No transcript for this section.
Transcript begins at 0:00.
కొంతమంది పొద్దున్నే అంటే మనం దండం పెట్టుకొని పొద్దున్నే లేచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి కుదురగా చేయకుండా వెళ్ళిపోయారనుకో దండం పెట్టుకోకుండా వెళ్ళిపోయారనుకో వాళ్ళు అపశకునం-- అంతే కాకుండా పిల్లలు కూడా దేవుడికి దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతే ఆ పరీక్ష బాగా రాయలేదు అని చెప్పి ఒక feeling అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది. అది నమ్మకం అంటారా లేకపోతే నిజమే అంటారా? అది నమ్మకమే. అది నమ్మకమే. ఎందుకంటే మనం నిద్ర లేవగానే భగవంతునికి నమస్కరించాలి అనేది ఒక క్రమశిక్షణ. ఆధ్యాత్మిక క్రమశిక్షణ. అంటే మన-- మనల్ని మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక అనంత మహాశక్తి ఏదో ఒకటి ఉంది. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు లేదు సద్గురువు కావచ్చు. వాళ్ళకి నమస్కరించి మనం గనుక ప్రారంభిస్తే వారి అనుగ్రహము, వారి శక్తి మన యందు ఉంటుందని, అది ఒక బలం. మనసుకి తెలియని బలాన్ని అది ఇస్తుంది. శక్తిని కూడా ఇస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో మనం పని చకచకా చేస్తాం. ఒకవేళ అది ఆ మీరు అడిగిన ప్రశ్న. దేవుడికి దండం పెట్టుకోకుండా లేస్తే ఏం కాదు. ఏం జరగాలో అదే జరుగుతుంది. కాకపోతే మనం ఆపాదించుకుంటాం. దండం పెట్టుకోనందువలన ఇది జరిగింది. జరిగేదేమో. భగవంతుడు మనం దండం పెట్టినందువలన ఇవ్వడు, పెట్టనందువలన ఇవ్వకుండా ఉండడు. What is destine to us we are sure to get. మనకి తప్పకుండా మనకు ఏది ప్రాప్తమో ఇది వైదాంతిక భూమిక. ఆ అది కచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకనే ఆ సద్గురువు అయిన వాడు, నిజమైన పరమహంస స్థాయికి చెందినవాడు ఏం చెప్తాడంటే గ్రహాల పని వాటి పని వాటిని చేయనివ్వండి. వాటి జోలికి మనం వెళ్ళొద్దు. భగవంతుడి అనుగ్రహం గనుక నీ యందు ఉన్నట్లయితే గ్రహాలు నిన్నేం చేయవు అంటారు. ఏం చేయవు అంటే చేయవలసినంత తీవ్రతలో చేయవు. కానీ ఆ ఫలితాలు మన మీద ఉంటాయి. ఇప్పుడు మనం వెళుతుంటాం, వర్షం పడుతుంది. తడుస్తామా తడవమా? తడుస్తాం. ఎండ వస్తుంది. ఆ ఎండిపోతామా లేదా? కానీ రెండింటికీ ఆధారం గొడుగుగా? ఆ గొడుగు భగవంతుడు. అంతే. చక్కగా ఉన్న వ్యత్యాసాన్ని ఎంత చక్కగా అంతే, అంతే. ఇదే సత్యం. రెండు గొడుగులు లేవుగా. వానలోకో గొడుగుంది, ఎండలోకో గొడుగు లేదు. ఆ గొడుగు ఏదంటే భగవంతుడు. దాని కింద మనం జీవులమంతా ఉన్నాం. భగవంతునికి నమ్మకం-- దండం పెట్టుకొని వెళితే అది ఒక మనసుకు ఒక తెలియని ధైర్యాన్నిస్తుంది. శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి మన outlook, మన approach, మన perfectionism, అవన్నీ కూడా మన వ్య-- మన చేసిన పనిలో ప్రతిఫలించి దాని results, dividends మనకు వస్తాయి. అంతే.
YouTube · audio
ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu
ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu
Source: Dharma Sandehalu on YouTube
0:00 / 2:43
More in this series
Dharma Sandehalu
-
6 min 1 నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu
-
1 min 2 ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu
-
2 min 3 టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu
-
3 min 4 కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu
-
3 min 5 నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu
-
1 min 6 గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu
-
2 min 7 ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu
Now playing -
1 min 8 శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu
-
4 min 9 నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu