No transcript for this section.
శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం లోక శంకరులైన శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి అంజలి ఘటిస్తూ సత్య సాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు కృష్ణానందలహరిలో తొట్ట తొలి విభాగం అయినటువంటి సోపానం అయినటువంటి దేహంలో ఉండగానే దేహాన్ని ఆధారం చేసుకుని దేహాతీతమైన స్థితికి ఎట్లా వెళ్ళాలి? అది విచారణ. ఇది సాధారణంగా ధ్యానం చెయ్, యోగం చెయ్, ఫలానా క్రియాయోగంలో ఉండు అన్నీ ఏర్పడతాయి అనే సులువైనటువంటి జవాబు మాత్రం కాదిది. ఇది ఒక గంభీరమైన తాత్విక చింతన, ఇది ఒక నిరంతరమైనటువంటి విచార ధార. ఈ ధారణే శంకర భగవత్పాదులు దేహంతో దేహాతీత స్థితిని ఎలా పొందాలో చెప్తున్నారు. అంటే మనమంతా శరీరంలో ఉన్నాం శరీరం అంటే ఎముకలు, రక్తము, మాంసము, మజ్జ, చర్మము, అవయవాలు, కరచరణాది అవయవాలు ఇవన్నీ కలిపితే స్థూలంగా ఓ శరీరం అవుతున్నది. ఇటువంటి అనిత్యమైనటువంటి శరీరంతో నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన, దేహాతీతమైన స్థితిని ఎట్లా పొందటం? ఇది విచారణ. ఈ విచారణలో అధ్యాత్మ సాధన, విస్తృత శాస్త్ర జ్ఞానము, విపరీత భక్తి ముక్తిని ప్రసాదిస్తాయా? అంటే నేను తీవ్రంగా నలభై ఏళ్లు తపస్సు చేశాను, నేను ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాలు నేను ఓపోసన పట్టేశాను, నాకసలు భగవంతుడు అంటే విపరీతమైనటువంటి, తీవ్రమైనటువంటి, గాఢమైనటువంటి, పరిణితమైన భక్తి ఉన్నది. అంటే సాధన, జ్ఞానము, భక్తి ఈ మూడు నాకు ముక్తిని ఇస్తాయా? ఈ ప్రశ్నకి సమాధానం ఒకటే ప్రాపంచిక బంధనల నుండి భావ స్థాయిలో దూరం కానంతవరకు ముక్తి అసాధ్యం. అది, నువ్వు దేహంలో ఉన్నా దేహానికో మనసు ఉన్నది. ఆ మనసుకు ఒక భావన కల్పించగలిగిన స్థితి ఉన్నది, ఆలోచించగలిగిన నేర్పరితనం ఉన్నది. దానిని మనసుకు లోబడి చేసినంత కాలం ముక్తి లభించదు. మనసుకు అతీత స్థాయికి మనం వెళ్ళాలి. ఆత్మజ్ఞానము, భక్తి, వస్తువుల యందు ఉపేక్ష ముక్తికి మార్గాలు. అపేక్ష ముక్తిని ఇవ్వదు. ఉపేక్ష, ఉపేక్ష అంటే ఔదాసీన్యం. ఏ స్టేట్ ఆఫ్ ఇండఫరెన్స్ అంటాం. ఆ స్టేట్ ఆఫ్ ఇండఫరెన్స్ లో ఏది రానీ, ఏది పోనీ జరుగుతూ ఉంటాయి అన్నవాడు ముక్తుడే. ఇదేమిటి ఇట్లా జరిగింది? ఇదేమిటి నాకే ఎందుకు జరిగింది? మరి ఎవరికీ జరగరానిది నా ఒక్కడి కోసమే ఎందుకు ఏర్పడింది? అంటే వాడి మనసు ముక్తి వైపు వెళ్ళదు అని. ఇంద్రియ పరమైన కార్యకలాపాల యందు ఉపేక్ష ప్రధానమైనటువంటిది. ఇంద్రియ కలాపాలు ఏమున్నాయి మనకి? పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు. ఐదు, ఐదు పది. ఆ పదింటికి అధిష్టాన దైవతం మనస్సు. పది ప్లస్ ఒకటి పదకొండు. ఆ పదకొండే మన శరీరంలో ఉన్న ఏకాదశ రుద్రులు అన్నారు స్వామి. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తున్నాను అంటే శివ లింగానికి రుద్ర పూర్వకమైనటువంటి స్తోత్రం చేయటం మాత్రమే కాదు, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనస్సును నియంత్రించుకోగలిగినటువంటి ఒక అధ్యాత్మ శిఖర స్థాయి ఆ ఏకాదశ రుద్రాభిషేకం. నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలే అపేక్ష. నాకు భార్య యందు, సంపద యందు, కడుపున పుట్టిన బిడ్డల యందు, ప్రపంచము నందు, కీర్తి యందు అనేకమైన అపేక్షలున్నాయి. ఇన్ని ఉన్నవాడు ముక్తికి దారి తీయలేడు. తన ప్రయాణమంతా బంధనలోనే ఉంచుకుంటున్నాడు గనుక ఈ దేహంతో కూడి ఉన్న ఇంద్రియాలు, వాటి చరణాల వలన కలిగేటువంటి స్పందనలు ఇదంతా ఒక బంధన. ఈ బంధన నుంచి బయట పడటమే ముక్తి. జ్ఞానేంద్రియాలు ఎందుకిచ్చాడు? శబ్ద, రస, రూప, స్పర్శ ఇవన్నీ కూడా. అలాగే కన్ను, చెవి, ముక్కు, నోరు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? వీటికి అధిష్టానం అయిన మనస్సును ఎందుకు ఇచ్చాడు అంటే పరమాత్మను ఎరగటానికి మాత్రమే ఇచ్చాడు. తద్భిన్నంగా ఉన్నట్లయితే ముక్తి లభించదు. మరి దేహం లేకపోతే జీవన వ్యాపారం సాగేది ఎట్లా అని. నిజమే దేహం కావాలి. దేహమే సాధన ఆలయం, దేహమే శోధన ఆలయం. కానీ దేహము పరిమితమైనది. ఎప్పటికైనా దహింపబడుతుంది గనుక దేహం అన్నాం. ఆత్మగా ప్రాణ చైతన్యంగా ఉన్నది గనుక మందిరం అని దేహానికి అనేక పేర్లున్నాయి, విచారణ చేశాం. ఇంతకీ ఈ దేహం అంటే ఏమిటి? దేహానికి ఇంద్రియాలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ విచారణ పూర్తయినప్పుడు నేను, నాది అనే భావం నశిస్తుంది. ఆ వినాశమే ముక్తి. లేకపోతే బంధనే. అంటే దేహము మనసుతో చేసే ప్రపంచ కార్యకలాపాలన్నీ మన మానవుడిని బంధిస్తాయి. ప్రపంచాతీతంగా మనసుకు అతీతంగా చేసినట్లయితే అవే విముక్తిని కలిగిస్తాయి. శుక్ల శోణితాలు గర్భాశయ ప్రవేశంతో దేహం ఏర్పడుతున్నది. గడచి వచ్చిన జన్మల అనుభవాల ఆధారంగా వర్తమాన జీవితం ఏర్పడుతున్నది. తల్లి గర్భ వేదికపై తొమ్మిది నెలల కాలంలో మలమూత్రాది పదార్థాల మధ్య జఠరాగ్నిలో వేగుతూ ఉన్నదది. నిర్ణీత కాలంలో తల్లి గర్భం నుంచి బయట పడుతున్నది. బయట పడటంతో జీవుడి వేదన ప్రారంభమవుతున్నది. మనోవ్యధ, వ్యాధి, వియోగం, దారిద్య్రం వంటివి అనుభవంలోకి తెచ్చుకుంటున్నది దేహం.పరిణామ దశలో మానవ దేహం అత్యున్నతమైనది. ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరమోత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తి వచ్చిన జీవుడు మానవ దేహాన్ని పొందాడు అంటే అది పరిణామంలో కీలకమైన స్థాయి. అది పరమ చరమమైనటువంటి స్థాయి. అందుకే భగవద్గీతలో యోగీశ్వర కృష్ణుడు "బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" అన్నాడు. బహూనాం జన్మనాం అంతే. ఎన్నో ఎన్నెన్నో వేలాది జన్మల చిట్టచివర ఏర్పడినటువంటి ఈ మానవ జన్మలో జీవుడు అడుగుతున్నాడట, జ్ఞానం అంటే ఏమిటి అని. అంటే ఈ జన్మ వచ్చే వరకు జీవుడు జ్ఞానాన్ని గురించి ఆలోచన చేయలే. కానీ మానవ దేహం ఎందుకు ఏర్పడింది, జన్మ ఎందుకు ఏర్పడింది అంటే జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. జ్ఞానము అంటే విజ్ఞానం కాదు. జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుకే జ్ఞానం అని విచారణ. కాబట్టి, పరిణామ దశలో మహోన్నతంగా ఏర్పడినటువంటి మానవ దేహం మేధావులము అని అనుకునేవారు సైతం దేహ పరిమితిని ఎరగక దేహమే తానన్న భావనలో ఉంటారు. దేహమే తమనుగా భావించుకున్నా దేహం అంటే ఏమిటో పూర్తిగా ఎరగనందువలన కాలాన్ని వృధా చేసుకుంటారు. దేహ స్థితే ఎరగకుండా ముక్తిని దేని నుంచి పొందుతాం? రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, పంచభూతాల