Skip to content
Transcript తెలుగు
[సంగీతం] భారతీయం. [సంగీతం] సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగమాలిక ఒక భావవీచిక. [సంగీతం] రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయమ్ కార్యక్రమానికి స్వాగతం. శీర్షికలో భాగంగా శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారు ఆదిశంకరాచార్యుల వారి మీద ఇస్తున్న ప్రసంగాల పరంపరను కొనసాగిస్తూ, ఈనాడు పరంపరలోని రెండవ భాగాన్ని విందాం. సాయిరాం. [సంగీతం] శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అఖండ భారతావరణి కాలినడకన పరమ పావనం చేస్తూ ధర్మస్థాపన, ధర్మప్రబోధ మానవజాతికి ఆచరణీయ జీవన ధర్మంగా సాగించి హైందవ ధర్మ ప్రచారకులుగా దిశానిర్దేశం చేసిన మహాపురుషులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. పాశ్చాత్య సంస్కృతి బయట ఉన్న వస్తువుల గురించిన ఆలోచనలకు లోబడిన పదార్థ విచారణ మాత్రమే. విచారణలో పునర్జన్మ విషయం లేదు. వ్యక్తి లోపల పరిణామశీలమైన సంస్కారాన్ని జాగృతం చేసి కర్మ, భక్తి యోగాలను ఆధారం చేసుకొని చివరకు జ్ఞాన మార్గం వైపు నడిపించి బ్రహ్మానంద అనుభవాన్ని కలిగించేది భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో పునర్జన్మ విషయం ఉన్నది. పరమమూ చరమమూ అయిన ఆనందధామం చేరుకునే వరకు జీవుడు జన్మ ఎత్తుతూ ప్రతి జన్మను పవిత్రీకరించుకుంటూ చివరకు తన లక్ష్యమైన మహా మోక్ష స్థాయిని అందుకుంటాడు. దీనిని భారతీయ సంస్కృతి ఒక పవిత్ర ధర్మ కార్యక్రమంగా జాతికి అన్నివేళలా మహాత్ముల ద్వారా బోధిస్తూనే ఉన్నది. ఆసేతు-సీతాచలము పర్యటించిన శంకర భగవత్పాదులు భావ సమైక్యత ప్రాతిపదికగా అనేక ప్రకరణ గ్రంథాలు రచించి భగవాన్ వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి ఉత్కృష్ట భావనా భాండాగారాన్ని ప్రపంచానికి అందించారు. సామాన్యుడికి సైతం అక్కరకు వచ్చే రీతిలో అనేక స్తోత్రాలు రచించి అతడి మనసు దైవభావనలో నిలకడ చెందే విధంగా అనుగ్రహించారు. పెద్దవాడికి పెద్ద ముద్దలు, పసివాడికి గోరుముద్దలు తినిపించి తల్లి విధంగా తన పిల్లలను పెంచుతుందో విధంగానే శ్రీ శంకరులు సాధకుడి స్థాయికి తగిన బోధను అందించిన ఆచార్యోత్తములు. హైందవ ధర్మం పరిపూర్ణ మానవతా ధర్మం. హైందవ ధర్మం సనాతన ధర్మం కంటే భిన్నం కాదు. సమతా జీవితాన్ని సంఘర్షణకు తావులేని విధంగా జీవించమని బోధించే పరమ పవిత్ర దివ్య జీవన విధానమే సనాతన ధర్మం. అతలాకుతలమవుతున్న ఆధునిక సమాజం తన చుట్టూ జరుగుతున్నటువంటి విపత్కర విపరీత పరిణామాలను గమనిస్తూ పొంచి ఉన్న ప్రమాదాన్ని పసికడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి ధర్మం. అపార మేధాశక్తితో మేధా దక్షిణామూర్తి అపరావతారమైన శ్రీ ఆదిశంకరుల సర్వజ్ఞతను ఆకళింపు చేసుకొని వర్తమాన ప్రపంచంలో మానవుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. విధంగా శంకర భగవత్పాదుల నేపథ్యం భారతీయ ఆత్మను తడుముతూ, తాకుతూ, స్పృశిస్తూ ఆనంద రేఖని సృష్టిస్తూ మానవుణ్ణి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఉత్తమ స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఉదాత్త స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఆపై యదార్థ స్థితికి తీసుకువెళ్ళే విధంగా ఆచార్య ప్రబోధం సాగింది. అందులో ఒక సందర్భం, సందర్భం ఏమిటి అంటే కనకధారాస్తవాన్ని గురించి మనం వింటూ ఉంటాం. ఏమిటి కనకధారాస్తవం? శుద్ధ పురుషులు తాము సాధించుకున్న లేదా సహజంగా పొందిన సిద్ధులను తమ కోసం ఎన్నడూ వాడుకోరు. మేఘం తన వద్దనే ఉన్న నీటితో దాహం తీర్చుకోదు. ఆవు తన పాలను తాను తాగదు. సిద్ధ పురుషులంతా తమ సంకల్పాలను, సిద్ధులను లోక కళ్యాణం కోసం లోక శోకాన్ని తొలగించటానికి మాత్రమే వినియోగిస్తారు. భగవత్పాదులు తమ బాల్యంలో భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక నిరుపేద గృహిణి ఆమె ఇంటి ముందు భిక్ష నర్ధించినప్పుడు, ఆమె తన అశక్తతను, పేదరికాన్ని వ్యక్తపరిచినప్పుడు, ఇంట ఉన్న ఎండిన ఉసిరిక కాయే తప్ప మరేదీ సమర్పించుకోవటానికి వస్తువే లేదని వెలపించినప్పుడు కరుణాలయమైన శంకర హృదయం ఆర్ద్రమైంది. మనసు సంకల్పించింది. అమృత వాక్ ప్రవాహం ఆశివుగా సర్వైశ్వర్యదాయిని అయిన శ్రీ మహాలక్ష్మిని స్తుతించింది, ప్రార్థించింది. శంకరులే అర్థిస్తే అమ్మ కదలదా?కరగదా కనికరించదా? అదే జరిగింది. కనకధార సాగింది. శంకర దేహం పూజించింది. శంకర మనసు స్తుతించింది. శంకర హృదయం పరవశించింది. బీద ఇల్లాలి ఇల్లు సర్వ సంపదాలయమైంది. ఆమె దీనత్వం లయించింది, దివ్యత్వం పల్లవించింది, ఆనందం వెల్లివిరిసింది. ఆనాటి శంకర హృదయ గీతిక ఈనాడు ఆరాధనా గీతిగ జనుల నాలుకపై నడయాడే దివ్య గానమైంది. శ్రీమహాలక్ష్మిని ఎట్లా ప్రార్థిస్తే, ఏమని అర్థిస్తే ఆమె అనుగ్రహిస్తుందో, పేదరికం నశించి పెద్దరికం లభిస్తుందో సూచించే కనకధారాస్తవం ఒక దివ్య కవితా మాలిక అయింది. ద్రద్యా దయాను పవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ కించన విహంగ శిశౌ విషణ్ణి దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంభువాహహా అంటారు శంకర భగవత్పాదులు. ఏమిటి? దీనర్థం ఏమి? కనకధారా స్తవం వెనక దాగినటువంటి కవితా హృదయం ఏమిటి? భాషా ప్రవాహం ఏమిటి? భావ ధార ఏమిటి? విచారణ చేద్దాం. శంకరులు అంటున్నారు అమ్మా! నీ కనుకొలుకుల మెరిసే మెరుపు శ్రీ మహావిష్ణువుకు మైమరపు. నీ చూపులు బారులు కట్టి హరివదనాన్ని మనోహరం చేస్తున్నాయి. నీ కడగంటి చూపు శ్రీహరికి ఆనంద కారణం. నీ అరమోట్టు కన్నుల కాంతి విష్ణువుకు పారవశ్యం కలిగిస్తున్నది. చూపే నాకు కలిమిని అనుగ్రహిస్తున్నది. నీ చూపులు