No transcript for this section.
[సాయి music] రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు 1984 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భగవద్గీత పై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో ఒక దివ్యోపన్యాసం. తదుపరి శూన్యత నుండి పూర్ణత వైపు, భగవాన్ బాబా వారి మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం, శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో సంభాషణ. చివరగా స్వామి వారి నిరుపమానమైన దివ్య ప్రేమను వివరించే శ్రీమతి సాయి ప్రసన్న గారి ప్రసంగం మీరు వింటారు. [సాయి music] ముందుగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు 1984 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భగవద్గీత పై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో ఒక దివ్యోపన్యాసం వినండి. [సాయి music] అద్వేష్ట సర్వభూతానం. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు తమ దివ్యోపన్యాసం లో ఏ ప్రాణి యందు తిరస్కార భావం లేక అన్నిటియందు సర్వాత్మ భావంగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే అన్న సత్యాన్ని గుర్తించమని బోధించారు. ప్రతి ప్రాణి యందు దైవత్వం ఉన్నందనే సత్యాన్ని విశ్వసించి దైవ గుణమైన ప్రేమను సర్వ జీవుల యందు ప్రసరింప చేయాలని తెలియజేశారు. నిర్వైర సర్వభూతేషు. ఎట్టి ప్రాణి యందు కూడను ద్వేషము లేకుండా, వైరము లేకుండా ప్రేమించమని గీతా వాక్యం. సర్వభూతముల యందు సర్వాత్మ భావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే. ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడవవుతావు. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్ఛతి. ఎవరిని నీవు దూషించినప్పటికినీ, తిరస్కరించినప్పటికినీ అది నీ ఆరాధన దైవమును తిరస్కరించిన వాడవవుతావు. దీనిని భారతీయ ధర్మశాస్త్రం కూడను సోదరత్వాని బోధిస్తూ వచ్చింది. అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పై మెట్టునకు ప్రవేశించింది. సర్వాత్మ భావనే ఏకత్వంగా గుర్తించమని బోధించింది. సోదరత్వం కాక సర్వాత్మ భావన బోధించింది. అనగా ఈశ్వరః సర్వభూతానాం అన్ని భూతముల యందు ఉండేటువంటిది ఒకే ఆత్మ అనేటువంటిది అని నిరూపించింది. కనుకనే సుఖదుఃఖ సమైకిత్వా అన్నట్టుగా సుఖదుఃఖములను మనం ఏవిధముగా సమానంగా చూసుకోమని బోధించిందో అదేవిధముగనే సర్వభూతముల యందు కూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది. కేవలము మానవ జీవితమునే కాక పశుపక్షి క్రూరాదుల యందు కూడను దైవత్వం అనేటువంటిది నిరూపింప చేయుటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది. కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు. క్రిమికీటి కాదు మొదలుకొని బ్రహ్మ రుద్రాదుల వరకు కూడను ఈ జీవత్వం అనేటువంటిది ఆత్మత్వంగా, ఏకత్వంగా ఉంటుండాలి. కనుకనే త్యాగరాజు కూడను జీవలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ నీడ వెలసి ఉండే విరుదు వహించిన రామా! నన్ను బ్రోవరా! అని ప్రార్థించాడు. కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావం జీవిని చూచినప్పుడు చంపి వేస్తాం, నలిపి వేస్తాం. బ్రహ్మని చూచినప్పుడు నమస్కరిస్తాం. చెప్పటం వేరు, చేయటం మరొకటి. కనుకనే మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందుపోతున్నారు. కానీ భగవద్గీత యందు మనసేకం, వచసేకం, కర్మణ్యేకం మహాత్మనం అని బోధించింది. ప్రతి ప్రాణి యందు కూడను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి. దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వ జీవుల యందు కూడను మనము ప్రసరింప చేయాలి. అందరిని కూడను దయా కరుణతో మనము చూడాలి. అట్టు చూడకుండినా మన సాధన అన్నీయు కూడను కేవలం నిరర్థకం అవుతుంది. దేవున్ని భజించుచూ జీవున్ని హింసించుచూ, దేవున్ని పూజించుచూ జీవున్ని బాధించుచూ ఉండెనంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధం అయిపోతుంది. జీవుడే దేవుడనియు, దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత. సర్వ జీవుల యందు కూడను దయ కలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడను బోధించింది. ఎంతటి విద్యావంతుడు అయినప్పటికినీ, ఎంతటి శక్తి సామర్ధ్యములు కలిగినటువంటి వాడైనప్పటికినీ భూతదయ లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడను శూన్యం అవుతుంది. కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం. ఇట్టి భూతదయ యందు కొంత విచక్షణా జ్ఞానాన్ని, విజ్ఞతను కొంతవరకును విచారించాలి. భూతదయ అనగా...బాధపడుతున్నటువంటి వ్యక్తులను, జీవులను చూసి సాధ్యమైనంతవరకు మన చేతనైనంతవరకు దానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. వారి బాధను, వారి దుఃఖమును, వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు, నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి. దయ, దయ అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రాన ప్రయోజనం లేదు. క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి. కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వం గా కూడను మనం విశ్వసించాలి. దయగల హృదయమే దైవ మందిరం అని కూడను విశ్వసించాలి. కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి. నిర్దయుడైపోతుంటారు. కఠిన హృదయాన్ని పెంచుకుంటారు. కారడవుల యందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు. ఇది మానవత్వానికి సైన్యం అంటే లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణం అని కూడను బోధించాడు కృష్ణుడు. కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఈ అరక్క పుష్పములలో ఈ దయా పుష్పం అనేటువంటి దాన్ని అంగీకరించు తాను భగవంతుడు. పూలగుచ్ఛలు తెచ్చి పూజ ఎంత చేసినా మెచ్చుకొనుడు తాను పుచ్చుకొనడు. దేనిని పుచ్చుకుంటాడు? దేనిని మెచ్చుకుంటాడు? దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు. కనుకని మనము దైవము సర్వజీవుల యందు కూడను ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ దయను మనం ఏరీతిగా ప్రకటించాలి? ఇది కేవలం అభ్యాసముతో మనం లభ్యsించేటువంటిది కాదు. హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి. నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి. అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా తాను పరుల యొక్క దుఃఖమును, పరుల యొక్క బాధను తాను గుర్తించుతాడు. ఒక గ్రామంలో బీద కుటుంబం ఉండేటువంటిది. అందులో ఏకైక బిడ్డ ఒక పుత్రిక ఉండేటువంటిది. ఇది పెద్ద కుటుంబం కాదు. కేవలము ధనవంతులతో ఉండినటువంటి ధనముతో కూడినటువంటి కుటుంబం కాదు. ఇది బీద కుటుంబం. కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆ పల్లెలో విద్యాసంస్థలు లేవు. కనుక ప్రక్కనున్నటువంటి ఒక గ్రామమునకు పంపవలసి వచ్చింది. ఆ ప్రక్క ఉన్నటువంటి గ్రామమునకు పోవలనంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది. కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు. వారికి నిత్యజీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది. ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామమునకు వెళ్ళి చదువుకోవటం, తిరిగి సాయంకాలమునకు ఇల్లు చేరుకోవటం ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది. ఆ కాలములో దానములు, ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం. ఈ మార్గమధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు. ఒకనాడు ఈ బిడ్డ స్కూలుకు వెళుతూ ఆ ఛత్రంలో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూసింది. రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది. ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో, అటువైపునో చేరుదామనుకుంటే నడవలేని శక్తిహీనుడయ్యాడు. అందువల్ల ఎవరినీ ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి. క్రమక్రమీన కూడను ఆహార పానీయములు లేకుండా శరీరం కృశించిపోతుండాలి. ఇది గుర్తించింది ఈ బాలిక. తన ఇంటి నుంచి దినము తాను స్కూలుకు వెళ్ళే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకొని ఒక ఇడ్లీనో, ఒక దోశనో ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కారులో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెన-ఆ యొక్క టిఫిన్ కారి వెనుక తీసుకురావటము ఈరీతిగా జరుపుతూ వచ్చింది. ఈ విధంగా పది దినములు జరిపేటప్పటికీ అతను కొంచెం పుంజు వేసుకున్నాడు. కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు. ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి. "బంగారు బిడ్డ! నీవు నాకు ఇన్ని దినములు కూడను ఆహార పానీయములు ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించావు. ఈ ఆహార పానీయములు ఎక్కడినుంచి నువ్వు తెస్తున్నావు? నీ తల్లిదండ్రులకు తెలిసినా? లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెస్తున్నావా? ఇంకే విధమైనటువంటి మార్గంలో దీన్ని ఉమ్ ను-ఆ అపహరించి నాకిస్తున్నావా? లేక నీకు నివ్వే తినకుండా వస్తూ ఉండి నాకు పెడుతున్నావా? యదార్థం చెప్పమని" కోరాడు. అప్పుడు ఆ బాలిక చెప్పింది "అయ్యా! నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడను లేదు. నా తల్లిదండ్రులకు మూసుపెట్టి అనగా వారిని మరిపి చేసి నేను తెచ్చేటువంటి పదార్థములు ఒక్కటీ లేదు. నేను నీకిచ్చేటువంటి ప్రతి పదార్థం కూడను నా తల్లిదండ్రులకు తెలుసు. మాది బీద కుటుంబము. మా ఇంట్లో శక్తి సామర్థ్యము లేవు. అయినప్పటికీని నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను" అని చెప్పింది. ఇంత చిన్న బాలిక ఏరీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు. నేను వచ్చే దారిలో రేగు పండు చెట్టు ఉంటుండాలి. దాన్నంతా వేరుకోవటము, ఆ రేగు పండ్లు మూటగట్టుకొని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ, దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతే కానీ నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టటం లేదు. నేను ఎక్కడా అపహరించటం లేదు. ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వాయార్జితం. ఆ బిడ్డ యొక్క త్యాగమునకు, ఆ బిడ్డ యొక్క యుక్తికి, ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు. నీకీ బుద్ధి ఏరీతిగా లభించింది అని కూడా మరీ ప్రశ్నించాడు. ఇది మా తల్లిదండ్రుల యొక్క బోధ. అమ్మా! మనము చాలా బీద కుటుంబము. మనకంటే హీనమైనటువంటి కుటుంబాన్ని చూచినప్పుడు ఏదో మన శక్తి కొద్దీ మనం దానం చేయాలి అని నా చిన్న బిడ్డప్పటి నుంచి కూడను నాకు ఇదే బోధలు చేస్తూ వచ్చారు. ముగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూతదయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది. క్రమక్రమీన ఈ రోగి కొంతవరకు ఆరోగ్యమును పొంది నడుచుకొనిగ్రామం వచ్చి చేరాడు కానీ ఆ భూతదయకు ఏమి ఫలితం. ఈ patient ఈ రోగి అనేటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వవిధములుగా సుఖంగా జీవించేటట్టుగా అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి. నేను నిత్యమైన బీదవాడిని, నేను రోగిష్టిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి నేను దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు. ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరాడు. ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు. ప్రతిఫలాన్ని ఆశించలేదు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినటువంటి ఈ యొక్క దానం కనుక దైవమే అనుగ్రహించాడు. ఒకనాడు సాయంకాల సమయంలో దైవము డబ్బులు మూటగా కట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి "అమ్మా! నాకు ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి, ఆహారాన్నిచ్చి, పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా?" అని అడిగాడు. ఆ అమ్మాయి ఒంటరిగా school కు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యముతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైన దయా హృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలని ఉద్దేశంతో నేనొక బిచ్చగాడి వేషంతో ఒక ఛత్రంలో చేరాను. ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం, పది దినములు ఆ ఛత్రంలో నివసించాను. ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దయగల హృదయము అదే నా మందిరము. కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాలా సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు. ఈ ధనమును చూసిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పైన పడి "స్వామి! ఇంత ధనమునకు మాకు అధికారం లేదు. మా శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు. శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది. అశాంతిని అందిస్తుంది. అహంకారమును చేకూరుస్తుంది. ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది. కనుక మాకింత ధనమొద్దు మహానుభావా" అని ప్రార్థించారు. కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానం అయ్యాడు. వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు కేవలం దైవమే అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏ మాత్రము దీనిని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయా హృదయంతోపల దీనులను రక్షించడానికి ఈ ధనమునంతా ఉపయోగపడుతూ వచ్చారు. సర్వుల యందు ఉండినటువంటి యొక్క జీవతత్త్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు. దయా ప్రేమల వల్లనే దైవం లభిస్తాడని కూడాను విశ్వసిస్తూ వచ్చారు. కనుకనే "యద్భావం తద్భవతి" మన భావం ఎటువంటిదో దైవత్వం అటువంటిదిగా మనకు లభ్యమవుతుంది. దైవం ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో ఉన్నాడని మనం విశ్వసించరాదు. సర్వత్రా ఉంటున్నాడనే సత్యాన్ని మనం కొంతవరకు చాటడానికి అనుభూతిపరులు కావాలి. అయితే ఇలాంటి సద్భావన మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది. దీనికి "అంతర్బహిర్ద సర్వవ్యాప్య నారాయణ" అని పిల్లలు పురుష సూక్తంలో చెప్పారు. అదేవిధంగా అంతర్ బహిః శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు. భగవంతుడు లోపల, వెలుపల ఉన్నాడు. కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతఃశుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు గనుక బహిఃశుద్ధి కూడా మనకు అవసరమే. కనుక దైవము అంతర్బహిస్తత్వము నందు ఉండుట చేత మనం కూడాను అంతఃశుద్ధి, బహిఃశుద్ధి రెండు శుద్ధులు కూడను మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది. ఈ బహిఃశుద్ధి అంటే ఏమిటి? మొట్టమొదటి బహిఃశుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము, మనము పఠించేటువంటి గ్రంధములు కూడను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దుస్తులు ఎందుకాని, మన దేహము నందు కానీ, మన బుక్కులు ఎందుకాని అశుద్ధం అనేటువంటిది మాలిన్యం చేరకుండా చూచుకోవాలి. మనము పరిశుద్ధం అనగా ఏమిటి? దేహమును సరియైన రీతిలో నిత్యము రెండు వేళలు స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండినటువంటి అంతరార్థం ఇదియే. దేహమును మాత్రమే కాదు ప్రతి అంగామును కూడను పరిశుద్ధం చేసుకోవాలి. ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది. మాలిన్యం చేరిన దగ్గర insects పురుగులు చేరిపోతాయి. ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది. కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి. మనం నిత్యము తెల్లవారు లేచిన వెంటనే toothpaste, toothbrush తీసుకుని చక్కగా పళ్ళు తోముకోవాలి. కేవలం పళ్ళు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి. దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు. ఈ ద్వారము నుండే కొంతవరకును మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. మనం ఎంత ప్రదేశాల్లోనో మనం చూస్తుంటాము. ఏదైనా మురికినీరు దేని దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి. అదేవిధంగానే ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. ఇంతే కాదు మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడను పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఆంధ్రదేశంలో పలికేటటువంటివారు "ఇల్లును చూసి ఇల్లాలును చూడు" అంటారు. ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటాదో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటిది అని దీని అర్థం. ఇది దేనికోసం చేసుకోవాలంటే మన మంచి కోసమే. ఇల్లు కానీ పరిసర ప్రాంతములు కానీ పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం. ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క property మన యొక్క లక్ష్యమే. కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడను మనం పరిశుద్ధంగా ఉంటుండాలి. మనకు రెండు చొక్కాలు, రెండు ప్యాంటులు ఉండినా చాలు. ఒకటి ధరించి రెండోదాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం. దిన్నము రెండు మార్చనక్కర్లేదు ఒకటి ఉండినా చాలు మన శక్తికి. ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. సాధ్యమైనంతవరకును ఈ యొక్క అశుద్ధం మనపైన చేరకుండా చూచుకోవాలి. బయట మాత్రము తెల్లని dress లు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు. కనుక దానివల్ల అంతఃశుద్ధిని కూడను మనం పరిశుద్ధంగా చూచుకోవటానికి ప్రయత్నించాలి. దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి. పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి. అసూయ భావనలు కానీ ద్వేష భావం కానీ మనలో చేరకుండా చూచుకోవాలి. నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగి పోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి. ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడను మనం చింతించరాదు. సర్వులో మంచిని కూడను మనం కొంతవరకును యోచిస్తూ రావాలి. దీనిని ఆధారంగా చేసుకొని వైదిక ధర్మం లోపల లోక సమస్తా సుఖినోభవంతు అనేటువంటిది ఆర్యుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు. ఇదే వేదికుల యొక్క లక్ష్యం అని కూడను భావించారు. కనుక హృదయము లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామమును చింతించుతూ రావాలి. ఈ విధంగా అంతర్ బహిర్గత తత్వములందు పరిశుద్ధము గావించుకొనుటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు, అసూయాది డమ్మములు ఇలాంటి క్రిమి కీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు. ప్రహ్లాదుడు చెప్పారు ఆరు శత్రువులను నీవు జయించినప్పుడే నీవు సరి అయినటువంటి ఉత్తముడవుతావు అని. ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావు అన్నాడు. ఆ ఆరు శత్రువులే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. ఈ ఆరు శత్రువుల యందు కూడను మనం చేరకుండా చూచుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధం. కనుకనే మనము ఈ శత్రువులు లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకమైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి. కనుక నీవు సుఖదుఃఖములు రెండింటినీ సమానంగా చూచుకోవాలంటే, లాభనష్టములు రెండింటినీ సమానంగా చూచుకోవాలంటే అందరి యందు కూడ ఉన్నిటువంటి ఆత్మ తత్వమును కూడ సమానంగా చూచుకోవాలి. ఈ సుఖదుఃఖములను, శీతోష్ణస్థితులను, లాభనష్టములను సమానంగా చూసుకోవటం చాలా అసాధ్యం. అయితే అందరి యందు ఉండేటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యం మనకు దృఢం అయిపోతే ఇవన్నీ సులభంగా మనకు వశం అయిపోతాయి. నీ అనుగ్రహం ఒక్కటుంటే చాలు సర్వ గ్రహములు నా అస్తగతమే అన్నాడు త్యాగరాజు. సర్వుల యందు ఉండేటువంటి యొక్క ఏకాత్మ తత్వాన్ని ఒక్క దాన్ని మనం విశ్వసిస్తే, ఇవన్నీ కూడను సులభంగా మనకు ఏకమైపోతాయి. సులభంగా సాధించడానికి వీలవుతుంది. అన్నింటికీ మూలం ఏదో, అన్నింటికీ కీలకమేదో, అన్నింటికీ గమ్యం ఏదో దానిని మనం పట్టాలి. అదే ఆత్మ తత్వము. దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మనకు వశం అవుతాయి. చెట్టును కొట్టదలచినటువంటి వాడు కొమ్మలను, ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు. వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది. అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశం అయిపోతుంది. కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహం మనస్సు యొక్క తత్వాన్ని కూడను కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి. కనుక పూత దయను మనం పెంచుకోవటం, సర్వాత్మ భావనను మనం అభివృద్ధి పరచుకోవటం, దేహం యొక్క పరిశుద్ధము, మనస్సు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం. ఈ విధమైనటువంటి యొక్క నిత్య చర్యలు లోపల నిత్య జీవితం లోపల సాధనను సలిపినప్పుడే దైవత్వం మనకు సులభముగా అర్థమవుతుంది. కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి సర్వుల యందు కూడను ఉండేటువంటి యొక్క భగవంతునికి నేను యొక్క నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి. అంతటితోనే మనము ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి దాన్ని కూడ రెండో అడ్డుగా పెట్టుకోవాలి. మన జీవితము ఒక పెద్ద ప్రవాహం. ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు, అన్ని భూములు అంతజీవులను కూడను ధ్వంసం చేస్తుంది. గ్రామాల మీద ముంచివేస్తుంది. కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయం మనం తీసుకోవాలి. ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరుడే. కనుకనే ఈ సాగరమును ఏరీతిగా మనం చేర్చటం. దీనికే భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది. ఈ నదికి ఇటువైపున, అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను, ఏ గ్రామాలను ముంచకుండా నేరుగా సముద్రంలోకి చేరిపోతుంది. ఏమిటి ఈ గట్టు? అదే అష్టాక్షర నామము అని బోధించాడు. ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణ కాదు. సంశయాత్మా వినశ్యతి ఇది. సంశయాత్మా వినశ్యతి నిస్సంశయుడుగా నీవు ఉట్టుండు అని గట్టును ఒకవైపున కట్టుకో. రెండవ వైపున శ్రద్ధావాన్ లాభతే జ్ఞానం ఇది ఎనిమిది అక్షరాలది. ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో. నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటిని మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది. ఈ ఉపాయమునే జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనముగావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. నాయనా! మానవుని యొక్క గమ్యము అదే. గమ్యమును మరవవద్దు, లోకమును నమ్మవద్దు, మరణమునకు భయపడవద్దు. ఈ మూడింటిని నీకు నిజమైనటువంటి మంత్రములుగా బోధిస్తున్నాను అన్నాడు. కనుకనే గమ్యము, దైవము. దైవాన్ని మరవకూడదు, ఈ లోకాన్ని నమ్మకూడదు, మరణానికి భయపడకూడదు. ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు తమ దివ్యోపన్యాసం లో దయగల హృదయమే దైవ మందిరమని, ఈ దయను ఏరీతిగా ప్రకటించాలో తెలియజేశారు. హృదయమే దైవ మందిరం కాన, ఈ మందిరాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోగలమో వివరించారు. [నవ్వు] భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో భగవద్గీత పై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో ఒక దివ్యోపన్యాసం విన్నారు. శూన్యత నుండి పూర్ణత వైపు, భగవాన్ బాబా వాది మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో సంభాషణ వినండి. [సంగీతం] సాయిరాం! అది రెండువేల ఆరవ సంవత్సరం. ఆ వేసవి సెలవులలో కొడేకెనాల్ లో స్వామి విద్యార్థుల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఏదైనా కొత్త పాట చెప్పండి అన్నారు.అప్పుడు వెనుక నుండి నేను స్వామి ఒక తెలుగు పాట పాడతానన్నాను. ఆ పాట ఇలా సాగుతుంది. ఓ నేస్తమా! ప్రియమైన బంధమా! ప్రేమకు రూపమా! మా అందరి ప్రాణమా! గడిచే ప్రతి క్షణం నీతోనే గడపాలని, మేమూ వినే పదాలన్నీ నీ మాటలే కావాలని, మాలోని తలపులన్నీ మీకు వివరించాలని, క్రియలన్నీ కర్తకే అంకితం చేయాలని. అలా పాడుతూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. నా కన్నీళ్లకు కరిగి స్వామి కూడా అలాగే స్పందించారు. స్వామివారు భౌతికంగా మన మధ్య నుండి విడలి ఒక నెలకు పైగా గడిచింది. ఇది జరిగిన నాటి నుండి ప్రతి ఒక్క భక్త హృదయం చెల్లాచెదురైంది. ఎన్నో ప్రశ్నలు ప్రతి మదిలో తలెత్తాయి. తమ చివరి క్షణాల వరకు స్వామి తమ జీవితాన్ని తమ సందేశంగానే అందిస్తూ వచ్చారు. స్వామి ఆసుపత్రిలో గడిపిన ముప్పై రోజుల్లో కూడా ఒక్కమారు కూడా తనకు నొప్పి అని కానీ, బాధ అని కానీ చెప్పలేదు. సచ్చిదానంద స్వరూపులై దేహ భ్రాంతిని వీడడం అంటే ఏమిటో మనందరికీ ఆ చివరి క్షణాల్లో కూడా ఆచరణలో చూపిన కరుణామూర్తి మన స్వామి. అయితే నేను అనుకుంటూ ఉండేవాడిని, ఆ క్షణం వచ్చినప్పుడు నేను ఊపిరితో ఉండగలనా? ఆ బాధ నేను తట్టుకోగలనా అని. ప్రతిసారి సమాధానం ఉండలేను, తట్టుకోలేను అని మాత్రమే వస్తుండేది. అయితే మరి ఈ రోజున ఇంకా ఊపిరితోనే ఉన్నానే ఇంకా నా హృదయం స్తంభించలేదే. ఎన్నో రాత్రులు ఈ ప్రశ్నతో మనలో చాలామంది గడిపి ఉంటాము. అయితే దాని సమాధానం స్వామి తమ జీవిత పర్యంతం మనకు నేర్పిన పాఠాలను, పంచిన ప్రేమను మానవాళికి పంచాలి. మనలో ప్రతి ఒక్కరూ స్వామి వారి నిస్వార్థ ప్రేమను, సేవా తత్పరతను ప్రతిబింబించాలి. అందుకే మనలో స్వామి ఊపిరిగా ఉన్నారు. ఆ పాట ఇప్పుడు తలుచుకుంటే దాని అంతరార్థం నాకు ఎంతో చక్కగా గోచరమవుతుంది. గడిచే ప్రతి క్షణము మనలో ఉన్న స్వామితోనే గడపాలి. వినే ప్రతి పదము స్వామి పదం గానే వినాలి. మనలో ఆవిర్భవించే ప్రతి తలపు స్వామి పరం గానే ఉండాలి, స్వామి ప్రేమనే ప్రతిబింబించాలి. ఇంతవరకు బాధలో ఉన్నాము. అయితే ఇక మన బాధ్యత, మన కర్తవ్యం మనకు పిలుపునిస్తోంది. శూన్యత నుండి పూర్ణత వైపు అనే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకుందాం. భగవాన్ మహా పరినిర్వాణం అనంతరం మన బాధను మరుస్తూ బాధ్యత వైపు ఏ విధంగా మనందరి జీవితాలు కొనసాగాలన్నదే ఈ కార్యక్రమ ప్రధానాంశం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు గత యాభై సంవత్సరాలుగా స్వామి వారి భక్తులు. వారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. కెమికల్ ఇంజనీరుగా, సాంకేతిక రంగంలో దేశ విదేశాల్లో ప్రముఖ స్థానం పొందారు. అంతేకాకుండా స్వామి వారి అనుగ్రహంతో పది ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా రచించి స్వామికి సమర్పించారు. ప్రముఖ వక్త రేడియో సాయి ద్వారా మనందరికీ పరిచితులే. సాయిరాం సార్. సాయిరాం. ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న ఈ కార్యక్రమం ఈ రోజుకి స్వామి కృప వలన సాధ్యం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్లు స్వామి మనందరినీ భౌతికంగా వదిలి వెళ్లడం అనేది ఒక బాధ కన్నా ఒక షాక్ గా చెప్పవచ్చు. ఇప్పటికీ అది నిజమని నమ్ముకుది కావటం లేదు. మీ మనోభావంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కోటానుకోట్ల భక్తుల హృదయాలలో స్వామి రూప నామాలు శాశ్వతంగా ముద్ర వేసుకున్నాయి. అందులో కొన్ని లక్షల మందికి స్వామితో ప్రత్యక్ష అనుభవం ఉంది. స్వామి ప్రతి ఇంటికి ఒక పెద్ద. స్వామి ప్రతి వ్యక్తికి ఒక దిక్సూచి. స్వామి తలపు లేకుండా, స్వామికి చెప్పకుండా, స్వామిని నివేదించకుండా జీవితం సాగలేదు. అటువంటిది స్వామి ఇరవై నాలుగు ఏప్రిల్ రెండువేల పదకొండు తమ దివ్య దేహాన్ని వదిలిపెట్టారు. నిజానికి ఒక భక్తుడుగా ఇది ఆపుకోలేని ఒక ఉద్వేగ స్థితి. కానీ స్వామి మనకు నేర్పింది ఒక్కటే. అన్నివేళలా మీరు దేహం మాత్రమే కాదు, మీరు దివ్యాత్మ స్వరూపులు, మీరు ప్రేమాత్మ స్వరూపులు. ఆ రెండు మాటల్లోనే మానవుణ్ణి పరమోత్కృష్ట స్థాయికి తీసుకెళ్లారు స్వామి. ఎవరినీ ఎన్నడూ పేరు పెట్టి పిలిచి సంబోధించింది లేదు. ప్రైవేటు సంభాషణలో తప్ప. కాబట్టి స్వామి ఈ దేహాన్ని వదిలిపెట్టారు అన్నటువంటిది ఒక వాస్తవం అయినప్పటికీ, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి, దాని నుంచి నెమ్మదిగా మళ్లీ ప్రాపంచికమైనటువంటి కార్యకలాపాలలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు సాగటానికి స్వామి కావలసినంత అంతర్గత శక్తిని మాత్రం మనకిచ్చారు. ఆయన ఇచ్చిన శిక్షణ ఒక రోజు, రెండు రోజులు కాదు. మీరన్నట్లు కొన్ని దశాబ్దాలుగా స్వామి భక్తులుగా ఉన్న వారందరికీ ఇది ఎంత కఠోరమైనటువంటి సత్యం అయినప్పటికీ దీన్నుంచి బయటపడాలి అన్నటువంటి దానిని స్వామి ఆ శక్తిని కూడా వారే ఇచ్చారు గనుక నెమ్మది నెమ్మదిగా కాలగమనంలో స్వామిభావాలు స్వామి ఆశయాలు స్వామి ఆదర్శాలు స్వామి ప్రబోధాలు సందేశాలు ఉపదేశాలు ఆదేశాలు ఇవన్నీ కూడా మనకు అక్కడికి వస్తాయి అవును సర్ మీరన్నట్టు ఇప్పటివరకు ఏ బాధ వచ్చినా ఏ విపత్తు సంభవించినా ఏ ఆపద వచ్చినా లేక ఏ శుభవార్త ఉన్నా ఏ మంచి కార్యం జరిపినా స్వామి వద్దకు పరుగున వచ్చి ఆ బాధను వారితో పంచుకోవటము లేక ఆ ఆనందాన్ని వారి సమక్షంలో అనుభవించడం జరుగుతూ ఉండేది ఇప్పుడు ఇక అది చేయలేము ఎవరితో చెప్పుకోము ఏమని చెప్పము అనేది ఒక ప్రశ్నగా చాలామందికి మిగిలిపోయింది నిజానికి స్వామిని కేవలం దేహం మాత్రమే అనుకున్నట్లయితే ఈ ప్రశ్న మనం వేసుకోవాలి మనకి స్వామి 1945 నుంచి అంటే మనందరం పుట్టక ముందు నుంచి అవును నన్ను ఈ ఐదడుగుల మూడంగుళాలకి పరిమితం చేసి చూడకండి దానిని దాటే స్థితికి మీరు రండి అని వచ్చామో రాలేదో అది మన సాధన కానీ స్వామి చెప్తూనే వచ్చారు అవును అంటే ఏమిటి నేను దేహం కాదు దేహాతీతమైనటువంటి మహా చిచ్ఛక్తిని అని స్వామి చెప్పారు చెప్పకనే అయితే ప్రశ్న ఏంటంటే ఇవాళ ఎట్లా చెప్పుకోవాలి ఆ భౌతిక స్థాయిలోని జీవితం ఒక భౌతిక స్థాయి మాత్రమే కాదు కదా భౌతిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక అంటే physical metaphysical and spiritual మూడు స్థాయిలలో స్వామిని మనం భౌతిక స్థాయిలో ఒక పారిశ్రామిని అనుభవించాం అవును రామకృష్ణాది అవతారాలు ఉన్నాయి ఓ ఆంజనేయస్వామి ఉన్నాడు వెళతాం పదకొండు ప్రదక్షిణాలు చేసి నువ్వే ఈ కష్టం తీర్చవయ్యా అని గుడిలో అడిగి వస్తాం రాముడు ఉన్నాడా రాముడు లేడు ఆంజనేయస్వామిని చూశామా చూడలేదు కానీ ఒక నమ్మకం ఒక విశ్వాసం ఆ విశ్వాసం ఎలా ఏర్పడింది అది వారు ఇచ్చిన అనుగ్రహమే అట్లాగే సత్యసాయి భగవానుడు ఈ శరీరానికి పరిమితం కాకుండా అపరిమితమైన విశ్వ చైతన్యంగా ఇవాళ తనను తాను ప్రకటించుకున్నారు ఆ విశ్వ చైతన్యంలో స్వామి ఇదివరకు ఎక్కడున్నారు అంటే వైట్ ఫీల్డ్ లో ఉన్నారు కొడైకెనాల్ లో ఉన్నారు పుట్టపర్తి లో ఉన్నారు చెప్పేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఏం లేదండి మొన్నటి వరకు మాతో ఉన్నారు లేదు మనతో ఉన్నారు ఇప్పుడు మనలో ఉన్నారు అని చెప్పగలిగిన స్థాయికి మనం వెళ్ళాలి నిజం సర్ చాలా అది ఆ మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి స్వామి యువతని 1999 అలాగే 2004 ఉపన్యాసం చేసినప్పుడు ఒక మాట అన్నారు రాబోయే కాలంలో మీరే ఈ organization నాయకత్వం వహించాలి సిద్ధంకండి అన్నారు అవును ఆ నాయకత్వం వహించడం అంటే ఏమిటి మనం ఆ బాధ్యత తీసుకోవాలి ఎంత సేపు బాధలోనే గనక ఉండిపోతే నిర్వీర్యులమైపోతాం ఉమ్ ఎందుకని ఒక agony అంటే ఒక దుఃఖం గాని ఒక భయం గాని మనకున్నటువంటి energy ని drain out చేసేస్తుంది అవును ఆ నిర్వీర్య స్థితిని కాకుండా స్వామి దేహంలో మాత్రమే లేరు మనతో మాత్రమే లేరు ఇవాళ మనలో ఉన్నారు అన్నప్పుడు మనకి ఒక దివ్య చైతన్యం ఆ అంతర్గత శక్తి మనకి స్వామి రూపంలోనే మళ్ళీ మనం దాన్ని అనుభవిస్తాం ఇవాళ అలాగే ఏ ప్రశ్న ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ ఆనందం ఉన్నా ఏ సంతోషం ఉన్నా స్వామి పటం చిత్రపటం స్వామి ఉట్టి పటం కాదుగా అవును సర్ మన దృష్టిలో స్వామికి ప్రతీక అది స్వామి యొక్క ప్రతిబింబం దాని దగ్గరికి వెళ్ళి ఎట్లా ఇదివరకైతే చెప్పుకున్నామో ఇప్పుడు కూడా అలా చెప్పుకున్నట్లయితే సమాధానం కచ్చితంగా వచ్చి తీరుతుంది దీంట్లో సందేహం లేదు మీరు ఇప్పుడు అంటుంటే నాకు అనిపిస్తోంది ఒకవేళ మనం ఇట్లానే బాధలో ఉండిపోతే ఉమ్ స్వామి చేపట్టిన ఈ మహోద్యమంలో మనం పాలు పంచుకోలేకపోతాం అవును దాని వల్ల ఆయన ఆశయాలకు మనం ఎదగలేం ఈ ఉద్యమం ఇక్కడే ఆగిపోతుంది అని లేదు ఎందుకంటే అది ఆయన ఆ ప్రారంభించినది ఉమ్ అది సాగుతూనే ఉంటుంది