Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరామ్! భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్య సాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్య సాయి సేవా సమితి కోటి హైదరాబాద్. సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. September మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్య సాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవని సంచారంలో జాతి మత వర్గ వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా భూమికలు. సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్య సాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. రాముడితో ప్రారంభమైంది ధర్మ పరిరక్షణ, ధర్మ సంరక్షణ. ఆయన ఎక్కడా కూడా నేను ధర్మాన్ని రక్షించబోతున్నానని గాని, ధర్మాన్ని స్థాపన చేయబోతున్నానని గాని ప్రకటనలు చేయకుండా, నేను మానవుడినిగానే వచ్చాను దశరథ రాజకుమారుడిగా వచ్చాను నేను రఘురాముడిగా ఉంటాను విధి ఎట్లా నడిపిస్తే నా జీవితాన్ని నేను అట్లా నడిపిస్తానని చెప్తూ తన జీవితాన్ని పూర్ణమయమూ, భాగ్యవంతమూ, ధర్మమయమూ చేశాడు. సత్య ధర్మాన్ని గనుక మనం దాటినట్లయితే అనేకమైనటువంటి ధర్మాలున్నాయి. ధర్మము అంటే మంచి మార్గము అనుకున్నాం. మనందరికీ ఏం కావాలి అని శాంతి కావాలి. శాంతి కావాలి అంటే ఒకే ఒక్క మార్గం ధర్మాన్ని పట్టుకోవటమే. బాగా డబ్బును పట్టుకున్నాం అనుకుందాం మనకు బాగా పది కోట్లు సంపాదించాలనో ఆలోచన మొట్టమొదట తెలవారుగానే కలిగింది. ఆలోచనలో ఎలా పొందాలి అన్నతో-- అన్న దాంతో అశాంతి ప్రారంభమై, ఏదో చేసి అది సంపాదించి దీన్ని ఎలా నిలబెట్టుకోవాలోనో అశాంతితో ఉండి దాచుకుందామనుకునే లోగా ఎవడో వచ్చి దోచుకొని పోతే, నేను సంపాదించాలి అన్న మాట నుంచి పోగొట్టుకునే దాకా శాంతి ఎక్కడ పొందాడు. దానికి కాపలా కాశాడు అశాంతి పొందాడు. ఎప్పుడైతే ఇటువంటి అర్థము తన చేతికైతే వచ్చిందో అనేక పాపకార్యకలాపాలు చేశాడు. సుఖమూ, భోగమూ, లాలస ఏర్పడింది. ధర్మం ఎప్పుడో వెనకబడి పోయింది ధనము మాత్రమే మిగిలిపోయింది. ధర్మం వేరు ధనం వేరు. ధర్మం మానవుడికి శాంతిని, దాంతిని, క్రాంతిని, హాయిని, ప్రసన్నతని, పారమార్థికతని, ఒక అంతరంగమైనటువంటి ముఖత్వాన్ని, తన లోపలికి తాను చూచుకోగలిగినటువంటి ఒక నియంత్రణని, ఒక యోగ స్థితిని కల్పిస్తుంది గనుక అన్నింటికీ మూలం ఏమిటయ్యా అంటే ధర్మంగా ఉండటమే. ఉండటమే అంటే ధర్మాన్ని అనుసరిస్తూ జీవయాత్ర చేయటమే. దీనిలో మానసిక ధర్మమని అంటే మనో ధర్మమని, సామాజిక ధర్మమని, రాజకీయ ధర్మమని, ఆర్థిక ధర్మమని అలాగే ఉపదేశ ధర్మమని అనేకమైనటువంటి ధర్మాలు ప్రపంచం నుండా పరచుకొని ఉన్నాయి. అయితే వ్యక్తిగా వ్యక్తిగతంగా విచారణ చేసినట్లయితే మన లోపల ఆరు అనాచారాలున్నాయి దాంతో వచ్చాం మనం ఇక్కడికి. వాటిని అరిషడ్వర్గాలు అన్నాం. అరి అంటే శత్రువు షడ్ అంటే ఆరు. ఆరు వర్గాలుగా ఉన్నాయి ఆరుగా ఉన్నాయి. అదే కామ, క్రోధ, మోహ అవన్నీ మనకన్నీ తెలుసు. ఆరు లోపల ఉండగా దైవాన్ని ఎలా దర్శనం చేస్తాం? ధర్మాన్ని ఎలా ఆచరిస్తాం? కాబట్టి ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే దానికి ముందు అరిషడ్వర్గాలను జయించాలి. సాధ్యమేనా అని. సాధ్యమే. ఏది ఎప్పుడు సాధ్యం కాదంటే అసలు ప్రయత్నమే చేయకపోతే అది అసాధ్యం. ప్రయత్నం అంటూ మొదలు పెడితే మనతో పాటు సమాజం, సమాజంతో పాటు దేశం, దేశంతో పాటు సృష్టి, వీటన్నింటితో పాటు పరమేష్ఠి యొక్క అనుగ్రహం మన యందు ఉంటుంది గనుక సంకల్పము మూలమైన సంకల్పం బలంగా, శుద్ధంగా, అచ్చంగా, స్వచ్ఛంగా, సనాతనంగా కానీ సనూతనంగా, పురారూపంగా కానీ ఆధునికంగా, సమకాలీనమైనటువంటి భావానికి అనుగుణంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మం తాను మారకుండా విలువలకు బలాన్నిస్తుంది. ఇవాళ సర్వ ప్రపంచంలో మన చుట్టూ ఉన్నది పతనమైనది ధర్మం కాదు విలువలు మాత్రమే పతనమైనయి. విలువలు మారుతూ ఉంటాయి సమాజం యొక్క దృష్టిని బట్టి, సమాజ అవసరాలను బట్టి, సమాజం యొక్క స్థాయిని బట్టి, సమాజం యొక్క ప్రాప్తిని బట్టి, సమాజం యొక్క పోకడని బట్టి, సమాజం యొక్క అంతరంగ స్థితిని బట్టి, దాని బలాన్ని బట్టి, దాని బలహీనతను బట్టి విలువలు మారుతూ ఉంటాయి. ఒకానొకనాడు దేశంలో ఉమ్మడి కుటుంబం ఒక బలం. ఇవాళ ఉమ్మడి కుటుంబం ఒక బలహీనత. చూశారా! కొన్నాళ్ళు unit families బలం. కొన్నొక ఐదారేళ్ళ క్రితం దాకా. ఇప్పుడు unit families బలహీనత. చూశారా మారిపోతూ ఉన్నది. కానీ ఇద్దరు ఉండండి, ముగ్గురు ఉండండి, ఒకే కప్పు కింద ముప్పై మంది ఉండండి ధర్మం మాత్రం అక్కడే ఉన్నది. అందరం కలిసే ఉండాలి, అందరం కలిసే ఆలోచించాలి, అందరం కలిసే ధర్మాచరణ చేయాలి, అన్నింటినీ కూడా ఆచరణాత్మక దివ్య విధానంగా గనుక మార్చుకోగలిగినట్లయితే అది పూర్ణమైనటువంటి సత్యాన్వేషణకి దారితీసి ధర్మం మనల్ని నడిపిస్తుంది గనుక ధర్మాన్ని ఆశ్రയിస్తే అన్నింటినీ ఆశ్రయించినట్లే.ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక ధర్మం అయితే నేను ఒక్కడిని ధర్మాన్ని పాటించి ప్రపంచం అంతా ధర్మాన్ని పాటించటం లేదు అంటే నాకు కుదరదు. కనుక నేను ఏం చేయాలి అంటే సమాజంలోకి చొచ్చుకుని వెళ్ళాలి. నాదైనటువంటి ముద్రతో వెళ్ళాలి. ఇదిగో నేను ధర్మాన్ని ఆశ్రయించాను నేను హాయిగా ఉన్నాను అని చెప్పక్కర్లే. ధర్మాన్ని ఆశ్రయించిన వాడి చుట్టూ ధర్మాన్ని కోరిన వారంతా కూడా చేరుతారు. నేను బాగా పాడతాను, మీరందరూ రండి అంటే ఒక్కడు రాడు. వస్తాడా? పాడుతూ ఉంటే ఎవడన్నా వింటే విన్నది ఇది బాగుంది అంటే అప్పుడు ఎవరో వస్తారు. వచ్చిన తర్వాత పట్టుకుంటున్నాడు. దేనిని పట్టుకుంటున్నాడు? చెప్తున్న వాడిని పట్టుకోవటంలా చెప్పబడిన విషయాన్ని పట్టుకోవాలి. అందుకే స్వామి అన్నారు ఒక ఉంగరం సృష్టించటం సృష్టికర్తకి అసాధ్యం కాదు కానీ మానవ మానవుడి యొక్క దౌర్బల్యం ఏమంటే సృష్టింపబడిన ఒక గొలుసునో ఒక ఉంగరాన్నో పట్టుకొని సృష్టికర్తను వదిలిపెడుతున్నాడు బంగారు. ఇంతకంటే అవిద్య మరొకటి ఉన్నదా? అన్నారు స్వామి. మనం కూడా చూడండి ఉంగరం స్వామి ఇచ్చారు. ఉంగరం స్వామి ఇచ్చారు అంటాం. ఇచ్చారయ్యా ఏమైంది? తర్వాత నువ్వేమన్నా బాగుపడ్డావా లేదా ఆలోచించుకో. ఉంగరం ఏమన్నా హెచ్చరికలు చేసిందా లేదా ఆలోచించుకో. స్వధర్మాన్ని పాటిస్తున్నావా లేదా ఆలోచించుకో. నీవు చేయవలసినటువంటి విహిత కర్మలన్నిటినీ చేస్తున్నావా లేదా ఆలోచించుకో. అందుకనే యత్ర యోగేశ్వర కృష్ణో ఏడు వందల శ్లోకాన్ని మనం ఇక్కడ సమన్వయం చేయాలి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిహి ధ్రువా నీతిర్ మతిర్మమ. ధృడమైనటువంటి ఒక నీతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధర్మంలో నుంచి వస్తుంది. ధర్మాన్ని ఆశ్రయించిన వాడు ఏం చేస్తాడు అని? ధర్మవీరుడుగా ఉంటాడు. భారతంలో ధర్మవ్యాధుడి కథ అందరికీ తెలిసిందే. వేదవ్యాసులవారు భారతాన్ని రాస్తూ ఒక మాటన్నారు. రాయబడుతున్న పంచమ వేదమైన భారతంలో ఉన్నదంతా లోకంలోనే ఉన్నది. లోకంలో ఏదైతే ఉన్నదో అదంతా భారతంలో ఉన్నది. భారతము అంటే లోకానికి దర్పణము, అద్దము అన్నారాయన. భారతం చదివితే మనల్ని మనం చదువుకోవటమే, సమాజం యొక్క పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకోవటమే, ఎట్లా ఉంటే పతనం అవుతామో తెలుసుకోవలసిందే, ఎట్లా ఉంటే ముక్తి, మోక్షము, ఆనందము, చైతన్యము ఎట్లా కలుగుతాయో చెప్పేది భారతం గనుక ఇటు positive energy ని అటు negative energy ని రెండింటినీ సమన్వయం చేసి ధర్మసంస్థాపనార్థాయ అని తాను ప్రకటించినటువంటి రీతిలోనే శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత సంగ్రామాన్ని నడిపించాడు. ఆయన గనుక రాయబారంలో వెళ్ళినప్పుడు రాయబారంలో మంచి మాటలు చెప్పినప్పుడు రాయబారంలో ఇటువారిని అటువారిని కలిపే ప్రయత్నంలో కాస్త మనసు పెట్టి ఉంటే దుర్యోధనుడు మారడా? పరమాత్మకు శక్తి లేదా? అంటే వాడు మారినా మారినట్లు ఉంటాడు. చూడండి మంచివాడు వేరు, మంచివాడుగా ఉండటం వేరు. మంచివాడు వాడికి ఉండటం లేకపోవడం రెండు లేవు. జిల్లేళ్ళమూడి అమ్మ దగ్గరికి ఒకాయన వచ్చారు. వచ్చి అమ్మా! నీ దగ్గర ఒకాయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి వచ్చాడు. నీ అనుగ్రహము, ఆశీర్వచనము కావాలి అంటే ఆమె పట్టించుకోలే. ఆమెకి వినపడలేదేమోనని నీ సమక్షంలో సన్యాస స్వీకారం చేయటానికి ఒకాయన వచ్చి వాకిట్లో ఉన్నాడు అంటే సన్యాసం స్వీకరించటం ఏంటి నాన్న సన్యాసిగా ఉండటం కదా అన్నది. స్వీకరించటము అంటే తీసుకున్నాము అంటే ఎప్పుడో వదిలిపెట్టాల్సిందే. అసలు ఉండటమే నిశ్చలమైనటువంటి స్థితి గనుక అదే సహజ స్థితి గనుక మనోధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో, మనోధర్మాన్ని గురించిన విచారణలో మనం నెరవేర్చవలసింది ఒకటే. మనకో మనస్సు ఉంది, మనకో అంతస్సు ఉంది, మనకో చైతన్యం ఉంది. చైతన్యం ఏం చెప్తున్నది అంటే లోపల ఎక్కడో ఒక చిన్న ఆలోచన పుట్టగానే నీవు చేస్తున్నది తప్పు అని చెప్తున్నది. చెడు ఆలోచన. ఒక మంచి ఆలోచన రాగానే రేపుకు రూపం లేదు గనుక మంచిని ఇప్పుడే వెళ్లి ప్రపంచానికి పంచిపెట్టు అంటున్నది. రెండు అంటున్నది ఎవరంటే లోపల ఉన్నటువంటి వస్తువు. కానీ మనం ఏమంటున్నాం అంటే నువ్వు అన్ని మంచి వాటినే support చేస్తున్నావ్. ఎప్పుడైనా నేను చెడు ఆలోచన రాగానే నాకు హెచ్చరిక చేస్తున్నావ్. కనుక నువ్వు కాసేపు పక్కనుండు అంటున్నాడు. తెలిసి చెడు చేస్తున్నాడు. తెలిసి చెడు చేసినటువంటి దుర్యోధనుడు చివరకు ఏమైనాడో కథంతా మనకు తెలుసు. అది మనం చెప్పుకోక్కర్లే. కాబట్టి మనోధర్మం ఉన్నది కదా అని మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. దానికి సాంఘిక ధర్మం ఒక అంచు. బంగారంతో మంచి కంచం చేసి మనకిచ్చారు. దాంట్లో భోంచేయండి అని ఇచ్చారు. దానికి అంచు కావాలా వద్దా? అంచు గనక లేకపోతే పదార్థాలన్నీ పది దిక్కులా పారిపోయినట్లే మనోధర్మానికి కూడా ఒక అంచు ఉన్నది. అంచు ఏమిటంటే సాంఘికమైన ధర్మం. సాంఘిక ధర్మం ఎందుకున్నది అంటే వ్యక్తి సమాజం కాడు. సమాజమంతా కలిపినా ఒక వ్యక్తి కాడు. మరి ఏమిటంటే అనేక వ్యక్తులందరూ కలిస్తే ఒక సమాజం ఏర్పడుతుంది. అనేకమైనటువంటి ఇళ్లన్నీ గనక చోట ఉంటే అది గ్రామం అవుతున్నది. అనేకమైనటువంటి చెట్లన్నీ ఒక చోట ఉంటే అది అడవి అవుతున్నదో, తోట అవుతున్నదో, కోట అవుతున్నదో అవుతున్నది. అనేకమైతే తప్ప అది ఏకంగా కనపడటం లేదు. ఏకము అనేకమై అనేకము ఏకమైనప్పటికీ దీనిలో సత్యసాయి భగవానుడి మాట ధర్మ విచారణలో, మహోపదేశంలో గుర్తుపెట్టుకోదగిన మాట. అది మనం మరణించినా, మనం తనువు తెల్లవారిపోయినా రాబోయే తరాలు కూడా గుండెల మీద రాసుకోవలసినటువంటి మాట బంగారు. మానవుడు ఒక్కడికే season reason లేదు.ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు season ని reason ని ఆశ్రయించి బతుకుతున్నాయి మరి మానవుడు రెండు లేకుండా పోయినాడే అన్నారు season reason రెండు మాటలు ఏమిటంటే ప్రకృతి ఉంది తన ఋతు ధర్మాన్ని తాను పాటిస్తూ పాలిస్తూనే ఉన్నది మొన్న మొన్నటి దాకా ఎండలు కాసి కాసి ఆగగానే నేను రేపటి నుంచి వర్షాలు కురుస్తానని చెప్పకుండానే వర్షం కురిసింది వర్షాలు కురిసి కురిసి హేమంత ఋతువు వస్తుంది ఎప్పుడైనా ప్రకృతి తన ధర్మాన్ని తప్పిందా విచారణ చేసినట్లయితే ప్రకృతి ఎప్పుడూ కూడా ధర్మాన్ని అధక్కరించలేదు దాటలేదు ఎలా ఉన్నదయ్యా ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నది గనుక ఆకు ఎప్పుడు రాల్చాలో రాల్చింది పండ్ ఎప్పుడు పండించాలో పండించింది పువ్వు ఎప్పుడు పూయాలో పూచింది అది ఎన్నాళ్ళు ఉండాలో అంతవరకే ఉన్నది నేను పువ్వునై పూచాను నేను నాలుగు రోజులు ఉంటానని పరమాత్మకి అది మొరపెట్టుకోలేదు మొరపెట్టుకుంటున్నది ఎవడంటే జీవుడే వాడు తనకు ఇవ్వబడినటువంటి ఆయు ప్రమాణంలో తాను చేయలేని పనిని పొడిగించబడినటువంటి ఆయుష్షులో చేయగలడా అని ప్రశ్నించినట్లయితే చేయలేడన్నదే జవాబు అందుకనే ప్రతి క్షణాన్ని జరిగిపోయినదేదో జరిగిపోయింది రాబోతున్నదేదో మనకు ఎరుక లేదు ఉన్నటువంటి వర్తమానాన్ని ఒక రోజును ఒక unit అనే జీవితంగా భావన చేయగలిగినట్లయితే నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ జాగ్రదవస్థ లోకి ఇరవై నాలుగు గంటలలోగా ఏం చేయాలనుకున్నామో అవన్నీ సమయంలోనే చేయాలి ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా రేపు ఉన్నది మనం ఉంటే రేపును చూస్తాం మనం లేకపోతే రేపుకి మనకి సంబంధం లేదు కాబట్టి ఇంత అవాస్తవమైన అనిశ్చితమైనటువంటి ఒక భావన ఉన్నటువంటి ఒక పరిణామ స్వరూపమైనటువంటి కాలంలో జీవుడు ఏం చేయాలి అంటే ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి సామాజిక ధర్మము వ్యక్తిగత ధర్మము మానసిక ధర్మము దాటుతున్నటువంటి వేళ ఆరు మృగాలు ఆరు రాక్షసులు లోపల సంచారం చేస్తున్నటువంటి వేళ వాటిని ఎట్లా ఏం చేస్తే అవన్నీ negative గా ఉన్నవన్నీ positive ఎట్లా అవుతాయి అంటే స్వామి చెప్పినటువంటి మాట అరిషడ్వర్గాల అన్నింటినీ కూడా హరిషడ్వర్గాలు చేసుకో అన్నారు హరిని హరి చేసుకో అన్నారు అంటే మొట్టమొదటిది అది మూలాధారం అంటే చిట్టచివరిది అది సహస్రారం సహస్రారంలో హరి ఎట్లా ఉన్నాడో నీలో గనుక సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస త్యాగము ఆరవది త్యాగము అంటే నా కర్మణా నా ప్రజయా నా ధనేన నా త్యాగేనైక అమృతత్వమానశు అని కదా ఉపనిషత్తు డబ్బు వల్ల అమృత పుత్రుడు కాలేడు అనేకమైన కర్మలు సత్కర్మలు చేసిన అమృత పుత్రుడు కాలేడు నాకు బలిమి ఉన్నది జనబలము అంటే అంగబలము అర్థబలం అంతా ఉన్నది నేను అమృత పుత్రుడిని అంటే వీలు లేదు నీలో ఉన్నటువంటి ప్రాపంచికమైన భౌతికమైన లౌకికమైన వాసనా మయమైనటువంటి అనేకానేకమైనటువంటి వృత్తులని అన్నింటినీ వదిలి పెట్టగలిగితే నీవు అమృత పుత్రుడు అవుతావు త్యాగేనైక త్యాగము వలన మాత్రమే అమృతత్వమానశు మృతి లేని మార్పులేని అసంభవమైనటువంటి ఒకానొక సంభవ స్థితిని సహజ స్థితిని పూర్ణ స్థితిని నీవు ధర్మము వలననే పొందగలవు గనుక ముందుగా ధర్మ మార్గాన్ని ఆచరించాలనుకునేవాడు ధర్మాన్ని గురించి విచారణ చేయాలని అనుకునేటువంటి వాడు తనలో ఉన్నటువంటి క్రోధాన్ని వదిలిపెట్టాలి తనలో ఉన్న అసూయను వదిలిపెట్టాలి తనలో ఉన్న లోభాన్ని వదిలిపెట్టాలి తనలో ఉన్న మోహాన్ని వదిలిపెట్టాలి అంతే కానీ వాటన్నింటినీ లోపలే పెట్టుకొని నాకు మోక్షం ఇవ్వు అంటే ఇచ్చిన మోక్షం దీని వైపు రానే రాదు మోహ క్షయం కాదు మోహం లోపలే ఉన్నది లోభం పెరిగిపోతున్నది అసూయ పెరిగిపోతున్నది ప్రగల్భం పెరిగిపోతున్నది దాంభికం పెరిగిపోతున్నది తెలిసింది తక్కువ తెలిసినట్లు ఎక్కువ కనిపిస్తున్నది మరి తత్వార్థ విచారణలో మనం చేయవలసినటువంటి పని ఏమి అంటే లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలని జయించేటువంటి ఒక ప్రయత్నం చేయాలి అందుకే శంకర భగవత్పాదుల వంటి పరమ మహేశ్వర స్వరూపం ప్రపంచంలో శివానందలహరిలో మాటన్నారు ఆయన శివా అది కిరాతక ఎందుకయ్యా కిరాతకుడి వేషంలో వెళ్లి బాణాలు పట్టుకొని బాణాన్ని ఎక్కుపెట్టి ఆరు మృగాలని అమాయక జీవుల వెంట ఎందుకు పడతావ్ ఎందుకు వేటాడుతావ్ బాణాన్ని నా వైపే తిప్పరాదా లోపల ఆరు మృగాలు నశిస్తాయి కదా అంటారు ఎవరు శంకర భగవత్పాదులు ఎప్పుడైనా మనం ధర్మ మార్గంలో ఉన్నామనుకునేటువంటి వాళ్ళం ధర్మము అంటే చెడు చేయకపోవడం ధర్మం కాదు మంచిని ఆచరించడమే ధర్మం చెడు చేయనందువలన మనం మంచి వాళ్ళం కాలేం మంచిని ఆచరించాలి కూడా మంచిని పంచాలి కూడా ఎప్పుడు పంచగలం అంటే మన దగ్గర సమృద్ధంగా ఉంటే