Skip to content
Transcript తెలుగు
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం [పాట] నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి అంజలి ఘటిస్తూ సత్యసాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శంకర వాంగ్మయమంతా కేవలం వేదాంత భూమికకు చెందినదేనని అనుకుంటాం కానీ శంభోర్ మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా శంకరుడు సరస్వతీ స్వరూపం. ఆయన ఆచార్య సత్తముడు సర్వజ్ఞ పీఠాధిరోహణం చేసినటువంటి పూర్ణాత్మ. కాలడి నుంచి ప్రారంభమై కేదారం వరకు సాగినది అనంత సరస్వతీ ప్రవాహమే శంకర భగవత్పాదుల వాంగ్మయ సృష్టి. అటువంటి జ్ఞానవాదిగా భావించబడినటువంటి భగవత్పాదులు భక్తి ప్రధానమైన స్తోత్ర గ్రంథాలు వ్రాసి ఉంటారా? అన్న ప్రశ్నకు వారే తమ వివేక చూడామణి లో ఇట్లా అంటారు. భక్తి ద్వారా జ్ఞానమును సంపాదించి మోక్షమును పొందవచ్చును అని. అంటే మోక్షం పొందాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానము భక్తి రెండూ భిన్నం కావు రెండు స్థితులని ముందే చెప్పుకున్నాం. కాబట్టి భక్తి జ్ఞానముల ద్వారా మోక్షాన్ని పొందాలి అని శంకరుల ప్రతిపాదన. సౌందర్యలహరి శివానందలహరులను వ్యాఖ్యానించుకునే ముందు శంకర హృదయాన్ని అర్థం చేసుకోవాలి శంకర వాంగ్మయాన్ని లోలోతుల అధ్యయనం చేయాలి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్ర భాష్యము మూడింటిని ప్రస్థానత్రయం అంటాం. వీటిపై శంకరుల వ్యాఖ్యానం సంపూర్ణం సాధికారం ప్రామాణికం సనాతనం కానీ నిత్య నూతనం అది సంప్రదాయగతము ప్రసన్నము గంభీరము శుద్ధము వేద సమానము శంకరుల తాత్విక దృష్టి ప్రమాణ ప్రధానం వాద ప్రధానం అభిమానము పక్షపాతము ఉన్నట్లయితే శృతుల అర్థము ఒక జన్మ వ్యర్థమైన సాధకుడు ఎరుగలేడు. ఎవరి యందు నిరాదరణ కానీ నిరాకరణ గాని చూపక శృతులను అర్థం చేసుకోవాలంటారు శంకరులు. దీనికి సమత్వ ఏకత్వ దృష్టి ఉండాలి శంకరుల దృష్టి నిజానికి వైజ్ఞానికం. అజ్ఞానాన్ని పోగొట్టడమే విజ్ఞాన లక్ష్యం. సాఫల్యం పొందితే అదే జ్ఞానం. వాస్తవిక దృష్టి పదార్థ మూలాన్వేషణ పరమార్థ చింతన యదార్థ దర్శనానికి దారి తీయాలి. ద్వైతం నుంచి అద్వైతంలోకి పయనించాలి అన్నిటినీ కాదనుకుంటూ ఏమీ లేదనుకుంటూ. దృష్టి లోపం వలన సృష్టి లోపభూయిష్టంగా కనిపిస్తుంది. శాస్త్రం అంటే జ్ఞాపకమే ఇంతకు ముందే వస్తువు ఉండి కాలగమనంలో రూపాంతరం చెంది విశ్వంగా మారింది. విషయాన్ని పరిశోధన ద్వారా గుర్తించి మళ్ళీ మనకు తెలియజేస్తున్నాడు శాస్త్రవేత్త. ఇదే విజ్ఞాన పరిధి అది పరిమిత పరిధి ప్రశ్నిస్తూ జిజ్ఞాస రేకెత్తిస్తూ శోధిస్తూ సాధిస్తూ పదార్థాన్ని పరిచయం చేస్తున్నది విజ్ఞాన శాస్త్రం. ఇదే విషయాన్ని ప్రమాణం ద్వారా అనుభవ రస సిద్ధం చేసి పదార్థము బ్రహ్మమే అంటున్నాడు జ్ఞాని. ఇక విభేదానికి ఆస్కారం లేదు కదా బొమ్మ బురుసుల వంటి స్థితే జ్ఞానిది విజ్ఞానిది. కర్మ నిష్ఠ జ్ఞాన నిష్ఠ రెండు ముఖాలు హేతువును ప్రశ్నిస్తూ సమాధాన పడిన హేతువాదికి ప్రమాణాన్ని అనుసరించి అంగీకరించిన వాడికి భేదం ఎక్కడ అని ప్రశ్నిస్తారు భగవత్పాదులు. ఆధునికులందరూ శంకరులు కేనోపనిషత్ మీద చేసిన వ్యాఖ్యానం చదివితే శంకరులు ఎంత హేతువాదో తెలుసుకుంటారు. నిజానికి సత్యసాయి భగవానుడు అన్నది కూడా ఇంతే "science and spirituality are not contradictory to each other, they are complimentary to each other" ఎక్కడ విజ్ఞాన శాస్త్ర భావన అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రారంభం అవుతుంది. రెండూ ఒకదానితో ఒకటి విడదీయరానటువంటి అనుబంధంతో కూడి ఉన్నాయి అంటారు భగవాన్ బాబా. హేతువాదానికి నిరూపణే బలం తర్కానికి బుద్ధే బలం యదార్థమును అనుభవించడానికి హృదయం ప్రధానం కనబడుతున్న దానిని కాదనుకోమనలేదు నిప్పు మంచు వలె ఉన్నది అగ్నికి ప్రకాశం లేదు అని ఎవరన్నా అంటే ఖండించమన్నారు. వస్తు స్థితి సత్యమే అయినా దానికంటే వస్తు మూలమే నిత్యమూ సత్యమూ అన్నారు. బ్రహ్మానుభవం కలిగే వరకు ప్రపంచ భావన సత్యమే అలాగే అనుకుంటున్నాం కదా. రాగద్వేషాలను వదులుచుకొని నిశ్చల నిర్మల మనసుతో విషయాన్ని విశ్లేషించుకోవాలి. చూడండి నేను చేస్తున్నాను అంటే కర్తృత్వ భావం నేనే చేస్తున్నాను అంటే అహంభావం నేను మాత్రమే చేయగలను అంటే అహంకారం ఎవరో చేయిస్తున్నారు నేను చూస్తున్నాను చూస్తున్న నేను కంటే చూపిస్తున్న నేను అసలు నేను అనుకుంటే అది అహం స్పురణ. అధ్యాత్మ విద్య యోగశాస్త్రము విజ్ఞాన దృక్పథం ఉంటే ప్రపంచం ఆనందధామ అవుతుంది సర్వ సృష్టి ప్రశాంత నిలయం అవుతుంది. అభ్యుదయ దృష్టి సత్యనిష్ఠ శీలము అహింస ధర్మనిష్ఠ ఉన్నట్లయితే మనిషి మనీషి ఋషి రాజర్షి మహర్షి బ్రహ్మర్షి కాగలుగుతాడు. విజ్ఞానం ఒక క్రియాశక్తి జ్ఞానం అనుభూతిమయం రెండిటి మధ్య సమన్వయం సాధించుకోవాలి సంఘర్షణకు తావులేని విధంగా సాధనగా సాగాలి.మైత్రి ముదిత కరుణ ఉపేక్ష వంటివన్నీ బ్రహ్మ భావనలే వీటిని జీవితంతో అనుసంధానం చేసి అనుష్ఠానం చేయాలి అనుభూతిని పొందాలి. బోధ సమగ్ర బోధ సమ్యక్ బోధ అద్వైత భావన సమదృష్టి ఏర్పడుతుంది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే స్థిర భావన కలుగుతుంది. కారణంగా జాతి, మత, కుల, వర్గ, వర్ణ భేదం నశించి మానవత్వం పరిమళిస్తుంది. అందరం సమానం అనుకుంటూనే భావాన్ని జీవితంలో ఆచరణ పూర్వకంగా అనుభవించమంటుంది అద్వైతం. అద్వైతం స్థిరవాదం కాదు అది ఒక స్థిమిత వాదం, సమతావాదం, నిత్య నవతావాదం. నేపథ్యంలో సౌందర్యలహరిని, శివానందలహరిని మనం అర్థం చేసుకోవాలి. భాష, భావం, శిల్పం, శైలి, అలంకారం, శాస్త్రం, మంత్రం, తంత్రం, యంత్రం, భక్తి, రక్తి, ముక్తి, వైరాగ్యం, సాధన, అన్వేషణ, సాఫల్యం అనబడేటువంటి పదహారు కళల దివ్య ఆవిష్కరణే స్వాధ్యాయం. అనితర సాధ్యమైన శంకర మేధని శంకర హృదయంతో మన హృదయాన్ని అనుసంధానం చేసి లహరులపై మన ప్రస్థానం సాగాలి. సౌందర్యలహరిని స్పురించాలి అంటే ఇంతటి నేపథ్యం కావాలి. శివానందలహరిని అనుభవించాలి అంటే పూర్ణ హృదయం కావాలి. అందుకనే సత్యసాయి భగవానులు తమ ఉపన్యాసాలలో శంకర వాంగ్మయాన్ని, శంకర మేధని అమితంగా ప్రస్తావిస్తూ ఉండేవారు. అందునా స్వామి భజగోవిందం మీద చేసిన వ్యాఖ్యానం నిరుపమానమైనటువంటి వ్యాఖ్యానం. ఒక భగవత్ స్వరూపం మరొక ఆచార్య సత్తముడి యొక్క భావనా స్థితికి ఒక విస్తృతమైన, గంభీరమైనటువంటి వ్యాఖ్యానం చేసిన ఒక రమణీయ ఆర్ద్ర సన్నివేశం అది. సౌందర్యలహరిని ఇప్పుడు మనం విచారణ చేద్దాం. అందుకనే ఇక్కడ మనం అనుకోవాల్సింది "జయతు జయతు శంకర భారతి" అంటే శంకర వాంగ్మయానికి జయమగు గాక. వాంగ్మయము అంటే వాక్కు. వాక్కు అంటే అగ్ని స్వరూపం. మూలాధారం నుంచి ప్రారంభమై వాయువు తన ప్రయాణాన్ని సాగించి యోగ భూమికలో విశుద్ధ స్థాయికి చేరుకున్నప్పుడు అంటే విశుద్ధ చక్రం దాకా చేరుకున్నప్పుడు అది వాక్కుగా వెలువడుతూ ఉన్నది. అదే సౌందర్యలహరి. అమ్మవారిని శంకర భగవత్పాదులు జగన్మాతను ఒక విశిష్టమైన, వినూత్నమైనటువంటి రీతిలో సంభావించినటువంటి, ఆవిష్కరించినటువంటి దివ్య సౌందర్యమే సౌందర్యలహరి. అందుకనే స్వామిని గురించి మనం ఎప్పుడనుకున్నా సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం అనుకుంటాం. సౌందర్యలహరి ఏమిటి విచారణ చేస్తే సుధాధారా సారైశ్చరణ యుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాం నాయం అసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మజ్జుష్ఠ వలయం స్వమాత్మానం కృత్వా స్వపిశీ కులకుండే కుహరిణీ కుండలినీ మహాశక్తినంతా కూడా ఒక అత్యద్భుతమైనటువంటి కవితా రూపంలో ఆవిష్కరించినటువంటిదే సౌందర్యలహరి. సౌందర్యలహరి ఎంత అందమైన పేరు! శంకర భగవత్పాదులు అనుభవించిన అందుకున్న అనుభూతికి సుందర కవితా రూపమే సౌందర్యలహరి. బ్రహ్మము నాతోనే ఉన్నాడన్న సమయ మత వాదానికి వ్యాఖ్యానం సౌందర్యలహరి. స్వామి అనేక సార్లు మీ వెంట, మీ జంట, మీ ఇంట, మీ కంట ఉంటాను అని చెప్పటం ఇదిగో ఇది బ్రహ్మము నాతోనే ఉన్నాడు అన్న భావన కలిగించడమే. తమ గురువులైన గౌడపాదుల వారి శుభగోదయ స్తోత్రం పై సోదాహరణ వ్యాఖ్యానమే సౌందర్యలహరి. జగన్మాత సౌందర్య స్తుతి వైభవము మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరా, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు అనబడేటువంటి ఆరు చక్రాలను అధిగమిస్తూ ఏడవదైన సహస్రార చక్రం నందు సంస్థితము చేయించే అంతరంగ ప్రయాణ యోగ భోగము కలబోసుకున్న యోగ విద్య సౌందర్యలహరి. అద్వైతమనే ఆత్మవిద్య, యోగవిద్య కలిపి రమణీయ కవితా ప్రవాహమైనది సౌందర్యలహరి. నూరు శ్లోకాల నిండా మంత్ర, తంత్ర, యంత్రాత్మక విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి కుండలినీ జాగృతిని శంకరులు అనుభవ రస సిద్ధం చేసి శతసహస్ర పత్రసుందరి అమ్మవారు. ఆమె సగుణ, ఆమె నిర్గుణ. సాకార నిరాకారాలలోనూ పరిపూర్ణంగా అనుభవించవలసిన మహా త్రిపురసుందరి. ఆమెను గురించిన తలుపులన్నీ సౌందర్యలహరులే. వంద శ్లోకాలలో మొదటి నలభై ఒక్క శ్లోకాలు ఆనందలహరిగా, మిగిలినవన్నీ సౌందర్యలహరిగా లోకంలో ప్రసిద్ధం. భక్తి, సమయమతం, అద్వైతం కోణంలోనైనా సర్వ సల్లక్షణంగా, సమస్త శక్తిమంతంగా, సౌందర్య సార సర్వస్వంగా, ఆవిష్కృతమైన సౌందర్యలహరి మహత్వ, కవిత్వ, పటుత్వ స్వరూపం. సత్యసాయి భగవానుని వలె కర్మ, భక్తి తమంతట తాము ముక్తిని ఇయ్యలేవు. వాటికి జ్ఞానం తోడు కావాలి. ఇంతకి ముక్తి అంటే ఏమిటి? జీవాత్మ, పరమాత్మలు ఏకం కావటమే. దీనిని సాధించాలి అంటే విద్య కావాలి, మార్గం తెలియాలి.కర్మ భక్తి జ్ఞాన యోగాలు మూడు కలిసిన విద్య కావాలి. నిజానికి అదే పూర్ణ విద్య, అదే శ్రీ విద్య, అదే అసలు విద్య. ఇక కావలసింది మార్గం. గమ్యమా? అద్వైతం. అద్వైతం ఆచరణీయ విధానం కావాలి. దాని పేరు పూజ. ఎవరి పూజ? సర్వ సృష్టికి మూలమైన దేవీ పూజ. అంటే శ్రీవిద్యోపాసన, శ్రీచక్ర పూజ, ఇవన్నీ అద్వైత సిద్ధికి ఆనంద మార్గాలు. శివుడంటే ఆలోచన, శక్తి అంటే ఆచరణ. రెండూ విడదీయరానివి. ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన లోకానికి అక్కరకు రావు గనుక రెండింటి సమన్వయ ధార శ్రీవిద్య స్వరూపంగా, యోగత్రయ శక్తిగా శంకరులు సౌందర్యలహరిని సృష్టించారు. వేద ప్రామాణికంగా శక్తి స్వరూపాన్ని సానందంగా, సౌందర్యంగా జగత్తుకి వరదానం చేశారు భగవత్పాదులు. మాటకు మనసుకు అందరినీ, కానీ వాటి ద్వారానే ఎందుకోవలసిన నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని దేవీ పరంగా ఆమె సగుణ స్థితిలో సౌందర్య విలసితంగా, కవితా అమృతంగా శంకరులు వర్ణించారు. అది నిరుపమానమైన వర్ణన. చిచ్ఛక్తిని శ్రీవిద్య ద్వారా, శ్రీ చక్రోపాసన ద్వారా, కవితా గానం చేస్తూ అమృత భాషలో భగవత్పాదులు సాగించిన ఆనంద సౌందర్య లహరి విహారం ఒక ఆత్మానుభవాన్ని సాధకుడికి అనుగ్రహిస్తుంది. కావలసిందల్లా అనుభవించగలిగిన హృదయం, అచంచల విశ్వాసం, మూసుకోని తలుపులు, ముసురుకునే సంస్కార పవనాలు. పురాణాలు, ఉపనిషత్తులు, మహా వాక్యాలు, నానా వాదాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సౌందర్యలహరిని గాఢంగా, తీవ్రంగా అధ్యయనం చేయాలి. శక్తి లేకుండా శివుడు తన కార్యకలాపాలు సాగించలేడు. శివుడు ఏమిటి? బ్రహ్మ, విష్ణు, చంద్రుడు, కుబేరుడు, మనువు, అగస్త్యుడు, లోపాముద్ర, స్కందుడు, ఇంద్రుడు, మన్మథుడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు, వీరంతా శ్రీదేవిని అంటే శ్రీవిద్యను ఉపాసించవలసిందే. శివశక్తులకి అది ఒక కూటమి. ఒకటి లేని మరొకటి లేదు. అందువలననే దత్తత్రయీ అవతారాలలో సాయిత్రయీ అవతారాలలో రెండవది మహా పరిపూర్ణమైనటువంటి సత్య సాయి అవతారము శివశక్తి స్వరూపము. అందుకనే అది సౌందర్యలహరి. చిచ్ఛక్తి నుండి పుట్టిన పరాగ రేణువును బ్రహ్మ గ్రహించి లోకాన్ని సృష్టిస్తున్నాడు. ఒక్క శిరస్సుతో రేణువును మోయలేని విష్ణువు పదివేల శిరస్సులున్న శేషుడై మోయగలుగుతున్నాడు. పరాగ రేణువును చూర్ణము చేసి విభూతిని ధరించి శివుడు లయ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. అంటే ముగ్గురూ తమ శక్తులను ఆమె పాద పద్మ పరాగ రేణువు నుండి గ్రహిస్తున్నారు. విధంగా సౌందర్యలహరి అమ్మవారి చిచ్ఛక్తి స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రంలో బీజాక్షరాలు, అదొక తీవ్ర విచారణ. నిజానికి శంకర భగవత్పాదులు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాయలేదు. లోటును సౌందర్యలహరిని రచించి పూర్తి చేసుకున్నారు. లలితా సహస్రనామమునకు సౌందర్యలహరి శ్లోక రూపంలో ఉన్న భాష్యమే. అనేక శాస్త్రాల రహస్యం తెలిసి, కవితా అమృతం రుచి ఎరిగి, మరిగి, అనల్ప కల్పనా శక్తి కలిగి, శ్రీవిద్యను ఉపాసించాలన్న తీవ్ర కాంక్షలు ఉన్నవారికి సౌందర్యలహరి నిజానికి అసలు విద్య. అది అనుగ్రహించేది అచ్చ తెలివినే. అనేక స్థాయిలలో ఆకళింపు చేసుకోవాలి. వైకల్యం వదులుకోవాలి. కైవల్యాన్ని సాధించాలి. దేశకాలాతీతంగా భగవత్పాదులు మానవాళికి అనుగ్రహించిన సంవిత్ ఫలమే సౌందర్యలహరి. సత్య సాయి భగవానుడు మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటి మహా సాయి గాయత్రిని జగత్తుకి వరదానం చేసి సహస్ర... లలితా సహస్ర భాష్యాన్ని, సౌందర్యలహరి వ్యాఖ్యానాన్ని, యంత్రాత్మకమైనటువంటి స్థితిని సాయి గాయత్రి యందు పొదిగి తాము అధిష్టాన దేవతయై ప్రపంచానికి వరదానం చేశారు. అటువంటి జగజ్జనని సౌందర్యాన్ని