Skip to content
Transcript తెలుగు
[సంగీతం] సందేశమే ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధలపై శ్రీ వి.ఎస్.ఆర్. ముక్తి గారి విశ్లేషణ [సంగీతం] సేవని ఒక ఆధ్యాత్మిక భూమికగా తీసుకోమన్నారు స్వామి It is not a mere action, it is an act of spirituality. ఏమిటి spirituality? అధ్యాత్మ అంటే ఏమిటి? భౌతిక పదార్థ వాదం నుంచి ఆంతరంగికమైన పరమార్థ వాదాన్ని దాటి హృదయంగమమైనటువంటి హృదయగతమైనటువంటి యదార్థవాదంలో గనక వెళ్ళినట్లయితే స్వామి చెప్పిన ప్రకటించినటువంటి "అహం సత్యబోధకః" అన్నటువంటి సూత్రానికి అనుసరణీయంగా సత్యబోధ జరగాలి. సత్యం బోధించే వాడు ఉండవచ్చు సత్యాన్ని గురించి వివరించే వాడు ఉండవచ్చు కానీ సత్యాన్ని అనుభూతి చేసుకోవటం చాలా కష్టం. అయితే సత్యము అనేటువంటిది సతతము ఉండేది సత్యం కాబట్టి అది eternal కాబట్టి changeless కాబట్టి deathless కాబట్టి అది birthless కాబట్టి మరి ఏమిటి అంటే అన్నీ అదై అంతా తానై అదే ఇదై అంటే కనపడనిది కనబడుతున్నదై కనబడుతున్నటువంటి సర్వ సృష్టి ప్రకృతి కూడా మూలమైనటువంటి పరమాత్మయే భాసిస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు ఎవరికీ సేవ చేసినా ఎవరికి చెందుతుంది? పరమాత్మకే చెందుతుంది. నిజానికి నాలో ఉన్న దైవాన్ని నేను గనక గమనించినట్లయితే నాలో ఉన్న ఆత్మను నేను గనక దర్శనం చేసుకున్నట్లయితే నావరకే అది లాభం. కానీ నా ముందు ఉన్నటువంటి వారి అందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గనక నేను గమనించగలిగితే నేను పూర్ణుడిని అవుతాను. కాకపోయినట్లయితే నా యోగము అసంపూర్ణమే గనుక మనం సేవా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మనకు పరిచయం లేనివారు, మనకు రకమైన సంబంధం లేనివారు, రకమైన బాంధవ్యం లేనివారు, రకంగానూ మనతో ముడి పడని వారు, ఆపై మనతో జీవించే అవకాశం లేని వారందరికీ మనం వెళ్ళి సేవా కార్యక్రమాల్లో ఉంటాం. వారందరికీ ఒకే ఆనందం కలుగుతుంది మనకు కూడా అదే ఆనందం కలుగుతుంది. దీన్ని మించిన స్వామిని గురించి ఏదైనా ఒక అద్భుతం miracle చెప్పండి అని అడిగినప్పుడు miracles చెప్పటానికి ఏం లేవు అసలు. స్వామి రావటమే ఒక miracle. స్వామి ఆవరణంలోకి వెళ్ళటమే ఒక miracle. కానీ అత్యద్భుతమైనటువంటి miracle ఏమిటి అంటే స్వామి మనందరికీ దర్శనం ఇస్తారు కుల్వంత హాల్లో లేదా పాతకాలం రోజుల నుంచి. అక్కడి నుంచి స్వామి నిష్క్రమించిన తర్వాత ప్రతి వాడి యొక్క ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అంటే స్వామి మనలో ఉన్నటువంటి సేవా యోగాన్నిని ఒక్కసారి తాకి ఉద్దీపనం చేసి జ్వజ్వల్యమానం చేసి ప్రేరణ కల్పించి ఇదిగో సేవ ద్వారా నీవు నిర్వాణ స్థితిని అందుకోవచ్చును అని చెప్పటానికే స్వామి సేవా యోగాన్ని మనకు అనుగ్రహించారు. అయితే సేవ ఎవరికి చేయాలి? ఎట్లా చేయాలి? Organization పరంగా కాకుండా మామూలుగా ఒక వైదాంతిక భూమికలో గనక చేసినట్లయితే Organization పరంగా list ఉంటుంది. ఏయే కార్యక్రమాలు, నెలలో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు వెళ్ళాలి అంతా ఉంటుంది. వైదాంతికంగా ఇంకా స్వామి అంటే అనుభవం లేని వారి కోసం చెప్పే మాట సేవ ఎక్కడ ఎప్పుడు చేయాలి అంటే You should start from your own house. లవాల్ సర్వాల్ అనటంలో సర్వాల్ మన ఇంట్లోనే ఒక తొంభై ఏళ్ళ వృద్ధుడు లేదు అననుకూల ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లో గనక ఉన్నట్లయితే ఐదున్నర అయిపోతున్నది నేను స్వామి సేవలోకి వెళ్ళిపోతున్నాను మీ పాటలు మీరు పడండని కాక ఇంట్లో ఉన్న వారికి కూడా సేవ చేయటంతో మన అహంకారం నివృత్తి చెందటం మొదలు పెడుతుంది. లవాల్ అనేటువంటి సర్వాల్ అనేటువంటి స్వామి మాటలో అందరినీ అన్నివేళలా అన్నిటా అంతటా ఎప్పుడూ ఎల్లవేళలా మనం సేవ చేస్తూ ఉండవలసిందే. అసలు నిజానికి స్వామి సేవ అనేటువంటి యోగాన్ని మనకు ఎందుకు కల్పించారు? ఇది ఎక్కడ పుట్టింది? కాస్త మూలంలో గనక వెళ్లినట్లయితే సేవ అంటే అసలు అర్థం భావన. అందుకనే మనం ప్రపంచంలో అనేకమంది మన-మన దగ్గరికి వస్తారు. అనేక విషయాల కోసం వస్తారు. అయితే నేను ఇది చెయ్యను అనకూడదు. స్వామి principle ఒకటే You may not oblige but speak obligingly అది greatest సేవ. అంటే లోపల భావనలో నుంచే నేను మంచి పని చేయాలి, ఇతనికి ఆనందాన్నివ్వాలి, ఇతనికి వాత్సల్యంగా దగ్గర తీసుకోవాలి, ఇతనికి ప్రేమనివ్వాలి, నేనున్నాను అనేటువంటి ఒక చిన్న నమ్మకాన్ని కలిగించాలి, నీకు కష్టం వచ్చినా నన్నడుగు అన్నవాడు పరమాత్మ యందు విశేషమైన నమ్మకం ఉన్నవాడే చెప్పగలుగుతాడు. కాబట్టి సేవాభావంలో అహంకార మమకారాలు పోవటమే కాదు ఉన్నతోన్నతమైనటువంటి అంతరంగ వ్యక్తిత్వం కూడా unfold అవుతుంది. అందుకనే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో మాటంటాడు. శ్రీ విద్యుత్ కలితా జవం జవ మహాజిమూత పాపాంబుధారా వేగంబునన్ మన్మనోజ్య సముదీర్ణత్వంబు కొల్పోితిన్ దేవా! కరుణాశరత్ సమయమింతే చాలు చిద్భావనా సేవన్ తామరతం పరై మన్యదన్ శ్రీ కాళహస్తీశ్వరా! ఎంత అందమైన పద్యం అంటే సార్వకాలికమైన విశ్వజనీనమైనటువంటి సాహిత్యంలో ఇది మకుటాయమానమైన పద్యం. కృష్ణదేవరాయల వంటి ఒక రాజుని సేవించినటువంటి వాడు, భావించినటువంటి వాడు, ప్రతిరోజూ కొన్ని వందల పద్యాలు రాసి అగ్రహారాలు, పల్లకీలు, ఆభరణాలు అనేకమైనవి సంపాదించుకున్నటువంటి వాడు ఒకరోజున విరక్తి కలిగిఏమిటిది భగవంతుడి యొక్క తత్వాన్ని వదిలిపెట్టి నేను చివరికి రాజునా సేవించేది అనే భావన కలిగింది. భావన కలగటమే సేవ. అందుకనే అంటాడు ఇవన్నీ వచ్చిన కారణంగా అనేక పాపకార్యాలు చేశాను. పాపకార్యాలు చేసినందువలన అనేకమైనటువంటి అమృతము కాకుండా మృత సమానమైనటువంటి భావనలు నా హృదయము అనేటువంటి మొగ్గ మీద పడి పడి సూర్యుడి వేడిమి, తాలిమి, పోడిమి ఎరగని కారణంగా అసలు అది వికాసమానమే చెందలే. పోతే పోయిందిలే, పోయిందేదో తెలుసుకున్నాను కదా. కరుణాశరత్ సమయం ఇంతే చాలు. నీ కరుణ ఒక్కటి మాత్రం ప్రపంచంలో నన్ను కాపాడుతుందన్న నమ్మకం చాలయ్యా చిద్భావనా సేవన్. నువ్వు అన్నివేళలా అంతటా ఉన్నావనేటువంటి ఒక భావనలో నిన్ను సేవించుకుంటాను అన్నాడు. అంటే పరమేశ్వరుణ్ణి మనం స్వామి నారాయణ సేవ ప్రారంభించటానికి ముందు దాన్ని ఎవరూ నారాయణ సేవ అనలేదు దేశంలో, అన్నదానం అన్నారు. దానంలో దాన్ని కూడా ఒక భాగం చేశారు. స్వామి అన్నారు "నువ్వెవరివి దానం చేయటానికి? పరమాత్మ ఇస్తున్నాడు వాడు తింటున్నాడు. నారాయణుడు, నీలో ఉన్న నారాయణుడే వాడి యందు ఉన్నాడు గనుక, నారాయణుడు నారాయణుడికి సేవ చేస్తున్నాడనుకోండి, గనుక దానికి నారాయణ సేవా అని మాత్రమే పేరు పెట్టండి" అన్నారు. మిగతా వారు ఎట్లా అనలేదు. చరిత్ర మనకు తెలుసు. మరి స్వామి మాట ఎందుకు చెప్పారంటే ఆయన నారాయణుడు గనుక. కనుకనే మనందరినీ దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా అని సంబోధించటంలోనే మన ఆత్మని, మన మూలాలని, మన భౌతికమైనటువంటి లక్షణాలని, మన fundamentals ని స్వామి touch చేసి వదిలిపెట్టారు. కానీ అందుకోగలగాలి. అందుకోగలగటానికి సేవ బహుముఖీనమైనటువంటి రంగాలలో అనేకమైనటువంటి రంగాలలో సేవ ఎప్పుడూ అవసరం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కాలం ఒక అనంత ప్రవాహం. ఒక జాతి మరొక జాతిగా రూపాంతరీకరణం జరిగేటప్పుడు జాతి యొక్క అవసరాలు, జాతి పాటించేటువంటి విలువలు, జాతి celebrate చేసుకునేటువంటి సంస్కారాలు, అది పెంపొందించుకున్నటువంటి సంస్కృతి పరిమళాలు, ఇవన్నీ ఎవరి నుంచి, ఒకరి నుంచి వెళుతుంది అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి మాత్రమే వ్యవస్థకు వెళుతుంది. కనుక సంస్కరింపనేల సంఘమంతటినీవు సజ్జనుండవగుము స్వార్థముడిగి ఒక్క నీచుడప్పుడుర్విలో తగ్గును. కాబట్టి స్వీయ సంస్కరణ చేసుకోవటానికి సత్యసాయి భగవానుడు ఉపదేశించినటువంటి సేవా మార్గం తప్ప మరొక మార్గం లేదు. దీంట్లో ప్రపంచానికంతా నేను సేవ చేస్తున్నాను అనుకునేటువంటి వాడు కూడా ముందు స్వీయ సంస్కరణ చేసుకోవాలి. అహంకార మమకారాలు కట్టు దాటకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. Ever willing to work అన్నట్లు ఉండాలి. నిరంతరము కూడా జాగృతమై ఉండాలి. పరోపకార భావనతో ఉండాలి. అంటే పరా అంటే పరమేశ్వరుడికి ఉప అంటే దగ్గరగా కర ఆయన కార్యక్రమంలో పాల్గొనేటువంటి స్థాయిలో మనం మనల్ని మనం చక్కగా, ఉత్కృష్టంగా నిర్మాణం చేసుకోవాలి. దీనికి సాధారణమైనటువంటి ఒక పామర భక్తుడు గనుక దీన్ని అర్థం చేసుకోవాలి అంటే స్వామి ఒక analogy, ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. డాక్టర్ గారు ఉంటారు. surgeon, great surgeon. ఆయన operation theatre లోకి వెళతారు. వెళ్ళినప్పుడు ఆయన దృష్టి అంతా దేనిమీద ఉంటుంది? తాను చేయబోయేటువంటి operation మీద ఉంటుంది. ఎట్లాగైనా