Skip to content
Transcript తెలుగు
[ఉపోద్ఘాత సంగీతం] ఓం శ్రీ సాయిరాం! రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా స్వామి వారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారిచే కర్మయోగం పైన ప్రసంగాన్ని వింటారు. తదుపరి స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస్ గారి అనుభవాలను మీరు వింటారు. ఇప్పుడు మీరు స్వామి వారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారిచే కర్మయోగంపై ప్రసంగాన్ని వింటారు. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రముఖ ఆయిల్ ఇండస్ట్రీ కన్సల్టెంట్ గా తమ సేవలను అందిస్తున్నారు. వారు తమకు వీలు దొరికినప్పుడల్లా కూడా స్వామి వారి అవతార వైభవాన్ని గురించి మరియు స్వామి యొక్క అవతారోద్యమాన్ని గురించి ప్రసంగిస్తూ ఉంటారు. అయితే శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగాన్ని విందామా? పరమ మహేశ్వర స్వరూపుడు, సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి మూడు యోగాలను గురించి విచారణ చేద్దాం. ప్రధానంగా కర్మ, భక్తి, జ్ఞానం మూడు ఏమిటో తెలుసుకున్న తర్వాత యోగం వైపు వెళదాం. కర్మ అంటే ప్రాపంచికమైనటువంటి కర్మలు చేయటం. కార్యకలాపాలలో మనస్సు, దేహము నిమగ్నమై ఉండటం కర్మ. కర్మ అనేక విధాలుగా ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. కొన్ని మన కోరిక చేత, మన ఆశ చేత, మన లక్ష్యం చేత, మన సమర్ధత చేత, మనకున్నటువంటి అవకాశాల వలన కర్మలు సాగుతూ ఉంటాయి. అలాగే భక్తి అంటే పరమేశ్వరుడు ఉన్నాడని, పరమేశ్వరుడికి ఒక రూపం ఉన్నదని, ఉన్నాడు, రూపం ఉన్నది గనుక ఆయనకు ఒక పేరున్నదని కాబట్టి నాకు రాముడు, కృష్ణుడు, శివుడు, సాయి అంటే ఇష్టమని భక్తి మార్గంలో జీవుడు ప్రవేశిస్తాడు, అంటే మనం ప్రవేశిస్తాం. ఇక జ్ఞాన మార్గంలోకి వెళుతున్నప్పుడు జ్ఞానము అనగానే శాస్త్రాధ్యయనం. అనేకమైనటువంటి విషయాలని స్వాధ్యాయం చేసి అంటే అధ్యయనం చేసి విషయాలను మనకు ఉన్నటువంటి మేధా పరిమితికి లోనై దానిని విచారణ చేయటం, దానిని ఒక విజ్ఞాన సర్వస్వంగా మనం భావిస్తున్నప్పుడు లోకం మనకు చాలా విషయాలు తెలుసు గనుక మనల్ని జ్ఞాని అంటుంది. కానీ మనకు-మన వరకు మనం తెలుసుకోవలసిన ఒక విషయం ఏమంటే సమస్త శాస్త్ర పరిచయాలు, దాని మీద అధికారము సంపాదించిన వాడు కూడా విజ్ఞాని అవుతాడే తప్ప జ్ఞాని కాడు. జ్ఞాని పండితుడవుతాడు. జ్ఞాని కవి అవుతాడు. జ్ఞాని అన్ని అవుతాడు. కానీ పండితుడు జ్ఞాని కావటానికి, కవి జ్ఞాని కావటానికి చాలా శ్రమ పడాలి, చాలా సాధన చేయాలి, తనను తాను సమర్పణం చేసుకోవాలి. అంటే కర్మ, భక్తి, జ్ఞాన మూడు కూడా కేవలము మనోమయంగా తనువుకి సంబంధించినవిగా ప్రపంచంలో చలామణి అవుతూ వచ్చినాయి. మరి కర్మయోగం అన్నారే, భక్తి యోగం అన్నారే, జ్ఞాన యోగం అన్నారే దేనికి దానికి ఏమిటి తేడా అని. యోగించి చేస్తే అది కర్మయోగం అవుతుంది. యోగించి చేస్తే అది భక్తి యోగం అవుతుంది. యోగించి చేస్తే, చూస్తే అది జ్ఞాన యోగం అవుతుంది. యోగించి అంటే కూడి అని అర్థం. దేనితో కూడి? ప్రపంచంలో ఉన్న వస్తువుతో మనం కూడి ఉన్నా అది ఊడిపోయేదే, చాలా కాలం ఉండేది కాదది. అంటే నీలో ఒక అంతస్సుగా, ఒక మహస్సుగా, ఒక రో-రోచిస్సుగా లోపల ఉన్నటువంటి ఒకానొక భావన, పరమాత్మ భావనతో కూడి గనుక కర్మలు చేసినట్లయితే అది కర్మయోగం అవుతున్నది. అలాగే పరమేశ్వరుడిని ద్వైతంలో అంటే రెండుగా, ద్వంద్వాలుగా ఆయన వేరు, నేను వేరు అన్న భావనలో చేస్తే అది కేవలము దైహిక, మానసిక పూజ అవుతున్నది తప్ప ఆంతరంగికమైనటువంటి, జ్ఞానపూర్వకమైనటువంటి భక్తి కానేర-అవుతున్నది-కావటం లేదు. కనుక భక్తి యోగము అంటే రూపము నందు, నామము నందు నీకు అశేషమైనటువంటి విశ్వాసం ఉన్నదో దానిని ఆధారం చేసుకుని మనకు జరిగేటువంటి లౌకిక భౌతిక వ్యాపారాలన్నీ కూడా అటువంటి రూపానికి సమన్వయం చేసి కర్మకాండ చేస్తే అది భక్తి యోగం అవుతున్నది. మరి జ్ఞాన యోగంలో ఏమున్నది అని, అక్కడ ఎవరితో కూడి ఉండాలి అని. కర్మయోగంలో ప్రపంచంతో కూడి ఉంటాం. భక్తి యోగంలో మనకిష్టమైన దేవుడితో కూడి ఉంటాం. జ్ఞాన యోగంలో మాత్రం మనతో మనం కూడి ఉంటాం. మనతో అంటే సెల్ఫ్, ఆత్మ. ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నదని, నిజానికి ఆత్మ శూన్యంగా ఉన్నదని, అదే పూర్ణంగా భాసిస్తున్నదని ఎప్పుడైతే మనకు ఒక అనుభవం ఏర్పడుతుందో అది జ్ఞాన యోగంగా పరిణామం చెందుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఇక రోజున ప్రధానంగా కర్మ యోగాన్ని గురించి విచారణ చేద్దాం. దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఇది, దీని అంతర్వాహిని ఇది, దీనిని ఆలోచించి అనుసరించేటువంటి ఒక విధివిధానం ఇది కాబట్టి మనమంతా కూడా అంటే జీవులుగా, మానవ దేహాన్ని ధరించి వచ్చిన మనం ప్రధానంగా అనేక కర్మలు చేస్తాం. ఉపాసనా మార్గంలో ఉంటాం. ఉపనిషత్ వ్యాఖ్యానాలు చేస్తాం. అనేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తాం. కొన్ని అక్కరకు వచ్చేవి, కొన్ని అక్కరకు రానివి, కొన్ని ఇతరులను బాధించేవి, కొన్ని ఇతరులకు ఆనందం కలిగించేవి, కొన్ని మనకు తెలిసి, మరికొన్ని తెలియక అనేక విధాల కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలన్నీ కూడా గతించినటువంటి జన్మ తాలూకు ఛాయలు. అంటే ఆగామి, సంచిత, ప్రారబ్ధ అని మూడు కర్మలున్నాయి.సంచిత అంటే తెచ్చుకున్న మూట అని అర్థం. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఇంతకు ముందు గడిపిన జీవితం నుంచి తెచ్చుకున్నాం. ఆగామి అంటే ఇప్పుడు నడుస్తున్న జీవితాన్ని బట్టి, ఇక్కడ చేస్తున్న కర్మల యొక్క పరిస్థితిని బట్టి రాబోయే మూట తయారు చేసుకుంటున్నాం. రెండింటి మధ్య అనుభవించటానికి, పోగొట్టుకోవటానికి, పాత దాన్ని వదిలిపెట్టడానికి కొత్తవి వేటిని రానివ్వకుండా ఉండటానికి ప్రారబ్ధము అని ఒక చక్కని మాట ఉన్నది. ప్రారబ్ధాన్ని మనం వ్యతిరేక భావంతో చూడకూడదు. ప్రారబ్ధము అంటే అనుభవించవలసిన దానిని అనుభవించటమే ప్రారబ్ధం. మనం ఏమనుకుంటాం అంటే, నేను ఎంత గొప్పవాడిని నాకీ ప్రారబ్ధం ఏమిటి అనుకుంటాం. నువ్వు ఎంత గొప్ప వాడివి కాదు, ఇంతకు ముందు ఎంత గొప్పగా నీ జీవితాన్ని నువ్వు గడిపావు, ఏం చేశావు ఇవ్వబడిన అవకాశంలో? జన్మ నీకు పరమాత్మ ఇచ్చినప్పుడు దానిని నువ్వు సక్రమంగా సద్వినియోగం చేసుకున్నావా లేదా? చేసుకొని ఉన్నట్లయితే ఇదిగో మంచికి తగిన ఫలితం ఇక్కడే అనుభవించు. నీవు చేసిన చెడు అంటే నీకు తెలియక చేసినా, తెలిసి చేసినా కర్మానుభవం పోదు గనుక దానిని కూడా ప్రారబ్ధమే అన్నారు. కనుకనే జ్ఞాని అయిన వాడు మాట అంటాడు, జ్ఞానికి కూడా ప్రారబ్ధం తప్పదు అని. తప్పించుకోలేడు. ఎందుకంటే, జ్ఞాని కూడా పంచభౌతిక దేహాన్ని అంటే పంచభూతాల సమ్మేళనంగా, సమ్మిశ్రితంగా వచ్చినటువంటి దేహం ద్వారా అనేకమైనటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తాడు. కొనసాగించి ఆయన కూడా కొంత ప్రారబ్ధాన్ని మన కళ్ళ ముందు అనుభవిస్తాడు. అయితే జీవుడు ప్రారబ్ధాన్ని బరువుగా, బాధగా, మోస్తూ అనుభవిస్తాడు. జ్ఞాని దాన్ని ఆనందంగా, సహజంగా అనుభవిస్తాడు. రెండింటికి తేడా అదే. జీవుడికి యాతన ఉన్నది. యాతన ఎందుకున్నది అంటే మనసు ఉన్నది గనుక యాతన ఉన్నది. మనసు ఉన్నది గనుక బంధనం ఉన్నది. బంధనం ఉన్నది గనుక బాంధవ్యం ఉన్నది. బాంధవ్యం ఉన్నది గనుక సంయోగం ఉన్నది. సంయోగం ఉన్నది గనుక వియోగం ఉన్నది. వియోగం ఉన్నది గనుక ఆశలున్నాయి. ఆశలున్నాయి గనుక దురాశలున్నాయి, దుర్దశలున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి అంటే మనస్సు. మరి జ్ఞానికి మనస్సు లేదు. అమనస్కుడై ఉన్నాడు. అంటే మనస్సు లేకుండా ఇన్ని కార్యకలాపాలు జగత్తులో ఆయన చేయగలుగుతున్నాడు అంటే, ఆయన మనవలె కర్మలు చేస్తున్నాడు. పద్మపత్రమివాంభస అంటీ ముట్టకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె జరుగుతున్న దానికి సాక్షిభూత సర్వస్వంగా, దేనిలోనూ తన ప్రమేయం లేకుండా, అందుకనే భగవంతుడికి మరొక పేరు అప్రమేయుడు అని పేరు. ప్రమేయం ఉండదు, interference ఉండదు. ఎప్పుడన్నా ఉంటే intervention ఉంటుంది. అది కూడా జీవుడి యొక్క సాధన తీవ్రతను బట్టి భగవంతుడు intervene అవుతాడు తప్ప interfere కాడు. influence చేయడు. మరి ఏం చేస్తాడు? జరుగుతున్న దాన్ని జీవుడు, సాధకుడు, నా భక్తుడు అనుకున్నటువంటి వాడు దీనిని ఎట్లా స్వీకరించాడు, దీనిని ఎట్లా అనుభవిస్తున్నాడు, ఒక రోగాన్ని, ఒక భోగాన్ని, ఒక సంయోగాన్ని, ఒక వియోగాన్ని, ఇవన్నీ కర్మ తాలూకు విషయాలు కాబట్టి కర్మల అన్నింటినీ కూడా తీసుకుని జీవుడు సాధనా మార్గంలో వెళుతున్నప్పుడు, ఒక సద్గురువు యొక్క ఛాయలలో అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు, సద్గురువుని పరమాత్మగా భావించినప్పుడు, సాధకుడు నిజంగా చెప్పబడిన వాటన్నింటినీ అనుష్ఠానం చేస్తున్నాడా లేదా, నిలబడుతున్నాడా లేదా, నేను ఇంత స్వామి భక్తుడిని, ఇన్నేళ్లు స్వామిని చూశానే, అయినా నాకెందుకు ఇది వచ్చింది అంటే వాడు భక్తుడు కాదు అని భావన. నేను ఇంతకాలం స్వామితో ఉన్నాను గనుక ఇప్పటికైనా తీరవలసిన కష్టాన్ని నాకు పరమాత్మ ప్రసాదనం చేశారు అని అనుకున్నట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహము మనలో ఉన్నటువంటి కర్మాన్ని నిశ్శేషం చేస్తుంది. అందుకనే జనస్యే జంగలికాయమానే సంసార హాలాహల మోహ శాన్యై అంటారు శంకర భగవత్పాదులు. అంటే మోహాన్ని నశింపజే-- క్షమింపజేస్తాడట. కష్టాన్ని కూడా పూర్తిగా ఆయన తుడిచిపెట్టడు, తగ్గిస్తాడు. స్వామి కూడా అదే అంటారుగా. మీరన్నీ కష్టాల మూట తీసుకుని పుటపర్తి వచ్చి నా దగ్గర కూర్చుని ఉంటే, మూట ఇక్కడ పడేయి అంటే, పడేసిన వాళ్ళు ఎంతమంది అని అడిగారు స్వామి. ఎవరి మూట వాళ్ళ దగ్గరే పెట్టుకుని స్వామి నువ్వు చూడాలి అంటే, ఏం చూడను మీ మూట మీ దగ్గరే ఉంది, దాన్ని మీరే విప్పుకోండి అన్నారు స్వామి. కనుక కర్మలు చేస్తున్నప్పుడే మన సంస్కారాలు, మనం తిరుగుతున్నటువంటి సమాజం, మనకున్నటువంటి సత్సంగం, సత్సాంగత్యం, సదాచారం, సమ్యక్ సంకీర్తనం ఇవన్నీ కూడా సాంప్రదాయాలు ప్రధానంగా సంస్కృతి, సంస్కారం ఇవన్నీ కూడా ఒక ఆర్ష సంస్కృతికి లోనై ఉన్నాయి గనుక కర్మల అన్నింటినీ కూడా సాధ్యమైనంతవరకు మన శక్తి మేరకు, ఏది రాని, ఏది పోని, అందులో ప్రాణమే పోని కర్మల అన్నింటినీ కూడా సమాజహితంగా చేయాలి. పరమేశ్వరుడి యొక్క ప్రీత్యర్థం చేయాలి. పరమేశ్వరుడు మనలను దాటి ఉన్నాడని కర్మయోగంలో అనుకోలేం. అనుకోగలిగితే చేస్తున్నవన్నీ కూడా పరమాత్మే అన్న భావన వచ్చినప్పుడు పరమాత్మ అంటే జ్ఞానికి ఎట్లాగైతే కర్మబంధం లేదో జీవుడికి కూడా కర్మబంధం లేదు. కానీ నేను చేస్తున్నాను, నేను చదివాను, నేను రాశాను, నేను కూశాను అన్నాడు కదా! అన్నదాని ఫలితాలన్నీ వీడే పట్టుకోవాలి గనుక నాతో పరమాత్మ మాట అనిపించాడు. నా చేత పరమాత్మ పని చేయించాడు. ఇది కర్మయోగం. నేను పని చేశాను, ఇది కర్మ. నేను మాత్రమే చేయగలను, ఇది కర్మ. అది. కర్మ, కర్మ అంటే అహంకారంతో కూడిన ప్రారబ్ధం. కర్మ అంటే చేయవలసి వచ్చి. కొన్ని కారణాలు ఉండొచ్చు. కారణాలు మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ కర్మలలో మన మనస్సు నిమగ్నమై ఉంటుంది గనుక ప్రధానంగా ఒక అధ్యాత్మ భూమికలో భగవాన్ సత్యసాయి వంటి మహా పరిపూర్ణ అవతారి యొక్క సమకాలీనుడిగా ఉన్నటువంటి మనం కర్మల అన్నింటినీ కూడా సర్వమున్ ఈశ్వర ప్రీతికే అన్న భావనలో చేయాలి. అన్నం తిను, బ్రహ్మార్పణం చెప్తున్నాం. బ్రహ్మార్పణం అని చెప్పి మనం స్వామికి నైవేద్యం చూపిస్తున్నాం. కాదు. బ్రహ్మార్పణం అంటే స్వామిని బ్రహ్మం చేసి మనం తయారుచేసిన పిండివంటలన్నీ ఆయనకు చూపిస్తున్నాం. అది కాదు. బ్రహ్మార్పణం అంటే అర్పణం బ్రహ్మ.హవిః బ్రహ్మ అం-- సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న భావనే తప్ప బ్రహ్మార్పణం అంటే సాయి బ్రహ్మకు అర్పణం అయినా కాదే. కర్మ అది కాదు కదా! అర్పణము కర్మ, హవిస్సు కర్మ, యాగము కర్మ, యోగము కర్మ, భోగము కర్మ, కన్ను విప్పుట కర్మ, కన్ను మూయుట కర్మ. ఇవన్నీ కర్మలు కదా. కర్మల అన్నింటికీ మూలమైన వాడు ఒకడు ఉన్నాడన్న స్ఫురహే ఒక అధ్యాత్మ బీజం. దానిని బీజాన్ని భూజం చేయాలి, వృక్షం చేయాలి. ఎట్లా? సాధన చేత. మన సాధనలన్నీ, మన కర్మలన్నీ, మన చేతలన్నీ, మన చూపులన్నీ, మన మాటలన్నీ సర్వ ప్రపంచానికి కూడా మహదానందాన్ని ఇవ్వాలి. ఎటు నుంచి ఎవరు మనల్ని చూసినా, పరికించినా, పరిశోధించినా కర్మలన్నీ సర్వజనామోదయోగ్యంగా ఉన్నాయి, అందరికీ సంతోషం కలిగిస్తున్నాయి, ఆనందం కలిగిస్తున్నాయి అన్నట్లుగా మన కర్మలు చేయాలి. దానం చేశాం, మన ఆనందం కోసం దానం చేయాలి. త్యాగం చేశాం, అది మనకు ఆనందం కలిగించేలా చేయాలి. దానం చేసినా పేరు బోర్డు మీద రాయమనడక్కూడదు, అహంకారం. త్యాగం చేసినే చేశానని చెప్పకూడదు, అది అతిశయం. నేను మాత్రమే చేయగలను, వాడు పదివేలు ఇచ్చాడు, నేను ఇరవై వేలు ఇచ్చానంటే అది స్వామి మాటలోనే అది vanity తప్ప charity కాదు. charity అనేటువంటి గుప్తంగా, నెమ్మదిగా, నిస్తంద్రమంద్రంగా ఎవరికీ అర్థం కానట్లుగా అందుకున్న వాడికి మాత్రమే ఆనందం కలిగించేలాగా త్యాగభూమికలో కర్మలన్నీ కూడా సాగాలి. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ధర్మబద్ధంగా చేయాలి. దానికి ఇవ్వబడిన do's and don'ts చేయదగినవి, చేయతగినవి అని రెండు ఉంటాయి. పనికైనా. చేయతగినవి ఎలాగో మనకు తెలుసు. చేయతగనివి ఏమిటో పరిహారం చేయాలి మనసులో. ఎక్కడికక్కడ ప్రక్షాళన elimination process అన్నాం, దాన్నే సనాతనమైన భాషలో నేతి నేతి అంటే నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదంటూ ఉంటే ఏం చేయాలో తెలిసిపోతుంది గనుక. జ్ఞానమూర్తులు, అవతార మూర్తులంతా జగత్తులోకి కేవలము జ్ఞానబోధ చేయటానికి మాత్రమే రారు. అజ్ఞానం అంటే ఏమిటో కూడా మనకు అనేక సందర్భాలలో తెలియజెప్పాలి గనుక అజ్ఞానబోధ చేస్తూ జ్ఞానం వైపు నడిపిస్తారు. మన కర్మలన్నీ కూడా నిష్కామం వైపు నడిపించాలి. స్వార్థం ఉంటుంది తొలినాళ్లలో. నెమ్మది నెమ్మదిగా స్వార్థం పక్కకి తొలగిపోతుంది. కానీ చిన్న కామనలు ఉంటాయి, లాలసలు ఉంటాయి, భోగాలు ఉంటాయి, చిన్న చిన్న ఆశలుంటాయి. కర్మ చేస్తే, వ్రతం చేస్తే అమ్మాయి పెళ్లి అవుతుందట, లేదా పుస్తకం చదివితే మంచి వరుడు దొరుకుతాడట అని చదవకూడదు, అని యాగం చేయకూడదు, యోగం చేయకూడదు. యాగ యోగాలు అన్నీ చేస్తూ భోగాన్ని కూడా యోగంగా మార్చుకునే దిశగా కర్మలు సాగాలి. ధర్మబద్ధంగా చేయాలి. ధర్మబద్ధం అంటే స్వామి మూడు మాటలు చెప్పారు. ఏమిటి ధర్మం అనేదానికి అది మనోధర్మం, వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, మానసిక ధర్మం, సామాజిక ధర్మం, రాజకీయ ధర్మం, ఆర్థిక ధర్మం, దైవ ధర్మం అనేకం ఉన్నాయి. వీటన్నింటికంటే స్వామి చాలా అందంగా అధునాతన మానవుడికి అర్థమయ్యే సరళమైన, సూటైన, గంభీరమైన భాషలో చెప్పారు. పాపభీతి, సంఘనీతి, దైవప్రీతి. మూడు చాలా ప్రధానం. మూడు ఎవరి దగ్గర ఉన్నాయో వాడి కర్మలన్నీ కర్మయోగాలేనన్నారు స్వామి. అంటే మనం పని చేస్తున్నా సమాజం మనల్ని గమనిస్తున్నది సుమా. మనం పని చేసినా నిర్మల కాసారం వలె ఎక్కడా అలజడి లేనటువంటి సమాజంలో మనం చేసిన ఒక్క కర్మ వలన అలజడులు సృష్టింపబడుతున్నాయి సుమా. అనగానే మనల్ని మనం సర్దుకోవాలి. ఇది సంఘనీతి. పాపభీతి ఉండాలి. సమూహంలో, సమాజంలో ప్రతి వ్యక్తి మర్యాదగానే ఉంటాడు. మర్యాదగా ఉన్నట్టుగా ఉంటాడు. నీ మర్యాద, నీ గొప్పతనము, నీ గాంభీర్యము చూడాలంటే నువ్వు ఏకాకిగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? నీ మనస్సు ఎట్లా ఉన్నది? అది hallmark, అది testing point. నేను ఒక్కడిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానంటే నేను ఎలా ఉండాలని అనుకున్నానో అట్లా ఉన్నా. పవిత్రుడుగా, అద్భుతమైన వ్యక్తిగా, పరమాత్మని అనుభవించిన ఒక ఆనంద సముద్రంగా నేనున్నాను అనుకున్నావా అది నువ్వు నిజమైన నువ్వు అన్నమాట. కనుక పాపభీతి ఉండాలి మనసులో. ఎవరి పట్లనో ఒక చిన్న అసూయ, ఒక చిన్న కోపం, ఒక అననుకూలత, మనస్సు యొక్క తొట్రుపాటు, ఒక అలజడి, ఒక ఆందోళన. ఇవన్నీ కూడా పాపం కిందనే వస్తాయి. ఎట్టి పరిస్థితులలోనూ మన మనస్సుని, మనస్సు మన సాధన వలన పొందుతున్న శాంతిని, శాంతిని కలుగుతున్న వలన కలుగుతున్న ఆనందాన్ని, ఆనందం వలన మనం పొందుతున్న బ్రహ్మానందాన్ని అల్పమైన విషయాలతో పోగొట్టుకోకూడదు గనుక కర్మలన్నీ ధర్మబద్ధంగా, సమాజహితంగా, పాపభీతి ఉన్న పాపము పట్ల భయంకరమైనటువంటి భయం ఉండాలి మనకి. భయంకర భయం అంటే ఇక భయానికి హద్దులేని భయం ఉండాలి. పుణ్యం చేయటానికి ఆనందం ఉండాలి, శాంతి ఉండాలి. అలాగే సంఘం అంటే స్వామి చెప్పారే ఒక వ్యక్తి సంఘం కాదు, ఒక ఇల్లు గ్రామం కాదు, ఒక ఊరు దేశము కాదు. అంతా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి. నాలుగు భావనలు ఉండాలి. వ్యష్టి బాగుంటేనే సమష్టి నలుగురు బాగుంటారు. సమష్టి బాగుంటేనే సృష్టి బాగున్నట్టు. సృష్టి అంతా బాగుంటే పరమేష్టి బాగున్నట్టు. భగవంతుడు పదే పదే లోకంలోకి వస్తున్నాడు అంటే తాను సృష్టించిన సృష్టిలో జరుగుతున్న కర్మలన్నీ ధర్మవిదూరంగా ఉన్నాయి గనుక, కర్మలను మళ్ళీ ధర్మబద్ధం చేయాలి గనుక పరమేశ్వరుడు మనవంటి దేహాన్ని, పాంచభౌతిక దేహాన్ని తీసుకొని చిన్మయ స్వరూపుడై జగత్తులోకి వచ్చి అనేకమైనటువంటి కర్మకాండలలో మన మనస్సుని, మన బుద్ధిని, మన చిత్తాన్ని, మన వివేకాన్ని, మన విచక్షణని, మన అహంకారాన్ని, మన అహంత్వాన్ని, మమత్వాన్ని అన్నింటినీ కలబోసి చక్కగా ఒక సన్మార్గంలోకి నడిపిస్తారు గనుక పరమేశ్వరునితో కూడి ఉన్న మనం కర్మలన్నింటినీ కర్మయోగం చేయాలి. అంతా సాయిరామార్పణమస్తు. అంతా పరమేశ్వరార్పణమస్తు. గురువులందరికీ ఇది చెందు గాక. నా వలన, నా మాట వలన సర్వ ప్రపంచానికి శాంతి కలుగు గాక. నేను ఎట్లా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానో సర్వ ప్రకృతి కూడా, నా చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఆనందవనంగా ఉండాలని కోరుకోవాలి. ఇది సంఘనీతి.