Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] సందేశాన్ని ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధాలపై శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారి విశ్లేషణ. [ఇంట్రో మ్యూజిక్] కర్ణుడు మహాదాతగా మనం ఇప్పటికీ కీర్తిస్తాం. దానవీరుడు అంటాం ఆయన్ని. దానము యందు అంతటి వీరుడు లేడు అని. కానీ అంతటి దానవీరత్వంలోనూ ఏమున్నది అంటే రాబోయేటువంటి వర్షాకాలానికి ఇవాళ కట్టెలు దాచుకోలేనటువంటి దాతగా మిగిలిపోయినాడు. చరిత్రలో దానం చేస్తే ఇటు కర్ణుడి లాగా అటు బలి చక్రవర్తి లాగా మాత్రం చేయకూడదు. పాత్రత ఎరిగి చేయాలి అనేటువంటి ఒక పాఠము, గుణపాఠము ఇద్దరి పాత్రల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకే స్వామి ఏం చేసినా ఉద్వేగం చెందకండి. ఏం చేసినా తాదాత్మ్యం చెందకండి. ఏం చేసినా పరమ నిష్ఠతో, నిగ్రహంతో, నిశ్చలతత్వంతో, స్ఫూర్తితో కానీ ప్రేమతో మీరు గనక చేసినట్లయితే, మీరు వాడి చేతికి ఒక్క రూపాయి ఇచ్చినట్లయితే మిమ్మల్ని చూసి పది మంది ఇస్తే వాడి అవసరం తీరిపోతుంది. సమాజం గనక ఇటువంటి బాధ్యతను తీసుకోగలిగినట్లయితే అది Help Ever. ఎవర్ అంటే నిరంతరం నువ్వు ఒక్కడివే చేయమని కాదు. ప్రపంచానికి అవసరం వచ్చినటువంటి వేళ నీవు అనేకమైనటువంటి విషయాలలో నీ దాతృత్వాన్ని ప్రకటించుకోవచ్చు. ఇది కేవలము ఒక సంపదకు సంబంధించిన విషయం. ఇది భౌతిక అవస్థకు చెందింది. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు States మనం ప్రతిరోజూ అనుకోవాలి. ఒకటి Physical, రెండవది Meta Physical, మూడవది Spiritual. నిజానికి Meta Physical కి Spiritual కి ఏమి తేడా లేదు. సన్నని దారపోగే అడ్డం. ఇటుది అటు అయిపోతుంది. ఈశ్వరవాదానికి, నిరీశ్వరవాదానికి ఉన్నంత తేడా. అంటే అంత సన్నిహితంగా ఉంటాయి. Meta Physical State లో Intellectual Quotient బాగా ఎక్కువ పని చేస్తుంది. మనకున్నటువంటి శాస్త్ర పరిచయాలు, మనం చదువుకున్నటువంటి పద్యాలు, పాటలు, శ్లోకాలు, ఎవరెవరో చెప్పిన ఎన్నెన్నో మాటలు, వాటన్నింటి మీద ఒక సాధికారికత, వాటన్నింటిని విశ్లేషించగలిగినటువంటి ఒక వినాణం, ఒక బహుకుశలత్వం, ఇవన్నీ ఏర్పడి ఉంటాయి. కానీ మళ్ళీ పునః చెప్పుకోవలసిందంతా, అంతటి విజ్ఞాని కూడా విజ్ఞాన కోశంలోనే ఉన్నాడు తప్ప వాడు జ్ఞాని కావటం లేదు. జ్ఞాని అయితే వాడు Spiritual కి వెళ్తాడు. జ్ఞాని కావటానికి ముందు ఉన్నటువంటి State Meta Physical State కాబట్టి, Meta Physical State లో Help Ever ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏదో ఒక Subject మీద మనకు అధికారం ఏర్పడింది. అది Law కావచ్చు, Medicine కావచ్చు, Engineering కావచ్చు. సరే! ప్రపంచంలో ఉన్న ఎన్ని శాఖలు కానివ్వండి, వాటి మీద మనకు గనక ఒక ప్రజ్ఞ, ఒక సాధికారికత, ఒక అనుభవము, ఇవన్నీ గనక ఏర్పడినట్లయితే, ఇది కోరి మన దగ్గరకు ఎవరన్నా వచ్చినట్లయితే, వారికి గనక మనం ఇది దానం చేయగలిగినట్లయితే, అది నిజమైనటువంటి Help Ever. ఎవరో సాయం కోరి వస్తారు. ఎప్పుడూ డబ్బు సాయమే కాదు. మాట సాయం కోరి వస్తారు. మాట కూడా చెప్పలేని స్థితిలో మనం ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, ఎటువంటి మాట చెప్తే అవతల వాడికి ముందు ఆనందం కలుగుతుందో, మాట చెప్తే వాడి మనస్సు ముందు స్థిమిత పడుతుందో, దానివలన ఎటువంటి ఆనందాన్ని వాడు పొందగలుగుతాడో, అటువంటి మాటనే గనక చెప్పగలిగినట్లయితే అది Meta Physical State లో మనం ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి దానం. అలాగే అనేకమైనటువంటి చిక్కుల్లో కొన్ని స్వయంకృతంగా, కొన్ని సమాజం విసిరేటువంటి ఆకర్షణ వలయంగా లేదా లాలసగా, భోగంగా, అపరిపక్వత స్థాయిలో జరిగేటువంటి Amateur అంటామే, స్థాయిలో జరిగేటువంటి అనేకానేక కారణాల వలన, తొట్రుపాటు వలన, తొందరపాటు వలన, వేగం వలన, ఆవేగం వలన, ధృతి వలన, అధృతి వలన అనేకమైనటువంటి పొరపాట్లు మనిషి చేస్తూ ఉంటాడు. ఉషారాణి గారు అన్నట్లు కొన్ని అతికించుకునేవి, అంటించుకునేవి, కొన్ని అక్కరలేనివి. అన్నీ ఆలోచనలు మనసుకి పట్టించుకున్నప్పుడు వాడు దాని నుంచి బయట పడలేక, బయట పడలేని స్థాయి నుంచి వాడు వికలమైపోయినటువంటి వేళ సున్నితంగా, సూక్ష్మంగా కానీ కఠినంగా, గట్టిగా, గంభీరంగా, ఉదాత్తంగా, అనునయంగా, ప్రేమగా చెప్పగలిగినట్లయితే వాడికి సమాధానం కచ్చితంగా దొరుకుతుంది. సమాధానం పొందిన వాడు సమాధాన పడతాడు ముందు. సమాధానం పడటం వేరు, సమాధానం పొందటం వేరు. సమాధానం పడటం అంటే క్షణానికి ముందు ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే మనసు నెమ్మదిస్తుందో ఆలోచనలు Positive గా వెళ్లటం మొదలు పెడతాయి. Help Ever అనేటువంటిది Meta Physical State లో, చూడండి ఇవాళ ప్రపంచం చాలా ఆందోళనాయతంగా ఉంది. అతలాకుతలంగా ఉన్నది. మంచివాడికి చోటు లేని రోజులు ఏర్పడ్డట్టుగా ఉన్నాయి. చెడ్డవాడు వెలిగిపోయేటువంటి రోజులు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి. మరి ఏం చేయాలి? Physical State లో ఏం చేయలేమా? కొంత వరకు చేయగలం. Meta Physical State లో ఏం చేయగలం అంటే చాలా చేయగలం. పరమేశ్వరుడు మనకు ఒక ప్రజ్ఞ ఇచ్చాడు. మనకు Mentoring Capacity ఇచ్చాడు. మనం అనునయం చేయగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. దానికి తగినటువంటి ఆలోచించగలిగినటువంటి ఒక మేధా శక్తిని ఇచ్చాడు. దీనినన్నింటినీ కూడా సమాజగతం చేస్తూ ఎక్కడికక్కడ మనం ఉన్నటువంటి ప్రదేశంలో గనక సద్భావనలు వెదజల్లగలిగినట్లయితే Meta Physical State లో మనం చేసే Help Ever. అంతే. Help అనంగానే డబ్బు డబ్బు డబ్బు అంటున్నాం. డబ్బు ఒక్కటే కాదు. డబ్బును మించి చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఎంత డబ్బు ఉన్నా మనకి శాంతి ఉండకపోవచ్చు.శాంతి ఉన్నవాడికి డబ్బు అవసరం లేకపోవచ్చు కాబట్టి రెండింటిని చాలా balanced గా అందుకనే ఎప్పుడూ మనం మూడు మాటలు గుర్తు పెట్టుకోవాలి అవి English పదాలు అయినప్పటికీ కూడా equilibrium ఒకటి equanimity ఒకటి equipoise ఒకటి మూడు ఎవరి దగ్గర ఉంటాయో వాడు ప్రపంచంలో ఉన్న అన్ని కోరికలకి అతీతంగా కానీ హాయిగా ఏది అక్కరలేదనే స్థాయిలో నుంచి కానీ పరమ ప్రశాంతంగా ఎన్నెన్ని ఒత్తిళ్లు మీద పడ్డా ప్రసన్నంగా ఎన్నెన్ని సవాళ్లు మీద పడుతున్నా పారమార్థికంగా జీవించగలిగినటువంటి ఒక స్థాయిని తనలో నుంచే తాను అంతరంగికంగా శక్తిని తాను తెచ్చుకుని ఉద్దీపనం చేసుకుని జ్వజ్వల్యమానం చేసుకుని ప్రదీపనం చేసి తనలో తాను అఖండ చిద్గణమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా నిలవ గలిగినట్లయితే అటువంటి దోహదం గనక మనం చేయగలిగినట్లైతే metaphysical state లో అది ఒక help ever. ఇవాళ మనం సంపాదించిన కీర్తి కానివ్వండి పాండిత్యం కానివ్వండి కవిత్వం కానివ్వండి సరే ప్రజ్ఞ కానివ్వండి చివరికి logical conclusion అది ఎక్కడ end అయిపోతున్నది అంటే మనకు గోడకి మేకేసి కొట్టుకోవటానికి ఎవడో బిరుదు ఇస్తాడు బిరుదుకు పటం కట్టి అక్కడికి సాధించామనుకుంటున్నాం ఇది కాదు help ever లో నీవు దేనిని నీవు సమాజం నుంచి ప్రపంచం నుంచి ప్రకృతి నుంచి నీ జీవన స్వీయ అనుభవంలో నుంచి అనుభూతిలో నుంచి పొందావు దానిని మళ్ళీ ప్రపంచానికి ఒక refined గా redefined గా ప్రపంచానికి గనక ఇవ్వగలిగినట్లయితే అది నిజమైనటువంటి help ever metaphysical state లో. భాగవతం చదువుతాం రామాయణం చదువుతాం ఎన్నాళ్ళు పురాణం చదువుతాం ఎన్నాళ్ళు పద్యాలు పాడుతాం ఎన్నాళ్ళు పాటలు పాడతాం రాముడు ఇట్లా రాముడు అట్లా అని ఎన్నాళ్ళు చదువుతుంటాం రాముడి వలె జీవించలేమా రాముడి వలె ఒత్తిళ్ళని భరించలేమా సాక్షాత్తు నారాయణ మూర్తి అయినటువంటి రాముడి భార్యని ఒక పరాయి వాడు తీసుకుని వెళ్ళిపోతే రాముడు జీవితాన్ని చాలించాడా రాముడు జీవితంలో నిర్వేదానికి గురైనాడా విషాదాన్ని అనుభవించాడా అంటే అనుభవించలేదేమో కానీ అభినయించాడు అనుభవించేవాడు జీవుడు అభినయించేవాడు దేవుడు. అభినయంలో నుంచి మనం ఒక అనుభవాన్ని draw చేయాలి రామాయణంలో రాముడి కథలో జరిగినవన్నీ మనకు జరిగినా అందులో కొన్ని జరిగినా ఒక్కసారి రామాయణ కథ రామాయణ తత్వాన్ని గనక సమన్వయం చేసుకుంటే స్థితిలో రాముడు ఎట్లా ఉన్నాడు పరిస్థితిని రాముడు ఎట్లా ఎదుర్కొన్నాడు పరిస్థితిలో రాముడి యొక్క మనోస్థితి ఏమిటి వాటిని గనక మనం ఒక్క క్షణం నిలకడ చెంది ఆలోచించగలిగినట్లయితే రాముడికొచ్చిన కష్టాలలో ఇంకా మనకు అటువంటివి ఏం రాలేదు మనం రాముడి కంటే అదృష్టవంతులం. ఎనిమిదేళ్ళకే దుఃఖరామం అన్నాడు ప్రపంచం పన్నెండేళ్ళకే విశ్వామిత్రుడితో కలిసి అడవులకు వెళ్ళాడు తాటక సంహారం చేసినప్పుడు భయపడింది ఎవరు అంటే తాటక కాదు మారీచుడు కాదు రాముడే నేను జన్మ ఎత్తింది తాటకుని సంహారం చేయటానికా అన్నాడు. కనుక ప్రకృతిలో ప్రతి వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సహజీవనంలో సహాయం అన్ని విధాలా అందుతూ ఉండవలసిందే it is a continuous process ఇది ఒక క్రీడ ఆటలో ఇచ్చేవాడు ఉండాలి పుచ్చుకునేవాడు ఉండాలి ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలి ఆయనకు నేను అడిగానా బోలుడు ఉంది గనక ఇచ్చాడు అని తీసుకున్న వాడు అనకూడదు అది మహా పాపం తాపత్రయాలలో మొట్ట మొదటి తాపత్రయం ఏమిటంటే ఇంకోడిదంతా నాదైపోవాలి అని కాదు ప్రకృతిలో మర్మం లేదు నీకు ఏది ఎంతవరకు భగవంతుడు ఇవ్వవలసి ఉన్నదో దాంట్లో రూపాయి తగ్గించడు నీది కానిదేదో ఒక రూపాయి బిళ్ళ నీ account లో వేయడు నువ్వన్నీ తెచ్చుకున్నావు సంచిత కర్మలన్నీ ఇవాళ ఇక్కడ ఉన్నవన్నీ అనుభవించటానికి వచ్చావు గనుక help ever అనేటువంటి ఒక మానసికమైనటువంటి భావనలో గనక నీవు నిలకడ చెంది ఉన్నట్లయితే నీ మనస్సు ఎప్పుడూ కూడా ఎవరు వచ్చి మన వాకిట సహాయం చేద్దామన్నా సిద్ధంగా ఉంటాం. భగవాన్ రమణ మహర్షి అరుణాచలంలో ఒకసారి ఆకులన్నీ కూర్చి విస్తళ్ళు కుడుతున్నారు ఒక యువకుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి "భగవాన్ మీది చాలా quality time కదా మీరు జ్ఞాని కదా మీరు సాక్షాత్తు దక్షిణామూర్తి కదా మీరు సాక్షాత్తు స్కందుడు కదా మీరు విస్తరి కుడుతూ మీ సమయాన్ని ఇలా పాడు చేసుకుంటున్నారే" అని అడిగాడు. ప్రశ్న చాలా బాగుంది కదా ఆకర్షణీయమైన ప్రశ్న భగవాన్ అంతటి వాడిని కూడా ప్రశ్నించగలిగినటువంటి ఒక గొప్ప ప్రశ్న వేశాడని అనుకుంటే భగవాన్ ఒక మాట చెప్పారు "చూడు ఏది quality time విస్తరి తయారైన తర్వాత ఇది అన్నం తినటానికి ఆధారం అవుతున్నది అది అయ్యేదా-- ఇది లేకపోతే ఎన్ని పంచభక్ష పరమాన్నాలు ఉన్నా విస్తరి లేకుండా వడ్డించడానికి వీలు లేదు అవి తక్కువగా ఉన్నాయి గనుక నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా కర్తవ్యం చేయకుండా నీలాగా నేను ఒక ముద్ద ఎత్తటానికి ఇక్కడ నాకు హక్కు లేదు హక్కు ఉందని ఇక్కడ భుంజేస్తాను కనుక నేను కర్మ యోగంలో ఉండవలసిందే రెండవది భోజనానంతరం విస్తరిత్వం మనకేం ప్రయోజనం లేదు దీని వలన ఏం ఉపయోగము లేదు ఏం చేయాలి అంటే మడత పెట్టి బయట పడేయాలి అలాగే దేహము అనబడేటువంటి విస్తరి ఉన్నంత కాలము వాడుకోవాలి మరణానంతరం దీన్ని పులి విస్తరాకు వలె విసిరివేసే స్థాయికి మనం వెళ్లగలగాలి ఆత్మ నిరంతరమైనటువంటి చింతనలో ఉన్నట్లయితే ఎంత బాగుండును" అన్నారు. ఒక్క దాన్లో భౌతిక స్థితి ఆదిభౌతిక స్థితి ఆధ్యాత్మిక స్థితి మూడింటిని కూడా సమన్వయం చేశారు ఆయన జ్ఞాని కనుక మరి క్షణంలో దాత ఎవరు అంటే దాత ఆయనే ధాత ఆయనే విధాత ఆయనే త్రాత ఆయనేఅన్ని ఆయన అయినటువంటి ఒకే ఒక సన్నివేశం. అలా మానవుడు కూడా ఎప్పుడూ తీసుకోవటానికి అలవాటు పడకూడదు. తన-తన స్థాయిని బట్టి, తన స్థితిని బట్టి తాను ఇవ్వగలిగినటువంటి, చేయగలిగినటువంటి ప్రతి సహాయము చేయటానికి అన్ని స్థితులలో కూడా సంసిద్ధమై ఉండాలి. ఇక ఆధ్యాత్మిక స్థాయిలో విచారణ గనుక చేసినట్లయితే అధ్యాత్మ అంటేనే అరవిందుల వారు, సత్యసాయి భగవానుడు, రమణ మహర్షి ముగ్గురు నిజానికి ప్రధానంగా ఒక విషయాన్ని మాత్రం ఏకసూత్రంగా చెప్పారు. ఏకసూత్రం ఏమిటంటే, నీకు ఆలోచన కలగగానే దానిని ముందు humanize చెయ్. మానవతా పరిమళాన్ని దానికి అద్దు. మానవత్వం ఎప్పుడైతే నీలో మేల్కుంటున్నదో humanize అయినటువంటి దానిని divinize చెయ్. దానికి దివ్యత్వాన్ని కూడా అద్దు. మానవత్వము, దివ్యత్వము నీ యందే ఉన్నవి గనుక రెండూ కలిసినప్పుడు అది అధ్యాత్మగా, పరమాత్మగా ప్రకాశమానం చెందుతుంది. Humanize, divinize and then spiritualize. Spiritualize అయిపోయినటువంటి ఆలోచన అది స్థాయిలో ఉన్నది, ఎవరికి చేయాలి అన్నీ తెలిసిపోతాయి గనుక ఎవరి willingness to cooperate, ఎవరి willingness to serve, ఎవరి willingness to help మూడు కూడా అన్నివేళలా ఒక సాధకుడు తన మనస్సులో పెట్టుకోవాలి. పురాణాలు విని ముక్తి పొందిన వారు లేరు. కాలక్షేపం చేసుకోవటానికి పురాణం వినవచ్చునేమో గానీ పురాణ స్ఫూర్తిలో నుంచి ఒక మార్గాన్ని తనకు తాను ఏర్పరచుకొని మార్గోపదేశనాన్ని గ్రహించి మార్గంలో ఎవరు సంచారణము, చారణము చేశారో వారు మాత్రమే తారణం పొందారు. అంటే ముక్తిని పొందారు. ముక్తి అంటే నిజానికి ఆధునికమైనటువంటి కలియుగంలో, సమాజంలో మూడు, help ఎవరు కూడా ముక్తిని ఇవ్వదు. పరిణామాన్ని ఇస్తుంది. అసలు human evolution అంతా కూడా transformation bound తప్ప salvation bound కాదు. salvation అనేటువంటిది సనాతనమైనటువంటి ధర్మంలో లేదు. ముక్తి చిట్టచివరికి. పుస్తకమంతా అయిపోయాక సమాప్తం అని రాస్తామే అది అన్నమాట. సమాప్తం ఎక్కడుంది? ఇదంతా comma నే. నిన్న comma పెడితే ఇవాళ ఉన్నాం, ఇవాళ comma పెడితే రేపు ఉంటాం. Comma, comma పెట్టి, పెట్టి, పెట్టి comma ఆగిపోయిన తర్వాత full stop పెడితే కథ కంచికి మనం ఇంటికి అవుతున్నాం. కాబట్టి దాత అనబడేటువంటి వాడు లేదు చేయాలి, సహాయం చేయాలి అనేటువంటి వాడు నిజంగా శుద్ధుడు కావాలి, సిద్ధుడు కావాలి, సంసిద్ధుడు