వంటి పదార్థాల సమ్మేళనమే ఈ శరీరం. అందుకనే ఒక విచారణ ఉన్నది. "పంచభూతములు నిశాకరుండు దివాకరుడు నీ తను సప్తకంబ యేని ఈ శరీరంబు నీదే కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్టాత యవ్వడో యజమానుడ నిన అష్టమ తనువు వాడు కెరలి నన్నేమి మిగిల్చితినా సామి బిట్టు నేనన్నది అభిజ్ఞ గాక" ఆ నేనుగా మిగిలిన ఈ జీవుడు ఎవరు అంటే పరమాత్మ స్థూలమైనటువంటి, విశ్వవ్యాపకమైనటువంటి, విష్ణుత్వంతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క గుర్తే జీవుడిగా భావన చేయమన్నది వేదాంతం. అందుకనే భగవాన్ రమణ మహర్షి అంటారు, "మనందరము శవ వాహకులమే. మన శరీరాన్ని మనమే మోసుకుంటూ తిరుగుతుంటాం. మరణించాక దాన్ని మరొకరు మోస్తారు. అంతే తేడా. దేహమే నేనన్న భావన నుంచి దూరం కావటమే ముక్తి" అన్నారు. కాలిగోటి నుంచి తల వెంట్రుక వరకు అంతా దుర్గంధమే. ఎముకల గూడు ఈ శరీరం. ఇదే యదార్థ స్థితి. ప్రాపంచికంగా ఎంత వైభవం అనుభవించినా ప్రాణం పోయినప్పుడు శరీరం నిస్సహాయ స్థితిలో ఒక నిమజ్జనానికి లోనవుతుంది. తనివి తీరా, కరవు తీరా, కనులార చూడబడినటువంటి శరీరం శవంగా ఉన్నప్పుడు భయం కొలుపుతుంది. కట్టుకున్న భార్య సైతం గడప దాటి బయటకు రాదు. ఎంత త్వరగా దహనం చేద్దామని బంధుజనం ఆతృత పడతారు. ఇంత అనిత్యమైనటువంటిది ఈ దేహం. అయితే శరీరంలోని సర్వ శక్తులు, ప్రజ్ఞలు, అది అనుభవించిన సుఖ సంతోషాలు, స్థితులు, గతులు, చీకటి వెలుగులు, జయాపజయాలు, మానావమానాలు, ఎత్తుపల్లాలు అన్నీ ఏమైపోతున్నాయి? అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. కథ కంచికి చేరుతున్నది. ఇది దేహ పరిమితి. వైరాగ్యంగా తోచినా నిజానికి యదార్థ స్థితి ఇంతే. జీవితాన్ని స్పష్టంగా, అర్థవంతంగా, ఆనందంగా, శాంతిగా జీవించాలని అనుకునే వారికి తమ దేహం ఎంత అశాశ్వతమో అనేటువంటి ఒక నిత్య స్ఫురణ కలిగి ఉండాలి. మృత్యు నీడ ఎప్పుడు పారుతుందో తెలియదు గనుక చాలా అప్రమత్తంగా ఉండాలి. దేహాన్ని సర్వోపాయంగా వాడుకోవాలి. దానిని రక్షించుకోవాలి. యుక్తాహార యుక్త విహారాలలో దానిని పోషించి పాలించుకోవాలి. ఎందుకని? దేహం అశాశ్వతం అంటున్నాం, దేహం పోతుంది అంటున్నాం, ఎక్కువ కాలం ఉండదు అంటున్నాం, అయినా దీనిని పాలించుకోవాలంటున్నాం, కారణం ఏమిటి అంటే, ఎంత అశాశ్వతమైనా దేహమే ఆయుధం గనుక, దేహమే ఆధారం గనుక. పాలించాలి, పోషించాలి, నిలబెట్టుకోవాలి కానీ బంధన పెంచుకోకూడదు. బంధన వలన బాంధవ్యము, దాని వలన మోహము, దాని వలన వ్యామోహము, వ్యామోహం వలన వ్యసనము ఏర్పడి తెంచుకోలేనిదిగా దేహం వదుల్చుకోలేని గుదిబండగా తయారవుతుంది. అయితే దాని పట్ల అపరిమితమైన ప్రేమ, ప్రేమ వలన కలిగేటువంటి అహంకారం తగ్గించుకోవాలి. పరిమిత దేహంలోనే అపరిమిత శక్తి ఉన్నదని, అశాశ్వత స్థితి నుండి శాశ్వత స్థితిలోకి చేరాలని, దేహాన్ని ఉదాత్త పరికరంగా వాడుకుంటూ దేహంలోనే వెలుగుగా ఉన్న మూలాన్ని వెదకాలని, ఆ వెదుకులాటే సాధన అని గ్రహించాలి. అందుకై ఇంద్రియ నిగ్రహం చేయాలి. ఆనందానికి నిత్య చైతన్యానికి దారులు వెతుక్కోవాలి. ఆ అన్వేషణ ఆంతరంగికంగా సాగాలి. దేహాన్ని ఆధారం చేసుకుని దేహాతీతమైన స్థితిని, శక్తిని అందుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. సుఖం, సంతోషం దేహానికి సంబంధించిన విషయాలు. శాంతి, ఆనందం మనసుకి, హృదయానికి సంబంధించినవి. ఇవన్నీ దేహంగానే దానిలో ఉండగానే పొందాలి. ఎట్లా? విచారణ చేద్దాం, చేయాలి. శంకర భగవత్పాదులు ఒక కరుణాలయం. ఆ కరుణాసుధా సింధువు అనుగ్రహించిన ఆనంద బిందువే తదుపరి ప్రబోధ సుధగా మనం విచారణ చేయాలి. అంటే సత్యసాయి భగవానుడు కూడా పరిమితి ఎరిగి చేయాలిమన అవసరాన్ని మన శక్తిని బట్టి మన కార్యక్రమాలు రూపొందించుకోవాలి. మనం చేయవలసినవన్నీ కూడా దేహాతీతమైన భావనలో చేయాలి. అన్నీ పరమేశ్వర కైంకర్యంగా చేయాలి. పరమేశ్వరుడికి నివేదన చేయాలి. పరమేశ్వర ప్రీత్యర్థమే మానవ జీవితం సాగాలి అని స్వామి చేసినది. ఇది దివ్య ప్రభోద సుధాకరం గనుక శంకర భగవత్పాదులకు సత్యసాయి భగవానుడికి అభేదమైన అద్వితీయ అద్వయ రమణీయ మనోజ్ఞ స్థితిలో మరొక్కసారి ప్రణామం చేస్తూ శంకర అద్వైతామృత ధారలో, విచార ధారలో, సత్యసాయి భగవానుడి దివ్య ప్రభోద ధారలో అంతర్లీనమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలోనే దేహాత్మ, దివ్యాత్మ ఈ రెండింటి గురించిన విచారణ మనం స్పష్టంగా చేసుకోవాలి. ఏది దేహాత్మ? ఏది దివ్యాత్మ? ద్వంద్వంలో చేస్తున్నవాడు, చేస్తున్న పని ఉన్నాయి. చేస్తున్నవాడు నేను చేస్తున్నాను అంటూనే ఉన్నాడు. పైకి నిజమేనని అనిపించిన అధ్యాత్మ భూమికలో ఇది నిజం కాదు. సూర్యోదయానికి కారణం సూర్యుడు కాదు. సూర్యోదయం సూర్యుడి ద్వారా జరిగింది, అంతే. ఆత్మ విషయంలోనూ అంతే. ఆదిత్యుడు కర్మలు చేయటం లేదు కానీ కర్మలకు సాక్షిగా మాత్రం ఉంటున్నాడు. ఆత్మ సైతం సాక్షిభూతమే. ప్రపంచ కార్యకలాపాలకు అది కారణమూ కాదు, నిజానికి ప్రేరణమూ కాదు. నిప్పుల కొలిమిలో ఉన్న ఇనుమును కొలిమి బయట ఉన్న మరొక ఇనుప వస్తువు కొడుతున్నప్పుడు అగ్నికి బాధ లేదు కదా! వడ్రంగి దుంగను కోస్తున్నప్పుడు కట్టెలో దాగిన అగ్నికి ఆతన కలగటం లేదు కదా! ఆ విధంగానే దేహంలో ఉన్న ఆత్మ దేహం అనుభవిస్తున్న సుఖదుఃఖాలను అనుభవించటం లేదు. అది సాక్షిగానే ఉంటున్నది. దేహం చేస్తున్నాను అనుకుంటున్నదా? అది ఒక కట్టే. అనుకుంటున్నది దేహం కాదు, అనుకుంటున్నది మనసు. చూస్తున్నది మాత్రం ఆత్మ. దేహాత్మకే విహారమూ, వ్యవహారమూ ఉన్నాయి. దివ్యాత్మకు ఇవేవీ లేవు. శరీర వృక్షం మీద ఉన్న రెండు పక్షులలో ఒకటి ప్రపంచాన్ని చూస్తున్నది, అనుభవాలు పొందుతున్నది, ఆవేదన, ఆందోళన చెందుతున్నది, ఆనందాన్ని కూడా ప్రకటిస్తున్నది, అప్పుడప్పుడు. రెండవ పక్షి మాత్రం ఇవేవీ పట్టనట్లు తనను తానే చూసుకుంటున్నది. దివ్యాత్మ బింబం అయినట్లయితే దేహాత్మ ప్రతిబింబం. మనసు ఒక అద్దం. రాత్రిపూట ఇంట్లో దీపం వెలుగుతుండగానే దొంగ వస్తువులను దొంగిలించుకొని పోతున్నాడు. దీపం దొంగను ప్రోత్సహించటమూ లేదు, ప్రతిఘటించటమూ లేదు. జరుగుతున్న దానికి సాక్షి మాత్రంగా ఉంటున్నది. ఆత్మ సైతం ఇంతే. మనిషి పుట్టిననాడు, గిట్టిననాడు ఇంట్లో ఉన్న దీపం మోదాన్ని గానీ, ఖేదాన్ని గానీ అనుభవించటం లేదు. దేహం ఒక గూడు, ఆత్మ ఆ గూటిలో దీపం. సూర్యచంద్రాదులన్నీ వెలిగేవి. ఆ పై వెలిగించేవి. ఆత్మ మాత్రమే వెలుగు. ఆత్మ స్వయం ప్రకాశం. అది శుద్ధ చైతన్యం. అది వెలుగు మూలం. శుద్ధ చైతన్యపు వెలుగులో ఇంద్రియాలు తమ పనులు సక్రమంగా చేయగలుగుతున్నాయి. బయట వెలుగు అంధుడికి అక్కర రావడం లేదు. లో వెలుగు వల్లనే అంధుడు సైతం వస్తువులను తన అనుభవ పరిధిలోకి తెచ్చుకుంటున్నాడు. స్వయం ప్రకాశి అయిన ఆత్మ అన్నిటినీ వెలిగిస్తున్నది. ఆత్మ స్వభావం, దేహం ప్రభావం. ఇదే అధ్యాత్మ. సత్యసాయి భగవానుని అనేక దశలలో స్వామి అవతార కాలంలో వేసిన ప్రశ్న, అధ్యాత్మ అంటే ఏమిటి? తొలినాళ్లలో స్వామి ఇచ్చిన జవాబు, అధ్యాత్మ అంటే ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళటం. మళ్ళీ పదేళ్లకు ఇదే ప్రశ్నకి స్వామి ఇచ్చినటువంటి జవాబు, ప్రభావం నుంచి స్వభావంలోకి వెళ్ళటం అధ్యాత్మ. మళ్ళీ పదేళ్లకు అదే ప్రశ్నకు స్వామి జవాబు, మానవుడు మానవుడిగా జీవించడమే అధ్యాత్మ. పశు ప్రవృత్తిని వదిలి పశుపతి స్థాయికి వెళ్ళే ప్రస్థానమే అధ్యాత్మ జీవన విధానం అని సత్యసాయి భగవానుడు మనకి ఒక ఉపదేశం చేశారు. అందువల్లనే ఒక క్షణకాలం మీద లిప్త కాలం మీద శుద్ధ చైతన్యాన్ని ఏకాగ్రం చేయగలిగితే యోగశాస్త్రం ప్రకారం సాధకుడి కుడి చెవిలో నాదం వినిపిస్తుంది. ఆగకుండా, అదే అనాహత నాదం. ఆలోచనా తరంగాలు ఆగినప్పుడు శుద్ధ చైతన్యంలో మన మనస్సు లీనమవుతుంది. లీనం కావటమే లయ. నిస్తంద్ర మంద్రంగా వినిపించే అనాహత నాదం సానందభరితం. యోగి ఈ మధుర నాదాన్ని వింటూ ఉంటాడు. ఇదే నాదానుసంధానం. ఈ యోగ స్థితిలో నిలకడ చెందితే ఈ నాదమే చివరకు సమాధి స్థితికి దారితీస్తుంది. ప్రాణంలో పుట్టినటువంటి నాదం నాడీ మండలం ద్వారా ప్రయాణించి నాదంగానే అనుభవంలోకి వస్తుంది. ఈ ప్రక్రియ అంతా వెలుపల జరగటం లేదు. ఎవరి ప్రమేయం లేకుండానే వారి వారి లోలోపలే జరుగుతూనే ఉన్నది. కుండలినీ జాగృతం కావటానికి ఈ నాదానుసంధాన యోగమే తొలి మెట్టు. మనోశుద్ధికి, స్థిమితత్వానికి, స్థిరత్వానికి, నిశ్చల స్థితికి ఈ యోగమే కారణం. యోగ సాధనలో ఇది తొలి విజయం. మనసు లోలోపల మిగిలిన మూల వాసనల వలననే ఆలోచనలు పుడుతున్నాయి. ఈ వాసనల వలన కలిగే దోషాలు తొలగాలంటే యోగాగ్రత ఏర్పడాలి. ఏకాగ్రత కంటే యోగాగ్రత విశిష్టమైనది. ఇది ఏకాగ్రత వలననే సాధ్యం. దీనికి మూలం శుద్ధమైనటువంటి మనసే. వాద్య పరికరాల వలన కలిగే శబ్దం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్నిస్తుంది.ఇంద్రియ సుఖాన్నిస్తుంది శుద్ధానందం యోగం వలన కేల్ మాత్రమే కలుగుతుంది శుద్ధ మనస్సు తన మూలమైన హృదయంతో లీనమైనప్పుడే ఆత్మానందం కలుగుతుంది దాని పేరే బ్రహ్మానందం ప్రాపంచిక వస్తువుల నుండి ఆలోచనలు దూరంగా వైదొలగినప్పుడే అనాహత నాదం ఆత్మ గీతమై సాగుతుంది శ్రీకృష్ణుడు వినిపించిన వేణుగానం అంటే ఇదే అదే అనాహత నాదం అదే ఆనంద నాదం మనసు నిశ్చలమైనప్పుడు మాత్రమే అది సంభవం నాదము అంతరంగ కాంతి యోగించినప్పుడు అంతరంగమే బహిరంగం అని చూపించగలదు అంధుడు అనుభవించే ఆనంద స్థితి ఇదే చూపించవలసిన కన్ను సహకరించకపోయినా చూపుకు కారణమైన మూల చైతన్యం ఆ భారాన్ని వహిస్తున్నది తోలు కన్ను చేస్తున్న దానికంటే లోకన్ను శక్తివంతంగా ఉన్నది ఈ మహత్తర స్థితిలో ఇంకా లోకం తాలూకు అనుభవాలకు చోటెక్కడ భౌతిక భోగ స్థితిలో ఈ అనుభవం ఉండదు యోగ స్థితిలో ఈ అనుభవం లేకుండానూ ఉండదు అంతరంగ శ్రవణం అంతరంగ దర్శనం సర్వాత్మ బుద్ధి సమ్యక్ దృష్టి సమ్యక్ జ్ఞానం ఇవన్నీ యోగికి సొంతం యోగ పద్ధతులు సాధనా రీతులు