No transcript for this section.
[భాగవత సంగీతం] సందేశమే ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధాలపై శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారి విశ్లేషణ. [భాగవత సంగీతం] త్రేతాయుగం అయిపోయింది రెండవ పురాణ పురుషోత్తముడు ఉన్నాడు ఆయన శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా ఒక మాధుర్యాన్ని ప్రౌఢ కృష్ణుడిగా ఒక రాసిక్యాన్ని ఒక లాలిత్యాన్ని ఒక మార్ధవాన్ని అలాగే చివరలో ఒక యోగేశ్వర కృష్ణుడుగా యోగశాస్త్రాన్ని ఒక జ్ఞానబోధగా అనుగ్రహించినటువంటి యోగీశ్వరుడిగా అనేక దశలను శ్రీకృష్ణుడి యొక్క జీవితం మనకు పరిచయం చేస్తుంది ఈ పరిచయంలో లీలాశుకుడు అంటాడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. శ్రీకృష్ణుడు అసలు వృద్ధాప్యం ఆయన దగ్గరకు రాదా? ఈ వేణుగానాన్ని నేను ఎన్నిసార్లు వినును ఎప్పుడు విన్నా మళ్ళీ వినాలని అనిపిస్తుంది. ఈ శ్రీకృష్ణుడి యొక్క దివ్య లావణ్య రేఖా విలాసితమైనటువంటి ఈ దివ్య మంగళ విగ్రహాన్ని నేను దర్శించి దర్శించి ఆనందానుభూతిని ఎంతగా నేను లోపల పెట్టుకోగలుగుతాను. అవునులే! నీవు మహానంద సర్వస్వానివి కదా అంటాడు. జిహానం జిహానం సుజానేన మౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ రామకృష్ణులు ఇద్దరి మధ్య సందేశం ఇవ్వటంలో కొద్దిగా తేడా ఉంది. రాముడు తన జీవన విధానం ద్వారా సందేశం ఇచ్చాడు మానవుడు ఎలా జీవించాలి అంటే రాముడు ఎలా జీవించాడో తెలుసుకుంటే మనం ఎవర్ని consult చేయక్కర్లే. కృష్ణుడు మాత్రం అట్లా చేయలే. ఆయన కొన్ని హెచ్చరికలు చేశాడు. ఎందుకని అంటే రామావతారంలో రాముడిని తన చుట్టూ ఉన్నటువంటి వారంతా నువ్వు దేవుడివి అంటే కాదు కాదు నేను దశరథ నందనుడిని రఘురాముడిని మాత్రమే నేను రఘురాజుని మాత్రమే మానవుడిగా ఉండటానికే ఇష్టపడి వచ్చానన్నాడు ఇది మాయామానుష వేషం. మాయకు లోబడిన వేషం మాయను ఎదిరించని వేషం మాయను అంగీకరించినటువంటి వేషం విధిని అంగీకరించిన వేషం. కానీ కృష్ణుడు అట్లా కాదు నిజానికి కృష్ణుణ్ణి దేవుడన్న వాళ్ళు చాలా తక్కువ మంది పట్టుమని పది మంది పేర్లు చెప్పొచ్చు పంచపాండవులు కుంతీ ద్రౌపది విదురుడు అక్రూరుడు భీష్ముడు తదదిగా కలిగిన ఇంకో పది మంది అనుకుందాం. మిగిలిన వాళ్ళంతా ఆయన్ని కులం చేత, గుణం చేత, రూపం చేత, భావన చేత, చేష్ట చేత, దృష్టి చేత, సర్వ సమర్ధత చేత అనేకమైనటువంటి కారణాల వలన శ్రీకృష్ణుణ్ణి నిందించిన వారు ఎక్కువ కీర్తించిన వారు తక్కువ. కనుక ఆయన ఏమన్నాడంటే "ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా ఒకడిని ఎన్నుకొని వీడంతటి వాడు లేడు అని గనుక మీరు నిర్ణయిస్తే ఆ ఒక్కడు నేనే" అన్నాడు. కోటిమంది భక్తులు గనుక వస్తే అందులో ఏ ఒక్కడో నన్ను కోరి గనుక వస్తే ఆ ఒక్కణ్ణి కూడా నేనే కనుక నాకు వాడికి తేడా లేదు. అలాగే పక్షులలో ఉత్తమోత్తమమైనటువంటి గగన గగనాంతర విహారం చేసేటువంటి గరుడ పక్షిని నేనే మా-మాసములలో మార్గశీర్షాన్ని నేనే" అక్కడ గుచ్చోబెట్టాడు పరమాత్ముని వేళ. మార్గశిర మాసం అంటే మార్గశీర్షం అన్నమాట. మార్గములలో ఉత్తమ మార్గం ఏది జ్ఞానమార్గం కనుకనే నేను భగవద్గీతను చెప్పానన్నాడు. అలాగే వేదాలలో మొట్టమొదటి ప్రప్రథమ అగ్ర తాంబూలాన్ని అందుకున్నటువంటి గాన స్వరూపమైనటువంటి సామవేదాన్ని నేనే, పాటను నేనే, గానము నేనే, గతిని నేనే, ఘమకాన్ని నేనే, త్రయాణాం బంధాణాం అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. కనుక ఈ ఉన్నదంతా ఏది కనిపిస్తున్నదో ఉత్కృష్టమైనదంతా నేనే. ఈ ఉత్కృష్టం కానిదంటూ ఒకటి ఉన్నదా అంటే ఒకటంటూ ఉంటే దానిని నడిపించడానికి వచ్చిన పరమాత్ముని నేనే. కనుక అనన్యాశ్చింతయంతోమా సమస్త భావనలు వదిలిపెట్టేసేయ్ నాకు శరణాగతిగా ఒక్క భగవంతుడు మాత్రమే ఈ మాట అనగలడు. అలాగే మన్మనా భవ మద్భక్తో మాధ్యాజీ నాం నమస్కురు నీవు ఎవరికైనా నమస్కరించాలి అంటే నన్నే ఆశ్రయించు నాతోనే ఉండు నాకు నమస్కరిస్తూ నాతో ఉన్నట్లయితే నా యందున్నటువంటి శక్తిని యందు ప్రవహించి ప్రవేశించి ఆవహించి ఆవరించి నిన్ను నా అంతటి వాడిని చేస్తుంది. కనుక నీవు ఎవరితో ఉండాలి నాతో ఉండాలి. భగవద్గీతలో కూడా అనేకమైన కర్మ భక్తి జ్ఞాన యోగ మార్గాలన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికో చిన్న మీమాంస ఏర్పడినప్పుడు అడిగాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు భగవద్గీత విననా? యుద్ధం చేయనా? అన్నాడు. ఆయన ఏమనాలి భగవద్గీత వినమనన్నా అనాలి యుద్ధం చెయ్యి అనన్నా అనాలి. రెండూ అనలేదు ఆయన యోగి భవతి అర్జునా నువ్వు యోగివికా అన్నాడు. యోగివికా అంటే మీసాలు గడ్డాలు పెంచుకొని కాషాయం కట్టడం కాదు. యోగి కావటము అంటే పరమాత్మ భావనతో లీనమై లయాత్మకమై ఉండటమే యోగము యోగించటం అచ్చ తెలుగులో కూడి ఉండటం. దేనితో కూడి ఉండాలి పరమాత్మతో కూడి ఉండాలి. స్వామి అన్న మాట ప్రాపంచికంగా కూడి ఉన్నాను కూడి ఉన్నాను కూడి ఉన్నానని అనుకునేవన్నీ ఒకరోజున ఊడిపోయేవే బంగారు. నాతో కూడి ఉన్నట్లయితే నేను ఎంత నిశ్చలుడినో ఎంత నిరామయుడినో ఎంత నిరంజనుడినో ఎంత నికేతనుడినో నీవు కూడా అట్టి వాడివి అవుతావు. కనుక సత్యసాయి భగవానుడి యొక్క సందేశము.కృష్ణ సందేశం కంటే భిన్నం కాదు సత్యసాయి భగవానుడి యొక్క సందేశం రామ సందేశం కంటే భిన్నం కాదు సత్యసాయి భగవానుడి యొక్క సందేశం వేద సందేశం కంటే భిన్నం కాదు ఉపనిషత్తుల కంటే భిన్నం కాదు కనుకనే వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు ప్రస్థానత్రయాలు అలాగే ఈ సర్వ ప్రాకృతమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ దివ్య లీలా వైభవం అంతా కలిసినట్లయితే సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నది ఒక్కటే ఆ బ్రహ్మము ఒక్కటై ఉన్నది గనుక ఆ బ్రహ్మోపాసన గనుక నువ్వు చేసినట్లయితే ప్రాపంచికమైనటువంటి ఈ భావన నుంచి భ్రమ నుంచి నీవు బయట పడతావు ఈ భ్రమ నుంచి బయటపడితే బ్రహ్మత్వాన్ని నువ్వు పొందగలుగుతావు కనబడుతున్న చలిస్తున్న కదులుతున్న మారుతున్న రూపాంతరీకరణం చెందుతున్నటువంటి ఈ అనేకా అనేకమైన వస్తువులన్నింటినీ సత్యము అని నీవు ఎట్లా అంగీకరిస్తావు? నీ దేహాన్నే తీసుకో నీ తల్లి గర్భంలో ఒక చిన్న అండంగా పిండంగా ఉన్న నీవు శిశువుగా ఒక ఆకృతిని సంతరించుకున్న తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చి బాల్యాన్ని కౌమారాన్ని యవ్వనాన్ని అనుభవిస్తున్నటువంటి వేళ ఒక్కసారి తిరిగి వెనక్కి చూసుకున్నట్లయితే నీ రూపమే నీ దగ్గర లేదు నీవు చిన్నప్పుడు ఉన్నట్లు ఇప్పుడున్నావా? లేదే! నీకు తెలియకుండానే నీకు చెప్పకుండానే నీ శరీర ధర్మము శరీరము యొక్క ఆకృతి శరీరము యొక్క రూపము శరీర లావణ్యము ఎన్ని విధాలుగా రూపాంతరీకరణం జరిగి జరిగి జరిగి మారి మారి మారి ఏదో ఒకరోజున మార్పే ఎరగనటువంటి ఒక మరణావస్థకు చేరుకుంటున్నప్పుడు ఈ దేహాన్ని సత్యమని నిత్యమని శాశ్వతమని నవ్య భవ్య దివ్యమని ఎట్లా అనుకోగలుగుతున్నావ్? కానీ దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహిని రామయుండు గణుతింపగా దేహియ దేవదేవుడవు. ఎవరయ్యా? ఆ దేవుడు ఎక్కడున్నాడు అంటే బయట లేడు నీ యందున్నాడు నీ యందున్నటువంటి పరమాత్మను నీవు కనుక్కోవడానికి ఎందుకు కష్టపడుతున్నావు? అక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి వెళ్తున్నావు వాడు దేవుడు అంటున్నావు కాదంటున్నావు కొన్నాళ్ళు అవును అనుకున్నావు పని అయినప్పుడు అయింది అనుకున్నావు కానప్పుడు కాదనుకున్నావు కానీ చివరికి అసలు భగవంతుడు ఎక్కడ అని ప్రశ్న వేసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి పరమాత్మను నీవు దర్శనం గనుక చేసుకోకపోయినట్లయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశి చక్రంలో నుంచి బయటపడి బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనేక జన్మల చిట్టచివర ఈ నరజన్మ మనకు ఏర్పడింది ఈ నరజన్మ ఏర్పడినప్పుడు కూడా మాధవత్వాన్ని గనుక నీవు అనుభవించలేకపోయినట్లయితే ప్రయోజనమేమున్నది ఈ జన్మకి? అని సత్యసాయి భగవానుడి యొక్క సందేశము అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అన్ని శబ్దాలు పుట్టే నిశబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ హరయ నారాయణాన్వేషితం. దేనికొచ్చింది ఈ జన్మ? విచారణ చేసుకున్నట్లయితే దేహం ఉండదు మరి కోహం నేనెవరు తెలియదు తెలుసుకోగా తెలుసుకోగా నాహం దేహము నేను కాదు మరి చివరికి ఏమిటయ్యా? సోహం అది. దేహం కోహం నాహం సోహం ఈ నాలుగు మార్గాలని సత్యసాయి భగవానుడు మనకు ఉపాసనా మార్గంగా చెప్పీ చెప్పకుండా చెప్పారు. మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ కనబడుతున్న నేను ఈ పలుకుతున్న నేను ఈ తిరుగుతున్న నేను ఈ కదులుతున్న నేను ఈ అంటున్న నేను ఈ వింటున్న నేను ఈ కంటున్న నేను ఎవరన్నా ప్రశ్న వేసుకున్నప్పుడు ఇదంతా మేనుకు లోబడిన ఆలోచనే. మేను అంటే దేహం. సరే ఇది కాదు అనుకున్నప్పుడు మరి నేనెవరు అన్న ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ నేనెవరు హూ యామ్ ఐ అని భగవాన్ రమణ మహర్షి ఎట్లాగైతే ప్రశ్నించుకోమన్నారో తాత్విక దివ్య జీవన విధానంలో ఆనందాన్ని అనుభవాన్ని సమాధానాన్ని ఆ ప్రశ్నలలో నుంచి పొందమని అన్నారో అలాగే స్వామి కూడా కోహం నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను కుతః ఆయాతః అన్నారు శంకర భగవత్పాదులు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే మనం చెబుతాం మనం పుట్టిన ఊరు చెబుతాం పుట్టిన తేదీ చెబుతాం సమయం చెబుతాం నిజమేనా? ప్రశ్న వేసుకున్నట్లయితే ఏమో అవి చారిత్రక అంశాలు కావచ్చు అది నా బయోడేటా కావచ్చు నా ఉద్యోగానికి అవసరం కావచ్చునేమో కానీ ఆత్మవిద్య విశారదత్వాన్ని పొందటానికి గానీ ఆత్మవిద్య విలాసాన్ని అనుభవించటానికి గానీ ఆత్మవిద్యను ఎరుగటానికి గానీ ఎరుక తానుగా రూపాంతరీకరణం చెందటానికి గానీ ఈ లెక్కలు ఏవీ అక్కరకు రావు. మరి ఏమొస్తాయి? విచారణా మార్గంలో ప్రాణాయామం ద్వారా యోగం ద్వారా శాస్త్రాధ్యయనం ద్వారా అనేకమైనటువంటి