patient ని బతికించాలి అని కూడా ఉంటుంది. రెండు ఉంటాయి. తద్వారా తన చేతి మీదుగా మరొక వ్యక్తికి పునర్జన్మ లభించాలి. మూడు ఉండి తీరతాయి. మూడు లేకపోతే వాడు వైద్యుడు కాడు. మూడు భావాలతో వెళ్ళిన operation theatre లో ఒక scalpel బదులు ఒక ten scalpels ఉంటాయి. ఒక scissors బదులు పది scissors ఉంటాయి. ఇవి ఒకటికి one is to ten. ఒకటి కావాలంటే పది ఉంటాయి. They are all sterilized. They are ready to be used. ఎవరిపై, ఎవరి వలన? doctor వలన. సమయంలో doctor గారు కత్తి పట్టుకుందామా, scissors పట్టుకుందామా, scalpel వాడుదామా అనే దృష్టి దానిమీద ఉండదు. ఆయన చెయ్యి దేనిమీద పడుతుందో అది తీసుకుంటాడు. ఎందుకంటే they are all equally sterilized. They are all potentially divine. కనుకనే సత్యసాయి భగవానుడు మనకిచ్చినటువంటి సేవా సందేశంలో మనందరం కూడా sterilized ఉపకరణాలుగా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ ఆయనే సేవ చేస్తున్నారే, మనం ఇంకా చేయలేదే అంటే మనం sterilize అయ్యి అక్కడిదాకా చేరుకునేదాకా, పరమేశ్వరుడి హస్తం మన మీద పడేదాకా మనం కాచుకొని ఉండాలి. జాగ్రత్తగా ఎదురు చూడాలి. పాత కాలంలో, చాలా పాత కాలంలో స్వామి దర్శనానికి వచ్చేటువంటి సమయంలో అనేకమంది అనేక విన్నపాలు, వేడికోళ్ళు, అనేకమైనటువంటి సంతోషాలు, ఆనందాలు, దుఃఖాలు, ఆశలు, ఆశయాలు అన్నీ ఉత్తరాలు రాసి పట్టుకుంటే స్వామి కొన్నే తీసుకుంటూ స్వామి నోట నుంచి వచ్చేనటువంటి మాట కొన్ని ఏళ్ళు wait, wait, wait అనేవారు. wait ఎంతకాలం అంటే స్వామి పిలిచేదాకా wait. స్వామి ఒకసారి నవ్వుతూ "wait లోనే weightage ఉంది. కనుక జాగ్రత్తగా ఎదురు చూడండి" అన్నారు. waiting కూడా ఒక సాధన. మనము నిరాశ చెందకూడదు. ఎవరు ఎప్పుడు పాత్ర, సేవా కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉన్నదో దానిని భగవంతుడికి సమర్పణం చేసుకొనక చేసినట్లయితే అది మాత్రమే సేవ. తర్వాత నిజానికి జన్మ ఎందుకు వచ్చింది? మానవ జన్మ, పరమోత్కృష్టమైనటువంటి మానవ దేహం ఎట్లా ఏర్పడింది అంటే "అన్ని శబ్దాలు పుట్టె నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితం. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే". అన్ని జన్మలు ఎత్తాం. ఇదిగో మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మకి లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి నారాయణుడిని మనం దర్శనం చేయాలి దివ్యత్వాన్ని.ఈ దివ్యత్వాన్ని దర్శనం చేయటానికి స్వామి మళ్ళీ నాలుగు సోపానాలు చెప్పారు. మొదటి సోపాన అంటే మనలో నాలుగు dynamics ఉంటాయి dimensions ఉంటాయి. ఒకటి దానవత్వం అది అహంకారం దీనత్వం మమకారం మానవత్వం సహజీవనంగా మానవుడిగా ఉండగలగటం మూడు దాటితే నాల్గవది దివ్యత్వం. అంటే దానవత్వ దీనత్వ మానవత్వ మూడు దాటితే ఏం మిగిలిందయ్యా అంటే మిగిలిందంతా మాధవత్వమే. సేవ ద్వారా అహంకార మమకారాలు పోయినట్లయితే మనలో ఉన్న దానవుడు మరణిస్తాడు మనలో మహాయోగి ఎంత బలంగా ఉన్నాడో మాయావి కూడా అంతే బలంగా ఉన్నాడు మహాయోగితో మనకు పేచీ లేదు మాయావిని ఎట్లా బయటకు వెళ్ళగొట్టాలి అంటే ఇదిగో సేవ ద్వారా అహంకార నిర్మూలనం ద్వారా నిష్కామ కర్మ ద్వారా జరుగుతున్నదంతా పరమాత్ముడి యొక్క దివ్య హేలగా దివ్యమైనటువంటి ఒక కేలగా ఒక పరమాద్భుతమైనటువంటి లీలగా ఎప్పుడైతే మనం భావన చేస్తామో భావనలో నుంచి సేవ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి స్ఫురణ మనకు కలుగుతుంది. ఇవాళ సత్యసాయి భగవానుడి యొక్క సంస్థను గురించి ఇంకా అసలు ప్రవేశించని వాడు స్వామిని చూడనటువంటి వారు ఏమంటున్నారంటే సేవ అంటూ చేస్తే సత్యసాయి సేవా సంస్థలలోనే చేయాలి. ఎందుకని చేయాలి కారణం ఏమిటంటే అక్కడ ఐదు ఉన్నాయి discipline ఉంది dedication ఉంది devotion ఉన్నది discrimination ఉన్నది detachment కూడా ఉన్నది. అన్ని సర్వ కాలాన్ని మనం కರగిస్తాం మళ్ళీ స్వామికి స్వామి యొక్క దివ్య శ్రీ చరణాల దగ్గర దాన్ని సమర్పించి మనం పని చేయనివ్వండి ఏది సాధించనివ్వండి ప్రపంచం అంతా మనల్ని ఏం అననివ్వండి స్వామి ఇదంతా నీ దయ అని ఒక మాట అని సమర్పించుకొని రాగలిగేటువంటి స్థితి ఒక్క సేవలోనే మిగతా అన్నింట్లలో సేవింగే ఉంటుంది. ఉద్యోగం చేశాం డబ్బులు సేవ్ చేస్తాం కదా, ఏదో ఇల్లమ్మాం ఇంకో ఇల్లు కన్నాం సేవ్ చేస్తాం సేవ్ చేయటం కాదు సేవ చేసుకోండి అన్నారు. సేవ దేనికోసం అంటే రాబోయేటువంటి జన్మలలో ఇంతకంటే ఉత్తమమైన జన్మన్నా పొందాలి లేదా జన్మే లేకుండాన్నా ఉండాలి. పరమోత్కృష్టమైనటువంటి సాధనని సేవాయోగంగా భావన చేస్తూ మానవుడు మాధవుడుగా ఎదగటానికి ఇది పరమ ఉత్కృష్ట సాధనము అన్నారు. అంటే మానవుడు it is an ascent of man and descent of god భగవంతుడు ఎప్పుడూ దిగి రావలసిన వాడే మానవుడు ఎప్పుడూ ఎదిగి ఎక్కి ఎరికి ఎరుకలోకి వెళ్ళవలసిన వాడే. పైకి వెళ్ళాలి మానవుడు పైనుంచి దిగి దయా పూరకంగా కరుణా స్ఫోరకంగా కరుణాపూర్ణ సుధాబ్ధి అయి పరమేశ్వరుడు రావాలి. అందుకనే పసిపాప వంటింట్లో పారాడుతున్నప్పుడు తల్లి తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు పిల్లవాడు ఒక కేక వేసినప్పుడు తల్లి ఏం చేస్తుంది ముందు తాను చేస్తున్న పని ఆపేస్తుంది. ఆపేసి నేలమీద పాకుతున్నటువంటి పిల్లవాడిని తాను సర్వాంగీణంగా వంగి తన రెండు చేతులతో తీసుకుని గుండెకి హత్తుకుని భుజాలకు ఎత్తుకుని వాడికి వాడికి బుజ్జగించి స్పర్శానుభూతితో వాడికి ఆనందాన్ని కలిగిస్తుంది. కనుకనే పరమేశ్వరుడు కూడా మానవుడి కోసమై దిగి వస్తాడు ఒక తల్లి వలె. తండ్రి వలె శాసిస్తాడు తండ్రి వలె శిక్షణ ఇస్తాడు శిక్ష కూడా వేస్తాడు. శిక్ష కూడా నిజానికి రక్షే శిక్షల భాగం ఉండాలి శిక్ష గనక లేకపోయినట్లయితే కేవల శిక్షణతో మాత్రమే మానవుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేడు. మనం atonement అంటాం చూడండి మనం అనేక కర్మలు చేస్తాం తెలిసి కొన్ని తెలియక కొన్ని. ఇక్కడ ఒక చిన్న తేడా స్వామి మాటల్లోనే పశువులు తప్పు చేస్తాయి కానీ వాటికి తప్పు చేస్తున్నాము అని తెలియదు కనుక అవి పశువులైనాయి. మానవుడు తెలిసి తప్పు చేస్తాడు వాడికంటే పశువు గొప్పది కదా. తనలో ఉన్నటువంటి పశుపతి తత్వాన్ని తాను అనుభవించే దిశగా జన్మలో గనక సాధించుకోకపోయినట్లయితే దానికి సేవా మార్గాన్ని గనక ఎంచుకోకపోయినట్లయితే సంపదంతా ఏం చేస్తాడు? జ్ఞానమంతా ఏం చేస్తాడు? దైహికమైన బలమంతా ఏం చేస్తాడు? కన్నుమూసే దాకా కాచుకుని ఉంటాడా? అని స్వామి ప్రశ్న. కాచుకుని ఉండకూడదు ప్రతి క్షణాన్ని మనం ఎంతగా జీవిస్తే, ప్రతి క్షణాన్ని పరుల గురించి ఎంతగా ఆలోచించగలిగితే, ప్రతి క్షణాన్ని ఎంత ఆదర్శవంతంగా ఆత్మీయంగా ఆశయాత్మకంగా అనుష్ఠానంగా గనక చేయగలిగినట్లయితే మనం నిజంగా జీవించినవారి కింద లెక్క. కేవలం మనకోసమే మనం జీవించినట్లయితే అదిగో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశుల వలె మనం కూడా పుట్టాం కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాం కాల గర్భంలో కన్ను మూశాం. మానవ జన్మకి పరమ చరమమైనటువంటి లక్ష్యం ఇది కాదు లక్ష్య గమ్యాలు రెండూ మనకి స్పష్టంగా నిర్దేశింపబడినాయి. ఒక మానవజాతి గనక సముద్ధరించబడినట్లయితే ఇందాక చెప్పిన అన్ని లక్షల జీవరాశులు కూడా మానవుడి చేతిలో భద్రంగా ఉంటాయి. కనకా కనుకనే వీడికి ఒక దేహ బలాన్ని, మానసికమైనటువంటి సంస్కారాన్ని, ఆంతరంగికమైనటువంటి స్థిమితత్వాన్ని అన్నింటినీ వనకూర్చి మాధవుడు తన ప్రతిబింబంగా మానవుడిని ఇక్కడికి పంపించాడు. అంటే ప్రతి మానవుడు ఏమనుకోవాలి నేను భగవంతుని యొక్క ప్రతినిధిని చైతన్యం అదైతే మాయగా నేను వచ్చినా చైతన్యపు ఛాయ మాయ అయినట్లయితే పరమేశ్వరుడి నుంచి వచ్చిన నేను పరమేశ్వర సమానుడి వలే జీవించాలి. పరమేశ్వరుడి వలే నేను అందరినీ ప్రేమించగలగాలి పరమేశ్వరుడి వలే అందరినీ సేవించగలగాలి. శ్రీరాముడు ఎంత సేవ చేశాడు ప్రపంచానికి శ్రీకృష్ణుడు ప్రపంచానికి ఎంత సేవ చేశాడు. నిజానికి సత్యసాయి భగవానుడు చేసినంత సేవ మనం సత్యసాయి భగవానుడికి చేయలేం. ఎందుకంటే మానవత్వాన్ని ఉద్దీపనం చేసి సమస్త మానవాళిని కూడా ఒక బాట మీదికి ఒక గొడుగు కిందికి తేవటం అంత మామూలైన విషయం కాదు. ఇది ఇతః పూర్వం చరిత్రలో జరగనటువంటి ఒక పరమాద్భుత రమణీయ ఘట్టం ఇది.