No transcript for this section.
[ఇంట్రో మ్యూజిక్] రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా 2001 సంవత్సరం దసరా పండుగలలో ఇరవై అక్టోబర్ నాడు స్వామివారు ఇచ్చిన దివ్యోపన్యాసం వింటారు. తరువాత పంచముఖ ఆంజనేయస్వామి గురించి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ఉపన్యాసం వింటారు. శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరు గత నలభై ఏడు సంవత్సరాలుగా స్వామికి భక్తులు. అంతేకాక తమ ప్రసంగాల ద్వారా స్వామి తత్వాన్ని రాష్ట్రమంతటా అందిస్తున్నారు. ఇప్పుడు 2001వ సంవత్సరం దసరా పండుగలలో ఇరవై అక్టోబర్ నాడు స్వామివారు ఇచ్చిన దివ్యోపన్యాసం వింటారు. [మ్యూజిక్] మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలకే చెవికి చేత్రు ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట ప్రేమ స్వరూపులారా! యువతులు యువకులు ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు. నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం. ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏ మాత్రము అర్థం కావటం లేదు. మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవడం చేతనే చిన్న వయసు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు. యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరియైన అర్ధాన్ని అందించలేకపోతున్నది. నైతికమన్నటువంటిది సామాన్యమైనటువంటి పదం కాదు. చాలా విలువైనటువంటిది. చాలా ఫలితమైనటువంటిది. చాలా గొప్పది. ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమునే మనము కాపాడుకోలేకుంటేన మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు? మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే. ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఈ నైతికమనేటువంటిదిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు. ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది. సంస్కృత పదము నందు నైతికమనేటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది. ఇంగ్లీష్ పదము నందు దీనికి Morality అని చెప్తూ వచ్చింది. Morality అనగా ఏమిటి? పూర్వము జీసస్ క్రైస్ట్ రోమన్ దేశం లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకొని ఈ యొక్క రాజ్యమునకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు. Morality అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థం. ఇంగ్లీష్ నందు Personality అన్నారు. కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు, శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చుచున్నది అనేటువంటి ఉద్దేశంతో Persona అని పేరు పెట్టారు. Persona అనగా ప్రతి మానవుని యందు కూడను దైవత్వం అనేటువంటిది అంతర్భూతంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. దీనినే తెలుగు నందు నీతి అన్నారు. అనగా మనకు అర్థం కాకుండా అగమ్యమైనటువంటి గీతయో, గోప్యంగా ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి యందు కూడను ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. నీతిలేని జాతిభూతి కంటే పాడు అన్నారు. నీతి చాలా విలువైనటువంటిది. దీనినే English లోపల చెప్పారు కదా personality అని. దీన్ని Roman language లోపల persona అన్నారు. అనగా ప్రతి వ్యక్తి యందు కూడను గోప్యంగా, గుప్తంగా హృదయ స్థాయి యందుండి సర్వులకును సమక్షం చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క persona అన్నారు. కనుక ఈనాటి మానవుడు తన యందు గుప్తంగా, గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్య శక్తిని తాను వ్యక్తం గావించాలి. ఆ విధముగా వ్యక్తం గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు. వ్యక్తి అనగా కూడను ఇదే అర్థం. అవ్యక్తమైనటువంటి శక్తిని వ్యక్తీకరింపజేసే మానవునకే వ్యక్తి అని పేరు. కానీ అట్టి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుణ్ణి వ్యక్తి అని పిలచటం కూడను సరి అయినటువంటి పదం కాదు. ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధములైనటువంటి రహస్యములను హృదయము నందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక, దైవత్వాన్ని దర్శించుకోలేక, మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు. రెండు వందల యాభై సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది. క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పూర్వంగా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు. రెండు వందల ఇరవై సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు. అగ్రబను కూడను అక్బరు కూడను చక్రవర్తిగా వచ్చాడు. వీరందరు కూడను ముహమ్మదులు అయినప్పటికిని కానీ తమ యందు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునకు కూడను అర్థం అయ్యేటట్టుగాన వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. కనుక ఈనాటి మానవుడు తన యందు ఉన్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి. ఈనాటి మానవులకు వ్యక్తి అంటే ఏమిటో కూడను అర్థం కాకుండా ఉంటున్నది. తన వ్యక్తిత్వాన్ని మరచాలి. దివ్యత్వాన్ని స్మరించాలి. పవిత్రమైన భావం పెంచుకోవాలి. అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఆస్తికత్వం అనగా ఏమిటి? ఆధ్యాత్మికం అనగా ఏమిటి? అనగా ఆధ్యాత్మికం అనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింప చేయటమే ఆధ్యాత్మికము. కానీ ఈనాటి మానవుడు చదువులు అధికం అయికొనది తన యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధి పరచి కేవలము ప్రచార ప్రబోధములో ప్రయాణం అవుతున్నారు. మానవత్వమే అర్థం కాకుండా పోతుండారు. కనుకనే పదిహేడు సంవత్సరము నుంచి కూడను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఏమిటి ఈ human value? ఏమిటి ఈ మనిషి యొక్క విలువ? మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికీ సాధ్యం కాదు. సత్యం అని కొందరు, ధర్మం అని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు. నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి? పశుత్వాన్ని పూర్తిగా మరచి దివ్యత్వాన్నే చింతించి మానవత్వాన్ని ప్రకటింప చేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి. కనుక ఈనాడు మానవుడు అనగా చాలా మంచివాడు అని అర్థం. అన్ని ఉపనిషత్తులకును మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు. మంచి మనసు కలవాడే మానవుడు. కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది. కనుక మంచి మనసు కలవాడే మానవుడు. మంచి మనసు అనగా ఏమిటి? పది మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవింపజేసి ఆత్మతత్వాన్ని ప్రకటించి అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము. ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు? మంచి మనసు అనేటువంటిది కనిపించటం లేదు. కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు. man అనగా ఏమిటి? M A N man అన్నారు. M అనగా మాయను మరచిపోవాలి. A ఆత్మను దర్శించాలి. N నిర్వాణం పొందాలి. మాయను మరచి ఆత్మను దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి. ఈనాడు ప్రతి మానవుడు కూడను మాయలో మునిగి ఉంటున్నాడు. ఆత్మతత్వమే మరిచి ఉంటున్నాడు. నిర్వాణం ఇంక ఎక్కడినుండి ప్రాప్తిస్తుంది. కనుక మొట్టమొదట మాయను మరచాలి. మాయను వదలాలి. మాయ అనగా ఏమిటి? లేనిదాన్ని ఉందని భావించుకోవటమే మాయ. లేనిదాన్ని చింతించి ఉన్నదాన్ని మరిచిపోయి చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు. కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. కనుక నవరాత్రులు అనగా ఏమిటి?తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రులు లోపల కూడను దివ్యత్వమైనటువంటి ఆత్మ తత్వాన్ని మహాదుర్గ, మహాకాళి, మహా సరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికొక నియమం నియమించారు. దుర్గ అనగా ఏమిటి? దుర్గ అనగా సర్వశక్తులతో కూడినటువంటిది సమస్త మనో శక్తులు, బుద్ధి శక్తులు, ఆత్మ శక్తులు మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గ అంటారు. ఇంకా మహా కాళి అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి. అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు. మానవుని యందే ఇది కనిపిస్తూనే ఉంటున్నది. మనసు నుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే, ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక, ఇంద్రియములను అనుసరించడం చేత, దురభ్యాసముల చేత, దుర్మార్గములకు లోబడి దుష్ట శక్తిగా రూపొందుతూ వచ్చింది. కనుక ఈ దుష్ట శక్తిని దెనుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మ తత్వాన్ని దర్శింప చేసేకే ఈ యొక్క దుర్గ అనేటటువంటి యొక్క తత్త్వమును ప్రబోధిస్తూ వచ్చారు. ఈ తొమ్మిది దినములు కూడను అనేక రకమైనటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దెనుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క పది దినముల యొక్క సమ సాధ్య లక్షణం. ఈనాడు మనం చదివేదంతా కూడను దుర్గుణాలే, వినేదంతా దుర్గుణాలే, చేసేదంతా దుర్గుణములే ఇంకా మంచితనం ఎక్కడ నుంచి వస్తుంది. మంచితనం మానవుని యందే కనిపించటం లేదు. ఏదో నేను మంచిగా నడుస్తున్నాను అని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది. ఆ భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడను బ్రహ్మ శూన్యం కనిపించదు. కనుక ప్రతి మానవుని యందు కూడను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి. ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది. ఎక్కడ నుంచినో పోయి ఒక కాపరు, పిత్తాళి, వెండి ఇలాంటివి ఇంత గనుల నుంచి తీయటం కాదు. ప్రతి మానవుని యందు కూడను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది. ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని. ఈ మైన్ నుంచి కూడను మనం అనేక రకమైనటువంటి యొక్క పవిత్రతను మనం ఆవిర్భవింప చేసుకోవాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవ్వడు చేపట్టడం లేదు. పెద్దలను దర్శించినప్పటికినీ అక్కడి నుంచి వచ్చేటువంటి జవాబులు మనకు ఏ మాత్రము సరి అయినటువంటివి కావు. కానీ తనకే తృప్తి లేనప్పుడు పరులకేం బోధించగలడు. కనుక మొట్ట మొదటి జీసస్సు రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతా కూడను గుర్తించటము ఒక పర్సోనా దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు. కనుక అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. దానినే దివ్య శక్తి అన్నారు, చైతన్యము అంటూ చెప్తూ వచ్చారు. ఈ చైతన్య శక్తి సర్వత్రా ఉన్నటువంటిది. చైతన్య శక్తి లేని స్థానమే కనిపించదు. కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉండినట్టుగా భావించటం లేదు. మంచి చెడ్డలెంత నిప్పుడనూ దివ్యత్వ యొక్క ప్రభావములే. అన్నిటియందు దివ్యత్వం ఉన్నది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఈనాడు మానవుడు తలం తానే అని మర్చిపోతున్నాడు. లోకంలో జరిగేటువంటి అన్నిటిని కూడను ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో. మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు. అనేక జన్మల యొక్క రహస్యములు, అనేక జన్మల యొక్క కర్మలు అన్నీ దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి. కనుక మనస్సు అనేటువంటిది అనేక కల్తలతో కూడినటువంటిది, అనేక కల్లోలములతో కూడినటువంటిది, అనేక కలహములతో కూడినటువంటిది, అనేక కాంక్షలతో కూడినటువంటిది. ఈ కాంక్షల చేతనే మానవత్వమును కేవలము మరిచిపోతున్నాడు. మానవత్వాన్ని మరిచినటువంటి వాడు మానవుడే కాదు. కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి. మానవుని మరిచిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి? నీ చర్మానమున ఉంచుకోవాల్సింది ఏమిటి? మనసును పవిత్రముగా విన్చుకోవటమే ప్రధానమైన సాధన. మంచి మనసు కలిగినటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి. అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటాది. కనుకనే మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా, ఎంత ప్రేమ చేతనో, ఎంత దయ చేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏ మాత్రం కూడను వినటం లేదు. మనసు లేకుండా కేవలము మాయా మనస్కులైపోయి కొన్ని ప్రబోధన చేస్తుంటే ఆ దుర్గుణములనంతా కూడను చాలా సులభంగా వింటుంటారు. ఇవి వినడానికి కాదు చెవులు ఇచ్చిందేది. ప్రొద్దుపోక ఊరి వారి సుద్దులంటే మీరు సిద్ధమవుదురే ఇక్కడ శ్రద్ధతోడా. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పి వేళ వద్దికలనుండలేరా ఓ చెవులా. ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు. చెడ్డ మాటలకు ఇంకా నాలుగు చెవులు పెట్టుకుని వింటారు. ఇది కేవలము ఒక చెడ్డ కాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి. దీనినే వినాశకానే విపరీత బుద్ధి అన్నారు. కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే. ఏది మంచి మాటలు? పరులకు అపకారం కలగని, పరులకు దుఃఖం అందించని, పరులకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని, దివ్యత్వాన్ని అందించి, దైవత్వాన్ని ప్రబోధించి, దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట. కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క సప్ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము నందు దీనిని సరి అయినటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి. వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని దీనికి పేరు. వేద పురుష, పురుష అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము. పురుషుడు అనగా కేవలం ప్యాంటు షర్టు వేసుకుని ఉండేటువంటి వాడు కాదు. ఇది పురుష డ్రెస్ గా ఉంటుంటాది. కానీ నిజమైనటువంటి పురుషుడు అనేటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే. దీనినే పౌరుషత్వము అని చెప్పి అని కూడను హిందీలో చెప్తూ వచ్చారు. కనుక దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని...ఈ బయట భావాలంత కూడాను ప్రాకృతమైనటువంటివని తలంచి, ఇదంతా కేవలం negatives మాత్రమే. నిజమైన positive అనేటువంటిది తన యందే ఉంటున్నది. ఈ positive ఎవరు ఇచ్చినా గాని పోయేటువంటిది కాదు. ఏమి చేసినా గాని కదిలేటువంటిది కాదు. కదలక, మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము. ప్రేమ స్వరూపులారా, ఈనాటి విద్యార్థులు నైతిక విద్యలని ఏ మాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. నైతికం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ morality లేకుండేటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు. ఈ morality ని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు. ఈ morality ని పెంచుకోకుండా ఎన్ని పెంచుకొని ప్రయోజనమేమిటి? గొప్ప ధనములు సంపాదించాము, గొప్ప భవనములు కట్టాము, గొప్ప ఉద్యోగములు చేశాము. కానీ ఎన్ని చేసి ప్రయోజనమేమిటి? morality లేకపోతే అవన్నీ కూడాను వ్యర్థమే. కనుకనే అదియే నిజాయితీ, అదియే నీతి. అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి. ప్రతి మానవుని యందు ఉంటున్నది. కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు. చూసినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయములు మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు. చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపుగా ఉంటుంటాయి. కనుక మొట్టಮೊదటి మనము హృదయం నుంచి ఆవిర్భావం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి. భగవంతుణ్ణి ఏ విధంగా కూడదు మనం తం-అందుకోవడానికి వీలు కాదు. ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు. పదవులకు దక్కేటువంటి వాడు కాదు. అధికారమునకు చిక్కేటువంటి వాడు కాదు. కానీ సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు. దానినే నీతి, నిజాయితీ అన్నారు. ఈ రెండిటికి మాత్రమే తాను చిక్కగలడు, దక్కగలడు కానీ మరొక దేనికి ఏ మాత్రం కూడదు భగవంతుడు చిక్కడు, దక్కడు. కనుక ఈనాటి యువకులంతా, యువతలంతా కూడను తమ యొక్క దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి. కనుకనే ఇదియే మొట్టమొదటి మూడు మాటలతో చెప్పాను. దైవ ప్రీతి కలగాలి. దైవ ప్రీతి కలిగినప్పుడే పాపభీతి ఏర్పడుతుంది. ఈ పాపభీతి ఏర్పడినప్పుడే morality లో మనకు గౌరవం ఏర్పడుతుంది. ఈ morality మనకు రావటానికి ఈ విధమైనటువంటి పాపభీతి కావాలి. ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు. పాప ప్రీతి, దైవ ద్వేషం ఈ రెండిటిని పెంచుకుంటున్నారు. ఇది పాపం కాదు. పాపభీతి ఇది. పాపం కాదు. మహా ఘోరమైనటువంటి పాపము. కనుకనే మనము సంపాదించుకోవాల్సినటువంటి పాపభీతి కావాలి. అందరి యందు నిజమైనటువంటి ప్రేమను ప్రకటించాలి. ఈ ప్రేమ తన యందు ఉన్నటువంటి ప్రేమనే సర్వులి యందు ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు. ప్రేమ ఒక్కటే. కానీ ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. ప్రేమ లేని జీవితము ప్రాణము లేని శ్వా-శ్వాసమే. కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ప్రేమనే లేకుండినా మనకు ప్రాణమే ఉండదు. ప్రేమ ముదితమగు నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఈనాడు లోకములో ధనమును ఏరీతిగా సంపాదిస్తున్నారు? ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో ధనాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకొని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదేవిధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడను నీతి, నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి. ప్రవహించేటువంటి నదులకు ఆనకట్టలు కట్టి పంటలు ఏవిధంగా పండించుకుంటామో అదేవిధంగానే మానవత్వం ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తుంటున్నది. దానికి ఆ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని control చేసి అదియే దీనికి ఆనకట్ట. ఆ నించినటువంటి ప్రేమతత్వాన్ని సమాజం యొక్క సంక్షేమానికి ఉపయోగించుకోవాలి. కనుకనే ఈనాటి యువకులు సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి యందుంచుకోవాలి. సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటాది. కనుకనే సమాజం యొక్క క్షేమాన్నే నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి? విద్యార్థులారా, ఈనాటి ప్రథమ దినం కనుకనే మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడను కొంచెం simple గా ఈనాడు చెప్పుతూ వచ్చాను. ముఖ్యంగా మనము జీవితంలో సాధించవలసినటువంటిది morality. mind అనేటువంటి దాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. మనసు చాలా పవిత్రమైనటువంటిది. కానీ దానికి అనేక విధములైనటువంటి దుర్గుణాలను అంతా కూడను చేరుస్తున్నాం. దానిని సరియైన రీతిలో ప్ర-పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రముగా విన్చాలి. తెలిసో, తెలియకనో ఎన్నో పాపములు చేస్తుంటారు. కానీ తెలుసుకున్న తర్వాత దాని పరిహారార్థమై పశ్చాత్తాప పడాలి. ప్రేమ స్వరూపులారా, మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది. నిజంగా మీరు చాలా ధన్యులు. ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ఒకరినొకరు చూచి తడ మార్గం పట్టి కొంతవరకును దీన్ని అపవిత్రంగా విన్చుకుంటున్నారు. కనుక మనం సంఘం కూడను సరియైన సంఘంగా పెట్టుకోవాలి. "Tell me your company, I shall tell you what you are" అని. నీవు ఎలాంటి company తో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడను ఆ company తో చేరి ఉంటాయి. కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడను మానవుని యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంటాయి. ఈ ప్రవర్తనలన్నీ కూడను సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది. ఈ సంకల్పములన్నీ కూడను మానవుని యొక్క desires పైన ఆధారపడి ఉంటుంటాయి. ఈ desires అంతా కూడను మరి యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటాయి. కనుకనే సంఘం యొక్క ప్రవర్తనలు సరియైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి. అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి. ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గమునకు మా-సరియైనటువంటి రాజబాట. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు morality. నీతి అనేటువంటి దాన్ని మనము చక్కగా మనము గుర్తించి వర్తించాలి. ఈ నీతి లేకుండా గినిపోతే మానవత్వం ఏ మాత్రము పనికిరాదు. కనుకనే నీతిని మనంలక్ష్యంలో పెట్టుకోవాలి. ఆ నీతి ఒకటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును. రేపటి దినము అమరత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదియే నిజమైనటువంటి మానవత్వము. కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు, భ్రాంతులు, భ్రమలు. ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుంది. కనుక ఈ desires ను చాలా వరకు తగ్గించుకోవాలి. Less luggage more comfort. ఈ యొక్క luggage ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం. ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ తించుకునేటువంటివి కావు. పుట్టినప్పుడు మనం ఏమి తెచ్చాము? పుట్టినప్పుడు ఏమి తెచ్చాము? చచ్చినప్పుడు ఏమి తీసుకుని పోతున్నాం? తెచ్చింది లేదు, తీసుకుని పోయేది లేదు. అన్నీ ఎక్కడ అక్కడ వదిలిపోవుతుంది. ఎక్కడ అక్కడ వదిలిపోవుతుంది. కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి. తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు. అన్నీ passing clouds మాదిరి కదిలిపోతున్నాయి. దేహం మార్పు చెందింది. మనసు మార్పు చెందుతూనే ఉన్నది. కనుక మార్పు చెందేటువంటివి నీవు కాదు. మార్పు చెందనటువంటివాడే నీవు. కనుక దేహం పుట్టినప్పుడు child అన్నారు, పది సంవత్సరాలకు boy అన్నారు, thirty years కి man అన్నారు, seventy five years కి grandfather అన్నారు. పేర్లు మారే కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహంతో కలిగేటువంటి మార్పులు. ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలే. కానీ ఇందులో ఉండేటువంటి ఒక నివృత్తి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా ఒక్కటిగానే ఉంటుంది. అది మారున్నది కాదు. కనుకనే ఆత్మతత్త్వమే నిజమైనటువంటి తత్వం. కనుక ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము. ప్రతి మానవుడు కూడ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి. తనను తాను నమ్మాలి. తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు. అనేక గ్రంథాలు చదువుతున్నారు. కానీ చదివి ఏమి ప్రయోజనము? చదువు, చదువు, చదివి చావంగానేటికి చావులేని చదువు చదవాలి. మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. మనం ఎప్పుడూ help, help, help, help చేయాలి. హస్తములంతా కూడ help యే చేయాలి. కంఠమంతా సత్యాన్నే పలకాలి. చెవులంతా మంచిని వినాలి. హృదయమంతా మంచిని అనుభవించాలి. తదేయం హృదయం యస్య భాషితం, తస్య భూషితం. ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరుచుకోవాలి. కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగున పడిపోయింది. ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రతి ప్రపంచం యొక్క సంభోగమే చేస్తున్నాం. ఇవంతా ఏనాటికైనా గానీ కదిలిపోయేటువంటివి. నీవు వదిలినా కూడ అది నిన్ను వదలదు. కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటాది. కనుక ఇలాంటి చింతలంతా మనం మానాలి. అన్ని చింతల కంటే కూడ గొప్ప చింత దైవచింతన చేయాలి. ఆ చింతన చేతనే సర్వ చింతలు నీవి పరిహారం అవుతాయి. పుట్టుట ఒక చింత, భూమినిండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంటే చింత, వార్ధక్యం ఒక చింత, తంతసం ఒక చింత, వింత చిం--సర్వ చింతల బాపడి సర్వేశ్వర స్తవరణ. చేయుడి ఇప్పుడైనా మీరన్ని చింతలారా. ఇప్పుడైనా మీరు దీన్ని చేసి దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి. మీరే దైవ స్వరూపులు. మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు. ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైనటువంటి సాధన చేస్తున్నారు. తనకంటే ప్రత్యేకమైనటువంటి God లేడని, తానే దైవము, తానే సర్వము ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు. కనుక I am God, I am God, I am God దీన్నే స్మరించండి. ఎప్పుడూ ఆనందంగా ఉంటుండండి. ఎందుకు మీరు విచారం చేస్తుంటారు? ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు. ఏదో అమ్మానాన్నకు ఒళ్ళు సరిలేదంటే విచారం చేస్తారు. ఎందుకు ఈ విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా? తప్పిపోతున్నాయా? తప్పిపోవు. జరగవలసినవి జరుగుతాయి, చేయవలసినవి చేస్తారు. కనుక ఈ చింతలు ఏ మాత్రం కూడ చేయకూడదు. ఎప్పుడూ ఆనందంగా ఉంటుండాలి. ఆ happy గా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది. ఈ happy అనేది ఎక్కడినుంచి వస్తుంది? అది దైవం నుంచే ప్రాప్తిస్తుంది. Happiness is union with God. ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది. దైవాన్ని వేరు చేసి నీవు ఆనందాన్ని అనుభవించాలంటే అది అసాధ్యము. కనుకనే ప్రేమ స్వరూపులారా కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి. మంచి విషయాలు తలంచండి. పవిత్రమైన మార్గాన్ని వెతకండి. ఈ తుచ్ఛమైన, అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి. [భారతీయ సంగీతం] ఇప్పటివరకు స్వామి Divya ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు పంచముఖ ఆంజనేయస్వామి గురించి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ఉపన్యాసం వింటారు. [భారతీయ సంగీతం] ఓం శ్రీ సాయిరాం. ఈరోజు భగవద్భక్తుడు, దాసుడు, అనుజుడు, పూర్ణుడు అయినటువంటి అద్వైతమూర్తి హనుమంతుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. "కృతం హనుమతా కార్య సమవిద్విహు దుష్కరం మనసాప్యదన్యేన న శక్యం ధరణీతలే" అంటాడు Valmiki రామాయణంలో. అంటే నిజానికి రామకథ పూర్ణమై రామపట్టాభిషేకమైనటువంటి మహా సంమంగళ వేళ రాముడు శాలంకృతుడై ఉన్నాడు. అంతఃపురం అంతా కూడా, సభాభవనం అంతా కూడా ఒక గొప్ప వేడుకగా ఉంది మన పుట్టపర్తి లాగా. అందరి కళ్ళు రామస్వామి మీద ఉన్నాయి. కానీ రామస్వామి మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నారు. ఇంతమంది పురోహితులు, హితులు, సన్నిహితులు, పురప్రముఖులు, అంతఃపుర స్త్రీలు, వానర సమూహం వీళ్లంతా కూడా రాముడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తూ పరవశించి పోతున్న వేళ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి నేత్రాలు దేనిని వెతుకుతున్నాయి అని అందరి యందు కలిగిన ఒక ప్రశ్న. సమాధానంగా కాసేపు అయిన తర్వాత రామచంద్రుడు సింహాసనం దిగిసభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే రెండు సింహాసనాల వెనక పద్మాసనంలో ధ్యాన ముద్రాంకితమై ఉన్నాడు. కనుల వెంట అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. ఆ అశ్రుధారలతో ఆనంద ప్రవేశం చెంది ఉన్నాడు చూసేవాడికి సమాధి స్థితిలో ఉన్నాడు. "నేను వచ్చాను" అన్నాడు రాముడు. ఎక్కడా జవాబు లేదు. మళ్ళీ "ఇదిగో నేను వచ్చాను చూడు" అన్నాడు. జవాబు లేదు. ఆ క్షణం నెమ్మదిగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేసి హనుమంతుడు కళ్ళు తెరవలేకపోయినాడు. "కన్ను తెరువు నీకోసం నేను వచ్చాను" అంటున్నాడు రామచంద్రుడు. తెరవలేనంటున్నాడు హనుమ. "నీ దివ్య నామస్మరణంతో అజపమైనటువంటి మహా ధ్యానంతో నా కళ్ళ నిండా ఆనందాశ్రువులు నిండిపోయినాయి. ఇంత ఆనందంతో కూడిన భాష్పాలు తెప్పించిన తండ్రి నీవే కన్నీరు తప్పిస్తే తప్ప రెప్ప ఎత్తలేను" అన్నాడు. "లే లే" అన్నారు రామచంద్రుడు. చూశాడు దివ్య మంగళ విగ్రహాన్ని. మహా ప్రవేశం చెందాడు. దేనిని ధ్యానించాడో, దేనిని నిజంగా స్మరించాడో, దేనిని ఒక తపస్స్వాధ్యాయంగా మార్చుకున్నాడో అటువంటిదే సాకారమై ఆ ప్రభువు తన దగ్గరకు వచ్చినటువంటి వేళ. రాముడు నవ్వుతూ ఒక మాటన్నాడు. "అంతఃపురం అంతా అయోధ్య అంతా పండగ చేసుకుంటున్నదే. నీకివేమీ పట్టలేదా? కన్ను తెరిచి చూసినట్లయితే ఎంత అందంగా ఉన్నదో చూశావా?" అన్నాడు. "వాటితో నాకేమి పని స్వామి? నాకు నీతో పని. నీ దివ్య మంగళ విగ్రహం కంటే, నీ సత్య సౌందర్యం కంటే మరొక సౌందర్యమైన వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నదా?" అంటూ హనుమ లేచాడు. ఆ లేవటానికి శ్రీరామచంద్రుడు తన చిటికెన వేలు అందించాడు. ఈ శ్రీరామచంద్రుడి యొక్క చిటికెన వేలు రామావతారం మొత్తంలో రెండు చోట్ల మాత్రమే జరిగింది. ఒకటి సీతా స్వయంవర వేళ, కళ్యాణ వేళ. తర్వాత హనుమంతుడికి చిటికెన వేలు అందించాడు. హనుమంతుడు అని మనకు తెలుస్తున్నది గాని సభలో ఉన్నవారు ఎవరికీ హనుమ ఇంకా పరిచయం కాలే. నెమ్మదిగా చిటికెన వేలు పట్టుకొని అందించి హనుమను సింహాసనం దాకా నడిపించాడు రామచంద్రుడు. సభ పరికించి చూస్తున్నది. మహా నిశ్శబ్దంగా ఉన్నది. అప్పుడు ఇందాక మనం అనుకున్న శ్లోకం చెప్పాడు రాముడు. అంటే శ్లోకంలో శ్లోకం ద్వారా తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించాడు రాముడు. అన్నాడు. "ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామి కార్యక్రమాన్ని స్వామి యొక్క ఆజ్ఞని పాటించటంలో మరొకడు ఉన్నాడా? ఒకవేళ ఉన్నా వాడికి ఇట్లా చేయాలన్న మనస్సు ఉంటుందా అంటే ఈ ప్రపంచంలో మాత్రం మా హనుమ కంటే మరొకడు లేడు." అని రెండవ సారి ఆలింగనం అనుగ్రహించారు. మొదటిసారి ఎప్పుడయ్యా అంటే సీతాన్వేషణలో అమ్మవారిని దర్శనం చేసి రాముడి దగ్గరకు వచ్చి ఉన్నది ఉన్నట్లుగా దృశ్య సాక్షాత్కార భాజకంగా అంటే కన్నులకు కట్టినట్టుగా అమ్మవారి యొక్క స్థితిని చెప్పినప్పుడు రాముడు ఆనంద ప్రవేశుడైపోయినాడు. దుఃఖం నుంచి బయట పడ్డాడు. అప్పుడు ఆలింగనం ఇచ్చాడు సముద్ర తీరంలో. మళ్ళీ సభా మధ్యంలో రెండవ సారి ఆలింగనం ఇచ్చాడు. ఈ రెండు కౌగిలింతలు పరమాత్మ నుంచి స్వయంగా అనుభవించినటువంటి భాగవతోత్తముడు, భక్తుడు ఎవరు అంటే ఇదిగో మన హనుమ. నిజానికి మహా మండలేశ్వరి అయినటువంటి అమ్మవారు దేవీ భాగవతంలో మాటన్నది. త్రేతాయుగంలో ఎనిమిది మంది మంత్రులతో కూడి నేను శ్రీరాముడై వెళతాను. ఆ శ్రీరాముడి యొక్క శక్తి, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు మూడు అవి నేనే. ఆ ఎనిమిది మందిలో ఒకడు పరమ ఉత్కృష్టమైనటువంటి మంత్రి ఉంటాడు. ఆ మంత్రి హనుమ అన్నది. మరి హనుమ మన పురాణ ప్రకారంగా చూసినట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వింటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి అంటే పౌరాణికమైనటువంటి విశేషణలతో ఒక్కొక్క దిక్కును చూస్తున్నప్పుడు ఆయనకు ఒక్కొక్క పేరు ఇవ్వబడింది. కానీ స్వామి అంటే మన స్వామి. ఈ పంచ ముఖాలకి ఇచ్చిన వ్యాఖ్యానం చాలా వినూత్నమైనది, విశిష్టమైనది, అర్థవంతమైనది, సత్యార్థమైనది. ఏమున్నాయి అంటే ఆంజనేయస్వామికి ఐదు ముఖాలు లేవు బంగారు. ఆయనలో ఉన్నటువంటి వీరత్వమే ఐదు పాయలుగా ప్రస్ఫుటించింది ఆయన జీవిత కాలంలో. అందులో దయావీరం, దానవీరం, విద్యావీరం, ధర్మవీరం, రణవీరమని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ధర్మవీరం. ఈ ధర్మవీరం ఎట్లా ఉన్నదయ్యా అంటే పూలతో కూడినటువంటి ఒక దారానికి వాసన ఎట్లా ఏర్పడుతుందో సుగ్రీవుడి దగ్గర కర్మవశాత్తు కొంతకాలం మంత్రిగా ఉన్నా స్వామిగా ఆయనను భావించిన శ్రీరామచంద్ర ప్రప్రథమ దర్శనంతో భార్యలను పోగొట్టుకున్నటువంటి ఇద్దరు పురుషులు ఒకరు లోకానికి చెందినవారు ఒకరు లోకాతీతమైన పురుషోత్తముడు. ఈ రెండు దుఃఖాలు వాళ్ళది ఏకం కనుక వీళ్ళ మధ్య స్నేహం బాగుండాలి అనుకున్నాడు. కనుక రామచంద్రుడికి ఒక ఆప్త వాక్యాన్ని, ఆత్మీయ వాక్యాన్ని మధురమైనటువంటి వచో వినాణంతో సంభాషణా చాతుర్యంతో రాముడి యొక్క హృదయాన్ని మొదటి కలయికలోనే మొదటి స్పర్శలోనే అనుభవించాడు పొందాడు హనుమ. లక్ష్మణుడు ఎంత వారించినా రాముడు అన్నాడు, "లక్ష్మణా!"హనుమంతుడి మాటల వెనుక ఉన్నటువంటి నిజాయితీను గమనించటం లేదా? భక్తి గమనించటం లేదా? శరణాగతి గమనించటం లేదా? ఒక అనంతమైనటువంటి సత్య పారమ్యాన్ని గమనించటం లేదా? కనుక ఇతనిని నేను గ్రహిస్తున్నాను అన్నాడు. ఎలా గ్రహించాడు? ఆత్మ యొక్క ఒక ప్రతిధ్వనిగా గ్రహించాడు. అయితే హనుమ చూడండి, ధర్మవీరంలో శ్రీరామచంద్ర ప్రభువు పరిచయం అయ్యే దాకా తన యొక్క శక్తి యుక్తులు అన్నింటినీ కూడా తను, మన అంటామే ఈ రెండింటినీ కూడా సుగ్రీవుడి కోసము మాత్రమే వెచ్చించాడు. అయితే తాను భావించినటువంటి సుగ్రీవుణ్ణి కాపాడగలిగినటువంటి శక్తి ఉన్నా మరొక బలవత్తరమైన శ్రీరామచంద్రుడు రాగానే సుగ్రీవుడితో ఒక మాటన్నాడు. "ఈ క్షణం నుంచి ఈ రామచంద్ర ప్రభువు నీకూ నాకూ స్వామి" అన్నాడు. అది. ప్రపంచంలో ఒక గురువు దొరికి, అసలు గురువులకే గురువు గనక దొరికినట్లయితే [గొంతు సవరించిన శబ్దం] సాధకుడు ఈ గురువుని ఆ గురు గురోర్గురువు దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఇది ధర్మవీరం. అంతే కాదు, ఏ రాముడి కార్యక్రమంలో తన మనస్సును నిమగ్నం చేశాడో, ఏ రామాజ్ఞని ఒక అదృష్టంగా, యోగంగా భావించాడో, ఏ రకమైన అపేక్ష లేకుండా ఒకే ఒక్క భావనతో నా చర్యల వలన, నా చూపు వలన, నా కదలిక వలన, నా మెదలిక వలన నా స్వామి అయినటువంటి రాముడికి ఎంత ఆనందం కలుగుతుంది అది ఒక్కటే పెట్టుకున్నాడు ఆయన. కనుకనే శ్రీరామచంద్రుడి యొక్క కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా, శ్రీరాముడి యొక్క ఆజ్ఞని దాటటానికి వీలులేని ఆజ్ఞగా, శ్రీరామచంద్రునికి మించిన పరదైవం మరొకటి లేదన్న భావనతో ధర్మవీరాన్ని ప్రతిపాదించాడు. ఇది ఒక ముఖం. ఇక రెండవ ముఖం ఆయనది విద్యావీరం. ఆయన గురువు ఎవరో తెలుసునా? సూర్యుడు సాక్షాత్. ఆ సూర్యుడు ఈయనకి బోధ చేశాడు. అందుకనే విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో "వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురు ఉత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించెదన్" అన్నాడు. ఈ జగదక్షుడు ఎవడయ్యా అంటే సూర్యుడు. ఈ ఒక కన్ను పగలుగా ఒక కన్ను రాత్రిగా అంటే సూర్యచంద్ర నాడీ మండలాలుగా జగత్తుని వెలుగుమయం చేస్తున్నవే ఆ వెలుగుకు మూలం ఎక్కడ ఉన్నదని అన్నట్లయితే గురువైన సూర్యుడు అయినట్లయితే దానికి మూలం ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువే అని నమ్మినటువంటి విద్యావీరం. అందుకనే జ్ఞానగుణ సాగర అన్నారు ఆయన్ని. జ్ఞాన సాగరుడు, గుణ సాగరుడు. విజ్ఞానం ఉండి అనేక శాస్త్రాలన్నీ పుక్కిట బట్టి శీలం లేకపోతే వాడు ఈ ప్రపంచానికి బరువు. జ్ఞానము ఉండి, వినయము ఉండి, సద్గుణాలు ఉండి, సత్వగుణ ప్రధానమై ఉన్నటువంటి వ్యక్తి గనుక ఒక ఉత్తమ వ్యక్తి గనుక ఉన్నట్లయితే వాడు ఈ ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేయగలడు. కనుక ఆంజనేయస్వామి సకల శాస్త్ర పండితుడు ఆయన. రణ పండితుడు, వ్యాకరణ పండితుడు అన్నాడు రాముడు. రణ పండితుడు అంటే యుద్ధం చేశాడా చేయలేదా కాదు. యుద్ధం చేస్తున్న వేళ ఈ రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా ఏ రకమైన అపాయము కలగకుండా మనస్సుని కేంద్రీకరించి యుద్ధనీతిలో రాముడు ఎట్లా వెళితే రాముడు చక్కగా ఉంటాడో, లక్ష్మణస్వామి ఏ మార్గాన వెళితే ఆయన భద్రంగా ఉంటాడో అన్ని వేళలా తన కనుగుడ్డుకి, తన కనురెప్ప ఎట్లా ఉన్నదో తాను నమ్మిన స్వామికి, స్వామి యొక్క అనుజుడికి బంటై నిలబడ్డాడు ఆయన. కనుక మనకున్నటువంటి విద్యలన్నీ కూడా స్వామి అంటారే "The end of education is character". ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని వేదాలు చదువు స్వామి చెప్తారు "బ్రహ్మవిద్య గురించి ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు ప్రపంచంలో తక్కువే లేరు కానీ ఆచరించేవాడు కంటికి ఒక్కడు కానరాడే" అన్నారు స్వామి. బ్రహ్మవిద్య చెప్పటం వేరు, బ్రహ్మవిద్యని అనుభూతిమయం చేసుకోవటం వేరు, అదే బ్రహ్మవిద్యని విభూతిమయంగా జీవించటం వేరు. అట్లా జీవించినటువంటి వాడు హనుమ. ఇది రెండవ ముఖం. ఇక మూడవ ముఖం దయావీరం. దయావీరం ఇది కరుణావీరం అనొచ్చు కదా అంటే కరుణ అనేటువంటిది కేవలం పరతత్వానికి చెందిన భావన. దయా, జాలి, సానుభూతి మానవ జీవ సంస్కారానికి సంబంధించింది గనుక ఆంజనేయస్వామి కూడా వానర రూపంలో వచ్చాడు గనుక ఈ దయావీరం ఎట్లా ఉన్నది అంటే [గొంతు సవరించిన శబ్దం] సీతమ్మవారిని దర్శనం చేసినప్పుడు ఆమెకు ఆనందం కలిగించాలి. ఆమెకు ఏమి ఆనందం కలిగిస్తుంది? రాముడు వస్తాడు, రావణుడిని చంపుతాడు, నిన్ను అయోధ్యకు తీసుకెళతాడు, మనందరం కలిసి వెళతాం, అదిగో రాముడు ఇట్లా ఉన్నాడు, నీకోసం ఇంత వియోగంలో ఉన్నాడు అని ఒక ఆత్మీయుడుగా ఒక ఆప్తుడుగా చెప్పగలిగినటువంటి ఆ దయావీరాన్ని ప్రకటన చేశాడు. అందుకనే లవకుశులను జన్మ ఇవ్వటానికి ముందే అమ్మవారు హనుమాన్ చాలీసాలో రఘువర అన్నది ఎవరిని అంటే రాముడిని కాదు ఆంజనేయస్వామిని. రఘువర అంటే రఘువంశంలో ఆమెలో కలిగినటువంటి ఒక మాతృభావన. ఆ మాతృత్వాన్ని ఒక్కసారి తాకినటువంటి వాడు హనుమ. ఆమె అనుకున్నది ఉంటే ఇటువంటి హనుమ వంటి ఒక కొడుకు ఉంటే చాలు కదా అన్న భావన అంత శోకంలోనూ ఆమెకు కలిగించినటువంటి వాడు ఆంజనేయస్వామి గనుక అది దయావీరంగా ఉన్నది. అలాగే లంక నుంచి విభీషణుడు వచ్చినప్పుడు అందరూ ఆయన్ని శంకించారు. రాముడు తప్ప. రాముడు ఇంకా నిర్ణయం చేయలేదు. విభీషణుడు అంటున్నాడు నన్ను నమ్మండి అంటున్నాడు. నువ్వు లంక నుంచి వచ్చావు పైగా నువ్వు రావణుడి యొక్క తమ్ముడివి గనుక నిన్ను నమ్మము అంటున్నారు వీళ్ళు. విభీషణుడి గురించి నూటికి నూరుపాళ్ళు పక్కన నిలబడి సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి వాడు విభీషణుడు. రాజస గుణ ప్రధానమైనటువంటి వాడు రావణుడు.తమోగుణ ప్రధానమైనటువంటి వాడు కుంభకర్ణుడు. కనుక సత్వగుణ ప్రధానంతో ఉన్నటువంటి విభీషణుడు రామచంద్రుడి దాకా రాగలిగాడు. ముగ్గురూ రాగలిగారా? కుంభకర్ణుడు రాగలిగాడా? ఈ రాముడిని వెతుక్కుంటూ వచ్చాడే, శరణాగతి పొంది వచ్చాడే, "రామచంద్రుడి యొక్క వాక్యం ధర్మ పరిపాలన గనుక ఎవరు అధర్మంలో ఇంతకాలం జీవించినా ధర్మాన్ని ఎరిగినటువంటి వేళ ఆచరించటానికి సంసిద్ధులవుతారో వారు నా వారు" అన్నాడు రాముడు. ఆ అన్నప్పుడు విభీషణుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆంజనేయస్వామి దయావీరం చేత, పరిపూర్ణమైనటువంటి ఆ సానుభూతి చేత, జాలి చేత రాముడి దగ్గరకు తీసుకుని వెళ్లి "విభీషణుడు మన వాడే" అన్నప్పుడు రాముడు కూడా కరుణాసముద్రుడు కదా ఒక మాట అన్నాడు. "నేనే కావాలి, నన్నే శరణు వేడుతున్నాను" అన్నప్పుడు "నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను విభీషణుడిని నాతోనే ఉండని" అంటూ "కాదు మనతోనే ఉండని". ఇక విద్యావీరం ఉన్నది. విద్యావీరం చెప్పుకున్నాం జ్ఞాన గుణసాగరుడు. రణవీరం ఉన్నది. రణవీరం అనేకమైనటువంటి బలాలు ఆయనకు ఏర్పడి ఉన్నాయి. లంకాదహనం చాలా ప్రధానమైనటువంటిది. లంకాదహనం చేయమని రాముడు ఏం చెప్పలే. "అమ్మవారు ఎలా ఉందో చూసిరా" అన్నాడంతే ఆజ్ఞ. కానీ సమయజ్ఞుడు అయినవాడు, కాలం ఎరిగిన వాడు, సమయాన్ని పరమాత్మ స్వరూపంగా భావించిన వాడు వెళ్లిన కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని ఒక స్పష్టమైన నిర్ణయానికి రాగలిగినటువంటి నిర్ణాయక శక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ముందు పరిసరాలు చూస్తాడు. ఏమైంది లంక నగరంలో? లంకా ప్రవేశం చేశాడు అంతఃపురం లోకి వెళితే ఒక స్త్రీమూర్తి శాలంకృతయై సర్వాభరణాలతో కూడి ఉన్నటువంటి ఒక జగదేక సుందరి పడుకొని ఉందో మంచం మీద. ఆంజనేయస్వామి ఒక జీవ లక్షణం చేత ఈమె సీత అని భ్రమించాడు. అయితే చూడండి జ్ఞానగుణ సాగరుడులో జ్ఞానసాగరుడు గనుక ముందు ఈ స్త్రీమూర్తిని ఇలా నేను చూడకూడదు అని గుణసాగరత్వాన్ని విచక్షణా వివేకం అనేటువంటి జ్ఞానం చేత అటు శ్రీరామచంద్రుడిని వదిలిపెట్టిన అమ్మవారు శాలంకృతయై పరపురుషుడు ఇంట శయ్యా గృహంలో ఒక పట్టు మంచం మీద ఏ రకమైనటువంటి దుఃఖం లేకుండా వివశ్యై పడుకొని ఉంటుందా? ఈ కారణం వల్ల ఇవి అమ్మవారు కావటానికి వీలు లేదు అని నిర్ణయించాడు. అంతేకాదు జగదేక సౌందర్యం కనిపిస్తున్న ఈ మండోదరిది బాహ్య సౌందర్యమే. అమ్మ యొక్క సౌందర్యము ఆమె జగజ్జనుని గనుక ఆత్మ సౌందర్యం కాబట్టి ఆమె స్వరూపం ఇట్లా ఉండటానికి వీలు లేదు అనుకున్నాడు. అది విచక్షణా పూర్ణమైనటువంటి ఒకానొక స్థితి. అలాగే అమ్మవారికి చెప్పాడు. ఆ ఆనందాన్ని కూడా మనందరం అనుభవించాలి అని చెప్తూ ఆ రణవీరులలో మొట్టమొదట ఆయన సీతమ్మవారిని ఆ చెట్టు పై కొమ్మ నుంచి చూసినప్పుడు దభేలుని కింద పడ్డాడు. పడగానే ఆమె, లంకానగరంలో వానరుడు ప్రవేశించటం అది మొట్టమొదటి సన్నివేశం. కనుక లంకానగర ప్రజలు ఎవరికీ మనుషులు తెలుసు, రాక్షసులు తెలుసు కానీ వానర రూపంలో ఉన్న వాళ్ళు తెలియరు. అందునా చిన్న కోతిగా కనిపించాడు ఆయన. భయపడింది ఆమె. భయపడి, కలవరపడి వీడు మరొక రాక్షసుడేమో అనుకుంది. అప్పుడు శరీరాన్ని అమితంగా పెంచి తన యొక్క స్వస్వరూపాన్ని చూపించాడు. అంటే ఆయన దగ్గర అనిమాది సిద్ధులు అన్నీ కూడా కైవసం అయి ఉన్నాయి. సముద్రోల్లంఘన వేళ సముద్రంలో పైన వెళుతూ ఉన్నప్పుడు శరీరాన్ని కుంచించాడు. ఇక్కడ వ్యాకోచింపజేశాడు. అలాగే "కార్యాతురాణాం న సుఖం న నిద్ర" అన్నట్లుగా రామాజ్ఞ పాలించేటువంటి వేళ హనుమ ఏ రకమైన సుఖానికి నోచుకోలేదు, మనస్సుని దానివైపు తిప్పలేదు. మొట్టమొదట సింహిక, మైనాకుడు వీళ్ళందరూ కూడా అనేక ఆకర్షణావలయాలు. కాసేపు విశ్రాంతి తీసుకో అంటే విశ్రాంతికి తావు లేదన్నాడు. అలాగే లంకానగర ప్రవేశం చేసినప్పుడు లంకానగరానికి రక్షిణిగా ఉన్నటువంటి లంకిణి ఆయనను అడ్డుకున్నప్పుడు ఒక్కసారి ఒక ఆ ముష్టిఘాతంతో దెబ్బ కొట్టినప్పుడు ఆమెకి సహజమైనటువంటి రూపం వచ్చి శాపవిముక్తి కలిగినప్పుడు లంకిణి ఒక మాట చెప్పింది. "ఏ మహాత్ముడి యొక్క స్పర్శ చేత మళ్ళీ నా దేహం నేను పొందుతానో, నా స్వస్వరూపాన్ని నేను పొందుతానో ఆనాడే లంకానగరానికి ఆ వైభవం నెమ్మదిగా పతనమయ్యేటువంటి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కానీ నువ్వు వచ్చావు కదా, నీ వెనక రావలసిన వారంతా వస్తారు. ఈ రావణ రాజ్యం నశించిపోతుంది" అంటే తమస్సు అనేటువంటి అంధకారం చీలిపోయి పరిపూర్ణమైనటువంటి సత్వగుణమైనటువంటి ఒక సామ్రాజ్యం ఇక్కడ ఏర్పడుతుందని ఆమె చెప్పినప్పుడు లంకిణికి నమస్కరించాడు హనుమ. అంటే ఆమెలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఆమెలో ఉన్నటువంటి శక్తిని ఆయన గమనించుకున్నాడు. అంతేకాదు గాఢాలింగనం పొందినటువంటి ఈ హనుమ ఎంత పరవశం చెందాడంటే పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ సేవలు అడిగారు. ఎవరెవరి సేవ, ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగి తీసుకున్నారు లిస్టులో రాయించుకున్నారు అనుకోండి. హనుమంతుని మాత్రం అందరూ కావాలని పక్కన పెట్టారు. తమ తమకి కావాల్సిన సేవలన్నీ మిగిలిపోగా నిజానికి ఏం మిగలలేదు. హనుమ కూడా వెళ్లి నాకు ఈ సేవ ఇవ్వమని ఆయన్ని అడగలేదు. ఎవరు ఏ సేవ ఇస్తే అది చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సరే రాముడు గనుక ఆవలిస్తే ఆ ఆవలింతలు లెక్కబెట్టే పని అని ఈయన అనుకున్నాడు. ఈ కారణంగా నేను నా స్వామికి దగ్గరగా ఉండే అవకాశాన్ని వీళ్ళందరూ కలిసి నాకు ఇచ్చారు. రాముడు ఆవలిస్తున్నాడా లేదా గమనించాలి అంటే నేను ఆయన దగ్గరే ఉంటా ఒకటి. ఎప్పుడు ఆవలిస్తాడో అని నా మనసంతా రాముడి మీద తప్ప ప్రపంచం మీద ఉండదు రెండవది. కాబట్టి మీరందరూ కారణాలు ఏవైనా నాకు అనుగ్రహం ఇచ్చారు. ఈ అనుగ్రహం ఇచ్చినది, ఈ ప్రేరణ, స్ఫూర్ణ, సంకల్పము నా తండ్రి శ్రీరామచంద్రుడిదే కనుక ఈ సేవను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు.కనుక శ్రీరామచంద్రుడి యొక్క సాలోక్య, సామీప్య, సాన్నిధ్య మూడు స్థితులు పొందాడు. ఇక సాయుజ్యమా? చెప్పాడు ఆయన. "రామా! ఒకానొక సమయంలో గమనించినట్లయితే, నీవు దశరథ రాజనందనుడివి, రఘురాముడివి, ప్రజారాముడివి. నేను అంజనీసుతుడిని, ఆంజనేయుడిని. మానసిక స్థాయిలో విచారణ చేసినట్లయితే, నీవు నాకు యజమానివి, నీకు బంటును నేను. మూడవ స్థాయిలో విచారణ చేస్తే, నీవు పరమాత్మవి, నేను ఆత్మను. నీకూ నాకూ తేడా ఏం లేదు. సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సుషుమ్నా కిరణాలు చంద్రుని నుంచి ఎట్లా భిన్నం కావో, ఆత్మలన్నీ పరమాత్మ నుంచి భిన్నం కావు గనుక, రామా! నీవు నేను ఒక్కటే." ఒక ఆధ్యాత్మిక స్థితిలో. కనుక, ఈ స్వామి అంటారే, "You are me, I am you" అనేదానికి అర్థం ఇదే. నువ్వు నేను ఒక్కటే అంటే భౌతిక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో కాదు, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతి జీవుడు పరమాత్మ యొక్క తత్వాన్ని, అంశాన్ని పుణికిపుచ్చుకొని వచ్చాడు గనుక, ఈ ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు చేసేటువంటి ఈ ప్రాణాయామ ప్రక్రియ అంతా కూడా సముద్రోల్లంఘనమే. ఆయన కూడా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు చేస్తూ చేస్తూ వెళ్ళాడు. ఈ సముద్రోల్లంఘనం అంటే పైకి కనిపించే భౌతిక సముద్రం కాదది. సంసార సాగరాన్ని దాటటానికి ప్రాణాయామ ప్రక్రియని జపంగా, అజపంగా, తెలిసినా, తెలియకపోయినా, ఇరవై ఒక్క సార్లు-- ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ప్రతిరోజూ చేసినట్లయితే, ఈ సంసార పారావారాన్ని పరమాత్మ యందు లగ్నం చేసినటువంటి మనసుతో హనుమ ఎట్లా పరమాత్మ యొక్క ఆలింగనాన్ని, లోక పురుషుడు కానీ లోకోత్తరుడు అయినటువంటి, జగదీశ్వరుడు అయినటువంటి రామచంద్రుడి యొక్క ప్రశంసని ఎలా పొందాడో మనం కూడా శ్రీరామదాసుడిగా ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా స్వామి దాసులుగా, స్వామి అనుయాయులుగా, స్వామి భక్తులుగా, స్వామి యొక్క సమకాలీనులుగా మనం గనుక స్వామి చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధనలలో కొన్ని మనం తీసుకొని హనుమంతుడు ఎలా ఉన్నాడో మనం కూడా ఉండగలిగినట్లయితే, హనుమ వలె మనం కూడా చిరంజీవులమే. అందుకనే, ఏ విషయాన్నైనా విచారణ చేయాలంటే మూడు స్థాయిలు ఉన్నాయి కదా. మళ్ళీ రామాయణ కల్పవృక్షంలోనే ఆంజనేయస్వామి గురించి ఓ పద్యం ఉంది. "శైవంశంబని యందునా దశశిరస్సంత్రాస చండాకృతిన్, శ్రీ వాయుద్భవుడందునా అనిలు శాశించెన్ మహాయోగియై, పోవో కేసరి కోతి కూనాననా ముక్తేంద్రియ భ్రాతు, నన్నావేశించిన రామచంద్ర పదపద్మాధీన చేతస్కునిన్" చమత్కారంతో కూడిన హనుమ వర్ణన ఇది. ఈయనని రుద్రాంశ, రుద్రాంశ అంటున్నారే, ఎలా అనుకోనయ్యా? శివుడి అంశే గనుక నిజంగా అయి ఉన్నట్లయితే, తన నిజభక్తుడైనటువంటి రావణబ్రహ్మ తలలు పది నేల మీద పడటానికి ఈయన కారణం కాలేదా? లంక గుట్టంతా చెప్పాడే రాముడికి. ఈయన శైవాంశే ఎట్లా అయినాడు? భక్తుణ్ణి కాపాడాడా? సంహారం చేశాడే. అని ఒక చమత్కారం. పోనీ, మానసిక స్థాయిలో చూద్దామంటే, వాయుపుత్రుడు యొక్క కొడుకు అని అందామంటే, సముద్రోల్లంఘన వేళ ఈయన ఏం చేశాడు? తన తండ్రిని బంధించాడు. తండ్రి ఎవరు? వాయువు. వాయువు ఎక్కడున్నది? ఆయు. ఆయువు ఎక్కడున్నది? లోపల ఉన్నది. ఈ ప్రాణ చైతన్యాన్ని ప్రాణాయామం చేత నిరోధించిన ఈ హనుమ వాయుపుత్రుడు అని ఎలా అనగలం-అనగలం? తండ్రిని బంధించాడు కదా. అనిలు శాశించెన్ మహాయోగియై. పోనీ ఈ రెండూ కాదు. కేసరి కోతి కూనాననా, కేసరి వంశంలో పుట్టిన ఓ కోతి పిల్ల అందామంటే, ముక్తేంద్-ముక్తేంద్రియ భ్రాతు. ఇంద్రియాలను జయించాడు. అంతేకాదు, జయించబడిన ఇంద్రియాలతో ఇంతకాలం జీవించాడే. ఈయనని నేను ఎట్లా వర్ణించుకోగలను, అనుభవించగలను? అవన్నీ నాకేమి? ఇదిగో ఆయన కూడా, లేదా ఆయన వలె నేను కూడా శ్రీరామచంద్ర పదపద్మాధీన చేతస్కునిన్. నాకు ఆయనకు ఒక commonality ఉన్నది. ఆ సామీప్యం ఏమిటంటే, ఆయన ఎట్లా రామచంద్రుడి యొక్క దివ్య పాదాల యందు మనసును లగ్నం చేశాడో, నేను అంతే. నేనెట్లా లగ్నం చేశానో, ఆయన అంతే. అంటే, భక్తులలో కూడా వాడు పెద్ద, వీడు చిన్న అన్న రెండు మాటలు లేవు. భక్తుడు భక్తుడే, దాసుడు దాసుడే, పరమాత్మ పరమాత్మే. ఇవన్నీ కూడా జ్ఞానగుణ సాగరుడైనటువంటి హనుమ మనకి పరిపూర్ణంగా బోధ చేస్తాడు గనుక, ఈ హనుమ ఎక్కడ ఉన్నాడు అంటే శ్వాస రూపంలో మనలో ఉన్నాడు. అందుకనే, "మనిషికిన్ని మహిమలా, ఘనసిద్ధుల గరిమలా, ఎదలోపల దైవమున్న హనుమలా ఎదిగితే, నీ హృదయం నీ దేహం తిరిగే తిరుమలా" ఎక్కడ ఉన్నది ఓ తిరుపతి, ఒక పుట్టపర్తి, ఒక శిరుడి ఎక్కడున్నాయయ్యా అంటే, నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ కంటే నీవు అభిన్నంగా ఉండగలిగితే, పరమాత్మకి నీకు అద్వైత స్థాయి గనుక ఏర్పడినట్లయితే, నీ శరీరమే పుణ్యక్షేత్రం. దానిలోనే ఉన్న క్షేత్రంలో గనుక, హృదయం మీద గనుక నీవు శ్రీరామచంద్రుణ్ణి ఎట్లాగైతే హనుమ హృదయ స్థానంలో పెట్టుకొని సాకార స్వరూపంగా ఆత్మారాముడిగా ఈ జగత్తుకు చూపించగలిగాడో, మనం కూడా స్వామి భక్తులుగా హనుమని ఆదర్శప్రాయం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని, ఆ గుణాన్ని, ఆ రణవీరాన్ని, జీవితాన్ని స్వామి అంటారే, "Life is a challenge, meet it" అది, ఆ challengeని మనం ఎదుర్కోవాలి. Challengeని దాటకూడదు. అలాగే ఈ రణవీరం, విద్యావీరం, ధర్మవీరం అన్నింటికంటే కూడా స్వామి సత్య స్వరూపులు గనుక, ధర్మ స్వరూపులు గనుక, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఏ సాంఘిక, కౌటుంబిక, రాజకీయ, ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాన్ని ప్రబోధం చేశాడో దానినే సత్యసాయి రాముడు కూడా ఈరోజు చేశారు. అంతే. తేడా ఏం లేదు. ఆ రూపం వేరు, ఈ రూపం వేరు. ఆ పేరు వేరు, ఈ పేరు వేరు. ఆ ఉపాధి వేరు, ఈ ఉపాధి వేరు. కానీ ఉన్న చైతన్యం మాత్రం త్రేతలో ఉన్న రాముడు, ద్వాపరలో ఉన్న కృష్ణుడు, కలియుగంలో ఉన్నటువంటి భగవాన్ సత్యసాయి, ఈ మూడూ కూడా ఒక్కటేనన్న స్ఫురణలో హనుమంతుణ్ణి ఆదర్శంగా గనుక తీసుకొని జీవించగలిగినట్లయితే, రామకార్యంలో నిమగ్నమైనటువంటి హనుమ ఆదర్శం గనుక ఉన్నట్లయితే, భవిష్యత్ బ్రహ్మలం కాకపోయినా, రాబోతున్నటువంటి సర్వ బ్రహ్మీమయమైనటువంటి జగత్తులో మన ఆయువు నిలకడగా ఉంటుంది, నిశ్చితంగా ఉంటుంది, అన్నివేళలా ఆత్మ స్వరూపంగా ఉంటుంది. [outro jingle] ఇప్పటివరకు శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ఉపన్యాసం విన్నారు. ఇంతటితో ఈనాటి తెలుగు కార్యక్రమం సమాప్తం. ఓం శ్రీ సాయిరాం. [outro jingle]
SSSMC · audio
Telugu Broadcast - 491
Telugu Broadcast - 491
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 56:21
More in this series
Telugu Broadcasts
- 57 min 394
Telugu Broadcast - 394
- 1 hr 396
Telugu Broadcast - 396
- 58 min 402
Telugu Broadcast - 402
- 58 min 420
Telugu Broadcast - 420
- 56 min 424
Telugu Broadcast - 424
- 57 min 427
Telugu Broadcast - 427
- 57 min 490
Telugu Broadcast - 490
- 56 min 491
Telugu Broadcast - 491
Now playing - 56 min 498
Telugu Broadcast - 498
- 58 min 555
Telugu Broadcast - 555
- 57 min 560
Telugu Broadcast - 560
- 58 min 561
Telugu Broadcast - 561