పాపభీతి మనం ఎట్టి తలపులో కూడా ఎవరిని గురించి పాపపు భావన మనస్సు వికారానికి లోనవుతుంది వెంటనే దాన్ని గమనించాలి మనం. మనసుకు చెప్పాలి "మనసా! నేను పరమాత్మతో కూడి ఉన్నా, నా మనసు ఎలా ఉండాలంటే పరమాత్మకు మనసు అంటూ ఉంటే అంత స్థాయిలో ఉండాలి తప్ప, నా మనసులా ఉంటే పరమాత్మ నా దగ్గర ఎందుకు ఉంటాడు?" అన్న భావనలో మనసుకు నెచ్చె చెప్పాలి. అలాగే ఎప్పుడైతే మనసు ఉన్నదో, సంఘం ఉన్నదో, వ్యక్తి ఉన్నాడో, దైవం అక్కడే ఉన్నాడు. రెండు మొదటివి సాధిస్తే దైవ ప్రీతి అత్యంత సహజంగా మనకు ఏర్పడిపోతుంది. లేదా దైవ ప్రీతిని గనక అలవరచుకున్నట్లయితే సంఘ నీతి బలపడుతుంది. సంఘ నీతి బలపడ్డప్పుడు పాపభీతి సభ-- సహజమైనటువంటి స్థితిలోనే పాపం పట్ల భయం ఏర్పడుతుంది గనుక మూడు భిన్నంగా కనిపిస్తున్నా ఒక్కటే. పాపభీతితోనన్నా మొదలు పెట్టండి, దైవ ప్రీతితోనన్నా మొదలు పెట్టండి, మీరు, సమాజం అంటే మనము, సమాజము ఇక్కడ కలిసి ఒకటిగా ఉన్నాం గనుక ఏకమేవా అద్వితీయం నద్వితీయం. ద్వితీయం రెండోది లేదు ఉన్నది ఒక్కటే. అది నువ్వు కావచ్చు ఒక, ఒక కుండ, కూజా, బాణ అనేక పేర్లు ఎట్లా ఉన్నాయో అలాగే ఫలానా శరీరం ద-దానికి ఒక స్త్రీ, ఇదొక పురుషుడు వాటికి పేర్లు ఇవన్నీ ప్రపంచంలో మనం మన కర్మకాండాలు చక్కగా కొనసాగించటానికి పరమాత్మ యొక్క సంకల్పాలని పరమాత్మకు ఆనందం కలిగించే దిశగా నడిపించటానికి కర్మలు చేయాలి తప్ప కర్మలన్నీ కూడా స్వామి చెప్తారు "సేవతో చేసే కర్మలుంటాయే అవే నిజమైన కర్మలు బంగారం. సేవ లేకుండా కర్మలు చేయి అవన్నీ చాకిరీలే. ప్రేమ లేకుండా సేవ చేయి చాకిరీ. చాకిరీ చేసిన వాడికి కూలి లభిస్తుంది, ప్రేమతో చేసినటువంటి వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. నీకు అనుగ్రహం కావాలా, డైలీ కూలి కావాలా?" అని అడిగారు స్వామి. నాకు పరమాత్మ అనుగ్రహమే కావాలి. ఎందుకంటే నేను కన్నుమూసే వరకు నన్ను నడిపించేది పరమాత్మ యొక్క అనుగ్రహమే తప్ప కూలి నాలి డబ్బులు మాత్రం కావు. అందుకనే పరమేశ్వరుడి యొక్క ఉపాసన అంటే ఉప- ఆసన. పరమేశ్వరుడి యొక్క హృదయ స్థానానికి దగ్గరగా ఉండేది ఉపాసనా మార్గం. ఉపనయనము అంటే రెండు తోలు కళ్ళ మధ్య ఉన్నటువంటిది మూడవ కన్ను, ఉపనయనం. అది ఆజ్ఞాచక్రం. మన విభూతి ధారణ అంటే బొట్టు పెట్టుకునే చోట అన్నమాట. ఉపనయనము, ఉపవాసము ఉన్నది. ఉప అంటే దగ్గరగా, వాసము నివాసము. పరమాత్మ భావనకు దగ్గరగా. మరి ఉపనిషత్ అంటే ఏమిటి? ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చొని. ఎక్కడ కూర్చొని? ఉప అంతా దగ్గరగా. దేనికి దగ్గరగా? పరమాత్మకు దగ్గరగా. కర్మలన్నీ చేస్తున్నప్పుడు స్వామి ఒక హెచ్చరిక చేశారు. చాలా ఏళ్ల క్రితమే. ఏమిటా హెచ్చరిక అంటే "పరమాత్మ సర్వసాక్షి అయి అందరి యందు వెలుగుతున్నాడు. నీ కర్మకాండలు ప్రపంచంలోకి ఆచరణ పూర్వకంగా రాకముందే, అంటే నీ మనసులో ఒక సంకల్పం కలగగానే దాన్ని మొట్ట మొదట చూసిన వాడు ఎవడు అంటే సర్వసాక్షిమయుడైన పరమాత్మ. పరమాత్మను నేనే." అంటే ఆత్మ స్వరూపుడిగా మీ అందరిలో నేను ఉన్నాను అని స్వామి చెప్తున్నారే, దానిని గనుక మనం చక్కగా అనుభవించగలిగితే, గ్రహించగలిగితే, అనుష్ఠానం చేయగలిగితే అంటే practice చేయగలిగితే కర్మలన్నీ కర్మ యోగాలే. పాట పాడండి, మాట అనండి, పుస్తకం రాయండి, బొమ్మ గీయండి, పరమాత్మ గురించి నాలుగు ముక్కలు మంచివి చెప్పండి, పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పండి, అదంతా కర్మ యోగమే. నేను చెప్పకపోతే ఈయన పరమాత్మ అని లోకానికి తెలియదని అనుకున్నాం అనుకో, అది కర్మ. ఎందుకంటే షిరిడి బాబా గాని, భగవాన్ సత్య సాయి బా-బాబా గాని ఒకటే మాట అన్నారు. "భగవత్ తత్వానికి ప్రచారకులు అవసార-- అవసరం లేదు, భగవత్ తత్వానికి ప్రసారకులని మేమే ఎంచుకుంటాము." అని. canvas కాదు బంగారం transmit చేయండి. canvas ఏముంది? ఒట్టి డొల్ల మాటలు, పై పై మాటలు, ప్రయోజనం లేదు. ప్రసారము అంటే transmit చేయాలి అంటే turbine నీలో ఉండాలి. నువ్వు దాన్ని ప్రతిరోజూ charge చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? కర్మల ద్వారా చేసుకోవాలి. సత్కర్మల ద్వారా చేయాలి, సదాచారం ద్వారా చేయాలి, మంచి ఆలోచనల ద్వారా చేయాలి, అంతా పరమేశ్వరుడు చేయిస్తున్నాడన్న సమర్పణ భావనతో చేయాలి. చేసినప్పుడు కర్మలన్నీ కర్మ యోగంగా మారతాయి. నిజానికి మనం గనక గమనించినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య శరీరానికి ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చినయి. అందులో తొలి పధ్నాలుగు ఏళ్లు, అంటే అవతార ప్రకటన అక్టోబర్ ఇరవై. దాన్ని కాస్త మినహాయించినట్లయితే ఎనభై నాలుగులో పధ్నాలుగు పోయినాయి. పోతే డెబ్భై ఏళ్లు. డెబ్భై ఏళ్లు పరమాత్మ సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులలో జన బాహుళ్యంతో కూడి మన మధ్యనే ఉండి, మన వలె మాట్లాడి, మన సుఖదుఃఖాలలో తాను ఒక భాగం అన్నట్టుగా అనుభవించి, చెప్పి, ఊరడించి, మనల్ని లాలన చేసి, పాలన చేసి "అన్నింటికీ నేనున్నాను మీకెందుకు భయం?" అని పరమాత్మ అభయమిస్తుంటే, ఉన్నావా లేదా అని ఇప్పటికీ అడిగితే పరమాత్మ వచ్చిందెందుకు? ఆయన్ని పొందిందెందుకు? పోనీ ఆయన్ని చూసిన తర్వాత మనం ఏదన్నా మన కర్మలలో ఏదైనా ఒక బలీయమైనటువంటి మార్పు, ఒక పరిణామం మనం పొందామా? బాల్యం నుంచి కౌమారానికి వచ్చాం, కౌమారం నుంచి యవ్వనానికి వచ్చాం, యవ్వనం నుంచి నెమ్మది నెమ్మదిగా మధ్య వయస్సు దాటి వృద్ధాప్యం వైపు అడుగులు వడివడిగా వేస్తున్నాం. మార్పు జరిగిందా అంటే మనకు తెలియకుండానే శరీరంలో అనేక మార్పులు జరిగినాయి. మరి మనస్సులో? జరగటం లేదు. ఎందుకు జరగటం లేనిదంటే మన కర్మలు ఇంకా కర్మలుగానే ఉన్నాయి, కర్మ యోగంగా లేవు. "మీరు ఎక్కడికి వెళ్లారు?" "నేను పుట్టపర్తి సేవకు వెళ్ళాను." పుట్టపర్తి సేవకు వెళ్ళామా? "స్వామి సేవకు వెళ్ళాను." స్వామి సేవకు వెళ్ళామా? స్వామి అన్నారు "నాకు ఎవ్వరి సేవలు నాకక్కర్లేదు." అసలు నిజానికి అవతారం సత్యసాయి భగవానుడి అవతారాన్ని చాలా జాగ్రత్తగా గనుక గమనించినట్లయితే మానవుడు మాధవుడికి చేసిన సేవ సున్నా.మాధవుడే మానవుడికి సేవ చేశాడు. ఇది చాలా అపురూపమైన సన్నివేశం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. కర్మలు చేస్తూనే వాడు వ్యాపారం చేస్తాడు, వాడు ఉద్యోగం చేస్తాడు, వాడు ఉద్యోగం రావాలి, promotion కావాలి, ఉన్న ఊర్లో కావాలి, ఇంటి పక్కన కావాలి. ఇద్దరు వ్యాపారస్తులు స్వామి devotees, great devotees. ఇద్దరూ స్వామికి కావలసిన వారే. ఇద్దరూ ఒకే వ్యాపారానికి ఒక tender వేశారు కర్మకాండలో చూడండి. మరి స్వామి ఎవరిని అనుగ్రహించాలి అని? ఇద్దరూ తన భక్తులే కదా. అంటే స్వామిని examine చేయటం మనకు అలవాటైపోయింది. అంతేకాదు, కొన్ని కోటానుకోట్ల మంది భక్తులు స్వామికి అర్ధరాత్రి, అపరాత్రి సందర్భం లేదు ఎప్పుడు మనకి బాధ కలిగితే వాడు ఒక calling bell నొక్కుతున్నాడు. మరి విచిత్రం ఏమంటే పరమాత్మ సాయి ఇన్ని కోట్ల calling bells కి ఏకకాలంలో, ఒకే క్షణంలో అన్నింటికీ సమాధానం ఇస్తున్నారు. అది పరమాత్మ తత్వం. ఎందుకని? కర్మ పరమాత్మ గనుక సుకౌశలంతో చేస్తారు. కర్మ సుకౌశలం perfect skillfulness అంటాం. దాంతో చేస్తారు. అలాగే మనకు రాత్రి పన్నెండు గంటలకు ఎవరైనా ఒక calling bell నొక్కారు. పక్క వాడే, మనతో ఉన్నవాడే. హాస్పిటల్ కి తీసుకెళ్లాలి, మీరు మీ కారు కాస్త తెస్తారా? ఎప్పుడూ తెచ్చేవాడినే గాని ఈవేళ తేలేను అంటాడు. వాడికి అవసరం అయినప్పుడు మనం we never rise to the occasion. పరమాత్మ కూడా ఎప్పుడన్నా రోజూ calling bell కొడతాడులే తర్వాత చూద్దాం అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. నేను నమ్ముకున్న సాయి నాకు వెంటనే చేశారంటాం. మరి నిన్ను నమ్ముకొని వచ్చిన వాడి సంగతి నువ్వేం చేస్తున్నావు? ఇది కర్మయోగం. మా స్వామి చేశారు, చేశారు ఒక ఎత్తు. మనం అడిగినా, అడక్కపోయినా ఆయన చేస్తారు. భక్తుడు అయిన వాడికి చేస్తారు, కాని వాడికి చేస్తారు. అది సర్వ సమ్మతమైనటువంటి, సర్వాంగీణమైనటువంటి కరుణా సముద్రం అది. మనం కూడా కర్మ యోగంలో స్వామి ఎట్లా ప్రపంచానికి తన చర్యల ద్వారా, అనుగ్రహం ద్వారా, అనుభూతి ద్వారా, ఒక విభూతి స్థితి ద్వారా ఇంత దివ్యమైనటువంటి ఆనందాన్ని, ప్రేమని తన చర్యల ద్వారా పంచి పెట్టారో మనం కూడా తెల్లవారి నిద్ర లేవగానే పడుకోబోయే వరకు జాగ్రదవస్థలో సుమారు పదహారు గంటలు గడుపుతాం. పదహారు గంటలని కర్మయోగ భూమికలో గనుక సంచారం చేయగలిగితే చాలా ఉత్తమోత్తమమైనటువంటి సాధనగా భావించాలి. అంతేతప్ప భారత, భాగవత, రామాయణాలు పుక్కిట పట్టినా, సర్వ శాస్త్రాల మీద అధికారం సంపాదించినా, సర్వోపనిషత్తులకి సమగ్ర రమణీయ వ్యాఖ్యానం చేసినా నీవు ముక్తుడివి కావు. ఎప్పుడు అంటే దానిని నువ్వు అనుష్ఠానం చేయాలి. information to transformation స్వామి బోధించలే, మనం రాసుకున్నాం. స్వామి చెప్పింది ఏమంటే information to transformation మధ్యలో implementation ఉంది బంగారు, అది ఎలా మర్చిపోయినారు అని. కేవలం information వల్ల ముక్తి పొందిన వాడు లేడు. కేవలం information వల్లనే transformation చెందిన వాడు లేడు. implementation గనుక లేకపోతే దానిని అనుష్ఠాన వేదాంతం అన్నారు. దేనిని practice చేశామో దానివల్ల faith పెరుగుతుంది. faith ఎక్కడ ఉంటుందో practice accelerate అవుతుంది. వేగవంతం అవుతుంది, ఆవేగవంతం అవుతుంది. కర్మలన్నీ కూడా పరమేశ్వరాధీనమై ఉంటాయి. మన మనస్సు అణగి ఉంటుంది. మనస్సు అణగి ఉండటం అంటే శాంతి పొందింది. శాంతి ఉన్నది అంటే హాయి ఉన్నది. హాయి ఉన్నది అంటే సుఖం ఉన్నది. సుఖం ఉన్నది అంటే సంతోషం ఉన్నది. సంతోషం ఉన్నచోట ఆనందం ఉన్నది. ఎక్కడ ఆనందం ఉన్నదో అక్కడ ప్రేమ ఉన్నది. ఎక్కడ ఆనందం ఉన్నదో అక్కడ సాయి ఉన్నాడన్న భావనతో కర్మ యోగాన్ని మన కర్మల ద్వారా అనుష్ఠాన వేదాంత పూర్వకంగా కర్మ యోగాన్ని పరిపూర్ణంగా అనుభవించే దిశగా భగవాన్ సత్యసాయి యొక్క దివ్య అనుగ్రహం మనందరిపై మహామృత వృష్టి వలే కురిపించు గాక. సాయిరాం. [బీప్] ఇంతవరకు మీరు స్వామి వారి చిరకాల భక్తుడైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారిచే కర్మయోగంపై ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు మీరు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస్ గారి అనుభవాలను వింటారు. శ్రీ సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస్ గారు మణిపాల్ కళాశాల యందు తమ MBBS మరియు MD లను పూర్తి చేసిన పిమ్మట పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యందు కొద్ది కాలము తమ సేవలనందించారు. ప్రస్తుతం వారు విశాఖపట్నంలో స్థిరపడి అక్కడి సాయి యువత చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస్ గారి అనుభవాలను మనం ఇప్పుడు విందామా? [బీప్] సాయి భక్త కోటికి సాయి ప్రేమవాణి స్టూడియో ద్వారా నమసుమాంజలు. ఈరోజు మన స్టూడియోలో విశాఖపట్నంలోని డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస్ గారు వచ్చి ఉన్నారండి. డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస్ గారు ప్రఖ్యాతి కాంచిన డాక్టర్ మంగమ్మ గారి పుత్రుడు. విశాఖపట్నంలో డాక్టర్ మంగమ్మ గారి హాస్పిటల్ తెలియని వారు ఉండకపోవచ్చు. అదేవిధంగా సాయి భక్తుల్లో విశాఖపట్నంలో డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా తెలియని వారు ఉండరు. డాక్టర్ శ్రీనివాస్ గారు మీరు మా స్టూడియోకి రావడం మా మహద్భాగ్యం అండి. మీకు స్వాగతం. సాయిరాం అండి. సాయిరాం అండి. మొట్టమొదట భక్తులందరికీ కూడా మీరు విధంగా స్వామికి introduce అవ్వబడ్డారు? విధంగా మీ parents స్వామి దగ్గరికి వచ్చారు? ఇటువంటి విషయాలు కొన్ని మాకు చెప్తారా? నేను చాలా చిన్న పిల్లవాడినండి. విషయాలు కొన్ని మా parents చెప్పడం వల్ల నాకు తెలిసింది. అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం అయి ఉండాలి. time లో మా అమ్మగారు స్త్రీ వైద్య నిపుణులు gynecologist. ఆవిడ ఒక patient ని admit చేశారు. patient గర్భంలోనే బిడ్డ పోయింది, abortion అయింది. తర్వాత ఆమె blood pressure బాగా down అయిపోయింది. కొంత సేపట్లో విపరీతమైన bleeding జరిగి patient shock లోకి వెళ్ళింది. ఊ. మా అమ్మగారు వెంటనే భర్తను, ఆమె భర్తను పిలిచి "వెంటనే ఈమెను పెద్ద ఆసుపత్రికి shift చేయండి లేదా మీ యొక్క ఆహ్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే కబురు పెట్టండి" అని చెప్పారు.అది విన్న భర్త డాక్టర్ గారు ఒక్కసారి మీ phone నేను వాడుకోవాలి urgentగా telegram పుట్టపర్తి సత్యసాయిబాబా గారికి ఇవ్వాలి అన్నారు. ఉమ్ ఇదేం విచిత్రం అని మా అమ్మగారు ఆశ్చర్యపోయి ఆమె shock లో ఇక్కడ ఉంటే సత్యసాయిబాబా గారు ఏం చేస్తారండి అని అడిగారట. ఉమ్ అప్పుడు భర్త లేదండి మాకు భగవంతుడు అన్ని కూడా సాయిబాబా గారే ఆయనకి telegram ఇస్తే ఈమె బాగుపడుతుంది అది నాకు నమ్మకం ఉందని చెప్పి మా telephone ద్వారా telegram ఇచ్చాడాయన ఉమ్ telegram ఇచ్చిన పది నిమిషాలకి అంతవరకు కళ్ళు తెరని patient కళ్ళు తెరిచి మంచినీళ్ళు అడిగిందట. ఉమ్ అది మొట్టమొదటిసారిగా మా అమ్మగారికి కొంత అది మహిమనాలో విచిత్రమానో లేకపోతే coincidence నా తెలియక చాలా అవకతవకంగా చాలా ఆలోచనలు ఆమె మనసులో కలిగి patient ని ఇంకొంచెం స్వామి గురించి అడిగి తెలుసుకున్నారు. అంటే ఇది medical science ప్రకారము అది impossible అండి. అంటే అంత తక్కువ time లో మళ్ళీ ఆవిడ తేరుకోవడం అనేది bleeding ఒక పక్క bleeding జరుగుతుంది shock లోకి వెళ్ళిపోయిన మనిషి ఉమ్ Within minutes మళ్ళీ తిరిగి normal అయిపోవడం అనేది కొంచెం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అవును అయితే తర్వాత పెద్ద treatment blood ఏం ఇవ్వకుండానే ఆమె చాలా quick recovery వచ్చింది. ఉమ్ మొట్టమొదట జరిగినటువంటి ఆసుపత్రిలో జరిగినటువంటి యొక్క మహత్యాన్ని చూసి మా అమ్మగారు కొంచెం ఆశ్చర్యపడ్డారు. ఉమ్ అయితే స్వామిని పూర్తిగా భగవంతుడని accept చేయలేకపోయారు. ఉమ్ ఎందుకంటే ఆవిడ scientific personality కాబట్టి ఇదేదో chance గా patient recover అయింది అనేటువంటి ఆలోచనతో ఉండిపోయారు. ఆహా కొద్ది కొద్ది నాళ్ళు తర్వాత మా తండ్రి గారు మొట్టమొదట స్వామి యొక్క దర్శనానికి వెళ్లారు. ఉమ్ ఆయన వెళ్ళి తిరిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ స్వామి యొక్క ప్రేమతత్వం ఇవన్నీ కూడా చాలా ఆకర్షించాయని మాకు వచ్చి చెప్పారు. ఉమ్ ఇట్లాగా కొన్ని సంవత్సరాలు గడిచింది. 1973 లో నాకు అప్పుడు ఎనిమిదో సంవత్సరం. ఉమ్ time లో ఏమైందంటే నాకు ప్రతిరోజూ సాయంకాలం అయ్యేసరికి జ్వరం వస్తూ ఉండేది. ఉమ్ చాలామంది పిల్లల డాక్టర్లు నన్ను చూశారు. రకరకాలుగా cancer అని కొందరు TB అని కొందరు ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఉమ్ కానీ ఏది నిర్ధారణ కాలేదు diagnosis కాలేదు. మనిషిని క్షీణిం క్షీణించిపోతూ ఉండేవాడిని. ఏమి ఆకలి ఉండేది కాదు. ఉమ్ పరిస్థితిలో నేనుండే వాడిని. ఉమ్ అయితే అప్పుడు pediatric డాక్టర్ గారు విశాఖపట్నంలో కొప్పచ్చి కృష్ణమూర్తి గారు ఉండేవారు చాలా famous డాక్టర్ గారు. ఉమ్ ఆయన్ని చూసి ఎందుకన్నా మంచిది TB treatment start చేయండని streptomycin injection మొదలు పెట్టించారు. ఉమ్ ఇది జరిగింది. ఇదే time లో మా రెండో sister ఏమో ఆమె intermediate కి application పెట్టా tenth అయిపోయిన తర్వాత. ఉమ్ సో ఎవరో చెప్పారు అనంతపురం college అయితే అక్కడ సులభంగా seat దొరుకుతుంది అక్కడ apply చేయండి అని. ఉమ్ సో ఆమె అనంతపురం కి apply చేయడానికని మా నాన్న గారితో బయలుదేరింది. ఉమ్ time లోనే నేను కూడా చిన్న పిల్లవాడిని కదా పక్క ఊరు ఏదో ఊరు వెళ్తున్నారు అనేసరికి అల్లరి పెట్టి నేను కూడా వాళ్ళతో పాటు