Skip to content
Transcript తెలుగు
[భాగం ఒకటి, ఆడియో] సందేశమే ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధలపై శ్రీ వి.ఎస్.ఆర్. ముక్తి గారి విశ్లేషణ. [భాగం ఒక, మ్యూజిక్] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాంవి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ పాత ఆలోచనలన్నీ కూడా, పాత కర్మలన్నీ కూడా జన్మాంతర విశేషం చేత తెచ్చుకున్నటువంటి అనేక సంచిత కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమై ఒక సమ్యక్ క్రాంతి రేపటి నుంచి పుట్టబోతున్నది. సమ్యక్ క్రాంతి సంక్రాంతి అయి సర్వ ప్రపంచానికి శాంతిని, ప్రేమని హాయిని, దాంతిని సమృద్ధంగా అనుగ్రహించు గాక అని కాల స్వరూపుడు అయినటువంటి పరమాత్మకి నమస్కరిస్తూ, ఇవాళ స్వామి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఉపదేశ సందేశాలకు అతీతంగా ఆదేశాలకు కూడా అతీతంగా రెండు విషయాలు స్పష్టంగా స్వామి చెప్పారు. ఒకటి ప్రేమ, రెండవది సేవ. ప్రేమ, సేవ అనబడేటువంటి రెండు విభాగాలు కూడా కాస్త hypothetical గా అనిపించినా ప్రతి thesis కి hypothesis ఉండాలి కదా. ఏది కనిపిస్తున్నదో అది ఒకరోజున నశించాలి. ఏది నశించబడవలసి ఉన్నదో అది రోజు కనిపిస్తూ ఉండాలి. రాక, పోక రెండు దేహానికే గాని ఆత్మకు కావు అన్నటువంటి ఒక సనాతనమైన, వైదికమైన, ఆరుష్యమైన పురా సంస్కృతికి కొనసాగింపుగా సత్యసాయి భగవానుడు ప్రపంచానికి Help ever hurt never అని రెండు మాటలు చెప్పారు. ఇవాళ మనం అర్థం చేసుకునేటువంటి రీతిలో, అలాగే Love all serve all కూడా చెప్పారు. Love ఏమిటి? All ఏమిటి? Serve ఏమిటి? All ఏమిటి? అవన్నీ మనం నిన్నటి దాకా విచారణ చేశాం. నిన్న Help కి service కి అవి కేవలం పదాల మధ్య ఉన్న తేడా మాత్రమే కాక స్థితిగతులలో, ఆచరణాత్మక విధానంలో, ఆలోచనా రీతిలో, దృక్పథంలో, జీవుడి యొక్క సంస్పర్శలో, స్పర్శానుభూతిలో అనేకమైనటువంటి కోణాలను తాకుతూ మన విచార ధార కొనసాగించాం. ఇవాళ చివరగా Hurt never అనబడేటువంటి ఒక మహా వాక్యాన్ని గురించి కాసేపు మాట్లాడుకోబోతున్నాం. మళ్ళీ దీంట్లో రెండు మాటలున్నాయి Hurt never అంటే ఎవరినీ బాధించొద్దు, ఎప్పుడూ బాధించొద్దు అని. పైది Ever అయితే ఇది Never అన్నమాట. కానీ జీవుడు మనోమయుడు కాబట్టి ప్రాపంచికమైనటువంటి ప్రకృతి భావనలకు ఒదిగి ఉంటాడు కాబట్టి, రాగద్వేషాలకు నిజానికి అతీతుడు కాదు కాబట్టి, ప్రాపంచికమైనటువంటి positive attitude నుంచి వైదొలుగుతూ ఉంటాడు కాబట్టి, ప్రకృతి అనబడేటువంటి ఒక మాయావరణంలో నిరంతరం సంచారం చేసే మనస్సు కలవాడు కాబట్టి Help ever hurt never అని స్వామి చెప్తే పొరపాటున అనండి, ప్రారబ్ధం చేత అనండి Help never hurt ever అనేటువంటి భూమికలో నిలకడ చెందుతాడు. దీన్ని సరిదిద్దాలి. దీన్ని ఎవరు సరిదిద్దగలరు? పండితుడా? కవే? ఉపాధ్యాయుడా? అధ్యాపకుడా? బౌద్ధ? ఉపదేశకారుడా? ఎవరు? అంటే ఎవరు వీరందరికీ మూలమో, ఎవరి వలన వీరందరూ తమ కార్యకలాపాలు జగత్తులో చక్కగా కొనసాగిస్తూ ఉన్నారో, వీరన్నింటికీ మూలమైనటువంటి పరమాత్మ మాత్రమే దీన్ని చక్కదిద్దగలడు. ఎలా దిద్దగలడు? కేవలం సందేశంతో గనుక ప్రపంచం మారినట్లయితే యుగాయుగాల నుంచి కూడా సందేశాలు ఇవ్వబడుతూనే ఉన్నాయి. ఆదేశాలు జారీ చేయబడుతూనే ఉన్నాయి. మానవ ప్రవృత్తి మనం గమనిస్తూ ఉన్నట్లయితే నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే పుట్టబోయే రేపు నెమ్మదిగా దిగజారి పోతున్నటువంటి వేళ దీనిని మళ్ళీ ఉత్థానం చేయటానికి, ఉద్దీపనం చేయటానికి, జ్వాజ్వల్యమానం చేయటానికి, ఒక దివ్యమైనటువంటి పావన భావనామయ స్థితిలో నిలబెట్టడానికి పరమేశ్వరుడే గనుక సంకల్పించకపోయినట్లయితే మనం మళ్ళీ అదే ఆవరణంలో తిరుగుతూ తిరుగుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం గనుక Hurt never అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రంగా, ఒక సాధనా మాత్రమైనటువంటి మహాద్భుత పరికరంగా మనం గనుక స్వీకరించగలిగినట్లయితే ఇది మానసిక శాస్త్రానికి, మన Behavioural science కి, మనం జీవితాన్ని చూసే దృష్టిలో నుంచి వీటన్నింటిలో నుంచి ఒక్కసారి గమనించినట్లయితే దీనిని మించి మనల్ని మనం సరిదిద్దుకునేటువంటి అవకాశం మాత్రం లేదు. మనకి రోజు చెప్పుకుంటాం దేహం ఎలా వచ్చింది?షడూర్మములు అన్నాం, షడ్వర్గములు అన్నాం. అలాగే అనేకా అనేకమైనటువంటి వాసనలతో మూల వాసనలతో అనేక సంస్కారాలతో కొన్ని పాతవి కొన్ని ఇప్పుడే అంటించుకున్నవి కొన్ని ఇంకా ఇప్పుడిప్పుడే మనోభూమికలో పుడుతున్నవి ఆలోచనగా రూపుదిద్దుకుంటున్నవి వాక్కుగా బయటకు వస్తున్నవి కర్మలుగా ప్రపంచంలో బహిర్గతమవుతున్నవి ఇన్ని రకాలుగా జరుగుతున్నటువంటి ఆంతరంగికమైనటువంటి ఒక స్థితిని మనం గనుక సరిదిద్దుకోకపోయినట్లయితే జన్మ వృధా అయిపోతుంది. అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం. మనం ఎప్పటికప్పుడు రోజుకారోజు ఇదే ఆఖరి రోజు అనుకున్నట్లుగా ఎంత జాగ్రత్తగా మసలుకుంటామో దీనిని కూడా ఆఖరు జన్మ చేసుకోవటానికి కొంత ప్రయత్నం చేయాలి. ఇలా జన్మలు వస్తూనే ఉంటాయి కొంతకాలం మళ్ళీ ఆగి కామ అయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి ప్రపంచంలోకి వస్తూ ఉంటాము. ఏదో ఇప్పటికి ఇంతే చేసుకున్నాములే అని కాక వచ్చినందుకు ప్రపంచంలో ఒక పరమాత్మతో కూడి ఉన్నందుకు ఒక అవతారమూర్తిని మనం దర్శనం చేసినందుకు అవతారమూర్తి సనాతనమైనటువంటి ఒక భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులభంగా సరళంగా అలతి అలతి మాటలతో మహా లాలిత్య మార్ధవాలతో కూడినటువంటి ఒక భాషా సౌందర్యంతో మనకప్ప చెప్పినప్పుడు జన్మని కూడా కాలాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోక లేకపోతే ఎట్లా? అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. మరణానంతర జీవితాలు వేరు అక్కడ జీవితం ఉండదు జీవించటం ఉండదు జీవనము ఉండదు. ఏముంటుందంటే కేవలము ఒక అపేక్షాభావంతో అన్నింటినీ దర్శించేటువంటి ఒక ప్రేయస్సుతో ఉంటాం అక్కడ శ్రేయస్సు లేదు. శ్రేయస్సు అంటే మనందరం కలిసి ఉండటం శ్రేయస్సు అంటే మనందరం కూడి సంపదను పెంచుకోవటం అధ్యాత్మిక సంపదను పెంచుకోవటం నిత్య జీవితం ని అధ్యాత్మమయం చేసుకోగలగటం. నిజానికి నిత్య జీవితంలో అధ్యాత్మ అంటే అదొక పాత్రగా దానికి కూడా కొంత సమయం కేటాయించిన వాళ్ళం గా కాక జీవితాన్ని అధ్యాత్మమయం గనుక చేసుకోగలిగినట్లయితే అది ఒక దివ్యమైనటువంటి భావన. భావనలోకి వెళ్ళటానికి మనకి అనేక సాయంకాలాలు అనేకమైనటువంటి సత్సంగ స్వరూపాలు అనేకమైనటువంటి సన్నివేశాలు సందర్భాలు మహాయోగాలు అన్నింటికంటే ఇగో వేదం చదువుకున్న వారంతా ఇగో వారు వచ్చారు వారు రోజూ మంత్రం చదువుకుంటారు అగ్ని కార్యం చేసుకొని "ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహా" అని ఒక మాట అనుకుంటారు. అంటే ఏం లేదు, అయ్యా అగ్ని స్వరూపమా అగ్ని స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మమా! నీకు నమస్కరిస్తూ మంత్రం చదువుకుంటున్నా. అదేమిటి అంటే నిన్న వేదాధ్యయనం చేశాను వేద పఠణం చేసుకున్నాను వేదాన్ని ఉపాసించాను వేద ఘోష చేశాను వేద గోష్టిలో ఉన్నాను అనేకమైనటువంటి అనుభవాలు నాకు కలిగినయి. అనుభవాలలో నుంచి నాకు కూడా కొన్ని అనుభూతులు కలిగినయి. అవి వైయక్తికంగా అంటే వ్యక్తిగతంగా స్వీయంగా అంటే నావిగా ఉన్నప్పటికీ కూడా నావి-- అన్నవి ప్రపంచంలో నాది అంటూ ఏం లేదు నావి అంటూ ఏం లేవు గనుక ప్రేరణ, కారణము, కర్త, కర్మ, క్రియ, సర్వమూ నీవైనటువంటి పరమాత్మ! దీనిని అందుకోగలిగినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి శిష్యున్ని నాకు గనుక వాళ్ళు ఇచ్చినట్లయితే దేనిని నేను పొంది ఆనందాన్ని అనుభవించానో, దేనివలన పరాతత్వానికి నేను దగ్గర కాగలిగానో, దేనివలన నా వేద విద్య సార్ధకతను సంతరించుకున్నదో దానిని మళ్ళీ గురు పరంపర శిష్య పరంపర గురుశిష్య బంధంలో ఒక శిష్యుడిని గనుక నువ్వు నాకు ఇచ్చినట్లయితే ఆతనికి ధారపోసి మళ్ళీ నా వేదాధ్యయనంలో నేను మునిగిపోతాను అని మంత్రానికి అర్థం. అంటే ఏమంటున్నాడు ఈయన నేను వేదాధ్యయనం చేశాను నాకు అనుభవాలు కలిగాయి ఇలా నువ్వు ఇస్తూ ఉండు ఇచ్చినవి చాలు దీంతో నాకు ముక్తిని ఇవ్వమని ఆయన అడగటం లేదు. నేను నిండు నూరేళ్ళు శరీరంలో ఉండాలి. నిండు నూరేళ్ళు ఆయుష్మంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలి. పటుతరంగా ఉండాలి. మహత్వంగా ఉండాలి. నిన్ను ఉపాసన చేస్తూనే ఉండాలి. నా శరీరంలో ఉన్న ప్రత୍ୟణువు వేద ఘోష చేస్తూనే ఉండాలి. కానీ ఎందుకని చేయాలి? మళ్ళీ రేపు పుట్టగానే దీనిని మరొకరికి అందించటానికి అర్హత ఉన్నవాణ్ణి నా దగ్గరకు పంపించు అని ప్రమాణం చేస్తూ ఉంటారు. రోజూ వారు నిత్యం చేసే ప్రార్థన. వేదపండితుడు ఎవడు, నాకు ఇవ్వాళ అగ్రహారం ఇచ్చేవాడు ఎవడు, పట్టు బట్టలు పెట్టే వాడు ఎవడని వాళ్ళు ఎదురు చూడరు. వాళ్ళకి వేదమే మొదలు వేదమే అంత్యము. అసలు వారే వేద స్వరూపులు గనుక వేద ఉద్ధరణలో ఒక భాగంగా సత్య సాయి భగవాన్ యొక్క అవతార ప్రవాహం సాగుతూ వచ్చింది గనుక తత్ ప్రమాణంగా గనుక ఇవ్వాళ చూసినట్లయితే మనం పొందినటువంటి ఏదైనా సరే ప్రపంచానికి ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అంతే. అది అడగక్కర్లేదు. అటువంటి వేదపండితుడు రోజుకారోజు ఒక్క విద్యార్థిని, ఒక్క చాతుర్యాన్ని, ఒక్క అర్హత ఉన్నటువంటి వాణ్ని, ఒక సిద్ధున్ని, సంసిద్ధున్ని, శుద్ధున్ని నా దగ్గరకు పంపమని అడుగుతూ ఉంటే మనం ఏం యజ్ఞాలు చేశామో తెలియదు, ఎన్ని యాగాలు చేశామో తెలియదు, తాపత్రయమంతా తపస్సుగా మార్చుకున్నామేమో తెలియదు, ఇంటలెక్ట్ ని ఆధారం చేసుకుని ధ్యానంలో ధ్యానులమైనామో తెలియదు, సత్య సాయి భగవానుడితో కూడి ఉన్నందువలన మనము యోగులమైనామేమో మా-- అసలు తెలియదు. కానీ ఇవి ఏమీ లేకుండానేప్రతిరోజూ ప్రతిక్షణము ఒక నిత్య సత్సంగ సంయోగాన్ని అనుగ్రహించినటువంటి సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి వేద పురుషుడైనటువంటి వేదమే తానైనటువంటి సత్య సాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మనం మరొక్కసారి నమస్కరించాలి. ఎందుకంటే అడిగి పొందేవన్నీ వరాలు. మంత్రం చదివి నాకిది కావాలి అంటే తధాస్తు అంటారు, దొరుకుతాయి. అడగక పొందేదే కరుణ కాబట్టి మనకు కావలసింది భగవంతుని నుంచి వరాలు పొందటం కాదు. మనసు ఉన్నంత కాలం, ఆలోచనలు ఉన్నంత కాలం, కోరికలు పుడుతున్నంత కాలం మనం అడుగుతూనే ఉంటాం, ఆయన ఇస్తూనే ఉంటాడు. అడగటము