సాధనా స్థితుల వలన యోగ సిద్ధి కలుగుతుంది అయితే ఇది పూర్ణ సిద్ధి కాదు దృశ్యం దాటాలి శబ్దం దాటాలి వాటి వలన కలిగే ఆనందానుభవాలు దాటాలి అనుభూతిని దాటాలి అన్నిటికీ మూలమైన సచ్చిదానందంగా మిగలాలి వెలగాలి వెలిగించాలి వస్తువు వలన కలిగే సుఖాన్ని మనసు ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది ఇప్పటివరకు జరిగిన విచారణ ఫలితంగా మనసు వస్తువు నుంచి దూరమై నాదానుసంధానం జరిగి దేహాత్మ దివ్యాత్మగా అనుభవంలోకి వస్తుంది మాట మలగుతుంది మౌనం వెలుగుతుంది ఎరుక ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తుంది ఇదే నిజమైన యోగం అయితే మనోలయ సాధన సాగించటం సాధించటం ఎట్లా సాధనా మార్గము సాధనా విధానము ఏమిటి లయమన్నా లీనమన్నా ఒకటేనా మనోలయం సాధకుడిని ఎటువైపు తీసుకెళుతుంది ఈ విచారణ సాధకుడు తీవ్రంగా చేయాలి ఇదేదీ చేయకుండా ముక్తిని మోక్షాన్ని బ్రహ్మానంద పదాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని జీవుడు ఆశించిన ట్లయితే అవి లభిస్తాయా ప్రయత్నం చేయాలి తీవ్ర ప్రయత్నం చేయాలి దేహాత్మ భావనను త్యాగం చేయాలి బంధువులను బంధుత్వాలను వాటికున్న పరిమితులను ఎరిగి ప్రవర్తించాలి సంపద దేహము కీర్తి భౌతికమైన అనేక విషయాల పట్ల పూర్ణ అవగాహన ఉండాలి దానివలన మాత్రమే భౌతిక అవస్థకు అతీతమైనటువంటి పూర్ణత్వాన్ని మనం అనుభవించగలం అందుకే సత్యసాయి భగవానుడు మనకు అనేక సందర్భాలలో "యదృశ్యం తన్నశ్యం" అంటూ చెప్తూ వచ్చారు అంటే ఏది కనబడుతున్నదో అది నిజం కాదు ఏది కనపడవలసి ఉన్నదో అది కనపడటం లేదు కనుగొనవలసిన దానిని కనుక్కున్నప్పుడు మాత్రమే దానిని పొందినప్పుడు మాత్రమే మనకి పూర్ణ ఆనంద తారక స్థితి అనుభవంగా ఏర్పడుతుందంటారు భగవాన్ అందుకనే కరుణాలయమైనటువంటి శంకర భగవత్పాదులు మార్గోపదేశం చేస్తున్నారు అచ్చమైన యోగ స్థితిలో ఈ బోధనను వినాలి ఆలపించాలి అనుభవించాలి అనుభూతి చెందాలి విభూతి స్థాయికి వెళ్ళాలి అందుకనే సత్యసాయి భగవానుడి అవతారంలో మణిమాణిక్యాల కన్నా వస్తువుల కన్నా స్వామి అనుగ్రహించిన విభూతికి ఏది సంకేతం అది ఇష్టార్థము మోక్షార్థము రెండింటినీ ఇటు పదార్థంగా కనిపించిన విభూతి స్థాయికి నడిపిస్తుంది గనుకనే సత్యసాయి భగవానుడు అనుగ్రహించినటువంటి విభూతి ఈ లోకానికి లోకాతీతమైన దానికి పూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన శక్తి ఉన్నది కనుకనే స్వామి విభూతి ప్రసాదనం చేస్తూ మనందరికీ కూడా దేహ శుద్ధిని ఆత్మశుద్ధిని మనో నైర్మల్యాన్ని చిత్తశుద్ధిని ఏకాగ్రతని యోగ స్థితిని ఏకకాలంలో అనుభవించి పరిపూర్ణ మహా పరిపూర్ణ అవతార మూర్తిగా మన మధ్య నడయాడారు అందువలననే సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ మనోలయ సాధనలో అంతరంగ శుద్ధి కలగాలని శుద్ధ చైతన్యం వైపు అడుగు వేయాలి అంటే మనసుకు ఒక పూర్ణత్వం కలగాలని మనోలయాన్ని గురించిన విచారణ దానికి భక్తి జ్ఞానము అనేటువంటి రెండు మార్గాలు ఉన్నాయని స్వామి మనకు విశదీకరించినట్లే ఈ ధ్యానం అంటే ఏమిటి ఇది నిజంగా ఒక యోగమేనా ఈ విచారణ కూడా చేసుకోవాలి యోగము అంటే కూడి ఉండటం దేనితో కూడి ఉండటం దేనితో కూడి ఉంటే మనకు ఆనందం కలుగుతుందో అదే నిజమైన యోగం ఆ విచార ధారలో ధ్యానం అంటే ఏమిటో వివరిస్తున్నారు