Skip to content
Transcript తెలుగు
[సంతోషకరమైన సంగీతం] సందేశమే ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధలపై శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారి విశ్లేషణ. [సంతోషకరమైన సంగీతం] మనకి అహంకారం చేత భగవంతుడు మనకోసం వచ్చాడని పాటలు కట్టి పాడేసుకుంటాం కదా! భగవంతుడు మనకోసమే రాలే తాను సృష్టించిన ప్రతి వస్తువు కోసం వచ్చాడాయన. అందులో ఇది చిన్నది అది పెద్దది అని మనోమయుడైన మానవుడు నిర్ణయించాడు తప్ప పరమేశ్వరుడు నిర్ణయించలేదు. పరమేశ్వరుడిలో మనందరం ఆయన దృష్టిలో మనందరం ఒకటే. మనందరం ఒకటే కాదు మనము ఆయన ఒకటే. ఆయన మనము భిన్నం కాదు. ఇదే స్వామి ప్రేమ స్వరూపంగా ప్రపంచానికి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి సందేశం. ఇవాళ కుటుంబాలలో గాని వ్యక్తులలో గాని ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి వారికి కానీ ప్రేమ రాహిత్యం వాళ్ళని ముంచెత్తకూడదు. స్వామి ఒక్క మాట అన్నారు "ఎప్పుడూ కూడా నేను ఒక్కడినే అనుకోకు నీ లోపల నేను లేనా?" అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడే మనకు స్నేహితుడు. మనం లక్ష మందితో కలిసి ప్రయాణం చేసి మళ్ళీ మనము ఏకంగా ఒక్కరుగా అయినప్పుడు మనం ఒక్కళ్ళమే ఉన్నామా? చైత్య పురుషుడు మన హృదయ స్థానంలో నిలకడ చెంది నేను నేను అంటునే ఉన్నాడుగా! నేనున్నానంటున్నాడుగా! నేను ఉన్నానంటున్న వాడు ఒక్కసారి కూడా నువ్వు ఉన్నావని మాత్రం అనటం లేదు. నేనుని నేనుగా భావించిన వాడు లోపల నేను అంటున్నటువంటి వాడిని నువ్వున్నావని కనుక్కోవటం లేదు. content container relation లో దేహం container అయినట్లయితే content ఆత్మ అయినట్లయితే ఆత్మకి రాగం లేదు విరాగం లేదు సంయోగం లేదు వియోగం లేదు బంధన లేదు కనుక బాధ లేదు బాధ లేదు గనుక వ్యధ లేదు వ్యధ లేదు గనుక కథ లేదు. కథ ఎవరికున్నది? మనకుంది. అన్ని సన్నివేశాలే అన్ని సందర్భాలే ప్రతి దానికి ఒక కథ ప్రతి దానికి ఒక వ్యధ నిన్న జరిగినదంతా ఒక బాధ రేపు ఏమవుతుందో భయం. బాధకి భయానికి మధ్య వర్తమానము ఆనంద స్వరూపంగా ఉన్నప్పటికీ దానిని అందుకోలేని స్థితి మనకు ఏర్పడింది గనుక స్వామి సూక్ష్మంలో సర్వవేదాంత సారమైనటువంటి మాట "Love all" all లో జంతు జాలాలున్నాయి ప్రేమించగలగాలి. మన వాకిట్లో మనం పోసే చెంబు నీళ్ళకి నాలుగైదు పూలు పూసేటువంటి చెట్టుని రోజు ఒక్కసారి తాకితే ఏమవుతుంది? మన స్పర్శలో నుంచి అది జీవాన్ని చైతన్యాన్ని ఒక స్ఫూర్తిని ఒక ఆనందాన్ని నన్ను తాకేవాడు నన్ను పలకరించే వాడు నన్ను స్పృశించేవాడు ఉన్నాడు కదా పువ్వుని దాని నుంచి చెట్టు నుంచి కోస్తున్నప్పుడు నిన్నేం చేయటం లేదు నువ్వు ఎక్కడికి చేరాలో నేను చేరుస్తున్నా పరమాత్మ యొక్క దివ్య శ్రీ చరణాల దగ్గర పెట్టబోతున్నా అన్నట్లయితే చెట్టుకి దుఃఖం ఉన్నదా? అలాగే ఆకాశాత్ పతితం తోయం యధా గచ్ఛతి సాగరం ఆకాశం నుంచి పుట్టేటువంటి బిందువు కాలగమనంలో కాల పరిణామంలో పరిక్రమణంలో ఎక్కడికి చేరుతున్నది? కాలవై చలమై పిల్ల కాలవై నదై మరొకటై అయి సింధువుని చేరుతున్నది. బిందువు బిందువు లేక సింధువు లేదు సింధువు లేక బిందువు లేదు. సింధువు అంటే సముద్రం సముద్రం అంటే అనేక బిందువుల యొక్క సమగ్ర స్వరూపం అది. సమ్యక్ స్వరూపం. దానిలో బిందువు ప్రత్యేకము బిందువు మంచిది బిందువు చెడ్డది అని చెప్పగలిగిన వాడు లేడే. అట్లాగే భగవత్ సృష్టిలో ఏర్పడినటువంటి సమస్త సృష్టి కూడా పరమేశ్వరుడి యొక్క ప్రతిబింబంగా భావన చేయాలి. నేను reaction నేను reflection నేను resound అన్నారు సత్య సాయిబాబా. ఎవరికి reaction ఎవరికి reflection ఎవరికి resound మీకే మీకే. సర్వ ప్రకృతికి మూలమైన మహా చైతన్యము నేనైతే చైతన్య బిందువులుగా ఆనంద బిందువులుగా వచ్చినటువంటి మీరు తద్భిన్నంగా ఎట్లా ఉండగలరు? నా నుంచి వచ్చాను అని గనుక మీరు అనుకున్న తర్వాత మీరు ఎట్లా ఉండాలి? నా వలె ఉండాలి నా వలె జీవించాలి నా వలె ఆచరించాలి నా వలె మాట్లాడాలి నా వలె అందరినీ మీరు ప్రేమించగలగాలి. కనుకనే సత్య సాయి భగవానుడి ప్రేమకు నోచుకోని వారంటూ ఒక్కరు కూడా లేరు. ప్రత్యక్షంగా కొందరు మాత్రమే పరోక్షంగా కోటానుకోట్ల మంది. ఇవాళ కేవలం స్వామి యొక్క చిన్న పటం జేబులో పెట్టుకుంటే దివ్యమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నారు. మహిమ అనేటువంటి చిన్న పేరు చిన్న సిద్ధిని స్వామికి ఆపాదించి ఆయన్ని తగ్గించకూడదు మహా అపచారం అది. కేవలం మన ఆనందం కోసం మనల్ని సంతోష పెట్టడం కోసం భగవంతుని యొక్క శక్తి యందు మనకి నమ్మకం కలిగించేలాగా భగవత్ ఆకర్షణావలయంలోకి మనల్ని రప్పించుకునే దిశగా అక్కడక్కడా అప్పుడప్పుడు మహిమ ప్రదర్శన చేశారేమో కానీ అది నిదర్శన పూర్వకమే కానీ అది అహంకారంలో నుంచి పుట్టింది కాదు. ఇద్దరు వ్యక్తులని సత్య సాయి భగవానుడి యొక్క మహిమల గురించి విచారణ అడిగినప్పుడు ఇద్దరూ ఒకరు భగవాన్ రమణులు. సిద్ధులన్నీ విదేశీయులు అని నిన్న మీరన్నారే భగవాన్ మరి పుట్టపర్తిలోAn young man called సత్య సాయిబాబా భగవాన్. ఆయన miracles చేస్తున్నారే దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అని అడిగినప్పుడు అహంకారంలో నుంచి గనక ఒక సిద్ధి ఏర్పడినట్లయితే అది నశిస్తుంది. ప్రేమే ఒక అవతారమూర్తిగా వచ్చినప్పుడు దాని నుంచి వచ్చేది మహిమ కాదు అది అనుగ్రహము అన్నారు. కాబట్టి స్వామి మనకి వస్తువుగా ఇచ్చిన అది మహిమ కాదు అది అనుగ్రహమే. అలాగే జిల్లెళ్ళమూడిలో పుటపర్తి నుంచి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అమ్మతో ఇటువంటి మాటే అన్నారు. ఏమనంటే, "అమ్మా సత్యసాయిబాబా గారు miracles చేస్తున్నారమ్మా" అని అంటే, "నువ్వు చేయగలవా నాన్న?" అని అడిగింది. "నువ్వు చేయగలిగితే, నువ్వు చేయలేవు గనుక చేస్తున్నాడు అని చెప్తున్నావు. నువ్వు చేయగలిగే స్థాయికి వెళ్ళు నాన్న" అంది. "అమ్మా ప్రపంచంలో ఉన్న వారందరూ నీ బిడ్డలే అన్నావు కదా మరి సత్యసాయిబాబా గారు కూడా నీ బిడ్డేనా?" అని అడిగితే, "మీలాంటి వారు కాదు నాన్న" అంది. చూసారా! అంటే మనలాంటి వారు కాదు. మరి ఎవరు? పరబ్రహ్మ తత్వం ప్రపంచంలోకి ఒక ప్రేమ వాహినిని పంచటానికి, ప్రేమ యొక్క స్వరూపాన్ని అందించటానికి, పరిచయం చేయడానికి, మన అందరి అనుభవంగా ఒక అనుగ్రహంగా ఇవ్వటానికి స్వామి ఒక ఆకారం ధరించి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న కుగ్రామంలో స్వామి ఉండి సర్వ ప్రపంచాన్ని ఎలా ఆకర్షించగలిగారు? ఎలా దగ్గరకు చేర్చుకోగలిగారు? ఇంతమంది ఇన్ని అనుభవాలు ఎలా చెప్పగలుగుతున్నారు? వీటన్నింటినీ కూడా ఒక analytical గా, ఒక rational గా, ఒక radical గా, ఒక హేతుబద్ధంగా విచారణ చేసినట్లయితే హేతువుకి అందనిదే సత్యం. కానీ హేతువు ద్వారా పట్టుకోగలిగినది అదే సత్యం. హేతువాది నాస్తికుడు కాదు. ప్రశ్నిస్తూ పరమాత్మను పొందుతున్నాడు. భక్తుడు నమ్మి భగవంతుణ్ణి పొందుతున్నాడు. ఇద్దరూ పొందుతూనే ఉన్నారు. ఇద్దరికీ చెందిన వాడు పరమాత్మ. కేవలం భక్తుడికే చెందిన వాడు కాదు. నాస్తి, నాస్తికుడు అంటే స్వామి యొక్క నిర్వచనం "నా-ఆస్తికుడు". భగవంతుడు ఉన్నాడు అని అనటం లేదు వాడు, లేడు అనుకుంటూ ఉన్నాడని తెలుసుకుంటున్నాడు అన్నారు స్వామి. లేడు అనుకుంటూ ఉన్నాడని తెలుసుకుంటే అది ఖచ్చితంగా పదికాలాల నిలబడుతుంది. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటూ ఎప్పుడో మన పని కాకపోతే మనం చప్పున చేతిలో వస్తువు జారవిడిచినట్టుగా భగవంతుడు కూడా లేడని చాలామంది చూడండి. సత్యసాయి భగవానుడి మహా పరినిర్వాణ అనంతరం ఇంకా స్వామి లేరు కదా అన్న మాటలు చాలా రోజులు వినిపించాయి. ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేవు. మళ్ళీ లేరు కదా అన్న దాన్ని నేను ఉన్నాను కదా అని చెప్పడానికా మళ్ళీ అనుగ్రహాలు పంచుతూనే ఉన్నారు. ఇక్కడ కాదు ప్రపంచం అంతా కూడా. సర్వము ప్రేమమయం. జగత్తు ప్రేమమయం. ప్రేమ లేకపోతే ఒక చెట్టు పుష్పించదు. ఒక వృక్షం కాయ కాయదు. అది ఫలించదు. మళ్ళీ పునరావృత్తి జరగదు. మళ్ళీ మనకి రేపు అనే దాని యందు ప్రేమ గనక లేకపోయినట్లయితే మనం ఇవ్వాళ బతికుండం. ప్రేమే మనల్ని బతికిస్తుంది. ప్రేమే మనకు ఆనందాన్నిస్తుంది. ప్రేమ ద్వారానే మనం ఉండగలుగుతాం. అందుకనే సత్యసాయి భగవానుడు, నీవు ప్రపంచాన్ని ప్రేమించటము అంటే, నీ ఆనందం కోసమే నువ్వు ప్రేమిస్తున్నావు. ఆనందం కలగటం లేదంటే నువ్వు ప్రేమించటం కూడా ఆపేస్తావు. కానీ సర్వాన్ని ఒకటిగా, ఏకంగా, అఖండంగా నీవు గనక ప్రేమించగలిగితే ఒకే భావంతో అన్నివేళలా మనం రోజూ చదువుతాం, "అవస్థాత్రయాతీతః" ఆయనేనా? మనం కాలేమా? "కాలత్రయాతీతః" అదంతా జరిగిపోయింది మంచి కాలం లేండి. ఏం చెప్తాం? మళ్ళా కాలం వస్తుందా? కాలం వస్తుందా? రాదు అది. కాలం నడుస్తుంది. కాలం రావటం ఏమిటి? సత్యసాయి భగవానుడు అన్నది అదే. కాలక్షేపం చేయటమంటూ ఇక్కడ ఏం లేదు. కాలాన్ని గడపటమంటూ లేదు. కాలమే నిన్ను నడిపిస్తుంది. కాలమే నిన్ను నడిపిస్తుంది. కాలమే నీ జీవితం అవుతుంది. కన్ను విప్పి కన్నుమూసే లోగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న జీవితం అంతా కలిపితే అది జానెడు కాదు, బారెడు కాదు, మూరెడు కూడా కాదు. చిన్న జీవితంలో పగ, ద్వేషము, స్పర్ధ, అసూయ, ఇవన్నీ మనలో పెట్టుకొని పరమాత్మని మనం ఉపాసించినా అది వ్యర్థమైన ఉపాసన. ఒక్క ప్రేమని ఆధారం చేసుకొని గనక సర్వ ప్రకృతి, సర్వ సృష్టి ఉండగలిగితే, ప్రేమ భగవంతుడి యొక్క స్వరూపమే. భగవంతుడు "Love is God, God is Love" అన్నారు స్వామి. భగవంతుణ్ణి ఎక్కడ చూడాలి? ప్రేమలో చూడాలి. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడికి ప్రేమ ద్వారా తన దివ్యత్వాన్ని ఆవిష్కరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడికి సాలోక్యాన్ని, సాయుజ్యాన్ని ఇవ్వటానికి ముందు సాలోక్యాన్ని, సామీప్యాన్ని, సాన్నిధ్యాన్ని అనుగ్రహించి విష్ణు సహస్ర నామాన్ని స్తోత్ర గీతంగా ఆయనతో పాడించి ఆయనకు సాయుజ్యాన్ని ఇచ్చాడు. ఎందుకిచ్చాడు? ప్రేమ చేత ఇచ్చాడు. ప్రేమ వేరు, అనురాగం వేరు, రాగం వేరు. ఇవ్వాళ Love Wall అనబడేటువంటి దివ్య సందేశామృతంలో మనం విను-విన్నంత కాలము విని, అనుకున్నంత కాలము బాగుందని అనుకొని గనక దాన్ని విన్నచోటే వదిలిపెట్టినట్లయితే సాధన ముందుకు సాగదు. ఏం విన్నామో, ఏమనుకున్నామో, ఏమి సంభావించామో, వీటన్నింటినీ కూడా మన జీవితంతో మనం సమన్వయం చేసుకోవాలి. జీవితాన్ని మించినటువంటి వేదిక మరొకటి లేదు. అవకాశము లేదు. జీవితంలో విడిపోవటం చాలా తేలిక. ఎంతసేపు? స్వామే అన్నారు, "రా" అంటే మనిషి హృదయానికి దగ్గరగా వస్తాడు. "పో" అంటే ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాడు. రా-పో అనే రెండు అక్షరాల మధ్య మానవుడు చిన్న జీవితాన్ని తన చేజేతులా తాను నాశనం చేసుకుంటూ, తన ఏకాంతాన్ని ఒక వ్యర్థమైన ఏకాంతాన్ని తాను సృష్టించుకుంటూ, దీనినంతా విధి విలాసంగా భావిస్తూ...జీవితాన్ని గడిపే కంటే సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు భగవంతుని యొక్క ప్రతిరూపమే అన్నటువంటి భావనతో జీవించగలిగితే that is love all. love all స్వామి యొక్క అవతారంలో చాలా ప్రధానమైనటువంటి అంశం. ప్రేమామృత ధారులని ప్రపంచానికి స్వామి అవ్యాజంగా అందించారు, కారణం లేదు. ఎవరూ అడిగిన వాడు లేడు. స్వామి మీ ప్రేమ మాకు కావాలని అడిగిన వాడే లేడు. మీరు మాకు ఆనందం ఇవ్వమని అడిగిన వారే లేరు. ఎవరెవరికి ఎంతెంత ప్రాప్తి ఉన్నదో, ఎంత అందుకోగలరో, ఎంత receptivity level ఉన్నదో దాన్నన్నింటినీ కూడా స్వామి నిస్వార్థంగా, పరమాత్మ తత్వంతో ప్రపంచాన్ని ప్రేమించగలిగారు. చివరగా ఒక్క మాట స్వామి దగ్గర సాయి గీత అని ఒక ఏనుగు ఉండేది. ఏనుగు ఏనుగు రూపంలో ఉన్నా స్వామిని అది అమితంగా ప్రేమించింది. స్వామిని ప్రేమించని వారెవరు? అని ప్రశ్న వస్తుంది వెంటనే. స్వామి కూడా దాన్ని ప్రేమించారు. ఎలా ప్రేమించారు అంటే భగవంతుణ్ణి తన ప్రేమ బలం చేత రప్పించుకున్నది. సత్యసాయి భగవానుడు సర్వదేవతా అతీత స్వరూపమై ఉండి కూడా సాయి గీత అనేటువంటి ఒక ఏనుగు దానికి సమాధి జరిగే వరకు అక్కడే కూర్చున్నారు. అంటే భగవంతుని యొక్క ప్రేమ మన బోటి వారి మీదేనా అంటే కానీ కాదు. నెమలి మీద, ఒక చిన్న లేడి మీద, ఒక జింక మీద ప్రేమని ప్రకటిస్తూనే ఉంటారు. కాకపోతే జ్ఞాని రకమైన attachment లేకుండా ప్రకటిస్తాడు. జ్ఞాని కానివాడు వ్యసనంతో, వ్యామోహంతో ప్రకటిస్తాడు. కనుక బాధలు కొనితెచ్చుకుంటాడు. వీటన్నింటికి కూడా ఒక అతీతమైనటువంటి ఒక భావన, హృదయం గతమైనటువంటి ఒక దివ్య భావనా భూమికే ప్రేమగా మనం భావించగలిగినట్లయితే స్వామి యొక్క అవతారము, చరిత్ర, దాని గతి, దాని ధృతి, ఆధృతి మనందరికీ పరిచయం కనుక, పరిచయం లేని వారందరికీ కూడా పుస్తకాలు ఉన్నాయి గనుక, పుస్తకాలన్నీ చదివితే మనకు అర్థమయ్యేది ఒక్కటే, అది ప్రేమ ప్రవాహమే సత్యసాయి భగవానుడు. ప్రేమని అందుకోగలిగినటువంటి స్థాయిని మనం పొందాలి. ఇప్పటికైనా ఎప్పుడూ అయ్యో ఇంతకాలం గడిచిపోయింది కాదు ఇప్పటికైనా తెలిసింది కదా. క్షణం నుంచైనా మనం గనుక మేల్కోగలిగినట్లయితే పరమాత్మ యొక్క ప్రేమని మనం పొందాలి. అలాగే సత్యసాయి భక్తులుగా మనందరం కూడా సత్యసాయి బిడ్డలుగా మనందరం కూడా ఒక resolve, ఒక ప్రమాణం మానసికంగా చేసుకోవాలి. మనమందరం కూడా స్వామి దగ్గర నుంచి ఎటువంటి ప్రేమని పొందాము, ప్రేమని పొందినప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించామో, ఆనందాన్ని ఎన్ని విధాల ఎన్ని వేల మందికి మనం చెప్పుకుంటూ పరమానందాన్ని మళ్ళీ మళ్ళీ పునః పునః పొందాము. అట్లాగే మన ఉనికి, మన వ్యక్తిత్వము, మన అస్తిత్వము, మన జీవితము, మన సంబంధాలు మానవతా పరిమళం కావాలి. మానవీయమైనటువంటి సంగీతం కావాలి. అది ఒక దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి గీతం కావాలి. మానవ సంబంధాలు పరిపుష్టం కావాలి. మానవతా పరిమళాలని కూడా ప్రపంచం నిండా వెదజల్లబడాలి. దివ్యమైనటువంటి ఒక మహా ప్రేమావతారిగా వచ్చి love all అందరినీ ప్రేమించు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వేద ప్రమాణికమైనటువంటి ఒక భావనని ప్రపంచానికి స్వామి అందించారో దాన్ని మనం ఇవాళ సాధనగా స్వీకరించాలి. ద్వేషమే ఎరుగని మనస్సు ప్రేమ మాత్రమే ఎరిగిన మనస్సుగా, అసూయకి అవకాశమే లేని ఒక మనసుగా, హృదయమే నడిపించేటువంటి ఒక మహా శక్తిగా మనందరం శేష జీవితాన్ని, మిగిలినటువంటి కాలాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలిగినట్లయితే అప్పుడు మాత్రమే మనకి సత్యసాయి భగవానుడు కాస్తూ అర్థమైనట్లు లెక్క. కాకపోయినట్లయితే మనం కూడా అందరిలాగే మహాపురుషుణ్ణి చూశాం, వెనక్కి వచ్చేశాం. ఏం పొందావయ్యా? ఏమో ఇంకా అర్థం కాలేదు. స్థితిలో మనం ఉండకూడదు. రాగ అనురాగ బంధాలను దాటి ప్రేమైక స్వరూపమైనటువంటి స్వామిని మనం దివ్యంగా, ఆంతరంగికంగా అనుభవించాలి, బాహ్యంగా ప్రకటించాలి, పరస్పరమైనటువంటి భావనతో జీవించాలి. ప్రతిరోజూ మనం అనుకునేటువంటి సహనా భవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై అది కేవలం శాంతి మంత్రం కాదు, అది ఒక ఆదేశం. అది ఉపనిషత్తులు మనకు అందించినటువంటి మహా సందేశం, అది మంత్రం. మంత్రాన్ని ఆధారం చేసుకుని యంత్రాన్ని మనం నడిపించుకోవాలి. దివ్యమైనటువంటి మహా సన్మంగళ వేళ సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహం మనందరిపై చల్లగా ప్రసరించు గాక. మనందరినీ సన్నని దారుల నడిపించు గాక. లోకంబులు, లోకేశులు, లోకస్థులు వీళ్లందరూ వెళ్లిపోయినా అలోకంబైనటువంటి పెంజీకటికి అవల ఉన్నటువంటి వెలుగా, వెలుగులో నన్ను నీవు కలుపుకో అన్నాడు పోతనామాత్యుడు భాగవతంలో. అద్భుతమైన పద్యం. లోకాలు పోనీ, లోకేశులు పోనీ, గురువులు జారిపోనీ, అసలీ కనిపిస్తున్న సర్వ ప్రపంచము అదృశ్యమైపోనీ కానీ దీనికన్నింటికీ అతీతమైనటువంటి పెనువెలుగు ఉన్నదో, తేజోమయమైన స్వరూపం ఉన్నదో దానిలోకి నేను నన్ను నడిపించుకునే దిశగా పరమేశ్వరా! నీవున్నావు కదా. చిన్న వెలుగు పెను వెలుగులో కలిసేటువంటి సాయుజ్య విధానాన్ని, సాయుజ్య స్థితిని కల్పించమని ఆయన ఎలా ప్రార్థించారో మనం కూడా love all అనేటువంటి సందేశామృత ధారని పుణికి పుచ్చుకుని, సాధనా మాత్రం చేసుకుని, సాధనా యోగంలో ప్రసారద్ర భూమికలో మనం నిలకడ చెందాలని, స్వామి యొక్క సర్వానుగ్రహము మనకు అన్నివేళలా మనకు లభించాలని, గురువుల మధ్య, అవతారమూర్తుల మధ్య రకమైనటువంటి భేదభావం లేకుండా సర్వ గురువులు ఒక్కటే అనేటువంటి ఒక ఉదాత్త భావనలోకి స్వామి మనల్ని అందరినీ కూడా చల్లగా, హాయిగా, ప్రసన్నంగా, పారమార్థికంగా నడిపించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ మళ్ళీ మరొక్కసారి కోటి సమితి ఇక్కడ ఏర్పడినటువంటి స్థలం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కలిగే అనుభూతి ఒకటే. ఇది ఒక పరమాద్భుత యజ్ఞశాల. పరమాద్భుతమైన యజ్ఞశాలలో యజ్ఞకర్త సత్యసాయి భగవానుడు. ఆలోచలుడు సత్యసాయి భగవానుడివి. అంటున్నది సత్యసాయి భగవానుడు. వింటున్నది జీవులమైన మనందరం. అందరమూ కలిస్తే అనేకము ఏకమైనటువంటి మహాద్భుత దృశ్యాన్ని ఇక్కడ మనం ప్రతిసారి ఆవిష్కరించుకుంటూనే ఉన్నాం. ఇటువంటి దశ, ఇటువంటి యోగాన్ని సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనకు కడదాకా అనుగ్రహించు గాక. అనేక క్షేత్రాల నుంచి అనేకమంది జీవులు ఇక్కడికి వచ్చి ఆనందామృతాన్ని తమ రీతిలో తాము అనుభవించి ఇక్కడ నుంచి సాధులలో పరిపూర్ణులై, జీవన్ముక్తులై, వినిర్ముక్తులై, అకర్మ, కర్మ, వికర్మ అనబడేటువంటి మూడు స్థాయిలను దాటి సంపూర్ణమైనటువంటి సత్యసాయి భగవానుని యొక్క తత్వ విచార ధారకి అతి సన్నిహితంగా మెలగు గాక. మళ్ళీ మళ్ళీ పునః జన్మే లేనటువంటి, పునర్జన్మ రహితమైన, పునరావృత్తి రహితమైనటువంటి మహా సాయుజ్య స్థితి సర్వేశ్వరుడైన స్వామి మనందరకూ అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio

Sandesame Adesam - 05

Home

Sandesame Adesam - 05

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 19:32

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

    Now playing
  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11