No transcript for this section.
[ back ground music] భారతీయం . సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగమాలిక ఒక భావవీచిక [ background music] రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ శీర్షికలో భాగంగా శంకరుల వారిపై శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు అందిస్తున్నటువంటి ఉపన్యాసాల పరంపరలోని ఆఖరి ఉపన్యాసాన్ని ఈనాడు మనం వింటాం. [ background music] శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటి విహి బ్రహ్మ సత్యం జగన్మిధ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ప్రపంచంగా స్థూలంగా కనబడుతున్న ఈ జగత్తు నిజంగా లేదు. జీవుడు నిజానికి బ్రహ్మమే, వేరు కాదు అంటూ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని మనకు అందించారు. ప్రపంచం అంటే కనిపిస్తున్నది అంతా కదా! కనబడుతున్న దానిని లేదనటం, కంటికి కనిపించనిదే సత్యము అని సమన్వయం సాధించటం ఎట్లా? ఈ సందేహం ఈనాటిది కాదు. నదులు, కొండలు, వాగులు, వంకలు, గుట్టలు, మిట్టలు, జీవులు, ప్రాణులు ఇవన్నీ లేవు అని అనుకోవటం అసహజం అని అనిపిస్తుంది కదా. ఇక బ్రహ్మయే సత్యం అన్నప్పుడు బ్రహ్మానికి ఉన్న లక్షణాలు ఏమిటి? వాటిని అర్థం చేసుకునే విధానం ఏమిటి? మొదటి లక్షణం సత్ అంటే ఉనికి. ఉనికి అంటే ఇంతకు ముందే ఉన్నది అని అర్థం. అంటే సృష్టికి ముందే ఉన్నదని, సృష్టి జరగటానికి ముందు ఏదో ఒకటి లేకపోతే సృష్టి ఎట్లా ఏర్పడుతుంది. కనుక సత్ అన్నింటికీ మూలం, అంతేతకి ఆధారం. రెండవది చైతన్యం. చైతన్యం పదార్థం కాదు. బయటకు వస్తువుగా కనపడదు. అదొక అంతర్ వాహిని. నడిపించే మూల శక్తి అది. అది ప్రాణాధారం. ఇంద్రియాలను కదిలించేది అది. అది సర్వవ్యాపకమైనది. అన్ని అవస్థలకు అతీతమైనది. ఉనికి ఉన్నది కనుకనే చైతన్యం ఏర్పడింది. ఈ చైతన్యం వ్యక్తి నుండి విశ్వం వరకు వ్యాపించిన శక్తి. మూడవది వెలుగు. వెలుగు అంటే వస్తువును చూడటానికి ఆధారమైనది. వెలుగు బయట, లోపల, అంతటా, అన్నిటా ఉన్నది. వెలుగు అన్నిటి మీద ప్రసరిస్తూ ప్రసరించిన చోటల్లా వస్తువును ప్రకాశింపజేస్తుంది. ప్రకాశం కారణంగా వస్తువు యొక్క చైతన్యం దాని ఉనికి, దాని మూలం అనుభవంలోకి వస్తుంది. వెలుగు వల్ల వస్తువు యొక్క స్థూల స్వరూపం తెలుస్తుంది. ఆపై ఆ వస్తువును గురించిన ఆలోచన, విచారణ, స్వభావ నిరూపణ ఒకదాని వెంట ఒకటి ఏర్పడి వస్తు మూలంలోకి దృష్టి పారుతుంది. బయట వెలుగు స్థూలం, లోపలి వెలుగు సూక్ష్మం. వెలుగు సకల ధర్మాలకు అఖిల విద్యలకు మూలం. సత్, ఉనికి, చైతన్యం వెలుగుల పట్ల అవగాహన బలపడుతున్నప్పుడు జ్ఞానం పటమరిస్తుంది. జ్ఞానం నాల్గవది. వివేకము, విచక్షణ కలబోసుకున్నదే జ్ఞానం. దాని మరొక పేరు ఎరుక. ఈ స్ప్రుహ అనంతం, ఆధ్యాత్మికం. అంటే భౌతిక, ఆదిభౌతిక స్థితులను దాటిన ఉన్నత స్థితి. అంతా నిశ్చలం, నిర్మలం, నిర్మమం. ఈ స్థితి పరమానందదాయిని. పరమ చరమ స్థితి. దాని పేరు ఆనందం. ఇదే అసలు స్థితి. సుఖం, దుఃఖం, మోదం, ప్రమోదం వంటివన్నీ వస్తు పరమైనవి. అనుభవానికి లోబడినవి. ఘటనకు సంబంధించినవి. అవి మారుతూ ఉంటాయి. పరిమిత ప్రభావం కలిగి ఉంటాయి. ఆనందం అపరిమితమైనది, మార్పెరగనిది. ఆనందం ఒక ఉదాత్త స్థాయి. వాసనారహితమైన ఆనంద నిష్ఠ జ్ఞానులకు సహజం. నిజానికి మానవ జన్మ ఎత్తిన వారందరూ సాధించుకోవలసిన పూర్ణ స్థితి. ఇదంతా బ్రహ్మకు సంబంధించిన విషయం. ఈ ఎరుక లేనివాడు కంటికి కనిపిస్తున్న వస్తు ప్రపంచమే సత్యం అనుకుంటాడు. ఆ కారణం వల్లనే తన దేహాన్ని నిత్య సత్య శాశ్వత వస్తువు