీ వెళ్ళాను నేను వెళ్ళానేమిటి పంపారు పంపారు ఊ స్వామి సంకల్పించారు అవును మన మెడల్లో చూడు కొత్త చెరుకు కూడా పో- ఊ పీల్చే దిక్కు ఉండదు ఉండదు నాకు బాగా తెలుసు ఊ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటే రూపాయి నోటు జేబులో ఉంటుంది లేకపోతే పెంట పోగులో ఉంటుంది అంతే కదా అంతే I am fully aware of this fact that but for him I am nowhere and no oneఅది నాకు బాగా తెలుసు ఉమ్ అందువల్ల ఇన్ని విదేశాలకు వెళ్ళానంటే వారి యొక్క సంకల్పం వారు పంపడం అన్న ఉద్దేశ్యం. ఉమ్ గుంటూరులో సైకిల్ లో తిరిగేవాడిని ఉమ్ విమానాల్లోనే తిప్పాడు ఆయన ఉమ్ స్కూటర్ కూడా లేదు నాకు. ఓ కారు, విమానాలు, రాజాధిరాజులు పట్టుకుంటే ఉమ్ పట్టుకుంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలి ఉమ్ తప్ప ఉమ్ మనిషి కాళ్ళు పట్టకూడదు అనేది నా జీవిత అనుభవం. బాగుంది, నిజం. నీకు ఇష్టం లేకపోతే కర్మ అనుభవించు అంతే. ఉమ్ వాడికి వీడికి స్తోత్రం పట్టటం ఉమ్ వాడికి వీడికి జిందాబాద్ లు అంటాం ఉమ్ మన కర్మ గాల. ఉమ్ పడితే ఉమ్ జగన్నాథుడు ఉమ్ సాయినాథుడు కాళ్ళు పట్టాలి తప్ప సాటి ఇంకో దరిద్రుడి కాళ్ళు పట్టడం నాకిష్టం లేదు. ఉమ్ నేటి వరకు నేను ఎవరిని యాచించింది గాని, కోరింది గాని ఏదీ లేదు. మిగిలిన కొద్ది జీవితంలో కూడా ఉండదు అని గంటా పదంగా చెప్పగలను. విదేశాల్లో ఉమ్ అనుభవం సూక్ష్మంగా చెప్పమన్నారు చెప్తున్నా. ఉమ్ చెప్తాను మెక్సికో, మెక్సికోలో Spanish మాట్లాడతారు. Argentina Spanish మాట్లాడతారు. Brazil Portuguese మాట్లాడతారు. ఏ language అయినా మాట్లాడనివ్వండి మనం అక్కడికి వెళ్ళగానే వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడుగా భావిస్తారు. ఉమ్ You are not new to anybody ఎవరికీ కొత్త కాదు మీరు. మనకి వాళ్ళని చూడగానే కొన్ని తరాల నుంచి వీళ్ళు మనకు తెలుసు అనిపిస్తుంది. ఉమ్ వాళ్ళకి వాడు మా ఇంట్లో వాడే కదా అనిపిస్తుంది. ఉమ్ వస్తూ ఉంటే అండి ఒక్కొక్క airport నుంచి వస్తూ ఉంటే, అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు అంపకాల ఏడుపులు ఎట్లుంటాయో ఉమ్ అవే ఏడుపులు ఉమ్ ప్రతి చోట ఉమ్ Tokyo అంటే Kobe అంటే Hong Kong అంటే Buenos Aires Argentina అంటే Sao Paulo Brazil అంటే Mexico City అంటే అందరు రావటం ఏడవడం. చూసే వాళ్ళు ఏమైందిరా అనుకుంటారు. వాడు ఏడవా? నేను ఏడవా? ఏమిటో నాకిదంతా అర్థం కాదు. ఉమ్ నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావ్? మళ్ళీ ఎప్పుడొస్తావ్? అంటారు. నేను నిన్ను ఎప్పుడు చూస్తాను? ఎప్పుడు చూస్తాను? అని అంటా. ఏమిటో రక్త సంబంధం కంటే ఉమ్ సాయి బంధం ఆ ప్రేమ బంధం ఉందే అంత తీవ్రమైనది, అంత గట్టిది నేను ఎక్కడా అనుభవించలేదు, ఎక్కడా లేదు అని కూడా చెప్పగలను. విద్యారంగ నేపథ్యంలో ప్రారంభమైనటువంటి మీ ప్రయాణం ఒక lecturer గా బృందావన్ campus principal గా తర్వాత మీరు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగారు. సత్యసాయి విద్యావిధానం ప్రపంచం మీద చూపిన ప్రభావాన్ని శ్రోతలకి కాస్త జాగ్రత్తగా, నెమ్మదిగా వివరించండి. ఇది చాలా-చాలా పెద్ద subject. అవును, అందుకే కానీ మీరు అడిగారు గనుక ఆ, ఉమ్ సంక్షిప్తంగా చెప్తాను అవును అందులో ఇది వేరే రకమైనటువంటి తరహా ప్రశ్న అవును ఇప్పటిదాకా వ్యక్తిపరమైనది అవును గుండెలు కదిలించింది అవును ఇప్పుడు తల దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ తలతో head తో ఆలోచించవలసిన intellectual question. అయినా చెప్తున్నాను సత్యసాయి విద్యార్థులు కొత్తగా కనిపించారు నాకు ఉమ్ ఎందువల్ల? మా college లో gold medalist కి ఉమ్ sports రాడు వాడు ఉమ్ music రాడు dances వాడికి ఏం ఉండవు NCC అలాంటివి ఉండవు. వాడు పుస్తకాల పురుగు అంతే ఉమ్ book worm ఉమ్ gold medalist వాడు ఉమ్ నాటకాల వాడు, ఎప్పుడూ September కి పరీక్షలు എഴുతునే ఉంటాడు ఉమ్ పరీక్షలో pass అవడం లేదో వాడు sports రాడనే వాడు sports లో ఉన్నవాడు మన college నుంచి వాడు వెళితే గొప్ప ఉమ్ వాడు పూర్తి చేయుడు, పోడు. అలా ఉంటాడు ఉమ్ ఇలాంటి పరిస్థితిలో ఈ పుట్టపర్తి బృందావన్ ఈ పిల్లలు, "అరేయ్ ఎన్నిరా నీకు marks లు?" "తొంబై" ఉమ్ "వాడు ఏం చేస్తున్నావ్ రా అక్కడ?" ఉమ్ "వీణ వాయిస్తున్నా" ఉమ్ "మరి ఇందాక drama లో నువ్వేరా?" "ఆ నేనే" ఉమ్ drama లో వాడున్నాడు ఉమ్ పాటల్లో వీణ వాయించాడు. class లో తొంబై marks వస్తాయి. ఆ sports లో ఒక నలభై అడుగులు పైకి వెళ్తాడు వాడు ఉమ్ కిందకి దిగుతాడు ఉమ్ అంటే head body and heart Heart ఈ మూడు మూడు, సమన్వయం ఆ ఉమ్ head hand heart Heart ఈ head ద్వారా మేధస్సు hand ద్వారా శారీరక వ్యాయామం heart ద్వారా విలువలు ఉమ్ total