No transcript for this section.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి అంజలి ఘటిస్తూ సత్య సాయి భగవానుని దివ్య చరణారవిందాలకు నమస్కరిస్తూ శంకర విచారధారలో అద్వైతామృత వర్షిణిలో మరొక కోణం ఎవరు భాగ్యవంతుడు అని ఎవడు సుఖి అని ఇది విచారణ. ప్రపంచ భావనలో ధనం అంటే సంపద అది నిరంతరం కదిలేది స్థిరంగా ఒకడి దగ్గర కొంతకాలం ఉన్నట్లున్నా ఆ స్థితి ఎంతో కాలం ఉండదు ప్రభుత్వం దొంగలు బంధువులు ఎప్పుడు దోచుకుందామా అని కాచుకుని ఉంటారు. ఆశకు దురాశకు ఆపై దుర్దశకు దారి తీసేది భోగ రోగాలకు మూలమైనది కారణ అకారణ శత్రుత్వాలకు కారణమైనది యుద్ధాలకు స్పర్ధలకు ప్రేరణ కలిగించేది కేవల భౌతికానందాన్ని కలిగించేది ఈ కదిలే సిరి. యతులు, అవధూతలు, సత్పురుషులు ఎప్పుడు ఆనందం అనుభవిస్తూ ఉంటారో అదే కదలని సిరి. కదలని సిరి అంటే జ్ఞానమే. మనం ఉన్న ఈ ప్రపంచంలో ఉంటూనే ఏ వికారానికి లోను కాకుండా, ఏ ప్రలోభము తాకకుండా, ఏ ఆకర్షణ దరిచేరకుండా వీరు ఎలా ఉంటారు? వీరి ఆనంద మూలాలు ఏవి? ఈ ఆనందం అంతా అనుభవిస్తున్నాం అన్న స్పృహన్నా వీరికి ఉంటుందా? ఇవి ప్రశ్నలు. లోక శంకరులు శుద్ధ జ్ఞాన స్వరూపులు సాక్షాత్ పరశివావతారులైన శంకర భగవత్పాదులు ఈ ఆనంద రహస్యాన్ని రమణీయంగా బోధిస్తూ ఆస్తిక జీవులకు మార్గోపదేశం చేస్తున్నారు. వేదాంత వాక్యములను అన్నివేళలా వింటూ, మరణం చేసుకుంటూ, భావానందం అనుభవిస్తూ, ఆ పూటకు కావలసిన భిక్షాన్నం చాలనుకొని ఎప్పుడూ తృప్తిగా ఉంటూ జీవించటం కోసమే జీవిస్తూ, భుజిస్తూ, ఆశ లేనందున శోకించక అన్ని కాలాలలోనూ హాయిగా ఉంటూ ఏనాటికైనా నశించే దేహంలో నాశమెరుగని ఆత్మే తామన్న భావనలో నిలకడ చెందు కౌపీనధారియే నిజమైన భాగ్యశాలి. చెట్ల నీడలు ఇల్లుగా రెండు చేతులు కంచాలుగా చింపిరి పాతలు సైతం అవసరమా అన్నట్లు గోచి కట్టిన వాడి కంటే ధనవంతుడు మరొకడు లేడు. తనను ఆత్మగా భావించుకొని ఆత్మానందం అనుభవిస్తూ తృప్తి ఆనందం తన స్వభావంగా మార్చుకొని ఇంద్రియాల కార్యకలాపాల అన్నిటినీ నియంత్రించి నిత్య శాంత స్వభావంతో నిలకడ చెంది రాత్రనకా పగలనకా ప్రతిక్షణము బ్రహ్మమును బ్రహ్మతత్వమును సంపూర్ణ ప్రేమభావంతో అనుభవిస్తూ నిజానికి ఇవన్నీ అనుభవిస్తున్నానని స్పృహ లేని వాడి కంటే అటువంటి కౌపీనధారి కన్నా కోటీశ్వరుడు లేడు. శరీర భావం వీడి ఇంద్రియాలను ఆత్మ దర్శన సాధనలో ప్రవేశపెట్టి భూత భవిష్యత్ వర్తమానాలను సమంగా దర్శిస్తూ మరణ విషయాన్ని కానీ ఇంద్రియాలను కానీ కాల కార్య కారణ కర్తవ్యములను స్మరించక సాక్షిభూతుడైన కౌపీనధారియే అసలు ధనవంతుడు. పవిత్ర ప్రణవ శబ్దాన్ని అంటూ తాను బ్రహ్మమునే నన్న నిశ్చిత భావనలో ఉంటూ ప్రాణం నిలవటానికి కావలసినంత భిక్ష మాత్రమే తీసుకుంటూ ఏ ప్రదేశము నందు అపేక్ష లేక అంతటా సంచారం చేయగలిగిన కౌపీనధారియే యతి. ఆయనను మించిన ధనశాలి మరొకడు లేడు. మన వలెనే మనం జీవిస్తున్న లోకంలో ఉంటూనే వైరాగ్య వైభోగం అనుభవించగలిగిన యతి నిత్యసుఖి. ప్రాపంచిక వస్తుమూలక ఆనందం తాత్కాలికం అది నిజానికి ఆనందం కాదు కేవలం సంతోషం మాత్రమే. వేదాంత వాక్యాలు జీవితాన్ని స్పష్టంగా అనుభవించగల ధైర్యాన్నిస్తాయి. అశోపహతులం కాకుండా వాస్తవిక జీవితం ప్రసాదించే ఆనందాన్ని హాయిగా అనుభవించేలా చేస్తాయి. నిజానికి మన శరీరమే ఒక అద్దె ఇల్లు కానీ అజ్ఞానం వలన అదే శాశ్వతం అనుకుంటాం, సొంతం అనుకుంటాం. ఏదో ఒకరోజు ఖాళీ చేయక తప్పని విషయం అది. దేహం దాని చుట్టూ అల్లుకున్న గూడు అందులో పుట్టే అనేక విషయాలు ఆనందాన్ని ఇవ్వలేవు. దేహాత్మ భావం వీడి ఆత్మనిష్ఠలో నిలకడ చెందినవాడు దుఃఖం ఎరుగడు. తృప్తిని మించిన సంపద లేదు, శాంతం లేకుండా సుఖం లేదు, ఆనందం లేకుండా జీవితం లేదు, కదిలే సిరి కలకాలం ఉండదు మార్పు తెస్తూ మారుతూ ఉంటుంది అది ప్రమాదము ప్రమోదాల విచిత్ర కలయిక. డబ్బు మనుషుల్ని కలిపి ఉంచలేదు విడదీయటంలోనే దాని బలమంతా ఉంది. భోగాలకు రోగాలకు అదే హేతువు తూకంగా దానిని వినియోగించాలి సత్కర్మలలో వినియోగించాలి. కదలని సిరే నిత్య సత్య శాశ్వత ఆనందమూలం. ఆత్మవిద్య నుండి ఆత్మ సంయమనము నుండి ఆత్మానుష్ఠానం నుంచి ఆత్మానుభవం నుంచి ఆత్మే సాక్షాత్ ఆకారంగా ఉన్నదన్న విభూతి స్థితే కదలని సిరి. అది సర్వానందదాయిని, శుభకారిణి, ఎరుకను అనుగ్రహించే అచ్చ తెలివి అది. అహంకారం, అనాచారం, అవిద్య, అస్పష్టత, అజ్ఞానం మనం వదులుచుకోవలసిన మతి పంచకం. సమర్పణ, శరణాగతి, వినయం, వైరాగ్యం, ఆత్మనిష్ఠ మనం పొందవలసిన, సాధించవలసిన యతి పంచకం. భగవత్పాదులకు ఇదే ప్రణామ సహస్రం. స్వామి! తృప్తి కంటే గొప్ప మరొక జీవితం లేదని, తృప్తి కంటే ఐశ్వర్యం లేదని, తృప్తిని మించినటువంటి మరొక స్థితి లేదని మనకు అనేక విధాల బోధించారు. అయితే తృప్తి అంటే ప్రగతి నిరోధకంగా సామాన్య జనులు భావిస్తూ ఉంటారు. కానీ తృప్తి నెరిగిన వాడు తను ఏ కార్యకలాపంలో మనస్సును నిమగ్నం చేసినా చిట్టచివరకు పరమేశ్వరుడికి సమర్పించి సానందభరితుడై ఉంటాడు. ఇవ్వటంలో ఆనందాన్ని, పుచ్చుకోవటంలో ఇబ్బందిని ఏకకాలంలో అనుభవిస్తాడు. అందుకనే స్వామి చెప్పిన ఒక సూక్తి.ఇచ్చింది మర్చపో పుచ్చుకున్నది గుర్తుపెట్టుకో కృతజ్ఞత మానవుడి సంస్కారానికి పతాక స్థాయి కృతజ్ఞత లేనివాడు అన్నిటికంటే హీనుడు అంటూ స్వామి ఈ కదలని వైరాగ్యాన్ని కదిలించేటువంటి వైభోగాన్ని కదలని సిరి అయినటువంటి జ్ఞానాన్ని అన్ని వేళలా పొందాలి అని బోధించిన సత్య సాయి భగవానుడి దివ్య చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయి రామ్ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం లోక శంకరులైన శంకర భగవత్పాదులకి సమస్త దేవతల నికమైనటువంటి పరమాత్మ సాయికి మరొక్కసారి ప్రణమిల్లుతూ ప్రబోధ సుధాకర వ్యాఖ్యాన ధారలో మనసు హృదయము ఆ రెండింటికి ఉన్న సంబంధాన్ని మనసు యొక్క మూలాలని మనం విచారణ చేద్దాం ఈ విచారణ లో అనేకమైన మహా పరి సత్యాలు మన మనసుకి తోస్తూ ఉంటాయి చూడండి పొరుగింటిలో పెళ్లి అయిందని విన్నా పిల్లలు పుట్టారని విన్నా కలిగే ఆనందం ఆనందమేనా అలాగే ఎవరో మరణించారు అని విన్నప్పుడు కలిగే దుఃఖము దుఃఖమేనా అంటే కాదనేదే నిజం అది ఒక స్పందన మాత్రమే తనది అనుకున్నది దూరమైనప్పుడు మాత్రమే దుఃఖం దక్కింది అనుకున్నప్పుడు మాత్రమే ఆనందం కలుగుతున్నది ఇవి నిజమేనా అని అంటే దుఃఖం అంటే ఏమిటి ఆనందం అంటే ఏమిటి విచారణ చేయాలి తన ఇంట్లోనే తానొక అతిధిగా ఉండగలిగినప్పుడు కలిగే భావమే నిజమైన వైరాగ్యం అంత వైరాగ్య స్థితిని పొందిన వాడికి ఆ ఇంట జరిగే ఏ విషయము బాధను గాని సుఖాన్ని గాని కలిగించదు అదే నిజమైనటువంటి వైభోగం వసంత కాలంలో చెట్టు కింద నీడలో మైమరచి నిద్రించగలిగిన వాడికి పూల పరిమళాలు కోయిల గానాలు ఆనందాన్ని ఇవ్వటం లేదా ఇవన్నీ వాడు పొందుతున్న వైభోగం కాదా నిజానికి వైరాగ్య భూమికలో నిలకడ చెందిన వాడికి మనసు నిర్మలంగా ఉంచుకోగలిగిన వాడికి ఆశలు లేని వాడికి ఎదురు చూడని విజయాలు లభించిన వాడి వైభోగం అంతా వైరాగ్యమే కదా జీవన సాఫల్యం సిద్ధించినట్లే కదా తీగ నుండి విడిపడినటువంటి పండు ఎవరికీ చెందకపోవడం ఎంత దురదృష్టమో మహాత్ముడికి అందించగలిగితే అంత అదృష్టం మరొకటి లేదు అంటే ఆ పండు చేరవలసిన చోటికి చేరితే ఆనందం చేజారితే దుఃఖం ఈ ఆనంద దుఃఖాలకు పండే కారణం అవుతున్నది అపజయాల్లో నుంచి ఏర్పడే వైరాగ్యం తాత్కాలికం విజయంలో నుంచి పుట్టే వైరాగ్యమే శాశ్వతం అందుకే ఏదైనా అర్థం ఎరిగి చేయాలి పరిస్థితులు అనుకూలించక వైఫల్యం వల్ల కలిగే వైరాగ్యం ఎల్లకాలము నిలవదు స్ఫూర్తితో ఇంద్రియ నిగ్రహం సాధించాలి వృద్ధాప్యంలో ఇంద్రియాలు తమంతట తామే తమ కార్యకలాపాల నుంచి బయట పడతాయి అవే తప్పుకుంటాయి అన్నీ ఉండగానే తనవి ఏవీ కావు అనుకోగలగాలి స్వచ్ఛందంగా ఇష్టంగా ఇచ్ఛాపూర్వకంగా వదులుకోగలగాలి తన స్వస్థానమైన హృదయానికి దూరమైన మనసు నిరంతర సంచారిణి అవుతున్నది దిక్కు తెలియక గమ్యం ఎరుగక లక్ష్యం లేక పరుగులు ఇడుతున్నది ఎందుకో తెలియకుండానే ప్రయాసతో ఆయాస పడుతున్నది జీవనారణ్యంలో మంటలకు బెదురుతున్నది వేటగాడి వలలో చిక్కుకుంటున్నది మనసు పరిస్థితి అంతే స్వస్థానం వదులుకున్న ఆసామి పరిస్థితి అది నీటిని విడిచిన చేప మరణిస్తున్నది నీటి నుండి బయటపడిన మొసలి బలాన్ని కోల్పోతున్నది మనసు తన స్వస్థానంలోకి చేరాలి సహజ స్థితిని పొందాలి ఎందుకని అంటే మూలంలోని స్వస్థానంలోనే బలం ఉన్నది గనుక ముందు స్వస్థానం ఏమిటో తెలిస్తే సగం పరిష్కారం లభిస్తుంది ఆపై చేరే మార్గాల కై అన్వేషణ ప్రారంభం అవుతుంది దీనికి మార్గదర్శకుడు కావాలి దారి ఎరిగిన వాడే దారి చూపించాలి ఆయనను గురువు అందామా సముద్రం నుండా నీరున్నా వర్ష మేఘం కోసం వాన చినుకు కోసం చాతక పక్షి ఎదురు చూస్తున్నది ఆ విధంగానే శాస్త్ర జ్ఞానం అందుబాటులో ఉన్న గురువు కోసం సాధకుడు ఎదురు చూడాలి గురు అనుగ్రహం మలయ పవనం అది స్వాంతన కూర్చే దివ్యానుభవం శాస్త్రం గురువు అనుభవం నిజానికి జ్ఞానానికి మార్గాలు ఈ పండు తీయగా ఉన్నది అంటున్నది శాస్త్రం ఈ పండు తీయగా ఉండటానికి ఇన్ని కారణాలున్నాయి అంటున్నాడు గురువు అవును నిజమే పండు తీయగా ఉన్నది అంటున్నాడు సాధకుడు అంటే స్వీయానుభవమే సత్యం శాస్త్రం విషయాన్ని అందిస్తున్నది గురువు కేవలం మార్గాన్ని చూపిస్తున్నాడు స్పర్శ రూప రస శబ్ద గంధాదులను అనుభవిస్తున్నది ఎవరు ఇంద్రియాలతో కూడిన శరీరమా కాదు కాదు ఎందుకంటే శవానికి అనుభవం లేదు ప్రాణంతో కూడిన దేహం మాత్రమే దీనిని అనుభవిస్తున్నది ఈ అనుభవం కూడా జాగ్రదావస్థలో అంటే మేల్కొన్నప్పుడే కలుగుతున్నది దేహంలో ప్రాణం ఉన్నా నిద్రావస్థలో ఈ అనుభవం లేదు వీటన్నింటి మధ్య స్వస్థానం అంటే హృదయం సాక్షిభూత భూమికగా ఉన్నది ఆలోచిస్తే ఇంద్రియాలన్నిటినీ మనసు ఒకే సమయంలో నియంత్రించలేకపోతున్నది అంటే మనసు కంటే అతీతమైన స్థితి మరొకటి ఉన్నదన్నమాట దాని పేరు ఆత్మఅందున్న భూమికే హృదయం. శబ్దానికి నిశ్శబ్దం మూలం. అలాగే మనసుకు మూలం హృదయం. ఇంద్రియ చలనాలకు, స్పందనలకు, కార్యకలాపాలకు మనసే కారణం అవుతున్నది. మనో నియంత్రణ మాత్రం హృదయం దగ్గర మాత్రమే ఉన్నది. అంటే అన్నిటికీ మూలము, అన్నిటిపై అధికారము హృదయానికే ఉన్నది. ఈ విచారణ నిరంతరము కొనసాగుతూ ఉండాలి. అదే అధ్యాత్మ సాధన. ఇంద్రియాలను, మనస్సును దాటుకుంటూ మనస్సును హృదయ స్థానంలో నిలపగలిగితే అదొక సాధనా సాఫల్యం. దేహంలో ఉన్న దేహిని ఎరగాలి. ఆ ఎరగటమే ఎరుక. అదే ఆత్మానుభవం. ఆ అనుభవం పొందకుండా అడ్డుకుంటున్న మాయ సంగతి ఏమిటి అని. మాయ ప్రపంచాన్ని ఆవరించి ఉన్నది అని మన భావన. అయితే శంకర ప్రబోధంలో మాయను గురించిన విచారణ నిరుపమానము. అటువంటి విచారణ మనం చేయాలి. మాయ నెరుగకుండా మాయకు మూలమైనటువంటి కారణాన్ని మనం వెతుక్కోలేము గనుక మాయ అంటే ఏమిటి? మాయ యొక్క స్థితులేమిటి? మాయ ఏం చేస్తుంది? మాయని జీవుడు అనుభవిస్తున్నాడా? ఇవన్నీ కూడా మనం చక్కగా విచారణ చేయవలసి ఉన్నది గనుక ఆ మాయని గురించిన విచారణ ప్రబోధ సుధాకరంలో అత్యున్నతమైన ఒక శిఖర స్థాయికి చెందిన విచారణ. ఈ మాయని గురించే సత్యసాయి భగవానుడు ఒక మాట అన్నారు. మాయ అంటే చైతన్యానికి ఛాయ అన్నారు. చైతన్యం అంటూ ఒకటి ఉన్నది గనుక అది బింబం. ఆ బింబానికి ప్రతిబింబం ఏమిటి అంటే అది మాయ. పరమేశ్వరుడి సత్తులో నుంచి సృష్టి అంటే విశ్వం. విశ్వంలో నుంచి ప్రకృతి, ప్రకృతిలో నుంచి ఒక మానవుడు, ఒక మానవుడిలో నుంచి అనేక దేహాలు, అనేక ఆలోచనలు ఎట్లాగైతే ఏర్పడి ఉన్నాయో, దీనన్నింటికీ కూడా మూలము ఏమిటి అని విచారణ చేస్తే అది మాయావరణము అని తేలిపోతుంది. ఈ మాయావరణ ప్రభావాన్ని, మాయావరణ స్థితిని, దీనినన్నింటినీ కూడా మనం వినూత్నమైనటువంటి ఒక వరిష్ఠమైనటువంటి స్థాయిలో విచారణ కొనసాగిద్దాం. మాయాన్వేషణ కాకుండా మాయానుభవాన్ని గనుక అర్థం చేసుకోగలిగితే ఈ దేహము, ఈ జన్మ, ఈ ప్రపంచము, ప్రపంచ భావన ఎంత అశాశ్వతమో కానీ ఎంత స్పష్టమో మనకు అవగతమవుతుంది గనుక అటువంటి విచార ధార వైపు మన మనస్సు హాయిగా సాగేట్లుగా అనుగ్రహ వరదానం చేసినటువంటి శంకర భగవత్పాదులకు, సత్యసాయి భగవానుడికి మరొక్కసారి నమస్కరిస్తూ, సాయిరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి అంజలి ఘటిస్తూ, సర్వదేవతా అతీత స్వరూపులైన సత్యసాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు వేవేల నమస్కృతులు అందిస్తూ శంకర ప్రబోధంలో, ప్రబోధ సుధాకరంలో విశ్వమే దేహమని, ఆ దేహానికి ఒక మనస్సు ఉన్నదని, ఆ మనస్సు ఇంద్రియాలకు అధిష్టానమని, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిపి పది. ఆ పదికి అధిష్టానమైనటువంటి యజమాని మనస్సు కలిపితే పదకొండు అని, ఇవే మన దేహంలో ఉన్న ఏకాదశ రుద్రులని విచారణ చేశాం. అయితే ఈ పరిగెత్తే మనస్సు, పరిగెత్తించే మనస్సు, నిలకడలేని మనస్సు, చలచలితమైనటువంటి మనస్సు, రూపమే లేని మనస్సు, పుట్టుకే ఎరుగని మనస్సు. దీని మూలాలు ఏమిటి? దీని అస్తిత్వం ఏమిటి? ఇది మనం విచారణ చేసుకోకపోయినట్లయితే మనస్సు అంటూ తెలియకపోతే మనస్సు యొక్క నియంత్రణ మనం ఎరగం గనుక ఆ మనస్సు యొక్క మూలాలు శంకర భగవత్పాదులు తమదైనటువంటి అద్వైత విధానంలో విచారణ చేస్తున్నారు. కోరికలు ఆవహించినప్పుడు మనసు రాక్షసత్వాన్ని పొందుతుంది. కోరికలు కుదిపినప్పుడు నవ్వుతూ, మరొక క్షణం ఏడుస్తూ, మరుక్షణం అయోమయానికి గురవుతూ పరిపరివిధాలా దిక్కుతోచని రీతిలో అది పరుగులు ఇడుతుంటుంది. అప్పుడప్పుడు విచక్షణతో, అన్నివేళలా మూర్ఖంగా ఉంటుంది. ప్రపంచాన్ని పొగుడుతూ, తెగుడుతూ, ద్వేషం పెంచుకుంటూ వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఒక్కొక్కసారి తనను తానే అభినందించుకుంటూ ఉంటుంది. దంభం, ప్రగల్భం, వంచన, దురాశ, పేరాశ, కోపం, తీవ్రమైన అసూయ మనస్సును నిలవనియ్యవు. ఇంతకీ ఈ మనస్సు ఆలోచనా సమూహమే కదా! ఆలోచనకు అవసరం లేని ఆశ జతగూడినప్పుడు మనస్సు తన సహజ స్థితిని కోల్పోతుంది. ఈ మనస్సును ప్రశాంత స్థితిలో నిలపాలి అంటే మార్గం ఒకటే. కోరికల వల నుండి దానిని బయట పడేయాలి. అది దేనిని తీవ్రంగా కోరుతున్నదో దాని నుంచి దూరం చేయాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడుతూ సాగే పడవ ఈ మానవ శరీరం. కర్మానుభవాల గాలులే నావను ఊపుతూ ఉంటాయి. దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు. పడవను నడిపే సరంగు విచిత్రంగా నిమిత్తమాత్రుడు. ఈ చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు ఆత్మవలె. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నోరు, మర్మస్థానం, ఆసనం. ఈ తొమ్మిది రంధ్రాలను గమనించుకుంటూ జీవన ప్రయాణం సాగించకపోతే పడవలోకి నీరు ప్రవేశించటం, పడవ మునగటం తధ్యం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అనబడే ఈ పదకొండు మంది రుద్రులు దేహం నిండా ఉన్నారు సుమా! జాగ్రత్తగా ఉండాలి. అనుభవశాలి అయిన సరంగు పడవను అవతల గట్టుకు భద్రంగా చేరుస్తాడు.ఏమిటీ అనుభవం? ఇంద్రియ నిగ్రహమే ఆ అనుభవం. ఇంద్రియ నిగ్రహం సాధించకపోతే ప్రయాణం నిత్యమూ ప్రమాదభరితమే. అందుకే స్వామి అంటారు, నాలుక జారితే నాకం జారిపోతుంది అంటే స్వర్గం జారిపోతుంది అని. అలాగే మాటే మంత్రం బంగారు పో అంటే మనిషి దూరంగా వైదొలుగుతాడు రా అంటే హృదయానికి దగ్గరగా వస్తాడు. నిజానికి రెండూ రెండు అక్షరాలు మాత్రమే కానీ దాని వెనుక ఉన్నటువంటి శక్తి అపరిమితమైనది గనుక మాటలు జాగ్రత్తగా వాడాలి. అది కూడా ఇంద్రియ నిగ్రహమే. ఇంద్రియ నిగ్రహం సాధించకపోతే జీవన ప్రయాణము నిత్యమూ ప్రమాదభరితమే. పరస్త్రీలను కోరటం పరమ పాపం. తెలిసి కోరికను వదులుకోలేకపోతే మనసు నిత్య పాప పంకిలం అవుతుంది. పరదూషణ చేయటము, వినటము నిరర్థకమే, అది ప్రయోజన శూన్యమే. నిందించటానికి, కఠిన పదాలతో బాధించటానికి అలవాటు పడినటువంటి నాలుక సాధించుకునేదంటూ ఏమీ లేదు, పోగొట్టుకోవటం తప్ప. వస్తువుల యందు కలిగేటువంటి అభిమానం దురదృష్టానికి మార్గం వేస్తుంది. వస్తువును పొంది పోగొట్టుకున్న వాడిది తీరని బాధే. వివేకవంతమైనటువంటి మనస్సు తనకు ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోగలదు. అందువలన అది అన్నివేళలా సుఖి. అశాశ్వతమైన వస్తువు నుంచి అది అన్నివేళలా దూరంగా ఉంటుంది. ఎరను పొందే ప్రయత్నంలోనే చేప తన ప్రాణాన్ని కోల్పోతున్నది. ప్రాపంచిక సుఖాలన్నీ మృత్యువు వైపు నడిపించేటువంటి ఎరలే, దుఃఖంలో ముంచెత్తేటువంటి ఎరలే. పాము నోట సగం శరీరంతో ఇరుక్కున్న కప్ప తనను కబళించబోతున్న మృత్యువును మాత్రం గమనించటం లేదు. పైగా తన ముందు ఉన్నటువంటి కీటకాలను తినటము ఆపటమూ లేదు. ఇంతకు మించిన అశాపాశం ఉన్నదా? మరి ఈ మనస్సును నిగ్రహించటం ఎట్లా? తన ప్రయాణాన్ని ప్రారంభించిన నది మూలం వదిలి సముద్రంలో చేరి ముగించే వరకు పల్లం వైపు సాగటం లేదా? వర్షాకాలంలో అధికంగా నీరు చేరటంతో బావిలో నీరు తీయదనాన్ని కొల్పోవటం లేదా? ఆ బావి నీరే వేసవి కాలంలో తీయదనాన్ని నిలుపుకోవటం లేదా? అధికం ఎప్పుడూ అనర్థమే కదా. అధిక కామన వల్ల తామస గుణం పెరుగుతుంది. నిరపేక్ష వలన తామసం నశించి సత్వగుణం పెరుగుతుంది. సత్వ, రజస్, తమోగుణాలు మూడు ప్రకృతి శక్తులే. పవిత్రత, వివేకం, విజ్ఞానం, సమత ఇవన్నీ సత్వగుణంగానూ, ఆందోళన, ఆగ్రహం, అస్థిమితత్వం ఇవన్నీ రజోగుణాలు గానూ, జడత్వం, అజ్ఞానం, భ్రాంతి తమోగుణంగానూ అనుభవంలోకి వస్తున్నాయి. మనసుకున్న మొదటి లక్షణం పొందాలనుకోవటం. పోగొట్టుకోవటం అంటే దానికి అయిష్టం. పైగా అవమానంగా భావిస్తుంది. వస్తువును పొందే ప్రయత్నమంతా నిజానికి యాతనే. అంకోల వృక్షం నుంచి విడిపడిన విత్తనాలన్నీ మళ్ళీ చెట్టు మూలంలోకే వచ్చినట్లే మనసెంతగా లోపలకు వెళ్లాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నంలో సఫలత సాధించుకోలేకపోతే నిర్వేదమే మిగులుతుంది. మందలో ఉన్న తన పశువు తప్పిపోకుండా దాని వంటిపై గుర్తు ముద్రించినట్లుగా ప్రపంచ కార్యకలాపాలలో సంచరించే మనస్సు మీద నియంత్రణ ముద్ర ఉండాలి. అది మనస్సుని ఎన్నడూ వశం తప్పనియ్యదు. మేల్కొన్నప్పుడు మనసు సుఖం పొందటం లేదు. నిద్రలో సుఖం పొందాననుకొని హాయిగా ఉంటున్నాను, ఉన్నాను అంటున్నది. నిజానికి రెండూ నిజం కావు. సుఖం వలన కలిగే సంతోషము శాశ్వతం కాదు. బావిలో పడిన పులి ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోయినప్పుడు తానున్న బావిలోనే నిలకడ చెందుతుంది. ఇంద్రియాధీనమైన మనస్సుకి సుఖమంటూ ఉన్నదా? లేదు అని అర్థం. సత్సంగము, సత్సాంగత్యము, సజ్జన మైత్రి మనస్సుకి స్థిమితాన్నిస్తాయి. ప్రాణాయామ సాధనలో మనస్సు నిలకడ చెందుతుంది. ప్రాణాయామము అంటే పూరకము, కుంభకము, రేచకము. ఇది మన ప్రయత్నం లేకుండానే శరీరంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు జరుగుతున్నటువంటి నిత్య ప్రాణాయామం. ఈ నిత్య ప్రాణాయామాన్ని శంకరులవారు తమ యోగతారావళి గ్రంథంలో లయ యోగము అత్యున్నతమైన యోగమని ప్రతిపాదన చేశారు. సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసన్తి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. లక్షా ఇరవై వేల లయ యోగాలలో అత్యుత్తమమైనటువంటిది లయ యోగం. అందులో నాదానుసంధాన యోగం అత్యున్నతమైనది అని చెప్తూ ఈ నాదానుసంధానం శంకర ప్రబోధంలో మనస్సును నియంత్రించటంలోనూ, మనస్సుని ఎందుకు నియంత్రించాలో, నియంత్రిస్తే కలిగే లాభాలేమిటో చక్కగా విచారణ చేశారు. ఇటువంటి మనోమూలకమైన మనస్సు యొక్క మూలమైన స్థితిని గురించిన విచారణను అందించినటువంటి శంకర భగవత్పాదులు మన కాలంలోనే సత్యసాయి భగవానుడు మనసు మర్మము అనేటువంటి ఒక గ్రంథంలో మనస్సు యొక్క కీలకమైనటువంటి అనేక స్థితులను మనోవైజ్ఞాన శాస్త్రంగా సర్వ ప్రపంచానికి కూడా స్వయంగా అందించారు. ఆ వైనాన్ని మనం మరిచిపోకూడదు. దానిని అధ్యయనం చేయాలి. ఇటువంటి వ్యాఖ్యానములతో కూడినటువంటి ఆత్మజ్ఞాన పూర్వకమైనటువంటి కర్మానుష్ఠాన మార్గాన్ని మనకు ఉపదేశించినటువంటి ఆచార్య సత్తములకు, సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయిరాం.మనిషా పంచకం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. సత్య సాయి భగవానుడు శంకరుడు ఎవరు అంటే సేవకుడే నాయకుడని లోక నాయకుడే లోకేశ్వరుడని నేనేం చేయాలి అన్నవాడే శంకరుడు అవుతాడని ప్రబోధం చేశారు. శం అంటే శుభం శం అంటే మంగళం శం అంటే ఆనందం శం అంటే వెలుగు దానిని ఇచ్చేవాడు దానిని చేసేవాడు అనుగ్రహించే వాడే శంకరుడు అని స్వామి ప్రబోధం. తదనుగుణంగానే శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా. బుద్ధుడి తర్వాత వేద వాంగ్మయాన్ని ఈ ప్రపంచానికి స్పష్టంగా విపులంగా అర్థమయ్యేటువంటి రీతిలో ప్రసాదనం చేయటానికి సాక్షాత్తు పరమేశ్వరుడే సదాశివుడే శంకరాచార్య రూపంలో వచ్చి షణ్మత స్థాపన చేసి పూర్ణద్వైత భావనా స్థితిలో జీవున్ని ఆనందతాండవం చేయించాడు ఆయన. అయితే ఒక్కొక్కసారి ఈ మహాపురుషులంతా ఏమీ ఎరగనట్లుగా మాయామానుష వేషంతో సంచారం చేస్తారు. అటువంటి ఒక రమణీయ మనోజ్ఞమైన సన్నివేశమే శంకర భగవత్పాదుల జీవితంలో జరిగింది. శంకరులది కవితా హృదయం శంకరుల హృదయం అది శివానందలహరి. సరే శంకర స్వరూపమే సౌందర్యలహరి ఇటు సౌందర్యము అటు శివాత్మకము మంగళాత్మకమైనటువంటి ఈ రెండు వంశాలు కలబోసుకున్నటువంటి మహా అద్వైత పూర్ణ స్వరూపం గనుక ఆ అనుభవాన్ని సర్వజనీనం చేశారు. ప్రపంచానికి ఆ సన్నివేశాన్ని వాడుకుంటూ ఒక దివ్య బోధ చేశారు. ఏమిటి ఆ బోధ అంటే అది తర్వాత ఒక కావ్య రూపంగా మనీషా పంచకంగా ఈ ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి వచ్చింది. మనీషా అంటే జ్ఞానాధిక్యము అని అర్థం. పంచకము అంటే ఐదు స్తోత్రాలు అని అర్థం. అంటే మనీషా జ్ఞానము బుద్ధిని దాటి హృదయాన్ని దాటి ఏదైతే ఒక పూర్ణద్వైత అచల స్థితిలో మానవుడు సంచారం చేస్తాడో దాని పేరు మనీషా. నిశ్చితమైన అభిప్రాయము అని అచ్చ తెలుగులో దాని అర్థం. దానిని ఏమిటి ఆ నిశ్చితమైన అభిప్రాయం అనేటువంటి దాన్ని భగవత్పాదులు వర్ణించిన తీరు వర్ణనాతీతం. అవతార మూర్తి సైతం మానవ దేహం ధరించి వచ్చినప్పుడు మూడు గుణాలతోనూ అంటే సత్వ రజస్తమో గుణాలతోనూ కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తంగా ఉంటాడు. ఎంత సర్వజ్ఞుడు అయినా జగత్తుకు ఏదైనా మహా పరిసత్యం బోధించ తలచినప్పుడు సాధారణ మానవుడి వలె ప్రవర్తిస్తాడు. శ్రీరాముడు యోగవాసిష్ఠాన్ని శ్రద్ధగా విన్నట్లు శ్రీకృష్ణుడు విష్ణు సహస్ర నామాన్ని నిష్టగా విన్నట్లు శంకరులు పరబ్రహ్మ స్వరూపమై కూడా అద్వైత బోధను ఇట్లాగే అందుకున్నారు. ఆ సందర్భం రమణీయం మనోహరం హృదయంగమం. శిష్య సమేతంగా గంగాస్నానం అనంతరం కదులుతున్న ఆచార్య స్వామి కంటికి కటికుడు ఒకడు కనిపించాడు నాలుగు శునకాలతో. జాత్యభిమానం ప్రకటిస్తూ శంకరులవారు అన్నారు "తొలుగు తొలుగు" అని. దేనిని తొలగమంటున్నారు? దేహాన్ని తొలగమంటే మీదీ దేహమే నాదీ దేహమే రెండు అన్నమయాలే రెండు పంచభూతాల వల్లనే ఏర్పడినయి. ఇక తేడా ఎక్కడ ఉన్నది? ఆచార్యవర్య దేనిని తొలగమంటున్నారు? అన్నాడు వచ్చిన కటికుడు. పోనీ జ్ఞాన దృష్టితో చూసినా ఆత్మ నీ యందు నా యందు సాక్షి సాక్ష్యే కదా! కనుక బ్రాహ్మణ చండాల అని మీరు దేనిని చూస్తున్నారు? సూర్యుడు గంగాజలం పైన మురికినీటి పైన ఏకకాలంలో ప్రతిఫలించటం లేదా? ఆత్మ అంటే అద్వైత భావన కదా! ఇక తొలగవలసినది ఏది? అన్నాడు చండాలుడు. శంకర హృదయాన్ని ఈ ప్రశ్నలన్నీ జ్ఞాన కిరణాల వలె తాకినాయి. బ్రాహ్మణుడు చండాలుడు అన్న భావాన్ని పావనుడు పాపి అన్న భేదభావాన్ని ద్వంద్వాలను విడిచి సమత్వాన్ని సమభావాన్ని సమదృష్టిని ఆచరిస్తాను. మహోదాత్తమైన దివ్య బోధన అందించిన మీరు కటికులు కారు చండాలురు కారు శూద్రులు కారు మీరు సాక్షాత్తు ఈశ్వరుడే అన్యం కాదు అంటూనే అంతేకాదు సర్వ సృష్టిని ఆత్మ స్వరూపంగా చూడగలిగిన వాడు నిశ్చిత జ్ఞాని అయినవాడు ఎవరైనా సరే నాకు గురు సమానుడే సర్వకాలాల నాకు ఆరాధనీయుడే అన్నారు శంకరులు. ఇది మనీషా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యందున్న చైతన్యమే సర్వ జీవకోటి యందు ఉన్నది. అన్ని కాలాలయందు ఈ భావంతో వెలుగుతున్న తత్వజ్ఞుడు నాకు పరమ గురువే. నాకు మాత్రమే కాదు ఈ సర్వ జగత్తుకి గురువే అంటూ శంకర భగవత్పాదులు తమ ఎదుట నిలబడి దర్శనాన్ని అనుగ్రహించినది పరమేశ్వరుడే అనే స్పురణను అనుభవించారు. భేదభావం నశించిన స్థితే మనీషా. తిరుగులేని మరువరాని మహా పరిసత్యం. నిశ్చితమైన స్థిరమైన భావం. భేదం లేకపోవటమే అద్వైతం. భౌతిక స్థితిలో రెండుగా కనిపించినా ఆదిభౌతిక స్థితిలో రెండూ ఒకటేనని స్థిర చింతన కలిగినా ఆధ్యాత్మిక స్థితిలో రెండంటూ లేవని ఉన్నది ఒకటేనని ఎరుక కలగటమే జ్ఞాన లబ్ధి. సిద్ధత శుద్ధత వాటికి తోడు వినయము ఉన్నట్లయితే జీవుడు ఆనంద తారక స్థితిని అందుకోవటం ఎంతో సులభం. ఈ స్థితిని అనుభవించటం సుందరం.ఈ స్థితిలో ఆత్మానందం కలగటం శివం. ఈ స్థితిలో సంస్థితం కావటం సత్యం. ఒకే స్థితిలో అన్నిటినీ అన్ని స్థితులలో వాటిని మనీషాయత్తంగా అనుభవించగలగటం సాధ్యమేనని జ్ఞానమూర్తి అయిన శంకరులు నిరూపణ చేశారు. ఈ మనీషా పంచకం శంకర భగవత్పాదుల పరంగా ఒక మహా అమృతమైనటువంటి కావ్య సృష్టి. అయితే ఏ శాస్త్రం అయినా ఆచరణకు నోచుకోకపోయినట్లయితే అది కాలగమనంలో వెనకబడి పోతుంది. జనులు దానిని మరిచిపోతారు. కాబట్టి వేదం కానీ, ధర్మం కానీ, శాస్త్రం కానీ, వేదాంతం కానీ అనుష్టానానికి నోచుకోవాలి. అంటే ఆచరించినదే శాస్త్రం. ఆ ఆచరణాత్మకమైనటువంటి ఒక దివ్య బోధనని ఈ ప్రపంచానికి అందించటానికి సత్యసాయి భగవానుడు స్వామి అంటే జ్ఞాని వలె ఈ జగత్తులోకి వచ్చి దేశ కాల మత అతీతమైనటువంటి జాతి, కుల, మత, వర్గ, వర్ణ, భేదములు లేనటువంటి ఒక స్థిరమైన నిశ్చితమైనటువంటి భావనలో సర్వ ప్రపంచానికి అద్వైతాన్ని అనుష్టానం ప్రబోధం చేశారు. ఈ అద్వైతం ఆచరిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం, భేదభావం నశించి, తారతమ్యాలు సమసి, నీవు అధికుడివి నేను అల్పుడనన్న భావన, నీవు పుణ్యాత్ముడివి నేను పాపినన్నటువంటి ఒక తలపు, ఇవన్నీ చెరిగిపోగా పూర్ణమైనటువంటి ఆత్మ వికాసమానమైనటువంటి ఒక దివ్య పరిమళమైన అనుభూతిని, ఆ అనుభూతి నుంచి విభూతి స్థాయికి వెళుతుందని సప్రమాణికంగా సుమారు ఎనభై సంవ-- ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో డెబ్బై రెండు సంవత్సరాలు స్వామి బోధాకృతిగా ఈ జగత్తుకి ఒక వరిష్టమైనటువంటి బోధని అందిస్తూ కేవలం బోధించటం మాత్రమే కాదు తాను కూడా సర్వజనులని దగ్గర తీసుకుని, పొదువుకుని, అక్కున చేర్చుకుని, ఆనందాన్ని పంచి, ప్రేమానురాగాలని చక్కగా సమభావంతో అందరినీ అనుగ్రహించి స్వామి అద్వైత మత స్థాపనకి ఒక విస్తృతమైనటువంటి ప్రచారాన్ని స్వామి కల్పించారు. ప్రచారంతో పాటుగా ప్రతి మానవుడు స్వామిని తన వాడిగా చేసుకున్నారు. స్వామి ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవుల అన్నిటినీ కూడా తన వాటిని చేసుకున్నారు. అంటే స్వామి కంటే ముందు వచ్చిన అవతారాలన్నీ మానవుడు దేవుడు కావటం ఎట్లాగో మార్గం చూపించినాయి. ఈ మార్గంలో వెళితే నువ్వు దేవుడివయ్యే అవకాశం ఉన్నాయి. ఆ అవకాశాలు నీ దగ్గరే ఉన్నాయి. ఇదిగో ఇట్లా వెళ్ళు అని చెప్పారు. అవి కర్మ యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, యోగం కావచ్చు, జ్ఞాన యోగం కావచ్చు. సత్యసాయి భగవానుడి అవతారం మహా పరిపూర్ణం. ఎందుకని అంటే స్వామి చిరునవ్వుతో ఈ ప్రపంచానికి చేసిన బోధ. మానవుడు దేవుడు కావటం ఏమిటి? మానవుడో ప్రయత్నం చేసి దివ్యత్వాన్ని అందుకోవటం ఏమిటి? అసలు మానవుడు దివ్యుడే. మానవుడు దేవుడే. ఆ ఎరుక పొందటానికి చేసేటువంటి సాధనే అధ్యాత్మ సాధన అన్యమైనది కాదు. నిత్య జీవితము, అధ్యాత్మ జీవితము రెండూ భిన్నమైనవి కావు. అధ్యాత్మ జీవితంలో భాగం కాదు. అధ్యాత్మే జీవితం అని సప్రమాణికమైనటువంటి నిరూపణ చేసినటువంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ శంకర మనీషా పంచకం అంతా కూడా మానవుడికి స్థిరమైనటువంటి బుద్ధిని, నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని, ఏ రకమైనటువంటి భేదభావం లేని సమతా దృష్టిని, మమతని, కారుణ్యాన్ని చక్కగా బోధించేటువంటి జ్ఞాన ఖండికగా మన అనుభవంలోకి మనం తెచ్చుకోవాలి. అట్టి శంకర భగవత్పాదులకి ఆచార్య సత్తములైనటువంటి సత్యసాయి భగవానుడికి మరొక్కసారి ప్రణామం చేస్తూ మనీషా పంచకాన్ని ప్రతి జీవుడు జీవితంలో ఆచరించాలని, దానికోసమే శంకరులు ప్రబోధించారని, దానినే ఆచరణాత్మకంగా స్వామి నిరూపించారని మనం విచారణ చేసుకోవాలి. సాయిరాం.
SSSMC · audio
Advaitamrutha Dhara - 05
Advaitamrutha Dhara - 05
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 34:57
More in this series
Advaitamrutha Dhara
- 22 min 1
Advaitamrutha Dhara - 01
- 36 min 2
Advaitamrutha Dhara - 02
- 31 min 3
Advaitamrutha Dhara - 03
- 33 min 4
Advaitamrutha Dhara - 04
- 34 min 5
Advaitamrutha Dhara - 05
Now playing - 27 min 6
Advaitamrutha Dhara - 06
- 20 min 7
Advaitamrutha Dhara - 07
- 16 min 8
Advaitamrutha Dhara - 08
- 21 min 9
Advaitamrutha Dhara - 09