Skip to content
Transcript తెలుగు
నమస్కారం అండి గురువు గారు నమస్కారం ముందుగా అసలు నమ్మకం అంటే ఏంటి? నిజం అంటే ఏంటి? నమ్మకానికి, నిజానికి ఎలాంటి వ్యత్యాసం ఉంది? మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. మ్ నిజాలన్నీ నమ్మకాలుగా మారుతాయి. నమ్మకాలన్నీ నిజమైనవి కావు. అయితే జీవితానుభవాలు-- చాలా మంది జీవితానుభవాలను మనము ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే, ఒక వంద మందిలో సుమారుగా ఒక ఎయిటీ పర్సెంట్ అంటాం. మ్ అవి గనక జరిగితే కాకతాళీయం కావచ్చు అవి. మ్ అది నెమ్మదిగా ఏమవుతుందంటే ఒక చిన్న నమ్మకంగా ఏర్పడిపోతుంది. నమ్మకం బలపడి, బలపడి, బలపడి నెమ్మదిగా అది సాంప్రదాయం అయిపోతుంది. మ్ సాంప్రదాయం కాలగమనంలో ఒక ఆచారం అయిపోతుంది. మ్ ఆచారం అలవాటు అయిపోతుంది. అలవాటు నమ్మకాల మీద, శకునాల మీద ప్రధానంగా ఆధారపడి ఉన్నప్పుడు మనిషిలో దాగి ఉన్నటువంటి ఒక భయానికి, మనిషిలో దాగి ఉన్నటువంటి పిరికితనానికి మ్ తనమీద తనకు ఆత్మవిశ్వాసం లేని తనానికి, ఇవన్నీ కూడా ప్రొద్బలం చేస్తూ ఉంటాయి. మ్ వీటిలో నుంచి అవి పుడతాయి. వాటి వలన ఇవన్నీ కూడా లోపిస్తాయి. అంటే రకంగా రెండు కూడా complimentary గా ఉంటాయి. దాని వల్ల ఇది, దీని వల్ల అది. మ్ కాబట్టి నమ్మకాలు అనేవి అనుభవాలు. అనుభవాలు ఎవరికి కలిగినయి? వ్యక్తికి కలిగినయా? మ్ వ్యక్తి సమూహాలకు కలిగినయా? అవి కేవలం కాకతాళీయంగా జరిగినయా? యాదృచ్చికంగా జరిగినయా? మ్ లేక అలా జరుగుతూ ఉన్నాయా? వీటిని జాగ్రత్తగా గమనించినట్లయితే మానవుడి మానసిక శాస్త్రాన్ని, human psychology దాన్ని study చేసినప్పుడు జీవితమంతా ఒక అద్భుత సరళ రేఖలాగా వెళ్ళాలి అని కోరుకుంటాడు. మ్ జరగదు అది. జీవితం ఎప్పుడూ కూడా transitional గా ఉంటుంది. ఒక sound wave లాగా వెళుతుంది. మ్ అంటే ఎత్తు ఉంటుంది, పల్లం ఉంటుంది, కరువే చర్చ్ ఉంటాయి, మలుపులు ఉంటాయి. దాని వెనక మెరుపులు ఉంటాయి, భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. మోదము, ఖేదము, ప్రమోదము అన్నీ ఎన్ని ఉండాలో అన్ని రసాలు జీవితంలో ఉంటాయి. మ్ అయితే జరుగుతున్నటువంటి అనేకానేక సంఘటనలని మన మనసుతో అనుసంధానం చేసినప్పుడు మనకి నమ్మకాలు ఏర్పడతాయి. మ్ ఒకటికి రెండు సార్లు, రెండుకు మూడు సార్లు. మనకే కాదు మనము అంటే ఏకాకిగా ఉండం కదా, కుటుంబంలో నలుగురు ఉంటాం. నలుగురికీ కలిపి ఇది గనక జరుగుతూ ఉన్నట్లయితే ఇక ఇహ నమ్మకాలు బలపడి పోతాయి. మ్ బలపడిపోయినటువంటి నమ్మకాలు నెమ్మది నెమ్మదిగా వేళ్ళూనుకొని మ్ అనేకమైనటువంటి శకునాలు మ్ అనేకమైనటువంటి భావాలు, జరిగేటువంటి ప్రతి సంఘటన వెనుక ఒక ఆందోళన మ్ ఒక విశ్లేషణ లేనితనం. మ్ మ్ ఒక విచక్షణ కోల్పోయేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి ఇది ఆస్తికవాదానికి సంబంధించిన విషయం కానే కాదు. మ్ కేవలం ఒక మనిషి యొక్క మానసిక పరిపక్వత మీద ఆధారపడి మ్ నమ్మకాలను నిజాలు చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. నిజంగా ఉన్న దాన్ని నమ్మకం అవునో కాదో తెలుసుకోలేని వారు ఉంటారు. మ్ నిజాన్ని నమ్మకంగా మార్చుకొని జీవితాన్ని బాగుచేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక యదార్థ స్థితికి మ్ ఒక ఊహాజనితమైన స్థితికి, రెండింటికీ మధ్య ఉండేటువంటి ఒక సంఘర్షణే నమ్మకం నమ్మకం. మ్ నమ్మకాన్ని, మామూలుగా నమ్మకానికి అనేక కోణాలున్నాయి. మ్ విశ్వాసం ఒక కోణం. అవును నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధిస్తామని చెప్పి కూడా పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. అది, అది నమ్మకం కాదు ఇక్కడ. మ్ నమ్మకాలన్నీ కూడా సమాజగతంగా జరిగేటువంటి శకునాలు, వాటివైపు సాగుతున్నటువంటి చర్చ కాబట్టి మ్ నమ్మకము అనేది ఉండాలి. నమ్మకం అంటే trust ఇవ్వాలి. మ్ విశ్వాసం ఉండాలి. అవతలి వ్యక్తిని మనం గౌరవించాలి. అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞని మనం గుర్తించాలి. అతను పని చేయగలడు అని ఒక నమ్మకం గనక లేకపోతే ఒక రాజు రాజ్యాన్ని పాలించలేడు. అవును ఒక యజమాని తన సంస్థను నడపలేడు. ఒక గృహస్తు తన సంసారాన్ని భద్రంగా నడపలేడు. మ్ కాబట్టి ఆధారం ఏమవుతుందంటే positivity తో కూడి ఉన్నటువంటి నమ్మకం, అది ఉండాలి. మ్ negativity కలిగించేటువంటి, భయాన్ని కలిగించే, ఆతృత కలిగించే, ఆందోళన కలిగించే అటువంటి నమ్మకాన్ని మనం వదిలిపెట్టాలి. అవి నమ్మకాలు కావు. మన మనస్సు మనల్ని చేసేటువంటి మోసం. గారడీ నుంచి మనం బయటపడాలి. ఇది నమ్మకానికి, నిజానికి ఉన్నటువంటి తేడా. చాలా నిజం ఎప్పుడూ కూడా మ్ నిజమేంటి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది సత్యం. నమ్మకం కాదుగా. అవును ఆకాశం నుంచి ఫ-ఫలానా రోజున ఒక ఉల్కాపతనం జరుగుతుంది. అది నమ్మకమా? నిజమా? పడేదాకా నమ్మకం. మ్ పడే-పడిన తర్వాతే నిజం. నిజం మ్ కదా! కానీ దాన్ని మనం కొట్టిపారేయలేం. పడొచ్చు, పడకపోవచ్చు. పడకపోవచ్చు గుర్రం ఎగరవచ్చు, పరిగెత్తనవచ్చు. మ్ ఇది మీమాంస, రధ్య అంటాం, మధ్యే మార్గం. మార్గంలో మనిషి బలహీనమైన మనస్సు ఉన్నటువంటి మనిషి అనేకమైనటువంటి విషయాలకి దాన్ని అనుసంధానం చేసుకొని, సత్యం తెలియక దాని నీడను చూసి భయపడతాడు. మ్ నీడ వాడికి ఒక రూపం తీసుకుంటుంది. చూడండి ఆకాశంలో మేఘం ఏర్పడుతుంది. మనం మన బాల్కనీలో కూర్చొని ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మ్ ఒకే మేఘం కాసేపు గుర్రంలాగా కనిపిస్తుంది. ఓకే కాసేపు ఏనుగులాగా కనిపిస్తుంది. కాసేపు అదేదో రథం మనం చూసే విధానం విధానం. అంటే మన మనస్సు అది map చేసుకుంటూ ఉంటుంది. మ్ కాబట్టి నమ్మకాలు, విశ్వాసానికి సంబంధించిన నమ్మకం కాక జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి నమ్మకాలన్నింటినీ గనక చూసినట్లయితే, నమ్మకాలు మనిషి యొక్క పురోగమనానికి అవి అడ్డు. మ్ మనిషి వాటన్నింటినీ అధిగమించగలడు, అధిగమించాలి.
YouTube · audio

నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu

Home

నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu

Source: Dharma Sandehalu on YouTube

0:00 / 6:13

More in this series

Dharma Sandehalu

9 episodes · 27 min

  1. 6 min 1

    నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu

    Now playing
  2. 1 min 2

    ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu

  3. 2 min 3

    టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu

  4. 3 min 4

    కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu

  5. 3 min 5

    నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu

  6. 1 min 6

    గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu

  7. 2 min 7

    ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu

  8. 1 min 8

    శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu

  9. 4 min 9

    నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu