No transcript for this section.
[ఉపోద్ఘాత సంగీతం] ఓం శ్రీ సాయిరాం! రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో స్వామి వారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు భక్తి యోగంపై అందిస్తున్న ప్రసంగాన్ని మీరు వింటారు. తదుపరి విశాఖపట్నంలో ఎంతో విజయవంతంగా చేపడుతున్నటువంటి సమగ్ర ఆరోగ్య కేంద్రం యొక్క వివరాలను గురించి మీరు వింటారు. చాలా కాలం పాటు సేవాదళ్ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ప్రస్తుతం ఈ సేవా కార్యక్రమంలో తమ సేవలనందిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారు ఈ వివరాలను మీకు అందిస్తారు. ఇప్పుడు మీరు స్వామి వారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు భక్తి యోగంపై అందిస్తున్న ప్రసంగాన్ని వింటారు. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రముఖ Oil Industry Consultant గా తమ సేవలను అందిస్తున్నారు. వారు తమకు వీలు దొరికినప్పుడల్లా కూడా స్వామి వారి అవతార వైభవాన్ని గురించి మరియు స్వామి యొక్క అవతారోద్యమాన్ని గురించి ప్రసంగిస్తూ ఉంటారు. అయితే శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగాన్ని విందామా? పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు యోగ భూమికలలో రెండవదైనటువంటి భక్తి యోగంలోకి ప్రవేశిద్దాం. క్రితం సారి కర్మ యోగాన్ని గురించిన విచారణ చేశాం. ప్రాపంచికంగా మానవుడు చేయవలసిన పనులు చేస్తే దాని పేరు కర్మ అని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరుడి యందు విశ్వాసాన్ని జత చేసుకొని సమాజహితమైనటువంటి కర్మలు గనుక చేస్తే అది మాత్రమే కర్మ యోగం అని విచారణ సాగింది. మరి ఈరోజు భక్తి యోగాన్ని గురించిన విచారణ. భక్తి అనగానే పూజింపబడే వాడు పూజ చేసేవాడు ఇద్దరు ఉన్నట్టు లెక్క. అంటే జీవుడు దేవుడు అన్నమాట. లేదా సాధకుడు బోధకుడు అన్నమాట. లేదా శిష్యుడు గురువు అన్నమాట. లేదు అనేవాడు వినేవాడు ఇద్దరు అని మాట. ఇది భక్తి. భక్తికి మరొక పేరు విశ్వాసం, నమ్మకం. ఒక గట్టి నమ్మకం, అచంచలమైనటువంటి నమ్మకం. ఈ భక్తి ఒక రూపానికి, ఒక నామానికి, ఒక గుణానికి లోబడి ఉంటుంది. అసలు భక్తి అంటే భా అంటే ప్రకాశం అంటే వెలుగు. పరమాత్మ రసో వై సః అంటే పరమాత్మ రస స్వరూపుడు. ఆయనకు నిజానికి ఆకారం లేదు. స్వామి చెప్పినట్లుగా నీళ్లు తీసుకొని Tumbler లో పోయి, కూజాలో పోయి, కడవలో పోయి, వెండి గిన్నెలో పోయి, బంగారు చెంబులో పోయి, ఎక్కడ పోస్తే ఆ వస్తువు పాత్ర యొక్క ఆకారాన్ని ఈ నీరు పొందుతూ ఉన్నదో పరమాత్మ అనేటువంటి చైతన్యం కూడా ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తం వచ్చేటువంటి పరమాత్మ ఈ ప్రకాశాన్ని అనేక రూపాలుగా తీసుకొని వస్తాడు. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శ్రీ మత్స్య కూర్మ వరాహ వటు నరసింహులు కావచ్చు, షిరిడి సాయి సత్య సాయి కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రకాశము నందు ప్రకాశముతో కూడి ఉన్నట్లయితే దాని పేరు భక్తి అని. అంతే. ప్రకాశంతో కూడి ఉన్నామా? మనం విడిపోయి ఉన్నామా? అని. ప్రకాశంతో కూడే ఉన్నాం గాని చాలా సుదూరంగా ఉన్నాం. సూర్యకిరణాలు ఎట్లాగైతే సూర్యమండలం నుంచి భూమిని తాకుతున్నటువంటి కొన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి మా మూలాలు సూర్య మండలమే అని చెప్పినా చెప్పకపోయినా సూర్యుడి నుంచి ఎట్లా విడిపడినట్టుగా కనిపిస్తున్నాయో జీవుడు కూడా పరమాత్మ నుంచి అట్లాగే విడిపడ్డట్టుగా కనిపిస్తున్నాడు కానీ విడి లేడు. ఎందుకంటే సూర్యుడు లేక సూర్యకిరణం లేదు, భగవంతుడు లేక భక్తుడు లేడు. అంటే ఈ రెండూ అవినాభావంగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి, స్వస్వామి సంబంధంగా ఉన్నాయి అన్నారు శంకర భగవత్పాదులు. స్వామి ఏమన్నారంటే భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తులు లేరు అన్నారు. ఎంత అందమైన మాటో చూడండి. మీరందరూ లేకపోతే నేను లేను బంగారు, నేను లేకపోతే మీరెవ్వరూ లేరు బంగారు అన్నారు. అంటే సూర్యకిరణాలు సూర్యుడి వలె, చంద్ర కిరణాలు దానిలో వచ్చే సుషుమ్నా కిరణాలు చంద్రుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సముద్రంలో పుట్టినటువంటి అలలు, తుంపరలు, బిందువులు, కెరటాలు సముద్రం నుంచి ఎట్లా భిన్నం కావో, ఈ పరమాత్మ నుంచి జీవుడు భిన్నం కాదు కానీ భిన్నంగా గోచరిస్తాడు. ఎందుకు గోచరిస్తాడు మరి? గోచరించకూడదు కదా. అంటే అణోరణీయాన్ అన్నాడు. ప్రతి అణువులోనూ నేనున్నాను అన్నాడు. అంటే ప్రతి అణువులోనే ఉన్నప్పుడు ప్రతి జీవిలోనూ ఉన్నట్లు లెక్క. ప్రతి జీవిలోనూ జీవుడు ఏం చేస్తాడు? తనలో ఉన్న పరమాత్మను తాను కొనుగొనే ప్రయత్నం చేయడు. ఎదుటి వాడిలో పరమాత్మ ఉన్నాడో లేదో వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక జీవితం భక్తి మార్గంలో ప్రవేశించటానికి ముందు తాను సాగించిన కర్మల అన్నింటికీ కూడా ఒక విజయాన్ని సంపాదించటానికి, ఒక సాఫల్యతను ఇవ్వటానికి అంటే ఒక లాభం పొందటానికి భక్తి అనేటువంటి ఒక మీడియం దాన్నే జీవుడు వాడుకుంటాడు. అది ఒక స్థాయి. రెండవ స్థాయిలో పరమాత్మని ఉపాసన చేసేవేళ పరమాత్మకి ఆకారం లేదని మనమే అనుకున్నాం గనుక రాముడుగా, కృష్ణుడుగా, సాయిగా, మరొకరుగా అనేక రూపాలు వేదం కూడా ఒక పరిష్కారం చెప్పింది మనకి. ప్రతిమా ఈశ్వరః అన్నది.అయ్యా బొమ్మలో బ్రహ్మ బ్రహ్మలో బొమ్మ ఇది దీని అర్థం అంటే ఏమిటి అంటే నేను దేవుణ్ణి చూడాలండి నేను రాముణ్ణి చూడాలి ఎలా చూట్టం? ఆ రాముడా ఇగో ఇలా ఉంటాడు కిరీటం పెట్టుకుంటాడు కోదండం పెట్టుకుంటాడు ఫలానా నామం పెట్టుకొని ఉంటాడు అటువైపు ఇటువైపు అమ్మవారు తమ్ముడు కింద దాసుడు అందరూ ఉంటారు అని ఒక ఊహ ఒక రూపం. మరి కృష్ణుడు ఎలా ఉంటాడు కోదండం బదులు వేణువు ఉంటుంది కిరీటం లో పించం ఉంటుంది ఆయన కృష్ణుడన్నామం అంటే నామ రూపాలు రెండు ఒక పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తించటానికి ప్రతిమలుగా replica అంటామే ఆ ప్రతిమా ఈశ్వరః రాముడి బొమ్మలో రాముడున్నాడు రాముడుగా కనిపిస్తున్న ఆయనలో బ్రహ్మ కూడా ఉన్నాడు. కనుక ఈ కనిపిస్తున్న బొమ్మలన్నీ బ్రహ్మలే బొమ్మలు అంటే జీవుడు దానిలో బ్రహ్మ ఉన్నాడు అని అర్థం. స్వామి ఒక పద్యం చెప్పారు చాలా అందమైన పద్యం. చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి అన్నను బ్రహ్మ వాళ్ళభ్యమది బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రారబ్ధమది బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మము కాలం బ్రహ్మ సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు. అంటే సత్యాన్ని బోధించటానికి వచ్చిన స్వామి కూడా నేను బ్రహ్మమునైనా బొమ్మలా మీ దగ్గరికి రాలేదా నేను అంతే అన్నారు. ఎందుకన్నారు ఈ మాట అంటే భక్తి కుదురుకోవాలి భక్తి పాదుకోవాలి భక్తి భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక బేరసారాలు ఆడుకునే విధానం కాకూడదు అని. సత్య సాయి భగవానుడి అవతారం వచ్చేదాకా గురు స్వరూపాలన్నీ ఓ మాట చెప్పినయి. ఏం చెప్పినయి అంటే నీలోనే దేవుడున్నాడు అని చెప్పినయి. సత్య సాయి భగవానుడు ఆ మాట చెప్పలే నీలో దేవుడున్నాడు కాదు బంగారు అసలు నువ్వే దేవుడివి. నేను దేవుడిని అని నాకు తెలుసు నువ్వు దేవుడివి అని నీకు ఇంకా తెలియలేదు అంతే తేడా. నీవు దేవుడివి అని తెలుసుకోవాలి అంటే నీకు నాకు ఉన్నటువంటి అంతరం చెరిగిపోవాలి. నేను ఒక పెద్ద canvas మీద చాలా చాలా గొప్ప పనులు చేసి మీ అందరికీ చూపిస్తున్నానే వాటన్నింటినీ మీ మీ స్థాయిలలో మీరు చక్కగా అభివ్యక్తి చేయండి ప్రపంచానికి అందించండి అది భక్తి మార్గంలో శ్రేయోమార్గంలో వెళ్ళండి. భక్తిని గనక మీ వ్యక్తిగత లాభాల కోసం వాడుకున్నట్లయితే దానివలన ఏం ప్రయోజనం లేదు ఎవరికీ నీతో సహా. నీకు కూడా ఓ రోజున కోరికలు కోరి కోరి కోరుకోవటానికి కోరికలే లేని రోజు భగవంతుణ్ణి ఎలా తలుచుకోవాలి అని విచారణ మొదలయ్యేసరికి కాలమంతా హరించిపోతుంది గనుక భక్తి అంటే మన యందు ఉన్నటువంటి ఈ శక్తిని అంతా ఈ ప్రజ్ఞనంతా కూడా పరమాత్మ యొక్క శక్తితో కూర్చి ఉంచటమే. అందుకే స్వామి భక్తిని ఏమన్నారంటే జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞ రెండూ కలిస్తేనే ఈ ప్రపంచానికి సాఫల్యం ఉన్నది అన్నారు. కేవల జీవుడి ప్రజ్ఞ hundred percent లాభం ఇవ్వదు. మనం ఏమీ చేయం స్వామి అనుగ్రహమే అంతా నడిపిస్తుంది అంటే అది నడవదు అది పనిచేయదు అన్నారు స్వామి. నీవు చేస్తూ ఉంటే పరమాత్మ యందు విశ్వాసం గనక నీవు పెంచుకొని ఉన్నట్లయితే నీ విశ్వాసానికి నా అనుగ్రహం తోడై ఫలితాలు తొందర తొందరగా వస్తాయి అన్నారు ఇది భక్తి యోగం. ఇవాళ మనం ఈశ్వరార్చన చేస్తున్నాం అభిషేకాలు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం అలంకారాలు చేస్తున్నాం యజ్ఞయాగాదులు చేస్తున్నాం ఇవన్నీ కూడా నిజానికి పంచకోశాల బయట జరుగుతున్న తంతు. బయట జరుగుతున్నాయి ఎక్కడ పంచకోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ. ఈ ఐదు కోశాల బయట జరుగుతున్నవి వేరు దీని వలన కలిగే ఆనందం మాత్రం ఆనందమయ కోశంలో మాత్రం మనకు లభిస్తున్నది. అసలు మనమే ఆనందమయ కోశంలో ఉండే ప్రయత్నం చేస్తే మార్గం ఉన్నదా? అదే భక్తి మార్గం ఎట్లా ఆత్మాత్వం గిరిజా మతిం సహచర ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నువ్వే ఆత్మవు నీలో ఉన్నటువంటి intellect ఏదున్నతో అది గిరిజా మతి ఎవరు అమ్మవారు. అయ్యవారు అమ్మవారు ఇద్దరూ నీలోనే ఉన్నారు శరీరం గృహం ప్రపంచ దేశాలన్నీ చుట్టి తిరిగి ఇంటికి వస్తాం. మన ఊర్లో దిగ్గానే అమ్మయ్య మా ఊరు వచ్చింది అంటాం మా ఊర్లో దిగ్-- మన ఊర్లో దిగ్గానే మన పేటలోకి వెళ్ళగానే మన పేటలోకి వచ్చామంటాం మన పేటలోకి రాగానే మనం ఉండే సందులోకి వెళ్ళగానే మా సందులోకి వచ్చామంటాం మన ఇంటి వాకిలి దగ్గరకు వెళ్ళి మా వా-- ఇంటి దగ్గరకు వచ్చామన్నాం వాకిలి దగ్గరకు వచ్చామన్నాం మన ఇంటి లోపలికి వెళ్ళి మనం పడుకునే ప్రదేశానికి వెళ్ళి నడుము వాల్చి అమ్మయ్య చేరుకున్నాము అన్నాం అంటే ఇల్లు ఎక్కడ ఉన్నది అని. ప్రపంచమంతా పెద్ద ఇల్లు అయితే అసలు ఇల్లు నీ లోపల ఉన్నది అని అర్థం. ఈ భావనా చమత్కృతి ఈ భావనా సంస్థితి జీవుడికి ఏర్పడటానికి ముందు ఈ భక్తి ప్రధానం భక్తి రమణీయము భక్తి మాధుర్యం. నిజానికి మనం రెండడుగులు వేస్తున్నాం నడక సాగించటానికి రెండు అడుగులు ఒక్కసారి వెయ్యటంలే ఒక అడుగు ముందు అది కూడుకునే లోగా రెండో అడుగు వచ్చి దానికి జత కలుగుతున్నది అంటే simultaneous గా అవుతుంది alternate గా అవుతుంది సంచార పదయో అంటే కుడి కాలు ముందు ఎడం కాలు వెనక అయితే రెండింటి మధ్య ఉన్నటువంటిదంతా విష్ణు వ్యాపకమైన బ్రహ్మ అయితే ఈ కుడికాలు ఎడమకాలు ఒక ఆవృత్తం పూర్తిగాగానే ఒక ప్రదక్షిణ చేసినట్లు లెక్క. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో ఏ మాట మాట్లాడినా దాని నిండా స్తోత్రం ఉండాలి. నతులు నుతులు స్తుతులు గీతులు గీతికలు గమకాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? పరమేశ్వరుడి యొక్క వాక్కు అగ్ని స్వరూపమై ఇక్కడి నుంచి బహు ముఖీనమై బహిర్గతమవుతున్నటువంటి వేళ ఇదంతా కూడా పరమేశ్వరుడి యందు మనకున్నటువంటి భక్తి భావన వలన పరమేశ్వరునితో మనం కూడి ఉన్న విధానం వలన వాక్కులన్నీ స్తోత్రాలై బయటకు వస్తున్నాయి. అందుకే పరమేశ్వరుడి భావనలో మాటలు మంత్రాలు అవుతాయి.జీవుడికి మంత్రాలన్నీ మాటలైపోతాయి. అంటే మంత్రాల బలం లేకుండా మాటలు సాగుతాయి. పరమాత్మ ఏమి శ్లోకాలు చెప్పడు. "అంతా బాగుంటుందిలే పో" అంటారు స్వామి. "నేను చూసుకుంటాలే బంగారు, నేను కాచుకుంటాలే బంగారు" అంటారు. అది మహా మంత్రం. చూసుకుంటా, కాచుకుంటా అన్నవాడు ఒక్కడే పరమాత్మ. మనం అల్లేం. చూసుకుంటా అంటే మొయ్యాలేమో, కాచుకుంటా అంటే చెయ్యాలేమో. కనుక ఆ రెండు వినహాయించి అన్ని పనులు చేస్తాం. పరమాత్మ "నేను చూస్తా, నేను కాస్తా, నేనున్నా, నీ పని నువ్వు చేసుకో, పరమేశ్వరుడి యందు అచంచల విశ్వాసం ఉంచుకో" అంటారు. అంటే భక్తి అంటే విడదీయరాని బంధం ఏదైతే ఉన్నదో అది భక్తి గనుక, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనం ఇవన్నీ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాం గనుక, కర్మ యోగాలన్నీ పరిపూతమవుతున్నటువంటి వేళ, భావన భావనామయమైనటువంటి వేళ పరమేశ్వరుని యొక్క గుణాన్ని, పరమేశ్వరుడి యొక్క విశేషణాన్ని, పరమేశ్వరుడి యొక్క గాథని అంటే నిజానికి పరమేశ్వరుడికి కథ ఉన్నదా అని ప్రశ్న. పరమేశ్వరుడికి కథలు లేవు. కథ లేనివాడే పరమేశ్వరుడు. మన అందరి కథలకి నాయకుడు కథా నాయకుడు ఆయన గనుక భాగవతం తీసుకోండి. భాగవతంలో కృష్ణుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు. విష్ణువు అనుకోండి. మరి అక్కడ ఉన్నదంతా భాగవతం అంతా ఎవరున్నా భాగవతులు అంతా ఉన్నారు అక్కడ. భగవత్ తత్వాన్ని అనేక మార్గాలలో ఉపాసన చేసిన వారందరి కథలు ఒక చోట ఉంటే దానికి పరిష్కార యోగ్యమైనటువంటి అనుగ్రహ వరదానం చేసిన పరమాత్మ కూడి ఉన్నాడు గనుక అది భాగవతం అయింది. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ ముక్తుల యొక్క ముక్త సమాహారమే భాగవతం గనుక ఈ కథలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని పరమేశ్వరుడి యొక్క అవ్యాజమైన అంటే కారణం లేనటువంటి నిరుపమానమైనటువంటి ఒక కరుణా విశేషాన్ని మనం చక్కగా అనుభవిస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు మనకు అనుగ్రహించేటువంటి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క విషయము, ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క అనుభూతి మనకి అమదానంద స్థితిని ఇస్తుంది. అంటే భక్తి అంటే కేవలం పూజ మాత్రమే కాదు. పూజ ఈ దేహం ఆ దేహానికి చేసినట్లు లెక్క. స్తోత్రం ఆయన గుణ విశేషాలను సంకీర్తనం చేసినట్లు లెక్క. భజన ఆయన గుణ గానాన్ని సం-సంకీర్తనం చేసినట్లు లెక్క. మరి ఏమవుతున్నది ఈ భక్తిలో అంటే పరమాత్మ ఒకడున్నాడని, ఆయనకి షోడశోపచారాలు చేసి ఆయనకు సేవ చేస్తే మనకి తగిన ఫలితాన్ని ఆయన ఇచ్చి మనకెట్టి కష్టము లేకుండా జీవితాన్ని అవతల గట్టుకు తీసు-తీసుకొని వెళ్ళేటువంటి ఒక గొప్ప నావికుడు అని ఒక భావన కలుగుతుంది. అన్నివేళలా భగవంతుని యొక్క అనుగ్రహం మన యందు ఉన్నది అని అనుకోవటమే భక్తి, అచంచల విశ్వాసం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామి అంటారు "సుఖంలో-- కష్టంలోనే కాదు బంగారు సుఖంలోనూ నన్ను తలచుకోండి" అంటారు. ఎందుకంటే సుఖమే జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కష్టంలో మనం ఎలాగూ భయం వల్ల జాగ్రత్తగా ఉంటాం. బాగా సుఖపడుతున్న వేళ చాలా అజాగ్రత్తగా ఉంటాం. ఈ సుఖం అన్నివేళలా మనకి ఇట్లాగే ఉంటుందనుకుంటాం, ఉండదది. పడుగు పేకల వలే ఉంటుంది. అంటే నిలువు పోగు, అడ్డం పోగు రెండు ఉంటేనే వస్త్రం తయారవుతుంది. కష్టం, సుఖం రెండూ కలబోతా ఉంటేనే ఈ ఆధార వస్త్రం, జీవన వస్త్రం ఏర్పడుతుంది గనుక నిలువు పోగు ఎంత పర్ఫెక్టుగా వేశావో అడ్డం పోగు కూడా అంత పర్ఫెక్టుగా ఉండు. కష్టంలో నువ్వు పరమాత్మకు ముడుపు పెడుతున్నావు, కొండ ఎక్కుతున్నావు, ప్రదక్షిణ చేస్తున్నావు, "స్వామి ఈ పని అయితే మళ్ళీ నీకిదేదో చేస్తా" అని అంటున్నావ్. సుఖంలో కూడాను. "పరమాత్మ సుఖించటానికి ఇంత ఇచ్చావయ్యా, నీ ద్వారా నేనేం చేయాలి, నీకేం చేయాలి?" స్వామి అంటారే, "కింకరుడైన వాడే శంకరుడు అవుతాడు తప్ప, నేనేం చేయాలి అని అడిగేవాడే శంకరుడు తప్ప, మీరు నాకేం చేస్తారన్నవాడు శంకరుడు కాదు." కనుకనే సత్యసాయి భగవానుడి దివ్య అవతారం అంతా అడిగినవారికి, అడగనివారికి, అడిగి అడగనివారికి, నమ్మినవారికి, నమ్మనివారికి, నమ్మి నమ్మనివారికి అందరికీ ఒకే సమమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం స్వామి అనుగ్రహించటానికి కారణం భక్తిని జాతిలో పెంపొందించటానికి. పరమాత్మ యందు లక్ష్యమున్నవాడు, పరమాత్మని గమ్యంగా పెట్టుకున్నవాడు, పరమాత్మతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడు వాడి జీవితం ఒక మాధురీ వసంతంగా ఉంటుంది. అది అత్యద్భుతమైనటువంటి ఉదాత్త అనుదాత్త స్థాయులతో కూడిన సంగీతమయంగా ఉంటుంది. ఎక్కడ ఉదాత్తత ఉన్నదో ఉదాత్త స్థాయి ఉన్నదో అనుదాత్త స్థాయి కూడా ఉన్నది. ఎక్కడ ఉచ్ఛైశ్వర్యం ఉన్నదో కింద స్థాయి కూడా ఉన్నది. ఎక్కడ ఎగుడు