పాతంజలిక యోగ శాస్త్రాల ద్వారా చిట్టచివరకి ఒక సమాధానం స్పర్శా రేఖగా తెలిసి తెలియనట్లుగా అర్థమై కానట్లుగా తెలుస్తుంది నేను సోహం. సోహం అంటే నేను కూడి ఉన్నాను స హం స సోహం హంస అంటే లోపల వెలుగుతున్నటువంటి ప్రాణైకమైనటువంటి ఒక చైతన్య ప్రవాహం ఆ చైతన్య ప్రవాహం ఎక్కడ ఉన్నది? సర్వాంగీనమైనటువంటి దేహంలో యోగశాస్త్రం ప్రకారం రెండు లక్షల డెభై రెండు వేల నాడులున్నాయి ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం డెభై రెండు వేల నాడులే ఉన్నాయి ఎన్ని వేల నాడులుండనివ్వండి వాని యందు ఏం ప్రవహిస్తున్నాయంటే రక్తం ప్రవహిస్తున్నది మరి మిగతా శరీరం అంతా ఎట్లా నడుస్తున్నది అంటే మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల ఈ ఆరింటి ద్వారా వాయువు కదలుతున్నది. ఇందాక మనం వేదంలో చదువుకున్నాం మూలాధారంలో నువ్వు సంస్థితమై ఉన్నావ్ ఎప్పుడూ అక్కడే ఉంటావ్ ఎవరు గణపతి.ఆ గమ్ అనబడేటువంటి బీజాక్షరం నుంచి సహస్రారమైనటువంటి గ అంటే జ్ఞానం. ఈ గమ్ వెళ్ళి ఆ గ ని కలిస్తే అది గంగా. గంగా ఎక్కడ ఉన్నది? కాశీ యందు నదీ రూపంలో ప్రవహిస్తున్నది గానీ అది మన యందే ఇడా పింగళ అనబడేటువంటి రెండు నాడులు దాని మధ్య తామర తూడులో ఉన్న సన్నని దారము వలె సుషుమ్నా. ఈ మూడు కలిపి మన యందే ప్రవహిస్తూ ఉన్నాయి గనుక అరయ నారాయణాన్వేషితమ్ము. ఆ నారాయణున్ని సోహం సోహం సోహం నేను ఎవరు నించి నేను అదే నేను అదే దానితో కూడి ఉన్నాను. ఈ సోహం అంటే సహం కదా. సహం ని తిప్పి చదివితే దాని పేరు హంస. అందుకనే మానవుడి యొక్క ప్రాణ ఆయామమంతా ప్రాణము యొక్క కదలిక మెదలిక అంతా కూడా హంసగీతం. దానినే హంసగీత అన్నారు. ఈ హంసగీతం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మన యందు ఉన్నది గనుక ఈ ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్య ఏదైతే ఒక విరామ సమయం ఉన్నదో ఆ విరామ సమయాన్ని గనుక మనం expand చేసుకుంటూ వెళ్ళినట్లయితే చిట్టచివరికి మోక్ష స్థాయికి వెళుతుందని యోగశాస్త్రం చెప్తున్నది. అందుకనే స్వామి ఈ నాలుగింటిని కూడా మీరు సాధనా మార్గంలో వినియోగించుకోండి. ఏది? దేహం, కోహం, నాహం, సోహం. మరి ఈ సోహం దేని మీద విచారణ చేయాలి? ఉపదేశ మార్గం గనుక మనం కాసేపు మాట్లాడుకున్నట్లయితే మామూలుగా చాలామంది చెప్పినటువంటిది ఆజ్ఞా చక్రం మీద అంటే మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో రెండు కనుబొమ్మల మధ్య గనక తీవ్ర ధ్యానం గనక చేసుకున్నట్లయితే నీ స్వస్వరూపం నీకు కనిపించాలి. ధ్యానంలో రాముడో కృష్ణుడో కనిపిస్తే ప్రయోజనం లేదు. నీ యొక్క స్వస్వరూపం తేజో రూపం నీకు బిందువుగా కనిపించాలి. అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో త్రికూట నాముని స్థమితే అంతరంగే అన్నారు. అంతరంగంలో త్రికూటం అంటే అది. ఆ త్రికూట స్థానంలో ఎక్కడైతే నీవు ధ్యానించి ఉన్నావో నీకు స్వస్వరూపానుసంధానం జరుగుతుంది. అంతే కాదు భగవాన్ రమణ మహర్షి దాని తర్వాత సత్యసాయి భగవానులు కూడా ఉపదేశ మార్గంలో ఈ సందేశానికి అంటే ముందు చెప్పారు. ఏమనంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యః మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్వతా మధ్యతా వా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్టో భవత్వం. నీలో ఉన్న ఆత్మని నీవే గమనించుకుంటూ ఉండు. ఎక్కడ ధ్యానించుకోవాలి, ఎక్కడ ఏకాగ్ర చిత్తంతో ఉండాలి, చిత్త ఏకాగ్ర స్థితిలో యోగాలన్నింటినీ కూడా మనకు కలిగేటువంటి వృత్తులన్నింటినీ కూడా అంటే దేహ వృత్తులు, మనో వృత్తులు వీటన్నింటినీ నిరోధించేటువంటి స్థానం ఏదంటే ఎడమ వైపున ఉన్నటువంటి మాంసఖండర యుక్తమైనటువంటి ఈ గుండె నుంచి ఒకటిన్నర అంగుళాల దూరంలో కుడి రొమ్మున ఏదైతే హృద్గుహగా వెలుగొందుతూ ఉన్నదో దానిలో నేను నేను నేను అని ప్రకాశమానమవుతున్న ఆ ఆత్మను నేను అన్న భావనలో ఉండగలిగినట్లయితే నీవు ఆత్మవే. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య సంబోధన అంతా కూడా దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా. ఇది సత్యసాయి భగవానుని యొక్క సందేశాత్మకమైనటువంటి ఒక భావనకి ఇది పూర్వరంగం. ఇంత తెలిస్తే తప్ప స్వామి చెప్పిన మాటలు మనకి అర్థం కావు. ఎందుకనంటే మహాత్ములు మంత్రాలను మాటలుగా మార్చేస్తారు. కవి, పండితుడు, గాయకుడు వీళ్లంతా మాటలను మంత్రాలుగా చేసుకుంటారు అంతే తేడా. కనుక స్వామి అధునాతన కాలంలో సమకాలీన ప్రపంచం అర్థం చేసుకోగలిగినటువంటి మృదు మధురమైన సరళమైన అచ్చమైనటువంటి తేట తెలుగు మాటల్లో భారతీయ అధ్యా-అధ్యాత్మని ఆవిష్కరించారు. స్వామి కంటే ముందు వచ్చిన ఏ అవతారం కూడా భారతీయ సాహిత్యాన్ని స్వయంగా లిఖించినటువంటి రచించినటువంటి సన్నివేశం లేదు. రాముడు గురించి వాల్మీకి రాశాడు. కృష్ణుడి గురించి వేదవ్యాసులవారు రాశారు. సత్యసాయి భగవానుడు ఇటు రామకథా రస వాహిని అటు భాగవత వాహిని ఇటు ఉపనిషద్ వాహిని అటు జ్ఞాన వాహిని ధ్యాన వాహిని. వారు రాయనటువంటి వాహిని లేదు అంతా వాహిని స్వరూపంగా