Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరామ్! భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. September మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో జాతి మత వర్గ వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా భూమికలు. సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఎన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ ఎన్నెన్ని అననుకూలాలు ఉన్నప్పటికీ సమాజ రీతులు వికృత పోకడలు పోతున్నప్పటికీ శాంతికి గనక దూరమైనట్లయితే మానవుడి మనుగడకు అర్థం లేదు. అసలు మనం అంతా కూడా శాంతి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఎదురు చూస్తే అది రాదని స్వాధ్యాయం వలన సాధన వలన మాత్రమే మనకి అది లభిస్తుంది అని. మనం అనుకుంటాం నా పరంగా నా వరకైతే యాభై ఏళ్ళు. 1962 June 9 మొట్ట మొదట స్వామిని దర్శనం చేశా. చేస్తే ఇదిగో ఇందాక అనుకున్నట్లుగా యాభై ఏళ్ళలో స్వామి చాలా సన్నిహితంగా చాలా దూరంగా కేవలం నలభై యాభై మంది మధ్య కేవలం లక్షల మంది మధ్య అదే స్వామిని చూశాం. చూస్తే స్వామి నిత్యశాంతుడయ్యే గోచరించారు. ఒక్కనాడు కూడా కనుబొమలు రెండు ముడిపడిన వైనం మనం చూడలే. పరమ ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంచారు. ఎలా ఉంచగలిగారు అంటే ఎప్పుడైతే మనకు ఏది అక్కరలేదో ఇది కావాలి అన్న ఆలోచన మన మనసులో పాతుకుపోదో ఉన్నదానితో హాయిగా తృప్తిగా ఉండగలుగుతామో ఉన్నదన్నా పరమేశ్వరుడు మనకు మిగిల్చాడు కదా అన్నటువంటి ఆనందంతో ఉండగలుగుతామో అప్పుడు శాంతిగా ఉండగలుగుతాం. మానవుడి యొక్క మానవుడి దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా గత జన్మల యొక్క సంస్కారాల చేత నడపబడతాయి. అందుకనే కాళిదాసు జన్మ జన్మాంతరేషు అంటాడు. జన్మ జన్మాంతరేషు అంటే జననాంతర సౌహృద అని అంటాడు. అనేక జన్మలలో నుంచి ఈవేళ వీడు ఇలా ఎందుకు ఉన్నాడయ్యా అంటే క్రితం జన్మలో సాధనంతవరకు చేసుకున్నాడు గనుక అక్కడి నుంచి కొనసాగింపు చేసుకొని ఎక్కడో ముగించుకోవాలి కదా అందుకని ఇట్లా ఉన్నాడు. మరి ఆయన అలా ఉన్నాడు గాని వాళ్ళ అబ్బాయి ఇలా ఉన్నాడే. ఆయనకేమో దేవుడంటేనే ఇష్టం వీడికి దేవుడు లేడని మొట్ట మొదటి శబ్దమే అది అని అంటే వీడు పాయలో నడుస్తూ వచ్చాడు అనేక కారణాల వలన వీడు వాడికి కొడుకుై పుట్టాడు తప్ప వీడి కథ వేరు వాడి కథ వేరు. వీడు తెచ్చుకున్న మూట వేరు వాడు తెచ్చుకున్న మూట వేరు. తండ్రి పరమ శాంతంగా ఉండగలిగాడు కొడుకు అశాంతికి మూలమై ఇక్కడ పారాడుతున్నాడు చూశారా? కాబట్టి శాంతి సాధన చేత చేయాలి. దానికి pathway ఏమిటి? మార్గంలో వెళ్ళాలి? సత్యసాయి భగవానుడి మహోపదేశం శాంతి అనబడేటువంటి రెండక్షరాల పారమార్థిక చింతనకు ఒక భూమిక ఒక వేదిక ఒక ఛత్రము అయినటువంటి స్థితిలో అంటే భౌతిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక స్థితుల్లో శాంతిని ఎలా పొందాలి అంటే భౌతిక భూమిలో మన బోటి వాళ్ళం ఉన్నాం అనుకుందాం మనందరం అక్కడి చెందిన వాళ్ళం. మనకన్నీ ఉన్నాయి ప్రపంచంలో ఉన్నవన్నీ మన ఇంట్లో ఉన్నాయి కానీ శాంతి లేదు. ఎందుకని లేదు? ఎందుకని లేదంటే అవన్నీ by comparison and contrast తెచ్చుకున్నాం. మనలో ఉన్నటువంటి ego ని satisfy చేసుకోవటం కోసం తెచ్చుకున్నాం. అది సంతృప్తి పడింది అని అనుకునే లోగా మనకంటే పక్కవాడో ముందు వాడో ఇంకో బలమైన విచిత్రమైన వస్తువును తెచ్చి మనకు చూపిస్తున్నాడు వాడు. దానిని పొందే దాకా ఇప్పటిదాకా పొందిన ఆనందం మన నుంచి దూరమైపోయింది. అంటే సాధనలో మొట్టమొదట కావలసినటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ ముగ్గురు మహాత్ములు నా కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తున్నారు. సత్యసాయి భగవానుడితో ప్రత్యక్షం కాబట్టి ఆయన ప్రశాంతి నిలయం 1950 లో కట్టబడింది. 1950 నుంచి నిన్న మొన్నటి వరకు 2011 వరకు స్వామి ఎవరినీ క్షణంలోనూ ఇది నాకు కావాలి అని కోరలేదు. కనుక హాయిగా శాంతిగా ఉన్నారు. మనం యాభై ఏళ్లలో కోరకుండా లేము కనుక శాంతంగా లేము. కాబట్టి శాంతి ఎక్కడ లేదు అంటే కోరటంలో శాంతి లేదు. ఎక్కడ ఉన్నది అంటే కోరకుండా ఉండటంలో శాంతి ఉన్నది. కోరకుండా ఉండగలిగినటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. రెండవది అపరిగ్రహము అని మాట ఉన్నది. ఒకరి నుంచి మనం మనం గనక మరొక వస్తువును తీసుకున్నట్లయితే కావాలని కానీ అడిగి కానీ దొంగిలించి గాని తీసుకున్నట్లయితే అది శాంతిని ఇవ్వదు. మన ఇంట్లోనే ఉంది వస్తువు కానీ దాన్ని చూసినప్పుడల్లా మన చర్యలన్నీ గుర్తొచ్చి మనకు ఆనందాన్ని ఇవ్వవు. అయితే దీన్ని కాస్త పొడిగించి స్వామి మూడే అనుకుంటున్నారేమో నాలుగోది చెప్తాను వినండి "Every gift is a rift" బంగారు అన్నారు చూశారా?Gift ఎవడో ఇస్తాడు ఒక pen ఒక watch ఏదో తెచ్చి ఇస్తాడు అంటే gift starts watch ఇచ్చాడు బానే ఉంది గానీ ఇస్తే Rolex లాంటిది ఇవ్వాలి ఇదే ఇచ్చేది మూడు వేలది నాలుగు వేలది చూసారా relative గా mind ఆలోచన మొదలు పెట్టింది వస్తువును పొందిన శాంతి లేదు అది రాలేదన్నటువంటి అశాంతి అక్కడే పుడుతున్నది గనుక "a gift is always a rift" అన్నారు మరి ఏమివ్వాలి అంటే నిన్ను నీవు ఇచ్చుకోగలగాలి అది అప్పుడు శాంతి మీకేం కావాలంటే మీకు కష్టం వస్తే మీకు ఆనందం కావాలంటే మీకు ఎటువంటి అవసరం ఉంటే నన్ను పిలవండి నేనున్నాను అనేటువంటి మాట గనక మరొక వ్యక్తితో అంటే అన్న మనకి పొందిన వాడికి ఏకకాలంలో శాంతి ఆనందము రెండు లభిస్తాయి ఇది అనాలి అంటే ధర్మాచరణ చేసి ఉండాలి సత్యాన్ని ఆశ్రయించి ఉండాలి సత్య ధర్మములు లేని శాంతి శాంతి కానే కాదు కేవల తాత్కాలికమైనటువంటి ఒక ఒక్కొక్కసారి నిస్సహాయ స్థితిలో కూడా ఏదోలే ఇంక మన వల్ల ఏమవుతుంది అని ఆగిపోతామే అది శాంతి కాదు ఇంద్రియాలు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఒక పోరాటం సలుపుతున్నప్పుడు ఇంద్రియాలని ఎదుర్కోలేని ఒకానొక పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఎవరు సంయమనం పాటిస్తారో ఎవరు ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తారో ఎవరు దమము శమము రెండు దగ్గర పెట్టుకుంటారో వాడు పరమ శాంతుడై ఉంటాడు పరమ తృప్తుడై ఉంటాడు ఆనందమయుడై ఉంటాడు సర్వానందమయుడై ఉంటాడు వాడు పూర్ణుడై జ్ఞాని అయి ప్రపంచంలో వెలుగుతాడు అంటే జ్ఞాని ఇవ్వటానికి ఉన్నాడే తప్ప పుచ్చుకోవటానికి వచ్చిన వాడు జ్ఞాని కాదు కనుక శాంతి అనబడేటువంటి మరొక స్థాయిని సాధనలో పరి ప్రశ్న విచారణ చేయాలి సత్యసాయి భగవానుడు దైవమా కాదా అది కాదు ప్రశ్న ఆయన దైవమే కానీ ఇన్ని దైవ లక్షణాలు ఒక మానవ దేహంలో ఎలా ఉన్నాయి అది పరి ప్రశ్న సత్యసాయి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసను బోధించారు స్వామి ఆచరించారా అని గనక ప్రశ్న వేస్తే అది పరి ప్రశ్న ఆచరించారు సత్య ధర్మాలు ఎలా ఆచరించారో నిన్న చాలా నిన్న మొన్న చాలా తీవ్రంగా విచారణ చేశాం శాంతిని కూడా స్వామి ఎలా ప్రసన్నంగా ఉండగలిగారు అంటే మన ఇంటికి ఒక అతిథి ఇద్దరు అతిథులు పోనీ ఒక నలభై మంది మన ఇంట్లోనే function మనమే పిలిచాం వాళ్ళని invitation వేసి మీరు రాకపోతే బాగుండదు మీరు వస్తేనే మాకు ఆనందం మీరు లేకపోతే ఎట్లా ఎంతమంది వచ్చినా మీరు ఒక్కరు రాకపోతే లోటు అంటే పాపం వాడు పరిగెత్తుకొని వచ్చాడు వాడు వచ్చాడు మనము పిలిచాం అంతవరకు బాగుంది వాడు వచ్చిన తర్వాత మన యాతన ప్రారంభమైంది ఏమిటంటే తొందరగా function అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు కదా అని మరి స్వామి ఒకడికి invitation వేసింది లేదు నువ్వు రా అన్నది లేదు నువ్వు పో అన్నది లేదు ఏడు లక్షల మంది ఉన్ననాడు ఎలా ఉన్నారో ఏడుగురు భక్తులతో పాత మందిరంలో ఉన్ననాడు కూడా అలాగే ఉన్నారు ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం అక్కడ ఆయన ఎక్కడ కంగారు పడినట్లుగానీ అటు ఇటు ఏదో ఆలోచించినట్లు గానీ ఉండదు రాణి పుట్టలు పుట్టలై ప్రవాహ వేగంతో వచ్చిన తాను నిశ్చలుడై నిర్మలుడై విశ్రాంతుడై ప్రసన్నుడై పారమార్థికమైన భూమికలో సంచారం చేయటం మనం కంటితో చూశాం దీనికి పుస్తకాలు అక్కర్లే వంద పుస్తకాలు కొని చదవక్కర్లేదు నీవు చూసినటువంటిది మాత్రమే seeing is believing నువ్వు చూశావు గనుక ఇంకా వారు రాలేదు వీరు రాలేదని తాపత్రయము లేదు అయ్యో ఇంతమంది వచ్చారే అన్న ఆలోచన లేదు వచ్చిన వారితో స్వామి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకే స్థితిలో రకమైన energy level లో తేడా లేకుండా ఉండటం అది దైవీ లక్షణం కాబట్టి దైవ్యాన్ని గనక మనం సత్య ధర్మాశ్రితమైనటువంటి తృప్తితో ఆనందంతో అన్నివేళలా శాంతంగా గనక ఉండగలిగినట్లయితే ఇంద్రియాలు మనల్ని ఏం చేయలేవు వేదాంతిని అడగండి ఇంద్రియాలను జయించవోయ్ అంటాడు పెద్ద కష్టం ఏం కాదు ఇంద్రియాలను జయించటం ఏముంది నాలుగు రోజులు జాగ్రత్త పడితే అవి ఉండిపోతాయి జయించబడిన ఇంద్రియాలతో ఎలా జీవించగలం అనేదే మన ముందున్న ప్రశ్న తాత్కాలికమైనటువంటి విజయం విజయం కాదు శాశ్వత విజయం కావాలి ఇంద్రియాలు మనం చెప్పినట్లు వినగలగాలి అందుకనే భగవాన్ రమణులు ఒక చోట అంటారు జ్ఞాని యొక్క స్థితి ఏమిటంటే మీరు అనుకునేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గనక ఉండి ఉంటే ముగ్గురూ ప్రతిరోజూ జ్ఞాని దగ్గరకు వచ్చి నుంచొని వినమ్రంగా ఏం చేయమంటారు అన్నట్టుగా నుంచుంటారు అడగరు వాళ్ళు వాళ్ళు అడగరు జ్ఞాని చెప్పడు కానీ మౌన భూమిక లో ఇద్దరూ నిలకడ చెందుతారు ఇది ఒకటి రెండవది యముడు కూడా చేతులు కట్టుకొని జ్ఞాని దగ్గర నుంచున్నప్పుడు జ్ఞానికి ఒక క్షణంలో గనక శరీరం ఇంకా ప్రపంచానికి అవసరం లేదు అని అడిగినప్పుడు కలిగినప్పుడు యముడ్ని పిలిచి నా వెనక రా అంటాడట అది జ్ఞాని యొక్క లక్షణం శంకర భగవత్పాదులే గొప్ప ఉదాహరణ కాబట్టి ఇక్కడ మానవుడు రెండు భయాల నుంచి రెండు బాధల నుంచి దూరం కావాలి ఒకటి జరిగిన దాని వలన మిగిలిన బాధ జరగదేమో అన్నటువంటి ఒక భయం రెండింటి మధ్య ఆనందానికి దూరమైతే శాంతి దొరకదు ఒకటి జన్మలో కలిగినటువంటి అనేకానేకమైనటువంటి అనుభవాలని స్మృతులుగా మార్చుకొని పదే పదే జరిగినటువంటి చెడుని తలుచుకుంటూ ఉంటే శాంతి దొరకదు అలాగే ఇంద్రియాలు అన్నీ కూడా ప్రపంచంలో ప్రకృతితో కూడి ఉన్నాయి కనుక అవి తమ వ్యాపారాన్ని కొనసాగించే ఒక ప్రయత్నం చేస్తాయి వస్తువును చూడగానే ఇది నా సొంతం అయితే బాగుండును అనిపిస్తుంది ఏం చేయాలి అప్పుడు వస్తువుకి మనస్సుని విముఖం చేయాలి దానికి రమణ మహర్షి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు a state of indifference ఎవరి దగ్గర ఉంటుందో వస్తువు తన దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నారుఆ state of indifference మనకి రావాలి. ఉపేక్షాభావం అంటామే, ఉపేక్ష రావాలి, అపేక్ష రాకూడదు. అపేక్ష ఉన్నదా వస్తువు మనది అయిపోతుంది, పెద్ద కష్టం కాదు. కానీ, కాకూడదు. నీకంటూ ఒక వస్తువు నీ దగ్గర ఉన్నది. పరమేశ్వరుడు నీ యందు ఉన్నాడు గనుక వస్తువు పేరు సద్ వస్తువు. సద్ వస్తువు అంటే ఆత్మ. అన్నీ దొంగిలింపబడు గాక, అన్నీ నశించిపోవు గాక, అన్నీ మార్పు చెందు గాక, అన్నీ అశాంతికి గురి చేయు గాక. కానీ, నీవు ఆత్మ నిష్ఠ లో గనుక ఉన్నట్లయితే, నీ దగ్గర ఏది రాని, ఏది పోని, ఏది జరగని, జరక్కపోని నీవు శాంతుడివై ఉంటావు, నీవు దాంతుడివై ఉంటావు, ఉదాత్తుడివై ఉంటావు. కనుక, శాంతి ఒక ఆంతరంగికమైనటువంటి భావన. తర్వాత, సాధనలో పరి ప్రశ్న తర్వాత సేవయా అంటే భావన అని. పరమేశ్వరుని భావయామి అంటుంది. భావయామి, నిన్ను భావిస్తున్నా, భావిస్తే చాలు. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తత్ తదఖిలం శంభో తవా రాధనం అన్నారు శంకర భగవత్పాదులు. అంటే, పూజలు, దానాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, మౌనాలు, ధ్యానాలు అన్నీ నీకు ఉత్తమ జన్మనిస్తాయి కానీ, శాంతిని ఎక్కడిస్తాయి? ఇంతకంటే ఉత్తమ జన్మ ఏది అని మనం గనుక విచారణ చేసినట్లయితే, మనకు అనిపిస్తుంది ఒక్కసారన్నా రాజుగా పుడితే బాగుండును అని. కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని అంటాడు, రాజపుత్రా చిరంజీవ మా ముని పుత్రా. రాజకుమారుడా! నీవు కలకాలం జీవించాలి. ముని పుత్రా! మాజీవః, నీవు జీవించొద్దు. శ్లోకం ఆపేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే, రాజకుమారుడేమో కలకాలం ఉండాలట, ముని కుమారుడేమో ఉండకూడదట. ఇదేవి ఆశీర్వచనం అనిపిస్తుంది. ఎందుకని ఉంటాడట అంటే, రాజు తాను చేసిన పాపాల అన్నింటికీ ఒక వారసుణ్ణి కన్నాడు గనుక, తాను అనుభవించగా మిగిలినదంతా అనుభవించడానికి తన కుమార రూపంలో ఉండు గాక. ముని కుమారుడికి అసలు మరణమే ఉండు గాక, వాడు ఉండక్కర్లేదు అన్నాడు ఆయన. ముని ఎవరికీ అపకారం చేయలేదు గనుక, సత్కర్మలు చేశాడు గనుక, అనేకమైనటువంటి మూటలు కొడుక్కి ఇచ్చాడు గనుక, కొడుకు ఇంకా దాన్ని అనుభవించడానికంటూ ఏం లేదు గనుక, ఇక్కడ ఉండక్కర్లేదు అన్నాడు. జీవవా మరవా వ్యాధో మాజీవ మామర. ఒక వేటగాడు మాత్రం మరణించని వద్దు, జీవించని వద్దు అన్నారాయన. ఒక పిట్ట తన పొట్ట నింపుకోవటానికి రెండు, మూడు గింజలతో సంతృప్తి పడి, తాను పొదిగినటువంటి, తాను పెట్టినటువంటి గుడ్లని తన రెక్కల కిందే పొదిగి, మళ్ళీ వాటికి రెక్కలు వచ్చి ఆకాశంలోకి ఎగిరే దాకా సంరక్షిస్తున్న ఒక పరమ పవిత్ర కార్యక్రమంలో ఉన్నటువంటి పక్షిని వేటగాడు గురిచూసి బాణం వేసి చంపినప్పుడు, తాను పోతున్నానన్న బాధ కంటే బిడ్డలు ఏమైపోతాయో అన్న యాతనతో మరణిస్తున్నదే, మరణయాతన అనుభవించటానికి జీవిస్తూనే యాతన అనుభవించు, యాతన అనుభవిస్తూ జీవించవయ్యా వేటగాడా అంటాడు. అంటే రాజు, ముని, వేటగాడు. ముగ్గురు ఎక్కడున్నారు? మన యందున్నారు. మనం ఎలా ఉండాలి? ముని వలె ఉండాలి, మౌనంగా ఉండాలి. వాక్కు అగ్ని స్వరూపం గనుక అది శాంతిని, ప్రశాంతిని ఇచ్చేటువంటి సరళమైన, సూటి అయిన, గంభీరమైన, స్వచ్ఛమైన భాషని మనం వాడాలి. భాష పరమేశ్వరుడి యొక్క స్వరూపం. భాష లేకపోతే అభివ్యక్తి లేదు. ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు ఒక్కడికే communication అనబడేటువంటి ఒక skill ఇవ్వబడింది, ప్రజ్ఞ. అదే వాక్ రూపంలో ఇవ్వాలి. వాక్కు పరమేశ్వరుడి యొక్క స్వరూపంగా భావన చేసిన వాడు ఒక సంస్కారాన్ని, సంస్కృతిని, ఒక పటిష్టమైనటువంటి నేపథ్యాన్ని, శాస్త్రాధ్యయనాన్ని, అభ్యసనాన్ని, లోకం యొక్క పోకడని అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని తన వాక్కుతో ప్రపంచానికి బోధ చేయాలి, తద్వారా ఆనందాన్ని కలిగించాలి, శాంతి వైపు వాణ్ణి నడిపించాలి. అందుకనే, వేద ప్రామాణికమైన మాట శాంతిని గురించి ಏನಕೇನ ಕೃಪಾಯೇನ ಯಸ್ಯ ಕಸ್ಯಾಪಿ ದೇಹಿನಃ ಸಂತೋಷಂ ಜನಯೇತ್ ಪ್ರಾಜ್ಞಃ ತದೇವ ಈಶ್ವರ ಪೂಜನಮ್ ఏమిటయ్యా ఈశ్వరుడికి పూజ అంటే అట? ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రజ్ఞ ఉంది. ప్రతి వ్యక్తికి ప్రజ్ఞ లేని వాడు ప్రపంచంలో లేడు. ఒక్కొడికి ఒక్కో రకంగా ఉంది. ప్రజ్ఞ ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి జనులందరికీ ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించి ఒక పరమానందాన్ని గనుక కలిగించినట్లయితే, అది మాత్రమే శివపూజ. తదేవ తత్ ఏవ ఈశ్వర పూజనం, అది. మిగతా అభిషేకమా? విగ్రహం ఇంకో విగ్రహానికి పోసినట్టేనన్నారు. అలంకారమా? దండ తీసుకెళ్లి దండకి విగ్రహం ఉండే విగ్రహానికి వేసింది. మరి, మానసికమైనటువంటి భావనలో నిలకడ చెందినటువంటి శాంత చిత్తుడు ఎలా ఉన్నాడంటే, పరమ ప్రశాంతంగా, ప్రసన్నంగా. రామకృష్ణ గురుదేవులు, అనేకమైనటువంటి galaxy of gurus. వీళ్లంతా ఏం చేశారంటే, బోధించవలసిన టైంలోనే బోధించారు. మరి మిగతా సమయం అంతా ఏం చేశారు అని. స్వాత్మానందులై, ఆనంద చిత్తులై, తమతో తాము కూడి సత్తుతో, చిత్తు అంటే మనం అనుకున్నాం మొట్ట మొదటి రోజు విచారణ. కనిపిస్తున్న పాంచభౌతిక దేహము చిత్తు. కానీ, దీని దేహానికి మూలమైనది సత్తు. సత్తు, చిత్తు రెండూ ఏకం కాగలిగినట్లయితే, దాని వలన కలిగేటువంటి ఫలితం ఆనందం కాబట్టి అది సత్తు చిత్తు ఆనంద స్థితి.ఈ సచ్చిదానంద స్థితి అన్ని వేళలా అవస్థాత్రయాతీతంగా, గుణత్రయాతీతంగా, కాలత్రయాతీతంగా పరమశాంత చిత్తుడైనటువంటి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడ్ని తీసుకోండి. తండ్రి పెట్టిన యాతనకి ఆయన చలించలేదు, కన్నీరు పెట్టలేదు, కంటతడి పెట్టలేదు. "నా తండ్రి నాకిట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు" అనలేదు. "హరి చూసుకుంటాడు" అన్నాడు. అది ప్రణిపాతేన, సమర్పణ అంటే అది. పరిప్రశ్నేన, ప్రశ్నలేమో హిరణ్యకశిపుడు వేశాడు. "దేవుడున్నాడా? హరి ఉన్నాడంటున్నావ్, ఎక్కడున్నావో చూపించు" అంటున్నాడు. వాడిది ప్రశ్న. ఈయనది పరిప్రశ్న. "ఇడుగోనయ్యా ఇటువంటి నా తండ్రివంటి మూఢులు చాలామంది ఉన్నారు. ఇలాంటి ప్రశ్నే వేస్తున్నారు. ఒకసారి కనపడరాదా? అంటే ఎక్కడున్నావ్? సర్వాంతర్యామివి కదా?" అంటూ తనకు తాను సమాధానం చెప్పుకున్నది పరిప్రశ్నలలో నుంచి పుట్టినటువంటి ఒక జవాబు. సేవయా, నిరంతరమైన హరిభావనలో ఉండటమే ఉత్కృష్టమైన భాగవత లక్షణం కాబట్టి ప్రహ్లాదుడ్ని మనం ఇక్కడ తద్విద్ధ్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గనక అనుకోవాలంటే ఆయన కథ చదువుకోవాలి. కథలో నుంచి తన తండ్రిని నరకేశరి రూపంలో వచ్చి పొట్ట చీల్చి కలుష రక్తాన్నంతా తాగి తన తండ్రికి యోగాన్ని అనుభవి-- అనుగ్రహిస్తున్నటువంటి వేళ ప్రహ్లాదుడి మనస్సు తడబడిందా? కలవరపడిందా? "అయ్యో నా తండ్రి మరణించాడే" అని అనుకున్నాడా? "ఈ వచ్చినవాడు నన్ను విష్ణువుగా అనుకోలేదుగా, విష్ణువు నరకేశరుడినని నేను అనుకోలే. నాలుగు చేతులతో చక్కగా మహాలక్ష్మితో చాలా అందంగా, సౌందర్యంగా, పట్టు పీతాంబరాలు కట్టుకొని నిత్య సత్య శాశ్వతుడిగా వస్తాడనుకుంటే, నరకేశరి రూపంలో వచ్చాడే. ఈయన నన్ను చంపుతాడేమోనన్న భయం లేదు." భయము జీవ లక్షణం. ఇందాక మనం అనుకున్నాం, శాంతి ఎందుకు దొరకదంటే ఒంట్లో చిన్న నలత రాగానే మనం "ఇంకా ఇక్కడ ఉండమేమో ఎక్కువ కాలం" అంటాం. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా మనమేం ఎక్కువ కాలం ఇక్కడ ఉండం. కానీ ఉన్నంత కాలం ఎట్లా ఉన్నాం అన్నది ప్రశ్న. ఎలా ఉండాలంటే అదిగో ప్రహ్లాదుడి వలె శాంత చిత్తంతో ఉండాలి. పరమేశ్వరుడి యొక్క భావన, పరమేశ్వరుడి యొక్క తలపు, పరమేశ్వరుడి యొక్క చింతన, పరమేశ్వరుడి యొక్క దివ్యతత్వ విచారణ ఎవరి మనస్సునందు, ఎవరి ప్రత్చణువునందు అన్నివేళలా ప్రజ్వలిస్తూ ఉంటుందో, ప్రకాశమానమై ఉంటుందో వాడు శాంతుడై ఉంటాడు. ఏమిటండీ ఇన్ని కష్టాలు వచ్చినా మనిషి తొణకడేమి, బెణకడేమి, శాంతం పోగొట్టుకోకుండా ఎలా నిలబెట్టుకోగలుగుతున్నాడంటే ఇంద్రియ నిగ్రహము, పరమేశ్వర భావన, సమర్పణ, పరమేశ్వరుడికి చెందినటువంటి ఒక శరణాగతి. spiritual orderలో highest భావన అర్చన కాదు, ఆరాధన కాదు, ఊరేగింపు కాదు, వేడుక, జాతరలు ఇవి కాదు. అచ్యున్నంతమైనటువంటి స్థితి ఏమిటే అంటే surrender కావటమే, శరణాగతి చెందటమే. రమణ మహర్షిని అడిగారు, శరణాగతి చెందమంటున్నారు ఎవరికి చెందాలి అని. నాకెవరికి ఇష్టమైతే వాళ్ళకి చెందుతానంటాం కదా. అంటే ప్రతి మనిషికి ఒక ఇష్టదైవం, కాస్త అక్కరకు వచ్చే దైవం, అప్పుడప్పుడు పలకరించే దైవం రకరకాలు ఉంటాయని అనుకుంటారు. దైవం ఒక్కడే. వాడే అన్ని రకాలుగా operate అవుతూ ఉంటాడు. నిజానికి శరణాగతి ఎవరికి చెందాలంటే "surrender to the self" అన్నారు రమణ మహర్షి. అన్నింటికంటే చాలా కష్టం. నేను వెళ్ళి ఇంకో గురువుగారి కాళ్ళ మీద పడి "మీరేనా నన్ను ఆదుకోవాలి" అనటం చాలా తేలిక. అసలు మన లోపల ఉన్న ఆత్మకి మనం surrender కావాలంటే ఆత్మని ఎరగాలి. ఎరగాలి అంటే సాధన చేయాలి. సాధన చేయాలంటే సమదమాదులు ఉండాలి, నియంత్రించబడిన జీవితం ఉండాలి, పరితృప్తమైన జీవితం ఉండాలి, రకమైన కోరిక లేనటువంటి భావన ఉండాలి, ఎవరి నుంచి ఏదీ ఆశించని స్థితిలో ఉండాలి. ఎన్ని పోగొట్టుకుంటే ఒక్క దాన్ని రాబట్టుకోగలుగుతాం. ఎన్నో, చాలా పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే ఒక్కటి రాబట్టుకోగలం. రాబట్టుకోవలసినటువంటిది శాంతం గనక అయినట్లయితే, అది శాంతి అయినట్లయితే పరమ ఉత్కృష్టమైనటువంటి సాధనలో షడూర్మములతో, షడ్వికారములతో, షడ్వర్గములతో ఏర్పడిన దేహము అశాశ్వతమన్న భావనలో నుంచి నిత్య సత్య శాశ్వతుడైనటువంటి ఆత్మ మన యందు, అందరి యందు అదే ఉన్నదని ఎవరైతే ఒక ఏక చింతనతో ఉంటారో వారు శాంతులుగా మనం భావన చేయాలి. అనేకమైనటువంటి అలలు, కెరటాలు, తుంపరలు పుడుతున్నా అవి ఎట్లా పుట్టి సముద్రంలోనే సమసిపోతున్నాయో అలాగే అరవై వేల, డెబ్భై వేల ఆలోచనలు మానవ దేహంలో పుడుతున్నప్పుడు పుట్టని అనుకోవాలి. పుట్టిన ప్రతి ఆలోచనతో గనక మనం దగ్గరైనట్లయితే మనము ఆలోచించుకోవడానికి కానీ, ఆలోచనా రాహిత్య స్థితిలోకి వెళ్ళటానికి కానీ, భావ శూన్యతను పొందటానికి కానీ, పరమ ఆర్ద్రమైనటువంటి ఉదాత్త స్థితిలోకి వెళ్ళటానికి కానీ అవకాశాలు కోల్పోతాం కనుక ఇంట, బయట, లోపల, బయట ఎట్లా ఉండాలి? పరమ శాంతంగా ఉండాలి. కానీ స్వామి నూటికి తొంభై ఐదు మంది ఎలా ఉంటారు అనే దాన్ని ఒక చోట స్వామి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. "external calmness and internal commotion, they don't match బంగారు" అన్నారు. చూశారా? internal commotion ఉంది, బయటికి externalగా calmగా ఉన్నాడు. ఉన్నాడా అంటే ఉన్నట్టుగా ఉన్నాడు. ఉన్నట్టుగా కనబడుతున్నాడు. అదే public self. లోపల ఎలా ఉన్నాడు? అంతా commotionే, గందరగోళమే. ఇది అయిపోయిన తర్వాత వాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అట్లా కాకుండా ఇంట్లో, ఒంట్లో, బయట అందరితో అన్ని వేళలా అన్ని అవసరలో ఏకరీతి ఒక్క-ఒక్క విధంగా గనక ఉండగలిగినట్లయితే వాడు శాంతుడవుతాడు, వాడు భాగవతుడవుతాడు, వాడు సార్థక జీవుడవుతాడు. తద్వారా తన ద్వారా ప్రపంచానికి శాంతి కిరణాలను నిరంతరము ప్రసరిస్తూనే ఉంటాడు.ఆ నిరంతరమైనటువంటి ప్రసార భూమికలో గనుక మనం కాసేపు నిలకడ చెందగలిగినట్లయితే క్షమించిన, ఆగిన, నియంత్రించబడిన నిష్ఠులమైనటువంటి ఇంద్రియాలు అన్నింటినీ కూడా పరమేశ్వర భావనలో గనక కలుపుకోగలిగితే అది శాంతం వైపు దారి తీస్తుంది. అందుకనే నవరసాలు ఉన్నప్పటికీ శాంత రసం మహోత్కృష్టమైనది. భారతం అంటే ఏమిటి? అంతా యుద్ధమే, అంతా స్పర్ధే, అంతా పగే, అంతా అసూయే. ninety nine percent దానిలో negative energy నిక్షిప్తమై ఉన్నది భారతంలో. ధర్మశాస్త్రంగా మనకు బోధ చేసినప్పటికీ పాత్రలన్నీ కూడా ఒక ఆశ వెంట, ఒక ఎండమావి వెంట, ఒక అభద్రత వెంట, ఒక యాతన వెంట, ఒక అననుకూలత వెంట పరిగెత్తి, పరిగెత్తి అలసిపోయినవన్నీ సమసిపోయినాయి. పరమాత్మను ఆశ్రయించినవన్నీ కలకాలం నిలిచిపోయినాయి. ఇంతే తేడా. పరమాత్మను ఆశ్రయించినవి ఏమిటి? ఐదుగురు పాండవులు, కుంతీ, ద్రౌపది. అంతే. చిట్టచివరికి ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా సమసిపోవలసిన పరిస్థితి ఏర్పడితే ధర్మరాజు తన ఆవరణ ప్రభావం చేత యుద్ధానంతరం అన్నీ పోగొట్టుకున్న పెద్ద తండ్రి ఏకాకియై దుఃఖితుడై విలపిస్తున్నాడని ప్రతిరోజూ సుశ్రూష చేశాడు. మా తండ్రిని ఎప్పుడో చిన్నప్పుడే పోగొట్టుకున్నాం గనుక మా పెద్ద తండ్రే మా తండ్రి అన్నటువంటి భావనలో ఉంటే అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక సందేశం వచ్చింది. సందేశం ఏమిటంటే, "ఇంకా ఎన్నాళ్ళు పాండు కుమారుల చేత సేవ చేయించుకుంటావ్? సిగ్గులేదా? ఎప్పుడు స్వాధ్యాయంలోకి వెళ్తావ్? ఎప్పుడు తపస్సు చేసుకుంటావ్? ఎప్పుడు శాంతచిత్తుడివి అవుతావ్? నీవు ఇట్లాగే ఆలోచిస్తూ ఉంటే పోయిన వంద మంది వెనక్కి వస్తారా? గంగానది తీరానికి వెళ్ళు. దీక్షలో ఉండు. పరమేశ్వరుడితో నీ మనస్సును అనుసంధానం చెయ్. నీవు కూడా ముక్తుడివి కా." అన్నప్పుడు మాత్రమే ధృతరాష్ట్రుడు, గాంధారి గంగాతీరానికి వెళ్ళి తపస్సు చేశారు. అంతవరకు చం-చనిపోయినటువంటి తమ బిడ్డల పట్ల, చంపిన పాండవుల పట్ల అనేకమైన విరుద్ధ భావజాలంతో ఏది పరమ చరమమైన స్థాయికి వచ్చి కూడా, వయస్సు ముదిమి ఏర్పడిన తర్వాత కూడా ఇంకా పరిణామం చెందలేదు. అపరిణామం చెందే స్థాయిలోకి జీవుడు వెళ్ళాలి అంటే ఎట్లా ఉన్నా సరే శాంత రసాన్ని మనం పోషించాలి. శాంతంగా ఉండాలి. పరమేశ్వరుడిని అవమానించినంతగా మనల్ని అవమానించిన వాడు ఎవ్వడూ లేడు. యాతన ఏమిటో మనకు తెలియదు. పరమేశ్వరుడిని, ఆనాటి కృష్ణుడిని, నిజానికి సత్య సాయి భగవానుడిని ఎన్ని రకాలుగా అవమానించవచ్చునో అవమానించింది జాతి. కృతజ్ఞత లేకుండా అవమానించింది. కానీ పరమేశ్వరుడు శాంత రసాన్ని, శాంత చిత్తాన్ని, శాంత స్వభావాన్ని ప్రపంచానికి నిజానికి అది విశ్వరూపంగా మనం భావన చేస్తే విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. మహాత్ములైన వారందరినీ సమాజం నిర్దయగా చూస్తుంది. అంత జాగ్రత్తగా చూడదు. వారి నుంచి ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని magnify చేద్దామని కాచుకు కూర్చుంటుంది. కానీ ఒక ఉదాత్త భూమికలో ఉన్నటువంటి అవతారమూర్తి కానీ, పూర్ణ పురుషుడు గానీ, పుణ్య పురుషుడు గానీ లోకం కోసము మాత్రమే, జనహితం కోసం మాత్రమే, జగద్ధితం కోసం మాత్రమే, అందరికీ శ్రీ కైవల్య పదాన్ని ఇవ్వటం కోసం మాత్రమే శాంత భూమికలో, శాంతి భూమికలో ఉంటాడు గనుక ఇవాళ త్యాగరాజ స్వామిని ఒక క్షణం గుర్తు చేసుకుందాం. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడాయన. కదా. మనం ఇవాళ మాట అనటంలే. సౌఖ్యము లేక శాంతము లేదు అంటున్నాం. సౌఖ్యము అంటే భోగం. దాని వెనక పడి, పడి, పడి, యాతన పడి దాన్ని నిలబెట్టుకొని చివరికి బరువు కిందే మరణించే స్థితికి మనం వచ్చాం. శాంతంగా ఉన్నట్లయితే సౌఖ్యం మనది. సౌఖ్యం మనదిగా ఉంటే సంతోషం మనది. సంతోషం మనదైతే ఆనందం మనది. ఆనందం మనదైతే పరమానందం మనది. పరమానందం మనదైతే బ్రహ్మానందం కూడా మనదే. అందుకనే శంకర భగవత్పాదులు ప్రౌఢానుభూతిలో మాటంటారు. ఏమంటారంటే, బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానందదాయిని అని. దాన్ని స్వామి మామూలు మాటల్లో మనకి చక్కగా అర్థమయ్యే రీతిలో, "ఏం లేదు బంగారు. నేను బ్రహ్మమును అనుకో. ఎవరి మీద ఆధారపడని స్థితిని తెచ్చుకో. రెండూ గనక ఏర్పడినట్లయితే దాని పేరే ధ్యానం. అటువంటి స్థితిలో నీవు ఉండగలిగితే అది నీకు పరమానందాన్ని ఇస్తుంది." ఇంకోడి మీద ఆధారపడ్డ వాణ్ణి ఒక్కణ్ణి చూపించండి, శాంతంగా ఉన్నవాడు. పదకొండు గంటలకు ఎవరో క్యారియర్ తెస్తారు అంటే పదకొండు గంటల ఒక నిమిషానికి అది రాకపోతే తల్లడిల్లిపోతాం. శాంతం ఎక్కడుంది? శాంతం మీద రెండు గంటలు మాట్లాడాం. ఉందా? లేదే. లేదు రావలసిన వాడు విమానం దిగి ఇంకా ఇంటికి రాలేదు. దిగాడు, ఊళ్లో ఉంటున్నాడు, ఇంకా ఇంటికి రాలేదు అంటూ శాంతాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇది చాలా అల్పమైనటువంటి, స్వల్పమైనటువంటి, భౌతికమైనటువంటి, అధోస్థాయికి చెందినటువంటి మానస సంచారం. ఇందులో ఎవరి కథ ఎట్లా, ఎప్పుడు, విధంగా నడవవలసి ఉన్నదో it is all predetermined. దాని ప్రకారమే అవి జరుగుతాయి గనుక జీవుడు నిమిత్త మాత్రుడు గనుక నిమిత్త మాత్ర స్థితిలో మనం ఉండగలగాలి. అందుకనే జల్లెడమూడి అమ్మ సర్వ జగత్తుకి పరమాద్భుతమైన సూచన చేసింది. ఏమన్నదంటే, "అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు. ఇది గనక నువ్వు జాగ్రత్త పెట్టుకుంటే నీకు శాంతి అక్కడే దొరుకుతుంది" అన్నది. అనుకున్నది జరగదు, జరిగి తీరదు అన్నదావిడ. అంతే కాదు, నీకున్నది తప్పదు. నీకున్నది నువ్వు అనుభవించవలసిందే. ఇంకా అశాంతికి తావులేని స్థాయి గనుక శాంతిగా ఉండాలి. శాంతి కావాలంటే తృప్తిగా ఉండాలి. మహాత్ముల సమాశ్రయంలో ఉండాలి. మంచి మాటలు అనుకుంటూ ఉండాలి. మంచి మాటలు వింటూ ఉండాలి. మంచి మాటలు చదువుకుంటూ ఉండాలి.దానితో పాటుగా పరి ప్రశ్న వేసుకుంటూ ఉండాలి ప్రశ్న వేసుకోవాలి జవాబు పొందాలి ఇవ్వదగిన వాడిని అడగాలి కావలసింది రాబట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టుకోవాలి ముందుకు వెళుతూ ఉండాలి అనేక సంశయాలు దేహం ఉన్నంతవరకు సందేహం తప్పదు దేహం సమసిపోయే దాకా ఆత్మ సంశయాత్మగా ఉంటుంది సంశయంతో కూడిన ఆత్మకు పురోగమనం లేదు ఉన్నదంతా తిరోగమనం గనుక కావలసినది ఏమిటి అంటే తిరోగమనము వద్దు పురోగమనము వద్దు గమనమే లేని ఒక నిశ్చలమైన ఆత్మైక భూమికలో గనుక మనం ఉండగలిగినట్లైతే పరమ శాంతంగా మనం ఉండగలుగుతాం ఏమున్నదని మహర్షులంతా ఏం పొందారని మహాత్ములంతా అను-- భౌతిక అనుభూతిని పొందారని ప్రపంచంలో పురాణ పురుషులంతా మనకు ఆదర్శ పురుషులైనారు అంటే ఏమీ అక్కరలేదు కనుకనే వాళ్ళు పుణ్యమూర్తులైనారు కనుక ఏమీ అక్కరలేని స్థితికి మనం వెళ్ళాలి. వస్తాయా రానివ్వండి వస్తే అవి నీ దగ్గర ఉంటాయా? ఉంటాయి, పోతాయా? పోతాయి దాంతో కూడా నీకు ప్రమేయం లేదు కావాలని కోరకండి దానికై పోరాడకండి దానికై పరిగెత్తకండి దానికై అలసిపోకండి ఇంద్రియాలకు లోబడకండి ఇది శాంత రసం హెచ్చరిస్తున్నది. ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వర భావనతో గనక కూడి ఉన్నట్లయితే నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో శ్రవణంతో ప్రారంభమై-- కదా. శ్రవణంతో ప్రారంభమైన తొమ్మిది భగవంతుడి వైపు నడిపించేటువంటి దివ్య మార్గాలు కనుక మనస్సుని ఆలోచనా రాహిత్య స్థితికి తీసుకు వెళ్ళాలి దానికి పరమేశ్వరుని నిత్య ప్రార్థన నిత్య ధ్యానము నిత్య యోగము త్యాగము పరమేశ్వరుని యందు అచంచలమైన విశ్వాసము కర్త ఒక్కడు ఉన్నాడన్నటువంటి ఒక భావన మనకు కనుక ఉన్నట్లయితే జీవితమంతా శాంతిధామం లోపల ఉన్నదంతా ప్రశాంతి నిలయం అసలు దేహమే అరుణాచలమై దేహమే ప్రశాంతి నిలయమై గనక మారినట్లయితే శాంతి ఇవ్వటానికి మరొక వ్యక్తి అవసరం లేదు ఎందుకనంటే తెచ్చుకోవలసింది మనమే తెచ్చుకున్న దానిని నిలబెట్టుకోవలసింది మనమే నిలబెట్టుకున్న దానిని పంచవలసిన బాధ్యత మనదే గనుక గురుతరమైనటువంటి స్థాయిలో జీవుడు పరమోత్కృష్టమైన భావనా స్థితిలో శాంతిని అన్నివేళలా పొందుతూ ఉండాలి. సత్యసాయి భగవానుడు తమ అవనీ సంచారంలో ఎనభై ఆరు సంవత్సరాలు కూడా శాంతమూర్తియై శాంతి ఘనీభవించిన లేదా ప్రవహించిన శాంతమై ఉన్న కారణంగానే స్వామి యొక్క దేహము స్వామి యొక్క చూపు స్వామి యొక్క పలుకు స్వామి నడిచిన నడక నడత అంతా కూడా జాతి మతాలు దాటి దేశాలు దాటి ఎల్లలు దాటి సుమారుగా దేశంలో ఎన్ని దేశాలున్నాయో ప్రపంచంలో ప్రపంచంలో ఎన్ని ద్వీపాలున్నాయో ప్రపంచంలో ఎన్న-- ఎన్ని పుణ్య నదులున్నాయో ఎన్ని పుణ్య తీర్థాలున్నాయో అన్నింటి చోట అన్ని చోట్ల సత్య సాయి రామ నామం వినపడుతూనే ఉన్నది చూడండి రామాలయం ఉంటుంది పక్కనే సత్యసాయి రామాలయం దాంట్లోనే ఉంటుంది ఇంకో గదిలో ఇంకో మందిరంలో కాదు ఇది సత్యసాయి భగవానుడు శాంత రసాన్ని శాంతి భావాన్ని ప్రపంచానికి ఉపదేశించినటువంటి మార్గం ఒక ప్రత్యక్షమైనటువంటి శాంతికి సంబంధించిన ఒక మాట చెప్పి మన సత్సంగాన్ని విచారణను ముగిద్దాం. 1984 ప్రాంతంలో ఒక తెల్లవారు-- తెల్లవారినటువంటి వేళ సుమారు ఏడు నలభై ఐదుకి స్వామి రోజుల్లో ఏడ, ఎనిమిది మందిని ఒక interview కి పిలిచారు అప్పుడు నేను ఢిల్లీలో ఉండేవాడిని. వెళ్ళాం అందరం మాతో పాటు ఒక negro స్త్రీ room లోకొచ్చి interview room లో కూర్చుంది స్వామికి దూరంగా మూలగా కూర్చుని ఉంది ఆమె ఒళ్ళో నెలలు నిండిన ఇంకా నిండని పసిపాప ఉన్నది. లోపలికి వస్తూనే ఏడవటమే మొదలు పెట్టింది ఓంకార నాదంతో పోటీగా ఏడుస్తున్నది పిల్ల. స్వామి మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏదో ఇచ్చేవిస్తున్నారు ఉంగరాలు సృష్టిస్తున్నారు, గొలుసులు సృష్టిస్తున్నారు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు ఒక్కొక్క భాషలో మాట్లాడుతున్నారు నేను కూడా గోడ వైపు కూర్చుని ఉంటే స్వామి నన్ను పిలిచి తమ సింహాసనానికి ఎడమ వైపున కూర్చోబెట్టుకున్నారు ఎందుకంటే దృశ్యం నాకు కనపడాలి కనుక బహుశా పక్కన కూర్చోబెట్టుకున్నారు. అన్నీ అయిపోయినయి ఇంతలోకే స్వామి negro lady South Africa నుంచి వచ్చింది స్వామి తమ హస్త చాలనంతో సృష్టించి ఇట్లా విసిరారు అప్పటిదాకా చేతిలో ఏం లేదు అలా విసిరితే పసిపాప మెళ్ళో ఒక చిన్న గొలుసు పడింది గొలుసు పడ్డదో లేదో రోదన ఆగిపోయింది టక్కున ఆగిపోయింది. ఆగిపోగానే తల్లికి ఆనందం కలిగింది స్వామి ఆ-- ఆమెతో ఏం మాట్లాడలే కానీ ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత స్వామి ఆమెను అడిగిన మొట్టమొదటి ప్రశ్న "from which country?" అని అడిగారు. అనగానే "I am from South Africa" అన్నది. వెంటనే స్వామి "what is the name of your child?" అని అడిగారు అడిగితే "Vivenia" అన్నది. "what does it mean?" అన్నారు స్వామి. "ఆ స్వామి it is ప్రశాంతి, it is ప్రశాంతి" that what she said. You know what Swami said immediately? "Peace is inside, outside only pieces" that the cryptic statement Swami gave. "Your husband is waiting for you. Why did you come this far? Your husband loves you. Your daughter needs your husband. She needs a father, a caring father. Go back" అన్నారు. "Swami, I don't have any confidence. Where is the proof?" అని అడిగింది. వెంటనే స్వామి ఇచ్చిన జవాబు ఏమిటంటే...The proof you want you are under this roof that is the proof అన్నారు. ఇక్కడ ఉండటమే proof కాబట్టి వెళ్లిపోమన్నారు. కాబట్టి శాంతి ఎక్కడ అంటే బయట లేదు బయట ఉన్నదంతా pieces లోపల ఉన్నది peace అది అఖండము, అచ్యుతము, అనంతము, అచిరము, శాశ్వతం కాబట్టి శాంతిధామంగా మనం మనం జీవిస్తున్నటువంటి జీవన కాలమంతా కూడా శాంతిమయం చేసుకోవాలి. తృప్తిగా జీవించాలి, ఆనందంగా ఉండాలి అందరికంటే మనం భగవంతుని గురించి కాసేపు మాట్లాడుకునేటువంటి ఒక మనస్సుని ఇగో మన కోటి సమితి లాంటి ఒక చక్కని సమితిని ఇటువంటి అవకాశాలు అనేకంగా మనకిస్తున్నందుకు మనం ఆనందపడాలి, పరమాత్మ పట్ల కృతజ్ఞతగా ఉండాలి, తద్వారా శాంతిని మనం అనుభవించాలి. శాంతిని మన సంపద చేసుకోవాలి. సంపదని, శాంతిని అందరికీ పంచగలిగినటువంటి స్థాయికి మనం వెళ్ళాలి. దిశగా పరమేశ్వరుడు అయినటువంటి స్వామి ఎందరెందరో కొన్ని కోటానుకోట్ల మందికి శాంతిని వరదానం చేసినటువంటి మహా పూర్ణావతారంగా భావన చేస్తూ సత్యంతో కూడిన ధర్మం సత్య ధర్మాలతో కూడినటువంటి శాంతి ఎక్కడ ఉన్నదో అక్కడ జీవుడు తన సచ్చిదానంద స్థితిని ఒక పూర్ణమైనటువంటి భక్తి భావనని, నిర్మలమైనటువంటి సేవాభావాన్ని, ఆ-అమితమైన అనంతమైనటువంటి ఆనందాన్ని అన్నివేళలా అనుభవించాలి. ఎప్పుడో ఆనందం అనుభవిస్తే ఏమిటి? ఆనందం అచిరకాలంగా ఉండాలి కనుక ఆనందం అంతా కూడా ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉండేటువంటి విరామం. విరామము శూన్యము కానీ అది శుద్ధము. అది శుద్ధము, అది పూర్ణము దాన్ని expand చేసుకుంటూ మనం వెళ్లినట్లయితే మనకు కలిగినటువంటి అనుభూతులన్నింటినీ, అనుభవాలన్నింటినీ శాంతంగా, హాయిగా అనుభవించగలుగుతూ పరమేశ్వరుడు ఇటువంటి మహోన్నతమైన మానవ జన్మని, ఉత్కృష్టమైనటువంటి మానవ దేహాన్ని, ఒక నిత్య సత్సంగ యోగాన్ని అనుగ్రహించినందుకు సర్వదా భగవంతుని పట్ల అంటే స్వామి పట్ల కృతజ్ఞతాపూర్వక మైన జీవితాన్ని గనుక మనం గడపగలిగినట్లయితే, ఉన్నదంతా బ్రహ్మమన్న భావనలో నిలకడ చెందగలిగినట్లయితే మార్గాలు వేరైనప్పటికీ కూడా గమ్యం ఒక్కటేనని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని సత్యం ఒక్కటేనని విజ్ఞులైనవారు, అనుభవించినవారు, ప్రాజ్ఞులైనవారు, ధీమంతులు, త్యాగమూర్తులు అనుభవించిన వారు, దర్శించినవారు దానిని తమదైనటువంటి సంస్కార ధారతో ప్రపంచానికి మళ్ళీ అందిస్తూనే ఉంటారని దానికి కూడా కర్త పరమాత్మ అని మనం నిజంగా నమ్ముతూ అటువంటి శాంతి స్థానంలో మన మనస్సులు నిలకడ చెందు గాక. మనసుతో చూట్టం ప్రపంచాన్ని ఆపితే స్పర్ధ నశిస్తుంది. హృదయం ద్వారాలు గనక తెరుచుకొని హృదయంతో ప్రపంచాన్ని గనక చూడగలిగితే ద్వారకమాయి మనలో ఉన్నది, అరుణాచలం మనలో ఉన్నది, ప్రశాంతి నిలయం కూడా మనలోనే ఉన్నది. మనలో లేనిది బయట ఏం లేదు. బయట ఉన్నదంతా మనలో అందుకే శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమా అరుణగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహినివోద్భూతం యధా నిద్రయా యత్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ಇದಂ శ్రీ దక్షిణామూర్తయే అని స్వామికి నమస్కరిస్తూ సాయిరాం.
SSSMC · audio

Mahopadesam - 09

Home

Mahopadesam - 09

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 40:02

More in this series

Mahopadesam

9 episodes · 5 hr 14 min

  1. 33 min 1

    Mahopadesam - 01

  2. 31 min 2

    Mahopadesam - 02

  3. 40 min 3

    Mahopadesam - 03

  4. 30 min 4

    Mahopadesam - 04

  5. 33 min 5

    Mahopadesam - 05

  6. 40 min 6

    Mahopadesam - 06

  7. 30 min 7

    Mahopadesam - 07

  8. 34 min 8

    Mahopadesam - 08

  9. 40 min 9

    Mahopadesam - 09

    Now playing