ఆ ఘట్టానికి మనం సాక్షులం, మనం అదృష్టవంతులం, మనం భాగస్వామ్యులం. స్వామి ఏది సంకల్పించినా మీకోసమే. నిజానికి దొరగారు ఇక్కడ ఉన్నారు గనుక దొరగారే ఒకసారి "స్వామి మంచి హాస్పిటల్ మీరు కట్టిస్తున్నారు" అంటే దొరగారితోనే స్వామి అన్నమాట "ఇది నాకోసం కాదు మీకోసం". ఎంత గొప్ప మాట! నాకోసం కాదు మీకోసం. మీకోసం మనం కూడా ఇతరుల కోసం జీవించగలిగినటువంటి పరోపకారమైనటువంటి భావనతో మనం జీవించాలి. అలాగే సేవ అంటే కేవలం వస్తువులు పంచిపెట్టడం కాదు, మన ఇంట్లో ఉన్న డబ్బు తీసుకెళ్లి వెదజల్లడం కాదు, మనకున్నదంతా ఎవరికో ఇచ్చేసేయటం కాదు, అది కాదు. సేవ అంటే ఒక ఆత్మీయ స్పర్శ, ఒక వాత్సల్య రేఖ. "నేనున్నాను" అనేటువంటి ఒక భద్రత ఇవ్వగలిగినటువంటి ఒక చల్లని చక్కని మాట. మాటలో నుంచి మనిషి బతుకుతాడు. మాటల్లో నుంచి మనిషి నిరాశయంలో నుంచి బయటికి వస్తాడు. ఇవాళ అతలాకుతలమై ఆందోళనాయత్తమైనటువంటి ప్రపంచానికి మనం చేసే సేవ చాలునా చాలదా అని ప్రశ్నించుకుంటే Mentoring అనేది ఒక కొత్త మాట పుట్టుకొచ్చింది. Mentoring ఏమిటి అంటే సత్యసాయి సేవా Organizations చేస్తున్న పని. అదే Leprosy Homes ఇంకోచోట ఇంకోచోట అనేకమైనటువంటి Hospitals అక్కడికి వెళ్లి వాళ్లకు కావలసిన మందులు, వాళ్లకు కావలసినటువంటి విషయాలు ఇస్తూనే ఆత్మీయమైనటువంటి ఒక స్పర్శ. ఎందుకంటే స్పర్శ నిజానికి అది పద్మానుగో లోకం, అది కింపురుష లోకం. మీరు ఎన్ని చేయండి, ఇంట్లో వారే భార్య కావచ్చు, భర్త కావచ్చు, కడుపున పుట్టిన బిడ్డ కావచ్చు, మనల్ని కన్న మన తల్లిదండ్రులు కావచ్చు మందులివ్వండి, డాక్టర్ ని ఇవ్వండి, కావలసినంత నగలివ్వండి, కావలసినవన్నీ సమకూర్చండి. కానీ ఆత్మీయతా పూర్వకమైన ఒక స్పర్శ వ్యక్తిని పది కాలాలు బతికేట్టుగా చేస్తుంది. "నేనున్నాను" అంటూ గనక తాకగలిగినట్లయితే చేస్తున్న సేవల అన్నింటికంటే కూడా ఉత్తమోత్తమమైనటువంటి సేవ స్పర్శ. మనం Leprosy Home కి వెళ్తాం. మన వాళ్ళు వెళ్తారు. వెళ్లి చాలా చోట్ల నేను చూశాను. వాళ్ళని తాకి ప్రసాదం ఇస్తారు. ప్రసాదం విసిరి వేయరు. మిగతా వారంతా అక్కడ పెట్టి దండం పెట్టి వెనక్కి వస్తారు. అక్కడ ఇచ్చి, తాకి, "మళ్ళీ మేము నెల కాగానే వస్తాం. ఇదిగో స్వామి ఫోటో దగ్గర పెట్టుకోండి. ఇదిగో విభూతి మీకేదన్నా ఇబ్బంది అయితే పెట్టుకోండి." ఇది ఉత్కృష్టమైనటువంటి సేవ. సేవకి ఇది అని definition, ఇది అని నిర్వచనం ఎక్కడా లేదు. మన లోపల నుంచి ఒక హృదయ స్పందనగా రావాలన్నారు సేవ. It should be spontaneous. లోపల ఒక-ఒక అన్యాయం, ఒక బాధ, ఒక దుఃఖం, ఇవన్నీ కలిగినప్పుడు మనబోటి వారు, దాన్నుంచి బయటపడినటువంటి వారు, బయట ఉన్నటువంటి వారు మునిగిపోతున్న వారికి చిటికెన వేలు అందించినా అది పరమోత్కృష్టమైనటువంటి సేవ. చూడండి పశువులకి బాధ ఉంటుందేమో కానీ దుఃఖం ఉండదు. ఒకవేళ ఉన్నా అది express చేయలేదు. మానవుడికి బాధ ఉన్నది, దుఃఖము ఉన్నది, express చేయగలడు. ఇన్ని చేసినా మనం నిరామయంగా గనక ఉన్నట్లయితే అది అధ్యాత్మ కాదు, అది సేవ కాదు. కాబట్టి స్వామి యొక్క సందేశామృత అమృతప్రాయమైన సందేశం ఏమిటంటే ఎదుటివారిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గమనించు. అన్నివేళలా నీకంటే నీ ముందు కూర్చున్న వారందరూ నీకంటే జ్ఞానులు అన్నటువంటి వినయపూర్వకమైన భావనలో నిలకడ చెందు. ప్రపంచంలో నాకంటే అధికుడు లేడు అనుకోవద్దు. మేమందరం సమానంగా అమృతస్య పుత్రాః. పరమేశ్వరుడిలో నుంచి మేము వచ్చాం. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వచ్చినట్లు, చంద్రుడిలో నుంచి సుషుమ్నా కిరణాలు వచ్చినట్లు, సర్వ ప్రకృతికి మూలమైనటువంటి పరమాత్మలో నుంచి ప్రాదుర్భవించిన మేమందరం కూడా సమానంగానే ఉన్నాం తప్ప ఇక్కడ స్థితిలో, గతిలో, భౌతిక స్థాయిలో మార్పులు గమనించవచ్చునేమో గానీ ఆంతరంగిక స్థాయిలో అందరమూ సర్వాత్మలమై ఉన్నామనే భావన సేవ ద్వారా మనం కల్పించుకోవాలి, కలిగించుకోవాలి. కనుకనే ఆత్మీయతా పూర్వకమైనటువంటి ఒక స్పర్శ, ఒక ఆప్త వాక్యము, వాత్సల్య పూరితమైనటువంటి చల్లదనము, ఇవన్నీ కూడా సేవలో ఒక అంతర్భాగాలుగా, ప్రధాన భూమికలుగా మనం గనక చేసుకోగలిగినట్లయితే సేవ ప్రపంచానికి ఇంకా విస్తృతంగా, బహుముఖీనంగా, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా అది సాగుతుంది. లేకపోయినట్లయితే మనం ఒక లిస్టు వేస్తాం. ఎన్ని దుప్పట్లు ఇచ్చాం, ఎంతమందికి ఏం ఎన్ని పంచెలు పంచాం. స్వామి అన్నారు ఒకసారి. "లెక్క లేకుండా ఇస్తున్నారే స్వామి" అంటే "లెక్క పెడుతూ ఇచ్చేదానికి విలువ లేదు బంగారు, లెక్క లేకుండానే ఇవ్వాలి" అన్నారు. లెక్క పెడుతున్నామంటే ఒక్కొక్క క్షణము నేను ఇస్తున్నా, నేను ఇస్తున్నా అనే భావన ఉన్నది. లెక్క లేకుండా, అగణితంగా, అందుకనే పరమేశ్వరుడు అగణిత గుణ స్వరూపుడు. మనకు మూడు గుణాలే చెప్తారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. పరమేశ్వరుడికి అసలు అన్ని గుణాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడే మనం చదివాం, గుణత్రయాతీతః. కనిపించే మూడు గాక నిజానికి ముప్పై మూడు వేల కోట్ల గుణాలు జీవుడి యొక్క ధాతువులో ఉన్నాయి. అవన్నీ గనక మనం గమనించుకున్నట్లయితే ఒక్క క్షణం కూడా జీవితాన్ని మనం జీవించలేం. మూడు గుణాలలో ప్రధానంగా అజ్ఞానము, అనాచారము, అస్పష్టత, అవిద్య, అహంకారము, దంభము, ప్రగల్భము, కోపము, పగ, దాష్టీకము అనబడేటువంటివన్నీ కూడా తామస గుణాలే. వీటిని విసర్జించడానికి అధ్యాత్మ రంగంలోకి రావాలి. అధ్యాత్మ రంగంలోకి వచ్చి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇవి ఉన్నాయి అంటే మనం దాని నుంచి ఏం ఫలితం పొందలేదన్నమాట. ఇంకా రజోగుణం ఉన్నది. దానిలో ఆభిజాత్యం ఉన్నది. మనకు ముందు, వెనక విరుదులుంటాయి, డిగ్రీలు ఉంటాయి, అనేకమైనటువంటి భుజకీర్తులు ఉంటాయి. అవన్నీ మనం ఇక్కడే acquire చేసుకున్నవే. మనం తెచ్చుకున్నవి కాదు. అలాగే వైదాంత, వివేక, వైరాగ్య భూమికలో గనక విచారణ చేసినట్లయితే కన్నుమూసిన మరుక్షణం వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ అప్పజెప్పి వెళ్ళవలసిందే.కనుక ఎట్లా వచ్చామో సత్వంగా వచ్చాం సా-స్వాదువుగా జీవించాలి సత్వంగా జీవించాలి మనస్సుని మనం చక్కగా control చేసుకోవాలి. మనస్సుని control చేయటానికి ధ్యానంలో ఉండండి యోగంలో ఉండండి లేకపోతే పదివేల ప్రవచనాలు చెప్పండి మీరు ముక్తులవుతారంటే పదివేల ప్రవచనాలు చెప్పిన వాడు కూడా వాడు జ్ఞాని కాకపోవచ్చు కేవలం విజ్ఞాన భూమిక దగ్గరే ఆగిపోయి ఉండవచ్చు మరి జ్ఞాని ఎవరు అంటే "సర్వం ఖల్విదం బ్రహ్మ" ఉన్నదంతా ఒక్కటే ఒక్కటే పరమాత్మ పరమాత్మకు చెందనిది ప్రపంచంలో ఏదీ లేదని ఎవరైతే ఒక స్పురహలో ఉంటారో వారు మాత్రమే జ్ఞానులుగా ఉంటారు. అయితే జ్ఞానులుగా లేకపోవటానికి మోక్షాన్ని పొందలేకపోవటానికి ప్రాపంచికమైన అన్ని యాతనలను అనుభవించటానికి ఏది కారణం అవుతున్నదంటే మనస్సే కారణం అవుతున్నది గనుక మానవుడు మనోమయుడు గనుక మన బలము మన బలహీనత మనస్సే గనుక సేవాభావంలో గనుక మనసుని ప్రవేశపెట్టినట్లయితే mind ఏమవుతుందంటే mild గా మారుతుంది నెమ్మదిగా mind mild అవుతుంది mild గా ఉన్నటువంటి mind ని నెమ్మదిగా bend చేయాలి bend చేసినటువంటి mind ని mend చేయాలి mend చేసిన mind ని end చేయాలి ఇదే అధ్యాత్మ. కాబట్టి మన మూలమైనటువంటి మనస్సుని గనుక నిగ్రహించుకొని నిగ్రహించుకోగలమా? నిగ్రహించుకో లేము గనుకనే పరమాత్మ యొక్క భావనలో పరమాత్మ యొక్క నామస్మరణలో పరమాత్మ ఇచ్చినటువంటి ఆదేశంలో ఉపదేశంలో సందేశంలో ఆదర్శంలో అన్నింటా మనం బహుముఖీనంగా ప్రవేశం చేసుకోవాలి. దానిలో అన్ని వేళలా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అట్లా అని మానవీయమైన సంబంధాలని మానవీయమైనటువంటి కార్యకలాపాలని వీటిని వేటిని కూడా విస్మరించకూడదు. దానికి పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ సత్యసాయి భగవానుడే. ఆయనకి అసలు ప్రపంచంలో రావలసిన పనే లేదు. ఎందుకని మనందరం కూడా కర్మ వశాత్తు వచ్చాం ప్రారబ్ధ వశాత్తు వచ్చాం పాపమూ శాపమూ తాపమూ కారణంగా దేహం మనకు ఏర్పడింది. మరి దీనికి అతీతమైనటువంటి పరమాత్మ తారకాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక పరమాత్మ సర్వదేవతా అతీత స్వరూపంగా మనం భావన చేస్తున్నామో స్వామి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించినట్లయితే మానవాళి యందున్నటువంటి దయచేత మానవాళికి మార్గోపదేశం చేయాలని ఒక దివ్య సంకల్పం చేత తనకి అక్కరలేకపోయినా మనవంటి మానవ దేహాన్ని తీసుకుని స్వామి ప్రపంచంలోకి వచ్చారు. సేవను గురించి స్వామి ప్రబోధం చేయలే ప్రచారం చేయలే స్వామి ఆచరించారు. అందుకనే "My life is my message" అనగలిగినటువంటి ఒకే ఒక్క అవతారం భగవాన్ సత్యసాయి. తన జీవితాన్ని పరచి తరచి ఎంత open book గా ఉంచారంటే ఎక్కడికి వెళ్ళినా క్షణాన పుటని line ని మనం ముట్టుకున్నా దానియందు దివ్యత్వము కరుణ పరిపూర్ణమైనటువంటి బుద్ధి మత్వము ఒక విశారదత్వము ఒక వైశాల్యము ఒక విస్తృత అనంత భావనా జరి అన్నీ కూడా దాని యందు నిలకడ చెంది ఉన్నాయి గనుకనే స్వామి తనకు అక్కరలేని ప్రపంచం అనుకోలేదు. ప్రపంచం తాను సృష్టించిందే గనుక వస్తువు చెడిపోతుంటే మరమ్మత్తు చేసుకోవటానికి సర్వేశ్వరుడు జగత్తులోకి వచ్చారు. వచ్చి ఏం చేశారు? మళ్ళీ ధర్మ మార్గంలోకి "అహం సత్య బోధకః" సత్యానికి లవాల్ సర్వాల్ అనబడేటువంటి రెండు మహా మంత్రాలు మహా వాక్యాలు మనకిచ్చారు. నిన్న లవాల్ లో లవ్ అనేటువంటి దాన్ని విచారణ చేశాం. ఇవాళ సేవ అనే దాన్ని సమన్వయం చేసుకుంటే లవాల్ సర్వాల్ మనకి slogans కావు సాధనా మంత్రాలవి సాధనా భూమికలవి. ప్రేమతో కూడిన సేవ చేయాలి సేవతో కూడిన ప్రేమ ఉండాలి. ప్రేమ వేరు సేవ వేరు కాదు. రెండూ అవిభాజ్యమైనటువంటి అభిన్నమైనటువంటి ఏక వస్తువుగా భావన చేసినట్లయితే మనం సేవాభావంలో పరమేశ్వరుడు అయినటువంటి స్వామి నుంచి దర్శనం ద్వారా స్పర్శన ద్వారా సంభాషణ ద్వారా శ్రవణం ద్వారా మరణం ద్వారా రకంగానైనా సరే పోనీ చివరికి కల ద్వారా ఒక ఆనందాన్ని మనం ఎట్లా పొందాము పొంది ఎంత ఆనందాన్ని పొందుతూ దాన్ని ప్రపంచంతో పంచుకున్నామో మన ఉనికి మన వ్యక్తిత్వము మన అస్తిత్వం కూడా ప్రపంచానికి ఆదర్శప్రాయం కావాలి. మన నుంచి కూడా ప్రేమ వాహిని ప్రపంచానికి ప్రసరించాలి. ఋగ్వేదంలో ఒక మాట మన చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం "Let noble thoughts come unto me from all directions" అని ఉంది. ఒక్కటే మనకి నేర్పారు. అదే ఋగ్వేద మంత్రంలో రెండో మాట కూడా ఉన్నది. అంటే ప్రపంచం నుంచి నా యందు అనేక ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి భావనలు నా యందు ప్రవేశించు గాక అని మంత్రం. దాని కిందనే మంత్రం ఏమిటంటే అట్లే నా నుంచి కూడా ప్రపంచానికి noble thoughts అందుగాక. నా నుంచి వెళ్ళకపోతే ప్రపంచం నాకు ఇవ్వలేదు కదా! computer లో మనం ఏం feed చేస్తామో దాన్ని మనం retrieve చేస్తున్నాం. దేనిని feed చేస్తున్నామో మళ్ళీ మనల్ని చూస్తున్నాం. మనం ఏమీ ఇవ్వలేదనుకోండి ఎంత నొక్కినా దాంట్లో నుంచి ఏం రాదు. It shows blank. The file is empty అని చూపిస్తుంది. అలాగే ప్రపంచము సమాజము జగదీశ్వరుడు మూడు భిన్నం కాదు. జీవుడు జగత్తు జగదీశ్వరుడు ఒక త్రిపుటి. "ईश्वरो गुरुरात्मेति मूर्ति त्रय विभागिने" ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మన్నా ఒక్కటే. కాకపోతే గురు స్వరూపంగా గనుక వచ్చినట్లయితే ఎలా గమనించాలి అంటే కబీర్ దాస్ జీవితంలో ఒక చిన్న సంఘటన ఈరోజు చెప్పుకోవాలి. భగవంతుడి దగ్గరికి ఒక భక్తుణ్ణి మనం ఎలాగో వెళ్తుంటాం ఇంకా ఆవరణ ప్రవేశం చేయనటువంటి ఇంకొక వ్యక్తిని గనుక వెంబడి పెట్టుకొని భగవంతుడి యొక్క దర్శనం గనుక చేయించగలిగితే అన్ని సేవల కంటే కూడా ఉత్తమోత్తమమైన సేవ అది. మనం పని చేయాలి.ఇవాళ ప్రధానంగా చేయాలి. కబీర్ దాసు రోజు రామ నామం చేసుకుంటాడని మనకు తెలుసు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ప్రతిరోజు సాయంకాలం గురువుగారు వచ్చేవారు. వచ్చి కబీరుకి ఆశీర్వచనం ఇచ్చేవారు. కాసేపు మాట్లాడేవారు. గురువు ఆయన యందు వాత్సల్యాన్ని ఒక సేవాభావంతో ఇచ్చేవారు. కానీ ఒకరోజున గురువుగారు తనంతటి వాడు మరొకడిని వెంబడి పెట్టుకొని వచ్చాడు. కబీరు దూరం నుంచి దర్శనం చేసుకున్నాడు. ఇద్దరూ సమానంగా వెలిగిపోతున్నటువంటి పుణ్య పురుషులుగా ఎవరు నా గురువుతో పాటు సమానంగా, గంభీరంగా నడిచి వస్తున్నాయి వీరు ఎవరు? అని మనసులో ఒక ప్రశ్న వేయగానే, మనసు కదా! కబీరు అనుకున్నాడు. ఇద్దరు వస్తున్నారు కదా, ఇద్దరికీ ఏకకాలంలో నమస్కరించలేను. ముందు ఎవరికి నమస్కరించాలి? రోజూ వచ్చే నా గురువుకా? అతిథి దేవోభవ అనేటువంటి ఆర్యవాక్యం ప్రకారం కొత్తగా వస్తున్న కొత్త వ్యక్తికా? నేను ఎవరికి నమస్కరించాలి అని. కానీ రామనామ స్మరణాంచిత దేహి అయినటువంటి కబీరు మనసు అల్పమైనది కాదు. అచించితమైనటువంటి మనసుతో ఒక్క క్షణంలో పరిష్కారం కనుగొన్నాడు. గురువుకి నమస్కరించాడు. నమస్కరిస్తే కారణం ఏమిటో చెప్పాడు. "గురు గోవింద్ దోనో ఖడే కాకే లాగూ పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే" నా గురువు ఎప్పుడూ గొప్పవాడే. ఎందుకు గొప్పవాడు అంటే, కబీర్, రామనామం చేత, రామనామ ధ్యానం చేత, తపస్సు చేత, తీవ్రమైనటువంటి భక్తి చేత సర్వ యోగాలని సమన్వయం చేసుకొని నీ అంతరంగంలో సాగుతున్నదో, రామనాద ప్రవాహానికి అంతిమమైన, పరమ చరమమైనటువంటి సిద్ధి ఏమిటి అంటే, అదిగో రామదర్శనమే గనుక నాతో వచ్చాడే ఆయన రాముడేనయ్యా అన్నాడు. అంటే భగవంతుణ్ణి చూపించిన నా గురువు భగవంతుడి కంటే గొప్పవాడు. కనుక మన యందు ఉన్నటువంటి దివ్యాత్మని మనకి పరిచయం చేసి మీరు కేవలము మట్టి బొమ్మలు కారు, కేవలం మానవ దేహంతో వచ్చినవారు