No transcript for this section.
ఓం శ్రీ సాయిరామ్! భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. September మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో జాతి మత వర్గ వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వ్యాసుల వారు వస్తూ ఉండగా వ్యాసుల వారు గౌడపాదుల వారు ఒకానొక సమయంలో "బ్రహ్మసూత్రాలన్నీ మనిద్దరం మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమిటి? ప్రపంచంలోకి వెళ్ళి చెప్తే కదా ఉన్నాయి అని తెలిసేది ఈ సృష్టి యొక్క పరిస్థితి చెప్పేది" అన్నప్పుడు గౌడపాదుల వారు అన్నారు "వ్యాసుల వారిని మీరే వెళ్ళండి" అన్నారు. వ్యాసుల వారు అన్నారు "నేను బ్రహ్మసూత్రాలు ఏమిటో చెప్పొస్తా కానీ వ్యాఖ్యానం చేయాలి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే రావాలి". అందుకనే శంభోర్ మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా శంకర భగవత్పాదులు ఈ జగత్తులోకి వచ్చి బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. ఆ బ్రహ్మసూత్ర భాష్యానికి మొట్టమొదటి బ్రహ్మసూత్రం ఐదు వందల యాభై ఐదు సూత్రాలలో మొట్టమొదటి సూత్రము ఏమిటి అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే తర్వాత ఏమిటి అని మనం నిద్ర లేస్తాం తర్వాత అంటాం. తర్వాత కార్యక్రమాలు ఉంటాయి తర్వాత అంటాం. అలాగే ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా ఏ క్షణాన్ని మనం జీవించినా ప్రతి నిమిషము తర్వాత తర్వాత తర్వాత అనుకోకుండా లేం మనం. కాబట్టి ఈ తర్వాత అనేటువంటి ప్రశ్న కాస్త చివర్లో మనం విచారణ చేద్దాం. ఈలోగా శంకర భగవత్పాదులు ఈ బ్రహ్మసూత్రాల కంతా భాష్యం చెప్పి ఆకాశంలోకి ఒక పిట్ట ఎగిరినా అది శూన్యం కదా అక్కడ ఏమి గింజ కూడా దొరకదు. గింజలన్నీ ఉన్న భూమిని వదిలి పరమానందాన్ని శూన్యంలో ఎలా అనుభవిస్తున్నది విచారణ చేయమన్నది. అలాగే నీటిలో ఉన్నటువంటి చేప నేలమీద ఎందుకు బతకలేకపోతున్నదో విచారణ చేయమన్నది. అలాగే నూట ఇరవై సంవత్సరాల ఆయుష్షు ఉన్నటువంటి మానవుడు ఎందుకని కుచించుకొని కుచించుకొని దేహాన్ని రోగగ్రస్తం చేసుకొని మనస్సుని మాలిన్యం చేసుకొని హృదయ కవాటాలు మూసుకొని పరస్పర విద్వేషాలతో ఎందుకు జీవిస్తున్నాడో విచారణ చేయమన్నది బ్రహ్మసూత్రం. అయితే సత్యసాయి భగవానుడు వచ్చేదాకా ఆ సమయం వరకు వచ్చిన వారంతా శాస్త్రాన్ని బోధించారు. శాస్త్రంలో ఏమున్నదో చెప్పారు. ఎప్పటి వరకు అంటే నూట యాభై సంవత్సరాల క్రితం వచ్చిన వివేకానంద స్వామి వరకు జరిగింది అంతే. వివేకానంద స్వామి "ఐ విల్ నెవర్ సీ ఫార్టీ" అని రాసుకున్నారు డైరీలో. నేను నలభై చూడను అన్నారు. ముప్పై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల ఇరవై నాలుగు రోజులలో వారి అవతారం పూర్తయిపోయింది. ఆ ముప్పై తొమ్మిది సంవత్సరాల ఈ ఐదు నెలల ఇరవై నాలుగు రోజులు ఆయన ఏం చేశారు అంటే పరమోత్కృష్టమైనటువంటి పరమహంస అయినటువంటి గురువు నుంచి సర్వశక్తులు తాను పొంది తనలో ఉన్నటువంటి ధీ శక్తిని జీవ ప్రజ్ఞని తాను ఈ అవతారం తీసుకొని ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ఏం చేయాలో ఒక ఉద్ధతిని కోల్పోయిన ప్రభవాన్ని కోల్పోయినటువంటి భారతీయ సంస్కృతిని హిందూ ధర్మాన్ని మతాన్ని కాదు సుమా, మతం వేరు ధర్మం వేరు. సత్యసాయి భగవానుడు మతాన్ని