No transcript for this section.
ఓం శ్రీ సాయిరాం! భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్య సాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్య సాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. September మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్య సాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో జాతి మత వర్గ వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్య సాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మాన్ని గనక మనం ఆచరించినట్లయితే దాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని మనమేం రక్షిస్తాం? ఆచరించగలిగినట్లయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కనుక నైతికమైనటువంటి విలువలు గోడమీదో నీటిమీద రాతలు మాత్రం కాదు. ఆ నైతికమైనటువంటి ఆ మాటలన్నీ కూడా ఋషి వాక్యాలు గనుక అపౌరుషేయాలు పౌరుషేయాలు అయినాయి గనుక ఎవరో అనుభవించి ఎవరో దర్శించి ప్రాపంచికమైనటువంటి మహా పరిసత్యాలుగా ఈ ప్రపంచానికి ఆవిష్కరించారు గనుక వాటిని ఒక్కసారి ఆగి అధ్యయనం చేసి మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేకానేక సన్నివేశాలతో పోల్చుకొని సమాధానం గనుక పొందగలిగితే అది ధర్మాచరణ. అంతేకాదు కష్టంలో ఉన్నవాడిని, నష్టంలో ఉన్నవాడిని, బలహీనుడిని, నిర్వీర్యుడిని, నిరాశక్తుడిని, ప్రమత్తత లేనివాడిని వీళ్లందరినీ కూడా కాచుకోవలసినటువంటి బాధ్యత ధర్మంలో ఒక భాగం. అందుకనే నిన్న మనం అనుకున్నాం కృతయుగం అంతా కూడా అస్థిగతం. త్రేతాయుగం అంతా మాంసగతం. ద్వాపర అంతా రక్తగతం. కలియుగం అంతా అన్నగతం. ఇక్కడ జీవుడికి మనం చేయగలిగిన ఉత్తమోత్తమమైన సేవ ఏది అంటే అన్నం పెట్టటమే. అన్నం పెట్టటం ఏమి అధ్యాత్మ అంటే అసలు అన్నం పెట్టగలగటమే అధ్యాత్మ. ఆ అన్నం ఎక్కడినుంచి సమృద్ధంగా మనం సంపాదించి ధర్మంలో నుంచి సంపాదించి ఎందుకంటే పిడికెడు అన్నం గనక పెడితే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలన్నీ కూడా ఉవ్వెత్తున ప్రతి జీవి యందు కూడా ప్రబుద్ధమానమవుతాయి గనుక వాడి యందున్న అన్ని కోశాలు కూడా పరమోత్కృష్ట స్థాయికి వెళ్లేటువంటి దిశగా మనం ఈ అన్నాన్ని దానం చేయకూడదు. అన్నాన్ని వితరణం చేయకూడదు. ప్రసాద వితరణం వితరణం అన్నా దానం అన్నా దానానికి అందమైన మాట వితరణం. అది వితరణమూ కాదు దానమూ కాదు. సత్య సాయి భగవానుడు దానికి పెట్టిన పేరు నారాయణ సేవ. అవతల జీవిలో ఉన్నటువంటి నారాయణుడికి నీవు ఈ అన్నం ద్వారా ఈ ముద్ద ద్వారా సేవ చెయ్. అందుకే జల్లెడమూడి అమ్మ ఓ గొప్ప మాట అన్నది. అన్నం పెట్టటం కాదు నాన్నా పెట్టుకోవటం చాలా అవసరం అన్నది. పెట్టటం వేరు పెట్టుకోవటం వేరు. ఎవరో వచ్చారు చూడు వాకిట్లో పనిమనిషికి చెప్తాం. వెళ్ళి కాస్త అన్నం పెట్టురా అంటాం. పుణ్యం ఎవరికి అంటే పెట్టిన పనిమనిషికే మనక్కాదు. ఆమె పెట్టింది ఆమె ఆనందాన్ని పొందిందో చెయ్యాలి గనుక చేసిందో యాంత్రికంగా చేసిందో అందుకున్న వాడు అందుకున్న వాడు వెళ్ళిపోయినాడు. కానీ పెట్టుకుంటే మనంతట మనమే పెట్టుకోగలిగితే మనంతట మనమే సేవ చేసుకోగలిగితే ఆ ఆనందమే ఆనందం. అందుకనే మనం ఎవరి నుంచైనా ఏదైనా వస్తువును పొందినప్పుడు మన మనస్సు కించపడుతుంది. మనం ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు ఆనందం కలుగుతుంది. ఎందుకని కలుగుతున్నది అంటే పుచ్చుకోవటంలో ఆనందం లేదు ఇచ్చుకోవటంలోనే ఆనందం ఉన్నది. అది అన్నం బహుకుర్వీత అని ఉపనిషత్ వాక్యం ప్రమాణంగా సత్య సాయి భగవానుడు ఈ ప్రపంచానికి అన్నం పెట్టమన్నారు పెట్టుకోమన్నారు. ఈ అన్నం ఎలా పెట్టుకోవాలి అంటే గాంధీ మహాత్ముడు మహాత్ముడే గానీ ఒక చిన్న పొరపాటు మాట దరిద్ర నారాయణుడు అన్నారు. స్వామి ఒప్పుకోలేదు. నారాయణుడు దరిద్రుడు ఎట్లా అవుతాడు? నారాయణుడు శ్రీనాథుడు. ఈ ప్రపంచం మొత్తానికి నారాయణ సేవ చేయమన్నారు దరిద్ర నారాయణ సేవ అనే మాట ప్రపంచంలో నుంచి వదిలిపెట్టమన్నారు సత్య సాయి భగవానుడు. నిజం. ఎందుకంటే నీలో నాలో చీమలో దోమలో పరబ్రహ్మంలో ఉన్నటువంటి ఆ చైతన్యం అంతా ఒకటైనప్పుడు దరిద్రం ఎక్కడున్నది? ఆగర్భం శ్రీమంతత్వం ఎక్కడున్నది? లేనే లేదే. ఉన్నదంతా ఒక్కటే. నిఖిలమై నిశ్చలమై అచంచలమై అతులమై అనన్యమై పూర్ణమై ఎవరి యందు చైతన్య ప్రవాహంగా ఉన్నదో ఆ చైతన్య భూమికలో నెలకొరి చెందినటువంటి జీవుడు గనుక వ్యర్థ పదాలు వాడుతూ వెళ్లినట్లయితే మహాత్ముడు కాగలడా ప్రశ్నించుకోవాలి. మహాత్ముడు అంటే తన యందున్న ఆత్మను తాను గమనించి తదనుగుణంగా జీవించిన వాడు. పరమాత్మ ఎవరో తెలుసునా? వీటన్నింటినీనియంత్రించగలిగిన వాడు వీటన్నింటిని నడిపించగలిగిన వాడు అన్నిటియందు అంతటా తానే ఉన్నానన్నటువంటి ఒక స్పృహని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని దృఢంగా పాదుకొలప గలిగిన వాడే పరమాత్మ అవుతాడు గనుక పరమాత్మ వాక్కులు మొట్టమొదట అనుకున్నాం. అవన్నీ కూడా శుద్ధ చైతన్యంలో నుంచి రావలసినవే. పుస్తకాలలో నుంచి వస్తే అక్కడిదిక్కడి చెప్పటానికి మనమెందుకు? అక్కడక్కడ ఉన్నాయిగా! చదవటం అంటూ గనక జరిగితే అక్కడికి వెళితే దొరుకుతాయి. కానీ జీవితాన్ని చ-చదవాలి. ధర్మ మార్గంలో జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. అనేక ధర్మాలలో సామాజిక ధర్మాన్ని కూడా దాటిన తర్వాత ప్రతి జీవుడికి కూడా కులధర్మం ఉన్నది. మతం ఉన్నవాడు లేడో ఉన్నాడో లేడో తెలియదు గాని కులం లేని వాడు లేడు. కదా. కానీ ఆ కులానికి కూడా ఒక ధర్మం ఉన్నది. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క సర్వ సమ్మతమైన, సర్వ జనహితమైనటువంటి ఒక దివ్య బోధ, మహోపదేశం ఏమిటి అంటే, "నీవు హిందువుగా గనక పుట్టినట్లయితే, హిందూ మతాన్నో, హిందూ ధర్మాన్నో ఆశ్రయించినట్లయితే కడదాకా హిందువుగానే జీవించు. నీవు క్రిస్టియన్ వి గనక అయినట్లయితే, నీ ధర్మాన్ని, క్రైస్తవ ధర్మాన్ని పరిపూర్ణంగా నీవు పాటించు." మతి ఏమి చె-- మతి ఎప్పుడైనా చెడు చెప్పిందా? మానవుడి మతి చెడ్డదే గాని మతం ఎప్పుడూ చెడలేదన్నారు. కాబట్టి మతము గాని, కులము గాని, గుణము గాని, గణము గాని జీవుడు ధర్మ బుద్ధితో దానిని విచారణ చేసినట్లయితే మహాభారతంలో కౌశికుడి కథ ఉన్నది. ఆ కౌశికుడు మహా తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడంటే తన శరీరంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగనాడులు, దానిలో నుంచి జ్వాలలు శిఖలై బయటకు వచ్చేట్లుగా, పొగలు సెగలై వచ్చేట్లుగా యోగాగ్నులు రగులుతున్నటువంటి వేళ, అది ముగిసినటువంటి వేళ, ఇక్కడికి తపస్సు చాలు అనుకుంటున్నాడు, ఇలా లేవబోయినాడు. ఆ చెట్టు పైనుంచి ఒక పక్షి ఆయన ఒంటిమీద రెట్ట వేసింది. చాలా తపస్సు చేశాడుగా! రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు యోగ-యోగాగ్నుల్లో తప్తమై ఉన్నాయిగా! కానీ, 'ఇంతటి నా మీద ఈ రెట్ట వేసినది ఎవరు?' అని పైకి చూశాడు. భస్మం అయిపోయింది. పిట్ట అక్కడే మాడిపోయి, రాలిపోయి ఆయన కళ్ళ ముందు పడిపోయింది. 'అది! నా తపశ్శక్తి.' అనుకొని బయలుదేరాడు. బయలుదేరి జ్ఞాని గానివ్వండి, మరొకడు గానివ్వండి, లోపల ఆత్మారాముడు వాడు ఆ time రాగానే "నాకేం పెడతావు?" అని అడుగుతాడుగా. మనల్ని కూడా అడుగుతాడుగా eight thirty కి. అలాగే ఆ time కి ఆ గ్రామానికి వెళ్ళగానే ఆయనకి ఆకలి వేసింది. ఆకలి జీవలక్షణం. ఆకలి దేహపరం. ఒక ఇంటి ముందు నుంచున్నాడు. ఇంకా ఈ ఇళ్ల ముందు ఉండటం, అడగటం కొత్త. అప్పుడేగా తపస్సులో నుంచి బయటకు వచ్చాడు. "భవతి భిక్షాందేహి" అన్నాడు. ఉలుకూ లేదు, పలుకూ లేదు. ఇంట్లో మాత్రం ఎవరో ఉన్నట్లే అలికిడిగా ఉంది. మళ్ళీ రెండోసారి అరిచాడు. మూడోసారి అరిచాడు. ఈ మూడోసారి అయిన తర్వాత కొంత సమయానికి ఆమె నెమ్మదిగా లోపల్నుంచి స్వామి చెప్పిన ఆ గృహలక్ష్మి బయటకు వచ్చింది. ఎలా వచ్చిందంటే పళ్ళెరం నిండా పదార్థాలు పెట్టుకొని వచ్చి, "నా భర్త పొలంలో పనిచేసి వచ్చి అలసిపోయి ఉన్నటువంటి వేళ, ఆయనకి భోజనం పెట్టి కాస్త సేద తీర్చే ప్రయత్నంలో నేనున్నాను. అయినా కన్నెర్ర చేస్తే కాలిపోవటానికి చెట్టు మీద పెట్టను కాదు కౌశికా." అన్నది. ఆశ్చర్యపోయినాడు కౌశికుడు. 'ఈ ఇల్లాలు, ఎక్కడో మూల గూర్చున్న ఇల్లాలు, సంబంధమే లేదే, అది అరణ్యం, ఇదేమో జనావాసం. ఈమె తన ఇంట్లో కూర్చుని అక్కడ జరిగిన సంఘటన చెప్తూ, ఏ పేరు తెలియనటువంటి నా పేరుతో ఇవి సంబోధించిందే, ఈ శక్తి ఉన్నదే' అని "అమ్మా! నీవు జ్ఞాన స్వరూపిణిగా, మాతృమూర్తిగా నాకు గోచరిస్తున్నావు. నీవు నీ స్వధర్మాచరణంలో నీవు ఉన్నత స్థితికి వెళ్ళావు. ఆ స్వధర్మాచరణ ఏమిటి? అలసిన భర్తకు సేవ చేయటం, ఆకలిగొన్న వేళ తన భర్త కడుపు చూసి అన్నం పెట్టటం, ఆయన సేద తీరి కాస్త విశ్రాంతి చెందేదాకా తన్-తన సేవని అందించటం. ఈ మూడు పాతివ్రత్యం అవునో కాదో కానీ సేవ మాత్రం అక్కడ నిలకడ చెందింది. కనుకనే ఆమె కౌశికుడికి భయపడలేదు. స్వధర్మంలో ఉన్న బలం అది." అప్పుడు ఆయన చేతులు జోడించి అడిగాడు, "అమ్మా! తపస్సు చేశాను, అజప జపం చేశాను, జపం చేశాను, ధ్యానిగా ఉన్నాను, ప్రపంచంలోకి వచ్చాను, ఇదిగో నిన్ను దర్శనం చేశాను. కానీ ధర్మం అంటే నాకు తెలియలేదమ్మా! ధర్మాన్ని గురించిన విచారణ నాకు ఎవరు చెప్తారో చెప్పు." అని అడిగాడు. "ఫలానా చోటికి వెళ్ళు. అక్కడ ధర్మవ్యాధుడు అని ఒకాయన ఉంటాడు. ఆ ధర్మవ్యాధుడి దగ్గరకు గనక నువ్వెళ్ళినట్లయితే నీకు బోధ తెలుస్తుంది. ఆయన చెప్తారు." ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక మాతృమూర్తి ధర్మవ్యాధుడి పేరు చెప్పింది అంటే ఒక ఊహ చేసుకున్నాడు ఆయన. ఆయన ఎలా ఉంటాడో. సరే వెళ్ళాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు. ధర్మవ్యాధుడు ఎవరు? ఎవరు? ఎవర్ని అడుగుతున్నాడు. అడుగుతుంటే అందరూ అడుగో అడుగో అని చూపిస్తున్నారు. ఆ ధర్మవ్యాధుడు ఏం చేస్తున్నాడో తెలుసునా? ఒక మాంసపు ముక్కలని ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. చేసి అందరికీ అమ్ముతున్నాడు. చాలా busy గా ఉన్నాడు. అక్కడ ప్రవాహంగా నిల్చుని ఉన్నారు queue లో. ఆయన మాంసం ముక్కలన్నీ కడు-- cut చేస్తున్నాడు చేస్తున్నాడు. ఈయన ధర్మవ్యాధుడు కావటానికి వీల్లేదు, అవకాశం లేదు. ధర్మవ్యాధుడు పొరపాటు ఇద్దరు పేర్లు ఉండొచ్చుగా, ఇద్దరికీ ఒకే పేరు అనుకున్నాడు. ఆ సమయంలో ధర్మవ్యాధుడు, "కౌశికా! ధర్మవ్యాధుడ్ని నేనే. ధర్మం అంటే ఏమిటంటే నేను ఏ వృత్తి యందు ఉన్నానో ఆ వృత్తి యందు ఏ అపేక్ష కానీఉపేక్ష కానీ, బంధన కానీ, బాంధవ్యం కానీ, కర్త్రుత్వం కానీ, లాభాపేక్ష కానీ, క్షేమం కానీ, సంక్షేమం కానీ, యోగాన్ని కానీ, ప్రాప్తిని కానీ, ఆశించకుండా నేను చేయగలిగిన పని చేస్తే దాని పేరు ధర్మం అయ్యా కౌశికా అన్నాడు. మాంసం అమ్మే వాడికి కూడా నా పేరు తెలిసిందే, ఇదెలా తెలిసింది అంటే స్వధర్మంలో ఉన్నటువంటి ధర్మం అది, బలం అది. స్వధర్మము అంటే భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి ఈ మూడు స్థితులలో ఆధ్యాత్మిక స్థితిలో ధర్మము అన్నా, కర్తవ్యం అన్నా, ఇదంతా కూడా మూడవ స్థాయికి చెందినదిగా మనం భావన చేసినా స్వధర్మం అంటే ఆత్మను ఎరగటం అని అర్థం. దాన్ని పక్కనబెట్టి ముందు లోకాన్ని ఎరగాలి. లోకాన్ని కాదు ఎరగవలసింది, ఎరగవలసింది మనమే. ఒక్కసారి మనంతట మనమే ఒక చోట కూర్చొని మోరల్ ఫిలాసఫీ నోటికి బోలుడు మాటలు మనకు గుర్తున్నాయి, చాలా చెప్పగలుగుతున్నాం. పాటించామా లేదా? సామాజికమైన ఒక ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామా లేదా? అలాగే సహజీవనం చేస్తున్నటువంటి భార్య పట్ల గాని, భర్త పట్ల గాని మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామా లేదా? ఒక విద్యార్థిగా విద్యాభ్యాసనం చేయవలసినటువంటి నేను ఆ విద్యని కూలంకషంగా, లోలోతులుగా, సర్వార్థంగా, సమగ్రంగా, సమ్యక్ దర్శనంగా నేను అధ్యయనం చేస్తున్నానా లేదా? నేను ఎంచుకున్న వృత్తికి లేదా నేను ఎన్నుకోబడిన వృత్తికి నేను శాయశక్తులా పరిపూర్ణంగా నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నానా లేదా? నేను చేస్తున్న పనికి తగిన జీతాన్నే నేను తీసుకుంటున్నానా లేదా? ఈ ఉద్యోగంలోకి వచ్చాం గనుక మనల్ని ఎవడు తీసేవాడు లేడు గనుక చేయకపోయినా పర్వాలేదు అనుకున్నామా? ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నట్లయితే దానిలో నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మనకి మార్కులు రావాలి. రాకపోయినట్లయితే ఈ ధర్మం అనేది ఒక సబ్జెక్టుగా మిగిలిపోతుంది తప్ప మనకు అక్కరకు రాదు. ధర్మాన్ని తెలుసుకోవటం వేరు, ధర్మాన్ని ఆచరించటం వేరు. అందువలననే వేదాలు, ఉపనిషత్తులు చెప్పీ చెప్పక పురుషుడికి కొన్ని ధర్మాలు, స్త్రీకి కొన్ని ధర్మాలు చెప్పినాయి. వాటిని కూడా మనం విచారణ కాస్త చేద్దాం. పురుషుడు అంటే రాముడు అనుకుందాం, స్త్రీ అంటే సీత అనుకుందాం. మనకు ఆదర్శమూర్తులు గనుక వారిద్దరినీ విచారణ చేద్దాం. రాముడు ఆదర్శప్రాయమైన కొడుకుగా, ఆదర్శప్రాయమైనటువంటి అన్నగా, ఆదర్శప్రాయమైన భర్తగా, ఆదర్శప్రాయమైన యువకుడుగా, ఆదర్శప్రాయమైన ఇక్ష్వాకు రాజుగా, ముముక్షువులందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటి ఆనంద ప్రదాతగా, అరివీర భయంకరమైనటువంటి శత్రు సైన్యానికి ఒక సింహస్వప్నంగా ఈ ధర్మాన్ని అన్నివేళలా పాటించాడు. అంతేకాదు వాలివధ అయిపోయిన తర్వాత సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు శిరస్సు వంచి, చేతులు జోడించి, రామా! నీవు గనక రాకపోయి ఉన్నట్లయితే వాలివధ జరిగేది కాదు. వాలివధ జరక్కపోతే నాకు రాజ్యమూ దక్కేది కాదు, నా రమణి దక్కేది కాదు. ఆయన రమణి తార. కనుక రాజ్యమూ, రమణి, ప్రదేశమూ, దేశమూ అంతా నీదేనయ్యా. యుద్ధం చేసింది నీవు, వాలిని చంపింది నీవు, గెలిచింది నీవు, విజయుడవైనది నీవు, ఇక నా ప్రమేయం ఏమన్నది? ఈ భూభాగమంతా నీదే అన్నాడు. అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏలుకోవటానికి నాకు అయోధ్య ఉన్నది. ఇది నీది, నీ జాతి, నీ గుణంతో, నీ భావంతో, నీ మూలంతో, నీ సంస్కారంతో, నీ సంస్కృతితో ఈ కిష్కింధ నగరం ప్రజ్వరిల్లు గాక, అనేక కాలాలు ఈ జాతి నిలబడు గాక అని ఆశీర్వచనం ఇచ్చాడు రామచంద్రుడు. ఇవాళ ఎవరైనా అయ్యా అంతా మీరే చేశారు పట్టుకెళ్ళండి అంటే, నేను కూర్చున్న కుర్చీ కూడా ఇస్తారా అని అడుగుతాడు. అది ఈనాడున్న ధర్మం. అలాగే లంకానగరంలో రావణవధ అయిపోయింది. విభీషణుడు కూడా ఇలాగే అన్నాడు. ఈ లంక ఇన్నాళ్ళు ఇక్కడ వేదం వినబడ్డా? ఇక్కడ వేదం అనబడ్డా? ఇక్కడ అనేక ధర్మాలన్నీ కూడా సంస్కారవంతమైనటువంటి విధివిధానాలుగా సాగినా రావణుడు అనబడేటువంటి నా అన్న కారణంగా మేము పూర్ణ తమస్సులో నిలిచిపోయినాము. ఇప్పుడు రావణుడు లేడు, కుంభకర్ణులు లేరు, దానికి సంబంధించిన ఏ సంతతి లేదు రామా! లంకానగరాన్ని కూడా నీవు అయోధ్యతో కలుపుకొని పాలించవా అని అడిగాడు. మళ్ళీ ఇదే జవాబు. జవాబులో తేడా లేదు. నిన్న సత్యము అంటే మారని వస్తువుగా స్వామిని గురించి మనం ఎలా చెప్పుకున్నాం? ఆయన నేను సాయిబాబాను అని ప్రకటించిన మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై నుంచి ఇరవై నాలుగు, స్వామి రెండువేల పదకొండులో ఏప్రిల్లో శరీరాన్ని వదిలిపెట్టే దాకా డ్రెస్సు మారలేదు, అడ్రస్సు మారలేదని నిర్ణయించాం కదా. అంటే మారని దాని పేరు సత్యం, మారుతున్నది అసత్యం. ఈ మారనటువంటిది ఎట్లా ఉన్నది అంటే రాముడి మాటల్లో కూడా మార్పు లేదు సుమా. ఇదే మాట అన్నాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. స్వర్గం కంటే నా మాతృభూమి మహత్తరమైనటువంటిది. నాకున్నటువంటి తల్లి కంటే మిగతా వారంతా మాతృ సమానులే. కానీ నాకు జన్మనిచ్చినది ఒకే తల్లి. కనుక నీవుండవలసిన చోట ఉండు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నీ అన్నగారు ఏమి చేస్తే ఇలా అయిపోయిందో గమనించుకొని అట్లా జరగకుండా ధర్మాన్ని ఆశ్రయించమని బోధ చేశాడు. వచ్చేశాడు. వచ్చిన తర్వాత సీత. సీత ఏమన్నది?ఆమె ఆమెను అడవికి వెళ్ళమని కైక అడగలే దశరథ రాజు అడగలే ముగ్గురు అత్తగారులు నువ్వేం చేస్తావ్ ఇక్కడ అంతఃపురంలో ఉండు అరణ్యంలో పొదలు ఉంటాయి పులులు ఉంటాయి రాముడే చెప్పాడు ఒక రాత్రంతా చెప్పాడు ఒక రాత్రంతా సీతమ్మని కూర్చోబెట్టి అక్కడ ఉన్నవన్నీ కూడా చాలా దృశ్యం కనిపించినట్టుగా చెప్తే అవన్నీ ఉన్నా వాటిని జయించటానికి నువ్వొక్కడివి ఉన్నావు కదా రామా నీతో ఉంటేవి నా జోలికి ఎందుకు వస్తాయి నువ్వు లేకపోతే కదా నాకు భయము నువ్వు ఉన్నచోటంతా నాకు అభయమే గనుక నేను కూడా అరణ్యానికి వస్తాను అన్నది అది పతివ్రతా ధర్మమా సహచర్య ధర్మమా సహధర్మమా సహజీవన ధర్మమా జీవన భాగస్వామ్యమా ఆదర్శప్రాయమైనటువంటి విచారధారలో రాముడి ధర్మము సీత ధర్మము రెండు కావు రామ ధర్మము సీత ధర్మము ఏకమైనటువంటిది కనుకనే అది రామాయణమై రామాయణం అయింది సీత యొక్క కథ అయింది గనుక సీతాయాశ్చరితం మహత్ అన్నాడు వాల్మీకి అంతేకాదు ఈ రాముడు ఈ సీత జగజ్జనని శ్రీమన్నారాయణుడు ఈ జగత్తులోకి రావటానికి కారణభూతమైనటువంటి వాడు పౌలస్త్య బ్రహ్మ రావణుడు గనుక రామాయణం అంతా రాముడి కథ కాదయ్యా సీత యొక్క మహత్వం కాదయ్యా రావణ హృదయమయ్యా అన్నాడు అంటే నెగెటివ్ ఎనర్జీ లేకపోతే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ రావలసిన అవసరం లేదు భగవంతుడు వచ్చాడు అంటే అక్కడ నెగెటివ్ ఎనర్జీ బాగా గూడు కట్టుకొని ఉన్నది అని అర్థం ఎందుకు వచ్చాడు <|diarize|>యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అలాగే గంగానది తీరానికి వెళ్ళినప్పుడు అమ్మ గంగకు పూజ చేసింది చెట్టుకు పూజ చేసింది రావి చెట్టుకి మర్రి చెట్టుకి ఆకాశానికి పంచభూతాలకి పూజ చేసి వచ్చింది ప్రార్థన ఏమిటో తెలుసునా నా భర్త శ్రీరామచంద్రుడు తన తండ్రికి ఇచ్చినటువంటి మాట పాలించటం కోసం సర్వము త్యాగం చేసి ఇదిగో అరణ్యవాసాన్ని ఎన్నుకున్నాడయ్యా ఓ లతలా ఓ పూలా అంటూ వాటితో సంబోధిస్తూ మళ్ళీ దిగ్విజయంగా వెనక్కి వస్తూ ధర్మాన్ని రక్షిస్తున్న నా రాముడు నేను మళ్ళీ భద్రంగా అయోధ్యకు వెళ్ళేదాకా మమ్మల్ని ప్రకృతిగా కాపాడమని ప్రార్థన చేసింది చేస్తూ మీ శక్తులన్నీ మా రామునికి వనగూడు గాక అన్నది చూడండి ఇక్కడ క్షేమంగా వెళ్లి భార్య అంటుంది లాభంగా రా అంటుంది లాభం లేకపోతే రావద్దు అనే లాభంతో రమ్మనమనే అంటే ఆమె దృష్టిలో క్షేమమే లాభము అని అర్థం క్షేమము అంటే క్షితి కాకపోవటమే పతనం కాకపోవటమే వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్లుగా వెనక్కి వెళ్ళాలి అది భద్రమైనటువంటి ప్రయాణం ఎలా వెళ్లారో అలా చక్కగా రండి అంటాం కదా అలాగే వెళ్ళాలి ఎలాగో వెళ్లి ఇంకోలా వెళ్లిపోతే ఎవరికి ఆనందం వెళ్ళిన వాడికి లేదు సమాజానికి లేదు గనుక ధర్మో రక్షతి రక్షితః అలాగే గుహుడు అనేకానేకమైనటువంటి ఆ మహామునులందరూ కూడా ప్రధానంగా భారద్వాజ మహర్షికి అహల్య దేవికి శ్రీరామచంద్రునితో కూడినటువంటి సీత ప్రార్థన ఏమంటే రాముని యొక్క శక్తి అంతా కూడా ఇనుమడించాలి అంటే మీ ఆశీర్వచనం కావాలి అన్నప్పుడు అరుంధతి దేవి ఒక్క మాట అన్నది వశిష్టుల వారి భార్య రాముడు ధర్మ స్వరూపం సీతా భయపడకు ధర్మాన్ని గురించి నీవు ఎప్పుడన్నా చదవాలి వినాలి తెలుసుకోవాలి అనుకుంటే ఏ శాస్త్రము చదవకు రాముడిని చూడు రాముడు ఎట్లా ఉన్నాడో ఎట్లా జీవిస్తున్నాడో గమనించు పదహారు ఏళ్ళు నీకు ఆ అవకాశం ఉన్నది కదా పదహారు ఏళ్ళలో సింహ భాగం అంతా రాముడిని చూడు అన్నది ఆ సింహ భాగం అంతా చూడు లోనే చివర ఒక్క ఎరు ఆయన దగ్గర ఉండవు అని చెప్పింది ఆమె ఆమెకు తెలియంది ఏం కాదు కనుక పదమూడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రామ అయన ంలో సీత అయన ంలో సీత దేనిని గమనించింది అంటే రాముడి పాద ముద్రలను గమనించింది ఈ రాముడు నారచీరలు గట్టి అన్నీ పట్టుకొని వెళితే అని వదిలిపెట్టి వెళితే ఆయన కాలికి మిగిలినవి పాదుకలు రెండు మిగిలినాయి కదా తమ్ముడు వచ్చాడు భరతుడు అమ్మ ఇంకోరింది నువ్వు అరణ్యవాసానికి వెళ్ళు మా అబ్బాయికి పట్టాభిషేకం జరుగుతుంది ఇది నా కోరిక అన్నది దాని ప్రకారం ఈయన వచ్చాడు అది బానే జరిగింది ఈ భరతుడు అన్న గారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఆయన చేసిన పని ఏమిటయ్యా అంటే ఆ రామ పాదుకలు రెండు పట్టుకుపోయినాయి ఇక రాముడు ఏం చేశాడు అని మిగతా కాలమంతా పాదాలకి ఏ రకమైన ఆరక్షణ లేకుండా ఆయన చక్కగా నడిచాడు ఎందుకు నడవవలసి వచ్చింది అంటే శ్రీరామ పాదముల యందున్న దివ్య మహా శక్తి భూమి అనబడేటువంటి సీత యందు నిక్షిప్తం కావాలి అందుకనే సత్య సాయి భగవానుడి డెబ్బై రెండు సంవత్సరాల దర్శన కాలంలో తదనంతర కాలంలో వారు ఏకాంతంగా ఉన్న ఎక్కడికి వెళ్ళినా కాలికి చెప్పు లేదు కారణం ఏమిటంటే స్వామి యొక్క దివ్య మహా శక్తి ఏదైతే ఉన్నదో ఈ భూమికి అందాలి కేవలం మనకోసమే పరమాత్మ వస్తాడా అది అహంకారం నాకోసం వచ్చాం సాయి అని ఒకడు పాట రాస్తాడు నీకోసం రాలే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కోసం వచ్చాడు తాను సృష్టించిన ఈ ప్రకృతి కోసం వచ్చాడు నడిచినంత కాలము తాను సహించినంత కాలము కూడా తన యందున్నటువంటి సర్వ శక్తులని మళ్ళీ ఈ భూమి అనబడేటువంటి దానికి స్వామి అప్పజెప్పారు అలాగే గాలిలో చూపుడు వేలుతో రాతలు రాసినప్పుడు అది ఏమిటని విచారణ చేస్తే అది సర్వ శక్తులని కూడా ఎనర్జీ లెవల్స్ అన్నింటినీ కూడా సమన్వయం చేసిన ఒక దివ్య విధానం దానిని ఇవాళ మనం రేకి అని పేరు పెట్టుకున్నాం స్వామి చూపుడు వేలుతో రాసేవారు ఎవరికీ అర్థం కాలా ఎందుకని అర్థం కాలేదంటే మన మేధకు అది అందేది కాదు గనుక అలాగే సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి తాదాత్మ స్థితిలో తనలో తాను నిలకడ చెంది పరమానందాన్ని పొందిన ఘటనలు ఎన్నో చూశాం వారు మౌనంగా ఉన్నా.ధ్యానం చేసిందంటూ లేదు ధ్యానిగా ఉన్నది లేదు ఎవరో ఎప్పుడో సత్యసాయి ధ్యాన ముద్ర అని ఒక ఫోటో తీస్తే స్వామి నవ్వుతూ ధ్యానమే నేనైనప్పుడు మళ్ళి ధ్యానం చేయటం ఏమిటి అన్నారు. అలాగే కోటి సూర్య సమ తేజ స్వరూప అని ఎవరో భజన పాడితే ఆ కోటి సూర్యులకు మూలమైన శక్తి నేనైనప్పుడు దాని స్వరూపం నాకెలా వస్తుందో ఆలోచన చేయండి అన్నారు కానీ ఇంకా పాడుతూనే ఉన్నాం కదా. ఆయన చెప్తూనే ఉన్నారు మనం పాట మాత్రం మానలే. ఈ కోటి సూర్య సమ తేజ స్వరూపా అని పాడుతుంటే మనకు ఒళ్లంతా కూడా ఒక తాదాత్మ్యం జెంది శివం ఎత్తి పరవశం ఎత్తి కదా భూనభో అంతరాలన్నీ కలిసిపోయేట్టుగా అర్థం ఎరిగి పాడాలి. కనుక ఈ ధర్మంలో సీతాదేవి యొక్క ధర్మం ఏమిటి అంటే కౌసల్య అడిగింది ఒక్క మాట అడిగింది. ఎందుకు నీవు కోరి రాముడితో వెళ్తావ్? రాముడు పురుషుడమ్మా తండ్రి ఆజ్ఞ పాలించి వెళ్తున్నాడు ఇదిగో నీలాగానే నేను నాలాగానే మన ముందు ఉన్నవారంతా ఇక్ష్వాకు వంశంలో ఉన్న స్త్రీమూర్తులందరికీ ఇది శాపం అమ్మ చంద్రమతిని తీసుకెళ్లి కాశీలో అంగట్లో సరుకులా అమ్మిన వాడు హరిశ్చంద్రుడు అని ఒక్కొక్కళ్ళ వ్యధంతా స్త్రీమూర్తుల వ్యధంతా చెప్తూ వచ్చింది. మనం అనుకుంటాం పురుషుడు ప్రపంచంలో రాణిస్తుంటే స్త్రీకి ఆనందం ఉండదు తగ్గుతూ ఉంటుంది. ఆ ఆనందం ఎందుకు తగ్గుతుంది అంటే సమయం కేటాయించలేం. ఆ ఏకాంతంలో అనేకమైనటువంటి భావాలు కలిగి నా వాడు నాకు కాకుండా పోతున్నాడేమో అనేటువంటి ఒక విచారధార కలిగి ఆ విచారంలో తనను తాను కృశింపజేసుకుంటుంది. ఆ భావనలోనే కౌసల్య అంటే అప్పుడు ఒక మాట అన్నది వాల్మీకి రామాయణంలో సీత నోట పలికించాడు వాల్మీకి. అమ్మా అత్తా అని పిలవలేదు ఆమె అమ్మా రాముడు లేని అయోధ్య అరణ్య సమానం కదా రాముడున్న అరణ్యం అయోధ్య కంటే గొప్పది కదా నేను రాముడితోనే ఉంటా. అసలు నేను రాముడిని కట్టుకున్నది అందుకే ఎందుకనంటే రాముడితో ఉండటం కోసమే. ఏ ధర్మాన్నైనా ఇందాక చెప్పుకున్న అనేక ధర్మాలలో ఏ ఒక్క ధర్మాన్ని మీరు అడగండి దేనితో నీవు కూడి ఉండటానికి ఇష్టపడతావ్ అంటే సత్తుతో కూడి ఉండటానికి ఇష్టపడతానంటుంది. అందుకనే దాని పేరు సత్య ధర్మము అని స్వామి దానికి పరమాద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. సత్య ధర్మం అనేది ఒక మాట సచ్చా కామా ధర్మ కాదు సత్య ధర్మం సత్యమే ధర్మం ధర్మమే సత్యం జీవుడే పరమాత్మ పరమాత్మే జీవాత్మ దేహియే దేహంగా దేహమే దేహిగా పరస్పర ఆధార ఆధేయంగా ఉన్నాయి గనుక ఈ ధర్మం అంతా జారి జారి జారి వస్తే లోక ధర్మంలోకి వచ్చేసరికి ఈ లోక ధర్మం చాలా విచిత్రంగా ఉంటుంది. లోకానికి ఎప్పుడు ఏది కావాలో దానికి తెలియదు. ఆ లోకం రాముడు సీత అన్ని ధర్మాలను పాటించి అన్ని పరీక్షలలో నెగ్గి పరమానందంగా వస్తుంటే మనం అనుకున్నంగా ఈ భరతుడు కాస్త పాదుకలు ఉన్నవి కూడా వట్టుకుపోయినాడు ఆయన దగ్గర ఏమీ లేవని దాన్ని విశ్వనాథవారు చాలా అందంగా ఒక పద్యం చెప్పాడు. ఏం పద్యం అంటే నందిగ్రామంలోకి భరతుడు ఈ పాదుకలు తీసుకుని వెళ్లి అయోధ్యలోకి వెళ్ళలే రాముడు వచ్చేదాకా నేను అక్కడ అడుగు పెట్టనన్నాడు. ఆయన ధర్మవీరుడే కర్మవీరుడే. నంది గ్రామంలో ఒక సింహాసనం చేయించి దాని మీద ఈ పాదుకలు పెట్టాడు పెట్టి. [పాట] జంకారమ్మగు సామగానములతో శైవాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో లావణ్య రేఖా నితాంతంబై చను పాదుకాయుగమున్ ప్రొజ్జత్సింహపీఠంబుపై శంఖాపేతముగా గవుంచి రఘువంశ స్వామిగా చూచుచున్. పాదుకలను చూస్తూనే ఉన్నాడట. ఆ పాదుకలు ఎలా తీసుకొచ్చాడంటే ఆ పాదుకలు శ్రీరామ దేహంలా ఉన్నాయట అవి. శ్రీరాముడి లావణ్య రేఖా నితాంతం బై చను పడుకున్న రాముడు పాదంలా కనిపించాయట ఆయనకి. ఆ రఘువంశ స్వామిగా చూస్తుంటే ఆ పాదుకలు కూడా ఎలా ఉన్నాయి అంటే తెచ్చి గంగాజలంలో కడగలేదట. దాని మీద మణులు వేయలేదట. దానినంతా పుష్పాలతో నింపలేదట. [పాట] శైవాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో. ఎంత అందమైన భావన చూడండి శైవాలిని అంటే బురద. ఏ రాముడు బురద తొక్కినటువంటి ఆ పాదుకలకు అంటిన బురదలో ఉన్న ప్రతి అణువులో రాముడిని చూశాడట అది దర్శనం. అందుకనే ఇసుకలో స్వామి నడిచినన్నాళ్ళు స్వామి నడిచి అలా వెళ్ళగానే ఆ పద ముద్రలో ఉన్నటువంటి ఇసుకలు కొన్ని లక్షల మంది ఇళ్ళలో పూజా మందిరాల్లో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకని అంటే అది కేవలము పరమాత్మ తాకిన నేల. పరమాత్మ సృష్టించినటువంటి దివ్యజ్ఞాన భూమిక అది. అది ఐశ్వర్యప్రదాయిని. ఇక్కడ సందర్భం కాబట్టి ఓమాట చెప్తాను సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నటువంటి ఒక వ్యక్తి శ్రీకాకుళంలో ఇలాగే స్వామి గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఇలాగే స్వామి ఇసుకలో నడిచి వెళ్తున్నటువంటి రోజుల్లో రేపు గడుస్తుందో గడవదో అసలు ఈ రాత్రికైనా ఈ పుటపర్తిలో మనం అన్నం తినగలమో లేమో అన్న పరిస్థితిలో అక్కడికి వెళితే స్వామి ఆయన ముందు నిల్చి నడిచి వెళ్లారట. నడిచి వెళ్ళగానే ఆయనకు ఏమనిపించిందో గుప్పెడు ఇసుక ఒక పాదం స్వామిది చిన్న పాదం ఆ చిన్న పాదం ఎంత ముద్ర ఉన్నదో అంత ఇసుక ఇలా పట్టుకోగానే ముందుకు సాగిన స్వామికి ఇది కనిపించింది. మూడు వందల అరవై డిగ్రీలు నా కళ్ళు అన్నారు స్వామి ముందే ఉన్నాయి అనుకోకండి మీకు ముందు ఉంటాయి నాకు three sixty degrees అన్నారు. మళ్ళీ చక చక వెనక్కి వచ్చిఆ ఇసుక అక్కడ వదిలిపెట్టు ఏమున్నది దాంట్లో నీకేం కావాలి అంటూ తమ దివ్య హస్తాన్ని అతని శిరస్సు మీద ఉంచారు ఉంచి రెండు నిమిషాలు అట్లా నిలబడిపోయినారు స్వామి ఇవ్వాళ ఒక్కమాట అన్నాడు నాతో నా దగ్గర డబ్బు ఎంత ఉన్నదో లెక్క పెట్టాలి అంటే రెండేళ్ళు పడుతుంది సత్యసాయి సంస్థ నుంచి ఎవరు ఎప్పుడు వచ్చినా మీరు గనక వచ్చి మా దగ్గర ఉన్నట్లయితే మీరు ఉన్నన్నాళ్ళు ప్రతిరోజూ పన్నెండు వేల మందికి నేను భోజనం పెడతా పెళ్లి భోజనం అయినా నాకేం లోటు లేదు ఎందుకో తెలుసా అదంతా స్వామి ఇచ్చిందే ఎంత వినయం చూడండి ఏదో నేను కష్టపడ్డాను ఏదో బాబా గారి దర్శనం అయింది అప్పటి నుంచి అంతా మారిపోయింది అని చెప్పేస్తుంటారు కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత లేకపోతే మానవ దేహానికి విలువ లేదు కనుక ధర్మం ప్రకృతి ధర్మాన్ని పురుష ధర్మాన్ని స్త్రీ ధర్మాన్ని మనం సంపూర్ణంగా గనక పాటించగలిగినట్లయితే అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి ఆ పరిపూర్ణ ఆనందమయమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి ధర్మమే సత్యసాయి భగవానుడు ఈ ధర్మాన్ని కేవలం ఒక పుటపర్తికి మాత్రమే కాక కేవలం ఒక ఆంధ్రదేశానికి మాత్రమే గాక స్వామి సర్వ ప్రపంచానికి అందించారు అందుకే ఔపధేయం మునకు సత్య నామం బిచ్చి నడత కెల్లా ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి వచ్చే మా స్వామి మల్హారమై విచ్చే మాస్వామి కల్హారమై బంగారమై వచ్చారు సహస్ర దళాలతో వికసించారు కేవలం ఒక ఆంధ్రుడికో ఒక అరవ వాడికో కర్ణాటక వాడికో మరొకరికో అనుకోలేదు సమస్త మానవ జాతికి సమస్త సృష్టిలో ఉన్న సర్వ జీవులకి కూడా ధర్మ మార్గోపదేశం చేశారు ఉపదేశించి ఆగలేదు సుమా ఆచరించారు తాను దేనిని ఉపదేశించారో దానిని ఆచరించారు దేనిని ఆచరించారో దానిని ఆచరింపజేశారు మన నడకకి నడతకి నేర్పారు నియతి నేర్పారు న శ్రేయో నియమం వినా నియమం లేకపోతే శ్రేయస్సు లేదు సమయపాలన లేకపోతే క్షేమం కాదు కాలము పరబ్రహ్మ స్వరూపము అది అనంత ప్రవాహము కాలమే పరమాత్మ అయినప్పుడు కాలాధీనుడు అయినటువంటి మనస్సు కాలాధీనమైనటువంటి మనిషి కాల కార-కారణ కర్తవ్య నిమిత్తమై పరమాత్మ వలె ఒక దేహాన్ని తీసుకొచ్చిన వాడు స్వామి చెప్పినట్లుగా మానవుడు కనీసం మానవుడిగా నైనా జీవించలేని ఒక దుస్థితి ఏర్పడినట్లయితే ఎప్పటికీ ఈ జాతి బాగుందును అన్నారు బాగుపడుతుంది అన్నారు మనలో పశుత్వాలు ఉన్నాయి residual animal instincts ఉన్నాయి మనలో ఇంకా మన దోషాలు చాలా ఉన్నాయి వాటన్నింటినీ కూడా ధర్మాచరణతో ధర్మాపేక్షతో ధర్మబద్ధమైనటువంటి నిబద్ధమైనటువంటి నియమ పూరితమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి సర్వ జన హితాయ సర్వ ప్రపంచము కూడా సుఖంగా ఉండుగాక అనేటువంటి ఒక మహా మంత్రాన్ని గనక మనం ఆచరిస్తూ వెళ్లినట్లయితే నీకు డబ్బు అక్కరకు రాదు బోలెడు డబ్బుంటుంది ఐసియులో ఉంటాడు వాడు అడుగుతాడు స్వామి విభూతి ఏదన్నా ఉన్నదా అని అడుగుతాడు నువ్వు లెక్క పెట్టలేదే ఎందుకని అంటే ఆ డబ్బు నన్ను కాపాడుతుంది అన్-అని పది మంది బిడ్డలను కడుపునిండా కంటాడు మోసే వాళ్ళు ఎవరూ నలుగురు ఏర్పడతారు అలాగే అనేక సంపదలన్నీ ఉంటాయి దానం చేయం ధర్మం చేయం సంపదని వినియోగించం దోచుకుపోయే వాడు ఎవడో ఒకడు దొరుకుతాడు వాడు పట్టుకుపోతాడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపిన వాడికే పరమాత్మ యొక్క భావన ఒక అంతరంగిక స్ఫురణగా ఆంతరంగికమైన దివ్య భావనా భూమికగా అది జ్ఞాన భూమికగా యోగ భూమికగా పుణ్య భూమికగా ధర్మ కర్మ భూమికగా నిలకడ చెందుతుంది గనుక అటువంటి స్థాయిని అందుకోమని సత్యసాయి భగవానుడి ధర్మ పరిపాలన ఏమిటంటే సమయపాలన ఏడు లక్షలు పది లక్షల మంది ఆయనకై వచ్చి ఆయన birthday నాడు అక్కడ నుంచుని ఉంటే ఏడున్నరకి స్వామి దర్శనము అని గనక అంటే ఏడు ఇరవై తొమ్మిది కల్లా స్వామి కనపడ్డారు అలాగే ఎవరైనా సరే గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వారు ఎనిమిదిన్నరకి తమ కార్యకలాపాలు బయట ముగించుకొని తొమ్మిది గంటలకు ఇల్లు చేరాలి ఉన్నాం కదా అంటున్నాం కదా వింటున్నారు కదా అంటూ పదకొండు గంటల దాకా చెప్పే హక్కు మనకు లేదు అది అనైతికం అన్నారు స్వామి ఎందుకంటే మనం చేయవలసిన హిత కర్మలు విహిత కర్మలు మన మీద ఆధారపడ్డవారు మనం వెళితే తప్ప విస్తట్లోకి ముద్ద వెళ్ళనటువంటి వారు ఎందరెందరో ఉన్నారు గనుక మన కాలాధీనమైనటువంటి మనము ఆ కాలానికి లోబడి మన కర్తవ్యాలన్నీ నిర్వర్తించాలి బ్రహ్మచారి గృహస్థస్య వానప్రస్థస్య భిక్షుకః అతివర్ణాశ్రమీ చైతి క్రమాత్ శ్రేష్ఠా విచక్షణ అంటుంది సూత పురాణంలో ఉన్నటువంటి ముక్తి ఖండం బ్రహ్మచారి కంటే వానప్రస్తుడి కంటే అతివర్ణాశ్రమి కంటే మరొకడి కంటే గృహస్థ ధర్మం గొప్పది గృహస్థ ధర్మం ఉంటే అతిథిని పిలవగలం అన్నం పెట్టగలం అనాథని ఆదుకో గలం ఆనందించగలం విద్యాబుద్ధులు నేర్పించగలం ఒక మనిషిని తయారు చేయగలం గృహస్థ ధర్మమే లేకపోతే ఒకసారి అరుణాచలంలో బాగా పళ్ళు కాచేటువంటి ఒక మామిడి చెట్టు కింద రమణ మహర్షి తపస్సు చేసుకున్నారు తపస్సు అంటే ఆయన అక్కడ కూర్చున్నారు ఆయన చెప్పారు నేను తపస్సు ధ్యానం ఎప్పుడూ చేయలేదు అన్నారు తర్వాత పుస్తకాలన్నీ ఆయన బాగా తపస్సు చేశారని అంటారు గానీ నేనేం చేయలేదు అంటారు ఏమి చేయలేదు గనుకే హాయిగా ఉన్నానని కూడా అన్నారు తపస్సు చేసుంటే ఇంకేదో అడగాల్సి వచ్చేదేమో నాకేం అక్కర్లేదు కాబట్టి హాయిగా కూర్చున్నాను అన్నారు మామూలుగా ఆయన కూర్చున్నటువంటి చోట ఆ చెట్టు ఎంత పుణ్యప్రదమైందోకాబట్టి కిందటి సారి ఒక లారీకి సరిపడా పళ్ళు వచ్చినాయి భగవాన్ కూర్చున్నారు కాబట్టి ఈ సారి నాలుగు లారీల పళ్ళు వస్తాయి అని అందరు అనుకున్నారు విచిత్రం next year ఒక్క పిందె లేదు అసలు పూత లేదు భగవాన్ దగ్గరికి వెళ్లి అడిగారు భగవాన్ ఇదేమిటి ఇలా జరిగింది సాక్షాత్తు మీరు దక్షిణామూర్తి స్వరూపం మీరు స్కందులు మీరు పరశివ అవతారం మీరు మీరే అక్కడ కూర్చొని నిర్మల నిశ్చల నికేతన నిరంజన మైన ఆనందంలో ఉన్నారే దానిని చూస్తున్నప్పుడు ఈ చెట్టు ఎంత పుణ్యం చేసుకున్నదో కదా దానిలో ఉన్న ధాతువులన్నీ ఎంత ఉజ్వల అవుతాయో కదా ఆ ఆనందంలో ఎన్నో పళ్ళు ఇస్తాయి అనుకున్నామే అంటే ఇదేనప్ప జ్ఞానితో కూడుకుంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి జ్ఞాని వైరాగ్య భూమిక లో ఉంటాడు అక్కడ గనుక ఈ చెట్టు బాగా కాయాలని నాబోటి వాడు ఎవడైనా కూర్చుంటే కాసేపంలో ఏమో నాకు పండు అక్కరలేదు నీడ అక్కరలేదు కాయ అక్కరలేదు అక్కరలేని వాడికి ఎందుకు ఇవ్వాలి నా చెట్టు అనుకున్నదేమో అడుగుదాం అన్నారు చూశారా అది జ్ఞానితో వైరాగ్య భూమిక ఈ జ్ఞానితో కూడితే మనకు ఏమిటంటే ఏం లభిస్తుందో తెలుసునా జ్ఞానం లభిస్తుంది జ్ఞానాన్ని ఎవడు అనుభవించగలడు అంటే వైరాగ్య భూమిక లో అనుభవించగలడు వైభోగంలో నుంచి వైరాగ్యం రాదు వైరాగ్యమే వైభోగం ఆ వైరాగ్య వైభోగ తత్వమైనటువంటి మూలమైనటువంటి ఏదైతే అసలు విద్య ఉన్నదో ఏది ఎరగవలసి ఉన్నదో ఏది ఆత్మవిద్యగా ఉన్నదో అది ఆచరణాత్మకమైనటువంటి దివ్య స్ఫురణగా కలిగినప్పుడు దాని పేరు ధర్మము ఆ ధర్మాన్ని మనం పట్టుకోవాలి స్వామి సమయపాలన ఒకటి రెండవది ఆయన గృహస్తు కాదు యతి కాదు యోగీశ్వరుడు కాదు ఎవరు అంటే నేను నేనైనా నేను అని ఆయన ప్రకటించుకున్నారు అంటే ఈ నేను నేనైనా నేను అంటే ఆత్మ స్వరూపంగా అభివర్ణన జరిగినప్పుడు ఈ వెళ్ళిన వారందరికీ ఒక్క వ్యక్తికి కూడా అననుకూలం లేకుండా అక్కడి నుంచి వెళ్తారు ఇది ఒక విభూతి ఏడు లక్షల మందికి ప్రసాదం దొరుకుతుంది అసలు ఆయాసం లేకుండా ఇక్కడ మాములుగా చిన్న పెళ్ళికి వెళితే మనం ఇస్తట్లోది కూడా ఇంకొకడు పట్టుకుపోతాడు వాడి తొందరలో కదా ఆ తేడా తెలియకుండా అక్కడ ఒక నియమబద్ధమైనటువంటిది శ్రేయస్సు ప్రధానం ప్రేయస్సు కాదు అలాగే మూడవది అన్ని అద్భుతాల్లో నన్ను చాలామంది అడుగుతారు ఒక మంచి miracle చెప్పండి అని చెప్పే అలవాటు మరి మనకు ఇవ్వలేదు ఆయన కానీ నాకు తోచిన ఒక miracle ఏమిటంటే కులవంత హాల్లో లేదా ఎప్పుడైనా స్వామి చుట్టూ గనక ఒక యాభై వేల మంది కూర్చున్నారు అనుకుందాం అందరూ దర్శనం చేసుకుంటారు స్వామి హారతి తీసుకుని లోపలికి వెళ్తారు మనందరం కూడా gate లో నుంచి బయటికి వస్తుంటాం యాభై వేల మంది అనే ఒక మాట ఏమిటో తెలుసునా స్వామి ఈ వేళ నన్ను చూశారు యాభై వేల మందికి ఒకే అనుభూతి ఇవ్వటం అద్భుతమైన miracle ఉంగరం ఇవ్వటం గొలుసు ఇవ్వటం కాదు ఇవి చాలా చిన్న విషయాలు అవి రక్ష వాడికి ఏ రకమైన ప్రమాదం లేకుండా కాపాడుతాను అంటే కాపాడుతాను అన్నారు గానీ ఏం గుర్తు ఇవ్వలేదే అంటారేమో అని ముందే ఉంగరం ఇచ్చేసి వదులుచుకుంటారు స్వామి కాబట్టి దాన్ని అంతవరకే చూసుకోవాలి ఆ రక్షణలో ఉన్నటువంటి ధర్మం పరమాత్మ కంటే గొప్పది ఎందుకంటే పరమాత్మే ధర్మాన్ని ఆచరించాడు సత్య సాయి భగవానుడు సర్వ దేవతా అతీత స్వరూపులై ఆయన ఎప్పుడొచ్చినా చూడటానికి మనం సిద్ధపడ్డా కాదు కాదు సమయ పాలన చేశారు సర్వ సంక్షేమాన్ని చూశారు సర్వ హృదయాలను తాకారు సర్వ జీవులను చల్లగా ఆశీర్వదించారు సనాతనమైనటువంటి ఒక వైదిక వేద ధర్మాన్ని ఆర్ష ధర్మాన్ని ఉపనిషత్ సారాన్ని మాములు మాటల్లో మనందరికీ అందించి మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి ధర్మ మార్గాన్ని ఉపదేశం చేసినటువంటి స్వామి యొక్క జీవితమే మహోపదేశం స్వామి యొక్క వాక్యే ధర్మోపదేశం స్వామి యొక్క చూపే మహోపదేశం స్వామి యొక్క తలపే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దివ్య మహోపదేశంగా భావన చేస్తూ సత్య ధర్మము సత్యముతో కూడిన ధర్మం ధర్మంతో కూడిన కర్మ కర్మతో కూడిన అర్థం అర్థంతో కూడిన ఆచరణ ఆచరణతో కలిసిన దాని వలన కలిగిన ఆనందం ఆ ఆనందం వలన కలిగినటువంటి బ్రహ్మానంద స్థితిని ఏకకాలంలో అనుభవించినటువంటి సర్వ దేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామికి ప్రణమిల్లుతూ సాయిరాం.
SSSMC · audio
Mahopadesam - 06
Mahopadesam - 06
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 40:39
More in this series