పంచగలం బాగా డబ్బుంది దానం చేయగలం జ్ఞానం ఉంది జ్ఞాన వరదానం చేయగలం అపారమైనటువంటి విద్య ఉన్నది ఇంకొకరికి అందించ గలం అసలు మనమే బలహీనులం మన దగ్గర ఏం లేదు మనకేం తెలియదు కానీ వాడు ఎవడికో నేను సాయం చేయనా అని అడిగాడనుకోండి చేయమని ఎవడన్నా అన్నా చేయగలగాలి కదా కాబట్టి సమృద్ధమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అంటే జీవుడు ధర్మాన్ని ఆశ్రయించాలి ధర్మం అరిషడ్వర్గాలను జయిస్తూ జయిస్తూ వెళ్ళిన తర్వాత అన్నింటికీ మూలమైన అన్నింటికీ కారణమైనటువంటి మనస్సును జయించాలి నిజానికి అన్నింటికంటే మనస్సును జయించటం కష్టం మనస్సును జయించటం కాదు మనసు యొక్క ఉరికిని గుర్తించకుండా వదిలిపెట్టినట్లయితే మనసు మన జోలికి రాదు.మనమంతా కూడా నా మనసేం బాగా లేదు అంటాం. ఒక్కమాటలో ఏం అర్థం ఉందో తెలుసా? నా అనబడే నాకు మనస్సు అనే వస్తువు ఉంది, దానికి బాగా లేదు అని. దానికి బాగా లేకపోతే మనమెందుకు బాగుండ-కుండ- ఉండాలి? అంటే మనస్సు నేను అని చెప్తున్నామా? నేను లేకుండా మనస్సు లేదని చెప్తున్నామా? మనస్సు లేకపోతే నేనే లేదని చెప్తున్నామా? ఎట్లా చెప్తున్నాం? కాబట్టి నా మనస్సు బాగా లేదు అంటే బాగా లేనిది నువ్వు కాదు మనస్సే. కాబట్టి మనస్సుని ఎడంగా, పెడగా, దూరంగా ఉంచగలిగితే జయించినట్లే లెక్క. కనుక వేదాంత భూమికలో జయించు అనబడేటువంటి మాటలో యజించు అని అర్థం ఉన్నది. జయ శబ్దంలోనే యజ శబ్దం ఉన్నది గనుక యజ అంటే నియంత్రించు అని, నిరోధించు అని, కాసేపు ఆపు అని. అది. కాసేపు మనస్సుని ఆపగలిగితే, మనస్సుని నియంత్రించగలిగితే, మనస్సు ఎప్పుడైతే ఆగిందో ఇంద్రియాల ఆట కూడా ఆగింది. మనస్సు ఇంద్రియాలు ఎప్పుడైతే ఆగిపోయినాయో, మనో, బుద్ధి, చిత్త, అహంకారములన్నీ కూడా ఒక level field కి వచ్చిన తర్వాత మనసుకు ఒకటే తోస్తుంది, నేను చేస్తున్న పని మాత్రం సత్యమే, నేను ఆశ్రయించినది ధర్మమే అని ఎప్పుడైతే ఒక ఆలోచన కలుగుతుందో, ధర్మాకృతిగా మానవుడు తన జీవితాన్ని గడపటం మొదలు పెడతాడు. దీని తర్వాత మనకి చిన్నప్పటి నుంచి ఒక తరం లో పాత పాఠశాలల అన్నింట్లలో కూడా schools లో గోడల మీద మంచి నీతి వాక్యాలుండేవి, కదా. వెళ్ళగానే teacher కూడా attendance తీసుకునేవాడు కాదు. గోడ మీద ఉన్నవన్నీ చదువుతూ మనం class లో మన bench మీద మనం కూర్చోవాలి. వీలైతే ఒక్కొక్క వాక్యాన్ని గురించి కాసేపు మాట్లాడేవారు, మనకు అర్థమయ్యేది. ఆ-అర్థమయ్యిందని అనుకున్నాం గనుక మాత్రమన్నా ఇలా జీవించగలిగాం అని ఒక ఆ-ఆనందం మనకు మిగిలింది. కానీ, ఇవ్వేళ ఎక్కడా కూడా moral value అనేటువంటి మాట గానీ, ధర్మాన్ని గురించిన విచారణ గానీ కనీసం గోడ మీద కూడా రాత లేదు. గోడ మీద ఏముందంటే, మనం వెళ్ళవలసినటువంటి దేశాల map లు ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, Australia వెళ్లాలంటే అక్కడుంది అలా వెళ్ళొచ్చు, ఇట్లా ఈత్తు వెళ్ళొచ్చు, ఎగురుతూ వెళ్ళొచ్చు అని చెప్పినాయి గానీ, మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి ధర్మాన్ని మాత్రం బోధించేటువంటి వేదము, ధర్మమూలమైనటువంటి వేదం అంటే విద్య. విద్య ఎప్పుడైతే మన నుంచి దూరమైపోతుందో, మనకు బోధించే వాడు లేడో, బోధించటానికి కావలసిన పరికరాలు దూరమైపోయినయో, మానవుడికి నేర్వవలసినవన్నీ అందని పండ్లుగా మిగిలిపోయినాయి. కనుకనే ధర్మాన్ని ఎక్కడ ఆచరించాలి అంటే, నీవు జీవిస్తున్నటువంటి unit per day ఒక-ఒక రోజును మనం unit గా భావన చేయాలని అనుకున్నామే అక్కడ ధర్మాచరణ చేయాలి. ఎంత ధర్మాచరణ చేయగలం? చేయగలిగినంత చేయాలి. సరే, అందరం కూడా అరవై ఏళ్ళు వచ్చేదాకా ఏదో వృత్తిలో ఉంటాం. అరవై ఏళ్ళు వచ్చేదాకా ఏమంటామంటే ధర్మాన్ని గురించినటువంటి పుస్తకం అరవై ఏడు retire అయిపోయాక అంతా time అప్పుడు చదువుతాను అంటాడు. చదవటానికి అవకాశం కల్పించని మాయాపాశమైన మనవుడు చుట్టూ కూర్చుంటాడు. మనవరాలు కూర్చుంటుంది. తాత కథ చెప్పు అంటుంది. వీడి జీవితమంతా మనవరాలికి కథ చెప్పటంతో చెల్లు అయిపోతుంది. ముందు అవకాశం ఉన్ననాడు చదవలేదు, అవకాశం ఉంటుందనుకున్ననాడు అవకాశం లేదు, మరి జీవితమంతా చెల్లగొట్టుకున్నట్లయితే అసలు ధర్మార్థ విచారణ చేసేది ఎప్పుడు? విచారణ చేసిన దానిని అర్థం చేసుకునేది ఎప్పుడు? అర్థం చేసుకున్న దానిని ఆచరించేది ఎప్పుడు? ఆచరించిన దానిని అనుభవించేది ఎప్పుడు? అనుభవించిన దానిలో అనుభూతిని చెందేది ఎప్పుడు? విభూతి స్థాయికి వెళ్ళేది ఎప్పుడు? కానీ, నైతికమైనటువంటి కొన్ని సూత్రాలన్నింటినీ కూడా జీవుడు పాటించాలి. జీవుడు భగవంతుని యొక్క ప్రమోద వశాత్, జీవుడి యొక్క ప్రారబ్ధ వశాత్ రెండు వర్గాలుగా సృష్టింపబడ్డాయి. ఒకటి స్త్రీ సమూహంగా, రెండవది పుంభావంగా, పురుషుడుగా. పురుష, స్త్రీ అనబడేటువంటి రెండు స్థితులు ఏవైతే ఉన్నాయో, అందునా ప్రధానంగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఉపన్యాసాల నిండా స్త్రీమూర్తిని గురించినటువంటి అనేక స్పర్శలున్నాయి. స్పర్శలన్నీ కూడా భారత, భాగవత, రామాయణాలలో ఉన్నటువంటి ఉదాత్త స్త్రీమూర్తుల యొక్క భావన, ఒకటి. అంతే కాకుండా సర్వ వేదములకు, సర్వ శక్తులకు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మూలమైనటువంటి కోటి సూర్యమండల మధ్యస్త అయినటువంటి మహా త్రిపుర సుందరి దేవి ఉన్నదో దాని యొక్క, ఆమె యొక్క ప్రతి స్వరూపమే ఈనాటి భారతీయ స్త్రీ అని స్వామి నిర్ద్వందంగా ప్రకటించారు. కానీ, స్వామి ఆనాడే ఒక ప్రమాద సూచికని 1966 ప్రాంతం నాటికే మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఎవరినైనా, స్త్రీనైనా మీరేం చేస్తున్నారు అని అడిగినప్పుడు, ఏం చేయటం లేదు I am only a housewife అని చెప్తున్నారు. housewife కాదు, నీకో husband ఉన్నాడు గనుక you are a wife to your own husband. అంతేగాని, నీ ఇంటికి నీవు భార్యవు కావు. నీ ఇంటికి నీవు ఎవరో తెలుసునా? నీవు గృహలక్ష్మివి అన్నారు. స్త్రీ అయినా నేను గృహలక్ష్మిని అని చెప్పుకోవటానికి ఎందుకు సిగ్గుపడాలో తెలియదు. కానీ, నూటికి నూరు పాళ్ళు ఇవ్వేళ I am only a housewife అంటున్నది. house కి wife కాదు. గృహలక్ష్మిగా ఉన్నట్లయితే ధర్మాన్ని తన భర్త, తన జీవన సహచరుడు అనేకమైనటువంటి ప్రాపంచిక కార్యకలాపాలలో మునిగి ఉన్నటువంటి వేళ సహధర్మంగా, ఒక భావనగా, సహచర్యంగా ఎప్పుడైతే ఒక హైందవమైన అంటే సనాతనమైన, హైందవ అంటే హిందూ మతం అనుకోకండి. సనాతనమైనపురాతనమైన వాంగ్మయమైన వేదమయమైన ఉపనిషన్మూర్తిమంతమైనటువంటి ఒక లక్ష్మి అనబడేటువంటి దివ్య భావనలు లక్ష్మి అంటే ఇచ్చేది లక్ష్మి అమ్మవారికి కాసుల దండ పూజ చేస్తాం పూజ ఎప్పుడైతో అయిపోయిన మరుక్షణం మనం ఇల్లో వేసుకుంటాం కదా అందుకే స్వామి అనేకసార్లు ఏదన్నా function అయినప్పుడు విస్తరి నిండా అన్నీ కూడా బ్రహ్మార్పణం చెప్పడానికి మన వాళ్ళు నుంచుంటారు కదా చెప్పిన తర్వాత స్వామి చమత్కారంగా ఒకసారి అన్నారు చూపులు నాకు మేపులు మీకు అన్నారు స్వామి అంటే పని కూడా అర్థం ఎరిగి చేయం ఇక్కడ సందర్భం కాబట్టి ఒక్కమాట చెప్తాను బ్రహ్మార్పణం చేయొద్దు స్వామికి ఇలా ఇలా అంటారు అనకూడదు బ్రహ్మార్పణానికి అర్థం అది కాదు బ్రహ్మార్పణం బ్రహ్మా హవిః అంటే అర్పణపు బ్రహ్మ హవిస్సులు బ్రహ్మ భోక్త బ్రహ్మ యజ్ఞ కార్యము బ్రహ్మ కర్మ సమాధులన్నీ బ్రహ్మ అంతా బ్రహ్మమే అన్నదాన్ని తీసుకొచ్చి మనం తెచ్చిన నాలుగు వంటలు బ్రహ్మ బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం అంటే ఆయన పుచ్చుకునేది లేదు మనకు వచ్చేది లేదు ఇది ఇది సత్యం అంటే అర్థం ఎరగాలి స్వామి చెప్పారు అర్థం తెలియకుండా నీవు పని చేయది వ్యర్థమే నీకు అక్కరకు రాదన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని మనం చక్కగా సమన్వయం చేసుకుంటూ మానవ జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి ఇవాళ ఒక fundamental గా ఒక ప్రశ్న మనల్ని ఎవరైనా వేస్తే అయ్యా మీరు చెప్పిన ధర్మోపన్యాసం బ్రహ్మాండంగా ఉంది కానీ మా నాన్నగారు ధర్మాన్ని నమ్ముకొని పూరిపాక కూడా కట్టలేకపోయినాడు నేను తర్వాత వచ్చి మా నాన్న చేసిన పొరపాటు ఏదో గ్రహించి అధర్మం అనే దాన్ని పాటించకుండా చూశారు కదా పద్దానుగంతస్తుల భవనం నే కట్టాను అన్నాడు కానీ పూరిపాక కట్టిన తండ్రి మరణానంతరం జీవిస్తాడు పద్దానుగంతస్తుల అధర్మాన్ని ఆశ్రయించి కట్టిన వాడు జీవించి ఉండగానే మరణిస్తాడు వాడికి చరిత్రహీనుడు అవుతాడు కనుక ధర్మాన్ని ఆశ్రయించాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మనిష్ఠ చాలా ప్రధానం త్రేతాయుగంలో మనం అనుకున్నట్లుగా మనకి సంపూర్ణమైనటువంటి ఒక ఉదాహరణ శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మః ఆయన ధర్మాన్ని ఎలా పాలించాడో మనం విచారణ చేసుకుని అలా మనం పాటించగలమో పాలించగలమో లేదో కాస్త లెక్క వేసుకుని సత్య సాయి భగవానుడు అదే ధర్మాన్ని తన జీవన కాలంలో అవతారంలో ఎలా చక్కగా demonstrate చేశారో అర్థం చేసుకుంటే ధర్మ శబ్దానికి పూర్ణమైనటువంటి ఒక అవగాహన మనకు కలుగుతుంది గనుక రాముడు ధర్మ స్వరూపుడు ఎందుకు అయినాడు అంటే ఆదర్శాన్ని ఆధారం చేసుకున్నాడు ఆయన ఏమి ఆదర్శము అంటే తాను పని మీద ప్రపంచంలోకి వచ్చాడో పనిని సంపూర్ణంగా నిర్వర్తించడం కోసం ధర్మాన్ని ఆశ్రయించాడు ఆదర్శాన్ని ఆధారం చేసుకున్నాడు తెల్లవారితే పట్టాభిషేకం వశిష్ఠ మహాముని చెప్పాడు రాత్రికి దీక్షా వస్త్రాలు ధరించి రామచంద్ర నీవు నీ భార్య సీత వేరు వేరు గదులలో ఉండి యోగ నిష్ఠలో ఉండి ధ్యాన సమాధిని అనుభవించి ప్రపంచంలో ఉన్నటువంటి దేవీదేవతల యొక్క అయోధ్యా ప్రజల యొక్క తపస్సుల యొక్క ముముక్షువుల యొక్క గురువుల యొక్క సమస్త జీవుల యొక్క ఆశీర్వచనాన్ని పొందు రామా నీవు ఇక్ష్వాకు వంశ మకుటాన్ని నీవు పొందబోతున్నావు రేపు కనుక నీ గదిలో నీవుండు అన్నాడు వెళ్ళాడు బాలుడు అయిన రాముడు వెళ్ళాడు వెళ్లి కూర్చుంటే ఆయనకి అన్ని వైపుల నుంచి ఒక ఘోష వినిపించింది ఘోష ముప్పది ముక్కోటి దేవతలంతా కూడా సూక్ష్మ శరీరంలో గదిలోకి వచ్చి రామా నీవు సింహాసనాన్ని అధిరోహించకు ఎందుకంటే నీవు వచ్చిన పని అది కాదు ధర్మసంస్థాపన చేయాలి రావణ సంహారం చేయాలి నువ్వు ఇక్కడ కాదయ్యా ఉండటానికి వచ్చావు అరణ్యాలు పాలించడానికి అరణ్యంలో తాపస్సులున్నారు యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి నీ కార్యకలాపం అంతా అక్కడే కానీ అయోధ్యా నగరంలో కాదు అంతఃపురంలో కాదు అని ఘోషిస్తున్నప్పుడు తన తల్లి అయినటువంటి కౌసల్య దగ్గరకు వెళ్ళలేదు తనను అమితంగా ప్రేమించినటువంటి సుమిత్ర దగ్గరకు వెళ్ళలేదు కైక దగ్గరకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే బారసాల నాడే కైక ఆయనకు ధనుర్విద్య బొమ్మలతో ధనుస్సులు ఎలా వేయాలో నేర్పింది ఆవిడ చాకులతో దుష్ట సంహారం ఎలా చేయాలో నేర్పింది ఆమె కనుక యుద్ధ క్రీడలో తొలి గురు అయినటువంటి కైక దగ్గరకు వెళ్ళాడు ఆయన అరణ్యాలకు వెళ్ళమంటున్నారు అరణ్యాలకు వెళ్ళమంటున్నారు వెళితే ఎవరు ఏం చేయాలి అని వెళితే కైకని అడిగాడు అమ్మా మనస్సు నిలవటం లేదు దేవీదేవతలు నన్ను నిలవనివ్వటం లేదు నన్ను ఏం చేయమంటావు అంటే దైవం ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళు రామా అని వెనుతిరిగి వెళ్ళిపోయింది ఆమెకు తెలుసు మర్నాడు ఆయన అరణ్యవాసానికి ప్రయాణం కట్టాలి అని లోపలికి వెళ్ళగానే రాముడు స్థిర బుద్ధితో స్థితప్రజ్ఞతో అన్నింటికీ సంసిద్ధుడు అయినాడు పట్టుబట్టలు కట్టుకోవలసిన శ్రీరామచంద్రుడు తెల్లవారగానే అదే భావంతో రకమైనటువంటి అలసట గాని అలజడి గాని ఆందోళన గాని లేకుండా నార చీరలు ధరించి అరణ్యవాసానికి ప్రయాణమైనాడు ప్రయాణం ప్రయాణం సుమారు