personality ఉమ్ సంపూర్ణ వ్యక్తిత్వ సమగ్ర వికాసమునకు అవును అందించేటుండే సత్యసాయి విద్యావిధానం అనిపిస్తుంది. ఇది ప్రపంచం మొత్తం మీద ఒక uniform influence ఉందంటారా? అని నేను అనలేను అనలేరు ఉమ్ ఎందుకంటే ఆ వాతావరణం వేరు అంటే స్వామీజీ సనాతనమైనటువంటి ఒక ethos Indian ethos base చేసి చెప్పారు. అది మరి ప్రపంచ వర్గాల మీద, ఆయా జాతుల మీద ప్రభావం కొద్దిగా చెప్పండి, అది అవసరం. అంటే కొద్దిగా-కొద్దిగా చెప్పాలంటే చెప్పాలి, అవసరం. ఆ ఉమ్ ఈ విద్యావిధానంలో ఉమ్ ప్రధాన సూత్రములు, మౌలికమైన సూత్రములు ఉమ్ మానవతా విలువలను జోడించి ఉమ్ విదేశాలలో ఉమ్ దాన్ని SSC అని పిలుస్తారు ఉమ్ Sri Sathya Education. ఆ SSC program లో ఉమ్ human values పిల్లలకి చెప్తారు ఉమ్ ఉమ్ మీరు అడిగారని చెప్తున్నా ఉమ్ చాలా చక్కని question వేశారు ఉమ్ ఉమ్ ఆ బాలల class పిల్లలు కానివ్వండి ఉమ్ pre సేవాదళ్ పిల్లలు కానివ్వండి ఉమ్ వాళ్ళు ఇచ్చే presentation చూస్తే ఉమ్ ఆశ్చర్యచకితులవుతారు. ఉమ్ మనం బాలల class pre సేవాదళ్ ప్రదర్శనలు అంటే ఉమ్ ఒక ధ్రువుడి వేషం వేయటం ఉమ్ ఒక శబరి వేషం వేయటం ఉమ్ భోళా బొమ్మని వేదికపై నేడవటం ఉమ్ జనాన్ని ఏడిపించడం ఉమ్ ఇవే మన సంస్కృతిగా ప్రదర్శనలు ఉమ్ వాళ్ళవలా ఉండవు ఆ latest problems ఉమ్ green revolution ఉమ్ global population ఉమ్ global warming warming ఉమ్ biodiversity ఉమ్ ఇలాంటి latest problems ఆ pre సేవాదళ్ వాళ్ళు ఉమ్ power point projection చేసి చెప్తుంటే ఉమ్ సత్యసాయి విధానానికి ఉమ్అది ఆధునికమైనటువంటిది సనాతన ధర్మం ప్రాతిపదికగా అత్యాధునికమైనటువంటి నవ సమాజ సమస్యలకు యొక్క పరిష్కారాన్ని అందించేటువంటి ఒక నూతన ప్రక్రియ ఒక నూతన విద్యా విధానం అనేది మీకు అనిపిస్తుంది ఆశ్చర్యపోతారు మన పిల్లలకంటే వీళ్ళు ఇంత స్థాయిలో ఉన్నారు ఏమిటని మన వాళ్ళు కూడా బాల వికాస్ ని అట్లా ఒకసారి restructure చేయవలసిన అవసరం ఉన్నది అది గుర్తించాలి గుర్తించాలి చేయాలి దాని అవసరం ఏది సనాతనమో సనూతనం కాకపోతే అర్థమైపోతుంది దానికి బాగా ఉదాహరణ అండి బాబాయే ఉదాహరణ మూడు వందల computerలు ఉన్నాయి universityలో University అవును చాలా సంతోషం మూడు వందల computerలు ఉన్నాయి ఆయనేమో laser sciences పైన స్వామి మాట్లాడతాడు electro magnetic waves పైన స్వామి మాట్లాడతాడు నేను ఇంకా శబరి ద్రువుడు అంటే అది చాలా silly అవును అంటే వద్దంటాను కదా నేను అది ఉంటూ Interpret Interpret బరాన్నారే గోకాక్ మహా పండితుడు అన్నాడు బాబా is all modern all that is ancient in modernity is సత్యసాయి బాబా నిత్య సత్య సనాతనాన్ని అధునాతనంగా జోడించడం సత్యసాయి బాబా కే సాధ్యం అన్నాడు అన్నాడు ఈ గోకాక్ ఈ నేపథ్యంలో ఆధునిక ప్రపంచం మన చుట్టూ ఉన్న సమాజం స్వామిని physical metaphysical and spiritual మూడు levels ఉన్నాయి physical levelలో ఆయన మహాపురుషుడు metaphysical levelలో జ్ఞాన స్వరూపుడు spiritual levelలో పరమాత్మ ఇది అనుభవించినవాడు అనుభవిస్తూ ఉంటాడు ఈ మూడు స్థాయిలు ఇంకా అనుభవానికి రాని యువత ఉన్నది దాన్ని స్వామిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ మూడు స్థాయిల్లో కాస్త నిర్మొహమాటంగా చెప్పాలంటే మనం స్వామిని exampleగా తీసుకోవాలి college పిల్లలతో మాట్లాడేటప్పుడు బ్రహ్మతత్వము అద్వైత తత్వము మాయ వాటి గురించి మాట్లాడరు ఆయన యువకులు ఎలా ఉండాలి యువతులు ఎలా ఉండాలి సంఘంలో ఎంత ఆదర్శంగా ఉండాలి ఎట్టి దేశాభిమానాన్ని పెంచుకోవాలి ఎట్టి ప్రజ్ఞాపాటవం కలగాలి ఏ రీతిగా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలగాలి అవే చెప్తారు తప్ప ఆత్మ పరమాత్మ మాయ అద్వైతం బ్రహ్మాండం అవి చెప్పరు ఆయన primary school వాళ్ళకి చెబుతున్నారంటే ice cream అంటే ఏమిట్రా ice cream exampleగా చెప్తారు ఈ tap water ఎలా ఉంటుందని చెప్తారు ఏ level కి ఆ levelలో ఆయన చెబుతూ ఉంటారు అవును మనం కలిపి కొట్టరా కావేరి రంగాన్ని primary schoolకి కూడా మాయే college పిల్లాడికి కూడా పరమాత్మయే పరమాత్మయే దాంట్లో చుట్టుపక్కల ఎవరు కనపడరు అవును ఏ వయసుకు తగ్గట్టుగా ఆయన చెప్పడం బాబా గారిని దృష్టాంతంగా చెప్పాలి ఎందుకంటే ఒక ఉదాహరణ సత్యం గోకాక్ గారితో ఆయన మాట్లాడే తీరు వేరు విధానం కామాదహన్ గారితో మాట్లాడే తీరు వేరు విజ్ఞానభవన్ లో బాబా atomic research centre Bombayలో Bombay ఆ మాట్లాడే తీరు వేరు Delhiలో parliament సభ్యులతో మాట్లాడే తీరు వేరు university పిల్లలు వేరు ఆడపిల్లలతో మాట్లాడే తీరు వేరు నా తీరే ఇదేనే యమునా తీరేంటి నాకది తెలీదు సేవాదళ్ తో మాట్లాడే విధానం వేరు అది మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది చాలా దాని ప్రకారం మనం ఇంకా దాన్ని ఒక రకమైన పరిణామం గాని ఒక రూప క్రియను రూపొందించుకోకపోవడం వల్ల కానీ ఇంకా అంత విస్తృత ప్రచారం కావటం లేదు అది జరగాలి అనేటువంటిది ఇవాళ అత్యవసరం అది అవును ఎందుకంటే స్వామిని దేవుడిని చేసేసి పట్టణంలో పెట్టినందువల్ల ప్రపంచానికి ఉపయోగం లేదని భావిస్తూ ఇక్కడ చూడండి ఆ ఈ మాట కట్టేస్తున్నా క్షమించండి చెప్పండి అమ్మా నాన్న భయం వల్ల వాళ్ళు ఇంకా అక్కడే కూర్చుంటున్నారే గాని ఆ సందు వస్తే బయటికి వెళ్ళిపోతాడు పెద్దవాడు చూసారా ఎందుకంటే మనం ఆధునికతను జోడించలేదు జోడించలేదు The relevance of spirituality in the modern society as applied to daily situation and problems ఆధునిక సమాజంలో daily సన్నిత పరిస్థితులకు దాని సమస్యలకు పరిష్కారాలకు ఉండేటట్లుగా మనం రూపొందించాలి అవును పిల్లలకి sense of reasoningను ability to question develop చేయాలి అది లేదుగా ఆ రెండూ ఉండాలి అందుకే వాడు ఆ పెద్దవాళ్ళ భయంతో కూర్చుంటాడు మళ్ళీ అనిల్ కుమార్ గారు మీ నుంచి శ్రోతలు ఎదురు చూస్తున్నటువంటి మూడు ప్రశ్నలు ఆ మూడు ప్రశ్నలు ఒకే ప్రశ్న స్వామితో మీకు ఉన్నటువంటి అనుభవాలు ఎవరికీ లేవు అని స్పష్టంగా అందరికీ తెలుసు ఇందులో మీకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అనుభవం ఏమిటి చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒకటి అద్భుతం అనిపించింది ఏమిటి అర్థం కానిది ఏమిటి చాలా ఆనందం అనిపించింది స్వామి తో చేసే ప్రయాణాలు ఉమ్ అందులో మొట్టమొదటి ప్రయాణం గమనీయమైనది గమనీయమైనది తుది శ్వాస వరకు గుర్తుంచుకోవాల్సింది ఉమ్ ఊటీకి వెళ్ళాం ఉమ్ నేను జోగా రావు గారు ఉమ్ Roommates ని అక్కడ ఉమ్ పెద్ద హాలు ఉన్నది రెండు మంచాలు పరుపులు అన్నీ ఉన్నాయి అనిల్ కుమార్ నువ్వు ఇక్కడ ఉండాలి అన్నారు ఉమ్ సరే స్వామి అన్నాను స్వామి చెప్తారు అదే ఎవరెవరు ఏ roomలో ఉండాలి ఎవరిది ఏ bed అన్నీ చెప్తారు ఆయన ఇది నీది సరే స్వామి కాసేపాక మళ్ళీ వచ్చారు పాపం గుంటూరు వాడివోయ్ ఉమ్ ఈ ఊటీ చలిగా ఉంటుంది ఆ ఉమ్ చూడు ఆ ఈ bed sheet సరిపోతుందా ఉమ్ ఓ blanket బాగుందా ఉమ్ సరే స్వామి మళ్ళీ కాసేపు అయ్యాక వచ్చారు లేదు చలిగానే ఉంది నీకు పాపం heater పెడతానులే ఉమ్ అని heater పెట్టించారు మళ్ళీ పది నిమిషాలకు వచ్చారు వచ్చిపడుకో బంగారం అన్నాడు. ఉమ్మ్ పడుకోమన్న బ్లాంకెట్లు