కదిలేటువంటి చలత్ చలితమైనటువంటి చైతన్య స్థావరంగా చైతన్య ప్రవాహంగా ఒక మహా నది వలె ఈ ప్రపంచాన్ని సుక్షేత్రం చేశారు. దీనిని తడిమారు, దీనిని తడిపారు. అటువంటి స్వామి ఎటువంటి సందేశాన్ని ఇచ్చి ఉంటారు? అనేకం ఇచ్చారు. అనేక మాటలున్నాయి. అందులో స్వామిని ఒకసారి ఓ మాట అడిగారు. "స్వామి బ్రహ్మ పదార్థము బ్రహ్మ పదార్థం అంటారే అంటే ఏమిటి?" అని అడిగాడు ఒకాయన. బ్రహ్మసూత్రాలలో ఒక భాష్య ఉంది, సూత్రం ఉంది. దానికి భాష్య రూపాన్ని స్వామి చెప్తూ "దేనిని ఈ కనులు చూడలేవో కానీ దేనివలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మ పదార్థము" అన్నారు. ఈ దేహం మాట్లాడలేదు. ఇది ఒట్టి కట్టే. ఇదిగో ఈ మైకు లాంటిది. నేను మాట్లాడితే మైకు convey చేస్తుంది. మరి ఈ దేహం మాట్లాడాలంటే ఎవరుండాలి? మన వెనక ఎవరో ఉన్నారన్నమాట. అది బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థంలో నుంచి వ్యక్తమైనటువంటి ఈ దేహం తనకున్నటువంటి ఒక పరికరాన్ని ఆధారం చేసుకొని తన వాక్కును ప్రపంచానికి amplify చేస్తున్నది. ఇక్కడ జరిగిందంతా ఏమిటంటే కనబడుతున్న మైకు ఉంది, మాట్లాడుతున్న వాడున్నాడు కానీ మాట్లాడిస్తున్న వాడు మాత్రం కనబడటం లేదు. అది బ్రహ్మ పదార్థం అన్నారు స్వామి. ఎంత తేలిక చూడండి! "స్వామి" ఇంకో ఉదాహరణ అనగానే జేబులో ఉన్న కర్చీఫ్ బయటకు తీసి, "ఇదిగో ఇప్పుడు దీన్ని మీరు కర్చీఫ్ అంటున్నారే, ఇందాక నిలువు పోగు అడ్డ పోగు అన్నామే, నిలువు పోగులన్నీ జారవిడవండి. ఏం మిగులుతాయి? అడ్డమన్నీ పడిపోతాయి. నిలువు అడ్డము ఒక్కటైపోయిన తర్వాత ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. ఏది కల్పితంగాఏది వస్తువుగా ఏది చిత్రంగా మనకు కనిపిస్తున్నదో దానిని ఆ వస్తువుని నిత్యం అనుకుంటున్నాం అందుకే "దేశకాలకలన వైచిత్య చిత్రీకృతం" అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఈ దేశము కాలము కలనము అంటే కలనం అంటే వస్తువు కాలము అంటే time దేశం అంటే space "He is beyond time and space" అంటాం భగవంతుణ్ణి. అంటే కాలము ఆయనే కాలాతీతము ఆయనే. అందుకనే "కాలత్రయాతీతాయ నమః గుణత్రయాతీతాయ నమః అవస్థాత్రయాతీతాయ నమః" అంటే మూడు అవస్థలు ఆయనకి లేవని కాదు మూడు అవస్థల యందు నువ్వే ఉన్నావు లేనిది మేమే ఉన్నది నీవు ఆ నీవుని ఎక్కడ పట్టుకోవాలి అంటే మాకు అలవాటు లేక అక్కడికి వెళ్లి ఇక్కడికి వెళ్లి ఇక్కడికి వెళ్లి బయట వెతుకుతున్నాం అయ్యా ఉన్నదంతా లోపలే ఉన్నది. కనుకనే నాలుగు మహా వాక్యాలని సత్య సాయి భగవానుడు నాలుగు వేద మహా వాక్యాలని మహా పరిసత్యాలని ఈ ప్రపంచానికి బోధగా సందేశంగా అందించారు. "అహం బ్రహ్మాస్మి", "అయమాత్మా బ్రహ్మ", "ప్రజ్ఞానం బ్రహ్మ" , "తత్వమసి". ఈ నాలుగు భారతీయ తత్వశాస్త్రంలో మకుటాయమానమైనటువంటి ఈ నాలుగు మాటలు. ఈ నాలుగు వాక్యాలు "అహం బ్రహ్మాస్మి" నేను బ్రహ్మమును అనుకో మనం అనుకోలేని గనక స్వామి ఏమన్నారంటే దివ్యాత్మ ప్రేమాత్మ అని పిలిచారే తప్ప మనల్ని రూప నామములతో కూడినటువంటి దేహాన్ని ఆయన సంబోధించలేదు. ఇక రెండవది "అయమాత్మా బ్రహ్మ" నేను బ్రహ్మమునై ఉన్నాను నేను బ్రహ్మమునై ఉన్నాను అంటే నేను ఒక్కడినే కాలే అంతా బ్రహ్మమై ఉన్నది బ్రహ్మము కాని ఒక వస్తువు లేదు చెట్టు, మిట్ట, గుట్ట, పుట్ట, పాము, పసరము లేకపోతే పశువు, ఆకాశము, శూన్యము, పూర్ణము, గాలి, పంచభూతాలు అంతా బ్రహ్మమయమై ఉన్నప్పుడు నీకు ప్రత్యేకంగా నీవు ఎట్లా ఉన్నావు? కనుక ఒక ఉనికి, ఒక అస్తిత్వము, ఒక వ్యక్తిత్వము, ఒక అహము, ఒక మమకారము నాశనం కాగలిగినట్లయితే మనోనాశనం కలిగినట్లయితే చిత్తవృత్తి నిరోధకం గనక జరిగినట్లయితే నీవు యోగివై, నీవు పూర్ణుడివై, నీవు దేహాతీతమైనటువంటి ఒక ఆత్మవై, నీవు నీ యంతట నీవే అనుభవాన్ని పొందగలుగుతావు. అయితే ఈ అనుభవాన్ని రెండు "అయమాత్మా బ్రహ్మ", "అహం బ్రహ్మాస్మి" అని అన్న తర్వాత ఎలాగా అంటే "ప్రజ్ఞానం బ్రహ్మ" నేను మాట్లాడగలిగిన, మీరు వినగలిగిన, వారు పాడగలిగిన, మరొకరు జ్యోతి వెలిగించగలిగిన, ఇదంతా కూడా ఏమిటి? దీని వెనుక ఏమున్నది? అని విచారణ గనక చేసినట్లయితే "ప్రజ్ఞానం బ్రహ్మ" స్వామి దీన్ని మూడు మాటలతో విభాగీకరించారు. ఒకటి విజ్ఞానము, రెండవది సుజ్ఞానము, మూడవది ప్రజ్ఞానం. విజ్ఞానం మనకనేక శాస్త్రాలు వచ్చు, తెలుసు. మనకి అనేక శ్లోకాలు, పద్యాలు ఎన్ని కావాలంటే అన్నీ తెలుసు కానీ ఇన్ని తెలిసినటువంటి నీవు జ్ఞానివి కావు. నీవు విజ్ఞానివి మాత్రమే. ఈ విజ్ఞానమయ కోశం నుంచి గనక దాన్ని సుజ్ఞానం చేయగలిగినట్లయితే సర్వ ప్రపంచానికి నీవు అందించగలిగినట్లయితే అది ఈ విజ్ఞాన భూమిక నుంచి సుజ్ఞాన భూమికలోకి వెళ్తాం. దానిలో వివేకము, విచక్షణ, వైరాగ్యము, వినయము అనబడేటువంటి నాలుగు పారిశ్రాంలో నుంచి నీవు ఒక అనుభూతిని పొంది శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా "ప్రౌఢప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః స్వచ్ఛిష్యబోధయా తత్సత్యమాశ్రితావన్" అంటే అయ్యా గురువుగారు మీకేదన్నా