Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి కంటే ముందు వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా ఉపదేశం చేసినయి ఆదేశమిచ్చినయి ఇదిగో దీక్షా మంత్రం చెయ్ నీకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పింది కొన్ని ఇలా చేయకపోతే నీ జన్మ వృధా అని కూడా చెప్పినయి కానీ సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి సల్లక్షణమైనటువంటి మహా పరిపూర్ణమైనటువంటి స్వామి ఉపదేశాన్ని ఆదేశాన్ని సందేశాన్ని లలితంగా అలతి అలతి పదాలతో సరళమైన అచ్చమైనటువంటి తెలుగులో వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు ఆగమ శాస్త్రాలు వీటన్నింటి యందు అంతర్వాహిని గా ఉన్నటువంటి మహా పరి సత్యాలనన్నింటినీ కూడా ఏరి నాలుగు మాటలుగా మనకప్ప చెప్పారు అందులో లవాల్ గురించి మాట్లాడుకున్నాం నిజానికి భారతీయమైనటువంటి తత్వచింతనలో వ్యక్తి పూజ లేదు వ్యక్తిత్వ ఆరాధన మాత్రం ఉన్నది వ్యక్తి పూజ వ్యక్తితో చెల్లిపోతుంది వ్యక్తిత్వ పూజ వ్యక్తి దేహానంతరం కూడా కొన్ని యుగాల వరకు ప్రభావితం చేస్తూ నడుస్తుంది కనుకనే త్రేతాయుగం నాటి రాముడిని ద్వాపరయుగం నాటి కృష్ణుడిని కలియుగ ఆరంభ వేళ వచ్చినటువంటి శ్రీ దత్తుడిని మనం ఇప్పటికి కూడా సాకారంగా మనం ఉపాసన చేస్తూ ఉన్నాం పూజ చేస్తున్నాం అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒక పరమాత్మ ఒక వేదమాత ఒక వేదపురుషుడు నిజానికి వేదమే ఒక మానవ దేహాన్ని ధరించి గనుక ప్రపంచంలోకి వస్తే అది ఏం చెబుతుంది అని వేదార్థమే చెబుతుంది బంగారాన్ని గనుక ముక్క కోస్తే దానిలో నుంచి బంగారమే వస్తుంది వేరే వస్తువు రాదే అలాగే స్వామి వేద స్వరూపులు వేదమూలము మొట్ట మొదటి రోజు అనుకున్నాం వేదోఖిలో ధర్మమూలం వేదం నిండా ఏముందయ్యా ఉండవలసినదంతా ఉన్నది దాని నిండా వ్యక్తి ధర్మం ఉన్నది కుటుంబ ధర్మం ఉన్నది సామాజిక ధర్మం ఉన్నది రాజకీయ ధర్మం ఉన్నది అసలు ధర్మం యొక్క అనేక dimensions dynamics అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఒక్కొక్క అవతార మూర్తి ఆయా జాతి యొక్క పరిపాకాన్ని బట్టి ప్రాప్తిని బట్టి యోగ్యతను బట్టి అర్హతను బట్టి అవసరాన్ని బట్టి మూలాల అన్నింటినీ కూడా మళ్ళీ ఒక్కసారి పునః మానవజాతికి గుర్తు చేసి ధర్మ మార్గంలో నడిస్తే పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మని మానవ దేహాన్ని జీవన విలాసాన్ని పరిపూర్ణ స్థాయికి తీసుకొని వెళ్ళవచ్చును అది మీ చేతుల్లోనే ఉన్నది అనేటువంటి ఒక మౌలికమైనటువంటి ధర్మ సూత్రాన్ని అనేక రీతిలలో అందించాలి అందించే దిశగా రామో విగ్రహవాన్ ధర్మః నిజానికి కృతయుగంలో దేవుడు లేడు దేవుడు లేడు అంటే ప్రత్యేకంగా లేడు అని అర్థం ఉన్నదంతా సర్వం ఖల్విదం బ్రహ్మ ప్రకృతి ప్రకృతికి మూలమైనటువంటి పరమాత్మ అభిన్నంగా అద్వైతంగా అద్వితీయంగా అద్వయంగా ఉన్నాడు కనుకనే కృతయుగం నాటి మానవుడు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో నూట ఇరవై సంవత్సరాల కాలాన్ని ఆయు ప్రమాణాన్ని సంపూర్ణంగా అనుభవించాడు ముక్కారు పంటలు పండినయి ఋతువులన్నీ కూడా సక్రమంగా సాగినయి ప్రకృతితో సమకూడి ఉన్నటువంటి జీవుడు సాధకుడు మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు తన మూలమైనటువంటి పరమేశ్వరుడితో నాధానుసంధానం చేసుకొని లయాత్మకమైన దివ్య విధానంతో నీవు నేను ఒక్కటే అనేటువంటి తత్వమసి స్థాయిలో సంచారం చేశాడు గనుక