శంకర భగవత్పాదులు ధ్యానం అంటే చేసేది కాదు దేనినో చూపించేది కాదు అసలు నిజానికి ఏమి చేయకపోవటమే ధ్యానం ధ్యానమే ధ్యానం అంటున్నారు సత్యసాయి భగవాన్ బయట నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నమే ధ్యానం అంటున్నారు మన స్వామి బయట ఉన్నది లోపల ఉన్నది ఏమిటి ప్రతిబింబం నుంచి బింబం వైపు చిటారు కొమ్మ నుంచి మూలంలో ఉన్న వేరు వైపు పయనిస్తూ వస్తువులను వదులుకుంటూ వస్తు మూలంలోకి వెళ్లి శాస్త్రీయ ప్రక్రియ ధ్యాన మార్గంగా పరిణమిస్తున్నది నేను బ్రహ్మమును అనే స్థిర భావన కలిగినప్పుడు మనో చిత్త వృత్తులు నశించి సద్వృత్తులు కలుగుతున్నాయి ఈ రెండింటి వలన ఎవరిమీద దేనిమీద ఆధారపడని యోగ స్థితి లభిస్తున్నది ఈ స్థితే ధ్యానం.శబ్దాలు వినటం దృశ్యాలు కనపడటం మరొకరితో మాట్లాడుతున్నట్టు అనిపించటం తమ తమ గత స్మృతులు గుర్తుకు రావటం ఒళ్ళు తూలటం బరువు ఎక్కటం తేలటం తేలిక అవటం ఇవన్నీ ధ్యానంలో అపరిపక్వత ను సూచిస్తాయి. అందుకే శంకర భగవత్పాదులు "బ్రహ్మైవాస్మీతి సద్వత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానంద దాయిని ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానంద దాయిని" అన్నారు. ధ్యానం అంటే ఏమీ కలగకపోవడం ధ్యానం అంటే ఏమీ చేయకపోవడం ధ్యానం చేసేది కాదు చూసేది కాదు ధ్యానం ఒక నిశ్చల నిరామయ స్థితి నీతో నీవు కూడి ఉండగలిగినటువంటి ఒక మహా స్థితి ధ్యానానికి ముందు దేవుడు లేడంటూ సంకల్పించుకొని ధ్యాన అనంతరం ధ్యానానుభవంగా దైవం దర్శనం ఇచ్చాడు అనుకోవటం ఆత్మవంచన జగద్వంచన. ఉన్నదనుకుంటున్న దానిని ధ్యానంలో పోగొట్టుకోవాలి కానీ లేదనుకున్న దానిని ధ్యానంలో పొందటం ఏమిటి? ఊహిస్తూ ధ్యానంలో ఏకాగ్రతతో శబ్దాల నుండి దృశ్యాల నుండి స్మృతి ముద్రల నుంచి బయటపడాలి ఇది ధ్యానం వలన మనం పొందవలసిన లాభం. శాలంకృత జగన్మోహనకారుడ్ని యత్యస్త పాదారవిందుడ్ని గోవిందుడ్ని యమునాతటిని బృందావనాంతరి నిత్య శిశువును ధ్యానానికి ముందు ఉపాసించమంటున్నారు శంకరులు. శంకరులు ధ్యాన మార్గాన్ని ఇంకా విపులీకరిస్తున్నారు. మలయ పవనంలా మందార పుష్ప పరిమళంలా దివిజగంగ నిత్యమూ కడుగుతున్న దివ్య చరణారవిందుడుగా ఉన్న కృష్ణుడిని భావించుకో. గోసమూహం మధ్య ఆనంద స్వరూపంగా ఉన్న యదునందనుడిని ఊహించుకో. దేవతల భయం పోగొట్టే ధీరుడిని గోప గోపిక గో బృందాలను సర్వదా కాచుకునే నీలమేఘ శ్యాముడిని తలచుకో ఆయనకు నమస్కరించు. వేణుగాన లోలుడిని వేణుగాన వరదాతను మనసులో నిలుపుకో. కరుణా సముద్రుడిని సహస్రకోటి మన్మధుల సౌందర్యం మూర్తిమంతమైన గోపాలుడిని హృదయంలో ధ్యానించు. ఇదంతా మనసును ఆలోచనా తీవ్రత నుండి మరల్చటం కోసమే శంకర భగవత్పాదులు ఉపదేశిస్తున్నటువంటి ఒక దివ్య సరళ ధరళ తావళ్యమైనటువంటి ఒక మార్గం. ప్రాపంచిక ఆలోచనలు వెనకబడి కృష్ణ వైభవం మీద మనసు నిలబడినప్పుడు మనసు కృష్ణమయం అవుతుంది. కొంత సమయం గడిచిన తర్వాత ప్రకృతి లేదు కృష్ణుడు లేడు అంతా శూన్యం పవిత్రం ఆనందం ఆలోచనా రాహిత్యంగా ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అదే అసలైన ధ్యానం. ఇంద్రియాలకు అతీతమైన ఆనంద స్థితి లభిస్తుంది అదే ధ్యాన పరమార్థం. రెండు కనుబొమ్మల మధ్య మనం తిలకం ధరించే చోటు ఆజ్ఞాచక్రం దృశ్యాలు కనిపించేది