బయలుదేరాను. ఉమ్ అయితే అనంతపురం లో మొట్టమొదట దిగాం అప్పటి రోజులు direct గా పుట్టపర్తి train లేవండి. ఉమ్ డెబ్బై మూడులో. ఉమ్ సో అనంతపురం లో దిగి అక్కడ కూడా hotel లోనే ఒక doctor గారిని పిలిచి injection చేయించారు. ఉమ్ ఇది అయిన తర్వాత అక్కడి నుంచి bus తీసుకుని పుట్టపర్తి చేరాం. ఉమ్ పుట్టపర్తి వెళ్ళిన తర్వాత రోజు సాయంకాలం స్వామి భజనప్పుడు వచ్చారు కానీ నేను మా నాన్నగారి ఒళ్ళోనే చిన్న పిల్లవాడిని కదా పడుకుని నిద్రపోతున్నాను. ఉమ్ స్వామి పిలిచి పిల్లవాడు నిద్రపోతున్నాడు disturb చేయొద్దు అని చూపించి రేపు morning నేను చూస్తాను అని వెళ్ళిపోయారట. ఉమ్ మన్నాడు ఉదయం స్వామి అన్న ప్రకారం నన్ను మా అక్కని మా నాన్నగారిని ముగ్గుర్నీ interview కి పిలిచారు. ఉమ్ లోపలికి వెళుతూనే స్వామి నా యొక్క మెడ భాగాన్ని తడిమి ఉమ్ ఏమిటి వీడికి ఎందుకు streptomycin injection ఇస్తున్నారు అన్నారు. అది ఇస్తున్నట్టు కూడా స్వామికి చెప్పలేదా? స్వామికి మేము మాట్లాడకుండా స్వామే మొట్టమొదట అడిగారు. ఆహా వీడికి streptomycin injection ఎందుకు ఇస్తున్నారు అని. ఉమ్ మా నాన్నగారు స్వామి వీళ్ళ అమ్మ doctor మిగతా doctor లందరూ కూడా streptomycin injection ఇవ్వమన్నారు ఏవో TB అని భయపడుతున్నారని. స్వామి నా యొక్క మెడ తడువుతూ ఇదంతా allergy TB ఏమీ లేదు అన్నీ ఆపేయండి నేను ప్రసాదం ఇస్తాను అంతా బాగుంటుంది అని చెప్పి సృష్టించి విభూది తీసి నా నోట్లో వేశారు. అది మొదలు ఈరోజు వరకు మళ్ళీ అటువంటి symptoms ఏవీ నాకు కనబడలేదు. సో అది మొట్టమొదట జరిగినటువంటి miracle. మీరు doctor శ్రీనివాస్ గారు అప్పుడు మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత మరి medicines అన్నీ మానేసి విభూది ఒక్కటే తీసుకునేవాదా? అంతే అంతే ఆహా అదే క్షణంలో ఉమ్ మేము interview room నుంచి బయట పడగానే ఉమ్ ఎదురుగుండా hotels ఉండేవి. ఉమ్ అక్కడికి వెళ్ళి ఒక plate meal తిని ఇంకొక plate అడిగానన్నమాట. [నవ్వు] మా అక్క ఆశ్చర్యపోయి వీడికేమైనా దయ్యం పట్టిందా ఎలా తింటున్నాడు అన్నది. అంటే అంతకు ముందు అది కూడా అది ఏమి తినలేకపోయేవాళ్ళు. అసలు తినలేకపోయేవాడిని. ఉమ్ అంతే కాకుండా మా అక్క స్వామిని అడిగిందన్నమాట. ఉమ్ స్వామి నేను doctor అవ్వాలనుకుంటున్నాను నాకు seat వస్తుందా అని. ఉమ్ స్వామి చెప్పారు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది seat. నువ్వు పెద్ద doctor అవుతావు బంగారు అని. ఇప్పుడు ఆమె gynecologist అయి ఉందండి. ఆహా సో అది మొట్టమొదట స్వామితో కలిగినటువంటి అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకొక చిన్నది విషయం ఏంటంటే నేను ఒక photograph ఇచ్చాను స్వామికి sign చేయమని. ఉమ్ స్వామి sign చేసి ఒక్క photo చాలు బంగారు అన్నారు. ఆహా రోజు actually గా మా అక్క ఒక photo తీసుకొచ్చింది నేను ఒక photo తీసుకెళ్ళాను. ఉమ్ కానీ మా అక్క స్వామికి చూపించలేదు. ఉమ్ కానీ స్వామి ఒక్క photo చాలు అని నా నా నేను తీసుకెళ్ళిన photo మీద sign చేసి మమ్మల్ని bless చేసి స్వామి బయటకు పంపించారు. సో అది మొట్టమొదటి సారిగా స్వామితో మాకు అనుబంధం కలిగింది. మా అమ్మగారికి కూడా కొంత నమ్మకం కలిగింది. మా parents father mother ఇద్దరూ కూడా స్వామిని అప్పటి నుంచి believe చేయడం మొదలు పెట్టారు. ఉమ్ ఇది అయిన తర్వాత సత్యసాయి సేవా సమితిలో మా నాన్నగారు active గా participate చేస్తూ ఉండేవారు. ఉమ్ రోజుల్లోనే ఆంధ్ర agitation వచ్చింది. ఆంధ్ర agitation వచ్చినప్పుడు పెద్ద ఆసుపత్రి government హాస్పిటల్ అన్నీ కూడా strike వల్ల మూతపడింది. సో ప్రసవ ప్రసవ సమయంలో ఆడవారు బాధపడుతున్నారని ఒక building లో జగదాంబ junction ఉంది విశాఖపట్నంలో. అక్కడ లేపాక్షి అనేటువంటి ఒక building handicraft emporium కొత్తగా తయారైంది ఇంకా మొదలు పెట్టలేదు. ఉమ్ సో permission collector permission free deliveries కోసం gyne camp ఒకటి run చేస్తూ ఉండేవారు. ఉమ్ అయితే స్వామి దగ్గరికి వెళ్లి వచ్చాం కాబట్టి ఒక photograph తీసుకొచ్చి photograph కూడా ward లో పెట్టడం జరిగింది. ఉహు ఒకరోజు రాత్రి ప్రసవ వేదనతో ఒక ఆవిడ admit అయింది. ఉమ్ ఒక nurse ఉండేవారు. nurse చూసుకునేది ఏమైనా అవసరమైతే phone చేస్తూ ఉండేవారు. పక్కనే మా ఆసుపత్రి కాబట్టి మా అమ్మగారు వెళ్తూ ఉండేవారు. ఉహు రోజు రాత్రి ఆవిడ చాలా tired అయిపోయి నిద్రపోయారు. nurse nurse కూడా పడుకుంది nurse కూడా పిలవలేదు. మన్నాడు ఉదయం ఆవిడ rounds కి వెళ్లి చూడగా చక్కగా ప్రసవించి పిల్ల పక్కన పడుకోబెట్టి ఉందన్నమాట. ఉమ్ అయితే మా అమ్మగారు అడిగారట ఆవిడని. ఏమిటమ్మా నువ్వెందుకు నన్ను పిలవలేదు నేను అని nurse ని అడిగితే madam నేను చూడలేదు ఇప్పుడే delivery అయిపోయి ఉందని ఇప్పుడే చూశానంది nurse. ఉమ్ ఉమ్ అప్పుడు patient ని అడిగారు ఎవరమ్మ నీకు delivery చేశారంటే ఆవిడకి ఆవిడ ఒక ముస్లిం lady. ఉమ్ ఆవిడకి స్వా ఆవిడ ఏం చెప్పిందంటే స్వామి photo చూసి జుట్టు చూసి ఇదిగోండి photo లో ఉంది కదా nurse మే వచ్చి నాకు delivery చేసిందంది. [నవ్వు] నేను నిర్ఘాంతపోయాను ఏమిటి స్వామి రావడం ఏమిటి delivery చేయడం ఏమిటి ఏంటైందో అర్థం అవ్వలేదు మాకు. ఉమ్ కానీ అదొక incident జరిగింది రోజుల్లో. అంటే స్వామి రోజుల్లోనే విశ్వాసం కలిగించడానికి అదే అదే విధంగా తన భక్తులకి నిరూపించడానికి తానేనర్సు లాగా వచ్చి delivery చేసి వెళ్లారన్నమాట. అదే అయి ఉండాలండి. లేకపోతే ముస్లిం patient ఇలాంటి అనుభవం చెప్పడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో, అక్కడి నుంచి భగవంతుడు స్వామి-- భగవంతుణ్ణి నమ్మడం మొదలు పెట్టాము. నా ఆరోగ్యం కూడా చాలా కుదురుపోవడంతో మా parents ఇద్దరూ కూడా స్వామి మీద ఆహ్ అచంచలమైన భక్తి విశ్వాసాలు పెట్టుకొని స్వామే దేవుడని నమ్మడం మొదలు పెట్టారు. time నేను 1977లో ఒకసారి summer course జరుగుతూ ఉండేది బెంగళూరులో. ఉహు నేను అప్పుడు ఏడో తరగతి చదువుతుండేవండి. ఉమ్ సో, అక్కడికి doctor జయలక్ష్మి అని మా అమ్మగారికి assistant గా తను ఉండి work చేసేవారు. ఉమ్ ఆవిడ observer గా అక్కడ invitation వస్తే ఆవిడ ఆహ్ బెంగళూరు వెళ్తున్నారు. ఉహు సో, ఆవిడతో మా అమ్మగారు నన్ను కూడా పంపించారు సెలవులని. ఉమ్ time లో నేను బెంగళూరులో ఉండేవాడిని. సో, బయట white field బయట ఉండి స్వామి దర్శనం రోజూ చేసుకుంటూ ఉండేవాడిని. ఉహు అయితే ఒకసారి Vizag నుంచి ఎవరో వస్తున్నారని జీడిపప్పు, వేయించిన జీడిపప్పు ఒక packet తో స్వామి స్వా-- బెంగళూరుకి పంపించారు. ఉమ్ అయితే అది తీయగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఎప్పుడో పెద్ద పొట్టమ్మ చెప్పడం విన్నాను. ఉమ్ ఆవిడ అనేవారు స్వామికి వేయించిన జీడిపప్పు కానీ, వేరుశెనగపప్పు కానీ చాలా ఇష్టమని. ఉమ్ ఇది ఎలా అయినా స్వామికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఉమ్ కానీ నాలోనే వెంటనే ఒక భయం కూడా కలిగింది. ఉమ్ ఏంటంటే స్వామికి ఇంతమంది జనంలో నేను ఎలా ఇస్తాను అని బాధపడుతూ బాధపడుతూ నిద్రపోయాను. ఉమ్ అయితే కల్లో స్వామి కనబడ్డారు. ఉమ్ కనబడి నవ్వుతూ "అడగందే అమ్మాయినా పెట్టదు కదా బంగారు. నువ్వు అడుగు ఇవ్వకపో-" విన్నగానే ఇది dream ఎప్పుడైతే వచ్చిందో మొన్నాడు ఉదయం చాలా హుషారుగా లేచి ఒక plate, plate ఏమీ లేవు నా దగ్గర. ఉమ్ పక్క-పక్కింటి వారిని ఎవరినో అక్కడ ఒక plate అడిగి. ఉమ్ జీడిపప్పు తీసుకొని white field కి వెళ్ళాను. ఉమ్ కానీ స్వామి అప్పుడే బయలుదేరి institute కి వెళ్ళిపోయారు auditorium కి. ఓకే సో, auditorium లోకి నేను చిన్నపిల్లవాడిని. నన్ను లోపలికి పంపించలేదు. ఉమ్ సో, చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నీ దాటుకొని, ముళ్ళ కంచెలను దాటుకొని auditorium దిగుతున్నప్పుడు స్వామి car దగ్గరికి వెళితే ఏమైనా తీసుకుంటారేమోని ఆతృతతో పరిగెత్తుకు వెళ్ళాను. ఉమ్ కానీ నేను gate దగ్గర చేరేసరికి అక్కడి నుంచి కూడా స్వామి బయలుదేరి వెళ్ళిపోయారు. ఉమ్ అప్పుడు చాలా నిరాశ, నిస్పృహ నాలో వచ్చింది. ఉమ్ చాలా బాధపడ్డాను. ఉమ్ కానీ స్వామి తిరిగి బృందావనంకి వెళ్ళకుండా కనమంగళం వైపు అంటే ఇంకొక వైపు ష-శికారుగా వెళ్లారు car లో ఆరోజు. ఉమ్ సో, నాకు చాలా సంతోషం వేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక bridge ఉంటుంది అక్కడ. అవును bridge దగ్గర car slow అవుతుందని ఎప్పుడో విన్నాను. ఆహా అందుకనే bridge దగ్గర నిలబడ్డాను. కష్టాన్నంతా చూసి స్వామి మనసు కరిగి. స్వామి car లో వెనక్కి వస్తూ. car ని నా దగ్గర ఆపారు. ఉమ్ ఆపి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. "నీ పేరేమిటి బంగారు?" "నీవు ఊరు నుంచి వచ్చావు?" ఉమ్ అని ఇలా ప్రశ్నించి, నేను ఇచ్చినటువంటి జీడిపప్పు, రెండు జీడిపప్పులు తిన్నారు అండి. తిన్నారు. తిన్న తర్వాత చాలా ఆనందం వేసింది. నేనేం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే భగవంతుడు వచ్చి ఆగి మనం ఇచ్చే చిన్న వస్తువుని నోట్లో వేసుకున్నాడంటే చాలా తన్మయత్వంలో ఉండిపోయాను నేను. డాక్టర్ ఇది జరిగినప్పుడు మీ వయస్సు ఎంత? నాకప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఏడో తరగతి. అంటే గట్టిగా పదకొండు, పన్నెండు పన్నెండేళ్ళు. పన్నెండు, పన్నెండేళ్ళు ఉంటాయి. ఆహా ఇది జరిగిన తర్వాత స్వామి car మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళింది. ఉమ్ మళ్ళీ car ఆపారు. ఉమ్ car ఆపి వెనక్కి తిరిగి "నువ్వే class చదువుతున్నావు?" అన్నారు. ఉమ్ ఉమ్ "స్వామి నేను ఏడో తరగతి" అన్నాను. ఉమ్ "అయ్యో అంతేనా" అన్నారు స్వామి. [నవ్వు] అని అప్పుడు నేను అన్నాను "స్వామి జీడిపప్పు అంతా మీకోసమే తీసుకొచ్చాను స్వామి" అంటే, "తిన్నాను కదా బంగారు" అన్నారు. "అలా కాదు స్వామి, ఇదంతా మీరే తీసుకోవాలి" అన్నాను. ఎంతో ప్రేమగా. మొత్తం packet తీసుకొని ఒళ్ళో పెట్టుకొని "ఉమ్ సరేనా" అని. [నవ్వు] రాధాకృష్ణ గారు drive చేస్తున్నారు అప్పుడు. "ఆ రాధా పోనీ" అన్నారు. అంటూ car లో ఆనందంగా వెళ్ళిపోయారు. ఆహా అది నాకొక stimulation గా జరిగింది. స్వామి అంతేనా అన్నారంటే తొందరగా పదో class అయిపోవాలి అనేటువంటి తాపత్రయం పట్టుకుంది. ఆహా సో, ఏడో class నుంచి పదో class వరకు ప్రతిరోజూ స్వామికి ఒకటే prayer. "నీ college లో రావడానికి ఎంత percentage కావాలో అది ఇవ్వు నాయనా." "నేను నీ college లోకి రావాలి" అనే తపన ఉండేది. ఇంకా కొద్ది రోజులు ముందుకు వెళ్ళాయి. ఉమ్ మా అమ్మగారు, నాన్నగారు కూడా "స్వామిని అడుగుదాం ఏం చేయాలి next, ఎందులో join చేయాలని అడుగుదాం" అని చెప్పి వారిద్దరూ వచ్చారు. ఉమ్ అనుకోకుండా ఆవిడ ప్రశాంతిలో ఉండగానే మా అమ్మగారు జారిపడి ఆమె కుడిచేయి fracture అయింది. ఉమ్ ఆమె gynecologist. కుడిచేయి fracture అంటే చాలా ఆమె కుడిచేత్తో చాలా పని ఉంటుంది important. అవును Fracture అయిన తర్వాత చాలా బాధపడుతూ ఆరోజు morning స్వామికి ఒక ఉత్తరం ఇచ్చాను. ఉమ్ అప్పుడు స్వామి దయామయుడు కదండీ. ఉమ్ చాలా కరుణామయుడు. ఆయన వెంటనే interview కి పిలిచారు. ఆహా మా అమ్మగారు, నాన్నగారు, నన్ను ముగ్గురినీ పిలిచారు. ఉమ్ ఉమ్ పిలిచి స్వామి చెప్పారు "వీడిని medicine చేయించండి" అని చెప్పారు. ఉమ్ అంటే నేను స్వామి రెండు పాదాలు పట్టుకొని ఆరోజు ఏడ్చాను. "స్వామి నన్ను పంపించొద్దు స్వామి. నేను ఇక్కడే మీ దగ్గరే ఉండిపోతాను. అవును నన్ను దూరంగా పంపొద్దు" అని. అప్పుడు స్వామి ఒక ఒక తల్లి బిడ్డని ఎట్లా తీసుకుంటుందో అట్లా చాలా ప్రేమగా చెప్పారన్నమాట. "అది కాదు బంగారు, నువ్వు doctor అయ్యి రావాలి. ఉమ్ నువ్వు తిరిగి వచ్చాక నువ్వు ఇక్కడ hospital లో work చెద్దు గాని. నీకు నేను ఇక్కడ job ఇస్తాను. అప్పుడు నువ్వు work చెద్దు గాని" అని. అయితే- అప్పట్లో పుట్టపర్తిలో hospital ఉండేదా అండి? అప్పట్లో ఎనభై రెండు అది. ఎనభై రెండులో general hospital తప్ప కొండమీద చిన్న general hospital ఉండేది. ఓకే నేనేమనుకున్నానంటే time లో అంటే మనం మానవులం కదండీ. మనకి అంత ఆలోచన, దూరదృష్టి ఉండదు. అవును నేనేం విధంగా అనుకున్నానంటే స్వామి నన్ను దూరంగా పంపేయడానికే ఇలా అనుకుంటున్నారు, అంటున్నారు. అవును ఉమ్ అంతేగాని చిన్న hospital, ఇక్కడున్న doctor లకే ఏం పని లేదు. నేను చదివి మళ్ళీ వచ్చే వరకు hospital అసలు ఉంటుందా అనేటువంటి ఆలోచనలు నాలో వచ్చాయి ఆరోజు. అదే అదే అప్పుడు స్వామిని అన్నాను "స్వామి నన్ను ఇలా పంపేయొద్దు స్వామి. నన్ను మీ దగ్గరే ఉంచుకోండి" అని. ఉమ్ అంటే స్వామి చెప్పారు "లేదు బంగారు, నువ్వు doctor అయ్యి వస్తావు. ఉమ్ నువ్వు doctor అయ్యి వచ్చాక నేను ఇక్కడ hospital లో నీకు మళ్ళీ ఉద్యోగం ఇస్తాను. నువ్విక్కడ పని చెద్దు గాని" అని చెప్పారు. అదే అది చెప్పిన తర్వాత ఇంక నేనింకేం మాట్లాడలేకపోయాను. అదే అయితే ఒక విషయం చెప్పారు స్వామి. నువ్వు hostel కి వెళ్తావు కదా. ఉమ్ నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు పుట్టపర్తి లాగా నీకుండదు. ఉమ్ అక్కడ రకరకాలైనటువంటి పిల్లలుంటారు. ఉమ్ వాళ్ళందరూ యువత రకరకాలుగా మారి ఉంటారు. ఉమ్ కానీ నువ్వు వాళ్ళందరితో మంచిగా వాళ్ళతోనూ ఒక్కడిలాగే మెసు-మసలుతూ. ఉమ్ స్వామి యొక్క principles అన్నీ నీ హృదయంలో పెట్టుకొని disciplined గా ఉండాలి బంగారు అని చెప్పారు. ఉమ్ అది చాలా మంచి guidance అండి నాకు. ఉమ్ Throughout my education స్వామి చెప్పిన ఒక మాట ఒక వేదవాక్కు అది ఎప్పటికీ అలా ఉండిపోయింది అన్నమాట. నేనుతొంభై ఐదులో నా MD complete చేశానండి. చేసిన వెంటనే స్వామి హాస్పిటల్లో ఇస్తా అని అప్పటికి super speciality hospital కూడా వచ్చేసింది. సో స్వామి అన్నారు కాబట్టి తప్పకుండా నాకు ఇస్తారనేటువంటి ధైర్యంతో నేను మా ఇంట్లో అందరికీ చెప్పి నేను వెళ్తున్నాను స్వామి దగ్గరికి స్వామి ఇస్తే అక్కడే ఉండిపోతానని చెప్పి వచ్చేసాను. అయితే మా భార్య తర్వాత మా అమ్మగారు అంటున్నారు ఏదో వీడు వెళ్తున్నాడు గాని నిజంగా స్వామి వీడికి ఇస్తారా లేకపోతే వీడు అక్కడ ఉంటాడా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ నేను మటుకు దృఢంగా స్వామి కోసం అంటూ వెళ్ళాను. ఒక నెల రోజులు స్వామి నాతో ఏం మాట్లాడలేదు. నెల రోజులు కూడా ప్రతి రోజూ నేను స్వామిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. స్వామి మీరు నన్ను తీసుకుంటా అన్నారు హాస్పిటల్ లో నేను మీ కోసం తిరిగి వచ్చాను నన్ను తిరిగి హాస్పిటల్ లో తీసుకోవాలని ప్రార్థిస్తూ ఉండే వాడిని. అయితే ఒకరోజు చాలా చక్కటి ఒక దృశ్యం చూపించారు నాకు స్వామి. అదేమిటంటే కలలో కల అది నిద్రలో ఉన్నప్పుడు కలలో ఏమిటంటే స్వామి నాకు super speciality hospital వరండా corridor చూపిస్తూ వెళ్ళు అని చెప్పారు. అంటే నేను ఒక చిన్న suitcase తో corridor లో నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. సో అది చాలా happy అనిపించింది నాకు. dream లో కనిపించింది కాబట్టి స్వామి తప్పకుండా చేస్తారేమో అనేటువంటి ఇంకొంచెం దృఢనమ్మకం నాకు కలిగింది అన్నమాట. అయితే interview పెట్టారు అనుకోకుండా అప్పుడు applications call for చేశారు. ఎవరో ఒక విద్యార్థి చెప్పడం వల్ల నేను కూడా application పెట్టాను. application లో ఆరుగురు వచ్చారు ఆరోజు ఆరుగురు కూడా interview చేశారు. interview చేసిన తర్వాత ఆరుగురిని interview చేసి ఎవరిని select చేశారో స్వామికి వారు చూపిస్తే గాని announce చేయరు తిరిగి. సో ఇంకా నేను suspense లోనే ఉన్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే స్వామికి వాళ్ళు select చేసిన list లో నా పేరు ఉందని అది స్వామికి చూపించగానే స్వామి వెంటనే "వీడు మన వాడే మన దగ్గరే చదివాడు" అని స్వామే వాళ్ళతో చెప్పారని. తర్వాత స్వామి "చాలా వీడికి ఇవ్వండి" అని కూడా స్వామి approve చేశారు. తర్వాత మన్నాడు స్వామి వచ్చి director ని అడిగారు "వీడికి ఇచ్చావా లేదా" అని. చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి అయితే ఆరోజు చాలా wonderful discussion జరిగింది. first time స్వామి english లో మాట్లాడినది విన్నాను. ఎందుకంటే ఆరోజు వరండాలో Italian prime minister brother Craxi ఉన్నారు. తర్వాత శ్రీలంక నుంచి ఒక minister వచ్చారు. ఆయన కూడా అక్కడ ఉన్నారు. చాలామంది తెలుగు రాని వ్యక్తులందరూ అక్కడ వరండాలో ఉన్నారు. సో స్వామి english లో మాట్లాడటం మొదలు పెట్టారు. నా దగ్గరికి వచ్చి "నువ్వు college లో చదివావు బంగారు" అన్నారు. అంటే "స్వామి నేను Manipal లో చదివాను స్వామి" అన్నాను. "Manipal లో students చాలా వ్యసనాలకి తాగుడుకి అలవాటు బానిసలై ఉంటారు కదా" అన్నారు. "కొంతమంది ఉన్నారు స్వామి" అన్నాను. "ఎప్పుడైనా నీకు తూరైనా నీకు రుచి