కానీ అందులో పాలు పంచుకునే భాగ్యాన్ని మనకి కల్పించారు కాబట్టి మనం బాధ నుండి మెల్లగా బాధ్యత వైపుకు వెళ్లి రైట్ దీన్ని ముందుకు సాగించాలని అవును అవును చాలా బాగా చెప్పారు సర్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పిన దాని నుండి నా జీవితమే నా సందేశము అయితే మీ జీవితాలు నా సందేశం కావాలి అని స్వామి చెప్పటం మనం అనేక మార్లు విన్నాం సర్ మన జీవితాలని ఆయన సందేశంగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అసలు ఇవాళ మన ముందున్న సాధన ఇదే ఏం చేయాలి స్వామి మనకు ఏం నేర్పారో అన్నివేళలా గుర్తు పెట్టుకోవాలి స్వామి ఏ బోధించారో మననం చేసుకుంటూ ఉండాలి స్వామి దాన్ని ఎలా ఆచరించారు మిగతా అవతారాలు మిగతా గురువులంతా కూడా మీరిది చేయండి అని చెప్పారు స్వామి చేసిన తర్వాత మనకు బోధించారు ఉదాహరణకి గ్రామ సేవ తీసుకోండి తన పుట్టపర్తి గ్రామాన్ని విశ్వ పటం మీద నిలబెట్టిన తర్వాతనే గ్రామ సేవే రామ సేవ బయలుదేరండి అన్నారు అలాగే ఒక hospital ప్రారంభించిన తర్వాత వైద్యరంగంలో మీరు చేయవలసిన సేవ ఇలా చేసుకోండి అని చెప్పారు అలాగే సత్యసాయి institute of higher learning లో విద్య మానవతా విలువలతో కూడినటువంటి విద్యని తాను ప్రవేశపెట్టిన తర్వాతే మీరందరూ కూడా ఇలా చేయవచ్చును అన్నారు అంటే స్వామి అవతారంలో ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి లక్ష్యం ఏమిటంటే చెప్పింది చెయ్ చేయగలిగిందే చెప్పు ఎంత అందంగా చెప్పేవారు ఈ మాటలు చాలా అచ్చ తెలుగులో అవును నువ్వేం చేయగలవో అది మాత్రమే చెప్పు చెప్పావా చేయాలి ఉమ్ అదిగో నేను చేశా నేను చూపించా మీరు చేయటానికి ఉంది నేనే చేయగలిగినప్పుడు నా శక్తిని తీసుకుని మీరు చేయండి ఇది కదా స్వామి భావన ఉమ్ కాబట్టి ఇవాళ మన ముందున్నటువంటి కర్తవ్యం స్వామి మాటల్లోనే ఇరవై ఒక్క తరాలు నేను కాచుకుంటానన్నారు స్వామి అంటే సుమారుగా 2100 సంవత్సరం తరాలు అంటే వంద ఏళ్ళు లెక్కేస్తే 2100 సంవత్సరాల వరకు కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆదర్శాలన్నీ వారు చూపించినటువంటి ఈ మార్గం అంతాపుష్పవనం అయిపోతుంది. ఖచ్చితం దీంట్లో సందేహం లేదు. చేయవలసింది ఏమిటి? మన కర్తవ్యం అంటే మన తండ్రి తన జీవిత కాలంలో చాలా కష్టపడి గొప్ప సంపద ఆస్తి మనకు ఇచ్చి వెళ్తాడు. మనం ఏం చేయాలి? ఆ ఆస్తిని నిలబెట్టుకోవాలి. అవును స్వామి మనకి ఇవ్వాళ ఇచ్చిన ఆస్తి ఏమిటి అంటే ఆధ్యాత్మిక సంపద. ఉన్నత విలువలతో కూడినటువంటి ఒక మానవతా ప్రభతో వెలిగేటువంటి ఒక జీవితం. అంతే కాదు నీ కోసం మాత్రమే కాదు నువ్వు పరుల కోసం కూడా జీవించాలి. నిజానికి పరుల కోసం జీవించే జీవితమే జీవితం. నీ కోసం జీవించేది పశుపక్షాదులు కూడా ఉంటాయి. అవును సర్ అది స్వామి కూడా చేసి చూపించారు. అది కూడా చూపించారు. కాబట్టి తన సర్వస్వాన్ని తన జీవితాన్ని open book అంటాం చూడండి తెరిచిన పుస్తకం. అవును ఆ తెరిచిన పుస్తకంలో ఏ line చూడండి, ఏ అక్షరం చూడండి అక్షరానికి అక్షరానికి మధ్య ఉన్నటువంటి space చూడండి అంతా ప్రేమమయం. అంతా దివ్యమైనటువంటి ఒక భావన. ఎక్కడా ఒక మానవ సంఘం నీతి తప్పనటువంటి దివ్య రీతిలో స్వామి దాన్ని ఆవిష్కరించారు. మరి స్వామి అనుయాయులుగా స్వామి భక్తులుగా స్వామితో కూడి ఒక అవతారమూర్తితో కూడి జీవించిన వాళ్ళంగా మనది మన బాధ్యత ఇవాళ కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆదర్శాలను మనం ముందుకు మనం ఆచరిస్తూ తీసుకు వెళ్ళాలి. మన life ఇవాళ సమాజం మనల్ని ఒక ప్రత్యేక దృష్టితో చూస్తుంది. స్వామి ఉన్నప్పుడు వీళ్ళు బాగున్నారు మంచి పిల్లలు మంచి భక్తులు వీళ్ళు స్వామి వాళ్ళ దేహంలో లేరు కదా ఎలా ఉంటారో చూద్దాం అని వాళ్ళ మనసులో ప్రశ్న ఉంటుంది. ప్రశ్న మొలకెత్తని రీతిలో మన జీవితాన్ని మనం గడపాలి. ఇంతకంటే ముందు ఇంతకు ముందు ఎట్లాగైతే మనం ఆ స్వామి ఉన్నారు స్వామికి నివేదించుకుందాం, ఏదో తప్పు చేస్తే స్వామి దగ్గరికి వెళ్లి చెప్పుకుందాం అని కాక అసలు తప్పే చేయనటువంటి స్థితిలో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఇవాళ స్వామి మనలో ఉన్నారు. మనలో స్వామిని పెట్టుకొని మనం స్వామి వలె జీవించాలి. అప్పుడే మన జీవితాలు స్వామి సందేశానికి అవి ప్రతీకలుగా మారుతాయి అని నా ఖచ్చితమైన అభిప్రాయం. ఇది వింటూ ఉంటే నాలో కూడా ఒక ఒక thought బయలుదేరుతుంది. స్వామి ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు ఉమ్ మీరు ఒక పాట తీసుకోండి నేను ఎన్నో పాటలు రాశాను ఉమ్ మీరు కొన్ని పాడి నాకు వినిపిస్తే అని ఆయన అడుగుతున్నారు అంటే direct గా చెప్పటం లేదు నా జీవితం మీ సందేశం కావాలి అని. ఉమ్ నా సందేశం మీ జీవితాలు అని ఆయన direct గా చెప్పటంలేదు కానీ ఆయన ఏది చేసినా అన్నీ ఆచరించి చూపించారు. ఉమ్ ఇందాక చెప్పినట్టు చివరి క్షణాల్లో hospital లో కూడా అవును ఆయన బాధ అని కానీ ఏదని కానీ చెప్పలేదు. ఎందుకంటే దేహ భ్రాంతి వీడడమే ఈ లక్ష్యం అన్నట్టుగా ఆయన తీసుకున్న బాధలన్నీ ఆయన wheel chair లో రావడం కానీ ఆ కాళ్ళు విరగటం కానీ ఏదైనా కూడా స్వామి తలుచుకుంటే ఆపలేనిది ఏదీ లేదు. cancer కూడా cancel చేశారు. కానీ ఆ బాధలన్నీ పడి అప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారు స్వామి. అదే ఆయన ఇచ్చిన సందేశం. దేహ భ్రాంతిని వీడి ఆయన ఆత్మ స్థాయికి చేరుకోవడానికి ముందరే పునాది వేస్తూ వచ్చారనేది అవును అవగతం అవుతోంది సర్. అది స్వామి స్థాయిలో అది ఒక గొప్ప యోగం అది. దానిని కేవల కుంభక యోగం అని మనం అంటాం. అది దాని విచారణ పక్కన పెట్టినట్లయితే స్వామికి సర్వమూ సమర్పించుకొని శరణాగతి పొంది వినయంగా ఉండేటువంటి సాయి భక్తుడు కూడా స్వామి తన దేహానికి ఏర్పడ్డ అన్ని అననుకూలాలని ఎంత ఎడంగా, పెడగా, దూరంగా తనది కానట్లే ఎలా ఉండగలిగారో మనం కూడా అలా ఉండగలగాలి. మనకు ముందు ప్రాణభయం పోవాలి. మనం పోతామేమో అనే భయం పోవాలి. ఎందుకంటే అవతారమూర్తే తన శరీరాన్ని చాలిస్తారు మనమెంత? మనం కూడా ఒకరోజు ఈ శరీరం వదలాలి. ఉమ్ కానీ ఆ వదిలేలోగా మనం మన గురువు సద్గురువు జగద్గురువు పరమాత్మ అయిన స్వామి ఆదేశించిన ప్రకారం జీవించామా లేదా? అవును దేహము పాంచభౌతికమని స్వామి చెప్తే చాలా బాగా చెప్పారని appreciate చేయటం ఆనందపడటం కాదు. మనం మనకు అన్వయించుకోవాలి. ఆ అన్వయించుకున్నప్పుడు అటువంటి సన్నివేశం ఏర్పడినప్పుడు స్వామి భావాలకు అనుగుణంగా మనం respond అయ్యే స్థాయికి మనం వెళ్ళాలి. అవును అది చాలా ప్రధానం. శూన్యత నుండి పూర్ణత వైపు. భగవాన్ బాబా వారి మహాప్రస్థానం నేపథ్యంలో