యోగశాస్త్రం ప్రకారం అక్కడే. దృశ్యం దగ్గర సాధకుడు ఆగిపోకూడదు దృశ్యం దాటాలి అంటారు రమణ మహర్షి. దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటే మనసు ఉన్నట్లే మనసు మలగనిదే మౌనం వెలగనిదే జాలన్-- ధ్యానం నిలవదు. ధ్యానం ధ్యాన స్థితి బలపడుతున్న కొద్దీ సాధకుడు సమాధి వైపు కదులుతుంటాడు. ధ్యానం ఏర్పడిన తర్వాత శూన్య స్థితి నిరాటంకంగా సాగాలి నిగ్రహం కావాలి. మళ్ళీ ప్రాపంచిక కార్యకలాపాల పట్ల లాలస కలగరాదు. ఇంద్రియాలు తమ వృత్తులతో మనల్ని పరిగెత్తించకూడదు. అయితే ఈ ప్రపంచంలోనే ఉన్నామే మనం ఏం చేయాలి అని? ధ్యాని ప్రపంచ కలాపల్లోనూ నిమిత్త మాత్రంగా ఉండాలి. ఏ ఆకర్షణకు లోబడక నిరామయంగా ఉండగలగాలి కర్మలన్నీ శ్రద్ధగా చేయాలి ప్రణాళికాబద్ధంగా చేయాలి ఫలితం ఆశిస్తూ చేయకూడదు. దేనితోనూ బంధం పెట్టుకోకుండా చేయాలి తృప్తుడై ఉండాలి. అలజడి ఆందోళన దరిచేరనీయక వేరొకరికి అననుకూలత కలిగించకుండా ఉండాలి. స్పష్టత ధైర్యం నాయకత్వం సేవాభావం దయాగుణం సహజ గుణాలుగా ఉండాలి. ప్రసన్నత ప్రశాంతత గంభీరత తొణకని గుణం ఉండాలి. ధ్యాని అన్నివేళలా అంతర్ముఖం అయ్యే ప్రయత్నం చేయాలి. అపేక్ష బంధన చాపల్యం అసూయ కోపం వంటివి ఏమాత్రం ఉండరాదు. అందుకనే సత్యసాయి భగవానుడు పూర్ణద్వైతమూర్తి గనుకనే దీనిని కృష్ణ ధ్యానంగా శివ ధ్యానంగా వెలుగు ధ్యానంగా అంటే జ్యోతి ధ్యానంగా ప్రపంచానికి ఉపదేశం చేశారు. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురు ఉత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించెదన్. దీన్నే ఆధునిక భాషలో స్వామి చెప్పారు వెలుగు ఉన్నదంతా లోపలే బయట ఉన్న వెలుగు లోపల ఉన్న వెలుగు వలననే కనిపిస్తున్నది. ఆ లో వెలుగే జ్యోతి అది చరాచరమైగా శ్రీమైగా పరాత్పరమైగా వాంగ్మయమైగా జ్యోతిర్మయంగా ప్రతి దేహము నందు ఉన్నది అన్నారు భగవాన్. కనుక సత్యసాయి భగవానుడు ఉపదేశించిన అటువంటి జ్యోతి ధ్యాన మార్గం అత్యున్నతమైన అటువంటి మార్గంగా మనం ఉపాసనా మార్గానికి తీసుకున్నట్లయితే భక్తి జ్ఞానాల ద్వారా మనస్సు శుద్ధిని పొంది ధ్యానియై ధ్యానం నుంచి సమాధి వైపు నడవాలి కనుక ఈ పరిపూర్ణమైనటువంటి బోధని మనం చక్కగా వాడుకుంటూ అత్యున్నతమైనటువంటి స్థాయికి మనం ప్రయాణం చేయాలి. నిజానికి ఇది ధ్యాన యోగం. జ్ఞాన యోగం ఉన్నది ధ్యాన యోగం అన్న మాట మనకు ఎక్కువ పరిచయమైన మాట కాదు. నిజానికి ధ్యాన యోగము అంటే ధ్యానమే యోగము యోగమే ధ్యానము ఇది అపూర్వమైనటువంటి అపురూపమైనటువంటి అద్వైత అచల అమృత బోధ ఇది సత్యసాయి బోధ. శంకర భగవత్పాదులకు సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయిరాం.
SSSMC · audio
Advaitamrutha Dhara - 03
Advaitamrutha Dhara - 03
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 31:08
More in this series
Advaitamrutha Dhara
- 22 min 1
Advaitamrutha Dhara - 01
- 36 min 2
Advaitamrutha Dhara - 02
- 31 min 3
Advaitamrutha Dhara - 03
Now playing - 33 min 4
Advaitamrutha Dhara - 04
- 34 min 5
Advaitamrutha Dhara - 05
- 27 min 6
Advaitamrutha Dhara - 06
- 20 min 7
Advaitamrutha Dhara - 07
- 16 min 8
Advaitamrutha Dhara - 08
- 21 min 9
Advaitamrutha Dhara - 09