Skip to content
Transcript తెలుగు
[సంగీతం] సందేశమే ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధాలపై శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారి విశ్లేషణ. [సంగీతం] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం ని పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీ సత్య సాయి సందేశామృత పంచాంగిక కార్యక్రమంలో ఇవాళ నాలుగవ రోజు తొలిరోజంతా ఉపదేశము సందేశము ఆదేశము మూడింటి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని భేదభావ స్థితిని కులంకషంగా మాట్లాడుకున్నాం రెండవ రోజు Love all అనేటువంటి ఒక మాటని ఒక మహా వాక్యాన్ని మానవుడు తన సాధనా జీవితంలో ఎట్లా వాడుకోవాలి దేనిని ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలి అసలు ప్రేమ అంటే ఏమిటి అనేటువంటిది అది ఒక dynamics లో దాన్ని మాట్లాడుకున్నాం నిన్న serve all సత్య సాయి భగవానుడి యొక్క అవతారం అంతా కూడా ప్రేమ సేవ అనబడేటువంటి ఒక సేవా యోగం వైపు నడిపించినటువంటి మహత్తరమైనటువంటి సాధనా భూమిక అది సేవ అనేక విధాలుగా సాగుతుందని ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల లాలసతతో భోగతతో అట్లాగే కీర్తి కోసం ప్రాచుర్యం కోసం జీవుడు గనుక ప్రయత్నించిన ట్లయితే అది చాకిరీ చేసినట్లేనని చాకిరీ చేస్తే కూలి డబ్బులు దొరుకుతాయని సేవ చేస్తే భగవంతుడి అనుగ్రహం దొరుకుతుందని విచారణ చేసుకున్నాం అయితే ఇవాళ మూడవ మహా వాక్యమైనటువంటి help ఎవరికి వెళ్ళబోయే ముందు సోదరులు మిత్రులు వారి రంగంలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఎప్పుడూ నిలబెట్టుకున్నటువంటి వల్లీశ్వర్ గారు ఒక మంచి ప్రశ్న వేశారు చాలా ఉదాత్తమైనటువంటి ప్రశ్న ఇది ఆత్మ శుద్ధం అది చైతన్యం మాలిన్య రహితం కళంకిత రహితం అది ఛాయా రహితం జన్మ రహితం మరణ రహితం అంతా రహితమే మరి అది వచ్చి దేహంతో సహితం అయినప్పుడు కూడి ఉన్నప్పుడు ఎందుకని తన లక్షణాన్ని పోగొట్టుకుంటున్నది అనేది ప్రశ్న కొంత వారు భాగవతం నుంచి సమాధానం కూడా చెప్పారు అది పరమేశ్వరుడు ఇచ్చిన సమాధానమే అయితే పరమేశ్వరుడు కూడా అంతా చెప్పడు కొంత మనకు వదిలిపెడతాడు ఆలోచించమంటాడు ఆలోచించమనేటువంటి రీతిలో మన అవగాహనకి లోబడి మన పరిమితికి లోబడి మన దృష్టికి లోబడి మన సాధనకి లోబడి ఇంకాస్త ముందుకు వెళ్లి గనుక విచారణ చేసినట్లయితే ఆత్మ మానవ దేహాన్ని ధరించినప్పటికీ తన ఉనికిని కోల్పోలేదు తన చైతన్య స్థితిని కోల్పోలేదు తన మార్పు ఎరగనటువంటి అనంతమైనటువంటి స్థాయిని కోల్పోలేదు అది దిగజారలేదు కానీ ఇవన్నీ జరిగేటువంటి దేహంలో తాను సాక్షి భూతంగా మాత్రం ఉన్నది తల్లి గర్భంలో అండంగా పిండంగా ఉన్నప్పటినుంచి శరీరాన్ని వదిలిపెట్టే వరకు ఆత్మ నిత్యమై సత్యమై శాశ్వతమై నిర్మలమై బుద్ధమై శుద్ధమై మహా చైతన్య స్వరూపంగా ప్రవాహంగా లేదు మెలకువగా ఉన్నది అనంతంగా కనిపించటం లేదు బిందు స్వరూపంగా ఉన్నది కానీ ఉండి ఏం చేస్తున్నది అంటే దేహము ఇంద్రియాలు షడూర్మములతో షడ్వికారములతో షడ్వర్గములతో ఏర్పడినటువంటి దేహం చేసేటువంటి అనేకానేకమైనటువంటి కర్మలకి అది నిజానికి అంతఃసాక్షిగా ఉన్నది అందుకనే భగవాన్ రమణ మహర్షి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి ప్రతివిష మనసా స్వం చిన్వతా మగ్ధతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్టో భవత్వం అంటే హృదయ స్థానంలో నేను నేను