Skip to content
Transcript తెలుగు
[సంగీతం] రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు కార్యక్రమంలో ముందుగా శ్రీ త్యాగోపనిషత్ శ్రీ త్యాగరాజ కృతులపై ఒక విశ్లేషణ. తదుపరి శూన్యత నుండి పూర్ణత వైపు భగవాన్ బాబా వారి మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో సంభాషణ రెండవ భాగం. వాగ్గేయకారుల త్రయంలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామివారు ఒకరు. వారి ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్ర ప్రభువును త్యాగరాజు తమ కృతులతో అర్చించారు. భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ శ్రీ త్యాగరాజ కృతులపై విశ్లేషణను శ్రీ త్యాగోపనిషత్ పేరిట ధారావాహికంగా మీకు అందజేస్తున్నారు. కృతుల సుమహారంలో తొలి సుమంగా ధేనుక రాగంలో రచించిన తెలియలేరు రామభక్తి మార్గమును అన్న కృతిపై విశ్లేషణ మీరు వినండి. [సంగీతం] ఓం శ్రీ సాయిరాం! జయంతీతే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం అని శ్రీ భర్తృహరి నుడివినట్లు చక్కని కృతులు రచించిన వారు చిరస్మరణీయులు. వారి యశఃకాయమునకు జరా మరణాదులు ఉండవు. వారి కీర్తి శాశ్వతము, ఆచంద్రతారార్కము. అట్టి కొందరి వాగ్గేయకారుల జీవిత చరిత్రలను గురించి తెలుసుకొనుట ఎంతయో సమంజసము. వారిలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి గురించి తెలుసుకుందాం. వీరు క్రీస్తు శకము పదిహేడు వందల అరవై ఏడు నుండి పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరం వరకు తమ జీవితమును గడిపిరి. శ్రీ త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షీతులు, శ్యామశాస్త్రి అను సంగీత త్రిమూర్తులు ముగ్గురును సమకాలికులు. ముగ్గురును తంజావూరు జిల్లాలో కావేరి నదీ తీరమున గల తిరువారూరు అను గ్రామమున జన్మించుట దేశము యొక్క మహత్భాగ్యం. శ్రీ త్యాగరాజస్వామి సొంటి వెంకటరమణయ్య గారను గురువు వద్ద సంగీతమును అభ్యసించారు. శ్రీ త్యాగయ్య గారు సంస్కృత, ఆంధ్ర, వేదశాస్త్ర, జ్యోతిష, సంగీత శాస్త్రములలో ఘనత వహించిన ఆంధ్రులు. వీరి కృతులన్నియు చక్కని తెలుగు భాషలో నుండుట ఆంధ్రుల పుణ్యవిశేషం. వీరు మహా భక్తులగుటయే గాక శ్రీరామోపాసకులై శ్రీరామచంద్రులను ప్రత్యక్షముగా దర్శించిన మహనీయులు. ఒక సమయమున శ్రీ నారద మహర్షి ఒక సన్యాసి రూపమున వచ్చి వీరికి స్వరాన్నవము అను సంగీత శాస్త్ర గ్రంథమునిచ్చి అంతర్ధానమైనారు. శ్రీ త్యాగయ్య గారు ఇరవై నాలుగు వేల కృతులను, పెక్కు దివ్య నామ సంకీర్తనలను, ఉత్సవ సంప్రదాయ కీర్తనలను రచించిరి. పుణ్యక్షేత్రములను సేవించినప్పుడు ఆయా దేవతలను కీర్తించుచూ కీర్తనలను గానము చేసిరి. శ్రీ త్యాగయ్య గారు వాల్మీకి మహర్షి యొక్క అవతారమనియు, వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకములలో రామాయణమును రచించినట్లు త్యాగయ్య గారు ఇరవై నాలుగు వేల కృతులను వ్రాసినారనియు ప్రతీతి. వీరు పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు శ్రీరామునిలో ఐక్యమైనారు. నేటికినీ ప్రతి సంవత్సరము పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారు గ్రామమున మహాత్ముని సమాధి సన్నిధి యందు వార్షికోత్సవము అత్యంత వైభవంతో జరుపబడును. సమయమున పెక్కు సంగీత విద్వాంసులు వీరి కీర్తనలను ఆలపించెదరు. రేడియో సాయిలో శ్రీ త్యాగోపనిషత్తు పేర ధారావాహికగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని విశిష్టత, స్వామి మనకిచ్చే బోధలే కృతుల ద్వారా త్యాగరాజస్వామి అందించిన విధానం గురించి శ్రీ కోటా శివకుమార్ గారు వివరించగా ఇప్పుడు మనం విందాం. శ్రీ కోటా శివకుమార్ ప్రశాంతి నిలయంలో స్వామి కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై మూడు, తొంభై ఐదు సంవత్సరములలో ఎంబిఏ హెచ్.ఆర్. లో ఉత్తీర్ణత పొంది అనేక పాటలు, పద్యాలు స్వామి ఆశీస్సులతో వ్రాసి స్వామి సమక్షములోనే కవి సమ్మేళనములో పాల్గొని స్వామి ఆశీస్సులు దండిగా పొందినవారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల స్పిరిట్యువల్ కోఆర్డినేటర్ గా తమ సేవా భాద్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇన్ సాయి కన్సల్టింగ్ అనే హెచ్.ఆర్. సంస్థను నడిపిస్తూ స్వామి చూపిన బాటలోనే పయనిస్తూ హెచ్.ఆర్. ట్రైనింగ్స్ నిర్వహిస్తున్నారు. శ్రీ కోటా శివకుమార్ గారు వినిపించే త్యాగోపనిషత్తులో ప్రవేశిద్దామా? ఓఓఓమ్ అఖండమండలాకారం వ్యాప్తం యస్సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాకయాచక్షురున్ మిలితమ్ యేన తస్మై శ్రీ గురవే నమః. రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం సాయిరాం. త్యాగరాజ స్వామి కీర్తనలను త్యాగోపనిషత్తు అని దేన్నంటారో దానిలోని కృతులను సారాంశము అర్థం చేసుకుని శ్రోతల ముందర ఉంచడం అనేది చాలా పెద్ద సాహసం. ఇది ఎటువంటిది అంటే ఒక మహా సముద్రం దగ్గరికి నాలాంటి వాడు ఒక చెంచా తీసుకుని వెళ్లి నీరంతా ఇంటికి తెచ్చుకోవాలి అని భావించినట్టు అటువంటి విషయం. త్యాగరాజ స్వామి ఇచ్చిన ఇరవై నాలుగు వేల కృతుల్లో ఇంత సారాంశము ఇంత నిగూఢార్థాలు ఉన్నాయి కాబట్టే దాన్ని సాగరంతో పోల్చబడింది. అయితే సాగరంలోకి వెళ్లి మనం తీసుకునేప్పుడు మనదంటూ ఒక capacity ఉండాలి కాబట్టి కోటా శ్రీకుమార్ అనిపడి నేను నా capacity చెంచా అంత మాత్రము ఉండొచ్చేమో అన్న భావనతో నేను మాట అన్నాను. అందుకని ఇది చాలా పెద్ద సాహసం. అయితే ఎందువల్ల త్యాగోపనిషత్తు అనేది మనం రేడియో సాయి లో మొదలు పెట్టడం జరుగుతోంది అన్నదానికి నేను వస్తాను. పంతొమ్మిది వందల యాభై ఏడులోనో యాభై ఎనిమిదిలోనో సంవత్సరంలో స్వామి ఒకసారి తిరుపతిలో త్యాగరాజ ఉత్సవాల్ని ప్రారంభిస్తూ ఒక discourse ఇచ్చారండి. సుమారు గంటసేపు సాగిన discourse లో మొట్టమొదట స్వామి అన్న వాక్యము "త్యాగరాజు అంటే నాకు చాలా ఇష్టము" ఇది స్వామి అన్న మొట్టమొదటి sentence. అంటే భక్తులు అనబడ్డ వారిలో కూడా భక్తాగ్రేసరులు అగ్రగణ్యులు అన్నవారు ఉన్నారు కాబట్టి వారితో తనకు ఇష్టమైన కృతులు రచనలు చేయించుకుని వారి నోటి ద్వారా విని వారి నోటివతారానే కాకుండా తర్వాత తరాల తరబడి ఎందరో నోటి ద్వారా అదే కృతులను అదే భావాలను మళ్ళీ మళ్ళీ విని ఆనందించే తత్వం భగవంతుడిది. అందువల్లనేమో త్యాగరాజ స్వామి తన ఇరవై నాలుగు వేల కృతుల్లో సారాంశం అయితే సారం అయితే భక్తి గాని జ్ఞానం గాని కర్మ గాని సంబంధించిన విషయాలు ఏవైతే పెట్టారో ఎంత బోధ చేశారో ఎంత భక్తి కురిపించారో అదంతా మానవాళికి ఒక సేవ లాగా మిగిలిపోయింది. ఇంత సేవ చేశారు కాబట్టే స్వామికి త్యాగరాజస్వామి అంటే అంత ఇష్టం. అందుకని మనకి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు ధారావాహికంగా జరిగే త్యాగోపనిషత్తు అన్న program లో మనం చర్చించుకోవచ్చండి. నా ఆలోచనకి స్వామి అందించినంత వరకు నేను మాట్లాడతాను. అయితే పెద్దలు వింటున్నవారు చాలామంది వారికి ఇంకా ఎన్నో ఊహలు తట్టొచ్చు. వారికి తట్టిన ఊహలు వారు రేడియో సాయి కి రాయడం గాని మిగతా వారితో గాని చర్చిస్తే జ్ఞానం ఇలా సాగుతూ ఉంటుంది. మొట్టమొదట మనము చర్చించుకోవాల్సింది ఏమిటంటే త్యాగరాజస్వామి సమకాలీకులుగా ఉన్న ఇంకో ఇద్దరు వాగ్గేయకారుల గురించి వారు ముత్తుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రి. వీరు ముగ్గురూ కూడా ఒకే కాలంలో ఒకే geographical area లో ఉండడం అనేది అది ఒక accident కాదు తటస్తం అయినది అది దైవ ప్రేరేపితం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు వీరిద్దరి గురించి కూడా చర్చిస్తున్నాను అంటే వీరి రచనల్లో చాలా variety ఉంది వారి రచనల్లో difference కూడా ఉంది. త్యాగరాజస్వామిది ద్రాక్ష పాకం ఆయన రచన. ముత్తుస్వామి దీక్షితుడిది నారికేళ పాకం. ఇక శ్యామశాస్త్రి గారిది కదళీ పాకం. ఏమిటి వీటి మధ్యలో మరి వ్యత్యాసం అంటే నారికేళ పాకం ఎటువంటిది అండి అంటే అది పైనకి కఠినంగా ఉంటుంది. మాటలు కొట్టి పగలగొడితే గాని అర్థం కావు. పగలగొట్టిన తర్వాత కూడా లోపల ఎంతో కొంత శ్రమ తీసుకోవాలి అర్థం చేసుకోవడానికి. ముత్తుస్వామి దీక్షితులు ఆయన చాలా శాస్త్ర కోవిదుడు ఎన్నో శాస్త్రాలు తెలుసుకున్నాయన ఎక్కువ బహుళంగా ఆయన సంస్కృతంలో రచించారు. సామాన్యులకి ఆయన రచనలు నిజంగా నారికేళ పాకమే. ఇక శ్యామశాస్త్రి దగ్గరికి వద్దామంటే ఆయన ఎంత సున్నితమైన రచనలు చేశారంటే చాలా సరళంగా ఉండే తెలుగు అందులో మనం మాట్లాడుకునే వాడుక భాష లాగా ఉండే తెలుగు ఆయన రోజుల్లో అప్పట్లో వాడుక భాషలో ఉన్నది. ప్రతి కీర్తన కూడా అమ్మవారికి ఒక నివేదన. అది నిజంగా కదళీ పాకమున అట్టి పండు స్వామికి నివేదించి అది ఒలిచి గనుక తింటే ఎంత సునాయాసంగా తినొచ్చో అంత సునాయాసంగా ఉంటాయి కాబట్టే వాటిని కదళీ పాకం అన్నారు. ఇక మనము త్యాగరాజస్వామి కీర్తనలకు వద్దాం. ఆయనది ద్రాక్ష పాకం అన్నారండి. ద్రాక్ష పాకం అంటే ఏమిటి? నోటిలో పెట్టుకోంగానే అతి మధురంగా ఉండేది ద్రాక్ష. పెట్టుకోవడం చాలా తేలికే నోట్లో పెట్టుకోంగానే అతి మధురంగా ఉంటుంది. అయితే ద్రాక్షకి ఇంకో గుణం ఉంది. అదేమిటంటే నోట్లోకి వెళ్ళంగానే కరిగిపోతూ కరిగిపోతూ ఒక మత్తెక్కిస్తుందది. అది మత్తులోకి దించుతున్నప్పుడు లోకాన్ని మర్చిపోయి దానిలోని సారాన్ని రసాన్ని కూడా మర్చిపోయే అవకాశాలు మనకున్నాయి. అంటే త్యాగరాజస్వామి కీర్తన తీసుకుంటే వినంగానే ఎంత మధురంగా ఉంటుందంటే గత రెండు వందల సంవత్సరాలుగా నూట డెబ్బై సంవత్సరాలుగా ఎంతోమంది మధురానుభూతి అనుభవిస్తున్నారు. ఓహో త్యాగరాజస్వామి కీర్తన అని తెలిసినవారు ఎంతోమంది ఉన్నారు. అయితే దాని లోపలికి వెళ్లి భావం మాత్రము చూసే లోపల ఒక విధమైన మైకం కమ్మేస్తుంది. పాట చాలా బాగుందని కీర్తన చాలా బాగుందని రాగం చాలా బాగుందని దానిలో ఎక్కువ భాగం అనుభవంలోకి వెళ్లిపోయే వాళ్ళు ఉంటారు కానీ లోపల నిగూఢంగా ఉన్న అర్థం చూసేవారు చాలా తక్కువ అనే భావిస్తున్నాను. అందువల్ల ఇది ద్రాక్ష పాకం అయిందని నా ఆలోచన. అయితే బయటికి మాత్రం చాలా తీసుకుని నోట్లో వేసుకోవాలని ఉద్దేశిస్తుంది అటువంటి కీర్తనలు త్యాగరాజస్వామివి. ఎన్ని కీర్తనలు మనం మాట్లాడుకున్నా మాట్లాడుకుంటూనే ఉండొచ్చండి ఎందుకంటే ఇరవై నాలుగు వేల కీర్తనలు కృతులు ఆయన చేశారు.ఆయన జీవితం తీసుకుంటే ఒక భక్తుడు ఒక సాధకుడు విధంగా తన జీవనం సాగించాలి అన్నదానికి ఒక perfect example గా స్వామి నిలిచారు. మీరు గమనిస్తే ఎనభై సంవత్సరాలకు పైగా ఆయన జీవించారు. గృహస్తాశ్రమం స్వీకరించారు, గృహస్తాశ్రమం నుంచి వెళ్లారు చివరికి సన్యాసాశ్రమం కూడా స్వీకరించారు. అంటే వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ పాటించి తను విధంగా వైదికంగా బతకాలో విధంగా బతికి మనందరికీ ఒక example ఇచ్చి వెళ్లారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామికి ఇంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా కూడా ఎప్పుడూ తన శాస్త్రం అమ్ముకోవాలని చూడలేదు. విషయం చాలా మందికి అవగతమే. "నిధి చాలా సుఖమా" అని ఒక మాటలో మొత్తం తెలిచేశారు ఆయన. "రాముని సన్నిధి సేవ సుఖమా" అయితే ఒక్క మాటలో అనడం కాకుండా ఎందుకంటే మాట మనము అనగలము అండి అందరం అనగలరు. ఒక్క మాటలో అనడమే కాకుండా తన జీవితాంతం దానికి కట్టుబడి ఉన్న భక్తుడు. భక్తుడు దేనికంటే సత్యమైన మార్గానికి భక్తుడు త్యాగరాజస్వామి. అందువల్ల పెద్దలు చెప్పిన విషయం ఏమిటంటే అండి, ఆయన జీవనశైలి కూడా విధంగా ఉండేదంటే పొద్దున్నే లేచి రాముడిని తనతో పాటు మేలుకొలిపి రాముడికి సపర్యలు చేసుకుంటూ బయటికి వెళ్లి తన సంసారాన్ని పోషించాలి కాబట్టి మధూకరం చేసుకుంటూ ఒక ఐదేళ్లలోనో పదేళ్లలోనో దొరికిన ఆహారం మాత్రం తీసుకుని ఇంటికి వచ్చి వాటిని వండిన తర్వాత కుటుంబం అంతా భుజించి రాముని ధ్యానంలోనే నిమగ్నమై ఉండిపోయేవారు. ఆయన అన్నగారు జపేశుడు ఇంత గొప్ప శాస్త్ర విజ్ఞానం ఉన్న త్యాగరాజస్వామిని ఏదో ఒక మహారాజు దగ్గరో ఎక్కడో శాస్త్ర పరిజ్ఞానాన్ని తీసుకు వెళ్లాలని ఈయనకి ఒక మంచి రాజ అవకాశం రాజునకు కులువులో అవకాశం ఒకటి ఇప్పించాలని ఆయన చాలా ప్రయత్నించారు. అయితే అది ఏమీ పడలేదు. ఎందుకంటే త్యాగరాజస్వామికి మానవులకి వెళ్లి వారి దగ్గర వారి గొప్ప పొగుడుతూ వారి ఆశ్రయంతో అలా జరుపుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఆయన. రాముడికే జీవితం అంకితం అనుకున్నారు కాబట్టి విధంగా మధూకరం చేసుకుంటూ ఆయన బతికినన్నాళ్ళు విధంగానే గడిపారు. అయితే తిరువాయూరులోని జనం చేసుకున్న పుణ్యం ఏమిటోగానీ ఆయన రోజూ మధూకరం కోసం వెళ్తూ బయటకు భిక్షకు వెళ్ళినప్పుడు మహానుభావులైన పురందరదాసు ఇటువంటి వారి కీర్తనలు, అన్నమాచార్య ఇటువంటి వారి కీర్తనలు, రామదాసు కీర్తనలు పాడుకుంటూ తన కీర్తనలు కూడా పాడుకుంటూ అలా రోడ్లలో వెళుతూ ఉండేవారట. ఆయన వెనకాల శిష్య బృందం ఉండేవారు. ఎందుకంటే త్యాగరాజస్వామి కూర్చొని నేను సంగీతం నేర్పిస్తాను రండి అని ఒకాయన ఒకళ్ళకి నేర్పించింది ఏమీ లేదు. ఆయన పాడుతూ ఉండగా విధంగా ఆయన వెంట ఉండి ఆయన పాడుతున్నప్పుడు notation లాగా రాసుకుని కృతిని మళ్ళీ వాళ్ళు practice చేసుకుని వెళ్లి గురువు గారి దగ్గర గురువు గారు ఇది correct ఇట్లాగైనా పాడాలా అని అడిగి విధంగా నేర్చుకున్న వాళ్ళు శిష్యులు. కాబట్టి అటువంటి శిష్యులు ప్రథమ శిష్యులు కొంతమంది వెనకాల వెళుతూ ఉండేవారు. వారితో పాటు మధూకరం చేసుకుంటూ ఈయన తిరువారూర్ streets లో వెళుతూ ఉన్నప్పుడు ఎంత మనోహరంగా ఉంటుందో దృశ్యం మనం ఊహించుకోవచ్చు. ఒకవేళ మీరు గాని నేను గాని అక్కడ ఉండి ఉంటే ఆయన విధంగా మేలుకో శ్రీరామా అని పాడుకుంటూ లేకపోతే నాపాలి శ్రీరామా అని పాడుకుంటూ వెళుతూ ఉంటే తప్పకుండా నేను అనుకోవడం ఎవరైతే గృహిణులు ఆయనకి మధూకరం ఆయనకి భిక్ష వేయడానికి వచ్చారో వారు భిక్ష పాత్రతో ముందర అక్కడ wait చేస్తూ ఉండి ఉంటారు. wait చేస్తూ ఉండడమే కాకుండా భిక్ష వేసి మొత్తం కీర్తన ఎంత వినబడినంత వరకు విని లోపలికి వెళ్లాలని అనుకుంటూ ఉండి ఉంటారు. ఒక అదృష్టం మనకి ఎప్పుడూ పడితే ఎంత బాగుండునని నాకు అనిపిస్తుందండి త్యాగరాజస్వామి స్వయం స్వయంగా తాను పాడుతూ ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉండి ఉండొచ్చు అది వినగలమా అని ఒక తహతహ నాలో ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆయన గొంతు మనం వినినా వినకపోయినా ఆయన అందించిన త్యాగోపనిషత్తులో ఆయన భావాలు మాత్రం తప్పకుండా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక ఉపనిషత్తు అని ఎందుకు అన్నాం అన్న దానిపైన ఒక మాట చెప్పి నేను ముందరకు వెళతాను. ఉపనిషత్తు అని దేనిని అనగలము? ఏదైతే వేదాంతము లేక మోక్ష మార్గానికి ఒక దారి చూపెడుతుందో దాన్నే ఉపనిషత్తు అనవచ్చు. వేదముల చివర వచ్చేది వేదాంతం ఉపనిషత్తే వేదాంతం. ఉపనిషత్తు ఒక కథ ద్వారా గాని ఒక example ద్వారా గాని ఎన్నో విషయాలు చెప్తుంది. అయితే direct గా విషయం ఎప్పుడూ చెప్తుంది. ఆత్మ పదార్థము గురించి, పరమాత్మ గురించి, జీవాత్మ పరమాత్మ సంబంధం గురించి విధంగా ఎన్నో విధాల ఉన్న సత్యాన్నే గురించే మాట్లాడేది ఉపనిషత్తు. ఇక త్యాగరాజస్వామి కీర్తనలకు వస్తే మనం చూడబోయే ఇన్ని కీర్తనలలో ఇదే భావం మనకి తొణికిసలాడుతూ ఉంటుందండి. కీర్తన తీసుకున్నా తనకి రాముడికి ఉన్న సంబంధము, జగత్తు ఒక్క విషయము, మనం మన life లో చేరవలసిన స్థితి ఏమిటి అన్న భావాల మీదే ఎక్కువగా సాగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఉపని ఉపనిషత్తు అనొచ్చు. రెండోది ఉపనిషత్తు ఒక గురువు చెప్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి త్యాగరాజస్వామి కీర్తనలు కూడా మహానుభావులు మనకు అందించిన భావాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప మన సొంత తెలివితో ఇది అయి ఉండొచ్చు అనుకోవడం కూడా ఒక విధంగా తప్పు కావచ్చు, అర్థం కాదు. కాబట్టి నేను మీ ముందుంచే భావాలు మహానుభావులు ఇటువంటి వారు చెప్పిన భావాలు, విన్న విషయాలను మాత్రమే మీ ముందుంచుతున్నాను. అందువల్ల ఉపనిషత్తు సారాంశాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అండి. అయితే విధంగా మనం ముందరకు వెళ్ళవచ్చు త్యాగరాజస్వామి కీర్తనలని, ఇరవై నాలుగు వేల కీర్తనలను మనమైతే చెప్పుకోలేమండి. అయి అసలు వాడుకలో ఉన్న కీర్తనలే తక్కువ. ఒక పన్నెండు వందల కీర్తనలు కన్నా వాడుకలో లేవని చెప్తారు. కొన్ని కీర్తనలు అసలు ఎక్కడున్నాయో కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇరవై నాలుగు వేలు రాసినట్టు మాత్రము గ్రాంథికంగా గ్రంథ పరిచి ఉంది. మనకు ఉన్న కీర్తనలు తెలిసిన కొన్ని కీర్తనలలో వాటిని ధారావాహికంగా భక్తి, జ్ఞాన, కర్మ లేక సేవ అన్న మూడు అంశాల కింద విభజించి అంశాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క కృతి తీసుకుని కీర్తనలనువాటిలోని విషయం కొంత చర్చించుకుని స్వామి ఏమి చెప్పారు? అదే విషయం గురించి అన్న భావాలు అప్పుడప్పుడు మనం ఆలోచించుకుని ముందరకు వెళుతూ ఉంటాం. అయితే ఇంకొక విశేషం ఉంది. ప్రతిసారి చర్చించబడ్డ కీర్తన చివరికి ఎవరన్నా popular artists లు వారు కీర్తన పాడగా కీర్తనను కూడా చివరికి వింటాం మనం. విన్నప్పుడు మాత్రం అందరు శ్రోతలకి ఒక విన్నపం ఏమిటంటే ముందు మనం చర్చించుకున్న భావాలన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకుని కీర్తన వినండి. అది ఎంత రమణీయంగా ఉంటుందో మనకి అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదట త్యాగ ఉపనిషత్తు అన్న అంశం కింద మొదటి కీర్తనని ఈరోజు మనం మొదలు పెడదాము. నేడు మనము చర్చకు సమీక్షిస్తున్న కృతి "తెలియలేరు రామ భక్తి మార్గమును" అన్న కృతి. ఇది ధేనుక రాగంలో రచింపబడినది. తాళము దేశాది. ఇందులో పల్లవిలో త్యాగరాజ స్వామి [పాట] "తెలియలేరు రామ భక్తి తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామా" అని అనడంలో "తెలియలేరు" అన్న ఒక పదం దగ్గర చిన్న gap ఇచ్చారు. అంటే అసలు తెలియలేరు, ఎందుకు తెలియలేరు? అన్న ఒక భావం మనకు వస్తుంది. "తెలియలేరు రామభక్తి" అని ఒక విధంగా విభజించుకోవచ్చు దీన్ని. అంటే రామభక్తి అంటే నిజమైన రామభక్తి ఏదో తెలియలేరు అని ఒక అర్థం తీసుకుంటే, "తెలియలేరు రామా" అని రాముని సంబోధిస్తూ ఆయన మాట్లాడుతున్నట్టు ఇంకో అర్థం వస్తుంది. రామా! ఇక్కడ మేమందరం ఉన్నాము భూమిలో. భూమి పైన ఉన్న మా అందరు మానవుల్లో మాకు ఎవరికీ కూడా భక్తి అన్నది ఎక్కువ మందికి తెలియట్లేదు. అందుకని నీవే బ్రోచాలి అని ఒక భావం మళ్ళీ మన కన్నుల ముందు గోచరిస్తుంది. అయితే ఏమిటి తెలియట్లేదు అన్న భావం వస్తుంది. ఏమిటి తెలియట్లేదు అంటే నేను నిజంగా భక్తుడినో కాదో, ఇది భక్తి మార్గమో కాదో అన్నది తెలియట్లేదు అని మనకి ఒక భావం స్పురిస్తుంది. ఎందువల్ల అంటా రేమో, స్వామి చాలా సార్లు అంటారు "నిజమైన భక్తుడి కోసం నేను ఇంకా వెతుకుతూనే ఉన్నాను" అన్నారు. అందువల్ల నేను భక్తుడను లేక భక్తురాలను అని అనుకున్నవారికి ఏమీ తెలియలేదు అంటున్నారు త్యాగరాజ స్వామి. అంటే నా-- నేను భక్తుడిని అని నేను అనుకోవడం కాక భగవంతుడు చెప్పడం అనేది వేరే మాట. ఇది ఎంతవరకు వెళుతుంది అంటే మనకు చెప్పిన పురాణ గాథల్లో నారదుడికి గర్వభంగం అయిందట, నేను భక్తుడిని అనుకుంటే. ఇది స్వయంగా విష్ణుమూర్తి ఇచ్చిన అనుభవం. నారద మహర్షి వంటి మహా భక్తుడికే గర్వభంగం అయితే ఇంకా చెప్పండి ఎవరు భక్తులు అనుకోగలరు? అందువల్ల అసలు భక్తి మార్గం అనేది తెలియలేక మేము పోతున్నాము, కొట్టుకుంటున్నాము అన్న ఒక భావం ఇందులో కనబడుతుంది. తెలియలేరు రామ భక్తి మార్గమును. కానీ ఎక్కడో ఇంకొక చిన్న భావమే తొంగి చూస్తుందండి. ఇది తెలుసుకోవడం చాలా కష్టము అన్న భావం. అంటే భక్తులు అవ్వడము అంత సులభం కాదు. సులభంగా అనిపించవచ్చు కానీ సులభం కాదు. ఎందువల్ల కాదు అన్నది అనుపల్లవిలోనూ చరణంలోనూ త్యాగరాజ స్వామి చెప్తారు మనకి. అనుపల్లవిలో అంటారు [పాట] "ఇలనంతటా తిరుగుచును ఇలనంతటా తిరుగుచును కలువరించే రేగా నీ తెలియలేరు రామా". ఇలనంతటా భూప్రపంచం అంతా కూడా తిరుగుతూ తిరుగుతూ ఎందువల్ల తిరుగుతున్నారయ్యా? అంటే ఎవరి జీవితం వారు వారి పొట్ట గడిపోవడానికి తిరుగుతున్నారు. ఏదో పని పెట్టుకుని ఏదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి అనుకుని తిరుగుతున్నారు. అంటే కర్మ పరంగా చూసుకుంటే మానవుడన్నవాడు కర్మ చేస్తూ ఉండాలి కాబట్టి పని నిమిత్తము, ఉదర పోషణార్థ నిమిత్తము అటు ఇటు తిరుగుతూ ఉన్నారే తప్ప నిజంగా భక్తి అంటే ఇది అని ఎవరికీ తెలియట్లేదు అని త్యాగరాజ స్వామి ఒక అర్థం చెప్పారు. రెండో అర్థం కోసం చూద్దాం అండి ఇక్కడ. భక్తి మార్గాల్లోనే నవైధ భక్తి మార్గాలు చూసుకుంటే కూడా కొన్ని practices కొన్ని-- కొంత ఆచరణ అనేది ఉంది. ఒకానొక ఆచరణ భక్తికి ఏమిటి అంటే పుణ్యక్షేత్రాలు తిరగడం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, ఎందుకంటే పుణ్యక్షేత్రాలు power centers కాబట్టి అక్కడ మళ్ళీ recharge అవ్వడం అన్న ఒక విధానం ఉంది. ఒక తిరుపతికి వెళితే రెండు రోజులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి మనలో ఏదో ఒక భావము, ఏదో ఒక purity రావడము, sacredness రావడము అనే విధంగా ఉంటుంది. పుట్టపర్తికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ఒక వారం రోజులు ఉండి వస్తే ఎంతో ప్రశాంతత, హృదయం నిండా ఒక విధమైన purity నిండుతుంది. అలా తిరగడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము అనేదానికి చాలా ప్రాధాన్యం ఉంది భక్తిలో. అయితే త్యాగరాజ స్వామి ఇక్కడ ఏమంటున్నారంటే అండి పుణ్యక్షేత్రాలు చూస్తూ అదే భక్తి అనుకోవడం మాత్రం చాలా తప్పు అంటున్నారు. [పాట] "ఇలనంతటా తిరుగుచును కలువరించేరే". ఏం కలువరిస్తున్నారు? అంటే తిరుపతి వెళితే గోవిందా గోవిందా అని కలువరిస్తాను. పుట్టపర్తి వెళితే సాయిరాం సాయిరాం అని కలువరిస్తాను. ఇంకో చోటికి వెళితే ఇంకోటి కలువరించవచ్చు. అంటే నోటి వరకే మాట వస్తోంది తప్ప ఇది హృదయానికి హత్-- అతుక్కోవట్లేదు, హృదయం లోపలి నుంచి రావట్లేదు అన్న ఒక భావం మనకి తొంగి చూస్తోంది ఇక్కడ. కాబట్టి అటువంటి వారు కూడా తెలియట్లేదు. అంటే భక్తి చేస్తున్నాం అనుకున్నవారు కూడా తెలియట్లేదు. ఇది పుణ్యక్షేత్రాలు తిరగడమే మాత్రమే కాదండి, ప్రదక్షిణ అన్న కూడా ఒక భావం వస్తుంది. ఎందుకంటే భక్తి ఆచరణలో ప్రదక్షిణ అనేది చాలా important. రోజూ కూడా పూజ చేసుకుంటూ పూజలో ఒక భాగంగా ఆత్మ ప్రదక్షిణ చేస్తూ యానికానిచ పాపాణి అనుకుంటూ నేను ఎంత పాపం చేశాను, పాపం మొత్తం నాశనమైపోవాలి అన్న భావంతో రోజూ తిరుగుతూ ఉంటే రోజూ పాపం చేసి రోజూ తిరగడం వల్ల అది భక్తి కాదు. అటువంటి వారు కూడా తెలియలేరు అని త్యాగరాజ స్వామి చెప్పినట్టు అనిపిస్తోంది. అయితే శ్రోతలజిజ్ఞాస ఒక-ఒక శబ్దం పైన ఇక్కడ నిలవాలని నేను కోరుతున్నాను. కలువరించేరే గాని అన్న భావంలో ఇక్కడ ఉపనిషత్తు భావన మనం వెళ్ళాలండి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఉపనిషత్తు లోపలికి వెళితేనే గాని మనకు అర్థం తెలియదు. ఎవరు కలువరించేది? నిద్రలోకి వెళ్లి స్వప్నావస్థ లో ఉన్నవాడు కలువరిస్తాడు. అంటే అది అటు ఘాడ నిద్ర కాదు ఇటు జాగ్రత్త అవస్థ కాదు. మధ్యలో స్వప్నావస్థ లో ఉంటాడు. స్వప్నావస్థ లో ఉన్నవాడు కలువరిస్తాడు. త్యాగరాజ స్వామి కీర్తనలలో ప్రపంచం ప్రాపంచికంగా కనబడే ఒక అర్థం కాకుండా అద్వైత పరంగా అర్థం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అద్వైత పరంగా ఉండే అర్థం ఇక్కడ గోచరిస్తుందండి మనకి. ప్రపంచంలో మనమందరం జీవితం సాగిస్తున్నాము అంటే అదంతా ఒక స్వప్నం లాంటిదే. ఇది అద్వైతం చెప్పే వేదాంతం చెప్పే పరిభాష. స్వప్నంలో మీరు నేను ఏదో మాట్లాడుతున్నాము, ఎన్నో చర్చలు చేస్తున్నాము, ఎవరెవరితోనో discussions చేస్తున్నాము, ఎవరెవరితోనో లావాదేవీలు పెట్టుకుంటున్నాము. ఇంత జరుగుతూ ఉంది. ఇది దీనికి ఒక జీవనోపాధి అంటున్నాము లేక ఏదో ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నాము. ఇంత ఇవన్నీ కూడా స్వప్నంలో జరుగుతున్న ఒక కలువరింత లాంటిదే సుమా అని త్యాగరాజ స్వామి చెప్పినట్టుంది. మరి ఇదంతా ఒక కలువరింత అయినప్పుడు నిజమైన భక్తి ఎట్లా తెలుస్తుంది? అది కలువరింత మాత్రమే అవుతుంది అని ఒక భావం నిగూఢంగా కనబడుతుంది. ఇలా మనం ఎన్నైనా అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు దీనికి. ఇంకొక భాష కలువరింత ఒక-ఒక పెద్దాయన మహానుభావుడు రాసినప్పుడు నేను గమనించానండి. ఆయన ఏమంటారంటే, "ఇలనంతటా తిరుగుచును" అంటే భాష త్యాగరాజ స్వామి కీర్తనలకి లేకపోతే ఉపనిషత్తులకి లేకపోతే వేదాంతం కి లేకపోతే భగవద్గీత కి ఇలా ప్రతి దానికి వ్యాఖ్యానము నేను చెప్తాను అని ఎవరైతే ఒక responsibility తీసుకుని అన్ని చోట్ల వెళుతున్నారో వారే గనక తమ జీవితంలో భక్తి అనేది లేకుండా ఒట్టిగా మాట్లాడుతూ ఉంటే దీన్ని దీన్ని కలువరింత అంటారు అని ఆయన అన్నారు. దీన్నే శంకరాచార్య స్వామి కూడా ప్రజల్పము అన్న ఒక పదం ఉపయోగించి చాలా చక్కగా ఆయన వివరించారు. అంటే నేను ఆచరించని విషయాన్ని నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అది ప్రజల్పం అవుతుంది, కలువరింత అవుతుంది. కాబట్టి భక్తి అనేది మనం ఉండవలసిన తీరు గాని మాట్లాడవలసిన తీరు కాదు అని త్యాగరాజ స్వామి చాలా సున్నితంగా అనుపల్లవి లో చెప్పారు. ఇక చరణానికి వద్దాం అండి. [పాట] వేగ లేచి నీట మునిగి భూతి పూసి వెళ్ళ నెంచి వెలికి శ్లాఘనీయులై. పొద్దున్నే లేచి స్నానం చేసి లేక చెరువులో మునిగి విభూతి పూసుకుని వేలు లెక్కబెడుతూ ఈరోజు తారుణ ఏంటి? ఈరోజు ముహూర్తము? ఈరోజు తిథి ఏమిటి? అని తిథి వారాలు అన్నీ లెక్కించుకుంటూ ఎంతైనా పండితుడి లాగా ప్రపంచానికి కనబడొచ్చు. బయటికి వెళ్లి ఎంతో పేరు తెచ్చుకోవచ్చు. కానీ దీని వల్ల కూడా భక్తి తెలియదు అంటున్నారు. అంటే భక్తి అనేది ఒక వేషం కాదు. "భక్తి is not a part time job" అని స్వామి చెప్పారు. "Devotion cannot be part time" అంటే వేషం అంటే ఏంటండీ? ఒక uniform అంటే ఏంటంటే స్వామి చెప్తారు, బయట మనం ఒక ఉద్యోగ దరఖాస్తు ఇచ్చి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం చేసేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ దాన్ని తీసి పక్కన తగిలించేస్తే uniform వెళ్ళిపోయింది. అక్కడితో తీరిపోయింది అది. కానీ భక్తి అనేది ఇటువంటిది కాదు. ఒక uniform కాదు అనడంలో అర్థం ఏమిటంటే అది ఇరవై నాలుగు గంటలు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగినంత కాలము మనతో పాటు ఉండే ఒక భావము, ఒక attitude అది భక్తి. కాబట్టి వెళ్ళ నెంచి వెలికి శ్లాఘనీయులై వేరే వాళ్ళమని పొగడటానికి ఎన్నైనా వేషాలు వేయొచ్చు అని స్వామి చాలా సున్నితంగా చెప్తున్నారు. వేరే కీర్తనలో కూడా కుంతల వరాలి లో సాగిన ఒక కీర్తనలో కూడా త్యాగరాజ స్వామి మాటే చెప్పారు. అది తర్వాత మనము ఎప్పుడన్నా వీలుంటే చర్చించుకోవచ్చు. కానీ దానిలోని భావం కూడా విధంగానే సాగుతుంది. ఏమిటంటే దారసుతులకై, పుత్రులకై, పేరు కీర్తికై, ధనమునకై ఇటువంటి వాటి కోసం భక్తి వేషం వేస్తున్నారే తప్ప నిజమైన భక్తి తెలుసుకోలేకపోయారు అని త్యాగరాజ స్వామి అన్నప్పుడు మనకి మళ్ళీ భావం గోచరిస్తుంది. కీర్తనలో తర్వాత ముందరికి వెళుతూ అంటారు, "బాగుగ పైక మార్జన లోలురైరి గాని త్యాగరాజుని తెలియలేరు రామా" అంటారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇంత వేషం ఎందుకు వేస్తున్నారు మానవులు అంటే పైకము లక్ష్మి ప్రసన్నం కోసం చేస్తున్నారు తప్ప శ్రీవారి ప్రసన్నం కోసం చేయట్లేదు. భగవంతుడికి లోపల భక్తి ద్వారా connect అయి ఉండాలని చేయట్లేదు అని ఒక భావం మనకి చూపెడుతున్నారు త్యాగరాజ స్వామి. అయితే ఇందులో చరణంలో త్యాగరాజ స్వామి చెప్పిన మాట మనకు అప్పుడప్పుడు కొంచెము negative గా అనిపించొచ్చండి. అంటే అందరూ విధంగా లేరు కదా అని. భక్తి మార్గంలో ముందరికి వెళుతూ స్వామి అనుగ్రహం ద్వారా భక్తి అని అర్థం చేసుకుని స్వామితో heart to heart connection పెట్టుకున్న వాళ్ళకి ఇటువంటి problems ఏమీ ఉండవండి. వారికి apply అయ్యేది కాదు. వారికి చెందింది కాదు కృతి. అయితే భక్తి వేషం వేసి బయటికి మాత్రం వెళ్ళి మేము భక్తులం అనుకుని భక్తులం అని చెప్తూ వేరే వారికి అటువంటి వారికి మాత్రము ఇది తప్పకుండా అన్వయిస్తుంది కీర్తన. కాబట్టి భక్తి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా మన నడవడికలో ఎప్పుడూ కూడా భగవంతుడు నా భక్తిని హర్షిస్తున్నాడా అన్న ఒక భావంతో ముందరికి వెళుతూ చేసుకోవాల్సిన విషయం అని చక్కగా ఉపనిషత్తు కీర్తన ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు మనం ఒక చిన్న కీర్తనను తీసుకుని దీని భావం తెలుసుకున్నామండి. వెళ్ళగా వెళ్ళ వేళ్ళగా మనము ఒక్కొక్క ధారావాహికగా సాగే ఒక్కొక్క శీర్షికలో ఒక్కొక్క program లో ఒక్కొక్క కృతి తీసుకుని దానిలోని లోతుపాతులు అన్నీ చూసుకుంటూ దానికి ఇంకేమన్నా కృతులు త్యాగరాజ స్వామివి link అయి ఉన్నాయా అనే విషయం కూడా మనం మాట్లాడుకుంటూ ముందరికి వెళ్దాం అండి. మరొక కీర్తన మనము చూసే వరకు కూడా మీకందరికీ కీర్తనఒకసారి మళ్ళీ మీరు చూసుకుని ఎక్కడన్నా ఎవరన్నా పాడింది విని దానిలోని సౌందర్యం చూడవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అంతవరకు సాయిరాం. [సంగీతం] శ్రీ త్యాగోపనిషత్ ధారావాహికలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతులలో తెలియలేరు రామభక్తి మార్గమును అన్న కృతిపై విశ్లేషణ మీరు విన్నారు. శూన్యత నుండి పూర్ణత వైపు భగవాన్ బాబా వారి మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారితో interview రెండవ భాగం వినండి. అందరినీ ప్రేమించు అందరినీ సేవించు మానవుడిలో మాధవుడిని చూడమని స్వామి చెప్తుంటారు. ఉమ్ కానీ ఈనాడు మానవుడిలో క్రోధం, ద్వేషం, jealousy ఇలాంటివి తనకు తెలియకుండానే తనను గ్రహించి వేస్తున్నాయి. ఉమ్ అయితే వీటిని అరికట్టుకోవడానికి స్వామి ఎన్నోమార్లు ఎన్నో చిట్కాలు చెప్పారు. వాటిని మా శ్రోతలతో పంచుకోండి sir. చాలా ఉదాత్తమైనటువంటిది సత్య సాయి భగవానుడి యొక్క అవతార తత్వానికే ఇది మంచి ప్రశ్న. చాలా ఉదాత్తమైన ప్రశ్న. స్వామి అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనేటువంటి మాటలో ప్రేమకి ఒక గొప్ప నిర్వచనం చెప్పారు. ప్రేమ అనగానే ఏదో తల్లి బిడ్డ ప్రేమ, కట్టుకున్న వాడు కట్టుకున్న దాని ప్రేమ, గురువు శిష్యుడు ప్రేమ, దైవం మానవుడి ప్రేమ ఇట్లా రకరకాలుగా మనం చెప్తూ వెళతాం. స్వామి ఓసారి private సంభాషణలో, నేనే ఇలా అంటున్నాను కదా, ప్రేమ అనే దాన్ని ఇలా చెప్తూ ఉన్నాను కదా, రాగం అనురాగం ప్రేమ అని చెప్పాను నేను. రాగం అంటే రక్త బంధం, అనురాగం అంటే పరిచయంతో ఏర్పడేటువంటి బంధం, ప్రేమ బంధం అంటే పరమాత్మతో కూడింది అని నేనే చెప్పాను. కానీ ప్రేమ అంటే ఏమిటని నన్ను ఎవరూ అడగలేదు బంగారం. నేను ఇప్పుడు మీ కోసం చెప్తున్నాను వినండి. ప్రేమ, సాయి ప్రేమకి, భగవంతుని ప్రేమకి మూడు కోణాలు ఉంటాయి. Three dimensions. మూడు కోణాలలో ఏమిటంటే మొట్టమొదటిది ఎప్పుడూ ఇస్తూనే ఉండు. రెండవది ఎన్నడూ తీసుకోకు. conditions లేకుండా ప్రేమించు. That is divine. మీరు పొందింది అదే మీకు తెలియదు. అని అంటూ స్వామి నేను ఎప్పుడన్నా ఎవరి దగ్గరన్నా ఏదన్నా కావాలని గాని ఇస్తే తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? లేవు. ఉండవు. రెండవది నేను ఇవ్వకుండా ఉన్న సందర్భం ఉన్నదా? ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ ఇస్తూనే వచ్చా. మూడవది మీ నుంచి నాకేం అక్కర్లేదు, మీరందరూ బాగా ఉండాలి. మీరంతా సంతోషంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉండాలి. సంఘానికి జవాబ్దారీగా ఉండాలి. దైవం పట్ల విశ్వాసం ఉండాలి. రెండవది ప్రేమా సేవ ప్రేమతో కూడిన సేవ మాత్రమే సేవ. ప్రేమతో కూడని సేవకి చాకిరీ అని తెలుగులో పేరు. చాకిరీ చేస్తే కూలి డబ్బులు మిగులుతాయి. స్వామి భాష ఇది. స్వామి చెప్పిన మాటే. మీకు కూలి డబ్బులు కావాలా, పరమాత్మ కావాలా తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు సేవ చేయండి. ప్రేమతో చేయండి. ప్రేమ అంటే అహంకార మమకారాలు లేని ఒక దివ్య మానసిక స్థితి. ప్రేమతో గనక మీరు సేవ చేసినట్లయితే మరి ఎవరికి సేవ చేయాలి? ఎవరికైనా చేయాలి. ఎవరికి అవసరమో వాళ్ళకి చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడూ చేయాలి. ఎంత కాలం చేయాలి? ఉన్నంత కాలం చేయాలి. స్వామి కుల, మత, జాతి, దేశ, ప్రదేశ అన్నీ దాటి ఎట్లాగైతే సత్య సాయి భగవానుడు తన ప్రేమను ప్రసారం చేశారో మనం కూడా స్వామి భక్తులుగా మన నిత్య జీవితంలో కూడా దీన్ని మనం ప్రసారం చేయాలి, ప్రచారం చేయకూడదు. అవును sir So we should not canvas we must transmit. Yes ఇంగ్లీషులో కాస్త ఎందుకు చెప్తున్నానంటే యువత చిన్నపిల్లలకు కూడా ఇది కాస్త అర్థం కావాలని, పైగా ఇవి స్వామి మాటలు గనుక. తర్వాత ఇది ప్రేమ, సేవ. ప్రేమ అంటే three dimension ప్రేమ ఉండాలి. ఇవ్వాలి, పుచ్చుకోవాలి ఇది ప్రపంచం అంటుంది. అది ప్రపంచం. అవును ప్రపంచం కాని స్థితిలోకి మనం వెళ్లాలంటే ఎప్పుడూ ఇవ్వగలగాలి. ఏమివ్వగలం మన దగ్గర డబ్బుంటే దానం చేయాలి. మన దగ్గర విద్య ఉంటే వరదానం చేయాలి. మన దగ్గర జ్ఞానం ఉంటే ప్రధానం చేయాలి. మనం ఇవ్వగలిగింది ఏం చేయగలిగితే మన స్థాయిలో అతిక్రమించకుండా మన పరిమితులు, పరిధులు ఎరిగి అందరికీ సేవ చేస్తూ చేశానన్న మాట మర్చిపోవాలి. చేస్తూ నాకు స్వామి ఈరోజు సేవ చేయటానికి ఒక అవకాశం, ఒక యోగం కల్పించారు. సేవ చేయటానికి నేను ఒక instrument ని ఒక పరికరాన్ని కాగలిగాను. నేను దీన్నే చేశాను. ఇది స్వామికే సమర్పితం. దీని వలన స్వామికి ఆనందం కలుగుగాక. అంటే స్వామి అన్నా ఒక మళ్ళీ మనిషే ఆయనకు ఆనందం కలగటానికి? అంటే స్వామి పరమాత్మ గనుక, ఆయన మన అంతర్యామి గనుక మనం ఒక మంచి పని చేసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఆనందాన్ని మనం అనుభవించే దాన్ని ఆయన చూస్తూ ఉంటారంతే. ఆయనకు ఆనందమూ లేదు, దుఃఖమూ లేదు, సుఖమూ లేదు, సంతోషమూ లేదు. అది నిర్వికార నిర్విశేషమైనటువంటి పరమాత్మ స్వరూపం. భావనలో మనం సంచారం చేయాలి. అది మీరు చెప్పినట్లు- ఉమ్ రోజుల్లో పని గానీనండి ఎవరితో అన్నా మాట్లాడండి, ఏదన్నా ఎవరికన్నా చేయాలంటే what for me అనేది ఒకటి ఉండిపోతుంది. వాడికి చేస్తే నాకేంటి అనేది లేకుండా నిస్వార్థంగా చేయాలి. చేయాలి ఇది స్వామి మనకు చూపించినది. Correct, correct. యువతకు క్లిష్ట పరిస్థితుల్లో ఏదైనా సలహా ఇవ్వండి. ఒక్క క్షణం ఆలోచిస్తే మనకసలు క్లిష్ట సమయం అనేది లేదు. ఎందుకు లేదంటే మనం స్వామితో కూడి ఉన్నాం. అప్పుడు భౌతిక చైతన్యంతో కూడున్నాం.