Skip to content
Transcript తెలుగు
[సంగీతం] సందేశమే ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధాలపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి విశ్లేషణ. [సంగీతం] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శీల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కోటి సమితి సంకల్పించినటువంటి సత్య సాయి భగవాన్ యొక్క సందేశామృతం అనబడేటువంటి ఒక పాంచాంగిక కార్యక్రమాన్ని స్వామి సంకల్పంతో స్వామి ఆశీర్వచనంతో అనుగ్రహంతో కరుణతో చల్లని సాయంవేళ ప్రారంభం కాబోతున్నది కర్త స్వామి కర్మ స్వామి క్రియ స్వామి మనం ప్రేక్షకులం వీక్షకులం పాత్రధారులమే తప్ప స్వామి యొక్క సందేశాన్ని ప్రపంచానికి అందించటమని మాత్రమే కాక మనందరం కలిసి పంచుకునేటువంటి సత్రయాగానికి స్వామి అనుగ్రహం మహామృత వృష్టి వలె మనకు లభించు గాక. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయు వీచి సంధ్యా కపిశం ములైన జడలల్లిన జీవులలోన తాండవ శ్రీ కమనీయ జాన్హ విదరించిన దేవుని గేహ రూప మాలా కృతి మందహాస కలితా నననా మాకు ప్రసన్నమయ్యేడున్ మందహాస కలితా నననా మాకు ప్రసన్నమయ్యేడున్ వాగ్దేవి సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి పలుకు తల్లి సరస్వతీదేవి యొక్క ప్రసన్నత అనుగ్రహం మనకు గనుక ఉన్నట్లయితే జరిగేదంతా పరమాత్మ సాయి జరిపిస్తారు నిజానికి సంవత్సరం అంతా కళాకారుల సంవత్సరం అయితే కళాకారుల సంవత్సరం అంటే కళాకారులకు జ్ఞానలక్ష్మి ధనలక్ష్మి ఇద్దరూ సమానంగా లభిస్తారు అని అర్థం జ్ఞానం వైపు గనుక అడుగు వేయగలిగితే ధనం దానంతట అది వెనకకు వస్తుంది ధనం వెనక కళాకారుడు పరిగెత్తినట్లయితే ధనమే వస్తుంది జ్ఞానం రాదు కాబట్టి కళాకారుడు కానీ సాధకుడు కానీ భక్తుడు కానీ యోగి కావలసిన వాడు కానీ దేనిని ఆశ్రయించాలి పరమాత్మ అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించాలి జ్ఞానము అంటే భగవత్ తత్వమే భగవంతుడికి కూడా తత్వం ఉన్నదా అంటే తత్ అదై ఉన్నాడు తానే బ్రహ్మమై ఉన్నాడు బ్రహ్మము కంటే భిన్నం ప్రకృతి కాదని ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా అండం మొదలు బ్రహ్మాండం వరకు కూడా పరమేశ్వరుడి యొక్క దివ్య లీలా విలాసం గా ఎవరైతే భావన చేస్తారో భావనలో ఎవరు నిలకడ చెంది ఉంటారో ఎవరు తమ జీవితాన్ని సర్వాంగీణమైనటువంటి దేహాన్ని మనస్సుని బుద్ధి చాతుర్యాన్ని అన్నింటినీ కూడా పరమేశ్వరోన్ముఖంగా నడిపిస్తారో వారు నిజమైనటువంటి సాధకులుగా తమ జీవితాన్ని ధన్యవంతం చేసుకుంటారు పరమేశ్వరుడు మూడు పాయలుగా జాతిని నడిపిస్తాడు ఒకటి ఉపదేశం అది దీక్షా గురువు చేసేటువంటి పని ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ అనబడేటువంటి మహా మంత్రాలని ఒక వ్యక్తికి సాధన కోసమై ఇచ్చి మంత్రం చదువుకో నీకు ప్రాపంచికంగా కలుగుతున్నటువంటి దుఃఖాలన్నీ క్షమిస్తాయి అని చెప్తే అది ఉపదేశం రెండవది ఆదేశం ఇచ్చే గురువు ఉంటాడు నువ్వు ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే నీవు ముక్తి మార్గంలోకి వెళ్ళగలుగుతావు అని ఉపదేశము ఆదేశము రెండింటికీ అతీతంగా నిరంతరము శ్రవణం చేస్తూ మరణం చేస్తూ నిధిధ్యాసనం చేస్తూ ఉండేటువంటి నవవిధ భక్తి మార్గాలలో తొలి మూడు ఏకమై మిళితమై ఒక్కటై త్రిపుటియై భాషించేటువంటిదే సందేశం సందేశము అంటే ప్రపంచానికి మార్గోపదేశం ఎటువంటి మార్గం అంటే అది ధర్మ మార్గం అది సత్య మార్గం అది కర్మ మార్గం అది జ్ఞాన మార్గం అది ప్రేమ మార్గం ఎన్ని మార్గాలు ఉన్న ఎన్ని సందేశాలు వాగ్ రూపంలో భగవంతుడు మనకిచ్చిన వాక్కు కాకుండా కూడా సందేశం ఇచ్చినటువంటి మహాత్ములు చరిత్రలో మనకు ఎంతోమంది ఉన్నారు అందులో ప్రధానంగా మనం దక్షిణామూర్తిని తలుచుకుంటాం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వ యువానం అంటాం అంటే నిత్య యవ్వన విలసితమైనటువంటి సద్భావనలతో కూడివి ఉండిమౌనము ద్వారా రకమైన వాక్కుని కూడా వాడకుండా వినియోగించకుండా మౌన వ్యాఖ్య ద్వారా బ్రహ్మమును ప్రకటన చేసేటువంటి వాడు ఒక గురువుగా భావన చేసినట్లయితే ఆయన దక్షిణామూర్తి. దక్షిణామూర్తి యొక్క భావాన్ని decode చేసుకుని అంటే మనకు కావలసిన రీతిలో సమన్వయం చేసుకోవటానికి జ్ఞానమూర్తి అయినటువంటి హయగ్రీవుడు మరొక ఉపదేశకారుడు. దక్షిణామూర్తి హయగ్రీవుడు ఇద్దరూ కలిసి ఒక గురు స్వరూపంగా గనుక వచ్చినట్లయితే నా అనుభవంలో అది పరమాత్మ సత్యసాయి భగవానుడే మరెవరో కాదు. సుమారుగా ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో డెభై రెండు సంవత్సరాలు సత్యసాయి భగవానుడు బోధాకృతి చెప్తూనే ఉన్నారు. డెభై రెండు ఏళ్లలో చివరి ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల మూడు నుంచి రెండు వేల పదకొండు వరకు స్వామి మాట్లాడింది తక్కువ. మౌన భూమికలోనే సంచారం చేస్తూ మాట్లాడినన్నాళ్లు చేసిన దానికంటే మౌనంగా ఉన్న కాలమంతా కూడా జగజ్జేగీయంగా ఒక సనాతన ఆర్ష భారతీయ వైదిక ధర్మాన్ని ప్రపంచం సృష్టి అనేది ఎక్కడ ఉన్నదో అక్కడి దాకా సర్వవ్యాపకం చేసింది పరమాత్మ సాయి. కనుకనే ఆయన సర్వదేవతా అతీత స్వరూపంగా మనందరి చేత ప్రార్థింపబడి, కీర్తింపబడి, ఉపాసింపబడి, ధ్యానింపబడి ఒక నిశ్చల నిర్మల నికామ నికేతన నిరంజన స్థాయిలో ఆవిష్కృతమైనటువంటి మహా పరిసత్యమే స్వామి. అయితే స్వామి ఉపదేశం చేసిన దాఖలాలు ఎక్కడా చరిత్రలో లేవు. ఎవరినో పిలిచి నువ్వు రామ మంత్రం చేసుకో, కృష్ణ మంత్రం చేసుకో, నారాయణ మంత్రం చేసుకో, నమశ్శివాయ చేసుకో లేకపోతే ఓం శ్రీ సాయిరాం అనుకో అని ఎవరికీ ఎప్పుడూ ఆయన చెప్పలేదు. ఆయన కనుక స్వామి ఉపదేశం చేసిన వారు కాదు, దీక్షా గురువు కాదు. మరి ఆదేశం ఇచ్చారా ఇది ఇలాగే చేయాలి అని చెప్పారా? స్వామి మాటల్లోనే నేను ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని కానీ కొత్త విషయాన్ని గానీ చెప్పటానికి వచ్చిన వాడిని కాదు. ఉన్నదానిని సనాతనంగా అనాది నుంచి ఉన్నటువంటి దానిని పునః మళ్ళీ మీ కోసం గుర్తు చేసి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించటానికి వచ్చాను కానీ నాకు సర్వమతములు సమ్మతమే అన్నటువంటి సమతావాదమే సత్యసాయి భగవానుడు. మరి అటువంటి స్వామి ఉపదేశము ఇవ్వలేదు, నిజానికి ఆదేశము ఇవ్వలేదు, సందేశం ఇచ్చారా? ఇచ్చారు. స్వామే ఇచ్చారా సందేశం? స్వామి కంటే ముందు ఎవరూ ఇవ్వలేదా? స్వామి కంటే ముందు అనేక అవతారాలు ప్రపంచంలోకి వచ్చినాయి ప్రధానంగా భారతదేశంలో. ఆసేతు సీతాచలం కూడా ఒక మహా పవిత్రమైనటువంటి క్షేత్రం కాబట్టి భారతదేశం అంటే ఒక క్షేత్రం. క్షేత్రము అంటే ఆత్మ భూమిక, హృదయ గుహ. అక్కడ కర్మ, భక్తి, యోగ, జ్ఞాన అనబడేటువంటి నాలుగు యోగాలు ఏకకాలంలో తెలియకుండానే ఉపాసన జరుగుతూ ఉంటాయి. అందున వింధ్య పర్వతాలకి అవతల రామకృష్ణ అవతారాలు రెండు వస్తే వింధ్య పర్వతాలకి ఇవతల ఏర్పడినటువంటి వచ్చినటువంటి ప్రప్రథమ పూర్ణ మహా పరిపూర్ణ దత్తావతారం సత్యసాయి భగవానుడు. ప్రప్రథమ ఆంధ్రదేశానికి మాత్రమే కాదు సర్వ ప్రపంచానికి కూడా. నిజానికి దత్త అవతారాలు మూడు ప్రధానంగా అందులో మొట్టమొదటి అవతారం షిరిడి బాబా అయితే రెండవ అవతారం ఆంధ్రదేశంలో ప్రథమంగా వచ్చింది గనుక దానిని ప్రథమ పూర్ణ దత్తావతారం అన్నాం. అంతేకాదు సత్యసాయి భగవానుని కంటే ముందు శ్రీ దత్తుడు ఒక అంశ రూపంగా ఇక్కడే ఆంధ్రదేశంలోనే అవతార పరిక్రమ ప్రారంభమైంది. ఎవరితో? శ్రీపాదు శ్రీ వల్లభునితో, విఠాపురంలో. కాబట్టి ఇదంతా దత్త భూమి, ఇది ఉదాత్త భూమి. భూమికలో రామకృష్ణావతారాల సందేశాలు కాసేపు మనం పక్కన పెట్టి విచారణ చేసినట్లయితే అగస్త్యులవారు వింధ్య పర్వతాలను దాటి వస్తున్నటువంటి వేళకి వింధ్య పర్వతాలు అతిశయించి ఉన్నాయి, గర్వించి ఉన్నాయి. ఎట్లా గర్వించినాయి అంటే మేరువుని దాటాలి అని సూర్యుడిని గనక అడ్డుకున్నట్లయితే మేరువుని తాను దాటినట్లు బలాఢ్యమైనటువంటి మహా పర్వతంగా కీర్తింపబడతానన్న ఒక కాంక్షతో వింధ్య పర్వతం నిట్టనిలువునా పెరిగిపోతున్నటువంటి వేళ అగస్త్యుల వారు జ్ఞాన దృష్టితో దృశ్యాన్ని ఊహించి తాను వింధ్య పర్వతాల దగ్గరకు వెళ్లి ఒక మాట చెప్పారు. ఏమని అంటే, "ఇదిగో నేను దక్షిణాపథానికి వెళ్తున్నాను, మళ్ళీ నేను తిరిగి వచ్చేలోగా నువ్వు పెరగకుండా ఉండు, తర్వాత నీ విషయం చూస్తాను" అనగానే అగస్త్యుల వంటి జ్ఞానమూర్తి యొక్క మాటను విశ్వసించి ఒక అమూల్యమైనటువంటి అపారమైనటువంటి నమ్మకంతో వింధ్య పర్వతం పెరగటం ఎదగటం ఆగిపోయింది. అగస్త్యుల వారు వింధ్య పర్వతాలు దాటి ఆంధ్రదేశాన్ని దాటి శ్రీలంక దాకా అంటే ఆంధ్రదేశం అంతా జ్ఞాన స్వరూపంగా ఆయన పరుచుకొని ఉన్నారు. నిజానికి ఆంధ్రదేశమే కాదు దక్షిణాపథం అంతా కూడా. సరే ఇది ఇలా జరుగుతున్నది సందర్భం ఎప్పుడు అంటే త్రేతాయుగంలో రామ రావణ సంగ్రామం జరిగే వేళకే అగస్త్యుల వారు దక్షిణాపథం చేరుకున్నారు. రామ రావణ సంగ్రామం జరుగుతున్నది, రావణుడు హతుడు కావటం లేదు. ఎంత ప్రయత్నించినా రాముడికి మానవీయమైనటువంటి ఒక స్పృహ కలిగి రావణ సంహారం జరుగుతుందా, నా వల్ల అవుతుందా అని ఒక మనో వైక్లబ్యం ఏర్పడినప్పుడురామ రావణ మహా సంగ్రామాన్ని దర్శనం చేయాలని వచ్చినటువంటి ముప్పై ముక్కోటి దేవతలు కూడా అగస్త్యుల వారిని ప్రార్థించినాయి. ఏమని అంటే "అగస్త్య మహాముని! మీరు శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్లి ఏదైనా మంత్రోపదేశం చేసి రాముడికి కావలసినటువంటి శక్తిని మీరు ఇచ్చి రావలసింది." అని. అప్పుడు అగస్త్యుల వారు నేల మీద దిగి రాముల వారి దగ్గరకు వెళ్లి సాయంత్రం ఒక మంత్రాన్ని ఉపదేశనం చేశారు. "రామా! రోజు రాత్రంతా ఉపవసిస్తూ మంత్రాన్ని ఉపాసన చెయ్. ఉపవాసము ఉపాసన రెండూ కలిమి బలిమి గాని యందు ప్రవేశించి మహత్పూర్ణమైనటువంటి జగత్ కల్యాణకారకమైన జగత్ శోభితమైనటువంటి జగదా నంద కారకమైనటువంటి రావణ సంహారం జరుగుతుంది. ధర్మం నిలబడుతుంది రామా! నీవు ఉపాసన చేయి." అన్నాడు. ఉపాసనకి అనువైనటువంటి మంత్రమే ఆదిత్య హృదయం గా ఈవేళ మన చేతుల్లో ఉంది. కాబట్టి దీని మూలకర్త ఎవరు అంటే అగస్త్యుల వారు. ఇంతలోకే కాశీలో వేదవ్యాసుల వారు ఒకానొక రోజున భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు రోజున భిక్ష దొరకలేదు. ఎప్పుడైతే భిక్ష దొరకలేదో ఆయన మనసులో ఒక్కసారి అన్నపూర్ణాదేవిని శపించాలి అని అనుకున్నాడు. అన్నపూర్ణాదేవిని శపించాలి అన్న ఆలోచన రాగానే కాశీవిశ్వనాథుడు చెలించిపోయినాడు. సాక్షాత్తు భగవాన్ అని పించుకున్నటువంటి జ్ఞానైకమూర్తి. వేదాల అన్నింటినీ పరిష్కారం చేసి వేద విభజన చేసినటువంటి వేదవ్యాసుల వారు. పద్దెనిమిది పురాణాలు ప్రపంచానికి అష్టాదశ పురాణాలుగా అందించిన వారు. విష్ణు సహస్ర నామాన్ని ప్రపంచానికి ఇచ్చిన వారు. భగవద్గీతను ఈవేళ యోగ మార్గంగా యోగశాస్త్రంగా కలియుగానికి అందించినటువంటి వ్యాసుల వారి మనసులో కూడా కేవలం ఒక రోజు భిక్ష గనక దొరక్కపోయిన ట్లయితే లోపల ఉన్నటువంటి అహంకారము, ఆగ్రహము ఎట్లా బయటికి వస్తాయో నిరూపించేటువంటి ఒక సన్నివేశం. ఎప్పుడైతే ఈయనకి ఆలోచన లోపల పుటమరించిందో విశ్వనాథుడు శపించాడు. "నీవు కాశీని విడిచి మరుక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసింది." అంతే. వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు గనుక జ్ఞాన దృష్టితో ఆలోచన చేశారు. ఆలోచన రావటం పని చేయటం కంటే పరమ పా-పాపం. మన లోపల ఆలోచన స్థాయిలోనే దాన్ని సంస్కారం చేయాలి, సమరించాలి, నిర్మూలన చేయాలి, నిగ్రహించాలి. అప్పుడు అనుకున్నారు "మరి నేను ఎక్కడికి వెళ్ళాలి?" అని. ఆయన స్మృతి పథంలో జ్ఞాన దృష్టిలో ఏర్పడిన ప్రదేశమే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ద్రాక్షారామం. చూడండి శ్రీ దత్తుడు ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురం. వేదవ్యాసుల వారు ఎన్నుకున్న ప్రదేశం ద్రాక్షారామం. వేదవ్యాసుల వారే అక్కడికి వస్తున్నప్పుడు వారికి ఎవరు స్వాగతం పలకాలి? ఆయనతో సమానుడన్నా పలకాలి, ఆయన కంటే అధికుడన్నా పలకాలి. అప్పుడు అగస్త్యుల వారు వేదవ్యాసుల వారికంటే ముందే దక్షిణాపధానికి చేరుకున్నారు. దక్షిణాపధానికి చేరుకొని దక్షిణాపధం నుంచి ద్రాక్షారామం ప్రవేశం చేశారు. వేదవ్యాసుల వారిని సాదరంగా, సప్రేమకంగా, పరిపూర్ణంగా, హృదయంగమంగా ఆహ్వానం చేశారు. చేసేయగానే వేదవ్యాసుల వారు, అగస్త్యుల వారు ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ "మీరు ఎట్లా ఉన్నారు?" అంటే "మీరు ఎట్లా ఉన్నారు?" అని "ఎన్నాళ్ళయింది మీ దర్శనం అయిందని" ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయ స్పర్శా రేఖతో ఆనందతాండవం చేస్తున్నటువంటి మనస్సు ఉన్నటువంటి వేళ అగస్త్యుల వారు అడిగారు "కాశీలో మీ సమయం ఎలా గడిచింది వ్యాస మహాముని?" అని అడిగితే వ్యాసుల వారు అన్నారు "ఏం చేయను సిద్ధాన్నం చేతికొచ్చే సమయానికి చేజేతులా జరుచుకున్నాను. అదిగో ఫలితంగా ఇక్కడికి క్షేత్రానికి రావలసి వచ్చింది." అని ఇదంతా చెప్పారు. అదే సమయంలో వేదవ్యాసుల వారు కూడా అడిగారు "మీరు చాలా కాలం కాశీలో ఉన్నారే! మీరు కాశీలో ఎలా గడిపేవారు? మీ ఉపాసనా మార్గం ఏమిటి? మీరు ఎవరి నుంచేదైనా ఉపదేశం పొందారా? మీరు ఎవరికైనా ఏదైనా చెప్పారా? కాలమంతా ఎట్లా గడిచింది?" అని అడిగితే అగస్త్యుల వారు పరమానందభరితమైనటువంటి ఒక మనసుతో ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ కాయంగా నానా సైకత వేదికలన్ నల్ దిక్కులన్ కాశీనాథున్ తరుణేందు శేఖరు శంభున్ శ్రీకంఠు నిన్ పాడెదన్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో ఏం లేదర్థం అర్ధరాత్రి కాశీ క్షేత్రమంతా కూడా చంద్రుడి యొక్క పూర్ణిమా మాలికలన్నీ వెన్నెల వెలుగులై వెలుగులు దారాలు దిగుతున్నటువంటి వేళ కాశీ క్షేత్రం వెన్నెల స్నానం వాడుతున్నటువంటి వేళ నేను నా భార్య లోపాముద్ర కలిసి నానా సైకత వేదికలన్ ఒక్కొక్క ఇసుక తిన్నె మీద కూర్చొని క్షణంలో సర్వ ప్రకృతి కూడా నిద్రాగతమై ఉన్నటువంటి వేళ గనుక నాలుగు వైపులా పరమేశ్వరుడిని కీర్తిస్తూ ఉంటే మా శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అంత పారవశ్యంతో ప్రేమాతిశయంతో మేము భగవత్ నామ సంకీర్తన చేశాం. ఎలా తెలుసును అంటే క్షణంలో గంగా నిస్తంద్ర మంద్రంగా ప్రవహిస్తున్నది. రకమైన అలజడి లేదు, ఆందోళన లేదు, ఉదృతి లేదు, ఆదృతి లేదు, గతి లేదు, ఏమీ లేదు. సన్నగా పారుతున్నటువంటి స్వచ్ఛ గంగాజలాలలో మా శరీరం మీద నిలబడినటువంటి వెంట్రుకలన్నీ కూడాదానిలో ప్రతిఫలించినాయి అంత ఆనందాన్ని పొందాం. మిన్ను మన్ను ఇటు గంగా అటు ఆకాశం అంతా ఒకటే "సర్వం ఖల్విదం బ్రహ్మ" అన్నటువంటి ఒక భావాన్ని మేమిద్దరం ఆనందంగా అనుభవించాము వ్యాసమహాముని అన్నారు అగస్త్యులవారు. ఇది ఆంధ్రదేశం చేసుకున్న పుణ్యం. ఇవాళ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఆంధ్రదేశంలో రామావతారం రాలే, రాముడు ఇక్కడ పూజింపబడ్డాడు. కృష్ణావతారము వింద్య పర్వతాలకు అవతలే వచ్చింది, కృష్ణుడు ఇక్కడ ఆరాధింపబడ్డాడు. కానీ సర్వదేవతా అతీతమైనటువంటి ఒక స్వరూపం మాత్రం ఆంధ్రదేశంలో ఏర్పడింది. ఇది జాతి చేసుకున్న అదృష్టం. పోయి పోయి ఎక్కడ అంటే ఆంధ్రదేశం అంచున ఇటు తమిళనాడు అటు కర్ణాటక కూడలి. ఎక్కడైతే త్రికూట స్థానం ఏదైతే ఉన్నదో పుట్టపర్తిలో స్వామి ఆగమించారు. ఆగమమంతా నిగమాగమంగా వచ్చారు. వేదము ఆయనే, వేదాంతము ఆయనే, వేదము ఆయనే, ఉపనిషత్తు ఆయనే, ఇతిహాసము ఆయనే, చరిత్ర ఆయనే, పురాణము ఆయనే, సర్వము ఆయనే. కనుక సర్వదేవతా అతీత స్వరూపమే కాక సర్వ శాస్త్రములకు మూలమైనటువంటి బ్రహ్మవిద్య ఏదైతే ఉన్నదో, ఆత్మవిద్య ఏదైతే ఉన్నదో అదే సత్యసాయి భగవానుడిగా సహకారం చెందింది. అందుకనే స్వామి ఎన్నడూ నేను దేవుడిని అని చెప్పలేదు. ఏమన్నారు? "అహం సత్యబోధకః" నేను సత్యాన్ని