Skip to content
Transcript తెలుగు
[ backgroud music playing] భారతీయం [backgroud music playing] సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగమాలిక ఒక భావవీచిక [backgroud music playing] రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయమ్ కార్యక్రమానికి స్వాగతం. ఆదిశంకరాచార్యుల వారిపై కొనసాగిస్తున్నటువంటి శీర్షికలో భాగంగా బి ఎస్ ఆర్ మూర్తి గారు తమ నాల్గవ ప్రసంగాన్ని ఈరోజు మనకు అందిస్తారు. ఇక ఆలస్యం దేనికి ప్రసంగాన్ని విందాం. [backgroud music playing] శ్రీ కృష్ణానంద లహరిలో శంకర భగవత్పాదులు ఆత్మ విచార మార్గాన్ని ఇంకా అందంగా చాలా లోతుగా విస్తృతంగా దేహం నుంచి దేహాతీతమైన స్థితిని విచారణ చేశాం కదా. అసలు ప్రపంచమే పరమేశ్వరుడి యొక్క అంగాంగీభూతమైనటువంటి వస్తువుగా వర్ణిస్తున్నారు భగవత్పాదులు. ప్రపంచంలో ఏముందో మన శరీరంలో అది ఉన్నది అంటున్నారు. దానిని ఒక వైజ్ఞానిక దృక్పథంతో శంకర భగవత్పాదుల మేధ అది శంకర మేధ దక్షిణామూర్తి మేధ. కనుకనే వస్తువునైనా బహు కోణాల్లో బహుముఖీనంగా ఆవిష్కరించేటువంటి ప్రజ్ఞా భూమికి అది. ఆయన ఆవిష్కరించే తీరుతెన్నులన్నీ కూడా అద్వైత మార్గం వైపు తరలించినా మరలించినా ఆయన చెప్పే విధానంలో ఒక స్పష్టత ఒక అధికారం ఒక సత్య దర్శనం ఒక నిత్యానంద స్పర్శ ఇవన్నీ కూడా మనకు కూడా అనుభవాన్ని కలిగిస్తాయి. ప్రబోధ సుధాకరంలో విశ్వమే దేహం అంటున్నారు శంకర భగవత్పాదులు. మనం కూడా అంటున్నాంగా సహస్ర శీర్షా పురుషః సహస్ర పాత్ అని వర్ణిస్తున్నాం గా ఆయన్ని. ఇదేంటో కాస్త విచారణ చేద్దాం. పంచభూతాలతో కూడిన మానవ శరీరం విశ్వానికి ఒక replica ప్రతీక. ప్రపంచమంతా దేనితో కూడి ఉన్నదో మానవ దేహం నిండా అదే ఉంది. సృష్టినంతా నడిపిస్తున్న ఒక అనంత శక్తి కంటికి కనపడదు. అంతటినీ ఆవరించి మాత్రం ఉన్నది. విధంగానే దేహమంతటా ఉండి దేహాన్ని ఇంద్రియాలను మనసును బుద్ధిని చిత్తాన్ని నడిపిస్తున్న శక్తి ఏది? అది ఆత్మే. సత్యాన్ని గ్రహించగలిగితే మనిషి మహాత్ముడు అవుతాడు. నిజానికి సాధకుడి ప్రయత్నమంతా స్థితిని అందుకోవాలని. ఇంద్రియాలు పంచభూతాలుగా ప్రతిబింబిస్తున్నాయి. మనసనే ఇంద్రుడు వీటికి అధిపతి. నిప్పు దేనినైనా దహించగలగటం కేవలం ఆత్మ శక్తి వలననే. గాలి విషయము అంతే. కానీ యత్నంలో సాధకుడు కొన్ని అవరోధాలను దాటాలి. దాటాలి అంటే అడ్డుపడుతున్న వాటి బలాలు బలహీనతలు వాటి నిజస్థితి స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆంతరంగికంగా ఇంద్రియాలుగా మనసుగా ఉన్నవే బాహ్య ప్రపంచంలోనూ ఎదురవుతున్నాయి. సత్యాచార్యులైన శంకర భగవత్పాదులు విషయాలన్నీ ఒక absolute reality అంటాం. అంటే అతి వాస్తవిక దృష్టితో విశ్లేషిస్తున్నారు. ఏమిటది అని దేహం పంచభూతాల సమిశ్రితంగా ఉన్నా అది ఒక మట్టి గూడు. కాలగమనంలో ఋతువు వెంట ఋతువులు ఏర్పడి గూడు శిథిలమవుతుంది. మట్టిని మెత్తుతూ గూటిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. నిజానికి ఇదంతా వృధా ప్రయాసే. మట్టి గోడకు ఎంత మట్టి మెత్తినా ఒకనాటికి కూలిపోయేదే కదా. కురూపి అయిన భార్య మానసిక వ్యధకు, సుందరి అయిన భార్య మానసిక అభద్రతకు కారణమవుతున్నది. చూశారా కురూపి అయినందువలన మానసిక వ్యధ కలుగుతున్నది. సుందరి అయినందువలన మానసిక అభద్రత కలుగుతున్నది. భార్య ఉండి రెండు స్థితులలోనూ పరివేదనే మిగులుతున్నది. నిజానికి దీనికి కారణం భార్య కాదు, భర్త మనస్సే. శిక్షణ లేని కారణంగా మనసు ఇంతగా బాధను రగిలిస్తున్నది. మూలాన్వేషణలో సమాధానం పొందాలంటున్నారు శంకర భగవత్పాదులు. ఇక కొడుకు సంగతి చూద్దాం. పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకుంటూ యజ్ఞయాగాదులు చేసి పుత్రుణ్ణి కన్నా, వాడి వలన పుణ్యలోకాలు ఎట్లా లభిస్తాయి? రాముణ్ణి పొందిన దశరథుడికి మరణ సమయంలో రాముడు అక్కరకు రాలేదు కదా. తన సేవలో మరణించిన జటాయువుకు కదా రాముడు అంత్యక్రియలు చేసింది. రుణం తీర్చుకోవటానికి తెగని అభిమానం అనుభవించటానికి తదితర కారణాల వలన ఏర్పడే పితృపుత్ర బంధం ఎల్లవేళలా సంతోషం కలిగించటం లేదు. ఇక బంధువర్గం అంతా ఎప్పటికప్పుడు ఏర్పడేదే. ఒక జన్మలో ఉన్న బంధాలు మరు జన్మలో ఉండవు. ఇది తజ్జ్యం. అట్లాగే జన్మ ఏర్పడటము స-తజ్జ్యమే. బాంధవ్యాలు మారుతూ ఉంటాయి. ఇంతకీ ఇప్పుడు మనవారిగా కనిపిస్తున్న వారంతా ఎవరు వారు? ఎక్కడివారు? ఎప్పటివారు? ఏమో. ఇప్పటికి మాత్రం మనవారు. ఎప్పటికీ మాత్రం కారు. సంపదలు ఉన్నంత కాలం అందరూ చెంత చేరటం లోకరీతి. సంపదలు మనుషుల్ని ఎక్కువ కాలం కలిపి ఉంచలేవు. స్థితిగతులలో మార్పులు మానవ సంబంధాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. అనుభవం పొందని జీవుడు ప్రపంచంలో ఉండడు. మితిమీరిన సంపద సుఖాన్ని ఇవ్వవచ్చునే గానీ ఆనందాన్ని ఇవ్వలేదు. పైగా భయాన్ని కలిగిస్తుంది. భార్య, పిల్లలు, రాజు, దొంగ సంపదను అనుభవిస్తారే తప్ప సంపద కలిగిన వాడికి భయం తప్ప మరి ఏమీ మిగలదు. సంపద మీద రాజు కన్ను వేసి ఉంచుతాడు. దొంగ దోచుకోవాలని, బంధువులు పంచుకోవాలని సంపద చుట్టూ ఉంటారు. సంపద పెంచుకోవటంలో ఇంత అస్థిమితత్వం దాగి ఉన్నది. నిజానికి రాజు సైతం ఎంత బలవంతుడైన మరొక రాజు వచ్చి తనను జయించి నిర్వీర్యుడిని చేస్తాడని నిరంతరం భయపడుతూనే ఉంటాడు. విధంగానే ఇంద్రియాల వల్ల కలిగే సుఖాలు అశాశ్వతం. అవి భయం కలిగించేవే కానీ ఆనందం వైపు అడుగు వేయనియ్యవు. జీవన ప్రయాణంలో మంచి స్నేహితుల వలె, సహ యాత్రికుల వలె భార్యాభర్తలు ఉండగలిగితే అది మంచి జీవితం. ఆత్మ విచారణ నుంచి పొందే దివ్యానందం ఇచ్చినంతగా కొడుకు ఎన్నడూ ఆసరా ఇవ్వలేడు. ఆత్మానందమే అసలు బిడ్డ. ఆత్మ తృప్తిని మించిన సంపద లేదు. ఇంద్రియాలు, మనస్సు నియంత్రించబడి ఉంటే కోరికలు అదుపులో ఉంటాయి. కోరికలు అదుపులో ఉన్నంత కాలం మనస్సు తేలికై దుఃఖం దూరంగానే ఉంటుంది. ఎవరు నిత్య తృప్తుడో వాడు నిత్యసుఖి. శరీరం పనిముట్టు. దానితో పని చేయిస్తున్నది మనస్సు. ఇంద్రియాలు పరివారం. వీటన్నింటికీ మూల శక్తి ఆత్మే. దేహం, ఇంద్రియాలు, మనస్సు పనిచేస్తూ ఉంటాయి. ఆత్మ మాత్రం చూస్తూ ఉంటుంది. అది సాక్షి. కానీ ఆత్మను ఎవరూ సాధన లేకుండా చూడలేరు. ఎందుకంటే అది వస్తువు కాదు కదా. ఆత్మ ఒక ఆంతరంగిక అనుభవం. శంకర బోధ నిజానికి ఒక ఉపనిషత్ వ్యాఖ్య. శంకర బోధ అపాత మధురము, అది ఆలోచనా అమృతం. ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకి విశ్వమే దేహం అన్నటువంటి శంకర భగవత్పాదులు స్థిమిత మనస్సుని సంపాదించుకోమంటున్నారు. కంట్రోల్డ్ మైండ్ కావాలి, కండిషన్డ్ మైండ్ కాదంటున్నారు. చాలా తేడా ఉంది. కండిషన్డ్ మైండ్ అంటే ఇక ఆలోచించడానికి వీలు లేనిది అని. కంట్రోల్డ్ మైండ్ అంటే ఇంద్రియ నిగ్రహం పొందినటువంటి మనస్సు అని. దానిమీద శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ కోరికలు కలిగినప్పుడు ఏం జరుగుతుంది అని. కోరికలు ఆవహించినప్పుడు మనసు రాక్షసత్వాన్ని పొందుతుంది. కోరికలు కుదిపినప్పుడు నవ్వుతూ, మరో క్షణం ఏడుస్తూ, మరో క్షణం అయోమయానికి గురవుతూ, పరిపరి విధాలా దిక్కుతోచని రీతిలో పరుగులు ఇడుతుంటుంది. కానీ అప్పుడప్పుడు విచక్షణతో ఉన్నా అన్నివేళలా మూర్ఖంగా ఉంటుంది. ప్రపంచాన్ని పొగుడుతూ, తెగుడుతూ, ద్వేషం పెంచుకుంటూ వింతగా ప్రవర్తిస్తుంది. ఒక్కోసారి తనను తానే అభినందించుకుంటుంది. దంభం, ప్రగల్భం, వంచన, దురాశ, పేరాశ, కోపం, తీవ్రమైన అసూయ మనసును నిలవనియ్యవు. ఇంతకీ మనసు ఆలోచనా సమూహమే కదా! ఆలోచనకు అవసరం లేని ఆశ జతగూడినప్పుడు మనసు తన సహజ స్థితిని కోల్పోతుంది. మనసును ప్రశాంత స్థితిలో నిలపాలంటే మార్గం ఒకటే. కోరికల వల నుంచి దానిని బయట పడేయాలి. అది దేనిని తీవ్రంగా కోరుతున్నదో దాని నుంచి దూరం చేయాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడి సాగే పడవ మానవ శరీరం. కర్మానుభవాల గాలులే నావను ఊపుతూ ఉంటాయి. దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు. పడవను నడిపే సరంగు మాత్రం నిమిత్త మాత్రుడు. చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు ఆత్మవలె. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నోరు, మర్మస్థానం, ఆసనం తొమ్మిది రంధ్రాలను గమనించుకుంటూ జీవన ప్రయాణం సాగించకపోతే పడవలోకి నీరు ప్రవేశించటం, పడవ మునగటం తధ్యం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అనబడే పదకొండు మంది రుద్రులు దేహం నిండా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అనుభవశాలి అయిన సరంగు పడవను అవతల గట్టుకు భద్రంగా చేరుస్తాడు. ఏమిటీ అనుభవం? ఇంద్రియ నిగ్రహమే. ఇంద్రియ నిగ్రహం సాధించకపోతే ప్రయాణం నిత్యమూ ప్రమాదభరితమే. పరస్త్రీలను కోరటం మహాపాపం. తెలిసి కోరికను వదులుకోలేకపోతే మనసు నిత్య పాప పంకిలమవుతుంది. పరదూషణం చేయటమూ, వినటమూ నిరర్థకమే, ప్రయోజన శూన్యమే. నిందించటానికి, కఠిన పదాలతో బాధించటానికి అలవాటు పడిన నాలుక సాధించుకునేది ఏమీ లేదు. ఎప్పుడూ పోగొట్టుకోవటం తప్ప. వస్తువుల యందు కలిగే అభిమానం దురదృష్టానికి మార్గం వేస్తుంది. వస్తువును పొంది పోగొట్టుకున్న వాడిది తీరని బాధ. వివేకవంతమైన మనసు తనకు ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకోగలదు. అందువలన అది సుఖి. అశాశ్వతమైన వస్తువు నుండి అది అన్నివేళలా దూరంగా ఉంటుంది. ఎరను పొందే ప్రయత్నంలో చేప తన ప్రాణాన్నే కోల్పోతుంది. ప్రాపంచిక సుఖాలన్నీ మృత్యువు వైపు నడిపించే ఎరలే. పాము నోట సగం శరీరంతో ఇరుక్కున్న కప్ప తనను కబళించబోతున్న మృత్యువును గమనించటం లేదు. పైగా తన ముందున్న కీటకాలను తినటము, ఆపటమూ లేదు. ఇంతకు మించిన అశాపాశం ఉన్నదా? నిజమే మనస్సును నిగ్రహించటం ఎట్లా అని. తన ప్రయాణాన్ని ప్రారంభించిన నది మూలం వదిలి సముద్రంలో చేరి ప్రయాణం ముగిసే వరకు పల్లం వైపుగా వెళ్ళటం లేదా? వర్షాకాలంలో అధికంగా నీరు చేరటంతో బావిలో నీరు తీయదనాన్ని కోల్పోవటం లేదా? బావి నీరే వేసవి కాలంలో తీయదనాన్ని నిలుపుకోవటం లేదా? అధికం ఎప్పుడూ అనర్థకమే కదా! అధిక కామల వల్ల తామస గుణం అధికమవుతుంది. నిరపేక్ష వలన తామసం నశించి సత్వగుణం పెరుగుతుంది. సత్వ, రజస్, తమో గుణాలు మూడు ప్రకృతి శక్తులే. పవిత్రత, వివేకం, విజ్ఞానం, సమత ఇవన్నీ సత్వగుణంగానూ, ఆందోళన, ఆగ్రహం, అస్థిమితత్వం రజో గుణాలు గానూ, జడత్వం, అజ్ఞానం, భ్రాంతి తమో గుణాలు గానూ ప్రతి వ్యక్తికి అనుభవంలోకి వస్తున్నాయి. మనసుకు ఉన్న మొదటి లక్షణం పొందాలనుకోవటం. పోగొట్టుకోవటం అంటే దానికి అయిష్టం. పైగా అవమానంగా భావిస్తుంది. వస్తువును పొందే ప్రయత్నమంతా నిజానికి ఆతనే.