ఎన్నడూ బోధించలేదు సనాతన ధర్మాన్ని మాత్రమే మనకు పరిచయం చేశారు. మనకు బోధించింది కూడా అదే. కనుక వివేకానంద స్వామి రెండు సంకల్పాలతో వారి అవతారం పూర్తయిపోయింది. ఒకటి భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా అక్షర జ్ఞానం లేకుండా గనుక మరణించినట్లయితే నా ఆత్మ ఘోషిస్తుంది అన్నాడు. విద్య. అలాగే భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా పిడికెడు అన్నం లేక డొక్క ఎండిపోయి గనుక మరణించినట్లయితే అది నా జీవితంలో ఒక విషాదకరమైనటువంటి రోజు అన్నారు. అది వివేకానంద స్వామి యొక్క ఒక మానసిక సంకల్పం ఒక భావన. తదనంతర కాలానికి వచ్చినప్పుడు సత్యసాయి భగవానుడు దాన్ని ఎలా పరిష్కరించారో మనం విచారణ చేద్దాం ఇవ్వాళ. ఈ లోగ ఈ సత్ అనబడేటువంటి పదార్థాన్ని ఇవ్వాళ మనం విచారణ చేయాలి. సత్ అన్నా బ్రహ్మమన్నా ఒక్కటే గనుక స్వామి ఒక పద్యంలో అసలు ఈ సత్ పదార్థాన్ని గురించి ఓ మాట చెప్పారు. ఏం చెప్పారంటే సత్యంలో నుంచే సర్వమూ పుడుతుంది. ఈ పుట్టిన సర్వమూ మళ్ళీ సత్యంలోనే కలుస్తుంది. స త య అనబడేటువంటి మూడు బీజాక్షరాలు ఉన్నాయి. స అంటే సచ్చిదానందం. సచ్చిదానంద స్థితి అంటే సత్ చిత్ ఆనందం. సత్ అంటే విచారణ చేస్తున్నాం చిత్ అంటే universal absolute consciousness.మహావిశ్వ చైతన్యం ఏదైతే ఉన్నదో ఎరుక ఏదైతే ఉన్నదో అది విశ్వ చైతన్యం గా మనం చిత్తుగా దాని భావన చేసినట్లయితే సత్ అనబడేటువంటిది కంటికి కనపడటం లేదు చిత్ అనబడేటువంటి ఇదిగో మనం అందరం కలిసి కనబడుతున్నాం. ఇది దానితో కూడితే మనం స్వామితో దగ్గరకైతే స్వామి మనకు దగ్గరైతే స్వామితో మనం మాట్లాడితే స్వామిని గురించి మాట్లాడితే ఏం కలుగుతున్నది అంటే ఈ చిత్తు ఆ సత్తుతో కూడినందువలన ఆనందం కలుగుతున్నది గనుక ఆనందం అందించిన వాడు సచ్చిదానంద ఉడై ఉన్నాడు చిత్తుగా ఉన్నటువంటి వాడు సత్ వైపు వెళ్లి పరమాత్మ వైపు వెళ్లి పరమాత్మ భావనలో ఉండి ఆనందాన్ని పొందుతున్నాడు కానీ అందించిన వాడు పొందుతున్న వాడు అంటే చిందించిన వాడు చందించుకున్న వాడు ఇద్దరూ ఒకటైనటువంటి వేళ ఇద్దరి ఆనందము ఒక్కటే. అందుకనే సత్యసాయి భగవానుడు మీ ఆనందమే నాకు ఆహారం అన్నారు అది దాని అర్థం అది మీరందరూ ఆనందంగా ఉన్నారనుకోండి నాకు ఆహారము ఈ దేహానికి ఆహారం లేదు సత్ అనబడేటువంటిది నా కిరణాలు ఇట్లా ఉన్నాయి నాలో వచ్చినవన్నీ బాగుపడ్డాయి నాలో వచ్చినవన్నీ నాలాగనే ఉన్నాయి నాకంటే భిన్నంగా లేవు రెండు పూర్ణాద్వైతమైన అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ స్థాయిలో సంచారం చేస్తున్నాయి అని అంటూ స్వామి ఓ పద్యం ఏం చెప్పారంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఒక దానికి సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నటువంటి దానికి అసలు ఉన్నది బ్రహ్మం తప్ప అన్య వస్తువు లేదనేటువంటి ఒక వైదాంతిక భూమికకి సమగ్రమైనటువంటి పద్యం అది. చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి అన్నను బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వల్లభ్యమది బ్రహ్మ జీవులన్నియు బ్రహ్మ జీవరాశియు బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయిబ్రహ్మ. తనను భిన్నంగా పెట్టుకోవాలని దేవుడు నన్ను అనలేదు మీరందరూ ఎలాగో నేను అంతే ఇంకో విషయం చెప్తున్నా నేనేమిటో మీరు అదే మిగతా వారందరూ మీలో ఉన్న దైవాన్ని చూసుకోమన్నారు పట్టుకోమన్నారు కనుక్కోమన్నారు వెతకమన్నారు తపస్సు చేయమన్నారు ధ్యానంలో ఉండమన్నారు స్వాధ్యాయం చేయమన్నారు సద్గోష్ఠి చేయమన్నారు సదాచారంలో ఉండమన్నారు స-సంయక్ సంకీర్తన చేయమన్నారు స్వామి ఇవేమీ అక్కర్లేదు బంగారు యు ఆర్ మీ ఐ యామ్ యు నీవు నేను ఒక్కటే త్వమేవ అహం న సంశయః ఎప్పుడు కేవలం దేహంగా ఒట్టి శరీరంగా ఒట్టి రథంగా ఒట్టి కవచంగా ఒక్క దేవాలయ ప్రాంగణంగా గనక ఉన్నట్లయితే ప్రాకార స్థాయిలో ఉన్నట్లయితే భగవత్ తత్వం మనకు ఎరుక పడదు గనక మనం కూడా సత్-చిత్ ఆనందంలో ఆనందాన్ని పొందలేదు చిత్తుగా ఉన్నాం సత్ అనేటువంటిది పరబ్రహ్మ తత్వమే ఈ ప్రపంచంలోకి పరమాత్మగా వచ్చినటువంటి వేళ మనం చేయవలసింది ఏమీ లేదు వెళ్లి దానితో కూడి ఉండటమే. దేనితో పరమాత్మతో ఆ పరమాత్మ ఎవరు అన్నప్పుడు ఇందాకన్నట్లుగా మనకి మిగతావన్నీ కథలే సత్య సాయి భగవానుడే మనకి వాస్తవం కారణం ఒకటే మిగతావన్నీ లేవని కాదు అవి కావని కాదు ఎందుకని ఒక్కటే అంటే మనం అందరం కూడా పరమాత్మని ఒక భావనలో మనం విచారణ చేయాలి స్వామి ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు చెప్పారంటే నన్ను ఈ ఐదడుగుల మూడంగుళాలకి పరిమితం చేయకండి మీకు కనిపిస్తున్నది మాత్రమే నేను కాదు సత్య సాయి యొక్క తత్వంలోకి మీరు రండి ఆ తత్వంలోకి మీరు గనకొస్తే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు కానీ దేహం జగన్మోహనాకారం అది ఆ దేహాన్ని చూస్తుండగానే పరవశించిపోయినటువంటి జాతిలో పుట్టాం మనం అలాగే స్వామి యొక్క నామం ఓం శ్రీ సాయిరాం అనగానే మానవుడి యొక్క బంధన పరిపూర్ణం అయిపోతున్నటువంటి వేళ బహుశా ఆ సత్ అనబడేటువంటి హైయెస్ట్ లెవెల్ ఏదైతే ఉన్నదో దానివైపు మనం కొంత ప్రయాణం చేయలేదేమో కనుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస పరమేశ్వరుడు అవతారం పరిసమాప్తి చేసుకున్నారు కనుక దేహ ప్రయాణం ఆపారు గనుక ఈవేళ మనం వేసుకోవలసిన ప్రశ్న తర్వాత ఏమిటి ఆ తర్వాత అంటే ఇప్పుడు ఏమిటి అని ఆ తర్వాతలో స్వామి యొక్క మూలాన్వేషణలోకి మనం వెళ్ళాలి వెళ్లలేకపోయినట్లయితే స్వామి కథలతో స్వామి మహిమలతో స్వామి లీలలతో స్వామి యొక్క జీవిత చరిత్రతో తృప్తి పడినట్లయితే మనకు అంతవరకే తెలుస్తుంది గాని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామి యొక్క మూల తత్వం మాత్రం మనకు అర్థం కాదు అర్థం కాకుండా గనక కన్నుమూసినట్లయితే మానవ జన్మ వ్యర్థమైపోతుంది గనుక ఆ దిశగా ఈ సత్ అనబడేటువంటి పదార్థాన్ని సత్యసాయి భగవానుడు ఇందాక చెప్పిన సర్వము బ్రహ్మమయమే ఇక్కడ బ్రహ్మం కాని మరొక వస్తువు లేదంటూ విచారణ చేసి ఏ సత్తులో నుంచి వచ్చామో వ్యక్తిగా వచ్చాం ఇదిగో పంచభౌతిక దేహం మనందరం ధరించాం కొన్ని ఎర్రవి కొన్ని తెల్లవి కొన్ని నల్లవి కొన్ని పొట్టివి కొన్ని పొడుగువి అవన్నీ పరిమితమైనటువంటి దేహానికి సంబంధించినవే దేహాతీతమైనటువంటి ఒక భావనలోకి వెళ్ళాలి అంటే ఈ సత్ అనబడేటువంటిది భగవాన్ రమణ మహర్షి సత్యసాయి భగవానుడు మాత్రమే ఈ ప్రపంచానికి ఒక సూచన ఇచ్చారు ఆ సూచన ఏమిటంటే ది వన్ దట్ ఇస్ ఛాలెంజ్డ్ ఇస్ నెవర్ రియల్.The one that is real can never be challenged. అది. ఏది సత్యమో దానిని ప్రతిఘటించడానికో, దాన్ని జయించడానికో లేదు. దాన్ని పొందటానికే ఉన్నాం మనం. అనుభవించటానికే