No transcript for this section.
[సాయి బాణీ] ఓం శ్రీ సాయిరాం రేడియో Sai శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా సాయి వాణిలో రామతత్వ ఆదర్శం శీర్షికలో తొమ్మిదవ భాగాన్ని మీరు వింటారు. ఈ శీర్షిక యొక్క ఎనిమిదవ భాగం ఫిబ్రవరి ఇరవై రెండు, రెండువేల పది న ప్రసారం చేయబడింది. ఈ శీర్షిక యొక్క పదవ భాగం మార్చి ఎనిమిది, రెండువేల పది న రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం చేయబడుతుంది. తదుపరి స్వామి వారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు యోగ త్రివేణి అనగా కర్మ, భక్తి, జ్ఞాన యోగములలో గల ముఖ్యమైన అంశాలను గూర్చి ప్రసంగిస్తారు. ఇప్పుడు సాయి వాణిలో రామతత్వ ఆదర్శం శీర్షికలో తొమ్మిదవ భాగాన్ని మీరు వింటారు. [సాయి బాణీ] రామ కథను వినరయ్యా రామ కథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామ కథను వినరయ్యా రామ రావణ సంగ్రామం, సుగ్రీవ విభీషణుల సంయుక్తత్వం, రావణునికి విభీషణుని హితబోధ, విభీషణుని వ్యక్తిత్వం. ధన్యుడు, పుణ్యుడు, ధార్మికులు అయినటువంటి ఇద్దరే వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. ఒకడు సుగ్రీవుడు, రెండవడు విభీషణుడు. ఈ సుగ్రీవ విభీషణుల యొక్క చరిత్రలు మహా పవిత్రములైనటువంటివి. రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ పోయిళ్ళాడు. సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు. రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు. రామచంద్రుని స్నేహిత్వం కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు. కానీ రాముని యొక్క ఆశ్రయం చిక్కక పూర్వమే విభీషణుడు రాముడు దయామయుడు అని గుర్తించాడు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్నేహితుడు రామునకు కలగటం చాలా ఆనందమని అనిపించింది రామాయణం. మహాభారతము పద్దెనిమిది దినములు జరిగింది. కానీ రామ రావణ యుద్ధము డెబ్బైఅయిదు దినములు జరిగింది. భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా ఇవి దినములకు మాత్రమే లెక్క చూడనివి. ఇవి కేవలము ప్రవృత్తి యొక్కల అంకెలు కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికినీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగము నందు కౌరవులు పాండవులు, రాములు రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు. [బాణాస్త్రం శబ్దం] సత్య అసత్యములకు నిరంతరము కూడను సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి. ధర్మ అధర్మములకు హృదయము నందు నిరంతరము సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యొక్క సంగ్రామములు, ఈ సంఘర్షణలు ఏనాటికి మారునో, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవునో ఇది ఎవ్వరూ చెప్పలేరు. దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేతకాదు. అందులో పరధనాహరణ అనున పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరస్త్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తములను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికూడను అర్థం కాదు. మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది. ఈ డెబ్బైఅయిదు దినములు జరిగినటువంటి యుద్ధములో నిత్యమూ అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు. ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకిష్టం లేదు. కనుక యుద్ధభూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి. ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క కోషము చేత రామలక్ష్మణులను మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞం జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు. ఆ ముందు దినమే లక్ష్మణ మూర్ఛకుడను జరిగింది. రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కుర్చీని పెట్టుకొని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ ఇంద్రజిత్తు మండి అయినటువంటి కోపంతో, "విభీషణ! నీవు కులద్రోహివి, రాజ్యద్రోహివి" అని అమితంగా దూషిస్తూ వచ్చాడు. అప్పుడు విభీషణుడు కూడను సత్యమును గుర్తించ చేయాలనే ఉద్దేశ్యం కలిగి ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము. అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడను రాక్షసులకు సహజము.నేను కాదు ఏనాటి నుండియో నేను రావణుడికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను. పరస్త్రీ అపహరణం అనేటువంటిది మహా పాపం అని బోధించాను. ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైన హీనము జరుగుతుంది. నీ జాతినే నీవు సంహరింప చేసుకుంటున్నావు. నీ రాజ్యమునే నీవు మంట కలుపుతున్నావు. ఇది మంచిది కాదు మంచిది కాదని అనేక విధములుగా బోధించాను. ఇదే ఒకానొక సమయంలో కుంభకర్ణుడు, రావణుడు, శూర్పణఖ ఇరువురు కూడా కలిసినప్పుడు చెప్పారు. విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను. ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను. కనుకనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను అని రావణుడు తన నోటి నుండి చెప్పాడు. అనగా ఈ రాజ్యమునకు, ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రి యా? తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు. మంచి మాటలు అతనికి ఏ మాత్రం కూడానూ అర్థం కాలేదు. ధర్మం అంటే ఎరుగనటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థం అవుతాయి? అధర్మమే అతనికి ప్రీతి, అసత్యమే అతనికి ఆనందము, దుర్మార్గమే అతని ప్రాణము. ఇట్టి దుర్భావములు, దుర్సంగముతో కూడినటువంటి రావణుని యొక్క హృదయము ఏ రీతిగా మారుతుంది? తన చేతులారా తాను రాజ్యమును భస్మం గావించుకున్నాడు. రాజ్యమును నాశనం చేసినది నేను కాదు. ఇంతే కాకుండా ఇంద్రజిత్తు మరొక ప్రశ్న వేశాడు. పోనీ నీ మాట వినకపోతే నీవు మధ్యస్తుడిగా ఉండవచ్చును కానీ, విరోధులైనటువంటి వారితో నీవు చేరి ఈ విధముగా యుద్ధము చేయటము చాలా మంచిది కాదన్నాడు. ఇంద్రజిత్తు సత్యమును ఎరుగనటువంటి మూర్ఖుడవు నీవు. ధర్మాధర్మములు ఎరిగినటువంటి వాడు నేను. ధర్మాధర్మములు తెలిసి కూడను నేను మధ్యస్తుడిగా ఉండటము ఇది మంచిది కాదు. ధర్మాధర్మములు సమాజమునకు తప్పక చెప్పు తీరాలి. నేను మధ్యస్తుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది. కనుక నేను మధ్యస్తుడిగా ఉండటం వీలు కాదు. నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము. ఇది నా పుణ్యఫలము, నా జన్మాంతర సుకృతము. సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది. అతని సన్నిధియే నా పెన్నిధి. నీవేమైనా భావించు అన్నాడు. కానీ, ఆనాటి నుండి కూడను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండుటమూ అందరికీ తెలుసు. ఒక్క విభీషణుడే కాదు, ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు. కానీ దుర్మార్గమునకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమియు చేయలేనిటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు, ఈ వాయుపుత్రునితో నేను మొరపెట్టుకున్నాను. నేను కేవలము దంతముల మధ్య నాలుకవలె నేను జీవిస్తున్నాను. లంక అంతా కూడను మహా రాక్షసులే. వారి మధ్యలో నేను మెత్తని నాలుకవలె నేను జీవిస్తున్నాను. ఎంతకాలం నేను ఈ విధంగా జీవించాలి? ఏనాడు నాకు శ్రీరామానుగ్రహం నాకు ప్రాప్తిస్తుంది? ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది? ఆ క్షణ నిమిత్తమే నేను, నేను క్షణములంతా వేచి ఉంటున్నాను. అంతే యే కాదు అప్పుడు హనుమంతుడు కూడను విభీషణునికి చక్కని ఆదేశం నిచ్చాడు. విభీషణా! నీకే కాదు ఈ లోకములో మంచివారికి అందరికి కూడను కొంతమంది దంతములువలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు. మహనీయులకు, తపస్సులకు, అవతారములకు అన్నింటికి కూడను ఇలాంటి దుష్టులైనటువంటి, దుర్మార్గులైనటువంటి, రాక్షసులైనటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో. నీతో పాటు పుట్టినదది ఈ నాలుక, మధ్యలో పుట్టినటువంటివి దంతములు. అనగా సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వం పరమం వదామి జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహా పవిత్ర రాళ్లు. మహా సద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక. మహా మధురమైనటువంటిది ఈ నాలుక. సత్య స్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక. నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక. నిర్ణయమును పరిచేటువంటిది ఈ నాలుక. ఇది మొదలు నీతోనే పుట్టింది. ఇదియే సద్గుణములు కలిగినటువంటి ఒక మహనీయుల యొక్క తత్త్వము. నాలుక మహా మహనీయుల యొక్క స్వరూపం ధరించింది. దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు. ఏ ఒక్క విషయాన్ని కూడను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తూ ఉంటాయి ఈ దంతములు. కానీ, నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు. పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులను, ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటాది. అనగా మహనీయులకు ఎన్ని విధములైనటువంటి ఆపత్తులు సంభవింపచేసినప్పటికినీ, ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దుర-దురమాకంతో అనేక ఆపత్తులను కల్గింపచేసినప్పటికినీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాది. కనుకనే నాలుక మహనీయుని యొక్క స్వరూపము. దంతములు దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు. వారు ఎంతకాలం కూడను దాన్ని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ, సహాయం చేసేటువంటి వారు కాదు. అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. విభీషణునికి లంక పైన ఆశ మాత్రమే ఉన్నది తప్పులేదు. కానీ, ఈ సింహాసనాన్ని కోరలేదు.రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు. ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు ఇంద్రజిత్తు. ఇంతే కాకుండా ఈ యుద్ధభూమి లోపల హనుమంతుని తీసుకుని వెళ్ళి అతనితో పాటు లక్ష్మణ్ణి కూడా తీసుకెళ్లి వెళ్ళి ఈ రావణాసురుని యొక్క కుమారుడు అయినటువంటి ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు. నల్లటి మారేడు చెట్టు. ఆ చెట్టు కింద అనేక నరబలులంతా గావిస్తూ వచ్చాడు. ఆ చెట్టుకు సమీపంగా ఉండినంతవరకే ఆ శక్తులంతా ఉంటాయి. కనుక సాధ్యమైనంతవరకు కూడానూ ఆ యొక్క దుర్మార్గుడ్ని ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు. ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు. అప్పుడు ఈ రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఈ విభీషణుడ్ని మరింత తిరస్కరిస్తూ వొచ్చాడు. నా రహస్యములన్నీ కూడానూ, లంక రహస్యములన్నీ కూడానూ ఎదురు దుర్యోధనులనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తన్ను నిందిస్తూ వచ్చాడు. చెప్పాడు, "రామునకు ఏ ఆశలు లేదు. రామునికి నీ లంక కావాలని ఆశించటం లేదు. అయోధ్యనే త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంక పైన తనకెందుకు అభిష్టము? కేవలము సీత నిమిత్తమై నీ లంకలో ప్రవేశించాడే కానీ లేకుంటే రామునకు ఏ ఆశ లేదు. అతను నిర్మల చిత్తుడు, నిస్వార్థపరుడు, శాంతమూర్తి." ఇలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించటం రాక్షసులకు ఏ మాత్రము వీలు కాదు. రాక్షసుడు ఎప్పుడికూడనూ అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యంలో ప్రవేశించటమే వారికి సాజ ధర్మముడు. అవ్వే వారికి మాధుర్యము, అవ్వే వారికి ప్రాణము. వారి చింతనలు చేయటమే వీని యొక్క శ్వాస. ఇలాంటి రావణాసురుని యొక్క త-సమస్త లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వమైనటువంటి రాములను విమర్శించటము మంచిది కాదన్నాడు. రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేకమంది అనేక విధములైనటువంటి యొక్క సాధనలు సలిపి ప్రాణాలను కూడానూ త్యాగం చేసేటువంటి మహనీయులున్నారు. అదే చిత్రకూట పర్వతం పైన తులసీదాసు నిరంతరము కూడనూ రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు. గోదావరి తీరమునకు వెళ్ళేది, స్నానం చేసేది, ఆ నీరున్ తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు. ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయల్దేరి వచ్చింది. "తులసీదాసు! నీవు నిత్యమూ రామాయణ చరిత్రమును, ప్రభోదనము చదువుతున్నావు. ఆ ప్రభోదనము సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు. అతను కన్నీటి ధారలు కార్చుతూ నీ యొక్క ప్రభోదనము చక్కగా, ఆనందంగా వింటున్నాడు. అతను ఎవరో నీకు తెలియదు. రేపటి దినము అతని వద్దకు వెళ్ళి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకో" మన్నాడు. చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది. రెండవ దినమునకై వేచియున్నాడు ఈ తులసీదాసు. "కంజలోచన కంజముఖకర కంజపాదానందము" అని ఆ యొక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు. "రామచంద్ర కృపాళుదయనిధీ! ఓ రామచంద్రా! ఓ కృపాళు! ఓ దయనిధీ!" అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ గంధం తీసి పక్కన పెట్టి తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్ళి పాదములు గట్టిగా పట్టుకున్నాడు. ఆ వృద్ధుడు, "నాయనా! నీకేం కావాలి? కోరుకో" మన్నాడు. "నాకు ఏమీ అక్కర్లేదు. ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతురి దర్శించాలి." అప్పుడు చెప్పాడతను, "రామచంద్రుని దర్శనం నా హస్తములో లేదు. కానీ నీకు లభ్యమవుతుంది. కొంతకాలం వేచి ఉందు" అన్నాడాయన. ఆ వృద్ధుడు ఎవరు? హనుమంతుడే. ఎక్కడ రామచరితము జరుగుతూ ఉంటాదో, ఎక్కడ రామ పారాయణం జరుగుతూ ఉంటాదో, ఎక్కడ రాము యొక్క సంభాషణలు జరుగుతూ ఉంటాదో అక్కడ అంతాకూడానూ హనుమంతుడు present అయి ఉంటాడు. ఈ ప్రభోదనలంతా విని తాను తన్మయత్వంలో గా అయిపోతున్నాడు. మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసీదాసు. ఒక పిల్లవాడు వచ్చాడు. "తాతా! నాకా గంధాన్ని ఇస్తావా?" అన్నాడు. తప్పక నాయనా తీసుకోమని ఇచ్చాడు. అతను ఇస్తున్న సమయంలోపల ఆ పైన ఉన్నటువంటి ఈ యొక్క వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి. సాక్షాత్ శ్రీమన్నారాయణ రామచంద్రుడే వచ్చి బాల రూపంలోపల గంధమును తీసుకునుచుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసీదాసు గుర్తించుకోలేకపోతున్నాడు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు. అడవుల యందున్న, ఆకాశమున నున్న, పట్టణమున నున్న, పల్లె నున్న, గుట్టమీద నున్న, నట్టేటబడి యున్న, దిక్కులేని వాని దోచునతడు, బ్రోచునతడు. అడవుల యందున్న, ఆకాశమున నున్న, పట్టణమున నున్న, పల్లె నున్న, గుట్టమీద నున్న, నట్టేటబడి యున్న. ఎక్కడ ఉండినప్పటికినీ తాను అక్కడనే తన వెంట ఉంటూ ఉంటాడు. అలాంటి రామచంద్రుడ్ని ఏ రూపంలో వస్తాడో, ఎక్కడ వస్తాడో అది గుర్తించుకోలేకపోయాడు తులసీదాసు. కానీ తరువాత రెండవ దినము ఆ వృద్ధుడు వచ్చాడు. "నాయనా! నిన్నటి దినము నీవు చూచావా?" అన్నాడు. "ఎక్కడ రామచంద్రుడ్ని నేను చూడలేదే?" "బాల స్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావ్?" అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే. सर्वतः पादिपादं तत्सर्वतोऽपि शिरोमुखं सर्वतः श्रुतिमल्लोके सर्वमावृतिष्ठति। అన్ని రూపములు అతనివే, అన్ని నామములు అతనివే.రామచంద్రుని ఒక్క రూపం కోసం నీవు ప్రార్థించడము చాలా వెర్రితనం నాయనా! రామచంద్రుడు నీ హృదయవాసిగా ఉంటున్నాడు. ఆ హృదయమే ఆ రామచంద్రుని యొక్క పీఠము. ఆ పీఠం పైన అతనికి తప్ప మరొకరికి నీవు చోటు ఇవ్వవద్దు. అనే చెప్తూ వచ్చాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాజ్ జాగ్రత జాగ్రత. నాయనా! ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ములకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారే. వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చెయ్. అది కర్తవ్యమే. కానీ హృదయ స్థానము మాత్రము ఒక్క భగవంతునిదే. అతన్ని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు. కనుకనే భగవంతున్ని హృదయవాసి అన్నారు. హృత్ ప్లస్ దయ, హృదయ. దయతో కూడినటువంటిది ఆ హృదయము. కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుణ్ణి ఉంచుకో అని తులసీదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్ళాడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడు నిరంతరం కూడను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధములైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు. విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు. విభీషణా! నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు. పట్టితివి రాముని పాదము. దానిని గట్టిగా పట్టుకో. అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి. కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు. భక్తి అంటే ఏమిటి? కేవలము రామ రామ రామ రామ అని జపం చేయటమా భక్తి? పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు. కోరినదేదియో కోరనే కోరితిరి కోరినదిడు దాక విడువకుండు. అడిగినదేదియో అడగనే అడిగితిరి అడిగినదిడు దాక విడువకుండు. తలచినదేదియో తలచనే తలచితివి తలుపు తీరెడు దాక పోవకుండు. పోరు పడలేక తానైనా బ్రోవవలయు వడలు తెలియక నీవైనా అడుగవలయు. అది లేకానీ ఇంక నీయంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు. ఇది రామభక్తి యందు ఉన్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష. ఈ విధంగా విభీషణునికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. విభీషణునికే కాదు సుగ్రీవుని కూడను బోధిస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు. ఎందుకంటే అతను కొన్ని విధమైనటువంటి రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు. చిన్న వయసు లోపలే విభీషణుడు తపస్సు గావించాడు. ఆ తపస్సు సమయములోపల బ్రహ్మ ప్రత్యక్షమై, "విభీషణా! నీకేం కావాలో కోరుకో" మన్నాడు. కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర, ఆహారం ఒక దండిగా కావాలని. కానీ కోరుకోవటంలో ఎట్లైపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు. నేను ఎప్పుడూ క్రూరుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలని కోరుకున్నాడు. నిర్దయ. ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి గనుక నాలుక మందంగా ఉండి, నిద్ర కావాలి అన్నాడట. నిద్ర వచ్చింది. అదేవిధంగా కూడను రావణుడు కూడను తపస్సు చేశాడు. దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నెరులతో, కింపురుషులతో ఎవ్వరితో కూడను నాకు మరణం రాకూడదు అన్నాడు. కానీ దుర్మార్గుడైనటువంటి ఆ రావణుని యొక్క బుద్ధి మానవుణ్ణి చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు. మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు. అది చక్కగా విష్ణువు దాన్ని పట్టి, నేను మానవావతారమును ధరించి తత్వారావితిని అతమారుస్తానన్నాడు. అప్పుడే రావణుడు గుర్తించాడు. నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే. మానవుని మాటని నేను హెచ్చరించలేదు. మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు ఆ రాక్షసుడు. విభీషణుడు తపస్సు చేశాడు. "నాయనా! నీకేం కావాలి కోరుకో" మన్నాడు బ్రహ్మ. "స్వామీ! నాకేమీ అక్కరలేదు. నిరంతరము కూడను దయామయుడనై, ఈ దయను అందరికీ పంచుతూ, నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకును దానధర్మముతో నేను జీవితాన్ని గడపాలి. దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకుడను నా మనసు కఠినంగా మారకూడదు. దయలోనే కలిగిపోవాలి." దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు. కనుకనే నిరంతరము కూడను విభీషణుడు దయామయుడిగానే ఉంటాడు. ఎన్నియో విధములు కూడను రావణాసురుడు దూషించాడు. తన కుమారులు అనేక విధముగా బాధించారు. కానీ దేనికి కూడను అతను క్రోధాన్ని ఉపయోగ పెట్టలేదు. దయతో దయతో దయతో అన్నింటిని కూడను దయతో నిగ్రహించి, దైవానుగ్రహము కోసమని పాటుపడుతూ వచ్చాడు. ఆ దయ చేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది. దైవ పాద సన్నిధి కూడను అతనికి ప్రాప్తించింది. కనుకనే ప్రతి మానవుని యెందుకుడను దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలచడానికి వీలవుతుంది. దయ లేనటువంటి వాడు మానవుడు కాదు దానవుడే. ఎలాంటి పరిస్థితులు ఎందుకుడను ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు. దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవాడైనా దయచేత ధన్యులు కావలరా. ముక్కుమూసి జపమాచరించినామొక్కుచు బాగా నిలుచుండి నా మ్రొక్కి మ్రొక్కి యెంత యెచ్చిన గాని మొరలిడినను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలెరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకు నీ యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలెరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా. ఆ దయచేతనే ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుందండి. ఇదిగో దయ లేకపోతే వాడు ఏనాటికుడ ఇంక దానవుడే కానీ ధన్యుడు కాడు కనుకనే విభీషణుడు దయామయుడుగా నిలిచాడు అందువలనే రామధర్మము యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు కట్టే ఇప్పటికీ రామాయణం అంతా కూడను సత్య ధర్మముతోనే నిండి ఉన్నది అనేక రూప నామము ధరించి అనేక చర్యలలోతను వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికిని అన్నింటి యందు ఉన్నది రెండే అనగా ధర్మము సత్యం ఇదిగో కనుక ఈనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి సత్య ధర్మ సత్య వాక్కును మనం ఉచ్చరించాలి నాలుక ఇచ్చిందేది దాని నిమిత్తమే గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసజ్ఞి మధుర ప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు అతని నామమే సత్యమైనటువంటి నామము అతని రూపమే ధర్మ స్వరూపమైనటువంటిది ఓం ఆ రూప నామములే సత్య ధర్మ స్వరూపాలు మరి వీటిని నీ శ్రీయమునందుంచుకొని జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి అదియే రామాయణం యొక్క సరి అయినటువంటి సారము ఈ సత్య ధర్మం లే రామాయణం యొక్క గమ్యము చూడండి కనుకనే క్రమక్రమీన కూడను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఇక ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి కనుక కనుక ఎట్టి సాధకులకైనా కూడను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి అసలు ఇంట్లో ఉంటాయి ఒంటిలో ఉంటాయి బయట ఉంటాయి రాజ్యంలో ఉంటాయి దేశంలో ఉంటాయి