No transcript for this section.
[భాగం వాయిస్] ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా స్వామి వారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారు జ్ఞాన యోగంపై ప్రసంగిస్తారు. తదుపరి 2008 నవంబర్ మాసంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఎనభై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా జరిగిన సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవం యొక్క విశేషాలను మీ ముందుంచుతున్నందుకు రేడియో సాయి బృందం ఎంతగానో ఆనందిస్తోంది. ఇప్పుడు మీరు స్వామి వారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారిచే జ్ఞాన యోగంపై ప్రసంగాన్ని వింటారు. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ యోగత్రయంలో మూడవదైనటువంటి జ్ఞానయోగ భూమికలోకి ఇవాళ ప్రవేశం. ఇంతకు ముందే కర్మ యోగాన్ని, భక్తి యోగాన్ని గురించిన విచారణ చేశాం. ప్రాపంచిక కర్మలు వ్యక్తిగా చేస్తే కర్మలని, భగవత్ ప్రీత్యర్థం చేస్తే అవి కర్మ యోగాలని, కేవలం కొన్ని ఆలోచనలకి కోరికలకు పరిమితమై పరమేశ్వరుని మనకంటే భిన్నమైన శక్తిగా ఉపాసన చేస్తే అది భక్తి అని, పరమేశ్వరా! నీవు నేను ఒకటేనన్న భావనలు అంటే సూర్యుడు, సూర్యకిరణాలు అభిన్నంగా ఎట్లా ఉన్నాయో అట్లాగే నువ్వు నేను ఒకటే అనే భావనతో గనుక చేసినట్లయితే అది భక్తి యోగం అని విచారణ చేశాం. కర్మ యోగంలో కర్మలున్నాయి. భక్తి యోగంలో పరమేశ్వరుడు, మనము ఉన్నాం. మరి జ్ఞాన యోగంలో ఎవరున్నారు అని? జ్ఞాన యోగంలో నిజానికి అందరూ ఉన్నా ఎవరూ లేరు అది జ్ఞాన యోగం. జ్ఞాన యోగంలో నువ్వుగా అనబడే దేహం ఉన్నది, నిన్ను నడిపిస్తున్న దేహి ఉన్నాడు. "దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహిని రామయి యుండు." అన్నారు స్వామి. గణుతిమ్పగా దేహియే దేవదేవుడవను పద్యం స్వామి. దేవుడు ఎక్కడో ఎక్కడో ఉన్నాడని దేవుళ్ళాడకండి బంగారు, నీలోనే ఉన్నారు. ఈ నీలోనే ఉన్నారనేది మొదటి రోజుల్లో చెప్తే మనకర్థం కాదు గనుక, పరిణామ సహమైనది మానవ జీవితం గనుక, అంటే పరిణామం చెందటం మానవుడి లక్షణం గనుక, చూడండి మానవుడికి మూడు దశలుంటాయి. అసలు నమ్మకమే లేని స్థితి ఒకటి. రెండవది నమ్మీ నమ్మని స్థితి. మూడవది నమ్మకమే నడిపించే స్థితి. ఈ నమ్మకమే నడిపించేటువంటి స్థితి పేరే జ్ఞాన యోగం. ఏమిటి ఆ నమ్మకం అంటే, పరమాత్మ అక్కడున్నాడు ఇక్కడున్నాడని వెతికాను గానీ అసలు ఉన్నదంతా పరమాత్మే. చిన్నప్పుడు నిజానికి మనం ఎవరన్నా కొత్త సంవత్సరంలో డైరీ ఇవ్వగానే ఏదో ఒక మంచి మాట రాసుకునే వాళ్ళం జనవరి ఒకటో తారీఖున. "God exists everywhere" అని రాసేవాళ్ళం. పరిణామంలో ఇవాళ మనకు మళ్ళీ ఎవరైనా కొత్త డైరీ ఇస్తే "God exists everywhere" అని రాయటంలే, ఏం రాస్తున్నాం అంటే "Whatever exists is God" అని రాస్తున్నాం ఇది పరిణామం. అసలు ఉన్నదే దైవం, ఆ దైవంలో మనము భాగం. ఇదివరకేం అనుకున్నాం దైవం వేరు మనం వేరు, ఆయన వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు. ఆయనేమో "త్వమేవాహం న సంశయః" యు ఆర్ మీ ఐ యామ్ యు స్వామి చెప్తూ వచ్చారు. ఆ అలా స్వామి అంటారు గానీ మనమెప్పుడు కావాలి అని. స్వామీ ప్రత్యక్షంగా, సాక్ష్యంగా పదిమంది మధ్య నుంచొని అందరికీ అర్థమయ్యేట్టుగా నీకూ నాకూ తేడా లేదు బంగారు, నీవు దైవమని తెలుసుకో అంటున్నారాయన. ఈ దైవమని తెలుసుకునేటువంటి మార్గంలో కర్మ యోగం ఒక సోపానమైతే, భక్తి యోగం రెండవ సోపానమైతే, మూడవది జ్ఞాన యోగం. ఇది పరమోత్కృష్టమైనటువంటి సాధనా స్థితి. ఈ జ్ఞాన యోగాన్ని చూడండి శ్రీకృష్ణుని యొక్క మధుర విషాద గాథ అయింది. అది ఎంత మధురమో అంత విషాదభరితం. అది ఎంత విషాదంగా కనిపిస్తుందో దానిలో ఒక విషాద మాధుర్యం అన్నది, మాధుర్య విషాదం కూడా ఉన్నది. రెండు కలబోసుకొని ఉన్నాయి. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా, కౌమార కృష్ణుడిగా, యవ్వన కృష్ణుడిగా, ప్రౌఢ కృష్ణుడిగా, యోగీశ్వరుడిగా పరిణామం చెందాడు. భగవద్గీత ఆయన చెప్పాలి అనుకుంటే కురుసభలోనే ఆయన చెప్పి ఉండేవాడు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ జ్ఞానబోధకి స్థానం లేదు. అక్కడ కావలసింది యుద్ధం చేయటమా అక్కర్లేదా అని విచారణ. చెయ్యాలో, చేయక్కర్లేదో నిర్ణయించింది ఆయనే, కానీ చెప్పదలచుకున్నదాని రంగం మాత్రమైనా మహాభారత సంగ్రామ వేళ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. లోక భూమికలోకి వెళ్లి రాబోయేటువంటి కలియుగంలో దేవుడు లేడు అంటూ ప్రారంభమయ్యే మన కలియుగంలో అనేకానేకమైన సందేహాలకు సమాధానంగా భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేశాడు. అప్పుడే ఎందుకు చేశాడు అంటే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి చెప్తూ ఓ మాటన్నారు. దక్షిణామూర్తి స్తోత్రం ఊరికే పది శ్లోకాలే కదా అని ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి, తత్వమసి స్థాయికి వెళ్ళిన వాడికి ఈ దశ శ్లోకీ చెప్పండి అన్నారాయన. అంటే తత్తత్వం అసి, నీవు నేను ఒకటే అయి ఉన్నాం అదే నేనై ఉన్నాను, నేను అదే అయి ఉన్నదనే భావన. అంటే అద్వితీయమైనటువంటి అద్వైత భావనలోకి వెళ్ళాక దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విచారణ అర్థమవుతుంది. అర్జునుడి వంటి వాడు తన జీవితంలో ఉన్న అన్ని ఎత్తుపల్లాలు అనుభవిస్తూ అనుభవిస్తూ ఇంకా మహాభారత సంగ్రామం తర్వాత ఏమనుభవిస్తాడయ్యా అంటే ఏం లేదు ఆయన అనుభవించటానికి. ఆయన రాజ్యం వెళ్తాడు, గెలుస్తాడు తప్పదు. రాజ్యం వెళ్తాడు తప్పదు. ఇంకా రాజైనవాడు, రాజభోగంలో ఉన్నవాడికి భగవద్గీత చెప్పటానికి వీల్లేదు గనుకఆ జయ-- విప-- విజయాన్ని పొందటానికి ముందే భగవద్గీతని ఉపాసనా మార్గంగా ఉపదేశనం చేశాడు. ఆ చేయటం అష్టాదశ అధ్యాయిని, పద్దెనిమిది అధ్యాయాలు. జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి ఆరు అధ్యాయాలు కర్మ యోగం, మధ్య ఆరు అధ్యాయాలు భక్తి యోగం, చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగం. ఇవాళ ఈ జ్ఞాన యోగ విచారణలో శ్రీకృష్ణుడే ఎందుకు గుర్తు రావాలంటే, కృష్ణుడి యొక్క స్థితి కృష్ణుడి యొక్క బోధ నిత్య నూతనమది. స్వామి లాగా. పొద్దున్నే చూశాం స్వామిని మళ్ళీ మూడు ఎప్పుడవుతుందా అని మనస్సు తహతహలాడుతుంది. ఇప్పుడు మళ్ళీ మూడింటికి చూస్తాం మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుందా అని. ఏమున్నది? "దుహానం దుహానం సుజానేన మౌధ్యం జిహానం జిహానం సుధాం వేణునాథై లిహానం లిహానం సుదీర్ఘై రపాంగై మహానంద సర్వస్వమే తన్ నమస్తత్" అంటాడు లీలాశుకుడు. ఎంత అందంగా కృష్ణుడిని వర్ణిస్తాడంటే, "జిహానం జిహానం సుజానేన మౌధ్యం" ఏమయ్యా కృష్ణ పరమాత్మ! నిన్ను పదేళ్ళ వాడిగా