నేను అని అనునిత్యమూ అనుక్షణమూ ఒక యోగ స్థితిలో నిరంతరమూ ఒక అఖండ అనాహతమైనటువంటి నాదం చేసేటువంటి ఒక చిద్ఘన ఆనంద బిందు స్వరూపమే నీవని ఎరుగరాదా అది నీవు కదా నీవును వదిలిపెట్టి నేను అంటే ఇంద్రియాలు సర్వాంగీణమైన దేహం మనస్సు ఆలోచనలు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నింటితో కూడినటువంటి దేహాన్ని నేను అని భావిస్తున్నావు కనుక నీవు ఆత్మవి అన్నటువంటి స్పృహను కోల్పోతున్నావు అన్నారు దానికి ఒక సాధారణ స్థాయిలో విచారణ చేస్తూ ఒక సాధకుడు ఇటువంటి ప్రశ్నే వేసినప్పుడు కాస్త ముందుకు వెళ్లి చాలా rational గా చాలా radical గా చాలా practical గా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో చాలా prudent గా ఒక సమాధానం ఇచ్చారు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడుబుద్ధి చిత్తము అహంకారము అనబడేటువంటి నాలుగు నాలుగు plus మూడు కలిపితే ఏడు అయితే పను సప్తకాన్ని దాటితే మిగిలిందంతా ఆత్మే కదా అబ్బా అని ఒక సమాధానం ఇస్తే అయ్యా ఇది పండితుడికి అర్ధం అవుతుంది పామరుడికి గతి ఏమిటి అడిగినప్పుడు ఏం లేదు ప్రతి ఇంటికి ఒక సింహద్వారము ఒక వాణి ద్వారము ఉంటుంది అలవాటు అయినటువంటి యజమాని అర్హత ఉన్నటువంటి యజమాని హక్కు ఉన్నటువంటి యజమాని ఎరుక కలిగిన అటువంటి యజమాని సింహద్వారాన్ని తట్టి లోపలికి ప్రవేశిస్తాడు ఎరుక లేని వాడు అట్లా రావటానికి అర్హత లేని వాడు ఇంకా ప్రాప్తి లభించని వాడు వెనక నుంచి వాణి ద్వారం అంటే దొడ్డి దారిలో నుంచి వాడు ప్రవేశిస్తాడు వీడు ఇటు నుంచి వాడు అటు నుంచి ఎవరు ఎటు నుంచి ప్రవేశించినా ప్రవేశిస్తున్నది మాత్రం హృదయ కుహరంలోకే కాబట్టి ఆత్మే దేహంగా వెలిగిపోతున్న దన్న భావనతో నిలకడ చెంది ఉన్నట్లయితే దేహాత్మ భావన కూడా ఒక పవిత్రీకరణ స్థాయికి చేరుతుంది కనుక దేహాత్మ భావన అల్ప స్థాయి కాదు దేహం పట్ల మమకారము వ్యసనము వ్యామోహము ఉండటం తప్పు తప్ప రెండు దేహము ఆత్మ భిన్నం కావన్నారు దానిని సర్వదేవతా అతీత స్వరూపులు సర్వవేదాంత సారాలకు మూలమైనటువంటి సత్య సాయి భగవానుడు ఇంకా అధునాతనమైనటువంటి భాషలో మన స్థాయిలో దీన్ని content container relation గా చెప్పారు content ఏముంది గాడ్రేజ్ బీరువా అది దేహం కొన్నాళ్ళు బాగుంటుంది తర్వాత రంగు వెలుస్తుంటుంది దానికి ఉండేటువంటి lock మారిపోతుంటుంది రంగులు మారిపోతుంటాయి పైన పెచ్చులు ఊడిపోతుంటుంది కానీ నువ్వు locker లో పెట్టుకున్నటువంటి డైమండ్ నగ అది అట్లాగే ఉంటున్నది డైమండ్ నగ పెట్టుకుంటాను అంటే పెట్టుకో అంటున్నది పెట్టుకోవటం అయిపోయింది నిన్ను దాచి పెడతాను అంటే దాచుకో అంటున్నది పెట్టుకున్న దాచుకోబడిన మరొక చోట ఉన్న తన స్థితిని ఎట్లా కోల్పోవడం లేదో ఆత్మ కూడా నిత్య సత్య శుద్ధ బుధ్యాత్మకంగా పరమ పవిత్రంగా అనంతంగా అద్భుతంగా అఖండంగా చిద్ఘనంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా మహా పరిపూర్ణంగా ఒక చైతన్య స్థాయిలో కదలక మెదలక అదరక బెదరక చెదరక నిలబడి ఉన్నటువంటి ఒక అచంచలమైనటువంటి అచలమైనటువంటి స్థితి గనుక అచలం లోపల ఉన్నది చలిస్తున్నది అంతా బయట ఉన్నది బయట చూస్తున్నదంతా దేహమే కానీ ఆత్మ కాదు ఆత్మ చూపిస్తున్నది అందుకే సత్యసాయి భగవానుడిని ఒక ప్రశ్న వేశారు స్వామి బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థం అంటున్నారే బ్రహ్మ పదార్థానికి నిజానికి అర్థం ఏమిటి abstract hypothesis మనసు