పలు కోణాలలో ఆవిష్కరించి, భక్తి, రక్తి, ముక్తి రంగరించి, శ్రీవిద్యోపాసనను కవితామయమూ, సానందమయమూ అయిన దివ్య స్తోత్ర కావ్యంగా శంకరులు తీర్చిదిద్దారు. సౌందర్యలహరిలో ఏమున్నదో స్థాలీపులాకంగా విచారణ చేద్దాం. మొదటి శ్లోకంలోనే అమ్మవారి సార్వభౌమ స్థితిని బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ, సదాశివ అనే పంచమూర్తులను ఆజ్ఞాపించే సర్వాధికారిణిగా ఆమెను కీర్తిస్తారు. రెండు, నాలుగు శ్లోకాలలో అమ్మ పాద మహిమను వర్ణిస్తారు. పదిహేను, పదిహేడవ శ్లోకాలలో జనని వాగ్విలాసాన్ని బహుసుందరంగా వ్యాఖ్యానిస్తారు. ఆమె అనుగ్రహం లభిస్తే వాల్మీకి, వ్యాస, కాళిదాసు వంటి ఋషి సమానుల వలె కావ్యాలు రచించవచ్చునంటారు. ఎనిమిదవ శ్లోకంలో కుండలినీ శక్తి నిరూపణం చేస్తారు. పదవ శ్లోకంలో కుండలినీ శక్తి యొక్క ఆరోహణ, అవరోహణ వివరిస్తారు. యోగ విద్యలో ఇది ప్రధాన శ్లోకం. దేవికి ప్రపంచంతో కానీ, దాని స్థితితో కానీ సంబంధం లేకపోయినా, అంటే తాను నిమిత్త మాత్రయైనా, సాక్షిభూత స్థితిలో ఉన్నా, లోకం పట్ల తనకున్న కరుణ వలననే మళ్ళీ మూలాధారంలో సర్పం వలె కుండలినీ శక్తి రూపంగా ఉంటున్నది అని ప్రాంజలి ఘటిస్తారు. శంకరులు, మనము విధంగానే షట్చక్ర ప్రయాణాన్ని, తత్వజ్ఞాన భూమికలను, అష్టాంగ యోగాలను సమన్వయం చేసుకుంటేనే తప్ప యోగానుభవం కలగదు. పదమూడవ శ్లోకమంతా శ్రీచక్ర వర్ణనే.ఏడవ శ్లోకంలో అమ్మవారి సౌందర్య విశేషాన్ని కడు రమ్యంగా వర్ణిస్తారు. లోతుగా విచారిస్తే శ్లోకం శంకరులు అమ్మవారిని దర్శించిన వైనంగా మనకు గోచరిస్తుంది. నలభై నాలుగు, నలభై ఎనిమిది, యాభై ఒక్క శ్లోకాలు అలంకార సౌందర్య విలసితమైన కవితా ఖండికలు. అమ్మవారిని చూడవలసిన తీరుకు, చూసిన ఆచార్య స్వామి వారి అనుభూతికి అక్షర రూపాలు. ముప్పై రెండవ శ్లోకం పంచదశాక్షరీ మంత్రం. దానినే శ్రీవిద్య మంత్రంగా లోకానికి ఉపదేశించారు. శివుడు, శక్తి, కామాడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, స్మరుడు, హంస, ఇంద్రుడు, పరాశక్తులు, పరామర, హరి ఇవి పన్నెండు వర్ణాలు. అందులో శివుడు, శక్తి, కామాడు, భూమి తొలి ఖండం. సూర్యుడు, చంద్రుడు, స్మరుడు, హంస, ఇంద్రుడు రెండవ ఖండం. పరాశక్తి, మన్మథుడు, హరి మూడవ ఖండం. మూడు ఖండములకు మధ్య ఉన్న విరామ స్థానాలలో హ్రీంకారములు కూడి ఉండి పదిహేను అక్షరాలలో మహా మంత్రం ఏర్పడింది. సౌందర్యలహరి శ్లోకాలలో ఆచార్య స్వామి వారు ప్రతిష్టించిన మంత్రశాస్త్రం ఉన్నది. ఇరవై రెండవ శ్లోకంలో అద్వైత బోధను ఆవిష్కరిస్తారు ఆచార్య స్వామి వారు. తొంభై, తొంభై రెండు శ్లోకాలలో దేవీ సౌందర్యాన్ని మరలా ఆమె పాదపద్మ శోభను వర్ణిస్తారు. భక్తులు అనుభవించే ఆనందమరంద శోభను సైతం వర్ణిస్తారు. దేవీ భక్తులను అభేదంగా నిరూపిస్తారు. అంటే అది అద్వైతం అన్నమాట. పరశివావతారమైన శంకరుల వినయం మూర్తిమంతమైన శ్లోకమే వందవది. అమ్మా! నీ పరమైన మాటలతోనే నిన్ను స్తుతించగలుగుతున్నాను అంటూ శంకరులు అమ్మవారిని చేతనా రూపంగా ఉపాసిస్తారు. సౌందర్యలహరిని చదవవలసిన రీతులు ఎన్నో. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో దానిని అర్థం చేసుకోవాలి. మంత్ర-తంత్ర-యంత్రాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. విజ్ఞాన శాస్త్రము, ఆత్మవిద్య, యోగ విద్యల త్రివేణి సంగమంగా ఆనందపానం చేయాలి, ఆలోచన చేయాలి. ఆధునిక మానవుడి ప్రశ్న సౌందర్యలహరి చదివితే మాకేమి లాభం అని. అమ్మా! నిన్ను తలచు భక్తుడు శారదా, లక్ష్మీదేవిల వలె చిరంజీవి అయి ఉంటాడు. అంటే విద్యావంతుడు, జ్ఞానమూర్తి అయి బ్రహ్మ విష్ణువులకు సైతం అసూయ కలిగించే శాశ్వతత్వాన్ని పొందుతాడు. తేజస్సు, వర్చస్సు కలిగి సౌందర్యవంతుడవుతాడు. అహంకారం, మమకారములనబడే జీవ లక్షణాలను, అజ్ఞానాన్ని వదులుకొని జీవన్ముక్తుడవుతాడు. సదాశివత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అన్నివేళలా సుఖి అవుతాడు అంటున్నారు శంకర భగవత్పాదులు తొంభై తొమ్మిదవ శ్లోకంలో. శంకరులు వశ్యవాక్కు, పరావాక్కు. భగవత్పాదులు ప్రపంచానికి ఇచ్చిన మహదాశీర్వచనము, అభయ ముద్ర, ఆనంద ముద్ర, వ్యాఖ్యా ముద్ర, సర్వ శాస్త్ర సార సముద్ర సౌందర్యలహరి. ఇట్టి సౌందర్యాన్ని, అమ్మవారి జగజ్జేగీయమైనటువంటి సౌందర్యాన్ని ఒక లహరిగా, ఒక మంత్రశాస్త్రంగా, యంత్ర శాస్త్రంగా, తంత్ర శాస్త్రంగా, త్రివేణి సంగమంగా ఆవిష్కరించిన శంకర భగవత్పాదులకు, సర్వ సృష్టి అమ్మవారి మూలమే అంతా తానే అని బోధించిన సత్య సాయి భగవానునికి మరొక్కసారి ప్రణమిల్లుతూ, సాయిరాం.
SSSMC · audio

Advaitamrutha Dhara - 09

Home

Advaitamrutha Dhara - 09

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 21:38

More in this series

Advaitamrutha Dhara

9 episodes · 4 hr 4 min

  1. 22 min 1

    Advaitamrutha Dhara - 01

  2. 36 min 2

    Advaitamrutha Dhara - 02

  3. 31 min 3

    Advaitamrutha Dhara - 03

  4. 33 min 4

    Advaitamrutha Dhara - 04

  5. 34 min 5

    Advaitamrutha Dhara - 05

  6. 27 min 6

    Advaitamrutha Dhara - 06

  7. 20 min 7

    Advaitamrutha Dhara - 07

  8. 16 min 8

    Advaitamrutha Dhara - 08

  9. 21 min 9

    Advaitamrutha Dhara - 09

    Now playing