No transcript for this section.
ఓం శ్రీ సాయిరామ్! భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతి నెలా ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. September మాసంలో మహా పరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవని సంచారంలో జాతి మత వర్గ వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు ప్రవచన పంచాగ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భగవానునితో కూడి ఉండి కూడా ఆ దారం పరిమళం యొక్క ఒక భాగాన్నైనా గనక అంటించుకోకపోయినట్లయితే ఎవరికి నష్టము అంటే స్వామి మాటలో సాధకుడిదే నష్టం. పొందాలి. దేన్ని పొందాలి భాగవత పరిమళాన్ని పొందాలి. భాగవత అంటే పరమేశ్వరుడి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులు కలిపితే భాగవత తత్వం కాబట్టి పరమేశ్వరుడి యొక్క దివ్య భావ నాగరిమలో మనం సంచారం చేస్తూ ఉండాలి. స్వామి బృందావన్ బాయ్స్ తో మొన్న ప్రశాంతి నిలయంలో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న చర్చలాగా వచ్చినప్పుడు అంతా బానే ఉంది సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు స్వామి చెప్పారు స్వామి అసలు ఆచరించారా లేదా అని ఒక చిన్న చిలిపి ప్రశ్న వేసుకుని ఎందుకు వేసుకున్నాము స్వామి ఎలా ఆచరించారో తెలుసుకుంటే దానిని ఎలా అనుసరించాలో మనకు తెలుస్తుంది గనుక. అసలు ఆచరించారా లేదా అన్న ప్రశ్నకి అసలు ఆచరణే అది బోధే అది మూలమే అది సత్యమే అది. ఆ స్వామి సత్ చిత్ ఆనంద స్థితిలోనే ఉన్నారు. స్వామి కూడా ఈ ప్రపంచంలో మానవ మానాలు రెండు సమానంగా భరించారు. భరించారా ధరించారా? నిజానికి భరించనూ లేదు ధరించనూ లేదు. ఏమిటి కేవలం అవధరించారు మాత్రమే విన్నారు. ఎవరో ఏదో నువ్వు దేవుడివి కాదన్నారు అవుననుకో అన్నారు. స్వామి నువ్వే దేవుడివి అన్నారు అవుననుకో అన్నారు. వాడు అవునన్నా మరొకడు కాదన్నా ఆయన దేవుడు కాకపోతే కదా ఆయన సత్యం కాకపోతే కదా దేవుడు అనేటువంటి మాట చిన్నమాట. స్వామి విషయంలో నా అనుభవంలో నా భావనలో నా అధ్యయనంలో ఒక చిన్న ఎరుక ఏమిటంటే స్వామి ఇస్ నాట్ ఏ మీర్ గాడ్ స్వామి ఇస్ ఏ ఫినామినన్. సర్వ దేవీ దేవతలకి సర్వ దైవ స్వరూపాలకి సర్వ దైవ శక్తులకి మూలమైన ఆ ఫినామినన్ ఏదైతే ఉన్నదో అది మాత్రమే సత్యసాయి భగవానుడు తప్ప స్వామి దైవం స్వామి దైవం అంటే దైవం వరకు మనం అర్థం చేసుకున్నాం ఫినామినన్ స్థాయికి కూడా వెళ్ళాలి. దైవము అంటే దేవులాడేవాడు దైవం అన్నారు స్వామి. దేవా అంటే ఆట అని అర్థం. ఆయన ఆడుకుంటారట. మనకి ఆ పద్యం ఉంది కదా ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై అని అంటూ పరమాత్మ అను బొమ్మలాటగాడు ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆ పరమాత్మ ఊరిక బొమ్మలాడుకునే ఆటగాటవాడు వచ్చి తాను జీవుల రంగస్థలాన్ని నిలిపి తనని జీవుల్ని పెట్టుకొని ఆట ఆడుకుంటున్నాడట. మన చిన్న పిల్ల నాలుగేళ్ళ ఐదేళ్ళ పిల్ల ఊహ తెలుస్తున్నటువంటి వేళ లక్క పెడతలలో ఏదో పోసినట్లు తాను ఏదో వండినట్లు అమ్మా నేను వండాను నువ్వు చెయ్యి చాపమన్నట్లు మనం కూడా మా పిల్ల ఏదో ఆ లక్క పెడతలో వండినట్లు మనం తిన్నట్లు ఇద్దరూ అభినయించారు కదా. అలాగే జీవుడు పరమాత్మ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చి రెండు ఆటలు ఆడుకుంటారు. అయితే అది దేవుడి ఆట మనది దేవులాట. ఆ దేవులాట అంటే వెదుకులాట. దేనిని వెదుకులాట అంటే దైవం ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతికితే అసలు ఎక్కడ లేడు. ఆ సత్తువ ఎక్కడ లేదు. ప్రహ్లాద చరిత్ర మనకు ఏం చెప్తున్నది సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని తెల్లవారిన తర్వాత ప్రహ్లాదుడు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు వచ్చి అడుగుతాడేమో నా భక్తుడిని ఏమిరా హరిని చూపిస్తానన్నావే అదిగో ఆ స్తంభం మా తాత కట్టాడు ఇంకోటి ముత్తాత కట్టాడు ఇది నేను కట్టాను నేను కట్టినటువంటి దాంట్లో నువ్వు చెప్పిన హరి ఉండటానికి వీల్లేదు గనుక దీంట్లో చూపించు అంటాడేమోనని తెల్లవారటానికి ముందే ఆ క్రితం రాత్రే శ్రీ మహావిష్ణువు అంతఃపురం లో ఉన్న ప్రతి అణువులోనూ తన విష్ణుత్వాన్ని నింపుకొని ఉన్నాడట. నింపుకొని ఉంటే వాడు అనుకున్న ప్రకారమే ప్రహ్లాదుడు అనుకోని చోటే దెబ్బ కొట్టాడు అక్కడి నుంచే నరసింహుడు వచ్చాడు. అంటే పగలు కానీ రాత్రి కానీ వెలుపల గాని లోపల గాని నరుడు గాని మృగము గాని ఒక పరమాద్భుతమైన ఎవరికీ గోచరించని ఎవరికీ అందని ఏ హ్యూమన్ మైండ్ కాంప్రహెండ్ చేయలేని మనోతీతమైన దివ్య భావనాకృతిగా జ్వజ్వల్యమానమైనటువంటి తేజో రూపంగా సయం సంధ్య వేళ తనను తాను పరమాత్మ ఆవిష్కరించుకున్నాడు. కనుక పరమాత్మ ఎలా ఉంటాడు అంటే రాముళ్ళ ఉంటాడా కృష్ణుళ్ళ ఉంటాడా మరొకళ్ళ ఉంటాడా అంటే...అన్నీ తానై ఉంటాడు అంతా తానై ఉంటాడు ఇది బ్రహ్మసూత్ర భాష్యం అసలు ఈ సర్వ ప్రపంచము కూడా ఒక ముద్ద ఆ ప్రపంచంలో అభివ్యక్తమైనప్పుడు మనం అబ్బురపడిపోతాం స్వామి ఒక ఉంగరాన్ని ఇచ్చినప్పుడు ఓ గొలుసుని ఇచ్చినప్పుడు ఒక రోగాన్ని పోగొట్టినప్పుడు ఏదో జరగబోయేది ముందే చెప్పినప్పుడు ఆశ్చర్యపోతాం చాలా చిన్న సిద్ధులు ఇవి ఎందుకంటే స్వామి చెప్పారు ఇవి అన్నీ కాదు బంగారు ఏరుగు నడిచి వెళ్ళిపోతున్నదే దానిమీద ఒక చిన్న దోమ వాలితే దోమను పట్టుకున్నావే గానీ ఏరుగును వదిలిపెట్టావు నష్టపోతావు జాగ్రత్త అన్నారు కాబట్టి మానవుడికి దైవము నందు ఇందాక చెప్పిన phenomenon అనబడేటువంటి దాన్నే వేదాంత భాషలో సత్ అన్నారు ఆ సత్ is phenomenon దాన్ని గనక పట్టుకున్నట్లయితే that phenomenon can be many phenomena it is a poly phenomena mega phenomena macro phenomena micro phenomena సూక్ష్మ సూక్ష్మీతరంగా ఎట్లాగైనా ఉండవచ్చు గనుక దానిని పట్టుకోగలిగినటువంటి ఒక అంతరంగ సిద్ధిని ఆత్మైక శుద్ధిని పరిపూర్ణమైన సంసిద్ధత్వాన్ని మనం గనక పొందగలిగినట్లయితే ఆ సత్ ఈ ప్రపంచం అంతా ఉన్నది. ఇవాళ మనం జడమైనటువంటి ఓ కుర్చీలో కూర్చున్నాం జడమైనటువంటి ఒక మైకు ద్వారా మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం కుర్చీలో కూర్చున్నాం అంటున్న ఈ దేహం కూడా జడమే ఇది ఒట్టి కట్టే ఈ కట్టకి ఏం లేదు కానీ కట్టే లోపల ఉండవలసినదంతా ఉన్నది. ఏమున్నదంటే యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి నేను నేను నేను అని నిత్యమూ ప్రకాశమానమవుతున్నటువంటి ఆ అఖండ జ్యోతి ఏదైతే ఉన్నదో అది సత్ గా ఉన్నది ఆ సత్ అనబడేటువంటి మాట అందుకనే గురునానక్ సత్ నామ్ సత్ నామ్ సత్ నామ్ బోలో కదా సత్ అనబడే పేరు అనే సత్ అంటూ అంటూ ఉండు అని సత్ కి నామం లేదు సత్ కి రూపం లేదు సత్ అంటే శక్తి ఆ సత్ అంటే సత్తువ అని అర్థం ఆ సత్తువ అంటే మూలశక్తి మూలకణాలు గనక పోయినట్లయితే ఎట్లాగైతే progeny లేదో ఎట్లాగైతే సృష్టి మళ్ళీ multiplication కి నోచుకోదో అదేవిధంగా పరమాత్మ యందు గనక మన భావాలు స్పష్టంగా లేకపోతే పరమాత్మ శక్తితో మన శక్తి అనుసంధానం కాకపోతే మనం చిత్తుగానే ఉండిపోయినట్లయితే చిత్తుగా ఉండిపోతాం అంతే. సత్ తో కూడితే సత్ చిత్తులు కలిస్తే అది ఆనంద స్వరూపం అవుతుంది కాబట్టి సత్యసాయి భగవానుడి యొక్క సత్యబోధ సత్యానికి వారు ఇచ్చినటువంటి నిర్వచనము బ్రహ్మనికి ఇచ్చినటువంటి నిర్వచనం గనుక ఇది పరిణామ సహమైనటువంటి మానవుడు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలలో సత్ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ సత్ లేకుండా ధర్మం లేదు ఎందుకంటే ఆధారం సత్. ఏదో ఒకటి ఉండాలి నేను కూర్చోవాలి అంటే కుర్చీ ఉండాలి కుర్చీ ఉండాలి అంటే నేల ఉండాలి నేల ఉండాలి అంటే పిల్లర్ ఉండాలి పిల్లర్ ఉండాలి అంటే foundation ఉండాలి foundation అంటే భూమి ఉండాలి ఇట్లా ఇది ఎట్లాగైతే ఒక పరంపరో ఇది ఎట్లా ఒకదానితో ఒకటి link up అయి ఉన్నాయో ఒక గొలుసుగా కొహసివుగా ఉన్నాయో సత్ తో మనము కూడనంత కాలం సత్ యొక్క నామంతోనే ఉన్నంత కాలం సత్ యొక్క యదార్థ స్థితి మనకు తెలియదు గనుక ఆ సత్యాన్ని మనం ఆవిష్కరించుకోవాలి స అంటే సహ అని స్వామి సహ మహా అర్ణవ గ్రంథం అని ఒకటి ఉంది మహా అర్ణవ గ్రంథం అది మహా మంత్ర అర్ణవ గ్రంథం అర్ణవ అంటే సముద్రం మహా మంత్రాలన్నీ దాంట్లో ఉంటే పరమేశ్వరుడికి అసలు ఏం పేరు పెడదాం అని ఆలోచించారట సహ అనమంది వేదం. సరే రాముడిగా వస్తే రాముడు కృష్ణుడిగా వస్తే కృష్ణుడు అది వేరు ఈ రామకృష్ణులకు కూడా ఏదన్నా మూలము పేరు ఉన్నదా అంటే సహ. ఆ సహ తల్లితనంతో గనక కూడి ఉన్నట్లయితే ఆయి అయినట్లయితే సాయి అయింది స్వామి పరిష్కార మార్గాన్ని మనకు చెప్పారు గనుక ఈ సహ దేహంగా ఉన్నట్లయితే సరే దేహము లేదు ఈ phenomena గానే ఉన్నది సత్ గానే ఉన్నది దాన్ని ఎలా విచారణ చేయాలి అంటే ఆ సత్ అనబడేటువంటిది ఎలా ఉన్నది రాముడిగా కృష్ణుడిగా సత్యసాయిగా షిరిడి భగవానుడిగా ఎట్లా అన్నా ఉండనివ్వండి ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అకార ఉకార మకారములు ఏవైతే కూడి ఉన్నాయో అకారము అగ్ని బీజమై మకారము చంద్ర బీజమై ఉకారము శక్తి బీజమై మూడు ఎక్కడైతే కూడి ఉన్నదో అది ఓంకార ప్ర-ప్రథమ ప్రణవ నాదంగా ప్రణవాక్షరంగా మార్పు చెందకుండా ఉన్నదో అన్నింటికీ కూడా ఓం అని గనక చదవకపోతే తర్వాత వచ్చే మంత్రం ఎంత బీజాక్షరాలు ఉన్న ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఎటువంటి వారినైనా శ్రీకారం చుట్టకుండా మనం పలకరించినట్లయితే మనం ఎవరికైనా ఉత్తరం రాస్తే మహారాజ శ్రీ అని రాసేవాళ్ళు. ఆ శ్రీకారములో శకార రకార ఈకారములు ఉంటాయి శ అంటే శారద రా అంటే రమ ఈ అంటే ఈశ్వరీ పార్వతీదేవి. ఆ మూడు యొక్క శక్తి ఒకటి అయినట్లయితే అటు ఓంకారమైన ఇటు శ్రీకారమైన మానవ దేహము యొక్క ప్రాకారం కాబట్టి ఈ ప్రాకారాన్ని తొలుచుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. దేవాలయం దాకా వెళితే దేవుణ్ణి చూసినట్టు కాదు దేవాలయంలోకి వెళ్ళాలి వీణాదండమైన ధ్వజస్తంభాన్ని తాకాలి మూడు ప్రదక్షిణలు చేయాలి మూడు అవస్థలు దాటాలి గర్భాలయంలోకి వెళ్ళాలి చిరు చీకట్లో మెరుస్తున్న పరమాత్మను చూడాలి. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే లోపలికి వెళితే తప్ప పరమాత్మ అనుభవంలోకి రాడు. పై పైన చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈ సత్ అర్థం కాదు గనుక ఈ సత్ అనబడేటువంటి దానికి నిర్వచన పూర్వకంగా స్వామి ఎలా ఉన్నారు అంటే ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారం అదొక మహా ఆనంద ప్రవాహం అది ఎందుకని ఆనందంగా ఉన్నది అంత ప్రవాహ వేగంతో ఎలా ఉండగలిగింది ఇటువంటి ప్రపంచంలోనే అంటే దానికి ఏమీ అక్కరలేదు గనుక.దా-- అది పొందవలసినది అంటూ ఏమీ లేదు గనుక అది అన్నింటినీ అందించగలదు గనుక అది ఆనందంగా ఉన్నది. మనం ఉన్నాం, ఎవరి దగ్గరన్నా ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నాం. ఎలా ఉంటుంది? మనసు కించపడుతుంది. అయ్యో తీసుకోవాల్సి వచ్చిందే అని కుంగిపోతాం. మనమే మరొకడికి ఇచ్చాం. ఎలా ఉంది? మహానందంగా ఉన్నది. ఎంత ఆనందం అంటే నేను కూడా ఇవ్వగలిగాను కదా, నేను కూడా చేయగలిగాను కదా. అందుకనే సత్య సాయి భగవానుడు ఈ సత్ అనబడేటువంటి దాన్ని సేవగా మార్చారు. ఆ సేవ ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందం మనకి అనుభవంలోకి రావాలి గనుక మనం చేసేటువంటి సేవకు మూలం ఏమిటంటే మన దగ్గర ఉన్న డబ్బు కాదు, మన దగ్గర ఉన్న ప్రజ్ఞ కాదు, మనం పొందిన అవకాశాలు కాదు, మనకు భగవానుడు ఇచ్చిన అనుగ్రహం మాత్రమే. ఆ అనుగ్రహం ఎందువల్ల ఏర్పడింది అంటే, ఆ సత్ ని పట్టుకోవాలి అంటే మనది కాని వారిని, మనకు చెందని వారిని, మనతో ప్రమేయం లేని వారిని కానీ వారెవరో వేరువారు కారు అన్న భావనలో ఉండేట్టుగా సేవా యోగాన్ని సత్పదార్థంగా సత్ప్రవాహంగా స్వామి మనకు పరిచయం చేశారు. అలాగే స్వామి యొక్క స్థితి ఏమిటి? ఎలా ఉంటారు? మనమందరం ఓ లక్ష మంది ఆయన ముందు కూర్చుంటాం. మన ఆలోచనలన్నీ ఆయన యందు ఉంటాయి. మరి ఆయన ఆలోచన మనందరి యందు ఉండాలి. మనకు ఒక ఆలోచన ఒక పరమాత్మ కానీ ఒక పరమాత్మ కోటి ఆలోచనలు ఉన్నాయా అంటే అది ఎంత speed of thought భగవాన్ది అంటే నువ్వు ఎక్కడ కూర్చో, ఎక్కడ ఉండు, ఎట్లా ఉండు, ఏమనుకుంటుండూ దానికి సమాధానం వస్తుంది. ఎందుకంటే that is the highest antenna which Swami has. The antenna of love, antenna of grace, antenna of compassion. ఈ కరుణ, ఈ దయ, ఈ జాలి, ఈ సానుభూతి, ఆత్-- వాత్సల్యము, అజరామరమైనటువంటి ఒక జీవ భావన, దైవ భావన అన్నీ సమన్వయం చేసుకున్నటువంటి సత్ కనుక తాను సృష్టించిన ఈ సృష్టిని ఎలా చూసుకోవాలో, ఈ జగత్తుని ఎలా మరమ్మత్తు చేసుకోవాలో, దీన్ని ఎలా బాగు పరుచుకోవాలో, దీన్ని ఎలా నడిపించుకోవాలో, ఎవరెవరు ఏ కాలంలో ఏ పాత్ర వహించాలో, ఆ పాత్రకు కావలసినటువంటి సన్నివేశాలు ఎలా ఉండాలో అన్నీ ఒక్క master దగ్గర ఉంటాయి. ఆ master, ఆ జగదీశుడు, జగదాతీతుడు, జగద్రక్షకుడు, జగదక్షుడు, పూర్ణుడు, జగన్మోహనుడు, జగదానందకారకుడు ఎవరు అంటే ఈ do లన్నీ కలిపితే do లేని సత్ అది. సత్య సాయి భగవానుడు అంటే రూపం. సత్య సాయి భగవాన్ అంటే భావం. సత్య సాయి అంటే అవతారం. సత్య అంటే మూలం. సత్. ఆ మూలం కనుకనే దాని స్వభావం ఏమిటి? ఆనందమే దాని స్వభావం. ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి ఏది ఆశించింది కాదు. ఇది వాడు వచ్చి నాకు చేస్తే బాగుండును అని అనుకున్నది కాదు. ఈ ప్రపంచాన్ని తాను సృష్టించుకున్నారు గనుక దానిని ఎట్లా నిలబెట్టుకోవాలో, ఎటువంటి వ్యక్తులను తయారు చేసుకోవాలో, ఎవరి యందు ఆ శక్తి ప్రవాహాన్ని నింపాలో, ఏం చేస్తే ఈ ప్రపంచం సర్వానందమయంగా ఉంటుందో, ఎక్కడ యుద్ధం లేదో, ఎక్కడ శాంతి ఉంటుందో, ఎక్కడ స్పర్ధ లేదో, ఎక్కడ సమన్వయం ఉంటుందో, ఎక్కడ సమన్వయము, సంయమనము ఉన్నదో, ఎక్కడ సంఘర్షణ లేదో అటువంటి ఉదాత్త వైఖరిలో సత్య సాయి భగవానుడు నా వాడు, పెరవాడు అన్న భేదం లేకుండా వీడు నా వాడు అని మాత్రం ఏనాడూ స్వామి అనుకోలేదు. కనుకనే సత్య సాయి భగవానుడి యొక్క అవతారం సత్ స్వరూపం. అది సత్ ప్రవాహం. అది సత్ భూమిక, అది సత్ వేదిక, అది సత్ మూలిక. ఎందుకనంటే తాను-- శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళటానికి ఒక కారణం ఉంది. శ్రీకృష్ణుడు చెరసాలలో నుంచి ఆ రోజు రాత్రికే వ్రజభూమికి వెళ్ళటానికి ఒక కారణం ఉంది. ఆ కారణాలు కాల, కార్య, కారణ, కర్తవ్య అనబడేటువంటి నాలుగింటికి లోబడి అవతారాలన్నీ సాగితే సత్య సాయి భగవానుడు చాలా అపురూపమైనటువంటి అవతారం ఇది. ఎందుకనంటే తాను ఎక్కడ దేహాన్ని తీసుకున్నారో అక్కడే సత్ గా నిలబడి సర్వ ప్రపంచానికి నాభి కేంద్రమై, నాడీ కేంద్రమై, సర్వానికి మూలమైనటువంటి ఒక energy battery గా ఒక center గా తాను నిలబెట్టి అక్కడ నుంచి అనుగ్రహ తరంగాలు ఈ ప్రపంచం మొత్తం వ్యాపింపజేసి అక్కడే దేహాన్ని పరిసమాప్తం చేసుకున్న, దేహత్యాగం చేసిన ఏకైక అవతారమూర్తి భగవాన్ సత్య సాయి. మిగతా వారంతా అక్కడ అక్కడ అక్కడ ప్రచారం వెళ్లారు, సంచారం చేశారు. కాలాలున్నాయి, కారణాలున్నాయి మరి స్వామి కర్తవ్యం ఏమిటి అంటే అహం సత్యబోధకః అంటూ సత్యాచార్యులైనటువంటి స్వామి తాను సత్య సాయినని తన అవతార ప్రకటనని మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభైలో ప్రకటన చేసి ఈ అవతార పరమార్థాన్ని, తన కర్తవ్యాన్ని, తాను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైయవ తారీఖున అవతార ప్రకటన చేసినప్పుడు ఏమన్నారు స్వామి? కుటుంబంతో కానీ, కుటుంబం అంటే ఎవడో ఉండవచ్చు. తల్లితో కానీ, తల్లి పెద్ద మాయ అన్నారు. ఆ మాయతో నాకెట్టి సంబంధం లేదన్నటువంటి ఆ మాట అన్నప్పుడు స్వామి దేహానికి ఉన్నటువంటి ఏళ్ళు ఎన్ని? పధ్నాలుగు. పధ్నాలుగు ఏళ్ళ బాలుడు ఈమెతో నాకు సంబంధం లేదు అనగలడా సత్ కాకపోతే. నా తండ్రి పోయినాడే, నా తల్లి పోయిందే అయ్యో ఎట్లా అన్నాడా సత్ కాకపోతే. మీరందరూ ఎవరు? మీ దేశాలేమి? మీ కులాలేమి? అని అడిగారా సత్ కాకపోతే. మీరందరూ ధర్మ మార్గంలో నడవండి అని చెప్పారు సత్ కాకపోతే. అసలు మీరు దైవమే అని చెప్పారు తాను సత్ కాకపోతే చెప్పగలరా? కనుక సత్ అనేటువంటి ఒక వైదాంతికమైనటువంటి ఒక సాంకేతిక పదాన్ని ఈ కంటితో, ఈ మనసుతో, ఈ హృదయంతో అనుభవించలేని ఒక సత్ ని తన మూలమైనటువంటి స్థితిలో నుంచి సాకారమైనటువంటి పరమాత్మగా అవనీ సంచారానికి వచ్చారు కనుకనే వచ్చమల్హారమై అన్నాం స్వామిని. శుద్ధ చైతన్యమే ఇక్కడికి వచ్చింది కనుకనే స్వామి ఒకసారి అన్నమాటప్రతి శివరాత్రి నాడు లింగోద్భవ వేళ స్వామి దేహం నుంచి వెలువడే లింగాన్ని చూసి అబ్బుర పడుతున్నారే, స్వామి నోటి నుంచి వెలువడే ప్రతి మాట లింగం కాదా అబ్బుర పడరేమి అన్నారు స్వామి. వాక్కు అగ్ని స్వరూపం గనుక మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలు దాటి విశుద్ధానికి వచ్చినప్పుడు ఆ అగ్ని వాక్కుగా బయటకు వచ్చినప్పుడు, అందుకనే స్వామి అవతారమూర్తి గనుక మంత్రాలన్నీ మాటలైపోయినాయి ఆయన చేతిలో. అనేకమైనటువంటి అవతారమూర్తుల యొక్క ప్రతిభ, ప్రజ్ఞ, వారి శక్తులన్నీ కేవలము ఒక చిన్న ఆటగా మారిపోయినాయి. అందుకనే స్వామి ఓసారి ఏమన్నారంటే, జీవుడు మానవుడు ఒక ఎనర్జీ కావాలి అంటే మ్యాటర్ కావాలి కాబట్టి మ్యాటర్ ఉంటేనే వాడు ఎనర్జీ సృష్టించగలడు. కానీ పరమాత్మకి ఎనర్జీ లో నుంచి మ్యాటర్ సృష్టించగలిగిన శక్తి ఉంటుంది. కనుకనే సంకల్పమే మూలం. ఆ మూలం ఎటువంటి సంకల్పం మనం కూడా అంటాం. ఏ సత్సంకల్పమో ఇలా జరిగిపోతుంది అని ఆనంద పడతాం కదా, అంటే మనకు తెలుస్తోంది అది మనం సంకల్పించలేదు అని. మరి ఎవరు సంకల్పించారు? ఏ దైవ సంకల్పం అంటంలా, ఏ సత్సంకల్పమో, ఇక్కడ సత్ ని మంచి అనుకుంటున్నాం. కానే కాదు. సత్ అనబడేటువంటిది ఈ cosmic world లో ఇందాక చెప్పిన ninety seven point five percent ఏదైతే అవ్యక్తంగా ఉన్నదో, కనపడకుండా ఉన్నదో అది సంకల్పించిన మాత్రముననే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతాయి గనుక ఆ సత్ సంకల్పించుకుంటే రాముడవుతాడు, సత్ సంకల్పించుకుంటే కృష్ణుడు అవుతాడు, సత్ సంకల్పించుకుంటే సత్యసాయి భగవానుడు అవుతాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాముడు అన్నాడు, ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళని రక్షించటం నా బాధ్యత. అధర్మాన్ని ఎవరు ఆచరిస్తున్నారో వాళ్ళని సంహారం చేయటం నా బాధ్యత. రెండవది శ్రీకృష్ణ పరమాత్మ "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" ధర్మాన్ని సంస్థాపన చేయటానికి వస్తానని ఒకరు, ధర్మాన్ని రక్షించటానికి వస్తున్నానని ఒకరు, అధర్మాన్ని శిక్షించటానికి వస్తున్నానని ఒకరు, ఒక్కొక్క అంశతో ఒక్కొక్క కార్యకలాపంతో వస్తే సత్యసాయి భగవానుడు మూడు ప్రతిజ్ఞలున్నాయి. దీనజనోద్ధరణ. దీనజనుడు ఎవరంటే ప్రపంచంలో భగవత్ సమానమైనటువంటి దేహాన్ని ధరించి కూడా పిడికెడు మెతుకులకు నోచుకోనటువంటి వాడు, చిటికెడు వాత్సల్యానికి కూడా నోచుకోని వాడు, సభ్య సమాజం నుంచి దూరమైనటువంటి వాడు, అటువంటి ఆ దీనజనులను రక్షించడమే నా ఒక కర్తవ్యం అన్నారు. అలాగే ధర్మోద్ధరణ. ధర్మాన్ని నేను ఉద్ధరించాలి అన్నారు. ధర్మాన్ని ఉద్ధరించడం అంటే మన బోటి వారందరి చేత ఆ ధర్మాన్ని ఆచరింపజేయటమే. ధర్మాన్ని ఆచరించడం అంటే ఏ పని ఎప్పుడు ఎంతవరకు ఎట్లా చేయాలో అది మాత్రమే చేయటం, చేసిన మరుక్షణం ఇది నేను చేశానన్న భావనలో ఉండకుండా పరమాత్మ చేయించుకున్నాడు దానితో మనకేం పని అని మళ్ళీ ఖాళీ చేసుకొని వెళ్ళగలిగినటువంటి ఆ ధర్మాచరణ. అలాగే ఈ సర్వ ప్రపంచము నా వలన ఆనందాన్ని పొందు గాక, సర్వ ప్రపంచం నుంచి నాకు కూడా ఆనందం వచ్చు గాక అనేటువంటి ఋగ్వేద వాక్యానుసరణీయమైనటువంటి ఈ సత్ ని స్వామి బోధ చేయటానికి వచ్చారు. కనుక అది ధర్మోద్ధరణ. చివరగా నిజానికి మొదటిగా వేదోద్ధరణ. వేదము అంటే విద్య అని అర్థం. వేదము అంటే సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం ఇవి మాత్రమే కాదు. విద్ అంటే విద్య. దేనిని మనం తెలుసుకోవలసి ఉన్నదో తెలుసుకోగలిగితే మనం వేదవిదులం అవుతాం. లేకపోతే శాస్త్ర కోవిదులం అవుతాం తప్ప వేదవిదులం కాము. దేనిని తెలుసుకోవాలి అని, సత్ ని తెలుసుకోవాలి. సత్ ని తెలుసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి? నిన్ను నువ్వు చదువుకోవాలి. పుస్తకం చదివితే రాదు. కనుకనే ఈ సత్ అనబడేటువంటిది, ఈ వేదాన్ని జీవనశైలి ద్వారా, జీవన దృక్పథం ద్వారా, జీవన విధానం ద్వారా, జీవితంలో మానవీయమైన విలువలు పాటించటం ద్వారా మానవుడు పరిపుష్టుడు కావాలి తప్ప బోధించి బోధించి బోధించి అని అని అని ఎంతకాలం వింటాడు. అన్నవన్నీ వినాలి, విన్నవన్నీ మరణం చేయాలి, మరణం చేసినవన్నీ నిధిధ్యాసనం చేయాలి, దాని నుంచి ఆచరణాత్మకం చేయాలి, కర్మానుష్ఠానం చేయాలి, కర్మానుభవాన్ని పొందాలి, అనుభూతిని చెందాలి, విభూతి స్థాయికి వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి ఈ అన్న అన్ని మాటలకి మళ్ళీ మూలం ఏది అంటే సత్ మాత్రమే మూలం. ఏది నశించటం లేదో, స్వామి యొక్క డ్రెస్ అడ్రస్ సత్యానికి గుర్తులు. ఎట్లా అంటే, నేను సాయిబాబాను అన్ననాడు ఎట్లా అన్నప్పటికీ ఇది నా అవతార ప్రకటన అని ప్రకటన చేసిన నాటి నుంచి అవతార పరిసమాప్తి వరకు వారి డ్రెస్ లో మార్పు లేదు. అదే డ్రెస్. పధ్నారేళ్ళ పిల్లవాడు కషాయం గటుకు తిరగగలడా? మనం కొనిస్తే విసిరేస్తాడు. సత్ గనుక ఈ దేహాన్ని, ఈ మానాన్ని కాపాడాలి గనుక అదే డ్రెస్. దాంట్లో డిజైన్ చేంజ్ కూడా లేదు. అవే మూడు పిన్నులు, అదే కాలరు, అదే డ్రెస్సు, శరీరము వయస్సు ద్వారా, ఆ దేహ పరిణామం ద్వారా మార్పులు చెందుతూ సైజు మారిందే తప్ప దానిలో రూపం మాత్రం మారలా. అలాగే డ్రెస్సు అలా ఉంటే అడ్రస్ కూడా అదే. అడ్రస్ ఏమిటయ్యా అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా. తెలియని వాళ్ళకి మనకంటే స్వామి. తెలియని వారికి పుట్టపర్తి సత్యసాయిబాబా. అంతేగా. పుట్టపర్తిలోనే ఉన్నారు. ఇంకా షిరిడి బాబా అక్కడక్కడ తిరిగితమ దేహానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చేదాకా బయట పడలా. షిరిడి అనేటువంటి గ్రామంలోకి వెళ్లి అది తనని పుణ్యక్షేత్రం చేసుకున్నారు గనుక ఆయన షిరిడి సాయి అయినారు. అసలు పుట్టపర్తిని అంటే ఏమిటి అనంటే put apart I is పుట్టపర్తి. put apart I నేను అన్న భావన పక్కకు పెట్టగలిగితే దాని పేరు పుట్టపర్తి. పుట్టపర్తి అంటే గ్రామం కాదు, బస్ స్టాండ్ కాదు, అక్కడున్న ఇల్లు కాదు, మనుషులు కాదు. నేను లో ఉన్న నేను అనే భావాన్ని పక్కకు తొలగించగలిగినటువంటి మహా సహజ పుణ్యక్షేత్రము. ఈ ప్రపంచంలో వైదాంతిక భూమిక ఏది అంటే అదే. స్వామి వైరాగ్య స్థితిలో అనుష్ఠానాలు చాలా గొప్ప స్థాయి. ఎందుకంటే, శాంతిర్నితాంతమహితా పరమాశ్య శక్తిహి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్నకుహనం మధురంచ వృత్తం. ఆ గురువుకి, అవతారమూర్తికి, శుద్ధ చైతన్యానికి, సత్పదార్ధానికి, సత్యంగా కనుగొనవలసిన యదార్ధానికి ఏముండాలంటే శాంతం ఉండాలి. స్వామి ఎన్నడైనా మన ఎరుకలో, మనం చూసినంతలో, మన అనుభవంలో కన్నెర్ర చేసిన సందర్భం ఉన్నదా అంటే లేనే లేదు. నిజానికి మన పని కానప్పుడు మనం కాస్త కన్నెర్ర చేసాం. స్వామి అన్నారు, "మీ పనులు అయినంత కాలం నన్ను సాయిరామ్ అంటారు, ఎప్పుడైనా కాస్త అటూ ఇటూ లేట్ అయితే సైరామ్ అని నన్ను విడిచి కూడా వెళ్లిపోతారు, మీరు విడిచినా మిమ్మల్ని నేను విడవను" అన్నారు. అది శాంతం యొక్క రసం అది. పరమేశ్వరుడి రసం నవరసాలలో పరిపూర్ణమైన రసం ఏమిటంటే శాంత రసమే. శాంత రసం