ఇవ్వటము అనేటువంటిది ద్వైతంలో, ద్వంద్వంలో సాగేటువంటి ఒక క్రీడ కాబట్టి దానికి ఎక్కడో ఒక్కచోట ఆపి ఏదీ అడగటానికి వీలులేని ఒక మహాస్థితిని మనం కోరుకోవాలి. క్షణంలో అడగనప్పుడు, మనం ఏదీ కోరనప్పుడు, నాకిది కావాలి అని ఏమీ మనస్సు పరచి వారి ముందు నుంచోనప్పుడు ఏమి లభిస్తుందయ్యా? భగవంతుని నుంచి వరదానం కాదు కరుణ ప్రవహిస్తుంది. కరుణే అరుణారుణ ప్రభలతో మానవ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది, అవిద్యానాశకారి అవుతుంది, అహంత అవుతుంది, పరిపూర్ణత్వమైనటువంటి ఒక మహంత స్థాయిలోకి అంటే మహస్సుని ఎరిగినవాడు. మహస్సుని ఎరగాలి. మహస్సు సంపూర్ణంగా ఉన్నది, అదే అంతస్సుగా మన యందున్నది, అదే వెలుగుగా రోచిస్సు అవుతున్నది కాబట్టి నభస్సు, అవని, రెండింటి మధ్య ఉన్నటువంటి సర్వ భవనాలు, సర్వ శక్తులు, పంచేంద్రియాలతో కూడి ఉన్నటువంటి దేహము, పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ప్రకృతి "సర్వం ఖల్విదం బ్రహ్మ" ఉన్నది బ్రహ్మం ఒక్కటే అనేటువంటి భావనలో నిలకడ చెందుతున్నప్పుడు ఇక్కడ నీవారు ఎవరు? పరవారు ఎవరు? నా వాడు వీడు అనటానికి ఎవరున్నారు ఇక్కడ? ఎందరెందరి వాడో జీవుడు, ఎవడికి ఏమోనో జీవుడు. జన్మలో బంధాలు ఉన్నాయి గనుక, సంబంధాలు ఉన్నాయి గనుక, అనేకమైనటువంటి బంధనాలు ఉన్నాయి గనుక, బాంధవ్యాలు ఉన్నాయి గనుక, మోహాలు ఉన్నాయి గనుక, వ్యామోహాలు ఏర్పడ్డాయి గనుక అది వ్యసనంగా మారుతున్నదే తప్ప కన్నుమూసిన మరుక్షణం బాంధవ్యాలకు రకమైన relation లేదు. అంతా తనువు ముగియటంతో తెల్లవారిపోతూ ఉన్నది. అనిశ్చితమైన, ఇంత transient గా, ఇంత impermanent గా ఉన్నటువంటి సంబంధాల్ని మనం నిత్యమని, సత్యమని, శాశ్వతమని భావన చేస్తూ ఉంటాం. కానీ నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒకే ఒక్క బంధం అది తనువుని, మనస్సుని దాటి హృదయంగమమైనటువంటి మహాపూర్ణ చైతన్య స్థలి అయినటువంటి ఆత్మతో కూడి ఉన్నది గనుక ఆత్మ పరమాత్మలు రెండూ రెండుగా, భిన్నంగా, ద్వయంగా, ద్వైతంగా కనిపిస్తున్నప్పటికీ రెండూ నిజానికి ఒక్కటే. ఒక్కటే అనే భావనలోకి వెళ్ళమనే చెప్తుంది భారతీయ తత్వశాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఇదే. అధ్యాత్మ శాస్త్రంలో నీవాడు నావాడంటూ లేడు, ఉన్న వారందరూ మనవారే. మంచి లేదు చెడు లేదు, ఉన్నదంతా మంచే. అసలు ఉన్నది బ్రహ్మమైనప్పుడు బ్రహ్మములో మంచి ఎక్కడ ఉన్నది చెడు ఎక్కడ ఉన్నది అని. అయితే ప్రపంచమంతా అద్వైతంతో సాగదు, అది భావనా స్థితి. ప్రపంచం యొక్క నడక, దాని పోకడ, దాని గమనము, దాని ఆగటము, దాని యొక్క ధృతి, అధృతి, వేగ ఆవేగాలు అన్నీ కూడా ద్వైతంలోనే సాగుతాయి గనుక రెండుగా కనిపిస్తూ ఉంటాయి, రెండుగా అనిపిస్తూ ఉంటాయి, రెండుగా వినిపిస్తూ ఉంటాయి. రెంటిని-రెండుంటినీ మానసిక స్థాయిలో ఒకటిగా అనుకోవాలి, హృదయ స్థాయిలో ఒకటిగా అనుభవించాలి, భౌతిక స్థాయిలో రెండుగా సహజీవనం చేయాలి. అదే సహనావవతు అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థం. అది కేవలం మంగళాశాసనం మాత్రమే కాదు. గురువు అంటున్నాడు, మనం కలిసి విద్య నేర్చుకుందాం. అలాగే ఆహ్ మనం కలిసి సంపాదిద్దాం. మనం కలిసి సముపార్జించిన దానిని కలిసి ప్రపంచానికి ఇద్దాం. సంపాదించాం కలిసే, పొందాం కలిసే, ఇస్తున్నాం కలిసే, ఇంకా స్పర్ధ ఎక్కడ? ఎప్పుడైతే నేను సంపాదిస్తున్నాను, నీకు నేను ఇస్తున్నాను అంటే రెండు వర్గాలుగా ప్రపంచం విడిపోతున్నది గాని కలిసే ఉన్నామన్నటువంటి ఒక మంగళ పూర్వకమైనటువంటి భావనలో నిజానికి రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. మరి హర్ట్ నెవర్ అనేటువంటి దాన్ని కాస్త ఈవేళ సత్య సాయి భగవానుడి యొక్క dynamics లో, dimension లో మనం విచారణ చేయాలి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ప్రపంచంలోకి ధర్మస్వరూపుడిగా వచ్చాడు. ధర్మోద్ధరణ చేస్తా అన్నాడు. అధర్మాన్ని ఎవరు ఆచరించారో వారందరూ నా బాణానికి గురి కావలసిందేనన్నాడు. ధర్మాన్ని ఎవరు ఆచరిస్తున్నారో వాళ్లందరూ నా కరుణకు పాత్రులేనన్నాడు. అంటూనే మాయావరణంలో సంచారం చేసి కేవల నరమాత్రుడి వలె ప్రపంచంలో "రామో విగ్రహవాన్ ధర్మః" అనిపించాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ "ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అంటూ క్షణక్షణము నేను మీ యందే ఉంటాను. కనురెప్ప ఎత్తి కనురెప్ప దింపే లోగా ఒక యుగం గనక గడిచిపోయినట్లయితే యుగాన్ని శాసిస్తున్నది నేనే. అందుకనే భగవాన్ రమణ మహర్షి ఆలోచనకు ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఒక విరామ సమయమే నీ అసలైనటువంటి కాలం. దాన్ని గనక నువ్వు transcend చేయగలిగితే, దాటగలిగితే, దాన్ని encompass చేయగలిగితే, అధిగమించగలిగినట్లయితే నీవు జీవన్ముక్త స్థాయిలో ఇక్కడే సంచారం చేస్తావ్. ఎందుకని? ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఉన్నటువంటి విరామ కాలాన్ని గంభీరంగా, విస్తృతంగా, మర్యాదగా, ఒక అంతస్పురణతో, అహం స్పురణాభూమికలో గనుక నిలకడ చెంది దానిని expand చేసుకుంటూ వెళ్లినట్లయితే మొదటి ఆలోచన ఎప్పుడో నశించిపోతుంది, ఇప్పుడే పుట్టిన ఆలోచన చివరికి తెగిపోతుంది. ఆలోచనా రాహిత్యమే మనో నిర్మూలనం కాబట్టి మనో నిర్మూలనము, మనోనాశనము, మనోలయము అంటే ఏం లేదు. మనస్సు లేకుండా కావటం కాదు, ఉన్న మనస్సును తీసుకెళ్లి దాన్ని స్వస్థానంలో చేర్చటం. అందుకనే...సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతీలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేమాన్యతమం లయానాం అంటారు శంకర భగవత్పాదులు. అంటే ఒక లక్షా ఇరవై వేల యోగాలు ప్రపంచంలో ఉన్నట్లయితే, అన్నీ లయ యోగాలు గనక అయినట్లయితే అందులో నాదానుసంధాన యోగమే పరిపూర్ణమైనటువంటి యోగము. తనువు తనువు కలవటం యోగం కాదు, మనసు మనసు కలవటం యోగం కాదు, బుద్ధి బుద్ధి కలగటం-కలవటం యోగం కాదు. నాదము వినిపిస్తున్నటువంటి, బయటకనిపిస్తున్నటువంటి సంగీత పరమైనటువంటి ఒక నాదము అంటే శబ్దము లోపల అనాహత చక్రం దగ్గర అనాహత నాదంగా ప్రారంభమై విస్తృతమై గంభీరమై విశుద్ధం ద్వారా వచ్చి సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి వాగ్విభూతిగా ఎప్పుడైతే ప్రకటన అవుతున్నదో నాదము నాదము గనక కలిస్తే అది నాదానుసంధాన యోగం. నాదానుసంధానంలో శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మము, నిశ్శబ్దం కూడా బ్రహ్మమే. ఎల్లెల్లమూడమ్మా అన్నట్లుగా నాన్నా కనిపిస్తున్నదంతా అబద్ధమైతే కనిపించంది కూడా అబద్ధమే. కనిపిస్తున్నదంతా బద్ధమైతే కనిపిస్తున్నదంతా అబద్ధమే. రెండింటి యొక్క తేడా నువ్వు గనక గమనించుకోగలిగినట్లయితే నీకు పూర్ణ ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఏర్పడేది ఏమిటి? అసలు అదే పూర్ణ ప్రజ్ఞ. కనబడుతున్నదాన్ని సత్యం అంటున్నాం, కనపడనిది లేదంటున్నాం. నువ్వు చూడలేదు గనుక అది లేకుండా లేదు. ఇంకా నువ్వు చూడవలసి