Skip to content
Transcript తెలుగు
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం లోక శంకరుడు అయిన శంకర భగవత్పాదులకు లోకేశ్వరుడు అయిన పరమాత్మ సత్య సాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ. ఆత్మజ్ఞానమే అచ్చ తెలివి అనే విషయాన్ని చక్కగా విచారణ చేద్దాం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అసలు ముందు ఆత్మ అంటే ఏమిటి? దాని ఎరుక ఏమిటి? ఇవన్నీ తెలియకపోయినట్లయితే ఆత్మవిద్య, బ్రహ్మవిద్య, సద్విద్య అచ్చ తెలివిగా చెప్పబడేటువంటి అసలు విద్య మనకు అర్థం కాదు. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు "చదువులన్నీ చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు" చావు లేని చదువే ఆత్మవిద్య. అయితే శంకర భగవత్పాదులు తమ వ్యాఖ్యాన ముద్రతో ఆత్మజ్ఞానాన్ని అచ్చ తెలివిగా, అసలు తెలివిగా ఎలా నిరూపణ చేశారో అది ఒక రమణీయమైనటువంటి విచారధార. మానవుడి ఆనందం అంతా ఆరోగ్యంలో, సంపదలో, అధికారంలో దాగి ఉన్నది. అంటే ఆరోగ్యం బాగా ఉన్నవాడు, సంపద బాగా ఉన్నవాడు, అధికారం గట్టిగా ఉన్నవాడు హాయిగానే ఆనందంగా ఉన్నాను అని అనుకుంటాడు. అయితే ఇది మనుష్య ఆనందం. పితృదేవతల యొక్క ఆనందం మనుష్య ఆనందం కంటే నూరు రెట్లు ఎక్కువ. దానికంటే దేవా ఆనందం ఇంకా వంద రెట్లు ఎక్కువ. వేదాధ్యయనం చేసిన వాడి ఆనందం దానికంటే మరొక వంద రెట్లు అధికం. రాగద్వేషాలు లేని వేదపండితుడి ఆనందం దానికంటే వేయి రెట్లు అధికం, అదే బ్రహ్మానందం. దానినే మనం పునః అనుకోవలసిన మాట. ఆనంద తారక స్థితులు మనుష్య ఆనందము, మనీష ఆనందము, గంధర్వా ఆనందము, మానవ గంధర్వా ఆనందము, దేవ గంధర్వా ఆనందము, పితృ పితా ఆనందము, ప్రజా పితా ఆనందము, హిరణ్యగర్భ ఆనందము, అదే బ్రహ్మానందం. ఇన్ని స్థాయిలు మనమంతా కూడా ప్రయాణం చేసి సాధించుకోవాలి. అసలు బ్రహ్మం అంతా ఒక పెద్ద వెలుగు ముద్ద. అది అగ్నిమయం. కాలం, ప్రపంచం, మేఘం, మెరుపు, ఉరుము అంతా అగ్నిమయమే. ప్రపంచంతో కూడి ఉన్న స్త్రీ పురుషులు నిజానికి అగ్ని స్వరూపాలు. దహయతి ఇతి దేహః. దహింపబడేది కనుక అది దేహం. దేహం నుండి ప్రాణం విడిపోతే దాని పేరు మరణం. మరణం అంటే మార్పే. మార్పుకు లోనైన దేహం అగ్నికే సమర్పితం. కర్మలు కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం కావాలి. వాక్కు అగ్ని స్వరూపమే. మూలాధారంలో ప్రారంభమై వాయువే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడేటువంటి చక్రాలలో ప్రయాణం చేస్తుంది. అందునా విశుద్ధ స్థానం వరకు వచ్చేపటికి అగ్నే, వాయువే వాక్ స్వరూపం అవుతుంది. అందుకనే మానవ శరీరంలో కంఠ స్థానంలో అమ్మవారు కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉన్నది కనుకనే వాక్కు అగ్ని స్వరూపమై బహిర్గతం అవుతూ ఉంటుంది. మూలాధారంలో ప్రారంభమైన వాయువు విశుద్ధ చక్రం దగ్గర మాటగా బయటపడుతున్నది. దారంతా యోగాగ్నిలో కాలుతూ వాయువు వాక్కు అవుతున్నది. మేను పరమైన మాటలన్నీ అంటే దేహ పరమైన మాటలన్నీ నేనుగా చలామణి అవుతున్నాయి. నేను చేశాను, నేను చూశాను, నేను తిన్నాను, నేను అనుభవిస్తున్నాను అన్నదంతా దేహమే కానీ అసలు నేను ఏమీ అనటం లేదు. దేహంగా వెలుగుతున్నది అదే దేహం, బొమ్మ అందున్న చైతన్యమే బ్రహ్మ. చీకటి గర్భంలోనే వెలుగు ఉన్నది. వెలుగు లోగిలిలోనే చీకటి ఉన్నది. శబ్ద నిశ్శబ్దాలు వాటి స్థితి కూడా అంతే. అలాగే నేను, నేనుల పరిస్థితి అంతే. బయట ఉన్నటువంటి వస్తువుని కన్ను చూస్తున్నది, చూస్తున్న కన్ను చూడబడుతున్నది. కంటికి వస్తువును చూపిస్తున్న మనసే మనసును బుద్ధి, బుద్ధిని చిత్తం, చిత్తాన్ని అహంకారం వీటన్నింటినీ అన్నివేళలా చూస్తున్నది నేను. నేనే ఆత్మ. నేను పేరు ఆత్మ. నేను కదలదు కానీ అన్నింటినీ కదిలిస్తుంది. అది ఒక నిత్య సాక్షి. పుట్టదు, పెరగదు, నశించదు. నిజానికి ఆత్ అంటే ఏమి? మా అంటే లేదు అని శంకరుల వ్యాఖ్యానం. అదే శంకరులు మరొక సన్నివేశంలో, సందర్భంలో ఆత్ అంటే వృద్ధి ఎరగనిది. ఆత్మ అంటే వృద్ధి ఎరగనిది. వృద్ధి అంటే నాశనం ఎరుగనిది అని. నిత్య చైతన్య విలసితమైనటువంటి ఒక అనంత ప్రవాహమే ఆత్మ గనుక ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే దేహము నందు ఉన్నది. దేహము నందున్న ఆత్మ వలననే అన్ని ఇంద్రియాలు కూడా చలిస్తూ ఉన్నాయి. కేనోపనిషత్తు వ్యాఖ్యానిస్తున్నది. ఇంద్రియ చలనాలన్నీ కూడా ఆత్మ యొక్క ప్రకంపనలే. దాని నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క సంస్కార విశేషం చేత కన్ను చూస్తున్నది, నోరు అంటున్నది, చెవి వింటున్నది, మనసు అనుభవిస్తున్నది, హృదయం నిశ్చలంగా ఉన్నది. నేను పేరు ఆత్మ. ఆత్ అంటే ఏమీ లేదని కదా అనుకున్నాం. అంటే అసలు లేదు అని కాదు, ప్రత్యేకంగా లేదు అని అర్థం. కనుక బ్రహ్మం అనేది ఆత్మకు మరొక పర్యాయపదం లేదా మరొక పేరు అన్నమాట. అయితే బ్రహ్మానుభవాన్ని, ఆత్మానుభవాన్ని, ఆత్మజ్ఞానాన్ని లేదా అచ్చ తెలివిని పొందాలంటే ఏం చేయాలి? ప్రాపంచిక చింతను విడి చింతన అలవాటు చేసుకోవాలి. చితి, చింత, చింతన అని మూడు మాటలున్నాయి. దేహానికి చితి తప్పదు.చింత దేహం ఉన్నంత కాలము తప్పదు. అంటే విచారణ తప్పదు. చింతన సంస్కారం ఉంటేనే చింతన ఏర్పడుతుంది. చింతన అంటే జిజ్ఞాస. చింతన అంటే తెలుసుకోవలసిన దానికై చేసే తీవ్ర ప్రయత్నం. అది ఒక నిరంతరమైనటువంటి ప్రయత్నం. చింతన అలవాటు చేసుకోవాలి. ప్రతిదానినీ ప్రశ్నించాలి. ప్రతిదానినీ శోధించాలి. ప్రతిదానినీ తర్కించుకోవాలి. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాతీతమైన సత్యాన్ని మనంతట మనమే ఆవిష్కరించుకోవాలి. ప్రయత్నం ఎవరికి వారే చేసుకోవాలి. అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను సక్రమంగా వాడుకోవాలి. ఇది సాధనా లయంగా శోధనాలయంగా ఉన్నటువంటి దేహమే మానవుడి అసలు సొత్తు గనుక దేహంలో ఉండగానే ఆత్మను ఎరిగేటువంటి ప్రయత్నం చేయాలి. దేహము వేరు ఆత్మ వేరు నిజానికి కానే కాదు. దేహము ఆత్మ ఒకటేనా అంటే ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఒక చక్కని వ్యాఖ్యానం చేశారు. అయ్యా! బాగా చదువుకున్న పండితులంతా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారమనే నాలుగు. నాలుగు మూడు కలిపి ఏడు శరీరాలు దాటితే ఆత్మ ఉన్నదని దానిని ఎరగగలరని అందరూ చెప్తున్నారు. వారు అందుకో గలరు. కానీ పామరులమైన మా బోటి వాళ్ళం ఆత్మని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అడిగినప్పుడు "ఏం లేదప్పా! ఇంటికి సింహద్వారము, పెరటిలో వాణిద్వారము అని రెండు ఉంటాయి. అలవాటైన వాడు సింహద్వారం నుంచి వెళతాడు. అనుకూలించనప్పుడు వెనక ద్వారంలో నుంచి వెళతాడు. ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వెళ్ళినా చేరవలసినది ఆత్మ అనేటువంటి గర్భమే గాని మరొకటి కాదు కదా" అన్నారు. అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు ఆత్మగా విలిగిపోతుంటే ఆత్మే వెనక నుంచి మన భాషలో ఇవాళ అర్థమయ్యే భాషలో backward integration అంటాం. అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, కనబడుతున్న స్థూల శరీరము. కాబట్టి దేహము ఆత్మగా ఉంటూ ఉన్నది. ఆత్మ కూడా దేహంగా వెలుగుతున్నది అని నిరూపణ చేశారు. అ-అటువంటిది తర్కం చేసుకుంటూ గనుక వెళ్లినట్లయితే నిజానికి రెండూ వేరు కాదని తెలుస్తుంది. పరస్పర ఆశ్రితంగా ఉన్న యదార్థ స్థితి ఇది. ప్రపంచంలో అత్యంత వింతైనటువంటిది ఏది, విషయం ఏమిటి అని ప్రశ్నించుకుంటే దేహమే ఎరుగని, మరణమే ఎరుగని, మార్పే ఎరుగని, పరిణామమే ఎరుగని ఒక చైతన్యం అంటే ఆత్మ పరిణామమునకు లోనై అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి దేహంలో తాను సత్యమై నిలకడ చెంది ఉన్నది. దీనిని భగవాన్ సత్య సాయిబాబా వారు చాలా అందంగా మళ్ళీ స్వామి ఏం చెప్పినా అందమే. ఏం లేదు కోటి రూపాయలు విలువ చేసేటువంటి డైమండ్ నెక్లెస్ ని పెట్టేది ఎక్కడ? పెట్టెలో. పెట్టె దేంతో చేశారు బంగారం తోనా, వెండితోనా? అది ఇనప పెట్టె. లోపల ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్ లో మార్పు ఉండదు. కానీ దానిని దాచి ఉంచినటువంటి ఇనప పెట్టె మాత్రం కాలగమనంలో తుప్పు పడుతుంది, పోతుంది, పాడైపోతుంది. దేహము ఇనప పెట్టె. దేహంలో ఉన్నటువంటి ఆత్మే అదిగో డైమండ్ నెక్లెస్. you are diamond అని స్వామి మనకు చెప్పటం మనకు గుర్తే. కాబట్టి రెండూ భిన్నం కాదు. పరస్పర ఆశ్రితంగా ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి? పెట్టెకి దానిలో ఉన్న వస్తువుల వలన ఉనికి ఏర్పడింది. వస్తువుకి తనను దాచుకోగలిగినటువంటి ఒక వస్తువు కావాలి. కాబట్టి రెండూ ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అలాగే కుండ, నీరు. సముద్రము, అలలు. చంద్రుడు, చంద్ర కిరణాలు అవే సుషుమ్నా కిరణాలు. సూర్యుడు, సూర్య కిరణాలు. ఎట్లాగైతే రెండూ అభిన్నం కావో, రెండూ ఒకటో అట్లాగే మరణమెరుగని ఆత్మ, శాశ్వతత్వం లేని శరీరము ఓచోట కలిసి ఉన్నాయి. ఇదే మహా పరిసత్యం. ఇది అచ్చ తెలివి. అయితే ఆత్మసాక్షాత్కారము అని ఒక మాట వింటూ ఉంటాం. ఆత్మజ్ఞానం, ఆత్మ ఒకటి ఉన్నది అని అనుభవంలోకి రావటం ఆత్మవిద్య అయితే, దానిని గురించిన విచారణంతా ఆత్మ విచారణా మార్గం అయితే ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అని. ఆత్మ సాక్షాత్ ఆకారమై ఉన్నది. అది ఆత్మసాక్షాత్కారం. అందుకనే అటు రామకృష్ణ పరమహంసని, భగవాన్ రమణ మహర్షిని, భగవాన్ సత్యసాయిబాబా వారిని ఇదే ప్రశ్న వేసినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఒకటే. లోపల ఉన్నటువంటి ఆత్మ నీవలె ప్యాంటు చొక్కా వేసుకుని కనపడదు. నీవలె అది ఒక ఉన్నటువంటి నీడ కాదు, అది ఛాయ కాదు. తానే లోపల అరూపంగా ఉండి స్వరూపంగా ఉన్న దేహం ద్వారా ప్రకటితమవుతున్నది. కనుక ఆత్మ సాక్షాత్ ఆకారమై ఉన్నది అని అర్థం. అటువంటి స్పుర పేరే ఎరుక. ఎరుకే జ్ఞానం. జ్ఞానమే అచ్చ తెలివి. ఉండవలసిన తెలివి, కావలసిన తెలివి, అసలు తెలివి. ఇది కలిగిన తర్వాత అదే ఆత్మని, అదే చైతన్యమని, నిత్య సత్య శాశ్వతమైన ఆనందమని అనుభవం అయిన తర్వాత తనకంటే మరొక వేరు వస్తువు లేదన్న భావన నిలకడ చెందుతుంది. ఉన్నదంతా బ్రహ్మమే అన్న ఒక సత్యము ఏర్పడుతుంది. శంకర భగవత్పాదుల దయావీరమిది. దయావీరము అంటే ఆంజనేయస్వామి దయావీరం వలె శంకరులు దయావీరం. దయలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆత్మబోధని మనకి విచార మార్గంలో చెప్పారు. సర్వ-సర్వం ఖల్వితం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నటువంటి వేద వాక్యానికి సత్యసాయి భగవానుడి ఒక పద్యం ఉన్నది.చాలా అందమైన పద్యం. చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి అన్నను బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వాల్లభ్యమది బ్రహ్మ జీవరాసులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ ప్రకృతంతయు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు సభయు బ్రహ్మ సత్యమును తెలుపు సాయి బ్రహ్మ. అంటే తనను తాను పక్కన పెట్టుకోలేదు సత్యసాయి భగవానుడు. నాతో సహా ఉన్నదంతా బ్రహ్మమేనన్నారు. ఇది సర్వం ఖల్విదం బ్రహ్మ. పూర్ణ ఆత్మజ్ఞాన ప్రకాండమైనటువంటి స్థాయిలో అటు శంకరులు గాని ఇటు సత్యసాయి భగవానులు గాని ఆత్మజ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవటమే అని స్పష్టంగా చెప్పారు. అటువంటి లోక శంకరులైనటువంటి శంకర భగవత్పాదులకి సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి భగవాన్ సత్యసాయికి నమస్కరిస్తూ సాయిరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద్ శంకరం లోక శంకరం. శంకర భగవత్పాదులకు సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ శంకర విచారధారలో మనోలయ సాధన మనోలయం అంటే ఏమిటి? విచారణ చేశాం. అయితే మనోలయ సాధన ఎలా చేయాలి? దానికి కావలసినటువంటి పూర్వరంగం ఏమిటి మనం విచారణ చేసుకోవాలి. విచారణలో భగవత్పాదులు విధంగా మనకి ప్రబోధం చేస్తూ ఉన్నారు. మనోలయ సాధనకు మనసు శుద్ధత్వంతో నిండిపోవాలి. రజస్తమో గుణాలు ఉన్నంత కాలం అహంకార మమకారాలు నశించవు. మనోలయ సాధనలో మరపు తెరపుగా కలిగే ఆత్మానుభవం నెలకొన చెందాలి అంటే మనసు కేవల సత్వగుణ ప్రధానంగా నిర్మల నిశ్చల స్థితిలో ఉండాలి. పూర్ణ సత్వం ఏర్పడాలి అంటే భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి. ఇంతకీ భక్తి అంటే ఏమిటి? అంటే వెలుగు కతి అంటే కూడి ఉండటం. పూజలు, వ్రతాలు, దీక్షలు వంటివన్నీ భక్తి మార్గంలో ఏర్పడే మలుపులు. ఇవి కొన్ని దశలు. వీటన్నింటి లక్ష్యము వెలుగుతో కూడి ఉండటమే. దీనికి శరణాగతి ప్రధానం. శరణాగతి వలన అహంకార మమకారాలు నశించి అంటే రజస్తమో గుణాలు అంతరించి కేవల సత్వగుణం మాత్రమే మిగులుతుంది. స్థితిలో వినయం ఏర్పడుతుంది. సమర్పణ, శరణాగతి, వినయం మూడు భక్తికి మూడు ముఖాలు. భక్తి వలన మనో మాలిన్యం తొలగి స్వచ్ఛత కలుగుతుంది. కోరికలనే ధూళి వలన మనస్ అనే అద్దం విధంగా మసగబారుతుందో ధూమం తొలగితే మాలిన్యం తొలగితేనే అద్దం స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటుంది. స్వచ్ఛమైన మనసు ఆత్మను తేజస్సుగా ప్రతిబింబించగలుగుతుంది. అంటే శుద్ధ మనసు ఏర్పడే దాకా మనోలయ సాధన ప్రారంభం కాదు అని అర్థం. భక్తి జ్ఞానము రెండూ వేరా అని. భక్తి జ్ఞానం రెండుగా లేవు రెండు కావు. నిజానికి రెండూ ఒకటే. భగవంతుని యందు నిజ భక్తి కలిగిన వాడే జ్ఞాని. సగుణ భక్తి నిర్గుణ భక్తి అని భక్తి రెండు విధాలు అంటున్నది బృహదారణ్యక ఉపనిషత్తు. మోక్షానికి రెండు మార్గాలు అనుసరించదగినవే. ముందు స్థూలంగా ఉండే సగుణ భక్తి సాధనా క్రమంలో సూక్ష్మంగా ఉండే నిర్గుణ భక్తికి దారి తీస్తుంది. బ్రహ్మచారి, గృహస్తుడు, వానప్రస్తుడు, సన్యాసి వంటి వారందరూ స్థూల భక్తికి చెందిన వారే. భగవంతున్ని సగుణోపాసన మార్గంలో అర్చించి, ఆరాధించి, అలంకరించి, ఊరేగించి, వేడుకలలో జాతరలలో ఆనందం పొందటం నవవిధ భక్తి మార్గాలలో ఆయనను ఉపాసించటం అసత్యం పలకకుండా ఉండటం పరస్త్రీలను కోరుకోకుండా ఉండటం ఇతరుల ధనంపై ఆశ లేకుండా ఉండటం దుర్భాషలాడకుండా ఉండటం పుణ్యక్షేత్ర దర్శనం పుణ్యనదీ స్నానం ఇవన్నీ సాధించుకున్న భక్తుడి హృదయంలోకి భగవంతుడు నెమ్మదిగా ప్రవేశిస్తాడు. భగవంతుడు భక్తుని లోకి ప్రవేశించాలి అంటే ఇన్ని జరగాలన్నమాట. ఇప్పటివరకు జ్ఞాన మార్గాన్ని గంభీరంగా ఆవిష్కరించిన భగవత్పాదులు సామాన్య సాధకుడికి సరళ మార్గాన్ని భక్తి యోగంగా బోధిస్తున్నారు. సత్యాన్వేషణ భక్తి మార్గ ప్రాధాన్యతను స్పష్టీకరిస్తున్నారు. పురాణ వాంగ్మయం నిండా పరచుకున్న భగవంతుడి లీలలు, మహిమలు, అతిమానుష చర్యలు, విరుద్ధంగా కనపడే సందర్భాలు వీటన్నింటిని సత్యానుభవం పొందగోరిన సాధకుణ్ణి గందరగోళంలో పడేస్తాయా? వీటిని సమన్వయం చేసుకోవటం ఎట్లా? పురాణం అనగానే కొంత కథ, కొంత చరిత్ర, కొంత ఊహ, కొంత ఆధ్యాత్మికతల కలబోత కదా. ఇవన్నీ తరచి అతి వాస్తవిక దృష్టితో విశ్లేషించి మధించి సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం ఒక సంక్లిష్టమైన విధానం కదా. భక్తుడికి పురాణాలంటే చరిత్ర. నమ్మకం లేని వాడికి అది కల్పన. జ్ఞానానికి సత్యాన్వేషకుడికి మాత్రం పురాణాలు విజ్ఞాన కదంబాలు. అసలును పట్టుకోగల ఒడుపు జ్ఞానికి సహజం. అది ఒక సామర్థ్యం.సత్యసాయి శంకరుల బోధను అరవిందల వారు సమగ్రంగా వ్యాఖ్యానం చేశారు. శ్రీకృష్ణుడు చారిత్రక మహాపురుషుడు, లోక నాయకుడు, బ్రహ్మవేత్త, చాంద్యోగ ఉపనిషత్తు శ్రీకృష్ణుని గురించి ప్రస్తావిస్తున్నది. గీతాచార్యుడిగా భారతీయ ఆత్మను గీతగా వ్యాఖ్యానించిన కృష్ణుడు వాస్తవమే. అఖండ చైతన్యం పరిమిత దేహంలో అభివ్యక్తమై లోక కల్యాణం సాగుతుంది కనుక కృష్ణుడు అవతారమూర్తి. దివ్యశక్తి, ప్రేమ, జ్ఞానం అనే ముప్పేట హారమే శ్రీకృష్ణుడు. అవతారంగా, పురాణ పురుషుడుగా కృష్ణుడు ఒక వాస్తవం. ఒక అభివ్యక్తి. దివ్యత్వానికి, ప్రేమకు, జ్ఞానానికి విస్పష్టమైనటువంటి ఒక గుర్తు. ఇది ఒక మహాయోగి యోగేశ్వరుని దర్శించిన వైనం. శ్రీకృష్ణ పరమాత్మను గురించిన అరవింద దర్శనం ఏదైతే ఉన్నదో నిజానికి మనమంతా సత్యసాయి భగవానుడిని అదే రీతిలో, అదే బాణీలో, అదే విధానంలో, అదే కార్యక్రమంలో, అదే జిజ్ఞాసలో, అదే సాధనా రీతిలో మనం అనుభవించాం. స్వామి ఒక వాస్తవికత, స్వామి ఒక చారిత్రక మహాపురుషుడు, స్వామి ఒక ఆధ్యాత్మిక వేత్త, స్వామి పూర్ణ పురుషుడు, స్వామి పరదైవం, స్వామి నడిచే బ్రహ్మ పదార్థం. ఇదంతా కూడా మనం పొందినటువంటి అనుభవ సారమే గనుక స్వామి యొక్క చరిత్ర రాబోయే తరాలకు పురాణం. మన తరానికి ఒక అధివాస్తవికత. పురాణం ఒక జ్ఞాన పేటిక. మూత తెరవాలి, శుద్ధ మనసుతో వెతకాలి, పట్టుకోవాలి, అనుభవించాలి, ఆచరించాలి, పంచాలి, పెంచాలి. ఇదే సాధన. సూక్ష్మ స్థాయిలో భక్తి అంటే ఏమిటి? దాని లక్షణాలు అంటే ఏమిటి? మానసిక పూజ, ఏకాంతవాసం, శృతిస్మృతుల అవగాహన, ఇవి సూక్ష్మ భక్తికి సంబంధించినవి. స్థూల భక్తిలో అర్చన, ఆరాధన, అలంకరణ, వేడుక, ఊరేగింపు, జాతర, పండగ, ఇదంతా స్థూలం. కానీ అన్నివేళలా స్థూలం ఉండదు గనుక, సూక్ష్మంగా కూడా చేసుకోవాలి గనుక మానసిక పూజ, దీనికి కావలసినది ఏకాంతమైన, శుద్ధమైన, మనోలయ సాధనకు అనుగుణమైనటువంటి ఒక మనసు. అట్లాగే శృతిస్మృతుల అవగాహన కూడా ఉండాలి. ఏది వినవలసి ఉన్నదో, దేనిని గుర్తుపెట్టుకోవలసి ఉన్నదో దానిని గుర్తు పెట్టుకొని నిరంతరము మననం చేస్తూ ఉన్నట్లయితే అది సూక్ష్మ భక్తికి గొప్ప సంకేతం. వేదకాలం నాడు ఋషులు ఏర్పరచిన సాంఘిక నియమాలు, నీతి ధర్మ సూక్ష్మాలు, ఇవన్నీ స్మృతులు. అంటే అన్ని కాలాలలోనూ స్మరించదగినవి, సార్వకాలికమైనవి, విశ్వజనీనమైనవి. పురాణాలన్నీ కథా కథన రీతిలో సత్యాన్వేషణకు దారి చూపే ఆనంద విహారాలు. అవి ద్వైత అద్వైత మార్గాలు. ద్వైతంలో చూస్తే భగవంతుడు వేరు, నేను వేరు. అద్వైత మార్గంలో నేను, భగవంతుడు ఒకటే. పూర్ణ విచారణ వైపు శంకర భగవత్పాదులు, సత్యసాయి భగవానుడు మనల్ని ఎంత అందంగా నడిపిస్తున్నారో చూడండి. భగవంతుడు అందరి యందు ఉన్నాడు కనుక ఎవరినీ ద్వేషించకూడదు. సర్వ జీవుల యందు దయ కలిగి ఉండాలి. పరిపూర్ణ తృప్తి, నాది నేను అనే భావం విడనాడాలి. అహంకారము, దంభము, కోపం వదులుకోవాలి. మృదు మధురంగా మాట్లాడాలి. నిర్మల మనసు కలిగి ఉండాలి. ఆత్మస్తుతి, పరనింద వదిలిపెట్టాలి. అది ఒక భావ స్థితిగా సంచారం చేయాలి. సుఖదుఃఖాలను, స్థితిగతులను సమంగా అనుభవించగలగటం, అపేక్షను వదిలి ఉపేక్షను అలవాటు చేసుకోవాలి. దైవ చింతన, నామస్మరణ నిరంతరం సాగించటం, ఇవన్నీ భక్తి ద్వారా సాధించుకోవాలి. పుట్టపర్తితో పాటు ప్రపంచం నిండా ఇవాళ సత్యసాయి భగవానుడి యొక్క కరుణా విశేషం చేత మనం విచారణ చేస్తున్నదంతా సర్వ ప్రపంచంలోనూ సాగుతున్నది. భక్తిగా, సేవగా, ప్రేమగా, దివ్యాచరణ విధానంగా, స్వీయ సాధనా మార్గంగా, వ్యక్తిగత నిష్ఠగా, అనుష్ఠానంగా, ఎన్నెన్ని రీతులలోనో మానవుడు తనను తాను ఎరిగే ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మనసు మదమెరుగని నిశ్చిత భూమిలో ఉండగలుగుతుంది. భజనలు, సంకీర్తనలు, నారాయణ సేవలు, సేవలు, ఇవన్నీ ఎందుకు స్వామి ప్రవేశపెట్టారు అంటే మానవుడి యొక్క మనసు శుద్ధిని పొందాలి. శుద్ధిలో నుంచి ఒక సిద్ధత్వాన్ని కూడా పొందాలి. అటువంటి భగవంతుని యందు నిరంతరము గనుక మనసును లగ్నం చేసి జ్ఞానాధిక్యమైన స్థితిలో సంచారం చేయగలిగితే భక్తి ఒక పరిపూర్ణతను సంతరించుకుంటుంది. ఇదే మహాభావ సమాధి స్థితి లేదా పూర్ణ మనోలయం. అంటే ఇక మన మనస్సంటూ లేదు. నిజానికి దాని పేరే జ్ఞానం. మిగిలినదంతా కేవల విజ్ఞాన భూమిక మాత్రమే. భగవంతుని యందున్న తీవ్ర నిశ్చల నిర్మల భక్తే జ్ఞానంగా పరిణమించి పరిమళిస్తున్నదన్నమాట. ధ్యానము, ఏకాగ్రత వంటివి మహాభావ స్థితికి దివ్య మార్గాలు. రెండూ మనసును పవిత్రీకరించుకునేటువంటి దివ్య సోపానాలు. భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా మనోలయ సాధకుడికి కావలసిన ధ్యాన విధానం ఏమిటి? ధ్యానం అంటే జ్యాస? ధ్యానం అంటే పోరాటమా? ధ్యానం అంటే వెదుకులాట? ధ్యానం అంటే మనసుపై ఆధిపత్యమా? ధ్యానం అంటే చేయటమా, ఏమీ చేయకపోవటమా? శంకరుల పరిష్కార మార్గంలో సమాధానం చెప్తున్నారు. శ్రద్ధగా విందాం. ఎందుకంటే ఉత్తమ శ్రోత అంటే కేవలం భగవంతుడు మాత్రమే. స్వామి ధ్యాన వాహినిలో అనేక విషయాలు ముచ్చటించారు.అందులో ప్రధానంగా ధ్యానము అంటే ధియానము అన్నారు స్వామి. ధి అంటే ఇంటలెక్ట్. మనకున్నటువంటి విజ్ఞాన రేఖ. దానిని దాటి, దాని వలన కలిగే అహంకార మమకారాలు వదిలిపెట్టి శుద్ధ చైతన్యంలోకి ఏకాంత ప్రదేశంలో ఒక జ్యోతి ధ్యాన స్థితిలో ప్రక్రియతో బయట ఉన్న వెలుగుని లోనికి ఆహ్వానించుకొని, ఆవహించుకొని, ఆవరించుకొని నఖశిఖ పర్యంతము కూడా కేవల వెలుగు మూలంగా వెలుగుతో నిండిపోయినట్లుగా, ముంచినట్లుగా ఎవరైతే నిలకడ చెంది ఉండగలరో వారిది తీవ్ర మనోలయ సాధన అని సత్యసాయి భగవానుడు మనకు ప్రబోధించిన ధ్యాన యోగ మార్గం. మార్గాన్ని అనుసరిస్తూ మనస్సు యొక్క పూర్ణత్వాన్ని, ఒక శుద్ధత్వాన్ని, ఒక స్థిమితత్వాన్ని, ఒక నిర్మలత్వాన్ని, ఒక నిశ్చలత్వాన్ని, సంస్థితత్వాన్ని మనం పొందే దిశగా మనం ప్రయాణం చేద్దాం. ప్రయాణ మార్గం ఒకటి ఉన్నదని, మార్గంలో వెళితే ధ్యానమే యోగం అవుతుందని, ధ్యాన యోగ సమాధి స్థితులను మనకి స్పష్టంగా బోధిస్తున్నారు అటు ఆచార్య శంకరులు, ఇటు భగవాన్ సత్యసాయి. శంకర సత్యసాయి భగవానుల దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ, సాయిరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకర భగవత్పాదులకు, సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ, అద్వైతా మృతధారలో, విచారధారలో మరొక రెండు విషయాలు విచారణ చేయాలి. శ్రీకృష్ణ జ్ఞానం చేయి, యమునా తటిని ఊహించుకో, వేణుగాన లోలున్ని మనసులో నిలుపుకో, మనసంతా శ్రీకృష్ణమయం చేయి అన్నటువంటి శంకరులు దైవాన్ని గురించి, దైవం ఇచ్చే అనుగ్రహాన్ని గురించి కూడా కొంత విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ అసలు నిజానికి దైవం ఏమిటి అన్నటువంటి ప్రశ్న వైపు సాగాలి. దానికి సమాధానమే విచారధార. దేవుడు అంటే ఒక మధుర భావన, ఒక మహా శక్తి. దైవము సాకారము, అది నిరాకారము కూడా. వేదాలు దైవాన్ని సగుణంగాను, నిర్గుణంగాను వ్యాఖ్యానించినాయి. సర్వ ప్రాణుల యందుండి శక్తి త్రయంగా అంటే ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులుగా నడిపించే ప్రాణాధారమే దైవం. సగుణ స్వరూపానికి కళ్ళకు కనిపించే దేహం ఉన్నది. నిర్గుణ తత్వానికి మనోనేత్రం సంభావించగలిగిన స్థితి ఉన్నది. అంటే మామూలు కళ్ళతో బొమ్మని చూడగలుగుతాం. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని మనోనేత్రంతో దర్శనం చేయగలుగుతాం. నిర్గుణ తత్వానికి మనోనేత్రం సంభావించగలిగిన స్థితి ఉన్నది. కనుకనే ధ్యానము నిర్గుణ పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తీసుకువచ్చే ఆధ్యాత్మిక సాధనం. అందుకనే ధ్యానిగా ఉండాలి. ధ్యానం చేయటమంటూ లేదు. ధ్యానిగా స్థితిలో యోగంలో నిలబడాలి. ధ్యానంలో స్వరూపాలు కనిపిస్తున్నాయి అంటే అది అపరిపక్వ ధ్యానమే, అది ప్రయోజన శూన్యం. దాని వలన సమయం వృధా, భ్రాంతులు కలుగుతాయి. మళ్ళీ భ్రాంతులు సత్యం అనుకుంటాం. మళ్ళీ అవిద్యలోకి, అనాచారంలోకి, అస్పష్టతలోకి, అజ్ఞానంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉన్నది గనుక ఎక్కడ దృశ్యం కనపడలేదో, ఎక్కడ శబ్దం వినపడలేదో, ఎక్కడ ఆలోచనా పుట్టటం లేదో, పుడుతున్నదన్న స్పృహే లేదో, ఎక్కడ దేహ భావం నశించిపోయిందో, దేహాత్మ స్థితిని దాటి పూర్ణమైన ఆత్మైక స్థాయికి వెళుతున్నదో, దానిని కలిగించగలిగిన శక్తి ప్రక్రియకు ఉన్నదో దాని పేరు మాత్రమే ధ్యానం. మూడో కన్ను, అంతర్నేత్రం, లోకన్ను పేరుతో పిలిచినా ప్రపంచాన్ని చూపిస్తున్న రెండు కళ్ళను దాటి ఉన్న మూడో కంటిని దివ్య చక్షువు అంటున్నాం. మహాభారత సంగ్రామ వేళ తాను విశ్వరూప దర్శనం ఇవ్వటానికి ముందు అర్జునుడికి దివ్య చక్షువునిచ్చాడు కృష్ణుడు. ఎందుకంటే మామూలు కన్ను మామూలు వస్తువునే చూడగలదు. దాని శక్తి అంతవరకే. అసలు వస్తువుని చూడాలి అంటే అసలు కన్నే కావాలి. ఉన్నదంతా తానేనని, తానే అన్నిటా ఉన్నానని చెప్పటమే శ్రీకృష్ణుడి లక్ష్యం. అందుకే శరీరం, రూపం, భావం అనే స్థితులను దాటించి విరాట్ మూర్తిగా మరొక రూపంగా అర్జునుడికి అనుభవాన్నిచ్చాడు కృష్ణ పరమాత్మ. శుద్ధ చైతన్యము, అఖండ పరబ్రహ్మము, సచ్చిదానందము కలబోసుకున్న సుదర్శనము, అది నిదర్శనము, అది ప్రదర్శనము. దుర్యోధనుడికి పాండవ సైన్యమంతా కృష్ణులుగా కనిపించటం కూడా ఇటువంటిదే. పరమాత్మ అంటే దైవం సర్వసముడు, నిత్య సాక్షి, కారణాతీతుడు. ఆయనకు శత్రువులంటూ, మిత్రులంటూ లేరు. అవన్నీ తనువుతో, మనసుతో ఏర్పడినవే. భావరహితుడైన దైవానికి నిజానికి ఇవేవీ లేవు. మార్గం పక్కన ఉన్న చెట్టు వంటి వాడు దైవం. ఎవరికీ ఏమి కావాలో దానిని ఇవ్వటానికి సిద్ధమైన వృక్షం వలె జీవుడి ప్రాప్తిని బట్టి అనుగ్రహిస్తుంటాడు. మధుర భక్తి, వైర భక్తికి ఫలితం మోక్షమేనని మనం వింటూ ఉంటాం. కథలన్నీ మనకు తెలుసు. భాగవతం నిండా పరుచుకొని ఉన్నది మధుర భక్తి, వైర భక్తుల యొక్క కలబోత. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు తదదిగా గలిగినటువంటి భక్త సమూహాల యొక్క చరిత్ర అంతా కూడా ఇదిగో మధుర భక్తితో హిరణ్యకశిపుడు, కంసుడు, గజేంద్రుడు వీరంతా కూడా వైర భక్తి మార్గంలో ఉపాసన చేసుకున్న వారే. పుత్రుడి కంటే, సంపద కంటే ఆత్మే శ్రేష్ఠమైనది.సర్వోత్కృష్టమైనది కానీ అది తటస్థం దేనికి చెందదు దేనిలోనూ చేరదు. కురుపాండవుల మధ్య కృష్ణుడి వలె అది ఏమీ చేయదు కానీ అన్నింటినీ చేయిస్తుంది. ఆయుధం పట్టక యుద్ధం చేయక కేవల రథసారథి వలె కృష్ణుడు ఉన్నట్లుగా ఆత్మ కూడా మానవ దేహము నందు ఉంటుంది. సంయోగంలో వియోగం వియోగంలో సంయోగం ఇది ఆత్మ స్థితి. కృష్ణుడి విషయంలో గోపికలు గాని గోపబాలురు గాని అనుభవించిన పరిస్థితి ఇటువంటిదే. సర్వం హరిమయం అన్న యోగ భావన కలిగించడమే శ్రీకృష్ణుడి లక్ష్యం. కృష్ణుడి వేషం కృష్ణుడి చేష్ట కృష్ణ చేతన అందరికీ ఆనందదాయకమే. కృష్ణుడి అతిమానుష చర్యలన్నీ అద్భుతాలు ఆనంద రసతుందిలాలు అపాత మధురాలు. దైవానుగ్రహానికి అందరూ సమపాత్రులే. అందుకనే స్వామి నేను యోగిని కాను భోగిని కాను అవధూతను కాను అవస్థలకు అన్నింటికీ అతీతమైనటువంటి నేను నేనైన నేను అన్నారు. నేను అంటే ఆత్మే. జీవుడిలో ఉన్నది ఆత్మ స్వామి యందు ప్రకటితంగా అప్రకటితంగా అభివ్యక్తం కాకుండా కానీ పూర్ణ విలసితంగా ఉన్నటువంటిది పరమాత్మ. విషమిచ్చి చంపవచ్చిన పూతనకు పూచిన తనువిచ్చిన శకటాసుర సంహారంతో శకటాసురుడికి ముక్తి కలిగించిన తృణావర్తుని మట్టుబెట్టి ముక్తినిచ్చిన అర్జున వృక్షాలను పెకలించి విముక్తిని సగిన కాళీయ మర్ధనంతో దివ్య జీవన విధానాన్ని అనుగ్రహించిన గోవర్ధన పర్వతమెత్తి పరతత్వ శక్తిని ప్రదర్శించిన. ఒకటేమిటి అటు శ్రీకృష్ణావతారము ఇటు సత్య సాయి అవతారము అంతా దైవానుగ్రహానికి నిదర్శనమే. దైవము అనుగ్రహము రెండు వేరు కావు అనుగ్రహమే దైవం దైవమే అనుగ్రహం. దైవము లేనిది దైవము ఇవ్వనిది అనుగ్రహం కాదు వరం. అందుకే శ్రీకృష్ణావతారంలో ఆనందలీలలను మనం అశాంతము అనుభవించగలుగుతూ ఉంటాం. కుబ్జ కువలయాపీడం అనేటువంటి ఏనుగు కొంగ కాకి రూపానికి అతీతంగా కృష్ణుడు అన్నిటా ఆత్మనే చూశాడు. ఆత్మోద్ధరణ అనుగ్రహ పూర్వకంగా చేశాడు. కంస శిశుపాల వధల వెనుక ఉన్న అనుగ్రహ స్పర్శ ఎప్పుడు తలచుకున్నా ఆనందాన్ని కలిగిస్తుంది. శంకర భగవత్పాదుల భక్తి ఆవేశం పారంజ్యం గట్టు తెలియని అనంత ప్రవాహం. అవిద్యను మటుమాయం చేయగల మాతృమూర్తే భగవంతుని దయ అదే శ్రీకృష్ణ అనుగ్రహం. అందుకనే స్వామిని మనం వేయి తల్లుల ప్రేమ అంటాం. అంటే మనలో ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి ఆలోచనలని మనలో ఉన్నటువంటి అల్పత్వాలని మనలో ఉన్న అవిద్యని మటుమాయం చేసేటువంటి దయా స్వరూపము అది మాతృమూర్తి వలె కనపడుతున్నది గనుక స్వామిని మనము సాయి మాత అని వేదమాత అని వేయి తల్లుల కంటే అధికమైనటువంటి ప్రేమ ఇచ్చేటువంటి మాతృమూర్తి అని భావన చేస్తాం. సర్వాత్మకుడైన కృష్ణ నీవు నా యందు తండ్రి వలె ఉండి నీ దయా స్పర్శతో అహంకారాన్ని తొలగించు. అందుకే స్వామి అన్నివేళలా చూడండి తల్లి తండ్రి గురువు దైవం మాటలు ఎన్నడూ మార్చలేదు. తల్లి తండ్రిని చూపిస్తుంది తల్లి తండ్రి కలిసి గురువుని చూపిస్తారు ముగ్గురూ కలిసి దైవం వైపు జీవుడిని నడిపిస్తారు. అందుకనే భగవంతుని దయ మాతృమూర్తి పరమాత్మ మన యందుండి దయా స్పర్శతో అహంకారాన్ని తొలగించాలి. గతించిన రాబోయే కర్మానుభవాలను అనుభవించగలిగిన శక్తిని నీ దయ మాత్రమే ఇవ్వగలదు. బ్రహ్మమే కాలమేఘంగా మారి సాధకుల పిలుపుతో చలించి గీతా మృత వర్షిణి కాలేదా? ఇదంతా నీవే కదా అంటున్నారు శంకర భగవత్పాదులు. ప్రాపంచిక వస్తువులన్నింటినీ ఒకవైపు నిన్ను ఒక్కడిని మరొకవైపు పెట్టి తూచిన వేళ నీవే ఘనుడవి అని మాకు తెలిసింది కదా. లోకాన్నంతా పొందినా లోకేశ్వరుడవైన నిన్ను పొందకపోతే ఏం లాభం? హరిణి వదిలి సిరిని పట్టుకున్నా ఏం ప్రయోజనం? నీ అనుగ్రహ వర్షానికి తీయ మామిడి చెట్టు పెనువేప చెట్టు అనే భేదం ఉన్నదా? తాబేలు చేప వంటి జీవుల వాత్సల్య దృష్టే వాటి సంతానానికి ప్రాణమవుతుంటే నీ దయా సృష్టి నీ దయా దృష్టి సోకిన మేమెంత అదృష్టవంతులం. ఆకాశం శూన్యమే అయితే చాతక చకోర పక్షులకు మేఘము చంద్రబింబము తమ నుంచి ప్రసవించిన వాన చినుకు ప్రసరించిన వెన్నెల ఆహారం కావటం లేదా? నీవు నిరాకారుడివైతే మాకేం లోటు? విధంగా జగద్గురు శ్రీకృష్ణ పరంగా దివ్య బోధ చేస్తూ ప్రబోధామృతాన్ని పంచుతున్నారు. అద్వైత మూర్తికి అంతా భేదమే అంతా ఆనంద రసానుభూతే. నిజానికి శంకరులే రసమాలయం. శ్రీకృష్ణ ఆనందలహరిగా సాగిన ప్రబోధ సుధాకరం శంకర అద్వైత భావనకు దివ్య దర్పణం. కరుణాలయము లోక శంకరము అయిన సత్యసాయి భగవానుడు అనుగ్రహించినటువంటి అద్వైతా మృత వర్షిణి సత్యాచార్యునికి ప్రణామం చేయమంటున్నది. చేద్దాం. అద్వైతా మృత ధార కురియ అంతరంగమనిడి పాత్ర తెరచి ఉంచు బోర్లించి ఉండగా బుట్టైన చిక్కదు తెరచి ఉంచిన చాలు తరచనగును. సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయిరాం.
SSSMC · audio

Advaitamrutha Dhara - 02

Home

Advaitamrutha Dhara - 02

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 36:23

More in this series

Advaitamrutha Dhara

9 episodes · 4 hr 4 min

  1. 22 min 1

    Advaitamrutha Dhara - 01

  2. 36 min 2

    Advaitamrutha Dhara - 02

    Now playing
  3. 31 min 3

    Advaitamrutha Dhara - 03

  4. 33 min 4

    Advaitamrutha Dhara - 04

  5. 34 min 5

    Advaitamrutha Dhara - 05

  6. 27 min 6

    Advaitamrutha Dhara - 06

  7. 20 min 7

    Advaitamrutha Dhara - 07

  8. 16 min 8

    Advaitamrutha Dhara - 08

  9. 21 min 9

    Advaitamrutha Dhara - 09