అంకుర వృక్షం నుంచి పడిన విత్తనాలన్నీ మళ్ళీ చెట్టు మూలంలోకి వచ్చినట్లే మనసు ఎంతగా లోపలికి వెళ్ళాలని ప్రయత్నించినా ప్రయత్నంలో సఫలత సాధించుకోలేకపోతే నిర్వేదమై మిగులుతుంది. మందలో ఉన్న తన పశువు తప్పిపోకుండా దాని వంటిపై గుర్తును ముద్రించినట్లుగా ప్రపంచ కార్యకలాపాల్లో సంచరించే మనసు మీద నియంత్రణా ముద్ర ఉండాలి. అప్పుడు మనసు ఎన్నడూ వశం తప్పదు. మేల్కొన్నప్పుడు మనసు సుఖం పొందటం లేదు, నిద్రలో సుఖం పొందాననుకొని హాయిగా ఉన్నాను అంటున్నది. రెండూ నిజం కావు. సుఖం వలన కలిగే సంతోషము శాశ్వతం కాదు. బావిలో పడిన పులి ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోయినప్పుడు తానున్న బావిలోనే నిలకడ చెందుతుంది. ఇంద్రియాధీనమైన మనస్సుకు సుఖం ఎక్కడ? సత్సంగము, సత్సాంగత్యము, సజ్జన మైత్రి మనసుకు స్థిమితాన్ని ఇస్తాయి. ప్రాణాయామ సాధనలో మనసు నిలకడ చెందుతుంది. ప్రాణాయామం చేయమంటున్నారు, ప్రాణ ఆయామం చేయమంటున్నారు శంకర భగవత్పాదులు. ప్రాణమన్నా మనసన్నా ఒకటే. రెండూ శక్తి క్షేత్రాలు. స్వస్థానంలోకి, మూలంలోకి, దేహిలోకి ఎట్లా వెళ్ళాలి? "దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహి నిరామైయుండు గణుతింపగా దేహియే దేవదేవుడవు" అని సత్యసాయి భగవానుడు మనకు ఎట్లా ప్రబోధిస్తూ వచ్చారో దానిని శంకర భగవత్పాదులు యధాతథంగా చక్కగా మనకి అర్థమయ్యేట్లుగా చెప్తూ స్వస్థానానికి చేరే మార్గం ఏమిటో మనకు చెప్తున్నారు. పొరుగింటిలో పెళ్లయిందని విన్నా, పిల్లలు పుట్టారని విన్నా కలిగే ఆనందం నిజానికి ఆనందమేనా అని. అలాగే ఎవరో మరణించారు అని విన్నప్పుడు కలిగే దుఃఖము దుఃఖమేనా? కాదనేదే నిజం. అది ఒక స్పందన మాత్రమే. తనది అనుకున్నది దూరమైనప్పుడు మాత్రమే దుఃఖం, దక్కిందనుకున్నప్పుడు మాత్రమే ఆనందం కలుగుతున్నాయి. నిజానికి ఇవి నిజమేనా? తన ఇంట్లోనే తాను ఒక అతిథిగా ఉండగలిగినప్పుడు కలిగే భావమే నిజమైన వైరాగ్యం. స్థితిని పొందిన వాడికి ఇంట జరిగే విషయము బాధను గానీ, సుఖాన్ని గానీ కలిగించదు. వైరాగ్యమే ని-నిజమైన నిత్యమైన వైభోగం. వసంత కాలంలో చెట్టు కింద నీడలో మైమరచి నిద్రించగలిగిన వాడికి పూల పరిమళాలు, కోయిల గానాలు ఆనందాన్ని ఇవ్వటం లేదా? ఇవన్నీ వాడు తుం-- వాడు పొందుతున్న వైభోగం కాదా? నిజానికి వైరాగ్య భూమికలో నిలకడ చెందిన వాడికి, మనసు నిర్మలంగా ఉంచుకోగలిగిన వాడికి, ఆశలు లేని వాడికి, ఎదురు చూడని విజయాలు లభించిన వాడికి వైభోగమంతా వైరాగ్యమే కదా! జీవన సాఫల్యం సిద్ధించినట్లే కదా! తీగ నుండి విడిపడిన పండు ఎవరికీ చెందకపోవడం ఎంత దురదృష్టమో, పండును మహాత్మునికి అందించగలిగితే అంత అదృష్టం మరొకటి లేదు. అంటే పండు చేరవలసిన చోటికి చేరితే ఆనందం, చేజారితే దుఃఖం. ఆనంద దుఃఖాలకు పండు కారణం అవుతున్నది. అపజయంలో నుంచి ఏర్పడే వైరాగ్యం తాత్కాలికం. విజయంలో నుంచి పుట్టే వైరాగ్యమే శాశ్వతం. అందుకే ఏదైనా అర్థం ఎరిగి చేయాలి. పరిస్థితులు అనుకూలించక వైఫల్యం వల్ల కలిగే వైరాగ్యం ఎల్లకాలం నిలవదు. స్ప్రుహతో ఇంద్రియ నిగ్రహం సాధించాలి. వృద్ధాప్యంలో ఇంద్రియాలు తమంత తామే కార్యకలాపాల నుంచి బయటపడతాయి, తప్పుకుంటాయి. అన్నీ ఉండగానే ఇవేవీ తరవి కావు అనుకోవాలి. స్వచ్ఛందంగా, ఇష్టంగా వదులుకోవాలి. తన స్వస్థానమైన హృదయానికి దూరమైన మనస్సు నిరంతర సంచారిణి అవుతున్నది. దిక్కు తెలియని, గమ్యం ఎరుగని, లక్ష్యం లేక పరుగులుడుతున్నది. ఎందుకో తెలియకుండానే ప్రయాసతో ఆయాసపడుతున్నది. జీవనారణ్యంలో మం-మంటలకు బెదురుతున్నది. వేటగాడి వలలో చిక్కుతున్నది మనసు పరిస్థితి అంతే. స్వస్థానం వదులుకున్న ఆసామి పరిస్థితి దానిది. నీటిని వీడిన చేప మరణిస్తున్నది. నీటి నుండి బయటపడిన మొసలి బలాన్ని కోల్పోతున్నది. మనస్సు తన స్వస్థానంలోకి చేరాలి, సహజ స్థితిని పొందాలి. మార్గం ఏమిటి? ఎట్లా? శంకర భగవత్పాదుల బోధ నిరుపమానమైన బోధ. ఉదాహరణలన్నీ, ఉపమానాలన్నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో నుంచి చూసుకుంటూనే స్వస్థానం అంటే ఏమిటో తెలుసుకోమంటున్నారు. అసలు స్వస్థానం అంటే ఏమిటో తెలిస్తే సగం పరిష్కారం లభిస్తుంది. ఆపై చేరే మార్గాలపై అన్వేషణ ఆరంభం అవుతుంది. దీనికి ఒక మార్గదర్శకుడు