No transcript for this section.
ఓం శ్రీ సాయిరామ్! భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్య సాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్య సాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్య సాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో జాతి మత వర్గ వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్య సాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ స్వామి అనుగ్రహ విశేషంతో శ్రీ సత్య సాయి మహోపదేశం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి కోటి సమితికి స్వామి దివ్యానుగ్రహం నెండుగా లభించు గాక. ఉపదేశం అంటే ఏమిటి? మహోపదేశం అంటే ఏమిటి? అందునా సత్యం అంటే ఏమిటి? అంతా పరిపూర్ణమైనటువంటి విచారణ చేసుకుందాం. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయువీచి సంధ్యా కపిషమ్ములైన జడలల్లిన జిబులలోన తాండవ శ్రీ కమనీయ జాన్హవి ధరించిన దేవుని గేహరూప మాలాకృతి మందహాస కలితా ననమాకు ప్రసన్నమయ్యడున్. శివుడు శివాని, భవుడు భవాని, లక్ష్మీనారాయణులు ఇట్లా రెండుగా అనిపిస్తున్న, రెండుగా కనిపిస్తున్న కానీ ఒక్కటే అయినటువంటి ఏకాత్మకు పూర్ణాత్మకు పరమాత్మకు సంకేతమైనటువంటి సత్య సాయి భగవానునికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మహోపదేశం అంటే ఏమిటి? ఒక మాట. ఉపదేశము అంటే ఒక దీక్షా గురువు ప్రాపంచిక కామ్యసిద్ధి కోసం ఈ మంత్రం చదువుకో బాగుపడతావు కష్టాలు తీరుతాయి అని చెప్తే అది ఉపదేశం. ఇట్లా చేస్తే బాగుంటుందని ఆదర్శం చెప్తే దాని పేరు సందేశం. ఇలాగే చేయాలి అని నిర్ణయిస్తే అది ఆదేశం. ఉపదేశ సందేశ ఆదేశాలకు అతీతంగా మహోపదేశము అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే సాకార సగుణ స్వభావియై స్వరూపియై రూపియై ఒక పంచభౌతిక దేహాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి సాలోక్య సామీప్య సాన్నిధ్యములతో ఉంటూ సాయుజ్యాన్ని అనుగ్రహ వరదానం చేస్తూ ఈ తరానికి జరుగుతున్న కాలానికి మాత్రమే కాక రాబోయేటువంటి సర్వ సంపూర్ణ భవిష్యత్తుకి కూడా మార్గోపదేశనం చేసేటువంటి శుద్ధ చైతన్యంలో నుంచి వచ్చే మాటే మహోపదేశం. కనుకనే సత్య సాయి భగవానుడు సర్వదేవతా అతీత స్వరూపులు కనుక వారి నోటి నుంచి వెలువడిన ప్రతి మాట శుద్ధ చైతన్యంలో నుంచి వచ్చిన తునక. వాక్కు అగ్ని స్వరూపము, వాక్కు బ్రహ్మ స్వరూపము, వాక్కు సత్య స్వరూపము, వాక్కు ధర్మ స్వరూపం. సత్యము అంటే సతతము ఉండేది. సత్యము అంటే మార్పు చెందనిది. సత్యము అంటే జనన మరణాలకు అతీతమైనటువంటిది. సత్యము అంటే లోకమునకు మూలమైనది కానీ లోకాతీతమైనది. ఇటువంటి సత్యం అన్నిటికీ మూలం అంటే సర్వ సృష్టికి సర్వ విశ్వానికి సర్వ ప్రపంచానికి సర్వ సంసారానికి సర్వ వ్యక్తులకి వ్యష్టులకి మూలమైనటువంటి ఏ సత్తువు ఉన్నదో అది నిత్యము సత్యము శాశ్వతము ఆనందము సార్థకము పూర్ణము ధవళము తరళము అది చైతన్యం. ఆ చైతన్యం ఎలా ఉన్నది అంటే జడంలో ఉన్నది. ఇదిగో ఈ మాట్లాడుతున్న ఈ దేహం ఒట్టి కట్టె దానికేం తెలియదు.కానీ మాట్లాడుతుంది మరి మాట్లాడుతున్నది దేహమా అని ప్రశ్నించుకున్నప్పుడు కాదు అని విచారణలు తేలిపోయింది.మాట్లాడిస్తున్నది ఏదో లోపల ఉన్నది గనుక అసలుది అది అని.ఈ కనిపిస్తున్నది మాత్రము కట్టె కనుక, జడం కనుక, ఇనర్ట్ గనుక, మారేది గనుక, ఇది పోయేది గనుక ఇది శాశ్వతం కాదు.నిత్య సత్య శాశ్వతానందమై సర్వ అనుభవాలకు మూలమై సర్వ అనుభూతులకు స్థావరమై సర్వ విభూతికి కేంద్రమై పరమై చరమై ఏదైతే ఉన్నదో అది హృదయ స్థానము మానవ దేహంలోనే కుడి రొమ్మున ఉన్నది గనుక.హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యః మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశమనసా స్వం చిన్వతా మజ్జతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్టో భవత్వం అని సాకల్యంగా సంపూర్ణంగా విశదీకరించిన అటువంటి భగవాన్ రమణులు.నీట నానదు నిప్పున కాలదు అన్నీ తానై ఉన్నదని చెప్పినటువంటి యోగీశ్వర కృష్ణుడికి. అసలు ఉన్నదంతా దైవమే జీవ దేవులు అనబడేటువంటి రెండు స్థితులు మాత్రమేని ఒక అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి శంకర భగవత్పాదులు.ప్రజ్ఞానం సుజ్ఞానం విజ్ఞానం బ్రహ్మైతే మరి అజ్ఞానము బ్రహ్మే కదన్నా అని చెప్పిన జల్లెళ్ళ మూడి అమ్మ.వీళ్ళందరినీ కూడా అనుక్షణం మనం స్మరించాలి ఎందుకంటే వేదోఖిలో ధర్మమూలం అంటే అఖిల ధర్మాలకి మూలం ఏమిటయ్యా అంటే వేదమే అన్నారు.వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు ప్రబంధాలు మానవ జీవితాలు జీవన గ్రంథాలు వీటన్నింటినిండా సత్యమే పరుచుకొని ఉన్నది అనేకానేకమైనటువంటి స్థితిగతులలో రూపాలలో. ఈనాడు రెండవ మహోపదేశంలో రెండవ పార్శ్వమైనటువంటి ధర్మాన్ని మనం విచారణ చేయాలి.వేదం ఏమన్నదంటే మనం కేవలం ధర్మము అన్నాం సత్యం తర్వాత కామ పెట్టాం కానీ వేదం అన్న మాట అది కాదు సత్య ధర్మము అని ఒక మాట వాడింది అది.అతి విచిత్రమైనటువంటి మాట పరిచయం లేని మాట పరిచయం ఎందుకు లేదంటే మనం దాన్ని అధ్యయనం చేయలేదు గనుక.సత్యం వేరు ధర్మం వేరు అనుకుంటున్నాం తల్లి వేరు బిడ్డ వేరు ఎట్లా కాదో సత్యము ధర్మము రెండు కాదు రెండు స్థితులుగా రెండు అవస్థలలో ఒక విచారణకు నోచుకున్నటువంటి ఒక పరమార్థిక చింతనే ధర్మం.అయితే ఈ ధర్మము అనేటువంటిది అంటే ఏ పదమైనా ఏ శబ్దమైనా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మహావట వృక్షం ఒక చిన్న బీజం లో నుంచి వచ్చినట్లుగా విత్తనం లో నుంచే పెద్ద చెట్టు వచ్చినట్లుగా ప్రతి పదము ప్రతి శబ్దము కూడా ఒక ధాతువులో నుంచి వచ్చింది.ధాతువు అంటే జీవం ఉన్నదని అర్థం ధాతువు అంటే మూలము అని అర్థం ధాతువు లేకుండా జీవుడు లేడు.మన మూల ధాతువు ఏది అంటే శుక్ల శోణితాలు అనబడేటువంటి రెండు కణాలు మన ధాతువులు తద్వారా పిండం ఏర్పడి అండం ఏర్పడి పిండమై శిశువై మానవ జన్మ ఎట్లాగైతే ఏర్పడిందో అట్లాగే ఈ ధర్మము అనేటువంటి దానికి మూలము ధ్రువు అనేటువంటి ఒక ధాతువు.ఇది తెలియకపోతే మనకి మిగతాంత ధర్మాన్ని గురించి ఏం తెలియదు కనుకనే ధ్రువు అంటే ఏమిటి అంటే పట్టుకోవలసినది అని ఒక అర్థం మనల్ని పట్టుకునేది అని రెండో అర్థం.దత్తుడికి ఎట్లా విచారణ చేశాం ఎవరు ప్రపంచాన్ని అడాప్ట్ చేసుకుంటారో వాడు దత్తుడు ఎవరు ప్రపంచానికి తనను తాను సమర్పించుకుంటాడో వాడు దత్తుడు అన్నాం.అట్లాగే ఈ ధ్రువు అనేటువంటి ధాతువు పట్టుకోవలసినది పట్టుకున్న తర్వాత వదిలిపెట్టకూడనిది అది ధర్మంగా వేదాలన్నీ కూడా చక్కగా చెప్పినాయి.కనుకనే వేదో అఖిలో మూలం ధర్మం ధర్మమే మూలం.ఈ ధర్మానికి మూలం ఏమిటంటే వేదం కాబట్టి వేదము అంటే తెలుసుకోవలసినది తెలుసుకున్న దానిని అనుభవించవలసినది అనుభవించిన దానిని అనుభూతి చెందవలసినది అనుభూతి నుంచి ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అయినటువంటి అపరిణామ ప్రాప్తమైనటువంటి విభూతి స్థాయికి వెళ్ళటమే అధ్యాత్మ కాబట్టి.ఈ ధర్మం ఎన్ని రకాలు అంటే ఏముందండీ ధర్మం అంటే ధర్మం.ధర్మ అర్థ కామ మోక్ష అందులో ఒకసారి విన్నాం.ధర్మం అంటే ఏముంది నా పని చేయటమే కదా అంటే ధర్మం యొక్క విచారణ ఎట్లాగంటే కల్పవృక్షానికి ఎన్ని కొమ్మలు రెమ్మలు చిగురాకులు తలిరాకులు ఆకులు పండుటాకులు ఎండుటాకులు ఎట్లా ఉన్నాయో పూలు కాయలు పళ్ళు ఎట్లా ఉన్నాయో ఒక నిబద్ధమైన కాండం ఎట్లా ఉన్నదో కంటికి కనరానటువంటి వేళ్ళు ఎలా ఊనుకొని ఉన్నాయో ఇదంతా గనక సమగ్ర విచారణ చేయగలిగితే దాని పేరు ధర్మం.ధర్మం అంటే హానెస్టుగా ఉద్యోగం చేయటం మాత్రమే కాదు నేను చాలా సిన్సియర్ గా ఉన్నాను అంటే అది మాత్రమే ధర్మం కాదు.ఈ ధర్మం మొట్టమొదటిసారిగా నిజానికి భగవద్గీతలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం.ఏ ధర్మాన్ని అధర్మాన్ని రెండు శబ్దాలని యోగీశ్వర కృష్ణుడు అనగా వ్యాసులవారు దానిని గ్రంథస్తం చేశారు.కృష్ణుడు అనకపోతే వ్యాసుడు రాసి ఉండేవాడు కాదు కృష్ణుడు ఎలా అన్నాడంటే ధర్మానికి హాని గ్లాని జరిగినప్పుడు నేను వచ్చి అధర్మాన్ని సవరించి సవరణలు చేసి మార్పు చేసి మళ్ళీ ఆ జాతికి కావలసిన రీతిలో ధర్మ ప్రబోధం చేయటం కోసమే నేను అప్పుడప్పుడు వస్తుంటాను అన్నాడు.అలాగే సంభవామి యుగే యుగే.పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే యుగానికి ఒక్కసారి వస్తాను అని కాదు యుగము అంటే కనురెప్ప ఎత్తి కనురెప్ప దింపి ఆ కాలం ఏదుందో దాని పేరు యుగం. ఒక్క క్షణం, ఒక్క నిమిషం ఏ నిమిషమై ఉన్నదో అది ఆ క్షణం కనుక పరమాత్మ ఎప్పుడొస్తాడు? మళ్ళీ ఎప్పుడొస్తాడు? అప్పుడు ఎప్పుడొచ్చాడు? అని కొన్ని వ్యర్థమైన ప్రశ్నలు మన మనసును తొలుస్తు ఉంటాయి. ఆయన ఎప్పుడొస్తాడు అంటే మనలో గనుక అధర్మ ప్రవృత్తులు పెరిగినట్లయితే, మనం కనుక చేయవలసిన పని సక్రమంగా చేయకపోయినట్లయితే, మనం చేస్తున్న పనిలో నుంచి లాభాన్ని, కీర్తిని ఆశించినట్లయితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎక్కడ అవుతాడు అని ముందు నీలో అవుతాడు. యుగే యుగే వచ్చి నీ ఆలోచన సక్రమంగా లేదు భగవంతుని గురించి మాట్లాడటానికి నీవు సిద్ధంగా ఉండాలి. భగవంతున్ని చూడటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. భగవత్ తత్వాన్ని విచారధారగా అనుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ సిద్ధత్వం కనుక జారిపోయేటువంటి వేళ ఏర్పడినట్లయితే నేను వచ్చి నిన్ను ప్రబుద్ధమానం చేస్తాను. నిన్ను ప్రచోదితం చేస్తాను అంటే మేల్కొలుపుతాను, లేపుతాను, పరిగెత్తిస్తాను అందుకునే దాకా నీతో ఉంటాను. అందినంత వరకు నీ సమయం నీతోనే కూడి ఉంటాను. కాబట్టి యోగము అంటే ఏవో రెండు పదార్థాల కలయిక యోగం కాదు. జీవాత్మ పరమాత్మతో కూడినదే యోగంగా భావన చేసి ఆ యోగానికి ఒక సోపానం, ఒక మంచి రాచబాట వేదాలే వేసినయి. ఆ వేదాలు ఎలా వేసినయి అంటే ధర్మము అనేటువంటి ఒక మార్గాన్ని సూచించినయి. ఈ ధర్మ మార్గం మనం అనుకున్నట్లే మనం పట్టుకోవలసిన మార్గం. అందుకనే స్వామి తమ అవతార కాండలో పట్టినదేదో పట్టనే పట్టితివి పట్టు విడునందాక అట్టే ఉండు అన్నారు. మామూలుగా ఏదో పట్టుకున్నాం, స్వామి పాదాలు పట్టుకున్నాం, స్వామి చేతులు పట్టుకున్నాం, స్వామి లోకి వచ్చేసాం, స్వామి దగ్గర ఉండిపోయినాం. ఏ ఇక్కడుంటే పర్వాలేదు అది కాదు స్వామి చెప్పింది. పట్టుకోవలసినది ఏది అంటే ధర్మాన్నే పట్టుకో. ఆ ధర్మం నాకంటే భిన్నం కాదు. నేను ధర్మం ఒకటే. నిజానికి అనుభవించగలిగితే నీవు ధర్మము ఒకటే అన్నారు స్వామి. ఆ స్థాయికి వెళ్ళాలి. అయితే ఈ ధర్మం అదే యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో ఒక చిన్న హెచ్చరిక చేశాడు సాధకులకి. మనం దానధర్మాలన్నీ చేస్తూ ఉంటాం, యాగాలు చేస్తుంటాం, హోమాలు చేస్తూ ఉంటాం, రోజూ ఒక నియమంగా ఓ పిడికెడు బియ్యం పక్కన పెడుతూ ఉంటాం. ఇదంతా పుణ్య కార్యమే కానీ నిజానికి ధర్మ కార్యం కాదన్నారు. పుణ్య కార్యము వేరు, ధర్మ కార్యం వేరు. పుణ్య కార్యంలో మనం బ్యాంకులో అకౌంట్ లో మనకు వచ్చిన డబ్బు రోజూ వెళ్లి జమ చేయటం లాంటిది. జమ చేశాం గనుక మన అకౌంట్ అంతా కూడా బాగా సమృద్ధంగా ఉంది గనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవటానికి వీలుంటుంది గనుక పుణ్య కార్యాలు చేస్తాం. ధర్మ కార్యాలు చేస్తే డ్రా చేయటానికే ఉండదు ఉన్నదంతా అయిపోతుంది. తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం అది దాని అర్థం. పుణ్యం చేస్తే మా బేరం చెడిపోతుందని ఎవరూ చెప్పలే. ధర్మం చేస్తే మాత్రం పోతుంది అన్నారు. అందుకనే ఆయన ఏమన్నారంటే స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నాడు. స్వధర్మం చేయాలి అంటే నేను నా వృత్తిలో నేను నా ధర్మాన్ని నిర్వర్తించాలి అని స్థూల అర్థం. అసలు అన్ని ధర్మాలు, అన్ని అలవాట్లు, అన్ని ఆచారాలు పక్కన పెడితే మనందరికీ కలిపి ఒక్క ధర్మం ఉంది. అంటే జీవుడికి. ఏమిటా ధర్మం అంటే తనను తాను ఎరిగి ఎరుక. తనను తాను తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోకుండా అన్నీ తెలుసుకున్న దండగే అన్నారు రమణ మహర్షి. స్వామి కూడా అదే చెప్పారు. ఆత్మ తత్వాన్ని ఎరుగక పోయినట్లయితే మరొక వస్తువు యొక్క గుణ విశేషాలను గనుక అనుకుంటూ ఉన్నట్లయితే ఏం ప్రయోజనం బంగారు నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నీవు ఆత్మ స్వరూపుడిగా ఈ ప్రపంచంలో ఉంటావు. అందుకనే ఎనభై ఆరు సంవత్సరాల సత్యసాయి భగవానుడి అవనీ సంచారంలో డెభై రెండు సంవత్సరాలు బోధాకృతిగా ఉంటే, బోధ చేస్తూ ఉంటే, అనేక సందర్భాలలో సంబోధన చేస్తూ ఉంటే, ఆ సంబోధనలో స్వామి ఎన్నడూ కూడా ఎవరినీ కూడా పేరెత్తి పలకరించలేదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా ఆ సంబోధన వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే కనిపిస్తున్న ఈ భాష్యంతో కానీ, లోపల సంచారం చేస్తున్న మన మనసుతో కానీ, మన భావనా బలిమితో కానీ, మన కలిమి యొక్క బలిమి చేత గానీ పరమాత్మని మనం అందుకోలేము. దానికి పరమాత్మకి సంబంధం లేదు. కానీ ఇవన్నీ తెగిపోయినా, స్థితిగతులు మారినా, కష్టాల కడలిలో మనం మునకలు వేస్తూ ఉన్నా, సుఖాల అలలపై తేలుతూ ఉన్నా, ఊహల మేఘాలపై పారాడుతున్నా, ఒక్క బంధం మాత్రం తెగకుండా ఉన్నది అదే నిత్య సత్య శాశ్వతమైనటువంటి బంధం అది ఆత్మ బంధం. ఈ ఆత్మ బంధం ఎలా ఉన్నదంటే నిన్న విచారణ చేసినట్లుగా సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి పుట్టిన వెన్నెల దారాలు ఎట్లాగైతే భిన్నం కావో, అట్లాగే పరమాత్మ సాయి నుంచి పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ జీవుల అందరికీ కూడా ఒక సోర్స్ తో మాత్రం సంబంధం ఉన్నది. ఆ సోర్స్ కి గాడ్ అని పేరు పెట్టండి, ఫినామినన్ అని పేరు పెట్టండి, మూలము అనండి, పరమాత్మ అనండి, పరాశక్తి అనండి, పరమహంస అనండి, అంత అదేననండి, బ్రహ్మ పదార్థం అనండి, ఏదైతే ఏం ఎట్లా పిలిస్తే ఏం మూలం మాత్రం ఒక్కటే.ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కడై తోచు పోలిక అన్నాడు. భగవతం లో పోతనామాత్యుడు సూర్యుడు ఒక్కడే పోలికలు వేరు తోచటం వేరు అనుభవాలు వేరు ఒకడికి వేడి కావాలి రెండో వాడికి వేడి అక్కరలేదు ఒక్కడికి వెలుగు కావాలి రెండో వాడికి అక్కరలేదు సర్వ ప్రకృతికి చైతన్యం కావాలి కొన్ని చోట్ల ఎండ వస్తే భరించలేని అటువంటి స్థితి కానీ ఎవరెవరు ఎంతెంత అందుకోవలసి ఉన్నదో ఎవరెవరు ఎంతెంత గా అనుభవించవలసి ఉన్నదో దానిని ఇవ్వటానికి సర్వదా సన్నద్ధుడైనటువంటి పూర్ణ జ్యోతిర్మయ మండలమైనటువంటి సూర్యుని వలె ఒక సూర్యుడే ఇంత చేస్తే ఆ సూర్యుడికి శక్తిని ఇచ్చ టువంటి మూలమైనటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే నిశ్చలంగా ఉన్నాడు సత్యంగా ఉన్నాడు కానీ ధర్మ ప్రబోధం చేస్తున్నాడు ధర్మం ఏమిటో సూచిస్తూ ఉన్నాడు అందుకనే వేదవ్యాసుల వారు అన్నీ రాశారు నాలుగు వేదాలు పూర్తి చేశారు సామవేదం ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం తర్వాత బ్రహ్మసూత్రాలు భగవద్గీత విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం అన్నీ రాయవలసినవన్నీ రాశారు రాశారు రాశారు ఆయనకు అనిపించింది ఇదంతా బాగా పండితులైన వారికి శాస్త్రాల మీద మక్కువ ఉన్నటువంటి వారికి అర్థం చేసుకోగలిగినటువంటి వారికి వీరందరికీ చేశానే మరి ఈ లోకాన్ని గురించి చెప్పలేదే అని అనుకున్నారు అనుకున్నప్పుడు ధర్మశాస్త్రంగా నీతి శాస్త్రంగా లోక శాస్త్రంగా భౌతిక శాస్త్రంగా పదార్థ శాస్త్రంగా మానవ మనస్తత్వ శాస్త్రంగా పంచమ వేదాన్ని సృష్టించాడు ఆ పంచమ వేదమే భారతం ఆ భారతము అంటే భగవంతుని యందు రతి కలిగినటువంటి ప్రతి వ్యక్తి చదవదగినటువంటిది భారతం. ఆ భగవంతుడు మళ్ళీ ఎవరంటే భా అంటే భగవంతుడు అని ఒక అర్థం అయితే భా అంటే వెలుగు అని ఒక అర్థం ఆ వెలుగు ఏమిటంటే సత్యసాయి భగవానుడు అన్నటువంటి మాట the end of education is not character alone it is an illumination అన్నారాయన. ఆ illumination ఏమిటంటే వెలుగు చిట్టచివర అక్కడ tunnel చివర ఉందది ఎలా ఉన్నదంటే ఒక చిన్న చుక్క వలె కనిపిస్తున్నది ఒక వెలుగు రవ్వ వలె కనిపిస్తున్నది ఆ tunnel లో ప్రయాణం చేస్తూ చేస్తూ వెళితే ఆ వెలుగు మనం అయిపోతాం గనుక ఆ వెలుగు మూలంలోకి మనం వెళ్ళాలి అందుకనే విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో ఆ పద్యం చెప్పారు వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమాద్ధ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వము నందున వేరు చోట లేవు అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తి కిన్ వెలుగుల నిధి కిన్ గురు ఉత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించెదన్. ఆ వెలుగుకి నమస్కారం చేయాలి దాన్నే పోతనామాత్యుడు అన్నాడు ఆవలి గట్టున ఉన్న పెలు వెలుగులోకి వెళ్ళాలి నేను అన్నాడు ఈ చిన్న వెలుగు పెను వెలుగులోకి వెళ్ళటమే ప్రస్థానం దానికి మార్గం ఏమిటి అని విచారణ చేస్తే ధర్మమే మార్గం. ఈ ధర్మం వేదాలు చెప్పినయి ఉపనిషత్తులు చెప్పినయి భగవద్గీత చెప్పినయి పట్టుకో పట్టుకో పట్టుకో అన్నయి పట్టుకున్న వానిని అంటిపెట్టుకో మని చెప్పినయి సత్యసాయి భగవానుడి మహోపదేశంలో ఈ ధర్మం గనక బంగారు ఆచరణకి నోచుకోకపోయిన ట్లయితే దాచి పెట్టుకున్న దంతా కూడా వస్తువు ఎలా పాచిపట్టి పోతుందో అలాగే ధర్మాన్ని గురించి ఎంత తత్వ విచారణ చేసినా నీవు ధర్మాచరణాసక్తుడివి కావాలి నీవు జీవించినటువంటి ప్రతి క్షణము కూడా ధర్మబద్ధం కావాలి అలాగే కర్మబద్ధం కావాలి ఎందుకంటే కర్మానుబంధి మనుష్య లోకే మనందరికీ కర్మలు ఉన్నాయి నేను retire అయిపోయాను ఏం చేయను అనటానికి వీలు లేదట ఎప్పటిదాకా చేయాలంటే అన్ని కర్మలు ఉడిగిపోయినా ముగిసిపోయినా ఇక చేయటానికేన్ లేదని ఒక నిస్సత్తువ ఒక వృద్ధాప్యం ఒక అలసత్వం ఒక నిర్వీర్యం శరీరాన్ని ఆవహించిన ఆ కనురెప్ప శాశ్వతంగా వాలే దాకా ఒక కర్మ మాత్రం మిగిలి ఉన్నది అది సంతత సాయి రామా నామస్మరణాంచితమైనటువంటి నామస్మరణం అందుకనే నాస్తి నాస్తి కలౌ నాస్తి హరి నామ వినా గతిహి కలియుగంలో నువ్వు యజ్ఞం చేయలేవు యాగం చేయలేవు యోగం చేయలేవు ధ్యానం చేయలేవు చదవలేవు అనలేవు అనలేవు వినలేవు మరి ఏం చేయాలయ్యా ఆ ఇగో నామస్మరణ చేసుకో నీకు ముక్తి వస్తుంది అన్నారు అంటే అది first కాదు అది last ఇవన్నీ చేయాలనే చేయలేము కాబట్టి ఆ ఒకటి పట్టుకుందాం అని కాకుండా ఆ చిట్టచివర కనీసం అదైనా పట్టుకున్నట్లయితే మనసు శుద్ధి చెంది నాడీ మండలం శుద్ధి చెంది నాద శ్రవణానుభవం కలిగి పరమేశ్వరుని తనలో తాను దర్శించుకోగలిగినటువంటి ఒక ఉదాత్త భూమిక కలుగుతుంది గనుక నామస్మరణ కలియుగ మానవుడికి అది విహితమైంది నిర్దేశింపబడింది నిజానికి హాయిగా ఆచరించదగినటువంటిది సరే. సత్య ధర్మము అనేటువంటి ఒక మాట మొదట్లో మనం అనుకున్నాం ఏమిటా సత్య ధర్మం సత్యాన్ని ధర్మంగా మార్చుకోవటమా సత్య ధర్మం అనేటువంటి దాన్ని పట్టుకొని నడవటమా ప్రశ్న సత్య ధర్మము అంటే మనం ఇవ్వాల ప్రపంచంలో మన తరం ఈ జరుగుతున్నటువంటి సమకాలీన ప్రపంచాన్ని ఒకసారి కనురెప్ప ఎత్తి జాగ్రత్తగా చూసినట్లయితే సమాజం అంతా పతనం అయిపోయినట్లు సమాజం అంతా ఎక్కడో దిగజారి పోతున్నట్లు విలువలు అన్నీ కూడా ఎక్కడో జారిపోయినట్లు మనకి అనిపించి బాధ కూడా కలుగుతూ ఉన్నది.పైకి అది ఎట్లా కనిపించినా ఈ పరిణామం అనివార్యం ఇది అవాస్తవం కాదు ఇది ఇలా ఈ time లో ఇట్లాగే జరుగుతుంది. రావణుడే లేకపోతే రాముడు రావలసిన అవసరం ఏముంది ఇక్కడ? కంసుడు, కౌరవులు లేకపోతే అసలు శ్రీకృష్ణ పరమాత్మ రావాల్సిన అవసరం ఆయనకే ఉన్నది. అలాగే ఈ కలియుగంలో, ఈ సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనాచారాన్ని సరిదిద్దటానికి పరమేశ్వరుడు సర్వదేవతా అతీత స్వరూపుడై, సత్యాచార్యుడై, సత్యబోధకుడై, "అహం సత్యబోధకః" అన్నటువంటి ఒక ప్రమాణానుసారమే స్వామి యొక్క అవతారం సాగింది. ప్రస్తుతం ఆగిందే తప్ప శాశ్వతంగా అది ఆగింది కాదు. కామా అది. ఇది నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తూ ఉన్నటువంటి వేళ, ఈ సత్య ధర్మాన్ని, సత్యంతో కూడినటువంటి ధర్మాన్ని ఆచరించడమంటే ఏమిటంటే మనకంటే ముందు ఉన్నటువంటి మహాత్ములంతా అనేకమైనటువంటి విషయాలకు మనకు బోధ చేశారు. ఎలా చేశారు? మనలాంటి జీవితమే గడిపి ఉంటే వాళ్ళకి అన్ని ఉదాత్త భావనలు ఉండి ఉండేవి కాదు. మూడు యుగాలు దాగి-దాటిపోయినాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం సాగిపోయినాయి. కాల గర్భంలోకి వెళ్లిపోయినాయి. కానీ కృతయుగం ఒక సత్యాన్ని, త్రేతాయుగం ఒక ధర్మాన్ని, ద్వాపర యుగం ఒక శాంతి ప్రేమని ఈ ప్రపంచానికి కలియుగ మానవుడికి అందించినాయి. త్రేతలో ఉన్నటువంటి మానవుడు మాత్రం సత్యాన్ని పట్టుకోగలిగాడు. ఎందుకంటే ద్వాపర త్రేత తర్వాత వచ్చింది గనుక అనుభవం ఇంకా కాలే. వారికి ముందు ఉన్నటువంటి కాలమంతా ఏది అంటే కృతయుగము. అంటే చేయబడిన యుగం. కృతయుగం ఎవరు చేశారు ఆ యుగాన్ని అంటే తపస్సులు, ముముక్షువులు, జ్ఞానులు, మూణులు, మౌనులు. వీళ్లంతా కూడా యజ్ఞయాగాదులు అనేవి లేకుండా కేవల తపస్స్వాధ్యాయంలో, మౌనంలో తమలో తాము నిలకడ చెంది, సర్వ ప్రకృతిని పరమాత్మగా భావించి, ఎక్కడ ఉన్నటువంటి నానానాద సందోహాన్నంతా కూడా నాద భూమికలో నిలకడ చెందించి, దానిని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి యుగం కాబట్టి అది కృతయుగంగా చెప్పబడింది. అందుకనే వేదాలని రాక్షసులు అనబడే వాళ్ళు దొంగిలించి ఎక్కడ దాచారయ్యా అంటే నీళ్ళల్లో దాచారు. వీళ్ళు రాలేరు, ఈదలేరు, దూకలేరు. వీళ్ళకి అది గీత తెలుసునేమో గానీ ఈత తెలియదనుకొని వెళ్లారు. మరి ఈత తెలిసిన వాడు, గీత తెలిసిన వాడు ఒకడున్నాడుగా. ఆయనే