No transcript for this section.
[సందేశమి ఆదేశం] సందేశమి ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధాలపై శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి విశ్లేషణ ఈ ప్రేమ ఇవాళ ప్రపంచాన్ని గనక చూసినట్లయితే మన దేశమే కాదు మన ప్రాంతమే కాదు మన కుటుంబాలే కాదు మన ఇల్లే కాదు దెంతో సఫర్ అవుతున్నది. అన్నీ ఉన్నాయి ప్రాపంచికమైన భౌతిక అవసరాలు తీర్చగలిగిన పరికరాలన్నీ వ్యాపారరంగంలో మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు మన ఇంట్లో లేకుండా ఏం లేదు చిన్నో చితకో ఉండనే ఉంది. కానీ లేనిదల్లా ఏమిటి అంటే ఆనందం లేదు, శాంతి లేదు కారణం ఏమిటి? ఇన్ని ఉండి ఆనందం కలగాలి కదా! ఇంత సంపద ఉండి ఆనందం అనుభవంలోకి రావాలి కదా! ఇన్ని ఉండి, ఇంత ఉండి, భక్తి ఉండి, దైవం ఉన్నాడనుకొని ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టి అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసి కూడా ఆనందాన్ని ఎందుకని పొందలేకపోతున్నాడు? ఈ మౌలికమైనటువంటి ప్రశ్నను గనక మనం తడమగలిగితే సమాధానం దాంట్లోనే ఉంది. ప్రేమ రాహిత్యం. అనురాగం దండిగా ఉంది, రాగము నిండుగా ఉంది, ప్రేమ మాత్రం నిండుకొని ఉన్నది. ఏమీ లేదు. అన్నీ అవసరాలే, అన్నీ అవకాశాలే, అన్నీ సందర్భాలే, అన్నీ సన్నివేశాలే. కాబట్టి ప్రేమ యొక్క స్వరూపం ఏమిటి? విచారణ చేసినట్లయితే, ఏ కృష్ణుణ్ణి మనం ఒక ఆదర్శంగా ప్రేమమూర్తిగా మనం స్వీకరిస్తామో ఆ కృష్ణుణ్ణి అందరూ ప్రేమించారు అని మనం వింటాం. భాగవతం చదివితే కృష్ణుణ్ణి ఎంతగా ద్వేషించారో అంతగా ప్రేమించిన వాళ్ళున్నారు. అందుకనే జీవితాన్ని కృష్ణ సంగీతం అన్నారు. దీనిలో ఉదాత్త అనుదాత్త స్థాయిలు రెండూ ఉండనే ఉన్నాయి. చీకటి వెలుగులు ఉండనే ఉన్నాయి, ఎత్తు పల్లాలు ఉన్నాయి, జయాపజయాలున్నాయి, జనన మరణాలున్నాయి, ఆశ నిరాశలున్నాయి, పగలు రాత్రులున్నాయి, చీకటి వెలుగులున్నాయి. ఇదంతా ద్వంద్వ భూమికగా, ద్వైత భూమికగా మనకు అనుభవంలోకి వస్తున్నది. కానీ ఆనందం అనుభవంలోకి ఎందుకని రావటం లేదు? అంటే ఆ ప్రేమ అనబడేటువంటి ఒక విషయాన్ని నుంచి మనం వైదొలగాలి. రాగ అనురాగ బంధాల చట్రంలో ఇరుక్కుపోయిన జీవుడు ప్రేమని కేవలం ఒక కామనగా, ఒక లౌకిక భౌతికమైనటువంటి అవసరంగా, కేవలం ఒక అవకాశవాదంగా తీర్చుకున్న కారణంగానే జాతుల మధ్య వైరాలు ప్రేమరాహిత్యం వల్లనే వచ్చినయి. ఇప్పుడు ధర్మగ్లాని జరిగిందన్నమాట. ఈ ధర్మగ్లాని జరిగినప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మని అమితంగా ప్రేమించినటువంటి గోపికా బృందం అంతా ఉన్నది, వ్రజకాంతలంతా ఉన్నారు. కాస్త వెనక్కి వెళితే త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తిని అమితంగా ఆరాధించినటువంటి అశేష వానర సమూహం ఉన్నది. వారంతా రాముడి యొక్క దర్శనం చేసుకున్నారేమో కానీ స్పర్శన, సంభాషణ, అనుభూతులు పొందలేదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వ్రజభూమి నుంచి దూరమైన తర్వాత ఏ వేణునాదంతో వారందరినీ కూడా ఒక తన్మయ స్థితిలోకి, ఒక ట్రాన్స్ లోకి, ఒక స్టేట్ ఆఫ్ ఎక్సల్టేషన్ లోకి తీసుకుని వెళ్ళాడో అక్కడే నిలకడ చెంది మళ్ళీ సగుణంగా, స్వరూపంగా, స్వభావంగా కృష్ణ దేహాన్ని చూద్దామనుకునే లోగా శ్రీకృష్ణ మహాపరినిర్వాణము అయిపోయింది. కాబట్టి ఇటు త్రేతాయుగంలో అటు ద్వాపర యుగంలో ఎవరైతే ఇంకా భగవంతుని యొక్క స్పర్శని, భగవంతుని యొక్క వాక్ శమత్కృతిని, వాక్కులో నిండినటువంటి అమృతాన్ని గొలవలేదో, అనుభవంలోకి తెచ్చుకోలేదో వారందరూ ఏం కావాలి అని వారందరూ మరి జన్మలు ఎత్తుతూనే ఉంటారే. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న తాత్విక విచారణ. అరవింద యోగిని ఒక మాట అడిగారు. "అయ్యా! అనేకమైనటువంటి జన్మలు ఎత్తి ఎత్తి మహోత్కృష్టమైన మానవ జన్మ ఎత్తాం కదా, ఈ మానవ జన్మ ఎత్తాం గానీ అన్నీ మంచి పనులే చేయలేదు కదా, కొన్ని చెడ్డ పనులు కూడా చేశాం కదా, మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టాక ఎటువంటి జన్మ వస్తుంది?" అంటే పురాణాల్లో అనేక కథల్లో మనకి హరికథకులంతా చెప్తూ ఉంటారు కదా, "ఇగో! నువ్వు ఈ పని చేస్తే అదై పుడతావు, ఈ పని చేస్తే ఇదై పుడతావు" అంటే అరవిందుల వారు ఏమన్నారంటే, మళ్ళీ సృష్టి గాని ఎవల్యూషన్ గాని ఇది పరిణామవాదమే తప్ప అపరిణామ వాదం కాదు. పరిణామం అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది, ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది. ఆ ఎవల్యూషన్ లో భాగంగా ఇవాళ నువ్వొక మానసికమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన జన్మ ఎత్తి మానవుడిగా వచ్చాక ఇక్కడ నీవు మంచి చేశావా చెడు చేశావా కాదు మళ్ళీ జన్మ మానవ జన్మే ఎత్తుతావు తప్ప మళ్ళీ జంతు జన్మ ఎత్తవు అని ఆయన ఒక స్పష్టీకరణ చేశారు. అది ఆయన యోగ భూమికలో ఆయన పొందిన అనుభవం కావచ్చు, అది ఆయన దర్శనం కావచ్చు. దాన్ని ఇతమిద్ధమని ముద్ర వేసుకుని అవును అని అనుకోవటానికి లేదు, కాదని అనుకోవటానికి లేదు గాని, కానీ ఒక చిన్న ఆశ కలుగుతుంది. మనం మళ్ళీ జంతువుగా పుట్టం కదా అనేటువంటి ఒక భద్రత కలిగించేటువంటి మాట. సరే, ఏ జన్మ ఎత్తనివ్వండి వాళ్ళంతా జన్మ గనుక ఎత్తితే ఎందుకు ఎత్తుతారు అంటే మళ్ళీ మానవ జన్మే పునః పునః అంటే పునరపి జననం, పునరపి మరణం. పునరపి జననం అంటే పునః మళ్ళీ పుడుతున్నావు పునః మళ్ళీ పోతున్నావు. ఈ పుట్టటం పోవటం ఎంత కాలము? ఎన్నేళ్ళు? ఎన్ని యుగాలు? అంటే, నీవు ఆ తత్వమసి అనేటువంటి స్థాయికి నీవు చేరుకునే దాకా నీవు ఇటువంటి జన్మలు ఎత్తుతూనే ఉంటావు అనేది శంకర భగవత్పాదుల యొక్క భాష్యం కూడా. కనుకఇవాళ కలియుగం ప్రారంభమై ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల సంవత్సరాలు లెక్క తేల్చారు. దాని ప్రకారంగా ఇంకా నాలుగు లక్షల పదిహేడు వేల సంవత్సరాలు ఇది ఉంటుంది. 2012 లో పోతుంది అన్నారు. పన్నెండు పోయిందేమో గానీ, ప్రపంచం అట్లాగే ఉంది. మళ్ళీ కొత్తగా కాస్త వ్యాపారం చేసుకునే వాళ్ళు 2020 దాకా మళ్ళీ వచ్చి ఆ ప్రళయం వచ్చేస్తుంది అంటున్నారు. రానివ్వండి. ఏం చేయగలం? ఆపగలమా? అరచేత్తో అడ్డుకోగలమా? సహజ పరిణామంగా జరిగేటువంటి వాటిని గురించి వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, నిరర్థకమైనటువంటి భావనలతో మనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కాలాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఏది ఎట్లా రానీ, ఏది ఎట్లా పోనీ, let us accept life as it comes. జీవన నిర్మాణాన్ని మనం ఏం చేయవలసిన పని లేదు. మనం చేసినా అది జరగదు. అలాగే మనం అనుకున్నట్లే గనక జరిగితే దాని జీవితం ఎందుకు? మనం అనుకున్నట్లు రేపు పొద్దున అయిపోతుంది అంటే కాకపోవటమే జీవితం. అయిపోతే జీవితం ఎలా అవుతుంది? కాబట్టి వైరాగ్య-వివేక-విజ్ఞాన భూమికలో గనక జీవుడు సతతము ఉన్నట్లయితే ఆ ప్రేమ భావనలోకి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. ఈ రాగ-అనురాగ బంధాలు దాటి ప్రేమరాహిత్యం ఉన్నదని ఇవాళ మనం అనుకున్నాం కదా! బహుశా ధర్మగ్లాని జరిగిన కారణంగానే ఈ కలియుగం అంతా కూడా నారాయణ అవతారాలకు అతీతమూ, మూలమూ అయినటువంటి దత్త అవతారమే ప్రధాన భూమికగా ఇప్పుడు వచ్చిందని మనం భావన చేయాలి. It is only by a calculation. It is only by intuition. ఎందుకని అంటే, ఇరవై యొక్క అవతారాలు అయిపోయినయి, కలియుగం అంతం అయ్యేటప్పుడే కలికి వస్తాడు గుర్రం ఎక్కి. అప్పటిదాకా ఎవడు రాడు మరి. మరి వచ్చిన వారిని మనం పరిపూర్ణావతారం అంటున్నాం, మహాపరిపూర్ణావతారం అంటున్నాం. కలియుగకే అవతారుహు అని మనం స్వామిని పాడుతున్నాం. ఏమిటిది? ఇది అవతారం అవునా కాదా అంటే స్వామి ఒక సమాధానం చెప్పారు. అవతారము అని గనక అనుకున్నట్లయితే అది ఒక కల్పాంతము వరకే ఉంటుంది. కల్పాంతము దాటి ఏవైతే మిగులుతాయో అవి అవతారాలు అవుతాయి, నువ్వు ఏదన్నా భావన చేసుకో. రాముడు అవతారం. ఎందుకంటే కల్పాంతాలు, యుగాంతాలు అయిపోయినాయి. కృష్ణుడు అవతారం. ఇప్పటికి కూడా. సనక సనందనాది మహామునులంతా కూడా అంశావతారాలుగా వచ్చినయి. కొన్ని కళావతారాలుగా వచ్చినయి. కొన్ని అర్చావతారాలుగా వచ్చినయి. కొన్ని అనుప్రవేశావతారాలుగా వచ్చినయి. కొన్ని ఆవేశావతారాలుగా వచ్చినయి. కొన్ని ప్రసవావతారాలుగా వచ్చినయి. మరికొన్ని ప్రభవావతారాలుగా వచ్చినయి. స్వయంభువుగా వెలసినయి అన్నాం. ఆశ్చర్యం ఏం లేదు. అలా వెలుస్తాయి. child prodigy అన్నాం. ఈయన ఎక్కడా చదువుకోలేదే, ఈమె ఎక్కడా చదువుకోలేదే, ఈమె ఇవన్నీ ఎలా చెప్తోంది అని ఆమెను అవతారము, ఆయనను అవతారము అనటానికి వీల్లేదు. ఎందుకంటే అవతారము అనగానే ఒక కల్పాంతం వరకే మనమే పరిమితం చేస్తున్నట్లు లెక్క. ఈ అవతారాన్ని దాటి ఇంకేదన్నా ఉన్నదా అంటే, ఈ అవతారం యొక్క మహోన్నతమైనటువంటి చరమ స్థితి చిచ్ఛక్తి అన్నారు. ఈ చిచ్ఛక్తి అంటే చిత్ అంటే existence. శక్తి అంటే energy. ఏ energy exist అయి కనబడుతూ ఉన్నదో అది ఎంతవరకు ఉంటుంది? యుగాలు ఉన్నంత వరకు అది ఉంటుంది గనుక చిచ్ఛక్తి స్వరూపమైనటువంటి ఈ మహదవతార భూమికలో అవతారం అంటే ఒక అభివ్యక్తి ఇప్పుడు ఇట్లా కనబడ్డది, అంతే. దీనికి ముందున్నది అదే, దీని తర్వాత ఉండబోతున్నది కూడా అదే గనుక సత్యసాయి భగవానుడిని కూడా మనం దగ్గరగా చూసిన వాళ్ళం కనుక భక్తులైన వారికి, కాని వారికి, ప్రపంచానికి ఆయన ఏం చేశారు, ప్రపంచానికి ఆయన ఏం బోధ చేశారు కాస్త విచారణగా, లోతుగా గనక చేసినట్లయితే, తాత్వికమైనటువంటి చింతనా భూమికలో నిలకడ చెందగలిగినట్లయితే సర్వ వేదముల యొక్క సారాన్ని, సర్వోపనిషత్తుల యొక్క సారాన్ని, సర్వ ధర్మాల యొక్క మూలాన్ని, మానవకోటి, ప్రాణికోటి అంతా కూడా పరస్పరము అందించుకోవలసినటువంటి ఒక ప్రేమానుభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అది భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి ఈ మూడు స్థితులలో కూడా చాలా ప్రబలంగా ప్రకటన అయినటువంటి ఒక మహత్తర సన్నివేశం ఇది. శ్రీరామచంద్రుడు ప్రేమ స్వరూపుడు. ఆయన్ని ధర్మ స్వరూపుడు అంటాం మనం. స్వామి ఆయన్ని సత్య ధర్మ పరాక్రముడు అన్నారు. ఆయన కేవలం ధర్మమే కాదు, సత్యము కూడా ఆయనేనన్నారు స్వామి. సత్యమూ, ధర్మమూ కలబోసుకుంటే వాడి పేరు రాముడు. అలా భావన చేయండి అన్నారు. ఎందుకంటే, ఏ సత్యము తానై ఉన్నాడో తనకు ఎరుకలో ఉండి కూడా తాను వచ్చినటువంటి కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై వచ్చిన ఒక అవతార భూమికని తాను సంతరించుకొని దానిలో, ఆ ఆవృత్తంలోనే, ఆ పరిధిలోనే మాయామానుష వేషంగా ఆయన సంచారం చేశాడు. రాముడు ఎవరిని ప్రేమించాడు? ప్రత్యేకంగా ప్రేమ స్వరూపం అన్నాం రాముడిని కూడా. రాముడు, ఆ శబ్దంలోనే రమయతి ఇతి రామః. రామ అనగానే ఒక ప్రేమ కలుగుతుంది. రామ అంటే గాయత్రీ మహా మంత్రానికి మూలమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియే రామ శబ్దం. ఆ రామ, ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నాం. మీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు మనల్ని. పైకి ఎన్ని పేర్లు, ఎవరెవరి పేర్లు చెప్పినా సత్యం ఏమిటంటే మనమంటే మనకు చాలా ఇష్టం. అదే సత్యం. కనుకనే అద్దం దగ్గరికే కాళ్ళు వెళుతూ ఉంటాయి. గంట క్రితంకి ఓ గంటలో మార్పులేం ఉండవు. కానీ మనల్ని మనం చూసుకోవటంలో మనకు ఆనందం ఉన్నది. మన ప్రజ్ఞను మనం తడుముకోవటంలో మనకొక ఆనందం ఉన్నది. మనల్ని మనం ప్రేమించుకోవటంలో ఒక భద్రత ఉన్నది. మనల్ని మనం ప్రేమించుకునేటువంటి ఈ శక్తి మనకు ఎరుకలోకి వచ్చిన తర్వాతఅందరినీ ప్రేమించగలిగినటువంటి శక్తి రావాలి కదా! వస్తే కదా వాడు భగవంతుడైనే అయ్యేది. రామ, భరత, లక్ష్మణ, శతృఘ్న నాలుగు వేదాలు నాలుగు పాయలై, నాలుగు రూపాలై, నాలుగు సాకారాలై, నాలుగు గుణాలై ఒకే దశరథుడి ఇంట వారు వచ్చినప్పటికీ కూడా ఈ నలుగురూ నలుగురిలో ఒక్క రాముడే దైవమైనాడు. మరి మిగతా ముగ్గురు దైవం కాదా అది? ఆ దైవమే ఈ మూడు శక్తులను తన వెంట తెచ్చుకున్నది. శ్రద్ధగా, భక్తిగా, జ్ఞానంగా తన వెంట తెచ్చుకుని ఈ రాముడు ఎవరిని ప్రేమించాడు అంటే సర్వ హృదయా రామాలలో ఆరాముడై ఉన్నాడు. హృదయాన్ని ప్రేమించాడు, మానవ జాతిని ప్రేమించాడు, పశుపక్షాదులను ప్రేమించాడు. తాను సంహారం చేయబోతున్నటువంటి రాక్షస సమూహాన్ని సంహారం చేసిన మరుక్షణం అన్నాడు, "ఎందుకా నేను ఈ జన్మ ఎత్తింది? క్షత్రియ వంశంలో నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది. అందరినీ నేను ఇలా సంహారం చేస్తూ వెళుతున్నానే ఏమి ఆనందం నాకు మిగులుతున్నది?" అన్నాడు. ఇది ప్రేమ స్వరూపంలో ఒక పార్శ్వం. ప్రేమ ఇంకొకరిని బాధించదు, ప్రేమ ఇంకొకరిని శోధించదు, ప్రేమ ఇంకొకరిని వేధించదు. ప్రేమ ఒకరిని నమ్ముతుంది. ఆ నమ్మకం Faith deepens practice, practice accelerates faith. ఈ faith and practice ఎక్కడ నుంచి పుడతాయి అంటే ప్రేమ అనేవ్వడేటువంటి రెండు అక్షరాలలో నుంచి, రెండు భూమికలలో నుంచి ఒక్కసారి ఉత్పన్నమై మానవ జాతిని స్వస్థానం వైపు నడిపించాలి. కనుకనే రాముడు సీతాన్వేషణకి ఎంచుకున్నది నరుణ్ణి కాదు వానరుణ్ణి. వానర సమూహం అంతా తన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేళ శ్రీరామచంద్రుడు తన దివ్య పాదం దగ్గర ఉన్నటువంటి ఒక ఉడత మోయగలిగినంత ఇసుకను మోసి పోస్తూ ఉంటే ప్రేమాస్పదుడైనటువంటి రాముడు అరచేతిలోకి తీసుకున్నాడు. భగవంతుని యొక్క దివ్య ప్రేమకి అది గొప్ప సంకేతం. అలాగే విభీషణుడు లంక నుంచి వచ్చి "నీ ఆశ్రయం నాకు కావాలి" అన్నప్పుడు ముందు వెనకలు చూడకుండా అభయమిచ్చాడు. జాంబవంతుడు, అంగదుడు తదాది కాగలిగినటువంటి వృద్ధ వానరులంతరూ అందరూ కూడా "విభీషణుడు శత్రు శిబిరం నుంచి వచ్చినటువంటి వాడు రామా! నీవు నమ్మవద్దు" అన్నారు. "ప్రేమతో వచ్చిన వాడిని కాదని ఎలా అనగలను" అన్నాడాయన. ప్రేమతో వచ్చాడు అని అందరికీ తెలియలేదు ఆయనకు ఒక్కడికే తెలిసింది. ఎలా తెలిసింది అంటే ఎవడు ప్రేమ స్వరూపుడో వాడు ఈ ప్రపంచాన్ని ప్రేమించగలడు. ఎవరు ఈ సర్వ ప్రపంచాన్ని ప్రేమించగలడో వాడు మాత్రమే సర్వ ప్రపంచం చేత ప్రేమించబడతాడు. ఆ ప్రేమలో ఒక చిన్న తూకం ఒక చిన్న మెత్తు తేడా ఉన్నా ప్రపంచం వాణ్ని దరిచేరదు. మళ్ళీ ఇంకాస్త ముందుకి వెనక్కి వెళ్ళినట్లయితే రావణ బ్రహ్మ క్షతగాత్రుడయినాడు యుద్ధంలో. లక్ష్మణ స్వామి రాముడితో ఏకాంత వాసంలో రెండు ప్రశ్నలు సంధించాడు. "అన్నగారు! ఈ రావణ బ్రహ్మకి ఇంత తేజస్సు ఏమిటి? నిజానికి మీతో సమానమైన తేజస్సుతో వెలిగి పోతున్నాడే! అయినా వీడిలో ఈ దౌష్ట్యం ఎందుకున్నది? ఈ రాజ్యాన్ని తామసంగా ఎందుకు పాలిస్తున్నాడు? దీని వెనుక ఉన్న రాజధర్మం ఏమిటి?" అని అడిగితే రాముడు అన్నాడు, "దేవో భూత్వా దేవం యజేత్" దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు దేవుడంతటి వాడివి కావాలి. కాకపోతే పైపైన అన్నీ చెప్పగలం తప్ప ఆ ఈ దివ్యత్వం ఇది ఇతమిద్ధమని చెప్పాలి అంటే వీడు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే అటువంటి వాడి దగ్గరకు వెళ్ళాలి. లక్ష్మణ స్వామిని రామస్వామి రావణ దర్శనం చేయమన్నాడు. "రావణ దర్శనమా? రావణుణ్ణి నేను చూడ్డమా?" అన్నాడు బుసబుసలు స్వామి. ఆదిశేషుడు