కావాలి. దారి ఎరిగిన వాడే దారి చూపించాలి. ఆయనను గురువు అందామా? సముద్రం నిండా నీరున్నా వర్ష మేఘం కోసం, వాన చినుకుల కోసం చాతక పక్షి ఎదురు చూస్తూనే ఉంది. విధంగానే శాస్త్ర జ్ఞానం అందుబాటులో ఉన్నా గురువు కోసం సాధకుడు ఎదురు చూడాలి. గురు అనుగ్రహం ఒక మలయ పవనం. స్వాంతన కూర్చే దివ్యానుభవం. శాస్త్రం, గురువు, అనుభవం నిజానికి జ్ఞానానికి మార్గాలు. పండు తియ్యగా ఉన్నది అంటున్నది శాస్త్రం. పండు తియ్యగా ఉండటానికి ఇన్ని కారణాలున్నాయి అంటున్నాడు గురువు. అవును నిజమే పండు తియ్యగా ఉన్నది అంటున్నాడు సాధకుడు. అంటే స్వీయానుభవమే సత్యం. శాస్త్రం విషయాన్ని అందిస్తున్నది, గురువు మార్గాన్ని చూపిస్తున్నాడు. స్పర్శ, రూప, రస, శబ్ద, గంధాదులను అనుభవిస్తున్నది ఎవరు? ఇంద్రియాలతో కూడిన శరీరమా? కాదు, కాదు. ఎందుకంటే శవానికి అనుభవం ఎక్కడ? ప్రాణంతో కూడిన దేహం మాత్రమే వీటిని అనుభవిస్తున్నది. అనుభవము మేల్కొన్నప్పుడే కనిపిస్తున్నది. మేల్కొన్నప్పుడు అంటే జాగ్రదవస్థ అని అర్థం. దేహంలో ప్రాణమున్నా నిద్రావస్థలో దాని అనుభవం లేదు. వీటన్నింటి మధ్య స్వస్థానం సాక్షిభూత భూమికగా ఉంది. ఆలోచిస్తే ఇంద్రియాలన్నింటినీ మనస్సు ఒకే సమయంలో నియంత్రించలేకపోతున్నది. అంటే మనసు కంటే అతీతమైన స్థితి మరొకటి ఉన్నదన్నమాట. దాని పేరు ఆత్మ. అది ఉన్న భూమికే హృదయం. శబ్దానికి నిశ్శబ్దం మూలం. అలాగే మనసుకు మూలం హృదయం. ఇంద్రియాల చలనాలకు, స్పందనలకు, కార్యకలాపాలకు మనసు కారణమవుతుంటేమనోనియంత్రణ మాత్రం హృదయం దగ్గర ఉన్నది. అంటే అన్నిటికీ మూలం అన్నిటిపై అధికారం హృదయానికే ఉంది. విచారణ నిరంతరం సాగుతూ ఉండాలి అది అధ్యాత్మ సాధన. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యః మహామితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్వతా మజతావా పవన చరణ రోధాత్ ఆత్మ విష్టో భవత్వం. ఇంద్రియాలను మనస్సును దాటుకుంటూ మనసును హృదయ స్థానంలో నిలపగలిగితే అది ఒక సాధనా సాఫల్యం. దేహంలో ఉన్న దేహిని ఎరగాలి. ఎరగటమే ఎరుక అదే ఆత్మానుభవం. అనుభవం పొందకుండా అడ్డుకుంటున్న మాయ సంగతి ఏమిటి? శంకర ప్రబోధంలో మాయను గురించిన శంకరుల విచారణ నిరుపమానం. మాయను గురించి విచారణ చేద్దాం. మాయ, చైతన్యం నిజానికి బింబ ప్రతిబింబాలు. కనిపిస్తున్న స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరంలో కారణ శరీరం ఉన్నది. శంకర ప్రబోధం ఇంతటితో ఆగక మరొక శరీరాన్ని గురించి ప్రస్తావిస్తున్నది. అదే కారణ శరీరంలో దాగిన మహా కారణ శరీరం. వ్యక్తి చైతన్యాన్ని మరుగు పరుస్తున్న నాలుగు శరీరాల గురించిన విచారణ స్పష్టంగా చేసుకోగలిగితే ఆత్మ విచారణ స్పష్టమవుతుంది. రక్త మాంసాదులతో కూడిన స్థూల శరీరం మనకు పరిచయమే. సూక్ష్మ శరీరం అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు కలిసి ఉన్నది అనర్థం. కారణ శరీరం అంటే అవిద్య అజ్ఞానాల కలబోత. స్థూల, సూక్ష్మ శరీరాలు తమ కార్యకలాపాలు నిలిపివేసినప్పుడు కారణ శరీరం పనిచేయటం ప్రారంభిస్తుంది. కర్మానుభవాలు మిగిల్చే మనో ముద్రలే కారణ శరీరం. వీటన్నింటికీ మూలమే మహా కారణ శరీరం. దీనినే లోక లోకాంతర ప్రాణం అంటున్నాం. అవిద్య, అహంకారం, అజ్ఞానాల కాలంగా నిజతత్వం మరుగున పడిపోతున్నది. ఆత్మతత్వం అంటూ ఒకటి ఉన్నదని స్పృహ సైతం కలగటం లేదు. ఆత్మతత్వమే శుద్ధ చైతన్యమే బుద్ధి విశేషంలో జీవుడిగా నేనుగా అనుభవంలోకి వస్తున్నది. అనంతమైన ఆత్మతత్వం పరిమిత దేహంలో ఒదిగి ఇమిడి ఉండి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా తోస్తున్నది. అంటే బుద్ధే మహా కారణ శరీరం అన్నమాట. అది ప్రజ్ఞాన భూమిక. స్థితిలోనే భౌతిక, ఆధి భౌతిక స్థితులు