ఉన్నదో అక్కడ దిగుడు ఉన్నది. అంటే చీకటి వెలుగులు, ఎత్తు పల్లాలు, జనన మరణాలు, ఆశాభంగాలు, జయాపజయాలు, ఉదయ-ఉదయాస్తమయాలు ఎట్లాగైతే ద్వంద్వంగా రెండుగా ఉన్నాయో, మానవ జీవితం అంతా ద్వంద్వంగా ఉన్నది గనుక ఈ ద్వంద్వమైన అంటే రెండుగా కనిపిస్తున్న భగవంతుడు, భక్తుడు అన్నటువంటి రెండు భావనల నుంచి నెమ్మది నెమ్మదిగా భక్తి యోగంలో జీవుడు, సాధకుడు యోగవంతమైనటువంటి ఆధ్యాత్మిక భూమికలోకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక భూమికలో నిలకడ చెందినప్పుడు పరమాత్మ వలె నేను కూడా ఉండగలనా ఎప్పటికైనా? ఈ పరమాత్మ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు? ఒక సూర్యుండు సమస్త జీవులకంటాడు పోతన. ఒక్క సూర్యుడే సమస్త జీవులకు ఏమేం కావాలో ఇస్తున్నాడు. సైంటిస్టు డి విటమిన్ అన్నాడు, ఇంకోడు ఎ విటమిన్ అన్నాడు, క్లోరోఫిల్ అన్నాడు, ఇంకోడు శరీరానికి కావలసినటువంటి శక్తి అన్నాడు, చైతన్యాన్ని ఇచ్చాడన్నాడు, ప్రాణం పోశాడన్నాడు, ఆహ్ తామర పూలు వికసించడానికి భాస్కరుడి వలె వచ్చాడన్నారు. అంటే ఒక సూర్యుడు ఇంతమంది జీవులకి ఎవరెవరికి ఏయే సన్నివేశాలలో ఏ అవసరం ఉన్నదో కనిపెట్టి తీరుస్తున్నాడో అటువంటి శక్తి నాలో కూడా ఉద్దీపనం చెయ్య అనటానికి వీలుగా మనం భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగంలో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మనం సుఖంగా నిద్రపోతాం. ఒక మంచి రాజు రాజ్యం చేస్తున్నప్పుడు ఆ రాజ్యము చిట్టచివర సరిహద్దులలో ఉన్న సైనికుడు కూడా నిద్రపోతాడు. అలాగే సరిహద్దులను పహరా కాస్తున్న సైనికుడు సమర్థవంతుడు, నిజాయితీపరుడు, విశ్వాసం ఉన్నవాడైతే రాజు కూడా తన అంతఃపురంలో గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోతాడు.అంటే రాజు బంటు యొక్క సంబంధం ఎట్లా ఉన్నదంటే, రాజు వలన బంటు, బంటు వలన రాజు. అట్లే భగవంతుని వలన భక్తుడు, భక్తుడి వలన భగవంతుడు. ఇద్దరూ ఏకకాలంలో రెండు రూపాలుగా, రెండు స్వభావ-స్వభావాలుగా, రెండు స్వరూపాలుగా, రెండు గుణాలుగా ద్వంద్వంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వారి లక్ష్యం ఒకటే. చేరవలసిన వాడు జీవుడు, చేర్చవలసిన వాడు దేవుడు. మధ్యలో ఏమున్నదయ్యా? సంసార సాగరమున్నది. అందుకే భగవాన్ సత్యసాయి ఒక చక్కని మాటన్నారు. ఏమిటా మాట? దుస్తర భవసాగర తరణం. ఏమిటది? మానస భజరే గురు చరణం. మానస భజరే మనసులో గురువుని అన్నివేళలా తలుచుకో. ఇక్కడో విశేషమున్నది, భక్తి అంటే ఎవరి యందు భక్తి ఉండాలి అని. పోనీ దేవుడు రోజూ మాట్లాడడు. రోజూ మాట్లాడేవాడు ఎవడన్నా దొరుకుతాడా మనకి అని. ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగిని. ఈశ్వరుడు అంటే కనుగొనవలసిన ఈశ్వరుడు, కనపడవలసిన ఆత్మ, గురు స్వరూపంగా ఈ జగత్తులోకి వచ్చాడు అని అర్థం. ఈశ్వరో గురు ఆత్మ ఇతి మూర్తిత్రయ విభాగిని. మూర్తి అంటే బొమ్మ. మూడు బొమ్మలుగా వచ్చినాయి కానీ మూడు ఒకటే. ఇడుగో దేవుడు అని చెప్పేవాడు ఒకడుండాలి. ఓ వచ్చిన వాడు దేవుడా అని గమనించగలిగిన శిష్యుడు ఉండాలి. ఈ ముగ్గురూ ఏర్పడితేనే దృశ్యం ఏర్పడుతుంది గనుక కబీరు జీవితంలో భక్తి యోగంలో ఒక పరమాద్భుతమైన సన్నివేశం మనం గుర్తు చేసుకోవాలి. కబీర్ రామనామ జపం చేసుకునేటువంటి చోటికి ప్రతిరోజూ గురువుగారు, ఆయన గురువుగారు వచ్చేవారు. కబీరు ఎలా ప్రయాణం చేస్తున్నాడో చూడటం ఆయనకిష్టం. ఆ ప్రతిరోజూ వచ్చే గురువుగారు ఒకరోజున ఎవరో కొత్తవాణ్ణి ఒకాయన్ని వెంబడి పెట్టుకొని వచ్చాడు. ఆ కొత్తగా వచ్చినటువంటి వాడు తన గురువుతో సమానంగా వెలిగిపోతున్నాడు. అది ఆశ్చర్యం! అరే ఇంతవరకు ఇంత గొప్ప వ్యక్తిని నేను చూడలేకపోయానే, ఇవాళ గురువుగారు తెస్తున్నారే, ఎవరు ఈయన? అని అనుకుంటూనే ఇంత సాధనా పరిపక్వమైనటువంటి కబీర్ మనసు కూడా ఇందులో ముందు ఎవరికి నమస్కరించాలి అని మనస్సు ఆరాటపడ్డది. రోజూ వచ్చేటువంటి, కనపడేటువంటి మా గురువుకా? ఇవాళ వచ్చిన అతిథి రూపంలో వచ్చిన ఈ పక్కవారికా? ఎవరికి అని తొట్రుపాటు పడింది మనస్సు కదా! సాధకుడి మనస్సు. ఆ రోజు వచ్చే గురువుగారేలే అనుకోలేదు మనస్సు, ఓ క్షణంలో వివేకం మేల్కొని. "గురు గోవిందు దోనో ఖడే కాకే లాగూ పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే" అన్నాడు. అనుకున్నాడాయన. అంటే ఎంత అందమైన దోహానో చూడండి. ఆ వచ్చాడు నా గురువు వచ్చాడు. గురువుతో ఎవరో ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడు. దోనో ఖడే ఇద్దరూ నుంచునే ఉన్నారు. నా కళ్ళ ముందే. అందులో నా గురువు మాత్రం ఏం చెప్పాడంటే, "కబీర్, ఇవాళ నీకోసం దేవుణ్ణి వెంబడి పెట్టుకొచ్చానోయ్" అన్నాడు. దైవాన్ని చూపించిన నా గురువుకే నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. "గురు గోవిందు దోనో ఖడే కాకే లాగూ పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే" అంటే దైవాన్ని చూపించే గురువు మనకు కావాలి. ఇక్కడ రెండు విశేషాలున్నాయి. త్రేతాయుగాన్ని ప్రభావితం చేసిన రామచంద్ర ప్రభువు, ద్వాపర యుగాన్ని పరమాద్భుతంగా చాకచక్యంతో నడిపించిన కృష్ణ చైతన్యము గుర్తుస్తే, శ్రీరామచంద్రుడికి ఇద్దరు గురువులు. ఒకడు బోధ గురువు వశిష్టుడు బ్రహ్మర్షి. రెండవ వాడు ఆచార్య గురువు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు. సాధక గురువు అన్నమాట. విశ్వామిత్రుడు రెండవ బ్రహ్మర్షి. రాముడు అనబడేటువంటి పూర్ణ అవతారానికి ఇద్దరు గురువులు ఏర్పడ్డారు. కృష్ణుడి యొక్క అవతారంలో సాందీపుడు ఏర్పడ్డాడు బోధ గురువుగా. సత్యసాయి భగవానుడు అంటే భగవంతుడే కలియుగ మానవులకి గురువై వచ్చాడు. స్వామికి గురువు లేడు. ఎందుకని? గురోర్గురువు గనుక రామకృష్ణాది అవతారాలకు కూడా ఇదిగో ఈయన గురువు, ఈయన గురువు అని చెప్పడానికి ఉంది. మరి స్వామికి ఎవరు గురువు? ఎవరూ లేరు. ఎందుకనంటే గురువు గురువులకి అతీతమైనటువంటి, అన్ని గురువులకి మూలమైనటువంటిది కాబట్టి ఆ గురు స్థానానికి స్వామి ఇవాళ దివ్యత్వాన్ని, దివ్యుడైనటువంటి భగవత్ తత్వానికి ఓ గురుతత్వాన్ని, ఈ రెండింటితో పాటుగా ఒక పితృత్వాన్ని, పితృత్వంతో పాటు మాతృత్వాన్ని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్న నాలుగు సోపానాలు ఏకకాలంలో దర్శనమిచ్చినటువంటి మహా పరిపూర్ణ అవతారి భగవాన్ సత్యసాయి కనుక స్వామికి మనం నమస్కరించాలి. అన్ని వేళలా, అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో, అన్ని క్షణాలలో ఎందుకంటే ఒక్కటే. ఏం పుణ్యం చేసుకున్నామో! భరద్వాజ మహర్షి దేవుణ్ణి చూడాలి అని అనుకున్నాడు. తపస్సు ప్రారంభించాడు. వందేళ్ళు లక్ష్యం పెట్టుకున్నాడు. వందేళ్ళు అయిపోయింది. వందేళ్ళు అయిపోగానే భగవంతుడు వచ్చాడు. "ఏం కావాలి నీకు?" అని అడిగాడు. భగవంతుణ్ణి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. నాకెక్కడా మొదలు కాలేదు. ఇంకొక్క వందేళ్ళు అనుగ్రహం ఇస్తావా? అన్నాడు. అట్లాగే మంచి పని కదా, చెయ్యి అన్నాడాయన. వందేళ్ళు, రెండొందలేళ్ళు, మూడొందలేళ్ళు, నాలుగొందలేళ్ళు అయిపోయింది. నాలుగొందల ఏళ్ళు అయిన తర్వాత భగవంతుడు మళ్ళీ భరద్వాజ మహర్షికి కనిపించాడు. "ఏం కావాలి?" అన్నాడు. ఇక నిన్ను అడగను. ఎందుకంటే ఇట్లా నాలుగు లక్షల సంవత్సరాలు నాకు వయసు ఇచ్చినా భగవత్ తత్వాన్ని నేను పొందలేను, గ్రహించలేను. ఇది అనంతమైనటువంటి, చాలా విస్తృతమైనటువంటి విషయం గనుక నాకిక్కడితో ఈ-ఈ కోరికని సమసింపజేయమని అడిగాడు. మరి ఆధునిక మానవుడు, కలియుగంలో మానవుడు భరద్వాజ మహర్షి కంటే గొప్ప తపస్సు చేసి ఉండాలి. నాలుగొందల ఏళ్ళు తపస్సు చేస్తే దర్శనమే పొందలేదు భరద్వాజుడు. మరి మనమేమి తపస్సు చేశామో స్వామిని నాలుగొందల సార్లు చూడగలిగాం. ఇంతకు మించిన అదృష్టం ఉన్నదా? అని విచారణ చేస్తే భక్తి వలననే ఇది సాధ్యమైంది అని మనకి. మనకి స్వామి యందు భక్తి తగ్గుతూ వచ్చిందనుకోండి, ఆ చూశాం కదా ఇంకా ఏముంది స్వామిని చూట్టానికి అంటుంది మనస్సు.భక్తి స్వామి యందు కుదురుకొని ఉన్నది అనుకోండి, నిన్నటి దాకా చూశాను అయ్యా అదంతా పాచి మాట. అయిపోయింది అది. కొత్తగా మళ్ళీ నాకు మధ్యాహ్నం ఏ దర్శనం ఇవ్వబోతున్నారు స్వామి? దానికోసం నేను కూర్చొని ఉండాలి. నిన్న చూశాను అయ్యా, మళ్ళీ ఈవేళ బతికానుగా, ఈవేళ పుట్టానుగా, మళ్ళీ ఈవేళ స్వామిని చూడాలి. ఇది భక్తిలో పారమ్యం. ఎవరి మనస్సు ఆర్ద్రమై ఉంటుందో, ఎవరి మనస్సు పరమాత్మ యందు లగ్నమై ఉంటుందో, నిత్య నూతనమై ఉంటుందో, ఎవరి మనస్సు భయం లేకుండా ఉంటుందో, ఎవరి మనస్సు సమర్పణ భావంతో కూడి ఉన్నదో, ఎవరి మనస్సు శరణాగతి పొందిందో, ఎవరి మనస్సు ఆయన తప్ప అన్యమైన మరొక్క గతి లేదని ఒక నిశ్చితమైనటువంటి భావనకు లోనయ్యిందో, ఎవరు తమను తాము పూర్ణముగా సమర్పించుకొని నిస్సేషంగా అంటే ఇంకా ఏమి మిగలనంత స్థాయిలో సమర్పణ చేసుకోగలిగారో వాడు పూర్ణమైన భక్తుడు వెలుగొంటాడు. రెండవది, భక్తుడు అనటానికి భగవంతుని బోధ వినటానికి మాత్రమే కాదు, భగవంతుడు చెప్పినవి నిత్య జీవితంలో ఆచరించాలి. గురువుకి గాని, భగవంతుడికి గాని ఆనందం కలిగించే విషయం ఒక్కటే. మనం చేసే ఆరాధనలు గాని, ఉత్సవాలు గాని, వేడుకలు గాని, జాతరలు గాని భగవంతుణ్ణి కూడా నిజానికి కదిలించవు. అవన్నీ మనం మన ఆనందం కోసం చేసుకునే పనులు. మరి నిజానికి పరమేశ్వరుడికి సంతోషం కలిగించే పని ఏమి? పరమేశ్వరుడు చెప్పిన మాట విని దానిని జీవితంలో ఎవరు ఆచరిస్తారో వారి యందు పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానము, ప్రత్యేకమైనటువంటి ఒక అనుగ్రహము, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉంటాయి గనుక భక్తి యోగంలో అంటే పరమాత్మతో కూడి ఉన్నటువంటి ఈ భక్తి విశేషంలో అన్నివేళలా పరమాత్మతో కూడి ఉండాలి మనం. ఏ పని మీదైనా వెళుతుంటాం. వెళుతూ వెళుతూ ఈ పని మీద వెళుతున్నాను, స్వామి నువ్వే చూసుకోవాలి అని అడగటం ఒక ఎత్తయితే, ఇన్ని పనులు ఎలా చేయగలిగారండి మీరు అంటే, నేను పరమాత్మతో కూడి ఉన్నాను, పరమాత్మ కూడా నాతో కూడి ఉన్నారు గనుక ఈ పనులు జరుగుతున్నాయి అని చెప్పుకోగలగాలి. అంతేతప్ప మన కష్టాన్ని, మన సుఖాన్ని పరమాత్మ ఒళ్ళో వేసేసి నువ్వు పరిష్కారం చెయ్యనటంలో న్యాయం లేదని, మన భావనలో పరమాత్మ భావనను నింపుకొని ఆ పరమాత్మ యొక్క స్థితిని మనం అన్నివేళలా అనుభవిస్తూ, ఇదిగో ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ అనుభవం ద్వారా, ఈ ఆలోచన ద్వారా పరమాత్మే ఈ సమస్తాన్ని ఆచరింపజేస్తున్నాడు, పరమాత్మ ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, ఆ ఆనందం అనేటువంటి వెలువలో నేను కూడా కొన్ని క్షణాలు నిలబడగలిగాను అన్నటువంటి సంపూర్ణ శరణాగతి భావమే భక్తిగా మనం భావన చేయాలి. రామాయణంలో చిన్న సన్నివేశం ఉంది. శబరి మాతంగ మహర్షి ఆశ్రమంలో సేవ చేస్తుంది, గిరిజన పుత్రిక ఆమె. మాతంగ మహర్షి ఓ రోజు సాయంకాలం శబరిని పిలిచాడు. "రేపు పొద్దున రామచంద్ర ప్రభువు ఇక్కడికి రాబోతున్నాడు. ఆయన్ని సేవించి దర్శనం చేసుకో. సరేనా, నువ్వు ఇంతకాలం ఈ ఆశ్రమంలో చేసిన దానికి ఫలితం ఇది" అని చెప్పాడు ఆయన. శబరి ఆశ్చర్యపోయింది. "అంటే మీరు రాముణ్ణి చూడరా, రాముడే మన ఆశ్రమానికి వస్తున్నాడని మీరే చెప్తున్నారు కదా స్వామి, మరి మీరు రామదర్శనం చేసుకోరా?" అని. "రామదర్శనం చేసుకోవటానికి అర్హత నువ్వు పొందావు. నేను ఇంకా పొందవలసి ఉన్నది. కనుక నేను ఇక్కడి నుంచి వైదొలుగుతున్నాను. నీవు పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైన శరణాగతి పొందిన భక్తురాలివి గనుక, నేనెవరో నీకు తెలియకపోయినా, నాకు ఈ సేవ చేసినందువలన ఏం కలుగుతుందని ప్రశ్న లేకుండా, ఆశ్రమంలో చేయవలసిన సేవ చేసినందుకు ఫలితమే భగవంతుడు నీ వాకిలి దాకా నడిచి వస్తున్నాడు. ఆయన్ని చక్కగా దర్శనం చేసుకో" అన్నాడు. మర్నాడు ఆ మధుర క్షణం రానే వచ్చింది. శబరి కనుగుడ్లన్నీ కూడా ఎండిపోయినయి, ఎదురు చూసి చూసి. ఒళ్లంతా శుష్కించిపోయింది వయస్సు చేత, తపస్సు చేత, భావన చేత, పరమాత్మ యందు మనస్సు లగ్నమైన కారణంగా. రాముడు వస్తూనే అన్నాడు, "ఎందుకు తెచ్చావు? అవ్వా! నేను ఎలాగూ వచ్చా కదా, నీకు కనబడకుండా ఎలా వెళ్తాను? మళ్ళీ ఇంత దూరం ఎందుకు నడిచి వచ్చావు? పూలేమిటి? పళ్ళేమిటి?" అంటే, "చేతులునికి పోని పూలు తెచ్చితిని స్వామి, సతనువగుటను పండ్లు తెచ్చితిని స్వామి" అన్నది. అంటే, నాకు ఇంకా చేతులు ఆడుతున్నాయి గనుక పూలు కోసి తెచ్చాను రామా. ఇంకా దేహం ఆశ్రయించి నేనున్నా, ఇంకా ఈ దేహంలో ఉన్నాను కదా, అందుకని మా రామచంద్రుడి కోసం కొన్ని పళ్ళు తీసుకొచ్చా. భక్తిభావంలో ఇది పరాకాష్ట. ఎందుకంటే, మన కోరికలు తీరేదాకా ఉండే భక్తి భక్తి కాదు. అన్నివేళలా ఆనందం అనుగ్రహించేదే భక్తి అనుకుంటే అది భక్తి కాదు. ఆనందాన్ని, దుఃఖాన్ని సమస్థితిలో అనుభవించగలిగిన ఒక మానసిక స్థితిని మనకు ఏది కలిగిస్తుందో అది భక్తి. శరీరంలో ఉన్నాను గనుక పళ్ళు తెచ్చానయ్యా, చేతులున్నాయి గనుక పూలు తెచ్చానయ్యా అని వృద్ధ స్త్రీ అయినటువంటి శబరి వలె మన మనస్సుని కూడా చేతులున్నందుకు సేవ చేస్తానయ్యా, శరీరంలో ఉన్నాను గనుక నీ సంకీర్తనం చేస్తానయ్యా, సర్వ ప్రకృతికి నీ యొక్క భావనలు అందిస్తానయ్యా, నే చేయగలిగిన సేవ నా శరీరం ద్వారా, నా తనువు ద్వారా, నా మనస్సు ద్వారా, నా చేతుల ద్వారా, చేతల ద్వారా నీ యొక్క ఈ భావనా పరివ్యాప్తిలో నేనుంటానయ్యా అన్నటువంటిది భక్తే తప్ప విడదీసేది విభక్తి, కలిపి ఉంచేది భక్తి. ఈ పరిపూర్ణమైనటువంటి భక్తి యోగాన్ని స్వామి చూడండి, సర్వ మతాలని ఒక్క గొడుకు కిందకు తెచ్చారు. ముక్కోటి దేవతలని ఓ గొడుకు కిందకు తెచ్చారు. రాముడి మీద, శివుడి మీద, కృష్ణుడి మీద మీకు ఎవరిష్టమైతే వాడి మీద హాయిగా పాడుకోండి అన్నారు. నువ్వు ఏ మతంలో ఉంటే నాకేమి, ఆ మతాన్ని మాత్రం నమ్మి ఉండు. ఆ మతం ఏమి బోధించిందో దానిని నువ్వు అనుష్ఠానం చెయ్. నువ్వు గనుక నిజంగా హిందువువైనట్లయితే ఒక నిజమైన హిందువుగా జీవించు.నువ్వు ముస్లింవి అయినట్లయితే నిజమైన ఇస్లామిక్ భావనతో జీవించు. నీవు ఒక మంచి క్రిస్టియన్ గా ఉండాలి క్రిస్టియానిటీని పాటించు అంతే తప్ప మతం అనేటువంటిది మానవుడికి అడ్డుగోడ కాకూడదు, అడ్డదారి కూడా కాకూడదు, అది రాచబాట కావాలి. మన మతిని ప్రభావితం చేయాలి వెలిగించాలి ఆ వెలుగు దారిలో మనం వెన్నెల పుంతలు తొక్కుతూ వెళ్ళాలి వెళుతూ వెళుతూ పరమాత్మ ఆ కనిపిస్తున్న ఆ పెను వెలుగులోకి ఈ చిన్న వెలుగులన్నీ కూడా చక్కగా ప్రస్థాన పరిమళంగా సా-సాగాలి, సాగి ఆ రెండు కలవాలి యోగించాలి ఇదే పూర్ణమైనటువంటి భక్తి యోగంగా భావన చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా పరమాత్మను ముందు పెట్టుకుందాం. ఒకటే అనుకోవాలి పరమాత్మ ఈ పని మీద వెళుతున్నాను నువ్వు అనుగ్రహించని అడగొద్దు. పరమాత్మ నీకు ఎట్లా తోస్తే నాకు ఏ ప్రాప్తి ఉంటే ఆ ప్రాప్తిని మాత్రం నువ్వు నాకు అనుగ్రహించు ఒకటి. రెండవది నా అర్హత కంటే మించి కోరికలు రాకుండా నా మనస్సును నియంత్రించు. మూడవది నేను ఈ ప్రపంచంలో ఏది పొందాలన్నా ఆ పొందుతున్న దాంట్లో నా పాత్రని మాత్రం నిర్దిష్టం చెయ్. కేవలము నీ అనుగ్రహమే కేవలము నా ప్రజ్ఞ కాక, నా ప్రజ్ఞ అంటే నా సాధన, నా శోధన, నీ యొక్క అనుగ్రహము, నీ యొక్క దివ్యమైనటువంటి మహా అమృత వృష్టి వలే సాగేటువంటి ఒక కరుణా దృష్టి నాపై ఉంచి మన ఇద్దరం కూడా నీ అడుగుజాడల్లో మేము నడిచేట్టుగా, నీ భావనలో మా మనస్సు రాగ రంజితం అయ్యేట్లుగా, మనోజ్ఞ రమణీయ స్థితిలో సంచారం అయ్యేట్లుగా అనుగ్రహ వరదానం చేయమని భగవంతుణ్ణి ప్రార్థించటమే నిజమైనటువంటి భక్తి గనుక కూడి ఉండేటువంటి భక్తికై మనం ప్రయత్నిస్తూ భగవంతుణ్ణి మెప్పించే పనులు చేస్తూ తద్వారా ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందంలో మనము పాలుపంచుకుంటూ మనం పొందిన ఆనందాన్ని సర్వ జగత్తుకి ఇస్తూ మన ప్రస్థానం కొనసాగు గాక భక్తి యోగ మార్గంలో అని భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ భక్తి యోగాన్ని అనేక మంది భాగవతులు అంటే బలి, ప్రహ్లాదుడు, గజేంద్రుడు భాగవతంలో ఉన్నటువంటి మహా భక్తులు అందరి కథలు చూడండి. పరమేశ్వరుడు ఉన్నాడో లేడో అంటూ వెళ్ళిన వాడు కొందరు, ఉన్నా నాకెందుకు దక్కుతాడులే అని కొందరు, దక్కినా నా వాడు అవునో కాదో అని మరికొందరు. ఈ రకంగా అనేకమైనటువంటి స్థాయిలలో విచారణ చేస్తూ వెళ్ళినా అందరియందు విశేషమైనటువంటి కృపను చూపించిన వాడు కరుణాలువు, దయాళువైన పరమాత్మ గనుక పరమాత్మతో కూడి ఉండటమే భక్తి. ఆ భక్తి సామ్రాజ్యంలోకి మనం వెళ్ళాలి. జాగరాజ స్వామి అంటాడు, "రామచంద్ర ప్రభూ! నేను ఎంత తపస్సు చేసినా, ఎంత కీర్తి గుణగానం చేసినా, నీ దర్శనం నాకు లభిస్తుందో లేదో తెలియదు గానీ నిన్ను నమ్ముకున్నటువంటి ఒక సద్భక్తుడి యొక్క ఆవరణంలోకైనా నన్ను ప్రవేశింపజేయవయ్యా." రామ సామ్రాజ్యం, భక్తి సామ్రాజ్యంలోకి వెళ్ళేట్లుగా నాకొక చిన్న అవకాశమివ్వు అంటారు జాగరాజ స్వామి. తరించి పాడిన వాడాయన. పాడి తరించిన వాడు కాదు. తరించి పాడిన జాగరాజ స్వామి అలా అన్నప్పుడు మనం ఎంత తరించాలి, ఎన్ని పోగొట్టుకోవాలి, ఎన్ని భావనా స్థితులు దాటాలి, పరమాత్మని ఎంతగా అనుభవించాలి, అనుభవించి అనుభవించి అనుభవమే మనమై, అనుభవం కాగా కాగా అనుభూతిమయం మ-మనమై, అనుభూతి కాగా కాగా విభూతిమయమై, పూర్ణమైన విభూతి స్థాయికి వెళ్ళమనే స్వామి యొక్క విభూతి ప్రసాదనం చేయటం వెనుక ఉన్న అంతరార్థంగా గ్రహిస్తూ, భావిస్తూ భక్తి యోగంలో విభూతి స్థాయికి షడైశ్వర్యాలలో ఇవాళ కరెన్సీకి విలువ లేదు, చోటు లేదు. ఉన్నదేమున్నదయ్యా విభూతి స్థాయి. ఆ అత్యుత్తమమైన దానికి ఇవ్వటానికి వచ్చిన పరమాత్మని trivial and trash అల్పమైనవి, స్వల్పమైనవి అడక్కుండా కోరదగినది, కోరవలసినది అవకాశం ఉన్నప్పుడు కోరవలసిన స్వామినే కోరుకుంటూ ఆ భక్తి సామ్రాజ్యంలో మనందరం కూడా సుసుక్షితమైనటువంటి భక్త బృందంగా, పరిపూర్ణమైనటువంటి ఆనంద బిందువులుగా మన జీవితాలు కొనసాగాలని స్వామిని ప్రార్థిస్తూ, సాయిరాం. [భక్తి సంగీతం] ఇంతవరకు మీరు స్వామి వారి చిరకాల భక్తుడైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు భక్తి యోగంపై అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఎంతో విజయవంతంగా చేపడుతున్నటువంటి సమగ్ర ఆరోగ్య కేంద్రం యొక్క వివరాలను వింటారు. [భక్తి సంగీతం] సత్యసాయి పరమాత్ముని ఆదేశానుసారం గ్రామ సేవయే రామ సేవగా భావించి విశాఖ జిల్లాలో ఉచిత సమగ్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత సమగ్ర వైద్య శిబిరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విశాఖ జిల్లాలోనే ఎక్కువగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉచిత సమగ్ర వైద్య శిబిరానికి, మామూలు వైద్య శిబిరానికి గల తేడానేంటో కాస్త వివరంగా చెప్తారా నాగేశ్వరరావు గారు? సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా వారు గత ఇరవై సంవత్సరాలుగా సుమారు ఇరవై సంవత్సరాలుగా ఈ సమగ్ర ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహించడం జరుగుతుందండి. సత్యసాయి సేవా సంస్థలు ఎక్కడ ఉన్నా కూడా వైద్య సేవలు అనేటువంటిది ప్రతి దగ్గర నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ వైద్య సేవలు అనేటువంటిది ఉదాహరణకి విశాఖపట్నం ఎం.వి.పి. సెంటర్ లో ఒక వై-విశాఖ ఒక వైద్య సెంటర్ ఉంది, మన మెడికల్ సెంటర్ ఉందండి. అనకాపల్లిలో ఒక సెంటర్ ఉంది. అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో భజన సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో, ఆ ఉక్కునగరం సిటీ మా దాంట్లో ఉంది. ఈ అన్నీ కూడా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ పరిధిలో, వాళ్ళ ఏరియాలో మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకే లభ్యమవుతూ ఉంటాయి. ప్రభుత్వపరంగా, ప్రైవేట్ పరంగా. మనం ఉచితంగా ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పేదవారు వస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే చూపించుకోడానికి కూడా అవకాశం ఉంటుంది.కానీ ఈ ఉచిత సమగ్ర వైద్య సేవా శిబిరములు అనేటువంటిది ఈ విశాఖపట్నం city నుండి సుమారుగా నూట ఇరవై ఐదు, నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పూర్తి గిరిజన ప్రాంతంలో, ఏదైతే forest లో ఉంటున్నాయో ఊ ఆ గిరిజన ప్రాంతంలో ఏ విధమైనటువంటి వైద్య సదుపాయాలు లేని గిరిజనులకి ఆ వెనుకబడిన తరగతి ఉన్నటువంటి కుటుంబాలకి అందించే నిమిత్తమై దీన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ ఉద్దేశంతోటి కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఎటువంటి వైద్య సహాయం అందలేనటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్లి వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు అందించడం అనేదే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. Correct అండి. ఇది మనం వారికి ఒక ANM అనేటువంటిది వారే వెళ్లి సేవ, మందులు అందవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో. అటువంటి ఏరియాలోకి మనం పూర్తిగా ఒక super speciality doctors ని super speciality hospital స్థాయిలో మనం ఈ శిబిరాన్ని నిర్వహిస్తుంటాం. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుందండి. అంటే ఈ శిబిరాలు super speciality hospital స్థాయిలో మనం నిర్వహిస్తున్నామన్నమాట. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ సేవలు ఎవరికి అవసరం పడుతుంది, ఈ శిబిరాలు ఎక్కడ నిర్వహించాలి అనేటువంటి విషయాలకి మనకి ఏమైనా నిర్దేశింపబడిన సూత్రాలు ఉన్నాయా అండి నాగేశ్వరరావు గారు? ఈ camp ని ఎక్కడ నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఎవరి కోసం నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మనం ఊ ఏదైతే వైద్య సదుపాయం పూర్తిగా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడైతే ఉన్నవో ఊ దాన్ని గుర్తించడానికి ముందుగా మనం ఒక ప్రాథమిక survey నిర్వహిస్తాం. ఆ ప్రాథమిక survey Survey. అది ఎట్లా ఉంటుందంటే విశాఖపట్నం నుంచి సత్సాయి సేవా సంస్థలో ఉన్నటువంటి కొంతమంది active workers దీనికి ఒక ఐసెల్ అని ఊ దాన్ని 1990 లో శ్రీ వి. పాపారావు గారు అప్పటి state coordinator గారు ఉన్నప్పుడు దాన్ని form చేయడం జరిగింది. ఊ ఆ అప్పటి నుంచి ఇప్పటికి అదే నడుస్తుంది. వాళ్ళంతా కూడా చాలా experienced సేవాదళ్ళు. ఎక్కడ ఏ సేవలు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఊ అలవాటు పడి ఉన్నారు. వాళ్ళు సుమారుగా ఒక, ఒక పది మంది సేవాదళ సభ్యులని ఆ గిరిజన గ్రామాలకు వెళ్లి ఊ మనకు విశాఖపట్నం జిల్లాలో సుమారు పదమూడు గిరిజన మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో మనకు అన్నీ ఎక్కడెక్కడ అయితే ఏ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటివి మనకు ముందుగా information statistical information మన దగ్గర ఉంటుంది. ఊ దాని ప్రకారం ఈరోజు camp ఈ నెలలో చేయాలనుకుంటే, ఈ నెలలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏమిటి, ఈ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎపిడమిక్ ఏమైనా జబ్బులు ఎక్కడైనా ఉన్నాయా అనేటువంటిది ముందుగా information gather చేసి ఆ area కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఏమి సేవ చేస్తే బాగుంటుందనేటువంటిది నిర్ధారణ చేస్తాము. ఊ వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో మనం camp run చేయాలి కాబట్టి కొంత infrastructure అనేటువంటిది అవసరం ఉంటుంది. ఊ దానికి ఒక రెండు, మూడు buildings రెండు, మూడు rooms లు కొంత open place కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ITD hostels గాని లేదా ఆ గిరిజన సంక్షేమ పాఠశాలలు గాని, ప్రభుత్వ పాఠశాలలు గాని ఉన్నాయేమో చూసి ఊ వాటిని మనం తీసుకుంటాము. ఊ దాన్ని camp point గా మనం fix చేసి ఊ ఆ camp point నుంచి ఒక ఐదు నుంచి ఎనిమిది kilometer radius పరిధిలో ఊ ఒక పదిహేను, పదహారు గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వివరాలు సేకరించడం జరుగుతుందండి. ఊ దాంతో పాటు ఆ గిరిజన గ్రామాలు ఈ camp point నుంచి ఎన్ని kilometer దూరం లో ఉన్నాయి, నడిచి వెళ్ళాలా అక్కడికి ఊ వాళ్ళకి అంటే గిరిజనులకి camp గురించి information ఇవ్వడానికి ఊ మనం నడిచి వెళ్ళాలా ఊ vehicle వెళ్తుందా ఊ వాళ్ళకి ఏ విధంగా సమాచారం చేస్తాం అనేటువంటిది ఒక విషయం తెలుసుకుంటాం. ఊ ప్రతి గ్రామంలో కూడా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి. మనకి Indian standard ప్రకారం ఒక ఇల్లు అంటే ఐదుగురు వ్యక్తులు అనేటువంటిది ఒక standard ఆ survey ప్రకారం మనం చేస్తాం. అదొక rule ఉంది. Survey of India Survey-survey of India వారి ప్రకారము. ఊ కాబట్టి ఎన్ని ఇల్లు ఉన్నాయి. ఆ ఇళ్ళుల్లో ఉంటే యాభై ఇళ్ళు అంటే రెండు వందల యాభై మంది patient ఉన్నట్టు మనకు లెక్క. ఊ మరి అట్లా ఒక సుమారు రెండు వేల ఐదు వందలు నుంచి మూడు వేల మంది ఊ population ఉన్నటువంటి ఏరియాలు మనం తీసుకుంటాం. దాంట్లో సుమారుగా పన్నెండు వందలు, పదకొండు వందల మంది patient మనకు కచ్చితంగా avail అవుతారు. ఊ ఇది మనం ప్రాథమికంగా చేసేటువంటి survey. మనం గ్రామాల్ని choose చేసుకుంటాం, camp point ని choose చేసుకుంటాం. ఊ ఈ రెండూ జరిగిన తర్వాత ఒక date fix చేసుకుంటాం మనం. ఊ Door to door survey అయినటువంటిది చేస్తాం. ఇంటింటి survey కార్యక్రమం. ఊ మొట్టమొదటి ప్రాథమిక survey, camp point గుర్తించడం, సరైనటువంటి గ్రామాలను గుర్తించడం ఊ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది population ఉన్నారు అనేటటువంటిది గుర్తించడం జరుగుతుంది. ఊ మొదటి stage లో. ఓకే. ఇప్పుడు మీరు ప్రజల్ని గుర్తించారు. అలాగే గ్రామాలను గుర్తించారు. మన శిబిరాలన్నీ కూడా మీరు చెప్పిన విధంగా super speciality స్థాయిలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరికి ఎటువంటి వైద్య సహాయం కావాలి అనేది ఏ విధంగా మీరు గుర్తిస్తారు నాగేశ్వరరావు గారు? ప్రాథమిక survey చేసినప్పుడు గ్రామాలను గుర్తించడం జరిగింది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఊ అనేటటువంటిది మనం గుర్తించడం జరిగింది. ఊ ఆ-ఆ date నుంచి ఒక వారం రోజుల తర్వాత ఊ ఒక సుమారుగా ఇరవై మంది బాగా experience ఉన్నటువంటి సేవాదళ సభ్యులు ఊ అక్కడ local గా ఉన్నటువంటి సమితికి సంబంధించినటువంటి సేవాదళ సభ్యులతో కలిపి ఊ ప్రతి గ్రామానికి ఒక నలుగురు సేవాదళ సభ్యులు చొప్పున వెళ్ళడం జరుగుతుంది. ఊ వెళ్ళినప్పుడు ఒక కరపత్రాన్ని తీసుకుని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఊ దాంట్లో మనం ఏయే సేవలు వాళ్ళకి అందిస్తాం, ఏ రోజు camp నిర్వహిస్తాం, ఏ విధంగా నిర్వహిస్తాం అనేటువంటిది కూడా సూచన తెలియజేయడం జరుగుతుంది. ఊ ఈ ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుని యొక్క వివరాలని ఊ మనకొక standard proforma ఉంది. ఊ దాని ప్రకారం మనం వాళ్ళ వివరాలు collect చేస్తాం. అంటే వాళ్ళ యొక్క అనారోగ్య పరిస్థితుల్ని మనం అడుగుతాం. ఉదాహరణకి ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో కూడా అప్పారావు అనేటువంటి ఆయన యజమాని. ఊవెళ్ళగానే మనమేం అడుగుతాం అంటే సాయిరాం అండి మేము సత్యసాయి సేవా సంస్థల నుంచి భగవాన్ బాబా వారి ఆదేశానుసారంగా ఈ ఉచిత సమగ్ర వైద్య సేవలను మీకు అందించడానికి వచ్చాం. దీనికి ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి గాని రాజకీయమైనటువంటిది లేదు. ఇది పూర్తిగా ఉచితమైనటువంటిది. మీ యొక్క అనారోగ్య వివరాలు మేము సేకరిస్తున్నాం అండి. మీరు మీ-- మీరు చెప్పిన దాని ప్రకారం వివరాలు నోట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డాక్టర్లని, దానికి సంబంధించినటువంటి మందుల్ని మేము తీసుకొచ్చి క్యాంపులో మీకు అందించడం జరుగుతుంది అని చెప్తాం. ఇంటి యజమాని పేరు అడుగుతాం ముందు. ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు? అంటే major ఎంతమంది? ఎంతమంది ఆడవాళ్ళు major ఉన్నారు? అంటే statistics- Statistics కోసం. దాంట్లో ఐదు సంవత్సరాల లోపులో వయస్సు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? అంటే వాళ్ళకి immunization జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం. ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది? పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకంటే grown up girls ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం. ఇది ఒక phase లో. రెండవ phase లో ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరికైనా మొట్టమొదట కంటి వ్యాధులు ఉన్నాయా? అనేటువంటిది అడుగుతాం. రెండవది, ఆ మీకు సంబంధించి అంటే ఒక series లా వస్తది అండి అది practiced మా సేవాదళ్ళు అంతా కూడా. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయా? రాత్రుళ్ళు కనిపిస్తుందా లేదా? దూరంగా ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయా? పిల్లలకి ఏవన్నా ఇబ్బంది ఉందా? ఒకటి. రెండు, ముక్కు-- చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులు ఉన్నవా? మీకేమన్నా నాడి కారుతుందా? మూడు, దంత వైద్యానికి సంబంధించి అంటే దంతాలకు సంబంధించి ఏవన్నా ఇబ్బందులు ఉన్నాయా? నాలుగు, మహిళలకు సంబంధించినటువంటి ఏవన్నా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ lady doctors వస్తారు. వాళ్ళే మిమ్మల్ని పరిశీలిస్తారు కాబట్టి మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. అది ఒకటి. తర్వాత మీకు మోకాళ్ళ, కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వ్యాధులు. తర్వాత ఎవరికైనా గత రెండు మూడు సంవత్సరాల్లో TB సంబంధించి గాని, పక్షవాతం సంబంధించి గాని, epilepsy సంబంధించి మూర్చ వ్యాధులు సంబంధించి గాని మందులు వాడుతున్నారా? దాని తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి వ్యాధులు. ఇది కాకుండా సాధారణమైనటువంటి ప్రస్తుతం మీ area లో ఏమన్నా అందరికీ ఎప్పుడు మిగతా ఏవన్నా వ్యాధులు ఉన్నాయా? జ్వరాలు గాని, జబ్బులు గాని, విరోచనాలు గాని ఉన్నాయా? అని అడుగుతాం. ఇది చాలా-- ఆ దాని ప్రకారం ఎంతమంది అయితే ఉన్నాయని చెప్తే ఆ number note చేసుకోవడం జరుగుతుందండి. దీనివలన ఈ survey అంతా అన్ని గ్రామాల్లో conduct చేసిన తర్వాత మాకు total number of patients, total number of diseases అనేటువంటిది మేము గుర్తించగలుగుతాం. ఓకే. ఇది కార్యక్రమం. ఇది కేవలం మన volun-- సేవాదళ్ volunteers కే కాకుండా గ్రామంలో ఉన్న ముఖ్యులు తర్వాత youth లను కూడా సహ-- సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం అండి. అప్పుడు మనకి correct statistical data information మనకు అందుతుంది. అంటే మన సేవాదళ్ సభ్యులకి వ్యాధులను గుర్తించడంలో తర్ఫీదునిచ్చి అక్కడ నివసించేటువంటి గ్రామ పెద్దలు, యువకుల సహాయ సహకారాలతోటి ఎవరికి ఎటువంటి వైద్య సహాయం కావాలనేది గుర్తించడం జరుగుతుందా అండి? ఆ మనం ఇప్పుడు మొట్టమొదట ప్రాథమిక survey గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత ఇంటింటి సమగ్ర సర్వే అయినటువంటిది కూడా మీకు చెప్పడం జరిగింది. దీనివలన గ్రామాలు ఎన్ని, గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎంతమంది, కుటుంబాల్లో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది, వాళ్ళ అనారోగ్యములు ఏమిటి, వాళ్ళకు కావలసినటువంటి మందులు, డాక్టర్స్ ఏమిటి అనేటువంటిది మనం గుర్తించగలిగాం. ఇక రెండో stage లో ఏం చేస్తామంటే, ఇది camp ఒక ఆదివారం నాడు conduct చేసినa camp నిర్వహణకి శనివారము ఆదివారము రెండు రోజులు camp నిర్వహణ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. camp నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి శనివారము camp నిర్వహణ పూర్తిగా ఆదివారం జరుగుతుంది. దీనికి ముందుగా ఏం చేస్తామంటే camp కి కావలసినటువంటి checklist అనేటువంటిది ఎప్పుడు నుంచో తయారై ఉన్నది మా దగ్గర. దాంట్లో ఐదు విభాగాలు ఉంటాయి. checklist లో మొట్టమొదటిది సర్వే ప్రకారము ఎన్ని రకముల జబ్బులు ఉన్నవి, దానికి కావలసిన డాక్టర్లు ఎవరు? ఎక్కువ మంది ఎప్పుడు మిగతా TB ఉంటే heart chest మీద ఆధారపడినటువంటి doctor ని తీసుకెళ్లాల్సి వస్తుంది. జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, dysentery ఎక్కువ ఉందంటే సాధారణ వ్యాధులకి సంబంధించిన general physician తీసుకెళ్లవలసి వస్తుంది. cardiac problem ఉంటే super specialty doctor cardiac surgeon physician తీసుకెళ్లవలసి వస్తుంది. అట్లా డాక్టర్స్ ని నిర్ణయం చేస్తాం. డాక్టర్స్ తో పాటు ఏ స్థాయిలో జబ్బు ఉన్నది, ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి మందులు కొనడం అనేటువంటిది ఒక second stage లో జరుగుతుంది. మూడు, ఈ camp మొత్తం నిర్వహణకి ఈ మందులు, డాక్టర్లకు కూడా మధ్యలో ఉన్నటువంటి paramedical staff. ఈ doctor గారు prescription చేస్తారు. ఆ మందులు ఇవ్వాలి కాబట్టి నిష్ణాణత కలిగినటువంటి paramedical staff మన దగ్గర సుమారు ఒక అరవై యాభై మంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఎంతమందిని తీసుకెళ్లాలి అని నిర్ణయించి వాళ్ళని తీసుకెళ్తాం. దీంతో పాటు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ వ్యాధులను మనం గుర్తించాలంటే కొన్ని రకములైనటువంటి test లు చాలా అవసరం. అవును. అంటే blood test, urine test, x-ray, ECG ఇవి అవసరం. అవునండి. దీనికి సంబంధించినటువంటి technicians ని సంబంధించినటువంటి పరికరాలను కూడా మనం తీసుకెళ్తాం. ఇది అంతా కూడా medical కి సంబంధించినటువంటి. ఆ. మరి camp నిర్వహణకు కావలసినటువంటి టెంట్లు, రూములు, tables, chair లు, ఆ registration చేయడం, వాళ్ళని ఒక queue విధానంలో పంపడానికి కావాల్సిన material అంతా కూడా ఒకటి. ఉమ్. మరి patient లు ఎంతో దూరం నుంచి వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు మరి తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉండాలి కాబట్టి వాళ్ళకి ప్రసాద వితరణ, స్వామి వారి యొక్క ఒక photo ఇవ్వడం, స్వామి వారి యొక్క విభూది ఇవ్వడం, ఇదంతా కూడా తయారు చేయడానికి తగినటువంటి వంట ఏర్పాట్లు అనేటువంటివి కూడా జరుగుతుంది. మనతో పాటు మన సేవాదళ్ సభ్యులు, మన సేవాదళ్ సభ్యులు తర్వాత అక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తాం. మరి దీనికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది శనివారం నాడు వెళ్ళవలసినటువంటి సేవాదళ్ సభ్యులు ఎవరు, ఏయే material తీసుకెళ్లాలి, ఏ విధంగా దాన్ని transport చేయాలనేటువంటి శనివారం plan చేసుకొని తీసుకెళ్తాం. ఆదివారం నాడు ఎవరెవరు రావాలి, doctors అందరూ ఆదివారం వస్తారు, paramedical staff వస్తుంది, మిగతా staff వస్తారు. వీళ్ళందరినీ కూడా ఆదివారం.వస్తారు వీళ్ళు వచ్చినప్పటికీ శనివారం వెళ్లినటువంటి ఎవరైతే సేవాదళ సభ్యులు volunteers ఉన్నారో వాళ్ళు అక్కడ ఆ center లో మొత్తం camp కావలసిన ఏర్పాట్లు అంటే ముందుగా మనం స్వామివారి చిత్రపటం ఏర్పాటు చేయడం దాని తర్వాత అక్కడ ఆ tents ఏర్పాటు చేయడం doctors కూర్చోడానికి tables ఏర్పాటు చేయడం registration counter లు ఏర్పాటు చేయడం medicines distribute చేసే counter ఏర్పాటు చేయడం water ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసి ఉంచుతాం ఆదివారం ఉదయం doctors వస్తారు ఈ doctor లు వచ్చే లోపుగానే ఆదివారం ఉదయం మనం అక్కడ ఓంకారము సుప్రభాతం తెల్లవారుజామున చేసి గ్రామ సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తాం గ్రామ సంకీర్తన గ్రామ సంకీర్తన ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి hostel ఉంటే hostel అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని గ్రామంలో సుమారు నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా మనం గ్రామ సంకీర్తన నిర్వహించి స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత doctors వస్తారు తొమ్మిది గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం start చేసి వచ్చినటువంటి patient లు అందర్నీ కూడా registration చేస్తాము registration లో patient ని అడగడం జరుగుతుంది మీకు ఏమి వ్యాధి ఉన్నది కంటి వ్యాధి ఉంది అని చెప్తారు ఇంకొక వ్యాధి కూడా ఉండొచ్చు అది రెండోది కింద రాసుకుంటాం మూడోది రాసుకుంటాం అప్పుడు ఆ వ్యక్తిని [కొక్కు] ముందుగా eye department కి రెండవసారి general department కి ఇంకొక వ్యాధి ఉంటే ఆ వ్యాధికి పంపడం మూడింటికి సంబంధించిన ఏవైనా test లు చేయాల్సి వస్తే ఆ test లు చేయడానికి కూడా పంపించి test లు వచ్చిన తర్వాత మందులు prescribe చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం treatment చేస్తాం దీంతో పాటుగా చాలామందికి గిరిజనులు కాబట్టి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు వైద్యం లభించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలికముగా బాధ పడుతున్నటువంటి వ్యాధులు ఉంటాయి వాటికి పరిష్కారం ఉండదు వాళ్ళకి అటువంటి వారిని గుర్తిస్తాం ఇందులో దీర్ఘకాలికంగా గుర్తించడం అనేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి కంటి వ్యాధులు ఉమ్ రెండు మహిళలకు సంబంధించినటువంటి గర్భకోశ వ్యాధులు ఉమ్ మూడు TB ఇది TB అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి communicable TB కాకుండా ఉండేటువంటిది communicable TB అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది ఉమ్ దీని గురించి మనం survey చేస్తాం నాల్గవది epilepsy అంటే మూర్చ వ్యాధి ఇది కూడా ప్రమాదకరమైనటువంటి దీంతో పాటుగా ఇంకేమైనా చర్మ వ్యాధులు గాని ఇంకేమైనా ENT వ్యాధులు గాని ఉంటే వాటిని గుర్తించి ఆ వ్యక్తులకి వేరేగా మనం identification చేసి వాళ్ళను ఒక register నందు name out చేయడం జరిపి వాళ్ళని వేరేగా కూర్చోబెట్టి నాయనా నీకీ వ్యాధి ఉన్నది ఈ వ్యాధి వల్ల నీకీ problem ఉన్నది దీని వల్ల భవిష్యత్తులో ఇన్ని ఇబ్బందులు పడతావ్ దీనికి మేము విశాఖపట్నం నిన్ను తీసుకెళ్లి ఉచితంగా వైద్యం చేయించి నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాం మీరు రాగలుగుతారా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు అని వాళ్ళని మనం అవగాహన చేసి ఉమ్ వాళ్ళకు ఒక date ఇచ్చి వాళ్ళని విశాఖపట్నం తీసుకు వచ్చి వాళ్ళకు అవసరమైతే operations మందులు ఉమ్ ఈ విధంగా చేసి వాళ్ళకి దాన్ని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే అక్కడ చికిత్స చేయించుకునే నిమిత్తం వచ్చేటువంటి రోగులకి వారికి అవసరమైనటువంటి మందులు భగవాన్ బాబా వారి ప్రసాదం ఇస్తున్నారన్నమాట అయితే ఈ శిబిరాల వల్ల సేవలందుకున్నటువంటి ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఏ విధంగా స్పందిస్తున్నారో కాస్త తెలియజేస్తారా అండి మాకు ఆ ఇది మంచి ప్రశ్న అండి ఈ మధ్యకాలంలో అంటే ఈ నెలలో తొమ్మిదో తారీఖున ఆరు తారీఖున రావణాపల్లి అనేటువంటి గ్రామం కొయ్యూరు మండలంలో ఒక ఈ ఉచిత సమగ్ర వైద్య సేవా శిబిరం నిర్వహించడం జరిగింది అక్కడున్నటువంటి సమగ్ర గిరిజన బాలిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఉమ్ అక్కడ ఉన్నటువంటి జయంత్ సూర్యనారాయణ అనేటువంటి hostel ward welfare officer మరియు అక్కడ ఉన్నటువంటి principal మేడం ఐదు వందల ఇరవై ఒక్క మంది గిరిజన బాలికలు ఉన్నటువంటి hostel అండి వారందరూ కూడా మాకు ఈ camp ముందు పెట్టమని అక్కడ వారు అవకాశం ఉండడం జరిగింది ఈ camp నిర్వహించినప్పుడు అక్కడ వారు ఎట్లా మీరు ఆనందించారు camp ని camp వల్ల ఏమి లబ్ధి పొందారు అని మీరు అవును అంటున్నారు ఈ camp నిర్వహించడం వల్ల ఏ విధమైనటువంటి లబ్ధి పొందారో వారి ఆనందాన్ని వారి మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు వినండి సాయిరాం సార్ సాయిరాం మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు సార్ ఇక్కడ ఆసుపత్రిలో doctor గా వస్తాను జయంత్ సత్యనారాయణను ఇక్కడ సత్సాయి సేవా సంస్థ వాళ్ళు medical camp conduct చేస్తున్నారు అవును సార్ మీ అభిప్రాయం ఏంటి అండి ఈ camp మీద ఇటువంటి camp లు మై ఇలాంటివి మా చుట్టుపక్కల hostels లో అయితే ఇంకా mobilize అవుతుంది పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు అసలు ముందు భగవంతుడి కన్నా భక్తుల్నే గౌరవించారండి ఉమ్ అంత Sai devotees ఇక్కడ పాదం పెట్టడం వల్ల ఏంటంటే మా యొక్క schools గాని hostels గాని పునీతమైపోతాయి పునీతమైపోయి మీ యొక్క సేవా కార్యక్రమాలు చూసి ఆదర్శంగా తీసుకుని ఇక్కడి పిల్లలు కూడా మీలాగే work చేస్తారండి that is main అండి అది మా ఉద్దేశ్యం