ఉన్నది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో కూడా ఒక భావన ఏమిటి అంటే తొంభై ఏడు పాయింట్ రెండు ఐదు అంటే ninety seven point two five ఇంకా అవ్యక్తంగా ఉన్నది. అభివ్యక్తమైంది ఎంతంటే అదిగో మిగిలింది two point five two point seven five ఇది. కనిపిస్తున్నదాన్ని సత్యం అంటున్నాం, కనపడనటువంటి గగన గగనాంతరాలలో దాగినటువంటి అనేకమైనటువంటి లోకాలు, ఎన్ని లోకాలు? ఒకటా? రెండా? ఏదో మన వాళ్ళు చతుర్దశ భువనాలు అన్నారు, పధ్నాలుగు లోకాలు. పధ్నాలుగు కాదు. అది అగణితమైనటువంటి గోళాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. వీటన్నింటినీ దాటి అధిగమించి వచ్చి అర్థం చేసుకోగలిగినటువంటి ఒక పూర్ణ ప్రజ్ఞతో వచ్చినటువంటి మానవుడు ఇంకా హర్ట్ ఎవర్, హర్ట్ నెవర్, నే ఎవరిని బాధించాలి, ఎవరిని దూషించాలి, ఎవరి పట్ల పగ పెంచుకోవాలి, ఎవరిని నా వాళ్ళు అనుకోవాలి అనుకుంటుంటే మానవ జన్మకి పరాకాష్ట, పతాక స్థాయి ఎప్పటికైనా ఏర్పడుతుందా అన్నది ప్రశ్న కాబట్టి రెండు మాటలు మనం రెండు పదాలు విచారణ చేద్దాం. నిజానికి మహాభారతం గనక తీసుకున్నట్లయితే దానిలో అనేకమైనటువంటి సంఘటనలున్నాయి. సంఘటనలలో ప్రధానంగా ఇటువంటి హర్ట్ కి గురైనటువంటిది ఎవరంటే ద్రౌపది దేవి. ఇంకెవరూ కాదు. ఆమెను మానసికంగా, గుణం కారణంగా స్త్రీ అనేటువంటి ఒక చులకన భావంతో బాగా చదువుకున్నారు, విజ్ఞులు అనుకున్నటువంటి వారంతా కూడా ఆమెను దూషించినంతగా, హింసించినంతగా, బాధించినంతగా పాత్రని కూడా బాధించలేదు. నిండు కొలువులో ఇటు భీష్ముడు అక్కడ ఉండగా, ధృతరాష్ట్ర మహారాజు ఉండగా కథంతా మనకు తెలుసు. నిండు కొలువులో ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది దేవిని ఆమెకు భావతో సమానమైనటువంటి వారందరూ కూడా హేళన చేస్తున్నప్పుడు హర్ట్ అయిందావిడ. ఇవాళ స్వామి మాటలు హర్ట్ అయింది. ఏమి హర్ట్ అయింది? దేహానికంగా కాదు, మానసికంగా హర్ట్ అయింది. అందుకనే స్వామి చెప్తారు, ఏదైనా మాట ద్వారా, చూపు ద్వారా, కదలిక ద్వారా అన్నింటికంటే భావన ద్వారా మరొక వ్యక్తిని గనక మనం హర్ట్ చేసినట్లయితే అంటే బాధించినట్లయితే అది ఖచ్చితంగా rebounds అవుతుంది recoil అవుతుంది. అది ఎంత తొందరగా అవుతుందంటే ఇదిగో దుర్యోధనుడు వచ్చి నా అంకపీఠం మీద కూర్చోమన్నాడు ద్రౌపది దేవిని. అనదగిన మాటేనా? అంత అవమానం జరిగినప్పుడు కూడా పండిత సభ, అందులో కురు సభ, పరిపూర్ణంగా ఆవిష్కరింపబడిన సభ, అందులో లేనివారు ఎవరూ లేరు. ఆమె మా-మగవారందరూ అక్కడే కూర్చుని ఉన్నారు. అందరి ఎదుట ఒక స్త్రీని బాధించిన కారణంగా ఏం జరిగింది? ఉత్తరోత్తరా, కథాంతంలో ఏం జరిగిందంటే వంశమే అంతమైపోయింది. కేవలం గాయపరచిన కారణంగా, మానసికంగా బాధించిన కారణంగా వంశం అంతరించిపోయింది. తర్వాత ఎవడూ లేకుండా పోయింది. ఎంతగా పోయిందంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన అవతారాన్ని చాలించేంతగా. అంతేకాదు ఇటు కృష్ణుడు, ఇటు కౌరవులు, ఇటు పాండవులు మనవోటి సాధారణ పౌరులు ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యమే కాదు యుగమే అంతరించిపోయేట్టుగా, వీరితో పాటు యాదవులు అంతరించేట్టుగా, అసలు తరించింది ఎక్కడ? అంతా అంతరించే పోయింది. అంతరించటానికి మూల కారణం ఏమిటి గనక మనం కాస్త అంతరార్థంలోకి వెళ్ళినట్లయితే, విచారణ చేసినట్లయితే దీనికి ఎవరో మరొకరిని చేసినటువంటి ఒక బాధామయమైనటువంటి ఒకానొక స్థితి. స్థితి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేకపోయినారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇదిగో వంద మంది కౌరవ సంతానం, అంతేకాదు యుద్ధంతో, రాజ్యంతో, బాధతో అక్కడ జరిగిన సన్నివేశాలతో సంబంధం ఉన్నవారు లేనివారు అక్కడ ఉన్నవారంతా కూడా నశించిపోయేటువంటి ఒకానొక స్థితి ఏర్పడింది. అలాగే కర్ణుడు మహాదాత, దానవీరుడు అయినప్పటికీ కూడా స్వామి చెప్పిన బి సి లో ఉండి అంటే వాడు bad company లో వీడున్నాడా, వాళ్ళ company లో వీడున్నాడా, వీడి company లో వాళ్ళున్నారా అంటే స్వామి ఇవాళ ప్రపంచానికి యువతకు మీరేమి సందేశం ఇస్తారు, స్వామి మీరిచ్చేటువంటి ఆశీర్వచనం ఏమిటంటే ముందు బి సి నేర్చుకోమనండి అన్నారు.అంటే ABC అంటే English అక్షరాలు అనుకున్నారు. Avoid Bad Company. Companyయే మన యొక్క ఔన్నత్యాన్ని నాశనం చేస్తుంది. మనం ఎవరితో నలుగురితో ఎవరితో తిరుగుతున్నావో చెప్పు నీ, నీ విషయం కూడా మేము చెబుతాముంటాం. అందుకనే సత్సంగము సత్సాంగత్యము మనకి చాలా అవసరం. ఎందుకని? అందరం కూడి పరమాత్మ యొక్క భావన పరమాత్మ యొక్క తత్వాన్ని గనక మనం విచారణ చేసుకుంటూ వెళ్ళినట్లయితే పరమాత్ముడికి మనం నివాళి ఇచ్చినట్లుగా అంజలి ఘటించినట్లుగా పరమాత్మ మనకు కొంత అనుభవమైనట్లుగా తెలుస్తుంది. కేవలం ఆయన చెప్పిన మాటలే పునః పునః అనుకొని, అనుకొని, అనుకొని గోడ మీద రాతల వలే రాసుకుని మనం గనక పాలించకపోయినా, పాటించకపోయినా, అనుష్ఠానం చేయకపోయినా మాటలు నిరర్థకమైపోతాయి. భగవంతుడి నోటినుంచి వచ్చే మాటలన్నీ గోడ మీద గీతలే. అవి నీటి మీద రాతలు కావు. నీటి మీద కాలగమనంలో అన్నీ చెల్లిపోతాయి. గోడ మీద ప్రతిరోజూ చదువుకోవటానికి. గోడ హృదయం కాబట్టి heart అనేటువంటిది ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు కర్ణుడే కాదు వీడే కాదు అశ్వత్థామ. ఉపపాండవ సంహారం చేసినప్పుడు పాండవులంతా విగతజీవులైనప్పుడు అర్జునుడు అశ్వత్థామని బంధించి తెచ్చినప్పుడు గాయపడినది ఎవరు అంటే మాతృ హృదయంతో ఉన్నటువంటి ద్రౌపది దేవే. కానీ ఆమె అన్నది: "మా గురువుగారి యొక్క రూపాన్ని సంతరించుకున్న అటువంటి అశ్వత్థామా! ఇప్పుడు నా హృదయాన్ని గాయపరిచావు. నా బిడ్డలందరినీ సంహారం చేశావు. ఇదే గనక నీకు క్షణాన జరిగితే ఇంకా బతికున్నటువంటి మీ తల్లి యొక్క క్షోభ ఏమిటో ఆలోచించావా?" అందుకనే We should never hurt anybody. ఎందుకంటే ప్రపంచంలో సహాయం అందుకోవటానికి నిన్నంతా అనుకున్నాం. ఎంతోమంది మన దగ్గరికి వస్తుంటారు. ఒక వాక్యం కోసం, మంచి మాట కోసం వస్తారు. ఒక మంచి సలహా కోసం వస్తారు. మనం వారితో ఒక ఐదు నిమిషాలు గనక గడపగలిగినట్లయితే, వారి బాధని మనం నెమ్మదిగా వినగలిగినట్లయితే, తీర్చటంలో గనక మన పాత్ర కొద్దిగా ఉన్నట్లయితే దాన్ని ఉత్తమోత్తమమైనటువంటి సేవగా మనం భావన చేయాలి. అలాగే మీనాక్షి, విశాలాక్షి, జగదక్షి అని అమ్మవారికి అనేక పేర్లున్నాయి. మీనాక్షి ఏం చేస్తుందయా? అంటే చేప. మీనము అంటే చేప. నీళ్ళల్లో తన గుడ్లు తాను వదిలిపెడుతున్నది. తల్లి చేప ఓచోటే ఉంటున్నది. గుడ్లన్నీ అక్కడక్కడా ఉన్నాయి. కానీ తల్లి చేప యొక్క వీక్షణ దీక్ష లోనుంచి మాతృభూమికలో నుంచి వెలబ-వెలువడేటువంటి అనురాగ బంధమైనటువంటి చూపుల కిరణాల వలన, దాని వలన ఏర్పడిన శక్తి వలన గుడ్లన్నీ కూడా చిన్న చేపలై తోకాడిస్తూ పరిగెత్తుతున్నాయి. ఇక్కడ పెద్ద తల్లి చేప గుడ్లను కౌగలించుకున్నది లేదు, దాక్కున్నది లేదు, దాచిపెట్టింది లేదు, దానికి కావలసిన animated heat ఇచ్చింది లేదు, ఏమీ చేయలేదు. [దగ్గిన శబ్దం] కానీ దయా స్వరూపమైనటువంటి ఒక కంటి చూపు ద్వారా, కంటి చూపులో నుంచి ఒక అనుగ్రహాన్ని ఇచ్చింది గనుక ఆమె మీనాక్షి అయినది. అలాగే విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు కలిగిన అటువంటిది. విశాలం అంటే ఎంత విశాలం అంటే సర్వ భువనాలను ఆవరించి ఉన్నటువంటి మహా శక్తివంతమైన దయార్ద్రమైనటువంటి చల్లని చూపులు కలిగింది కాబట్టి ఆమె విశాలాక్షి అయింది. జగదక్షి ఎందుకైందంటే ఒక కా-ఒక కన్ను పగలుగా మరొక కన్ను రాత్రిగా మనల్ని కంటి రెప్పవలె కాపాడుతున్నది గనుక ఆమె జగదక్షిణి అయినది. అంటే ఇదంతా ఎందుకని జరుగుతున్నది అంటే ఆమె దృష్టి సోకని వారు లేరు. సోకి చెడిపోయిన వారు లేరు. దాన్నే సత్యసాయి భగవానుడు ఒక అందమైన మాటతో ముగించారు దాన్ని. పుట్టపర్తికి వచ్చిన వారంతా చెడి నమ్మిన వారే తప్ప నమ్మి చెడ్డవాడు ఒక్కడు కూడా లేడు అన్నారు. నమ్మిన తర్వాత చెడిపోవటానికేం లేదు. నమ్మకమే నడిపిస్తుంది. నమ్మకమే తీవ్రమైన అధ్యాస అభ్యాసాలని మనకి అనుగ్రహ వరదానం చేస్తుంది కాబట్టి ప్రకృతి పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలంతో ఉంటుంది. అనేక జాతులుంటాయి, అనేక వర్గాలుంటాయి, అనేక మతాలు, కులాలు, గుణాలు, అనేక భావాలతో. అంతెందుకు ఒక వ్యక్తినే గనక తీసుకున్నట్లయితే పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి భావ ప్రవాహం చేత అంటే counter current thoughts అంటామే దానివలన మనిషి తనతోనే పోరాడుతూ ఉంటాడు. మిగతా వారితో పోరాడేది పక్కన పెడదాం. ఒక్కొక్కసారి ఆత్మన్యూనతా భావం చేత ఇవాళ depression అనే మాట వాడుతున్నాం కదా! ఆత్మన్యూనత. తానేదీ సాధించలేకపోయినట్లు, తానేదో అనుకున్నవి అనుకున్నట్లుగా జరగనట్లు, జరగనందువలన జీవితమే వ్యర్థం అన్నట్లు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు జీవుడు ఉత్తమోత్తమ స్థితిని ఎలా పొందుతాడు? పొందే అవకాశం లేదు. తనతో తనకే యుద్ధం, తనతో తనకే పోట్లాట, తనయందు విశ్వాసం లేకపోవడం, తన బలం మీద, తన శక్తి మీద, తన ఆలోచన మీద, తన దృక్పథం మీద, తాను నమ్మిన సిద్ధాంతం పట్ల, తాను ఎంచుకున్న గురువు పట్ల, తాను నడుస్తున్న మార్గం పట్ల, తాను నేర్చుకున్న విద్య పట్ల, దేనిపట్ల రకమైనటువంటి స్పష్టత, నమ్మకము లేని కారణంగా వీటన్నింటి వలన నేను ఓడిపోయినానన్నాడు. కానీ అవన్నీ నీకు అనుగ్రహింపబడినా నిన్ను నీవే ఓడించుకున్నావు. అందుకనే సత్యసాయి భగవానుడు ఒక దివ్యమైనటువంటి మాట, ఇవన్నీ ప్రసంగాలలో స్వామి చెప్పేటువంటి విషయాలు. ఏమన్నారంటే స్వామి నాకు యాతనగా ఉన్నది, జీవితం అనుకున్నట్లుగా సాగటం లేదు, నన్ను ఫలానా వాడు బాధించాడు అని చెప్తే, ఫలానా వాడు బాధించాడు అనే ఆలోచనను మనస్సు నుంచి తుంచివేసి ఒక్క క్షణం ఆలోచించి ఆగి నా స్వభావమే నన్ను బాధిస్తున్నదేమో అని ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం నీకు దొరుకుతుంది కదా బంగారు అన్నారు. మనము ప్రశ్న వేసుకోము. నా స్వభావం వలన నేను పిరికివాడినైనాను, నా స్వభావం వలన నేను దుందుడుకుతనాన్ని పొందాను, నా స్వభావం వలన నేను పవిత్రుడినైనాను లేదా నా స్వభావం వలన నేను ఇట్లా బాధపడుతున్నా
SSSMC · audio

Sandesame Adesam - 10

Home

Sandesame Adesam - 10

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 31:05

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

    Now playing
  11. 44 min 11

    Sandesame Adesam - 11