స్పష్టమవుతాయి. వాటి పరిమితులు, వాటి స్వరూపాలు, వాటి స్వభావాలు అవగాహనకు వస్తాయి. రెండింటి గురించిన స్పష్టత కలగగానే ఆధ్యాత్మిక అనుభవం మలయ పవనంలా తాకుతుంది. ఇంకేముంది ఆత్మ విచార మార్గం వైపు ఆలోచనలు సాగుతాయి. ఇది అంతర్ముఖ ప్రయాణానికి తొలిమెట్టు. నిజానికి ఇది నాంది. తొలి ప్రయత్నంలోనే నేను ఎవరు అన్న ప్రశ్న పొడగడుతుంది. నేను కనిపిస్తున్న దేహాన్ని మాత్రమేనా? ఇదంతా మాయ గురించిన విచారణ. నేను ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాను? అనేటువంటి తత్వ విచారణ చినుకుగా ప్రారంభమవుతుంది. ఇదంతా ఆత్మ విలాసమే. విచారణ వలన ఇంతవరకు నేను అని భావించుకున్నవి ఏవీ నేను కాదు. వీటన్నింటికీ మూలమైన అసలు నేను ఎవరో తెలుసుకోమనే జిజ్ఞాస పుడుతుంది. అది శోధనై, సాధనై, ఆత్మానాత్మల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించే ప్రయత్నంగా మారుతుంది. కదలికలన్నీ, విచారణలన్నీ చైతన్యంతో కూడిన మనసులో జరుగుతుంటాయి. వస్తువును ఒక్కొక్క దాన్ని కనుగొంటూ, కాదనుకుంటూ అంటే నా ఇతి, నా ఇతి అంటామే అది. అసలు దానిని పట్టుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆత్మ విచారణ తీవ్రమవుతుంది. శుద్ధ చైతన్యం తాను కదలకుండానే ప్రతి వస్తువు నందు ప్రతిఫలిస్తుంది. సూర్య కిరణాలు సూర్యుని నుంచి భిన్నం కావు కదా! బింబం చైతన్యం, ప్రతిబింబం మాయ. బింబం శక్తిమయం, ప్రతిబింబం నిర్వీర్యం. అద్దం ముందున్న, అద్దంలో ఉన్న మనసు వలె. అద్దం ముందున్నాం మనం, అద్దంలోనూ మనం ఉన్నాం. అద్దం బయట ఉన్న మనం శక్తివంతులం. అద్దం లోపల ఉన్న మనం శక్తిహీనులం. అట్లా. వ్యక్తి చైతన్యాన్ని ఆవహించిన శుద్ధ చైతన్యం దేహంలో ఉన్న సర్వాంగములను తమ తమ కార్యకలాపాలు కొనసాగించగలవిగా సిద్ధపరుస్తుంది. కనులు చూడటమన్నా, చెవులు వినటమన్నా ఇటువంటిదే. నేను చూస్తున్నా, నేను చేస్తున్నా అన్న దేహాత్మ భావన నుంచి చూపిస్తున్నది ఎవరు? చేయిస్తున్నది ఎవరు? అనే ప్రశ్నలలో నుంచి ఆత్మ విచారణ ప్రారంభమవుతుంది. అంటే ముడి సడలుతున్నది అన్నమాట. సడలుతున్నదే గాని విడిపట్టం లేదు. ఇంకా ముడి విప్పేవాడు, విప్పటం అనేవి మనసును పట్టుకునే ఉన్నాయి. అంటే దీన్ని దృక్ దర్శన అని మనం చెప్తుంటాం. విచారణ. మనసు ఎక్కడ ఉన్నదని విచారించినప్పుడు మనసు లేనిదెక్కడ అన్న ఎదురు ప్రశ్న ఎదురవుతుంటుంది. హృదయము ఎక్కడ ఉన్నదని వెతికితే యోగ భూమికను సైతం దాటి పట్టుకోగలిగితే కుడి రొమ్మున ఉన్నది అని అర్థం అవుతున్నది. ఒక గుహ వలె, ఖాళీ ప్రదేశం వలె, ఘనీభవించిన నిశ్శబ్ద మూలం వలె. అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దం అందు, అన్ని యుగాలు మొదలాయ యోగం అందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరే నారాయణాన్వేషితం. నారాయణుడు ఎవరు? ఆత్మే. ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోవటమే సాధన. అదే విచారణ. విచారణలో మనసు మలగాలి, మౌనం వెలగాలి, అసలు నేను మిగలాలి. మాయ నుండి చైతన్యం వైపు లోచూపులు బారులు తీరాలి. విజ్ఞానం నుండి సుజ్ఞానం, దాని నుండి ప్రజ్ఞానం వైపు ప్రయాణం సాగాలి. పదార్థం నుంచి యదార్థం వైపు విచారణ కొనసాగాలి. ప్రపంచ భావన నుండి పరమాత్మ భావన వైపు మనసు, బుద్ధి, చిత్తం మరలాలి. అంటే ఇంకా ద్వంద్వం పోలేదన్నమాట. కనిపిస్తున్నదంతా అనేకంగా ఉన్నదన్నమాట. ఉన్నదంతా ఒకటేనని, ఒకటే అంతటా ఉన్నదని ఎలా కలుగుతుంది? స్థితిని అందుకోవాలంటే ఏం చేయాలి? అందుకున్న దాన్ని అనుభవించటం ఎట్లా? సాధనలు ఏవి? సాధనా మార్గాలు ఏవి? మార్గంలోకి ఎట్లా వెళ్ళాలి? అంటూ ప్రబోధించిన శంకర భగవత్పాదుల ప్రబోధం ఆద్యంతం రమణీయం.సత్య శివ సుందరాత్మకమైన ప్రబోధ సుధాకర మరంద బిందువును పొందటమే మనం పొందవలసిన అమృత స్థితి శంకర భగవత్పాదులు విశ్వమే దేహమని దేహంలో నుంచి దేహిలోకి ఎట్లా వెళ్లాలని విచారణ తీవ్రంగా చేస్తూనే ఆనందం అంటే ఏమిటో చెప్తున్నారు మానవుడు ఆనంద పిపాసి అసలు మనం ఆనందాన్ని ఎందుకు కోరుకుంటామని ఎప్పుడన్నా మనలో మనం ప్రశ్న వేసుకుంటే జవాబు ఒక్కటే అసలు మనం అదే గనుక దాని నుంచి దూరం అయిపోయినాం గనుక మళ్ళీ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం అయితే అజ్ఞానం వలన ఆనందం ఎవరో ఇవ్వాలి అని కోరుకుంటాం ఎవ్వడూ ఇవ్వలేడు ఇది సత్యం మనంతట మనమే పొందాలి ఎట్లా పొందాలి ఇది అధ్యాత్మ విచారణ ఆత్మ విచార మార్గం చాలా గంభీరంగా విషయంగా కనిపించినా ప్రయత్నం గనుక ప్రారంభించినట్లయితే అతి సులువు మార్గం అది ప్రయత్నం చేయనందువల్ల కఠినంగా అనిపిస్తుంది ఆత్మ అనాత్మల గురించి విచారణ చేయమన్నారు కదా శంకర భగవత్పాదులు విచారణ కొంతకాలం చేశామనుకుందాం విచారణ పూర్తయినప్పుడు ఏం కలుగుతుంది అనుకుంటే ఒక దివ్య భావన కలుగుతుంది ఏమని నేను బ్రహ్మమునై ఉన్నాను అహం బ్రహ్మాస్మి అది ఒక స్పురణ బ్రహ్మమన్నా ఆత్మ అన్నా నిజానికి ఒకటే బ్రహ్మ భావన కంటే తన కంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదని ఉన్నదంతా ఒకటేనని నిశ్చిత అభిప్రాయం కలగటమే వేదాలు ఉపనిషత్తులు సైతం ఇదే భావాన్ని స్పష్టం చేస్తున్నాయి స్థితిలో నిలకడ చెందిన వాడిని మహర్షి అంటున్నాం స్థితినే అద్వైతంగా భావిస్తున్న అంతటి అద్వైత స్థితిని పొందిన వాడుంటే వాడు నేను ఒకటే అని యోగేశ్వర కృష్ణుడు ప్రకటిస్తున్నాడు అద్వైత స్థితిలో నిలకడ చెందిన వాడికి ఆత్మకు ఏమీ భేదం లేదంటున్నది బృహదారణ్యకోపనిషత్తు అంటే అఖండ చైతన్యానికి నేను ఆత్మనన్న స్థితిని పొందిన వాడికి ఏం తేడా లేదు ద్వైత అద్వైతాలు రెండు నిజానికి సిద్ధాంతాలు కావు భావనా స్థితులు మాత్రమే ఆలోచనా అనుభవ స్థురుల్లో జరిగిన భావ విభజనే అది ఒక వంకర కట్టె కాలి కాలి చివరకు బూడిదైనా తన వంకర ఆకారాన్ని మాత్రం పోగొట్టుకోవటం లేదు ఎందుకని అదే స్థితిలో కాలి బూడిద అయింది గనుక అయితే కాలిన కట్టెను చేత పట్టవచ్చు కట్టె ఆకారంలో బూడిదని మాత్రం మనం చేత పట్టలేం విధంగానే విచారణ మార్గంలో దగ్ధ మనస్కుడు ఆత్మభావనలో నిలకడ చెందిన మహర్షి స్థాయి వాడు శరీరంలో ఉన్నట్లున్నా దేహాతీత స్థితిలో దేహాతీత స్థితిలో ఉన్నందున భౌతిక స్థాయిలో మన అనుభవ పరిధిలో ఉండడు మన పరిమిత అనుభవ క్షేత్రం మహర్షి అపరిమిత అనుభూతి క్షేత్రం రెండు వేరువేరు పరిమితి నుంచి అపరిమితికి ప్రయాణే సాధన దేనిని పొందాలని మనం సాధన చేస్తామో చివరకు మనం అది కావాలి యు బికమ్ వాట్ యు రీడ్ అని మనం వింటూ ఉంటాం అలాంటిది అనమాట కాగలగటమే అనుభవం అప్పుడు కలిగే భావ స్థితే అనుభూతి ఇవేవీ ఇకపై లేని స్థితే విభూతి తీవ్ర సాధన అనంతరం ఆత్మ స్థితిని అనుభవించిన వాడు అన్నిటా తానుగా ప్రతిఫలిస్తుంటాడు నీటి కుండల అన్నిటా ప-ప్రతిఫలిస్తున్న సూర్యుడి వలె సమస్త దేహాలయందు ప్రతిబింబిస్తున్న ఆత్మ సైతం అంతే సూర్యుడు ఒక్కడే కుండలు అనేకం కుండల నిండా నిండుకు-నిండి ఉన్న నీరు అనేకం కానీ అనేక సూర్యుల వలె కనిపిస్తూ ఉన్నది ఆత్మ బింబం దేహం స్థాయిలో ప్రతిబింబం ఆత్మ చైతన్యం దేహం స్థితిలో మాయ బింబం లేని ప్రతిబింబం లేదు ఇది అద్వైతం కుండ పగిలి నీరు పోతే అప్పటిదాకా నీటిలో ప్రతిఫలించిన సూర్యుడు లేకుండా పోతున్నాడా దేహం నశిస్తే ఆత్మ పోతుందా పోయేది దేహమే పోనిది ఆత్మ ఇది సత్యం దేహాత్మలో నిరంతరం జరిగే కదలికలు మెదలికలు ఆత్మకు లేవు అది కదలకుండా అన్నింటినీ కదిలిస్తుంటుంది కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం అంతా