Skip to content
Transcript తెలుగు
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. మనోలయ సాధన అని మనం విచారణ చేశాం. శంకర భగవత్పాదులు మనోలయాన్ని గురించినటువంటి ఒక తీవ్ర విచారణ మన ముందుంచుతున్నారు. మనోలయము, లయము అంటే కలిసి ఉండటం. లీనము అన్నా అదే. లయము అంటే నాశనం కాదు. దేనితో కూడి ఉంటే మనకు ఆనందంతో మనం ఉండగలుగుతామో దాని పేరు లయ. మన మనస్సు విచారణ చేశాం. దాని మూల స్థానం హృదయ స్థానం కాబట్టి మనస్సు ఎప్పుడు ఆనందాన్ని పొందుతుంది అంటే మనసు తన మూల స్థానానికి చేరినప్పుడు మాత్రమే. అందుకనే శంకర భగవత్పాదుల విచారధార ఇగో ఇట్లా సాగుతూ ఉంది. ప్రాపంచిక యాతనలతో అలసి అనేక జన్మల వలన కలిగిన అనుభవాలతో విసిగిన మనస్సు సాధనా క్రమంలో ఏదో ఒకనాడు తన స్వస్థానమైన హృదయంలో నిలకడ చెందినప్పుడు అచలంగా, ఆనందంగా, స్థిమితంగా ఉంటుంది. కదలని స్థితిలో అనేక ప్రశ్నలు పుడతాయి. ఏమిటిదంతా? నేనెవరు? అనే ప్రశ్నలు బలపడుతూ మనసు మరింత నిశ్చలమవుతున్నది. కానీ, స్ప్రుహను మాత్రం నిలబెట్టుకుంటున్నది. స్ప్రుహే శుద్ధ చైతన్యంతో కలిసిన మనసుకు ఆలోచనలకు అతీతమైన మరొక ఉన్నత స్థితిని పరిచయం చేస్తున్నది. కారణంగానే తెలుసుకుంటున్న వాడు, తెలియవలసినది, తెలిసినది అనే భేదం లేని అనుభవాన్నిస్తున్నది. ఇంద్రియాలు సైతం తమ కార్యకలాపాలను నిగ్రహించుకుంటున్నాయి. తీవ్ర సాధనా స్థాయిలో ఉపసంహరించుకుంటూనూ ఉన్నాయి. ఇంత జరిగినప్పుడు ఇక మిగిలినది ఏమున్నది అని అద్వయా నంద సంస్థితే రెండంటూ లేవని ఉన్నది ఒకటే అనేటువంటి భావన స్థిరంగా నిలకడ చెందుతూ ఉన్నది. అంటే స్ప్రుహే ఎరుక అవుతున్నదన్నమాట. ఎరుకకే నిశ్చలానందము అని పేరు. సాగర సంగమం తర్వాత నది తన ఉనికిని, అస్తిత్వాన్ని, గుణాన్ని పోగొట్టుకొని తానే సముద్రంగా మారినట్లు మనసు కూడా రూపమెరుగని ఆత్మకు ప్రతిరూపంగా ఉన్నట్లు ఉంటున్నది. ఇదంతా మూల స్థానంతో ఉన్న సుదీర్ఘ సంయోగమే. సత్యసాయి భగవానుడు ఉపాసనా మార్గాలలో నిదానవతి ఉపాసనా, అన్యవతి ఉపాసనా, అంగవతి ఉపాసనా అని మనకి ప్రధానంగా బోధించారు. అంగవతి ఉపాసనా ప్రత్యక్ష ఉపాసనా, సగుణం. అన్యవతి ఉపాసనా అన్యాపదేశంగా, పరోక్షంగా చెప్పబడేటువంటి ఉపాసనా. నిదానవతి ఉపాసనా నెమ్మదిగా మనస్సును నెమ్మదించుకొని స్థిరపరుచుకొని నిశ్చితమైనటువంటి మనిషితో చల్లని ఆలోచనలతో చక్కని భావాలతో ఆత్మ వైపు ప్రయాణం చేసి దానిని మనం పొందటమే. చూడండి పాలు కాచి మీగడ తరక కట్టి దాని నుంచి మీగడ వచ్చి చిలికిన తర్వాత వెన్నై వెన్నలో నుంచి నెయ్యి రావటం ఇది క్రమ పరిణామంగా ఏర్పడేటువంటి ఒక నిదానవతి ఉపాసనా. ఇది నెమ్మదిగా జరగాలి. ఇక్కడ ఏమాత్రం వేగ ఆవేగాలు అందుకున్నా అసలు పదార్థమే చెడిపోతుంది గనుక అన్ని స్థాయిలలో బా-పాలు బాగా కాగలి. గట్టిగా తరక కట్టాలి. మెల్లగా చిలకాలి. పెరుగు అయిన తర్వాత వెన్న తీయాలి. చూశారా, ఇంత జరిగితే తప్ప. వెన్నను నెమ్మదిగా కాయాలి. ఎక్కువ కాచామా మాడిపోతుంది. తక్కువ కాచామా రుచి పుట్టదు. కాబట్టి సాధన కూడా ఇటువంటి నిదానవతి ఉపాసనాగా సాగాలి. కానీ పాలలో నుంచి వెన్న తేగలం గానీ, వెన్నలో నుంచి నెయ్యి తేగలం గానీ, నేతిలో నుంచి పాలను మళ్ళీ మనం పుట్టించలేం. అది ఒక సుదీర్ఘ ప్రయాణమైన తిరుగులేని ప్రయాణం. వెన్న మళ్ళీ పాలుగా మారే అవకాశం లేనట్లే శుద్ధ చైతన్యంతో ఒకసారి యోగించిన మనసుకు ప్రాపంచిక వస్తువుల యందు మళ్ళీ అభిమానము, ఆసక్తి కలగదు. అంతర్మధనంలో సాగే తీవ్ర విచారణ సునిశిత విశ్లేషణ వలన స్పష్టమైన, స్వచ్ఛమైన స్థితి మనకు ఏర్పడుతుంది. మనసుకు ఏర్పడుతుంది. ఆలోచనలు, సంకల్పాలు, స్మృతులు, అహంకారం వంటి వాటిని మనసు వదులుచుకుంటుంది. ఎరుక స్వయం ప్రకాశం. వెలుగులో నేను అన్న అహంకారం, నాది అన్న మమకారం మటుమాయమవుతాయి. ఇదే అహం స్పురణ. అహం స్పురణ వలన ప్రపంచ భావన నెమ్మదిస్తూ నశిస్తుంది. అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ మరొక రూపం మీద జాసను ఎలా వదులుకుంటామో విధంగానే మనసు తన మూలాన్ని గమనించుకోగలిగినప్పుడు వేరే వస్తువును గురించి ఆలోచించక నిరామయ స్థితిలో సంస్థితమవుతూ ఉన్నది. శుద్ధ ఎరుకగా ఉండిపోతున్నది. అంటే తనకంటే అన్య వస్తువే లేదన్న నిశ్చిత భావనలో నిలకడ చెంది ఉంటున్నది. అద్దం ఉన్నది గనుక ప్రతిబింబం కనబడుతున్నది. అద్దం లేకపోయినా బింబం లేకుండా లేదు కదా! ఎరుక కలిగిన తర్వాత ఇంకో వస్తు సహాయం లేకుండానే అహం స్పురణ కలుగుతూనే ఉన్నది. మనసు శుద్ధ చైతన్యంలో లీనమైనప్పుడు కలిగే అనుభవము ఇంతే. అదే అఖండ చైతన్య స్థితి. బెల్లపు గడ్డలో ప్రతి కణంలోనూ తీపి గుణంగా ఉన్నట్లు, కర్పూరం తన అణువణువునా పరిమళాన్ని నింపుకున్నట్లు ఎరుక కలిగిన జ్ఞానికి ప్రపంచమంతా ఆత్మ వలే అనుభవంలోకి వస్తుంది.భగవాన్ రమణ మహర్షిని ఒక ప్రశ్న వేశారు. జ్ఞాని కార్యకలాపాలు ఎలా ఉంటాయి అని? అసలు జ్ఞానికి కార్యకలాపాలు అంటూ ఉంటాయా అని? జ్ఞానికి కూడా కార్యకలాపాలు ఉంటాయి కానీ జ్ఞాని తన కార్యకలాపాలన్నింటినీ perfect గా చేస్తాడు, స్పష్టంగా చేస్తాడు, ఎరుకతో చేస్తాడు, స్ఫూర్తితో చేస్తాడు, విశ్వకల్యాణ కాంక్షి అయి కార్యకలాపాలని కొనసాగిస్తాడు అన్నారు. అందుకనే నిద్ర మెలకువ అనేటువంటి సంగమ కాలంలో ఎరుక కేవలం ఒక లిప్త కాలమే ఉంటుంది. లిప్త అంటే కనురెప్ప మూసి కనురెప్ప తెరిచేంత సమయం. సాధకుడు ప్రయత్నపూర్వకంగా దీనిని పెంచుకుంటూ పోవాలి. మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాధకుడి దృష్టి మరల్చడానికి మాయ ఎప్పుడూ కాచుకొనే ఉంటుంది. అప్రమత్తత సాధించుకోవటానికి సాధకుడు ధ్యాని కావాలి. అనంత అగాధ చైతన్య సాగరం మీద కనపడే అలలన్నీ ఒక వ్యక్తికి సంబంధించిన గత అనుభవాల గుర్తులే, ఇంకా వీడని ముద్రలే. అందుకే అల పుడుతూనే విరుగుతూ ఉంటుంది. పుట్టి గిట్టే కార్యకలాపం మధ్య ఉన్న విరామ సమయమే నికామ క్షణం. అదే ఆనంద