కప్పి ఉమ్మ్ నా personal blanket తెచ్చానయ్యా నేను కప్పుకునేది ఉమ్మ్ feathers తో చేసింది ఉమ్మ్ గుంటూరు వాడికి చలి భరించలేమని తెచ్చాను ఉమ్మ్ అది cream color అండి ఉమ్మ్ మధ్యలో ఉమ్మ్ ఆ జింకలు, అరణ్యం brown dark brown color లో చిత్రీకరించబడింది. అది కప్పాడు స్వామి స్వయంగా ఉమ్మ్ కప్పి "ఓ boy! బాగుందా నీకు?" అన్నారు ఉమ్మ్ స్వామి చాలా బాగుందని ఉమ్మ్ "nice good night" good night అని స్వామి వెళ్ళిపోయారు. ఇది మరిచిపోలేను ఆ అద్భుతం అనిపించింది ఇంతకంటే పరమాత్మ అంటే అద్భుతం పరమాత్మ అంటే మానవాతీతమైన ఒక శక్తి అటువంటిది ఒక అనుభవం ఒకే ఒక అనుభవం ఒకటే చెప్తాను అంటే ఎనభై తొమ్మిది ఉమ్మ్ కోడైకెనాల్లో ఉమ్మ్ స్వామి అన్నారు "అనిల్ కుమార్ రేపు బలరామ కళ్యాణం జరుపుదాం ఇక్కడ" ఉమ్మ్ "చాలా మంది పిల్లలు, భక్తులు కూడా వచ్చి ఉన్నారు" ఉమ్మ్ "అందరికీ భోజనాలు ఇక్కడే" అన్నారు ఉమ్మ్ బలరామ కళ్యాణం కృష్ణుడైన బాబా చేయడమేమిటి? ఉమ్మ్ వాళ్ళందరూ భోజనాలకు రావడం ఏమిటి? ఉమ్మ్ నాకు అర్థం కాలే ఉమ్మ్ అయినా నాకెందుకని మనోమే భూషణము మూఢ మానవులకు అన్నట్టు ఉమ్మ్ కప్చుగున్ నోరు మూసుకున్నాను ఉమ్మ్ స్వామి తల్లారి వచ్చి ఉమ్మ్ భోజనాలు ఏర్పాట్లు చేశారు ఉమ్మ్ బ్రహ్మాండంగా జరిగాయి ఉమ్మ్ రేవతి బలరామ కళ్యాణం ఉమ్మ్ ఇంకా సాయంకాలం ఉపన్యాసం నేను పక్కనే ఉన్నా ఉమ్మ్ ఈనాడు ఉమ్మ్ బలరామ కళ్యాణం గురించి వివరించవలచు ఉన్నది ఉమ్మ్ అట్టి కళ్యాణ మహోత్సవమునకు ఉమ్మ్ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య సన్నిధానంలో జరిగినది ఉమ్మ్ ఆ కళ్యాణమునకు బ్రహ్మాది దేవతలు విచ్చేసి ఉన్నారు ఉమ్మ్ గణపతి కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు ఉమ్మ్ ఆ కళ్యాణం ఎంతో ఆనందంగా జరుగుతూ వచ్చింది ఉమ్మ్ అట్టే సందర్భంలో కృష్ణ పరమాత్మ నూతన వధూవరులను ఆశీర్వదించాడు సమస్తమైన దేవతలు కూడా వచ్చి నూతన దంపతులకు బహుకరణ చేస్తున్నటువంటి సన్నివేశము ఉమ్మ్ ఆ సందర్భమున బ్రహ్మ వచ్చాడు ఉమ్మ్ వచ్చి బలరాముడిని పిలిచాడు. పిలిచి తన యొక్క సృష్టించినటువంటిది ఇచ్చాడు ఉమ్మ్ బలరాముడికి ఉమ్మ్ మీరు చూడండి అని స్వామి ఉమ్మ్ మూడు దిప్పులు దిప్పారు చెయ్యి దిప్పారు దాంతో ఒక జగ్గు size లో జగ్గు size లో రెండు ప్రక్కన స్థూపాల్లాగా ఉమ్మ్ పైన ఒక ఆర్చి కింద బంగారం తీగలతో ఏర్పడింది. అడుగున పీఠం బంగారు పీఠం. ఈ ఆర్చిగా ఉన్నటువంటి బంగారుతో ఏర్పడినటువంటి ఈ తీగల మధ్య వజ్రాలు diamonds ఉమ్మ్ నాలుగు నాలుగు నాలుగు వరుసగా అమరపబడినాయి ఉమ్మ్ ఈజీగా రెండొందలన్నవుతాయి ఉమ్మ్ ఈ ఆర్చికి వ్రేలాడుతూ బంగారం గొలుసుతో ఒక హంస వ్రేలాడుతోంది అటూ ఇటూ ఊగుతోంది ఉమ్మ్ అది సృష్టించాడు భగవంతుడు. బాబ్ రే బాబ్! ఉంగరాలు చూశాం ఉమ్మ్ వాచీలు చూశాం గొలుసులు చూశాం ఏమిటి జగ్గు, diamonds, హంస at a time అబ్బా అనుకున్నాం. సరే అందరం చూశారు. "రావయ్యా! వైజయంతిమాల నగుడాల" ఉమ్మ్ నన్నెప్పుడూ స్వామి వైజయంతిమాల ఉమ్మ్ ద్రౌపది, పతివ్రత ఈ ఆడపిల్లల పేర్లతో పిలిచేవారు ఉమ్మ్ బహుశా గత జన్మలో ఏమన్నా స్త్రీనేమో తెలీదు ఒక అవతారంలో అలా ఉండి ఉండొచ్చు అలా ముందు జన్మలో ఏమో తెలీదు నాకు వర్తమానం కాదు అని చెప్పగలను ఉమ్మ్ అన్న-అన్నారు [నవ్వు] అది చూడవయ్యా అన్నారు ఉమ్మ్ చుద్దాం అని వచ్చాను ఉమ్మ్ ఆ హంస అటూ ఇటూ వేలాడుతోంది ఉమ్మ్ "చాలా బాగుంది స్వామి" అన్నా ఉమ్మ్ "ఏ పిచ్చికుర్రా" అన్నారు ఉమ్మ్ "ఏం చూశావు నువ్వు?" ఉమ్మ్ "ఆ హంస చూడు" ఉమ్మ్ చూశాను స్వామి. "దాని ముక్కు చూడు" ఉమ్మ్ "దాని నోరు చూడు ఎంత బాగుందో చూశావా?" అబ్బా! చాలా బాగుంది స్వామి ఉమ్మ్ "ఏమీ! దాని పొట్ట చూడు" అన్నారు ఉమ్మ్ ఆ పొట్టలో బాబా పవళించి ఉన్నారు అద్భుతం స్వామి అక్కడ పవళించి ఉన్నారు అద్భుతం "చూశావా?" ఉమ్మ్ అదే స్వామి చెప్పేది అదే ఉమ్మ్ "అందుకే చూడమంటున్నా" అన్నారు ఉమ్మ్ అచ్చం రెండు రోజులు అలాగే ఉంది అక్కడ ఉమ్మ్ మూడో రోజున లేదు అక్కడ ఆ స్వామి ఏమైందన్నా "బ్రహ్మదేవుడు బలరాముడికి ఇస్తే నువ్వు తీసుకోవచ్చా? తప్పు కదా?" ఉమ్మ్ "మీరు చూద్దాం అని తెప్పించాను వాడికి పంపించేశాను" చాలా అద్భుతం. ఇక మూడవది స్వామి అనేకమైనటువంటి అద్భుతాలలో మీకు అర్థం కానిది అంటే మీ మానవ మేధకు కూడా ఊహించనటువంటిది లేదా ఆ కళ్ళముందు జరిగినా ఏం అర్థం కాకుండా ఉండిపోయింది కూడా ఒకటి ఉండొచ్చు అది ఏదన్నా గుర్తుంటే కాస్త చెప్పండి. అర్థం కానిది ఏది అంటే ఆ సామాన్య మనిషిగా ప్రవర్తించడం అది ఉమ్మ్ ఒక ఆదర్శ మనిషిగా ప్రవర్తించడం ఉమ్మ్ స్వామి మనవంటి మనిషే అనుకున్నప్పుడు ఉమ్మ్ నేను దేవుణ్ణి ఉమ్మ్ అన్న shock మనకివ్వడం ఇవ్వడం ఈయన దేవుడేరా అని ఆ shock లో మనం ఉమ్మ్ తెప్పరిల్లే లోపల ఉమ్మ్ "కమాన్ boy! ఏమి?" ఉమ్మ్ "ice cream తిన్నావా? బాగుందా?" అంటాం. అరె ఇది నిజమా అది నిజమా? ఉమ్మ్ ఈయన దేవుడా? అంత సన్నిహితంగా ఉన్నది. లేదా మనిషా? అనేది మనకు అర్థం కాదు కాదు కనుక ఉమ్మ్ దేవుడు వంటి మనిషో మనిషి వంటి దేవుడో మనిషి లాంటి దేవుడో రెండూ కలిసిన ఒక మూర్తో అనేది అర్థం కానిది చాలా అద్భుతం అద్భుతం. అనిల్ కుమార్ గారు స్వామి ఆ ఈ అవతారంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి మొదలు పెట్టినట్లయితే నిన్న మొన్నటి మహా పరినిర్వాణం వరకు సుదీర్ఘమైన ఎనభై ఆరు సంవత్సరాల అవని యాత్రలో ఆయా కాలాలలో యువకులను ప్రధానంగా ఆకర్షించారు. ఇప్పుడు మీరు ముప్పై ఏళ్ల క్రితం యువకులే. అప్పుడు బానే ఉండేవాడిని ఆ అట్లాగే మీకంటే ముందు వచ్చిన వారంతా యువకులే అవును ఈ యువకులను స్వామి ఆకర్షించటానికి గల ఆ శక్తి అనంత శక్తి కేవలం ఆకర్షణ మహిమేనా? కేవలం స్వామిజీ దివ్య జీవన విధానమా? దాన్ని కాస్త వివరించండి. స్వామి యువకులను ఆకర్షించారు అంటే ఉమ్మ్ ఆ యువకుల యొక్క మనోస్థితిని సంపూర్ణంగా గమనించిన వాడు ఆయన ఉమ్మ్ మనం మన పిల్లల్ని కూడా అంత study చేయం. మనం అనుకున్నట్టు వాళ్ళు ఉండాలనుకుంటారే కానీ వాళ్ళు ఉన్నట్టుగా మనం గ్రహించం ఉమ్మ్ స్వామి ఆ యువకుల యొక్క మనోస్థితిని పూర్తిగా గమనించిన వాడు ఉమ్మ్ ఆ మనోస్థితికి కావలసిన విషయములు ఉమ్మ్ అందించిన వాడు ఉమ్మ్ తల్లిదండ్రులను మించి ప్రేమించిన వాడు ఉమ్మ్ జీవితానికి ఒక గమ్యాన్ని, ఆధారాన్ని నేర్పిన వాడు ఉమ్మ్ ఎంతో ఆనందంగా, తృప్తిగా సమస్యల తోరణం మధ్య ఉమ్మ్ గడిపే-గడిపే నైపుణ్యాన్ని అందించిన వాడు ఉమ్మ్ మానసిక శాంతి, ప్రశాంతి ఆ విధానాన్ని నేర్పిన వాడు దాంతో యువకులు ఆకర్షితులు ఆకర్షితులు చాలా సంతోషం అనిల్ కుమార్ గారు. ఆ ఈరోజు యువత స్వామి పట్ల ఆకర్షణకి లోను కావటానికి వారు ఆకర్షించడానికి గల కారణాలు మీరు పొందినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు చాలా పరమాద్భుతంగా ఆవిష్కరించారు. మీకు కృతజ్ఞతాంజలి. మళ్ళీ మరొక విషయాన్ని, అంశాన్ని మనం తీసుకుంటూ అనేక విషయాలు చర్చకి దారి తీసేట్టుగా మన చర్చ కొనసాగిద్దాం. సాయిరాం.
SSSMC · audio
Interview with Prof. Kamaraju Anil Kumar - 05
Interview with Prof. Kamaraju Anil Kumar - 05
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 25:40
More in this series