కోరిక ఉంటే చెప్పండి తీరుస్తా అంటాడు. నాకీ ఫలానా కోరిక ఉంది తీర్చు అంటే వాడేం గురువు? వాడు లోక గురువే. వాడు కేవల బాధ గురువే, శోక గురువే. మరి అసలు గురువు ఏమంటున్నాడంటే నేను నిన్న పొందినటువంటి ఒకానొక అనుభూతిని అది స్వచ్ఛమైనది, అచమైనది, విస్తృతమైనది, గంభీరమైనది, నాదైనదైన అనుభూతిని అందుకోగలిగిన శిష్యుడు ఒక్కడు దొరికేదాకా నేను ఈ శరీరంలో ఉండాలి ఇదే ఉంటుంది గురువు గారి కోరిక. నరేన్ వచ్చేదాకా రామకృష్ణ గురుదేవులు దేహంలో ఉన్నారు. నరేన్ కి తపస్సంతా ధారపోయగానే రామకృష్ణ గురుదేవులన్న మాట "నరేన్ నా దగ్గర ఉన్నదంతా నీకు ధారపోసి నేను కడు బేదనైనాను. ఈ స్థితి నాకిష్టం" అంటే అన్నీ ఉన్న నాకు అది స్థితి కాదు ఏమీ లేనిదే పూర్ణ స్థితి గనుక నేను ఈ స్థాయికి చేరుకోవటానికి నీవు సహకరించినందుకు నీకు ధన్యవాదాలు అన్నారు రామకృష్ణ గురుదేవులు. ఇటువంటి ఒక తపస్సాఫల్యాన్ని ఒక ఫలితాన్ని పొందినటువంటి నరేన్ అనబడేటువంటి ఆయన వివేకము చేత ఆనందం కలిగింది ఆయనకి. ఆ వివేకం రాగానే ఒక ఆనందం. ఆ ఆనందం కూడా మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, దేవగంధర్వానందము, మానవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్యగర్భానందం దగ్గరకు వెళ్ళాడాయన. కనుకనే వివేకము ప్లస్ ఆనందము కలిగి ఆయన వివేకానందుడు అయినాడు. వివేకానందుడు అయి ఉండిపోలేదు ప్రపంచానికి తన గురువు నుంచి తాను ఏమి పొందాడో దాన్ని పొందే ప్రయత్నం చేశాడు. ఆ పంచి పెట్టాడు కనుక ఆయన జ్ఞాని అయినాడు. జ్ఞాని అంటే స్వామి. కనుకనే రామకృష్ణులు గురుదేవులుగా ఉండిపోయారు వివేకానందులు స్వామి అయినారు. అందుకని వివేకానంద స్వామి అంటే గురువు నుంచి పొందిన దాన్ని మళ్ళీ బహుముఖీనంగా ఖండ ఖండాంతరాలు దాటించినటువంటి పరిపూర్ణ జ్ఞానమూర్తి విజ్ఞాన స్వరూపమే వివేకానందులు. స్వామి చెప్పింది కూడా అదే. మీరు దేనిని ఇక్కడ పుట్టపర్తిలో పొందారో, దేనిని సత్య సాయి భగవానుడి నుంచి అందుకున్నానని మీరు ఆనంద పడుతున్నారో ఆ ఆనందాన్ని ఏ రకమైన లాభాపేక్ష లేకుండా ఏ రకమైన ప్రతిఫలాన్ని కోరకుండా సర్వ ప్రపంచానికి పంచిపెట్టండి. పంచిపెడితే పెరుగుతుంది.దాచిపెడితే పాచిపోతుంది. ఇదొక సందేశం. ఎంత గొప్ప సందేశం చూడండి. దాచుకుని దాచుకుని మనం తిననన్నా తినాలి, తినలేని పరిస్థితి ఉంది, అవకాశం లేదు మరొకరికిన్నా వెంటనే పంచిపెట్టాలి. దాచిపెడితే పదార్థం చెడిపోతుంది. అక్కడ పదార్థం అంటే మానవ జీవితం. పరమార్థం లేని మానవ జీవితం పశువు కంటే హీనమైనటువంటి జన్మ కాబట్టి అలా కాకుండా స్వామి యొక్క ఈ సందేశం అనేక రీతులలో ఈ ప్రజ్ఞానం అనేటువంటి భూమికలో ఒక కళాకారుడు, ఒక కవి, ఒక పండితుడు, ఒక సంస్కారవాది, ఒక సంస్కరణ వాది, ఒక సంస్కృతి వాది. వీళ్లందరూ కూడా ఏం చేయాలి అంటే తాము ఈ ప్రపంచం నుంచి ఏం పొందారో మళ్ళీ దానిని ప్రపంచానికి పదింతలు చేసి అందించవలసినటువంటి బాధ్యత ఉన్నది గనుక అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవాళ ఎవరైనా చూడండి, ఏ కళాకారుడిని తీసుకోండి, ఏ పండితుడిని తీసుకోండి, ఏ కవిని తీసుకోండి. నన్నయ భట్టారకుడు అన్నాడు, "ఈ తెలుగున మహాభారతాన్ని ఆంద్రీకరిస్తున్నా ఎందుకో తెలుసునా? జగద్ధితంబుగన్" అన్నాడు. హరిహరాద్వైత స్వరూపాన్ని అద్వైత భావన చేసిన తిక్కన అన్నాడు, "నా మనోభీష్టి సిద్ధించేలాగా, ఈ ప్రపంచానికి ఆనందం కలిగించేలాగా నేను చేస్తాను." పోతన అన్నాడు, "శ్రీ కైవల్య పదం కోసమే చేస్తున్నాను" అన్నాడు. అంటే వీళ్లంతా కీర్తి కోసం చేయలా, డబ్బు కోసం చేయలా. తమ జన్మను ధన్యం చేసుకోవటానికి తామున్నటువంటి సమాజాన్ని మాత్రమే కాక రాబోయేటువంటి అనేక తరాలని ప్రభావితం చేసి వాటిని తరింపజేయటానికి కావ్య సృష్టి చేశామన్నారు. మన సమకాలీనుంగా విశ్వనాథవారు కూడా జన్మాద్యపాయం తప్పించుటన్ రామ-రామాయణ కల్పవృక్షం రాస్తున్నానన్నారు. జన్మాద్యపాయం మూలమైనటువంటి మళ్ళీ మళ్ళీ నాకు జన్మ లేకుండా, అపాయం లేకుండా నేను బయటపడాలి అంటే రాముడి కథే రాయాలి. రామకథ రాస్తేనే నా సాహిత్య విన్నాలానికి అది ఒక పతాక స్థాయి. లేకపోతే దానికి సార్ధకత లేదు. అలాగే అన్నమాచార్యుల వారు, అలాగే త్యాగరాజస్వామి వారు. త్యాగరాజస్వామి వారు వారి కీర్తనలన్నీ కూడా రామదర్శనం కోసం తహతహలాడారు. సంతత రామనామ స్మరణాంచితమైన దేహంగా ఆయన దేహమంతా నాదమయమైపోయింది. నాదం అన్నా వేదమే. వేదం అంటే సామవేదమే. సామవేదం అంతా గానమే. గానం అంతా కీర్తనే. భగవత్పరమైనటువంటి కీర్తనంతా సమ్యక్ సంకీర్తనమే కాబట్టి క్రాంత దర్శనం కలిగింది ఆయనకి, శ్రీరామ దర్శనం కలిగింది. ఎంత సేపు? కనురెప్ప వాల్చి మళ్ళీ ఎత్తేలోగా. ఒక్క నిమేషమాత్రం శ్రీరామచంద్రుడు సపరివార సమేతంగా పూర్ణ దర్శనాన్ని త్యాగరాజస్వామి వారికి అను-- కాబట్టి మనం కూడా రామదర్శనం అంటే ఆత్మ దర్శనం, కృష్ణ దర్శనం అంటే ఆత్మ దర్శనం. దీన్ని ప్రజ్ఞాన భూమికలో మనం నిలకడ చెందాలి. మనకున్నటువంటి ప్రజ్ఞలన్నీ ప్రజ్ఞానం కావాలి. జ్ఞానముతో కూడిన ప్రజ్ఞలు. ప్రజ్ఞ లేని వాడు