Skip to content
Transcript తెలుగు
నమస్తే అండి హలో అండి నా పేరు చెప్పండి నేను ఎందుకు call చేస్తున్నానంటే నేను ప్రతిదానికి tension పడతాను. పని అవుతుందా లేదా అని. tension తగ్గించుకోవాలంటే ఏంచేయాలి? మూర్తి గారు మా tension తగ్గించుకోవటానికి ఒక్కటే ఒక మార్గం మనస్సుని నిగ్రహించుకోవటం. జీవితం అంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. అనుకోనిది మనకు ఏర్పడితే దాని పేరు జీవితం. అది ఎట్లా వస్తే దాన్ని అట్లా accept చేస్తూ దాంతో సమాంతరంగా గనక ఏటి వాలు ప్రయాణం అంటాం చూడండి, అట్లా చేసుకుంటే మనసుకు ఘర్షణ ఉండదు. ఉమ్ కాబట్టి మా మనసు కలిగేటువంటి ఆందోళన ఏమిటంటే మనం అనుకున్నది జరగటం లేదు ఎందుకు జరగదు అన్న అహం మనలో ఉన్నప్పుడు ఆందోళన వెలుగుతుంది. చూశారా, అహం లో నుంచి ఆందోళన పుడుతుంది. ఆందోళన లో నుంచి భయం పుడుతుంది. భయం లో నుంచి అసహనం పుడుతుంది. అసహనంలో నుంచి అశక్తత ఏర్పడుతుంది. మనసు బలహీనమైపోతుంది. కాబట్టి మన మనసు మనదే కాబట్టి దాన్ని ఎవరు నియంత్రించాలి అంటే ఎవ్వడు నియంత్రించలేడు. మన మనసును మనమే నియంత్రించాలి యదార్థమైన స్థితిని accept చేస్తూ జీవితం ఇట్లా ఉంటుంది. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఎత్తు పల్లాలు ఉంటాయి. అన్నింటిని మనం కొండ ఎక్కాం అంటే కొండ దిగాలి కదా. దిగాం అంటే అక్కడే ఉండం మళ్ళీ ఎక్కాలి. కాబట్టి యాత్ర మనం చక్కగా మన మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. దీనిని బయట వాడు నిగ్రహించలేడు. వేరే దారి లేదు. అయితే దారి ఒకటుంది. మంచి పుస్తకం చదవటం, మంచి మాట వినటం. రెండు చదువు లేనివాడు అయితే అవి చదువుకోలేడు. మాట వినగలుగుతాడు. కానీ రెండూ కూడా లేని వాడు ఏం చేయాలంటే భగవంతుడు అనే వాడు ఉన్నాడు అని నమ్మిన దేశం కాబట్టి నీకు నచ్చిన ఒక భగవంతుడి యొక్క నామాన్ని మనస్సులో గనుక "మననాత్రాయతే ఇతి మంత్రః" అని అవును మననం చేస్తూ మననం చేస్తూ, చేస్తూ ఉంటే భయం నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయి మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. దాని వలన ఇంటికి, ఒంటికి, అందరికీ సు
YouTube · audio

టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu

Home

టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu

Source: Dharma Sandehalu on YouTube

0:00 / 2:09

More in this series

Dharma Sandehalu

9 episodes · 27 min

  1. 6 min 1

    నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu

  2. 1 min 2

    ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu

  3. 2 min 3

    టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu

    Now playing
  4. 3 min 4

    కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu

  5. 3 min 5

    నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu

  6. 1 min 6

    గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu

  7. 2 min 7

    ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu

  8. 1 min 8

    శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu

  9. 4 min 9

    నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu