Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరామ్! భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్య సాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్య సాయి సేవా సమితి కోటి హైదరాబాద్. సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్య సాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా భూమికలు. సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్య సాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ సత్య సాయి భగవానుని దివ్య అనుగ్రహ విశేషంతో ప్రారంభమైనటువంటి శ్రీ సత్య సాయి మహోపదేశంలో ఇది మూడవ సోపానం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. సత్య సాయి భగవానుని భక్తుడికి పదాలు చాలా చిరపరిచితం. అయితే మహోపదేశాన్ని స్వామి జాతి, మత, కుల, వర్గ, వర్ణాలకు అతీతంగా జాతులకు అతీతంగా సర్వ మానవాళిని ఉద్దేశించి తమ నిత్య నైమిత్తికమైనటువంటి జీవితంలో కనుక ఐదింటిని పాటించినట్లయితే పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని ఇక్కడే ఇప్పుడే పొందవచ్చును అని చెప్పారు. ఐదు భౌతిక మార్గాలు ఆదిభౌతిక విచారణలు ఆధ్యాత్మిక స్థితిలో అవి అనుభూతి తరంగాలు. అనుభూతి ఘనమై గాఢమైన తర్వాత అది విభూతి స్థాయికి సహజంగానే చేరుస్తుంది గనుక ఐదింటిని కూడా మనం ఐదు వేద వాక్యాలుగా వేద పదాలుగా నిజానికి వేదాలుగా భావన చేయాలి. సత్యం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? నిజానికి సత్య ధర్మం అంటే ఏమిటి? అనేక ధర్మాలలో సత్య ధర్మం శిఖర స్థాయికి చెందింది కాబట్టి సత్యాన్ని ఆశ్రయించినటువంటి ఒక ధర్మం. ధర్మాచరణలో సత్యాన్ని ఒక ఎరుకగా అనుభూతి చెందటం. సత్యం ఉన్నది అనేటువంటి ఒక స్పృహ అన్ని కాలాలలో ఉండటం. అంతేకాదు సత్ గనుక లేకపోయినట్లయితే అసలు పదార్థమే లేదు. పదార్థం లేదు గనుక పరమార్థము లేదు. పరమార్థం ఎరుగం గనుక యదార్థం అందుకోలేం గనుక సర్వ సృష్టికి సర్వ భువనాలకి సర్వ భావనలకి సర్వ కదలికలకు మెదలికలకు సర్వ చలనాలకు చలించకపోవటానికి కారణం ఏమిటి అని స్థూలంగా గనుక విచారణ చేసినట్లయితే ఒకానొక అనుభూతి మనస్సును తాకుతుంది. అది దాని పేరు సత్. సత్ అంటే అన్నివేళలా ఉండేది అని. సత్యము అంటే మనతో ఉన్నది అని. సత్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి సత్యము కలాజ్యవచ్ఛిన్నమైనటువంటిది, అపరిణామ ప్రాప్తమైనటువంటిది అంటే పరిణామం లేనిది, మార్పు చెందనిది, మూలమైనది, కారణమైనది, ప్రేరణమైనది, చారణమైనది, తారణమైనదిగా భావన చేశాం. అయితే అనేకమైనటువంటి ధర్మాలు కూడా సత్యాన్ని గనుక ఆశ్రయించకపోతే ఎన్నెన్ని ధర్మమైన బద్ధమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నప్పటికీ ధర్మాన్ని గురించి కూలంకషంగా విచారణ చేసినప్పటికీ ధర్మము సత్యాశ్రితం గనుక కాకపోతే ధర్మం అసమగ్రం. అందుకనే వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని వాల్మీకి సత్య పరాక్రమ అన్నాడు. ధర్మ పరాక్రమ అన్నాడు. అంతేకాదు సత్య ధర్మ పరాక్రమ అన్నాడు. ఆయన ధర్మానుష్ఠానం అంతా తన