Skip to content
Transcript తెలుగు
[సంగీతం] సందేశామి ఆదేశం భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధాలపై శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారి విశ్లేషణ [సంగీతం] ప్రపంచంలో జాగ్రత్తగా గమనించినట్లయితే పశువుకి బాధ ఉన్నది గానీ దుఃఖం లేదు. జీవుడికి బాధ ఉన్నది దుఃఖము ఉన్నది. బాధ ఎక్కడి నుంచి వచ్చింది? External factor. దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? Internal factor. ఇటు External గా ఇటు Internal గా బయట లోపల రెండింటితో ఏకకాలంలో యుద్ధం చేయగలడా? నీతో నీవే యుద్ధం చేసుకోలేని ని-నిస్సహాయుడివే నిర్వీర్యుడివే. నీవు మరొకరిని బాధించటానికి నీకు ప్రపంచంలో ఎవరు హక్కు ఇచ్చారు? నీకా అవకాశం ఎవరు ఇచ్చారు? అది నీ అహంకారానికి ఒక Shade కాదా? నీ మాయావరణంలో నీవు నిలకడ చెందినటువంటి ఒక భావనకి అది ఒక పతాక స్థాయి కాదా? మరొకడిని నీ భావం చేత, నీవు చూసేటువంటి ఒక చూపు చేత, నీ కదలికల చేత, పదవి ఇచ్చినటువంటి ఒక అహంకారం చేత, విద్యామదం చేత అనేక కారణాల వలన మనం ప్రపంచంలో సరిగ్గా సక్రమంగా ప్రవర్తించం. అందుకనే సత్యసాయి భగవానుడు "Hurt Never" అనేటువంటి మహోదాత్తమైనటువంటి మహా వాక్యాన్ని మనకిచ్చారు. చూడండి అధ్యాత్మలో ఉన్నాం అనుకుంటాం. నేను రోజూ గుడికి వెళ్తానంటాం. నేను ఫలానా యాత్రలన్నీ చేశానంటాం. అసలు నేను మొన్ననే కాశీ యాత్ర చేసి వెనక్కి వచ్చాను. కాశీ ఎంత బాగుందో అని చెప్తూ ఉంటాం. అంతెందుకు భగవద్గీత మీద ఉపన్యాసం ఇస్తుంటాం. అలాగే శాంతం మీద పరమ పవిత్రమైనటువంటి దివ్య భావనల మీద గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ ఉండగానే ఎక్కడన్నా ఒక చిన్న అలికిడి విన్నా ఆవేశానికి గురవుతాం. ఇది సాధనేనా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అన్ని శబ్దాల మధ్య నీవు నీవుగా ఉండాలి. అన్ని కష్టాల మధ్య నీవు నీవుగా జీవించగలగాలి. అసలు జీవితమంతా పరచిన పాంపు కాదు. మల్లెలు పరచినటువంటి ఒక రహదారి కాదిది. ఇది ముళ్ళ కంప. దీనిలో పల్లేర్లు ఉంటాయి, గన్నేర్లు ఉంటాయి, అనేకానేకమైనటువంటి ఎత్తుపల్లాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, మానవమానాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. వీటి అన్నింటి మధ్య నేనుగా అంటే ఆత్మగా ఒక ప్రజ్ఞాభూమికలో ఒక అచల మహా స్థితిలో గనుక నీవు నిలకడ చెంది ఉండగలిగినట్లయితే ప్రపంచం నిన్ను ఏమీ చేయలేదు. ప్రపంచం ఎప్పుడైతే బహిర్గతమైనటువంటి ప్రపంచం బయట గడపతున్నటువంటి ప్రపంచం నిన్ను బాధిస్తున్నది అని అనుకున్నావే, ఎప్పుడైనా నీ అంతరంగ ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్ళావా? అంతరంగ ప్రపంచం నీకు అర్థమైందా? దానిలో ఎన్ని గదులున్నాయో నీకు తెలుస్తున్నాయా? Have you ever heard of a subject called the Johari window? జోహారి అనబడేటువంటి ఒక అధ్యాత్మ శాస్త్రవేత్త మానవుడి యొక్క మనస్సును నాలుగు విధాలుగా విభజించాడు. మనస్సు అంటే అంతరంగ ప్రపంచాన్ని. ఒకటి Known self, రెండవది Unknown self, మూడవది Darker self, నాలుగవది Public self. సుమారుగా నూటికి తొంభై తొమ్మిది మంది Public self తో జీవితాన్ని గడుపుతారు. Public మనల్ని గురించి ఏమనుకుంటున్నదో He will be very conscious. నా గురించి ఎవ్వరూ చెడుగా అనుకోకూడదు. నువ్వెవరివి? నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు మంచివాడివైతే, నువ్వు ఎవరినీ బాధించకపోతే, నీవు నేర్చినటువంటి విద్యలో గనుక నీవు దాని యందు నిమగ్నమై నీవు అంతరంగికమైనటువంటి ఒక అధ్యాత్మ ప్రయాణాన్ని బయట కనిపిస్తున్న జీవితంతో అనుసంధానం చేసి ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపితే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది, నీకు నమస్కరిస్తుంది, నీ అంతటి వాడు అందరూ కావాలి అంటుంది. కానీ Public self అలా లేదే. It's a terribly deceptive. ప్రపంచానికి మనం చూపించేది వేరు, మనం వేరు. రెండూ ఎప్పుడైతే రెండుగా ఉన్నాయో, రెండూ ఒకటి కాకుండా ఉన్నాయో స్పర్ధ తప్పదు. ఎవరికీ యాతన? ప్రపంచానికి ఏమీ యాతన లేదు. నీతో నీకే యాతన. నీతో నీవు యుద్ధం చేయవలసిందే. కనుక లోపల ముందు ప్రపంచానికి మనం ఎలా Present చేసుకుంటున్నామనే దానిలో మొదటి మూడు కూడా మనం జాగ్రత్త పెట్టుకుంటే Public life లేదు, Private life లేదు. There is only one life. That life is called the Spiritual life. ఇంకేమీ లేదు. మిగతావన్నీ Rituals. Rituals ద్వారా Spiritual స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడూ Ritual దగ్గరే గనక ఆగిపోతే అధ్యాత్మ స్థాయికి జీవుడు ఎప్పుడు వెళ్తాడు? ఎంత కాలానికి వెళ్తాడు? మనం మన పిల్లలకి చెబుతాం, "ఇప్పటి నుంచి గుడి ఎందుకురా? ఇప్పటి నుంచి అక్కడికి ఎందుకురా? మేమిద్దరం సత్సంగానికి వెళ్లి వస్తాంలే నువ్వు టీవీ చూస్తుండు." అన్నాం అనుకోండి We are depriving the child to grow in the most natural ambience. వాడికి అవకాశం ఇవ్వటం లేదు. మనకు అవకాశం ఉన్నా దానిని అందిపుచ్చుకోవటం లేదు గనుక అధ్యాత్మని గనుక ఒక Positive attitude గా ఒక Realistic approach గా గనుక భావన చేసుకోగలిగినట్లయితే మనం ఎవరినీ Hurt చేయం. ఎందుకని? సర్వభూతముల యందు ఉన్నటువంటిది ఆత్మే అన్నప్పుడు, అసలు ఉన్నదే ఆత్మ అన్నప్పుడు, సర్వాంతరాత్మ స్థితిలో మనం ఉన్నామని అనుకున్నప్పుడు ఇంకా ఎవరిని మనం వేధిస్తున్నాం? ఎవరిని బాధిస్తున్నాం? మనల్ని మనమే బాధిస్తున్నాం. మరొక వ్యక్తిని మనం అవమానపరిచాము అంటే మనల్ని మనం అవమానపరుచుకున్నట్లు. మన Self esteem నుంచి మనం కింద పడిపోయినట్లే. అందుకే చాలా పాతకాలం నాటి పద్యం ఒకటుంది. తన కోపమే తన శత్రువు కదా! శత్రువు ఎవరయ్యా అంటే నీలో ఉన్న కోపమే. శివానందలహరిలో శంకర భగవత్పాదులు అంటారు, శివుడ్ని ఉద్దేశించి, "ఓ ఆదికిరాతకా! ఎందుకయ్యా బాణాలన్నీ ధరించి, ధనుస్సు ధరించి, అంబులపద భుజాన పెట్టుకొని అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తుతూకనిపించినటువంటి ప్రతి జంతువుని కూడా వేటాడే ప్రయత్నం చేస్తావు ఎందుకయ్యా? నా శరీరంలోనే, నా మనసులోనే, నా భావనలోనే, నా అంతరంగ స్థితిలోనే, నా అప్రాప్యమైనటువంటి భావనలోనే ఆరు మృగాలు సంచారం చేస్తున్నాయి. అవి అరిషడ్వర్గాలై నన్ను హింసిస్తున్నాయి. నీ బాణాలు అమాయకమైనటువంటి సాధు జంతువుల మీద ప్రయోగించే కంటే, ఘనమైనటువంటి, క్రూరమైనటువంటి అరిషడ్వర్గాల మీద సంధానం చేయకా-చేయరాదా? అని అడుగుతాడు ఆయన. అటువంటి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు మనల్ని మనం redefine చేసుకోగలుగుతాం. లేకపోయినట్లయితే మనం చేస్తున్నదంతా correct అనుకుంటాం. అలాగే known self అని ఒకటి ఉంది. అది కాస్త విచారణ చేయాలి. దీనికి దగ్గరైనటువంటిది కాబట్టి. known self అంటే నేను engineer ని, లేదు నేను teacher ని, నేను ఒక doctor ని అంటే ఒక వృత్తికి పరమైనటువంటి ఒక పరిమితమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక entity ని అనుకున్నట్లయితే, వృత్తిపరమైనటువంటి స్థితి వేరు, ప్రవృత్తి పరమైనటువంటి స్థితి వేరు. రెండూ రెండు ద్విధాభూతంగా ఉంటాయి. అంటే రెండు పారుశ్వాలు, రెండు dynamics, two dimensions అవి. నేను ప్రవృత్తిలో గొప్పవాడిని, వృత్తిలోనూ గొప్పవాడిని, అసలు వృత్తి ప్రవృత్తులు రెండూ ఏకమైపోయినాయి, అవి సంయోగించి ఉన్నాయి, సీమారేఖలు లేవు అనుకోగలిగితే వాడు ఉత్తమోత్తమమైనటువంటి వృత్తిదారుడవుతాడు. అలాగే ప్రవృత్తిలో ఒక రకంగా, వృత్తిలో మరొక రకంగా గనుక ఉన్నట్లయితే, మనం చాలా మందిని చూస్తాం. పూజలో ప్రతిరోజూ నాలుగైదు గంటలు పొద్దున గడిపేస్తారు. కనీసం పోనీ ఈవేళ speed ని బట్టి చూస్తే కనీసం రెండు గంటలన్నా పూజలో యధావిధిగా చేసుకుంటూ ఉంటారు. అది వారి ఆంతరంగిక ఔన్నత్యానికి దారితీస్తే పూజను తప్పకుండా పాటించవలసిందే, అనుష్ఠానంగా చేయవలసిందే, అది మనస్సును నియంత్రించుకోవటానికి, చిత్తైకాగ్ర స్థితికి, భగవంతుని యందు భక్తి విశేషాన్ని పెంపొందించుకోవటానికి ఉపయోగిస్తే మంచిదే. కానీ, రెండు గంటల పూజ ఒక బలాన్ని గనక ఇస్తే, ఒక స్థైర్యాన్ని గనక ఇస్తే, మహాపాపం చేయటానికి వెనుకాడని ధైర్యం గనక ఇస్తే, పూజ చేయకుండా ఉండటమే మంచిది. నీవు ఎంత శుద్ధంగా చేసినా, చేశానని నీవు అనుకున్నా, అది నీ ఆచరణలోకి వచ్చేపటికి ఒక వికృత స్వరూపాన్ని గనక పొందినట్లయితే అంత శుభ్ర పూజ అంత క్షుద్ర పూజ అయిపోతుంది. వామాచారం అయిపోతుంది. సదాచారంలో ఉండాలి, సమ్యక్ భావనలో ఉండాలి, పరమేశ్వరుడి ముందు ఒక గంటో, అరగంటో, పావుగంటో కూర్చొని మనస్సుని ఆయన-ఆయన ముందు నిలబెట్టి అనుసంధానం చేసి, జీవాత్మను విశ్వాత్మతో కలుపుకున్నటువంటి వ్యక్తి స్తోత్రాల ద్వారా, మంత్రాల ద్వారా, యంత్రతంత్రాల ద్వారా పరమేశ్వరుని తన యందు ఆవాహన చేసుకొని, తనను తాను భావనాస్పరణంగా సమర్పించుకొని ఉన్నటువంటి వ్యక్తి మళ్లీ ప్రపంచంలోకి రాగానే అతి సాధారణ మానవుడివలె గనక ప్రవర్తించినట్లయితే పూజ చేసినట్లా, చేయనట్లా? చేయనట్లే. ఒకవేళ చేసినా దాని ఫలితం నీకేం లభించదు గనుక, పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవా రాధనం అన్నారు శంకర భగవత్పాదులు. నీవు ఎవరు? నీవు ఆత్మవి. నీలో ఉన్న ప్రాణమే అమ్మవారు. అసలు నీ శరీరమే ఒక గృహం. నీవు చేస్తున్నటువంటి పూజలన్నీ అసలు భోగాలు కావు. అసలు భోగమైనటువంటి దానికి ఉపభోగాలు మాత్రమే. అసలు నీవు రెండు పాదాలు, రెండు కాళ్ళు ఇచ్చావు. కాలు ముందు, కాలు వెనకా నడుస్తూ simultaneous గా alternate గా పదాలు పడుతూ ఉన్నాయి. రెండు పదాలు ముందు వెళ్ళటం లేదు, రెండు వెనక్కి వెళ్ళటం లేదు. ఒకటి ముందు, ఒకటి వెనకగా ఒక space create చేసుకున్నది. మళ్ళీ కుడి పాదం వెనక్కి వెళ్ళి, ఎడమ పాదం ముందుకు రాగానే వృత్తం పూర్ణమైపోతున్నది. సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను నడుస్తున్న నడక, నా జీవితం నాకు నేర్పిన నడత, రెండూ కూడా నీకు ప్రదక్షిణే. ఎందుకంటే వాసుదేవ స్వరూపంగా నీవు ప్రతి అణువు నందు ఉన్నావు. సమస్త ప్రపంచాన్ని ఆవహించి, ఆవరించి ఉన్నటువంటి వేళ నీవు ప్రత్యేకంగా ఇక్కడే ఉన్నావని ఎక్కడ ప్రదక్షిణ చేయును? అనేటువంటి ఒక అధ్యాత్మ భూమికలో శంకర భగవత్పాదులది. స్తోత్రాణి సర్వాగిరో. నా మనస్సు నుంచి, నా భావనా ప్రపంచం నుంచి, నా అంతరంగ శుద్ధి నుంచి, నా నియమ నిష్టలలో నుంచి, నా అనుష్ఠాన గరిమలో నుంచి ఏర్పడేటువంటి ప్రతి స్తోత్రము, ప్రతి వాక్కు కూడా స్తోత్ర సమానమే అన్నాడాయన. అంటే మాటలన్నీ మంత్రాలైపోవు గాక. ఇదంతా కూడా శంభో తవ ఆరాధనం. ఇది నీ పట్ల నేను చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆరాధన. ఇది మానసిక పూజకు సంబంధించిన ఒక అద్భుతమైన విషయం. మానసిక పూజ దాకా వెళ్ళాలి అంటే ముందు మన ప్రవర్తన, మన conduct చాలా ప్రధానం. శ్రీ వైష్ణవులు సౌశీల్యానికి పెద్ద పీట వేస్తారు. సౌశీల్యము అంటే శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సుంటే తప్ప శుద్ధ చైతన్యాన్ని అనుభవించలేము. శుద్ధ చైతన్యం ఆత్మ స్వరూపంగా ఉన్నది గనుక, అది మన యందే ఉన్నది గనుక శ్రీమయంగా, చరాచరమయంగా, వాంగ్మయంగా, పరాత్పరమయంగా, అనంతంగా, అఖండంగా, నిత్యంగా ఉన్నది గనుక అనంత చైతన్యాన్ని ఒక భావనా స్థితిలో అనుభవించగలిగినటువంటి ఒకానొక మనస్సును మనం నిర్మాణం చేసుకోవాలి. దానిని శుద్ధ మనస్సు అనుకుందాం కాసేపు. ఏర్పడింది. ఏర్పడిన తర్వాత hurt never అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎప్పుడూ బాధించడంటే వీడు శుద్ధుడైనప్పుడే. శుద్ధత్వం మనస్సు ద్వారా. మనస్సే కాదు మాట. సత్యసాయి భగవానుడు ఒక మాట అన్నారు. రెండు అక్షరాలున్నాయి. They are very powerful. They are equal to two atom bombs అన్నారు. అవి ఏమిటి అంటే ఒకటి రా, రెండవది పో. రా అని ఎవరైనా గనక మన వాకిట్లోకి వచ్చినప్పుడు, రండి రండి లేదు రా లోపలికి రా అన్నట్లయితే వాడు హృదయానికి దగ్గరగా వస్తాడు. వాడు బెల్లు కొట్టి మనం తలుపు తీసి పూర్తిగా చూడకుండానే పో పో అన్నాం అనుకోండి, మళ్ళీ వాడు మన వాకిట్లోకి రాడు.ఆ రెండు చాలా భయంకరమైన అటువంటి అట్లాగే బలీయమైనటువంటి మహా శక్తివంతమైనటువంటి శబ్దాలు వాటిని జాగ్రత్తగా వాడుకోండి. రా అనేదే గుర్తుపెట్టుకోండి పో అనేది మరచిపోండి అన్నారు. పో మరచిపోకపోయినట్లయితే ప్రపంచం వసుధైక కుటుంబకం కాదు. గంభీరమైనటువంటి ఉపన్యాసం వెనక ఒక సాధన ఉండాలి ఒక తీవ్రత ఉండాలి ఒక అనుభూతి ఉండాలి ఒక స్వీయానుభవం ఉండాలి చెప్తున్న దాని పట్ల ఒక శ్రద్ధ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి భావశుద్ధి ఉండాలి అంతరంగ పరిణామం ఉండాలి. transmission transformation నిరంతరము సాగుతూ ఉన్నటువంటి వాడు బౌద్ధ గనుక కాగలిగినట్లయితే బౌద్ధ స్థాయిలో పరిపూర్ణమైన అటువంటి అంతరంగంలో నుంచి వచ్చేటువంటి పరమాద్భుతమైనటువంటి వాక్ తరంగాలన్నీ కూడా ప్రపంచానికి ఉపదేశాలు అవుతాయి అవే కొన్నాళ్ళకి ఆదేశాలు అవుతాయి అన్నివేళలా సందేశాలుగా మిగిలిపోతాయి. అంతేకాదు hurt never అనేటువంటి దానికి వేద ప్రామాణికంగా ఇంకొక మాట ఉన్నది. ఏనకేన ప్రకారేణ యస్య కశ్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. భగవంతుడు మనకంటూ ఒక ప్రజ్ఞ ఇచ్చినప్పుడు మనకొక అవకాశం ఇచ్చినప్పుడు ఒక యోగాన్ని కల్పించినప్పుడు నీ ప్రజ్ఞ ద్వారా నీకు ఉన్నటువంటి skill ద్వారా నీకు ఏర్పడినటువంటి సంస్కార విశేషం ద్వారా నీకు కలిగినటువంటి ఒక అనుభూతి ద్వారా ప్రపంచానికి నీ ప్రజ్ఞ చేత ఆనందాన్ని గనుక కలిగించగలిగినట్లయితే అది నిజమైనటువంటి తత్ ఏవ ఈశ్వర పూజనం అది మాత్రమే ఈశ్వర పూజ. మరి మిగతా ఈశ్వర పూజలు వద్దా అంటే ఉండాలి అన్నీ ఉండాలి ఒక్కొక్క స్థాయిని ఎరుగుతూ ఎదుగుతూ నెమ్మది నెమ్మదిగా తనని తాను తెలుసుకుంటూ ఆత్మ నిష్ఠుడు గనుక కాకపోయినట్లయితే జన్మంతా ఒక పూజ దగ్గర ఆగిపోయి జన్మంతా కర్మ దగ్గర ఆగిపోయి అక్కడే ఆగిపోతే ఇంకా ఎక్కవలసిన సోపానాలు ఎన్నో ఉన్నాయి. అనంత సోపాన ప్రక్రియలో జీవుడు శుద్ధుడు కావాలి సిద్ధుడు కావాలి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని సిద్ధాంతాన్ని గురువుని భావనని మనసు నిండా నింపుకొని తదనుగుణంగా జీవిస్తూ గురువుల మధ్య రకమైనటువంటి భేదభావం లేకుండా సర్వ శాస్త్ర సమన్వయమైనటువంటి సర్వ ప్రపంచానికి హితకరమైనటువంటి ఒక దివ్య భావనా భూమికలో సంచారం చేయాలి. అలాగే మానవ సంబంధాలన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి మానవ సంబంధాలయందు దయ సానుభూతి జాలి మూడు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. దయ ఉండాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దయా శతకంలో ఆయన అంటాడు "నీవు నీకంటే దయ గొప్పదయా వెంకటేశ్వరా" అని ఆ-ఆ మంత్రం. వెంకటేశ్వరుడి కంటే మంత్రం గొప్పది ఎలా ఉంటుంది అని ఉందన్నాడు ఆయన. ఎందుకంటే డబ్బున్నవాడు డబ్బు కాదు వాడు డబ్బు ఉన్నవాడు అంతే. డబ్బు ఎవరు డబ్బు వేరేగా ఉంది కనబడుతుంది జేబులోనో చొక్కాలోనో బ్యాంకులోనో ఎక్కడో కనిపిస్తోంది. కానీ వాడిని ఏమంటున్నాం అంటే వీడు డబ్బు కలవాడు అన్నాం గాని వీడు డబ్బు అనటంలేదు. అలాగే శ్రీ వేంకటేశ్వరా నీవు దయగలవాడివి అంటే దయను నీ దగ్గర ఉంచుకున్న వాడివి తప్ప నీవు దయ వెట్లావైనావయ్యా ఎవరో ప్రేరేపిస్తే తప్ప ఎవరో సంకల్పిస్తే తప్ప మాకు అర్హత కలిగితే తప్ప నువ్వు దయని తీసి మా ఊళ్లో వేస్తావ్ అని చమత్కారంగా పరమాద్భుతంగా ఆవిష్కరిస్తాడు. దయ వేరు దయగలవాడు వేరు ఆలోచనలు వేరు ఆలోచన కలవాడు వేరు ఆలోచన చెప్పటం వేరు ఆచరించటం వేరు. అందుకనే hurt never లో స్వామి ఇంకా ఒక ఉప సందేశాన్ని కూడా దాంట్లో ఇమిడ్చారు. చెప్పుట సులభము చేయుట కష్టం చూడండి. ఎంత తేలికో ఇట్లా ఇంకో రెండు గంటలు మాట్లాడుకోవచ్చు ఎంత తేలికో మాట్లాడటం కానీ చేయుట చాలా కష్టం. We continue to hurt somebody. ఎప్పుడో ఎవడో ముప్పై ఏళ్లనాడు మనల్ని ఏదో అవమానించాడట. మనం వెళితే వాడు లేచి నుంచోలేదట. మనం వచ్చామని వాడు గుర్తించలేదట మనకు దండం పెట్టలేదట. ఇప్పటికి కూడా మనకు గుర్తుంది. వాడు ఎప్పుడో మర్చిపోయి వాడు సుఖంగా ఉన్నాడు. గుర్తు పెట్టుకుని ఎవరు యాతన పడుతున్నారంటే మనం పడుతున్నాం. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి శీల నిర్మాణంలో hurt never అనేటువంటిది మన సౌశీల్యానికి గొప్ప గుర్తు. అంతేకాదు నేను అధ్యాత్మలో ఉన్నాను పుట్టపర్తి పటికి ఏడు వందల ఎనభై సార్లు ప్రయాణం చేసి వచ్చాను లేదు నేను ప్రతి నెల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది అసలు నాకు అది వ్రతం అయిపోయింది అన్నవాడు కూడా చేయవలసింది దాంతో పాటుగా మనలో మన ప్రవర్తనలో ఏదన్నా పరిణామం సంభవించిందా? పదేళ్లుగా ఆరేళ్లుగా ఏడాదిగా ఆరు నెలలుగా వెళ్తున్నటువంటి మనం లేదు ఇటువంటి అనేకమైనటువంటి సత్సంగాలలో ఉన్నటువంటి మనం ఇప్పటికి ఏదైనా కొంత మార్పు చెందామా? మాటలన్నీ మనకు ఎక్కడన్నా ఏదో ఒక స్థాయిలో సహాయపడ్డాయా? సహాయపడిన దాన్ని మనం స్వీకరించగలిగామా? మన మనసును స్వీకరించడానికి సిద్ధమైన ఒక apparatus గా చేసుకోగలిగామా? మన receptivity level పెంచుకోగలిగామా? Receive చేసుకున్నాం retain చేసుకుంటే ప్రయోజనం లేదు. మళ్ళీ దాన్ని ఆచరణాత్మకం చేయాలి. We have to translate into action. అందుకనే ఎవరైతే ప్రేమ స్వరూపులై ఉంటారో ఎవరు ప్రేమతత్వాన్ని అర్థం చేసుకుంటారో ఎవరు ప్రేమ భావనలో నిలకడ చెంది ఉంటారో ఎవరు ప్రేమాకరుడైనటువంటి పరమాత్మ యొక్క భావనతో తన మనసును అనుసంధానం చేసుకుని ఉంటారో వారికి hurt చేయటం చేతకాదు. శ్రీరామచంద్రుడు మళ్లీ రామాయణంలోకి మనం వెళ్ళాలి. రామాయణ భారత భాగవతాలు చదవకపోతే దానిని గనక దాని అంతరార్థాన్ని గనక తెలుసుకోకపోతే ఇవన్నీ కూడా western aspect నుంచి వచ్చేటువంటి ఆలోచనా తరంగాలుగా మనకి అనిపిస్తాయి. కానీ నిజానికి ఇక్కడి నుంచే అక్కడికి వెళ్లినాయి. వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పారు అది మనకు అర్థమైపోయింది. మన వాళ్ళు మన భాషలో చెప్పారు అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయలేదు. అంతరార్థ భావనలోశ్రీరామచంద్రుడు చూడండి కైక దశరథ మహారాజుని హర్ట్ చేసింది. ఎప్పుడు హర్ట్ చేసింది? సమయం చూసి సన్నివేశం ఏర్పడ్డప్పుడు సందర్భం కలిగినప్పుడు తన ప్రియతముడు అయినటువంటి తన ప్రాణమైనటువంటి రాముడి పట్టాభిషేకం తెల్లవారి జరగబోతున్నది అన్న సమయంలో కారణాలేవి కానివ్వండి దానికి అధ్యాత్మ స్థాయిలో అది దైవ ప్రేరణ అనుకుందాం సమాధాన పడదాం కానీ కైక అనబడేటువంటి ఒక వ్యక్తి దశరథుడు అనబడేటువంటి ఒక వ్యక్తిని హర్ట్ చేసింది. ఎట్లా? తనకిష్టమైన వాడు జ్యేష్ఠుడు అన్ని అర్హతలు ఉన్నటువంటి వాడు సకల గుణాభిరాముడు అయినటువంటి రాముడి పట్టాభిషేకం నాడు అరణ్యవాసం వెళ్ళవలసిందే నా కొడుక్కి పట్టాభిషేకం చెయ్యి అన్నది. చేశాడు జరగవలసి వచ్చింది భరతుడికి పట్టాభిషేకం జరగను లేదు రాముడి పట్టాభిషేకం నిజానికి ఆగను లేదు కాస్త time gap అంతే. కానీ జరిగింది ఏమిటయ్యా అంటే కైక ఎవరిని పోగొట్టుకున్నది? పుత్రుడు నుంచి ప్రేమను పోగొట్టుకున్నది, భర్తని సశరీరంగా పోగొట్టుకుని ఒక నిత్య వైధవ్యాన్ని అనుభవించేటువంటి స్థితికి వచ్చింది. ఆనాడే మామూలు కథలో ఒక-ఒకా నొక స్థాయిలో కథని గనక అర్థం చేసుకుంటే కైక అడిగి ఉండకపోతే ఏమయ్యేది అంటే రామాయణం ఏముండేది కాదు. పట్టాభిషేకం జరిగేది రాముడు అరవైనాలుగు మంది ఇక్ష్వాకు రాజుల్లో ఈయన అరవైనాలుగో వాడు రాముడు. అరవై మూడు మంది అంతకు ముందు పాలించారు వెళ్లిపోయారు వాళ్ళల్లో ఒక్కడు కూడా పట్టం కట్టి పూజా మందిరంలోకి వచ్చిన వాడు లేడు. రాముడు తర్వాత మళ్ళీ ముప్పై ఐదు మంది రాజులు రాజ్యం ఏలారు. మొత్తం తొంభై తొమ్మిది మంది ఇక్ష్వాకు రాజులు త్రేతాయుగాన్ని నడిపించారు. అందులో అరవైనాలుగవ రాజైనటువంటి శ్రీరామచంద్రుడు ఒక్కడే సర్వజనమనోభిరాముడు అయినాడు సకల జగత్తుకి కూడా ఆనందాన్ని ఇచ్చాడు జగదానంద కారకుడు అయినాడు ఇప్పుడు కూడా రామ అనేటువంటి ఒక శబ్దంతో మన తనువెల్లా పులకించి పోతున్నది సర్వాంగీణమైనటువంటి దేహం కూడా ఒక అధ్యాత్మ భావనలో తరించి పోతున్నది. రామ శబ్దం "రమయతి ఇతి రామః" అంత పరమాద్భుతమైనటువంటి జీవన విధానం ఏమిటంటే ఆయన ఎవ్వరినీ బాధించలేదు. నిజానికి రామాయణంలో చిన్న ఉపాఖ్యానం ఉంది రాముడు ప్రయాణం చేస్తూ ఉంటే అయనము అంటే ప్రయాణం. కాంతార వాసం లో ఉన్నాడు అరణ్యంలో వెళ్తున్నాడు. వెళ్తుంటే బాణాలు భుజాన ఉన్నాయి కదా, ఎక్కడో నీళ్లు తాగాలి అని ఒక సెలయేరు పక్కన అంబుల పొది బాణాలు పక్కన పెట్టాడు. పెట్టటం ఆయన గమనించుకోలేదు. ఇది కథే అనుకోండి. నీళ్లు తాగుతున్నాడు ఆయన నీళ్లు తాగాడు ఎక్కడో మూలుగు వినిపిస్తున్నది. మూలుగు ఎక్కడ వినిపిస్తున్నది అంటే తాను ఎక్కడ అంబుల పొది పెట్టాడో నేలమీద అందులో ఒక సూట్ అయినటువంటి బాణం అక్కడే ఉన్నటువంటి ఒక కప్ప శరీరాన్ని తాకి ఉన్నది. రామ బాణం దాన్ని తాకగానే దానికి యాతన కలిగింది దేహ భావన ఉన్నది దానికి. ఉన్నవాడు రాముడు అనుకోలేదు బాణం రాముడి బాణం కాబట్టి మెత్తగా ఉంటుందని తెలియదు. బాణం బాణమే, నిప్పు నిప్పే, భావన భావనే, insult insult ఏ, hurt hurt ఏ. కనుక అప్పుడు రాముడు దయా పరిపూర్ణుడు గనుక ఏ-ఎక్కడినుంచి మూలుగు వినిపిస్తున్నది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తన బాణమే గుచ్చుకున్నటువంటి ఒక కప్ప మూలుగుతున్నది. అయ్యో నీకు తగిలిందా అని అంటే కప్ప జీవ సంస్కారం చూడండి రాముడి వైపు తిరిగి "రామా! నీ గురించి ఎంతో మంది ఇక్కడ అంటుండగా విని, విని, విని, నీ దర్శనం అవుతుందని అలాగే జన్మ నుంచి ఉత్తమోత్తమ జన్మ నీ దర్శనంతో నాకు లభిస్తుందని నేను ఎంతో నీవు కారుణ్యమూర్తివి అని వస్తే కష్టం విప్పి చెప్పుకుందామని అనుకున్నానే చివరికి నీ బాణమే నాకు గాయం కలిగించిందే" అంటే హర్ట్ పరమాత్మ అనేటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రపంచంలో మనకు తెలియకుండా మనం హర్ట్ చేస్తాం. తెలియక చేసిందే కానీ అప్పుడు రాముడు అంటాడు "అమ్మా! నా బాణం నీకు ఇంత కష్టము, ఇంత నష్టము కలిగించింది గనుక" అంటూ బాణం తీసి శరీరాన్ని నిమిరి పరమాత్మ స్పర్శ చేత అది మాయమై ఉంటుంది గాయం పోయుంటుంది. మహిమానుగ్రహం పక్కన పెట్టినట్లయితే నేను తెలియక చేసిన నిన్ను hurt చేసిన కారణంగా రామ రావణ సంగ్రామంలో శరీరానికి బాణాలు తగలకపోతాయా అనుకుంటాడు రాముడు. తగలకపోతాయా? నేను దేహధారిణే వచ్చాను కదా. అలాగే శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి చిత్రకూటంలో ఉన్నప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు స్మృతి భాజ్యమైనటువంటి మనసుతో తనను తాను విచారణ చేసుకుంటూ ఉన్నప్పుడు లక్ష్మణస్వామితో ఒక మాట అంటాడు. లక్ష్మణుడు అడుగుతాడు "అన్నగారు ఎందుకిలా ఉన్నారు?" అని అడిగితే "ఏం లేదు జన్మలో అవతార జన్మ అంటే అవతారం రాముడి పరంగా జన్మలో ఎవరిని ఇంటి నుంచి నేను వెడలగొట్టానో, నా కారణం వల్ల ఎవరు తమ ఇంటిని స్వస్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిందో దానిని అనుభవించటానికి కదా దేహాన్ని నేను పొందాను" అన్నాడు. అంటే ఎంతఃపురం నుంచి ఆయన వెడలగొట్టబడ్డాడు బయటకు నెట్టబడ్డాడు. అంటే ఇది పరమాత్మకు కూడా తప్పదు. పరమాత్మ భావన ఉన్నప్పటికీ పాంచభౌతికమైనటువంటి ఒక దేహాన్ని ధరించి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యాతనల అన్నింటినీ కూడా పరమేశ్వరుడు అనుభవిస్తాడు. అందుకనే సత్యసాయి భగవానుడిని అతి సన్నిహితంగా చూసి, అనుభవించి, ఆనందించి, పరవశించినటువంటి మన బోటి వారందరికీ కూడా ఒక్కసారి స్వామి యొక్క దివ్య చరణాన్ని గనక ఈవేళ స్మృతిగా గుర్తు చేసుకున్నట్లయితే, ఎన్నో కొన్ని వందల దర్శనాలు మనం చేసుకున్నాం ఒకటి రెండు కాదు వందలు. వందల దర్శనాలలో స్వామి ఒక్క వ్యక్తినైనా కానీ తన కాళ్ళ కింద పడి ఉన్నటువంటి ఇసుక రేణువు పట్ల గానిఒక hurt చేశాననేటువంటి feeling లేకుండా ఒక పరమాత్మ వలె సంచారం చేయటం ఇది అసాధ్యమైనటువంటి విషయం. ఇది అవతారమూర్తుల స్థాయిలో ఉన్నటువంటి వారందరూ చేసేది అదే. అది భగవాన్ సత్యసాయి, శంకర భగవత్పాదులు, రమణ మహర్షి, జల్లెళ్ళమూడి అమ్మ, మహా కారుణ్యమూర్తి, మహా మానవతా మూర్తి. ఒక కుక్క, ఒక కాకి అక్కడ తిరిగే సంచారం చేసేటువంటి నిర్జీవమైనటువంటి ఊరికి ఒక photo అనుకోండి. photo లో బాధతో ఉన్నటువంటి photo అయితే దాని పట్ల కూడా సానుభూతి చూపించింది అమ్మ. కాబట్టి, ఇదంతా అవతారమూర్తులంతా మనకి నేర్పేది ఒకటే hurt చేయకండి. చేశారా? It recoils, rebounds అవుతుంది. మనం ఎవరిని కూడా బాధించకూడదు. ఇందులో ప్రపంచంలో మనకి నచ్చని వాడు, నచ్చేవాడు ఉంటే వాణ్ని ఉండనివ్వండి. మనం ఎలా ఉండాలి అంటే, అందరూ మనవారే, అందరూ మంచివారే, అసలు అందరిలో ఉన్నదే నాయందు, నాయందున్నదే అందరి యందు ఉన్నది అనేటువంటి అద్వైత భావనలో గనక ఉండగలిగినట్లయితే, ఇవాళ ఇక్కడ మీరందరూ కూడా అసంఖ్యాకంగా కూర్చొని ఉన్నటువంటి మీ అందరిలో ఇవాళ నామరూపాలు వేరే ఉండొచ్చు, వృత్తులు వేరే ఉండి ఉండవచ్చు, ప్రవృత్తులు భిన్నభిన్నంగా ఉండి ఉండవచ్చు కానీ, దర్శనం మాత్రం సత్యసాయి భగవానుడే ఇన్ని రూపాలుగా కుర్చీల్లో కూర్చున్నట్టుగా భావించినప్పుడు కలిగే ఆనందం అది పరమానందం, పరమోత్కృష్టమైనటువంటి ఆనందం. అలాగే చూస్తున్న వారందరూ కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక ప్రశాంతత లేమనేటువంటి ఒక సద్భావనతో గనక మనం ఉండగలిగినట్లయితే There is no reason to hurt anyone. మనల్ని ఎవరైనా బాధించారు అనుకుందాం, బాధించకుండా ఉండరు కదా. ఇది ప్రపంచం, ప్రపంచం యొక్క లక్షణం అదే. అందుకే స్వామి ఒక గొప్ప హెచ్చరిక చేశారు. "ఈ ప్రపంచాన్ని పెద్దగా నమ్మకండి. లోకం మీద పెద్ద ఆశలు పెట్టుకోకండి. ఆశలుంటూ పెట్టుకోవలసి వస్తే ఒక్క లోకేశ్వరుడిని మాత్రం నమ్ముకొని ఉండండి. ఎందుకని అంటే లోకేశ్వరుడికి నచ్చటం లేదు, లోకేశ్వరుడికి మెచ్చటము తెలియదు. మీరు అనుకుంటున్నారేమో పరమేశ్వరుడికి నాయందు దయ లేదనో, తగ్గిందనో. పరమేశ్వరుడికి గిచ్చటము తెలియదన్నారు." నచ్చింది అనేది లోకమే, మెచ్చేది లోకమే, time బాగా లేదనుకున్నప్పుడు దానికి అయిష్టం ఏర్పడినప్పుడు గిచ్చేది కూడా లోకమే గనుక, లోకంలో ఉన్నటువంటి సర్వాత్మ భావనని గనక మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మన ప్రవృత్తిని, మన ప్రవర్తనని, మన స్వీయ సంస్కారాన్ని మనం ఏర్పరచుకున్నటువంటి సభ్యతా స్మృతిని వీటన్నింటిని చక్కగా అనుసంధానం చేసుకొని, సమన్వయం చేసుకొని నిత్య నైమిత్తికమైనటువంటి జీవితాన్ని గనక అధ్యాత్మ భావనా భూమికగా చేసుకోగలిగినట్లయితే అది hurt never. ఎవ్వరినీ బాధించే అవకాశం ఉండదు, ఉండటానికి వీల్లేదు. చూడండి [గొంతు సవరించిన శబ్దం] ఒక చెట్టు ఉంటుంది. చెట్టు మీద నేల మీది నుంచి కాండం మీదిగా చీమలు ఎగబాకుతుంటాయి, తొండలు ఎగబాకుతుంటాయి. ఒక కొమ్మ మీద రామచిలుకలు ఉంటాయి. మరొక కొమ్మ మీద గుడ్లగూబలు ఉంటాయి, రాబందులు ఉంటాయి. అనేకమైనటువంటి జీవరాశులన్నీ ఉంటాయి. ఎండిన దాన్నో, పచ్చి దాన్నో నరికేవాడు ఉంటాడు. నీళ్లు పోసేవాడు ఉంటాడు, పోషించేవాడు ఉంటాడు. కాయ తెంపుకునేవాడు ఒకడు ఉంటాడు. రాయి పెట్టి కొట్టి సాధించేవాడు ఉంటాడు. కొమ్మ వంచి కాయ కొమ్మ విరిచేవాడు ఉంటాడు. అందరి విషయంలోనూ ఒక చెట్టు ఎట్లాగైతే నిస్తబ్ధంగా, ఎంత నిశ్చలంగా, ఎంత నిరామయంగా, ఎంత నిరంజనంగా, ఎంత నికేతనంగా, ఎంత మహా భూమికలో, సహన భూమికలో నెలకొల్పుతుంది ఉన్నదో గమనించినట్లయితే, ప్రపంచం మన మీదకు విసిరేటువంటి ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా స్వీకరించటం నేర్చుకోవాలి. అలాగే జరుగుతున్నవన్నీ, అంటున్నవన్నీ మనం మనసుకు ఎక్కించుకోవలసిన పని లేదు. దీనికి సత్యసాయి భగవానుడు, "నీకో registered letter వచ్చిందనుకో, ఎవడో పంపించాడు. మంచివో చెడో. registered letter నీ పేరు ఉంటుంది, acknowledgement card ఉంటుంది. Acknowledgment card మీద సంతకం పెట్టమని postman అడుగుతాడు. నువ్వు సంతకం పెట్టి తీసుకుంటే ఉత్తరం నీది. నువ్వు సంతకం పెట్టకుండా గనక వాడిది వాడికే ఇచ్చి 'నాకు అక్కరలేదు' అంటే అది నీది కాదు." అలాగే ప్రపంచం మనకి చేసే సన్మానం కానీ, ప్రపంచం మనకు చేసే అవమానం కానీ, ప్రపంచం మనల్ని గౌరవించినా, అగౌరవించినా, ఇవన్నీ కూడా స్వీకరించావా భరించక తప్పదు. స్వీకరించలేదా? నీకు ఏదీ చెందదు. ఏదీ చెందని, ఏదీ చిందనటువంటి ఒక పరమ ఉత్కృష్టమైనటువంటి నిశ్చల తత్వంతో గనక మనం జీవించగలిగితే, సౌశీల్య సౌభాగ్యాన్ని, జీవన దృక్పథాన్ని, జీవన శైలిని, జీవితాన్ని నడిపేటువంటి, గడిపేటువంటి, జీవించేటువంటి పరమ విన్నాణాన్ని అంటే skillful గా నడపాలి ప్రపంచంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అన్ని వైపులా మనం గమనించుకుంటూ, ఇది మహాయుద్ధ భూమి, ఇది పెద్ద రణరంగం. అంతా బానే ఉన్నట్లు ఉంటుంది పైకి, అంతా యుద్ధమే. ఎవరితో అంటే, మళ్ళీ పునః మనతో మనకే యుద్ధం. మనతో మన యుద్ధం ఆగినప్పుడు సత్వగుణం ఏర్పడి స్వాదువై, స్వీయమైనటువంటి సంస్కరణ చేత మనం ఉత్తమోత్తమమైనటువంటి మానవీయ స్థితిలో ఉండగలిగినట్లయితే, సర్వోత్కృష్టమైనటువంటి మానవతాభావంలో మనం జీవించగలుగుతాం. అటువంటి జీవన విధానాన్ని సత్యసాయి భగవానుడు Love all, serve all రెండు మాటలు. Let us start loving everyone. ఇందులో మీరు వర్గం వారు, మీరు వర్గం వారు, మీరు గురువు గారికి చెందినవారు, వారు ఆశ్రమానికి చెందినవారు. భేదభావం ఎవరి యందు ఉంటుందో వాడు అధ్యాత్మలో పూర్ణంగా లేనట్లే లెక్క. కాదండీ, మా గురువు గారి కంటే ఇంకో గురువుగారు లేడు అన్నామా? 1967లో బొంబాయిలో సత్యసాయి భగవానుడు నిర్ద్వందంగా చేసిన ఒక ప్రకటన క్షణాన మనం గుర్తు పెట్టుకోవాలి.కేవలం నా ఫోటో పెట్టుకొని నా ఫోటో దైవమని దానికి మాత్రమే దండలు వేసి దానిని మాత్రమే ఊరేగించి పక్కనే ఉన్నటువంటి కృష్ణుడి పటానికి గనక మీరు అవమానం చేసినట్లయితే మీకు కృష్ణానుగ్రహము ఉండదు నేను ఎలాగూ తీసుకోవటం లేదు గనక నా అనుగ్రహం కూడా మీకు ఉండదు. కనుక సర్వ దేవీదేవతల మధ్య గాని, గురువుల మధ్య గాని, వ్యక్తుల మధ్య గాని ఎవరైతే భేదభావాన్ని ప్రకటిస్తారో వాడు అధ్యాత్మ లో ఇంకా fundamental primary school లో ఉన్నట్లే లెక్క. extract మీ అందరికీ ఇస్తా. కోటి సమితి గనక ఇస్తే కొన్ని వేల మందికి తెలుస్తుంది గనక ఇవి సత్య సాయి భగవానుడి యొక్క దివ్య ముఖమండలంలో నుంచి అంతస్సు లో నుంచి వచ్చినటువంటి మాటలు. మీరు నన్ను గౌరవించటం అనేది ప్రధానంగా పెట్టుకొని మరొక వ్యక్తిని గాని, గురు స్వరూపాన్ని గాని అవమానించిన ట్లయితే అది స్వామికి ఆనందం కలిగించదు. ఎందుకంటే స్వామి యందు ఏమున్నదో ప్రపంచంలో అదే ఉన్నది. ప్రపంచం నిండా ఏమున్నదో అదే స్వామి యందున్నది. కనుకనే లోకము లోకేశ్వరుడు భిన్నంగా కనిపించిన జగత్తు జగదీశ్వరుడు రెండుగా కనిపించిన జగత్తు జీవేశ్వరుడు భిన్నం కాదు. అభిన్న అద్వితీయ అద్వైత రమణీయ మనోజ్ఞమైనటువంటి దివ్య భావనా భూమిక లో జీవుడు నిలకడ చెంది ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి మనం వచ్చిందే వందేళ్లు అనుకుందాం hundred years పూర్తిగా చెక్కు తీసుకొని వచ్చాం మన దగ్గరే ఉందది. వంద ఏళ్లలో మొదటి ఇరవై ఏళ్లు తల్లి చాటును తండ్రి చాటును గడిచిపోతుంది అప్పుడు మనకు ఏం తెలియదు. ఒక ఇరవై ఏళ్లు అయిపోయింది. మళ్ళీ ఒక నలభై ఏళ్లు పొట్ట కోసం ఎవడి దగ్గరో పని చేస్తాం లేదు మనమే స్వంతంగా వ్యాపారం చేస్తాం ఉద్యోగం చేస్తాం. నలభై ఏళ్లు దేనికోసం అంటే మన పొట్ట నింపుకోవటం కోసం మాత్రమే కాక మనక మనం కన్నవారు మనం కన్నవారు కన్నవారు కన్నవారు కన్నవారు అదేగా భారతంలో వారికి వారికి వారికి వారి వారికిన్ ఇంతమంది కోసం సంపాదన కావాలా? అని భారతం ప్రశ్నిస్తుంది. మనం ఏమో అన్ని వారికీ చేస్తున్నామో లేదో గాని మనం మాత్రం నోరు అన్ని కాళ్లు చేతులు కట్టేసుకుని కడుపున పుట్టిన వాళ్ళందరికీ ఏదో అప్పజెప్పాలని మనల్ని ఎవరు వాళ్ళు అనుకోకూడదని ఉన్నటువంటి వర్తమానాన్ని ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదని మనం వాళ్ళకి పంచటం లేదు. కేవలం భౌతిక స్థాయిలో ఆగిపోతూ ఉన్నాం. కనుక నలభై సంవత్సరాలు అట్లా గడిచిపోతుంది నలభై plus ఇరవై అరవై మనకు తెలియకుండానో తెలిసో గడిచిపోయాయి. కాల గర్భంలో కలిసిపోయాయి. ఇక మిగిలింది నలభై ఏళ్లు నలభై ఏళ్లలో అరవై నుంచి ఎనభై కళ్ళు కాళ్లు కీళ్ళు సహకరించనటువంటి పరిస్థితికి శుభారంభం అది. అక్కడ ఎన్నో చేద్దామనుకున్నవి ఏవి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయి నన్నేమో సత్సంగనికి వెళ్ళాలి మనవడా తీసుకెళ్ళు అంటే నాకు ఇప్పుడు కుదరదు నాకు టైం లేదు అంటాడు. పోనీ భార్యను తీసుకెళ్దాం అంటే ఆమె she is also equally old మరి ఎవరిని పట్టుకోవాలి? ఎవ్వడూ లేడు. కాబట్టి చేద్దామనుకున్న సమయంలో చేయగలిగిన సమయంలో చేయలేకపోయినాం, చేయలేని