శ్రీమత్స్య వరాహ, వటు వరాహ నరసింహ విరూపాలుగా వచ్చి కృతయుగాన్ని పరిసమాప్తం చేశాడు. అక్కడ జరిగినదంతా ఏమిటంటే కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి చాలా limited version of the manifestation of the ultimate. ఏ పరమాత్మ అనేకమైన, సుదీర్ఘమైన కాలం ఇక్కడ లేడు. వచ్చాడు, పని పూర్తి చేశాడు, మళ్ళీ unmanifest అయినాడు. తన మూలంలోకి తాను వెళ్ళాడు. అంటే కేవలం ఒక కార్యం కోసం. అందులో దుష్ట సంహారకాండ లేదు. ఎప్పటిదాకా? హిరణ్యకశిపుడి వధ దాకా. అప్పటిదాకా జాగి-సాగినదంతా కూడా ధర్మం ఎవరైతే నీళ్ళల్లో పడేస్తున్నారో, ధర్మాన్ని ఎవరైతే ద-దారి నుంచి పక్కకి తొలగిస్తున్నారో, అటువంటి వాళ్ళు ఒకడు, ఇద్దరు ఉన్నా వాళ్ళిద్దరినీ ఏరి పారేయటానికే పరమాత్మ వచ్చాడు. పారేసే వాళ్ళు ఎక్కువై పట్టుకునే వాళ్ళు తక్కువైతే ఏం చేయాలి అని స్వామిని అడిగారు ఓ ప్రశ్న. చాలా చమత్కారంగా. మహాత్ములంతా మాట్లాడిన దాంట్లో మహితోక్తిలో కూడా ఒక హాస్యం ఉంటుంది. "స్వామీ, ఇవాళ చాలామంది భగవాన్ భగవాన్ అని అనిపించుకుంటూ తిరుగుతున్నారే, ఏమిటి ఇంతమంది భగవాన్లు ఏమిటి?" అని అంటే "ఏం లేదు బంగారు population నుంచి పరమాత్మ. population పెరిగింది, పరమాత్మలు కూడా ఎక్కువ కావలసి వచ్చారు" అని దాన్ని చమత్కరించారు. అలాగే త్రేతాయుగానికి వచ్చేప్పటికీ తొంభై తొమ్మిది మంది రాజులు త్రేతాయుగంలో ఇక్ష్వాకు రాజులు పాలన చేశారు. అందులో అరవైనాలుగవ రాజు ఎవరు అంటే రాముడు. అంటే రాముడి కంటే ముందు అరవై మూడు మంది రాజులు వచ్చారన్నమాట. వాళ్ళు వాళ్ళల్లో ఒకణ్ణి మనం గుర్తు పెట్టుకున్నట్లయితే సత్య హరిశ్చంద్రుడు అని విన్నాం. కదా. అంటే కృతయుగం నాటి సత్యాన్ని ఈ హరిశ్చంద్రుడు అనబడేటువంటి ఇక్ష్వాకు రాజు వరకు సత్యం కాపాడబడింది. అయితే ఆ సత్యం వేరు. అది లౌకికమైన సత్యం. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని, బిడ్డని, భార్యని, రాజ్యాన్ని, సంపదని, సుఖాన్ని అన్నింటినీ వదులుకోవటానికి సిద్ధపడ్డటువంటి ఒక ధీశక్తితో కూడినటువంటి వ్యవస్థగా హరిశ్చంద్రుడు మనకి నిలబడిపోయినాడు. ఈ సత్యం వేరు, ఆ సత్యం వేరు. కానీ శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు "రామో విగ్రహవాన్ ధర్మః" అని రాముని గురించి ఒక మాట ఉంది. రాముణ్ణి "రామో విగ్రహవాన్ ధర్మః" అన్నది ఎవరంటే ద్వాపరయుగం వాళ్ళు. మరి వాల్మీకి బృహత్తరమైనటువంటి, మహాద్భుతమైన ఆదికావ్యం రాశాడే, రామాయణం రాశాడే, కేవలం దర్శనం ద్వారా రాశాడే, ఆయన ఏమన్నాడు అని రాముణ్ణి. రాముణ్ణి ఏమన్నాడంటే సత్యవీరుడు, సత్యపరాక్రముడు అన్నాడు. ధర్మవీరుడు అనలే, సత్యవీరుడు, సత్యపరాక్రముడు అన్నాడు. అంటే సత్యాన్ని ఆశ్రయించి, ధర్మాన్ని పట్టుకొని, సత్య ధర్మాలని ఆచరించిన కారణంగా రాముడు పూర్ణ మానవుడిగా, పురుషోత్తముడుగా యుగం-యుగాలతో కూడా ఆయన పూజనీయుడయినాడు అని అర్థం. కనుక
SSSMC · audio
Mahopadesam - 04
Mahopadesam - 04
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 30:15
More in this series