పదహారు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ప్రయాణంలో వెళుతున్నప్పుడు రాముడి కథంతా గనుక మనం చదివినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే ఒక రాక్షస సంహారం కాగానే అదే రోజు రాత్రి ఒక ముని ఆశ్రమంలో ఉన్నాడు ఆయన ఒకరోజు రాత్రి గనుక ముని ఆశ్రమంలో రాత్రి గడిపినట్లయితే మరనాడు మళ్ళీ దుష్ట సంహారం చేశాడు నడక కొంత సాగిన తర్వాత అంటే జీవితం అంతా కూడా నిలువు అడ్డం పోగుల కలయిక అది కలనేతపడుగు పేకగా వస్త్రం ఎట్లా నేయబడి ఉన్నదో, నిలువుగా ఒక పోగు అడ్డంగా ఒక పోగు. రెండు ఏర్పడినట్లుగా జీవితం రామ జీవితం అంతా కూడా అలాగే ఉన్నది. అలాగే నిజానికి మానవ జీవితం కూడా. మనకి రాముడి వంటి వాడికి కలిగిన అనుభవం మనకు కలగదు కానీ, మనకు గనక ప్రోగ్రాం వేసుకున్నాం, ఎక్కడికో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. సామాన్లన్నీ కారులోకి డిక్కీ లోకి వెళ్లిపోయినాయి. ఇంకా ఏం మిగిలింది అయి అంటే ఉరికే తాళం వేయటమే మిగిలింది. సమయంలోనే ఎవరో వచ్చారు. మనతో ఉండటానికి మన ఇంట్లో ఉండటానికి వచ్చారు. ఏం చేస్తాం మనం? అబద్ధం చెప్పి ధర్మాన్ని అతిక్రమించి అక్కడి నుంచి జారుకొని వెళ్లిపోతాం లేదా ఎందుకు ఇప్పుడు వచ్చారని ప్రశ్నిస్తాం. రాముడు కరెక్ట్ గా పట్టాభిషేకం అప్పుడే కైక వరాలు కోరాలా అని అనుకోలేదు. కైక వరాలు కోరటం అనేది cosmic design లో భాగం. పరమేశ్వర సంకల్పంలో అదొక భాగం. దాన్ని వినమ్రంగా తీసుకున్నాడు. విధి ఎట్లా నిర్ణయిస్తే, విధి ఎట్లా సంకల్పిస్తే, విధి ఎట్లా అనుకుంటే తన జీవితాన్ని తాను అట్లాగే గడిపాడు. కనుక శ్రీరామచంద్రుడు తన భార్యతో, తన తమ్ముడితో అరణ్యవాసానికి వెళితే ఆయన భార్యను పోగొట్టుకున్నాడు. తీసుకు వెళ్ళినటువంటి రావణబ్రహ్మ ప్రతిరోజూ రాముడిని నిందించాడు అశోకవనంలో. దానిని భరించింది. తాను క్షాత్ర ధర్మంలో రాజై పుట్టినప్పటికీ, ముగ్గురు తల్లుల ముద్దుబిడ్డ అయినప్పటికీ, నవయవ్వనంలో ఉన్నప్పటికీ, తాను సాక్షాత్తు నారాయణమూర్తి అయినప్పటికీ, పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళవని లోకం చేత జగదానంద కారక స్థితిలో ఉండి కూడా ప్రపంచం విసిరిన ప్రతి సవాలుకి తన జీవితాన్ని ఎదుర్కోలుగా పెట్టాడాయన. పెట్టి జయించాడు. తనలో ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా జయించి పట్టాభిషిక్తుడు అయినాడు. అప్పటిదాకా ప్రపంచం నుంచి సర్వ సహాయాలు పొందాడు. ధర్మాన్ని అతిక్రమించనటువంటి స్థాయిలో సంచారం చేశాడు. మనకి జీవితంలో ఒక చిన్న కష్టం రాగానే, చిన్న అననుకూలం కాగానే మనం అనుకున్నది అనుకున్న సమయానికి జరక్కపోతే మనం ఏమైపోతున్నాం? అల్లాడిపోతున్నాం. మళ్ళీ అటువంటి జీవితం కలుగుతుందా? మళ్ళీ అటువంటి జీవితం పొందగలమా? ఇదివరకు ఉన్నట్లుగా ఉండగలమా? ఇదివరకు ఎంత ఏదో సుఖంగానే ఉన్నట్లు. అప్పుడు కష్టాలున్నాయి, అవన్నీ మరిచిపోయాం. మరిచిపోయి నిన్నటి సుఖంతో ఇవాళ కష్టాన్ని పోల్చుకొని మనం బెంబేలు పడిపోతున్నాం. అట్లా జరగటానికి వీలు లేదు. ఎందుకంటే ధర్మాన్ని ఎవరైతే పట్టుకొని ఉన్నారో, పట్టుకొని ఉన్నదానిని ఆశ్రయించి ఉన్నారో, ఆశ్రయించిన దాని ద్వారా జీవితాన్ని గడుపుతూ ఉన్నారో धर्मो रक्षति रक्षितः.
SSSMC · audio

Mahopadesam - 05

Home

Mahopadesam - 05

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 33:36

More in this series

Mahopadesam

9 episodes · 5 hr 14 min

  1. 33 min 1

    Mahopadesam - 01

  2. 31 min 2

    Mahopadesam - 02

  3. 40 min 3

    Mahopadesam - 03

  4. 30 min 4

    Mahopadesam - 04

  5. 33 min 5

    Mahopadesam - 05

    Now playing
  6. 40 min 6

    Mahopadesam - 06

  7. 30 min 7

    Mahopadesam - 07

  8. 34 min 8

    Mahopadesam - 08

  9. 40 min 9

    Mahopadesam - 09