మూలమైనటువంటి సత్యంతో అనుసంధానం చేసుకొని తాను సత్యమై ఒక స్పష్టత ఉన్నప్పటికీ మాయా మానవ వేషధారణ చేసినటువంటి రాముడు నేను మానవుడిగా ఉండటానికే వస్తాను. మానవీయమైన, సాంఘికమైన, రాజకీయమైనపరిపాలనా పరమైన ప్రజాపరమైన ధర్మబద్ధమైన యజ్ఞహితమైన అనేకమైనటువంటి ధర్మాలని జీవిత కాలంలోనే నేను కొనసాగిస్తాను అని రాముడి యొక్క ప్రతిన. ఆయన జీవితమంతా ప్రజాపత్య పురుషుడు వచ్చి కౌసల్య గర్భనందనుడుగా కావడానికి కారణమైనప్పటి నుంచి రావణ సంహారమై కుశుడికి పట్టాభిషేకం చేసి సరయు నది ప్రవేశం చేసేదాకా రామగాథ అంతా కూడా అది ధర్మ ప్రవాహం. అందుకనే "రామో విగ్రహ్వాన్ ధర్మః" అని ఇప్పటికీ కలియుగంలో ఐదువేల నాలుగు వందల సంవత్సరాలుగా మనం ఉన్నటువంటి యుగం కూడా రామున్ని ధర్మమూర్తిగా, త్యాగమూర్తిగా, ఆదర్శమూర్తిగా, పరిణామ మూర్తిగా ఒక పరిపూర్ణమైనటువంటి పురుషోత్తముడుగా భావన చేస్తూ వచ్చింది. సత్యం ఎరుగకుండా ధర్మమే గనక ఆచరింపబడి ఉన్నట్లయితే అది కేవల సాంఘిక పరమైనటువంటి ఒక మర్యాదను పాటించిన వాడిగా రాముడు మిగిలిపోయి ఉండేవాడు. కానీ సత్యాన్ని ఆశ్రయించినటువంటి ధర్మాన్ని, తన మూలాన్ని ఎరిగినటువంటి ఒకానొక నిత్య స్ప్రుహతో జీవనం కొనసాగించాడు గనుక, తన అవతారాన్ని తాను ఎత్తి వచ్చినప్పుడు ఎటువంటి ప్రకటన చేయకుండా తన దివ్య జీవన విధానం ద్వారా సత్య ధర్మాచరణం పరిపూర్ణంగా చేశాడు గనుక రాముడు పురుషోత్తముడైనాడు, ఆరాధనీయుడైనాడు, పూజనీయుడైనాడు, పూజ్యుడైనాడు, ఆపై దేవుడైనాడు. మనందరము దేవుడన్ననే కాదన్నాడు ఆయన. అవతారం యొక్క విశిష్టత అది. శ్రీ కృష్ణ పరమాత్మ అంతే. సత్య ధర్మాలు రెండింటినీ కూడా ఎవరి పరంగా ఆచరింప చేశాడు అంటే, ఆయన ఎప్పుడూ కూడా రాజు కాదు. He was never a king, he was a king maker. ఎందుకంటే రాజు అయ్యేవాడి కంటే రాజును చేయగలిగిన వాడి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు రాత్-రాచరికపు బిడ్డగా వచ్చాడు. ఆయన కంటే ముందు అరవై మూడు మంది రాజులు రాజ్యం పాలించారు. ఈయన అరవై నాలుగవ వాడు. కాబట్టి రాజ్యం ఉన్నది, రాచరికం ఉన్నది, సింహాసనం ఉన్నది, అధికారం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, ఒక lineage ఉన్నది ఇక్ష్వాకు వంశంగా. కృష్ణుడికి అట్లా ఏం లేదు. రావటం రావటమే చెరసాలలో వచ్చాడు. అదే రోజు రాత్రి యమునా దాటాడు, వ్రజ భూమికి చేరాడు. అక్కడ నుంచి ఉన్నచోట ఉండకుండా ఉండవలసిన ప్రతి చోటికీ ఆయన చేరుకోగలిగాడు. ఉండవలసిన ప్రతి చోటు ఎక్కడ అంటే అధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ చేరుకున్నాడు ఆయన. కనుకనే శ్రీ కృష్ణ పరమాత్మ ఇటు భాగవతాన్ని అటు భారతాన్ని పరచుకున్నటువంటి మధుర లావణ్యమూర్తి ఆయన. కానీ ఆయన జీవితం మాత్రం ఒక మధుర విషాద గాథ. ఎందుకని అంటే అది మాధుర్యం ఆయన గురించి అనుకుంటూ ఉన్నప్పుడు, అది విషాదం కారణం ఏంటంటే ఆయన్ని దేవుడిగా గుర్తించిన వాళ్ళు లేరు, బహు కొద్ది మంది మాత్రమే. ఏది ఏమైనా తనను గుర్తించలేదు గనుక అసలు నేనే దైవము అని ప్రకటన చేసుకున్నటువంటి పూర్ణావతారం శ్రీకృష్ణ పరమాత్మ. ఒకటి మాయావరణంలో రెండవది లీలాభరణంగా సాగినటువంటిది. కాలగమనంలో ద్వాపర యుగం అయిపోయిన తర్వాత ఆధునిక కాలంలో ఎనభై ఏడు సంవత్సరాల క్రితం వింధ్య పర్వతాల కివితల ఆంధ్రదేశం చేసుకున్నటువంటి మహా పుణ్య విశేషం చేత కృతయుగ నాటి సత్యము, త్రేతాయుగ నాటి ధర్మము, ద్వాపర నాటి శాంతి ప్రేమలు, కలియుగ నాటి అహింస కలబోసుకొని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడు ప్రపంచంలోకి ఆవిష్కృతమైనారు. అందుకనే "ఔపదేయం మునకు సత్యనామం బిచ్చి, నడతకెల్ల ధర్మ నిరతి నెరపి, ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి, వచ్చేమా స్వామి మల్హారమై, విచ్చేమా స్వామి కల్హారమై" సహస్ర దళాలలో వికసించినటువంటి ఒక పూర్ణ చేతన ఏదున్నదో మహా చైత్య పురుషుడే సత్యసాయి భగవానుడు. సర్వ వేదాలు, సర్వ ఉపనిషత్తులు, సర్వ గాథలు, సర్వ ఇతిహాసాలు సమస్తమైనటువంటి భారతీయ వాఙ్మయం కూడా స్వామి వెనక పరిగెత్తుకొని వచ్చినాయి. ఎందుకంటే రామకృష్ణాది అవతారాలకు లోక గురువులు ఉన్నారు, స్వామికి గురువే లేడు. స్వామే గురువుగా, స్వామే అనుభవించిన వారికి తల్లిగా, అనుభూతి చెందిన వారికి తండ్రిగా, దర్శనాన్ని పొందిన వారికి దైవంగా తల్లి, తండ్రి, గురువు, దైవము అనేటువంటి నాలుగు పార్శ్వాలు ఏకకాలంలో అభివ్యక్తం చేసినటువంటి మహా పరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. మరి అటువంటి పూర్ణావతార మూర్తి యొక్క శుద్ధ చైతన్యంలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట అగ్ని స్వరూపమై అనేకమైనటువంటి జీవుల యొక్క తమస్సును తొలగించి, తపస్సును వెలిగించి, మాటలు మలగించి, మౌనాన్ని వెలిగించి, మహా మోక్షం వైపు నడిపించేటువంటి దివ్య సాధనాకృతులు గనుక రోజున మనము శాంతి అనబడేటువంటి ఒక పదాన్ని, ఒక విషయాన్ని, ఒక బోధని, ఒక ఉపదేశాన్ని, ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని లోతుగా విచారణ చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. శాంతి అనగానే ఎవరో ఇస్తారు మనం తెచ్చుకుందాం అని మనకు అనిపిస్తుంది. సత్యసాయి భగవానుడు అన్న మాట ఒక్కటే, "శాంతిని నీకు ఎవరు ఇవ్వగలరు? నీ శాంతి నీ యందే ఉన్నది. చిత్త ఏకాగ్ర స్థితిలో నిలకడ చెంది, ధ్యానివై, పరమాత్మ భావనతో యోగించినట్లయితే అన్నీ తొలగిపోగా మిగిలినది శాంతి."నాకు శాంతి కావాలి ఆనందం కావాలి అని అడుగుతున్న ప్రతి జీవుడు కూడా శాంత స్వభావుడు కనుక ఆనంద స్వరూపుడు కనుకనే తన మూలాన్ని మళ్ళీ అడుగుతున్నాడు మర్చిపోయాడు. శాంతి వైదలగటానికి గల కారణం ఏమిటి అశాంతి పోతే శాంతి వచ్చినట్టేనా అశాంతి పోయినంత మాత్రాన శాంతి వచ్చినట్లేనా శాంతి ఉంటే అశాంతి రాదా అసలు ఇంతకీ శాంతి ఏమిటి అంటే శాంతమే శాంతి. సంయమనమే సమన్వయం సమన్వయమే సంఘర్షణ లేని స్థితి. మనం ప్రపంచంతో పోరాడుతున్నాం ప్రపంచంతో సంఘర్షణ పడుతున్నాం ప్రపంచంతో ఎప్పుడూ పేచీగా ఉన్నాం అని అనుకుంటాం. దాన్ని పక్కన పెట్టినట్లయితే మనతో మనం పోట్లాడుకోవడం చాలా ఎక్కువ మనతో మనం ఘర్షణ పడటం చాలా ఎక్కువ చాలా తరచుగా జరుగుతుంది. కనుకనే లోపల ఉన్నటువంటి శాంతిని మనం ఎలా పొందాలి అంటే