చూశా, ఇరవై ఏళ్ళ వాడిగా చూశా, అరవై ఏళ్ళ వాడిగా చూశా, ఎనభై ఏళ్ళ వాడిగా చూశా, నా చూపులు మారటం లేదు, నువ్వు మారటం లేదు. నీలో ఇంకా ఆ బాల్యంలో ఉన్న ముగ్ధత్వం ఎలా నిలబడింది అని. స్వామికి సమన్వయం చేయండి. స్వామిని యాభై ఏట చూశాం, అరవై ఏట చూశాం, డెభై ఏట చూశాం, ఎనభై న చూశాం, తొంభై న చూస్తాం, తొంభై ఆరున చూస్తాం, మార్పు ఏదన్నా ఉన్నదా అని. ఒక మార్పు మాత్రం ఉంది. ఏమిటా మార్పు అంటే, ఎప్పటికీ మారనిటువంటిది ఒకటి మాత్రం ఉన్నది. అది మహా చైతన్యం. పొద్దున కంటే మధ్యాహ్నం, మధ్యాహ్నం కంటే మళ్ళీ రేపు పొద్దున తేజస్సు పెరుగుతున్నదే. అది "సుజనేన మౌధ్యం". మౌధ్యం అంటే ముగ్ధత్వం. ముగ్ధత్వం అంటే ప-- శిశుత్వం, పసిపిల్లవాడి తత్వం. దేవుడు, పిల్లలు, భగవంతుడు అంటే అంతా సమానమే గనుక స్వామిలో ఒక పసితనం ఉన్నది గనుక ఆ పసితనానికి మాలిన్యం లేదు. అందుకనే అది వికాసమానంగా ఉంటుంది, ప్రకాశమానంగా ఉంటుంది. రెండవది, "జిహానం జిహానం సుధాం వేణునాథైహి" ఎన్నిసార్లు విన్నాం ఈ వేణునాదం! తమాల వృక్ష ఛాయల్లో విన్నాం, యమునా తటిలో విన్నాం, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, మనసులో విన్నాం, రేపల్లెలో విన్నాం, అందరి గుండెల్లో విన్నాం, అందరి కంఠాలలో విన్నాం. ఎన్నిసార్లు విన్నా అమృత బిందువులు తాగినట్లే ఉంటుందేమయ్యా! స్వామితో సమన్వయం చేయండి. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు? ఒక ఉపన్యాసానికి రెండో ఉపన్యాసానికి పోలిక ఉన్నదా? ఆ ఇది మొన్నే చెప్పారులే అన్నట్టు అనిపించినా మొన్న చెప్పింది, ఇవాళ చెప్పింది రెండు పక్క పక్కన పెట్టి చదువుకుంటే మొన్న చెప్పింది వేరు, ఇవాళ చెప్పింది వేరు. "లిహానం లిహానం సుదీర్ఘై రపాంగై" ఈ స్వామిని చూస్తుంటే, కృష్ణ పరమాత్మని చూస్తుంటే, వీడు బాలుడా, గోపబాలుడా, నందబాలుడా, యశోదా బాలుడా, ఎవరు ఈ కృష్ణ పరమాత్మ అని పాదం మొదలుపెట్టి చూస్తే, కనుల చూపులు బారులు కట్టి వెళుతూ వెళుతూ ఉండగా ఆకాశం అంచు తగిలింది అంటాడు. అంటే అవని, ఆకాశము రెండు ఆక్రమించినటువంటి పరమాత్మకి మానవుడి యొక్క చూపుకు అందుబాటు ఏందా ఆ రూపమని. "లిహానం లిహానం సుదీర్ఘై రపాంగై". మహా ఆనంద సర్వస్వమే తన్ నమస్తాత్. మహా ఆనంద సర్వస్వం ఒక చోట ఉన్నది గనుకనే ఆయన భగవంతుడు అయినాడు. జ్ఞాన యోగంలో మనస్సు ఆర్ద్రమవుతుంది. మనస్సు కరుణా పరిపూతం అవుతుంది. భగవాన్ రమణ మహర్షిని ఒక మాట అడిగారు. జ్ఞానికి కర్మలు ఉంటాయా అని. ఎందుకుండవ్ ఆయనే పని చేస్తాడు కదా అన్నారు. మరి ఎందుకు దాని వలన ఫలితాలు ఉంటాయి కదా అవి ఆయనకు అబ్బుతాయా అని. ఏమీ అబ్బవు అన్నారు. ఎందుకని అంటే, జ్ఞాని నిష్కామ కర్మ చేస్తాడు. ఏం చేసినా, ఏం తలచినా ఈ ప్రపంచం యొక్క కళ్యాణాన్ని, క్షేమాన్ని, శాంతిని కోరి ఆ పనులు చేస్తాడు. కనుక ఆయనకి ఫలితాలంటూ ఏం లేవు. ఆశించినవి లేవు గనుక అనుభవాలేం మిగలవు. జీవుడు ఏదో కోరి చేస్తాడు గనుక కోరినంత దక్కుతుంది. అర్హత ఉన్నంత దక్కుతుంది. జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు గానీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆ పర్ఫెక్షన్ని సుమారుగా మన వరకు నలభై ఆరు సంవత్సరాలుగా ప్రశాంతి నిలయం దర్శనంలో అనుభవం పొందుతూనే ఉన్నాం. 1963 నుంచి ఇదిగో 2009 అంటే నలభై ఆరు సంవత్సరాలు. ఏం జరుగుతున్నదయ్యా అంటే స్వామి ఏ పని చేసినా పర్ఫెక్షన్ అంతే. నియర్ పర్ఫెక్షన్ కాదు, పర్ఫెక్షన్ అంతే. అంటునే స్వామి అన్నారు పర్ఫెక్షన్ గా చేయాలి కానీ పర్ఫెక్షన్ ఎప్పుడూ కూడా obsessive గా ఉండకూడదు. "It should never become an obsession" అన్నారు. obsession ఎవరికంటే జీవుడికి. పరమాత్మకి obsession లేదు, obstruction లేదు, ఏమీ లేదు. సంకల్ప బలమే సాకారం అవుతుంది గనుక జ్ఞాని సంకల్పాలు విశ్వజనీనంగా ఉంటాయి, సర్వ శ్రేయోదాయకంగా ఉంటాయి, సర్వజన మనోల్లాస పులకిత పుంభణంగా ఉంటాయి, అందరికీ ఆనందం పంచేవిగా ఉంటాయి గనుక జ్ఞాని కర్మలు చేస్తాడు. ఎలా చేస్తాడు? ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడు. జ్ఞాని మనస్సుని ప్రపంచంలో ప్రవేశపెడతాడు. మరి జ్ఞానికి మనస్సే లేదంటేదే! ఉంది. ఎట్లా ఉందంటే, ఎక్కడ ఉండాలో తన స్వస్థానంలో ఆ మనస్సు ఉన్నది. అవసరమైన వేళ ఆ మనస్సును బయటకు తెచ్చి ఆ పని పూర్తి చేసి మళ్ళీ ఆ మనస్సును హృదయ స్థానంలోకి తీసుకొని వెళ్ళగలడు జ్ఞాని. జీవుడి యొక్క మనస్సు ఒక్కసారి పంజరంలో నుంచి బయటకు వస్తే పంజరం యొక్క అడ్రస్సే మర్చిపోతుంది అది. జీవుడి ప్రారబ్ధం అది. జ్ఞాని అన్నింటినీ అధీనంలో ఉంచుకుంటాడు. సాధకుడు, జీవుడు అన్నింటికీ అధీనుడై ఉంటాడు. అన్నింటినీ అధీనము చేసుకొని ఉన్నాడంటే జితేంద్రియుడుగా ఉన్నాడు అని. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు జ్ఞాని. ఓ statement అనుకుందాం.జయించాడు ఇంద్రియాలు అంటే ఇంకా ఆయన జ్ఞాని అయినట్లేనా అంటే స్వామి ఒక మాట చెప్పారు చాలా అందమైన మాట చాలా గొప్ప మాట చాలా నిగూఢమైన మాట మార్మికతతో కూడుకున్న మాట జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించటం కాదు బంగారు జయించబడిన ఇంద్రియాలతో జీవించటమే జితేంద్రియత్వము ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకోండి బంగారు అన్నారు స్వామి ఇంద్రియాలను జయిస్తే ఏముంది కథ అయిపోయింది. ఇంకో విషయం కేనోపనిషత్తులో మన ఇంద్రియాలు జీవుడి యొక్క ఇంద్రియాల యొక్క సంచలనాలు కదలికలు మెదలికలు అన్నీ కూడా ఆత్మలో నుంచి ప్రాదుర్భవిస్తాయి అంటాయి అంటే ఆత్మ కూడా ఒక్కొక్కసారి trigger చేస్తుంది అన్నమాట stimulate చేస్తుంది అంటాం ప్రేరణ కలిగిస్తుంది ఉత్ప్రేరణ కలిగిస్తుంది మరి ఇంద్రియాలని ఉత్ప్రేరణ కలిగించినటువంటి ఇంద్రియాలని అధీనం చేసుకొని అధీనంలో ఉంచుకున్న ఇంద్రియాలతో జీవించిన వాడు మాత్రమే జితేంద్రియుడు అన్నటువంటి సత్యసాయి భగవానుడు జ్ఞాని అంటే స్వామి స్వామి అంటే అర్థం అసలు జ్ఞాని అని అర్థం జ్ఞాని అంటే అజ్ఞాన భూమిక నుంచి బయట పడేసే వాడు ఒకటైతే అసలు అజ్ఞానం ఒకటి ఉందని మనకు తెలియజెప్పే వాడు జ్ఞాని. షిరిడి సాయి ని తీసుకోండి అన్ని అవతారాలలో చాలా ప్రధానమైనటువంటి సాయిత్రయ్ అంటే షిరిడి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి మూడు సాయిత్రయ్ అవతారాలు అందులో మొదటిదైనటువంటి షిరిడి సాయి జ్ఞానబోధ కంటే కూడా అజ్ఞానాన్ని గురించిన ఎరుక చాలా ఎక్కువ చెప్పారు. నానా వంటి పండితులు కూడా మాకన్నీ తెలుసు బాబా కి ఏం తెలుసు అన్నప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా విచారణ చేస్తే అక్కడ సాగింది ఏమిటి మనం అజ్ఞాన భూమికలో కూరుకు పోతూ పోతూ నాకు ఇన్ని పద్యాలు వచ్చు ఇన్ని పాటలు వచ్చు ఇన్ని మాటలు వచ్చు అని