సార్ ఇప్పుడు సత్సాయి సేవా సంస్థలు కాకుండా ఇలా ఎవరైనా ఇక్కడికి రావడం జరిగిందా ఆరోగ్య శిబిరాలవి conduct చేయడానికి first time మీరే చేశారండి ఈ ఆరోగ్య శిబిరం నిర్వహించిన విధానం ఉమ్ doctors లు ఆహ్ నా రోగులతోటి ఎలా మాట్లాడారు పిల్లలకి చెప్పిన ఆరోగ్య సూత్రాలు ఉమ్ దీని మీద మీ స్పందన ఏమిటి సార్ వాళ్ళని చూసి ఎంత మంచిగా నేర్చుకోవాలండి అంత చక్కగా చేస్తున్నారు ప్రతి ఒక డబ్బున్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఒక రోగమున్నవాళ్ళు రోగులు അനി వాళ్ళు అక్కడ అందరినీ సమానంగా చూస్తూ సమానంగా సేవ చేస్తున్నారండి ఇలాగే మీకు two months కి three months కూడా ఒక చిన్న చిన్న mini camps అయినా పెడితే మాకు ఒక tribals లో మంచి చైతన్యం వస్తుంది చైతన్య awareness వస్తుంది వాళ్ళు కూడా మీరు ఇవన్నీ ఇక్కడ నేర్చుకున్నవి మీ సేవాధారాలు చేసే కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా inspire అయ్యి వాళ్ళ గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళలో పెట్టుకుని అందరూ బాగా motivate అవుతారు తర్వాత ఇక్కడ ఇటువంటి hostel లో పెట్టడం వల్ల ఏంటంటే remote areas నుంచి పిల్లలు ఇక్కడికి వస్తుంటారు ఆ మీరు చేసే సేవా కార్యక్రమాలు మీరు చేసే ఆదరణ నేను చూస్తున్నా కదండీ ఒకబా బాగా ముసలి వాళ్ళని చిన్న పిల్లల్ని వాళ్ళు అందరు కూడా ఎవరికి చేసి విధంగా వాళ్ళకి లోడి మీద ఏది పెట్టడం వాళ్ళకి అసలు ఏ సెక్షన్ తీసుకెళ్లడం వాళ్ళని ఇంకో సెక్షన్ తీసుకెళ్లడం అది ఏ మాత్రం విసుక్కోకుండా ఒక భగవంతుడు సేవ చేస్తున్నట్టే చేస్తున్నారు కాబట్టి ఇటువంటి క్యాంప్స్ ఈ Tribal areas లో పెడితే వా దాంట్లో awareness వచ్చి మా పిల్లల్లో కూడా ఆహ్ పిల్లల్లో కాకుండా గ్రామాల్లోనూ వాళ్ళ పే తల్లిదండ్రులు కూడా ఏ బ్రహ్మాండమైన మార్పు వస్తుందండి. మీరు రావడం కాకుండా బాబా ఏదో రూపంలో ఇక్కడ వస్తారండి. ఆ అంటే మనం ఒకేలా అట్ట ఐడెంటిఫై ఎస్ ఆయన్ని ఐడెంటిఫై చేయాలంటే మనం ఎంతో జ్ఞానులం అవ్వాలి. ఏ రూపంలో వస్తున్నా గుర్తించడం. సరి సార్ సాయిరాం ఇప్పుడు ఈరోజు సత్యసాయి సేవా సంస్థల తరపున ఆరోగ్య శిబిరం పెట్టారు కదా మాకిలా- ఇది ఫస్ట్ టైం మేము చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం అండి. ఇంతవరకు కూడా పిల్లలు కడుపు నొప్పి అవి మాములుగా ఒక్కొక్కళ్ళకి సేవ చేయగలుగుతున్నాం అండి. బాబు లేదా అమ్మాయి అని తీసుకెళ్లగలుగుతున్నాం. ఆ ఒకేసారి అందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ మెడిసిన్స్ వీళ్ళకి ఫ్రీక్వెంట్ గా అందిస్తున్నందుకు పిల్లలు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. చుట్టు ప్రక్కల గ్రామాల కూడా చాలా మంది వచ్చారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మెడిసిన్ సవన్నీ ఇవ్వడం ఆ బట్టలు ఇవ్వటము ఆ వాళ్ళని Encourage చేయటము ఆ అది మాకు చాలా నచ్చిందండి. మామూలుగా సత్యసాయి సేవా సంస్థకు చెందిన సభ్యులు భక్తులు వాళ్ళు ఇచ్చే విధానం పట్ల మీకు ఎలా అనిపిస్తున్నాదంటే? మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా చేస్తున్నారండి. చాలా అది చూడటానికి వినటానికి అంతా కూడా మాకు చాలా హ్యాపీగా ఉందండి. నిన్న సాయంత్రం అండి మా స్టూడెంట్స్ అందర్నీ Gather చేసి చక్కని పాయింట్స్ సైన్స్ సంబంధించిన విషయాలు ఆరోగ్యం విషయాలు మంచి అలవాట్లు ఆ Health and Hygiene గురించి ఆ బోధ పరిచారు. ఆ పిల్లలందరితో కూడా వాగ్దానం చేయించుకున్నారు. మేము తప్పనిసరిగా ఇది పాటిస్తాము. వినటం వరకే కాదు ఆచరణలో పెడతాము ఆ అని పిల్లలతోను ఆయన స వాళ్ళంతట వాళ్ళు చెప్పేటట్టుగా చేయించారండి. ఆ రేపటి నుంచి మేము ఆ ఈ శిబిరం- ఈ శిబిరం వల్ల మాకు చాలా ఉపయోగం అనిపించింది. ఈ శిబిరం ద్వారా ఇలాంటివన్నీ చేయాలి, ఆరోగ్యానికి చేయాల్సిన విషయాలు వాళ్ళకి తెలిసాయి ఎటువంటి ఆహ్ చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకి తెలిసిందా? తెలిసిందండి. ఇప్పుడు మామూలు పిల్లలకైతే పేరెంట్స్ చెప్తారండి. ఆ వీళ్ళు మేమే పేరెంట్ వండి ఇక్కడ. ఆ టీచర్స్ వార్డెన్ హెచ్ఎం సేమ్ ఇక్కడ పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి ఇలాంటి శిబిరాలు పెట్టి వా ఈ విషయాలన్నీ తెలియపరుస్తుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది జీవితంలో అనే భావం మాలో కలిగిందండి. ఆ ఇప్పుడు పిల్లలకు తెలియవలసినవి చిన్న చిన్న విషయాలే కొన్ని తెలియకపోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ చెప్పలేరు. అవును అలాంటివి శిబిరాలు పెట్టడం వల్ల ఆ చాలా చక్కని విషయాలు ఆ టూ అవర్స్ చాలా ఓపికగా చెప్పారు. ఆ మీ పిల్లలందరూ కూడా ఎంతో ఓపికగా నైట్ అనేది చూడకుండా ఆయన చెప్పిన విషయాలన్నిటినీ కూడా చాలా చక్కగా గ్రహించారండి. చాలా బాగుందనిపించింది. ఎక్కడో ఉండి ఇక్కడ పిల్లల కోసం మీరే తల్లిదండ్రిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. థాంక్ యు సర్ సారి స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. థాంక్ యు సర్ సాయిరాం అమ్మ చాలా సంతోషం సాయిరాం చాలా సంతోషం సాయిరాం. ఏ ఊరు నుండి వచ్చారు? పల్లె ఊరు నుంచి అండి. పల్లె ఊరు. మీ వయస్సు ఎంతుంటది? ఏమో గాని నాకు తెలియదు. తెలియదా? ఇక్కడ ఏం చేస్తుంటారు? ఏం చేయకుండా కూలి పని కూలి పని చేస్తున్నారా? ఇప్పుడు మీకు ఆరోగ్యం బాలేదు కదా, మందులు ఎవరైనా ఇచ్చారా ఇంతవరకు? ఇంతవరకు ఎవడూ పని చేయలేదు కదా అని మళ్ళా ఈ వేళ పట్టుకొచ్చారు. ఈ వేళ వచ్చారు. ఆ ఇవాళ డాక్టర్లు బాగా చూశారు కదా? బా చూశారు. ఆ బాగా ప్రేమతో చూశారు. బానే చూశారు. మందులిచ్చారు. ప్రసాదం ప్రసాదం ఇచ్చారు. సాయిరాం. సంతోషం ఉంది కదమ్మ? ఉంది. నాకు గర్భాశయ ఆపరేషన్ చేయించారండి బాబా. ఆ బాబా వచ్చి ఆ లేపి ఆ లెక్కి వారం పుట్టినరోజు నాడు అవుతది యాడ కన్నారండి. ఊ పుట్టినరోజు నాడు చేశారండి బాబా గారు వచ్చి. ఊ ఆపరేషన్. ఊ ఇమ్మీడియేట్ ఇంటికి అయిపోయిందండి. ఊ గర్భాశయ ఆపరేషన్. సాయిరాం అమ్మ సాయిరాం సాయిరాం. ఏ కార్యక్రమం చేసినా మానవ సేవయే మాధవ సేవ అని తను ఆచరిస్తూ ప్రపంచాన్ని ఆచరింపజేస్తున్నటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే కాకుండా వారి మార్గదర్శకం వలన మాత్రమే ఈ కార్యక్రమాల్ని నిర్వహింప చేయడం జరుగుతుందండి. ఇది వ్యక్తిగతంగా మా యొక్క గొప్పతనం కాదు. భగవంతుడు మాలో ప్రవేశించి ఈ కార్యక్రమాన్ని మా ద్వారా నిర్వహింపజేస్తున్నారు. మమ్మల్ని ఒక సాధనలో ఆయన యొక్క కార్యక్రమంలో పనిముట్లుగా వాడుకుంటున్నారు. ఈ ఉచిత సమగ్ర వైద్య సేవా శిబిరము అనేటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది అని మేము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం. ఆ ఒక భావన మాలో స్వామి పెంపొందింపజేసి ఏకాత్మ భావంతో ఎంత మారుమూలలో ఉన్నటువంటి వ్యక్తికైనా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సత్య సాయి సేవా సంస్థల ద్వారా అందించేటువంటి ఒక చక్కటి పథకాన్ని స్వామి రచించి మా చేత నిర్వహింపజేస్తున్నారు. అట్టి స్వామివారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై సాయిరాం. సాయిరాం. [backgroud music] ఇంతవరకు మీరు విశాఖపట్నంలో ఎంతో విజయవంతంగా చేపడుతున్నటువంటి సమగ్ర ఆరోగ్య కేంద్రం యొక్క వివరాలను విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం. [background music]
SSSMC · audio
Telugu Broadcast - 396
Telugu Broadcast - 396
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 1:00:17
More in this series
Telugu Broadcasts
- 57 min 394
Telugu Broadcast - 394
- 1 hr 396
Telugu Broadcast - 396
Now playing - 58 min 402
Telugu Broadcast - 402
- 58 min 420
Telugu Broadcast - 420
- 56 min 424
Telugu Broadcast - 424
- 57 min 427
Telugu Broadcast - 427
- 57 min 490
Telugu Broadcast - 490
- 56 min 491
Telugu Broadcast - 491
- 56 min 498
Telugu Broadcast - 498
- 58 min 555
Telugu Broadcast - 555
- 57 min 560
Telugu Broadcast - 560
- 58 min 561
Telugu Broadcast - 561