దైవం యొక్క ప్రత్యేకమైనటువంటి అవసరం లేకపోయింది కాలం ఎప్పుడూ ఒక్కలానే ఉండదు కదా తెల్లవారింది త్రేతాయుగం ఏర్పడింది త్రేతాయుగంలో భగవంతుడిని ఎలా చూడాలి అని అనుకున్నప్పుడు యజ్ఞయాగాదుల ద్వారా కర్మకాండ ద్వారా భగవంతుడిని చూడవచ్చును అని ఒక శాస్త్రీయమైన శాస్త్రగతమైన స్మృతి భాజ్యమైనటువంటి ఒక విషయం వచ్చినప్పుడు దశరథ మహారాజు వశిష్ఠుల వారిని అడిగాడు ఇదిగో ముగ్గురు భార్యలున్నా నేను నిస్సంతని మరి నా తర్వాత వారసుడు ఎవరు అని ప్రశ్నిస్తే పుత్రకామ ఇష్టి చేసుకో పుత్రుడిని కోరి ఒక ఇష్టి చెయ్ యజ్ఞం చెయ్ నీకు భగవంతుడు దక్కుతాడు అన్నాడు భగవంతుడు దయా పరిపూర్నుడు గనుక రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు గా నాలుగు వేదాలను కూడా తన వెంట పెట్టుకొని వచ్చాడు నాలుగు నలుగురు కూడా ధర్మాన్ని మానవుడిగా గనుక ఒక జన్మ ఎత్తితే ఎట్లా ఆచరించాలో సోదాహరణ పూర్వకంగా తమ జీవితమంతా పరచి తరచి ఉంచి సాగించారు త్రేతా వెళ్ళిపోయింది ద్వాపర వచ్చింది ద్వాపర వచ్చేసరికి మానవుడిలో కల్మషము కాలుష్యము నెమ్మదిగా ప్రవేశించింది ద్వాపర తొలినాళ్లలోనే త్రేతాయుగంలో ఒక రాజు ఇంకో రాజు మీద యుద్ధం చేయటం విన్నాం ద్వాపర యుగంలో అన్నదమ్ములు జ్ఞాతి వైరాలు పుట్టినటువంటి జాతి అది అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతాఅభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దేవీదేవతలు ఎలా వస్తారు? అవతార పురుషులకి లోకంతో ఏం పని అనేదానికి ఒక విస్పష్టమైన నిర్దుష్టమైనటువంటి ఒక నిశ్చితమైన మనీషాయత్తమైన భావనలో శ్రీకృష్ణుడు నిర్ద్వందంగా ప్రకటించాడు. ఎప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో, ఎప్పుడు మానవుడు ధర్మం నుంచి దూరం అవుతాడో ఆయా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేనే సృష్టించుకుంటాను. కనుక అవతారాలన్నీ కూడా ప్రసవావతారాలు కావు, అవన్నీ ప్రభవావతారాలే. అది వారి నిర్ణయాన్ని బట్టి అవి ఏర్పడతాయి. జాతి ఔద్ధత్యాన్ని, జాతి యొక్క గొప్పదనాన్ని, జాతిని సన్మార్గంలో నడిపించే దిశగా ఇవన్నీ సాగుతూ సాగుతూ సాగిపోతాయి. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాకార సగుణ స్వభావ స్వరూపంగా వచ్చినప్పటికీ ఆయనని దేవుడని నమ్మిన వారు తక్కువ. మానవుడిగానే చూస్తూ-చూస్తూ ఎన్నెన్ని విధాలుగానో ఆయనని దూషించడం మొదలు పెట్టారు. అయినా అవతార కార్యక్రమం చాలా విస్తృతమైనది, గంభీరమైనది. జాతి అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా కార్యక్రమాన్ని తలపెట్టుకొని ఒక అవతారమూర్తి జగత్తులోకి వస్తాడో, దేనినీ లెక్కచేయకుండా శ్రీకృష్ణ పరమాత్మ శాంతి, ప్రేమ అనబడేటువంటి రెండింటినీ తన జీవిత కాలంలో, అవతార కాలంలో పూర్ణం చేసి ధర్మసంస్థాపనతో పాటుగా శాంతి ప్రేమలను కూడా ప్రపంచానికి అందించాడు. అయితే కృతయుగనాటి సత్యం, త్రేతాయుగనాటి ధర్మం, ద్వాపరనాటి శాంతి ప్రేమలు నాలుకూ కలిసి కలియుగంలో ఉండేటువంటి అహింసా ప్రబోధం ఏదైతే ఉన్నదో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా స్వరూపంగా సత్యసాయి భగవానుడు మహా పరిపూర్ణ అవతారంగా వచ్చారు. కనుకనే స్వామి ధర్మాన్ని ఆచరించమన్నారు, సత్యాన్ని ఎరగమన్నారు, ఆత్మనిష్ఠుడుగా ఉండమన్నారు. అనేకమైనటువంటి రీతులలో ఎన్ని భౌతిక సంపదలు ఉన్నా శాంతి లేకపోయినట్లయితే భౌతిక సంపదలకు రకమైన విలువ లేదు గనుక అహింసా ప్రవృత్తితో కూడా ఉండమని చెప్తూ ఐదింటినీ కూడా ఐదు భాగాలుగా చేసి సమన్వయమైనటువంటి రీతిలో మానవుడు తన జీవితాన్ని గడపాలి అని ప్రబోధం చేశారు. ప్రచారం చేయలేదు, ప్రసారం చేశారు. ఇది సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన, నిగూఢమైనటువంటి ఒక అంతర్వాహిని. దీనిని గమనిస్తూ ఉన్నట్లయితే స్వామి అనేకమైనటువంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోనక్కర్ల. కాకపోతే సత్యసాయి భగవానుడి అవతారం వచ్చే దాకా అనేకమైన సంస్థలు ఏర్పడ్డాయి. సంస్థలన్నీ ఆయా సిద్ధాంతాల ప్రచారం కోసం వాడుకోబడ్డవే తప్ప సర్వ మానవాళికి సేవ చేసేటువంటి విధానం దానిలో లేదు. ఎవరి ఎవరి సిద్ధాంతం వైష్ణవుడు వైష్ణవుడుగా, శైవుడు శైవుడుగా, జైనుడు జైనుడుగా అనేక రకాల మతాన్ని నమ్మితే, భావనకు గనక ఆకర్షితుడైతే దాని ప్రకారంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. దానికి కావలసినటువంటి అధిపతులు ఏర్పడ్డారు. పీఠాలు ఏర్పడ్డాయి. వారు కూడా ధర్మ ప్రబోధం చేస్తూ వచ్చారు. కాకపోతే అది పాక్షికంగా. మరి సమగ్రమైనటువంటి భారతీయ తత్వ చింతనని, ఒక దివ్య విధానాన్ని, మానవీయమైనటువంటి విలువలను, సమాజగతమైనటువంటి అనేకానేకమైనటువంటి భావనలని వీటన్నింటినీ సమన్వయం చేస్తూ జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతంగా ఒకే ఒక వసుధైక కుటుంబకం అనేటువంటి వేద ప్రామాణికమైనటువంటి మహా సంస్థని నిర్మాణం ఎలా చేయాలి? ఇది ఎవరి వలన సాధ్యమవుతుంది? జాతులన్నీ కలవాలి, మతాలన్నీ కలవాలి, వర్గాలు లేవు, కులాలు లేవు అనుకున్నట్లయితే అంటున్నాం గానీ వాటిని వదిలిపెట్టలేకపోతున్నాం. కానీ వీటన్నింటినీ కలిపేటువంటి ఒక అంతఃసూత్రము ఏమి? అని విచారణ చేసినటువంటి సత్యసాయి భగవానుడు మనకి రెండు మార్గాలు ఉపదేశనం చేశారు. వాటిని మించి సాధనా మార్గం లేదని కూడా తమ అవతార కాలంలో సర్వ ప్రపంచానికి, కేవలం ఆంధ్రదేశానికి మాత్రమే కాక సమస్త సృష్టికి కూడా తమ యొక్క భావనని ప్రసారం చేయగలిగారు స్వామి. ఏం చేశారు అని. ఒకటి ప్రేమ, రెండవది సేవ. అందుకనే స్వామి ప్రతిపాదన చేసినటువంటి, సంకల్పించినటువంటి, ప్రారంభించినటువంటి, నడిపించినటువంటి ఒకే ఒక సంస్థ దాని పేరు సత్యసాయి సేవా సంస్థలు. సేవా Organization అంటే Organized సేవ కాదు. అసలు సేవే Organization. సేవగా, సేవలో, సేవతో సేవే మనంగా గనుక రూపాంతరీకరణం చెందగలిగినట్లయితే సేవ బినా నిర్వాణనహి. ఎక్కడో మరణానంతరం విష్ణులోకానికి, కైలాసానికి అనేక ధామాలకు వెళ్తామని మన పురాణాలు చెప్తే వేద ప్రామాణికమైనటువంటి మాటని, ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని స్వామి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఇహమేవా అన్నటువంటి మాటని నౌ అండ్ హియర్ అంటే ఇప్పుడే ఇక్కడే దీని తర్వాతేం లేదు ఉన్నదంతా ఇప్పుడే ఉన్నది. ఇప్పుడే అంటే The present is omnipresent అంటూ మనకు బోధ చేశారు. గడచిన నిన్నకి పుట్టబోయే రేపటికి మనకెట్టి సంబంధం లేదు. ఎందుకంటే రేపుకు రూపం లేదు. మనం ఉన్నా లేకపోయినా రేపు ఉండవచ్చునేమో కానీ రేపులో మనం ఉంటామో ఉండమో మనకు ఎరుక లేదు. వైరాగ్య వివేక విచక్షణాయుతమైనటువంటి ఒక మహత్తర జ్ఞాన భూమికని స్వామి చాలా స్పష్టంగా ఆవిష్కరిస్తూ సమస్త మానవాళి శాంతిని, ప్రేమని, సమత్వాన్ని, సహజీవన సౌందర్యాన్ని ఎక్కడి నుంచి వీళ్ళు పొందగలరు అని మనకిచ్చినటువంటి మహా మంత్రము అదే, మహా తంత్రము అదే, మహా యంత్రము అదే. దాని పేరే రెండు అక్షరాలలో ఇమిడి ఉన్నటువంటి సేవ. సేవ స్వామి ఎట్లా ప్రారంభించారు? పుట్టపర్తితో ప్రారంభించారు.తాను ఎక్కడ ఉన్నారో అక్కడ తాను ఏమి చేశారో దానిని చేసిన తర్వాత ప్రపంచానికి చెప్పారు మీరందరూ చేయండి నేను చూస్తాను అనలేదు నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి అన్నారు కారణంగానే ఇవాళ పుట్టపర్తి ఒక అంతర్జాతీయమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా అలాగే ఆనాడు స్వామి తలపెట్టినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలన్నీ కూడా ఇవాళ ప్రపంచానికి ఉపాధేయమైనయి ఆచరణీయమైనయి అనుసరణీయమైనయి ఆదర్శప్రాయమైనయి వాటిని మించి మరొక వస్తువు లేదు ఒక మార్గము లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికని సర్వ జగత్తుకి కూడా స్వామి అందించారు. సేవ అంటే ఏమిటి? అంటే స్వామి చెప్పారు ప్రతిఫలాపేక్ష లేకుండా నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నీవు ఎవరి నుంచి ఏది ఆశించకుండా అది సంపద కావచ్చు కీర్తి కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అవేమీ లేకుండా నీ కార్యకలాపాలు భగవంతుడు చేయిస్తున్నాడన్న భావనతో చేస్తే దాని పేరు సేవ. దానికి ఏం ఫలితం ఉంటుంది ఏం ఫలితం ఉంటుందంటే భగవంతుని యొక్క అనుగ్రహం నీ పరమవుతుంది కాదు నేను స్వామికి బాగా సేవలు చేశాను నేను స్వామి చుట్టూ తిరిగాను స్వామిని చాలా ప్రచారం చేశాను నా జీవితం అంతా ఆయనకే అంకితం చేశాను అంటే నేను చేస్తున్నాను అనుకున్నంత కాలం చేసేదంతా ఒట్టి చాకిరీయే. చాకిరీకి నాలుగు కూలి డబ్బులు దక్కుతాయి తప్ప భగవంతుడి అనుగ్రహం మాత్రం దక్కదు అంటే ఏది నిష్కామ కర్మగా వేదాలు వేదాంగాలన్నీ మనకు సనాతనంగా బోధించినయో దానినే సత్య సాయి భగవానుడు సేవని సందేశామృతంగా మనకు అందించారు. రెండవది సేవ చేస్తూ ఉన్నప్పుడు మానవుడిలో ఉన్నటువంటి అహంకారం మమకారాలు రెండూ కూడా తగ్గిపోతాయి సేవ చేయనంత కాలం నేను చేయిస్తున్నాను మరెవరో నాతో చేస్తున్నారు అనుకుంటారు స్వామి ఒకసారి కదాచిత్ ప్రసంగ వశాత్ అన్నటువంటి మాట క్షణాన మనసులో మెదులుతున్నది. జ్ఞాని అయినవాడు భక్తుడైనటువంటి వాడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు తన తోటి వాడిని "He is working with me" అంటాడు తానే చేయిస్తున్నాను అన్నటువంటి వాడు "He is working for me" అంటాడు. "He is working for me" అంటే ఎవరు చేస్తున్నారో వాడి కంటే నేను అధికుడిని అని చెప్తూనే ఉంటాడు కానీ చేస్తున్న వారంతా నాతో కలిసి చేస్తున్నారు అని అంటున్నాడే "working with me" లో నుంచి ఒక సహజీవనమైనటువంటి మహా సౌందర్యం ఆవిష్కరింపబడుతుంది. కలిసి ఉండటంలో ఇందాక నుంచి మనం ప్రతిరోజూ సహనావవత్ చెప్పుకుంటాం అంటే ఏమిటి? అంటున్నవాడు, వింటున్నవారు, అనిపిస్తున్నవాడు అంతా ఒక్కటై త్రిపుటియై అభేదంగా ఉండటమే పూర్ణ ప్రజ్ఞ కాబట్టి దిశగా సేవని స్వామి జనలోకంలోకి జన జాగృతమైనటువంటి సమాజంలోకి సర్వ జగత్తులోకి అనేకమైనటువంటి పాయలుగా ప్రారంభించి సుక్షేత్రాల అన్నింటి నిండా ఇవాళ దానిని ఒక యోగంగా మార్చారు. మనకి నాలుగు యోగాలు తెలుసు నిజానికి భగవాన్ రమణ మహర్షి వచ్చేదాకా మూడు యోగాలే తెలుసు ఒకటి భక్తి యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం. రమణ మహర్షి వచ్చి భక్తి యోగానికి జ్ఞాన యోగానికి మధ్య ఒక చిన్న విరామంగా స్వల్పంగా యోగము అని ఒకటి ఉన్నది యోగమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతగా జగత్తుకు అందించాడు గనుక కర్మ, భక్తి, యోగ, జ్ఞాన అనబడేటువంటి నాలుగు యోగాలు ఉన్నాయి అంటే సత్య సాయి భగవానుడు కర్మ, భక్తి, యోగ, జ్ఞాన యోగములున అన్నింటినీ కూడా కలిపి ఐదవదిగా పంచముఖీనమైనటువంటి సేవా యోగాన్ని దాంతో సమన్వయం చేశారు. ఎందుకంటే సేవ చేయటంలో కర్మ ఉన్నది. సేవని చాలా Concerted effort తో చేయటంలో భక్తి ఉన్నది. ఎరుకతో కూడి అందరం కలిసి చేయటంలో యోగం ఉన్నది. స్పష్టతతో అర్థమెరిగి కార్యక్రమాలు చేయటంలో జ్ఞానం ఉన్నది. నాలుగు కలిపితేనే సేవ అవుతుంది గనుక సేవ చేసేటువంటి యోగంలో, సందేశంలో, స్వామి యొక్క భావనలో, స్వామి యొక్క సంకల్పంలో, ఏమి మిడి ఉన్నది అని విచారణ గనుక చేసినట్లయితే సర్వ యోగముల సారమే సేవా యోగమై ఉన్నది. ఇక్కడ మనం ఒక సేవకు వెళ్తాం. ఎలా వెళ్తాం? ఒక్కళ్ళుగా వెళ్లి సేవ చేయలేం. సామూహికంగా వెళ్తాం. సామూహికంగా వెళుతూ చేసే ప్రతి పని కూడా సత్ర యోగ సమానం. ఒక వ్యక్తి ఒక గురువు నుంచి దీక్షా మంత్రాన్ని తీసుకుని చెట్టు కిందో పుట్ట కిందో కూర్చొని జపమాల తిప్పుతూ తపస్సు గనుక చేసుకున్నట్లె-- చేసుకున్నట్లయితే అది వైయక్తికం Individual. అలాగే అది సోమ యోగం దాని వల్ల ఫలితం వ్యక్తికి లభిస్తుంది. కానీ సత్ర యోగంలో అందరం కలిసి సామూహికంగా చేసేటువంటి సేవలో అలసట ఉండదు ఆనందం ఉంటుంది. అపేక్ష ఉండదు ఉపేక్ష ఉంటుంది. ఉపేక్ష మాత్రమే కాదు ఔదాసీన్య ఉండదు పరిపూర్ణమైన తృప్తి ఉంటుంది. సేవ చేసి సాయంకాలం వేళ మళ్ళీ మన మన ఇళ్ళకి వెళుతూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం కోటానుకోట్ల రూపాయలు సంపాదించినా కలగనంత ఆనందం మనకు కలుగుతుంది. అందుకనే స్వామి సేవ ఎవరో ఇస్తే చేయకండి అడిగితే చేయండి మీరు ఎలా అడగగలరు ఎవరో వచ్చి మిమ్మల్ని చేయండి అంటారు చేయండి అంతే. అది ఎందుకు చేయాలి ప్రశ్నే లేదు చేయాలి అంతే. ఎందుకు చేయాలి? అది భగవత్ నిర్ణయం. ప్రేరణ భగవంతుడిది ప్రయత్నం జీవుడిది. మానవుడు తనంతట తానుగా దేనినీ నిర్ణయించుకోలేడు దేనినీ చేయలేడు కానీ భగవంతుడు అన్నీ చేయగలిగి ఉండి కూడా మన బోటి వారందరికీ కూడా సేవా యోగంలో ఒక పాత్రనిస్తాడు. పాత్రని నిబ్బరంగా, నిశ్చలంగా, నిజాయితీగా, గంభీరంగా, మర్యాదగా.సమర్పణ భావంతో గనుక చేసినట్లయితే అది సేవ అవుతుంది. సేవ పరమ ఆనందాన్నిస్తుంది. పరమానందాన్ని మనం ఒక విచారణ గనుక చేసినట్లయితే సేవ మనకు లభించింది అనుకుందాం. సేవ లభించినప్పుడు దీంట్లో నుంచి నాకేం లాభము? అంటే లాభం ఖచ్చితంగా ఏదో ఉంటుంది. తృణమో ఫలమో దక్కుతుంది. అది మనుష్య ఆనందం. నేను ఒక్కడినే చేయలేను నలుగురం కలిసి చేద్దాం అనుకున్నప్పుడు మనుష్య ఆనందము మనీష్ ఆనందం అవుతుంది. మనీష్ ఆనందంలో నుంచి దీనిని కాస్త ప్రజ్ఞాపూర్వకంగా అంటే skillfull గా చేస్తే బాగుండునే పది రోజుల్లో చేసేది ఒక గంటలో చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే అది గంధర్వ ఆనందం అవుతుంది. గంధర్వ ఆనందంలో మన బుద్ధిని అంటే మన intellect quotient ని మనకున్నటువంటి తీవ్రమైనటువంటి విచార ధారణి మనకున్నటువంటి దైహిక, మానసిక, ఆంతరంగిక శక్తులని ఒక త్రిపుటిగా గనక చేసినట్లయితే అది దేవగంధర్వ ఆనందం అవుతుంది. దేవగంధర్వ ఆనందం తర్వాత పని చేసినందువలన ఇంతమందికి ఆనందం కలిగింది కదా అన్నటువంటి ఆనందమే ప్రజాపిత ఆనందం అవుతున్నది. ప్రజాపిత ఆనందంలో మనల్ని ఎరిగినవారు మనమంటే తెలిసినవారు ఓహో సేవలో భగవంతుడు అనుగ్రహించినటువంటి సేవా యోగంలో కాస్త ముందుకు వెళుతున్నారు పైకి వెళుతున్నారు అనేటువంటి ఒక ఆనందం మనని చూసిన వారికి కలిగించినట్లయితే అది పితృ పిత ఆనందం అవుతున్నది. ఇక చివరగా నేను కార్యక్రమం తలపెట్టానో, కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని మానవ దేహాన్ని నేను తీసుకొని వచ్చానో, అవనీ సంచారం చేస్తున్నానో దీనిలో నా కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వీడికి నేను ఇవ్వబోయే ఆనందము దాని పేరు హిరణ్యగర్భ ఆనందము. పరమేశ్వరుడు అయినటువంటి స్వామి దగ్గర మనుష్య ఆనందం లేదు. ఆయన్ని తృప్తి పరచలేము. నాకు చాలా ఆనందంగా ఉంది అనలేరు. ఎప్పుడు అనగలరు అంటే ఇన్ని ఆనంద తారక స్థితులను దాటి దాటి దాటి వెళ్ళి పరమేశ్వరా మొదట్లో తెలియక నేను చేస్తున్నాను నీ అనుగ్రహం కావాలి అంటాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అసలు నేను చేస్తున్నాను నువ్వు చూస్తూ ఉండు స్వామి అంటాం. మూడవ స్థాయికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఒకానొక స్పృహ కలిగి స్వామి మీరు చూస్తున్నారు మీరు చేస్తున్నారు నేను చేస్తున్నాను అంటాం. అంటే ఇంకా నేను నశించకుండానే ఉంటుంది. కానీ జ్ఞాన సముపార్జనంలో కాలగమనంలో భగవదనుగ్రహం చేత, ప్రాప్తి చేత, యోగ్యత చేత, సాధనా తీవ్రత చేత ఒక భావన కలుగుతుంది. పరమేశ్వరుడే చేస్తున్నాడు ఇందులో నేను లేదు. నేను అనేటువంటి నేను భావన నశించడానికి సేవను మించినటువంటి యోగం మరొకటి లేదు. చూడండి కర్మలన్నీ కర్మ యోగాలు ఎప్పుడవుతాయి అంటే ప్రతి వాడు కర్మ చేయని వాడు లేడు కానీ భగవంతుడికి సమర్పించే దిశగా పనులన్నీ భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో గనక చేస్తే యోగించి చేస్తే అంటే కూడి చేస్తే ఎవరితో భగవంతుని తలపుతో భగవంతుని ప్రజ్ఞతో కూడి చేస్తే కర్మలన్నీ కర్మ యోగాలు అవుతాయి. పూజలు, దానాలు, జపాలు, తపాలు, యజ్ఞయాగాదులు అవన్నీ మనం గనక చేసుకున్నట్లయితే కేవలం అది భక్తి మన పూజా మందిరానికి పరిమితం అవుతుంది. కానీ పరమేశ్వరుడిని దేహంలో ఎట్లా ఆపాదమస్తకం కూడా సర్వవ్యాపకమైన పరమాత్మ నీవు నా యందు శివుడుగా, భవుడుగా, మాధవుడుగా అనేక రూపాలలో ఉన్నావన్న భావనతో కూడి గనక చేసినట్లయితే భక్తి భక్తి యోగం అవుతున్నది. అలాగే నేను అన్నటువంటి భావనలో నుంచి అసలు నేను అన్నటువంటి లోకలోకాంతర ప్రాణాలలో దాగినటువంటి హృదయంగమమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని గనక ఎరగగలిగినట్లయితే అంటే physical, meta physical and spiritual spiritual స్థాయికి అధ్యాత్మ స్థాయిలో విచారణ గనక చేసినట్లయితే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యః మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ Marasāsvam ಚಿನ್ವತಾ ಮಜ್ಜತಾವಾ ಪವನ ಚರಣರೋಧಾತ್ ఆత్మనిష్ఠో భవత్వం. నేను ఆత్మ నిష్ఠుడనై ఉన్నాను నా యందు పరమాత్మ ఉన్నాడు పరమాత్మే సంకల్పాలు చేస్తున్నాడు అన్నది కేనోపనిషత్తు యొక్క మూలం కాబట్టి ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి కదలిక, ప్రతి మెదలిక పరమేశ్వరుడు అయినటువంటి స్వామి యొక్క సంకల్పంగా భావించినట్లయితే అన్ని యోగాలు కూడి ఒక్కచోట సేవా యోగంగా రూపుదిద్దుకుంటాయి. మనకి జన్మతః egoes ఉంటాయి అవి వాసనాస్ అంటాం. వాసనలకి మూల వాసనలున్నాయి. మూల వాసనలకి సంస్కారాలున్నాయి. సంస్కారాలన్నీ కర్మలలో నుంచి ఏర్పడ్డాయి. కర్మలన్నీ జన్మలలో నుంచి ఏర్పడినయి. అంటే జన్మ, కర్మ, కర్మలో నుంచి ఆలోచన, ఆలోచన నుంచి సంస్కారం, దానిలో నుంచి ఇవాళ మనం చెప్పుకునే treats అంటాం and tendencies అంటామే అవే వాసనలు మూల వాసనలే మన వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానమైన భూమిక వహిస్తాయి గనుక మనం ఏం చేయాలి? సేవా యోగం ద్వారా సేవ ద్వారా ప్రపంచంలో మనకున్నటువంటి అహంకారము అనేటువంటి component ని మనం వదులుకోవాలి. అహంకారం పోతే ఏం వస్తుంది అని అహంకారం పోతే అహం స్పురణ కలుగుతుంది. నేనే చేస్తున్నాను లో నుంచి నేను చేస్తున్నాను లోకొచ్చి నేను కాదు ఎవరో చేయిస్తున్నారు అనుకొని ఎవరో చేయిస్తున్నదే అన్నింటికీ మూలమని గనుక ఒక చిన్న స్పృహ కలిగినట్లయితే దానిని మనం అంతరంగ స్పృహగా, అహం స్పురణగా, ఆత్మనిష్ఠగా, ఆత్మ భావనగా మనం భావించగలుగుతాం. ఇది సేవ. మిగతాది రెండవ భాగం రెండవ పార్శ్వం మమకారం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇంద్రియాలు షడూర్మములతో, షడ్ వికారములతో, షడ్ వర్గములతో ఏర్పడినటువంటి మానవ దేహంలో చాలా పదునైనటువంటిది ఏమిటి అంటే mind. mind ఎక్కడి నుంచి పుట్టింది అంటే హృదయ స్థానం నుంచి పుట్టినప్పటికీ అది it is a shade of our own ego.ఆ ego అంటే మన బలం అనుకుంటాం మన బలహీనతే మన ego దాన్ని గనక చంపుకోగలిగినట్లయితే దానిని మించింది లేదు సాధ్యమేనా అని ఇందులో ego చంపుకున్నవారు ఎవరైనా ఉన్నారా అంటే పరమేశ్వరుడు egoless less ego కాదు అసలు egoless కనుకనే అంపశయ్యమీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా నుంచుని ఉండగా విష్ణు సహస్ర నామాన్ని చెప్తున్నప్పుడు శిరస్సు వంచి చేతులు కట్టుకొని అతి శ్రద్ధాళువై విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్తోత్రం అంతా ఎవరి గురించి ఆయన గురించే కానీ ఎవరి గురించో చెప్తున్నట్లుగా ఎవరో అంటున్నట్లుగా నిర్వికార నిర్విశేషమైనటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావనలో సంస్థితమైనాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈవేళ ప్రపంచం మనల్ని ఎన్ని రకాలుగా కీర్తించని అది పరమేశ్వరుడికి చెందేదే పరమేశ్వరుడి చేతిలో ఒక ఉపకరణంగా గనక మనం ఉండగలిగినట్లయితే సేవ ఒక అధ్యాత్మ సాధన అవుతుంది అన్నారు స్వామి. సేవని కేవలం ఒక పనిగా వాడుకోకండి discipline ఒక శాంతాన్ని గురించి ఒక గంట మాట్లాడతాం ధర్మాన్ని గురించి ఒక గంట మాట్లాడతాం యజ్ఞయాగాదుల్లో ఉన్న రహస్యాల గురించి అనేక విషయాలు రెండు గంటలు మాట్లాడతాం ప్రయోజనం ఏదైనా ఉన్నదా? దానిని ఆచరించాలి ఆచరించాలి అంటే ఒక భూమిక కావాలి భూమిక కావాలి అంటే అవకాశం రావాలి అవకాశం రావాలి అంటే అర్హత కలగాలి అర్హత కల-కలగాలి అంటే భగవంతుని యొక్క ప్రేరణ రావాలి ఇన్ని కలిగితే ఒక్క సేవ చేసుకోవటానికి పరమేశ్వరుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు స్వామి అన్నారు "నీకు ఎవరు సేవ ఇవ్వటానికి సిద్ధపడి పని నువ్వు చేయ్యని నీకు అప్పజెప్పారో ముందు వారికి నమస్కరించు వారే గనక నీకు యోగాన్ని ఇవ్వకపోతే నువ్వేం సేవ చేయగలుగుతావ్? నీ దగ్గర intellect ఉండొచ్చు, నీ దగ్గర ధనరాసులు ఉండొచ్చు, నీ దగ్గర అనేకమైన దైహిక మానసిక శక్తులు ఉండొచ్చు అన్నీ ఉన్నా నాకు సేవ-- నీకు సేవ ఇస్తున్నాను." అనే వ్యక్తి గనక లేకపోయినట్లయితే అవన్నీ దాచుకున్న డబ్బే స్వామి మాటల్లోనే దాచుకున్నది ఏదైనా పాచిపోయేదే పంచిపెడితే అది పెరుగుతుంది ప్రౌఢప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః స్వశిష్యబోధయా తత్సత్యమాశ్రితావన్ గురువు తన జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వాలి ధనికుడు అంటే కలిగిన వాడు నలిగిన వాడిని కాచుకోవాలి. అలాగే అంతరంగ ప్రవృత్తిలో నిష్టలో ఉన్నటువంటి సమాజం గుర్తించాలి తాను కూడా సమాజం నుంచి ఏది పొందాడో మళ్ళీ సమాజానికి కారణం లేకుండా సేవాభావంగా గనక దాన్ని అందించగలిగినట్లయితే అది నిజానికి ఒక జీవన్ముక్త స్థితి. ఒక్కసారి సత్యసాయి భగవానుడి యొక్క అవతార వైభవాన్ని మనం గనక పరిశీలించినట్లయితే పరిశోధనాత్మకంగా కాక ఒక పవిత్రమైనటువంటి భావంతో దానిని దర్శనం చేసినట్లయితే ఒక కుగ్రామంలో eighth standard కూడా complete చేయని అతి మానవ స్థితిలో స్వామి సంకల్పించి చేసినవన్నీ చూసినప్పుడు అది పరదైవం అవునా కాదా? అని ప్రశ్న వేసుకుంటే అవును అన్నదే జవాబు. అందుకనే డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య గారు పుట్టపర్తి పాపయ్య శాస్త్రి గారు ఆయన్ని ఎన్నో సార్లు పిలిచినా "నాకంత నమ్మకం లేదులే ఓయ్ నేను రాను." అని అంటే "కాదు నువ్వు రమ్మను." అని చెప్తే అవకాశం ఎప్పుడో వస్తే స్వామి యొక్క దర్శనం ఆయనకి లభించింది స్వామి ఆయనతో ఏం మాట్లాడలే దర్శనం ఇవ్వటానికి స్వామి రోజునే కొన్ని గ్రామ సేవలన్నీ అయిపోయి కళకళలాడుతూ అందరూ పరమానందంలో ఉన్నారు స్వామి వస్తున్నారు సమయంలో ఆయన మహాకవి గనుక రెండు పద్యాలు రాసుకున్నారు. అవతరించ నేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి ఆతడు పన్యసింప యావత్ప్రపంచాన దేవభాషయ్యే తెలుగు నేడు స్వామి వచ్చి తెలుగులో చెప్పేదాకా తెలుగు అమృత భాష కా లే అన్ని భాషలతో ఇది సమానం ఆయన దైవం గనుక ఆయన తెలుగులో మాట్లాడారు గనుక ఇదిగో మా తెలుగు భాష కూడా దైవభాష అయింది అంటూ రెండోసారి అప్పటివరకూ కేవలం అపనమ్మకంతో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి కేవలం స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శన స్ఫూర్తితో రెండో పద్యం రాసుకున్నారు. అరయ సత్యసాయి దేవుడే అయినచో ఆయన మానవీయతకు అంజలింతు అరయ సత్యసాయి నరమాత్రుడైనచో ఆయన దివ్య గరిమకు అంజలింతు ఎంత దివ్యమైన భావనో చూడండి నిజానికి నమ్మకం కలిగేదాకా కష్టం గాని నమ్మకం కలిగినదా-తర్వాత అంతా అదృష్టమే. ఆయన అదే అన్నారు ఈయన గనక నిజంగా దేవుడే గనక అయినట్లయితే ఆయనకు అనుభవం లేదు కదా ఆయనలో ఉన్నటువంటి మానవత్వానికి నేను నమస్కరిస్తున్నా ఇంత మానవుడు ద-దైవం మానవుడిగా ఇంత గొప్పగా ఉంటాడా కాదు కాదు నా మనస్సు నేను కేవల మానవుడే అనుకుంటే మానవాతీతమైన పనులేమిటి? కార్యక్రమాలేమిటి? సర్వ ప్రపంచం ఆయన కోసం ఎదురు చూట్టం ఏమిటి? దివ్య వైభోగం ఏమిటి? స్వామి యొక్క దర్శనంలో నుంచే నా లోకలోకాంతర ప్రాణాలన్నీ ఒక్కసారి లేచి సర్వదేహము సర్వాంగీణమైన దేహం పులకాంకుర ప్రకరం అయిపోతున్నదే నేను ఎక్కడ ఉన్నాను? అని ఒక ప్రశ్న వేసుకున్నారు అది స్వామి యొక్క దర్శన మహత్యం. తర్వాత ఆయన సేవ చేసుకున్నారో ఏం చేసుకున్నారో అది సాధకుడు అందుకోగలిగినటువంటి యోగం అదృష్టం.
SSSMC · audio

Sandesame Adesam - 06

Home

Sandesame Adesam - 06

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:58

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

    Now playing
  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11