సమయంలో ఎన్నో చేద్దామనుకుంటాం అట్లా అనుకుంటూ అనుకుంటూ ఇరవై ఏళ్లు అవి గడిచిపోతాయి. పూర్ణంగా ఎనభైవ ఏడు వచ్చినా అది ఎవరికీ ప్రయోజనం లేనిది. ఎందుకంటే అప్పుడు ప్రపంచానికి మనం అక్కర్లేదు. మనక్కూడా ప్రపంచం అక్కర్లేని స్థితి ఏర్పడుతుంది. ఇరవై plus నలభై plus ఇరవై ఎనభై అయిపోయినాయి. పోనీ ఇంకా ఇరవై ఉన్నాయి కదా అంటే ఇరవై నీకు తెలియకుండా ఎనభై వచ్చేప్పటికి అయిపోయినాయి. ఇరవై లో సుమారుగా పన్నెండు సంవత్సరాలు నిద్రలో గడిచిపోయింది. మిగతా ఎనిమిది సంవత్సరాలు ఊరు వెళ్ళి ఊరు వెళ్ళి వాడిని కలిసి వీడిని కలిసి రాత్రి పడుకోక పగలు పని చేయక దాంతో నిర్వ్యాపారం అయిపోయింది. కాబట్టి ఇరవై ఏళ్లు రకంగానూ వ్యర్థం అయిపోయింది. ఇరవై ఏళ్లు అర్థం తెలియకుండా గడిచిపోయింది. ఒక ఇరవై ఏళ్లు అర్థం తెలిసినా అవకాశం లేకుండా పోయింది. అర్థము అన్నీ తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయ్ అన్న స్పృహ ఉన్న సమయమంతా జీవితము సంసారంతో గడిచిపోయింది గనుక దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్ బలెనీ పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వరా. అతి చిన్న వయస్సులో అధ్యాత్మ భూమికలోకి రావాలి. సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి స్వామి ఎన్నెన్నో విషయాలు ఒకటి రెండు కాదు వేదాలు ఉపనిషత్తులు ప్రస్థానత్రయం అలాగే అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా స్వామి వాహినీ స్వరూపంగా ప్రపంచానికి బోధ చేశారు అందించారు స్వయంగా రాశారు వీటన్నింటినీ కూడా అధ్యయనమైనా చేయాలి. అధ్యయనం చేసిన వాడితో ఒక సంబంధం అయినా పెట్టుకోవాలి. అందుకనే చాగరాజు స్వామి ఏమన్నారు, "రామా! నీ సామ్రాజ్యంలోకి నేను ఎలాగూ రాలేను impossible జన్మలో నేను రాలేను. కానీ పని చెయ్, నీ సద్భక్తుడైనటువంటి వాడితో నాకొక సాహచర్యాన్ని మాత్రం ఇవ్వు. ఇచ్చినట్లయితే వాడు నీ సామ్రాజ్యానికి వాడు స్వరూపంగా ఉన్నాడు. సామ్రాజ్య స్వరూపి అయినటువంటి నీ భక్తుడితో గనుక నాకు కాస్త స్నేహం ఉంటే నా జీవితం ధన్యమవుతుంది." అందుకనే భాగవతంలో పోతనామాత్యుని పద్యం తెలుగువారు మనందరం కూడా స్మరించాలి. "నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయును తాపస మందార నాకు దయ చేయగదయే" మొట్టమొదట direct గా నీ పాదాలను సేవించే ఒక అదృష్టం అవకాశం యోగం ఇవ్వు. నేను అడుగుతున్నా గాని నాకు ప్రాప్తి ఉండాలిగా యోగం ఉండాలిగా అర్హత ఉండాలిగా లేదేమో పోనీ అది నాకు ఎలాగూ దొరకదు అని అనుకుంటా. కానీ నీ పాదార్చకులతోడి నెయ్యము స్నేహం కావాలి. స్నేహమే సత్సంగం. స్నేహమే ఇవాళ అనుకునే మనం company అంటున్నాం కదా good company మా సత్సాంగత్యం సత్సంగం మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే like minded కాదు.పరమేశ్వరోన్ముఖమైనటువంటి భావనా భూమికలో నిలకడ చెందినటువంటి సద్భక్తుల యొక్క సామ్రాజ్యమే సామ్రాజ్యం తప్ప కిరీటాలు, గదలు పెట్టుకొని పెద్ద building ఉన్నటువంటిది అది సామ్రాజ్యం కాదు. ఎక్కడ హృదయము సామ్రాజ్యం అవుతుందో, ఎక్కడ హృదయము గుహ అవుతుందో, ఎక్కడ వైరాగ్య-వివేక-విజ్ఞాన భూమికలు చంద్రికలై వెదజల్లబడుతూ ఉంటాయో, ఎక్కడ పరమ నిత్యంగా, పరమ సత్యంగా పరమేశ్వరుడి యొక్క భావనా ప్రవాహం మనందరినీ ముంచెత్తుతూ ఉంటుందో అటువంటి దివ్యమైనటువంటి భావనలో నిలకడ చెందగలిగినట్లయితే we become incapable of hurting others. ఇంత జరిగితే తప్ప hurt never అనేది మనకు సాధన కాదు. ఇంత జరగాలి. స్వీయ సంస్కరణ జరగాలి. మనలో ఉన్నటువంటి అనేకానేక చీకటి కోణాలు, negative energies అన్నీ నశించిపోవాలి. మన జీవన దృక్పథం మారాలి. ఒక వైశాల్యాన్ని సంతరించుకోవాలి. ఒక విశుద్ధమైనటువంటి స్థానాన్ని అది గనుక పొందినట్లయితే భావనలో నుంచి జీవుడు సంస్థితుడై సమన్వయమైనటువంటి రీతిలో, సంఘర్షణ లేనటువంటి భావనలో సర్వము కూడా పరమేశ్వరుడి యొక్క కేళగా, లీలగా, పరమేశ్వరుడి యొక్క హేలగా అంటే అది ఆనంద విలాసం. ప్రకృతి అంతా, ప్రకృతిలో వచ్చేటువంటి ప్రతి ఋతువు కూడా పరమేశ్వరుడి యొక్క ఒక ప్రతిస్పందన. పరమేశ్వరుడి యొక్క భావావేశమే ఋతువుగా ఏర్పడుతున్నది. అది ఆరు ముఖాలుగా షణ్ముఖము అంటే ఆరు ముఖాలున్న సుబ్రహ్మణ్యస్వామి అని కాదు. సుబ్రహ్మణ్యము అంటే కాలము. అది ఆరు ముఖాలుగా ఆరు ఋతువులుగా ఉన్నది గనుక సుబ్రహ్మణ్యోపాసన అంటే కాలోపాసన, కాలోపాసన, ప్రకృతి ఉపాసన, ప్రాణోపాసన, ప్రాణాయామ ఉపాసన వీటన్నింటినీ సమన్వయం గనుక చేసుకోగలిగినట్లయితే దేహం నిండా పధ్నాలుగు భువనాలున్నాయి. బ్రహ్మ రంధ్రం ఒక లోకమై, కనుబొమ్మల మధ్య ఉన్నటువంటిది ఒక లోకమై, రెండు కనులు ఒక లోకమై, రెండు చెవులు ఒక లోకమై, నోరు ఒక లోకమై, కరచరణాది అవయవాలన్నీ ఒక లోకమై, ఉదరమంతా ఒక లోకమై, ఇవన్నీ కలిపితే పదమూడు లోకాలైతే పధ్నాలుగవ లోకమే కింపురుష లోకంగా స్పర్శగా ఉన్నది. మనల్ని అవమానించిన వాడిని మీరు స్పర్శించండి. Shake hand అంటున్నామే, shake hand ఇవ్వండి. చేతిలో చెయ్యి కలపండి. వాడిలో పరివర్తన వస్తుంది. వీడు నన్ను అవమానించాడు, నన్ను బాధించాడు, వేధించాడు అని వాడిని దూరంగా పెట్టండి. gap అట్లాగే ఉండిపోతుంది. మనం ఎవరి చేతా బాధింపబడిన మనం మాత్రం మరొకరిని బాధించే స్థాయిలో ఉన్నట్లయితే అది అధ్యాత్మ కాదని, అధ్యాత్మ అంటే ఒక సత్య జీవన విధానం అని, అధ్యాత్మ కేవలం మరణానంతరం ముక్తిని ఇచ్చేటువంటి ఉపాయం కాదని, ఇది జీవించి ఉండగానే ఒక జీవన్ముక్త స్థాయిలో సంచారం చేయగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి భూమిక అని మనం గనుక గ్రహించగలిగినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క నాల్గవ మహావాక్యం ఇవాళ ఆధునిక ప్రపంచం వేగం పేరుమీద, ఆశ పేరుమీద, దురాశ పేరుమీద, నిరాశ పేరుమీద, పేరాశ పేర-పేరుమీద, దుర్దశ పేరుమీద జీవితాలన్నీ భగ్నం చేసుకుంటున్నటువంటి ప్రమాదకరమైనటువంటి సమయంలో సత్యసాయి భగవానుడు ఉపదేశించినటువంటి Love all మొట్టమొదటిది. Serve all రెండవది. ప్రేమతో service చేయాలి. Service ద్వారా ప్రేమని అనుభవించాలి, అభివ్యక్తం చేయాలి. అంతే కాదు Help ever hurt never. నాలుగింటిని నిజానికి సత్యసాయి భగవానుడు ఎన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినా అన్నింటి యొక్క సారము ఇదే. నిజానికి Help ever hurt never అనేది పుట్టింది ధర్మక్షేత్రంలో. అంటే బొంబాయిలో దాన్ని సత్యం అని, హైదరాబాద్ లో ఉన్నదాన్ని శివం అని, చెన్నైలో ఉన్న దానిని సుందరం అని స్వామి మూడు మందిరాలు మూడే వారు ప్రారంభించారు. సత్య-శివ-సుందరాత్మకమైనటువంటి భావనలో సత్యం అనబడేటువంటి ధర్మక్షేత్రంలో అంటే అది మూల స్థానంలో అంటే వేద ప్రామాణికమైనటువంటి మాట ఒక foreigner అడిగాడు. ఏమడిగాడు అంటే, "బాబా, పద్దెనిమిది పురాణాలుగా చెప్పబడి ఉన్నాయే. పద్దెనిమిది పురాణాల సారము సంక్షిప్తంగా మాకు అర్థమయ్యేట్టుగా చెప్పవచ్చు కదా? పద్దెనిమిది పురాణాలు చదివే శక్తి మాకు ఉండకపోతే మేము దాని ఫలితాన్ని పొందలేం కదా?" అంటే The very essence of eighteen Puranas is very simple that is help ever hurt never. ఇది వేదవ్యాస ప్రోక్తమైనటువంటి మాటే, భిన్నమైంది కాదు. అంటే పరులను పీడించటమే పాపమని, పరులను సేవించటమే పుణ్యము అనేటువంటి భావాన్ని ఇవాళ అధునాతనమైనటువంటి ఆంగ్లీయమైనటువంటి భాషలో సత్యసాయి భగవానుడు మహోపదేశాన్ని మనకు అందించారు. స్వామి సర్వదా, సర్వధా, బహుధా, శతధా అంటే అన్నిటా, అంతటా, అన్నివేళలా సర్వాత్మకమైనటువంటి ఒక భావనా భూమికలో మన అంతఃస్థుర నిలకడ చెంది మనందరినీ కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనబడేటువంటి అభిలాషని, ఆసక్తిని, అపేక్షని, మార్గాన్వేషణని సుగమం చేయాలని, శుభగం చేయాలని, స్వామి యొక్క మహస్సు మనల్ని నడిపించాలని, సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఐదు రోజులు పంచాంగికంగా ఇది పంచామృత ధారగా మనకు అందించినటువంటి స్వామికి మరొక్కసారి నమస్కరిస్తూ ఇవాళ చివరి రోజు అనుకున్నాం. కనుక పూర్ణాహుతి చేయాలి. ఎవరికి పూర్ణాహుతి చేయాలి అని. వాక్కు ఎవరిదో, వాక్కు ఎవరి వలన బయటకు వచ్చిందో, ఇన్ని విషయాలు మనందరికీ ఎట్లా అర్థమైందో, అర్థం కావటానికి కారణమూ, ప్రేరణమూ ఎవరో, వీటన్నింటినీ అర్థం చేసుకుని ఒక తారణ స్థితిని పొందేటువంటి ఒక మహాయోగాన్ని ఎవరు కల్పించారో అటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకి మరొక్కసారి సమర్పిస్తూ, సమర్పణ చేస్తూ, వినయంతో, సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో ఒక తాదాత్మ్యమెరిగినటువంటి అధ్యాత్మ స్థితిలో దీనిని స్వామికి సమర్పిస్తూ కోటి సమితి ఉత్తమోత్తమమైనటువంటి స్థాయిలో సాధ్యమైనంత ఎక్కువగా ఇట్లా గనుక చేసుకుంటూ ఉన్నట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క అవతార పరమార్థం మనం ఎరగాలి. ఆయన ఏదో వచ్చారు, ఉన్నారు, మహాపురుషుడు, గొప్ప సేవ చేశారు, ప్రపంచానికి ఇంత చేశారు, ఫలానా వాడికి ఉంగరం ఇచ్చారు, ఫలానా వాడికి గొలుసు ఇచ్చారు, ఫలానా వాడి రోగం పోగొట్టారు అని కాక ఒక comprehensiveగా ప్రపంచానికి స్వామి తత్వాన్ని అందించారు? అహం సత్యబోధకః అన్నటువంటి మాటకి ప్రమాణంగా స్వామి యొక్క జీవితం ఎట్లా గడిచింది? జీవనంలో, ప్రవాహంలో మనం కూడా కొన్నాళ్ళు కాళ్ళుని ఎలా ఉండగలిగాం? ఉన్నందువలన మనలో జరిగినటువంటి పరిణామం ఏమిటి? ఇంకా స్వామిని చూడనివారు, స్వామి యొక్క స్పర్శానుభూతిని పొందనటువంటివారు, స్వామి అధ్యాత్మ సామ్రాజ్యంలో ఇంకా అడుగుపెట్టనటువంటివారు, అవకాశాన్ని పొందనటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని స్వామి యొక్క అవతార వైభవాన్ని, అవతార పరమార్థాన్ని, తత్వ విచారణని మనమందరం కూడా రకమైన భేదభావం లేకుండా సర్వగురు సమన్వయం చేస్తూ, సర్వశాస్త్ర సమన్వయం చేస్తూ, అందరు గురువులు చెప్పినటువంటి మాటలని పునః మళ్ళీ మనం అనుసంధానం చేసుకుంటూ సాగేట్టుగా ప్రవాహాన్ని, విద్యా ప్రవాహాన్ని, ప్రజ్ఞా ప్రవాహాన్ని సర్వేశ్వరుడైనటువంటి స్వామి అమృతధారగా మార్చుగాక అని స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంగళ
SSSMC · audio

Sandesame Adesam - 11

Home

Sandesame Adesam - 11

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 44:36

More in this series

Sandesame Adesam

11 episodes · 6 hr

  1. 29 min 1

    Sandesame Adesam - 01

  2. 45 min 2

    Sandesame Adesam - 02

  3. 30 min 3

    Sandesame Adesam - 03

  4. 31 min 4

    Sandesame Adesam - 04

  5. 19 min 5

    Sandesame Adesam - 05

  6. 29 min 6

    Sandesame Adesam - 06

  7. 36 min 7

    Sandesame Adesam - 07

  8. 31 min 8

    Sandesame Adesam - 08

  9. 29 min 9

    Sandesame Adesam - 09

  10. 31 min 10

    Sandesame Adesam - 10

  11. 44 min 11

    Sandesame Adesam - 11

    Now playing