Skip to content
Transcript తెలుగు
[సంగీతం] సందేశమే ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధలపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి విశ్లేషణ. [సంగీతం] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం ది. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీ సత్య సాయి సందేశామృతం అనబడేటువంటి ఒక మహత్తరమైనటువంటి జ్ఞాన భూమికని ఏర్పాటు చేసుకొని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామి యొక్క వచనామృతాన్ని ప్రపంచానికి పంచాలి అనేటువంటి ఒక దివ్య సంకల్పంతో భగవాన్ అనుగ్రహంతో కోటి సమితి హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. స్వామి అనుగ్రహం లేనిదే అంటే పరబ్రహ్మ అనుగ్రహం లేకపోతే జీవుడు కదలలేడు. ఆకే కదలదు. ఇంద్రియాలు కదలవు. సంకల్పాలు పుట్టవు. మనసు ఆలోచించటం ప్రారంభించదు. కనుక జరుగుతున్నదంతా ఒక భగవత్ లీల. భగవంతుడు ఆడుకునేటువంటి ఒక అందమైనటువంటి ఆటలో ఇది కూడా ఒక భాగమే. ఇందులో అంటున్న వాడు వాడే, వింటున్న వాడు వాడే, అనిపిస్తున్న వాడు వాడే, సర్వం ఖల్విదం బ్రహ్మ. మరి అంతా వాడే అయినప్పుడు ఇదంతా ఎందుకు అని? ఇదంతా ఉంది గనుకనే వాడు కావలసి వచ్చాడు. ఇంత సృష్టి చేయగలిగిన వాడు ఎలా ఉంటాడు? దాని తత్వం ఏమిటి? విచార ధారలోకి సాధకుడు ఎలా వెళ్ళాలి? ఇవన్నీ మౌలికమైనటువంటి ప్రశ్నలు. కనీసం జీవన చరమాంకం చేరుకునేటప్పటికైనా సమాధానం పొందవలసినటువంటి ప్రశ్నలివి. అయితే దేహధారి అయినటువంటి మానవుడికి సందేహాలు ఎప్పుడూ ఉంటాయి. తనువు తెల్లవారవచ్చునేమో గానీ సందేహాలు మాత్రం ఆగవు. అవి పుడుతూ ఉంటాయి, తీరుతూ ఉంటాయి. తీరుతున్న కొద్ది పుడుతూ ఉంటాయి, పుడుతున్న కొద్ది మళ్ళీ పునరావృత్తి రహితంగా ఆవృత్తంగా నడుస్తూనే ఉంటాయి గనుక సందేహాలకు సమాధానం వెతుక్కునే కంటే, ఏది కంటక కనబడుతున్నదో, ఏది అనుభవంలోకి వస్తున్నదో, దేనివలన వ్యాపారమంతా జరుగుతున్నదో, అంటే దైహిక, మానసిక, ఆధ్యాత్మిక, అంతరంగ యోగ వ్యాపార ప్రక్రియ అంతా ఎట్లా కొనసాగుతున్నదో, తీవ్రమైనటువంటి ఒక తపన చేత, స్వాధ్యాయం చేత, సద్గోష్ఠి చేత, సమ్యక్ సంకీర్తన చేత, దివ్య భావనా గరిమ చేత, జన్మ జన్మాంతర సంస్కార విశేషం చేత, అవకాశం చేత, ప్రాప్తి చేత, ఖడగ దైవానుగ్రహం చేత సాగేటువంటి ప్రక్రియ అంతా కూడా మనల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నమే. ప్రపంచం మొత్తాన్ని తెలుసుకుని ప్రయోజనం ఏం లేదు. విషయాలు తెలుస్తాయి అంతే. మనల్ని మనం తెలుసుకోవనే ప్రయత్నంలో గనుక ప్రపంచాన్ని తెలుసుకోవటం మొదలు పెడితే, ప్రపంచం యొక్క స్థితి మనకు అర్థమయ్యి మనం కూడా దానిలోనే భాగం గనుక స్థితికి మూలమైనటువంటి కర్త ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. కర్త భగవంతుడనొచ్చు, శక్తి అనొచ్చు, కరెంట్ అనొచ్చు, ఫ్లూయిడ్ అనొచ్చు, బ్రహ్మమనొచ్చు, పరబ్రహ్మమనొచ్చు దానికి పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. కానీ ఉన్నది ఒక్కటే అది అఖండము, చిద్ఘనము, అనంతము, అచ్యుతము, అనాహతము, అప్రమేయము, అచించ్యము అయినటువంటి ఒక ఆత్మే బ్రహ్మ పదార్థంగా సర్వ సృష్టికి మూలమై, సర్వ సృష్టికి కూడా చరమమై కొనసాగుతున్నటువంటి దివ్యమైనటువంటి మహా సంమంగళ వేళ మళ్ళీ మార్గశిర మాసంలో రెండో రోజున వచనామృతం అనేటువంటి దాన్ని స్వామి పరంగా మనం కొంత విచారణ చేసుకోవాలి. ఎందుకంటే సత్య సాయి భగవానుడు ఒక అవతారం పరిసమాప్తం అయినా భౌతిక స్థాయిలో ఇంకా స్వామి ఎందుకు వచ్చారో, వచ్చి ఏం చేశారో, మనల్ని ఏం చేయమని చెప్పారో, ఏం చేస్తే మనకు ఆనందం కలుగుతుందో తాత్వికమైన ప్రశ్నలు మనం పెద్దగా వేసుకున్నట్టు లేదు. స్వామి ఉంగరం ఇచ్చారు, స్వామి గొలుసు ఇచ్చారు, స్వామి రోగం పోగొట్టారు, స్వామి బాగున్నారు, స్వామి చాలా అందంగా ఉన్నారు, అయ్యో స్వామి పెద్దవారైపోయారు. ఇట్లా మన మానసికమైనటువంటి భావనలో స్వామిని అనుభవిస్తూ వెళ్ళిపోయినాం తప్ప, లేదు కొన్ని కష్టాలు తీరినప్పుడు ఈయన దేవుడే అనుకున్నాం, తీరనప్పుడు కాదని కూడా అనుకున్నాం. రెండూ సత్యం. వీటినన్నింటినీ దాటి ఒక పరాస్వరూపమైనటువంటి, ఈశ్వరీయమైనటువంటి తత్వం ఒక సాకార సగుణ స్వభావంగా అవనీ సంచారానికి గనక వచ్చినట్లయితే, దాన్ని మనం దర్శించినట్లయితే, దాంతో మనం సంభాషించినట్లయితే, దాన్ని తాకినట్లయితే మనలో కలిగేటువంటి పరిణామం ఏమిటి? అసలు ఏమైనా ఉన్నదా? లేదు ఒక మహాపురుషుడ్ని, ఒక సత్పురుషుడ్ని, ఒక అందగాడ్ని, గొప్పవాడ్ని చూసి వచ్చేశామా?ఇలా కాలాన్ని మనం చెల్లగొట్టుకున్నామా అనేది తాత్వికమైనటువంటి భూమిక లో మనం విచారణ చేయాలి. ఇది గనుక చేయకపోయినట్లయితే భగవాన్ రమణ ఉన్నట్లుగా "ప్రపంచమంతా ఎరిగి నిన్ను నీవు ఎరుగకపోతే ఎట్లా? నిన్ను నీవు ఎరిగినట్లయితే సర్వ ప్రపంచాన్ని ఎరిగినట్లే కదా అది కదా నిజమైన ఎరుక" అన్నారు. ఎరుక అంటే స్వస్వరూప అనుసంధానమే. మనల్ని మనం దర్శించుకోవటం కోసమే ఏర్పడినటువంటి దివ్యమైనటువంటి విధానం. నిన్న అనుకున్నాం ధ్యానంలో ఉండి రాముడు కనిపించాడు కృష్ణుడు కనిపించాడు అంటే మనకి ఏం లాభం? ధ్యానంలో కూడా మనకి మనం కనిపించాలి ఇంకా మనల్ని మనం చూసుకోలే. మనల్ని మనం అద్దంలో చూసుకున్నాం ఎలా చూసుకున్నాం అంటే పాంచభౌతిక దేహాన్ని మళ్ళీ మరోసారి చూసుకున్నాం. ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని మనం దెద్దుకుంటూ కొంత ప్రయత్నం చేశాం. "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం" స్వాత్-- ఆత్మ ఆనంద స్థితిలోకి జీవుడు వెళ్ళాలి. వెళ్ళటానికి స్వామి గంభీరమైన మాటలు చెప్పారు అలతి అలతి పదాలతో జగత్తుకి ఒక మార్గనిర్దేశం కూడా చేశారు. మార్గనిర్దేశం లో నాలుగు వాక్యాలు మనం ఎన్నుకున్నాం నాలుగు రోజులకి. నాలుగు వాక్యాలలో చాలా ప్రధానమైనటువంటిది "Love all" రెండవది "Serve all" మూడవది "Help ever" నాలుగవది "Hurt never" నాలుగు కూడా నాలుగు మహా సత్యాలుగా భావన చేసినటువంటి వాడికి "Love all" అనేటువంటి భావన సామాన్యుడు అందుకోగలడా? అందుకోవాలి అది సందేశం. అందుకని తీరాలి అది ఆదేశం. అందుకోకపోతే మానవ జన్మ వృధా ఇది ఉపదేశం. కాబట్టి ఉపదేశ, సందేశ, ఆదేశాల మూడింటిని కూడా స్వామి ఒక్క వాక్యంలో "Love all" అన్నారు. ఇదేమి సనాతనమైన మాటగా అనిపించటం లేదే, ఇది మన భాషగా లేదే అని అనుకోక్కర్లేదు. చాలా కాలం క్రితం అసేతు సీతాచలం ఒక అమృత భాషగా నిజానికి వాడుక భాషగా ఉన్నటువంటి సంస్కృతం కాలగమనంలో వెనకబడిపోయిన కారణంగా అనేకమైనటువంటి అనివార్యమైనటువంటి సహజమైనటువంటి పరిణామ గతిలో ప్రపంచం అంతా ఒక రూపాంతరీకరణం చెందుతున్నటువంటి వేళ, అభివ్యక్తి కోసం ఏర్పడినటువంటి ఒక భాష అంతర్జాతీయమైనటువంటి భాషలో స్వామి ఉపదేశాన్ని ఇచ్చారు. "Love all" అని స్వామి అన్నంత మాత్రాన ఆయన దివ్యత్వానికి వచ్చిన లోటేం లేదు. ఎందుకంటే ప్రపంచం అందరూ అందుకొని అర్థం చేసుకొని ఆనందించి అనుభవించి అనుభూతి చెంది విభూతి స్థాయికి వెళ్లగలిగినటువంటిదే అభివ్యక్తికి ఒక ఉపకరణంగా భాషను మనం వాడుకోవాలి. అందుకే సత్యసాయి భగవానుడి నోట వినబడినటువంటి ఒక మాట ఏమిటంటే "భాషలో ఏమున్నది? అన్ని భాషలకి మూలం ఒకటి ఉన్నది. అన్ని భాషలకి మూలం ఏమిటంటే హృదయ భాష. హృదయం అంటూ గనుక నీవు అక్కడి దాకా చేరుకోగలిగినట్లయితే జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతమైనటువంటి ఒక భావనా రేఖపడసూపి దానిలో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి భావనలన్నీ కూడా భాషగా మారి భాష ద్వారా అభివ్యక్తి జరిగి పరస్పరము మాట్లాడుకునేటువంటి, అనుకునేటువంటి, అర్థం చేసుకునేటువంటి ఒకానొక సన్నివేశం ఏర్పడుతుంది" గనుక "Love all" అనేటువంటి దాంట్లో కేవలం రెండు పదాలున్నాయి. ఒకటి "Love" రెండవది "All". "Love all" అంటే అందరినీ ప్రేమిస్తే ఒక్కడే ఉంటాడని అని కానీ, ఒకడిని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్లే అని కానీ అది అర్థం కాదు. "Love" అంటే ఏమిటో ముందు తెలుసుకుంటే తర్వాత "All" వైపు కాసేపు అయ్యాక వెళదాం. మూడు బంధాలున్నాయి జీవుడికి ఒకటి రాగబంధం, రెండవది అనురాగ బంధం, మూడవది ప్రేమబంధం. రాగబంధం లో మనల్ని కన్నవాళ్ళు, మనం కన్నవాళ్ళు, మన తోబుట్టువులు, మన రక్తసంబంధీకులు, మన జ్ఞాతులు, కులగోత్రాల పరంగా ఏర్పడినటువంటి అసంఖ్యాకమైనటువంటి జనాళి అంతా కూడా రాగబంధం లో ఇమిడిపోయి ఉంటాయి. స్థితిగతులు మారినా, కాలం అనేకమైనటువంటి ఒత్తిళ్లు తెచ్చినా, కాల స్పర్శలో అనేక భిన్న రీతులు గోచరించినా, మారానటువంటి బంధం రాగబంధం. అంటాం "Blood is thicker than water" కదా! అంటే ఎన్ని అనుకోనివ్వండి, ఎన్ని సార్లు విడిపోనివ్వండి, ఎంత జరగనివ్వండి వాడు మా అన్న అంటాడు. మహాభారతంలో కురుపాండవుల మధ్య ఒక సంగ్రామ ಕೇಳి జరుగుతున్నటువంటి సమయంలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళే సమయంలో ఎవరెవరి సందేశం ఏమిటో చెప్పమని పాండవులను అడిగినప్పుడు ధర్మరాజు ఒక్కమాట చెప్పాడు "కృష్ణా! నువ్వేం మాట్లాడు, అక్కడికి వెళ్లి ఏం చెప్పు, ఏం చెయ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. మాటలు ఎకడమిక్ గా మాట్లాడుకోవలసి వస్తే వారు వంద మంది మేము ఐదుగురం అనే అనుకుంటాం కానీ మాకు గనక ఏదైనా సంఘటన గనక సంభవించినట్లయితే దుఃఖమో, సుఖమో ఏర్పడినట్లయితే తాత్విక చింతనా భూమిక కంటే ముందే అతి వాస్తవిక దృష్టితో మేము నూరు ప్లస్ ఐదు నూటైదు గురం మేము. కాబట్టి ఇరు పక్షాల యొక్క క్షేమాన్ని చూసే నీవు నీ రాయబారాన్ని నడిపించు" అని ధర్మరాజు అడగటం వెనక రాగబంధమే ఉన్నది. రాగబంధం భారతంలో ప్రధానంగా ఎంత దాకా అంటే కురువంశం అంతా నశించిపోయిన తర్వాత కూడా, ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయిన తర్వాత కూడాప్రతి రోజు ధృతరాష్ట్రుడికి, గాంధారికి ధర్మరాజు వెళ్లి సేవలందించాడు. ఎందుకందించాడు? యుద్ధరంగంలో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి కుటుంబం దగ్గరకు ధర్మరాజు వెళ్ళాడా? వెళ్ళలే. కానీ, ధర్మరాజు తన పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి, పెద్ద తల్లి అయినటువంటి గాంధారి దగ్గరికి, రాజ్యం చేయటానికి సభకు వెళ్ళటానికి ముందు తెల తెల వారుతున్నటువంటి వేళ పెద్ద తండ్రికి పెద్ద తల్లికి ఏం కావాలో అన్ని అవసరాలు తీర్చి వచ్చాడు. ఇది చాలా కాలం సాగించాడు. ఇంతలోకే విదురుడు రానే వచ్చాడు, ఏదో ఒకరోజున వచ్చాడు. పరిణామాలన్నీ చూశాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. ధర్మరాజుని పిలిచాడు. "నువ్వు సేవ చేయొద్దు." అని ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు వినడు. ధర్మరాజు చేస్తాడు. ఎందుకంటే రాగ బంధానికి లోనైన వాడు గనుక. ఇక మరి ఎవరికి చెప్పాలి? ఎవరికి అవసరమో, ఎవరికి చెప్తే పని ఆగిపోతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళింది ధృతరాష్ట్రుడి దగ్గరికి, గాంధారి దగ్గరికి. "రాజ్యమంతా ఉండి, నీ కొడుకులంతా సుఖంగా ఉన్నటువంటి సమయంలో ఐదుగురు పాండవులు, కుంతి, ద్రౌపది అన్నం తిన్నారా? అని పట్టించుకొని నీవు యుద్ధంలో అన్నీ పోగొట్టుకుని, నీవు ఇంకా రాజువి కాదు. అయినా నిస్సిగ్గుగా ధర్మరాజు నుంచి సేవలు అందుకుంటున్నావే! ఎంతకాలము సేవ అందుకుంటూ ఉంటావు? దీనికి ఎక్కడో ఒకచోట దీనిని ఆపే ప్రయత్నం చేయవా? భౌతికమైనటువంటి సుఖాలు, భౌతికమైనటువంటి సంతోషాలు, భౌతిక స్థాయిలో ఏర్పడేటువంటి భద్రత ఇది మాత్రమే నీకు కావాలా? దేహం ఉంటుందా? ధృతరాష్ట్ర! నీవు ఒక పని చెయ్. నీవు నీ భార్యతో సహా ఇంతకాలము నీవు పరమాత్మను గురించినటువంటి భావనే చేయలేదు గనుక, గంగానది తీరంలో చక్కగా వానప్రస్థ జీవితాన్ని గడుపు. వానప్రస్థము అంటే అడవికి-అడవికి వెళ్ళటం అని ఒక అర్థం ఉన్నది. పరమ చరమమైనటువంటి ఒక దశలో తీర్థయాత్రకు వెళ్లి ఒక ప్రవాహం, నది ప్రవహిస్తున్నటువంటి నది పక్కన గనక కూర్చున్నట్లయితే అది కూడా పరమోత్కృష్టమైనటువంటి ఒక వానప్రస్థ ఆశ్రమమే. వానప్రస్థ ఆశ్రమంలో నీవు గనక అక్కడ ఉన్నట్లయితే, నీవు స్వస్వరూప అనుసంధానంతో ప్రకృతితో అనుసంధానమై, ప్రకృతి వలన ఏర్పడినటువంటి దేహము యొక్క స్థితిని నీవు ఎరిగి, 'ఓహో! దేహాన్ని నేను ఎప్పుడో ఒకరోజు వదిలిపెట్టవలసిందే కదా! వదిలిపెట్టే లోగా నేను కురువంశానికి రాజునని, నూరుగురు కౌరవులకు తండ్రిగా ఉన్నానని, నా భార్య మహాపతివ్రత గాంధారి అని, ఇప్పుడు నా తమ్ముడి కొడుకులే రాజ్యం ఏలుతున్నారు గనుక నాకు రాజ్యభాగం ఇంకా అనుభవించే హక్కు ఉన్నదని అనుకోకుండా, శరీరము ఎప్పుడో రాలిపోయేది గనుక, రాలిపోయే లోగా ఆత్మానుసంధానం చేసుకునే దిశగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శేష జీవితాన్ని ప్రకృతి పరంగా చేసుకున్నట్లయితే, స్వా-ఆత్మ అనుసంధానమై, స్వా-ఆత్మ నిష్ఠలో ఉండి, తనను తాను ఆత్మగా భావించుకొని, అంటే అహం బ్రహ్మాస్మి అనుకొని భావించుకున్న వాని వలె ఉండి, అయమాత్మ బ్రహ్మ అయి, తన లోపల ఉన్నటువంటి జీవ ప్రజ్ఞని, పరమేశ్వర ప్రజ్ఞని ప్రకృతి ద్వారా సమన్వయం చేసుకొని, 'ఓహో! నేను ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ' అనేటువంటి మూడవ వాక్యం దాకా వచ్చాను గనుక, ఇక చివరికి ఏం మిగిలింది అంటే, కదులుతున్న నీరు, కదలని ఆకాశం, భూమి, ఆధార దేవత అయినటువంటి భూమి, సర్వ ప్రకృతి, అఖండ భారతం, అశేతు సీతాచలం అంతా కూడా ఇది ధర్మభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా, తపోభూమిగా, జ్ఞానభూమిగా, అనేక విధాలుగా ఉన్నటువంటి అణువు యందే నా శరీరము కలిసిపోవు గాక, నేను అదైపోవు గాక." అనేటువంటి ఒక సంకల్పంతో తత్త్వమ్ అసి "అదే నేనై ఉన్నాను." అదే అంటే పరబ్రహ్మము కోసమై నేను ఉపాసన చేశానో, కంటికి కనపడనటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని లోపల భావన చేసుకున్నానో, అటువంటిది ఈరోజున నేనై ఉన్నాను తప్ప, సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి వచ్చేటువంటి సుషుమ్నా కిరణాలు ఎట్లా భిన్నం కావో, అభిన్నమైన అద్వైత ద్వితీయ రమణీయ మనోజ్ఞ స్థాయిలో నేను నిలకడ చెంది, స్థిమితం చెంది, స్థితప్రజ్ఞా మూర్తినై, నేను సంస్థితుడనై, పరిపూర్ణమైనటువంటి ఆనందాశ్చర్యంతో దేహాన్ని నేను వదిలి పెడుతున్నాను అనేటువంటి ఒక నిస్సంగత్వ నిర్మోహత్వ నిశ్చలత్వ మోక్ష అపేక్షతో జీవితాన్ని గడుపుతున్నాను అని సాధన గనుక చేసుకోగలిగినట్లయితే అది పూర్ణ ప్రజ్ఞ అనుకోమని చెప్పాడు విదురుడు. విదురుడు గనుక ఇన్ని మంచి మాటలు చెప్పాడు. విదురుడు కాకపోతే చెప్పేవాడు కాదు. విదురుడి పని ఏమిటయ్యా అంటే మంచి పని చేయమని చెప్పడమే. మంచి మాట చెప్పడమే. వినటం ఎవరిది? అందుకోవలసిన వాడు. అర్హత, ప్రాప్తి, యోగ్యత, సమర్ధత, యోగము ఉన్నటువంటి వాడు, వాడు అందుకుంటాడు. అందుకోవలసిన వాడు, అందించేవాడు కలిస్తే దాని పేరు యోగం. యోగం అంటే యోగాసనాలు కాదు. యోగం అంటే ఎవరిని మనం చూడవలసి ఉన్నదో, ఎవరి మాట వినవలసి ఉన్నదో, వారిని మనం దర్శించి, స్పర్శించి, సంభాషించి, మూడు స్థాయిలను మనం జన్మలో పొంది, తదనుగుణంగా గనుక జీవించగలిగితే అది యోగత్వాన్ని పొందినట్లుగా లెక్క. పరమ చరమ రమణీయమైనటువంటి యోగ భూమికలో సమస్త జగత్తు కూడా నిలకడ చెందాలన్నాడు విదురుడు. సరే, రాగ బంధం యొక్క ప్రమాద పుటంచు దాకా వెళ్ళాడు. ఎవరు?ధృతరాష్ట్ర మహారాజు గాంధారిది ఏమున్నదీ భర్త ఏమంటే అదే మాట ఇది ఒక స్థాయి నూరుగురు మనుషులు గనక ఉన్నట్లయితే సాధకులు ఉన్నట్లయితే అందులో సుమారుగా తొంభై percent రాగబంధంలోనే ఉంటారు రాగ బంధాన్ని దాటగలగటం అంత తేలికైన విషయం కాదు ఎప్పుడైతే రాగ బంధాన్ని దాటగలుగుతాడో అనురాగ బంధం వైపు వెళ్తాడు అనురాగ బంధం యొక్క స్వరూపం ఏమిటని విచారణ గనక చేసినట్లయితే తనవారు కాకుండా కాలగమనంలో పరిచయమై కాలగమనంలో స్నేహితులై బంధువులై తనవారుగా అనిపించుకున్న వారందరి పట్ల ఉండేటువంటి ఒక అపేక్షే అనురాగం అంటే మనం ఉన్నాం తల్లిదండ్రులు వేరు కుటుంబం వేరు నేపథ్యాలు వేరు ఎవరిది వారిదే కానీ ప్రపంచంలోకి వచ్చాక మనకు ఒక లక్ష మంది పరిచయం అయ్యారు లక్ష మంది అనురాగ బంధానికి చెందినటువంటి వారు వారి వలన మనకో మన వలన వారికో ఏదో ఒకరోజు అవసరమో లాభమో ఉండాలి లేకపోయినట్లయితే అనురాగాలు కూడా మారిపోతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం చాలా తీవ్రమైన గాఢమైనటువంటి ఒక మైత్రి లో ఉన్నటువంటి వాడు కూడా కొన్నాళ్ళు కారణం మనకు తెలియదు వాళ్ళు విడిపోతూ ఉంటారు రాగ బంధంలో విడిపోయినట్లు కనిపిస్తారు కానీ అక్కరకి కష్టానికి సుఖానికి అరుగో రాగ బంధానికి చెందిన వారే మూగుతారు మనిషి చుట్టూ అనురాగ బంధం వాడికి అవకాశం లేదు వాడు రావచ్చు రాకపోవచ్చు అంటే అనురాగ బంధం అనేటువంటిది కేవలం ఒక మానసికమైనటువంటి క్రీడగా కాక ఒక సామాజికమైనటువంటి అవసరంగా ఒక ఉపయోగకారకమైనటువంటి భావనగా భూమిక యొక్క స్థితే వేరు అందులో equations మారిపోతుంటాయి అంటాను చూడండి అదన్నమాట equation మారినట్టుగా కనిపించేది రాగ బంధం అయితే నిజానికి మారుతూ ఉండేది అనురాగ బంధం ఇక మూడవ స్థాయికి వెళ్ళినప్పుడు దానిని ప్రేమ బంధము అన్నారు ప్రేమ బంధం బహుశా మిగిలిన తొంభై లో వందలో తొంభై పోతే పది పదిలో వీళ్ళొక ఎనిమిది percent అనురాగ బంధం గనక పోతే నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆత్మానుసంధానం చేసుకునేటువంటి వ్యక్తులు కేవలం two percent లో ఆవృతంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆలోచనలు ఒకటిగా ఉంటాయి దాన్నే ఇవాళ మనం like mindedness అంటున్నాం birds of same feathers flock together అంటాం ఏదో చెప్పుకుంటూ ఉంటాం కానీ కలిసిన పది మందికి ఆలోచన ఉన్నదీ అంటే పరతత్వం అంటే ఏమిటి? పరబ్రహ్మం అంటే ఏమిటి? పరబ్రహ్మము యొక్క స్వరూపం ఏమిటి? పరబ్రహ్మము యొక్క విచారణ ఏమి? పరబ్రహ్మము ఎక్కడ ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? అది పదార్థమా? పరమార్థమా? యదార్థమా? తాత్వికమైనటువంటి చింతనా భూమిక లో ఉండేటువంటి two percent నిజానికి పునర్జన్మ లేకుండా చేసుకునేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నటువంటి వారే మొదటి తొంభై మందిని మీకు పునర్జన్మ ఉందా కావాలా అక్కరలేదా అంటే private గాను public గాను వాళ్ళు ఒప్పుకునేటువంటి మాట మాకీ జన్మ బాగుంది ఇంకా చాలా సాధించాలి time చాలలేదు భగవంతుడి దయ లేక ఒట్టు అరవై ఏళ్ళే ఇచ్చాడు నలభై ఏళ్ళే ఇచ్చాడు మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ రేప్ అంటూ ఉంటే అంటుంటారే వాళ్ళంతా ninety percent next ten percent లో ఉన్నటువంటి అనురాగ బంధం వాళ్ళు అటూ ఇటూ మారుతూ ఉంటారు ఎలా మీరు మీకు మళ్ళీ పునర్జన్మ కావాలా వస్తే కాదనం కావాలని పెద్దగా అడగం అంటారు మిగిలిన two percent ని అడగండి మాకు జన్మ ఉన్నదా జన్మ లేదా అసలు మేము ఉన్నామా ఇప్పుడు ఉండి లేనట్లు అప్పుడు లేకుండా ఉన్నట్లు కాబట్టి మాకు పరబ్రహ్మ తత్వం యొక్క విచార ధారలో మా మనసుకు ఒక స్పురణ కలిగింది ఏమిటా స్పురణ అంటే కనిపిస్తున్న దేహము మాత్రమే పోతున్నది కానీ దీనిని ఇంతకాలము నడిపించిన నిలిపిన సంస్థితమైన పూర్ణ ప్రజ్ఞతో ఉన్నటువంటి ఆత్మ దానికి చావు లేదు మార్పు లేదు అది ఎరుకగా చైతన్యంగా హృదయ స్థానంలో నెలకొరి చెందే ఉన్నది గనుక అదే నేనుగా అంటే తత్వమసి స్థాయిలో వాడు ఉంటున్నాడు మొదటి తొంభై percent రాగ బంధంగా తర్వాత వారు అనురాగ బంధంగా మిగిలిన two percent ని ప్రేమ బంధంగా ఉంచిన ట్లయితే ప్రపంచం తరించేదెట్లా వీల్లేదు two percent తో ప్రమాదం లేదు వాళ్ళకి ప్రపంచం అక్కర్లేదు నిజానికి ప్రపంచానికి కూడా వాళ్ళు అందుబాటులో ఉండరు ప్రపంచం అంటే ఏమిటంటే మొదటి తొంభై percent రాగ బంధంలో అల్లాడుతూ బంధనంలో నుంచి బాంధవ్యాన్ని బాంధవ్యంలో నుంచి ఒక బంధాన్ని బంధనంలో నుంచి ఒక మోహాన్ని మోహంలో నుంచి ఒక వ్యామోహాన్ని వ్యామోహంలో నుంచి ఒక వ్యసనాన్ని పొంది వదుల్చుకోలేక మొయ్యలేక తట్ట దింపలేక పుట్ట నింపలేక ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటూ కొట్టుమిట్టాడేటువంటి జీవుడి కోసం అదిగో two percent ఎదురు చూస్తుంటారు అందుకనే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే కేవలము సామాజిక పరమైన రాజకీయ పరమైన మతపరమైన జాతి పరమైన వర్గపరమైన వర్ణపరమైనటువంటి విభేదాలు ఏర్పడినప్పుడే నేను వస్తాను అని కాదు మానవ జన్మ ఎత్తినటువంటి మానవుడు తాను ఆచరించవలసినటువంటి కనీస ధర్మాన్ని కూడా వాడు మరిచిపోయి తనలో ఉన్నటువంటి పశువుని ప్రేరేపించుకొనితనలోనే ఉన్నటువంటి పశుపతి తత్వాన్ని గనక అర్థం చేసుకోకుండా జీవించటం మొదలు పెట్టినట్లయితే ఆనాడు ధర్మానికి జ్ఞాని జరిగినట్లుగా లెక్క. ధర్మజ్ఞాని జరిగినటువంటి వేళ మానవుడు ధర్మాచరణకి దూరమైనటువంటి వేళ మళ్ళీ వాడికి ఒక్కసారి ధర్మ ప్రబోధం చేసి ధర్మ ప్రచారం చేసి ధర్మ ప్రచారం చేసి మానవుణ్ణి ఉన్మనీ స్థితికి తీసుకు వెళ్ళాలి. ఉన్మనీ స్థితి అంటే ఉత్ మనీ, ఉత్ అంటే ఉన్నతమైన మన మనస్సు. మనస్సు అందరికీ ఉంది, మనందరికీ మనస్సు ఉంది. దాని స్థాయి ఏమిటో మనకు తెలియదు. పరమాత్మకు తెలుసు. కనుక ఉన్న మనస్సుని ఉన్నత మనస్సుగా, ఉన్నతమైనటువంటి మనస్సుని మనోన్మనీ స్థాయిలోకి, మహోన్నతమైనటువంటి స్థాయిలోకి నడిపించటానికే పరమాత్మ అనేక రూపాలలో అనేక అవతార ప్రవాహంగా ప్రపంచంలోకి వస్తూనే ఉంటుంది. రావటంలో దేశం చేసుకున్న అదృష్టం. అవతారమూర్తులంతా దేశంలో వచ్చారు. అఖండ భారతావని నిండా ఎవరున్నారు అంటే ఒక తాత్వికమైనటువంటి విచారణలో గణాంకంలో తేలింది ఏమిటంటే ముప్పై ఆరు వేల మంది యోగులు భారతదేశాన్ని అన్నివేళలా కాపాడుకుంటూ ఉంటారు. బయట జరిగే పరిణామాలకు వాటికి వాళ్ళు సంబంధం లేదు, కనపడరు, ప్రమేయంగా ఉండరు. అందునా ఆంధ్రదేశంలో సుమారు మూడు వేల ఆరు వందల మంది ప్రచ్ఛన్న యోగులు ధర్మ ప్రచార ప్రసార మాధ్యమంలో ఉండి ప్రపంచాన్ని ప్రబోధం చేస్తూ ఉంటారు అని ఒక భావన. అది వేలిటి మాట కాదు. మన హరిదాసులు సంకీర్తనం చేసేటువంటి వారు కళా స్వరూపాలుగా పరమాత్మ యొక్క కథలు గాథలు గాథలుగా జానపదుల మధ్య జానపదుల హృదయాలలో పరమాత్మ భావనని పాదుకునేట్టుగా చేసినటువంటి వారందరూ కూడా ఈశ్వర సమానులే. ఎందుకంటే భగవంతుడు తనను గురించి తాను చెప్పుకునే అవకాశం లేదు ఆయనకి. భగవంతుణ్ణి అనుభవించినటువంటి భక్తుడికి ఆయనకు చెప్-- ఆయన గురించి చెప్పవలసినటువంటిది ఒక బాధ్యత గనుక బాధ్యతను పూర్ణంగా స్వీకరించినటువంటి ఈశ్వర తుల్యమైనటువంటి సమానులైనటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే హరిదాసులుగా, భాగవతులుగా, నటులుగా, కళా స్వరూపాలుగా, పాండితీ మండీతులుగా, కవులుగా వచ్చి భగవంతుని యొక్క తత్వాన్ని బహుముఖీనంగా ప్రపంచానికి చాటుతూ ఉంటారు. ఆంధ్రదేశం ఎందుకని మూడు వేల ఆరు వందల మంది లెక్క ఏమిటి, ఇక్కడ ఎందుకున్నారు అని విచారణ చేస్తే ఆంధ్రదేశానికి అంటే తెలుగు దేశానికి త్రిలింగ దేశము అని పేరు. మూడు లింగాలున్నాయి. మూడు ప్రాంతాలలో మూడు లింగాలున్నాయి. దేవుళ్ళు కూడా ప్రాంతాలు చూసుకుని వెలగలేదు, వెలయలేదు. ఆయా ప్రాంతాలలో వారున్నారు శివ స్వరూపంగా ఉన్నారు. అందుకనే విశ్వనాథవారు ఒకానొక సందర్భంలో తెలుగు జాతిని గురించి ఒక మాట మాట్లాడుతూ ఓంకార స్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షా దక్షమై తాండవాహంకార స్థిరచంద్రయశ్శకల చైత్యప్రాప్త శాంతత్వమై శంకా సంకులమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించుతన్. అసలు ఆంధ్రదేశంలో పుట్టిన వాడికి వాడు జీవన్ముక్తుడవుతాడయ్యా అన్నాడాయన. ఎందుకట అంటే మూడు ప్రాంతాలలో ఉన్నటువంటి శైవాలయాలలో నుంచి సుప్రభాతాంచిత నవప్రభాత వేళ వినిపించేటువంటి నిస్తంద్ర మంద్రమైనటువంటి ఓంకార నాదము గాలిలోనే మిళితమై ఉన్నది గనుక గాలిని పీలుస్తున్నావు అంటే ఓంకారాన్నే పీలుస్తున్నావు గనుక నీకు ప్రత్యేకంగా ఉపాసనే లేదన్నాడాయన. కనుకనే వేద ప్రామాణికంగా కూడా ఆంధ్రత్వము అంటే తెలుగువాడిగా గనక జన్మ ఎత్తినట్లయితే వాడు ఏదో ఒక రోజున ఒక శంకని ఆధారం చేసుకుని, ఒక సందేహాన్ని ఆధారం చేసుకుని, ఒక హేతువుని ఆధారం చేసుకుని పరతత్వం వైపు నడుస్తాడు. ఎందుకంటే నా ఇతి నా ఇతి నా ఇతి నేతి నేతి అనుకుంటే కదా అసలు విషయం ఏమిటో తెలిసేది. అదేమిటో ఒక్కసారే తెలిస్తే మరి ప్రపంచం యొక్క ఉనికి అర్థమయ్యేదెట్లా? కనుక ఇది కాదు ఇది కాదు అంటూ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నుంచి జీవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి. క్రమ పరిణామ దశలో ఆంధ్రుడు ముందుంటాడు. అంటే తెలుగువాడు ముందు-ముందుంటాడు. ఉండి దేవుడు లేడన్నవాడు ఇక్కడే ఉన్నాడు, ఉంటే దేవుడంటూ ఉంటే ఇక్కడే ఉన్నాడని చెప్పినవాడు ఇక్కడే జమిలిగా అది కాలం తీసుకోండి, సందర్భం తీసుకోండి ఇద్దరూ అక్కడే పక్కపక్కనే కూర్చుని ఉంటారు. ఉన్నవాడు ఉన్నాడు అన్నవాడు వాటితో ఏం పెద్ద పేచీ లేదు, స్పర్ధ లేదు, వాదన లేదు. మరి లేదంటున్నవాడే ఎట్లా ఉన్నాడు అంటే లేడు అంటున్నవాడు హేతువు ద్వారా పరమాత్మను చూస్తున్నాడు. ప్రశ్నిస్తూ సమాధాన పడుతూ ఇది కాదేమో ఇది కాదేమో ఇది ఎట్లా అవుతుందని ఒక తార్కికమైన విధానంలో కానీ ఇద్దరూ ఏం-ఏం చేస్తున్నారయ్యా అంటే చివరికి భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని సమాధాన పడుతున్నారు. కనుక ఆంధ్రదేశంలో ఏర్పడినటువంటి జీవన్ముక్త స్థితి మనము అదృష్టవంతులంగా మనం భావన చేయాలి. అందుకనే రాగ అనురాగ ప్రేమ బంధాలలో రాగం మనకు తెలుసు, అనురాగం నెమ్మదిగా అర్థమవుతోంది. నా వాడు అనుకున్నవాడు నా వాడు కాకుండా పోతున్నాడు. నేను అమితంగా గౌరవించిన నా అన్న నన్ను అక్కున చేర్చుకోవటం లేదు. ప్రాణాధికంగా ప్రేమించినటువంటి నా తమ్ముడు నా బాగోగులు చూసేటువంటి సమయం లేదంటున్నాడు. కానీ ప్రేమ బంధంలో ఉన్నటువంటి సాధకుడు జ్ఞాని ప్రపంచంలో ఉన్న వారందరినీ తనవారిగా, తనవారందరినీ కూడా ప్రపంచం కంటే అభిన్నంగా అన్నీ ఒకటిగా అంతా ఒకటిగా అంతా అదేగా చూడగలిగినటువంటి ఒక మానసిక భావనా స్థితిని తాను ఏర్పరచుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
SSSMC · audio

Sandesame Adesam - 03

Home

Sandesame Adesam - 03

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 30:54

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

    Now playing
  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11