ఎవరు పాటిస్తారో వాళ్ళకి మానవమానాలు ఎక్కువ ఉంటాయి. అవమానం దేహానికే గాని నాకు కాదన్నటువంటి భావనలో సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అంతా కూడా అలాగే సాగింది. కనుక శాంతిర్నితాంతమహితా పరమాశ్య శక్తిహి. మనందరం మన బోటి వాళ్ళం కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది స్వామిని దర్శనం చేసుకొని ఆనందాన్ని పొందారు. దర్శనం చేస్తే ఏమానందం? ఆయన మాట్లాడాలి, కాస్త ఆయన పాదం తాకాలి, ఏదన్నా మనం ఉంగరమో, బొంగరమో చేతిలో పెట్టాలి. ఇవేవీ లేకుండా కేవలం ఒక చిన్న pocket size photo ఎవరి చేతికన్నా ఇస్తే గుండెకి హత్తుకొని పెట్టుకుంటామే, అది ఏమిటి అంటే ఆ ముఖమండలంలో ఉన్నటువంటి దివ్య కాంతి వలయం అది. అది ఆకర్షణ వలయం అది. అది మనల్ని దగ్గరకు చేర్చుకునేటువంటి ఒక అమ్మదనము, అది కమ్మదనము, అది చల్లనితనం. అంతే కాదు వైరాగ్యం అద్భుతతమం. వైరాగ్య భూమికలో స్వామి చూడండి, కాలుకి చెప్పు లేదు, కంటికి జోడు లేదు, కొన్ని వేల లక్షల ఉంగరాలు ఇచ్చుంటారేమో తన చేతికి మాత్రం ఉంగరం లేదు. చేతికి కంకణం లేదు, గడియారం లేదు. ఆయన దగ్గర ఏమీ లేదు లేదు, మన దగ్గర అవన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేని వాడేమో దేవుడైనాడు, అన్నీ ఉన్న మనమేమో ఇంకా కావాలని ఏడుస్తూనే ఉన్నాం. ఏమీ లేదు కనుకనే, దేనినీ ఆయన దగ్గరకు తీసుకోలేదు గనుకనే తన దేహాన్ని కూడా స్వామి, దేహాభిమానం పోవాలి, దేహాత్మ భావన వదిలిపెట్టి దేహ భావనలో నుంచి ఆత్మభావనలోకి రండి, దైవ ప్రీతిలోకి రండి అని డెబ్బై రెండు సంవత్సరాల బోధాకృతిగా సత్యసాయి భగవానుడు సాగించినటువంటిదంతా ఒక సత్య అనంత ప్రవాహం ఇది. సత్య వేదికగా సర్వ ప్రపంచాన్ని స్వామి మార్చారు. కనుక ఏది మార్పు చెందకుండా ఉన్నది అంటే స్వామి ఏమన్నా మార్పు చెందారా? ఏం మార్పు లేదు. యాభై ఏళ్ల నాటి devotee నలభోయ వరుసలో కూర్చున్న, వెళ్లి పలకరించిన పరమ సాధువు, పరమ దయాళువు, కరుణాపూర్ణ శుభాబ్ది అయినటువంటి స్వామి. ఏమో ఈ జనమంతా పెరిగిపోయినారు, స్వామి మనల్నెక్కడ గుర్తుపట్టగలరు, ఆ చిన్ననాటి మాటలేవేరు అనుకున్నవారికి తక్షణమే సమాధానం ఇచ్చింది. కారణం ఏమిటంటే స్వామి అనే అది సత్ కనుక, అది బ్రహ్మ పదార్థం కనుక, దాని చూపుకి నోచుకోని ప్రాణి లేదు. దాని భావనలో వదగనటువంటి, ఇమడనటువంటి ప్రాణి లేదు. దాని సంకల్పానికి గురికాని జీవి లేడు కనుక సత్ అంటే స్వామి, స్వామి అంటే సత్. తన యావజ్జీవితం కూడా అంటే ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం కూడా స్వామి సత్తుగానే ఉన్నారు. చిట్టచివరగా మనందరికీ తెలిసింది కూడా స్వామి ఆ దేహాన్ని వైద్యాలయానికి తీసుకెళ్లినప్పుడు కూడా వైద్యులతో స్వామి అన్నటువంటి మాట, "నేను హాయిగా ఉన్నాను, ఆ దేహంతో నాకు పని లేదు" ఎంత అందమైన మాట చూడండి. దానికి మీరేం కావాలో చేసుకోండి, నాకేమీ సంబంధం లేదు. ఎవరనగలరంటే దేహాన్ని తృణప్రాయంగా, దేహము తాను కానట్లుగా, తాను దేహము మాత్రమే కానట్లుగా ఎవరైతే ఉండగలరో, ఎవరైతే జీవించగలరో అటువంటి వారు మాత్రమే సచ్చిదానంద స్వరూపంగా ఈ ప్రపంచంలో ఉంటారు కనుక సత్ అనబడేటువంటి ఈ ವಿಚಾರಧಾರలో సత్యసాయి నామాభిరామ సచ్చిదానంద గురుమూర్తి తోచే సుప్రసన్నతా స్ఫూర్తి దివ్యదీప్తి విమలోదాత్త ఉదాత్తమూర్తి. జ్ఞానము రూపమై, మౌనము భాషయై, చూపులు బోధయై, రూపుకట్టిన శివమై, మనసుకు పరవశమై, ఈ జన్మకు కైవసమై, ఈశ్వరో గురురాత్మేతియను తోచనా తరి ఈ కైవల్య సిరి. స్వామి యొక్క స్వామిని ఎవరు పొందారో, స్వామి యందు ఎవరికి మనస్సు లగ్నమైయున్నదో, ఎవరు స్వామి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారో, ఎవరు ఆ సత్తుని పట్టుకోవాలని ఒక ధ్యాయంగా, ఒక అధ్యయనంగా, ఒక అభ్యాసనంగా తమ జీవయాత్ర సాగిస్తున్నారో వారందరికీ కూడా సత్యసాయి భగవానుడు ఒక కదలని సిరి. మిగతాదంతా కదిలే సిరి. ఆస్తులు వస్తాయి, పోతాయి. అవమానాలు వస్తాయి, పోతాయి. విజయాలు వస్తాయి, పోతాయి. దేహం వస్తుంది, పోతుంది. కానీ నిత్యమూ, సత్యమూ, శాశ్వతమూ, నవనవోన్మేషమైనటువంటి సత్యసాయి భగవానుడు సత్తుగా ఈ ప్రపంచంలో మనకు దర్శనమిచ్చిమనతో కూడి ఉండి మనలను నడిపించి మనల్ని ధర్మ మార్గంలో సమాజ సేవా మార్గంలో సర్వ ప్రాణులను ప్రేమించగలిగినటువంటి ఒక ఉదాత్త భూమిక లో సంచారం చేయించిన ఆ సత్తు సర్వ వేదములకు మూలమైన సత్తే సత్య సాయి భగవానుడు. సర్వోపనిషత్తులు అంటే ప్రధానంగా ఈశావాస్యోపనిషత్తు దశోపనిషత్తులు ఆ దశోపనిషత్తుల అన్నింట్లో బృహదారణ్యక ఉపనిషత్తు అనబడేటువంటి దాంట్లో బృహత్ అరణ్యకమై ఉన్నటువంటిదంతా సత్య సాయి భగవానుడు మనతో గడిపిన మనము సత్య సాయి భగవానుడుతో గడిపిన ప్రతి క్షణము కూడా ఉపనిషద్ భావనే. ఉపనిషత్ అంటే మంత్రం కాదు ఉపనిషత్ అంటే దాంట్లో ఉన్న విచార ధార కాదు ఉపా దగ్గరగా నిషత్ కింద కూర్చొని పరస్పరము బోధ యంతి స్వామి చెప్పగా మనం విని మనం అడగ్గా స్వామి చెప్పి ఎప్పుడైతే పరమాత్మ ముఖమండలంలో నుంచి ఒక సత్యాన్వేషణ సత్యార్థము పదార్థ విచారణ వివేకము వివేచనము చింత చింతన ఇవన్నీ కూడా అనుగ్రహ ప్రవాహంగా మనకు కలిగించిందో అది ఒక సత్తు మాత్రమే ఇవ్వగలదు. అనేటువంటి దాన్ని మనం గనక దృష్టిలో పెట్టుకున్నట్లయితే రామకృష్ణాద్యవతారాలు కూడా పరిమితమైన ప్రాదేశికమైన ప్రభావాన్ని మాత్రమే చూపిస్తే సత్య సాయి భగవానుడు ఉపఖండాన్ని దాటి ద్వీపాలు దాటి అనేకమైనటువంటి లోక లోకాంతరాలు దాటి ఎక్కడికి తీసుకు వెళ్లారంటే ప్రపంచంలో ఈ క్షణంలో ఎక్కడైనా ఏ మూలైనా సరే స్వామిని గురించిన విచారణ జరుగుతూనే ఉంటుంది అందులో మనం కూడా చేస్తున్నాం అంతేతప్ప సర్వ ప్రపంచం కూడా స్వామి భావనలో నిలకడ చెందే లాగా అలాగే ఈ సత్ అనబడేటువంటి మూలంలోకి వెళ్లే లాగా సర్వోపనిషత్తుల సర్వ వేదాల సర్వ భావనల సర్వ పురాణాల యొక్క సారాన్ని సత్తు కనుకనే ఒకరు అడిగితే పద్దెనిమిది పురాణాల సారాన్ని ఆధునిక భాషలో చెప్పారు Help ever hurt never క్యాలెండర్ మీద ప్రింట్ చేసుకునే స్లోగన్ కాదది గుండెలలో నిండుగా నింపుకొని జీవన పరమార్థాన్ని సాధించుకోవలసినటువంటి వాడు వైదాంతిక భూమికలో నిలకడ చెందవలసినటువంటి వాడు పారమార్థిక జీవితాన్ని పొందవలసినటువంటి వాడు ఎత్తి వచ్చినటువంటి జన్మని సార్థకం చేసుకోగలిగినటువంటి వాడు Help ever hurt never ఈ-ఈ రెండింటిలో మనం ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయకపోయినా ఎవరినైనా చూపు చేత భావన చేత తలపు చేత స్మృతి చేత బాధించినా మనం సత్య సాయి భగవానుని భక్తులుగా అనుకోవటానికి మనకు అర్హతే లేదు. కనుక స్వామి సత్ అని మనం ఎప్పుడైతే నిరూపణ చేసుకున్నామో, ఏ రకమైన తత్వార్థ విచారణలో మన మనస్సు నిమగ్నమై ఉన్నదో ఆ క్షణం నుంచి సత్య సాయి మూలం ఏమిటి మన మూలం ఏమిటంటే ఆదిత్యుడి నుంచి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఎట్లా సూర్యుడి నుంచి భిన్నం కావో చంద్రుడి నుంచి వచ్చే సుషుమ్నా కిరణాలు ఎట్లా చంద్రుడి నుంచి భిన్నం కావో సత్ అనబడేటువంటి మూల బ్రహ్మ పదార్థం లో నుంచి అవనీ సంచారానికి వచ్చిన సత్య సాయి భగవానుడి నుంచి వచ్చిన మనం కూడా స్వామి కంటే భిన్నం కాదు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మరి ఇంత తెలిసిందే ఇప్పుడు ఏం చేద్దాం ఆయన సత్ అని తెలిసిపోయింది మన మూలం కూడా అదేనని తెలిసిపోయింది ఆయనలో నుంచి మనం వచ్చేసామని ఒక విచారణ చేసుకున్నాం మరి మనం ఏం చేయాలి? స్వామి వలె జీవించాలి వేరే మార్గం లేదు. స్వామి వలె ఆలోచించాలి వేరే మార్గం లేదు. స్వామి వలె అందరినీ ప్రేమించాలి అందరినీ సేవించాలి. నిజానికి ప్రపంచం స్వామికి చేసిన సేవ కంటే స్వామి ఈ సర్వ ప్రపంచానికి చేసిన సేవ కొన్ని కోటానుకోట్ల రెట్లు ఎక్కువ. మనం ఏం చేయలేదు ఆయనకి, ఏం చేశాం? చూశాం, వచ్చాం. దేవుడు అనుకున్నాం, వచ్చేసాం. ఆ స్వామి మాకు తెలుసు అనుకున్నాం, వచ్చేసాం. ఏం పొందాము? అహంకారాలు అక్కడే ఉన్నాయి, మమకారాలు అక్కడే ఉన్నాయి, ఇరిష్యాసూయలు అక్కడే ఉన్నాయి. పూర్ణమైన శుద్ధమైన మూలమైనటువంటి సత్తుతో మనం కూడి ఉండి కూడా చదపురుగు అగ్ని దాకా వెళ్ళి కూడా చద మనస్తత్వాన్ని ఎట్లాగైతే వదులుచుకోలేక పోయిందో, అగ్నికి భయపడి నేనేపోతానేమో అని వెనక్కి వెళ్ళిందో అట్లా మనం వెళదామా? ఆ సత్ అనబడేటువంటి జ్ఞానాగ్నిలో దగ్ధమై మళ్ళీ శరీరమే అక్కరలేని జన్మే అక్కరలేని పునరావృత్తి రహితమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి సాధనకి మనం అందుకుందామా? బ్రహ్మానంద పదాన్ని అందుకుందామా? ఆ పదాన్ని పధాన్ని ఎట్లా పొందాలి విచారణ చేసుకుంటూ స్వామి నుంచి ఏమి పొందినా పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఆనందించాం. మరి మన నుంచి కూడా ప్రపంచం ఎప్పుడైనా ఏదైనా ఆశించినప్పుడు unconditional గా ఏ రకమైనటువంటి rules regulations లేకుండా ఏ అవసరానికి లోబడకుండా ఏ స్వార్థం లేకుండా మనం కూడా ఇవ్వగలిగినట్లయితే అప్పుడు మాత్రమే మనకు స్వామి అర్థమైనట్లు లెక్క. స్వామి దేవుడు గనుక అన్నీ చేశారండి మనం ఎక్కడ చేయగలం అంటాం. నేనంటాను స్వామి దేవుడు గనుక అలా చేశామంటున్నాం ఆ దైవంలో నుంచి వచ్చిన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే మనలో సంకుచితత్వం మనలో ఇంకా రిషడ్ వర్గాలు మనలో ఇంకా జన్మాంతరమైనటువంటి వాసనలన్నీ కూడా మూటకట్టుకొని ఘనీభవించి ఉన్నాయి గనుక దానిని పోద్రోలాలి. లోపల ఉన్న చీకట్లన్నింటినీ కూడా పక్కకు నెట్టాలి. మనలో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి ఆ సత్ అనేటువంటి దివ్యమైనటువంటి కాంతిలో మనం కూడా వెలిగిపోవాలి. అందుకనే భారతీయ సిద్ధాంతమంతా కూడా ఆర్షధర్మమంతా కూడా అద్వైత భూమికే గాని ద్వైత భూమిక కాదు. అందుకనే మొట్టమొదట మనం అనుకున్నాం స్వామి రావటానికి ముందు వచ్చిన వారంతా దైవాన్ని కనుక్కోమన్నారు. స్వామి ఆ మాట చెప్పలేదు. నీవే దైవం ఆ భావనలో ఉండు. ఎవరైనా మీరు చాలా మంచివారండి గొప్పవారు అంటే మనం ఒక్కసారి ఆగాలి. అంటే వాడు మనకు చెప్తున్నాడన్నమాట మనం బాగా మంచివాడిగా ఉండాలని గొప్పవాడిగా జీవించాలని.మనకో హెచ్చరిక చేస్తున్నాడే తప్ప వాడు అనగానే మనం మంచివాళ్ళం కాలేదు మనం గొప్ప వాళ్ళం కాలేదు అలాగే సత్య సాయి భగవానుడి యొక్క భక్తులుగా బిడ్డలుగా భక్తుడు చిన్నమాట నా దృష్టిలో సత్య సాయి భగవానుడి యొక్క బిడ్డలుగా ఆ మూలం నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా మన కర్తవ్యం ఏమిటంటే ఎనభై ఆరు సంవత్సరాల స్వామి అవనీ సంచారంలో one to one స్వామికి relation ఉంది చెప్పారు స్వామి ఒక మాట మీకు నాకు agent అంటూ ఒకడు లేడు ఏ జంటు లేడు అన్నారు ఆ agent ఉన్నాడు అనగానే వాడి మీద ఆధారపడతాం నీకు నాకు ఉన్నది స్వస్వామి సంబంధితహ మధ్యలో వీడు ఫలానా అని చెప్పక్కర్లేదు స్వామి స్వామికి మనమెవరో తెలుసు మనకు మాత్రం స్వామి తెలియని స్థితిలో ఉన్నాం గనుక ఆ తెలియబరచేటువంటి దిశగా సత్య సాయి భగవానుడు సత్యార్థ నిరూపణ చేసి సత్యంగా ఇలా జీవించి ఇలా ఉండండి అని చెప్పారు గనుక మనం కూడా అలాగే జీవించాలి అలాగే ప్రేమించాలి అలాగే సేవించాలి అలాగే అందరినీ దగ్గర తీసుకోవాలి అందరూ మన వాళ్ళే ఎంత కాలం ఉంటాం ఇక్కడ అరవై డెభై ఎనభై తొంభై పోనీ ఇందులో ఏ ఒక్కణ్ణి గనక మనం పొందలేకపోయినట్లయితే అందరినీ పోగొట్టుకుంటూ వెళ్లిపోయినట్లయితే చివరకు జీవితం ఎంత వ్యర్థంగా ముగిసిపోతుందో గమనించండి అందుకనే సత్తుతో కూడి ఉన్న సత్య సాయి భగవానుడితో కూడి ఉన్న మనమంతా కూడా కలుపుకోవటమే మన ప్రధానమైన భూమిక కావాలి విడగొట్టుకోవటం ఎంత సేపు స్వామి అన్నారు రెండే అక్షరాలు బంగారం ప్రపంచాన్ని గుండె దగ్గరకు తెచ్చేది రా అనే అక్షరం పో అనే రెండో అక్షరం నిన్ను వాడి నుంచి దూరం చేస్తుంది రా దగ్గర పెట్టుకో పో వదిలిపెట్టు అన్నారు ఆ రా పట్టుకోవాలి ఆ రా పట్టుకుంటే పరమాత్మ మనవాడవుతాడు పరమాత్మే మన వాడైన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లి నాకు ఇది కావాలి అది కావాలని అడగక్కర్లేదు ఆ మూలాన్వేషణలోకి భారతీయ తత్వచింతన అంతా కూడా పై పైన కాదు అందుకనే స్వామి అంటారు roots బాగుంటే fruits బాగుంటాయి బంగారం ఆ roots ని పట్టుకోవాలి మూలాన్వేషణకు వెళ్ళాలి ఇది పరిపూర్ణమైన సమగ్రమైనటువంటి సత్య సాయి భగవానుడి యొక్క సత్యార్థ విచారణగా సత్యాన్ని సతతమూ ఆనందంగా ఉండటం ఒకటి సతతమూ ఆత్మ నిష్ఠలో ఉండటం రెండవది సతతమూ స్పృహతో ఉండటం రెండవది సతతమూ ఎరుకతో ఉండటం ఒకటి సతతమూ సచ్చిదానంద స్థితిలో ఉండటం మరొకటి సతతమూ సత్య సాయి రామ నామ స్మరణాంచితమైనటువంటి దేహంగా ఉండటం మరొకటి స్వామి బోధించినటువంటి సేవలో అన్ని వేళలా పరితృప్తమైన పరివ్యాపకమైన పరిపూర్ణమైన పరిశుద్ధమైన అనంతమైన అద్భుతమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవధారణ మనం గనుక పట్టుకోగలిగితే అది సత్తుగా మిగిలిపోతాం లేకపోతే ఒక సుబ్బారావు గారు పుట్టారు ఓ సుబ్బారావు గారు పెరిగారు ఆ సుబ్బారావు గారు పోయారు కాదు సత్తుగా వచ్చాం సత్తుగానే జీవించాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం సర్వమూ సత్యంలో నుంచే వచ్చింది ఈ వచ్చినదంతా మళ్ళీ సత్యంలోకే వెళుతున్నటువంటి స్వామి మాట దృష్టిలో పెట్టుకొని ఎక్కడ నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం ఒకే ఇంట్లో నుంచి మనందరం కలిసి రాలా కానీ అందరం కలిసి ఇక్కడికి మాత్రం వచ్చాం ఇది సత్యం రెండో సత్యం ఏమిటంటే మళ్ళీ మనం మన మన స్వస్థానానికే వెళుతున్నాం ఇక్కడ బయలుదేరి ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళటంలా మన ఇంటికే వెళుతున్నాం కాబట్టి సత్యంలో నుంచి వచ్చిన మనం సత్యంలోకే వెళ్ళాలి సత్యంగానే జీవించాలి సత్య ప్రకాశమానంగా వెలిగిపోవాలి అటువంటి యోగాన్ని ప్రాప్తిని శక్తిని ఆనందాన్ని అనుగ్రహాన్ని అవకాశాన్ని సన్నివేశాన్ని సందర్భాన్ని సర్వేశ్వరుడైనటువంటి సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి సత్య సాయి భగవానుడు మనకు అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio
Mahopadesam - 03
Mahopadesam - 03
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 40:36
More in this series