కాదు, కేవలం పుట్టి గిట్టే వారు కాదు, మీరు దివ్యాత్మ స్వరూపులు అని అన్ని కాలాలలో డెబ్బై రెండు సంవత్సరాల స్వామి సంబోధనలో ఏనాడూ మార్పు లేదు. కడకంట వరకు ఒకే సంబోధన దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా. అందుకోగలిగిన వాడు ధన్యుడైనాడు, అందుకోలేని వాడు ఆగిపోయినాడు. పర్వాలేదు మళ్ళీ వాడు అందుకోవాలి. సత్య సాయి భగవానుడి యొక్క అపరిమిత అనంత మహా చైతన్యం ఇవాళ సర్వ సృష్టిని కూడా ఆవరించి ఉన్నది, ఆవహించి ఉన్నది, ఆవేశించి ఉన్నది. సేవా, ప్రేమ అనబడేటువంటి రెండు దివ్య భావనలు మనం నిజంగా ఆచరించాలి అంటే ఏం చేయాలో మరొక మార్గోపదేశం చేశారు. మరొక్క రెండు సందేశాలు అవి కూడా ఇచ్చారు. వాటిని మనం పునః రేపు విచారణ చేసుకుందాం. ఈరోజు సత్య సాయి భగవానుడి యొక్క సేవ ప్రపంచానికి-- నేను నిజానికి మధ్య వేరే ఒక సంస్థకి ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్వామి యొక్క ప్రస్తావన అక్కడికి వచ్చినప్పుడు, అది ఏదో కాదు రామకృష్ణామట మన దోమలగూడ. అక్కడ జ్ఞానదానంద ఒక మాట అన్నారు. సత్య సాయి భగవానుడు సాక్షాత్తు అవతారమే. దానిలో ఒక వెయ్యోవంతు మనం సేవ చేయగలిగిన జీవితం ధన్యమే. అవుతుందో కాదో మనం చట్రంలో ఇరుక్కోకుండా అన్నింటినీ కూడా దాటుతూ సత్య సాయి భగవానుడు ప్రపంచానికి ఒక పరమోత్కృష్టమైనటువంటి దేవీదేవతా స్వరూపంగా అన్నింటికంటే పరిపూర్ణమైనటువంటి కరుణా రసమాలయంగా ఉన్నారు. వారికి మీరు పుట్టిపర్తి వెళ్ళినప్పుడు స్వామికి ధన్యవాదాలు తెలియజెప్పండి అని వారు అన్నప్పుడు మనం ఇంకెంత సేవ చేయాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇవాళ ప్రపంచం మనల్ని గమనిస్తుంది. స్వామి దేహంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. స్వామి వైపే చూపులు ఉంటాయి. స్వామి దేహంలో లేరే, ఎవరు బయట వాళ్ళకి మనకైతే దేహంలో ఉన్నా, దేహంలో లేకపోయినా మనం దేహంగా చూడలేదు గనుక మన భావన వేరు. కానీ మెజారిటీ స్వామి లేరే వీళ్ళు ఎలా ఉంటారు అని జాగ్రత్తగా గమనిస్తారు. మన కదలిక, మన మెదలిక, మనం చేసే కార్యకలాపాలు, మనం ఎత్తుకునేటువంటి కార్యక్రమాలు, మనం చేపట్టేటువంటి సేవా యోగం అంతా కూడా స్వామి యొక్క దివ్య చైతన్యానికి గొడుగు పట్టేదిగా, ఒక పతాక శిఖర స్థాయికి తీసుకువెళ్ళేదిగా మన సాధన తీవ్రతరం కావాలి, అది పవిత్రీకరణం కావాలి, పూర్ణం కావాలి, సమర్పణాభావంతో ఉండాలి, వినయంతో ఉండాలి. అప్పుడే సేవకి ఒక సమర్థవంతమైన ఒక అర్థం మనకు లభించి, జన్మ ఎత్తినందుకు ఒక అవతారమూర్తిని దర్శనం చేసుకున్నందుకు, అవతారమూర్తితో ఉండి గాలినే పీల్చినందుకు, స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతార వైభవాన్ని రెండు కన్నులా చూసినందుకు, జీవితాన్ని పరితృప్తము, పరిపూర్ణము, సర్వ భావనామయము చేసుకుంటూ సత్య సాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఆదర్శాలని మన ఆదర్శాలుగా, స్వామి యొక్క దివ్య భావనలన్నీ మన భావనలుగా, స్వామి సంకల్పాలన్నీ మన సంకల్పాలుగా నెమ్మది నెమ్మదిగా వాటిని అలవాటు చేసుకుంటూ, సేవా యోగానికి పెద్ద పీట వేస్తూ జన్మ ఎత్తి వచ్చినందుకు దీన్ని ధన్యం చేసుకుందాం. పరిపూర్ణమైనటువంటి తృప్తితో ఎప్పుడైనా జీవితంలో అలా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బానే చేసుకోగలిగాం. పరమేశ్వరుడు మనకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మకి, పరమాత్మ స్వరూపమైనటువంటి సమాజానికి నమస్కరిస్తూ, ప్రపంచం నుంచి సెలవు తీసుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సన్నివేశం మనకు ఏర్పడు గాక అని స్వామిని ప్రార్థిస్తూ, ఇవాళ సేవ అనబడేటువంటి సందేశం నలుమూలలా వెళ్ళాలి. చాకిరీ స్థాయి నుంచి సేవా యోగంలోకి వెళ్ళాలి. యోగానికి కారణమైన, మూలమైన పరమాత్మ స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ, సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి, కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి సత్య సాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయిరాం.
SSSMC · audio

Sandesame Adesam - 07

Home

Sandesame Adesam - 07

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 36:38

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

    Now playing
  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11