ఉన్నాం. అనుభూతి చెందటానికే ఉన్నాం. విభూతి స్థాయికి వెళ్ళటానికే ఉన్నాం. ఆ విభూతి స్థాయికి వెళ్ళాలి అంటే ఎన్ని జన్మలు పొందాలి? మూడు రకాల సాధకులు ఉంటారు. బొగ్గు, దాంట్లో నుంచి నిప్పు రాజేయ్యాలి అంటే కాస్త time పడుతుంది. రెండో వాడు ముట్టించగానే వెలుగుతాడు. మూడో వాడు ముట్టించి ముట్టించకుండానే దానిలో నుంచి sound and light ఏకకాలంలో బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ జ్ఞానులు, ఈ సాధకులు కూడా మూడు స్థాయిలలో సంచారం చేస్తారు గనుక మనం నెమ్మదిగా ప్రారంభించినా మన ప్రయాణాన్ని గనుక అర్థవంతంగా, వేగవంతం గనక చేసుకున్నట్లయితే ఫలితాలు ఇహమేవా అన్నది వేదం. అంటే ఇప్పుడే, ఇక్కడే. Now and here. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏం లేదు. కథ కంచికి, మనవింటికి. దేహం తీసుకుని వచ్చి పొందలేనిది దేహం లేకుండా ఏం పొందగలుగుతాం? అందుకనే పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయేని ఈ శరీరంబు నీదే. కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు కలుగకెట్లు? ఏతదధిష్ఠాత యెవడో యజమానుడ నిన అష్టమ తనువు వాడు. కెరలి నన్నేమి మిగిల్చితి నా సామీ! బిట్టు నేనన్నది అభిజ్ఞ గాక. పూర్ణమైనటువంటి ఆత్మతత్వమే ఇది. పంచభూతాలు నీవేనంటివి. సూర్యనాడి, చంద్రనాడి అనబడేటువంటి కుడి కన్ను, ఎడమ కన్ను రెండూ నీవేనంటివి. అసలు ఆ ఐదు ప్లస్ ఈ రెండు కలిపితే అన్నీ నే-నీవేనంటివి. పోనీ ఎనిమిదోదున్నదయ్యా ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడన్న. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడేటువంటి ఏడు శరీరాలు దాటితే ఎక్కడో ఒక ఆత్మని ఉన్నట్లయితే ఆ ఆత్మ నీవే అని వేదాంతులంతా చెప్తుంటే వాడు అంటున్నామే. నాలో ఎవడో ఒకడున్నాడు. వాడు వింటున్నాడు. వాడు అంటున్నాడు అంటున్నామే. అంటే ఈ ఏడూ నేను కాదు. ఎనిమిదో వాణ్ణి నేను కాదు. కన్ను తెరవటం నా వల్ల కావటం లేదు. కన్ను మూయటమూ నా చేతుల్లో లేదు. మరి నేనెవరయ్యా? నేను చేశాను. నేను రాశాను. నేను కూశాను. నేను ఎన్నో చేశాను అంటున్నానే. మరి ఆ నేను ఎవరు అంటే మేనుతో కూడిన నేనే ఈ మాటలంటున్నాయి. నేనుగా ఉన్నటువంటి నేను అసలు ఏమీ అనటం లేదు. అదేమంటుందంటే మనం కూడా జీవితంలో మూడు స్థాయిలలో సంచారం చేస్తాం. తొలినాళ్లలో మీరు బాగా పాట పాడారండి, మంచి కచేరీ చేశారండి అని ఓ సంగీత కళాకారుణ్ణి గనక అన్నట్లయితే, అవునండి చాలా నిష్టగా సాధన చేసి నేను బ్రహ్మాండంగా పాడాను. మన గురువుగారు అన్నారు నాకంటే బాగా పాడావోయ్ అని. నిజమేననుకున్నాను వచ్చానంటాడు. కాస్త పరిణామం ఏర్పడిన తర్వాత నేను పాడుతున్నానని అనుకోవటం లేదు, ఎవరో పాడిస్తున్నారు నేను పాడుతున్నాను అంటున్నాను. ఇంకా నేనున్నాను. పరిణామస్సం పూర్తయిపోయిన తర్వాత ఎంత బాగా పాడారు అనగానే నాకేమొచ్చు ఎవడో పాడుతున్నాడు, వెళుతున్నాడు అంటున్నాడు. కాబట్టి ఈ అకర్తృత్వ భావన ఏదైతే ఉన్నదో, doership ఏదైతే ఉన్నదో దానిని వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనకి సత్ అర్థమవుతుంది. లేకపోతే ఎవరైనా మనం foreign countryకి లేదా ఇంకో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు suddenగా ఓ కొత్తవాడు మనల్ని కనిపెట్టి ఈయన జేబులో స్వామి photo ఉంది, కనుక ఈయన స్వామి భక్తుడే అని బాబా గారి గురించి