లేడు. కళాకారులందరికీ ప్రజ్ఞలు ఉంటాయి. అహం ఎక్కడ ఉండదో అది ప్రజ్ఞానం అవుతుంది. అహంతో కూడి ఉంటే కేవలం ప్రజ్ఞగా ఉండిపోతుంది. ప్రజ్ఞతో పాటు శీలం ఉండాలి. శీలతో పాటు త్యాగ ఉండాలి. త్యాగంతో పాటు ఔదార్యం ఉండాలి. ఔదార్యంతో పాటు ఉదాత్త స్థాయి ఉండాలి. దానిలో నుంచి దేనినైనా ఆహ్వానించగలిగినటువంటి ఒక ఔద్ధత్యం ఉండాలి. ఒక పూర్ణత్వం ఉండాలి. ఇవన్నీ కలిపితే అప్పుడు మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ. కనుక Intellectual interpretation of Shastras is not జ్ఞాన. It is a కేవల విజ్ఞాన. శాస్త్రం మీద అద్భుతమైన ప్రవచనం చేశాం. ఓ పరమాద్భుతమైన ప్రసంగం చేశాం. శ్రోతలంతా ఉర్రూతలూగారు. చెప్పినవాడు జ్ఞాని కాడు. విజ్ఞాని మాత్రమే. జ్ఞాని ఏం చేస్తున్నాడయ్యా? ఏమీ అనటం లేదు. కూర్చున్నాడు అంతే. మాట్లాడకుండా బోధ ఎలా చేస్తాడంటే, ఆయన converse చేయడు transmit చేస్తాడు. వినటానికి వచ్చిన వాడు మౌనంగా ఉన్నాడు. అనటానికి వచ్చిన వాడు మౌనంగా ఉన్నాడు. ఇద్దరూ ఆ మౌన భూమికలో గురువు నుంచి శిష్యుడికి, అంటున్న వాడి నుంచి అంటే బౌద్ధ నుంచి శ్రోతకి నెమ్మదిగా అందుతుంది. నిజమేనా? ఈ transmission ఎలా జరిగిందా అంటే, భగవద్గీత. కేవలం మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్లలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి transmit చేశాడు. transfer చేయలా. ఆ transmission అతివేగంగా జరిగిపోయింది. మనం చెప్పుకున్నట్లుగా గంటలు గంటలు ఆయన చెప్పాడా? చెప్పలా. హౌతల యుద్ధం ప్రారంభం కావాలి, మనస్సును నిర్మలం చేయాలి, దాన్ని నిశ్చితం చేయాలి, నిర్వీర్యమైనటువంటి వైక్లభ్యంతో ఉన్న మనస్సును సంసిద్ధం చేయాలి, శోభితం చేయాలి, జ్ఞాన మార్గంలో నడిపించాలి, వాణ్ని యోగిని చేయాలి. ఇన్ని పనులు శ్రీకృష్ణ పరమాత్మ ఆ మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్లలో పూర్తి చేశాడు. కనుకనే అక్కడ ఆయన్ని "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్松松". అటువంటి బౌద్ధ, ఇటువంటి శిష్యుడు. అటువంటి గురువు, ఇటువంటి శిష్యుడు. అటువంటి ఆచార్యుడు, ఇటువంటి అంతేవాసి. అటువంటి భగవంతుడు, ఇటువంటి భక్తుడు ఒకచోట కూడి ఉంటే ఎవరికి లాభము అంటే, అంటున్న వాడికి లాభం లేదు, నిజానికి వింటున్న వాడికి లాభం లేదు. ఎవరో ఇలా అన్నారట అని విన్నవాడు పది మందికి చెప్పినప్పుడు అది సర్వ ప్రపంచానికి ప్రసారం అవుతుందే అది నిజమైనటువంటి ఉపాసన. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ లోనుంచి నెమ్మదిగా తత్వమసి. తత్ త్వం అసి. దేనిని గురించి నేను ఇన్నాళ్లు ఆలోచించానో, దేనిని గురించి ఇన్నిన్ని మాటలు అనుకున్నానో, దేనిని పొందాలని అనేక శాస్త్రాల మీద పట్టు సాధించానో, ఎంత అనుష్ఠాన మార్గంలో నిష్ఠగా ఉన్నానో, ఉపవాసము ఉపాసన అనబడేటువంటి మార్గాలు ఎంచుకున్నానో, దేహాన్ని మనస్సుని దగ్ధం చేసుకోగలిగానో, ఇన్ని జరిగిన తర్వాత నాకు ఒక్క స్ఫురణ కలిగింది. తత్త్వమ్ అసి అదే నేనే ఉన్నాను అని మనం అనుకోవాలి అదే నీవై ఉన్నావు అని గురువు అనుకోవాలి. అందుకనే సత్య సాయి భగవానుడు తత్వమసి గురించి భారతీయమైనటువంటి ఒక భావనని విశ్వజనీనమైనటువంటి భావనలో భాషలో you are me, I am you అన్నారు. You are me నువ్వు నేను నువ్వే నేను అంతేకాదు నేను నువ్వే మనిద్దరికీ భేదం లేదు. ఎప్పుడు నాకు మీ యందు ఎట్టి భేదభావం లేదో మీకు కూడా నా యందు అట్టి భేదభావం లేనప్పుడు మనమిద్దరం ఒక్కటవుతాం. ఈ లోగా జరిగేదంతా ఆ అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ చిట్టచివరికి తత్వమసి. ఇక్కడ స్వామి సందేశం వెనుక ఇంత బలవత్తరమైనటువంటి ఒక భారతీయ సిద్ధాంతం పరుచుకొని ఉన్నది. ఈ మూల సిద్ధాంతాన్ని ఎరగకుండా ఏవో స్వామి చెప్పిన నాలుగు మాటలు మాట్లాడుకుని వెళ్లిపోవటానికి కలిసిన వాళ్ళం కాదు. ఎందుకంటే స్వామి అనగానే మహా మహిమాన్విత మూర్తిగా కొన్నాళ్ళు, మహిమలు చేసిన మహిమా కాండ కారకుడుగా కొన్నాళ్ళు, ఈ సమాజాన్ని సంస్కరించే దిశగా సాగించినటువంటి ఒక సంస్కర్తగా కొన్నాళ్ళు, విద్య వైద్య రంగాలని సమున్నత స్థాయిలో చేసినటువంటి ఒక ఉత్తమోత్తమమైనటువంటి సేవాకృతి బోధాకృతిగా మనం అనుకున్నాం. ప్రేమాకృతిగా మనం భావన చేశాం. కరుణా సముద్ర శ్రీరామ అంటూ సాయి రాముడిని పాడుకున్నాం. ఇది మాత్రమే కాదు స్వామి మాటల వెనుక బోధనల వెనుక దాగినటువంటి ఏ మహా ఉపనిషత్తులు వేదాలు దాని వెనుక దాగినటువంటి పరమ మార్మికమైనటువంటి మహా పరి సత్యాలని మనం అర్థం గనుక చేసుకోకపోయినట్లయితే ఒక అవతారమూర్తితో కలిసి కూడి ఉండి దర్శించి స్పర్శించి సంభాషణ చేసినటువంటి మనం మన ఈ జన్మని పూర్ణంగా అనుభవించనట్లే లెక్క. ఎందుకంటే రామావతారం కాలంలో అందరూ రాముడిని చూడలే, అందరూ రాముడితో మాట్లాడలే, అందరితో రాముడు మాట్లాడలే. ఆ ఎదురైన వారిలో కొందరితో ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణ పరమాత్మది అంతే. సత్య సాయి భగవానుడు దానికంటే భిన్నం కాదు. వచ్చిన వారందరితో