చరాచరంగా ఉన్నది ఒకే సూర్యుడి వెలుగులో ప్రయాణిస్తున్నది విధంగానే పదార్థాలన్నీ ఒకే బ్రహ్మ పదార్థం వలననే కదలగలుగుతున్నాయి పదార్థానికి భిన్నత్వం సహజం యదార్థానికి భిన్నత్వం లేదు నీరు ఒకటే దివ్య పరిమళాలు వెదజల్లే పూలకి ఉల్లికి మూలం నీరే వాసనలలోనే తేడా అంతా వస్తువులోనే ఉంది మూలమైన నీరు మాత్రం వాసనారహితంగా ఉంటున్నది స్థితులు లక్షణాలు మార్పులు ఇవన్నీ పాత్రధారికే సూత్రధారికి వేవీ లేవు తెర వెనుక ఉండి తెరమీద బొమ్మల సంచారానికి అతడు కారణంగా ఉంటున్నాడు కదులుతున్న దేహం వెనుక కదలని ఆత్మ ఉన్నట్లు ఆడించే వాడు ఆడుతున్న వాడు ఆట ఒక్కటే ఇది అద్వైతం ఆభరణాలు ఎన్ని ఉన్నా వాటి మూల వస్తువు బంగారమే తీపి వస్తువులు ఎన్ని ఉన్నా మూలం తీయందనమే ఆకారము స్వభావం కార్యకలాపాలు పరిమాణం రూపురేఖలు రంగులు ఎన్ని విధాలుగా ఉన్నా ప్రపంచ మూలం ఆత్మే బాటసారి అన్నం మూటను మోస్తున్నంత సేపు ఎవరు కాజేస్తారో ఎక్కడ పారేసుకుంటానో తినవలసిన సమయం ఎప్పుడు వస్తుందో అని వ్యాకుల పడుతుంటాడు అన్నాన్ని తినటంతో బాధంతా క్షణంలో తొలగిపోతుంది మోసినంత సేపు బరువు అనిపించింది అదే తినగానే తేలిక అయిపోతున్నది ఇంతకీ ఏమైంది బయట ఉన్న మూట లోపలికి చేరింది జరిగింది అంతే ప్రపంచ భావన మనసుని ఆక్రమించి ఉన్నంత సేపు బరువే అద్వైత భావన మనసును తాకగానే ప్రపంచం తనకంటే భిన్నం కాదని అంతా ఒకటేనని నిశ్చితానుభవం కలుగుతుంది అది అధ్యాత్మ అదే అద్వైతం ప్రపంచం వేరు నేను వేరు అనుకున్నంత కాలం ద్వైతం వదలదు ద్వైతం అంటే రెండు ఉన్నవి అనుకున్నంత కాలం భయం బాధ అభద్రత తప్పవు అంతా ఒకటే అనుకోవటమే హాయి అదే శాంతి అదే దివ్య ప్రేమ రెండంటూ లేవు ఉన్నది ఒకటే అది ఏకం సత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం ఆనందాన్ని అనుభవిస్తున్న వాడే జ్ఞాని ఆనందం మన స్వభావం ఆనందం మన స్వరూపం ఆనందం ఒక తారక స్థితి అదే అద్వైత స్థితి నిజానికి అద్వైతమే ఆనందం శంకరుల అద్వైతామృత వాహిని మానసోల్లాసకారిణి ఆనంద స్వరూపిణి శంకర ప్రబోధానికి వేవేల జ్యోతలు సమర్పిస్తూ కృష్ణానంద లహరి విహారం సాగించిన శంకర భగవత్పాదుల దివ్య శ్రీచరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ శంకర వాఙ్మయంలో శంకర భావనలో శంకర ప్రబోధంలో శంకర ప్రసారంలో మనం అనేకమైనటువంటి శిఖరాలు అందుకునే దిశగా మన విచారణ మనం కొనసాగిద్దాం [భాగం] ఈనాటి భారతీయ కార్యక్రమంలో మీరు శంకర భగవత్పాదుల వారిపై కొనసాగుతున్నటువంటి శీర్షికలో భాగంగా వి.ఎస్.ఆర్. మూర్తి గారు అందించిన నాల్గవ ప్రసంగాన్ని విన్నారు కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@videosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం వచ్చే వారం శంకరుల వారిపై శీర్షికలోని ఐదో ప్రసంగాన్ని వింటారు అంతవరకు సెలవు సాయిరాం.
SSSMC · audio

Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 04

Home

Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 04

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 31:31

More in this series

Sri Adi Shankara — Contribution to Indian Culture and Spirituality

5 episodes · 2 hr 28 min

  1. 27 min 1

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 01

  2. 26 min 2

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 02

  3. 31 min 3

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 03

  4. 31 min 4

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 04

    Now playing
  5. 31 min 5

    Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 05