మీకు తెలుసా అంటే నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు నాకే తెలుసు అంటాం. ఎట్లా మనకేం తెలుసో తెలుసునా? స్వామి ఎలా వచ్చారు, ఏం చేశారు, పుటపర్తిలో ఏం జరిగినయో, స్వామి ఏం మహిమలు చేశారో అంతవరకే తెలుసు. ఏది అభివ్యక్తమైందో అది మాత్రమే తెలుసు కానీ, అవ్యక్తం కానిది మనకు తెలియదు. Nuclear physicsలో ఓ సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే పదార్థం అంతా hundred percent అనుకుందాం. అదో మూట, ఓ కుప్ప. ఈ hundred percentగా పరిపూర్ణంగా ఉన్న ఈ కుప్పలో మనం చూడగలుగుతున్నది ఎంతో తెలుసునా? 2.5% మాత్రమే. దానికే పధ్నాలుగు భువనాలని, అసలు విశాల ప్రపంచమని, మనమేదో యాభై ఏళ్ళు ఇక్కడ ఉన్నామని, డెబ్భై ఏళ్ళున్నామని, ఎనభై ఏళ్ళు చాలా కాలం ఉన్నట్లు, అసలు ఈ ప్రపంచాన్నంతా మనం జయించామని అనుకుంటామే out of hundred percent 2.5వే మన కంటికి కనబడుతున్నది. ఆ 2.5లో మన కంటికి మనం చూసింది ఎంత అంటే 0.001% మాత్రమే. దానిని అసలు అర్థం చేసుకున్నది అంటే ఇంకో సున్నా పెట్టాలి. అనుభవించింది ఎంత అంటే పాయింట్ తర్వాత ఐదు సున్నాలు. ఏ-ఏం మిగిలిందయ్యా అంటే మనకేం తెలియదు అని తెలుతున్నది. ఏమీ తెలియని మనం అన్నీ తెలిసిన, అన్నింటికీ మూలమైన ఆ 97.5%ని ఎలా పట్టుకోవాలి? ఒక్కటే. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యః మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృతి విస్మయ నశాస్వం చిందితా మజ్జతావా పవరచరణ రోగాత్ ఆత్మనిష్ఠో భవత్వం. మనం ఇక్కడ దీపం వెలిగించాం. వెలిగించగానే ఏం చేశాం? దీపం ఆరిపోకుండా ఒక డబ్బా పెట్టి పెట్టేశాం. ఆ డబ్బా-డబ్బాలో ఉన్నటువంటి జ్యోతి అలాగ వెలుగుతుంది.దాన్ని కాసేపు బయటికి తీద్దాం, ఒక నిమిషంలో మన కళ్ళ ముందు ఆరిపోతుంది. కాబట్టి ఆత్మ కూడా, సత్ కూడా నీ లోపల బిందు స్వరూపంగా నీ యందే ఉన్నది గనుక ఆ ఆత్మ విచార మార్గంలోకి వెళ్ళమని స్వామి కూడా మనకి సెలవిచ్చారు. నిజానికి స్వామి ఉపన్యాసాలన్నీ కూడా పందొమ్మిది వందల డెబ్బై వరకు అధ్యయనం గనుక చేసినట్లయితే భారతీయ వేదాంతం మొత్తాన్ని, ఆర్షధర్మం మొత్తాన్ని, వేద వేదాంగాలలో ఉన్నటువంటి మర్మాన్ని, ఉపనిషత్తులలో ఉన్నటువంటి భావనలన్నింటినీ కూడా అతి సరళమైన, గంభీరమైనటువంటి ఒక essence గా, ఒక రసం గా పిండి చేతిలో పెట్టారు. ఆ జాతి అంటే పందొమ్మిది వందల డెబ్బై వరకు వచ్చినటువంటి వారంతా కొంత గ్రహించగలిగారు. పందొమ్మిది వందల డెబ్బై తర్వాత స్వామి అవతార వైభవంలో అనేక దేశాలు, అనేకమైనటువంటి మనుషులు అక్కడికి చేరిన కారణంగా ఈ సాంద్రమైన, ఘనీభవించిన, మూలమైన ఆ రసాన్ని పట్టుకోలేరేమో అని స్వామి మధ్య మధ్యలో చిన్న చిన్న కథలు చెప్తూ మనకి సత్ విచారణ చేశారు. అదే సత్యాచార్యః అన్నటువంటి దాన్ని సత్యబోధకుడుగా స్వామి చేశారు. అయితే మన స్థాయి receptivity మనలో ఎంత ఉన్నది అంటే, కథని పట్టుకున్నాం, అసలుని వదిలిపెట్టేసాం. లోపం మంది కాదు మనకు అంతవరకే తెలుసు, పట్టుకోగలిగింది అంతే. స్వామి చిన్న కథలు తెలిసినంతగా స్వామి చెప్పిన తత్వాన్ని మనం అధ్యయనం చేయలేదని అనిపిస్తుంది. కనుకనే స్వామి ఆ రెండింటినీ కూడా కథ కావలసిన వాడికి కథగా, సత్యబోధ కావలసిన వాడికి సత్యబోధగా రెండూ సమన్వయం చేస్తూ స్వామి ఒకసారి ఒక మాట అన్నారు. "నా ఉపన్యాసం ఒక మంచి mixture