పట్టుకో లేదా మనసుకు అతీతమైనదా మనసుకు అతీతం అయితే ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మం పదార్థం ఎట్లా అయింది అన్నప్పుడు ఏం లేదు బంగారు దేనిని కనులు చూడలేవో దేనివలన కనులు చూడగలుగుతున్నాయో ఎరుకే బ్రహ్మ పదార్థం ఎంత అద్భుతమైన నిర్వచనం సత్యసాయి భగవానుడి నోట వెలువడిన అటువంటి పరమాద్భుతమైన వ్యాఖ్యానం ఇది కన్ను ఉన్నా కనుగుడ్డు ఉన్నా లోపల నేత్ర పటలం ఉన్నా ఇవన్నీ కూడా కేవలము యాంత్రికమైనటువంటి భావనలో ఉన్నవే తప్ప మార్మికము తాంత్రికము పూర్ణము శుద్ధము అయిన మహా చోదక ప్రేరణ శక్తి మాత్రం లోపల ఉన్నటువంటి బ్రహ్మ పదార్థమే కనుకనే సర్వం ఖల్విదం బ్రహ్మ కదులుతున్నంత సేపు ఇది భ్రమగా ఉన్నది ఇది కదలటం గనక ఆగిపోయి నిశ్చలమైతే ఇది బ్రహ్మమే కాబట్టి బ్రహ్మము యొక్క ఒక చలన పార్శ్వము దేహం అయినట్లయితే అచల పార్శ్వము ఆత్మ అయినట్లయితే ఆత్మ నిత్యంగానే ఉన్నది మరి ఆత్మ చెడిపోయిందా అంటే చెడే పదార్థంలోనే అది ఉంటుంది చెడే పదార్థం ఎప్పుడూ బయటే ఉంటుంది చెడని పదార్థం దాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది శిథిలాలయంలో శివుడు ఉన్నట్లుగా ఎప్పుడైతే దేహము గూడు బసేయరా దీని అవసరం ఎప్పుడైతే తప్పిపోతుందో కలవశాత్ కార్య కారణ కాల కర్తవ్య నిమిత్త వశాత్ వచ్చినటువంటి జీవుడు దేహాత్మ భావనను దాటి పరమాత్మ భావనతో అనుసంధానం చేసుకోగలిగితే బయట ఉన్నటువంటి దేవీదేవతా స్వరూపాల ఉపాసన చేత ఉపవాసముల చేత ఆరాధన చేత పూజాతుల చేత అనేక కారణాల చేత అనేకానేక మార్గాల ద్వారా మళ్ళీ తనలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని తాను దర్శించుకోవటం కోసమే ఇవ్వబడినటువంటి మహత్ పూర్ణమైనటువంటి మానవ జన్మగా మానవ శరీరంగా గనుక మనం భావన చేస్తే శరీరం మాధ్యం కలు ధర్మ సాధనం పరిపూర్ణమైనటువంటి ధర్మకర్మలు చేయటానికి కర్మలనన్నింటినీ ధర్మమయం చేయటానికి శరీరం తప్ప మనకు మరొక ఆధారం లేదు ఒక వేదాంతి దేహము తుచ్ఛమని అల్పమని నీచమని నీటి మీద బుడగ అని ఎప్పుడైనా రాలిపోయేదేనని భయపడుతూ ఉంటాడు నిజమే రాలే దాకా ఇదే శాశ్వతం మన నించి వీడిపోయే దాకా ఇదే మనకు ఆధారం దేహం ఉన్నది గనుక విచారణ చేస్తున్నాం దేహం ఉన్నది గనుక వింటున్నాం దేహం ఉన్నది గనుక అంటున్నాం దేహం ఉన్నది గనుక కంటున్నాం కాబట్టి దేహాన్ని ఒక పవిత్రమైన అటువంటి దేవాలయంగా పరమేశ్వరుడు మనయందు ఆత్మ స్వరూపుడిగా బిందు స్వరూపుడిగా ఉన్నాడనేటువంటి ఒక భావనతో గనుక ఉన్నట్లయితే దేహాత్మ భావన నెమ్మది నెమ్మదిగా కాలగమనంలో సన్నగిల్లి తగ్గి నియంత్రించబడి నిరోధించబడి చివరకు నిర్మూలించబడుతుంది గనుక అధ్యాత్మ విచార ధారలో అధ్యాత్మ అంటేనే దేహాతీతమైన భావన అని శంకర భగవత్పాదులు ఆత్మ అనేటువంటి దానికి వారు ఇచ్చిన పరమాద్భుత నిర్వచనం ఏమిటి అంటే ఆత్ అంటే ఏమి మా అంటే లేదు ఏమీ లేదా అంటే ఏమీ ప్రత్యేకంగా లేదు ఉన్నదంతా ఆత్మే ఆత్మే కాస్త దేహంగా ప్రకృతిగా అనేకమైనటువంటి రుతువులుగా.భావన కల్పిస్తూ మాయా మేయ జగత్తులో మళ్ళీ శంకర భగవత్పాదులే అన్నట్లుగా అద్దంలో బొమ్మలాగా ప్రతిబింబం లాగా విశ్వం దర్పణ దృశ్య మాన నగరీ తుల్యం నిజాంతర్య తం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భుతం యధా నిద్రయా యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణము అమూర్తమై ఉన్నది అసలు దక్షిణామూర్తి ఎక్కడున్నాడు అన్నారు శంకర భగవత్పాదులు అమూర్తమైన దానికి మూర్తిమంతమైనటువంటి స్వరూపాన్ని సగుణాన్ని స్వభావాన్ని నీవు కల్పించుకోవాలి ఒక అకాడమిక్ డిస్కషన్ కోసం ఒక విచారధార కోసం ఒక వాద ప్రతివాదన కోసం అసలు విషయాన్ని పట్టుకోవటానికి అసలు కానిదేదో దొరికితే తప్ప అసలు దొరకదు ఎందుకంటే జన్మ ఎత్తితే తప్ప కర్మ తీరదు కర్మ చేస్తే తప్ప జన్మ తీరదు గనుక రెండింటిని కూడా ఒక సమన్వయ స్థాయిలో ఒక తీవ్రమైనటువంటి విచారధారలో మన మనస్సును గనుక లగ్నం చేయగలిగిన నిమగ్నం చేయగలిగిన ధ్యానాతురులమైయున్న ధ్యానులమై నిలకడ చెంది ఉన్న యోగత్వాన్ని మనం సంపాదించుకున్న చివరకు పరమంగా చరమంగా లభించేది అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. లోపల గురు స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మే చిత్తజుడై ఉన్నాడు గనుక చిత్తం లోపల ఉన్నాడు గనుక సర్వము కూడా బ్రహ్మీమయంగా ఉన్నది పూర్ణంగా ఉన్నది కాలుష్యం లేదు అందుకనే గరుడ పురాణంలో కూడా మరొక్క మాట మనం దేహం వదిలిపెట్టినప్పుడు ఆత్మ ఏమవుతుంది ఎక్కడికి పోతుంది చెట్టుకు వేలాడుతుంది అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళదు అది ఇక్కడే ఉంటుంది ఎక్కడికో వెళ్ళటానికి ఇంకోటంటూ ఉంటే కదా అందుకనే మీరు మహత్తరమైనటువంటి సద్గురువు యొక్క ఆఖరి మాటలు ప్రపంచంలో వినండి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇక్కడే ఉంటున్నాను అన్నాడు మనకి ఇక్కడే అంటే భూమి అనుకుంటాం కానే కాదు చతుర్దశ భువనాలు తన శరీరంలో నింపుకొని ఆపాద మస్తకము కూడా భువన సదృశ్యంగా ఉన్నటువంటి మానవ దేహం దేవాలయమే కదిలే రథమే ఇది కవచమే ఇది దహింపబడుతుంది గనుక దేహమని శీర్ణమవుతుంది గనుక శరీరమని మార్పు చెందబడుతుంది గనుక శరీయతి ఇతి శరీరహా అని అనేకమైన పేర్లు ఇవ్వబడ్డాయే కానీ ఇది నిస్తులమైన అనంతమైన అఖండమైన ఆనంద సంధాయకమైనటువంటి ఒక మహా మహిమాన్వితమైనటువంటి ఆయుధంగా మనం భావన చేయగలిగినట్లయితే శరీరాన్ని వదిలిపెట్టిన అటువంటి ఆత్మని ఎవరు తీసుకు వెళతారు ఒక పసరిక పాము పదరిళ్లలో పారాడుతున్నటువంటి వేళ ఎక్కడో గగన గగనాంతరాలలో విహారం చేస్తున్నటువంటి ఒక గరుడ పక్షి అంతటి పచ్చని పొదలోనూ పాకుతున్న పచ్చ పాముని పట్టుకొని ఎట్లాగైతే తన గోళ్లతో పట్టుకొని ఎంత వేగంగా భూమి మీదకు వచ్చి అంతే వేగంతో వెళ్లి అది మరణించే దాకా తన గోళ్లతో పట్టుకొని మరణించటానికి కొన్ని క్షణాల ముందు ఎట్లా తింటుందో అలాగే ఆగామి సంచిత ప్రారబ్ధ అనబడేటువంటి మూడు ప్రధానమైనటువంటి యోగాలలో కర్మలలో జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చిత్తము ఏర్పడే దాకా ఆత్మ అక్కడే ఉంటుంది అందుకనే మనస్సును నియంత్రించవచ్చు చిత్తాన్ని నిరోధించటం కష్టం చిత్తాన్ని దానికి వృత్తులున్నాయి గనుక దానిని నిరోధించగలిగినట్లయితే దానిని యోగం అన్నాడు పతంజలి సత్య సాయి భగవానుడు దానిని ఇంకా చాలా సరళం చేసి యోగము అంటే ఏం లేదు బంగారు నీతో నీవు కూడి ఉంటే అది అసలు యోగం అన్నారు మనకి అన్నింటితో యోగించటం చాలా తేలిక ఎవరెవరితోనో కలిసి ఉండటం చాలా తేలిక ఎవరెవరితోనో మాట్లాడటం మనకు చాలా తేలిక కానీ మనతో మనం మాట్లాడుకునేటువంటి శక్తిని స్థైర్యాన్ని ధైర్యాన్ని తపోభూమికని మనం సంపాదించుకోవటం కష్టం కాబట్టి సత్సంగం చేత సత్సాంగత్యం చేత సద్గోష్ఠి చేత సదాచారం చేత సమ్యక్ సంకీర్తన చేత అనేకమైనటువంటి భావనల చేత మనల్ని మనం తడుముకోవటానికి మనల్ని మనం తాకటానికి మనల్ని మనం స్పృశించుకొని స్వా ఆత్మ అనుబంధాన్ని అనుభవాన్ని ఆనందాన్ని ఇక్కడే ఇప్పుడే పొందటానికి శరీరాన్ని ఆధారం చేసుకుందాం లోపల ఉన్నటువంటి ఆత్మ చివరగా సంబ-- దీనికి సంబంధించి కేనోపనిషత్తులో ఒక చిన్న కీలకమైనటువంటి ఉపదేశం ఉన్నది ఏమిటి అంటే సర్వ ఇంద్రియాల యొక్క చలనము కూడా ఆత్మ నుంచి ప్రభవించినదే ఇంద్రియము దానంతట అది కదలదు దానిని అట్లా చెబితే అర్థం కాదు గనుక శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఒక మాట అన్నారు ఎవరు శివుడు శివుడు ఆత్మ అయితే చీమా అనేటువంటి ఇంద్రియం కదులుతుంది వాడు కదిలించకపోతే ఇంద్రియాలు స్తబ్ధమై నిశ్శబ్దమై నిశ్చలమై అచలమై స్తంభీభూతమై ఒక్కచోట నిలకడ చెంది ఉంటాయి గనుక సర్వాన్ని కదిలిస్తున్నది ఎవరు అన్నటువంటి ప్రశ్న దోషరహితమైనటువంటి ఆత్మే నని అది నిశ్చలంగానే ఉన్నదని తాను కదలకుండా అన్నింటినీ కదిలిస్తున్నదని మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలు దాటి సహస్రారము ఒక్కటే కదలని స్థితిలో ఉన్నదని ఆరు చక్రాలు కదులుతున్నదని ఆరు ప్లస్ ఒకటి ఏడు కలిపితే వాటిని సప్తజ్ఞాన భూమి కలుగా వాటిని ఏడు కొండలుగా అది శ్రీ వేంకటాచల స్థితిగా శ్రీ వేంకట అచల స్థితి వేం అంటే పాపం కట అంటే పోగొట్టటం అచల అంటే స్థిమితంగా ఉండటం అది వెంకటాచల శబ్దానికి కాబట్టి ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి దివ్య విధానంలో దీని యొక్క దర్శనాన్ని అంతరంగ దర్శనాన్ని గనుక మనం సాధించుకోగలిగినట్లయితే ప్రతి ప్రశ్నకి సమాధానం మన యందే ఉన్నది ఎక్కడ సూది కింద పడుతుందోఅక్కడ వెతకాలి అది అక్కడే ఉంది గనుక పడ్డది ఒకచోట వెతికేది ఒకచోట అయినట్లయితే అధ్యాత్మ పూర్ణం కాదు గనుక ఇటువంటి ఆలోచనను రగిలించినటువంటి ఒక మంచి ఉత్తమోత్తమ ప్రశ్న సంధించినటువంటి వల్లీశ్వరుడు అంటే పరమశివుడే అటువంటి శివాయతనమైనటువంటి ఒక మూర్తికి నమస్కరిస్తూ స్వామి యొక్క సర్వ అనుగ్రహము వారి యందు ప్రవేశించాలని ప్రార్థిస్తూ స్వామి చెప్పినటువంటి help your అనేటువంటి ఒక మాట లోకి మనం వెళదాం. పైకి ఇంగ్లీషులో చెప్పారు ఏమిటి బాబా గారు ఇలా చెప్పొచ్చునా? అని అంటే మనకి అర్థం అలా చెప్తే తప్ప అసలు తెలుగు అర్థం కావటం లేదుగా కాబట్టి help your రెండు మాటలున్నాయి చాలా అందమైన మాటలు. నిన్ననే service అంటే ఏమిటో మాట్లాడుకుని మాట్లాడుకుని మళ్ళీ దాని కంటే కాస్త తక్కువ స్థాయికి చెందిన help లోకి దిగామా అనిపిస్తుంది కానే కాదు help అన్నా service అన్నా ఒకటే నిజానికి. help ఎవరికి చేయాలి? అసలు help ఎందుకు చేయాలి? అంటే సహనావవతు అని చదువుతున్నాం కదా రోజు కలిసి ఉండాలి కలిసి సంపద పెంచుకోవాలి కలిసి చదువుకోవాలి కలిసి బుద్ధిని పెంచుకోవాలి అంటే అంతా కలిసే ఉండాలి కలిసే చేయాలి సోమంగా కాక సత్రంగా ఉండాలి comprehensive గా ఉండాలి community గా ఉండాలి సంఘటితంగా ఉండాలి. సంఘటితంగా ఉన్న ప్రకృతి ఎప్పుడూ కూడా సృష్టి ఎప్పుడూ కూడా అసమగ్రంగానే ఉన్నది, అసమానంగానే ఉన్నది. ఒక సమ సమాజ స్థాపనను నేను సాధించబోతున్నాను అని ఎవరన్నా అంటే మనం జాలిపడవలసిందే. అటువంటి సమాజం ఒక ఊహాచిత్రమే కానీ అది వాస్తవిక దృష్టి మాత్రం కాదు. సమాజంలోనే ఒక అసమానత ఉన్నది దాని సృష్టిలోనే మరి అసమానత ఎప్పుడూ ఉంటుందా? gap ఎప్పుడూ పూర్తలేమా అంటే కలిగిన ప్రతి వాడు నలిగిన వాడిని కాపాడుకోవాలి అందుకే కలిగిన వాళ్ళు ఏర్పడ్డారు. కలిగిన వాడు కలిగిన వాడుగానే ఉండిపోతే నలిగిన వాడు నలిగిన వాడుగానే ఉండిపోతే రెండూ ఎట్లా సమన్వయం? కనుక ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూ సహజీవన సౌందర్య దివ్య విధానంలో నుంచి ప్రపంచాన్ని, సృష్టిని, ప్రకృతిని సమర్థవంతంగా నెలబెట్టుకోవాలి. ప్రకృతి యొక్క స్వీయ ధర్మానికి గౌరవాన్నిస్తూనే, మర్యాదనిస్తూనే అది చేసేటువంటి అనేకా అనేకమైనటువంటి విన్యాసాలకి లోనవుతూనే ఎన్నెన్నో ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా తాను తానుగా ఉండగలిగినటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే ఇవాళ మన చేతిలో మనం ధరించవలసింది help అనబడేటువంటి ఒక మాట ఒక సాధన అది ఒక గొప్ప ఉపకరణం. ఎవరికి help చేయాలి? పాత్రత ఎరిగి దానం చేయమన్నది. పాత్రతను ఎలా ఎరగాలి? దానం చేశాక అపాత్రుడు అని తేలితే ఏం చేద్దాము అని. పాపం తీసుకున్న వాడిదే కానీ పాపం ఇచ్చిన వాడిది కాదు. అయితే సమాజం ఎప్పుడూ కూడా ఒక వర్గం అన్నివేళలా సమాజం నన్ను కాపాడితే బాగుండును నేను కూడా వాడి స్థాయిలో జీవించగలిగితే బాగుండును అని ఒక భౌతికమైనటువంటి స్థితిలో ఎప్పుడూ కూడా ఆశిస్తూనే ఉంటాడు. భౌతిక అవస్థలో దానం చేత అనేకమైనటువంటి సత్కర్మలు చేయటం ద్వారా అనేకమందిని సంఘటిత పరచటం ద్వారా అనేకమందిని ఏకీకృతం చేయటం ద్వారా ఒక సంపద కలిగినటువంటి వాడు పది మంది దొక్కలు నింపగలిగితే అది ఒక రకమైనటువంటి help. help అనేటువంటి మాటని మాములుగా మన విచారణ కోసం పరోపకారము అనే మాటలో గనక వెళ్లినట్లయితే సహాయము పరోపకారము భిన్నం కాదని సహాయము అంటే అవసరమైనప్పుడు అవసరమైనటువంటి వేళ స్పందన కలిగినటువంటి దివ్య విధానంలో నుంచి గనక చేయూతనివ్వగలిగినట్లయితే అది help అప్పటికప్పుడు చేసేది. service ఒక నిరంతరమైనటువంటి అధ్యాత్మ సాధన. భౌతికమైన స్థాయిలో జరిగేదంతా help అనుకున్నట్లయితే ఆధ్యాత్మిక స్థాయిలో జరిగేదంతా service అనుకోవాలి. సత్యసాయి భగవానుడు అన్నటువంటి ఒక మాట ఏమిటంటే service ని గనక నువ్వు spiritual activity గా దానిని ఒక spiritual tool గా నువ్వు గనక భావన చేసినట్లయితే అది ఒక పవిత్రీకరణం చెందుతుంది. పవిత్రతా భావంతో చేసేటువంటి ప్రతి పని ఒక విజయాన్ని, ఒక ఆనందాన్ని, ఒక పరితృప్తిని, ఒక సంతృప్తిని కలిగించి పరిదీనత్వాన్ని సంహారం చేస్తుంది గనుక service ను అధ్యాత్మలో ఒక యోగంగా భావన చెయ్. అందుకే దానికి ఆయన సేవా యోగము అని పేరు పెట్టారు. సహాయ యోగము అనేది లేదు. సహాయం ఎప్పటికప్పుడు క్షణానికి క్షణం ఏర్పడేది సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అవతల వాడి యొక్క అవసరం యొక్క తీవ్రతను బట్టి, మన స్పందనను బట్టి జరిగేది help. help అనే దాంట్లో ఎవరు చేయాలి అని అనుకుంటున్నటువంటి వాడు అన్నివేళలా సంసిద్ధంగా ఉండాలి. ఏమో ఎటునుంచి నా అవసరం ఎవరికొస్తుందో, ఎవరికి నేను సహాయం చేయవలసి ఉంటుందో అనేటువంటి ఒక దివ్య భావన మనసులో గనక ఉంచుకోగలిగినట్లయితే రెండవ శబ్దం ఎవరు? ఎవరంటే అన్నివేళలా సహాయం చేయటానికి మన తల్లిదండ్రుల తదినాల్లో, మన పుట్టు పండుగలో లేకపోతే మరొకటో మరొకటో ఎందుకు రావాలి? మానవుడు తన నిత్య నైమిత్తికమైనటువంటి జీవితంలో అనేకానేకమైన ఒడుదుడుకులకు లోనవుతున్నప్పుడు అందరికీ చేయలేకపోయినా ఎవరైనా మన వాకిట వచ్చి నాకు సహాయం కావాలి అన్నప్పుడు వాడి పాత్రతను ఎరగకుండా చేసేటువంటిది నిజానికి help. క్షణాన వాడు మనల్ని కోటానుకోట్ల రూపాయలు కోరడు. సహాయం మీ నుంచి కావాలి అంటాడు. అది కేవలం