కావాలి. He must be prepared to serve. He must be pure enough to serve. He must be strong enough to serve. స్వామి అన్నారు, "నీ చేతులే బలహీనం, నీ అంగాంగములే బలహీనం, నీ మనస్సే మాలిన్యంతో కూడింది. నీవు ఇంకొకరికి సహాయం ఎట్లా చేస్తావు? చేయటానికి వీల్లేదు. ముందు నీవు శుద్ధుడివి కా. నీ ధర్మార్జనలో నుంచి నీవు ధర్మం చెయ్. నీ ధర్మ భావనలో నుంచి మరొకడికి మరొక సహాయం చేసేటువంటి ప్రయత్నం చెయ్." ఇది ఒక స్థాయి అయితే ఇక అధ్యాత్మ స్థాయిలో, విచారధారలో అధ్యాత్మని ఎలా దానం చేయాలి అని. అధ్యాత్మ దానం చేయబడేది కాదు, ఎవరో వచ్చి పుచ్చుకునేది కాదు. అందుకనే ఒక అచ్చమైనటువంటి గురువు నాకు శిష్యులు ఉన్నారు అని అనడు. నా శిష్యుడు నా కుమారుడితో సమానము అంటాడు. ద్రోణాచార్యుల వారు అశ్వత్థామని గురించిన విచారణ వచ్చినప్పుడు కురు సంతతిలో ఉన్న నూట ఐదుగురు కూడా నాకు బిడ్డలతో సమానమే అన్నాడు ద్రోణ ఆచార్యుడు. అంటే శిష్య సంబంధము, గురు శిష్య సంబంధము పితృ పుత్ర సంబంధంగా సనాతనంగా మనం వింటూ వచ్చాం. అలాగే అధ్యాత్మలో help ఎవరు? మన దగ్గరికి ఎవరో ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక సందేహాన్ని, ఒక జటిలమైనటువంటి ప్రశ్నని, ఒక భావనని, పరిష్కారానికి నోచుకోనటువంటి ఒక విషయాన్ని మా వాకిట్లోకి వచ్చి మన దగ్గర కూర్చొని అతను అడిగినప్పుడు నువ్వు దానిని అందుకునే స్థాయికి ఇంకా నువ్వు రాలేదులే అంటే వాడు గురువు కాదు. గురు స్థానానికి అర్-అనర్హుడు. గురువు అడిగిన వాడి స్థాయికి వచ్చి వాడితో మాటామాటా కలిపి కాస్త సమయాన్ని వెచ్చించి వాడితో కలిసి మాట్లాడుతూ, మాట్లాడుతూ ఉంటే శిష్యుడే నెమ్మదిగా దారపోగులన్నీ విప్పటం మొదలుపెట్టి, "గురువుగారు ఇది ఇంతే కదా, ఇది ఇంతే కదా, నేను అనుకున్నది ఇట్లానే కదా, మీరు అంటున్నది ఇట్లానే కదా" అంటూ వాడి చేత సమాధానం రప్పిస్తాడు. ఎందుకంటే ఎంత శిష్యుడికైనా, ఎంత మహోత్తమమైన గురువు సమాధానం చెప్పినా వాడికి అనుభవం గనుక కలక్కపోతే దాన్ని వాడు నమ్మడు. కనుకనే అనుభవమే గురువు. అనుభవాన్ని ఇవ్వటమే గురువు యొక్క లక్షణము. గురువు యొక్క దాత స్థితిలో గనుక గురువు ఉన్నట్లయితే చేయవలసింది ఇదే. ఆతని స్థాయికి గురువు దిగి రావాలి. ఎందుకనంటే శిష్యుడు గనుక గురువు స్థాయికే వచ్చి ఉన్నట్లయితే అసలు గురువు దగ్గరికి వాడు వెళ్లే ఉండేవాడు కాదు. కాబట్టి అధ్యాత్మలో ఒక balance చాలా అవసరం, పవిత్రత చాలా అవసరం, అహంకార నిర్మూలనం చేసుకోవాలి. అది చేసుకోకుండా గురు స్థానంలో ఉండటానికి అర్హత నిజానికి లభించదు. నేను గురువుని అన్న తర్వాత నువ్వు కనీసం వినమ్రుడిగా ఉండాలి, సమర్పణగా ఉండాలి, శరణాగతిగా ఉండాలి. నీకున్నటువంటి సమస్త విద్యని కూడా నువ్వు ఇంకొకడికి అప్పజెప్పాలి. ఇవాళ వివేకానంద స్వామి యొక్క జన్మదినం. ఎంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఇది. నూట యాభై సంవత్సరాల క్రితం ఒక మహాపురుషుడు జగత్తులోకి వచ్చి సర్వ ప్రకృతిలో ఉన్నటువంటి యువతా స్ఫూర్తిని, యువశక్తిని ఒక్కసారి ఆధ్యాత్మిక భూమికలోకి, సమాజ సేవా భూమికలోకి అట్లాగే తనను తాను ఆలోచించుకొని, విమర్శించుకొని, పరామర్శించుకొని, స్పర్శించుకోగలిగినటువంటి ఒక దివ్య భావనా భూమికలోకి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల, ఐదు నెలల, ఇరవై నాలుగు రోజుల తన చరణంలో ఎంత ప్రభావితం చేశాడు మహానుభావుడు. అటువంటి వివేకానంద స్వామి ఒక నరేన్ గా...