లాంటిది" అన్నారు. "ఖారా లాంటిది" అన్నారు. ఖారా అంటే తెలుసు మనకి Namkeen అంటామే! దానిలో ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ఉంటాయి. కాసేపు అది, కాసేపు ఇది గా ఉంటుంది. కానీ మూలం ఏమిటి అంటే యదార్థమే, సత్యమే. కాబట్టి సత్యసాయి భగవానుడు ఎవరు అని గనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ఇవాళ ప్రపంచానికి మనం ఇవ్వగలిగిన, ఇవ్వతగిన, ఇవ్వవలసిన జవాబు ఒక్కటే. అది సత్. ఆయన, ఆమె కాదు. అది. That. ఏది తత్ అయి ఉన్నదో దానిని మనం దర్శనం చేశాం. ఆ తత్ కి ఒక అర్థము, ఒక ప్రయాణము, ఒక కదలిక, ఇవన్నీ ఉన్నాయి గనుక సత్యాన్ని బోధించటం కొంతవరకు తేలికే. మాటలున్నాయి, విచారణలున్నాయి, అవగాహన ఉంది, స్పష్టత ఉన్నది, శాస్త్రాల మీద అధికారం ఉంది, భాష ఉంది, ప్రజ్ఞ ఉంది. బోధించటం ఏమి కష్టం? కొంత బోధించవచ్చు. సత్యాన్ని ఆచరించటం ఏం చేయాలి? మనకి స్వామి సత్యాచార్యుడు అంటే ఆచార్యుడు అంటే ఎవరినో ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, గురువు, ఆచార్యుడు. ఈ నాలుగు, నాలుగు స్థాయిలు. ఉపాధ్యాయుడు అంటే ఉప అంటే దగ్గరక, ధ్యాయిత నేర్పేటువంటి వాడు అని అర్థం. మనకి పలక మీద ఓం నమశ్శివాయ అని అక్షరాభ్యాసం అన్నాడు, రాయరా అనలేదు గురువు. ఉపాధ్యాయుడు పలక ఆయనే పట్టుకున్నాడు, బలపము ఆయనే పట్టుకున్నాడు, మన చేతిని ఆయన చేతిలో పెట్టుకున్నాడు, మన చేత రాయించినట్టుగా ఆయనే రాశాడు. కదా. ఆయన ఉపాధ్యాయుడు. అధ్యాపకుడు అంటే ఇంతకు ముందే ఏదో ఒక విషయం ఉన్నట్లయితే, ఆ విషయాన్ని దగ్గర చేసుకొని, నాయనా భాగవతంలో ఇది ఉన్నది, ఇదిగో పోతన గారు ఇట్లా అన్నారు, వ్యాసులవారు ఇట్లా అన్నారు అని ఉన్నదాన్ని కాస్త explain చేశాడు అధ్యాపకుడు అయినాడు. ఉప నుంచి అధికి వెళ్ళాడు. అధి వ్యాపకుడు అయినటువంటి వాడు అధ్యాపకుడు. ఇక గురువు ఏం చేశాడంటే, తామసాన్ని, అహంకారాన్ని నశింపజేసి మానవుణ్ణి స్థిమిత పరచి, అందుకనే స్వామి అంటారు, "అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారం ఉండదు." నాకు గురువు దొరికారు అంటే ఇంకా నాకు అహంకారం ఉంటే నా గురువు నాకు దొరికినట్టా దొరకనట్టా? దొరికాడు అన్న భ్రాంతిలో నేను ఉన్నట్టే లెక్క. కాబట్టి అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారం ఉండదు. అహంకారం పోవాలి అంటే ఆ గురు స్వరూపం రావాలి. ఆ గురువు అంటే గురుతు చెప్పేవాడు, సూచన చేసేవాడు, సూచక గురువు, మోచక గురువు, వాచక గురువు, నిషిద్ధ గురువు, కారణ గురువు, లోక గురువు, బోధ గురువు, ఇట్-దీక్షా గురువు అని అనేకమంది గురు స్వరూపాలున్నాయి. ఈ అనేక గురు స్వరూపాల కంటే కూడా వాళ్ళు బోధ దగ్గర ఆగిపోతారు. అందుకనే స్వామి "All Gurus are one but all are not Gurus" అన్నారు. ప్రతి వాడు గురువు కాలేడు. ఎవరయ్యా ఈ గురువు అంటే తాను ఎరిగిన, తాను పొందిన, తాను చూసిన, తాను అనుభవించినటువంటి మార్గాన్ని మరొకడికి ఉపదేశనం చేయగలిగిన వాడు గురువు. మరి ఆచార్యుడు ఎవరు? స్వామి నేను సత్యాన్ని బోధించడానికి వచ్చిన గురువునని అనలేదే! కాబట్టి స్వామి గురువా? గురువు కానే కాదు. మరి స్వామి ఎవరు అంటే "అహం సత్య బోధకః" ఆచార్యుణ్ణి నేను అన్నారు. ఆచార్యుడు అంటే ఆచరించి బోధించేటువంటి వాడు. దేనిని బోధించాడో దానిని ఆచరించేవారు. సత్యసాయి భగవానుడు సత్ పదార్థంగా, ఒక యదార్థంగా, ఒక పాంచభౌతిక దేహాన్ని తీసుకొచ్చినటువంటి మాయా మానుష వేషధారిగా, అది రామత్వాన్ని, లీలా కాండ సాగించిన కృష్ణత్వాన్ని కలిపి ఇది మాయా లీలా మానుష స్వరూపమిది. మాయా ఉన్నది, లీలా ఉన్నది. అందుకనే స్వామి కావాలనుకున్న వారికి, అవుననుకున్న వారికి నేను మూడు Yes లు. కదా. Yes Yes Yes. లేదన్న వాడికి అంతే బలంగా No No No.అంటే యద్భావం తద్భవతి మనం ఆ వస్తువుని ఎలా దర్శనం చేస్తే అది మనకు అట్లా కనిపిస్తుంది. చూడటం వేరు దర్శనం చేయటం వేరు. చూడటం అంటే ఈ కంటితో చూసి వదిలిపెట్టేది. దర్శనము అంటే హృదయంతో అనుభవించేది. ఆ సత్యార్థ దర్శనాన్ని సత్య సాయి భగవానుడు ఈ ప్రపంచంలోకి ఒక అవతారమూర్తిగా వచ్చి సత్యబోధన చేస్తూనే సత్యోపదేశం చేస్తూనే ఈ నాలుగు స్థితులని కూడా ఒకే శరీరంలో ఒకే కాలంలో ఒకే అనుభూతిగా మనల్ని పరవశింపజేశారు. అందుకనే స్వామి అధ్యాపకుడు వేర, గురువు వేర. ఏ శాస్త్రం చదవాలి అంటే ఓ పద్యంలో చెప్పారు "అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమగురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే" ఏది నశ్వరమో, ఏది సత్తో, ఏది పదార్థం కాదో, ఏది సర్వ పదార్థములకు మూలమై ఉన్నదో, ఏది కదలదో కానీ అన్ని కదలకు ఏది మూలమై ఉన్నదో, ఏది చూడదో కానీ చూడటానికి ఏది మూలమై ఉన్నదో, ఏది ఈ కనుల ద్వారా చూడబడదో కానీ చూపించగలిగిన శక్తి అంతరంగంలో ఉన్నదో అదే సత్ గనుక సతతము ఉండేది గనుక సచ్చిదానంద పూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో అదే సత్పదార్థంగా, సత్యదార్థంగా, అదే చిన్మయంగా, అదే మృణ్మయంగా, అదే నిరామయంగా, నికేతనంగా, నిరంజనంగా, పూర్ణంగా, హాయిగా పరిఢవిల్లుతూ ఉన్నది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అణువు కూడా పదార్థమా అంటే పదార్థంగా కనిపిస్తున్న యదార్థం. యదార్థాన్ని గనుక పట్టుకుంటే పదార్థం మనం మర్చిపోతాం. ఓ రవ్వలడ్డు తిన్నాం, రసగుల్లా తిన్నాం, మంచి భోజనం చేశాం. దేన్ని గుర్తుపెట్టుకున్నాం? బియాన్ని గుర్తుపట్టుకోలేదు, పంచదారను పట్టుకోలేదు, పాకాన్ని పట్టుకోలేదు, అది అందించిన రుచిని మాత్రమే రిజిస్టర్ చేసుకున్నాం. ఎందుకనంటే మొదట చెప్పిన పాకము పదార్థ-- అన్ని పదార్థం. పదార్థము అంటే నశించేది, మార్పు చెందేది. యదార్థము అంటే మార్పెరగనిది. అది నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, నవనవోన్మేషమైనది, పూర్ణమైనది, ధవళమైనది గనుక ఆ తెల్లనైన, శుద్ధమైన, సరళమైన, సూటి అయిన, గంభీరమైనటువంటి సత్యాన్ని ఎక్కడ వెదకాలి? ఎక్కడ పట్టుకోవాలి? అసలు వెదకటమే అవసరం లేదన్నారు. స్వామి ఓమాట చాలా అందంగా స్వామి ప్రబోధం అంతా కూడా వేద వాక్కులే. వేదాలలో అటువంటి అపౌరుషేయంగా, నాదమయంగా ఉన్నటువంటి దానిని మహా మంత్రాలన్నింటినీ కూడా మాటలుగా మార్చి మామూలు వాడు మన బోటి వాడు అందుకునే దిశగా మన స్థాయికి దిగి వచ్చి, పారాడుతున్నటువంటి బిడ్డని వంట చేసుకుంటున్నటువంటి తల్లి వంట వదిలిపెట్టి ఎట్లాగైతే ఒంగి ఎత్తుకొని లాలించి వాడిని నిద్రపుచ్చే దాకా తన పని మానుకున్నదో సత్య సాయి భగవానుడు కూడా మనకోసమే ఒంగిన రెయిన్బో అది. మహా ఇంద్రధనస్సు అది. ఆ ఇంద్రధనస్సుకు ఈ ప్రపంచంతో ఏం పని లేదు. తాను సృష్టించిందే. కానీ మరి ఎందుకని ఇక్కడికి ఇలా వచ్చారు? ఎందుకని ఈ సత్యబోధ ఇప్పుడే ఎందుకు చేశారు? అని