భక్తుల కర్తవ్యం. శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో సంభాషణ మీరు విన్నారు. స్వామివారు రాసిన పద్యరత్నాలు కొన్నింటితో సమకూర్చిన సుమనోహర మాలిక. శ్రీమతి శ్రీ సాయి ప్రసన్న గారి నేటి ప్రసంగం. ఇందులో స్వామి వారి నిరుపమానమైన దివ్య ప్రేమను హృద్యంగా వివరించడం జరిగింది. విని ఆనందించండి. యం బ్రహ్మ వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైహి వేదైః సాంగపదక్రమోపనిషదైహి గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యశ్శాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఎవరినైతే బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత్తులు దివ్య స్తుతులతో స్తుతిస్తున్నారో, ఎవరినైతే సామగానం చేసే విద్వాంసులు వేదవేదాంగ ఉపనిషత్ మంత్రాలతో కీర్తిస్తున్నారో, ఎవరినైతే యోగులు ధ్యాన స్థితిలో మనోనేత్రంతో దర్శిస్తున్నారో, ఎవరి యొక్క అంతాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరో ఆ అనంతునికి నమస్కారం. అనంతుడైన సర్వదేవతాತీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికి ప్రణామ సహస్రం. ఎవరయ్యా పుట్టపర్తిలో సురలు మోహింపంగా దివ్యాగమోత్సవముల్ సేయుచు భక్తవర్యులకు ఉత్సాహంబుగా మానసోద్భవ లింగంబులు తీసి ఇత్తురట సంభావింప ఆదిత్యుడా? శివుడా? మాధవుడా?సరోజభవుడా! శేషాచలాధీసుడా! అని పండితవర్యులంతా విస్తుపోతూ ఉంటే వారికి సమాధానమా అన్నట్లుగా తన నిజతత్వాన్ని వెల్లడి చేస్తూ "ఏను దైవంబు తద్భిన్నమేమి కాను ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను వ్యధలు క్లేశాలు నను స్పృశింప గలేవు సచ్చిదానందడును సత్యసాయి విభుడ" అని భగవాన్ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత తీయగా తన అవతార రహస్యాన్ని ప్రకటించారు. ఆ అఖండ పరబ్రహ్మం నిరాకార నిర్గుణ నిత్య శుద్ధ ముక్త నిర్మల సచ్చిదానంద తత్వం మానవ తత్వ పరివర్తన కోసం నరాకారం దాల్చి మనతో ఆడి, పాడి, నవ్వులు రూవి, నడయాడి, మాట్లాడి, లాలించి, పాలించి, కోపించి అంతలోనే బుజ్జగించి అన్నిటినీ మించి చెప్పలేనంత ప్రేమను పంచిన సాయిమాత విశ్వ చైతన్యంలో పరివ్యాప్తమై అణువణువునా నిండి అలరారుతోంది. ఇన్నాళ్ళు ప్రత్యక్షానుభూతిని పంచి ఎప్పటికప్పుడు దేహంపై మోహం వీడండి అంటూ మనల్ని హెచ్చరించి మానసికంగా సంసిద్ధుల్ని చేసి మన స్థాయిని, మనోస్థాయిని పెంచేందుకు ఇకపై పరోక్షానుభూతి పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. "ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే" అంటోంది. ఈశావాస్య బృహదారణ్యక ఉపనిషత్తు లోని శాంతి మంత్రం. అది అంటే ఆ పరబ్రహ్మం పూర్ణమే ఇది అంటే ఈ దృశ్య కల్పిత జగత్తు కూడా పూర్ణమే. మొదటి పూర్ణం నుండి రెండో పూర్ణం ఉదయిస్తుంది లేదా వ్యక్తమవుతుంది. ఒక పూర్ణానికి మరో పూర్ణం కలిపినా లేదా తీసివేసినా మిగిలేది అనంతమే. పరబ్రహ్మ తత్వమైన సాయి పూర్ణం. ఆ పూర్ణ ప్రేమ నుండి వెలువడిన ఈ జగత్తు పూర్ణమే. నిరాకార పరబ్రహ్మ తత్వం సాకారం దాల్చి సత్యసాయిగా సాక్షాత్కరించిన ఆ పూర్ణత్వానికి ఏం భంగం వాటిల్లలేదు. అదేవిధంగా ఇప్పుడు తిరిగి నిరాకారంగా విశ్వవ్యాప్తమైన జగత్తు ఇప్పటికీ పూర్ణంగానే మిగిలిపోయింది. విశ్వమందు విభుడు వెలుగొందు చుండును విభుని యందు విశ్వము వెలుగుచుండు విశ్వవిభుల మైత్రి విడదీయరానిది సత్య రతనాల మూట ఈ సాయి మాట. విశ్వజనీనమైన ప్రేమతత్వం, సహృద్భావనామయమైన సేవాతత్వం, భగవంతునితో మైత్రి, అంతర్భావాలైన విలువల ఆచరణాత్మక జీవనశైలి, ఆంతరంగిక ప్రయాణం, ఐక్యత, పవిత్రత, తద్వారా దివ్యత్వ నిరూపణ, వ్యక్తి వికాసంతోని సాంఘిక ప్రకాశం వంటి అత్యంత అరుదైన అపురూప భావ బీజాలు నాటిన సత్యసాయి భగవానుని తత్వం అనంతత్వం అది నిర్వచనానికి అందనిది పదకోశం పట్టుకోలేనిది కలాన్ని కదిలించలేనిది సాయి తత్వం. సాయి తత్వం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా బాబా చూపిన అడుగుజాడల్ని అనుసరించి చేరవలెను గమ్యము శీఘ్రగతిని. ఒకసారి భగవాన్ ని ఒక భక్తుడు ప్రశ్నించాడట భగవంతుడు మానవ రూపంలోనే ఎందుకు రావాలి అని? దానికి స్వామి సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా, ఆప్తంగా, నిర్ద్వందంగా అందించారు. సృష్టిలో పశు, పక్షి, మృగాదులన్నీ తమ ధర్మాన్ని తాము సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. ఒక్క మనిషి మాత్రమే తన స్వధర్మాన్ని మరిచిపోయి వర్తించి ప్రకృతిలో అసమతుల్యానికి కారణమవుతున్నాడు. వాటన్నిటికీ ఒక reason season ఉన్నాది. ఎటువంటి క్రమశిక్షణ లేనిది ఒక్క మానవుడికే కాబట్టి దైవం మానుష రూపేణ అవతరిస్తాడు అన్నారు. పాపభీతి లేని పామరత్వము బట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి, మానవత్వం అణిగే మానవులందున ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి కలదు? సత్యసాయి భగవానుని లీలలు, మహిమలు మొదలైనవన్నీ దివ్యత్వానికి నిదర్శనాలే. స్వాభావికమైనవే, భగవత్ తత్వానికి అభివ్యక్తి. సాయి అవతార లక్ష్యం ఈ లీలా విభూతులతో తనవైపు ఆకర్షించుకోవడం కాదు. మానవుల్లో అంతర్లీనంగా ఉన్న దివ్యత్వాన్ని తనకి తానుగా తెలుసుకోగలిగేలా మానవజాతిని తీర్చిదిద్దడమే భగవాన్ ప్రధాన లక్ష్యం. అదే మానవ స్వధర్మం. స్వధర్మాన్ని విస్మరించిన మానవుణ్ణి తిరిగి తన గమ్యాన్ని ఎరుకపరచి, చేయుతనిచ్చి, మార్గదర్శకత్వాన్ని చేసే బృహత్ కార్యాన్ని వహించేందుకే అవతరణ జరిగింది. ఆదిశంకరుల వారు ఏక శ్లోకంలో గురు శిష్య సంభాషణ రూపంలో ఉపనిషత్ సారాన్ని చెప్పారు. కిం జ్యోతిస్తవ భానుమానహమి నే రాత్రౌ ప్రదీపాదికమ్ | స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుః | తస్య నిమీలనాది సమయే కిం ధియో ధియోర్దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిః తదస్మి ప్రభో || నీకు దీపం ఏది అని మొదలుపెట్టిగురువుగారు అడిగిన ప్రశ్న పరంపరను చేధించి చివరకు ఆ వెలుగును నేనే, ఆ పరంజ్యోతిని నేనే అని ఎరుక కలుగజేసుకుంటాడు శిష్యుడు. ఇంతటి భావ గాఢత, విషయ క్లిష్టత కలిగిన బృహదాంశాన్ని తనదైన సులభ శైలిలో సరళ భాషలో నేను వెలుగులో ఉన్నాను, నేనే వెలుగు, వెలుగు నాలోన ఉన్నది, వెలుగు నేనే అన్న భావము హృదయాన హత్తుకున్న అట్టి జ్ఞానియే బ్రహ్మలో ఐక్యమగును. మానవ జీవితానికి దిశానిర్దేశం చేశారు భగవాన్ బాబా. శ్రీరాముడికి ఎందరు భక్తులు ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది హనుమంతుడే. ఎందుకంటే రామావతార పరిసమాప్తి తర్వాత కూడా రామ తత్వాన్ని జీర్ణించుకున్న వాడు కావడం