అనుకుంటాడు. ఆ భావనలోనే ఉండిపోతాడు. ఆ ఆలోచన నుండి బయట పడటం అసంభవం అనుకుంటాడు. సంభవం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న వాడు సాధకుడు అవుతున్నాడు. దేహ భావన నుండి అనంత ఆత్మ భావనలోకి ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. అంటే తన మూలాల వైపు నడక సాగిస్తూ బ్రహ్మ లక్షణాలను క్రమంగా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు. తాను బతుకుతున్న ప్రాపంచిక జీవనంతో బ్రహ్మ భావాన్ని అనుసంధానం చేసుకుంటూ అటు ఇటుగా సాధన సాగిస్తున్నాడు. కానీ సాధన తీవ్రమై నిలకడ చెందుతున్నప్పుడు తాను దేహం మాత్రమే కాదని, తన మూలాలను గమనించుకున్న జీవుడినని ఒక ప్రజ్ఞను సాధించుకుని సహజ స్థితి వైపు అడుగు వేస్తున్నాడు. ఆ సాధనా క్రమంలో జీవ ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞతో కూడి అంతా ఒక్కటే అన్న భావన స్థిరపడుతున్నది. కనబడుతున్న ప్రపంచం కనబడని వేరొక వస్తువు వలన కనిపిస్తున్నదని స్థిమిత మనస్సు ఏర్పడగానే రెండవది లేదంటూ లేదనిపిస్తుంది. ఆ భావనే అద్వైతం. జగత్ మిధ్యా అంటే జగత్తు లేదని కాదు.మూలమైన శక్తివంతమైన మరొక వస్తువు వలన ఈ జగత్తు ఉన్నది అని తెలుస్తున్నది. ఆ తెలిపే వస్తువే సత్, అదే ఆత్మ, అదే ఉనికి, అదే వెలుగు, అదే ఎరుక, అదే అంత. అర్థ శ్లోకంలో శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంత బీజాన్ని పాతి అనల్ప భావాన్ని సూత్రీకరించటం ఆయన ప్రజ్ఞా భూమికకు అద్దం పడుతుంది. అద్వైతం శూన్యవాదము కాదు, మాయావాదము కాదు, అదొక యదార్థవాదం, అది పూర్ణవాదం. ఆత్మైక స్థితి వైపు నడిపించే చేతనా భూమిక అది. అద్వైతం అచల అద్వైత అద్వితీయ రమణీయ విభూతి భూమిక సచ్చాచార్యులకు శత సహస్ర వందనాలు. ద్వాపర యుగంలో సమస్త వాఙ్మయ సృష్టికి మూలకారకుడైనటువంటి భగవాన్ వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ తత్వాన్ని చెప్పాను గానీ శ్రీకృష్ణుడి యొక్క ఆ మూలాన్ని, ఆ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను అని చింతించినప్పుడు నారదుడి కారణంగా భాగవతం రాసి ఆత్మ తృప్తిని పొందాడు. అట్లాగే శంకర భగవత్పాదులు సమస్త వాఙ్మయ సృష్టి చేసి కూడా ఆయన భాష్యం రాయని ఒక వస్తువు మాత్రం మిగిలిపోయింది. అది లలితా సహస్ర నామం. శంకర భగవత్పాదులు అన్నింటి మీద భాష్యం రాసిన లలితా సహస్ర నామానికి రాయాలి అంటే ఎలా రాయాలి అని సంకల్పించుకున్నప్పుడు మామూలుగా భాష్యార్థము, గోప్యార్థము కాకుండా కవితా భాండాగారాన్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేస్తూ యోగశాస్త్ర నిరూపణ చేస్తూ సాధికారంగా సౌందర్యలహరిని సృష్టించారు. అంటే సౌందర్యలహరి లలితా సహస్ర నామాలకు భాష్యం అన్నమాట. అది అద్భుతమైనటువంటి శంకరాచార్య భాష్యం. అసలు ఆ పేరే చూడండి, సౌందర్యలహరి. ఎంత అందమైన పేరు! శంకర భగవత్పాదులు అనుభవించిన అందుకున్న అనుభూతికి సుందర కవితా రూపమే సౌందర్యలహరి. బ్రహ్మము నాతోనే ఉన్నాడన్న సమయమత వాదానికి వ్యాఖ్యానం సౌందర్యలహరి. తమ గురువులైన గౌడపాదుల వారి శుభగోదయ స్తోత్రం పై సోదాహరణ వ్యాఖ్యానం సౌందర్యలహరి. జగన్మాత సౌందర్య స్తుతి వైభవము మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ అనబడే ఆరు చక్రాలను అధిగమిస్తూ ఏడవదైన సహస్రార చక్రము నందు సంస్థితం చేయించే అంతరంగ ప్రయాణ యోగ భోగము కలబోసుకున్న యోగ మహావిద్య సౌందర్యలహరి. అద్వైతమనే ఆత్మవిద్య, యోగవిద్య కలసి రమణీయ కవితా ప్రవాహమైనది అది సౌందర్యలహరి. నూరు శ్లోకాల నిండా మంత్ర తంత్ర యంత్రాత్మక విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి కుండలినీ జాగృతిని శంకరులు అనుభవ రస సిద్ధం చేసిన శతసహస్ర పత్రసుందరి అమ్మవారు. ఆమె సగుణ, ఆమె నిర్గుణ. సాకార నిరాకారాలలోనూ పరిపూర్ణంగా అనుభవించవలసిన మహా త్రిపురసుందరి దేవి. ఆమెను గురించిన తలపులన్నీ సౌందర్యలహరులే. వంద శ్లోకాలలో మొదటి నలభై శ్లోకాలు ఆనందలహరిగా, మిగిలినవన్నీ సౌందర్యలహరిగా లోకంలో సుప్రసిద్ధం. భక్తి, సమయమతం, అద్వైతం ఏ కోణంలోనైనా సర్వ సల్లక్షణంగా, సమస్త శక్తిమంతంగా, సౌందర్య సార సర్వస్వంగా ఆవిష్కృతమైన సౌందర్యలహరి మహత్వ, కవిత్వ, పటుత్వ స్వరూపం. కర్మ, భక్తి తమంతట తాము ముక్తిని ఇవ్వలేవు. వాటికి జ్ఞానం తోడు కావాలి. ఇంతకీ ముక్తి అంటే ఏమిటి? జీవాత్మ, పరమాత్మలు ఏకం కావటమే ముక్తి. దీనిని సాధించాలి అంటే విద్య కావాలి, మార్గం తెలియాలి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడు కలిసి విద్య కావాలి. నిజానికి అదే పూర్ణ విద్య, అదే శ్రీవిద్య, అదే అసలు విద్య. ఇక కావలసింది మార్గం, గమ్యం. అది అద్వైతం. అద్వైతం ఆచరణీయ విధానం కావాలి, దాని పేరు పూజ. ఎవరికి పూజ? ఎవరి పూజ? సర్వ సృష్టికి మూలమైన దేవీ పూజ. శ్రీవిద్య ఉపాసన, శ్రీచక్ర పూజ ఇవన్నీ అద్వైత సిద్ధికి ఆనంద మార్గాలు. శివుడు అంటే ఆలోచన, శక్తి అంటే ఆచరణ. ఆ రెండూ విడదీయరానివి. ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన ఈ లోకానికి అక్కరకు రావు. కనుక ఈ రెండింటికీ సమన్వయ ధార శ్రీవిద్య స్వరూపంగా, యోగత్రయ శక్తిగా శంకరులు సౌందర్యలహరిని సృష్టించారు. వేద ప్రామాణికంగా శక్తి స్వరూపాన్ని సానందంగా, సౌందర్యంగా జగత్తుకు వరదానం చేశారు భగవత్పాదులు. మాటకు మనసుకు అందని కానీ వాటి ద్వారానే అందుకోవలసిన నిర్గుణ పరబ్రహ్మాన్ని దేవీపరంగా, ఆమె సగుణ స్థితిని సౌందర్య విలసితంగా, కవితామృతంగా శంకరులు వర్ణించిన తీరు నిరుపమానం. చిచ్ఛక్తిని శ్రీవిద్య ద్వారా, శ్రీచక్రోపాసన ద్వారా కవితా గానం చేస్తూ అమృత భాషలో అంటే సంస్కృత భాషలో భగవత్పాదులు సాగించిన ఆనంద సౌందర్యలహరి విహారం ఒక ఆత్మానుభవాన్ని సాధకుడికి అనుగ్రహిస్తుంది. కావలసిందల్లా అనుభవించగల హృదయం, అచంచల విశ్వాసం, మూసుకోని తలపులు, ముసురుకునే సంస్కార భవనాలు. పురాణాలు, ఉపనిషత్తులు, మహావాక్యాలు, నానా వాదాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సౌందర్యలహరిని గాఢంగా, తీవ్రంగా అధ్యయనం చేయాలి. శక్తి లేకుండా శివుడు తన కార్యకలాపాలు సాగించలేడు. శివుడు ఏమిటి? విష్ణువు, బ్రహ్మ, చంద్రుడు, కుబేరుడు, మనువు, అగస్త్యుడు, లోపాముద్ర, స్కందుడు, ఇంద్రుడు, మన్మథుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు వీరంతా శ్రీదేవిని అంటే శ్రీవిద్యను ఉపాసించవలసిందే. శివశక్తులది ఒక కూటమి. ఒకటి లేక మరొకటి లేదు. చిచ్ఛక్తి నుంచి పుట్టిన పరాగ రేణువును బ్రహ్మ గ్రహించి లోకాన్ని సృష్టిస్తున్నాడు. ఒక్క శిరస్సుతో ఆ రేణువును మొయ్యలేని విష్ణువు పదివేల శిరస్సులున్న శేషుడై మొయ్యగలుగుతున్నాడు.పరాగ రేణువును చూర్ణం చేసి విభూతిని ధరించి శివుడు లైకార్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ ముగ్గురు తమ శక్తులను ఆమె పాదపద్మ పరాగ రేణువుల నుండి గ్రహిస్తున్నారు. సౌందర్యలహరి ఈ విధంగా సాగుతుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రంలో బీజాక్షరాలు. ఇది ఒక తీవ్ర విచారణ. శంకర భగవత్పాదుల లలితా సహస్ర నామ స్తోత్రానికి భాష్యం రాయలేదు గనుక ఆ లోటును పూరిస్తూ సౌందర్యలహరిని పూరించారు. అనేక శాస్త్రాల రహస్యం తెలిసి, కవితా అమృతం