బిందువు. మాయ ఆవరించినప్పుడు సముద్రము అల అని రెండుగా అనిపించినవే కనిపిస్తూ ఉన్నాయి. మాయ తొలగి అహం స్పురణ ఏర్పడినప్పుడు తేడా తొలగి ఉన్నదంతా సముద్రంగా కనిపిస్తుంది. అల లేదు సముద్రమూ లేదు అంటే అవి రెండుగా లేవు. అలలో సముద్రం, సముద్రంలో అల. అదే అద్వైతం. మనోలయం ఇచ్చేటువంటి దివ్యానుభూతి ఇటువంటిదే. చండ ప్రచండ మార్తాండ కాంతిలో ఎండమావులు పడసూపినట్లు చైతన్య భాస్కరుడు అనుభవ పరిధిలో ఉన్నప్పుడు ప్రపంచము ఒక ఎండమావి వలే కనిపిస్తుంది. శుద్ధ చైతన్యమే విశ్వ చైతన్యంగా బింబ ప్రతిబింబ భావంగా గోచరిస్తూ ఉంటుంది. అంతరంగ అనుభవాలు బలపడుతున్నప్పుడు బయట ఉన్న వస్తు ప్రపంచం తన ఉనికిని కోల్పోతుంది. అందుకే శంకర భగవత్పాదులు ప్రపంచాన్ని అద్దంలో బొమ్మ అన్నారు. దాన్నేగా దక్షిణామూర్తి స్తోత్రంలో "విశ్వం దర్పణ దృశమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" ఇది శంకర భగవత్పాదులు బింబ ప్రతిబింబ భావానికి ఇచ్చిన పరమాద్భుతమైనటువంటి నిర్వచనంగా మనం భావన చేయాలి. మనోలయం సాధించుకొని పూర్ణానందం అనుభవించే జ్ఞానికి లోపల వెలుపల నిండిన తనమే కానీ నిండుకున్న తనము లేదు. అంతా పరిపూర్ణమే. పవిత్ర గంగలో కుండను ఉంచితే ఖాళీ కుండ నెమ్మదిగా నీటితో నిండిన గంగలోనే ఉండిపోయినప్పుడు కుండ లోపల వెలుపల గంగే ఉన్నట్లుగా అఖండ ఆనందంలో మునిగిన జ్ఞానికి ఉన్నదంతా పూర్ణమే, కనబడుతున్నదంతా శూన్యమే. అలలే ఇరుగని ఆనంద సముద్రంగా, నీవు నేను అనే భేదభావం లేని అభేదిగా, పరిమితులు ఇరుగని అనుగ్రహ పారావారంగా, జ్ఞాని సర్వోన్నతుడుగా వెలుగు మూలంగా కనిపిస్తాడు. ఇంతటి ఆనందైక స్థితిని సమాధి అంటున్నారు శంకర భగవత్పాదులు. ఆనంద పారవశ్యంలో కవితా హృదయం పరవశించి సమృద్ధ భావ భాండాగారమంతా ఉపదేశ మణులతో, బోధామృతంతో లోక శంకరులైన శంకర భగవత్పాదులు ప్రబోధ సుధా బిందువులుగా వరదానం చేస్తున్నారు. స్వామి అంటారు చూడండి, "పంచుతున్న కొద్దీ పెరిగేది జ్ఞానం, పొందుతున్న కొద్దీ పొంగులెత్తేది ఆనందం" జ్ఞాన ఆనంద సుధామరందలహరి శ్రీ శంకర ప్రబోధం. సత్యసాయి ప్రబోధంలో ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకి కలుగజేశారు అంటే బంగారు కనిపిస్తున్న ప్రపంచమంతా ఒక దృశ్యం. బొమ్మను చూస్తూనే జీవితాన్ని గనక గడిపిన ట్లయితే బ్రహ్మను చూసేది ఎప్పుడు? బొమ్మలో బ్రహ్మాన్ని చూడగలిగినట్లయితే బ్రహ్మ సర్వమూ వ్యాపించి ఉన్నాడు ఇక్కడ. బ్రహ్మమును మించిన మరొక వస్తువు లేదంటూ బ్రహ్మ జిజ్ఞాస కలిగేట్లుగా జీవుడు తనను తాను సిద్ధం చేసుకోమన్నారు సత్యసాయి భగవానుడు. ప్రబోధం ఆత్మ సాధకుడైనవాడు, ఆత్మజ్ఞానాన్ని ఎరగాలనుకున్నవాడు, ఎరుకలో నిలకడ చెందుకు-చెందాలనుకున్నటువంటి వాడికి ఇది నిత్యమైనటువంటి ఒక ప్రబోధమైనటువంటి ఉపదేశనా మార్గం కాబట్టి మార్గంలో సత్యసాయి భగవానుడు ప్రవచించినటువంటి ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించి విజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపు, సుజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వైపు నడవగలిగితే అది అధ్యాత్మ జీవన ప్రస్థానంగా మనం భావన చేయాలి. మార్గోపనిర్దేశం చేసిన శంకర భగవత్పాదులకు, సత్యసాయి భగవానుడికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం. "శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం" శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి, సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శంకర భగవత్పాదుల అద్వైత విచార ధారలో మరొక్క కోణాన్ని ఆవిష్కరించుకుందాం. మేను అంటే శరీరం. నేను అంటే ఆత్మ. నేనుని వెతికి పట్టుకోవాలి. మేను యొక్క భావాన్ని దాటాలి. విచార ధారలో మనకు కనిపించే సూక్ష్మ శరీరం కాక ఇంకెన్ని శరీరాలు ఉన్నాయి అనే దాన్ని విచారణ చేస్తున్నారు శంకర భగవత్పాదులు. కనిపిస్తున్న స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉన్నది.సూక్ష్మ శరీరంలో కారణ శరీరం ఉన్నది. శంకర ప్రబోధం ఇంతటితో ఆగక మరొక శరీరాన్ని గురించి ప్రస్తావిస్తున్నది. అదే కారణ శరీరంలో దాగిన మహా కారణ శరీరం. వ్యక్తి చైతన్యాన్ని మరుగు పరుస్తున్న నాలుగు శరీరాల గురించిన విచారణ స్పష్టంగా చేసుకోగలిగితే ఆత్మ విచారణ స్పష్టమవుతుంది. రక్త మాంసాదులతో కూడిన స్థూల శరీరం మనకు పరిచయమే. సూక్ష్మ శరీరం అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు కలిసి ఉన్నది అని అర్థం. కారణ శరీరం అంటే అవిద్య, అజ్ఞానాల కలబోత. స్థూల సూక్ష్మ శరీరాలు తమ కార్యకలాపాలు నిలపివేసినప్పుడు కారణ శరీరం పనిచేయటం ప్రారంభిస్తుంది. కర్మానుభవాలు మిగిల్చే మనో ముద్రలే కారణ శరీరం. వీటన్నింటికీ మూలమే మహా కారణ శరీరం. దీనినే లోక లోకాంతర ప్రాణం అంటున్నాం. అవిద్య, అహంకారం, అజ్ఞానాల కారణంగా నిజ తత్వం మరుగున పడిపోతున్నది. ఆత్మ తత్వం అంటూ ఒకటి ఉన్నదనే స్పృహ సైతం ఉండదు. ఆత్మ తత్వమే శుద్ధ చైతన్యమే బుద్ధి విశేషంలో జీవుడిగా నేనుగా అనుభవంలోకి వస్తుంది. అనంతమైన ఆత్మ తత్వం పరిమిత దేహంలో ఒదిగి ఇమిడి ఉండి మనస్సు, బుద్ధి, చిత్తం అహంకారంగా తోస్తుంటుంది. అంటే బుద్ధే మహా కారణ శరీరం అన్నమాట. అది ప్రజ్ఞాన భూమిక. స్థితిలోనే భౌతిక, ఆధి భౌతిక స్థితులు స్పష్టమవుతాయి. వాటి పరిమితులు, వాటి స్వరూపాలు, వాటి స్వభావాలు అవగాహనకు వస్తాయి. రెండింటి గురించిన స్పష్టత కలగగానే ఆధ్యాత్మిక అనుభవం మలయ పవనంలా తాకుతుంది. ఇంకేముంది! ఆత్మ విచార మార్గం వైపు ఆలోచనలు సాగుతాయి. ఇది అంతర్ముఖ ప్రయాణానికి నాంది. తొలి ప్రయత్నంలోనే నేనెవరన్న ప్రశ్న పొడగడుతుంది. నేను కనిపిస్తున్న దేహాన్ని మాత్రమేనా? ఇది విచారణ. నేను ఎందుకు ఇక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను అంటే తత్వ చింతన చినుకుగా ప్రారంభమవుతుంది. ఇదంతా నిజానికి ఆత్మ విలాసమే. విచారణ ఇంతవరకు నేను అని భావించుకున్నవి ఏవీ నేను కాదు. వీటన్నింటికీ మూలమైన అసలు నేను ఎవరో తెలుసుకోమని జిజ్ఞాస పుడుతుంది. అది శోధనై, సాధనై, ఆత్మ అనాత్మల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించే ప్రయత్నంగా మారుతుంది. కదలికలన్నీ, విచారణలన్నీ చైతన్యంతో కూడిన మనసులో జరుగుతూనే ఉంటాయి. వస్తువుని ఒక్కొక్క దానిని కనుగొంటూ, కాదనుకుంటూ అసలు దానిని పట్టుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆత్మ విచారణ తీవ్రమవుతుంది. శుద్ధ చైతన్యం తాను కదలకుండానే ప్రతి వస్తువు నందు ప్రతిఫలిస్తూ ఉంటుంది. సూర్య కిరణాలు సూర్యుడి నుంచి భిన్నం కానట్లు. బింబం చైతన్యం, ప్రతిబింబం మాయ. సత్యసాయి భగవానుడి అవతార వైభవంలో స్వామి ఆత్మ విచారణకి ఒక గొప్ప ఉదాహరణ. తాను కూర్చున్న చోట కూర్చొని, తానున్న చోట తాను నిలకడ చింది. స్థూల శరీరంతో దర్శన, స్పర్శన, సంభాషణాదులు అనుగ్రహిస్తూ సర్వ ప్రపంచాన్ని తన దగ్గరకు ఎలా ఆరప్పించుకోగలిగారు? తాను సర్వ ప్రపంచంలో మూలనున్నా భక్తుల చెంతకు ఎలా చేరగలిగారు అంటే ఇది ఆత్మ యొక్క దివ్య ప్రభా సంపన్నమైనటువంటి ఒక భావనా స్థితి. ఇది ఒక నిరూపణ. స్వామి బింబం మనం ప్రతిబింబం. స్వామి దివ్య చైతన్యం జీవుడు ప్రతిబింబం మాయా ఆవరణం. బింబం శక్తిమయం, ప్రతిబింబం నిజానికి నిర్వీర్యం. అద్దంలో ఉన్న మనం వలె. అద్దం ముందు ఉన్న, అద్దంలో ఉన్న మన వలె. వ్యక్తి చైతన్యాన్ని ఆవహించిన శుద్ధ చైతన్యం దేహంలో ఉన్న సర్వాంగములను తమ తమ కార్యకలాపాలు కొనసాగించవలసిందిగా సిద్ధపరుస్తుంది. కనులు చూడటమన్నా, చెవులు వినటమన్నా ఇదిగో ఇటువంటిదే. నేను చూస్తున్నా, నేను చేస్తున్నానన్న దేహాత్మ భావం నుంచి చూపిస్తున్నది ఎవరు, చేయిస్తున్నది ఎవరు అనే ప్రశ్నలోకి ఆత్మ విచారణ ప్రారంభం అయి నెమ్మదిగా సాగుతుంది. అంటే ముడి సడలుతున్నది అన్నమాట. సడలుతున్నదే గాని విడివడ్డం లేదు. ఇంకా ముడి విప్పేవాడు, విప్పటం అనేవి మనసును పట్టుకొనే ఉన్నాయి. మనసెక్కడ ఉన్నది అని విచారించినప్పుడు మనసు లేనిదెక్కడ అన్న ఎదురు ప్రశ్నే అసలు జవాబు. హృదయం ఎక్కడ ఉన్నది అని వెతికితే యోగ భూమికను సైతం దాటి పట్టుకోగలిగితే కుడి రొమ్మున ఉన్నది అని స్పష్టంగా గోచరిస్తుంది. ఎట్లా ఒక గుహ వలె, ఒక ఖాళీ ప్రదేశం వలె, ఘనీభవించిన నిశ్శబ్ద మూలం వలె. అందుకనే అన్ని శబ్దాలు పుట్టే నిశబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం. నారాయణుడు ఎవరు? ఆత్మే. ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోవటమే సాధన, అదే విచారణ. విచారణలో మనస్సు మలగాలి, మౌనం వెలగాలి, అసలు నేను మిగలాలి. మాయ నుండి చైతన్యం వైపు లోచూపులు బారులు తీరాలి. విజ్ఞానం నుంచి సుజ్ఞానం, దాని నుండి ప్రజ్ఞానం వైపు ప్రయాణం సాగాలి. పదార్థం నుంచి యదార్థం వైపు విచారణ కొనసాగాలి. ప్రపంచ భావన నుంచి పరమాత్మ భావన వైపు మనసు, బుద్ధి, చిత్తం మరలాలి. అంటే ఇంకా ద్వంద్వం పోలేదన్నమాట. కనిపిస్తున్నదంతా అనేకంగా ఉన్నదన్నమాట. కానీఉన్నదంతా ఒకటే నని, ఒకటే అంతటా ఉన్నదని భావన ఎలా కలుగుతుంది? స్థితిని అందుకోవాలంటే ఏం చేయాలి? అందుకున్న దానిని అనుభవించటం ఎట్లా? సాధనలు ఏవి? సాధనా మార్గాలు ఏవి? మార్గంలోకి ఎట్లా వెళ్ళాలి? శంకర భగవత్పాదుల ప్రబోధ సుధాకరం ఆజ్యంత రమణీయం. సత్య సాయి భగవానుని దివ్య ప్రబోధం సత్య శివ సుందరాత్మకమైనటువంటి ప్రబోధ సుధామరంద బిందువును పొందటమే మనం పొందవలసినటువంటి ఆత్మైక స్థితి అదే అమృత స్థితి. అంటే నేను నుంచి నేను లోకి జీవుడు ప్రస్థానం చేయాలి. అన్నివేళలా శరీరం దగ్గరే గనక ఆగిపోయినట్లయితే శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మూల చైతన్య పదార్థం ఏమి? దానికి వైదాంతిక భాషలో ఉన్న పేరు ఏమిటంటే అది నిజమైనటువంటి వస్తువు అదే సద్ వస్తువు. కానీ అది వస్తువుగా లేదు. అన్ని వస్తువులకు అది మూలమై ఉన్నది, ఆధారమై ఉన్నది, చైతన్యవంతమై ఉన్నది, శీలవంతమై ఉన్నది, గమనానికి కారణమవుతున్నది, అన్నిటికీ మూలమదై ఉన్నది గనుక మూలాన్వేషణలో జీవుడు తన మనస్సుని, తన బుద్ధిని, తన చిత్తాన్ని, తన సాధనని, తన అన్వేషణని అక్కడ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నట్లయితే ఒక అద్వైత స్థితి మనసుకు తాకి ఒక హాయిని, ఒక తృప్తిని, ఒక ఆనందాన్ని ఇస్తుంది. అయితే అద్వైతం ఆనందాన్ని ఎట్లా ఇస్తుంది అన్నది తదుపరి విచారణ. చూడండి సత్య సాయి భగవానుడు "అందరిలో నన్ను చూడండి, నాలో అన్నిటినీ చూడండి" అని ఒక ప్రబోధం చేశారు. నాలో అన్నిటినీ అంటే స్వామిలో లేనిదంటూ మరొక వస్తువు లేదు. అన్ని వస్తువులు దాని యందు ఇమిడి ఉన్నాయి గనుక ఒక స్వామిని చూడగలిగితే, దర్శనం చేయగలిగితే, ఆంతరంగికంగా అనుభవ రస సిద్ధంగనుక అయినట్లయితే సత్య సాయి భగవానుడు సర్వవ్యాపకమైనటువంటి విరాట్ మూర్తిగా మనకు గోచరిస్తారు. అట్లాగే స్వామితో పాటుగా ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నందు స్వామిని గనుక చూడగలిగినట్లయితే అది ఒక అద్వైత భూమిక. అద్వైతం మనకు ఏమి మిగిలించింది? ఆనందాన్ని మిగిలించింది. ఆనందం పరిపూర్ణమైనటువంటి ఆందనం, స్వచ్ఛమైన ఆనందం, సుఖ సంతోషాలకు అతీతమైనటువంటి ఒక దివ్య భావన. భావనా స్థితిలోకి శంకరులు, సత్య సాయి భగవానుడు మనల్ని చల్లగా హాయిగా నడిపించు గాక అని శంకరులకు, స్వామికి మరొక్కసారి నమస్కరిస్తూ సాయి రామ్. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి, సత్య సాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ప్రతిభా మూర్తి అయినటువంటి యోగి, అవతార మూర్తి విషయాన్ని చెప్పాలి అన్న అర్థవంతంగా చెప్తాడు. దానికి పుంఖానుపుంఖంగా అనేక విషయాలు చెప్పవలసిన పని లేదు. అవసరమైన చోట కేవలం పరిమితమైన కొన్ని మాటల ద్వారా ఒక పూర్ణ వాదాన్ని శంకరులు ప్రతిపాదన చేస్తున్నారు. ఇది అర్థ శ్లోకీ అని పేరు. అర్థ శ్లోకిలో పూర్ణ వాదం అంతా ఉన్నది, అద్వైత వాదం అంతా. ప్రపంచంగా, స్థూలంగా కనబడుతున్న జగత్తు నిజంగా లేదు. జీవుడు నిజానికి బ్రహ్మమే, వేరు కాదు అంటూ శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని అర్థ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిహి బ్రహ్మ సత్యం జగన్మిధ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ప్రపంచం అంటే కనిపిస్తున్నది అంతా కదా! కనబడుతున్న దానిని లేదనటం, కనిపించనిదే సత్యం అని సమన్వయం సాధించటం ఎట్లా? సందేహం ఈనాటిది కాదు. నదులు, కొండలు, వాగులు, వంకలు, గుట్టలు, మిట్టలు, జీవులు, ప్రాణులు ఇవన్నీ లేవని అనుకోవటం అసహజం అనిపిస్తుంది కదా! ఇక బ్రహ్మయే సత్యం అన్నప్పుడు బ్రహ్మానికి ఉన్న లక్షణాలు ఏమిటి? వాటిని అర్థం చేసుకునే విధానం ఏమిటి? బ్రహ్మ కున్న మొట్ట మొదటి లక్షణం సత్ అంటే ఉనికి. ఉనికి అంటే ఇంతకు ముందే ఉన్నది అని అర్థం. అంటే సృష్టికి ముందే ఉన్నదని, సృష్టి జరగటానికి ముందు ఏదో ఒకటి లేకపోతే సృష్టి ఎట్లా ఏర్పడుతుంది? కనుక సత్ అన్నింటికీ మూలం. అన్నింటికీ, అంతటికీ అదే ఆధారం. సత్ తో పాటుగా రెండవది చైతన్యం. చైతన్యం పదార్థం కాదు. బయటకు వస్తువుగా కనపడదు. అది ఒక అంతర్ వాహిని. నడిపించే మూల శక్తి, ప్రాణాధారం. ఇంద్రియాలను కదిలించేది, సర్వవ్యాపకమైనది, అన్ని అవస్థలకు అతీతమైనది, ఉనికి ఉన్నది కనుకనే చైతన్యం ఏర్పడింది. చైతన్యం వ్యక్తి నుండి విశ్వం వరకు వ్యాపించిన అఖండ చిద్ఘనమైన శక్తి. ఇక మూడవది వెలుగు. వెలుగు అంటే వస్తువును చూడటానికి ఆధారమైనది. వెలుగు ఎక్కడ ఉన్నది? బయట, లోపల, అంతటా, అన్నిటా ఉన్నది. వెలుగు అన్నిటి మీద ప్రసరిస్తూ ప్రసరించిన చోటల్లా వస్తువును ప్రకాశింపజేస్తున్నది. ప్రకాశం కారణంగా వస్తువు యొక్క చైతన్యం దాని ఉనికి మూలం అనుభవంలోకి వస్తుంది. వెలుగు వల్ల వస్తువు యొక్క స్థూల రూపం తెలుస్తుంది.ఆపై వస్తువును గురించిన ఆలోచన, విచారణ, స్వభావ నిరూపణ ఒకదాని వెంట ఒకటి ఏర్పడి వస్తు మూలంలోకి దృష్టి పారుతుంది. బయట వెలుగు స్థూలం లో వెలుగు సూక్ష్మం. వెలుగు సకల ధర్మాలకు అఖిల్ విద్యలకు మూలం. సత్ ఉనికి చైతన్యం వెలుగుల పట్ల అవగాహన బలపడుతున్నప్పుడు జ్ఞానం పుటమరిస్తుంది. ఇక జ్ఞానం కట్టకడపటిది నాల్గవది. వివేకము, విచక్షణ కలబోసుకున్నదే జ్ఞానం. దానికి మరొక పేరు ఎరుక. స్పృహ అనంతం, ఆధ్యాత్మికం అంటే భౌతిక, ఆదిభౌతిక స్థితులను దాటిన ఉన్నత స్థితి. అంతా నిశ్చలం, నిర్మలం, నిర్మమం. స్థితి పరమానందదాయిని. పరమ చరమ స్థితే ఆనందం. ఇదే అసలు స్థితి. సుఖం, దుఃఖం, మోదం, ప్రమోదం వంటివన్నీ వస్తు పరమైనవి. అనుభవానికి లోబడినవి. ఘటనకు సంబంధించినవి. అవి మారుతూ ఉంటాయి. పరిమిత ప్రభావం కలిగి ఉంటాయి. ఆనందం అపరిమితం, మార్పెరగనిది. ఆనందం ఒక ఉదాత్త స్థాయి. వాసనారహితమైన ఆనంద నిష్ఠ జ్ఞానులకు