పరమాత్మ కామననే తీర్చగలిగినప్పుడు నాకు మంగళాన్ని అనుగ్రహిస్తాయి. నీ రూపం నీలి మబ్బుల ఉతికిన ఇంద్రాణి వలె నాకు శుభ్ర కాంతిని వరదానం చేస్తున్నది. పాల సముద్రంలో పుట్టిన పరమ పావనివి నీవు. నీ ఉనికితో హరి హృదయం రస హృదయమైంది. నీ దయ నాపై ఎందుకుండదు? పాప, తాప, శాపమయమైన నా జీవితంపై తల్లి నీ దయతో సంపద అనే వర్షం కురియాలి. ముగురమ్మల మూలపుటమ్మవు నీవు. నీకు నమస్సులు. నీవు శృతివి, రతివి, తుష్టివి, పుష్టివి. నీకు వందనం. నీవు పద్మ ముఖివి. పాల సముద్రం నీ పుట్టిల్లు. చంద్ర సోదరివి. అమృతము నీతోబుట్టువే. అంతా తెలిపే తెలిపేదే కదమ్మా! అమ్మా! నీకు నమస్కారం. ముల్లోకాల కల్లోలాన్ని ఆపి ఆనందం పూయించే తల్లి నన్ను అనుగ్రహించు. లోక సుఖము, పరసుఖము ఎరుగని కడు బీదను నేను. నిన్నే నమ్మిన నేను నీ దయకు పూర్తిగా అర్హుడిని. నీ దయారసంతో నన్ను కాపాడు. వేదమే నీ రూపం. మూడు లోకాలకు తల్లివి నీవు. అగణిత గుణమణివి నీవు. నిన్ను ఆరాధిస్తే నా యందు సద్గుణాలు అధికమవుతాయి. పండితుల, విద్వాంసుల ప్రశంశలు నాకు పుష్కలంగా లభిస్తాయి. భగవత్పాదులు లోక శంకరులు. కన్నీరు తుడిచి ఆనందం అనుగ్రహించే దయా స్వరూపమది. కడుపు నిండాలి, మనసు పండాలి. అప్పుడే జీవుడి హృదయం పరమేశ్వరుని యందు లగ్నమవుతుంది. ప్రాపంచిక సంపదలన్నీ పరమేశ్వరి అనుగ్రహమే. సత్కార్యాలకు వినియోగిస్తేనే సంపద పెరుగుతుంది. గుణ సంపద, దయ, సేవ, ప్రేమ, కరుణ మానవుడు పొందవలసిన అసలు సంపద. పరుల ఆనందం కోసం చేసే ప్రార్థనే అసలు ప్రార్థన. అదే శుద్ధి, అదే సిద్ధి. ధనమే బలంగా మారిన ఆధునిక ప్రపంచానికి కనకధారా స్తవం ద్వారా ఆచార్య స్వామి సందేశం స్థూలంగా, సమగ్రంగా ఇదే ఇంతే. శంకర భగవత్పాదులు కనకధారా స్తవాన్ని ఒక స్థాయిలో ఒక బీద ఇల్లాలి పరంగా చెప్తూనే పరమ జ్ఞానైక మూర్తి అయినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అనేటువంటి దానికి అనుసరణీయంగా దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం తస్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ పది శ్లోకాలలో ఫలశ్రుతితో సహా గురు పాదములకు, గురు హృదయానికి వందనం చేస్తూ శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం నిండా ఒక పరమాద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఇంతకీ ఏమిటది? శ్రీరామచంద్రుడు ధర్మయోగి. శ్రీకృష్ణుడు కర్మయోగి. శ్రీ శంకర భగవత్పాదులు పూర్ణ జ్ఞానయోగి. జ్ఞానయోగంలో శంకరులు బోధించిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తత్వమసి స్థాయిలో వినబడే సమర్థ వ్యాఖ్యానం. ఫలితం ఆశించి చేసే కర్మలన్నీ ప్రవృత్తి. ఫలితంతో నిమిత్తం లేకుండా చేసే కర్మలన్నీ నివృత్తి. అంటే ప్రపంచాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే తప్ప సాధకుడు ఆత్మను అనుభవించలేడు. విషయాన్నే శంకరులు తమ దర్శనాన్ని పరమోన్నత స్థాయిలో ఆవిష్కరించారు. ఆత్మ ధర్మాన్ని పరమ సుందరంగా, అలవోకగా, సాధికారంగా వివరించారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ఒక శబ్ద చిత్రం. మౌనం అంటే ఇంద్రియ మౌనం. వ్యాఖ్య ముద్రా స్వరూపం. కనిపిస్తున్న వస్తు ప్రపంచం అంతా అద్దంలో బొమ్మ వంటిది అంటున్నారు శంకరులు. అంతేకాదు, కలలో అనుభవించే దృశ్యం వంటిది. బింబం వంటూ ఏదో ఒకటి ఉన్నది కనుకనే ప్రతిబింబం ఏర్పడుతున్నది. వెలిగించే వెలుగేదో ఉన్నది కనుక అదే ప్రపంచంగా కనబడుతున్నది అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో పరమాద్భుతమైనటువంటి వ్యాఖ్య చేస్తూ మన అంతరంగన్నీ స్పృశించే దిశగా వ్యాఖ్యాన రేఖని పుడిగిస్తున్నారు. విత్తనంలో దాగి ఉన్న మహావృక్షం వలె ఆత్మ యందే అన్నీ ఉన్నాయి.నిజానికి అన్నిటికీ మూలం అదే కాకపోతే విత్తనంగాను చెట్టుగాను రెండుగా కనిపిస్తున్నాయి విత్తనంలో శక్తే లేకపోతే మొక్క కాలేదు కదా. మనసుతో ప్రపంచాన్ని చూస్తే బంధన అదే మనసు ఆత్మను చూడగలిగితే జీవన్ముక్తి జ్ఞానాగ్నిలో కర్మలు దగ్ధం కావాలి అదే సాధన. చిల్లర కుండలోని దీపం బయటకు ప్రసరించి వస్తువులను వెలిగించిన ట్లుగా శరీరంలోపల ఉన్న ఇంద్రియాలు ప్రపంచంలో ఉన్న వస్తువులను ప్రకాశమానం చేస్తున్నాయి కనబడుతున్న శరీరాన్ని ఆత్మ ప్రకాశం అంటాడు దేహాత్మ వాది శరీరమే ఆత్మ అంటున్నాడు చార్వాకుడు ప్రాణమే ఆత్మ అంటున్నాడు ప్రాణాత్మ వాది కలలోనూ నిద్రలోనూ మెలకువలోనూ తమ పనులు కొనసాగిస్తున్న ఇంద్రియాలే ఆత్మ అంటున్నాడు ఇంద్రియాత్మ వాది బుద్ధి సహకరించకపోతే ఇంద్రియాలు ఏం చేస్తాయ్ అంటున్నాడు బుధ్యాత్మ వాది అజ్ఞానం కారణంగానే ఆత్మ అనుభవంలోకి రావటం లేదంటున్నాడు శూన్యావాది నిజానికి వీరంతా స్పృహ లేని వారే ఇవన్నీ వారి వారి వాదనలే వేది అంటే ఎరుక ఉన్న వాడికి ఆత్మే అంతా అదే అన్నీ వేరే మరొకటి లేదు. నిద్ర మెలకువ హాయి స్పురణ గుర్తెరగటం ఇవన్నీ ప్రదేశానికి కాలానికి అతీతం అందుకనే దేశకాల కారణ వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు ఎందుకంటే అనుభవం ఉన్నది గనుకనే జ్ఞాపకం ఏర్పడింది అది చాలా కాలం తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకుంటున్నప్పుడు కలిగే తీయని అనుభూతి వంటిది మన శరీరంలో ఏర్పడే అవస్థలన్నీ మనము మన నీడ వంటివి మనమంటూ లేకపోతే మన నీడలు ఎలా ఏర్పడతాయి మన ఉనికికి మూలమైన ఆత్మ అన్ని వేళలా అన్ని కాలాల విశ్వ కళ్యాణ కాంక్షье ఆత్మ నిత్య ముక్తం దానికి బంధనం లేదు అది సర్వవ్యాపకం శరీరం పరిణామ శీలం పుడుతుంది పెరుగుతుంది మారుతుంది ఉరుగుతుంది కంటికి కనిపిస్తున్నది గనుక ఇదంతా నిజమే అనిపిస్తుంది వేదాంతులు ఇదంతా మాయ వలన అంటున్నారు ఇంతకీ మాయ ఈశ్వర శక్తి కంటే వేరు కాదు. మాయ నుండి బయట పడాలి అంటే ధ్యానంలో ఉండాలి ధ్యానం అంటే నీలో నీవు నిశ్చలంగా ఉండటమే యోగం అంటే నీతో నీవు కూడి ఉండటమే మార్పు చెందే దేహం శవం మార్పు ఎరగని ఆత్మ శివం విచారణ అంతా అంతర్ముఖం వైపు నడిపిస్తుంది ఇదే స్థూలంగా శంకర భగవత్పాదుల దివ్య బోధ నిత్య ప్రార్థన శరీరం మనసు బుద్ధి చిత్తం అహంకారం వంటి విషయాలను హేతుబద్ధంగా స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం మన లోపలకు మన దృష్టి సారించగల ఉపాయాన్ని సూచిస్తుంది చేయవలసింది ప్రయత్నమే పొందబోయేదంతా నిర్మల ప్రశాంతే ఇది దక్షిణామూర్తి స్తోత్రం శంకర భగవత్పాదులు జ్ఞానైక మూర్తి పూర్ణ అద్వైత మూర్తి. సర్వ జీవుల యందు సమభావాన్ని నిర్దుష్టంగా ప్రదర్శించిన అటువంటి అద్వైత సాకార స్వరూపమే భగవత్పాదులు అయితే తాము సాక్షాత్తు జ్ఞాన స్వరూపం అయినప్పటికీ కూడా తమ జీవన విధానం ద్వారా జీవితంలో ఏర్పడిన సన్నివేశాల ద్వారా ఒక బోధ చేయవలసి ఉన్నది గనుక శంకర భగవత్పాదుల అవతార క్రమంలో ఒక విశిష్ట సన్నివేశం చోటు చేసుకున్నది. విశిష్ట సన్నివేశం ఇవాళ మనం మనీషా పంచకంగా చెప్పుకుంటాం. మనీషా అంటే conviction అంటాం. మనీషా అంటే నిశ్చితమైన బుద్ధి అది పంచకం ఐదు శ్లోకాలలో చెప్పారు గనుక దాన్ని మనీషా పంచకం అన్నారు. ఇంతకీ మనీషా పంచకంలో శంకర భగవత్పాదులు ఏం చెప్పారు? అసలు పంచకాన్ని ఎందుకు చదివారు? ఇది విచారణ చేద్దాం. అవతార మూర్తి సైతం మానవ దేహం ధరించి వచ్చినప్పుడు మూడు గుణాలతోనూ కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తంగా ఉంటాడు ఎంత సర్వజ్ఞుడు అయినా జగత్తుకు ఏదైనా మహా పరిసత్యం బోధించ తలచినప్పుడు సాధారణ మానవుడి వలే ప్రవర్తిస్తాడు. శ్రీరాముడు యోగవాశిష్టాన్ని శ్రద్ధగా విన్నట్లు శ్రీకృష్ణుడు విష్ణు సహస్ర నామాన్ని నిష్టగా విన్నట్టు శంకరులు పరబ్రహ్మ స్వరూపం అయి కూడా అద్వైత బోధను ఇలాగే అందుకున్నారు. సందర్భం రమణీయం మనోహరం హృదయంగమం. శిష్య సమేతంగా గంగా స్నానం అనంతరం కదులుతున్న ఆచార్య స్వామి కంటికి కటికుడు ఒకడు కనిపించాడు నాలుగు శునకాలతో. జాత్యభిమానం ప్రకటిస్తూ తొలుగు తొలుగు అన్నారు శంకరుడు. దేనిని తొలగమంటున్నారు? దేహాన్ని తొలగమనటమంటే మీది దేహమే నాది దేహమే రెండూ అన్నమయాలే రెండు పంచభూతాల వల్లనే ఏర్పడ్డాయి ఇక తేడా ఎక్కడ ఉన్నది? పోనీ జ్ఞాన దృష్టితో చూసినా ఆత్మ నీ యందు నా యందు సాక్షియే కదా! కనుక బ్రాహ్మణ చండాల అని దేనిని చూస్తున్నారు? సూర్యుడు గంగాజలం పైనా మురికి నీటి పైనా ఏకకాలంలో ప్రతిఫలించటం లేదా? ఆత్మ అంటే అద్వైత భావన కదా ఇక తొలగవలసినది ఏమున్నది అన్నాడు చండాలుడు. శంకర హృదయాన్ని ప్రశ్నలన్నీ జ్ఞాన కిరణాల వలె తాకినాయి. బ్రాహ్మణుడు చండాలుడు అన్న భావాన్ని పావనుడు పాపి అన్న భేదభావాన్ని ద్వంద్వాలను విడిచి సమత్వాన్ని సమభావాన్ని సమ దృష్టిని