రుచి ఎరిగి మరిగి, అనల్ప కల్పనాశక్తి కలిగి శ్రీవిద్యను ఉపాసించాలన్న తీవ్ర కాంక్షలున్నవారికి సౌందర్యలహరి నిజానికి అసలు విద్య. అది అనుగ్రహించేది అచ్చ తెలివినే. అనేక స్థాయిలలో ఆకళింపు చేసుకోవాలి. వైకల్యం వదులుచుకోవాలి. కైవల్యం సాధించుకోవాలి. దేశకాలాతీతంగా భగవత్పాదులు మానవాళికి అనుగ్రహించిన సంవిత్ ఫలమే సౌందర్యలహరి. "శంభుజ్ఞాన వసంత సంగిని హృదారామేఖ జిర్ణచ్ఛదా। స్రష్టా భక్తిలతాచ్ఛటా విలసతా పుణ్యప్రవాళశ్రితాః। దీశ్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా। జ్ఞానానందసుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి ॥" ఈ శ్రీవిద్యా స్వరూపాన్ని శంకర భగవత్పాదులు సాక్షాత్ శంకరులు కనుక పరిపూర్ణ జ్ఞానానికి, సమర్పణకు, శరణాగతికి, వినయానికి, దార్శనికతకు, సమాజ స్పృహకు సాకార స్వరూపం. వారి వాక్కు మనోజ్ఞము, మధురము, మనోహరము. సౌందర్యలహరి సంగీత సాహిత్య సమ్మేళనం. దానిని అన్నా, విన్నా ఆనందమే. జగజ్జనని సౌందర్యాన్ని పలు కోణాలలో ఆవిష్కరించి భక్తి, రక్తి, ముక్తి రంగరించి శ్రీవిద్యోపాసనను కవితామయమూ, సానందమయమూ అయిన దివ్య స్తోత్ర కావ్యంగా తీర్చిదిద్దారు. మొదటి శ్లోకంలోనే అమ్మవారి సార్వభౌమ స్థితిని బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ, సదాశివ అనే పంచమూర్తులను ఆజ్ఞాపించే సర్వాధికారిణిగా ఆమెను కీర్తిస్తారు. రెండు, నాలుగు శ్లోకాలలో అమ్మ పాద మహిమను రమణీయంగా వర్ణిస్తారు. పదిహేను, పదిహేడవ శ్లోకాలలో జనని వాగ్విలాసాన్ని బహుసుందరంగా వ్యాఖ్యానిస్తారు. ఆమె అనుగ్రహం లభిస్తే వాల్మీకి, వ్యాస, కాళిదాసు వంటి ఋషి సమానుల వలె కావ్యాలు రచించవచ్చునంటారు. ఎనిమిదవ శ్లోకంలో కుండలిని శక్తి నిరూపణం చేస్తారు. పదవ శ్లోకంలో కుండలిని శక్తి యొక్క ఆరోహణ, అవరోహణ వివరిస్తారు. యోగవిద్యలో ఇది ప్రధాన శ్లోకం. దేవికి ఈ ప్రపంచంతో గాని, దాని స్థితితో గాని ఏ సంబంధం లేకపోయినా, అంటే తాను నిమిత్త మాత్ర అయినా, సాక్షిభూత స్థితిలో ఉన్నా, లోకం పట్ల తనకున్న కరుణ వలనని మళ్ళీ మూలాధారంలోకి సర్పం వలే కుండలిని శక్తి రూపంగా ఉంటున్నది అని ప్రాంజలి ఘటిస్తారు. మనము ఆ విధంగానే షట్చక్ర ప్రయాణాన్ని, సప్తజ్ఞాన భూమికలను, అష్టాంగ యోగాలను సమన్వయం చేసుకుంటే తప్ప యోగానుభవం కలగదు. పదకొండవ శ్లోకమంతా శ్రీచక్ర వర్ణనే. ఏడవ శ్లోకంలో అమ్మవారి సౌందర్య విశేషాన్ని కడు రమ్యంగా వర్ణిస్తారు. లోతుగా విచారిస్తే ఈ శ్లోకం శంకరులు అమ్మవారిని దర్శించిన వైనంగా కనిపిస్తుంది. నలభై నాలుగు, నలభై ఎనిమిది, యాభై ఒక్క శ్లోకాలు అలంకార సౌందర్య విలసితమైన కవితా ఖండికలు. అమ్మవారిని చూడవలసిన తీరుకు చూపిన ఆచార్య స్వామి వారికి, వారి అనుభూతికి అక్షర రూపాలు. ఇక ముప్పై రెండవ శ్లోకం. అది పంచదశాక్షరీ మంత్రం. దానినే శ్రీవిద్య మంత్రంగా లోకానికి ఉపదేశించారు. శివుడు, శక్తి, కామాడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, స్మరుడు, హంస, ఇంద్రుడు, పరాశక్తులు, పరా, మరా, హరి ఇవి పన్నెండు వర్ణాలు. అందులో శివుడు, శక్తి, కామాడు, భూమి తొలి ఖండం. సూర్యుడు, చంద్రుడు, స్మరుడు, హంస, ఇంద్రుడు రెండవ ఖండం. పరాశక్తి, మన్మథుడు, హరి మూడవ ఖండం. ఈ మూడు ఖండాలకు మధ్య ఉన్న విరామ స్థానాలలో రింకారములు కూడి ఉండి పదిహేను అక్షరాలతో మహా మంత్రం ఏర్పడింది. సౌందర్యలహరి శ్లోకాలలో ఆచార్య స్వామివారు ప్రతిష్టించిన మంత్రశాస్త్రం ఉన్నది. ఇరవై రెండవ శ్లోకంలో అద్వైత బోధను ఆవిష్కరిస్తారు స్వామివారు. తొంభై, తొంభై రెండు శ్లోకాలలో దేవీ సౌందర్యాన్ని, ఆమె పాదపద్మ శోభను వర్ణిస్తారు. భక్తులు అనుభవించే ఆనందమరంద శోభను వర్ణిస్తారు. దేవీ భక్తులను అభేదంగా నిరూపిస్తారు. శివావతారమైన శంకరుల వినయం మూర్తిమంతమైన శ్లోకం నూరవది. అమ్మా! నీ పరమైన మాటలతోనే నిన్ను స్తుతించగలుగుతున్నాను అంటూ శంకరులు అమ్మవారిని చేతనా రూపంగా ఉపాసిస్తారు. సౌందర్యలహరిని చదవవలసిన రీతులు ఎన్నో, ఎన్నెన్నో. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో దానిని అర్థం చేసుకోవాలి. మంత్ర, తంత్ర, యంత్రాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. విజ్ఞాన శాస్త్రము, ఆత్మవిద్య, యోగ విద్యల త్రివేణిగా దీనిని ఆనందపానం చేయాలి. ఆలోచన చేయాలి. ఆధునిక మానవుడి ప్రశ్న సౌందర్యలహరి చదివితే మాకేమి లాభం అని. అమ్మా! నిన్ను తలచు నీ భక్తుడు శారదా, లక్ష్మీదేవిల వలె శాశ్వతుడై ఉంటాడు. అంటే విద్యావంతుడు, జ్ఞానమూర్తియై బ్రహ్మ విష్ణువులకు సైతం అసూయ కలిగించే నిత్యత్వాన్ని పొందుతాడు. తేజస్సు, వర్చస్సు కలిగి సౌందర్యవంతుడవుతాడు. అహంకారం, మమకారాలనే జీవ లక్షణాలను, అజ్ఞానాన్ని వదులుచుకొని జీవన్ముక్తుడవుతాడు. సదాశివత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అన్నివేళలా సుఖి అవుతాడు అంటున్నారు శంకరులు తొంభై తొమ్మిదవ శ్లోకంలో. శంకరులు వశ్యవాక్, శంకరులు పరావాక్కు. భగవత్పాదులు ప్రపంచానికి ఇచ్చిన మహదాశీర్వచనము, అభయ ముద్ర, ఆనంద ముద్ర, వ్యాఖ్యా ముద్ర, సర్వశాస్త్ర సార సముద్ర సౌందర్యలహరి. శంకర భగవత్పాదుల దివ్య పాదపద్మాలకు వేవేల వందనాలు. మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రముల యొక్క సమన్వయ స్వరూపం సౌందర్యలహరి అని విన్నాం కదా! శంకర భగవత్పాదులు ఒక ఆనంద ప్రవాహాన్ని మనకు పరిచయం చేస్తున్నారు.ఇది సౌందర్యలహరి దేవీపరంగా ఉన్నట్లయితే శివానందలహరి శివ పరమైనటువంటి భావన. అద్వైత బోధ, వేదాంత ప్రబోధ, వైరాగ్య సుబోధ ఒకయెత్తయితే భక్తి ప్రబోధం మరొక రస స్థాయి. భగవత్పాదుల విచార ధారలో భక్తి ఒక ఆనంద ప్రవాహం. ప్రవాహం అంటే లహరులు ఏర్పడక తప్పదు కదా! పూజలు, వ్రతాలు, దీక్షలు దాటి పరమాత్మను కేవలం భావనా స్థితిలో అనుభవించగలిగితే ఆ ఆనందం అవిచ్ఛిన్నం, అనవరతం, అమృతమయం. శంకరులు తమ శ్రీశైల పుణ్యక్షేత్ర యాత్రలో హృద్గీతగా ప్రవాహ సదృశ్యంగా సాగించిన దివ్య కవితా వ్యాసంగమే శివానందలహరి. భగవంతుని యందు భక్తుడికి ఉండే పరమానురాగమే భక్తి. సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్యాలను అనుభవ పరిధిగా అనుభూతి పరమావధిగా అనుగ్రహించేది భక్తి. 'భ' అంటే వెలుగు 'క్తి' అంటే కూడి ఉండటం భక్తి అంటే వెలుగుతో కూడి ఉండటం అంటే లో వెలుగుతో కూడి అని అర్థం. సాధారణంగా లోకరీతిలో కవులందరూ జ్ఞానం కోసం, జన్మ రాహిత్యం కోసం కవిత్వం చెప్తారు, రాస్తారు. భక్తి రసాన్ని అంతరంగ సాధనా ఫలంగా అనుభవిస్తారు. అదొక ఆనంద రస ధుని. కానీ జ్ఞాని, పరమాత్మి, సాక్షాత్తు శంకరుడే కవిత్వమయంగా భక్తిని స్తోత్ర రూపంగా ఆలపిస్తే అది ఒక రసానంద గీతిక. సర్వజనులు పాడుకోగలిగిన, పాడుకోవలసిన కవితా స్వరూపం అవుతుంది. దాని పేరు శివానందలహరి. భాషా, భావం, అలంకారం, శాస్త్రం ఇవన్నీ బహుసుందరంగా మారిన ఆనందలహరిగా శివానందలహరి సాగుతుంది. కేవలం స్తోత్ర స్థాయిలోనే కాక శివతత్వాన్ని కూడా ఆవిష్కరిస్తారు శంకరులు. శివానుగ్రహం పొందటానికి భక్తే ఏకైక మార్గమని స్పష్టంగా బోధిస్తారు. ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు సాగే కోతి ఆటవలె మానవుడి మనస్సు ఊగుతున్నప్పుడు భగవంతుడు భక్తి అనే తాడును విసిరి మనస్సనే కోతిని బంధించి తన వైపు తిప్పుకుంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఎంత అధ్యయనం చేసినా, సన్యాస స్వీకారం చేసినా భగవంతుణ్ణి పొందటానికి భక్తి భావనే బలీయమైన సాధన. శివ పాద పద్మ లగ్నమైన భక్త హృదయము శివవశం అవుతుందని, పరమయోగత్వం లభిస్తుందని చివరగా కైవల్యం పొందుతుందని శంకర భగవత్పాదుల ప్రమాణం. కొందరు లౌకికమైన భౌతికమైన కోరికలను సాధించుకోవాలని గ్రహాలను శాంతింపజేసి దేవతారాధన చేసి లాభం పొందుతారు. సంసారికి ఇది తప్పనిసరి. కానీ మానవ జన్మకు లక్ష్యము, గమ్యము అయిన బ్రహ్మ పదాన్ని పొందాలి అంటే శివుణ్ణి ఆశ్రయించటమే శ్రేయం. ఆ శ్రమలో, ఆ తీవ్ర సాధనలో, శివుణ్ణి ప్రార్థించటంలో భక్తుడు వేడుకగా వేడుకోవాలి. "అధికిరాతుడా! శంకరా! ఎందుకయ్యా అరణ్యంలో అమాయకంగా స్వేచ్ఛగా తిరుగాడే మృగాలను వేటాడుతావ్? నాయందే అరిషడ్వర్గాలనే మృగాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నీ బాణాన్ని నా వైపు సంధించి వాటిని సంహరించవచ్చు కదా!" అంటారు ఆచార్య స్వామివారు. పాములు నీ ఆభరణాలు, విషము నీ కంఠఘటం, తోలు కట్టుబట్ట, ముసలి ఎద్దు నీ వాహనం, నీ దగ్గర ఏముందని నిన్ను అడగను. కానీ నీ దివ్య పాదముల యందు నిలువగల అచంచల భక్తిని నువ్వు అనుగ్రహించవు గలవు పరమాత్మ! దానినివ్వు చాలు." అంటున్నారు భగవత్పాదులు. మేరు పర్వతము, కుబేరుడు, కల్పవృక్షము, చింతామణి, కామధేనువు నీ అధీనం. నీవు ఇవ్వలేనిదంటూ ఉన్నదా? అని కీర్తిస్తూనే అటువంటి నీకు మేము ఏమివ్వగలము అంటున్నారు శంకరుడు. ఒక సూర్యుడు క్రమం తప్పకుండా సమస్త లోకాన్ని ఆవరించిన చీకటిని పోద్రోలి మాకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కోటి సూర్యుల వెలుగుకు మూలమైన నీవు నాకెందుకు కనపడవయ్యా? అని చమత్కరిస్తారు శంకరులు భక్తిభావంతో. శివుడంటే వేదమి. సకల భువన క్షేమంకరుడు, సర్వవ్యాపి, సర్వవేది, రసాలయుడు, పశుపతి, నిత్యుడు అంటూ శివగుణగణాలను అగణితంగా వర్ణిస్తారు. సానందంతో ఒక్కొక్క గుణ వర్ణన శివతత్వ విచారణకు దారితీస్తుంది. శివుణ్ణి సగుణంగా, స్వరూపంగా, నిర్గుణంగా భావించగలగాలి. అది శంకర హృదయంతో. త్రిశూలం జడం. చంద్రుడా మచ్చగలవాడు. మృగంలో పశుత్వం. పాముల నడకలా వంకరటింకాలు. ఇవన్నీ దోషాలున్న వాటిని ఆదరించి ధరించి ధరింపజేయటం పరమశివా! నీకు తప్ప ఎవరికి సాధ్యమయ్యా? వాటన్నింటితో పాటు నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు భగవత్పాదులు. మానవుడు స్వభావ రీత్యా కఠినాత్ముడు. జన్మ పరంపరను అధిగమించలేడు. పశు ప్రవృత్తిని అంత సులభంగా వీడలేడు. నివృత్తి మార్గం కోసం ప్రయత్నం ప్రారంభించడు. జీవితం అనుకూలించనప్పుడే దైవాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు. గండం నుంచి బయటపడగానే మళ్ళీ తన ప్రవృత్తిలో ప్రవేశిస్తాడు. భయాన్ని భక్తి ద్వారా దూరం చేసుకోవాలి అని అలమటిస్తాడు. భక్తి అంటే సమర్పణ, శరణాగతి, వినయం. భక్తి అంటే అభేద, అచల, అద్వైత స్థితి. దైవాన్ని సగుణంగానూ, నిర్గుణంగానూ ఉపాసించాలి, నమ్మాలి. ప్రపంచ శాసన కర్తను గుర్తించాలి. భక్తి ద్వారా జ్ఞానానుభవాన్ని పొందాలి. మూర్తి ఏదైనా స్ఫూర్తిని పొందాలి. పశుత్వం నుంచి పశుపతి స్థాయికి ఎదగాలి. భగవన్నామ స్మరణము, ధార్మిక చారణము, ఆత్మ విచారణను సాధించుకొని తారణం అంటే ముక్తిని పొందాలి. శివానందలహరిని రసగంగా ప్రవాహంగా మన ముందు నిలిపి లలిత మార్ధవ మార్మిక కవితా ధోరణిలో శివసాక్షాత్కారం చేయిస్తారు శంకర భగవత్పాదులు. శివానందలహరిలో దాగిన ఎన్నో విషయాలను మనం మరింతగా విచారణ చేయవలసి ఉన్నది. ఏమున్నది? భగవంతుణ్ణి స్తుతించాలంటే అమిత భావ సంపద ఉండాలి. భాషా సంక్రాంతం ఉండాలి.సిద్ధత్వము శుద్ధత్వము అనుభూతి దర్శనము ఉండాలి అప్పుడే కీర్తన సంకీర్తనై సమ్యక్ స్వరూపాన్ని సంతరించుకుంటుంది పరశివావతారమైన ఆదిశంకరుల అనుభూతి పారమ్యానికి భక్తినిష్ఠకు దర్శన శోభకు అద్దం పడుతుంది శివానందలహరి వంద శ్లోకాలలో పరమాద్రంగా శివభావామృత వృష్టిలో భక్తుడు హృదయం తడిసి ముద్దవుతుంది విందాం. ఉమామహేశ్వరుడుగా అద్వైత సిద్ధి స్వరూపం శివ శివానిలది మూడు కన్నుల వాడు మూడు పురాలను ధ్వంసం చేసిన వాడు మూడు వేదముల ద్వారా ఎరగవలసిన వాడు జ్ఞానమునకు ఆధారమైన వాడు ఆ పశుపతికి ప్రణామం అల్ప ఫలాలను ఇచ్చే వేవేల వేల దేవతల కంటే నీ పాద ఆరాధనా ఫలమే సర్వోత్కృష్టం తర్క శాస్త్ర వాదాల కంటే నీ పాదసేవే సుఖదాయి మనసు వాక్కు చేతులు చెవులు కళ్ళు నీ స్వరూప దర్శనంలో నిమగ్నం కావాలి మనస్సును నీకు అర్పించటమే అసలు పూజ మనిషి ఏ స్థితిలో ఉంటే ఏమి హృదయం నీ అధీనంలో ఉండాలి పరమేశ్వరా బ్రహ్మత్వము విష్ణుత్వము కేవలం పదవులే నాకు కావలసింది మోక్షం శివా దానినివ్వు. సారూప్య సామీప్య సాలోక్య సాన్నిధ్య సాయుజ్యాలను ఏకకాలంలో అనుగ్రహించగలిగిన వాడు విషాన్ని మింగక కంఠంలోనే నిలిపి సర్వభువన జీవకోటిని దయతో రక్షించావు ప్రళయ కాలంలోనూ నీవు అచలుడవు ఆనంద సముద్రుడు యోగం క్షేమం శ్రేయస్సు సాధన రీతి వంటి వాటిని వరదానం చేస్తూ అన్నివేళలా సర్వజ్ఞ స్థితిలోనే ఉంటావు నీవు మా మానస మందిరంలో ఉంటే ధర్మం నాలుగు పాదాల ప్రవర్తిస్తుంది అంతరంగ శత్రువులు నశిస్తారు నీవు మాయందు వసిస్తే అనంత జ్ఞానౌషధం మాకు లభిస్తుంది పరమేశా! నీ ధ్యానమే మాకు వసంతం సాయం సంధ్యలో సాగే తాండవ నృత్యం లాస్యం ఉపనిషత్తులు బ్రహ్మరాంబా దేవి దివ్య ప్రేమ సమస్త దేవతల పూజ నిత్యమూ సాగే ఈ శ్రీశైల క్షేత్రంలో ఉన్న మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవించాలి ఉపనిషద్ విహారి సత్య స్వరూపుడు చిన్మూర్తి తాండవానంద సాంద్రుడవైన నీకు నమస్కారం అరగిన పాత చెప్పు నీ పాలభాగాన్ని తాకినా పుక్కిట బట్టిన నీళ్లు నిన్ను అభిషేకించినా ఎంగిలి మాంసం ముక్క నీకు నైవేద్యం అయినా తిన్నన్ని కన్నప్పను చేసి నీ అనంతమైనటువంటి కరుణను నిరూపణం చేశావు. తిన్నడి నిశ్చల భక్తి నీ అనుగ్రహము ఎంత ఒద్దికగా వదిరినై తండ్రీ! నీ ఆట కోసం నువ్వే సృష్టించుకున్న ఈ ప్రపంచంలో మాతోనే నీ ఆట ఆడేది నీవే ఆడించేది నీవే గెలిపోటములు రెండూ నీవే మమ్మల్ని రక్షించటం బాధ్యత నీదే నీ పాదాల గోశాలలో ఉండి ఆనందం అనే పాలను పితకనిచ్చే నా భక్తి అనే గోవును సదా రక్షించు. పరమేశా! నీ పాదార్చన స్వాధ్యాయం ధ్యానం సమాధి వీటి వలన కలిగే ఆనందాన్ని నీకే సమర్పిస్తున్నాను అది జీవన్ముక్తి నీ ఆద్యంతమును ఎరుగని నేను నిన్ను ఎలా పూజించను హంస వరాహాలుగా మారిన బ్రహ్మ విష్ణువులకే ఇది సాధ్యం కాలేదా? అది అయినప్పుడు నాకు మాత్రమేం తెలుస్తుంది మహోన్నతమైన యోగవిద్య తెలియక ఇంకా రూప ధ్యానంలోనే ఉన్నాను. జ్ఞానప్రదము ముక్తిదాయకమైన నీ పాదారవింద ధ్యానము నాకు లభించింది నీ చరిత్రను నేను చదవాలి అది నాకు అమృతపానం నా కవితా కన్య సరళ పదాలతో కూడి అలంకార శోభితమై ధీమంతుల ప్రశంసలను అందుకున్నది ఆమె ఒక ఆనంద రేఖ వినయ జ్యోత ఆమెను స్వీకరించి నన్ను అనుగ్రహించు అని శ్రీ శంకరులు సదాశివుడ్ని స్తుతిస్తున్నారు. అంటే భగవంతుణ్ణి మనం ఎలా కీర్తించాలో కీర్తించటానికి ఎటువంటి భాష వాడాలో ఏ భావంతో నితించాలో సూచిస్తున్నారు శంకరులు. ఉపమా శ్లేష ఉత్ప్రేక్ష రూపక అర్ధాంతర