Skip to content
Transcript తెలుగు
అందుకే మనం ఇంట్లో నుంచి లక్ష్మీదేవిని అంటే శుక్రవారం రోజు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు అని అంటారు. అలాగే మళ్ళీ మంగళవారం రోజు ఎవరికైనా అప్పు ఉంటే రుణపడి ఉంటే గనుక ఎంతో కొంత తీరిస్తే త్వరగా తీరిపోతుంది అంటారు. దీనికి నిజంగానే శాస్త్రీయత ఉందని scientific reason ఏమైనా ఉందా? లేకపోతే మన నమ్మకం వల్లే మనం మంగళవారం రోజు త్వరగా అప్పు తీర్చడానికని ఎంతో కొంత డబ్బు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటారు. రెండు కారణాలు చెప్పారు ఇవి. దీని వెనుక logic ఉందంతే. ఉమ్. ఒక logic ఏమిటంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు మనకిచ్చినటువంటి వాడు తన అవసరాన్ని ఆపుకొని మనని కాపాడాడు. ఉమ్. మనం ఏం చేయాలి? అతని డబ్బు అతనికి అప్పజెప్పాలి. మన సాంప్రదాయంలో రుణంతో మనిషి పోకూడదు. ఉమ్. కాబట్టి ఎంత తొందరగా అప్పు తీర్చేస్తే మనమంత విముక్త-- ఇక్కడ విముక్తం అయిపోతాం. "అమ్మయ్య నేను తీసుకున్న డబ్బు వాళ్ళది వాళ్ళకిచ్చేశా. Now I am free" అనుకుంటాడు. కనుక దానికో ఒక మంగళవారం శుభప్రదమైనటువంటి వారం. ఇవ్వటంలో ఒక మంగళత్వం ఉంది. ఒక శోభ ఉంది. ఉమ్. ఏది? మనం తీసుకున్నది ఇవ్వటంలో. ఇక శుక్రవారం నాడు ఇవ్వటంలో ఏమన్నారంటే శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిందిగా మన పురాణాలు చెప్తూ వచ్చినాయి గాని- ఉమ్. -మనకు ఆరు-- ఏడు రోజులు డబ్బులు కావాలిగా. ఒక శుక్రవారం [నవ్వు] రూపాయి బిళ్ళ ఒక్కరోజే కాదుగా. ఉమ్. రోజునే ఎందుకని చెప్పారంటే అది నీ-నీకు అవసరం వస్తుందో నువ్వు గనుక చేయి జాపిన వాడికి ఇచ్చేస్తే ఒక అరగంట తర్వాత నీకు అవసరం ఏర్పడితే నీకు ఉండదు కాబట్టి- ఉమ్. -నిన్ను నీవు ముందు భద్రంగా చూసుకో. తన్ను మారని ధర్మం, మొదలు చెడ్డ బేరం ఉంటాది కదా. కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ ఆహ్ ఉండటానికి ఒక నియంత్రణ శుక్రవారం పెడితే- ఉమ్. -కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ అప్పు తీర్చే బాధ్యతని మంగళవారం గుర్తు చేస్తే రెండు ఖచ్చితంగా లౌకిక సంబంధమైన వ్యవహారం ఇది. ఉమ్. ఇది-ఇది నమ్మకము కాదు, ఇది నిజము కాదు. దీనిలో ఉన్న logic ఇంతే. ఓకే.
YouTube · audio

శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu

Home

శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu

Source: Dharma Sandehalu on YouTube

0:00 / 1:58

More in this series

Dharma Sandehalu

9 episodes · 27 min

  1. 6 min 1

    నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu

  2. 1 min 2

    ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu

  3. 2 min 3

    టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu

  4. 3 min 4

    కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu

  5. 3 min 5

    నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu

  6. 1 min 6

    గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu

  7. 2 min 7

    ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu

  8. 1 min 8

    శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu

    Now playing
  9. 4 min 9

    నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu