Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరాం! భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. September మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవని సంచారంలో జాతి మత వర్గ వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్యమార్గాన్ని సూచించారు. అవే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా భూమికలు. సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీడి స్వామి కూడా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని అంటూ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. నాన్న మొదటి చదువుకుంటున్నాడు అలవాటు ప్రకారం. చదువుతుంటే "ఏమిటి చదువుతున్నావ్?" అన్నాడు. "నీకు అర్థం కాదులే" అన్నాడు. "ఏదో చదువుకుంటున్నానులే" అన్నాడు. "కాదు కాదు వాళ్ళ ఏదో చదువుతున్నావ్ చెప్పు" అన్నాడు. "నీకు అర్థం కాదులే బాబా పడుకో" అన్నాడు. "అయినా నువ్వు చెప్పు నువ్వు చదువు" అన్నారు. అన్నప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి అంటే ఏమిటంటే అంతవరకు చెప్పాడు నాన్న ప్రణిపాతేన అన్నప్పుడు మాత్రం సమర్పణ అనే మాట వాడలేదు నాన్న ప్రణిపాతేన అంటే సర్వాంగీణమైనటువంటి దేహాన్ని సాష్టాంగ నమస్కారం చేయటము అని. "చేస్తే ఏం వస్తుంది?" అని అడిగారు శిరిడి బాబా. "నాకు నువ్వు దండం పెడితే నీకేం వస్తుంది?" అని అడిగారు. అది కాదు ప్రణిపాతేన అంటే సంపూర్ణ శరణాగతి అని అర్థం. అలాగే పరిప్రశ్నేన "నువ్వు దేవుణ్ణి చూశావా? నాకు చూపిస్తావా?" పరిప్రశ్నేన అది ఎవరిని చెప్పగలిగిన గురువుని కావలసిన శిష్యుడు అడిగినటువంటి సన్నివేశం. మనం కూడా చాలా ప్రశ్నలు చాలా సార్లు వేస్తూ ఉంటాం. అవి పరిప్రశ్నలు కావు ప్రశ్నలు మాత్రమే. పరిప్రశ్న అంటే ఒక ఉత్తమోత్తముడు అయినటువంటి శిష్యుడు సర్వ ప్రపంచానికి శాంతిని ప్రశాంతిని ఇవ్వటానికి కోరుకొని తన గురువుని అడగవలసిన ప్రశ్న వేసి కావలసిన సమాధానాన్ని పొందినట్లయితే అది పరిప్రశ్న. అది సార్వకాలికం కావాలి విశ్వజనీనం కావాలి. ఇక సేవయా అంటే ఏమిటి? అని అడిగారు బాబా. "ఇదిగో నీ కాళ్ళు నొక్కుతున్నాను కదా అదే కదా సేవయా" అన్నాడు. "అదా? ఎవరి కాళ్ళు ఎవరు నొక్కుతున్నారయ్యా? కాలు భౌతికమే నొక్కుతున్న చెయ్యి భౌతికమే ఇది సేవ ఎక్కడ అయింది? ఇది చాకిరీయే కదా?" సేవ అంటే భావన అని అర్థం. సేవయా మూడింటిని తత్వదర్శి అయినటువంటి గురువు తాను దేనిని దర్శించాడో దానిని ఇస్తాడు గనుక అటువంటి దర్శనం గనుక మనకు లభించినట్లయితే అది దేనిని ఇస్తుంది అంటే శాంతిని ఇస్తుంది. శాంతి మన నుంచి ఎందుకు దూరంగా ఉంటుంది విచారణ చేయాలి. వాంట్ పీస్ కాసేపు పక్కన పెడదాం. పీస్ అయిపోయింది వాంట్ పోయింది అన్నీ పోయినాయి చక్కగా ఉన్నాం శాంతి ఏర్పడింది. శాంతి ఏర్పడినట్లు ఉన్నది గాని మళ్ళీ ఇంకేదో కొత్త సమస్య వస్తోంది. నిన్న ఉన్న శాంతి మళ్ళీ ఈవేళ లేకుండా పోతున్నది. శాంతి కూడా ఎండమావి వలే ఉన్నది. ఇది ఏమి ఎటువంటి శాంతి అంటే తృప్తిని మించినటువంటి భావన మరొకటి లేదు. తృప్తి ఎవరి దగ్గర ఉన్నదో వాడికి శాంతం ఉంటుంది. శాంతము ఎవరి దగ్గర ఉన్నదో వాడు శాంతుడై ఉంటాడు. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకున్నటువంటి ఒక సాధకుడు ఇంద్రియాన్ని ఇప్పుడు శ్రవణేంద్రియం వింటున్న వారందరి చెవులు ఏం చేస్తున్నాయి అంటే వింటున్న దాని మీదనే మనస్సు లగ్నమై ఉన్నది. అంటున్న వాడి విషయం కూడా మనసు కూడా అదే దాని మీద లగ్నమై ఉన్నది గనుక సంధానము ఏదైతే ఉన్నదో దీని వలన ఒక శాంతి ఒక పరమ శాంతి ఒక పవిత్రత ఒక స్వచ్ఛత ఒక అచల స్థితి ఒక అద్వైత స్థితి ఒక ఆనంద స్థితి ఏకకాలంలో లభిస్తూ ఉన్నాయి గనుక ఇవన్నీ గనుక కలగలుపుసి ఒక చిన్న ముద్ద అయితే దాని పేరు శాంతి. శాంతిని పొందాం వస్తువును తెచ్చుకున్నాం డిగ్రీ తెచ్చుకున్నాం శాంతి దొరికిందా ఆనందం దొరికిందా? ఉద్యోగం వస్తుందో రాదో డిగ్రీ వచ్చింది గనుక వచ్చిందన్న సంతోషం కంటే తర్వాత ఏమిటి? అధాతో బ్రహ్మ జిజ్ఞాస కదా. తర్వాత ఏమిటి? తర్వాత ఏమిటి? జీవుడు శాంతి వెనుక పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎట్లాగంటే కస్తూరి తన యందే ఉంచుకున్నటువంటి మృగం ఎక్కడెక్కడో పరిమళాలు ఉన్నాయని దిక్కునా దిక్కునా పరిగెత్తినట్లుగా జీవుడు కూడా తన యందే శాంతిని ఉంచుకొని శాంతి ఎవరో ఇస్తారని అది ఎక్కడో ఒక పదార్థంగా ఉన్నదని అమాయకంగా ఒక అవిద్యలో కూరుకుని ఉన్నాడు గనుక సాధకుడు అయినటువంటి వాడు ఒక సత్యసాయి భగవానుడు వంటి ఒక మహా సద్గురువు గనుక ప్రపంచంలో దొరికితే ఏం పొందాలయ్యా అంటే శాంతినే పొందాలి.అసలు దర్శనమే ముందు ఒక శాంతిని కలిగిస్తుంది. ఎన్నో ఆలోచనలతో వెళ్తాం. ఎన్నెన్నో మూటలు, కష్టాల మూటలు కట్టుకొని, కన్నీటి ధారలు ఆపుకొని, జన్మ జన్మాంతరాలుగా ఉన్న మూలవాసనలన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని, మనసంతా కూడా అతలాకుతలంగా వెళ్తాం. సత్యసాయి భగవానుడి యొక్క దివ్య దర్శనంతో మనకు తెలియకుండానే ఒక శాంతి లోపల ఏర్పడుతుంది. ఎలా ఏర్పడింది? సాధ్యమేనా? లేదు ఇది ఒక మానసిక భ్రాంతి అంటే కానే కాదు. ఎందుకు కాదు అంటే, నది లోపలికి వెళ్లే దాకా ఒళ్ళు తడవలేదు గాని నది లోపలికి వెళ్ళిన తర్వాత తడవక ఏమవుతుంది? అక్కడ ఉన్నదే శాంతి. శాంతి అనబడేటువంటి పరమాద్భుతమైనటువంటి అధ్యాత్మ తరంగాలు, అనుగ్రహ తరంగాలు ఒకదానితో ఒకటి విభేదించక, కో-కరెంట్ గా, కౌంటర్ కరెంట్ గా కాకుండా, కకావికలం కాకుండా, పరమ ప్రసన్నంగా, పరమ ప్రశాంతంగా, నిరామయంగా, నిశ్చలంగా, సర్వ జీవుల హృదయాలని తాకుతున్నటువంటి వేళ, క్షణాన ప్రయాణం బయలుదేరిన క్షణంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడో మరిచిపోయింది మనస్సు. ఏదో అడగాలని, ఏదో పొందాలనుకున్నదంతా ఇప్పుడు అది అవసరమా? దర్శనం చూసుకుంటే చాలు కదా అని. ఆనందాన్ని అనుభవిస్తూ మనస్సు శాంతి చెందేటువంటి వేళ, సత్యసాయి భగవానుడు-- ఎందుకంటే, ఇదంతా మన ప్రత్యక్ష అనుభవం కాబట్టి. అనుభవాన్ని శాస్త్రంతో జోడించాలి. శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. అనుభవం శాస్త్రంగా మారుతుంది. అంతే కదా! పుస్తకాల్లో ఉన్నట్టుగా మనం జీవించం. మనం జీవించిన తర్వాత పుస్తకాలు ఏర్పడతాయి. మన అనుభవాలలో నుంచి, జీవన శైలిలో నుంచి, జీవిత భావనలో నుంచి, జీవన ఆదర్శంలో నుంచి, జీవన ధృతిలో నుంచి, ఆవేగంలో నుంచి, కోణంలో నుంచి, డైనమిక్స్ లో నుంచి, డైమెన్షన్స్ లో నుంచి అనేక శాస్త్రాలు వస్తాయి. శాస్త్రాలు ఈరోజు పుడతాయి, నాలుగు రోజుల తర్వాత వెనకబడతాయి. అందుకనే శాస్త్రానికి అసలు పేరు, అచ్చపేరు జ్ఞాపకం. శాస్త్రం అంటే జ్ఞాపకమే. జరిగిపోయింది. జ్ఞాపకము అంటే సంస్కృతంలో స్మృతి. స్మృతి అంటే ఏది మృతి చెందిందో అది స్మృతి. అంటే శాస్త్రము చైతన్యవంతమా? మృతిశీలమా? అది గతిశీలమా? సుగతిశీలమా? అని విచారణ చేస్తే, శాస్త్రము కేవలము ఒక జ్ఞాపకం మాత్రమే. ఒక జ్ఞాపకం ఒక క్షణంలో, ఒక సన్నివేశంలో మనల్ని తడుముతుంది. అన్ని జ్ఞాపకాలు ఒక్కసారే చుట్టుముట్టవు. ఒకదాని వెంట, ఒకదాని వెంట జ్ఞాపకాల దొంతరలు మానవుడి యొక్క సంస్కారాన్ని ఎలా కదుపుతూ ఉంటాయో, అట్లాగే అనుగ్రహ తరంగాలు కూడా సత్యసాయి భగవానుడు మనకి సమీపిస్తున్నటువంటి వేళ మనకు ఏమనిపిస్తుంది అంటే, దర్శనం అయిన తర్వాత ఏమిటి? తర్వాత మనల్ని వదిలిపెట్టడం లేదు. అథాతో. తర్వాత ఏమిటి? అంటే, తర్వాత ఆయన దివ్యమైనటువంటి పాదాలను ఒక్కసారి తాకితే బాగుండు కదా! అవి దొరికితే బాగుండు కదా! దొరికించుకున్న వాళ్ళంతా ఎంతో అదృష్టవంతులు కదా! ఇన్నేళ్లుగా నేను వచ్చినా నాకు దొరకలేదు కదా! ఆలోచనలన్నీ మహావేగంతో వస్తాయి. పాద స్పర్శ దొరికింది. స్పర్శ కింపురుష లోకం. పధ్నాలుగు లోకాలలో పదమూడు లోకాలు హాయిగా అనుభవించవచ్చు. శరీరంలోనే