అజ్ఞానంలో కూరుకుపోతున్నాం జ్ఞాని అయిన వాడు మాటలను దాటి భావనలు దాటి భావనను దాటి అనేకమైనటువంటి సంకల్పాలను దాటి స్థిమితమైనటువంటి సంస్థితమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు అక్కడ ప్రజ్ఞా స్థితప్రజ్ఞే సంకల్పాలు స్థితమే ఆచరణలు స్థితమే ఆలోచనలు స్థిమితమే అంతా స్థితిగా ఉన్నది సమస్థితి గా ఉన్నది సంస్థితిగా ఉన్నది అంటే ఎక్కడ తొట్రుపాటు లేదు ఎక్కడ ఎడబాటు లేదు కడబాటు లేదు ఏమి లొంగుబాటు లేదు పొంగుబాటు కూడా లేదు అందుకే స్వామి అంటారు దేనికి ఒంగక, లొంగక, పొంగక జీవించండి అట్లాగే స్థితప్రజ్ఞా మూర్తి ఎట్లా ఉండాలంటే ఒక పెద్ద హిమాలయ పర్వతం వలే ఉండాలన్నారు. అదరక, బెదరక, చెదరక, కదలక నిలుచుకోండి అన్నారు స్వామి. ఏం మాటలివి? ఎక్కడి నుంచి వచ్చినయి? సజ్జోనిర్గమమైన సర్వభావనా సంభారం ఇది. కనుక జ్ఞాని అయిన వాడు ఆయన మౌనమే మాట. అజ్ఞానంలో మాటలన్నీ మౌనాలే. ఇప్పుడు ఈ అనుకున్న మాటలన్నీ ఉన్నాయి చూడండి పంచకోశాల బయట. ఈ అంటున్నవాడు కాసేపు ఈ పంచకోశాలు దాటి లోపలికి వెళ్ళాడనుకోండి, అంతర్ముఖుడయ్యాడనుకోండి, వింటున్న మీరు కూడా అంతర్ముఖులయ్యారనుకోండి, ఏమున్నది అక్కడ? మహా నిశ్శబ్దం ఉన్నది. లోపల ఏమున్నది? రుద్రభూమి ఉన్నది, మహాస్మశానం ఉన్నది. స్మశానము అంటే విభూతి స్థితి. ఎక్కడ పరమేశ్వరుడు గజ్జ కట్టి ఆడుతాడో, ఇది నిటాలేక్షనుండు గజ్జకట్టి వాడు రంగస్థలంబు అంటాడు. ఆ రంగస్థలంలో అనేక పాత్రలు తండ్రి పాత్ర, తల్లి పాత్ర, కూతురు పాత్ర, కొడుకు పాత్ర, కోడలు పాత్ర, బోధకుడి పాత్ర, సాధకుడి పాత్ర ఎన్నో వేస్తాం. ఈ వేషాలన్నీ తీసివేయగా ఏం మిగిలింది అంటే నేను అన్నటువంటి ఒక అచంచలమైనటువంటి ఒక భావన, ఒక స్పష్టమైన ఆలోచన, ఒక అచ్చమైన ఆలోచన ఇది జ్ఞాన భూమిక. ఓ పద్యం ఉంది, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెప్తాడు, పరమేశ్వరుడి యొక్క ద్వైత బుద్ధిలో నుంచి ద్వైతాద్వైత మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు, అంటే ద్వైతంలో నుంచి రెండుగా ఉన్న నువ్వు నేను అనుకుంటూ కాదయా నువ్వే నేను అనుకుంటూ వెళ్లే మార్గంలో పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయేని ఈ శరీరంబు నీదే కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్టాత యవ్వడో యజమానుడనిన అష్టమతనువు వాడు కెరలినన్నేమి మిగిల్చితినా సామి బిట్టు నేనన్నది అభిజ్ఞ గాక. ఎంత అద్భుతమైనది! పంచభూతములు ఐదు దివాకరుడు కుడికన్ను నిశాకరుడు రెండవ కన్ను అంటే సూర్యనాడి చంద్రనాడి పంచప్రాణాలు అనబడేటువంటి పంచభూతాలు సూర్య-సూర్య రశ్మి సుషుమ్నా కిరణాలతో కూడిన చంద్రుడు ఐదు ప్లస్ రెండు కలిపితే ఏడంటివే వాటినే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నాలుగు. నాలుగు ప్లస్ మూడు కలిపితే ఏడంటివే. ఏడు దాటితే మిగిలింది ఆత్మ అంటివే. ఏతదధిష్టాత యవ్వడో యజమానుడననిన దీని ఈ శరీరంలో ఈ గూట్లో ఎవడో ఒక ఆత్మనొకడు ఉన్నాడయ్యా వాడే దీనికి యజమాని అని చెప్తుంటే ఇంతకాలం నేను రాశాను నేను అన్నానన్న ఈ నేనుకు విలువ ఏమున్నది. కెరలి నన్నేమి మిగిల్చితినా సామి నన్ను నేనుగా చెప్పుకోవటానికి ఏం మిగిల్చావయ్యా? నాలో ఉన్న పంచభూతాలు వేరే, నాలో ఉన్న సూర్యనాడి వేరే, నాలో ఉన్న చంద్రనాడి వేరే, వీటన్నింటికీ అధిష్టానమైన యజమాన్యం వహించిన ఆత్మ వేరే ఉంటే మరి నేను ఎవరు? అంటే, బిట్టు నేనన్నది అభిజ్ఞ గాక. నేను నేను నేనుగా చెప్పినదంతా నువ్వు నావనటానికి గురుత్వా అందుకు మిగిల్చావా తండ్రీ అన్నాడు. అంటే భగవాన్ రమణ మహర్షిని ఓ మాట అడిగారు. అందర్నీ అడిగినట్టే, అందరు గురువులు అందరు అవతార పురుషులు ఎదుర్కున్న ప్రశ్న ఇది. మీరు దేవుణ్ణి చూశారా? వాళ్ళ జవాబు మేము చూశాము. మాకు చూపించగలరా? నువ్వు చూడగలిగితే మేము చూపిస్తాము. ఇది ప్రశ్న. రమణల్ని కూడా అడిగారు. ఓ స్పష్టంగా చూశాను.ఎంత స్పష్టంగా చూశానంటే, "నువ్వు ఉన్నంత స్పష్టంగా చూశా" "అంతెందుకయ్యా విచారణ? అసలు నువ్వుగా కనబడుతున్న ఈ వస్తువు ఉన్నదే అసలు వాడు అక్కడ ఉన్నాడు అనటానికి నువ్వు గుర్తు కాదా?" అన్నారు. "నువ్వు పరమాత్మ ఉన్నాడు అని చెప్పటానికి గుర్తుగా నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావని ఎందుకు అనుకోవు? నీకంటే పరమాత్మ భిన్నంగా ఎక్కడున్నాడో విచారణ చేయమన్నాడాయన. అంటే జ్ఞాన భూమికలో జ్ఞాన యోగంలో పరమేశ్వరుడు నేను అన్న రెండు భావనలు లేవు. స్వామి సృష్టి యత్ప్రతిలే ఉపన్యాసం గనుక పూర్ణచంద్ర ఆడిటోరియంలోది విన్నట్లయితే, ఓ మాట పరమాద్భుతమైన మాట చెప్పారు. రెండు మాటలు చెప్పారు ఆ రోజున. ఒక మాట భక్తుడి యొక్క స్థితిని స్థాయిని బట్టి చెప్పారు. "దేవుణ్ణి దేవులాడుకుంటూ మీరంతా పుట్టపర్తికి వచ్చారు సంతోషమే" అంటే దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. "మరి నేను కూడా వెతుకుచున్నాను, వెతుకుచున్నాను, వెతుకుచునే ఉన్నాను. కంటికి ఒక్కడు కానరాడే నిజ మానవుడు ఒక్కడు కానరాడే" అన్నారు. అంటే ఒక true man ఒక complete man భగవంతుడికి కూడా కనపడటం లేదేమిటి? అంటే ఏ భగవంతుణ్ణి చూడాలని మనం వెళుతున్నామో మన ఆలోచనలన్నీ చూశాం అనుకోవటం దగ్గర ఆగిపోతున్నాయి. చూసిన తర్వాత ఏమిటన్న సాధన లేదు గనుక స్వామి అరవై ఏళ్ళు అంటే సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఒక హెచ్చరిక చేశారు. అలాగే స్వామి ఒకే ఒక్క మాట చెప్పారు. "పరమాత్మ ఉన్నాడా లేడా అనే సందేహం వదిలిపెట్టండి. కలడు కలండనడి వాడు ఉన్నాడా లేదా కాదు, యదహత్తి పుటపర్తిలో ఉన్నాడని చెప్పమన్నారు. స్వామి శరీరానికి అప్పుడు ఇంకా నలభై ఏడు ఏళ్ళు కూడా రాలే. ఎలా చెప్పారు ఎందుకు చెప్పారంటే పరమాత్మ ఉన్నాడన్న భావనలో నుంచి జ్ఞాన యోగంలోకి వెళుతూ జ్ఞాన యోగంలో త్వమేవాహం న సంశయః నిస్సందేహంగా పరమాత్మ నువ్వు నేను ఒక్కటే. మన ఇద్దరం ఇక్కడ రెండు కార్యక్రమాలు కొనసాగించడానికి వచ్చాం. నువ్వు చెప్పటానికి, మా చేత చేయించటానికి నువ్వొచ్చావ్. నువ్వు చెప్పింది చేయటానికి మేము వచ్చాం. మనమిద్దరం కలిసి ఉందాం స్వామి అంటారు. నిజమైనటువంటి బంధం జ్ఞాన యోగంలో భక్తుడికి భగవంతుడికి. భక్తి యోగంలో రెండుగా కనిపిస్తున్నదే జ్ఞానయోగంలో ఒక్కటై ఉన్నది. అన్నీ పోగా, అంతా పోగా ఏది మిగిలింది అంటే అఖండ చిద్గణ రసమైనటువంటి ఒకే ఒక ఆత్మ భావన దాని పేరు నేను. అదే సందర్భంలో మన స్వామి ఒక మాట చెప్పారు. "నేను యతిని గాను, నేను యోగిని గాను, భోగిని కాదు. నేను ఎవరో తెలుసునా? నేను నేనైన నేను" అన్నారు స్వామి. నేను నేనైన నేనంటే జాగ్రదవస్థలో ఈ కనిపిస్తున్న భౌతిక స్వరూపంలో నేను, మళ్ళీ సూక్ష్మ శరీరంలో నేను, కారణ శరీరంలో నేను, జాగ్రదవస్థలో నేను, నిద్రావస్థలో నేను, సుషుప్తి అవస్థలో నేను, శరీరం పడుకుంటున్నది, శరీరం లేస్తున్నది, అవతారం పోతున్నది, అవతారం నడుస్తున్నది, ఈ అవతారముపై కొత్త అవతారం వస్తుంది. కానీ అన్ని అవతారాలలో, అన్ని జీవులలో, అన్ని అవస్థలలో, అన్ని కాలాలలో, అన్ని భువనాలలో, అన్ని సంకల్పాలలో నేనుగా మిగిలిన ఆ నేను నేనైన నేను అంటే నేను పరమాత్మను అని స్వామి స్పష్టంగా ఈ జగత్తుకి ప్రకటన చేశారు. ఇది జ్ఞానయోగ రససిద్ధిగా మనం భావించినట్లయితే మనం కూడా మనం దేహము మాత్రమే కాదు. దేహంతో కూడిన ప్రాణ చైతన్యం, ప్రాణ చైతన్యంతో కూడిన దేహంగా వచ్చాం. స్వామే అంటారు చూడండి. ఈ ప్రాణ చైతన్యము, ప్రాణశక్తి, దివ్య భావన ఉన్నంతవరకు కట్టెగా కనిపిస్తున్న ఈ శరీరం శివం. ఆ ప్రాణ చైతన్యమో, దైవ భావనో, దేహి భావనో శరీరం నుంచి విడిపడగానే అది శవం. శవానికి శివానికి స్వామి చాలా అందంగా చెప్పారు. శవం రాస్తున్నప్పుడట కొమ్ము పైకు ఉంటుంది అది అహంకారానికి గుర్తు. ఆ పొల్లు చివరికి పైకి తీస్తాం. పొల్లు, నుడికారం. ఆ-ఆ నుడికారము అహంకారం కొట్టేస్తే అది శిరస్సు వంచుకొని ఉంటుంది, అది శివం. ఇది మంగళం, అది అమంగళం. ఇది సత్యం, అది అసత్యం. ఇది నిత్యమూ, సత్యమూ, శాశ్వతమూ, యోగమూ. అది భోగం మాత్రమే. భోగాన్ని దాటి వచ్చేదే యోగం కాబట్టి భోగాన్ని యోగంగా, యోగాన్ని భోగంగా భావించవలసినటువంటి స్థితి జ్ఞాన స్థితి. అందుకే రమణ మహర్షిని మరొక ప్రశ్న వేశారు. "అయ్యా! అనేక శాస్త్రాల మీద మాకు అధికారం ఏర్పడుతుంది. అనేక వాటి మీద అనేకమైన వ్యాఖ్యానాలు చేస్తాం. ఎన్నెన్ని విషయాల్లో చాలా చక్కగా చెప్తాం. ఇదంతా జ్ఞానమేనా?" అని అడిగారు. Interpretation of Shastras is not జ్ఞాన. అది ఊరికినే, అది విజ్ఞాన సంపుటి మాత్రమే తప్ప జ్ఞానికి సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు. జ్ఞానికి విశ్లేషణ లేదు, సమాశ్లేషణ తప్ప. సర్వాన్ని సమంగా చూడటం జ్ఞాని లక్షణం. అంటే జ్ఞాని అంటే ఇందాక అనుకున్నాం. జ్ఞాని అంటే అచ్చ తెలుగులో దాని పేరు స్వామి అని అర్థం. స్వామి అయినవాడు స్వస్వామిగా ఉంటాడు. ఎక్కడుంటాడంటే మనలో ఉంటాడు. ఎలా ఉన్నాడు? అన్నమాచార్యుల వారిని తీసుకోండి. వెంకటేశ్వర స్వామిని ముప్పై మూడు వేల సంకీర్తనలతో స్తుతించాడు. శివుడన్నాడు, భవుడన్నాడు, మాధవుడన్నాడు, కేశవుడన్నాడు, అసలు నువ్వే అన్నాడు, అంతా అన్నాడు. అనేకమైనటువంటి నవరసాలలో ఆయనని ఆవిష్కరిస్తూ వెళ్ళాడు. కానీ చిట్టచివరగా అనుభవం పండిన వేళ, గుండె నిండిన వేళ, హృదయావిష్కరణ జరిగిన వేళ, ఆత్మానుభూతికి లోనైన వేళ, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వేళ "చిత్తజగురుడా! నీకు శ్రీమంగళం" అన్నాడు. చిత్తజగురుడువై ఉన్నావు నా చిత్తములో పుట్టిన గురువుగా ఉన్నావయ్యా! నీకు శ్రీమంగళం. ఇంతకాలం రాళ్ళల్లో, రప్పల్లో, కోనల్లో, కొంగల్లో, మిట్టలలో, పుట్టలలో, గిట్టలలో అన్నింటిలోల్లో చూశా. చూద్దామని ప్రయత్నించినా కనపడనిది నా లోపలికి ఒక్కసారి చూసుకున్నప్పుడు, నేను అంతర్ముఖుడినైనప్పుడు, నీ యొక్క దివ్య జ్వాలా విశేషం ఏదైతే ఉన్నదో ఆ విశేషమైనటువంటి ఆ వెలుగును నేను దర్శనం చేశాను. దానికి శ్రీమంగళం అన్నాడు. అంటే ఏది సహకారంగా కనిపిస్తున్నదో, ఏది స్వభావంగా కనిపిస్తున్నదో, ఏది వస్తువుగా కనిపిస్తున్నదో, ఏది గుణంగా కనిపిస్తున్నదో, ఇదంతా కూడా పోయేదే.ఇక్కడ ఉండేది కాదు స్వామి అన్నారు ఒకసారి "The one that is real can never be challenged. The one that is ever challenged is not real, it is unreal" అన్నారు. Challenge కి గురి అయ్యేది real కాదు సత్యమే నిత్యము సత్యమే సత్యము సత్యమే శాశ్వతము సత్యమే యోగం గనుక జ్ఞాన యోగం అంటే సత్యాన్ని ఆవిష్కరించుకోవటం. ఏమిటి సత్యం అంటే నేను దేహము మాత్రమే కాదు నేను దేహిని నాలో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి నాలో ఉన్న fluid నాలో ఉన్న అనేకమైనటువంటి సంగతులన్నీ కూడా ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఒక అవతారంగా సాగటానికి పరమేశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక జన్మగా ఒక యోగంగా భావిస్తున్నా. అంతేగాని ఈ దేహము ఈ కీర్తి ఈ titles ఈ degrees ఇదంతా జగద్వంచన దానిని మించి ఆత్మ వంచన. ఇక రెండవది జీవుడికి దేవుడికి మధ్య అభేదమే గాని భేదం ఆ భేదం మాత్రం ఉండటానికి వీలు లేదు. పరమేశ్వరుడే జీవుడిగా ఇక్కడికి కొన్నాళ్ళు వచ్చాడు. ఈ జీవుడే మళ్ళీ metamorphosis అంటాం పరిణామ దశలో గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎట్లా కావాలో పుట్టిన ప్రతి జీవుడు దేవుడు కావటానికి తనలో ఉన్న దేవుడిని దర్శనం చేసుకోవటానికి తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించటానికి జ్ఞాన యోగము ఒక స్థిమితమైన యోగం ఒక సమస్థితితో కూడిన యోగం అది సమయోగం. జ్ఞాన యోగంలో రెండు లేవు ఉన్నది ఒక్కటే జ్ఞాన యోగంలో అంతా అన్నీ నేనే నేనే అన్నీ అంతా అంటే "యద్భావం తద్భవతి" లాగా "విశ్వం దర్పణ దృశమాననగరీతుల్యం" లాగా ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా అద్దంలో బొమ్మ అన్నారు శంకర భగవత్పాదులు. అద్దమే పక్కకి పోతే బొమ్మ పోతుంది బొమ్మ అక్కడ ఉంటుంది అద్దము అక్కడ ఉంటుంది కానీ యోగం గనుక లేకపోయినట్లయితే అద్దంలో బొమ్మ ఎట్లా కనపడదో జీవుడు గనుక పరమాత్మ ఆవరణలోకి రాకపోయినట్లయితే తనను తాను చూసుకోవటానికి తనను తాను అనుభవించటానికి తనను తాను ఆవిష్కరించుకోవటానికి అవకాశం లేదు. ఈ సన్నివేశంలో ఒక చిన్న అనుభవం స్వామితో చాలా ఏళ్ళ క్రితం మేమంతా చిన్న పిల్లలం స్వామి చాలా సేపు ఒక గంటన్నర మాకిది అర్థం అవుతుందా కాదా అంటే ఏమో అర్థమైన వాడికి ఇప్పటికి అర్థమైందా అంటే ప్రశ్న గాని చెప్తూ వచ్చారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో తెలుసునా బంగారు అంటూ మొదలు పెట్టారు. ఆ రోజుల్లో స్వామి interview room లోకి వెళ్ళటం అంటే కేవలం స్వామి ఇచ్చే ఒక ఉంగరం ఇంకోటి తీసుకుని రావటం కాదు. సుమారు గంట, గంటన్నర స్వామి విశేషాలు చెప్పేవారు. అవి మనము ఈ శరీరానికి ఏర్పడ్డ వయస్సుతో పోల్చుకుంటే అవి చాలా పెద్ద మాటలు. మరి ఏ వయస్సుని సంబోధించి స్వామి ఆ మాటలు చెప్పారు? ఇప్పుడు ఈ క్షణాన మనం ఈ studio లో ఇది మాట్లాడుతున్నప్పుడు గుర్తొస్తున్నది. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అని అడగ్గానే అక్కడే మేము ముగ్గురం నలుగురం ఉన్నాం. అంటే నేను నాతో పాటు కాస్త ఆ నా కంటే ఓ ఇరవై ఏళ్ళు ఆయన కంటే ఇరవై ఏళ్ళు పెద్ద వాళ్ళందరం ఉన్నాం. కుప్ప వైరాగ్య శాస్త్రి గారు కూడా room లో ఉన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఈ ప్రశ్న వదిలిపెట్టారు. సమాధానం ఎవరి దగ్గర లేదు ప్రశ్న వేశారు అంటే స్వామే సమాధానం చెప్పబోతున్నారన్నమాట. అప్పుడు మనం మౌనంగా ఉంటే స్వామి బోధ మనకు అందుతుంది అందరం మౌనంగా ఉన్నాం. ఆత్మసాక్షాత్కారం అంటే సినిమాల్లోలాగా మనిషి మంచం మీద పడుకుంటే ఆ మంచంలో నుంచి ఇంకో బొమ్మ బయటికి రావటం అని అనుకుంటున్నారా? మీలాగానే ఒక pant, shirt వేసుకొని ఇంకొకడు లేచి వస్తాడు అనుకుంటున్నారా? లేదు బంగారు ఆత్మ comma పెట్టండి pause ఇవ్వండి సాక్షాత్ pause ఇవ్వండి ఆకారమై ఉన్నది. నువ్వు దేహంగా కనిపిస్తున్నా ఆత్మే దేహంగా వెలుగుతున్నది బంగారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అన్నీ దాటితే ఒక ఇంటికి సింహద్వారం ఉంటుంది పెరటి ద్వారం వాణి ద్వారం అంటాం. అంటే ఇంటి వెనక నుంచి వాకిలి. సింహద్వారం దగ్గర calling bell కొట్టే ఎవరూ తలుపు తీయలేదు. అలవాటైన వాడు తెలిసిన వాడు ఏం చేస్తాడు అంటే దొడ్డి వైపు వెళ్ళి వెనక్కి వెళ్ళి తలుపు తీసుకుని ఇంట్లో ప్రవేశిస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు calling bell నొక్కుతాడు సింహద్వారం నుంచి లోపలికి వెళ్తాడు. జ్ఞాని కాని వాడు ఏం చేస్తాడు అంటే నెమ్మదిగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇది order అయితే స్థూల శరీరం నుంచి ప్రారంభించి చివరిదాకా వెళ్తాడు ఒకడు. అసలు చివర ఉన్నటువంటి అహంకారాన్ని వదులుచుకుంటూ చిత్తాన్ని సమయోగం చేస్తూ అంటే యోగ స్థితిలో నెట్టుకుంటూ బుద్ధిని పదును ఎక్కించుకుంటూ మనస్సుని అణచుకుంటూ కారణ శరీరాన్ని అనుభవిస్తూ సూక్ష్మ శరీరాన్ని దర్శిస్తూ స్థూల శరీరం దేహంగా వెలుగుతాడు. ఇంట్లోకి వెళ్ళటానికి ఈ వాకిలి అయితే ఏమి ఆ వాకిలి అయితే ఏమి ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది. ఏమి ఇక్కడ పరమాత్మ సాక్షాత్కరించలేదా అంటూ స్వామి ఆ interview ముగించారు. అంటే పరమాత్మే సాక్షాత్తు సత్యసాయి ఆకారమై మీ ముందు కూర్చోలేదా? ఇది ఆకారమై ఇది పరమాత్మ సాక్షాత్కారం అయినప్పుడు మీది ఆత్మసాక్షాత్కారం కాక భిన్నమా? దీనికి పెద్ద ప్రయత్నం చేయాలా? మీరే దేహాలుగా వెలుగుతున్నారు బంగారు అన్నారు. అంటే ఆధునిక మానవుడికి గంభీరమైనటువంటి విషయాలను కూడా ఇట్లా కర్మ, భక్తి, యోగ, జ్ఞాన, జ్ఞాన యోగాలలో పరిపూర్ణమైనటువంటి ఒక సమస్థితి కలిగించటానికి సత్యసాయి భగవానుడు ఇన్ని సంవత్సరాలుగా ఉపదేశ మార్గం చక్కగా మనకు తెలియజేస్తూ ఆ ఉపదేశనంలో నుంచి ఉపశమనం పొందుతూ ఉపశమనంలో నుంచి ఆనందాన్ని పొందుతూ శక్తిని కూడగట్టుకొని మనంతట మనం ఇవాళ నీరు సిద్ధం నావా సిద్ధం నడిపే నావికుడు సిద్ధం మిమ్మల్ని కచ్చితంగా ఆ గట్టుకు తీసుకువెళతానని ప్రమాణం చేసి ఒక అభయాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ సత్యమై ఉన్నటువంటి వేళ ఇంకా మనం శషభిషలు పోయి నాకు అది వచ్చు నేను ఇది వచ్చు నేను అది చేశాను ఇది చేశాను అహంకార నివృత్తిలో నుంచి మహాపరినిర్వాణ దిశవైపు జీవుడు వెళ్ళాలి. ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. ప్రవృత్తి అంటే సహజమానవ సహజమైనటువంటి భావనలో నుంచి పరిణామ దశని దాటి పరమేశ్వరుడి యొక్క తత్వం వైపు వెళ్ళటమే అధ్యాత్మ సాధన. అధ్యాత్మ సాధన అంటే కేవలం పూజాదులు మాత్రమే కాదు అధ్యాత్మ అంటే నిత్యంగా జీవించటం సత్యంగా జీవించటం అత్సంగా జీవించటం జీవితాన్ని నడపటము కాదు గడపటము కాదు జీవితాన్ని పరిపూర్ణంగా అర్థవంతంగా జీవించటమే అదే అధ్యాత్మ యోగం కాబట్టి అది జ్ఞానం మార్గం ద్వారా సంస్థితమైనటువంటి స్థితిలో అన్నింటినీ చాలా controlled గా చాలా balanced గా Equanimity Equilibrium Equipoise వీటన్నింటినీ కూడా చక్కగా అనుష్ఠానం చేస్తూ జ్ఞాన యోగ మార్గంలో ఇప్పటివరకు వచ్చినటువంటి మహాపురుషుల యొక్క బోధలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ మన పరమ గురువు అయినటువంటి భగవాన్ సత్యసాయి బోధనని చక్కగా inter-intervene చేస్తూ interview view చేస్తూ ఆ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పరిపూర్ణ మహా యోగ స్థితిలోకి మనందరి జీవితాలు సాగుగాక ఆ శక్తిని పరమేశ్వరుడు అయినటువంటి స్వామి మనందరికీ అనుగ్రహించు గాక అని ప్రార్థిస్తూ సాయిరాం. [భాగం] ఇంతవరకు మీరు స్వామి వారి చిరకాల భక్తుడు అయినటువంటి శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారిచే జ్ఞాన యోగం పై ప్రసంగాన్ని విన్నారు ఇప్పుడు మీరు 2008 నవంబర్ మాసంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఎనభై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా జరిగిన సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవం యొక్క విశేషాలను వింటారు. [పాట] వేయి చందమామలు ఈ వేళ వెలిగెను నిన్ను గాంచు కన్నులలో వెన్నెల వాన కురిసెను వేయి చందమామలు ఈ వేళ వెలిగెను. [పాట] సహస్ర పర్యాయములు సందర్శించి చందురుడే ధన్యుడే ఆనందించెను కృష్ణపక్ష వేదన నీ కృపతో మరచి కృష్ణపక్ష వేదన నీ కృపతో మరచి నీ చిరునవ్వులు చంద్రికలో సేద తీరెను వేయి చందమామలు ఈ వేళ వెలిగెను రేలోన తలువరెడు మెరయును కళలు తరిగి కొన్నాళ్ళు కలవరించును సత్య సాయి నీవు నిత్య ప్రకాశుడవు సత్య సాయి నీవు నిత్య ప్రకాశుడవు సహస్రారమున మధు శబిత పజేతువు వేయి చందమామలు ఈ వేళ వెలిగెను న భూతో నా భవిష్యతి న భూతో నా భవిష్యతి కలియుగ పరిణామ క్రమంలో ఎంతటి ఉత్కృష్టమైన వాక్యాన్ని వాడగలిగే సందర్భం కానీ అద్భుతమైన ఘట్టం కానీ ఆవిష్కరింపబడలేదేమో అనిపిస్తోంది. న భూతో నా భవిష్యతి అన్న ఉత్తమోత్తమమైన పద ప్రయోగం కేవలం ఏదైనా ఘట్టాన్ని అందంగా వర్ణించాలి అని సాధారణంగా ప్రయోగిస్తే అది అంత రక్తిగా ఉండదు. ఆ ఘట్టాన్ని వీక్షించిన వీక్షకులు అందులో పాలు పంచుకున్న సభ్యులు ఇలా అనేకమంది మదిలోని భావాలు ముక్తకంఠంతో న భూతో నా భవిష్యతి అని ఎలుగెత్తి చాటితేనే ఆ సందర్భానికి ఆ వాక్యం అనుసంధానమై అందరి భావావేశాలను ప్రకటితం చేస్తుంది. ఇంతకీ మేము చెప్పబోయే ఆ మహోన్నతమైన కలియుగంలో ఇంతవరకు చూడని ముందుముందు చూడలేని మహోత్కృష్టమైన ఘట్టం ఏమిటో మీరు ఊహించే ఉంటారు కదు. అదే సర్వదేవతా అతీత స్వరూపమైన శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి భగవానుని సహస్ర పూర్ణచంద్ర దర్శనం మరియు విశ్వ ప్రపంచ మహా శాంతి యజ్ఞం. ప్రకృతి పరవశించింది భూమాత పునీతమయ్యింది మనస్సులు పులకరించాయి ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని దర్శించిన భక్తుల జన్మలు చరితార్థం అయ్యాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దిగంత వ్యాప్తి తేజోమయుడు అయిన శ్రీ సత్య సాయి నాధుని సహస్ర పూర్ణచంద్ర దర్శన కార్యక్రమం నిర్వహణ అత్యద్భుత రీతిలో కొనసాగింది. మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ రసరమ్య ఘట్టానికి అతిథి స్వామి ఆతిథ్యం ఇచ్చింది స్వామి. పుట్టపర్తి పురవీధులు శోభాలంకరణతో ముస్తాబయ్యాయి. వీధుల్లో రంగవల్లులు హర్షధ్వానాలు సాయి నాధునికి జై జైలుతో వైభవంగా ప్రశాంతి నిలయం పరవశించిపోయింది. ఎటువంటి అలంకరణ లేకుండానే కలియుగ వైకుంఠంగా విరాజిల్లే ప్రశాంతి నిలయం అసమానమైన రీతిలో అలంకరించుకొని భక్తుల మనోసాగరం పై పవళించే సాయి నారాయణుని సహస్ర పూర్ణచంద్ర దర్శన కార్యక్రమానికి సిద్ధమైంది. ఉదయమంతా వేద ఘోషలు, సాయం సమయాన భాగవత ప్రవచన సప్తాహ కార్యక్రమాలు, సంగీత కచేరీలు అన్నిటినీ మించి శ్రీ సత్య సాయి నాధుని దివ్య దర్శనం.ఎక్కడ చూసినా దివ్య ప్రకంపనలే దివ్య సువాసనలే. సాయినాధుని జన్మస్థలమైన పుట్టపర్తి పులకరించి పురివిప్పి నెమలి వలె నాట్యం చేస్తోందా అనిపించింది. భక్తులందరూ మాటలు రాని ఆనంద సాగరంలో తన్మయులై తరించారా అని అనిపించింది. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం అంతా కూడా తిరుమల తిరుపతి నుంచి వేంచేసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానం మరియు కలియుగ నారాయణుడైన శ్రీ సత్య సాయి భగవానుని ప్రత్యక్ష సమక్షంలో జరగటం. స్వామి విశ్వ మానవాళిని ఆనంద పరవశులను చేసేందుకై చేపట్టిన ఈ సహస్ర పూర్ణచంద్ర దర్శన ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా విశ్వ ప్రపంచ శాంతి మహాయజ్ఞాన్ని భాగవత ప్రవచన సప్తాహ కార్యక్రమాలను విశిష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. అసలు ఇంతకీ సహస్ర పూర్ణచంద్ర దర్శనం అంటే ఏమిటి అంటే ప్రతి నెల పౌర్ణమి నాడు చంద్రుడు తన పూర్ణ రూపంతో దర్శనమిస్తాడు. అలా సంవత్సరానికి పన్నెండు మార్లు పూర్ణచంద్ర దర్శనం ప్రతి మానవునికి కలుగుతుంది. ఆ విధంగా మనిషి ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల సమయానికి సహస్ర అంటే వేయి చంద్రులను దర్శించుకుంటాడు. ఇది మనిషి జీవితంలో ఒక అనూహ్యమైన ఘట్టం కావడం చేత సహస్ర పూర్ణచంద్ర దర్శనం అయిన మనిషికి ఆ మనిషికి చెందిన పిల్ల పాపలు బంధువులంతా కలిసి శాస్త్రములలో తెలియజేసిన విధంగా ఆ వ్యక్తి మరియు అతని కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగి ఉండాలన్న సద్భావనతో ఒక యజ్ఞాన్ని పూజలను నిర్వహిస్తారు. అలా మన అందరి ఆరాధ్య దైవమైన సర్వదేవతా అతీత స్వరూపులైన స్వామికి కూడా సహస్ర చంద్ర దర్శనం పూర్తి అయిన సందర్భంలో ఏర్పాటు చేసిన విశ్వ ప్రపంచ మహా యజ్ఞం ఒక వ్యక్తికి సంబంధించినది కాకుండా విశ్వ మానవాళికి విజ్ఞాన శాంతి సౌఖ్యాలను అందించి మానవుడు జనన మరణ క్రమం నుంచి విముక్తుడు కాగలిగే నిమిత్తం ఏర్పాటు చేయబడినది అనడం సముచితం. ఈ సందర్భంలో స్వామి తన జీవితమే తన సందేశం అని మరొకమారు ప్రపంచానికి చాటి చెప్పారు. సహస్ర పూర్ణచంద్ర దర్శన కార్యక్రమానికి పవిత్రతను ఆపాదించి కొత్త రూపాన్ని ఇచ్చి కొత్త అర్థాన్ని ఇచ్చి సరికొత్త వరవడిని సృష్టించారు. నిజానికి ఈ కార్యక్రమం ఎనభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న స్వామి కోసం ఏర్పాటు చేయవలసింది. కానీ స్వామి మాత్రం తాను అతిధిగా మరియు ఆతిథ్యం ఇచ్చే వానిగా ద్విపాత్రాభినయం నయనానందకరంగా చేయ సంకల్పించారు. స్వామి ఏమి చేసినా అది విశ్వ మానవాళి సౌభ్రాతృత్వానికి అని మళ్ళీ ప్రపంచానికి మరొక్కసారి తెలియజేశారు. కార్యక్రమ రూపకల్పన సమయం నుంచి కార్యక్రమ ఏర్పాట్ల వరకు గల ప్రతి చిన్న విషయాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి తగు సూచనలను ఇచ్చి భగవంతుడు అతిధిగా వచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో ఉండాలో అదే సమయంలో భగవంతుని ఆతిథ్యం ఇంకే స్థాయిలో ఉండాలో ఒకే ఒక్క కార్యక్రమంతో తనదైన శైలిలో ప్రపంచానికి ఆచరించి చూపారు. సహస్ర పూర్ణచంద్ర దర్శన కార్యక్రమంలో భాగంగా నవంబర్ పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు సాయికుల్వంత్ సభా మండపంలో భాగవత ప్రవచన సప్తాహం అనే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. భాగవత సప్తాహ కార్యక్రమంలోని ప్రతిరోజూ సాయం సమయాన ఉద్దండ పండితులచే తెలుగు భాషలో భాగవత లీలా విశేషాలపై వీణుల విందైన ప్రసంగాలను ఏర్పాటు చేయడమైనది. ఆ ప్రసంగ ప్రవాహం ఇలా ప్రారంభమైంది. ఇక సహస్ర పూర్ణచంద్ర దర్శనం విశ్వ ప్రపంచ శాంతి మహా యజ్ఞం కార్యక్రమంలోకి వెళ్లినట్టయితే ఈ మహోన్నత కార్యక్రమం హిల్ వ్యూ స్టేడియంలో నవంబర్ పదిహేను, పదహారు, పదిహేడు తేదీలలో ఏర్పాటు చేయబడింది. హిల్ వ్యూ స్టేడియంలోని సభా వేదికైన శాంతి వేదికను విశ్వ ప్రపంచ శాంతి మహా యజ్ఞంలో పన్నెండు యజ్ఞ గుండాలను మరియు సుమారు నూట యాభై మంది వేద విద్య నభ్యసించిన ఋత్విక్కుల కోసం ఇతర అవసరాల సౌకర్యార్థం మరింత విశాలంగా మార్పు చేశారు. స్టేడియంలో ఎక్కడ కూర్చున్న యజ్ఞాన్ని దగ్గరగా భక్తులు వీక్షించే నిమిత్తం స్టేడియానికి ఇరువైపులా రెండు పెద్ద టివి స్క్రీన్లు ఏర్పాటు చేయబడినవి. ఆ మూడు రోజులు భక్తులకు ఉచిత ఫలహార భోజన సదుపాయాలను అందించుటకు ఏర్పాట్లు చేయబడినవి. మెహబూబ్ నగర్ సేవా దళ్ వారు అన్ని వేళలందు భక్తులకు మంచి నీటిని అందించే కార్యాన్ని చేపట్టారు. ఈ విశ్వ ప్రపంచ శాంతి మహా యజ్ఞం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే సుమారు నూట యాభై మంది ఋత్విక్కులు యజ్ఞంలో పాల్గొన్నారు. శృంగేరి శారదా పీఠం ప్రధాన వేద పండితులైన శ్రీ లక్ష్మీనారాయణ సోమయాజీ గారి అధ్యక్షతన యావత్ యజ్ఞం అంతా నిర్వహించబడింది. యజ్ఞ వేదికపై హోమగుండాల వెనుక భాగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అర్చావతార మూర్తిని ప్రతిష్టించడం జరిగింది. స్వామి వారిని రోజూ పూలమాలలతో ఆభరణములతో అలంకరించి తిరుమల తిరుపతి దేవస్థానపు అర్చకులచే పూజలు నిర్వహించబడేవి. ఆ దృశ్యం ఎలా ఉండేదంటే వేంకటేశ్వర స్వామే స్వయంగా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఉండేది. స్వామి కళాశాల విద్యార్థి బృందం కూడా వేద పండితులతో కలిసి రుద్ర పారాయణం కావించేవారు. ఇక నవంబర్ పదిహేనవ తేదీ రానే వచ్చేసింది. ఆ పవిత్ర ఉదయాన హిల్ వ్యూ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబయింది. భక్తులు కిక్కిరిసి స్టేడియంలో కూర్చుని ఉన్నారు. ఉదయం సరిగ్గా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వేద పండితుల వేద ఘోష ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామి స్టేడియంకు చేరుకున్నారు. శాంతి వేదిక మీదకు పూర్ణ కుంభముతో వేద మంత్రాల నడుమ స్వామి వారిని ఆహ్వానించారు.