Skip to content
Transcript తెలుగు
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకర భగవత్పాదాల దివ్య మహా స్మృతికి సత్య సాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ లయ యోగంతో ప్రారంభమై సమాధి స్థితి దాకా మానవుడు అంతర్గతంగా చేయవలసిన యోగాభ్యాసాన్ని ఆత్మవిద్యను అనేకమైన శాస్త్ర విషయాలను శంకర భగవత్పాదులు ఇరవై ఏడు శ్లోకాలలో ప్రపంచానికి ఒక బృహత్ యోగ విద్యగా అందించారు అది యోగ తారావళి యోగ తారావళి ఇరవై ఏడు శ్లోకాలు గురు వందనంతో ప్రారంభమై ఆత్మవిద్యను ఎరగటంతో ప్రపంచాభిమానాన్ని దాటి ప్రపంచావస్థను దాటి ప్రపంచ స్పురను దాటి జీవుడు పరిపూర్ణమైన అచల మహా స్థితిలో నెలకొంది చెందే ఒక రమణీయ సన్నివేశమే యోగ తారావళి ఇది ఒక అంతరంగ ప్రయాణం అధ్యాత్మసిద్ధి కలిగినవాడు ఆత్మానుభవం పొందిన వాడు పొందవలసినటువంటి తీరుతెన్నులను మార్గాలను ప్రపంచానికి ఉపదేశం చేసినట్లుగా సాగుతుంది అతి సుందరమైన సరళమైన సంస్కృత భాషలో భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం ఒక సమగ్ర విద్య వందే గురు నామ్ చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధి జనస్యయే జంగలికాయమాని సంసార హాలాహల మోహ శాన్యై ప్రపంచ విషయాల వలన కలిగే విషాన్ని తొలగించి జ్ఞానమే నిజ స్వరూపమని బోధించే గురు పాదపద్మాలకు నమస్సులు సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధి మేకం అన్యామహే మాన్యతమం లయానాం సదాశివుడు బోధించిన లక్షా ఇరవై ఐదు వేల రకాల లయ యోగాలలో నాదానుసంధాన సమాధి యోగమే ఉత్తమమైనది సరేచ పూరైర నిలశ్చ కుంభై సర్వాసు నాడీషు విశోధితాసు అనాహతాఖ్యో బహుభి ప్రకారైహి అంతః ప్రవర్తేత సదా నినాదః ప్రాణాయామం వలన సర్వ నాడీ శుద్ధి జరిగి హృదయంలో రకరకాల ధ్వనులతో అనాహత నాదం అనే పేరుతో నాదం పుడుతుంది నాదానుసంధాన నమోస్తుతుభ్యం త్వాం సాధనం తత్వ పదస్య జానే భవత్ప్రసాదాత్ పవనేన సాకం విలీయతే విష్ణు పదే మనోమి నాదానుసంధానమా! నీకు నమస్కరిస్తున్నాను పరమతత్వం చేరటానికి నీవు సాధనం నీ అనుగ్రహం ఉంటే ప్రాణవాయువును మనస్సును హృదయంలో లీనం చేస్తాను జలంధరోజ్జ్యానన మూలబంధాన్ జల్పంతి కంఠోదర పాయుమూలాన్ బంధత్రయేస్మిన్ పరిచీయమానే బంధః కుతో దారుణ కాలపాశాత్ మూలంలో మూల బంధనం ఉదరంలో ఓజ్జ్యాన బంధనం కంఠంలో జలంధర బంధనంగా నాడులన్నిటినీ బిగించి మరణ భయాన్ని దూరం చేసుకుంటాను ఓజ్జ్యాన జాలంధర మూలబంధైహి ఉన్నిద్రితాయాం ఉరగాంగనాయాం