చూపించారా" అని అడిగారు. "అయ్యయ్యో లేదు స్వామి" అన్నాను. స్వామి ఎంతో ఆనందించి వెంటనే అన్నారు "Swami's student discipline discipline అని several years back he was studying here then he went for medicine and his mother is a big doctor in Vizag now he is come back to work with Swami" అని english లో స్వామి చెప్పారన్నమాట వాళ్ళందరికీ అర్థం అయినట్టు. చాలా సంతోషం అని పాద నమస్కారం ఇచ్చి నాకు అక్కడ లోపల join అవడానికి permission ఇచ్చారన్నమాట. స్వామిని గాని మన medicine లో involve చేసి స్వామి యొక్క advice తీసుకుంటే medicine చాలా beautiful గా ఉంటుందని అనేవారు. అదేమిటా అని నేను ఎప్పుడూ అలాంటి చవి చూడాలని ఊళ్ళు ఊరుతూ ఉండేవాడిని. అలాంటి ఒకటి రెండు సంగతులను స్వామి నా యొక్క కోరిక మీద కల్పించారు అనమాట. చాలా బాగుంది. doctor గారు మీరు ఒక్కొక్క అంశం చెప్తూ ఉంటే ఎంత సేపైనా వినాలనిపిస్తోంది. అంటూ ఉంటారు doctor treats and then divine divinity cures అని అంటూ ఉంటారు. మీ doctor గా ఒక doctor గా మీ experience లో దీన్ని చూశారా? అంటే మీరు treat చేస్తూ ఉంటే స్వామి విధంగా cure చేశారు? జటిలమైన patients అటువంటి cases ఏవైనా చూశారా? వాటి గురించి చెప్తారా? చూశానండి. మూడు cases చాలా అద్భుతమైనవి scientific గా explain చేయలేనివి కూడా. ఒకటి ఏమిటంటే ఒక బృందావన్ college నుంచి sports time లోని చాలామంది పిల్లలు Bengaluru నుంచి వచ్చి పుట్టపర్తిలో చేస్తూ ఉంటారు. అందులో ఒక అబ్బాయి pneumonia తో బాధపడుతూ వచ్చాడనమాట. సో అబ్బాయిని admit చేశాం hospital లో. x-ray తీస్తే x-ray లో lung infection pneumonia అంటాం. సో lung infection ఉండింది. urine లో కూడా blood పోతుంది. అదొక complication of pneumonia glomerulonephritis అంటాం. ఇటువంటి complication pneumonia తో అబ్బాయి admit అయ్యాడు hospital లో. అయితే మన్నాడు ఇంకా మేము investigations అవి carry out చేస్తున్నాం. లోపు మన్నాడు స్వామి hospital rounds కి వచ్చారు. వచ్చి ICU లో ఉన్న అబ్బాయి దగ్గరికి రాగానే అబ్బాయి student కాబట్టి మంచం దిగి స్వామి యొక్క పాదాలను ముట్టుకున్నాడు. అప్పుడు స్వామి అడిగారు "ఏమైంది అబ్బాయికి" అని. నేను ఆరోజు స్వామితో పాటు rounds follow అవుతున్నాను. చాలా ఆనందమైనటువంటి దినం ఆరోజు. అప్పుడు నేను వెంటనే చెప్పాను "స్వామి అబ్బాయికి pneumonia వచ్చింది" అని చెప్పాను. స్వామి ఒక్క నిమిషం అలా ఆలోచించి "streptomycin ఇవ్వండి తగ్గిపోతుంది" అన్నారు. "streptomycin ఇవ్వండి తగ్గిపోతుంది" అన్నారు. okay. అని వెళ్ళిపోయారు. okay. అయితే మా boss ఉన్నారు అప్పుడు. ఆయన అడిగారన్నమాట "స్వామి ఇలా చెప్పారు గాని మనం ఎలా ఇవ్వాలి? మిగతా doctor లు చాలామంది devotees కాని వాళ్ళు కూడా super speciality లో work చేస్తున్నారు. మరి streptomycin ఇస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో? ఇప్పుడు రోజుల్లో అంత streptomycin ఎక్కువగా మనం వాడటం లేదు కదా" అని అనుకున్నారు. అని నేను అన్నాను "divine order వచ్చింది కాబట్టి ఒక dose ఇద్దాం. తర్వాత స్వామిని మళ్ళీ అడుగుదాం. ఒక dose ఇవ్వడం వల్ల there is no problem ఎందుకంటే అది antibiotic కాబట్టి అది ఇద్దాం" అని చెప్పి ఒక dose as case sheet లో కూడా నాకు బాగా గుర్తు రాశాను as advised by as per divine orders అని రాసి injection streptomycin ఒక పాయింట్ ఫైవ్ grams ఇచ్చేశాం. ఇటువంటిది doctor గారు బహుశా hospital లో world లో ఉండదు ఏమో. Definitely జరిగుండదు జరిగుండదు. అయితే injection intramuscular injection ఒక injection ఇచ్చాను. అయితే ఇచ్చాం గాని ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏమిటి అతనికి TB ఉందా, మరొకటి ఉందా ఇలాంటి ఆలోచనలు చాలా నా mind లో తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే I should be justified in using a medicine. Of course pneumonia కి కూడా streptomycin ఇచ్చిన రోజులు పూర్వం రోజుల్లో ఇచ్చేవారు antibiotic therapy ఎక్కువ లేనప్పుడు. ఇప్పుడు ఇంకా చాలా superior antibiotics వచ్చాయి కాబట్టి పాత medicines ఎక్కువగా మనం వాడటం లేదు. కానీ భగవాన్ చెప్పిన తర్వాత అందులో ఏదో సత్యం ఉందని అనుకున్నాను. ఆరోజు సాయంకాలం నాలుగు గంటలు అయింది. స్వామి hostel కి ఒక doctor గారు ఉండేవారు Kishor అని. doctor గారిని నేను పిలిచి ఒక మాట చెప్పాను. "doctor గారు మీకు స్వామితో మాట్లాడడానికి మీకు సన్నిహిత ఉంటుంది because మీరు hostel doctor గారు కాబట్టి. మీరు అడగాలి స్వామిని streptomycin ఎందుకు ఇవ్వమంటున్నారు? అబ్బాయికి ఏమైనా TB ఉందా? అయితే TB dose ఇవ్వాలా, ఎంత dose ఇవ్వాలి, ఎన్నాళ్ళు ఇవ్వాలి ఇది మీరు కొంచెం స్వామిని అడగాలండి. లేకపోతే మేము మా boss ని ధిక్కరించి నేను ఇవ్వలేను కదా injection" అని చెప్పి చెప్పాను. ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇద్దరం బయలుదేరాం కలిసి బయలుదేరాం. ఇద్దరం వెళ్ళి స్వామి interview room ఉన్నాం. ఇద్దరం ముందు doctor లను ముందు కూర్చోనిస్తారు కాబట్టి వరండాలో ఆయన ఒకవైపు నేను ఒకవైపు ఇద్దరం కూర్చున్నాం. స్వామి interview అవుతూనే నవ్వుకుంటూ బయటకు వచ్చారు. నవ్వుకుంటూ బయటకు వచ్చి అబ్బాయి Kishor గారి దగ్గర నిలబడ్డారు. నిలబడిచాలా చమత్కారంగా చాలా చక్కగా నవ్వుతూ ఏం చెప్పారంటే స్టెప్టోమైసిన్ టీబీ ఏమీ లేదు వాడికి కానీ స్టెప్టోమైసిన్ antibiotic ఇలా ఇవ్వండి అన్నారు. ఇక నా మొదటి doubt తీరిపోయింది. తీరిపోయింది రెండోది చెప్పారు స్టెప్టోమైసిన్ పెద్ద dose ఇవ్వకూడదు చాలా small dose ఇవ్వాలి పాయింట్ ఫైవ్ ఇవ్వండి లేకపోతే hearing problem వస్తుందని. actual గా స్టెప్టోమైసిన్ high doses వాడితే ototoxicity అనేటువంటి scientific problem ఉంటుందన్నమాట. అంటే scientific మనకు తెలుసు ot toxicity అంటే ear damage వస్తుంది internal ear. సరే సో స్వామి చెప్తున్నారు ఎక్కువ dose ఇస్తే ear పాడవుతుంది పాయింట్ ఫైవ్ మిలిగ్రామ్ ఐదు రోజులు ఇవ్వండి పూర్తిగా clear అయిపోతుంది అని అక్కడితో శాసనం పూర్తి చేశారు. ఓకే [నవ్వు] సో నా doubts అన్ని తీరిపోయాయి. ఉమ్ స్వామి చెప్పిన ప్రకారమే ఐదు రోజులు స్టెప్టోమైసిన్ ఇచ్చాం. ఉమ్ ఐదు రోజుల తర్వాత మా inquisitive nature వల్ల రోజు x-ray తీసాం. ఉమ్ మీరు చెప్తే నమ్మరు x-ray, x-ray ఒకటా కాదా total గా clear అయిపోయింది normal గా pneumonia resolve అయిన తర్వాత x-ray లో resolve resolution రావాలి అంటే అంటే x-ray normalize అవ్వాలి అంటే కొన్ని వారాలు తప్పకుండా పడుతుంది. ఉమ్ ఐదు రోజుల్లో pneumonia పూర్తిగా మాయమై వేరే x-ray కింద మారిపోవడం అనేటువంటిది it's a miracle అండి. Miracle scientifically we cannot explain that it's a wonderful thing ఉమ్ but it has happened in Sathya Sai hospital and this I'm a witness to what has happened to Bhagwan's miracle. అద్భుతం అండి. Doctor గారు మనం ఎన్నో విన్నాం experiences, devotees, Swami cancer cancel అంటే cancer cancel విధంగా చేసినవి తన విభూది ఇచ్చి cure చేసినవి ఎన్నో ఉండగా కూడా విధంగా doctor చేత వాళ్ళ medicine నే వాడించి dosage లో ఇవ్వాలి అనేది కూడా చెప్పి అది తగ్గించడం అనేది ఇదంతా కూడా doctors లో కూడా ఒక విశ్వాసం పుట్టించడానికి అన్నమాట అవుతుంది. అవుతుందండి మీరు ఏ-ఏ-ఏ organ తీసుకోండి ఉమ్ Bhagwan involve అయి Bhagwan చెప్పింది medical గా చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా అది cancer cancel అనేటువంటిది నేను ఒక చిన్న విషయం చెప్తాను మా ఇంట్లో జరిగింది. ఉమ్ నేను ఇంకా అక్కడ work చేస్తున్నాను. ఉమ్ తొంభై తొంభై ఏళ్ళు ఉమ్ అయితే స్వా మా మదర్ doctor మంగమ్మ గారికి ఆవిడకి sudden గా ఒకరోజు bathroom లో పడి విపరీతమైన వెన్ను నొప్పి వచ్చిందన్నమాట. ఉమ్ అయితే CT scan అంతా అప్పుడు చేశారు కానీ అక్కడెక్కడ fracture కానీ ఏం లేదు కానీ ఆవిడ లేచి నిలబడలేకపోయేవారు. ఉమ్ ఒక సంవత్సరం పాటు ఆవిడ bed మీదే ఉన్నారు. అబ్బా! ఉమ్ అయితే ఒకసారి అది అది పడిన వెంటనే స్వామికి నేను inform చేశాను స్వామి బృందావన్లో ఉన్నారు. ఉమ్ అప్పుడు స్వామి అన్నారు చిన్న fracture కదా ఉమ్ బాగుంటుందిలే అన్నారు. ఉమ్ కానీ fracture ఎవరికీ కనబడలేదు. ఉమ్ పెద్ద పెద్ద orthopedicians అంతా Vizag లో విశాఖపట్నం లో ఉన్న పెద్ద orthopedicians అందరూ వచ్చి చూశారు. ఉమ్ ధర్మారావు గారు, కైలాసరావు గారు అందరూ చూశారు. ఉమ్ కానీ fracture CT scan లో కనబడలేదు. కనబడలేదు. సంవత్సరం ఆవిడ కర్మ తీరే వరకు సంవత్సరం కూడా bed bed మీదే ఆవిడ చాలా ఇబ్బంది పడి అన్ని bed మీదే అయ్యాయన్నమాట. ఉమ్ చాలా depress అయ్యేవారు ఎందుకంటే ఆవిడ ఎవరితో చేయించుకొని ఎరగరు. ఉమ్ అయితే సంవత్సరం అయిన తర్వాత MRI scan కొత్తగా Vizag వచ్చింది. ఉమ్ అప్పుడు MRI scan తీశారు. ఉమ్ MRI scan లో fracture అయ్యి ఒక vertebrae ఇంకో vertebrae ను నొక్కుకుంటూ కనబడింది. అంటే స్వామి one year క్రితమే చెప్పారు చెప్పారు fracture ఉందని కానీ మాకు తెలియలేదు. అదే అంతే కాకుండా MRI scan లో ఉమ్ ఒక పెద్ద tumor లాగా ఒక mass ఒకటి vertebrae ని విరగ్గొట్టిన vertebrae పడిపోవడం వల్ల కాదు యొక్క mass వల్ల vertebrae విరిగిపోయినట్టుగా MRI లో కనబడుతోంది. అయితే ఇక్కడ doctor విష్ణుప్రసాద్ గారిని Vizag లో neurologist plus orthopedician ఉమ్ ఆయన్ని చూశారు. ఆయన friend Madras లో ప్రశాంత్ ఆయన దగ్గరికి యొక్క x-rays కూడా పంపించారు. ఉమ్ తర్వాత విశా మన పుట్టపర్తిలో కూడా doctor నియోగి అని orthopedic doctor గారున్నారు. ఆయనకి కూడా MRI scans చూపించాం. ఉమ్ వాళ్ళందరూ opinion ఏమిటంటే ఒక పెద్ద tumor ఏదో అక్కడ ఉంది అది TB అన్న అవ్వాలి లేదా cancer అన్న అవ్వాలి. ఉమ్ దాని వల్లే యొక్క fra vertebrae fracture అయ్యి spinal cord మీద నొక్కుతుంది కాబట్టి ఆవిడ లేచి నిలబడలేకపోతున్నారని ఒక నిర్ధారణకు వచ్చారు. ఉమ్ అయితే అది operate చేయాలని చెప్పారు. ఉమ్ అయితే వయసులో ఆమెకు operate అప్పుడు ఆమెకు almost డెభై ఏళ్ళు అబ్బా ఎలా operate చేయాలా లేదా అని చాలా భయపడ్డాం అన్నమాట. ఉమ్ ఉమ్ స్వామి దగ్గరికి వెళ్ళాను. ఉమ్ veranda లో కూర్చున్నాను స్వామి చాలా అపారమైన ప్రేమతో దగ్గరికి వచ్చారు. ఉమ్ రాగానే స్వామి అమ్మకి operation అంటున్నారు అన్నాను. స్వామి ఒక్క నిమిషం ఆలోచించి చేయమను అన్నారు. ఉమ్ అంటే స్వామి cancer అంటున్నారు స్వామి అన్నా. ఉమ్ cancer cancer ఏమీ లేదు operate చేయమను ఆమె బాగా నడుస్తుంది అన్నారు స్వామి. ఉమ్ ఉమ్ ఉమ్ నేను వెంటనే Madras వెళ్లి ఉమ్ doctor గారికి చెప్పాను. ఉమ్ ఆయన ఒకటే మాట అన్నాడు మీరు మీ తల్లి గారి doctor మీ-మీరు doctor కదా మీ తల్లి గారికి ఉన్న రోగాన్ని మీరు accept చేయట్లేదని. ఉమ్ ఉమ్ ఏమనండి స్వామి చెప్పారు మీరు operate చేయండని. ఉమ్ ఆయన విశాఖపట్నం flight లో వచ్చారు. ఉమ్ విష్ణుప్రసాద్ గారు, కిక్కడి గారు ఇద్దరూ కలిసి operate చేశారు. ఉమ్ వాళ్ళు నవ్వుతూ బయటకు వచ్చి చెప్పారు మేము open చేశాం అక్కడ ఏం mass లేదు, TB లేదు, cancer లేదు just ఒక చిన్న fracture ఉంది దానికి రెండు plate లు వేసి బయటకు వచ్చేసాం అని. అద్భుతం ఇప్పటికే ఆమె ఒంటరిగా పుట్టపర్తి వెళ్ళిపోయి హాయిగా నెల రోజులు కూడా స్వామి దగ్గర ఉండి వస్తున్నారు. అద్భుతం అండి సో అది స్వామి అనుకుంటే మటుకు ఏదైనా cancel చేయగలుగుతారు. cancel చేయగలుగుతారు స్వామికి యొక్క పవర్ ఉంది అని నేను చెప్పగలుగుతాను. పవర్ అది స్వామి college లో ఉన్నప్పుడు స్వామి విద్యార్థిగా తర్వాత hospital లో ఉన్న ఆనందాన్ని ఎప్పటికీ అలా ఉంచుకోవాలంటే service లో compulsory గా ఉండాలండి. ఉమ్ దాంతో స్వామికి చాలా దగ్గరగా కూడా చేరువుగా అవుతూ ఉంటాము. Vizag వచ్చిన దగ్గర నుంచి కొన్ని activities ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోని సమితితోని చేయూత తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటివరకు ఒక వెయ్యి cataract operations నిర్వహించాం గత ఏడు ఏడు సంవత్సరాలుగా. every month tribal areas నుంచి interior villages నుంచి కొంతమంది వాళ్ళని తీసుకొచ్చి operations చేసి eye operation చేసి వాళ్ళకి eye లోనే intraocular lens అయ్యి అమర్చడం జరుగుతోంది. ఉమ్ ఇవి కాకుండా villages లోని veterinary camps చాలా veterinary camps తర్వాత gynec screening camps చాలామందికి cancer ఉందని కూడా తెలీదు. so కొంతమంది gynecologist ని తీసుకెళ్ళి children and gynec mother and child health కి కొంతవరకు చాలా మటుకు camps conduct చేసాము. blind school కి కూడా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులకు కావలసినటువంటి newspapers ఎందుకంటే Braille లిపి అంతా కూడా వాళ్ళు ఉమ్ newspaper నుంచే చేస్తారు newspapers collect చేసి వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళకి అప్పుడప్పుడు భోజనం ఏర్పాటు చేయడం తర్వాత medical checkup చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నిటికన్నా ఇంకా చాలా ఆనందం కలిగించేది ఏమిటంటే మధ్య eye screening camps conduct చేస్తున్నాం wherein government schools లో ఉన్న పిల్లలకి ఏమన్నా spectacles ఏమన్నా అవసరమా? వాళ్ళకి refractive errors చాలా మందికి ఉంటున్నాయి ఎందుకంటే TV ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి పిల్లలు TV దగ్గరగా చూడటం వల్ల వాళ్ళకి refractive errors అవి develop చేస్తున్నారు. ఉమ్ సో eye screening camps కూడా కొంత కొంతవరకు conduct చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక ఇరవై వేల మంది పిల్లలకి screening చేసి చాలా మందికి అవసరమైన వాళ్ళందరికీ spectacles ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు చలికాలంలో blankets అవి కప్పడం ఇవన్నీ normal అన్ని చోట్ల జరుగుతున్న సేవా కార్యక్రమాలే జరుగుతున్నాయి. తర్వాత old age homes కి వెళ్ళి వాళ్ళకి వాళ్ళతో కాసేపు spend చేసి వాళ్ళకి భోజనం ఇచ్చి పండగ పండగ దినములలో అప్పుడప్పుడు వెళ్తుంటున్నాం వెళ్తున్నాం ఒక్కొక్కసారి. ఉమ్ ఇవన్నిటికన్నా ఆనందాన్నిచ్చేది అంటే youth retreats కొన్ని conduct చేస్తున్నాము. ఉమ్ అందులో అంటే సమితి యొక్క సహాయంతో ఇవి జరుగుతున్నాయి. youth అందరినీ పిలిచి వాళ్ళకి మనోవికాసానికి ఉమ్ తర్వాత ఎటువంటి path తీసుకోవాలి చెడుని ఎలా వద్దనాలి మంచిని ఎలాగా invite చేయాలి అనేటువంటివి కొంతమంది professional speakers ని పిలిచి వాళ్ళ help తో విద్యార్థులందరికీ చెప్పడం జరుగుతున్నాయి ఇవి. ఇవి చాలా చాలా మార్పు కూడా తెస్తున్నాయి వాటిలో కొంతమంది పిల్లలు వెనక్కి వచ్చి వాళ్ళు చెప్తున్నారు youth retreat అయిన తర్వాత మేము కొన్ని వ్యసనాలు వదిలిపెట్టామని ఉమ్ మా యొక్క జీవన విధానాన్ని మార్చుకున్నామని కూడా వాళ్ళు కొంతమంది వచ్చి చెప్పారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఇవి కాకుండా ప్రతి నెల professionals, doctors, lawyers లాంటి వాళ్ళని కొంతమందిని పిలిచి వారికి ఒక breakfast arrange చేసి ఒక forty five minutes to one hour ఎవరైనా speaker ని పెట్టి spiritual life ఎలా lead చేయాలి spirituality అంటే ఏమిటి అని అలాంటివి కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. [背後音樂] ఇంతవరకు మీరు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి doctor సి.ఎస్. శ్రీనివాస్ గారి అనుభవాలను విన్నారు. కార్యక్రమం విశాఖపట్నం లోని ప్రేమవాణి studios యందు record చేయడమైనది. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం!
SSSMC · audio

Telugu Broadcast - 394

Home

Telugu Broadcast - 394

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 57:10

More in this series

Telugu Broadcasts

12 episodes · 11 hr 32 min

  1. 57 min 394

    Telugu Broadcast - 394

    Now playing
  2. 1 hr 396

    Telugu Broadcast - 396

  3. 58 min 402

    Telugu Broadcast - 402

  4. 58 min 420

    Telugu Broadcast - 420

  5. 56 min 424

    Telugu Broadcast - 424

  6. 57 min 427

    Telugu Broadcast - 427

  7. 57 min 490

    Telugu Broadcast - 490

  8. 56 min 491

    Telugu Broadcast - 491

  9. 56 min 498

    Telugu Broadcast - 498

  10. 58 min 555

    Telugu Broadcast - 555

  11. 57 min 560

    Telugu Broadcast - 560

  12. 58 min 561

    Telugu Broadcast - 561