ఒక సాధారణమైన హేతువాదిగా నిజానికి atheist గా కాళీమాతను ఉపాసన చేసినటువంటి రామకృష్ణ గురుదేవుల దగ్గరకు వెళ్లి "నీవు దైవాన్ని చూశావా? చూస్తే నాకు చూపిస్తావా?" అని ఒక పరమాద్భుతమైనటువంటి ప్రశ్నని సంధించినప్పుడు గురువు అందుకోగలిగిన శిష్యుడు వచ్చాడు కనుక రామకృష్ణ గురుదేవులు తన దగ్గర ఉన్నటువంటి సర్వశక్తులు కూడా transmit చేశారు. "ధారపోశాను నరేన్, అందుకోగలిగిన వాడివి వచ్చావు గనుక నీకిస్తున్నాను. నేను నిరుపేదనైనాను నరేన్" అన్నారు రెండు మాటలు. నిరుపేదగా ఉండటం గురువు యొక్క లక్షణం. గురువు ఎప్పుడైనా అతిశయించి ఒక ఐశ్వర్య భూమికలోకి గనుక వెళ్లిపోయినట్లయితే మళ్ళీ ప్రాపంచికమైనటువంటి భోగము, లాలస ఇవన్నీ కూడా వాడిని చుట్టుముట్టి మళ్ళీ పతనావస్థకు మూలాధారంలోకి నెట్టివేస్తాయి. మళ్ళీ మరొక్కసారి స్వస్థితిలోకి రావటానికి జారిపోయిన, కాలిపోయిన కాలం కంటే కావలసిన కాలం మరింత సుదీర్ఘం అవుతుంది గనుక గురుస్థానంలో ఉన్నటువంటి రామకృష్ణులు ఏమన్నారు? "నేను నిరుపేదనైనాను, ఇవాళ తట్ట దింపుకున్నాను. రకమైనటువంటి బరువు లేని స్థితిలో నేను అమదానంద స్థితిలో నా ఆనందతాండవం చేస్తున్నది నరేన్" అన్నప్పుడు అందుకున్న వివేకానందుడు గురువు యొక్క శక్తంతా నా ఒక్కడికే అని ఆయన అనుకోలేదు. గురువు నుంచి శక్తిని ఆయన గ్రహించారో he was ever willing to help. అది help ever అంటే అది. help ever ఎవరు వెళ్లినా, మతం వాడు వెళ్లినా, కులం వాడు వెళ్లినా ఆయన పాశ్చాత్య దేశాలలో ఆయన్ని ఆయన ఉపన్యాస సరళికి, ప్రజ్ఞకి ముగ్ధులై వారి వారి ఇళ్ళకు భోజనానికి విందులకు పిలిస్తే తొట్ట తొలి ముద్ద ఎత్తగానే ఆయన దానికి నమస్కరించాడు. నమస్కరిస్తూ "భారతదేశంలో నావంటి వారు కొన్ని కోటానుకోట్ల మంది. ముద్ద దొరక్క అల్లాడిపోతున్నారు. వాళ్ళకి నిద్ర లేదు. రాత్రి ఎట్లా గడుస్తుందో జగజ్జనని. గురువు యొక్క అనుగ్రహాన్ని నేను పొంది ఇక్కడిదాకా రాగలిగానో, అన్నపు ముద్దలో ఉన్నటువంటి ప్రతి మెతుకు కూడా భారతదేశంలో అన్నార్తులైన వారందరికీ చేర్చు ఇది వారికి సమర్పిస్తున్నాను" అన్నాడు. అటువంటి దివ్య భావన అది help ever. అన్నివేళలా ఆయన జ్ఞాని, స్వామి అయినాడు. రామకృష్ణ గురుదేవుల నుంచి ఎప్పుడైతే తపోధారణే అందుకున్నాడో వివేకము, వివేకము వలన ఆనందం, వివేక ఆనందముల చేత జ్ఞానము కలిగింది గనుక ఆయన వివేకానంద స్వామి అయినాడు. రామకృష్ణ స్వామి కాళ. రామకృష్ణులు పరమహంసలుగా పరిపూర్ణమైనటువంటి త్యాగ భూమికలో ఆయన, స్వీకరణ భూమికలో ఈయన, ఇద్దరూ కూడా గురు శిష్య సమాగమంగా, మహోత్తర సంగమంగా, మహోత్తమమైన సంగమంగా ప్రపంచంలో ఈనాటికి నూట యాభై ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ వివేకానందుడు అనగానే ఆయన ఆ-ఆ యవ్వనము, దారుఢ్యము, గాంభీర్యముతో గాంభీర్యమైనటువంటి ఒక వదనము, ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చినప్పుడు help ever అనేటువంటి దానికి నిదర్శనం. అలాగే సత్య సాయి భగవానుడితో సుమారు ఐదు దశాబ్దాల ఒక పరిణితమైనటువంటి జీవనంలో, జీవన విధానంలో, జీవన దృక్పథంలో, జీవన శైలిలో స్వామి ఏం చెప్పారు? help ever అనేదానికి he was always willing to help ఎవరినీ. అనంతపురం జిల్లాలో కొన్నాళ్ళ క్రితం పశువులన్నీ కూడా గడ్డి లేక నశించిపోయినాయి. పశు సంపద అక్కడ ఉన్న సంపద అదొక్కటే. చినుకు పడితే తప్ప మొలక లేవదు. అటువంటి సమయంలో యువకులందరూ వెళ్లి "స్వామి మాకు ఒక సేవ ఇవ్వండి" అని అడిగారు. సేవ ఇవ్వండి అంటే రోజుల్లో పాత దేవాలయాలకెన్నింటికి సున్నం కొట్టి, దేవాలయాలలో నూనె పంపించి వత్తులు వెలిగించేటువంటి కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నటువంటి రోజుల్లో స్వామి అన్నారు "ఒక మంచి project చెప్తాను, ఇప్పుడే చేయండి" అన్నారు. అనంతపురం జిల్లాలో బీడువారి నటువంటి నేలల్లో మొలిచేటువంటి గడ్డి ఒకటున్నది. గడ్డిని సంపాదించండి. మీరందరూ వెళ్లి సేవా కార్యక్రమంలో పాల్గొనండి. స్వామి మాకు చేతకాదు. మీరు మొదలు పెట్టండి అదే చేతనవుతుంది. భగవంతుడు మీరు జీవ ప్రజ్ఞని, దైవ ప్రజ్ఞని సమన్వయం చేయండి. అంటే సంవత్సరం అనంతపురం జిల్లాలో, ఊహేరానటువంటి జిల్లాలో సుమారుగా తొమ్మిది వందల ఎనభై లారీల గడ్డి free గా పశువులన్నింటికీ అందించడం జరిగింది. పైగా అవి దొరకని మరొక ప్రదేశానికి కూడా అదే ప్రదేశం నుంచి వెళ్ళటం జరిగింది. భగవంతుడు కూడా మనం చేయాలి అని గనుక సంకల్పిస్తే ఆయన దాన్ని తీవ్రతరం చేస్తాడు. మనకసలు సహాయం చేయాలనే భావనే లేకపోతే, మనకి సంకల్పమే లేకపోతే, ఆలోచనే లేకపోతే భగవంతుడు మాత్రం ప్రేరణ ఎలా కలిగిస్తాడు? ఆయనకి ఒక ఆయుధం కావాలి, ఒక వాహిక కావాలి, ఒక route కావాలి. దానిలో నుంచి సర్వశక్తులు వ్యక్తి యందు ప్రజ్ఞాభూమికలో ప్రవేశింపజేసి మళ్ళీ ప్రపంచాన్ని ఆదుకుంటాడు. కనుకనే help ever అనేటువంటిది కూడా నిరంతరము సహాయం చేసేటువంటి యోగం కూడా ఒక నిస్వార్థ భూమికే. ఇది కూడా ఒక యోగ భూమికే. మనస్సు ఎప్పుడూ ఆయత్తంగా ఉండటం, సిద్ధంగా ఉండటం, సహాయం ఎటునుంచి ఎవరు మనల్ని కోరుతారో, మనమేం చేయగలమో అనేటువంటి ఆలోచన మనస్సులో ఎప్పుడైతే నిలబడిపోతుందో మనస్సు యొక్క మాలిన్యాలన్నీ నశించిపోతాయి. మనస్సు యొక్క తీవ్రత, ఆందోళన తగ్గుతుంది. అలాగే ప్రాపంచికంగా అనేకమైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నమైనటువంటి మనస్సు పరమేశ్వరోన్ముఖం కావాలి అంటే సమాజం మనకు కావాలి. సమాజ సేవను మించి సర్వేశ్వర సేవ లేదు. సమాజము సర్వేశ్వరుడి యొక్క ప్రతి స్వరూపమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి నిజానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా సత్తునించే పుట్టినాయి గనుక దానియందు సత్తే ఉన్నదనేటువంటి భావన మనం గనుక తెలుసుకోగలిగినట్లయితేఅనుభవ రస సిద్ధం చేసుకోగలిగినట్లయితే ఎవరు ఎవరిని సేవిస్తున్నారు, ఎవరు ఎవరికీ సహాయం చేస్తున్నారు అన్న ఆలోచన కలిగినప్పుడు ఉన్నదంతా బ్రహ్మీమయమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సత్ పదార్థమే. సత్ పదార్థ భావనలో నుంచి జీవుడు అన్నివేళలా ఆయత్తంగా ఉండాలి. ఇవాళ సహాయం కోరి వచ్చిన వాడి కన్నీరు తుడవగలిగితే, కాస్త వాత్సల్య పూరితమైనటువంటి చల్లని మాట చెప్పగలిగితే, ఒక రోగి దగ్గరికి వెళ్ళి నీవు నిదానిస్తావు తగ్గుతుంది నెమ్మదిస్తుంది నెమ్మదిగా నువ్వు మళ్ళీ ఇంటికి వస్తావని ఒక స్నేహితుడిలా ఆత్మ వాక్యం చెప్పగలిగితే కొన్ని వేల ఔషధాలు చేయలేని పని వాత్సల్య స్పర్శ ఆత్మీయతా స్ఫోరకమైనటువంటి మాట ఒక బలాన్ని, జీవితం పట్ల ఒక ఆశని, మళ్ళీ ఒక ఉత్సాహాన్ని కలిగించి లోపల ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా పునర్జీవనం చెంది పరమేశ్వరుని యందు భక్తి పెరిగి, విశ్వాసం ధృడమై, మళ్ళీ తన జీవితాన్ని కూడా అధ్యాత్మమయం చేసుకుంటాడు గనుక help ఎవరు అనేటువంటిది కేవలం దానానికి సంబంధించిన మాట మాత్రమే కాదని అది ఒక అత్యద్భుతమైన అటువంటి అధ్యాత్మ యోగమని, యోగ భూమికలోకి జీవుడు చక్కగా, చల్లగా, హాయిగా, స్వచ్ఛందంగా, స్వచ్ఛంగా, అచ్ఛంగా ప్రవేశించాలని, భూమికలో ఒక నిరంతరమైనటువంటి ఒక ఆనందం ఉన్నదని, అది ఒక చింతనా భూమిక అని, అది చితి చింత కాదని, చింతనలో నుంచి పరమేశ్వరుడి యొక్క భావన జీవేశ్వరుడి యొక్క ఆలోచన రెండూ సమన్వయమైనప్పుడు సర్వ సమాజము కూడా సభ్య సమాజమై నాగరికతా స్ఫోరకంగా అడుగులు ముందడుగులు వేస్తూ వేస్తూ వేస్తూ మళ్ళీ తన స్వస్థానానికి అది ప్రవేశిస్తుంది. అక్కడికి చేరుకోవాలి. మానవుడికి లక్ష్యము, గమ్యము రెండూ ఉన్నాయి. పరమేశ్వరుడు అంటే లక్ష్యము ప్లస్ గమ్యము ఈస్ ఈక్వల్ టు దైవము. అందుకే భగవాన్ రమణ మహర్షిని దైవము అంటే ఏమిటి మీ నిర్వచనం అని అడిగితే "It's a great force and a soft feeling within" మన లోపల ఉండే అంతర్గత శక్తే భగవంతుడు. అనిర్వచనీయమైనటువంటి ఒక పరమ ప్రఫుల్లమైనటువంటి భావనమే పరమేశ్వరుడు గనుక పరమేశ్వరుడు బయట ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, ఉన్నదంతా బ్రహ్మమైనటువంటి భావనతో help ఎవరు అనేటువంటి సాధనని మనం ఇంకాస్త విస్తృతమైనటువంటి స్థాయిలో అనేక కోణాలలో అనేకమైనటువంటి రీతులలో మనల్ని మనం పరా-పరామర్శ చేసుకుంటూ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, వచ్చి ఏం చేస్తున్నామో, చేస్తున్నది మనకు ఆనందం కలిగిస్తున్నదో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ఏం చేస్తే మనకు ఆనందం కలుగుతుందో, ఎవరికీ ఏం చేస్తే మనకి సంతోషం కలుగుతుందో, విధంగా ఉంటే ప్రేమ మనల్ని నడిపిస్తుందో వీటన్నింటినీ కూడా స్వీయ సాధనలో చక్కని ప్రశ్నలుగా, వాటి నుంచి పొందే సమాధానాలుగా పొందుతూ ఒక తాత్వికమైనటువంటి దివ్య జీవన విధానానికి శ్రీకారం చుట్టే దిశగా సత్యసాయి భగవానుడి యొక్క సందేశామృతంలో ఇది మూడవ మహా వాక్యం. help చేయాలి, ఎప్పుడూ చేయాలి, అందరికీ చేయాలి, అవసరమైన వాడికల్లా చేయాలి, స్పందనలో నుంచి చేయాలి, అహంకారంలో నుంచి కాక అని భావన చేస్తూ "సర్వం ఖల్విదం బ్రహ్మ" అనగానే ఉన్నదంతా బ్రహ్మమే, కనిపిస్తున్నదంతా బ్రహ్మమే. స్వామి మాటల్లోనే చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి అన్నను బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వాల్లభ్యమది బ్రహ్మ పుట్టించు నది బ్రహ్మ పోషించు నది బ్రహ్మ గెట్టించు నది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు సభయు బ్రహ్మ సత్యమును తెలుపు సాయి బ్రహ్మ. బ్రహ్మము సాయి బ్రహ్మమే సాయిని హాయిగా దగ్గర చేర్చుకున్న వాడు బ్రహ్మమే ఉన్నదంతా ఒక్కటే అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మే సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది గనుక ఆత్మ పరమైనటువంటి ఒక దివ్య భావనా గరిమతో మానవుడి జీవితము ప్రఫుల్లము, సంతోషము, పూర్ణము, ధవళము, తరళము, స్వచ్ఛము, అచ్ఛము, పరమార్థికము కావాలని దిశగా సర్వేశ్వరుడు సర్వదేవతా అతీత స్వరూపుడైనటువంటి విశ్వవ్యాపి అయినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క అనంత కోటి గురు స్వరూపాల యొక్క దివ్యానుగ్రహం అమృత వృష్టి వలె సర్వులపై కురియు గాక.
SSSMC · audio

Sandesame Adesam - 09

Home

Sandesame Adesam - 09

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:23

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

    Now playing
  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11