చెప్పటానికి వచ్చిన వాడిని అన్నారు. ఇది ప్రప్రథమ సందేశం. సత్యం ఏమిటో బోధించాలి, సత్య మార్గం ఏమిటో చెప్పాలి. సత్య మార్గంలో ఉంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనబడేటువంటి మిగిలినటువంటి చతుర్విధ పురుషార్థాలు కూడా సత్యాన్ని ఆశ్రయించి ఎట్లా ఉంటాయో చెప్పటానికి వచ్చాను. సతతము ఉండేదే సత్యమని, దేనికి మరణం లేదో, దేనికి పుట్టుక లేదో, దేనికి ఎదుగుదల లేదో, షడూర్మములతో, షడ్వికారములతో, షడ్విగ్దములతో ఏర్పడినటువంటి పాంచభౌతిక దేహంలో ఇవి ఏమీ లేనటువంటి ఒక సర్వాత్మ బిందువుగా, పూర్ణంగా, ధవళంగా, తరళంగా, సరళంగా, స్వచ్ఛంగా, అచ్ఛంగా, ఆత్మగా ఉన్నది అనేటువంటి భావన చెప్పటానికి వచ్చిన అవతారమే నేను అని స్వామి ప్రకటించారు. ఆయన ఎవరో సత్యబోధకః అని అనలేదు, స్వామి అన్నారు. అయితే స్వామి కంటే ముందు అనేక అవతారాలు వచ్చినాయి అని మనం చెప్పుకున్నాం. నిజానికి నారాయణావతారాలు ఇరవై రెండు. ఇరవై రెండులో ఇరవై ఒక్క అవతారాలు వచ్చేసినాయి. కళారూపాలుగా, అర్చావతారాలుగా, అంశావతారాలుగా, ప్రభావావతారాలుగా, ప్రసవావతారాలుగా, ఆవేశావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఎన్నెన్ని రకాలుగా భగవంతుడు రావచ్చునో అన్ని రకాలుగా ప్రపంచంలోకి వచ్చి, ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నిలబెట్టింది పరమేశ్వరుడి యొక్క తత్వమే. అయితే ఇరవై యొక్క అవతారాలలో ప్రధానంగా దశావతారాలను మనం చెప్పుకుంటాం. సనక సనందనాది మహర్షులు సైతం అవతారమూర్తులే. కానీ పది అవతారాలలో పూర్ణావతారాలు రెండే గాని నిర్ణయింపబడ్డాయి. ఒకటి రామ, రెండవది కృష్ణ. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు రెండు కూడా మానవ దేహాన్ని ధరించి రెండు different dynamics లో ఆవిష్కృతమైనటువంటి two dimensional అవతారాలు ఏదన్నా ఉన్నాయి అంటే అవి రాముడు, అవి కృష్ణుడు మాత్రమే. "రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు అంటే ఎవరు? కాసేపు చెప్పండి ఆయన గురించి అంటే రాముడు అంటే ధర్మమే. ధర్మాన్ని గురించి మాట్లాడితే రాముడి గురించి మాట్లాడినట్టే. రామాయణం అనుకున్నా, విన్నా, చదివినా, పాడినా ధర్మాన్ని గురించిన గుణగానం చేసినట్లే. మరి ధర్మానికి మూలం ఏమిటి? "వేదోఖిలో ధర్మమూలం" వేదం, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సనాతనమైనటువంటి వేదంలో నుంచే ధర్మం పుట్టింది గనుక వేదమూ, ధర్మమూ రెండూ భిన్నం కావు. వేదమే ధర్మమై, ధర్మమే రాముడై, రాముడే రమణీయమై, రమణీయమైనటువంటి, మనోజ్ఞమైనటువంటి పూర్ణ అవతారంగా వచ్చి మానవుడికి ఉత్తమోత్తమమైనటువంటి దివ్య జీవన విధానాన్ని ప్రపంచానికి తన జీవితం ద్వారా ప్రకటన చేసినటువంటి పరిపూర్ణ మానవతా మూర్తిగా శ్రీరామచంద్రుణ్ణి మనం కొలుస్తున్నాం. ఇప్పటికీ కొలుస్తున్నాం. అంతే కాదు తారకలు ఉండుదాకా, చంద్రుడు వెలుగునందాకా, సూర్యుడు ఉండునందాకా రామనామం వినపడుతూనే ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహా మహిమాన్వితమైనటువంటి ఆర్షధర్మ మూలకమైనటువంటి ధాతువే రామ శబ్దం కాబట్టి రాముడు ఉపదేశం చేశాడా? ఆదేశం ఇచ్చాడా? సందేశం ఇచ్చాడా? ప్రమాణం చేశాడా? ప్రతిజ్ఞ చేశాడా? ప్రజ్ఞా స్వరూపంగా వెలుగొందాడా? ప్రశ్నల అన్నింటికీ ఒక సమాధానం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం సందేశం కాబట్టి రాముడు ఒక ప్రమాణం మాత్రం చేశాడు. వాల్మీకి రామాయణం అంతా మనం చాలా స్పష్టంగా చదివినా, విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని మనం అవగాహన చేసుకోగలిగినా రెండు విషయాలు తెలుస్తాయి. రామ ప్రతిజ్ఞ ఒక్కటే. ఎవరు ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళని రక్షించటం నా బాధ్యత, ఇది మొదటిది. ఎవరు అధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళని శిక్షించడం కూడా నా పనేనన్నాడు. కాబట్టి రక్ష, శిక్ష రెండూ కలబోసుకున్నటువంటిది రామావతారం. రాముడి యొక్క కాంతార వాసాన్ని గనక గమనించినట్లయితే కానన వాసం అంతా కూడా పడుగు పేకలుగా సాగుతుంది. రోజున తాటక సంహారం అయింది, మరనాడు ఒక ఆశ్రమాన్ని దర్శిస్తాడు.ఇవాళ ఒక మహర్షిని దర్శనం చేశాడు, మర్నాడు రాక్షసుడ్ని సంహారం చేస్తాడు. మానవ జీవితం కూడా పడుగు పేకలే. ఒకటి నిలువు పోగు, రెండవది అడ్డం పోగు. నిలువు పోగు, రెండు పో-- రెండు అడ్డం పోగు కలవకపోతే వస్త్రం ఏర్పడదు గనుక, ఇది ఆధార వస్త్రంగా ఉన్నది గనుక జీవితమంతా కలబోసుకున్నటువంటి ఒక entwined విధానమే రాముడి యొక్క తత్వం. అంతే కాదు, మానవ జీవితం ప్రకృతి ఎట్లాగైతే ఆరు రుతువులుగా సాగుతుందో, రాముడి కథ కూడా షట్కాండమయం, ఆరు కాండలు. ఆరు కాండలు బాలకాండతో ప్రారంభమై చివరి వరకు సాగుతుంటుంది. అట్లాగే మనం కూడా బాల్య, కౌమార, యవ్వన, మధ్య, వానప్రస్థ, వృద్ధాప్య, వానప్రస్థ. ఆరు దశలుగా సాగుతుంది. నిజానికి మనక్కూడా సాధన గనక చేసుకోగలిగినట్లయితే ఆరు పదహారులు తొంబై ఆరు బతికినట్టే లెక్క. అయితే కళా విశేషాన్ని, కళా భావనని, కళా తత్పరతని ఒక వెలుగుగా గనక మనం మార్చుకోగలిగినట్లయితే అది పూర్ణ మానసమైనటువంటి ఒక స్థితిగా మనకి అనుభవంలోకి వస్తుంది. రాముడే ఇట్లా పడుగు పేకలుగా సాగుతూ సాగుతూ వెళ్ళి ఉత్థాన పతనాలు, ఎత్తు పల్లం, చీకటి వెలుగు, పగలు రాత్రి, జయం అపజయం, ఆశా నిరాశా, ఇవన్నీ కూడా జనన మరణాలు, ఇవన్నీ కలిపి ద్వైతాద్వైత మార్గంలో సాగేదే పరమాత్మ రామాయణం యొక్క విశిష్టత. మానవుడు తన జీవితాన్ని కూడా రామాయణంగా రాముడు ఎలా మార్చుకున్నాడో మనం కూడా మన అయనము అంటే ప్రయాణం. అయనాన్ని మన నయనంతో దర్శనం చేసుకోవాలి. నయనము అంటే కన్ను. అంతర్దృష్టిని అలవాటు చేసుకోవాలి. మార్గంలో వెళితే మనం పరమాత్మని అనుభవించగలమనేటువంటి ఒక నిర్దుష్టమైన, నిర్దిష్టమైన, నిశ్చితమైన, మనీషాయుక్తమైనటువంటి చిత్తంతో మనం గనుక రామాయణాన్ని చదివినా, రామ శబ్దాన్ని విన్నా, రాముడి యొక్క రూపాన్ని ఉపాసన చేసినా, రాముడి యొక్క గుణగాన సంకీర్తనం చేసినా అది మనకి తత్వోపదేశంగా ఉంటుంది. అదే రాముడి జీవితంలో మనకి అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశ విధానం. అంటే రాముడు ఏతావాతా ఏం చెప్పాడయ్యా అంటే, రాముడి కంటే రామ బాణం గొప్పది, రామ బాణం కంటే రామ నామం గొప్పది, రామ నామం కంటే రామ భావన గొప్పది అన్నాడు. ఎట్లాగ అంటే సర్వశక్తులు దేనియందు ఇమిడి ఉన్నాయో వాటిని గనక ఆశ్రయించినట్లయితే అవి మన శక్తులైతాయి. ఎట్లా? ఇనప రజను ఒక అయస్కాంత క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఇదంతా అయస్కాంత క్షేత్ర లక్షణాలని ఎట్లాగైతే పుణికి పుచ్చుకుని తానూ ఒకరోజున అయస్కాంతం కాగలుగుతున్నదో, భ్రమర కీటక న్యాయ విశేషం చేత ఒక పురుగు తుమ్మెద జంకారంలో నుంచి తాను తుమ్మెద ఎట్లా అవుతున్నదో, భక్తుడు కర్మ భక్తి జ్ఞాన యోగ మార్గాలలో పయనించి పయనించి జీవితాన్ని సాధనా యోగంగా, సాధనా మార్గంగా, సాధనా రీతిగా, సాధనా దృక్పథంగా, సాధనా శైలిగా గనక మార్చుకోగలిగినట్లయితే ఆతని జీవితం కూడా భగవత్ తత్వానికి దగ్గరవుతుంది. అందుకనే సత్య సాయి భగవానుడి కంటే ముందు వచ్చిన అవతారాలన్నీ భగవంతుడు ఎలా ఉన్నాడో చెప్పినయి, మానవుడు భగవంతుడు ఎలా కావాలో చెప్పినయి. సత్య సాయి భగవానుడు అసలు మానవుడు భగవంతుడు కావటం ఏమిటి? మానవుడు భగవంతుడే. ఎరగగలిగితే అది. ఎరుకలోకి వెళ్ళటానికి ప్రయత్నం అంతా చేయాలి. ధ్యానము, తపస్సు, స్వాధ్యాయము, సద్గోష్టి, సదాచారము, సమ్యక్ సంకీర్తన, సత్సంగము, సత్సాంగత్యము, ఇవన్నీ కూడా సాధనా మార్గాలు. అతి సులువైన మార్గాలు. ఒక్కడుగా చేసుకునేవి కాదు, సామూహికంగా చేసుకునేవి. ఒక్కడుగా చేసుకుంటే అది సోమ యాగం. నలుగురం కలిసి చేస్తే అది సత్ర యాగం. సత్ర యాగ ఫలం ఎవరికి అందుతుందంటే అందుకోవలసిన వారందరికీ సమానంగా అందుతుంది గనుక శ్రీమద్రామాయణ పురాణ పురుషుడైనటువంటి రాముడు, రాముడి యొక్క జీవితము, రాముడి యొక్క అవతారము మనకి అన్యాపదేశంగా ఒక సందేశాన్నిస్తుంది. నువ్వు ధర్మాన్ని ఆశ్రయించు, అంతే. ఇంకేం లేదు. జీవితం నీకు ఎట్లా ఏర్పడితే దాన్ని అట్లా అనుభవించు. జీవితాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేయకు. నీ జీవితం నువ్ ఇక్కడికి వచ్చిన నాడే నిర్మాణం చేయబడి ఉంది. అంతా నిర్ణయింపబడి ఉన్నది. ఏది ఎప్పుడు ఎట్లా క్షణాన జరగవలసి ఉన్నదో మనం ఇవ్వాళ అంటున్నామే, it is already programmed. దాన్ని alter చేయగలిగిన శక్తి మనకు లేదు గనుక శక్తి లేని వాడు ఏం చేస్తాడు? శరణాగతి చెందాలి, సమర్పణ చేసుకోవాలి, వినయంగా ఉండాలి, కాలానికి తలవొగ్గాలి. రాముడి జీవితం అంతా కూడా విధి ఎట్లా ఆడిస్తే నేను అట్లా నడుస్తానన్నాడు వశిష్ఠుల వారితో, యోగ వశిష్ఠంలో. రామా, ఎందుకు నీకింత మనో వైక్లభ్యం ఏర్పడింది అని వశిష్ఠులవారు అడిగితే, ఏమున్నది ప్రపంచం అంతా దుఃఖారామమే కదా అన్నాడు రాముడు. మాట అన్నప్పుడు ఆయన వయస్సు ఎనిమిది ఏళ్ళు. ముప్పై ఆరు వేల కీర్తనలతో శ్లోకాలలో యోగవాసిష్ఠం అంటే వశిష్ఠ రామ సంవాదంగా ప్రపంచంలో ఇవ్వాళ మనకి అందుబాటులో ఉన్నది. అదంతా మనోవిజ్ఞాన శాస్త్రము, అది ఒక అపూర్వమైన జ్ఞాన భాండాగారం అది.
SSSMC · audio

Sandesame Adesam - 01

Home

Sandesame Adesam - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:55

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

    Now playing
  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11