గనక విచారణ చేసినట్లయితే సత్యాన్ని మనం అబద్ధాలాడకపోతే సత్యవాదులుగా చెప్పుకొని చలామణీ అవుతున్నాం కనుక. అది సత్యం కాదు. సత్యము అంటే నా మూలమైన ఏ చైతన్యము బిందువుగా నా యందున్నదో, ఏ బిందువు ఒక శరీరాన్ని పొందిందో, ఏ శరీరము పరమాత్మ భావనలో నిలకడ చెందిందో, ఏ పరమాత్మ యొక్క స్థాయికి అది చేరే ప్రయత్నం చేస్తున్నదో, సాగర సంగమానికై నిరీక్షిస్తున్నదో, కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి మూడు యోగాలని సమన్వయం చేసుకొని యోగించటానికి సిద్ధపడుతున్నదో ఆ సత్ నేనైనప్పుడు, అందుకనే దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహి నిరామైయుండన్నారు. దేహం పోతుంది దేహి లోపల ఉన్నాడే ఉన్నదే అది నిరామయం. ప్రపంచంలో కష్టాలు వచ్చాయి లోపల వాడు ఏం బాధ పడలే, పడ్డదంతా మనమే. యాతనలు వచ్చాయి, అననుకూలాలు వచ్చాయ్, దేహం పడింది తప్ప దేహం లోపల ఉన్న ఆత్మ నిత్య సాక్షియై, పూర్ణుడై, ఏ రకమైనటువంటి దేనిని అంటించుకోని స్థాయిలో పద్మపత్రం ఇవ బాంభసా తామరాకు మీద నీటి బొట్టు వలె జరుగుతున్న దానిని చూస్తున్నట్లుగా సాక్షీభూతంగా. సత్య సాయి భగవానుడు భిన్నంగా చెప్పారా? ఒక మాట అన్నారు "మీ కర్మలకు నేను బాధ్యుడను కాను. మీ కర్మలను తొలగించటానికి నేను రాలేదు. నేను కేవలము కర్మసాక్షిని మాత్రమే". స్వామి, మా యాతన మేం పడుతుంటే, మా బరువు మేమే మోస్తుంటే మరి మీరు ఏమీ చేయవంటే మీరు మాకెందుకు స్వామి? అని ఒక ప్రశ్న వేస్తే స్వామి చెప్పారు "కష్టం రాగానే పరిగెత్తుకొని తీసెయ్యమని అడగకండి. ఎందుకంటే తీసేయటం నాకొక లెక్క కాదు. కానీ మూట తెచ్చుకున్నది మీరు. మూట విప్పుకోవలసింది మీరు. మూట ఎలా విప్పాలో చెప్తాను, ఎప్పుడు విప్పాలో చెప్తాను, ఎంత విప్పాలో చెప్తాను. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఒక ఆంతరంగిక శక్తిగా, ఒక మనోబలంగా, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల యొక్క త్రిపుటిగా నేను మీ యందు ఉంటానే కానీ మీ కర్మలకు నేను బాధ్యుణ్ణి కాదు" అన్నారు. స్వామి ఏదో మనకి చేశారని, మనకేదో చేయలేదని రెండు అకౌంట్లు తెరుచుకునే కంటే స్వామి మనకు ఏమీ చేయరు కానీ స్వామి ఏం చేస్తారంటే తప్పు చేయకుండా చూస్తారు, మంచే చేసేట్టుగా చూస్తారు అని గనక అనుకోగలిగితే మనందరం కూడా మంచే చేస్తూ ఉంటాం. ఆ మంచి ఆలోచన, మంచి కర్మ, మంచి భావన, మంచి సంబంధము అంతా మంచే మంచే మంచే అయినప్పుడు ఈ ప్రపంచంలో ఏం మిగులుతుంది? మంచే మిగులుతుంది. ఆ మంచి ఎలా మిగుల్చుకోవాలో సత్య సాయి భగవానుడు ఒక ఆచార్య స్థాయిలో సత్యబోధకుడిగా ఈ ప్రపంచానికి భారతీయ వైదాంతిక సిద్ధాంతాన్ని జాతి, మత, వర్గ, వర్ణములను దాటి కుల రహితమైనటువంటి ఒక ఉదాత్తమైన మానవ కులంలో పరమేశ్వరుడు తనను ఆవిష్కరించుకున్నటువంటి పరమాద్భుత సన్నివేశంలో మనం కూడా ఉన్నాం. ఉండి కూడా ఇంకా కులం చేత, ఇంకా మతం చేత, ఇంకా స్థితిగతుల చేత, ఇంకా భావనలో ఉన్నటువంటి అపరిపక్వత చేత మరొక మనిషి నుంచి గనక మనం దూరమైపోతూ వెళ్లిపోయినట్లయితే భగవానునితో కూడి ఉండి కూడా ఆ దారం పరిమళం యొక్క ఒక భాగాన్నైనా గనక అంటించుకోకపోయినట్లయితే ఎవరికి నష్టము అంటే స్వామి మాటలో సాధకుడిదే నష్టం.
SSSMC · audio
Mahopadesam - 02
Mahopadesam - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 31:20
More in this series