డబ్బు కాకపోవచ్చు, పిడికెడు అన్నం కావచ్చు, ఒక ఆప్త వాక్యం కావచ్చు, ఆత్మీయతా స్పర్శ కావచ్చు, వాత్సల్య పూరితమైనటువంటి ఒక చల్లని మాట కావచ్చు. ఇది కూడా help కానీ మనం సిద్ధంగా ఎవరు అనేటువంటిది సాధనలో మనం పట్టుకోవలసినటువంటి మాట. general గాసాధారణంగా మనం చేసే పని ఎవరైనా మన వాకిట్లోకి వచ్చి బెల్ కొట్టి నాకిది కావాలి అనగానే మనకి mood ఉంటే చేస్తాం mood లేకపోతే తర్వాత కనపడండి అంటాం. తర్వాత కనపడటానికి వాడికి అవసరం ఉండకపోవచ్చు. తీరికగా రండి అంటాం వాడికి తీరికే లేకపోవచ్చు అసలు మనిషే ఉండకపోవచ్చు. కనుక మన వాకిట్లోకి వచ్చి మన సహాయం ఒకడు కోరాడు అంటే మన స్థితిగతులను కూడా ఒక్కసారి గమనించుకొని దంభము చేత ప్రగల్భం చేత సహాయం చేయకూడదు. మనం కూడా పరిమితి ఎరిగి చేయాలి అందుకే సత్యసాయి భగవానుడి యొక్క సందేశంలో చాలా ఏళ్ల క్రితం సుమారుగా నలభై సంవత్సరాల క్రితం సేవా కార్యక్రమాలు ఇంకా ఊపందుకోని రోజుల్లో ఒక మాట చెప్పారు "One percent of your income" దానిని దాటి మీరు సేవలో ప్రవేశ పెట్టద్దు. One percent తొంబై తొమ్మిది రూపాయలు మీ జేబులో పెట్టుకోండి ఒక్క రూపాయి మీది కాదనుకోండి పక్కన పెట్టుకోండి అది ఎవరికీ అవసరం వస్తుందో దానికి వినియోగించండి. అయ్యో నా దగ్గర వంద ఉన్నాయి వంద ఇచ్చేస్తానంటే కర్ణుడిని ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు స్వామి. కర్ణుడు దానం చేసినా అహంకారంతో చేశాడు. అలాగే బలి చక్రవర్తి ఏమన్నాడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే నా వాకిట్లోకి వచ్చి నాకిది కావాలి అని మూడు అడుగుల నేల అడిగితే నేను కాక ఎవరు ఇవ్వగలడు అన్నాడు ఒక మాట. రెండవది బ్రాహ్మణుడా పసివాడా బలి చక్రవర్తి వంటి దాన చక్రవర్తి దగ్గరకు వచ్చి మడులో మాణ్యలో అగ్రహారలో పల్లకీలో మణిమాణ్యలో ఇవి అడగవాలి గాని దాత యొక్క శక్తిని కూడా గ్రహించలేని నువ్వు మూడు అడుగుల నేల అడుగుతున్నావు అని పరిహసించాడు. అక్కడ ఆయనకు కావలసింది మూడడుగులే తప్ప మన దగ్గర ఉన్న మణిమాణ్యాలు కాదు. మన దగ్గర ఎంత ఉండనివ్వండి వాడికి ఏం కావాలో అది ఇవ్వగలిగితే అది నిజమైనటువంటి help. కనుకనే శుక్రాచార్యుడు చెప్పాడు "నీ సమస్త రాజ్యాన్ని కబళించడానికి బలి చక్రవర్తి వచ్చాడంటే ఇంకా అహం చావనటువంటి బలి" ఏమన్నాడు విష్ణువు యొక్క చేయి కిందై మీద నాదుంట మేల్గాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నా అపాయమే. శరీరం ఉంటుందా గురుదేవా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నా యజ్ఞశాల యొగ్గకు వచ్చి విశ్వజిత్ యాగం చేయబోతున్నా విశ్వాన్ని జయించబోయేటువంటి యాగం ఇది. దీనిలో విష్ణు స్వరూపమైనటువంటి పరమాత్మ వచ్చి నాకిది కావాలని అడుగుతున్నప్పుడు దీనిని మించిన యజ్ఞ సాఫల్యం ఏమున్నది అన్నాడు. విశ్వాన్ని జయించటానికి రాలా జయింపబడిన ఇంద్రియాలతో ఇదే విశ్వంలో జీవించటానికి జీవుడు వచ్చాడు. చిన్న స్పృహ బలికి లేనందువలననే వెంటనే ఏమన్నాడు భార్యను పిలిచాడు. పిలిచి ఇదిగో హిమ పాత్ర బంగారు పాత్ర పట్టుకురా దానిలో పుణ్యతీర్థాలలో నుంచి తెచ్చినటువంటి నదీ జలాలు ఉన్నాయి అవి తీసుకురా. వటువు యొక్క చిన్న పాదాలు పెట్టడానికి ఒక బంగారు పళ్ళెరం తీసుకురా అనటంలోనే అక్కడ help అడుగుతున్నది మూడడుగుల help అడుగుతున్నాడు ఆయన. నాకిది చాలు అంటున్నాడు మిగతావి నేనేం చేసుకొను నాకవన్నీ అవసరం లేదంటున్నాడు. అడుగుతున్న వాడి అవసరాన్ని గుర్తించకుండానే అవసరానికి మించి తన యొక్క దాన ప్రతిభని చూపించటానికి దాన గర్వాన్ని దానాతిశయాన్ని ప్రదర్శించటానికి బలిదైత్యేంద్ర కరద్వయీకృత జలప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగిస్సుమనస్సం ప్రార్థిత శ్రీదమున్ కలితానంబ్ర రమాలలాట పదవీకస్తూరికా శాతమున్ నళినామోదము రతనునూపురిత నానావేదమున్ పాదమున్ అంటాడు పోతన. తాను చూసి వచ్చినట్లే సర్వ పాదములు వేదములు ఉపనిషత్తులు ఆగమాలు అన్నీ కూడా అలంకరించుకున్నటువంటి దివ్య పాదాలని ప్రక్షాళన చేయటానికి కడగటానికి అభిషేకించటానికి బలి చక్రవర్తి ఇంత హంగామా చేశాడు అంటాడు. హంగామా ఫలితం ఏమిటంటే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి స్థితిగతులను పోగొట్టుకున్నాడు. అయితే పరమేశ్వరుడు దోచుకోవటానికి వచ్చిన వాడు కాదు, దయాహీనుడు కాదు, కరుణ లేనివాడు కాదు కానీ ఆయనన్నాడు "నీకు రావలసినటువంటి ఇంద్ర పదవి వచ్చేదాకా నిన్ను నేను కాచుకుంటా అంతవరకు పాతాళ లోకంలో నన్ను స్మరిస్తూ నారాయణ స్మరణం చేస్తూ ధ్యానిస్తూ యోగిస్తూ నీవు ఉన్నట్లయితే నీవు ఉన్నటువంటి ప్రదేశానికి సుదర్శనంగా నిత్యదర్శనంగా నీకు నేను రక్షకుడినై నిలుస్తాను. నీకు ఇంద్ర పదవి వస్తుంది కానీ ఎప్పుడు ఎప్పుడో వస్తుంది వచ్చేదాకా ఉండు. నిన్ను ఒక్కడినే వెళ్ళమనటం లేదు నీ తాత నా భక్తుడు గనుక ప్రహ్లాదుడిని కూడా నేను పంపిస్తున్నాను. తాత మనవలు ఇద్దరూ కూడా మళ్ళీ మనవడైన నీకు ఇంద్ర పదవి లభించేదాకా" ఎలా లభిస్తుంది? ఇటువంటి దానం చేత ఇంద్ర పదవి లభించదు నారాయణ స్మరణం చేత లభిస్తుంది. నారాయణ రూప భావన చేత లభిస్తుంది. నారాయణ తత్వ విచారణ చేత నీ దేహాత్మ భావన నశించి బలి అన్నటువంటి భావన పోయి అసురీ లక్షణం నశించి ప్రహ్లాదు భక్తవరదుడైనటువంటి నా ప్రహ్లాదుని యొక్క సాంగత్యంలో సాన్నిధ్యంలో సామీప్యంలో ఒక సాయుజ్య స్థితిని నీవు పొందగలుగుతావు అని పరమ కరుణామూర్తి అయినటువంటి నారాయణుడు వటువే త్రివిక్రముడై పలికినటువంటి మాటలు మన బోటి వారందరికీ ఒక హెచ్చరిక. దానాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. దాన గ్రహీత ఎవడైతే ఉన్నాడో వాడు ఉత్తమ శీలుడై ఉండాడి ఉండాలి. వాడి అవసరం genuine గా ఉండాలి. అది నిజాయితీతో కూడి ఉండాలి. దానికి మూడు లక్షణాలు చెప్పారు వాడు, వాడి కుటుంబము, వాడి మీద ఆధారపడ్డ వాడి దొక్క ఎండిపోతుంటే దొక్కలు నింపవలసినటువంటి పని దాతది. దాత దొక్క నింపడానికి ఏమిస్తాడు? ఒకసారి జిల్లేళ్ళమూడిలో జిల్లేళ్ళమూడి అమ్మ మంచం మీద కూర్చొని ఉంది ఎవరెవరితోనో మాట్లాడుతున్నది. ఎవరో వచ్చారు ఏదో అడిగారు ఎవరో వెళ్లారు ఏదో ఇచ్చారు ఇవ్వగానే అమ్మ వ్యక్తిని అడిగింది ఏమిచ్చి పంపావు అని. ఏం లేదమ్మా అణా ఇచ్చి రోజుల్లో అణా ఉండేది అణా ఇచ్చి పంపించానమ్మా అంటే అణా అన్నమవుతుందా వచ్చింది అన్నం కోసం కదా అన్నం పెట్టవలసింది అన్నది. కాబట్టి అవసరం help ఎటువంటిది అనేటువంటిది మనం గనక గమనించినట్లయితే కాస్త స్పృహలో ఉన్నట్లయితే అందరికీ కూడా సమాన స్థాయిలో ప్రపంచం అంతా కూడా సహాయం అందుకునే స్థాయిలో అది ఉంటుంది.
SSSMC · audio

Sandesame Adesam - 08

Home

Sandesame Adesam - 08

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 31:13

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

    Now playing
  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11