Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరాం! భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరిలో భారతీయ గురుతత్వం అనే అంశంపై ఐదు రోజుల కార్యక్రమం జయప్రదంగా ముగిసింది. ఫిబ్రవరి మాసంలో ఆచంట అరుణ్ గంగాధర్, మన్నవ రేవతి గారలచే భక్తి సంగీత కార్యక్రమాన్ని, మార్చ్ నెలలో తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని తొమ్మిది మంది కవులచే సంగీత వాఙ్మయార్చన కార్యక్రమాన్ని, ఏప్రిల్ మాసంలో శ్రీ సత్యసాయి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని కుమారి మాళవిక ఆనంద్ గారిచే కర్ణాటక భక్తి సంగీత కార్యక్రమాన్ని, మే నెలలో పది రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణా శిబిరాన్ని, జూన్ మాసంలో ఓం శ్రీ సాయిరాం నామ జపం మరియు శ్రీ సాయి చరణ్ రాజ్ మరియు సాయి శ్రుతిరాజు గారలచే భక్తి సంగీత కార్యక్రమాన్ని, జూలై మాసంలో ప్రముఖ వీణా విద్వాంసుల చే వీణావాదన కార్యక్రమాన్ని, ఆగస్టు నెలలో ఐదు రోజుల పాటు శ్రీ-శ్రీడి సాయి సచ్చరిత్ర కార్యక్రమాన్ని స్వామి వారి దివ్య ఆశీస్సులతో జయప్రదంగా జరుపుకున్నాం. సెప్టెంబర్ మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవని సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా భూమికలు. సర్వ శాస్త్ర, సర్వోపనిషత్తుల ప్రాతిపదికగా సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సత్యసాయి మహోపదేశం అనే సత్యసాయి తత్వ ప్రవచన ప్రవాహం అందరినీ ప్రమోదం కలిగించాల్సిందిగా స్వామిని ప్రార్థిస్తూ రేడియో సాయి శ్రోతలకు అందరికీ సాయిరాం! సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్బ్రహ్మ స్ఫురతాం ని. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ విశేషంతో మనందరం కూడా ఈరోజు నుంచి ఐదు రోజులు స్వామి సర్వ మానవాళికి అందించినటువంటి మహోపదేశాన్ని గురించి అనేకమైనటువంటి పార్శ్వాలను మనం తడుముకుంటూ మన జీవితాలతో మన అధ్యాత్మ సాధనతో సమన్వయం చేసుకుంటూ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య లీలా వైభవాన్ని, అవతార వైభవాన్ని రంగరించుకుంటూ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, ప్రస్థానత్రయం అన్నింట్లలో ఉన్నటువంటి అనేకానేకమైన మౌలికమైనటువంటి విషయాలని స్థాలీపులాక న్యాయంగా కాక ఒక సమగ్రమైనటువంటి సమ్యక్ విచారధారగా మనం కొనసాగించుకోవాలి. ఎందుకంటే పరమేశ్వరుడు మానవ దేహంలో ఉండగా చెప్పిన బోధ, రూపాన్ని చూసి మైమరచిపోయి సగమే తలకెక్కుతుంది. స్వామి యొక్క దర్శనంలో ఉన్నటువంటి మహత్యమే అది. అలాగే స్వామి నామస్మరణాంచితమైనటువంటి దేహధారి అయినటువంటి మానవుడు ఇలాగే చెప్తూ ఉంటారు మనం వింటూ ఉందామని ఒక అలవాటు చేసుకుంటాం. ఒకరోజున చెప్పటం ఆగిపోయినప్పుడు ఏం చెప్పారు అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ అర్థం కానట్లుగా అయిపోతాం. ఒక పరమేశ్వరుడు ఒక పాంచభౌతిక దేహాన్ని తీసుకుని ప్రపంచంలోకి వచ్చినప్పుడు అందునా వింధ్య పర్వతాల కివతల ఉన్నటువంటి ఆంధ్రదేశంలో వచ్చిన ప్రప్రథమ అర్చావతార మూర్తి భగవాన్ సత్యసాయి. మన వరకు రాముడు ఒక కథ, శ్రీకృష్ణ పరమాత్మ మరొక కథ, మొన్న మొన్నటి శ్రీడి సాయి భగవానుడు కూడా అది ఒక కథే. దీనికి చారిత్రకమైనటువంటి ఆధారం సాహిత్యం ఆధారంగా సాగితే ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ మహాభాగ్యశాలురం మనం. ఒక పరమేశ్వరుడితో కూడి జీవితాన్ని, రెండు జీవితాన్ని హాయిగా గడపగలిగాం.స్వామిని గురించి తెలుసుకోవాలి అంటే పుస్తకాల ద్వారా కాదు స్వామి ప్రపంచానికి ఇచ్చిన ఉపదేశం ద్వారా అందున మహోపదేశం ద్వారా ఉపదేశం ఏమి మహోపదేశం ఏమి అంటే ఉపదేశము అంటే ఒక గురువు ఒక దీక్షా గురువు ఒక సాధకుడికి ప్రాపంచికమైనటువంటి రకమైన లబ్ధి లేని రీతిలో కేవల అధ్యాత్మ జీవితాన్ని గడపటానికి ఇచ్చేటువంటి మంత్రమే ఉపదేశం మరి మహోపదేశం ఏమిటి అంటే మానవ జీవితమే మహా మంత్రం మనం ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనకు తెలియకుండానే ప్రాణాయామం గా శరీరం నడుస్తున్నది మనలో ఉన్న మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వాసనలు మూల వాసనలు జన్మాంతర సంస్కారాలు మనల్ని విధి ఎట్లా నిర్ణయిస్తే దాని ప్రకారంగా మనం వెళుతున్నాం విధి నిర్ణయించిన ప్రకారం వెళ్ళటానికి మనం ఏమి జంతు జాలం కాదు మనం మానవ మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మనం పరమేశ్వరుని మన వాడిని చేసుకుని పరమేశ్వరుడికి మనం సమర్పణం చేసుకుని పరమేశ్వరుడు మార్గంలో వెళితే మీకు ఆనందం కలుగుతుంది మార్గంలో వెళితే మీకు బ్రహ్మానంద పద లబ్ధి కలుగుతుంది మార్గంలో గనుక వెళ్ళినట్లయితే మీ జన్మ సార్థకం అవుతుందని చెప్పారో అదే మహోపదేశం మహోపదేశం ప్రామాణికమా ప్రామాణికమే భగవంతుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట శుద్ధ చైతన్యమే దానికి కాయితాలు కలాలు అక్కర్లేదు భగవంతుడు చెప్పే మాటకి ముందు ఉన్నటువంటిది గాని తర్వాత ఉన్నటువంటిది గాని ప్రభావితం చేయలేవు ఏం చేస్తాయంటే మూలాలు ఉన్నాయో మాటకి ఏది మూలమో సృష్టికి ఏది మూలమో మన జీవితానికి ఏది మూలమో అసలు సమస్త మానవాళి యొక్క ఆలోచనా రీతులకు ఏది మూలమో ఆదిమూలమైనటువంటి పరబ్రహ్మమే సత్య సాయి భగవానుడు గా ఒక దేహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు అందుకనే కృతయుగం నాటి సత్యము త్రేతాయుగం నాటి ధర్మము ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలు కలియుగానికి సంబంధించినటువంటి అహింస సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి ఐదు తత్వాలతో ఒక దేహాన్ని తీసుకుని స్వామి ఇక్కడికి వచ్చారు అంటే స్వామి సర్వదేవతా అతీత స్వరూపం అనటానికి దీన్ని మించిన ఉదాహరణ లేదు ఐదు యుగాలు నాలుగు యుగాలు అందులో పరబ్రహ్మ స్వరూపం కలిసినట్లయితే అది సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామి అంతేనా రాముడు త్రేతాయుగంలో శ్రీమన్నారాయణ రూపంలో ఉండగా నారదాది మహర్షులంతా వెళ్లి అయ్యా మిధిలా నగరంలో రాజర్షి అయినటువంటి జనక మహారాజు ధర్మం తప్పకుండా జ్ఞానైక స్థితిలో రాజ్యం చేస్తున్నాడు మిధిలా నగరం హాయిగా ఉన్నది అడవి దాటి నది దాటి ఇవతలకు రాగానే దాని పక్కనే అయోధ్యా నగరం ఉన్నది అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు అక్కడ రాజస గుణం పరిణమిస్తూ ఉన్నది ముగ్గురు భార్యలు ఉన్నా ఆయన నిస్సంత అయినాడు దశేంద్రియాలను నియంత్రించగలిగినటువంటి ధీ శక్తి ఉన్నప్పటికీ కూడా పుత్రులు లేరే అనేటువంటి ఒక వాసన ఆయనని యాతన పెడుతూ ఉన్నది ఇదిగో సముద్రం దాటితే సముద్ర మధ్యంలో లంకానగర రాజైనటువంటి రావణ బ్రహ్మ తామస గుణానికి ప్రతీకగా సత్వ రజస్తమో గుణాలు మిధిలా అయోధ్యా లంకలుగా ఉన్నాయి ప్రజానీకమంతా యాతన పడుతున్నారు నీవు అవతారం చాలచవలసిన సమయం ఆసన్నమైనది అని అన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఏమిటా ప్రతిజ్ఞ అంటే నేను దశరథుడు ఇంట పుడతా దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తా అంటే రావణ బ్రహ్మ తలలు తెగే లాగా చేస్తా దశ యుగాల వరకు రామనామం వినపడే లాగా నేను వస్తా మీరు భ-- నిర్భయంగా ఉండండి అన్నాడు ఆయన నోటి నుంచి వచ్చినది నిజానికి రామనామము తను అవతారం చాలచక ముందే తన రాబోయే అవతారానికి ఆయన పేరు పెట్టుకున్నాడు మనందరికీ తెలుసు శ్రీరామచంద్రుడి జననం అయిన తర్వాత నామకరణ మహోత్సవం జరుగుతున్నటువంటి వేళ అంత: పురంలో వశిష్టాది మహామునులంతా కూడా మహర్షులంతా ఉన్నటువంటి వేళ బియ్యంలో రాముడి పేరు రాశారు దాంట్లో ఏమని ఉన్నది అంటే రామభద్రుడు అని రాశారు వశిష్టులు వారు వయసు మళ్ళిన కారణంగా బియ్యంలో చూపుడు వేలుతో రాసిన కారణంగా రామభద్రుడు అని చదవబోయి రామచంద్రుడు అని పిలిచాడు చూశారా రామా అన్న శబ్దం నారాయణుడు అన్నట్లయితే రామభద్రుడు అనే అంతఃపురం వాళ్ళు అన్నట్లయితే రామచంద్రుడు అన్నటువంటి వాడు కుల గురువు అయినటువంటి వశిష్టులు వారు ఆయన సూర్యవంశ సంజాతుడు అయినప్పటికీ కూడా మనసు చంద్ర వంశతో కూడి ఉన్నది గనుక ఆయన రామచంద్రుడు సర్వ జనావళి కూడా అన్నివేళలా సానందంగా ఉండాలని కోరుకున్నటువంటి పరమోత్కృష్టమైనటువంటి మాయా మానష వేషధారి గనుక రామభద్రుడు పధ్నాలుగు ఏళ్ళు అరణ్యంలో ఉంటే గంగాతీరం దగ్గర అయోధ్యా ప్రజలందరూ వచ్చి రామా నువ్వు లేకపోతే మేము ఎలా జీవించగలం అంటే అయోధ్యలో ఉన్న అంత: పురంలోనే ఉంటాను కానీ రోజూ కనపడతాన నేనున్నాను అనుకొని జీవించండి అన్నాడు పధ్నాలుగు సంవత్సరాల రామనామ స్మరణాంచితమైనటువంటి దేహులుగా అయోధ్యా నగర ప్రజలంతా మగ పిల్లవాడు గనుక పుడితే వాడికి రామా అని పేరు పెట్టుకున్నారు.ఆడపిల్ల గనుక పుట్టినట్లయితే రామా అని పేరు పెట్టుకున్నారు. తమ కడుపున పుట్టినటువంటి బిడ్డలనందరినీ రామానో రామ అనో పిలుస్తున్నారు గనుక పధ్నాలుగేళ్ళు అయోధ్య రామనామంతో తరించిపోయింది. అంటే రాముడికి పేరు ఎవరు పెట్టారు అని ఎవ్వరూ పెట్టలే ఆయనే పెట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో కూడా షిరిడి బాబా కి పేరు ఎవరు పెట్టలే. తొలినాళ్లలో ఫకీర్ అన్నారు, ఉన్మత్తుడు అన్నారు, అబ్రాహ్మణుడు అన్నారు, బ్రాహ్మణుడు అన్నారు, జ్ఞాని అన్నారు, అజ్ఞాని అన్నారు కానీ ఎప్పుడైతే పెళ్లి వారితో కలిసి రెండవసారి షిరిడి ప్రవేశం చేశారో, మహల్సాపతి ఆయన్ని తొలినాళ్లలో ఖండోబా ఆలయంలో ఉండటానికి వీలు లేదన్నాడో అదే మహల్సాపతి ఆవో సాయి అని పిలిచాడు. చూసారా, స్పురణ అదే మహల్సాపతికి కలిగించారు. అంటే పరమేశ్వరుడు గనుక అవతారమూర్తిగా వచ్చినట్లయితే ఆయనకు పేరు పెట్టగలిగిన వాడు లేడు. ఆయన పేరు ఆయనే పెట్టుకుంటాడు. అలాగే "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" నన్ను నేనే సృష్టించుకున్నా. తనను తాను సృష్టించుకున్నటువంటి వాడు తన దేహానికి తాను పేరు పెట్టుకోలేడా? కనుకనే సత్యసాయి భగవానుడు ప్రపంచంలోకి వచ్చినప్పుడు అంతఃపురం వంటి కుటుంబం పేరు పెట్టినా స్వామి తన దేహానికి పెట్టుకున్న పేరు మనందరికీ ఎరుకే. "ఔపదేయం మునకు సత్యనామం బిచ్చి నడత కెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చె మా స్వామి మల్హారమై విచ్చే మా స్వామి కల్హారమై" ఔపదేయం అంటే ఉపాధి, ఉపాధి అంటే శరీరం. శరీరానికి ఆయన పెట్టుకున్న పేరు సత్య. చూశారా, ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలోనూ ఆయన పలికిన పలుకు, నడిచిన నడక, చూపించినటువంటి అనేకమైనటువంటి లీలలు, మహిమ అంతా కూడా ఏమున్నదయ్యా దాని నిండా అంటే భారతీయ సైద్ధాంతికమైన ఆర్షధర్మ పరిపూతమైనటువంటి ఒక ధర్మమైన, ధర్మం మాత్రమే ఉన్నది. కనుక స్వామి దేహము సత్యమైనట్లయితే దాని పేరు స్వామి నడిచినటువంటి దారంతా ధర్మమార్గం అయిపోయింది. అలాగే స్వామి ఒక్కసారి తప్ప తానున్న ప్రదేశం విడిచి, దేశం విడిచి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. మనకు తెలుసు అది. కానీ ఏం జరిగిందయ్యా తాను కదలకుండా సర్వ ప్రపంచాన్ని కలిగించి, కదిలించి, తాను ఉన్నచోట నుంచే సమస్త ప్రకృతిలోనూ శాంతికాంతుల వెలార్చి, మీరు శాంతిగా ఉండండి అని ప్రతి చోటికి వెళ్లి స్వామి చెప్పారా? అవసరం లేదు. కనుక ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి, వచ్చే మా స్వామి మల్హారమై. మల్హారము అంటే బంగారం. బంగారము అంటే శుద్ధ చైతన్యం. హిరణ్యగర్భుడు మాత్రమే మల్హారం అవుతాడు. వచ్చి ఏదో బంగారం ముద్దలాగా ఎవరికీ అందకుండా, ఎవరికీ చెందకుండా ఎక్కడో షోకేస్ అయి స్వామి ఉన్నారా? "విచ్చే మా స్వామి కల్హారమై" సహస్రదళాలతో, పరిపూర్ణమైనటువంటి, వికాసమానమైనటువంటి షోడశి మహావిద్యకి సాకారంగా, అంతే కాకుండా ముప్పై రెండు ఉపాసనా మార్గాలకు ఒక మూర్తిగా, అంతే కాకుండా "ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ" అన్నటువంటి ఓంకార స్వరూపంగా, సర్వ నామములు తనవి కాగా తనకు పేరు లేని విధంగా, సర్వ దేహములు తనవైనప్పటికీ కూడా తనకు దేహము లేనట్లుగా, దేహాత్మ భావనని తొలినాళ్లలోనే వదిలిపెట్టినటువంటి, పరమోత్కృష్టమైనటువంటి "గురూణాం గురుః" సత్యసాయి భగవానుడు. రాముడికి ఇద్దరు గురువులు. లోక గురువు విశ్వామిత్రుడు, జ్ఞాన గురువు వశిష్టుడు. ఇద్దరూ బ్రహ్మర్షులు. అంటే రామావతారానికి ఇద్దరు బ్రహ్మర్షుల అవసరం ఏర్పడిందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేప్పటికి ఒక్క సాందీపుడు ఉన్నాడు. సత్యసాయి భగవానుని దగ్గరకు వచ్చేప్పటికి గురువే లేడు. గురువే లేని ఎందుకు లేని స్థితి ఉన్నదంటే ఆయనే గురువు. ఇక ఆయనకు చెప్పగలిగినవారు గాని, ఆయనకు మార్గం చూపించవలసినవారు గాని, ఇదిగో ఇట్లా నడవమని చెప్పగలిగిన వారు గాని ఎవరూ అవసరం లేదు గనుక, సర్వ ప్రపంచాన్ని దత్తాధీనమై ఉన్నటువంటి స్థాయిలో సంచారం చేశారు గనుక స్వామి ఒక ఉదాత్త దత్త భూమికలో ఇక్కడికి వచ్చారు. దత్తుడు అంటే కంచి మహాస్వామి ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు. దత్తుడు అంటే కేవలం మూడు తలలు ఉన్నటువంటి స్వరూపం కాదయ్యా, ఎవరు ప్రపంచాన్ని అడాప్ట్ చేసుకుంటాడో, దత్తత చేసుకుంటాడో, ఎవరు తమ సర్వ శక్తులని ప్రపంచానికి దత్తం చేస్తాడో అట్టివాడే దత్తుడు అన్నారు. స్వామి చరిత్రని మనం గనుక గమనించినట్లయితే, అధ్యయనం చేసినట్లయితే, అనుభవించగలిగినట్లయితే సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులు ఏకకాలంలో అనుగ్రహించినటువంటి పరమాద్భుత వరప్రదాత భగవాన్ సత్యసాయి దత్త ఉదాత్తమూర్తి. అంతేకాదు రామ ధర్మము, కృష్ణ చైతన్యము, శ్రీ లలితా మూలమైనటువంటి మహా చిచ్ఛక్తి స్వరూపము, సర్వ వాంగ్మయమైనటువంటి సరస్వతీ స్వరూపము అన్నీ కలబోసుకున్నట్లయితే, వక్షస్థలాన లక్ష్మీదేవిని నిలుపుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇవన్నీ సమన్వయం చేసి సత్యసాయి భగవానుడి ఉపాధికి గనుక మనం అన్వయం చేసుకోగలిగినట్లయితే అది సర్వదేవతా అతీత స్వరూపమే. సంపదని అనుగ్రహించిన వేళ అదే శ్రీమహాలక్ష్మి.వాక్కుని అనుగ్రహించినటువంటి వేళ అది వాగధీశ్వరి వాగీశ్వరి వాగ్విభూతి వాంగ్మయి చరాచరమయి శ్రీమయి ఆనందమయి జ్యోతిర్మయి. జ్యోతిర్మయమైన అఖండ సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఎక్కడ ఉన్నది? ఎచట నున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పర్తిని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటినను సత్యము తెల్పగా వచ్చెను సాయియై సత్య సాయియై. ఎక్కడున్నావయ్యా పరమాత్మ అంటే నేను పత్రిలోను లేను పర్తిలోను లేను సర్వ హృదయాలలోను నేనున్నాను పట్టుకోగలిగితే అనుభవించగలిగితే ఆనందించగలిగితే అనుష్ఠానం చేయగలిగినట్లయితే సత్య మార్గంలో నడిచినట్లయితే సత్యాన్వేషణ చేయగలిగినట్లయితే సత్యార్థమును ఎరిగినట్లయితే నేను నేనేనన్నారు స్వామి. అందుకనే స్వామి నేను యతిని కాను నేను యోగిని కాను నేను భోగిని కాను మరి నేను ఎవరు? నేను నేనైన నేను. స్వామి సిక్స్టీఎయిత్ బర్త్డే. నేను నేనైన నేను అంటే అవస్థాత్రయాతీతము, గుణత్రయాతీతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి చిచ్ఛక్తి ఏదైతే ఉన్నదో అదే సత్యసాయి భగవానుడు సాకారంగా దేహాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ పుట్టపర్తిలో. వైదిక ధర్మము సనాతన ధర్మము ఆర్ష ధర్మము నెమ్మది నెమ్మదిగా వెనకబడిపోయి బ్రిటిష్ సామ్రాజ్య వలస పాలకుల కాలంలో ప్రధానంగా అనంతపురం జిల్లాలో మతము అమ్ముడు పోతున్నటువంటి వేళ ఆకలి కోసం జీవుడు మతాన్ని ఆశ్రയിస్తున్నటువంటి వేళ తన మూలాలు తాను మరచిపోతున్నటువంటి వేళ కేవలం పిడికెడు గింజల కోసం గొంతులు కోసుకునేటువంటి వేళ అవిద్యలో అస్పష్టతలో అనాచారంలో ఉన్నటువంటి మానవుడికి ఆచారాన్ని సదాచారాన్ని సమ్యక్ సంకీర్తనని పరితృప్తమైనటువంటి జీవితాన్ని శాంతిని హాయిని కాంతిని క్రాంతిని దాంతిని అనుగ్రహించడానికి స్వయం సిద్ధంగా వచ్చినటువంటి పరిపూర్ణ మహావతారం సత్యసాయి భగవానుడు. అందుకనే స్వామి అనేక సందర్భాలలో చెప్పిన మాట నేను కొత్తగా ఒక సిద్ధాంతాన్ని చెప్పటానికి వచ్చిన వాడిని కాదు. అసలు అవతారం వచ్చింది ఒకందుకే అహం సత్యబోధకః. నేను సత్యం అంటే ఏమిటో చెప్పటానికి వచ్చాను. సత్యాన్ని ఎవరు చెప్పగలరు? సత్యాన్ని సత్యమే చెప్పగలదు. దేవో భూత్వా దేవం యజేత్. ఈయన భగవంతుడే అని ఎవరు అనగలరు అంటే భగవత్ తత్వాన్ని ఎరిగినవాడు భగవంతుని ఉపాసన చేస్తున్నవాడు భగవన్ నామాన్ని తన నాలుక పైన నర్తించేటువంటి వాడు భగవంతుని యొక్క కథలను వింటూ ఆనందపడేటువంటి వాడు భగవంతుడు చెప్పిన ఆజ్ఞను పాటించేవాడు సర్వము సమర్పణ శరణాగతి వినయము అన్నటువంటి మూడు భావనలతో పరమేశ్వరుడికి తనను తాను కైంకర్యం చేసుకున్నటువంటి వాడు మాత్రమే ఈయన భగవంతుడు అని అనగలడు. కేవలం అవసరానికి అవకాశానికి కష్టానికి దుఃఖానికి ఒక అననుకూలానికి లోబడినటువంటి భావాలు అవి తీరగానే మారిపోతూ ఉంటాయి. కష్టం రాగానే దేవుడి దగ్గర నుంచుంటాం తీర్చవయ్యా అని అడుగుతాం ఆయన తీరుస్తాడు. తీర్చిన మరుక్షణం ఆయనెవరు మనమెవరు మళ్లీ కష్టం వచ్చేదాకా ఆయనతో మనకు పెద్ద పని లేదు కదా. కాబట్టి ఇక్కడ స్వామి చెప్పింది ఒకటే మీరు ఏం చేయండి పరమేశ్వర ప్రీతి కోసం చేయండి. ఏం చేస్తున్నా పరమేశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోండి. సాటి మానవుడికి చేసిన మానవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గ్రహించి నేను అనుభవిస్తున్నాను అని అనుకోండి స్పర్ధ లేదు అన్నారు. మనసుతో మనం జీవించినంత కాలం స్పర్ధ తప్పదు. మనసున్నదనుకోండి అరిషడ్వర్గాల పుట్ట అది. అది లేదనుకోండి హృదయ స్థానంలోకి వెళ్తాం సర్వ ప్రపంచము కూడా సాయిమయంగా సాయిరామ మయంగా సత్యమయంగా ధర్మ విభూతిగా అర్థ ప్రధానంగా శాంతిమయంగా ప్రేమ స్వరూపంగా గోచరించి స్వామి ఇటువంటి జగత్తులోనే మన-మనతోనే ఉండి సర్వానందమయులై ఎలా ఉండగలిగారు? ఇదే ప్రపంచంలో మనం కాసేపు దుఃఖాన్ని కాసేపు ఆనందాన్ని కాసేపు అనుభవాన్ని కాసేపు అనుభూతి లేకుండా ఎందుకని ఉండగలిగామని విచారణ చేసుకున్నట్లయితే మానవుడు తాను తెచ్చుకున్నటువంటి అనేకానేక కర్మ ఫలాలు ఇక్కడ అనుభవించాలి కనుక ఇటువంటి జన్మ తీసుకుని వస్తాడు. అయితే జన్మలు అనేక రకాలు మనము జన్మ ఎత్తాం ఎలా ఎత్తాము ఏం తెచ్చుకున్నాం అంటే ఏమో మంచి పుణ్యం చేశాం. ఏదో యాగం యజ్ఞం కూడా చేశాం ఏదో తపస్స్వాధ్యాయం చేశాం. ధ్యానులుగా ఉన్నాం అన్నీ చేశాం అన్నీ పూర్తయిపోయినయి. పూర్తి అయిపోయినప్పుడు ఏదో ఫలితం కావాలి కదా bahunam janmanam ante jnanavan mam prapadyate అన్ని జన్మల చిట్టచివరకు వచ్చి జ్ఞానం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? దైవం అంటే ఏమిటి? సృష్టి అంటే ఏమిటి? అని ఒక తత్వార్థ విచారణలోకి మన మనసుని ప్రవేశపెట్టినటువంటి వేళ దీనికి సమాధానం ఎవరు ఇవ్వగలరు అంటే ఎవరు సత్యమో వారి-వారి నోట వచ్చినటువంటి మాట మనకు ఆధారమై అది ఆధేయం కాకుండా దానికి ఆధారం అక్కర్లేదు. సర్వమునకు ఆధారమైనటువంటి పరమాత్మే వాగ్ రూపంగా వెలిబుచ్చినటువంటి అనేకానేకమైన తార్కికమైన విషయాలని సత్య స్వరూపంగా మనం నిరూపణ చేసుకోవాలి. సత్యసాయి భగవానుని భక్తులమైనటువంటి మనందరికీ బాల వికాస్ నుంచిఎనభై ఏడు, ఎనభై ఆరు ఏళ్ల వయసు వచ్చిన వారి వరకు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస మాటలు వినని వాడు లేడు. వినని వాడు కాదు అనని వాడు లేడు. వింటున్నాం అంటున్నాం ఇంతకీ సత్యం ఏమిటి? అని అది విచారణ. మనం ఒక దేహాన్ని తీసుకుని ఇక్కడ ఉన్నాం. అసలు ఎలా వచ్చాం? శుక్ల శోణితాల ఫలితంగా వచ్చామా? శుక్ల శోణితాలకు మూలం ఏమిటి? అండము పిండమై, పిండము బ్రహ్మాండం లోకి ఎట్లా వచ్చింది? విచారణ అంతా చేయటానికి ముందు అసలు ప్రపంచం అంటే ఏమిటో వాటి అర్థం గనక తెలుసుకున్న ట్లయితే మనకు కొంత సత్యం వైపు అడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. సత్ అనబడేటువంటి దానికి ధాతు శబ్దం ప్రకారం ఎప్పుడూ ఉండేది అని ఒక అర్థం. మారకుండా ఉండేది అని రెండో అర్థం. మార్పు ఎరగనిది అని మూడో అర్థం. పరిణామం లేనిది అని అర్థం. మరణం లేనిది అని అర్థం. కాబట్టి మరణం లేదు గనుక జననం లేదు. పరిణామం లేదు గనుక అపరిణామం లేదు. అది జడము అది చైతన్యము అన్నీ కలబోసుకున్నటువంటిది గనుక సత్ అనబడేటువంటిది ఒక్కసారి వ్యాసుల వారి బ్రహ్మ సూత్రాలకి శంకర భగవత్పాదుల యొక్క బ్రహ్మసూత్ర భాష్యానికి సత్యసాయి భగవానుడు ఉపదేశించినటువంటి ఉపదేశానికి ఒక సమన్వయమైనటువంటి సమగ్ర విచారణ చేసినట్లయితే సత్ అనేటువంటిది సృష్టికి ముందే ఉన్నది. సృష్టించాలి అంటే ఎవరో ఉండాలిగా. బ్రహ్మ అంటున్నాం బ్రహ్మ తర్వాత వచ్చాడు. దీన్ని నిలబెడుతున్న వాడు విష్ణువు అంటున్నాం అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. దీన్ని సంహారం చేయటానికి రుద్రుడు అంటున్నాం అటువంటి వాళ్ళు చాలామంది రుద్రులు ఉన్నారు. కొన్ని కోటానుకోట్ల విష్ణువులు, కోటానుకోట్ల రుద్రులు ఉన్నారు. కానీ కొంతమందే మహేశ్వరులున్నారు. కొంతమందే ఈశ్వరులున్నారు. కానీ సదాశివుడు ఒక్కడే ఉన్నాడు. అందుకనే సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. లయించటానికి ఒక్కటే ఉన్నదయ్యా దాని పేరు సదాశివుడు అని భగవత్పాదుల భాష్యం. లయించటానికి మనక్కూడా సముద్రాలు చాలా ఉన్నాయి. అన్ని సముద్రాలకి కావలసిన నదులు అన్నీ ఉన్నాయి. కానీ జీవుడికి మాత్రం ఒక్కటే ఒక్క సముద్రం ఉన్నది. సముద్రమే పరమాత్మ. ఆనంద బిందువు ఆకాశం నుంచి ఒక చుక్కగా నేల మీద పడి నేలను ఇంకి, నేలను పొంగి, నేలను ఉప్పొంగించి ఎక్కడో మూల మెరుగని ఒక నదీ ప్రవాహమై తన ప్రయాణాన్ని ప్రారంభించి నెమ్మది నెమ్మది నెమ్మదిగా సాగర సంగమం చేస్తున్నట్లుగా జీవుడు కూడా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తి చిట్టచివరికి ఏం కోరుకుంటున్నాడయ్యా పరమాత్మ అనేటువంటి సింధువులో బిందువు చేరితే చాలు అనుకుంటున్నాడు. సింధువు బిందువు కలిస్తే అది జీవాత్మ పరమాత్మల యొక్క సంయోగం గా మనం భావన చేయాలి. అయితే సృష్టికి ముందే ఏదో ఉండాలనుకున్నాం గనుక అది ఉన్నది గనుక సత్ అనబడేటువంటి ఒక పదార్థం ఉండిపోయింది. పదార్థానికి ఒకటిగా ఉండటం కొంత కాలం అయిన తర్వాత ఇష్టం లేదు అంటుంది బ్రహ్మ వైవర్త పురాణం. మనం కూడా అంతే గదిలో కూర్చొని ఒక్కళ్ళంగే ఎంత సేపు ఉంటాం. ఎవరన్నా వస్తే బాగుండను, ఎవరి దగ్గరికన్నా వెళితే బాగుండనును మనం అనుకుంటాం కదా. అలాగే సత్తు కూడా ఏమనుకున్నది అంటే ఎంత కాలం నేను అపరిణామంగా ఉండను అసలు నాలో ఉన్నటువంటి అనేకానేకమైన శక్తులన్నింటినీ కూడా ఒక ప్రదర్శనమయంగా, నిదర్శనమయంగా దేనినైనా సృష్టిస్తే అని అనుకున్నది. సృష్టిస్తే అనుకున్నదే దాని పేరే సంకల్పం. సత్తు యొక్క సంకల్పంలో నుంచి సృష్టి ఏర్పడింది. సృష్టి అనగానే ఇవాళ మనం చూస్తున్న అన్ని ఏర్పడి ఉన్నాయి. కానీ సృష్టి అనంతంగా ఉన్నది. అనంతమైనటువంటి సృష్టి అంతా కూడా ఎక్కడెక్కడో విసిరేసిన ట్లుగా నదులు, కొండలు, కోనలు, వాగులు, గుట్టలు, మిట్టలు, పిట్టలు, పశుపక్ష్యాదులు, మానవ జాతి రకరకాలుగా సృష్టింపబడుతూ ఉన్నది. అప్పుడు పరమేశ్వరుడు అనుకున్నాడు. దీనినంతా కూడా విభాగీకరించిన ట్లయితే సృష్టికి మూలము నేనే గనుక అన్నింటియందు నేనే ఉన్నాను గనుక నన్ను మించి నేను కాని మరొక వస్తువు లేదని నిర్ణయించుకొని సృష్టిలో నుంచి మరొక దానిని ప్రవేశపెట్టాడు. ప్రవేశింపబడింది ఏదైతే ఉన్నదో సత్తులో నుంచి వచ్చినది సృష్టి అయినట్లయితే సృష్టిలో నుంచి ఏది బయటకు వచ్చిందో దాని పేరు విశ్వము అని పేరు పెట్టారు. విశ్వము అంటే దాని అర్థం అది. అంటే నెమ్మది నెమ్మదిగా ఏది గ్రాస్ గా కనిపిస్తున్నదో అది సటిల్ గా కనిపిస్తున్నది. ఏది బిందు స్వరూపంగా సటిల్ గా ఉన్నదో అది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అంతే కదా. విత్తులో నుంచి మర్రిచెట్టు వచ్చింది మర్రిచెట్టు లో నుంచి మళ్ళీ విత్తనాలు వచ్చినట్లుగా సత్తులో నుంచి సృష్టి, సృష్టిలో నుంచి విశ్వం వస్తే అమ్మో విశ్వం చాలా పెద్దది అన్నాం. ప్రపంచ పటాన్ని తీసుకున్నప్పుడు ఇండియా ఎక్కడ ఉన్నదని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉన్నదని చూసినప్పుడు అందులో మనం ఉన్న ఊరు ఎక్కడో వెతికినప్పుడు అందు మన ఇల్లు వెతికినప్పుడు మన ఇంట్లో మనల్ని వెతుక్కున్నప్పుడు ప్రపంచ పటంలో వి ఆర్ జస్ట్ డాట్. కానీ డాట్ ఏమిటో తెలుసునా? మూలం సత్తే. సత్తు లేకపోతే మనం లేము. కనుక నెమ్మదిగా విశ్వమంతా కూడా పరచుకొని తెరచుకొని ఉన్నటువంటి వేళ అచలంగా ఉన్నది. కదలకుండా ఉన్నది. జడంగా ఉన్నది.