చేత నిత్యం రామనామ స్మరణతో తనను తాను పావనం చేసుకొని చిరంజీవత్వాన్ని పొందాడు. అలాగే శబరి భౌతికంగా రామదర్శనం చేసుకోకపోయినా రామతత్వ మాధుర్యాన్ని ఫలాలు గా మలచి రాముడి రాక కోసం వేచి చూసింది. కృష్ణ భక్తులు ఎందరు ఉన్నా కృష్ణ నామంతో విడదీయరాని అనుబంధం కలిగిన వారు గోపికలు. కృష్ణుడు చిన్ననాటనే బృందావనం వీడినా అంతవరకు అనుభవించిన లీలావిభూతుల్ని, కృష్ణ తత్వాన్ని అనుభూతులుగా మలుచుకున్న యోగినులు గోపికలు. కృష్ణ నిర్యాణ వార్త వింటూనే ప్రాణాలు వదిలిన కుంతి కన్నా, కృష్ణుడు ఇక లేడని మహాప్రస్థానానికి బయలుదేరిన పాండవుల కన్నా గోపికలే కృష్ణ భక్తులుగా ప్రసిద్ధులయ్యారు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే "నువ్వు భక్తుడివి" అని హనుమని, "వీళ్ళు అసలైన భక్తులంటే" అని గోపికల్ని గుర్తించాడు కాబట్టి. స్వామి ఒకసారి తమ దివ్యోపన్యాసం లో మీరు ఏదైనా ఉత్తరం పోస్ట్ చేస్తే దాని acknowledgement వచ్చాకనే కదా అది అందింది అని నిర్ధారించుకుంటారు. అదేవిధంగా భగవంతుడు మీ భక్తిని మెచ్చి "నువ్వు నా భక్తుడివి అయ్యా" అని గుర్తించాలి. అంతేకాని ఎవరికి వాళ్ళు "మేం సాయి భక్తులం, మేం సాయి భక్తులం" అనుకోవడం సరికాదు అన్నారు. కాబట్టి అసలైన పరీక్షాకాలం ఇప్పుడు ఆసన్నమైనది. ఇంతవరకు పెట్టినవి కేవలం slip test లు మాత్రమే. ఇది అసలైన పరీక్షా సమయం. భౌతిక రూపం కనుమరుగయ్యాక భగవంతుడు అందించిన మార్గంలో మన పయనం ఎంత సాఫీగా, ఎంత సరళంగా నల్లేరు మీద బండి నడకలా సాగిస్తామో తేల్చి చెప్పే పరీక్షా కాలం. మామూలు పరీక్ష కాదు, EAMCET పరీక్ష. M for మానవ సేవ. మానవ సేవలో తరించేందుకు స్వామి పెట్టిన common entrance test. భగవంతుని బృహత్ ప్రణాళిక ఎప్పుడూ చాలా విస్తృతంగానూ, దూరదృష్టితోనూ, బృహత్కరంగానూ ఉంటూనే ఉంటుంది. 1976వ సంవత్సరంలో స్వామి ఎంపిక చేసిన విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని తీసుకుని ఊటీ వెళ్లడం జరిగింది. అక్కడ తమ ఉపన్యాసం లో భాగంగా కేవలం ఒక హస్త చాలనంతో గోళాకారంలో ఉన్న ఒక వెండి వస్తువును సృజించి అందరికీ చూపించారు. ఆ వెండి వస్తువు మీద కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో వజ్రాలు, మంచి కాంతులు మిరుమిట్లు గొలిపే రాళ్లను పొదిగి ఉండడం చూశారంతాను. "దీని భావం ఏమిటి స్వామి?" అంటే, "ఈ ఉపాధి మరొక నలభై ఆరు సంవత్సరాలు ఉంటుంది. తదనంతరం ఎక్కడెక్కడైతే ఏ ఏ ప్రదేశాల్లో ఈ వజ్రాలు పొదగబడి ఉన్నాయో ఆ ప్రదేశాల్లో సత్యసాయి విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు నెలకొల్పబడతాయి. అవన్నీ కూడా మానవ అభ్యుదయానికి, సాంఘిక నైతిక పరివర్తనకి దోహదం చేసేవిగా ఉంటాయి. ఆయా సంస్థల్లో ఎవరెవరు తమ కార్యక్రమాన్ని నిర్వహించాలో దీనిమీద వంద శ్లోకాల్లో సంస్కృతంలో వివరించబడి ఉంది" అని స్వామి వివరించారు. "స్వామి, ఆ వంద శ్లోకాల్లో ఏమేం రాసి ఉందో మీరు వివరించండి స్వామి" అంటే, "భవిష్యత్తు నేను చెప్పకూడదు బంగారు. తినబోతు రుచి ఎందుకు? రాబోయే కాలంలో మీరే చూస్తారుగా." ఆనాటి రామకృష్ణుడికి ఒక్కడే వివేకానందుడు. కానీ ఈ రామకృష్ణుడికి కొన్ని వేల వివేకానందులు. ఈ ఉపాధి తదనంతరం వీరంతా కూడా కార్యరంగంలోకి దూకి నా సందేశాన్ని వ్యాప్తి చేస్తారు అని స్వామి తన అవతార కార్యక్రమాన్ని, ఆ రహస్యాన్ని అక్కడున్న ఆ అదృష్టవంతులకు వెల్లడించారు. కాబట్టి స్వామి ఏనాడో తన అవతార లక్ష్యాన్ని, అవతార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు మనందరం జాగరూకులమై అప్రమత్తతో వ్యవహరించి స్వామి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలి. ఒకసారి ఒక భక్తుడు స్వామిని, "స్వామి, మీరు భక్తులందరినీ చెయ్యి పట్టి నడిపించాలని ఎందుకు అనుకుంటారు? కేవలం మార్గం చూపించి వదిలేయొచ్చును కదా?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా "నిజమే, కానీ దురదృష్టవశాత్తు భక్తులందరూ గుడ్డివారు" అన్నారు. అవును, గమ్యం ఎదురుగా ఉన్నా గుర్తించని వారిని ఆ పేరుతో పిలవడమే అన్ని విధాలా సమంజసం. స్వామి చెప్పిన సమాధానం పైకి జవాబుగా కనిపించినా దాని ఆంతర్యం స్వామి ఇచ్చిన భరోసా, చేసిన ప్రమాణం.శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును మిమ్ము ఎప్పుడు కరుణాకరుడై చేపట్టి మిమ్ము బ్రోవును ఏ పట్టున విడువకుండా ఏలును మిమ్మున్ సర్వదా సర్వ కాలేషు సర్వత్రా నిండిన స్వామిని నిండు మనసుతో ప్రార్థించి మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో సాయి ప్రతినిధులుగా సమాజ సేవలో పాలుపంచుకొని తద్వారా వ్యక్తి పరిణామాన్ని సాధించి లో దృష్టిని అలవరచుకుందాం అదే సాయి సందేశం SAI see always inside. అంబోధిహి స్థలతాం స్థలం జలథితాం ధూళీ లవః శైలతాం మేరుః మృత్కణతాం తృణం కులిశతాం వజ్రో తృణప్రాయతాం వహ్నిః శీతలతాం హిమం దహనతాం ఆయాతి యస్యేచ్ఛయా లీలాదుర్లలితాద్భుతవ్యసనినే దేవాయ తస్మై నమః ఎవరి ఇచ్ఛ మాత్రంగానే సముద్రం భూమిలా భూమి సముద్రంగా మారుతుందో దుమ్ముకణం పర్వతంగా మేరు పర్వతం మట్టి రేణువంత అయిపోగలదో గడ్డిపరక వజ్రాయుధంలా వజ్రాయుధం గడ్డిపోచలా అయిపోగలదో అగ్ని చల్లగా మంచు అగ్నిగా మారగలదో ఆ భగవంతుడికి నమస్కారం సర్వ శక్తిమంతుడైన ఘటనా ఘటన సమర్ధుడైన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికి అనేకానేక నమస్కారాలు సాయిరాం [సంగీతం] స్వామి నిరుపమానమైన దివ్య ప్రేమను వివరించే శ్రీమతి సాయి ప్రసన్న గారి ప్రసంగం మీరు విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు కార్యక్రమం సమాప్తం. శ్రోతలు మా తెలుగు కార్యక్రమాలను ప్రతి సోమ, బుధవారాలు రాత్రి ఏడున్నర నుండి ఎనిమిదిన్నర వరకు వినవచ్చు. అంతేగాక ఈ ప్రసారాలు మా website www.radiosai.org లో కూడా అందుబాటులో ఉంటాయి. [సంగీతం]
SSSMC · audio
Telugu Broadcast - 560
Telugu Broadcast - 560
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 57:32
More in this series
Telugu Broadcasts
- 57 min 394
Telugu Broadcast - 394
- 1 hr 396
Telugu Broadcast - 396
- 58 min 402
Telugu Broadcast - 402
- 58 min 420
Telugu Broadcast - 420
- 56 min 424
Telugu Broadcast - 424
- 57 min 427
Telugu Broadcast - 427
- 57 min 490
Telugu Broadcast - 490
- 56 min 491
Telugu Broadcast - 491
- 56 min 498
Telugu Broadcast - 498
- 58 min 555
Telugu Broadcast - 555
- 57 min 560
Telugu Broadcast - 560
Now playing - 58 min 561
Telugu Broadcast - 561