స్వామి వేదిక అంతా కలియతిరిగి అక్కడున్న వారందరినీ ఆశీర్వదించి యజ్ఞాన్ని పర్యవేక్షించి సుమారు తొంభై నిమిషాలపాటు అక్కడే ఉండి తర్వాత హారతి తీసుకుని అక్కడి నుంచి తన నివాసానికి పయనమయ్యారు. ఆ తర్వాతి రోజు పదహారవ తేదీ నాడు యజ్ఞ విశేషాలను పరికించినట్లయితే ఉదయం యాగశాల శుద్ధి మరియు ప్రాతఃకాలాధరణం కావించబడింది. కొంతమంది ఋత్విక్కులు సర్వ వేదశాఖ పారాయణంలో మరికొందరు నవగ్రహ పారాయణం మరియు మహా మృత్యుంజయ జపంలో నిమగ్నమయ్యారు. రెండవ రోజున నిర్వహించే రెండు అతి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఒకటి శతరుద్ర అభిషేకం రెండవది మహా మృత్యుంజయ హోమం. 2006లో అతిరుద్ర మహాయజ్ఞంలో ప్రతిష్టించిన సాయీశ్వర లింగానికి శతరుద్ర అభిషేకం కావించబడింది. పాలు, పెరుగు శుద్ధం చేసిన వెన్న, చందనం, విభూతి, కొబ్బరి నీరు మొదలైన వాటితో ఆచార వ్యవహారములకు అనుగుణంగా భక్తి శ్రద్ధలతో అభిషేకం కావించబడిన సాయీశ్వర లింగం దివ్య తేజస్సుతో విరాజిల్లి పరమశివుని సన్నిధానాన్ని తలపింపజేసింది. ప్రపంచంలోని అన్ని జీవరాశుల ఆయురారోగ్యాల కోసం చేయబడిన మహా మృత్యుంజయ హోమం దిగ్విజయంగా నిర్వహించబడింది. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ హోమం యజ్ఞ ప్రధాన ఋత్విక్కునిచే నిర్వహించబడింది. పవిత్ర వేద ఘోషలు మరియు స్వామి ప్రత్యక్ష సన్నిధానంలో యజ్ఞ పురుషునికి పూర్ణాహుతి సమర్పించబడింది. వస్త్రాలు ఫలములతో బాటు స్వామి సృష్టించిన బంగారు గొలుసును అగ్నిహోత్రునకు సమర్పించారు. తర్వాత మంగళ హారతితో హోమం దిగ్విజయంగా ముగించబడింది. ఇటువంటి యజ్ఞయాగాదుల వల్లనే యావత్ ప్రపంచం శాంతి సౌఖ్యాలతో విరాజిల్ల గలుగుతుంది. ఆ రోజు యజ్ఞం జరుగుతున్న సమయంలో మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు శాంతి వేదికపైకి వేంచేసి ఆ కార్యక్రమాన్ని స్వామి వారితో కలిసి తెలగించడం ఒక ప్రత్యేకమైన విశేషం. స్వామితో కొద్దిసేపు గడిపిన పిమ్మట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి బయలుదేరి వెళ్లిపోయారు. ఆరోజు కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్టేడియంలో కూర్చుని ఉన్నారు. అంతలో ఆకాశం మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. భక్తులు వర్షంలో తడుస్తూనే కార్యక్రమాన్ని తెలగించారు. ఇంతకీ వాన వచ్చిన విశేషం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే ఆ వరుణ దేవుడు కూడా లోక కళ్యాణార్థం అనితర సాధ్యం కాని రీతిలో నిర్వహిస్తున్న విశ్వ ప్రపంచ శాంతి మహా యజ్ఞాన్ని వీక్షించుటకే వచ్చాడేమో కదా అని అనిపించింది. ఇక అది నవంబర్ పదిహేడవ తేదీ. విశ్వ ప్రపంచ శాంతి యజ్ఞం మూడవ రోజు. ప్రాతఃకాలం నుంచే భక్తులు స్టేడియంకి చేరుకుంటున్నారు. సుమారు లక్షా యాభై వేల మంది భక్తులు అక్కడ కిక్కిరిసి కూర్చొని సాయిరామ నామాన్ని జపిస్తూ అక్కడి పరిసరాలను మరింత పవిత్రం చేస్తున్నారు. ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే సత్యసాయి భగవానుని స్వర్ణరథ శోభాయాత్ర. అది మరుపురాని మధుర మహోన్నత ఘట్టం. భక్తులంతా ఉత్కంఠతతో వేయి కళ్ళతో వేయి చంద్రుల దర్శన ఉత్సవంలో విశ్వ మానవాళికి వేయి తల్లుల ప్రేమను పంచే సత్య సాయీశ్వరుని స్వర్ణరథయాత్రను తెలగించుటకు ఆతృతగా ఆర్ద్రత నిండిన హృదయాలతో వేచి యున్నారు. ఈ లోగా శాంతి యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అతిథులుగా వివిధ పీఠాధిపతులు యజ్ఞ వేదిక వద్దకు ఒక్కొక్కరే వేంచేస్తున్నారు. సరిగ్గా తొమ్మిది గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వేంచేశారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిద్ధగంగా మఠం నుంచి స్వామి శివకుమార, ఆ తర్వాత శ్రీ నారాయణి పీఠానికి చెందిన శ్రీ శక్తి అమ్మ స్వామి, అటు పిమ్మట తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు జగద్గురు మధ్వాచార్య మహా పీఠానికి చెందిన శ్రీ విశ్వేశ్వర తీర్థుల వారు, శ్రీ పడులి వారు నుంచి శ్రీ సుష్మీంద్ర తీర్థుల వారు మరికొందరు పీఠాధిపతులు వేంచేసి వేదికపై ఆసీనులై ఉన్నారు. అప్పటికీ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలయింది. అందరిలోనూ ఉత్కంఠత. ఊపిరి బిగపట్టి రాబోయే విశిష్ట ఘట్టాన్ని వీక్షించుటకు సంసిద్ధులవుతున్నారు. ఈలోగా ప్రధాన ద్వారం వద్ద హడావిడి మొదలైంది. అక్కడ చేరి ఉన్న అందరి జీవితాలలో చెరగని ముద్ర వేసే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించబోతోంది. ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించే మహోత్కృష్టమైన వరం అది. భువిన భక్తులు దివిన దేవతలు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న దృశ్యం అది. ముందు మూడు పర్వతాల వంటి గజరాజులు పయనమై వస్తుండగా తరువాత విద్యార్థులు వేదమంత్రాలు వల్లిస్తూ నడుస్తుండగా సంగీత వాయిద్యాల నడుమ వేద పండితులు పీఠాధిపతులు వేదికపై కూర్చొని వీక్షిస్తుండగా అనంత తేజోమయ కాంతితో కోటి సూర్య ప్రభల తేజస్సుతో అద్వితీయంగా అజరామరంగా న భూతో న భవిష్యతి అన్న రీతిలో సర్వ దేవతా అతీత స్వరూపులైన సత్య సాయి దేవుని స్వర్ణరథం పయనమైంది. స్వామి పసుపు పచ్చని అంగీని ధరించి తన మందస్మిత వదనా రవిందంతో రథంలో ఆసీనులై తన భక్త కోటిని తన అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నారు. సేవాదళ్ వారు రథాన్ని లాగుతూ ముందుకు నడిపిస్తున్నారు. సువర్ణరథ మహోత్సవం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాట భక్తులకు వీణుల విందుగా వినిపిస్తోంది. ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న భక్తుల కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వెల్లువులా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ సమయంలో భక్తుల మనోభావాల ఆనందాతి హర్షధ్వానాలను ప్రతిబింబించే ఈ గేయాన్ని వినండి. సత్యసాయి సువర్ణరథ యాత్ర దృశ్యాలను మీ మనో ఫలకాలపై ముద్రించుకోండి. కాలాతీత నీలామూర్తి కలియుగ చక్రవర్తి త్రిభువన వందితదిగంత వ్యాప్త తేజోదిప్తి [మ్యూజిక్] స్వర్ణరథముపై పయనించే సత్యసాయి దేవా! నిను ధరించి ధరియించే ముక్తిఖిల జన బాంధవా! కృత జన మానస సతతడ సరసిజ ప్రకృతికి సూర్యుడవు నవనవ తులుచిర కువలయ హితకర దవళ శశాంకుడవు [మ్యూజిక్] ఈ మహోత్సవము తిలకించుటకై ఎల్లరము చేరినాము ఈ మధుర క్షణము కోసము మేము ఎంతో వేచినాము మా అంతరంగముల ముప్పొంగినది ఆనంద సాగరం ఈ చారిత్రాత్మక ఘటనము చూచే జన్మనే చరితార్థం [మ్యూజిక్] స్వర్ణరథముపై పయనించే సత్యసాయి దేవా! నిను ధరించి ధరియించే ముక్తిఖిల జన బాంధవా! కృత జన మానస సతతడ సరసిజ ప్రకృతికి సూర్యుడవు నవనవ తులుచిర కువలయ హితకర దవళ శశాంకుడవు [మ్యూజిక్] ఓ అవనీ జనులను ఆదరించగా అవతరించినావు సహస్ర చంద్ర దర్శనమ్ముతో సంతోషమందించినాము సకల జనులను సంరక్షించగా సాక్షాత్కరించినావు దాస జనులపై దయనే చూపిన్ కన్నులే చేసేము [మ్యూజిక్] స్వర్ణరథముపై పయనించే సత్యసాయి దేవా! నిను ధరించి ధరియించే ముక్తిఖిల జన బాంధవా! కృత జన మానస సతతడ సరసిజ ప్రకృతికి సూర్యుడవు నవనవ తులుచిర కువలయ హితకర దవళ శశాంకుడవు ఆ విధంగా సాగిన సత్యసాయి స్వర్ణరథ యాత్ర శాంతి వేదిక వద్దకు చేరుకుంది స్వర్ణరథం పై నుంచి స్వామి వేదికపైకి చేరుకున్నారు స్వామి యజ్ఞ కుండాల వైపు వెళ్ళి ప్రతి ఒక్క యజ్ఞ గుండాన్ని పర్యవేక్షించి తన ఆశీర్వాదాన్ని అందించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించి అందరినీ అనుగ్రహించారు ప్రపంచ చరిత్రలోనే మరుపురాని విధంగా నిర్వహించిన విశ్వ ప్రపంచ శాంతి మహా యజ్ఞానికి ముగింపు పలికారు ఆ తర్వాత అక్కడకు విచ్చేసిన వివిధ పీఠాధిపతుల నడుమ ఆసీనులై అక్కడ చేరిన వారందరికీ దివ్య దర్శనాన్ని అందించారు పీఠాధిపతుల నడుమ ఆసీనులైన స్వామిని ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయి అమితానందానికి లోనయ్యారు పది గంటల నలభై ఏడు నిమిషాల సమయానికి స్వామి హారతిని స్వీకరించి తన నివాసానికి పయనమయ్యారు అక్కడ చేరిన భక్తులు పండితులు ప్రముఖులు అందరి నోట ఒకటే మాట అంతా స్వామి స్వర్ణరథ దర్శన విశేషాలే సాయినాధునికి పలికిన జై జైలతో స్టేడియం అంతా మారు మ్రోగిపోయింది ఇదంతా స్వామి భక్తుల ఆనందం కోసం అందించిన దివ్య వరం పదిహేడవ తేదీ సాయంత్రం సాయి కుల్వం సభా మండపంలో రుక్మిణీ కల్యాణం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు స్వామి వేంచేసి తన దర్శనాన్ని ప్రసాదించి వేదిక వద్ద ఆసీనులయ్యారు కడు రమ్యంగా శోభాయమానంగా అలంకరించిన శ్రీకృష్ణుడు రుక్మిణీ మరియు సత్యభామల విగ్రహాలను వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా అర్చకులచే రుక్మిణీ కల్యాణం రసవత్తరంగా రసజ్ఞ మనోహరంగా కావించబడింది ఆ విధంగా భాగవత ప్రవచన సప్తాహానికి కూడా ఆనందమయ రీతిలో ముగింపు పలికారు ఆ రోజుతో సహస్ర చంద్ర దర్శన ఉత్సవాల కార్యక్రమాలన్నీ న భూతో న భవిష్యతి అన్న రీతిలో ముగించబడ్డాయి భక్తులను ఆనంద సాగరంలో ఓలలాడించాయి కేవలం మనమంతా బాహ్యంగా జరిగిన ఉత్సవ వేడుకలను వీక్షించి ఆనంద పరవశులం కావడమే కాకుండా అంతర్ దృష్టితో ఆలోచించి స్వామి ఇటువంటి కార్యక్రమాలను ఎందుకు ఇంత వైభవంగా నిర్వహించారో దాని అంతరార్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం పరీక్షిత్తు మహారాజు తాను ఒక వారం రోజులలో మరణిస్తానని తెలుసుకొని ఆ వారం రోజులు భగవంతుణ్ణి వివిధ అవతారాలలోని లీలా విశేషాల కథలను విని ఆస్వాదించి తాను శాప విముక్తుడయ్యాడట నేటి కలియుగంలో సంసార సాగరంలో చిక్కుకొని అల్లాడుతున్న మానవులకు భగవంతుణ్ణి తలుచుకునే సమయం గాని తీరిక గాని లేవు అందువలన భగవంతుడే తన భక్తులకు తన లీలా విశేష కథలను వినే ఏర్పాటు చేసివీడువారిన వారి మనసులను భక్తి భావాలతో సారవంతం చేసి వారి మనో క్షేత్రాలలో ప్రేమ పుష్పాలను చిగురింపజేసే నిమిత్తం సహస్ర చంద్ర దర్శనం అన్న పేరిట ఒక కార్యక్రమాన్ని సృష్టించి వారం రోజుల పాటు కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది విశిష్టమైనది ఏమిటంటే ఆ పరీక్షిత్తు మహారాజుకు కూడా దక్కని మహా అదృష్టం మనకు కలిగింది. అది ఆ దివ్య లీల విశేషాలను సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మానవాకారంలో దర్శిస్తూ వినగలగటం అంతకన్నా విలువైనది ఏమైనా ఉంటుందా? ఆలోచించండి. అంతేకాక భగవంతుడు గానలోలుడు అంటారు. అందుచేతనే తన నామాన్ని కీర్తించే సంగీత కచేరీలను కూడా అందించి భక్తులను ఆ గానా అమృతంలో ఓలలాడింప చేశారు. వేయి సార్లు పూర్ణచంద్ర దర్శనం చేసుకున్నందుకు స్వామి ఈ పండుగనంతా జరిపించారంటారా? ముమ్మాటికీ కాదు. ఈ విధంగా తన భక్తులకు ఆనందాన్ని తన ప్రేమను పంచడానికి జరిపించారనడమే సముచితం నిత్య సత్యం. ఇంకా ఇలా అనిపిస్తోంది. నిజానికి స్వామి వెయ్యి మార్లు చంద్ర దర్శనం చేసుకున్నారా? లేక చంద్రుడే వేయి సార్లు స్వామిని దర్శించుకున్నాడా? ఇదే విషయాన్ని భాగవత ప్రవచన సప్తాహంలో ఒక పండితోత్తముడు ఇలా పేర్కొన్నాడు. "నినుగని వెయ్యి మార్లు తన నీరసమున్ విడ నిండు చంద్రుడే" చంద్రుళ్ళో తేజస్సు ఏమిటండి? చంద్రుడికి ఉత్తేజం ఏమిటండి? పదిహేను రోజులకోసారి క్షీణించిపోయే వాడికి. ఎనభై మూడేళ్లుగా ఉత్తేజమే తప్ప మరొకటి తెలియనటువంటి సాయి భగవానుని ముందు చంద్రుని యొక్క తేజస్సు ఎంత? అందుకని వెయ్యి నెలలుగా చంద్రుడే స్వామిని చూసి తిరిగి తేజస్సును పొందుతున్నాడు. "నినుగని వెయ్యి మార్లు తన నీరసమున్ విడ నిండు చంద్రుడే" "నినుగని వెయ్యి మార్లు తన నీరసమున్ విడ నిండు చంద్రుడే" "నను గణ నిమ్ము" "నను గణ నిమ్ము" "నీదు కరుణం గణ నిమ్ము" "సహస్ర వర్షమున్" వెయ్యేళ్ళు మీరు ఇదే శరీరంతో ఇలాగే మాకు దర్శనమిస్తూ ఉంటే తప్ప మా చిత్తాలకి శాంతి అనేది ఉండదు స్వామి. మమ్మల్ని అనుగ్రహించండి. ఈ పుట్టినరోజుకు మేము కోరే కోరిక ఇది. పండిత పామర రంజకంగా సాగిపోయిన సహస్ర చంద్ర దర్శన ఉత్సవాలు మానవ చరిత్రలో కానీ వినీ ఎరుగని రీతిలో విజయవంతంగా భగవంతుని దివ్య సమక్షంలో సెలయేటి ప్రవాహంలా ఆహ్లాదాన్ని అందించాయి. కేవలం ఉత్సవాలలో పాల్గొనటమే కాకుండా అక్కడ చూచిన దృశ్యాలను మనం మన మనో ఫలకాలపై ముద్రించుకొని అక్కడ విన్న భగవంతుని లీలా విశేషాలను ఆస్వాదించి అర్థం చేసుకొని మన ఆధ్యాత్మిక అభివృద్ధికి బాటలుగా వేసుకొని ఆ చిద్విలాస మూర్తి సాయినాథుని అనుగ్రహంతో ఆయన చూపించిన మార్గంలో పయనించి ఆయన పంచే ప్రేమలో తన్మయులై ఆయన్ని కీర్తిస్తూ ప్రేమ జ్యోతులుగా వెలుగుందుదాం. సాయిరాం. [సంగీతం] ఇంతవరకు మీరు రెండువేల ఎనిమిది నవంబర్ మాసంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఎనభై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా జరిగిన సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవం యొక్క విశేషాలను విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం. [సంగీతం]
SSSMC · audio
Telugu Broadcast - 402
Telugu Broadcast - 402
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 58:40
More in this series
Telugu Broadcasts
- 57 min 394
Telugu Broadcast - 394
- 1 hr 396
Telugu Broadcast - 396
- 58 min 402
Telugu Broadcast - 402
Now playing - 58 min 420
Telugu Broadcast - 420
- 56 min 424
Telugu Broadcast - 424
- 57 min 427
Telugu Broadcast - 427
- 57 min 490
Telugu Broadcast - 490
- 56 min 491
Telugu Broadcast - 491
- 56 min 498
Telugu Broadcast - 498
- 58 min 555
Telugu Broadcast - 555
- 57 min 560
Telugu Broadcast - 560
- 58 min 561
Telugu Broadcast - 561