కదా! వెళ్ళవలసిందే. రాజనీతి రెండు రకాలుగా ఉంటుంది. రాజ్యం ఎలా ఏలాలో కొందరి నుంచి నేర్చుకోవాలి, రాజ్యం ఎలా ఏలకూడదో రెండో వర్గం నుంచి నేర్చుకోవాలి. కనుక నీవు రాజ్యం ఎలా ఏలకూడదో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే నువ్వు రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. రావణుణ్ణి రాముడు ప్రేమించాడు. ఆశ్చర్యం ఏమిటంటే వాల్మీకి రామాయణం కానీ, శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు గానీ రావణ బ్రహ్మకి అత్యంత ఇష్టమైనటువంటి వాడు ఎవడు అంటే రాముడే. ఆ రాముడు రామదర్శనం కావాలి అని కైకసి అడిగినప్పుడు రాముడి ప్రాణాన్ని గనక తీసుకొని వచ్చేస్తే రాముడు ఆ ప్రాణం కోసం వెనక్కి వస్తాడు. రామ ప్రాణం ఏది అంటే దేహధారి అయినటువంటి రాముడికి ప్రాణము సీత, దేహధారిణి అయినటువంటి సీతకు ప్రాణమును రాముడు. కనుక ఈ అభేదమైనటువంటి అద్వైత స్థితిలో సీతారాములు ఇద్దరూ ఒక్కటే. ఈయనని దేహంగా చూశావా ప్రాణం సీత, ఆమెని దేహంగా చూశామా ప్రాణము రాముడు. కనుక ఏ సీత అనబడేటువంటి ప్రాణాన్ని గనక దగ్గర చేర్చుకొని ఉంచినట్లయితే ఆ ప్రాణాన్ని వెతుక్కుంటూ కేశవుడు నా వాకిట్లోకొస్తాడు. నేను పరమ శిష్ట వైశ శైవ ఆచార పరుణ్ణి నేను, వీరశైవుణ్ణి. ఈ వీరశైవము ఆ వైష్ణవము రెండూ ఒకటి కావాలి. కనుకనే శివ ధనుర్భంగం అయినటువంటి వేళ పరశురాముడు వచ్చి విష్ణు ధనుస్సును కూడా రాముడికి ఇచ్చి పూర్ణం చేశాడు. కనుక శివ కేశవాద్వైత స్థితి భారతీయమైనది గనుక మతపరమైనటువంటి స్పర్ధ లేకపోతే మానవుడు ప్రేమమయుడుగా ఉంటాడు. ఇది ప్రేమకు ఒక మూలం. అలాగే శ్రీరామచంద్రుడు సీతమ్మవారిని ప్రేమించారు అని చెప్పటం అది అంత అవసరం లేదు. ఆమెనికి తప్ప ఎవరిని ప్రేమించారు అని అనుకున్న వాళ్ళం ఎంతో మందిని ప్రేమిస్తూ వెళ్ళాడు శబరిని ప్రేమించాడు. శబరి, శబరి అనేటువంటి ఆమె జీవన చరమాంకంలో ఉన్నది. మాతంగ మహర్షి ఆమె దగ్గరకు వచ్చాడు. "శబరి!"శ్రీరామ దర్శనం నీకు కాబోతున్నది శ్రీరామచంద్రుడు నీ వాకిట్లోకి రాబోతున్నాడు ఆయనని సేవించి ధన్యవుకా పూర్ణ ముక్తిని నీవు సాధించుకో అని అంటే అప్పటి వరకు సేవించిందే తప్ప మతంగ మహాముని దర్శనమే చేయనటువంటి శబరి మరి రాముడు వస్తున్నాడు అంటున్నారే రామ దర్శనం నాకు అవుతుంది అంటున్నారే గురుదేవా మరి మీరు రామ దర్శనం చేసుకోరా అని అడిగింది ఒక గిరిజన స్త్రీ అడిగితే మతంగ మహాముని అన్నాడు నా కాలం తీరిపోయింది స్వర్ణరథం ఇప్పటికే బయలుదేరింది నేను నా లోకానికి వెళ్ళాలి ఈ కాలంలో ఈ సమయంలో ఈ జన్మలో నాకు రామదర్శనం లేదు రాముడు రాముడిని నువ్వు చూడటం కాదు నిన్ను చూడటానికి రాముడు వస్తున్నాడు నీవు నీ గురువుకు చేసినటువంటి సేవకి ఇది ప్రతిఫలం ఎటువంటి ప్రేమని అనుభవించబోతున్నావు అంటే రామ ప్రేమను అనుభవించబోతున్నావు రాముడు వచ్చాడు ఆ కథ అంతా మనకు తెలుసు కానీ రాముడు ఒక్క ప్రశ్న వేశాడు ఎందుకు తెచ్చావు ఈ పళ్ళు ఎందుకు తెచ్చావు ఈ పూలు కళ్ళే కనపడట్లేదే నన్నేం చూస్తావ్ చూట్టానికి ఏముందని చూస్తావ్ అని కాస్త తికమకగా అడిగితే చేతులు నికి పూని పూలు తెచ్చితిని స్వామి సతనువగుటను పండ్లు తెచ్చితిని స్వామి ఎంత స్ఫూర్తి చూడండి ఇంకా చేతులు ఆడుతున్నాయి కదా పరమాత్మ రామా ఇంకా ఈ చేతులు పని చేస్తున్నాయి కదా అందుకని నీకోసం పూలు కోసుకుని వచ్చా కర్మయోగం నుంచి భక్తి యోగంలోకి భక్తి యోగంలో నుంచి జ్ఞాన యోగంలోకి ప్రస్థానం చేయటమంటూ లేదు కర్మ భక్తి జ్ఞాన అనబడేటువంటి ఈ మూడు యోగాలు కూడా మూడు స్థితులే అది యోగ త్రివేణి ఆ యోగ త్రివేణిలో శబరి సాధించుకున్నటువంటి ఈ కర్మ యోగం నుంచి శ్రీరాముడి యొక్క దర్శనంతో భక్తి పెల్లుబికి జ్ఞానంలో స్థిమిత పడిపోయింది పండ్లు ఎందుకు తెచ్చావు అంటే సతనువగుటను పండ్లు తెచ్చితిని స్వామి ఇంకా దేహం ఉందిగా పతనం కాలేదుగా ఇంకా నడుస్తోందిగా ఈ బొమ్మ రామా తనకు నాలుగు పళ్ళు కోసుకొచ్చానయ్యా ఆరగించు అన్నది ఇక్కడ శబరి రాముడిని ఎంతగా ప్రేమించిందో రాముడు కూడా శబరిని అంతగానే ప్రేమించాడు ఇవన్నీ ఒక ఎత్తు రాముడు కేవలం పన్నెండు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలరాముడు ప్రతిరోజూ కౌసల్య అంతఃపురం లోకి వెళుతున్నప్పుడు బయటకి లోపలికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక ద్వారపాలకుడు ఉన్నాడు ఈ రాముడు రాగానే ద్వారపాలకుడు నుంచునేవాడు ఆ నుంచున్నప్పుడల్లా రాముడు ద్వారపాలకుడికి నమస్కరించేవాడు నమస్కరించి నీ వయస్సు ఎంత నీవు వృత్తి చేత ద్వారపాలకుడివే కానీ వయస్సు చేత జ్ఞానం చేత అనుభవం చేత నీ యొక్క నిష్ట చేత నీవు నిత్య వంజుడివి కదా నీవు నేను వచ్చినప్పుడల్లా నువ్వు లేవవద్దు అన్నాడు అది ప్రేమలో ఒక భాగం అట్లా ఇవాళ మనం ఒప్పుకోగలమా మన కిందవాడు లే-లేవకపోయినా కనపడ్డప్పుడు దండం పెట్టకపోయినా లోపల ఎంత బడబాగ్రులు ఒక్కసారిగా అహం అన్నమాట విజృంభిస్తుందే రాముడు మర్యాద పురుషోత్తముడు అనటానికి ఆ ప్రేమ భావన లోపల ఉన్నది ప్రేమ స్వరూపం రాముడని స్వామి ప్రకటించటం వెనుక ఇటువంటివి అనేక సన్నివేశాలున్నాయి అలాగే కౌసल्याనందనుడుగా కౌసల్య ఇంట ప్రతిరోజూ తల్లి చేత స్నానం చేయించుకున్న బాలరాముడు మూడో అంతఃపురం అయినటువంటి కైక దగ్గరకు వెళుతున్నప్పుడల్లా ఒకరోజున కౌసल्याదేవి ఆయన్ని పట్టుకుంది పట్టుకొని కనక కనక ఇన్నాళ్ళకి నిన్ను కన్నాను ప్రతిరోజూ ఇదే తంతు సాగుతున్నది స్నానం చేయించుకుంటావు వెళ్లిపోతావు నీకు నేను అలంకారం చేయటానికి తగనా నాకు అవకాశం లేదా అని అడిగింది రాముడిని అమ్మా! నీవు పూర్ణ సత్త్వవు సత్వగుణ ప్రధాన సంపన్నమైన గర్భాలయంలోకి నేను వచ్చాను తల్లీ! నీకు సాధనలు లేవు తపస్సులు లేవు రాగ అనురాగాలు లేవు విరాగ వైరాగ్యాలు లేవు నీవు పూర్ణత్వాన్ని సంతరించుకున్న మాతృమూర్తివి నేను వెళుతున్నానే నా పినతల్లి చిన్నమ్మ కైక తామస గుణ ప్రధానంగా ఉన్నది గనుక ఈ రామ దేహానికి అలంకారం చేస్తూ ఈ రాముడికి శృంగారం చేస్తూ శృంగారం చేస్తూ చిన్న చిన్న ఆయుధాలన్నీ ఎలా ప్రయోగించాలో గడుపుతూ నేర్పుతూ నాతో ఈ సాలోక్య సామీప్య సాన్నిధ్యములను అనుభవిస్తూ ప్రేమైకమూర్తిగా రూపాంతరీకరణం చెందాలి గనుక నా పని నీతో కాదమ్మా నా పని అంతా కైకతోనే అన్నాడు ఇది రాముడి యొక్క ప్రేమకి మాతృమూర్తిని కూడా దాటి ఆ దివ్యమైనటువంటి అనుభవాన్ని రససిద్ధం చేసినటువంటి ప్రేమ యోగి రామచంద్రుడు ఇక ఆంజనేయుడి పట్ల ఆయనకున్నది అది అపారమైనటువంటి ప్రేమ ఆయన ఇద్దరికే ఆలింగనం ఇచ్చాడు రెండు సందర్భాలలో మాత్రమే ఆయన అన్నాడు సీతాన్వేషణలో హనుమ గనుక మరణించినట్లయితే నాకా సీత ఎందుకన్నాడు రామరావణ సంగ్రామంలో లక్ష్మణడే మరణిస్తే నాకీ రాజ్యం ఎందుకన్నాడు అసలు నా-నా తమ్ముడు పోయి ఆ రావణుడు నశించినా నాకేం లాభం అన్నాడు నా తమ్ముడు నాకుండాలి నా సీత నాకుండాలి ఈ ప్రపంచం అంతా ధర్మబద్ధంగా గడవాలి ఇదంతా ప్రేమలో నుంచి పుట్టినటువంటి భావనే రామాయణాన్ని పక్కన పెట్టినట్లయితే కాసేపు మళ్ళీ మహాభారతంలోకి మనం అక్రూరుడు విదురుడు కుంతి తదాదిగా కలిగినటువంటి కొంతమంది భక్త బృందాలను గనుక తీసుకున్నా భాగవతంలో పరచుకున్నటువంటి అశేషమైనటువంటి భక్తగణాన్ని చూసినా పరమేశ్వరుడిని తమ ప్రేమ అనేటువంటి ఒక్క కారణంతో అవని సంచారానికి రప్పించుకోగలిగారు.ప్రేమ భక్తి జ్ఞానము మూడు మాటలుగా అనిపిస్తున్నా వినిపిస్తున్నా నిజానికి మూడు ఒక్కటే. భక్తిలో ప్రేమ ఉండాలి సగుణోపాసన జ్ఞానం నిర్గుణోపాసన అక్కడ నమ్మకం ఉండాలి కర్మయోగంలో ఒక సమర్పణ శరణాగతి వినయం అన్న భావన ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ఆ పదం ఆ ప్రేమ ఏర్పడుతుంది గనుక ప్రేమ రాహిత్యాన్ని పొందినటువంటి వారందరూ కూడా negative గానే ఉండిపోయినారు. ఒక చిన్న కథ సత్యసాయి భగవానుడు తమ దివ్య సందేశాలలో ఓ మాట చెప్పారు. మహాభారత యుద్ధం అయిపోయింది పంచ పాండవుల్ని కుంతిని ద్రౌపదిని వెంబడి పెట్టుకొని శ్రీ కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడిని గాంధారిని కలిశాడు. కలవగానే మనకు తెలుసు భీముడు ఎక్కడ భీముడు ఎక్కడ అని అరిచాడని. ఇంతలో గాంధారి వంతొచ్చింది. "అత్తా నేను వచ్చాన"న్నాడు కృష్ణుడు. "వచ్చావా నిన్నంతా లోకం దైవం అంటున్నదే ఏం దైవానివి నువ్వు? నూరుగురిని నేను కన్నాను నా గర్భశోకాన్ని నీవు కలిగించావు పంచ పాండవుల్ని ద్రౌపదిని కుంతిని సభద్రంగా తీసుకొని వచ్చావు ఇక్కడికి. ఈ వంద మందిలో ఒక్కడ్నన్నా నాకోసం మిగల్చాలని నీకు అనిపించలేగా అనిపించలేదా? నీవేమి దైవానివి?" అని అన్నప్పుడు "నువ్వన్నదంతా నిజమే అత్తా నూరుగురిని కన్నావు కానీ కంటితో ఒక్కరినేనా కన్నావా? వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారో చూశావా? మాతృ ప్రేమని ఎప్పుడైనా నీ బిడ్డలకు పంచావా? స్తన్యంలో కలిపావా? చేయలేదే" మాతృ ప్రేమకు నోచుకోనటువంటి వాడు దైవ ప్రేమకు దూరంలే. ఇది కృష్ణ పరమాత్మ గాంధారి ద్వారా ఈ ప్రపంచానికి అందించిన మహత్తర సందేశం. అందుకనే జీవుడు తల్లి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. తల్లి యొక్క ప్రేమను పొందాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమ అనేక రీతులుగా అనేక రకాలుగా మనకు కనిపించినా స్వార్థం ఎరుగని ప్రేమ తల్లిదే. అది కవితాత్మకమైన భావన కాదు. అందుకే స్వామి ఒక చోట అంటారు ఏమిటంటే చెడ్డ కొడుకు ఉండవచ్చునేమో గానీ చెడ్డ తల్లి లేదు. చెడ్డు చెడుగా ఉన్నది తల్లి అయితే తల్లి ఎలా అవుతుంది? బ్రహ్మ రాక్షసి అవుతుంది తప్ప. కాబట్టి చెడిన తల్లి కాదు చెడిన కొడుకు ఉండవచ్చు. వీడు ఎన్ని కష్టాలలో ఉంటే వాడి కోసం జపం చేస్తుంది. నేను ఉండగా వాడికి ఏం కాకూడదనుకుంటుంది. నేను లేకపోయినా వాడికి అసలేం కాకూడదనుకుంటుంది. ఇది ఒక నిష్కల్మషమైన విరహర్మలమైన విశుద్ధమైనటువంటి ప్రేమకి ఒక సంకేతం. ఈ దివ్య ప్రేమని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి కనుక ఆ ప్రేమ నుంచి నెమ్మదిగా కలియుగ ప్రభావం చేత రామ కృష్ణ గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి తప్ప అది వాస్తవిక స్థితిలో ఇవ్వాళ తల్లికి బిడ్డకి సంబంధమే లేదు. భార్యకి భర్తకి సంబంధాలు పెలుసు బారిపోయినాయి. అలాగే మానవ సంబంధాలన్నీ కూడా నెమ్మదిగా పతనావస్థకు వచ్చేసినాయి. ఎందుకని ఈ విషాదం సంభవించింది అంటే జ్వలించే అహంకారమే కారణం. అందుకే స్వామి నీవు గురువునో జగద్గురువునో సద్గురువునో పరమాత్మనో వెతుక్కుంటూ పుటపర్తికి రాకు. నువ్వేం చేయాలి అంటే అహంకారం ఉండనా గురువు చిక్కడు గురువు చిక్కనా అహంకారం ఉండదు. నేను చిక్కాను మనందరం మనిద్దరం కలిసాము అంటే నీలో అహంకారం ఉండకూడదు. నీలో అహంకారం లేని తర్వాత నీకు గురువు దక్కుతాడు చిక్కుతాడే తప్ప నీ అహంకారపు మూట నీ దగ్గరే పెట్టుకుని ఓ సాయి రామా ఓ సాయి మన మందిరమే అని నువ్వు వెయ్యి సార్లు భజన చేసినా కదిలి ఆయన రాడు. ఏం చేయాలి? రాగ అనురాగ బంధాల యొక్క స్థితులను మనం చక్కగా అర్థం చేసుకొని ప్రేమ బంధంలోకి ప్రేమానుభవంలోకి మన జీవితాన్ని నెమ్మదిగా ప్రవేశ పెట్టాలి. ప్రేమలో స్వార్థం లేదు. ప్రేమలో స్పర్ధ లేదు. ప్రేమలో సంఘర్షణ లేదు. ప్రేమలో వాద వివాదాలు లేవు తర్కాలు లేవు భీమాంశలు లేవు. ఉన్నది ఏమన్నదంటే నమ్మకం ఉన్నది సాధన ఉన్నది. ఆ సాధన నమ్మకాన్ని నమ్మకం సాధనని బలీయం చేసేటువంటి ఒక రెండు శక్తులు ఏకంగా ఉంటాయి గనుక ప్రేమాస్పదుడైనటువంటి జీవి వాడికి ప్రాపంచికమైనవి ఏది ఉండనివ్వండి ఏది లేకుండా పోనివ్వండి వాడు వాడుగానే ఉంటాడు. ఆ వాడు వాడుగా మనిషి మనిషిగా జీవించగలిగినటువంటి ఒక రసార్ద్ర భూమిక ఏదైతే ఉందో దానికి ప్రేమ అని మనం పేరు పెట్టుకున్నట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క సందేశం అంతా కూడా ఇదే. Love all. ఈ Love దీని యొక్క మూలం ఈ స్థూల గమనాన్ని మనం గమనించాలి. దీని స్థితిని అర్థం చేసుకోవాలి. ఈ divine love ఏదైతే ఉన్నదో దేనికి unconditional గా ఏదైతే ఉన్నదో దేనికి ప్రతిబంధకాలు లేవో నిబంధనలు లేవో కేవలం ఆత్మనిష్ట ప్రధానంగా సాగేటువంటి హృదయంగమమైనటువంటి జన్మ జన్మాంతర సంగతమైనటువంటి ఒక దివ్య ప్రేమ ధార ఏదైతే బలీయంగా ఉన్నదో ఆ ప్రేమను గనుక అందుకోగలిగినట్లయితే ఆ ప్రేమ యొక్క స్వరూపం దాని పేరు భగవంతుడు. భగవంతుడి స్వరూపం ఏమిటి అంటే వేదాంత భూమికలో వైజ్ఞానిక భూమికలో భావనా భూమికలో రసో వై సః. ఈశ్వరుడు రస స్వరూపుడు అన్నారు. రసము అంటే ప్రవాహం. రసము అంటే చలచ్ఛలితమైనటువంటి దానికి రూపం లేదు. నీవు ఎట్లా అనుకుంటే అది అట్లా. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడలే అన్నాడుగా అన్నమాచార్యుల వారు. మరి ఈ రసము ప్రేమ స్వరూపంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడితో మనకి తత్వానుసంధానం ముందు జరుగుతుంది. ఈ తత్వానుసంధానం జరిగిన తర్వాత ఈయన భగవంతుడే అని నమ్మకం కలుగుతుంది. అంతే తప్ప స్వామి ఇచ్చేటువంటి ఒక ఉంగరం తోనో ఒక గొలుసుతోనో లేకపోతే కాసేపు మాట్లాడటంతోనో ఈ ప్రేమ పుట్టుకొని రాదు. ప్రేమగా ఉండాలి. ప్రేమ స్వరూపంగా స్వామిని అనుభవించాలి అంటే నీవు ప్రేమ స్వరూపుడివి కావాలి. నీవు ఆ స్థాయికి ఎదగాలి. ఎదగాలి అంటే చాలా వదిలిపెడితే తప్ప ఎదగలేము. బాల్యం వదిలిపెడితేనే కౌమారంలోకి వచ్చాం ఇంకా బాల్యం అక్కడే ఉందా మన జేబులో? లేదే. కౌమారం వదులుకుంటేనే యవ్వనంలోకి వచ్చాం. ఇది కూడా అంతే ఒకటి వదులుకుంటే గాని రెండవది రాదు. అరుణాచలానికి మధురై నుంచి ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ యువకుడు వచ్చాడు రమణ మహర్షి దగ్గరికి. రెండు నెలలు ఉన్నాడు. రోజూ అక్కడ జరిగే దాంట్లో కార్యకలాపాల్లో ఉన్నాడు. చివరికి ఏదో రోజు మధురై వెళ్ళాలి కదా ఆ వెళ్ళే time వచ్చినప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్లి ఓ మాట అడిగాడు. ఏమనంటే "రెండు నెలలు అయింది భగవాన్ మీ దగ్గరికి వచ్చి రెండు నెలల నాడు నేను మధురైలో ఎలా ఉన్నానో మీ సన్నిధిలో ఉండి కూడా రెండు నెలల తర్వాత అట్లాగే ఉన్నాను. నాలో ఏం మార్పు లేదు. ఏమిటిది?" అని అడిగాడు. అప్పుడన్నారు "ఏదన్నా కొద్దిగా అన్నా వదిలిపెడితే కాస్త రాబట్టుకోవచ్చు తప్ప అసలు నింపుకొనే వచ్చి వంపకపోతే మళ్ళీ నింపేది ఎట్లా? వంపటం మొదలు పెట్టు నింపుకోవటం ప్రారంభం అవుతుంది." అహంకారాన్ని వదిలిపెట్టాలి. మమకారం కట్టుబాటు దాటకుండా చూసుకోవాలి. ఖాళీ glass అయితేనే నింపగలుగుతాం కదా. నిండిన glass నింపటం ఉండదు. అది పొర్లి ప్రవహిస్తుంది గనుక ఈ ప్రేమ ఒక ఆత్మైకమైనటువంటి హృదయంగమమైనటువంటి ఒక దివ్య మహా స్థితి అది.
SSSMC · audio
Sandesame Adesam - 04
Sandesame Adesam - 04
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 31:48
More in this series
Sandesame Adesam
- 29 min 1
Sandesame Adesam - 01
- 45 min 2
Sandesame Adesam - 02
- 30 min 3
Sandesame Adesam - 03
- 31 min 4
Sandesame Adesam - 04
Now playing - 19 min 5
Sandesame Adesam - 05
- 29 min 6
Sandesame Adesam - 06
- 36 min 7
Sandesame Adesam - 07
- 31 min 8
Sandesame Adesam - 08
- 29 min 9
Sandesame Adesam - 09
- 31 min 10
Sandesame Adesam - 10
- 44 min 11
Sandesame Adesam - 11