సమన్వయమైనటువంటి ఒక అధ్యాత్మ భూమిక లో నిలకడ చెంది అధ్యాత్మ భావనలో పరమేష్టితో ధర్మాన్ని ఆచరిస్తూ సత్తు ఉన్నది అనేటువంటి ఒక స్పృహలో ఉంటూ రెండింటిని గనక సమన్వయం చేసుకోగలిగితే శాంతి అది అక్కడే ఉన్నది అది ఎవరు తెచ్చి ఇచ్చేది కాదు. శాంతి ఒక అద్భుతమైనటువంటి శుభ్ర మనస్సు యొక్క స్థితి. మనసు అనేక రీతులలో ఉంటుంది శుభ్ర మనసు అపరిశుభ్ర మనసు అశాంత మనసు అస్థిమిత మనసు అచల మనసు అనేక రకాలుగా కొన్ని వేల రకాలుగా మనసు ఉంటే మనసు యొక్క పోకడని బట్టి శాంతి యొక్క స్థితి ఏర్పడుతున్నది. శాంతి తన స్థితిని తానేం పోగొట్టుకోవటం లేదు అట్లా మనకి ఆవిష్కృత అవుతున్నది అట్లా అనుభూతి పరంగా మన అనుభవంలోకి వస్తున్నది గనుక శాంతి కూడా అనుగ్రహంలాగానే ధర్మంలాగానే మార్పు చెందని ఒక ఉత్కృష్టమైనటువంటి మనోభూమిక లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్థితి. ఇక్కడ భారతీయ వేదాంత శాస్త్రంలో గాని తత్వశాస్త్రంలో గాని మంత్ర తంత్ర భూమికలలో కానీ అనేకమైనటువంటి విచారధారులు అయిన తర్వాత శాంతి మంత్రం చదువుతాం. ఓం శాంతి శాంతి శాంతిహి అని మూడు సార్లు అనేస్తాం. ఒకటి నేను ఉన్న నాకు కనబడుతున్న నేను అనుభవిస్తున్న నాతో కూడి ఉన్న నాతో సహచరమైన నాతో సహభాగమైన నాదైన నే-నా అనుభవ పరిధిలో ఉన్నటువంటి సర్వ ప్రపంచము అంటే కళ్ళకి కనిపించే ప్రపంచం అంతా ముందు శాంతి నొందు గాక అది మొట్ట మొదటి ఆవృత్తం. రెండవ ఆవృత్తం అదే ప్రపంచంలో నా చుట్టూ అనేక ఆందోళనలు ఉన్నాయి అల్లకల్లోలాలు ఉన్నాయి ఆతృతలున్నాయి తాపత్రయాలున్నాయి పీడలు చీడలు ఉన్నాయి ఆనందం మృగ్యమై పోతున్నది కానీ శాంతి అటువంటి ఆందోళనని అనుకున్నటువంటి వాటన్నింటినీ కూడా దూరం చేసేట్లుగా నా మనోభూమిక అంటే ఆదిభౌతికమైనటువంటి స్థాయి శాంతి నొందు గాక అది రెండవ ఆవృత్తం. ఇక మూడవ ఆశంసనం అంటే కోరిక ఏమిటయ్యా అంటే నేనెంత నేను చూసిన ప్రపంచం ఎంత కంటికి కనపడని పదార్థం అంతా కూడా చాలా ఉన్నదే నూరు శాతం గనక ప్రపంచమంతా పదార్థమయం అయినట్లయితే సృష్టి అంతా అందులో మన కంటికి కనిపిస్తున్నది అభివ్యక్తమైంది Two point five percent దానినే చూసి మనం బెంబేలు పడిపోతున్నాం కాబట్టి అవ్యక్తమైనటువంటి ఇంకా కంటికి కనపడని మనస్సుకి వాక్కుకి గోచరం కాని హృదయానికి మాత్రమే అనుభూతిగా మనని తాకేటువంటి Ninety seven point five percent దానికి దైవం అని పేరు పెట్టు ఫినామినన్ అని పేరు పెట్టు అవతార మూర్తి అని పేరు పెట్టు అదృశ్య శక్తి అని పేరు పెట్టు చిచ్ఛక్తి అని పేరు పెట్టు అదేమో కానీ అది మాత్రం ఇంకా చూడలేదే చూడబడని బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో అది కూడా శాంతించు గాక. శాంతించు గాక అంటే ఏమిటి? తను ఉన్న పరిస్థితిలో తాను అట్లే ఉండు గాక అని అది. మనం ఉన్న పరిస్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి జీవుడు ప్రకృతి పరమాత్మ అట్లాగే ఉండాలి అవి అట్లాగే ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నత స్థితికి వెళ్తాం గనుక సమన్వయ ధారలో శాంతిని ఎలా పొందాలి అనగానే అనేకమైనటువంటి విచార ధారలలో మొట్టమొదటిది మనకు కావలసిన వస్తువు గనక మన చేతికి దక్కితే శాంతి దొరుకుతుంది అనుకుంటాం. దొరకదు. వస్తువు కావాలి అనుకున్న మరుక్షణం నుంచి యాతన ప్రారంభం అవుతుంది. ఎప్పటిదాకా మనం పోయేదాకా. శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వస్తు మూలకమైనటువంటిది సుఖము సంతోషమే కానీ అది ఆనందము కాదు దాని పరమ చరమ స్థాయి అయినటువంటి శాంతి కూడా కాదు. శాంతి అంటే క్షమము అని అర్థం క్షమము అంటే ఇంద్రియాలు అన్నీ కూడా ఉండవలసిన స్థాయిలో ఒకానొక పరిస్థితిలో ఒకానొక పొటెన్సీలో ఒకానొక ధృతిలో ఒక ఆధృతిలో ఒక పరిమిత వేగంలో కావలసిన ఆవేగంలో సంచారం గనక చేస్తే దాని పేరు క్షమము. ఇంద్రియాలు అన్నీ చక్కగా ఉన్నాయి వేళ హాయిగా ఉన్నాను అంటున్నాం ఎప్పుడంటున్నాం మేలుకొని ఉండగానేలే మేలుకొని ఉండగా ఉద్యోగం చేస్తున్నాం సంపాదిస్తున్నాం భోంచేస్తున్నాం ఆనందిస్తున్నాం నిద్రపోతున్నాం మేలుకుంటున్నాం మళ్ళీ లేస్తున్నాం కానీ రాత్రి పూట పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారి లేస్తున్నటువంటి వేళ అందరితో ఏం చెప్తున్నాం అంటే నేను హాయిగా ఉన్నాను ఎంత హాయిగా నిద్ర పట్టిందో నిద్ర పట్టింది అని నీకు తెలుసా నిద్ర పట్టాక నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసునా కానీ నేను హాయిగా ఉన్నాను అంటున్నావ్ అంటే జగత్తు యొక్క వ్యాపారంతో కూడి ఉన్నంత వరకు నేను హాయిగా ఉన్నాను అన్నవాడు ప్రపంచంలో లేడు.ఎలా ఉన్నారు మాస్టారు అని ఎవరన్నా మనల్ని పలకరించి మనం జవాబు చెప్పకపోతే ఆయనే రెండో ఉప ప్రశ్న వేసి కులాసాగా అయితే ఉన్నారు కదా అంటే కులాసా ఎక్కడ అంతా లాస్ గానే ఉందని చెప్తాం మనం అది అంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలన్నీ కూడా ఉండవలసిన రీతిలో లేవు గనుక ఉండవలసినట్లుగా లేవు గనుక ఉండవలసిన చోట లేవు గనుక అవి చేయవలసిన పనుల కంటే చేయవలసిన పనిని దాటి ఇది చేయక తప్పని పరిస్థితి ఉన్న కారణంగా క్షమము దూరమైన కారణంగా శాంతి లభించటం లేదు. శాంతి అంతర్గతమైన మనోభూమికి చెందింది అని మనం అనుకున్నాం శాంతి ఎలా పొందుతాం సాధన చేస్తే పొందుతాం సాధువు దగ్గరికి గురువు గారి దగ్గరికి అయ్యా నాకు శాంతి కావాలి అని గనుక మనం అడిగినట్లయితే ఇట్లా అడిగిన వాళ్ళు చాలామంది స్వామిని అడిగారు చాలా మంది ఉన్నారు. ఇవాళ మధ్యకాలంలో కాదు గాని పాతకాలంలో I want peace అంటూ స్వామి దగ్గరికి వెళితే స్వామి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం చూపించారు అది పైకి చాలా చమత్కారంగా నవ్వుకోవటానికి హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది గాని ఒక్క పదాన్ని ఒక్క వాక్యాన్ని మనం గనుక విచారణ చేస్తే స్వామి ఎంత అందంగా మార్గం చూపించారో తెలిసిపోతుంది. I want peace అని రోజుల్లో foreigners పుట్టపర్తికి వచ్చినప్పుడు ఇట్లా బ్యానర్ పట్టుకు కూర్చున్నాడు ఒకాయన స్వామి మార్నింగ్ దర్శనం ఇవ్వటానికి వచ్చినప్పుడు అక్కడ ఆగారు ఆగి అలా చూశారు దానివైపు చదివారు పక్కన ఉన్న వాడి pen ఒకటి తీసుకుని I కొట్టేశారు want కొట్టేశారు I పోయింది want పోయింది కాగితం మీద peace మిగిలింది చూశారా? I అంటే అహం I అంటే దేహాత్మ భావన want అంటే మానసిక వ్యాపారం want నెమ్మదిగా ఒక desire గా మారుతుంది desire ఒక will గా మారుతుంది intention గా మారి will గా మారి desire గా మారి ఘనీభవించి అచ్చ తెలుగులో మోహంగా మారి మోహము వ్యామోహమై వ్యామోహము వ్యసనమై జీవుణ్ణి అల్లాడిస్తుంది కనుక మనం పోగొట్టుకోవలసింది మొట్టమొదట ఏమిటి అంటే I పోగొట్టుకోవాలి. తేలిక కాదు అంత తేలిక కాదు నేను దేహము మాత్రమే కాదు అనుకోగలిగిన స్థాయి రావటానికి కూడా కొన్ని జన్మలు ఎత్తాలి. ఎత్తిన వాడు కూడా అప్పుడప్పుడు నేను నేను అంటూనే ఉన్నాడు నేను మాత్రం వదిలిపెట్టటం లేదు. నేను అంటున్నప్పుడల్లా నేను చూపిస్తున్నాడు నేనుని దాటి దేహాత్మ భావన దాటి నేను దేహము మాత్రమే కాదు చలత్ చలితమైనటువంటి ఇంద్రియాలు మాత్రమే కాదు తదధిష్టానమైన మనస్సును మాత్రమే కాదు వీటన్నింటికీ మూలమైన ఆత్మను నేనే అన్న భావనలో గనుక ఉండగలిగితే అందుకనే ఆత్మ నిష్టో భవత్వం మిగతా అన్ని నిష్టలు కూడా సాధనలో ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు తీసుకెళ్తాయి ఆత్మ నిష్టకి పైన ఇంకో మెట్టు లేదు ఉన్నదంతా అదే సర్వం ఖల్విదం బ్రహ్మ అసలు ఉన్నదంతా బ్రహ్మమే భావన రావాలి అంటే ముందు మనకు ఎరుక కలగాలి ఎరుక ఎట్లా కలుగుతుంది అంటే దేహం భావన చదువు కీర్తి భౌతిక సంపద ప్రాపంచిక సంబంధాలు లౌకిక వ్యాపారాలు ఇవన్నీ మనసును చుట్టుముట్టినటువంటి వేళ ఇంద్రియాలను శాసిస్తున్న వేళ మనసుని అణచలేని ఒక దౌర్బల్య స్థితిలో ఉన్నటువంటి వేళ I మన నుంచి ఎలా పోతుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి ముల్లుని ముల్లుతో తీయాలి అంటే ముల్లు గుచ్చుకున్నదన్న స్పృహ మనకు ఉండాలి. రెండవ ముల్లు ఏమిటంటే అజ్ఞానం అనేటువంటి ముల్లు మనల్ని గుచ్చుకున్నప్పుడు జ్ఞానము అనేటువంటి మరొక ముల్లుతో మొదటి దాన్ని తీసేయాలి. అందుకనే షిరిడి మహాస్వామి అవతారంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం. ఏమిటి ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానులందరూ కూడా తాము పొందినటువంటి జ్ఞాన ఖడ్గము చేత అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి దిశగా తీసుకు వెళతారు గనుక సేవయా అనబడేటువంటి సమర్పణ భావంతో తెలుసుకోవాలి అన్నారు మూడు ఉన్నాయి అక్కడ తద్విద్ధి విద్ధి అంటే వేద విద్ధ్ విధి తత్ విద్ధి దానిని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ప్రణిపాతేన సమర్పణం చేయాలి పరిప్రశ్నేన ప్రశ్నించాలి సేవయా అంటే చాకిరీ చేయటం కాదు భావన అని అర్థం. ఏం చేయాలి? సమర్పణ చేయాలి, విచారణ చేయాలి, భావించాలి, సమర్పణ చేసుకోవాలి. వీటన్నింటినీ సమగ్రం చేసుకున్నటువంటి ఒకానొక స్థితిలో జీవుడు నిలకడ చెంది ఉండాలి ఉంటే మూడింటికి మార్గం చూపించగలిగినటువంటి జ్ఞానిని గురువుగా భావించి ఆయన దగ్గరకు గనుక వెళ్లగలిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా? జ్ఞానినా తత్వదర్శినః అది. జ్ఞాని శాస్త్రం చెప్పడు పుస్తకాల్లో ఉన్నది చెప్పడు రామాయణంలో ఇట్లా ఉందనేటువంటి పద్యాలు చెప్పడు ఏం చెప్తాడయ్యా అంటే నేను ఇది చూశాను దీనిని చూశా నేను దేనిని చూశానో మీకది చెప్తున్నా అంటాడు. అందుకే శంకర భగవత్పాదులు ప్రౌఢప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః స్వచ్ఛుష్యబోధయా తత్ సత్యమాశ్రితావన్ అన్నారు అంటే ఒక నిజమైనటువంటి గురువు ఎవరు ఈయన మంచి గురువు, గొప్ప గురువు, సహజ గురువు, కారణ గురువు, అచ్చమైన గురువు, ఆత్మ గురువు అని ఎవరు అంటే ఎవరైతే తాను పొందినటువంటి అచ్చమైనటువంటి అనుభూతినివిస్తృతమైన అనుభూతిని గాఢమైనటువంటి అనుభూతిని అందుకోగలిగిన శిష్యుడు ఎవరన్నా వస్తే అందించే దాకా శరీరంలో ఉంటే చాలు అనుకునేవాడు ఉత్తమోత్తమ గురువు అది. నరేన్ కోసం రామకృష్ణ పరమహంస wait చేసినట్లుగా గురు శిష్య పరంపరలో అది ఒక అద్భుతమైనటువంటి combination మన మన కాలంలో రామకృష్ణ గురుదేవులు నరేన్ వచ్చేదాకా ఎదురు చూశారు. ఆయన కంటే ముందు నరేన్ తో పాటు కొన్ని వందల మంది గుంపులు గుంపులుగా శిష్యులు అంతా ఉన్నారు. వారెవరికీ తమ తపస్సుని ధారపోయలేదు ఆయన. నరేన్ వచ్చిన తర్వాత పరి ప్రశ్న వేశాడు నరేన్. పరి ప్రశ్న ఎప్పుడు వేశాడో తెలుసునా? తద్విద్ధి అదేమిటో తెలుసుకోవాలన్నాడు. ఏమి తెలుసుకోవాలనుకున్నాడు? గురువుగారు మీరు దేవుణ్ణి చూశారా? అని అడిగాడు. అమాయకంగా అడగలే, గురువుని పరీక్షించాలని ప్రశ్నించలే. ఈయన ఖచ్చితంగా చూసే ఉంటారు అని నమ్మకంతో అడిగాడు. అడిగినప్పుడు ఆయన కూడా అంతే దృఢంగా నేను చూశాను అన్నారు. అయితే నాకు చూపించగలవా అని అడిగాడు. ఈయన చూడగలడు గనుక చూపిస్తాను అన్నాడు. చూడలేని శిష్యుడు ప్రశ్న గనక అడిగున్నట్లయితే నువ్వు చూడగలిగితే నేను చూపిస్తాననేవాడు కానీ అనలేదు ఆయన. చూపించగలరా గురుదేవా అనగానే బ్రహ్మ రంధ్రం మీద తమ చేతిని పెట్టి సర్వలోకాలు సమస్త బ్రహ్మము మూలమైనటువంటి పదార్థం పదార్థానికి మూలమైన సత్తు సత్తు ఆకారం దాల్చినటువంటి అనేకానేక స్థితులు దానిని శాసిస్తున్నటువంటి దేవీదేవతా గణం వాటన్నింటికీ మూలమైనటువంటి చైతన్య భావన చైతన్య ప్రవాహం ఘనీభవించిన చైతన్య స్థితి పరమ మార్దవమైన పరమ లాలిత్యమైన పరిపూర్ణమైనటువంటి అచ్చమైనటువంటి ఒక జ్ఞాన శిఖని జ్ఞాన స్పర్శని జ్ఞాన రేఖని నరేన్ కి అందించగానే ఆయనకు ఏం దొరికిందయ్యా అంటే తద్విద్ధి దొరికింది. దేనిని తెలుసుకో గోరి ఉన్నాడో అది దొరికింది గనుక వెనువెంటనే ఆయనకు వివేకం కలిగింది. వివేకం ఏమంటే నరేన్ అనబడేటువంటి దేహం అశాశ్వతం ఇది ఒట్టి కట్టే. వివేకం ఏమిటి అంటే దీనిని పాలిస్తున్న దీనిని శాసిస్తున్న దీనిని నడిపిస్తున్న దీనికి మూలమైన ఒక ప్రాణ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నేను కదా అన్న భావన. ప్రణిపాతేన సమర్పణ చేసుకున్నాడు గురువుకి. చేసిన తర్వాత పరి ప్రశ్న వేసే వేయటమే వేసుకున్నాడు. ఇక ఏం చేశాడు భావించాడు. నేను ఏది కోరదగిని ఆశించి కోరుకొని గురువుని ఆశ్రయించానో గురువు నాకు పూట అనుగ్రహించాడు అన్నటువంటి ఒక speed of thought నరేన్ అనబడేటువంటి ఆయన దేహంలో మనస్సులో అంతరంగంలో ఒక్కసారిగా