మాట్లాడారా? మాట్లాడలే. కానీ స్వామి ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆ మాటలలో సారాన్ని మనం ఎలా గ్రహించాలి, ఆ గ్రహించిన సారాన్ని మన జీవితంలో ఎలా సమన్వయం చేయాలి, అనుసంధానం చేయాలి, అనుష్ఠానం చేయాలి, ఆత్మావలోకనం చేయాలి, ఆచరణాత్మకం చేయాలి, అనుసరణీయం చేయాలి, అనుభవాన్ని పొందాలి అన్నవే మన ముందు ఉన్నటువంటి ప్రశ్నలు గనుక సత్య సాయి భగవానుడి యొక్క సందేశాన్ని అనేకమున్నాయి కొన్ని వేలున్నాయి కానీ మనకు కావలసినవి ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి నాలుగు మాటలు నాలుగు రోజులు రోజుకు ఒక్కటిగా చెప్పుకోవాలి. ఒకటి help ever రెండవది hurt never మూడవది love all నాలుగవది serve all. ఈ నాలుగు వేద మహా వాక్యాలు. వేదాలలో నుంచి పుట్టిన మాటలే ఇవి. కాకపోతే ఈవేళ భాషలో మనకి వేద ప్రామాణికంగా చెప్పినవే తప్ప వేద భాషలో చెప్పబడినవి కాదు గనుక అవి కావేమో అని మనం అనుకుంటాం. కానీ నిజానికి అవే. అందుకనే ఒకసారి ఒక శివరాత్రి లింగోద్భవం అయిన తర్వాత స్వామి... ఎంత బాగుందో స్వామి మహా సుందర దృశ్యం. ఆ దృశ్యం చూసే మేము తరించాము అంటే స్వామి అన్నారు, "ఏదో ఏడాదికి ఒకసారి వచ్చే శివరాత్రి నాడు స్వామి శరీరంలో నుంచి ఏర్పడేటువంటి లింగోద్భవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారే, స్వామి నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క లింగం కాదా" అన్నారు. దానికి అబ్బురపడరేమి అన్నారు. ఎందుకంటే వాక్కు అగ్ని స్వరూపం. మూలాధారంలో ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చేప్పటికి అంటే కంఠ స్థానానికి వచ్చేసరికి అది ఒక భాషని, భావాన్ని, సంస్కారాన్ని, ఒక ఔద్ధాత్తిని, ఒక పూర్ణత్వాన్ని, ఒక గాంభీర్యాన్ని, ఒక వాస్తవాన్ని, ఒక యదార్థ స్థితిని, ఒక సత్యాన్ని, ఒక మహా పరి సత్యాన్ని ఆవిష్కరించుకొని మాటగా బయటకు వస్తుంది. అందుకే సత్య సాయి భగవానుడు అన్న మాట ఇదేమి తోలు శరీరమా తాలు మాట బయటకు రావటానికి. ఇది దివ్యమైన శరీరం. ఇది అంటే ఆయనదని కాదు మనందరిది కూడా. కానీ మనము ఆ స్థాయికి ఎదగాలి. ఇంకా miracles ఇంకా ఏవో అద్భుతాలు ఇంకా ఏవో స్వామితో మనకున్న personal relations ఎంతకాలం? పాడిన పాట పాట ఎంతకాలం పాడతాం? అది ఎవరికి కావాలి? కావలసింది ఏమిటంటే రాముడు ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో శ్రీకృష్ణ పరమాత్మ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् అంటూ ప్రతి యుగంలో నన్ను నేను సృజించుకుంటాను అనేటువంటి ఒక ప్రమాణము ప్రతిజ్ఞ ఎట్లా చేశారో अहं सत्यबोधकः అన్నటువంటి స్వామి మాటను ప్రమాణంగా మనం తీసుకుని గనుక విచార ధారలోకి వెళ్లగలిగినట్లయితే స్వామి కంటే ముందు వచ్చినటువంటి సర్వావతారాలు చెప్పిన వాటిని ఇవాళ స్వామి దాన్ని ఆధునికీకరణం చేశారు. ఒక మాధవ స్థాయిని మానవీయ స్థాయికి తీసుకువచ్చారు. అందుకే స్వామి మన మనసులో ఏదైనా ఒక ఆలోచన గనుక పుడితే దానిని ముందు humanize చేయండి. తర్వాత divinize చేయండి. ఆపై spiritualize చేయండి. మానవతా పరిమళాన్ని దానికి అద్దండి. మానవత్వం గనుక లేకపోతే నీవు ఎంత గొప్పవాడివైనా ఈ ప్రపంచానికి అక్కర్లేదు. అందుకే స్వామి సందేశంలో ఒక మాట This country doesn't need great men alone. This country absolutely needs good men. అంటే ప్రపంచంలో ఈ దేశానికి ప్రపంచానికి కావలసింది గొప్పవాళ్ళు కాదు బంగారు మంచివాళ్ళు కావాలి. ఎందుకంటే గొప్పవాళ్ళంతా మంచివాళ్ళు కారేమో కాకపోవచ్చు కూడా. కానీ మంచివారందరూ గొప్పవారే. వారివలన ఈ సమాజానికి ఏ చెడుపు ఉండదు, ఏ రకమైన హాని ఉండదు, సర్వహితమైన, సర్వ సమ్మతమైన, సర్వ శ్రేయోదాయకమైన, సర్వ జన మనోల్లాస పులకిత పుంభణమైన, పూర్ణమైనటువంటి ఒక దివ్య ముత్వం ఎక్కడ ఆవిష్కరింపబడుతుందో అటువంటి వాడు ఉత్తముడుగా మనం భావన చేయాలి. మాధవుడి వలె సంచారం చేయాలి.మాధవుడి వలె ఆలోచించాలి మాధవుడి వలె జీవితాన్ని గడపాలి మాధవుడి వలె ఇంకొకడిని ప్రభావితం చేయాలి మానవుడి వలె అందరినీ ప్రేమించగలగాలి మానవుడి వలె అందరి యొక్క ప్రేమని పొందగలగాలి ప్రేమించటం ఒక ఎత్తు ప్రేమ పొందటం రెండవ ఎత్తు ప్రేమించటం స్వభావం అయితే ప్రేమించబడటం భాగ్యం అది సౌభాగ్యం ఆ సౌభాగ్య స్థితిని అందుకోమనే సత్యసాయి భగవానుడి యొక్క ఈ ఎనభై ఆరు సంవత్సరాల దివ్య చరిత్ర మనకి చాలా స్పష్టంగా చెప్తున్నది ఏదైనా ఎట్లా ఉన్నా ఇక్కడున్న మనందరం మనతో పాటు స్వామి యొక్క ఆవరణంలోకి వచ్చినటువంటి కోటానుకోట్ల మంది ఈ మానవజాతి అదృష్టం చేసుకున్నది ఎందుకంటే ఒక మహా అవతార మూర్తితో మనం కలిసి జీవించాం దానికి మించినటువంటి ఆ పుణ్యం మరొకటి ఉందని నేను భావించను అలాగే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య వాణిని మన భాషలో మనం విన్నాం మిగతావన్నీ కూడా సంస్కృత భాషలో రాయబడ్డవే గానీ అవి అనబడ్డవి కాదు వినబడ్డాయి స్వామి అదే ఇదే భాషలో ఆయనకు భాష రాదు కాదు ఇంగ్లీషులో ఫ్రెంచ్ లో జర్మనీలో జపనీస్ లో వారందరూ వచ్చి ఆయన్ని దర్శనం చేసుకున్నారు వారందరితో మాట్లాడారు అందుకే స్వామి చెప్పింది ఇవన్నీ ప్రాదేశికమైనవప్ప అసలు విషయం ఒకటుంది it's the language of the heart అది గనక ఉంటే అన్ని తర్జుమా అయిపోతాయి automatic గా అన్నారు మనం కూడా హృదయ భాష ఎట్లా ఉన్నదో నేర్చుకోవాలి అలాగే మూడవది స్వామిని తాకం స్పర్శించాం పరమాత్మ దేహాన్ని తాకటం అంత తేలికైన విషయం కాదు మనం ఒక switch కి గనక నీళ్ళు ఒక చుక్క తగిలితే shock కొడుతుంది కదా మరి సర్వదేవతా అతీత స్వరూపం అన్న స్వామిని తాకితే shock కొట్టాలిగా మనల్ని shock proof చేసిన తర్వాతనే fool proof చేసిన తర్వాతనే స్వామి తన దగ్గరకు తీసుకుని ఆ స్పర్శన అనేటువంటి ఒక యోగాన్ని అనుగ్రహించారు కనుకనే స్వామి పాదం మెత్తన స్వామి స్పర్శ చల్లన స్వామి యొక్క ఆ పాద సంస్పర్శనలలోనే శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదభిరంచితాభ్యం నమో నమః సద్గురు పాదుకాభ్యం అనేటువంటి ఆ గురు వందనాన్ని గురుపాద నమస్కారాన్ని పొందగలిగినటువంటి భాగ్యశాలురం కాగలిగాం ఈ మూడు పొంది కూడా స్వామి ఒక సేవా మార్గాన్ని ఒక ప్రేమ మార్గాన్ని ఈ ప్రపంచానికి సర్వవేద సమ్మతంగా సప్రమాణికంగా మనకు ప్రకటన చేసినప్పుడు ఈ డెభై రెండు సంవత్సరాల అవనీ సంచారంలో బోధాకృతిలో తరచి తరచి మనందరికీ చెప్పినప్పుడు చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా గనక మామూలుగానే జీవించినట్లయితే నిజానికి ఈ జన్మ చరితార్థం కానట్టే లెక్క ఏమున్నది అందుకనే భగవంతుని గురించే ఏ ప్రసంగం అయినా అది ప్రసంగము కాదు అది ఉపన్యాసము కాదు అది ప్రవచనం భగవద్వాణి మరొక రూపంలో మరొక దేహం ద్వారా తానే అంటాడు తానే వింటాడు అందుకనే రాముడిని గురించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీ రామ కర్ణా అమృతంలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి ప్రమాణం చేశారు రాముడిని గురించి తెలుసుకోవాలి అంటే ఎట్లా అంటే రామాయణం చదివేయండి అంటాం మనం శంకరులు అలా అనలేదు.సత్యసాయి భగవానుడా! నీవు మా యందు ఆవేశించి ప్రవేశించి నీ యొక్క దివ్య మహా మహిమా అమృతమైనటువంటి సందేశ అమృతాన్ని మాకు చిలకరించవయ్యా, మాటలతో పలకరించవయ్యా, గానంతో పల్లవించవయ్యా అని ప్రార్థించగలిగినటువంటి ఒకానొక స్థితికి మనందరినీ స్వామి పరమోదాత్తమైనటువంటి స్థాయిలో సంచారం చేయిస్తారు. ఆ సందేశం అమృతమయం. ఆ సందేశం సందేశామృతం అంటే అదో పాలు, పెరుగు అటువంటి పంచామృతాలని కాదు. అమృతము మృతిలేనిది, నాశనమెరుగనిది, ఆత్మ స్వరూపమైనది, కాలాద్యవచ్ఛిన్నమైనది, అపరిణామమైనది, అప్రమేయమైనది, అచ్చ తెలివిగా ఉన్నటువంటి ఆ సందేశము సమదేశంగా దాని యందే ఉపదేశ ఆదేశాలు ఇమిడి ఉన్నటువంటి ఒక మహా త్రిపుటిగా మనం భావన చేయగలిగినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క సందేశము రాబోయేటువంటి ఈ అనంత కాలానికి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి జ్ఞాన భూమికగా, సుజ్ఞాన ప్రజ్ఞాన వేదికగా భాసిల్లుతుందని స్వామిని స్వయంగా దర్శించి అనుభవించినటువంటి మనం స్వామి జీవితంలో అంటే అవతారంలో జరిగిన అనేకానేకమైన సంఘటనలన్నింటినీ కూడా సమన్వయ సమాహారం చేసుకుంటూ ఇటు స్వామి యొక్క అవతార వైభవాన్ని, స్వామి యొక్క దివ్య లీలా అమృత వైభవాన్ని దానితో పాటుగా ఈ సందేశ అమృతాన్ని క్షీరసాగర మథనం చేసుకొని అమృతాన్ని పొందేటువంటి దిశగా సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మనకు ఆ సంపూర్ణ అనుగ్రహాన్ని వరదానం చేయవలసిందిగా స్వామిని ప్రార్థిస్తూ నేనే పుష్పము నీవే సౌరభము తండ్రీ! లోక లోకాంతర ప్రాణముల్ పలు శ్రీ దళములై విరియగా ఈ నీ నా నడుమ యుగాంతర స్థిర మహా నిర్మాణ సూత్రంముగా నేనే నీవై వెలిగిపోయెదము తంత్రీ నాద రమ్యా కృతిన్. ఒక పుష్పాన్ని ఆశ్రయించినటువంటి పరిమళంలా నీవు ఒక వీణని ఆశ్రయించినటువంటి నాదంలా నీవు నేను ఒక అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ హృదయంగమ స్థాయిలో పరమ చరమ రమణీయమైనటువంటి భావనలో ఒకరికి ఒకరమై ఇద్దరం గా కనిపించిన మనం ఈ ద్వైతంలో నుంచి పూర్ణాద్వైత భావనలోకి చల్లగా, ప్రశాంతంగా, హాయిగా, ప్రసన్నంగా, పారమార్థికంగా, కరుణా స్ఫోరకంగా, ఆనంద సంధాయకంగా, ఆనంద రసతుందిలంగా మన ఈ ప్రయాణం సహ ప్రయాణమై సాగుగాక! అదే సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై. సాయిరాం.
SSSMC · audio
Sandesame Adesam - 02
Sandesame Adesam - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 45:16
More in this series
Sandesame Adesam
- 29 min 1
Sandesame Adesam - 01
- 45 min 2
Sandesame Adesam - 02
Now playing - 30 min 3
Sandesame Adesam - 03
- 31 min 4
Sandesame Adesam - 04
- 19 min 5
Sandesame Adesam - 05
- 29 min 6
Sandesame Adesam - 06
- 36 min 7
Sandesame Adesam - 07
- 31 min 8
Sandesame Adesam - 08
- 29 min 9
Sandesame Adesam - 09
- 31 min 10
Sandesame Adesam - 10
- 44 min 11
Sandesame Adesam - 11