ఇప్పుడు భౌతిక అవస్థను దాటినటువంటి మహా విశ్వ చైతన్యంతో కూడి ఉన్నాం. అయితే భౌతికంగా నామ రూపాలకు మనం అలవాటు పడ్డాం గనుక, దానితో మనకు అనుభవాలు ఉన్నాయి గనుక దుఃఖం అనివార్యం. అది అసహజం కాదు. దుఃఖం కలగకపోతేనే అసహజం. కలిగిన దానిలో నుంచి అది యువతకే కాదు సాయి భక్తులకి, మన వారందరికీ కూడా సందేశం అని కాదు చిన్న సూచన మాత్రం చేయగలుగుతాను. సూచన ఏమిటి అంటే, సమాజాన్ని మీరు తీసుకోండి, ఎప్పుడు తీసుకోండి నూటికి డెబ్బై ఎనిమిది పర్సెంట్ యువకులే, యువతులే ఉంటారు. అది యువత. అది సమాజం past గాని రాబోయే future గాని డెబ్బై ఎనిమిది పర్సెంట్ యువకులు, యువ నాయకత్వం కావాలి, యువ శాస్త్రవేత్తలు కావాలి, యువ శ్రేష్టులు కావాలి. యువతలో అద్భుతమైన energy ఉంది. ఉమ్, అవును మీరు జాగ్రత్తగా గమనించండి. ఎనభై ఆరు సంవత్సరాలు స్వామి అవనీ సంచారం. అవును మొదటి పధ్నాలుగు ఏళ్ళు అవతార ప్రకటన వరకు ఒక భాగం. పధ్నాలుగవ ఏట అవతార ప్రకటన nineteen forty అనుకుందాం. forty నుంచి ఇదిగో ఇప్పటి వరకు డెబ్బై రెండు సంవత్సరాలు. డెబ్బై రెండు సంవత్సరాలలో స్వామి ఏం చేశారు? బాల వికాసతో మొదలుపెట్టి వాళ్ళని యువకులుగా చూసి, యువకుల్ని మధ్య వయస్కులుగా చూసి, వాళ్ళు ఇవాళ వృద్ధులైనారు. అవును సార్ అంటే ఏం చేశారు? అతి చిన్న వయస్సు నుంచే వాళ్ళని అధ్యాత్మలోకి రమ్మన్నారు స్వామి. వాళ్ళు యువతులుగా రూపాంతరీకరణం చెందినప్పుడు లేదా యువకులుగా మారినప్పుడు, యువతులుగా మారినప్పుడు వాళ్ళ మనసులో ఏముంది? అంతా సాయి తత్వమే ఉంది. సాయి తత్వం అంటే ప్రేమ తత్వం ఉంది, సేవాభావం ఉంది, దివ్యత్వం ఉంది. అదే unity purity divinity అని స్వామి మనకు పదే పదే చెప్పారు. వాటిని ఇవాళ ఆచరించాలి మనం. ఆచరించినట్లయితే తప్పకుండా స్వామి ఆదర్శాలకి, స్వామి అవతారానికి ఒక సంపూర్ణ పరమావధి ఏర్పడినట్టు గా భావన చేస్తూ యువత అనబడేటువంటి యువతీ యువకులందరూ కూడా స్వామి ఆదర్శాలను ప్రపంచమంతా నలుమూలలా చాటే ఒక ప్రయత్నం చేయాలి. రెండవది, తాము స్వామి నుంచి ఏది పొందారో తాము కూడా ప్రపంచానికి అదే స్థాయిలో కాకపోయినా తమ తమ స్థాయిలో దాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఉమ్ ఇది దీనికి నాకేమిటి అన్న ప్రశ్న లేదు. అలా అనుకొని ఉన్నట్లయితే సత్య సాయి భగవానుడి అవతారం వచ్చి ఉండేదే కాదు. నాకేమిటి కాదు మీకేమిటి స్వామి వేసిన ప్రశ్న ఇది. మీకేం కావాలి? నేనున్నా. అన్నీ ఇక్కడ వదిలిపెట్టండి. కాబట్టి మరొక చిన్న సూచన ఏమిటంటే, యువతకి పరమాద్భుతమైన energy ఉందని అనుకున్నాం. అవును అది channelize కావాలి. proper గా channelize కావాలి. నదికైనా, చిన్న కాలువ, పిల్ల కాలువకైనా రెండు గట్లు ఉంటాయి. గట్ల మధ్య ఉడ్డొరిసి ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ప్రవహించటం, పరిగెత్తటం, వేగ, ఆవేగంతో వెళ్ళటం దాని లక్షణం. అవును లక్షణంలో ఒక్కోసారి గట్టు తప్పచ్చు, గట్టు తెగచ్చు. దానికి అటూ ఇటూ కాపు కాయటానికి మనకంటే ముందు తరం వాళ్ళున్నారు. ముందు తరం వాళ్ళ experience, వాళ్ళ జీవితానుభవం, స్వామితో వాళ్ళకున్నటువంటి అనుభవం, సేవ ద్వారా వాళ్ళు పొందిన ఆనందం. వాళ్ళు స్వామితో స్వయంగా పొందినటువంటి అనుభవాలు. ఇదంతా కలిపితే వాళ్ళ జీవన, జీవితానుభవం. జీవితానుభవానికి యువత గనుక తన శక్తిని సమన్వయం చేస్తే, స్వామి మహా పరినిర్వాణ అనంతరం ఉన్నటువంటి సమయం ఇది ఒక శూన్యతగా కనిపిస్తూ ఉన్నది. శూన్యం అనటం లేదు మనం. ఎందుకనటం లేదంటే శూన్యత అంటేనే దాంట్లోనే చాలా temporary phase. temporary phase ని మన కార్యకలాపాల ద్వారా దాన్ని నెమ్మదిగా దూరం చేసుకోవాలి. మనస్సుని స్వామి కార్యక్రమంలో ప్రవేశపెట్టాలి. పూర్ణత్వం వైపు నడవాలి. పూర్ణత్వం అంటే సాయిత్వం. సాయి సత్య సాయి భగవానుడు అంటే మూడు వందల అరవై డిగ్రీలలో ఉన్నటువంటి మహా పరిపూర్ణమైనటువంటి అవతార స్ఫూర్తి. అందుకే నా బలమైనటువంటి ఒక అభిప్రాయం ఏమిటంటే, "Youth shall reshape the world, of course with the help of adults." పెద్దవారిని గౌరవిద్దాం, వారి అనుభవాలు తీసుకుందాం. వారి బాసటగా ఉంటూ వారి మార్గం, మన మార్గం ఒకటే. అందరం స్వామి లక్ష్యం. మార్గంగా వెళ్లాలనేటువంటిది నా సూచన. అందరూ అంటుండేవాళ్ళు స్వామి మనకు ముందరే ఏదన్నా సూచన ఇచ్చి ఉంటే బాగుండేది. ఉమ్ అప్పుడు నేను అనుకునేవాడిని- ఉమ్ ఒకవేళ స్వామి నాతో ఇవాళ వచ్చి "నేను రేపు వెళ్తున్నాను బంగారు.- ఉమ్ నేను ఇక్కడి నుండి ఈ- అవతారం చాలిస్తున్నాను అవతారం చాలిస్తున్నాను" అంటే- ఉమ్ మనకు తట్టుకునే శక్తి ఉందా? మనమేమైనా చేయగలమా? ముప్పై రోజులు స్వామి పడిన బాధ ఎందుకు? అండ్ చాలా మందిలో ప్రశ్న ఉంది. చాలా మంది నన్ను అడిగారు. స్వామి ఒక్క సూచన కూడా ఇవ్వలేదే అని. ఉమ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటే. స్వామి అనేక సూచనలు చేశారు. 2003 నుంచి 2011 దాకా సుమారు ఎనిమిది సంవత్సరాలు. దాన్ని మనం ఇవాళ English లో withdrawal అంటాం. withdrawal అంటే, ఇంతవరకు నేను చేస్తూ, మీకు చూపిస్తూ, మీతో ఉంటూ, మీతో నడిపిస్తూ ఉన్నాను కదా. మీతో నడుస్తూ ఉన్నాను కదా. ఇకపై మీరు చేస్తూ ఉంటే నేను చూస్తాను ఎలా ఉందో అన్న భావంగా. దాన్ని తీసు-- మనం ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటాం దాన్ని బట్టి. ఒక ఎనిమిదేళ్ళు సుదీర్ఘ కాలం. అవును సార్ సుదీర్ఘ కాలంలో మనకు నాలుగు విషయాలు స్వామి చెప్పారు. ఉపన్యాసాలని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక జాతీయత ఉండాలన్నారు. nationality. ప్రతి దేశం వాడికి. ఒక భారతదేశం అని కాదు. ఆయన దృష్టిలో భారతదేశం ఒక చిన్న భాగం. సర్వ ప్రపంచానికి ఆయన భగవంతుడు గనుక జాతీయత ఉండాలి. ఒక మానవుడు సంచారం చేసే స్వేచ్ఛ ఉండాలి. మానవత ఉండాలి. లోపల దివ్యత్వాన్ని ఎరగాలి. ఈ, నాలుగింటిని కూడా స్వామికుర్చీలో వస్తూనే, కారులో వస్తూనే మనకి అనేక విధాల సందేశాలు ఇస్తూ వచ్చారు. అయితే ఇంతకు ముందు ప్రబోధంగా ఉండేది ఇప్పుడు కాస్త పరోక్షంగా ఉన్నాయి. చాలా సటిల్ గా. దాన్ని పట్టుకోగలిగినటువంటి ఒక ఏకాగ్రమైనటువంటి ఒక చిత్తము, మనస్సు ఒక సంస్కారం మనకు ఉన్నట్లయితే అవి మనకు అర్థమయ్యి ఉండేవి. రెండవది, అవతార పురుషుడు కూడా నేను రేపటి నుంచి మీ మధ్యలో ఉండను అని చెప్పడు. నది, ఒక చిన్న నది సాగరాన్ని సంగమించాలి, సముద్రంలో కలవాలి. నేను కలవబోతున్నాను అని చెప్తుందా? తన ప్రయాణం చేస్తూ వెళుతుంది. సముద్రం వైపే అభిముఖంగా వెళుతుంది. సముద్రం వచ్చినప్పుడు, దగ్గర పడ్డప్పుడు ప్రశాంతంగా, ప్రసన్నంగా, మహా చైతన్యంలో కలిసిపోయినట్లుగా అది కలిసిపోతుంది. స్వామి indications చాలా ఇచ్చారు. ఉపన్యాసాలు ఇవ్వటం మానేశారు ముందు. చాలు అన్నారు. చేయండి అన్నారు. అనేక కొత్త కొత్త కార్యక్రమాలు భక్తులు రూపకల్పన చేస్తే ఇది ఇట్లా కాదు అట్లా అని ఏం చెప్పలేదు. చేసిన వాటన్నింటినీ కూడా ఆశీర్వదించారు. స్వామి అనుగ్రహంతోనే ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ నడిచినాయి. కాబట్టి నా పరంగా స్వామి ఇవ్వవలసినన్ని సంకేతాలు ఇచ్చారు. ఇక రెండవది, చివరగా నెల రోజులు ముప్పై రోజులు స్వామి అనుభవించిన బాధ అనే మాట ఆధ్యాత్మిక స్థాయిలో మనం వాడనవసరం లేదు. ఎందుకంటే, ఆయన పద్నాలుగవ ఏటనే తన తల్లిని స్వయంగా, జన్మనిచ్చిన తల్లిని పిలిచి "నువ్వు మాయ. నీకూ నాకూ సంబంధమే లేదు. నా భక్తుల కోసం నేను వచ్చాను" అని ప్రకటన చేసిన నాడే స్వామి శరీరం నుంచి ఎలైనేట్ అయిపోయినారు. శరీరమే గనక స్వామి అయి ఉన్నట్లయితే ఆయన కూడా మనలాగా ఇన్ని పనులు చేయగలిగి ఉండేవారు కాదు. అదొక దివ్యత్వం, ఒక గాఢమైనటువంటి పరమాత్మ తత్వం గనుక మానవ దేహాన్ని ఆసరా చేసుకున్నారు. దానికి