మౌనంగా ఉన్నది ఘనీభవించి ఉన్నది కదలిక మెదలిక లేనటువంటి స్థితిలో ఉంటే అప్పుడు పరమాత్మ ఆలోచన చేశాడు కదలని గుడ్డు ప్రయోజనం ఏముంది గుడ్డు పగలాలి దానిలో నుంచి పిట్ట బయటకు రావాలి కదా అండర్న్ తల్లి గర్భాలయంలోనే ఉన్నట్లయితే బిడ్డ బయటకు రాడే కనుక దీనికోసం ఏం చేయాలి అని సత్ మళ్ళీ సంకల్పించింది పంచభూతాలు తీసుకున్నాడు నేల నీరు నిప్పు గాలి శూన్యమైన ఆకాశం ఐదింటినీ కలిపి తన చైతన్యాన్ని దాంట్లో జోడించి ప్రపంచాన్ని సృష్టించాడు పంచకము అంటే ఐదు పంచము అన్నా ఇదే ప్ర పంచము ఐదు కూడి ఉండాలి ఐదు ఒకచోట ఉంటేనే జీవుడు ఉంటాడు ఐదు బకెట్లు తీసుకుని ఒక దాంట్లో పిడికెడు గాలి పిడికెడు నేల మట్టి పిడికెడు అగ్ని పిడికెడు నీళ్లు తర్వాత ఖాళీ గనక ఉంచి బిడ్డా బయటకు రా అంటే ఎట్లా రాదో ఐదు కూడా సత్ అనేటువంటి పరమాత్మ యొక్క అంశాన్ని తీసుకుని కలుపుకుని ప్రజ్ఞతో తన ప్రజ్ఞను అనుసంధానం చేసుకుంటే ప్రపంచకం ఏర్పడింది గనుక ప్రపంచము అన్నా సంసారం అన్నా ఒకటే అయితే ప్రపంచంలో కూడా జాతులు కులాలు వర్గాలు వర్ణాలు మతాలు భావాలు మూగజీవులు యోగ జీవులు ఎన్నెన్నో ఉన్నాయి మరి ఇవన్నీ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వ్యష్టిగా వ్యక్తిగా ఒక మానవుణ్ణి ఉదాత్త మానవుణ్ణి పరమేశ్వరుడు సంకల్పించాడు అంటే సత్ సంకల్పిస్తే సృష్టి రాగా సృష్టిలో నుంచి విశ్వం రాగా విశ్వంలో నుంచి ప్రపంచం రాగా ప్రపంచంలో నుంచి సంసారం రాగా సంసారంలో నిమ్ ఇన్ దాంట్లో నుంచి మనం వచ్చాం అంటే మన మూలం ఏమిటి అంటే సత్ అనబడేటువంటి పదార్థమే అది పదార్థం మాత్రమే కాదు అది యదార్థం పదార్థం నుంచి పరమార్థంలోకి పరమార్థంలో నుంచి యదార్థమైనటువంటి స్థితిలోకి వెళ్ళమంటుంది ఇది మూలమైనటువంటి వైదికమైన అంటే వేద పరమైన ఉపనిషన్మూలమైనటువంటి ఒక దివ్య భావన భావన ఎవరు చెప్పారు ప్రపంచానికి అంటే మహాత్ములు ఎవరు మనుషులై మనీషులై ఋషులై ఒక్కొక్క మంత్రం వెనుక లోపల ఉన్న బీజాక్షరంలో దాని వెనుక ఉన్న అధిష్ఠాన దేవతలను వారి వారి శక్తులను దర్శనం చేసి ఇది ఇంతే అని నిర్ధారణ చేసినటువంటి మహాఋషులు అందరూ కూడా ప్రపంచానికి ఉద్బోధ చేస్తూ ఇది అని మనకు విషయాన్ని చెప్పారు ఇది వ్యాసులవారు వచ్చేదాకా జరిగిన పరిణామం.
SSSMC · audio

Mahopadesam - 01

Home

Mahopadesam - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 33:08

More in this series

Mahopadesam

9 episodes · 5 hr 14 min

  1. 33 min 1

    Mahopadesam - 01

    Now playing
  2. 31 min 2

    Mahopadesam - 02

  3. 40 min 3

    Mahopadesam - 03

  4. 30 min 4

    Mahopadesam - 04

  5. 33 min 5

    Mahopadesam - 05

  6. 40 min 6

    Mahopadesam - 06

  7. 30 min 7

    Mahopadesam - 07

  8. 34 min 8

    Mahopadesam - 08

  9. 40 min 9

    Mahopadesam - 09