ఉన్నాయి. పధ్నాలుగవది మాత్రం కింపురుష లోకం. ఒక తల్లి తన కడుపున పుట్టినటువంటి బిడ్డని, తన ప్రతిస్వరూపాన్ని, ప్రతిబింబాన్ని తాకినప్పుడు భద్రత కారణంగా బిడ్డ ఆనందాన్ని అనుభవిస్తున్నది. నా బిడ్డను తాకాను కదా అని తల్లి అనుభవిస్తున్నది. స్పర్శానుభూతి కింపురుష లోకం రెండు భావాలను ఏకకాలంలో కలిగిస్తున్నది. ఏకకాలంలో తల్లికి, బిడ్డకు శాంతి కలుగుతున్నది. బిడ్డ అనుకుంటున్నది, నా తల్లి నా దగ్గరే ఉన్నది అని. తల్లి అనుకుంటున్నది, నా బిడ్డ నా దగ్గరే ఉన్నాడు, భద్రంగా ఉన్నాడు. ఇది మూడో మనిషి లేడక్కడ. మూడో మనిషి ఎవరు అంటే మన దేహము, మన ఆత్మ ఒకటి గనక అయినట్లయితే, లేదు ద్వైతంలో రెండు అయినట్లయితే, మూడవదంటూ లేదు. మూడవది కనపడని దానికి మనం దైవమని పేరు పెట్టాం. కనపడనిదై దొరకనంత కాలం యాతన పడుతున్నాం. దొరకదేమో అనుకుంటున్నాం. స్పర్శానుభూతి దివ్య పాద సంస్పర్శ చేత. దర్శనానుభూతితో ఒక అనుభూతి కలిగితే, స్పర్శనంతో అది ద్విగుణీకృతమైనటువంటి మహదానందం కలిగింది. భగవంతుణ్ణి నేను తాకాను కదా అని. శాంతి కలిగిందా లేదా? ఇంకా ఆయన ఏం మనతో ఏం మాట్లాడలే. మాట్లాడితే, దర్శనమైంది, స్పర్శనమైంది, బాగున్నావా అని స్వామి పలకరించారు అనుకుందాం. ఇక ఆనందానికి అవధులు లేని ఆనందం అది. సీమారేఖలు ఎరగనటువంటిది. గగన గగనాంతరాల వరకు కూడా జీవుణ్ణి ప్రబుద్ధమానం చేయగలిగినటువంటి, పరమోత్కృష్టమైనటువంటి పలకరింతలో నుంచి ఒక హిరణ్యగర్భానందాన్ని జీవుడు కూడా అనుభవిస్తాడు. అనుభవించేటువంటి దివ్య క్షణాన్ని గనక మనం నిలబెట్టుకోగలిగినట్లయితే అది పరమ శాంతికి దారితీస్తుంది. అన్నివేళలా లభించదే, దర్శనం దొరకదే, స్పర్శనం దొరకదే, వెళ్ళినప్పుడల్లా మాట్లాడాలని ఏం లేదే, అప్పుడు ఏం చేయాలి? అనుభూతిని, అనుభవాన్ని శాస్త్రంగా మలుచుకొని మన లోపల పెట్టుకోవాలి. శాస్త్రంగా అంటే స్మృతిగా, జ్ఞాపకంగా. పదే పదే దాన్ని బయటకు తీసుకుంటూ ఉండాలి. ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. అది శాస్త్రం అంటే. శాస్త్రం అంటే గ్రంథం కాదు. నీతి నియమావళికి సంబంధించిన పుస్తకం కాదది. నువ్విది చేయాలి, ఇది చేయకూడదు అన్నటువంటి భావన కాదది. అందుకే అరుణాచలంలో భగవాన్ రమణులు, వారికి ఆర్థరైటిస్ వచ్చి కాళ్ళు పొడుగ్గా జాపుకొని ఒక కంఫర్టబుల్ గా కూర్చుంటే ఒక ఫారెన్ లేడీ వచ్చి ఇక్కడి మర్యాదలు తెలియని కారణంగా భగవాన్ కి ఎదురుగ్గా వారి మొహం కనపడుతూ ఉంటుందని కూర్చొనినేలమీదే ఆమె కాళ్లు కూడా బారజాపి భగవాన్ వైపు కాళ్లు పెట్టి కూర్చుంది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోయారు. ఇలా మడిచి కూర్చోవాలి, బాసిం పెట్లు వేసుకోవాలి, నిభృతంగా ఉండాలి ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టి కాళ్లు ముడుచుకో అన్నారు. కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి రమణులు ఏం చేశారంటే, బోధ ఎలా ఉంటుందో చూడండి "మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం" కాబట్టి నెమ్మదిగా చాలా అతి కష్టం మీద తన కాళ్లు తానే ముడుచుకోవటం మొదలు పెట్టారు. పరిచారకుడు చూశాడు, "భగవాన్ మీరు ముడుచుకోకండి మీకు నొప్పులు ఎక్కువ అవుతాయి" అన్నారు. ఎన్నో ఏళ్ళు దేశంలో పుట్టి ఎన్నో ఏళ్లుగా బాసిం పెట్లు వేసుకుని అనేక సంవత్సరాలు ఉన్నటువంటి నాకే ఇలా ముడుచుకోవటం కష్టమైపోతే దేశ మర్యాద తెలియని ఇప్పుడే వచ్చిన ఆడబిడ్డ కావలసినట్టుగా బాసిం పెట్లు ఎలా వేసుకుంటుంది? ఇంతకీ సుఖాసనమే ఉన్నతోన్నతమైనటువంటి జానైక స్థితి కదా! వారిని అలాగే ఉండనివ్వండి అన్నారు. అంటే ఒక జ్ఞాని అయినటువంటి వాడు ఇంకొకరు అడక్కుండానే శాంతిని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే మహాత్మునిని సమాశ్రయించినట్లయితే ఏమవుతుంది అని ఒక చిన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, మహాత్మునిని గనుక సమాశ్రయిస్తే నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు ప్రేమమయుడు అవుతాడు, ప్రేమమయుడు జ్ఞాని అవుతాడు. మరి జ్ఞాని కావటానికి శాస్త్రాలు చదవక్కర్లే. మళ్ళీ స్వామి భగవాన్ రమణులు ఒక అందమైన మాట చెప్పారు "శాస్త్రాలా పండితులకు అక్కరలేదు, పామరులకు అర్థం కాదు మరి ఎవరికోసం అవి? వాడ-వాడినంత సేపే వాటి వినియోగం తప్ప వాడకపోతే ఒట్టి జనపకట్టెలప్ప" అన్నారు. అది. అంటే పశువు మేసేటువంటి జనపకట్ట వెట్టిదే శాస్త్రం, స్మృతి. అలాగే శాంతి అంటే పుస్తకాలలో నుంచి శాంతి రాదని, గోడమీద కోపం పోగొడితే శాంతి వస్తుంది. చదివి, చదివి అలసిపోతాం తప్ప శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పోవలసింది నేను అన్నటువంటి దేహాత్మ భావన నశించాలి. నాకు మాత్రమే అన్నటువంటి ఒక మమకారం నశించాలి. అహంకార మమకార రాహిత్యం నెమ్మదిగా మన లోపల ఉన్నటువంటి ఐ, రియల్ ఐ, సూడో ఐ, రియల్ రెండు ఉన్నాయి. సూడో ఐ-- నిజానికి ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా మనం విచారణ చేయాలి. జోహారి విండోస్ అని ఉన్నాయి. జోహారి విండోస్ అంటే ప్రతి మనిషిలో నాలుగు గదులున్నాయి. ఒకటి పబ్లిక్ సెల్ఫ్, పబ్లిక్ చూసేది. రెండవది ప్రైవేట్ సెల్ఫ్. మూడవది డార్కర్ సెల్ఫ్. నాలుగవది అన్నోన్ సెల్ఫ్. నాలుగింటికి, నాలుగింటికి సెంట్రల్ పాయింట్ గా రియల్ సెల్ఫ్ ఉన్నది. అంటే నువ్వు మార్గంలో నుంచైనా నువ్వు వెళ్ళు, నువ్వు చేరవలసింది మాత్రం రియల్ సెల్ఫ్ లోకి నువ్వు వెళ్ళాలి. ముందు ప్రపంచంలో-- అందుకే స్వామి అన్నారు "This country doesn't need great men, this country needs only good men" అన్నారు. గ్రేట్ మెన్-- All great men are not really good but all good men are really great. కాబట్టి ప్రపంచానికి అక్కరకు వచ్చే, ఉపయోగపడే, ప్రపంచానికి శాంతిని చేకూర్చగలిగినటువంటి జీవులంతా కూడా ప్రపంచానికి గనక అందగలిగినట్లయితే అది మా-- అది పరమ శాంతి నిధానం అయి ఉంటుంది గనుక స్థాయికి వెళ్ళమని చెప్తున్నారు. పబ్లిక్ సెల్ఫ్ లో ప్రపంచం మనల్ని చూస్తుంది. పైన చూసి బేరీ చేసుకుంటుంది. వేసుకుని మనకొక ముద్ర వేస్తుంది. దాన్ని స్వామి ఒక మాట అన్నారు. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకడు వ్యవసాయం కోసం ఎద్దుని, దున్నపోతుని కొనుక్కున్నాడు. వ్యవసాయం చేసుకోవాలి, కాడికి కట్టాలి. ముందు మొట్టమొదట ఏం చేశాడట అంటే ఎద్దు వీపు మీద, దున్నపోతు వీపు మీద రెండు ముద్రలు వేశాడట. వేసి ఇది నాది అనుకున్నాడు. ఏది నాది? ముద్ర పోయేదే ముద్ర వేయించుకున్న దున్న పోయేదేనన్నారు స్వామి. ఇక్కడ ముద్ర ఎటువంటిది అంటే జీవుడు ఇది నాది అని అనిపించుకోవటానికి వేసుకునేటువంటి ముద్ర. ప్రపంచం కూడా వీడు గొప్పవాడే అని ముద్ర వేస్తుంది. అందుకని స్వామి ఒక హెచ్చరిక చేశారు. లోకాన్ని నమ్మకండి బంగారు, ఒక్క లోకేశ్వరుడిని నమ్ముకోండి చాలు అన్నారు. ఎందుకంటే లోకం నిన్ను ఈవేళ మెచ్చుతుంది, రేపు నిన్ను గెచ్చు-గిచ్చుతుంది. ఎప్పుడైనా ఒకసారి నచ్చావులే అంటుంది. నచ్చటం, గిచ్చటం, మెచ్చటం లోక సంబంధమైన వ్యవహారం. దాని నుంచి నీకు శాంతి లభించదు. మీరు ఎంత గొప్పవారో అనగానే తాత్కాలికమైన ఆనందం కలగవచ్చు గాక. ఈయన గొప్పవారు మాత్రమే కాదు, ఈయన జ్ఞాని, ఈయన పూర్ణుడు, ఈయన పవిత్రుడు అన్న భావన అవతల వాడికి గనక కలిగినట్లయితే కలిగించిన వాడికి, కలిగిన వాడికి శాశ్వతమైనటువంటి ఒక బంధం ఏర్పడుతుంది. అక్కడ ముద్రలు లేవు. రకమైన Imprints and Impressions రెండూ లేవు. ఉన్నది ఏమిటంటే స్వస్వామి సంబంధతః. దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెప్పారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బంధాల కంటే పరిపూర్ణమైనటువంటి, అచ్చమైనటువంటి బంధం ఏదంటే స్వస్వామి సంబంధతః. నాకు పరమాత్మకి ఉన్నటువంటి బంధమే నిత్య సత్య శాశ్వతమే అది. మిగతావన్నీ, కూడి ఉన్నవన్నీ కూడా ఊడిపోయేవని అన్నారుగా స్వామి. కాబట్టి శాంతి కావాలి అనుకున్నటువంటి మనం Public self నుంచి, Private self నుంచి, Darker self నుంచి, Unknown self నుంచి సాధనా మార్గంలో మనం నెమ్మదిగా బయటపడి Real self లోకి మనం వెళ్ళాలి. Real self ఎలా ఉన్నదట అంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం.యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి పృథివిశ మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం నేను నేను నేను అంటూ లోపల ఉండనే ఉన్నది నేను ని పట్టుకో నేను నేను కాదు నేను నశించిపోయేదే బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము అనబడే నాలుగు దశలు దాటి దాటి దాటి మార్పు చెంది చెంది మార్పు ఎరగని ఒక మరణ స్థితి ఏర్పడినప్పుడు ఏది మరణిస్తున్నదన్న విచారణ జరిగినప్పుడు దేహమే మరణిస్తున్నది దేహమే మార్పు చెందుతున్నది లోపల ఉన్నటువంటి ఆత్మ రకంగానూ మార్పు చెందేది కాదు తల్లి గర్భంలో అండంగా ఉన్నప్పటి నుంచి శరీరాన్ని వదిలి పెట్టే వరకు ఆత్మ పెరగలేదు తగ్గలేదు అది దానికి contraction లేదు expansion లేదు ఉన్నదంతా దేనికయి అంటే ఇదిగో స్థూల శరీరానికి ఉన్నది గనుక విచార ధారలో గనుక ఎవరైతే ఒక మార్కండేయుడి వలె ఒక ధ్రువుడు వలె ఒక ప్రహ్లాదుడి వలె ఉండగలిగినట్లయితే ఆత్మనిష్ట అతి చిన్న వయస్సులో గనుక ఏర్పడినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ఎండ్ ప్రొడక్ట్ by ప్రొడక్ట్ కాదు ఎండ్ ప్రొడక్ట్ ఏది అంటే అది శాంతి ఎప్పుడైతే మనము శాంతిగా ఉంటామో ఎప్పుడైతే చీకటి గుహగా ఉన్నటువంటి ఇంట్లో ఒక చిన్న light వెయ్యగానే చీకటి అంతా పారిపోయిందో అన్ని వస్తువుల మీద కాంతి ప్రసారం జరిగిందో అన్ని వస్తువులు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయో వస్తువు మనకు కావాలని మనం ఏరుకోగలిగిన స్థాయికి మనల్ని నడిపిస్తున్నదో అటువంటి శాంతి నీ యందే ఉన్నది గనుక శాంతిని నీ అంతట నీవే I వైపు ప్రయాణం చేయాలి దేహము అనేటువంటి I కొట్టేయాలి ఆత్మ అనే I కి టిక్ పెట్టుకోవాలి దానికై అంతరంగ ప్రయాణం చేయాలి ఆంతరంగిక ప్రయాణానికి సుఖము సంతోషము ఆనందము మూడు వస్తువులకు సంబంధించినది శాంతి ఇంద్రియాలకు ఇంద్రియాతీతమైన మనసుకు మనోతీతమైన భావనా భూమికకు చెందినటువంటి ఒక పరమ చరమ ప్రశాంత విశ్రాంత స్థాయి మాత్రమే అది శాంతి శాంతి మనం శాంతంగా ఉంటే సర్వ వస్తువులు ఎట్లా దీపం వల్ల వెలిగి పోయినయో మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా శాంతి ఏర్పడుతుంది మనమే అల్లకల్లోలమైనట్లయితే మన ఇంద్రియాలే మన అధీనంలో లేకపోతే మన భావనలే గనుక అనేక రీతులలో సాగిపోతూ ఉన్నట్లయితే ముందు మన శాంతి నశించిపోతుంది కనుక ప్రశాంత ప్రసన్నమైనటువంటి శాంతి సర్వ ప్రపంచానికి extend చేస్తూ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి Code Name God అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం మధ్య చదివాను Code Name God మణి భౌమిక్ అనేటువంటి ఆయన రాశాడు ఆయన laser technology కి పితామహుడు ఆయన గురించి ఎందుకు అనుకోవాలంటే ఒక వైజ్ఞానికవేత్తగా ఉండి ఆయనకు అనేక ప్రశ్నలు ఇలాగే మనలాగానే తత్వ విచారణ లో ఉన్నాడు శాంతి ఎలా దొరుకుతుంది అనుకున్నాడు పంజాబ్ రాష్ట్రం నుంచి బయలుదేరి ఉద్యోగం దొరికితే శాంతి దొరుకుతుంది అనుకున్నాడు ఉద్యోగం దొరికింది ఉద్యోగం ఆయనకు నచ్చలే అందుకే స్వామిని ఒకసారి అడిగారు స్వామి అసలు జీవితం అంటే ఏమిటో ఒక definition ఇవ్వండి స్వామి అని అడిగారు అడిగితే స్వామి అన్నటువంటి మాట ఏం లేదు బంగారు జీవితంలో దొరికిందేమో నచ్చదు నచ్చేదేమో దొరకదు దాని పేరే జీవితం అన్నారు సత్యం అది అలాగే ఇక్కడ కూడా ఉద్యోగం దొరికింది శాంతిగా ఉండాలిగా ఆనందంగా ఉండాలిగా కాదు కాదు దీని కంటే మంచి ఉద్యోగం దొరకాలి అనుకున్నాడు అది దొరికింది కాదసలు దేశం అంతా పేద దేశం అయిపోయింది ఇక్కడ ఏమి growth లేదు దేశం గాని ఇంకో దేశం వెళ్లిపోవాలి అనుకున్నాడు చూడండి అతను అనుకున్నవన్నీ అయినాయి ఎందుకయినాయి అంటే అతని లక్ష్యం వేరు అతని గమ్యం వేరు అతను ప్రపంచానికి ఇవ్వబోతున్నది వేరు అతను భగవంతుడి చేతిలో ఒక tool కనుక tool ని ఆయన ఎలా నడిపిస్తున్నాడు వెళుతూ వెళుతూ శాంతి అమెరికా వెళితే తప్ప నాకు శాంతి లేదు అనుకున్నాడు అమెరికా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక research దీంట్లో join అయినాడు research చేస్తూ చేస్తూ నెమ్మదిగా laser కిరణం కనిపెట్టాడు ఇవాళ laser అంటే ఏమిటో మనందరికీ తెలుసు పితామహుడు ఆయన అయిన తర్వాత ఒకరోజున ఇన్ని చేశాను పంజాబ్ వదిలాను దేశం వదిలాను అమెరికాకు వచ్చాను మహోన్నతమైనటువంటి భౌతిక స్థితికి చేందాను కానీ ఇంత చెందించటానికి కారణమైన వాడు ఎవరో నాకు ఇంకా కనపడలేదు గనుక నాకు శాంతి లేదు అనుకున్నాడు కానీ అటువంటి వాడు ఉన్నాడు అన్న స్పృహ రాగానే అమ్మయ్య ఇదంతా నేనేం చేయలేదు కదా ఎవడో చేయించాడు కదా అనగానే లోపల ఒక శాంతి ఏర్పడింది శాంతి ఎలా ఏర్పడింది అంటే అహం నశించిన కారణంగా అహంకారం నశించిన కారణంగా నేను చేశానన్న భావన తొలగిపోగా ఆనందం కలిగింది కనుక I ఎలా పోగొట్టుకున్నాడు తనంతట తానే విచారణ చేత అందుకనే తద్విద్ధ్ Prపాతేన Prణిపాతేన ముందు surrender కావాలి పరిప్రశ్నేన మనకు మనం ప్రశ్న వేసుకోవాలి నేను సత్య సాయి భగవానుడితో యాభై ఏళ్ళు కూడి ఉన్నాను బాగుంది చాలా బాగుంది నాలో పరిణామం ఏమిటి ఏమీ అంతగా కనపడటం లేదు ఏం చేస్తాం పరిణామం ఎరగనటువంటి పరిచయం శుద్ధ దండగ అందుకే స్వామి చెప్పారు మహాసముద్రం మధ్యంలో గండశిల ఉంది గండశిల మీదికి కెరటాలు అలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి ప్రతిరోజూ కెరటాలు గండశిలని తాకుతూనే ఉన్నాయి తడుముతూనే ఉన్నాయి తడుపుతూనే ఉన్నాయి కానీ నీళ్లు వెంటనే కిందకు జారగానే మళ్లీ యధాప్రకారంగా రాయి తనలో తాను అంటించుకున్నటువంటి తేమను పోగొట్టుకున్నది ఇలా గండశిల సముద్రము ఏకకాలంలో చాలా ఏళ్లుగా ఉన్నాయి.గండ శిరసు బాగు చేద్దామని సముద్రానికి లేదు సముద్రంలో ఉన్నాను కదా నాకేం ఏం దొరుకుతున్నదని ఆలోచన గండ శిలకు లేదు కానీ అప్పుడే ఒడ్డున గాలి వాటున ఒక చిన్న మట్టి బెడ్డ కొట్టుకొని కొట్టుకొని వచ్చింది కెరటం వెళ్లి మట్టి బెడ్డ ని తాకింది మట్టి బెడ్డ నెమ్మదిగా కరిగి సముద్రం అయిపోయింది కనుక భగవంతుడితో కూడి ఎన్నాళ్లు ఉన్నామన్నది ప్రధానం కాదు కూడిక వలన కలయిక వలన పరిచయం వలన దర్శనం వలన స్పర్శనం వలన నిరంతర వితరణం అయినటువంటి చింతన వలన సరళ చింతన చేత మనకు కలిగినటువంటి పరిణామం ఏమిటి అని గనక ప్రశ్నించుకున్నప్పుడు ఇదిగో నేను జరుగుతున్న దానికి నేను కర్తను మాత్రం కాదు కర్త ఎవడో ఉన్నాడు వాడి పేరు నేను భగవంతుడు అనుకుంటున్నాను అని ఎవరికి స్ఫూర్తి ఉంటుందో వాడు మొదట పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే దేహాత్మ భావన నశించిపోయిన లో దేహానికి కావలసిన ఏది అక్కరలేకుండా పోయింది కనుక కోరిక లేకుండా పోయింది కోరిక చిట్టచివరికి భగవంతుడా నువ్వు నా వాడివి కావాలన్న కోరిక కూడా నశించాలి అన్నారు స్వామి ఎందుకంటే నీవాడు కాకపోతే గదా కావాలని కోరుకోవటం భగవంతుడు నీవాడు ఎట్లా అయినాడో నీవు కూడా భగవంతునికి చెందిన వాడివి ఇది స్వస్వామి సంబంధతః పరమార్ధికమైనటువంటి భూమిక మనకు ఏర్పడినప్పుడు మనకు కలిగేటువంటి మహదానందం అన్నాం మహదానందం లో ఇంద్రియాలకి ఏవి పోటెత్తడం లేదు నిస్తంద్ర మందిరంగా ఉన్నాయి నిశ్చలంగా ఉన్నాయి ఏది రాని ఏది పోని ఏది జరగని ఏది జరక్కపోని ఏది ఎట్లా రూపాంతరీకరణం చెందని అసలు అనుకున్నది ఏది జరక్కపోని అనుకోనివి అన్నీ వచ్చి ఒంట్లో పడని నిశ్చలంగా ఉన్నాడు అది పరమ శాంతమైనటువంటి మహా స్థితి కనుక శాంతి మనోభూమిక మనో స్థితి ఆంతరంగికమైనదే గాని బహిరంగమైనటువంటిది కాదు బయట వస్తువుతో ఎప్పుడైతే మనం కూడి ఉంటామో వస్తువు యొక్క లక్షణాలు వస్తువు పట్ల అపేక్ష వస్తువు పట్ల ఉన్నటువంటి ఆకర్షణ వస్తువు పట్ల ఉన్నటువంటి అభిమానం వస్తువు పట్ల ఏర్పడిన అభిజాత్యం దాని వలన ఏర్పడిన దంభం దాని వలన ఏర్పడిన ప్రగల్భం మన అహంకారాన్ని పదింతలుగా పెంచుతుంది తప్ప అహంకారాన్ని అది తుంచలేదు కనుక శాంతము దేనితో కూడి ఉండాలి అంటే ధర్మ శాంతంగా ఉండాలి అధర్మ శాంతి అధర్మ శాంతి is only a pretension కదా ధర్మ శాంతి pure ఎలాగంటే భీష్ముడు ఉన్నాడు నిజమే ప్రతిజ్ఞ చేశాడు కురు సామ్రాజ్యం అంతా తన వారికే ఇచ్చాడు బయట వాడి ఎవరికీ ఇవ్వలేదు ఆయన కానీ మహాభారత సంగ్రామంలో అంపశయ్య మీద పడుకునే దాకా ఆయనని వీడని ఒక భావన మాత్రం ఉన్నది అది ఏమిటంటే నేను మహత్తరమైనటువంటి త్యాగం చేశాను కురు వంశాన్ని నిలబెట్టాను ఇటు ధృతరాష్ట్ర కుమారులు అటు పాండురాజు కుమారులు అందరూ కూడా భద్రంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళున్నారు దీనికంతటికీ నేను కారణం అన్న ఒక భావన రెండవది సత్య ధర్మము తన కట్టెదుట అవమానం పాలవుతున్నటువంటి వేళ తన ఇంటి కోడలు వివస్త్రుని చేయాలని తన ఇంటి వారే ప్రయత్నిస్తున్నటువంటి వేళ నోరు మెదపని భీష్ముడికి అంపశయ్య గతి పట్టిందా లేదా అలాగే పితామహ కురుకుల పితామహ నా గతి ఏమిటి నేను ఓడిపోయినానా ఓడిన తర్వాత ఆయన గెలిచారా ఏమిటి ధర్మ సందేహం అని అడిగితే తల వంచుకున్న భీష్ముడికి అంపశయ్య తప్పలేదు అంపశయ్య మీదకు వెళ్ళిన తర్వాత బాణాలు గుచ్చుకున్న కారణంగా కురు వంశంలో తిన్నటువంటి ఉప్పు వలన ఏర్పడిన రక్తమంతా యుద్ధభూమిలో ఇంకిపోయిన తర్వాత శ్రీ కృష్ణ పరమాత్మ కనిపించాడు భగవంతుడు కనిపించాడు కలుషిత రక్తం అంతా దూరమైపోయిన తర్వాత అందుకనే స్వామి విషయ వాంఛలను వదిలిపెట్టండి విష్ణు వాంఛను పట్టుకోండి అన్నారు విష్ణు వాంఛ అప్పుడు కలిగింది ఎదురుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగన్మోహనుడై చతుర్భుజాలతో శ్రీ మహావిష్ణువై మూల దర్శనం ఇచ్చాడు అప్పుడే విష్ణు సహస్ర నామాన్ని గానం చేశాడు అంటే భీష్ముడికి గృహస్తు కాదు కానీ గృహస్తు యొక్క అందరి బాధ్యతలని యాతనలని గుండె బరువు ఎక్కేట్టుగా మోశాడు జీవించినంత కాలం ఆనందం లేదు యుద్ధం చేయవలసి వస్తే పాండు కుమారుల మీద యుద్ధం చేయవలసి వచ్చింది ధర్మం మీద అధర్మం అని తెలిసి బాణం ఎక్కుపెట్టవలసి వచ్చింది ఆనందం ఎక్కడున్నది శాంతి ఎక్కడున్నది అంపశయ్య మీద పడుకున్నప్పటికీ కూడా ప్రాణ నిర్గమన వేళ వరకు ఆయనకు శాంతి లేదు కలుషిత రక్తము పూర్ణమైన తర్వాత పరమ శాంతి కలిగినప్పుడే పరమాత్మ యొక్క భావన లోపల వెలిగింది వెలగగానే సుషుమ్నా గీతిగా విష్ణు సహస్ర నామాన్ని ఆనందంగా సానందంగా స్వాదువుగా మధురంగా పరమోత్కృష్టంగా భక్తి భావంగా శరణాగతి భావంతో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన అప్పుడు భీష్ముడు సేవయా భావించాడు మరి అదే కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు మరి భీష్ముడికి సంస్కారం ఎందుకు కలగలేదు అని విచారణ చేసినట్లయితే శరణాగతి లేదు కృష్ణున్ని సామాన్య మానవుడి వలె దర్శనం చేశాడు కృష్ణుడు పాండవుల తరఫున వచ్చాడన్నటువంటి భావనలోనే భీష్ముడి మనస్సు కూడా ఉన్న కారణంగా భీష్ముడికి శాంతి చిక్కలేదు తన వారందరూ తన నుంచి దూరమైపోగా తాను ఒక్కడే యుద్ధభూమి కలో భూమిలో అంపశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు యుద్ధం చేసిన వీరులంతా విశ్రాంతి చెందటానికి గుడారంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు తెలిసింది.నేను మానసికంగా సమూహాన్ని సృష్టించుకున్నాను. ఇవాళ ఏకాంతంగా సమూహాన్ని సృష్టించుకోవాలంటే నా చుట్టూ విరిగిన రథాలు, శవాలు, హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రుల యొక్క రోదనలు వీటన్నింటి మధ్య నేనున్నానే. ఇవన్నీ వదిలి పెట్టగలిగితే నాలో ఉన్న పరంజ్యోతిని, పరంధాముని యొక్క దివ్య శబ్ద నామాన్ని నేను వినగలుగుతాను కదా అని అనుకున్నప్పుడే సర్వవ్యాపకమైనటువంటి శ్రీ మహావిష్ణు స్తోత్ర పూర్వకమైనటువంటి విష్ణు సహస్ర నామాన్ని ఆయన మనస్సు గీతంగా, గానంగా, గమకంగా, పరమాద్భుతంగా అది సాగిస్తూ వచ్చింది. అంటే జీవుడు ఎరుకతో ఉండాలి. ఇది భీష్ముల వారికి జరిగినట్టుగా మనకు కూడా జరుగుతుందని అనుకోవటానికి వీల్లేదు. అందుకనే దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లా కానప్పుడే చింతింపన్ బలెనీ పదాబ్జములన్ శ్రీ కళహస్తీశ్వరా అంటాడు ధూర్జటి. అతి చిన్న వయస్సులో గనుక శాంతము, ఇంద్రియ నిగ్రహం గనుక నేర్పగలిగినట్లయితే ఇంద్రియాలు ఇంకా ఆకృతి తాల్చక ముందే వాటికి సంబంధించినటువంటి కథలు గాథలన్నీ కూడా పిల్లలకు చెప్తూ గనుక ఉన్నట్లయితే ప్రపంచం విసిరేటువంటి ప్రతి సవాలుని కూడా ఎదుర్కోగలిగినటువంటి ఒక ధీశక్తిని పొందుతాడు. మిగతా శక్తులు డబ్బు వలన గాని, కీర్తి వలన గాని, సౌందర్యం వలన గాని, అంగబలం వలన గాని, అర్థబలం వలన గాని మానవుడు ఏమీ సాధించలేడు గనుక పొందవలసినది ఏమిటంటే నిరంగుడైన, అనంగుడైన, సర్వాంగుడైన, సర్వాంగీణమైన, జగన్మోహనమైనటువంటి పరమాత్మ యందు మన మనస్సు గనుక నిమగ్నం చేసుకోగలిగితే లోపల ఉన్నటువంటి అనేకానేక జన్మ జన్మాంతర సంస్కారాలన్నీ కూడా అంటే వాసనలు, మూలవాసనలు నశించి పూర్ణుడై, తృప్తుడై, శాంతుడై, దాంతుడై, క్రాంతుడై తన యందు తాను నిష్ఠలో ఉండగలుగుతాడు గనుక దీనికి జపమూ, తపమూ, స్వాధ్యాయము, ధ్యానము, సద్గోష్ఠి, సదాచారము, సమ్యక్ సంకీర్తన ఇవన్నీ కూడా దోహద పరుస్తాయి గనుక జీవుడు ఇక్కడ పుట్టగానే ఒకనాటి తల్లి గర్భంలో తన బిడ్డను పెట్టుకొని ఉన్నప్పుడే పరమేశ్వరుని గురించి విన్నది. పరమేశ్వరుడి యొక్క లీలలు కన్నది. మానసికంగా ఎవరో చెప్పగా, తాను చదవగా పరమేశ్వరుడి యొక్క లీలా వైభవాన్ని తనది చేసుకొని తన ఊపిరితో పాటు తన బిడ్డకు కూడా రంగరించి పంపిన కారణంగా ఆనాటి జాతి అంతా కూడా ఒక భక్త జాతి, ఒక భద్ర జాతి, ఒక ముక్త జాతి, ఒక విముక్త జాతి, ఒక నిరుక్త జాతి, ఒక పూర్ణ జాతి ఏర్పడింది. రోజున ఏం చేస్తున్నాం? గర్భవతి అయిన తల్లి దగ్గర టీవీ ఆన్ చేసి వెళ్లిపోతున్నాం. ఏం వింటున్నది లోపల ఉన్నటువంటి బిడ్డ? రోదన వింటున్నది. అనేకమైన పరుషమైనటువంటి భాష వింటున్నది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి అనేక భావజాలాలది లోపలికి absorb చేసుకోగలుగుతున్నది. కనుకనే ఒక నికృష్ట జాతి ఈనాడు పుడుతూ ఉన్నది. ఇది కఠినమైనటువంటి మాట అయినప్పటికీ కూడా దేవుడే లేడంటూ ప్రారంభమైనటువంటి కలియుగ లక్షణానికి విరుగుడు ఏమిటి అంటే కలియుగానికి ముందు ఏర్పడినటువంటి కృత, త్రేతా, ద్వాపరలలో అనేకమంది శాంతులై, ముక్తులై ఎంత ఆనందంగా ఉన్నారో మనం గనుక గమనించగలిగినట్లయితే, శాస్త్రాధ్యయనం చేయగలిగినట్లయితే, పౌరాణికమైనటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగినట్లయితే, తాత్విక చింతనా రీతి గనుక అలవడినట్లయితే రోజున కూడా ఒక అక్రూరుడు, ఒక విదురుడు, ఒక మహానుభావుడు తల్లి గర్భంలో నుంచి వస్తాడు. అటువంటి జాతి నిర్మాణంలో ఒక తల్లి తన పాత్ర నిర్వహించాలి.
SSSMC · audio

Mahopadesam - 08

Home

Mahopadesam - 08

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 34:27

More in this series

Mahopadesam

9 episodes · 5 hr 14 min

  1. 33 min 1

    Mahopadesam - 01

  2. 31 min 2

    Mahopadesam - 02

  3. 40 min 3

    Mahopadesam - 03

  4. 30 min 4

    Mahopadesam - 04

  5. 33 min 5

    Mahopadesam - 05

  6. 40 min 6

    Mahopadesam - 06

  7. 30 min 7

    Mahopadesam - 07

  8. 34 min 8

    Mahopadesam - 08

    Now playing
  9. 40 min 9

    Mahopadesam - 09