విలిగి పోయిందో వివేకము చేత ఆయనకు ఆనందం కలిగింది. ప్రశ్న దైవాన్ని చూశావా అని ప్రశ్నించినప్పుడు ఆతడు ఒక మామూలు నరేన్ మాత్రమే. ప్రశ్న వేసిన తర్వాత మనుష్యానందం నుంచి మనీషానందం వైపు వెళ్లి మనీషానందం నుంచి గంధర్వానందాన్ని పొంది గంధర్వానందంలో మానవ గంధర్వానందాన్ని అనుభవించి ఆపై దేవగంధర్వానుభూతిని చెంది తర్వాత ప్రజాపితానందాన్ని పొంది పితృపితానందాన్ని పొంది హిరణ్యగర్భానంద స్థితిలో ఒక ఆనంద రేఖ నరేన్ ని తాకిన కారణంగా వివేకము ప్లస్ ఆనందము కలిగిన కారణంగా నరేన్ స్వామి అయినాడు. స్వామి అంటే జ్ఞాని అని అర్థం. వివేకానంద స్వామి అంటే అర్థం అది. ఎట్లా ఈన-ఈయనకి శాంతి పరమ శాంతి ఎట్లా లభించింది అంటే ఆశ్రయించవలసినటువంటి గురువుని ఆశ్రయించాడు. అడగవలసినటువంటి ప్రశ్న వేశాడు. అనుభవించవలసినది మాత్రమే అనుభవించాడు. అనుభూతిని ఆనంద శిఖరం గా మార్చుకున్నాడు. అక్కడ జ్ఞాని అయి వెలిగిపోయినాడు. ఇక సంకల్పాలు, శాస్త్రాలు, భాష, భావం అన్నీ ఆయన కోసం కాచుకొని ఉన్నాయి. ఆయన వెనక పరిగెత్తటం ప్రారంభించినయి. తడుముకునే ప్రశ్న లేదు. లోపల ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోగా తమస్సు మలగిపోగా తపస్సు వెలిగినటువంటి కారణంగా గురువు యొక్క సంపూర్ణ శక్తి వివేకానంద దేహంలో ప్రవేశించింది. అప్పుడు నిజాయితీగా గురుదేవులైనటువంటి రామకృష్ణులు అన్నారు "నరేన్ ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా, ఇన్ని జన్మలుగా, ఇన్ని అవతారాలుగా నేను తీసుకువచ్చినటువంటి తపస్సునంతా నీకు ధారపోసి నేను నిరుపేదనైనాను అయ్యా" అన్నారు. అంటే నిరుపేద అంటే స్వామి కూడా మీకేమి పిలిచినప్పుడల్లా, అడిగినప్పుడల్లా, భజన చేసినప్పుడల్లా, కోరుకున్నప్పుడల్లా, తలచుకున్నప్పుడల్లా పలకటానికి నేనున్నాను. మరి ఇవన్నీ గనక నేను చేయవలసి వస్తే నాకెవరున్నారు? అని చమత్కారంగా ప్రశ్నించారు. అంటే పరమేశ్వరుడిని మించి ఇంకొకడు లేడు. పరమేశ్వర శిఖర స్థాయి ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక జ్ఞాని కావలసినటువంటి వాడికి, పరిపాకం చెందిన వాడికి, maturity level ఒక highest order లో ఉన్నటువంటి వాడికి గురువు ఎదురు చూస్తాడు. అందిస్తాడు. అందించి ఒక ఆనందాన్ని పొందుతాడు. ఆనందానికి నికామ క్షణము అని పేరు. ఏమీ అక్కరలేని స్థితి. ఇదిగో నరేన్ కి గనక ఇదంతా ఇస్తే ప్రపంచానికి ఏం చెప్పాలో చెప్పటానికి అతను ఉన్నాడు కదా అని.
SSSMC · audio

Mahopadesam - 07

Home

Mahopadesam - 07

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 30:08

More in this series

Mahopadesam

9 episodes · 5 hr 14 min

  1. 33 min 1

    Mahopadesam - 01

  2. 31 min 2

    Mahopadesam - 02

  3. 40 min 3

    Mahopadesam - 03

  4. 30 min 4

    Mahopadesam - 04

  5. 33 min 5

    Mahopadesam - 05

  6. 40 min 6

    Mahopadesam - 06

  7. 30 min 7

    Mahopadesam - 07

    Now playing
  8. 34 min 8

    Mahopadesam - 08

  9. 40 min 9

    Mahopadesam - 09