న్యాస వక్రోక్తి వంటి అలంకారాలు శివానందలహరిని అలంకరించిన కోకొల్లలు అలలు శివానందలహరి స్తోత్ర కావ్యం అద్యంత రమణీయం రసవంతమైన పదప్రయోగం ప్రసాద మాధుర్య గుణాలు అర్ధ గాంభీర్యం పరిపూర్ణంగా నింపుకున్న కవితా రసమాలయం శివానందలహరి. సదా మోహాదవ్యాం ధీయంత్రేణ కారుణ్యామృత వర్షిణం అమితము ముదమమృతం భక్తిర్మహేశ జడతా పశుతా జలధీ మధనా దక్షః సారసనా ఈ పదాలన్నీ కూడా కొన్ని ప్రయోగాలు లోకమును వీడు రసం లేదు ఆచార్య స్వామి వారు సాధారణ భక్తుని వలె అనితర సాధ్యమైన భక్తి పారమ్యంతో శివ స్తుతిని కవితా స్వరూపంగా రచించి శివ పరమైన రూప భావ తత్వార్ధాలను రమణీయ భావనా స్థితిలో ఆవిష్కరిస్తూ ఒక్క ఆట ఆడిస్తున్నారు అగ్ని స్వరూపమైన వాక్కుకు వైభవాన్ని విలాసాన్ని స్తుతి గీతగా వ్రాసి లోకోపకారం చేశారు శంకరులు. మళ్ళీ ఇదే ప్రశ్న శివానందలహరి ఎందుకు చదవాలి? అందమైన భాష దివ్య భావనలు భక్తి పారമ్యం శివగుణ కీర్తనం ఏకకాలంలో అనుభవంలోకి వస్తాయి ధారణా సిద్ధి కలుగుతుంది చదువుకున్నంత సేపు అది అపాత మధురం ఆగి ఆగి చదువుకుంటే అది ఆలోచనా అమృతం సంస్కారము సంస్కృతి కలబోసుకున్న దివ్యాకృతి శివానందలహరి. శంకర భగవత్పాదులకు శతసహస్ర నీరాజనాలు అర్పిస్తూ భారతీయ అధ్యాత్మ చరిత్రలో శంకరులది అగ్రస్థానం శంకరులది పరమోత్కృష్టమైనటువంటి భావనా భూమిక సాధారణ మానవుడు భక్తి కర్మ జ్ఞాన యోగాల ద్వారా తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళటానికి కావలసిన అన్ని మార్గాలను తెరచి పరచి ఆనంద సానంద విహారం చేయించి రసగంగా ప్రవాహంలో మునకలు వేయిస్తూ మనసుని ఆర్ద్రం చేసి హృదయాన్ని విశాలం చేసి లోలోపల ఉన్నటువంటి నేను అనేటువంటి ఒక అనంత మహా శక్తిని ఆవిష్కరిస్తూ జీవ బ్రహ్మలకు అద్వైతమైనటువంటి ఒక భావనను కలుగజేస్తూ జీవుడు జగత్తు జగన్నాయకుడు ఇది ఒక త్రిపుటి అని ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే అని అనేక విధాల అద్వైత బోధాన్ని ప్రపంచానికి అందించారు శంకర భగవత్పాదులు. వారు రాసిన అసంఖ్యాకమైనటువంటి స్తోత్రాల వ్యాఖ్యానంతో పాటుగా ప్రత్యేకంగా మరొక్కసారి బ్రహ్మసూత్ర భాష్యం చెప్పుకుందాం. ఖడగ భారతీయ వాఙ్మయంలో శంకరుల భాషా భావం అమరిక పొందిక కదలిక మెదలిక చలనము చారణము విచారణము సంచారణము తారణము కారణము ఈ జగత్తుని పరమేశ్వరోన్ముఖంగా నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం. [భాగం] ఇంతవరకు మీరు భారతీయన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ఆదిశంకరాచార్యుల వారిపై అందించిన ప్రసంగ మాలికలోని ఐదవ ఆఖరి ఉపన్యాసాన్ని ఈనాడు విన్నారు. వచ్చే వారం భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత లోని మరొక చక్కని అంశంపై ఉపన్యాసాన్ని మీకందిస్తాం అంతవరకు సెలవా మరి సాయిరాం. [భాగం]
SSSMC · audio
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 05
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 05
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 31:35
More in this series
Sri Adi Shankara — Contribution to Indian Culture and Spirituality
- 27 min 1
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 01
- 26 min 2
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 02
- 31 min 3
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 03
- 31 min 4
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 04
- 31 min 5
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 05
Now playing