ఆశ్రయం ఇచ్చారు దేహానికి. మళ్ళీ తనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు దేహాన్ని తానే వదిలిపెట్టారు గనుక ఆయన బాధపడ్డారనేది మనం చూస్తూ మనం అనుభవించాం. స్వామి ఏమన్నారు? "నాకేం బాధ లేదు. నేను హాయిగా ఉన్నాను. శరీరం మీస్ మీది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి" అన్నారు. అది మొన్న ముప్పై రోజులే కాదు, గోవా నాటి నుంచి. హిప్ జాయింట్ ఆపరేషన్ అయిన నాడు మాటల్లో ఏం తేడా లేదు స్వామి. మీరు స్వామి వద్దకు వచ్చి యాభై సంవత్సరాలు గడుస్తుంది. అవును. అయితే నెల రోజుల నుండి వార్త వినగానే మీలో ఉన్న మనోభావాలు ఏమిటి? యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుబంధంలో స్వామిని ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఉద్యోగరీత్యా గాని అనేక కారణాల వల్ల ఎప్పుడన్నా ఒక ఏడాది స్వామిని చూడలేకపోతే కన్నీరు మున్నేరైనటువంటి బాంధవ్యం స్వామితో. అయితే, ఆధ్యాత్మిక సాధనలో స్వామి అనేక విషయాలు చెప్పారు. అనేక విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా స్వామి ఏదో రోజు దేహం వదిలి పెడతారు అనేది ఒక బలమైనటువంటి భావన ఎక్కడో ఉన్నది. కానీ, స్వామి ఇలా దేహం వదిలిపెట్టారు అన్న మరుక్షణం నాలో కలిగినటువంటి భావం ఒక శూన్యత, ఒక నిస్తబ్ధత. మహాసముద్రం వచ్చి మనల్ని ముంచెత్తిన తర్వాత గాలి ఆడదు, ఊపిరి ఆడదు. సముద్రము, మనము ఒకటైపోయిన భావన కలుగుతుంది. కాస్త మళ్ళీ తల ఎత్తి నీటి ప్రవాహం నుంచి, కెరటాల నుంచి బయటకు వచ్చిన తర్వాతనే మనస్సు ఆలోచించటం మొదలు పెడుతుంది. మనస్సు నిజంగా మూగపోయింది. రకమైన భావన లేదు. భావన లేకపోవటానికి ఒకే ఒక్క కారణం స్వామి యందున్న భక్తి కావచ్చు. స్వామి శరీర మాత్రుడు మాత్రమే కాదు అన్నటువంటి ఒక నిశ్చిత అభిప్రాయం, మనీష కావచ్చు. మనీష అంటే జ్ఞానాధిక్యమైన ఆలోచన కావచ్చు. నిజమే దేహం వదిలిపెట్టారు, మరొక దేహంలోకొస్తారు. చెట్టు పడిపోయింది, చెట్టే పోయిందా లేదై చిగురించదా? అన్నటువంటి ఒక దివ్యమైన ఆలోచన. ఇవన్నీ తర్వాత వచ్చినయి. కానీ స్వామి శరీరం వదిలిపెట్టారు అన్నప్పుడు, కలవక కొన్ని వేళలు నికామ క్షణాలు అంటారు. నిక-- రకమైన ఆలోచనా లేని ఒక శూన్యత. దాని నుంచి బయటపడ్డ తర్వాత పూర్ణత్వం వైపు ఇవాళ మీరు చాలా ఆశ్చర్యంగా స్వామి అనుగ్రహంతోనే మాటలు వస్తున్నాయని అనిపిస్తోంది. పూర్ణత్వం వైపు ఇంకా నేను ఎలా, ఇప్పటిదాకా చేసుకున్న సాధనని ఇంకా పరిపూర్ణం ఎలా చేసుకోవాలి అని. ఇక మూడవది, సత్యసాయి భగవానుడు నా దృష్టిలో, నా అనుభవంలో అది మహా పరిపూర్ణ అవతారం. మిగతా అవతారాలు కావా అంటే ఏమో నాకు వాటితో పరిచయం లేదు. కథల ద్వారా, పురాణాల ద్వారా, పెద్దలు చెప్పిన మాటల ద్వారా విన్నాను. కానీ, దీన్ని నేను అనుభవించాను. పరిపూర్ణమైన ఒక అవతార పురుషుడికి, అవతారమూర్తికి సమకాలీనంగా ఒక జన్మ ఎత్తటం, జీవించగలగటం, స్వామి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, స్వామి ఆదర్శాలన్నీ ఒక స్ఫూర్తి కావటం, ఇదంతా స్వామి అనుగ్రహంగానే నేను భావిస్తూ స్వామి రోజు ప్రత్యక్ష బోధ చేశారు, ఇవాళ పరోక్షంగా మనల్ని నడిపిస్తారు అన్నటువంటి అచంచల విశ్వాసం నా-నాలో సడలలేదు, సడలదు. అలాగే మన స్వామి భక్తులందరూ కూడా. నిజానికి చేయవలసిన ఒక చిన్న కర్తవ్యం ఉంది. ఏమిటంటే, ఇదిగో మేము దీన్ని అనుభవించాం. యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ ఏం లేదు పుట్టపర్తిలో. ఇవాళ అక్కడ లేనిదంటూ లేదు. అన్నీ ఉన్నాయి. రండి మీరు, ఒకసారి రండి. స్వామిని కేవలం దేహంగా చూడవలసిన పని ఇవాళ ఏం లేదు. స్వామి చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి గుర్తుగా కొన్ని కోట్ల మందిని స్వామి ఇవాళ మనకు తయారు చేసి వెళ్లారు. నాయకత్వం వహించటానికి గాని, స్వామి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే సేవా కార్యక్రమాలలో గాని, స్వామి భక్త కుటుంబాలలో నుంచి మాత్రమే కాకస్వామి ఎంత చేశారు అనేది ఇక్కడికి వస్తే తప్ప తెలియదు చూడాలి కంటితో చూడాలి seeing is believing ఇక్కడికి వచ్చి స్ఫూర్తితో ఇవాళ నేను మన రేడియో సాయి ద్వారా యువతకి ప్రధానంగా తల్లిదండ్రులకు కూడా ఆధునికమైనటువంటి తరం వాళ్ళకి ఒక చిన్న సూచన ఎన్నో ప్రదేశాలు మీరు చూశారు చూసే interest మీకు ఉంటుంది పుట్టపర్తిని అలా చూద్దాం అని అన్నా రండి వస్తే ఇక్కడ స్వామి ఒక్క వ్యక్తిగా ఒట్టి నరమాత్రుడు అనుకుందాం కాశీ ఒట్టి మానవుడు అనుకుందాం చేయలేడు ఇంత పని చేయలేడు ఇక్కడికి వచ్చి మీరు మీ అనుభవాన్ని పొందండి మీ అనుభవంలో నుంచి మీ ఆనందాన్ని draw చేయండి మేము నాబోటి వాడు చెప్పటం అది నా ఆనందం మీరు వచ్చి ఇక్కడికి సాయి సేవా కార్యక్రమాలలో విపరీతంగా గనుక పాల్గొన్నట్లయితే సేవ ద్వారా మీరు పొందే ఆనందం మీ ఉద్యోగం ద్వారా ఆస్తుల ద్వారా కీర్తి ద్వారా ప్రతిష్ట ద్వారా పొందే ఆనందంతో ఇది సమానం మాత్రం కాదు స్వామి ఇలా దేహం వదిలారు తర్వాత చాలా negative publicity వచ్చింది మీడియాలో కానీవండి ఏదేదో మాట్లాడుతున్నారు స్వామి గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా వచ్చి చూడాలి అని వచ్చి చూడాలి అదే అంటే మీరు ఒకసారి దాని మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నన్నే అడిగారు ఎవరన్నా నేను ఏం చెప్పాలి అంటే ఇప్పుడు తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ప్రశ్నిస్తున్న వారు మీ బాబా అంటున్న వారు సంకుచిత ధోరణి నుంచి బయటపడాలి స్వామి ఎన్నడూ వీరు నా వారు వీరు నా వారు కాదంటూ రెండు వర్గాలు లేవు ఆయనకి అందరూ తన వారే తాను అందరికీ చెందిన వారే కాబట్టి ఒకే ఒక ఆలోచన మీరు ఇక్కడికి రండి చూసి ఇక్కడ ఏం జరిగింది యాభై ఇరవై సంవత్సరాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిననాడు మీడియా బయటకు రాలే అలాగే డీమ్డ్ యూనివర్సిటీ ఆంధ్రదేశంలో ఒక పుట్టపర్తి అనే కుగ్రామంలో స్వామి సంకల్పంతో అది ప్రారంభమైతే మీడియాలో చోటు చేసుకోలే స్వామి water projects చేస్తే ఎంత ఎక్కడ ఒక inauguration photo గాని గ్రామాలకు వెళ్తున్న route map గాని ఎక్కడా లేదు కాబట్టి నా దృష్టిలో మీడియాని మనం విమర్శించనవసరం లేదు అది సమాజంలో ఒక పార్శ్వం అయితే దాని బాధ్యత ఏమిటంటే రాసే ముందు కూసే ముందు ఇక్కడికి రావాలి వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఏం జరిగినయో చూడాలి చూసి దీన్ని ప్రపంచానికి ఒక సందేశంగా ఇవ్వగలిగినట్లయితే అది గొప్ప విషయం అయితే మీరు అడిగిన ఇంకొక ప్రశ్న స్వామి మానవుడిలానే వెళ్ళిపోయారేమిటి మామూలు మనిషి లాగా అని దైవమ్ అనుష రూపేణ పంచభౌతిక దేహాన్ని తీసుకొస్తే రమణ మహర్షి మాట అన్నారు జ్ఞానికి ప్రారబ్ధం తప్పదు ప్రారబ్ధం వారికేం లేదు మన ప్రారబ్ధాలే ఆయన ప్రారబ్ధం మనకోసమే ఒక జీసస్ క్రైస్ట్ శిలువ ఎందుకు మోశాడు ఎవరికోసం మోశాడు తనను శిక్షించిన వారిని బాధించిన వారిని కూడా వాళ్ళు అమాయకులు క్షమించి వదిలిపెట్టండి అన్నాడు క్షమ రెండవది స్వామి మానవ శరీరంలో వచ్చిన మానవాతీతమైన దివ్యశక్తిగానే ఉన్నారు పార్శ్వంలో ఆలోచన ప్రారంభించండి మూడో పాయింటు స్వామి అవతార ప్రకటన నాటికి కేవలం పద్నాలుగు ఏళ్ళ చిన్న పిల్లవాడు ఆనాడు dress వేసుకున్నారో శరీర పరిత్యాగం ఎనభై ఆరు ఏళ్ళు వచ్చేప్పటికి కూడా dress లో మార్పు లేదు address లో మార్పు లేదు రాముడు గాని కృష్ణుడు గాని మనకున్న పురాణాల ఆధారంగా ఎవరూ అవతారమూర్తి కూడా జగత్తుకి నేను చెప్పి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిన వారు లేరు పాయలోనే సత్యసాయి భగవానుడు కూడా అలాగే తాను కోరుకున్న తాను అనుకున్న నిర్ణయించుకున్న సంకల్పించుకున్న దివ్య శుభ ముహూర్తంలోనే దివ్యదేహాన్ని ఇక్కడ వదిలిపెట్టారు అంతే అది మన అభిప్రాయం స్వామి వదిలి వెళ్లారు కానీ ఆయన నిర్ణయించుకున్నాడు uncertainty is for us not for him not for him అది నిశ్చితం కచ్చితం కనుకనే ఇందాక నేను చెప్పానే రెండువేల మూడు నుంచే నెమ్మదిగా తనకి తాను మనందరికీ ముందు పాద నమస్కారాలు ఉండేవి interviews ఉండేవి interview కి గంట time లేదంటే వరసల్లో ఉన్నా పలకరించేవారు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు వెళ్లేనాడు విభూతి తప్పకుండా ఆయనకేదో మన program తెలిసినట్టుగా విభూతి packet ఆరోజు ఇచ్చేవారు పాద నమస్కారం చేయించి ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ పరవశించిన వేళ పాద నమస్కారం చేసుకో అని హెచ్చరించేవారు మరి నెమ్మదిగా పాద నమస్కారాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా కాలగమనంలో కాబట్టి సత్యసాయి భక్తుడుగా స్వామిని దగ్గరగా చూసిన వాళ్ళంగా మన అనుభవాలు వేరు ఆయనను చూడకుండా ఆయన చేసిన కార్యక్రమంలోనూ పాలుపంచుకోకుండా అసలు విషయాలే తెలియకుండా తోచిన రీతిలో రాయటం మహాపాపం అలా చేయకూడదు ఎందుకంటే మీడియా ఒక గొప్ప powerful మీడియా అదొక మంచి weapon ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చేటువంటి దిశగా స్వామి యొక్క అవతార లక్ష్యంలో సాధించబడినటువంటి విషయాలన్నీ గనుక ఇకనైనా చేయగలిగితే ఒక్కొక్క గ్రామము పుట్టపర్తి కావాలి స్వామి ఎప్పుడో చెప్పారు రాబోయే రోజులలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క mini సాయిబాబా కావాలి అది నా కోరిక నేను ఒక్కడినే వచ్చి ఒక్కడినే చేసి వెళ్ళేది కాదు నా తర్వాత అనేకమంది సాయిబాబాలు తయారు కావాలి అంటే సేవాకృతులుగా స్వామి స్ఫూర్తితో కాబట్టి module అందరికీ చెప్పగలిగింది ఒకటే దైవం మానవ రూపంలోనే వస్తాడు రాముడు అలాగే వచ్చాడు కృష్ణుడు అలాగే వచ్చాడు బుద్ధుడు అలాగే వచ్చాడు జీసస్ క్రైస్ట్ అలాగే వచ్చాడు గురునానక్ అలాగే వచ్చాడు మానవ దేహంతో వస్తారు వాళ్ళు మానవ దేహాన్ని వదిలిపెట్టవలసిందే కానీ మనం అనుకున్న రీతిలో మనం ఊహించిన రీతిలో వాళ్ళు వెళ్ళరు అదే రెండు మనకి చెప్పి వెళ్ళవలసిన పని బాధ్యత వాళ్ళ మీద లేదు ఏమి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఒక సంపదని ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని దివ్య సన్నిధానాన్ని ప్రపంచానికి స్వామి అప్పజెప్పారు ఎంతోమందిని transform చేశారు మరి విపరీతంగా మామూలుగా కాదు అసలు పరిణామం చూస్తే నేను చాలా చోట్లకు వెళ్తుంటాను seats of corruption అని దాన్ని తెలుగులో English లో పేరుఅటువంటి చోట కూడా మార్పు చెందిన వాళ్ళని కొన్ని కోకొల్లలు చూసా అనేక వర్గాలలో కాబట్టి స్వామి సమాజం మీద దేశం మీద మొత్తం ప్రపంచ పటం మీద సాయి ప్రభావం అది ఎవరు రెండు మాటలతోనో రెండు పుస్తకాలతోనో రాసేది కాదు తీసేది కాదు అవును అది indelible చిరస్మరణీయమైనటువంటి ఒక సాయి ముద్ర సాయి ముద్ర పాద ముద్ర మనకి కాలగమనంలో మన జీవితాలు కూడా మార్గంలోనే వెళ్ళాలి అలాగే కొనసాగాలి ఒకటే తేడా ఇది వరకు కంటే ఇంకా బాధ్యతగా మన కర్తవ్యాలు నిర్వర్తించాలి అవును సర్ ఇది వరకు కంటే ఇంకా అంకితభావంతో చేయాలి ఇది వరకు కంటే నాకు పాద నమస్కారం దొరికితే చాలు నాకు ముందు సీటు దొరికితే చాలు అనే యాతన నుంచి బయటపడి అనేక మంది కొత్త వాళ్ళు ఇంకా రుచి తెలియని వాళ్ళు వాళ్ళందరినీ మనం స్వయంగా వాళ్ళని తీసుకు రావాలి తెచ్చి ఇక్కడ ఒక్కొక institution దాని వెనుక ఉన్న దివ్య శక్తిని వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు కూడా మనం ఇంత కాలం పొందిన ఆనందాన్ని వారు పొందేటట్టుగా మనం కొంత సేవ చేయాలి అది మన కర్తవ్యంగా మనం భావన చేయాలి ముక్తి కాదు కావలసింది పరిణామం అంటే transformation అవును దానికి ఇవాళ మన దగ్గర పుస్తకాలున్నాయి information ఉంది transformation పుస్తకం కొని ఇంట్లో పెట్టుకుంటే రాదు ఉమ్ Information implementation transformation ఉమ్ implementation కి ఇవాళ అధ్యాత్మలో మనకి దివ్య యోగ సాధన స్వామి మనకు అనుగ్రహించారు ఇవాళ మళ్ళీ కొత్తగా రకంగా చేయండి అని చెప్పటానికి ఏం లేదు ఒక మానవుడు ఎన్ని దారులలో ఎన్ని కోణాలలో ఎన్ని స్థితులలో గతులలో తన అధ్యాత్మ జీవితాన్ని గడపవచ్చున స్వామి సుస్పష్టంగా వేద ప్రామాణికంగా ఉపనిషత్తుల అనుసరణీయంగా అలాగే ఒక Bible లో ఒక మత గ్రంథంలో సర్వ మతాలలో ఉన్నటువంటి సారాన్ని మానవుడికి ప్రబోధ గీతికగా అందించారు అటువంటి స్వామి వాళ్ళ కొత్తగా చెప్పవలసింది నిజానికి ఏం లేదు ఆచరించవలసిన బాధ్యత మాత్రం మనది అవును సర్ కృతజ్ఞత అనేది చాలా చిన్న word మన దాంట్లో అది లేదుగా అవును సర్ అక్కర్లేదు అవసరం లేదు thank you అనేది లేదు లేదు లేదు కాబట్టి మనందరం కలిసి ఇంకా పని చేస్తూ అంతే ఎప్పటికీ స్వామి సేవలో మన జీవితాలన్నీ తరించాలని ప్రార్థిస్తూ కార్యక్రమానికి స్వస్తి పలుకుతున్నా [భాగం పాట] శూన్యత నుండి పూర్ణత వైపు భగవాన్ బాబా వారి మహా ప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారితో సంభాషణ రెండవ భాగం మీరు విన్నారు కార్యక్రమం మొదటి భాగం గత బుధవారం 15 6 2011న ప్రసారం చేశాం ఇంతటితో ఈనాటి మా తెలుగు కార్యక్రమం సమాప్తం శ్రోతలు మా తెలుగు కార్యక్రమాలను ప్రతి సోమ బుధవారాలు రాత్రి ఏడున్నర నుండి ఎనిమిదన్నర వరకు వినవచ్చు అంతేగాక ప్రసారాలు మా website www.radiosai.org లో కూడా అందుబాటులో ఉంటాయి సాయిరాం [భాగం పాట]
SSSMC · audio

Telugu Broadcast - 561

Home

Telugu Broadcast - 561

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 58:37

More in this series

Telugu Broadcasts

12 episodes · 11 hr 32 min

  1. 57 min 394

    Telugu Broadcast - 394

  2. 1 hr 396

    Telugu Broadcast - 396

  3. 58 min 402

    Telugu Broadcast - 402

  4. 58 min 420

    Telugu Broadcast - 420

  5. 56 min 424

    Telugu Broadcast - 424

  6. 57 min 427

    Telugu Broadcast - 427

  7. 57 min 490

    Telugu Broadcast - 490

  8. 56 min 491

    Telugu Broadcast - 491

  9. 56 min 498

    Telugu Broadcast - 498

  10. 58 min 555

    Telugu Broadcast - 555

  11. 57 min 560

    Telugu Broadcast - 560

  12. 58 min 561

    Telugu Broadcast - 561

    Now playing