ప్రచ్ఛన్ముఖత్వాత్ ప్రవిశన్ సుషుమ్నాం గమాగమౌ ఉంచతి గంధవాహః మూడు బంధాలను సాధిస్తే మూలాధారంలోనే కుండలినీ శక్తి మేల్కొని ప్రాణవాయువు సుషుమ్నా నాడిలో ప్రవేశిస్తుంది ప్రాణం నిశ్చల మవుతుంది ఉత్తాపితాధార హుతాశనోల్కై ఆకుంచనైశ్వశ్వద పానవాయో సంతాపితాచ్ఛంద్ర మనః పతంతీం పీయూషధారాం పిబతీహ ధన్యః బంధత్రయాభ్యాసం వలన ప్రాణవాయువు సుషుమ్నా నాడిని దాటి సహస్రారంలోని చంద్ర కళలను తాకుతుంది బంధత్రయాభ్యాస విపాక జాతం వివర్జితాం రేచక పూరకాభ్యాం విశోషయంతిం విషయ ప్రవాహం విద్యాం భజే కేవలం కుంభరూపాం బంధత్రయాభ్యాసం పూర్ణమై రేచక పూరకాలు ఆగుతాయి మనసులోని విషయ వృత్తులు పోగా కుంభకం మిగులుతుంది అదే కేవల కుంభక యోగం అనాహతే చేతసి సవధానైహి అభ్యాస శూరైరనుభూయమాన సంస్థంభిత శ్వాస మనః ప్రచారసా ద్రుంభతే కేవల కుంభక శ్రీః మనసు అనాహత చక్రంలో ఏకాగ్రంగా నిలిపితే శ్వాసతో పాటు మనో సంచారము ఆగిపోతుంది ఇది తిరుగులేని యోగం. సహస్ర శస్సస్తు హటేషు కుంభ సంభావ్యతే కేవల కుంభయేవ కుంభోత్తమే యత్ర తురేచ పూరౌ ప్రాణస్య ప్రాకృత వైకృతాఖ్యౌ హఠ యోగంలో ఎన్ని కుంభక యోగాలు ఉన్నా కేవల కుంభకమే ఉన్నతమైనది. త్రికూట నామ్నిస్తిమితే అంతరంగే కే స్తంభితే కేవల కుంభకేన ప్రాణాని లోభాను శశాంక నాజ్యౌ విహాయ సద్యో విలయం ప్రయాతి కేవల కుంభకంలో ఉంటూ మనసును అనాహతం నుంచి ఆజ్ఞాచక్రం వరకు తెచ్చే స్తంభింపజేస్తే ప్రాణవాయువు ఆజ్ఞాచక్రంలో ఉన్న శూన్యంలో లయిస్తుంది. ప్రత్యాహృతః కేవల కుంభకేన ప్రబుద్ధ కుండల్యుపభుక్త శేషః ప్రాణః ప్రతీచీన పథేన మందం విలీయతే విష్ణు పదాంతరాళే ప్రత్యేక ప్రయత్నం లేకుండానే జరిగే కేవల కుంభకం నాదానుసంధానం కంటే భిన్నమైనది సహజమైనది. నిరంకుశానాం శ్వశనోద్గమానాం నిరోధనైహి కేవల కుంభకాఖ్యై ఉదేతి సర్వేంద్రియ వృత్తి శూన్యో మరుల్లయః కోపి మహామతీనాం కేవల కుంభకంలో మనస్సును తత్వజ్ఞానమయం చేయాలి ఇంద్రియ వృత్తులన్నీ శూన్యమై పూర్తిగా వాయులీనం జరుగుతుంది శుద్ధ జ్ఞానమూర్తులకే ఇది సాధ్యం. దృష్టి లక్ష్యాణి చిత్తబంధో దేశకాలో నచ వాయురోధః ధారణ ధ్యాన పరిశ్రమో వా సమేధమానే సతి రాజయోగే లక్ష్యం ఏకాగ్రం మనో స్తంభన దేశకాల నియమాలు అక్కరలేని ప్రాణాయామ ధారణ ధ్యానాలు అవసరం లేని ఉత్తమ యోగాన్ని రాజయోగంగా పిలుచుకోవాలి. అశేష దృశ్యోజ్జిత దుర్న్మయానాం అవస్థితానాం ఇహ రాజయోగే జాగరో నాపి సుషుప్తి భావో నో జీవితం నో మరణం విచిత్రం రాజయోగ సాధనలో నిలకడ చెంది కేవలం దృక్ స్వరూపంగా ఉన్నప్పుడు అవస్థలు ఉండవు. అహం మమత్వాద్యపహాయ సర్వం శ్రీ రాజయోగే స్థిర మానసానాం దృష్ట్వాతా నాస్తిత దృశ్య భావ సాజ్రుంభతే కేవల సంవిదేవా ఇంద్రియాభిమానము ప్రపంచాభిమానము నశించినప్పుడు దృక్ దృశ్యాలు పోయి కేవల సంవిత్ మిగులుతుంది. నేత్రేయ యోన్మేష నిమేష శూన్యే వాయుర్యయా వర్జిత రేచ పూరః మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం మనోన్మనీ సామై సన్నిధత్తాం రాజయోగ స్థితిలో కనురెప్పల కదలికలు ఉండవు ప్రాణవాయువు తీసుకోవటం వదలటం ఉండదు మనసుకు సంకల్ప వికల్పాలు ఉండవు అదే మనోన్మని అంటే ఉన్నత మనస్సు. చిత్తేంద్రియాణాం చిర నిగ్రహేణ శ్వాస ప్రచారే శమితే శమీంద్రా నివాత దీప ఇవ నిశ్చలాంగా మనోన్మనీం అగ్నదియో భవంతి శ్వాసగమనం మనోగమనం ఆగిపోయి శరీరం గాలిలో వెలిగే నిశ్చల దీపం అవుతుంది. ఉన్మన్యవస్థాదిగమాయ విద్యన్ ఉపాయమేకం తవ నిర్దిశామః పశ్యన్నుదాసీనతయా ప్రపంచం సంకల్ప మున్మూలయ సావధానః ప్రపంచాన్ని పట్టించుకోకుండా మనసులో పుట్టే సంకల్పాలను నిర్మూలించగలిగితే అదే ఉన్మనీ స్థితి. ప్రసశ్య సంకల్ప పరంపరాణాం సంభేదనే సంతత సావధానం ఆలంబ నాశాత్ అపచీయమానం క్షణైః క్షణైః శాంతిముపై ఇతి చేతః ప్రవాహంగా వచ్చే సంకల్పాలను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ ఉంటే స్థితి వలన చిత్తము నశిస్తుంది. నిశ్వాస లోపైర్నిభృతైః శరీరైః నేత్రాంబుజైరర్ధ నిమీలనైశ్చ ఆవిర్భవంతీం అమనస్క ముద్రాం ఆలోకయాము ముని పుంగవానాం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గి శరీరం నిటారుగా నిలిచి కళ్ళు అర్ధ నిమీలితమైనప్పుడు స్థితి అమనస్క ముద్ర అవుతుంది.అమీయమీంద్రా సహజామనస్కా అహం మమత్వే శిథిలాయమానే మనోతిగం మారుతవృత్తి శూన్యం గచ్ఛంతి భావం గగనావశేషం. ముద్రలో అహంకారం, మమకారాలు కుప్పకూలుతాయి. భావము మనస్సును దాటి శూన్యంగా ఉండిపోతుంది. నివర్తయంతిం నిఖిలేంద్రియాని ప్రవర్తయంతిం పరమాత్మయోగం సంవిన్మయీం తాం సహజామనస్కాం కదా గమిష్యామి గతా అన్యభావః. సహజ అమనస్క స్థితిలో ఇంద్రియాలు మరలి పరమాత్మతో యోగం తరలి వస్తుంది. ప్రత్యగ్విమర్షాతిశయేన పుంసాం ప్రాచీనగంధేషు ఫలాయితేషు ప్రాదుర్భవేత్ కాచితజాడ్యనిద్రా ప్రపంచచింతాం పరివర్జయంతి. మనసులోని పూర్వ వాసనలన్నీ నశించి, ప్రపంచాన్ని గురించిన ఆలోచనలు వదిలిపోగా జడత్వము ఉండదు. స్థితే యోగనిద్ర. విచ్ఛిన్నసంకల్పవికల్పమూలే నిశ్శేషనిర్మూలిత కర్మజాలే నిరంతరాభ్యాసనితాంతభద్రా సా జృంభతే యోగిని యోగనిద్రా. సంకల్ప వికల్పాలకు మూలమైన అవిద్యను, ప్రారబ్ధ కర్మలను నిర్మూలించి శుభప్రదమైన యోగనిద్రను పొందాలి. అదే అమదానంద ఆత్మానుభూతి. విశ్రాంతిమా సాజ్యతురీయతల్పే విశ్వాద్యవస్థాత్రితయోపరిష్ఠే సంవిన్మయీం కామాపి సర్వకాలం నిద్రాం సఖే నిర్విషనిర్వికల్పాం. అవస్థాత్రయాన్ని దాటి తురీయమనే శయపై జ్ఞానమయమైన నిద్రను వికల్ప రహిత స్థితిలో ఎప్పుడూ నిద్రించగల యోగం లభించాలి. ప్రకాశమానే పరమాత్మభానౌ నశ్యత్యవిద్యా తిమిరే సమస్తే అహో బుధా నిర్మలదృష్టయోపి కించిన్న పశ్యంతి జగత్సమగ్రం కించిన్న పశ్యంతి జగత్సమగ్రం. పరమాత్మనే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అవిద్య అనే చీకటి తొలగిపోయింది. జ్ఞానదృష్టి ఉండి జ్ఞానికి ప్రపంచం ఏమాత్రం కనిపించటం లేదు. పూర్ణాద్వైత అనుభవం రససిద్ధమైంది. శంకర భగవత్పాదుల యోగతారావళి, సత్యసాయి భగవానుడు తమ దేహంతో చేసిన కేవల కుంభక యోగము రెండూ ప్రపంచానికి నిదర్శన పూర్వకం. సదాశివ బ్రహ్మేంద్రుడు, శ్యామాచరణ లాహిరి, భగవాన్ రమణ మహర్షి, మన కాలంలో భగవాన్ సత్యసాయి కేవల కుంభక యోగంలో వీరందరూ తమ శరీరాన్ని నిలబెట్టుకొని శుద్ధత్వాన్ని, సిద్ధత్వాన్ని, సంసిద్ధత్వాన్ని ప్రపంచానికి తిరుగులేని స్థితిలో ప్రమాణ పూర్వకంగా నిరూపించి, తాము దేహాతీత సంచారులమని ప్రబోధించినటువంటి దివ్య క్షణాలు ఇవి. ఇంతటి మహత్తరమైనటువంటి కేవల కుంభక యోగాన్ని జగత్తుకి అనుగ్రహించి, స్థితిలో సంచారం చేసిన ఆచార్య సత్తములైన శంకరులకు 'అహం సత్యబోధకః' అన్న సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయిరాం.
SSSMC · audio

Advaitamrutha Dhara - 08

Home

Advaitamrutha Dhara - 08

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 16:17

More in this series

Advaitamrutha Dhara

9 episodes · 4 hr 4 min

  1. 22 min 1

    Advaitamrutha Dhara - 01

  2. 36 min 2

    Advaitamrutha Dhara - 02

  3. 31 min 3

    Advaitamrutha Dhara - 03

  4. 33 min 4

    Advaitamrutha Dhara - 04

  5. 34 min 5

    Advaitamrutha Dhara - 05

  6. 27 min 6

    Advaitamrutha Dhara - 06

  7. 20 min 7

    Advaitamrutha Dhara - 07

  8. 16 min 8

    Advaitamrutha Dhara - 08

    Now playing
  9. 21 min 9

    Advaitamrutha Dhara - 09