సహజం. నిజానికి మానవ జన్మ ఎత్తిన వారందరూ సాధించుకోవలసిన పూర్ణ స్థితి ఇది. ఇదంతా బ్రహ్మకు సంబంధించిన విషయం. ఎరుక లేనివాడు కంటికి కనిపిస్తున్న వస్తు ప్రపంచమే సత్యం అనుకుంటాడు. కారణం వల్లనే తన దేహాన్ని నిత్య సత్య శాశ్వత వస్తువు అనుకుంటాడు. భావనలోనే ఉండిపోతాడు. ఆలోచన నుంచి బయటపడటం అసంభవం అనుకుంటాడు. సంభవం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి వాడు సాధకుడు అవుతున్నాడు. దేహ భావన నుండి అనంత ఆత్మ భావన లోకి ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. అంటే తన మూలాల వైపు నడక సాగిస్తూ తన బ్రహ్మ లక్షణాలను క్రమంగా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడన్న మాట. తాను బతుకుతున్న ప్రాపంచిక జీవనంతో బ్రహ్మ భావాన్ని అనుసంధానం చేసుకుంటూ అటు ఇటుగా సాధన సాగిస్తున్నాడు. కానీ సాధన తీవ్రమై నిలకడ చెందుతున్నప్పుడు తాను దేహం మాత్రమే కాదని తన మూలాలను గమనించుకున్న జీవుడినని ఒక ప్రజ్ఞను సాధించుకొని సహజ స్థితి వైపు అడుగు వేస్తున్నాడు. సాధనా క్రమంలో జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞతో కూడి అంతా ఒకటేనన్న భావన స్థిరపడుతున్నది. కనపడుతున్న ప్రపంచం కనపడని వేరొక వస్తువు వలన కనిపిస్తున్నదని స్థిమిత మనస్సు ఏర్పడగానే రెండవదంటూ లేదనిపిస్తున్నది. భావనే అద్వైతం. జగత్ మిధ్యా అంటే జగత్తు లేదని కాదు. మూలమైన శక్తివంతమైన మరొక వస్తువు వలన జగత్తు ఉన్నది అని తెలుస్తున్నది. తెలిపే వస్తువే సత్. అదే ఆత్మ, అదే ఉనికి, అదే వెలుగు, అదే ఎరుక, అంతా అదే. అర్థ శ్లోకంలో శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంత బీజాన్ని పాతి అనల్ప భావాన్ని సూత్రీకరించటం ప్రజ్ఞాన భూమిక. దాని యందు ఏర్పడినటువంటి ఒక విశిష్ట పరిణితి. అద్వైతం శూన్యవాదము కాదు, మాయావాదము కాదు, అది ఒక యదార్థ వాదం. అదొక పూర్ణ వాదం. ఆత్మైక స్థితి వైపు నడిపించే చేతనా భూమిక అద్వైతం. అచల అద్వైత అద్వితీయ రమణీయ విభూతి భూమిక అది అద్వైతం. సత్యాచార్యుడు భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయిరాం.
SSSMC · audio

Advaitamrutha Dhara - 06

Home

Advaitamrutha Dhara - 06

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 27:46

More in this series

Advaitamrutha Dhara

9 episodes · 4 hr 4 min

  1. 22 min 1

    Advaitamrutha Dhara - 01

  2. 36 min 2

    Advaitamrutha Dhara - 02

  3. 31 min 3

    Advaitamrutha Dhara - 03

  4. 33 min 4

    Advaitamrutha Dhara - 04

  5. 34 min 5

    Advaitamrutha Dhara - 05

  6. 27 min 6

    Advaitamrutha Dhara - 06

    Now playing
  7. 20 min 7

    Advaitamrutha Dhara - 07

  8. 16 min 8

    Advaitamrutha Dhara - 08

  9. 21 min 9

    Advaitamrutha Dhara - 09