ఆచరిస్తాను మహోదాత్తమైన దివ్య బోధనందించిన మీరు ఈశ్వరుడే అన్యం కాదంటూనే అంతేకాదు సర్వ సృష్టిని ఆత్మ స్వరూపంగా చూడగలిగిన వాడు నిశ్చిత జ్ఞాని అయిన వాడు ఎవరైనా సరే అటువంటి వాడు నాకు గురు సమానుడు సర్వ కాలాల నాకు ఆరాధనీయుడే అన్నారు శంకరులు. అంతేకాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యందున్న చైతన్యమే సర్వజీవకోటి యందు ఉన్నది అన్ని కాలాలయందు భావంతో వెలుగుతున్న తత్వజ్ఞుడు నాకు పరమ గురువే.నాకు మాత్రమే కాదు జగత్తంతటికీ గురువే అంటూ శంకర భగవత్పాదులు తమ ఎదుట నిలబడి దర్శనాన్ని అనుగ్రహించినది పరమేశ్వరుడే అనే స్పురణను అనుభవించారు. భేదభావం నశించిన స్థితే మనీష, అది తిరుగులేని మరువరాని మహాపరి సత్యం. నిశ్చితమైన స్థిరమైన భావం. భేదం లేకపోవటమే అద్వైతం. భౌతిక స్థితిలో రెండుగా కనిపించినా, ఆదిభౌతిక స్థితిలో రెండు ఒకటే నని స్థిర చింతన కలిగినా, ఆధ్యాత్మిక స్థితిలో రెండంటూ లేవని ఉన్నది ఒకటే నని ఎరుక కలగటమే జ్ఞాన శుద్ధి. అదే జ్ఞాన లబ్ధి. సిద్ధత, శుద్ధత వాటికి వినయము తోడైతే ఆనంద తారక స్థితిని అందుకోవటం ఎంత సులభం. స్థితిని అనుభవించటం ఎంత సుందరం. స్థితిలో ఆత్మానందం కలగటం ఎంత శివం. స్థితిలో సంస్థితం కాగలగటం ఎంత సత్యం. ఒకే స్థితిలో అన్నిటినీ, అన్ని స్థితులలోనూ వాటిని మనీషాయతంగా అనుభవించగలగటం సాధ్యమేనని జ్ఞానమూర్తి శంకరులు నిరూపించారు. ఇది మనీషా పంచకం. మనీషా పంచకంలో బ్రాహ్మణ చండాల అనబడేటువంటి భేదం గనుక నశించకపోయినట్లయితే ఎంతటి జ్ఞాని అయినా విజ్ఞాన యోగంలో విజ్ఞానమయ కోశం వరకు వచ్చి ఆగిపోయిన వాడి కిందే లెక్క. సర్వాత్మన ఆత్మను అనుభవించవలసి ఉన్నది గనుక శంకర భగవత్పాదులు పూర్ణ జ్ఞానమూర్తి అయి కూడా తానేదో అనకూడనిది అన్నట్లు, తానన్న దానిని ఎవరో సవరించినట్లు చెప్తూనే మనీషా పంచకాన్ని ప్రపంచానికి చక్కగా బోధించారు. దాన్ని మనం ఆచరించటం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఒక సాధన. మానవుడు స్థితిగతులను బట్టి, నామరూపాలను బట్టి, బాహ్య సౌందర్యాన్ని బట్టి, పండిత పామరమైనటువంటి భావాలను బట్టి తనను తాను అతిగానో తక్కువగానో ఊహించుకుంటాడు. నిజానికి పండితుడి యందు, పామరుడి యందు, సర్వజీవుల యందు, చీమ నుండి శివకేశాదుల వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను అనుభవించటమే దాని పేరు మనీష. మనీష గనుక ఉన్నట్లయితే సర్వ ప్రపంచాన్ని గురువుగా భావించగలుగుతాం. కనుకనే జగద్గురువు అంటే జగత్తుకి గురువు అని కాదు, జగత్తును గురువుగా భావించిన వాడు అని అర్థం. అందుకనే దత్తాత్రేయ స్తవంలోనూ, దత్త సంప్రదాయంలోనూ దత్తుడు ఒక చోట నాకు ఇరవై నాలుగు మంది గురువులున్నారు అంటాడు. ఇరవై నాలుగు మంది గురువులు ఎక్కడున్నారంటే ప్రపంచంలోనే ఉన్నారు. లోకమును వీడి రసము లేదు. ఉన్నదంతా ప్రపంచంలో ఉన్నది. పట్టుకోగలగాలి, అనుభవించగలగాలి, అనుభూతిని పొందాలి, కడగా విభూతి స్థాయికి వెళ్లగలగాలి. శంకర భగవత్పాదుల వాంగ్మయం అంతా అనేక సన్నివేశాల కదంబ మాలికగా కనిపించినా, అనేక సంఘటనల పూమాలగా గోచరించినా దాని యందు ఆత్మబోధ అంతఃసూత్రం. ఆత్మ బోధను గనుక అందుకోగలిగినట్లయితే పై పైవీన్నీ తొలగిపోగా లోలోపల ఉన్నటువంటి అంటే పాల యందు నవనీతం దగినట్లుగా. దాంట్లో మూడు రకాల ఉపాసనా మార్గాలున్నాయి. నిదానవతి ఉపాసనని, అంగవతి ఉపాసనని, అన్యవతి ఉపాసనని అనేక రకాలు. అందులో పరమోత్కృష్టమైనటువంటి ఉపాసన పాలను కాచటం, తోడు పెట్టటం, మీగడ చేయటం, మీగడ తొలగించటం, పెరుగును చిలకటం ఇట్లా నెమ్మది నెమ్మదిగా మీగడలో నుంచి ఎట్లాగైతే మనం పాలలో నుంచి వెన్నని ఎలా వేరు చేసి ఆనందాన్ని అనుభవిస్తున్నామో అట్లాగే జీవుడు ప్రాపంచికమైనటువంటి అనేకానేక కార్యకలాపాలు చేస్తూనే వాటితో ప్రమేయం కూడా పెట్టుకోకుండా తనను తాను ఆత్మగా భావించుకోగలిగితే అది నిజమైనటువంటి సాధన. అధ్యాత్మ సాధన అంటే ముక్కు మూసుకుని జపం చేయటం, కళ్ళు మూసుకుని తపస్సు చేయటం, ఏమీ చేయకపోవటం కాదు. అన్నీ చేస్తూనే నేను ఆత్మను అన్న నిత్య స్ఫురణలో ఉండటమే. దానినే శంకర భగవత్పాదులు స్తోత్రం చెప్పినా, వ్యాఖ్యానం చేసినా దాన్ని సమగ్రంగా ఆత్మగతమైనటువంటి విచారధారగా దానిని మలుపు తిప్పుతూనే ఉంటారు. అందుకనే శంకర భగవత్పాదులు కేవలం స్తుతి గీతాలు, నృత్తి గీతాలు మాత్రమే కాక ఒక ఉపదేశ సోపానాన్ని మనకు అందించారు. అంటే సోపానం అంటే మెట్టు. Graduation అంటున్నామే! మనం ఎప్పుడూ అనుకునే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అదొక మెట్టు. ఆపై మరొక మెట్టు, మరొక మెట్టు. వీటన్నింటినీ కూడా ఉపదేశ సోపానంగా అందిస్తున్నారు శంకర భగవత్పాదులు. అద్వైత ఉపదేశమే కట్టకడపటి బోధ. అంటే రెండు లేవని ఉన్నదంతా ఒకటే అని చెప్పే భావనలో మనందరినీ నిలబెట్టటం. అంతా ఒకటే అనే భావనలో మనసు నెలకొల్పించే ముందు మనసే ద్వంద్వంలో ఉంది. రెండుగా ఉంటూ రెంటిలోనూ ఉండటం దానికి అలవాటు. స్థితి సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వదు. బ్రహ్మానందం అందుకోవాలని ఆరాటపడే మనసుకు శంకర భగవత్పాదులు మెట్లు చూపిస్తూ ఎక్కమన్నారు. మెట్లు సాధనా స్థితులు. వాటిని ఐదు సోపానాలుగా మనకి దగ్గర చేస్తున్నారు. గురు ముఖతః వేదం చదివి ధర్మానుసారంగా కర్మలు సాగించి, సాధించి, యధావిధిగా పూజ నిర్వర్తించి, కర్మ ఫలాన్ని భగవంతునికి సమర్పించి నికామమైన చిత్తాన్ని పొందాలి. దేహాత్మ భావన వదిలిపెట్టాలి. ఇది తొలి మెట్టు. సజ్జన మైత్రి, దైవ భక్తి, ఇంద్రియ నిగ్రహం, పరమ శాంతి, వైరాగ్యం, గురు సమాశ్రయం, సేవ, కులమత గుర-గుణ, వర్గ వర్ణ భేదం లేని సమత్వ స్థితి సాధించాలి. ఇది రెండవ మెట్టు. ఉపనిషత్తు బోధించిన విషయాలను విని, అర్థం చేసుకొని, ఆచరించే ప్రయత్నం చేయాలి. విషయాన్ని తెలుసుకునే వరకు తర్కించుకోవాలి, వితండవాదాన్ని వదిలిపెట్టాలి.జీవుడు వేరు, దైవం వేరు అన్న భావం వదులుచుకోవాలి. దేహమే నేను అన్న భావన నుంచి నేను దేహము మాత్రమే కాదన్న నిశ్చిత స్థితికి రావాలి. నాకన్నీ తెలుసునన్న భావం వీడాలి. నేనేదో పొందానన్న అహాన్ని విడనాడాలి. విద్వాంసులతో వ్యర్థ వాదం చేయకూడదు. ఇది మూడవ మెట్టు. ఆకలి రోగమైతే దానికి మందుగా తగిన ఆహారం తీసుకోవాలి. రుచి అనే సుఖం కోసం బిచ్చమెత్తకూడదు. వేళకు ఏమి దొరికితే, ఎంత దొరికితే దాంతో తృప్తి పడాలి. అపేక్ష తుంచుకొని ఉపేక్ష పెంచుకోవాలి. నిర్దయ, నిష్ఠూరం, మానవమాన స్థితి విడిచిపెట్టాలి. వాచాలత్వం ఉండరాదు. ఇది నాల్గవ మెట్టు. మనస్సును ఏకాంతం చేసుకోవాలి. స్థితి ఆనందాన్నిస్తుంది. మనసుకు అతీతమైన బ్రహ్మము నందు ఆలోచనలు ఎరుగని ధ్యాన స్థితి లభిస్తుంది. నిర్మల నిశ్చల భూమికలో ఆత్మ అనుభవం అవుతుంది. దాని పేరే ఎరుక. వెలుపల కనిపించేదంతా లోపల ఉన్న వెలుగు వలననే ప్రకాశిస్తున్నది అన్న నిశ్చిత బుద్ధిని పెంచుకుంటూ వెళ్ళాలి. పాత కర్మానుభవాలు నశించటంతో పాటు మళ్ళీ కొత్తవి కలగకుండా జాగ్రత్త పడాలి. ఇది ఐదవ సోపానం. మనసు పెట్టి ఆచరించగలిగితే ఐదు మెట్లు ఎక్కి ఆనంద తారక స్థితిని అందుకోవటం కష్టమేమీ కాదు. పొందాలి, అనుకోవాలి, ప్రయత్నం చేయాలి, దీక్షగా సాధన కొనసాగించాలి, బిగువు సడలకుండా నడవాలి, సదమల ఆనందాన్ని సొంతం చేసుకోవాలి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం శంకరులు ఉపదేశించిన దివ్య మార్గమే సాధనా సోపాన పంచకం. ఆధునిక మానవుడికి ఇది సూటైన సరళమైనటువంటి మార్గం. [నవ్వు] ఇంతటితో ఈనాటి భారతీయన్ కార్యక్రమాన్ని ముగిస్తూ మళ్ళీ వచ్చే వారం ఆదిశంకరాచార్యుల వారి మీద శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారు ఇచ్చే మూడవ ప్రసంగాన్ని విందాం. సాయిరాం. [నవ్వు]
SSSMC · audio

Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 02

Home

Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 02

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 26:26

More in this series

Sri Adi Shankara — Contribution to Indian Culture and Spirituality

5 episodes · 2 hr 28 min

  1. 27 min 1

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 01

  2. 26 min 2

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 02

    Now playing
  3. 31 min 3

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 03

  4. 31 min 4

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 04

  5. 31 min 5

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 05