రాష్ట్రంలో ఉంటాయి ఇన్ని రకములైనటువంటి దుర్మార్గులు అతని వెంట ఆడుతూనే ఉంటాయి కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధములైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి తెలుసుకున్న ఎట్లా నీ దంతములు నాలుక ఏ విధంగా అడ్డు తగులుతుండదో దురు అట్లే తగులుతుంటాయి కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి మొట్ట మొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుక కాదు అవును ఆ దుర్మార్గులే కూలిపోతారు ఆ ఆ దుర్మార్గులే కాలిపోతారు ఆ ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు కానీ నీకెట్టి ప్రమాదం ఉండదు నిన్నెప్పుడు కూడను దైవమే కాపాడుతుంటాడు దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష పరిరక్ష భగవంతుడు ఎన్నైనా చేస్తాడు అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు వాచామగోచరుండనీ నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకొన్నాను నీది కృపకై నా మొర ఆలకించి బ్రోవుమయమా చామగోచరుండనీ కాలుడు గొనిపోయిన గురు పుత్రిని తెచ్చి ఇచ్చినావు కాలుని మదమడచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపతి హా కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను కాచినావు కుచేలుని ఆప్తి తీర్చినావు కురుప్రియైన కుభ్య వక్రములను పోగొట్టినావు వాచామగోచరుండనీ నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకొన్నాను నీది కృపకై నా మొర ఆలకించి బ్రోవుమయమా చామగోచరుండనీ చెప్పు చూస్తా ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానము చేత భావము చేత అనేక విధముగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు అందులో భగవంతుడు గాన ప్రియుడు ఆ గానము చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు కనుకనే పరమాత్ముని దగ్గరికి వెళ్ళి నారదుడు ప్రశ్నించాడట నారాయణా! నీ స్వస్థానం ఎక్కడ? హ్మ్ నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ? హ్మ్ ఎక్కడిక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి బ్రాంచ్ ఆఫీసు వైకుంఠం అంటారు కైలాసం అంటారు స్వర్గం అంటారు ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట అప్పుడు నారాయణ చెప్పాడు నాయనా ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు ఎస్ ఇగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకో మన్నాడు ఎస్ మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాడి దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను ఇంక కదలునే కదను అన్నాడు అదే శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ మై సెల్ఫ్ అంతనే భగవంతుడి హృదయవాసి ఆ హృదయవాసి తత్వాన్ని కూడను అర్థం చేసుకోవటానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పురీకృత పాతక సంసర్గం పురీకృత పాతక సంసర్గం పూరిత నానావిధ ఫలవర్గం పూరిత నానావిధ ఫలవర్గం పూరిత నానావిధ ఫలవర్గం పూరిత నానావిధ ఫలవర్గం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనేకౌసల్యా దశరథ సుకుమారం కౌసల్యా దశరథ సుకుమారం రామ కౌసల్యా దశరథ సుకుమారం కౌసల్యా దశరథ సుకుమారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం [పాట] ఇంతవరకు సాయివాణి లో రామతత్వ ఆదర్శం శీర్షికలో తొమ్మిదవ భాగాన్ని మీరు విన్నారు. ఇప్పుడు స్వామి వారి చిరకాల భక్తులు అయినటువంటి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు యోగ త్రివేణి అనగా ధర్మ, భక్తి, జ్ఞాన యోగములలో గల ముఖ్యమైన అంశాలను గురించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ వాస్తవ్యులు అయిన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రముఖ ఆయిల్ ఇండస్ట్రీ కన్సల్టెంట్ గా తమ సేవలను అందిస్తున్నారు. వారు తమకు వీలు దొరికినప్పుడల్లా కూడా స్వామి వారి అవతార వైభవాన్ని గురించి మరియు స్వామి యొక్క అవతారోద్యమాన్ని గురించి ప్రసంగిస్తూ ఉంటారు. అయితే శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగాన్ని విందామా? సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పర్ధతాన్మి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కర్మ, భక్తి, యోగ అనబడేటువంటి ఈ మూడు యోగాలని విచారణ చేశాం. అయితే విచారణ కాక ఆచరణ భావనలో దీనిని మనం ఎట్లా సాధించుకోవాలి? ఈ సాధించుకోవాలి అంటే గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, సర్వోపనిషత్తులు చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేసినాయి. అయితే అవన్నీ కూడా మన ఊహకి, మన మనసుకి, మన సంస్కారానికి, మన సాధనా తీవ్రతకి, మన ప్రాప్తికి లోబడి అర్థమయ్యేవి గాని సమకాలీనమైనటువంటి ఒక పరమాత్మ ఆచార్యవర్యుడై ఈ జగత్తులోకి వచ్చినప్పుడు ఇవే యోగాలని తాను ఎలా ఆచరించి చూపించారో మనం కొద్దిగా విచారణ చేద్దాం. చేసినట్లయితే ఓహో పరమాత్మ ఇలా ఈ మూడు యోగాలని ప్రపంచానికి సాధనా పూర్వకంగా పరిచయం చేశారు కనుక ఇది ప్రామాణికం. అంటే శాస్త్రం కంటే మిగతా అనేకమైనటువంటి విషయాల కంటే పరమాత్మ స్వయంగా ఆచార్యుడై బోధించింది సర్వకాలికమైనది, విశ్వజనీనమైనది, సర్వ ప్రామాణికమైనది గనుక భగవాన్ సత్యసాయి ఈ మూడు యోగాలని మనకి ఎలా ఆచరించి చూపించారో కొద్దిగా విచారణ చేద్దాం. ముందుగా కర్మయోగం. కర్మ అంటే పని చేయటం. పని చేయటం అంటే మానవుడు తన సహజ ప్రవృత్తితో, తనకున్నటువంటి బలంతో అది దైహిక, మానసిక, ఆధ్యాత్మిక మూడు బలాలతో కొంత ప్రయోజనాన్ని, కొంత స్వార్ధాన్ని, కొంత లాభాన్ని, కొంత అనుభవాన్ని పొందే దిశగా చేసే అన్ని పనులు కర్మలే. అంటే ఇక్కడ మానవుడు తన మేధాశక్తిని ఉపయోగించి తాను చేయవలసినటువంటి కర్మలను అంటే పనులని సర్వహితంగా అందులో తనకు కూడా లాభం కలిగేలాగా చేసినట్లయితే అవి కర్మలని, పరమేశ్వరుడి యొక్క శక్తిని కూడా జోడించి నిజానికి పరమేశ్వరుడి శక్తే తనలో ప్రవహిస్తున్నది అని గనుక అనుకొని చేసినట్లయితే ఈ కర్మలన్నీ కూడా కర్మ యోగాలు అవుతాయి అని విచారణ. ముందుగా భగవాన్ మనం సమకాలీన ప్రపంచానికి కర్మ యోగాన్ని ఎలా అనుష్ఠాన పూర్వకంగా బోధించారో విచారణ చేద్దాం. ఎనభై నాలుగు సంవత్సరాలు అయింది భగవాన్ ఈ శరీరం తీసుకొని ఇక్కడికి వచ్చి. అందులో మొదటి పధ్నాలుగు కూడా చాలా గంభీరమైనవి. ఒక బీజ ప్రాయంగా అంటే ఒక విత్తన రూపంగా ఉండి మహా దివ్య శక్తి ఏదైతే ఒక వటవృక్షంగా, ఒక విస్తృతమైనటువంటి ఒక మర్రిచెట్టుగా నీడలు సాచి, ఊడలు పరచి ఈ ప్రపంచానికి ఒక బోధి వృక్షం అయిపోయిందో దానికి మూలాలు ఆ పధ్నాలుగు ఏళ్లు అన్నమాట. ఏం చేశారు స్వామి? తాను ఏమి బోధించదలచుకున్నారో దానిని తొలి పధ్నాలుగు ఏళ్లలో అంటే అవతార ప్రకటన పందొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైకి ముందే సూచించేశారు. ఎట్లా సూచించారు? "అహం సత్యబోధకః" అన్నారు. నేను సత్యం బోధించటానికి వచ్చాను అన్నారు. సత్యం ఎవరు బోధించగలరయ్యా అంటే ఎవరు సత్యమై ఉన్నారో, ఏ సత్యం ఒక సాకారమై మానవ దేహాన్ని తీసుకుని వచ్చిందో అది మాత్రమే సత్యాన్ని అనుభూతి పరంగా బోధించగలదు.ఈ సత్యం కర్మాచరణ చేయాలి. సత్యం అంటే ఏది మారదో, ఏది కాలాద్యవచ్ఛిన్నమైనదో, ఏది అన్ని కాలాలకు ఉపయోగపడుతుందో, జరిగిన కాలానికి, రాబోయే కాలానికి మహావారధిగా రూపాంతరీకరణం చేస్తుందో అది బోధ. ఆ సత్యాన్ని స్వామి కర్మయోగంగా మార్చటం మన కళ్ళ ముందు సుమారుగా నలభై సంవత్సరాల మన అనుభవంలో విచారణలో తేలేది ఏమిటంటే, ఒక్కసారి స్వామి అవతారం తాల్చి పుటపర్తిలో వెలసిన నాటి నుంచి లేదా ప్రభవించిన నాటి నుంచి ఈ అనుకుంటున్న విచారణ చేస్తున్న ఈ క్షణం వరకు భౌతికమైనటువంటి పరిణామం చాలా పరమాద్భుతం. ఆ భౌతిక పరిణామం ఎట్లా ఉన్నదంటే సర్వ విశ్వము ఎట్లాగైతే ఒక మార్పు చెందాలని స్వామి సంకల్పించారో ఆ సంకల్పానికి ప్రతిరూపంగా ఇవాళ పుటపర్తి మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఏం చేశారు? మీరు గ్రామ సేవ చేయండి అని స్వామి చాలా ఏళ్ళ తర్వాత చెప్పుండొచ్చు. కానీ భగవాన్ సత్యసాయి ఒక విశిష్టమైనటువంటి రీతిలో తాను ప్రభవించినటువంటి తన గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా ఎన్నుకున్నారు స్వామి. ఎందుకని నేను ఇదిగో ఈ పుటపర్తి యొక్క రూపురేఖలని, దాని యొక్క పవిత్రతని, నైసర్గికమైనటువంటి స్థితిని దాటి సర్వ ప్రపంచానికి అనుసంధానం నేను ఇలా చేయగలిగాను, ఇదిగో చూడండి. అంటే ఎనభై నాలుగేళ్ళ నాటి పుటపర్తి, ఎనభై నాలుగేళ్ళ తర్వాత ఈ రోజున మనం చూస్తున్న పుటపర్తి ఎలా సాధించారు అంటే స్వామి కర్మల అన్నింటినీ, అన్ని పనులనీ కూడా కర్మయోగంగా మార్చారు. అంటే స్వామి చేశారా స్వయంగా? చేశారు. చేస్తూ చేస్తూ అందరినీ దాంట్లో ఒక పాలు పంచుకునే విధంగా ఒక కర్మబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి అర్ధ కామ మోక్షాలను సమన్వయం చేస్తూ చతుర్విధ పురుషార్ధాల నాలుగింటినీ కూడా తాను చేస్తున్న ప్రతి పనికి అనుసంధానం చేశారు. అలాగే భారతీయ ఆత్మలో, భారతీయ జీవనాడిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పండుగలు. ఆ పండుగలన్నీ దేనికి అంటే ఒక వ్యక్తి అనుభవించటం కోసం కాదు. పండగ ద్వారా ఆ రోజున కొన్ని వేల మందితో ఆనందాన్ని ఎట్లా అనుభవించవచ్చునో కర్మని కర్మయోగంగా మార్చి మనకు చూపించారు. ఈ విద్యా, వైద్య రంగాలన్నీ బాగా చెడిపోయినాయి, దీన్ని మరమ్మత్తు చేసేవాడు లేడా అని స్వామి నిరాశ చెందలేదు. నిరాశని, పేరాశని, దురాశని ప్రపంచానికి స్వామి బోధించలే. ప్రతి దానిని కూడా అంటే ప్రతి పనిని, ప్రతి శాఖని కూడా కర్మయోగంగా మార్చేశారు. వాటి యొక్క ఫలితాలని మనం ఇవాళ కళ్ళ ముందు చూస్తున్నాం. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ గా, ఒక చిన్న జనరల్ హాస్పిటల్ గా ఒక పరిణామ దశ ఈ ఎనభై నాలుగు సంవత్సరాలలో చాలా స్థాలీపులాకంగా విచారణ చేసినట్లయితే పరిణామం మన కళ్ళ ముందు కట్ట వచ్చినట్లుగా కనబడుతూ ఉన్నది. ఈ కనబడుతున్నటువంటిది మామూలుగా ఎనభై నాలుగు ఏళ్ళు జీవించిన ఒక వ్యక్తి, సామాన్యుడు అనుకుందాం. వాడు కేవల మానవుడే గనుక అయితే ఇవి సాధించలేడు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే రెండు చెప్తున్నారు, నేను దివ్యుడిని, నేను పరమాత్మని గనుక నేను ఇదిగో నాకున్నటువంటి ఈ సమయంలో నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలని వచ్చానో ఆ సమయంలో ఇవన్నీ చేసి మీకు చూపించా. మీరు చేయవలసింది ఒకటి, నేను పెద్ద కాన్వాస్ మీద చేస్తే మీ మీ వ్యక్తిత్వాలతో మీ వ్యక్తి పరిధిలో గనుక ఇవే విషయాలను చక్కగా కర్మలన్నింటినీ కర్మయోగంగా చేసినట్లయితే ముందు మీ వంటిని, ఆ తర్వాత మీ ఇంటిని, ఆ ఇంటిని తర్వాత మీ చుట్టూ ఉన్న సమాజాన్ని, తర్వాత సర్వ ప్రపంచాన్ని ప్రభావితం చేసేట్లుగా కర్మలన్నీ కర్మయోగాలుగా చేసుకోండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను పరమాత్మని అయి వచ్చినా నేను ఉపయోగించిన శక్తులన్నీ కూడా మానవీయ శక్తులే. మీరు మానవులుగా జన్మ ఎత్తి వచ్చినా మీరు వాడుకోవలసింది నాలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు వాడుకోండి. అంటే జీవుడు పరమాత్మతో కూడి ఉండటమే యోగం గనుక మన కర్మలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ప్రజ్ఞతో కూర్చి గనుక చేసినట్లయితే నిజానికి జరిగేది కర్మయోగమే. ఇవాళ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ గాని, ఒక వాటర్ ప్రాజెక్ట్ గాని, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గాని, ఏ పనైనా స్వామి భావనలో, స్వామి సంకల్పంతో, స్వామి ఆవరణలో, ఏమి స్వామికి ఆవరణ అంటే పుటపర్తి మాత్రమే కాదు, ఈ సర్వ సృష్టి కూడా స్వామి యొక్క ఆవరణే. ఆ పనులన్నీ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా, టైం బౌండ్ గా, కాలానికి లోబడి, మన శక్తులకు లోబడి, అపరిమితమైనటువంటి దివ్య శక్తిని కూడా సంతరించుకొని కర్మయోగంగా అది భాసిస్తూ ఉన్నది. కర్మయోగానికి ఏదన్నా ఉదాహరణ చెప్పండి అంటే ఇవాళ పుటపర్తిలో స్వామి ఈ ఎనభై నాలుగు సంవత్సరాలలో తెచ్చిన పెను మార్పులు అన్నీ పాజిటివ్ గానే. చూడండి ఎక్కడా కూడా ఒక విస్తృతమైనటువంటి, విశిష్టమైనటువంటి, వరిష్టమైనటువంటి విధానంలో ఒక వినూత్నమైనటువంటి, విశిష్టమైనటువంటి ప్రపంచాన్ని స్వామి మనకు సంకల్పించి చూపించారు. ఎలా చేశారు? సనాతనమైనటువంటి ఒక వైదిక ధర్మాన్ని సనూతనమైనటువంటి ఒక విజ్ఞానం పరంగా, విజ్ఞాన శాస్త్ర పరంగా అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ తో సమన్వయం చేశారు. ఇవాళ ఏ కంప్యూటర్ టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నదో దానిని పుటపర్తిలో స్వామి ప్రవేశపెట్టారు. సనాతనం అంతా పాతదే గొప్ప అని స్వామి ఆగలేదు. సనాతనమైనటువంటి దానిని సనూతనం చేసి అన్ని కర్మలనీ కూడా కర్మయోగం చేశారు స్వామి. ఇది కళ్ళముందు ఉన్నటువంటిది. ఇక రెండవది భక్తి యోగం. భక్తి అంటే జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి ఒక అంతరంగ సూత్రం, ఒక బంధనం. ఒక చక్కని చల్లని ప్రేమ బాంధవ్యం అది. ఈ ప్రేమ బాంధవ్యాన్ని స్వామి ఎలా భక్తి పూర్వకంగా ఈ జగత్తులో చేశారంటే, ఒక్కసారి విచారణ చేద్దాం. పాత మందిరం రోజుల్లో స్వామి తొట్ట తొలి భజన మానస భజిరే గురు చరణన్ రాసిన వేళ.అరుణాచల శివ! అరుణాచల శివ! అరుణాచల శివ! అరుణ శివోహం అంటూ అరుణాచలాన్ని పుటపర్తిని సమన్వయం చేశారు. అంటే తాను బాబా ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నప్పుడు ఏమీ విచారణ చేయక్కర్లేదు. "ఓంకారంభవ ఓంకారంభవ ఓంకారంభవ ఓం నమో బాబా" అన్నారు. బాబా అంటే శరీరంగా కనిపిస్తున్న ఈ బాబా మూలాలు ఎక్కడివో మీకు తెలిసినా? ప్రణవ శబ్దంలో నుంచి నేను వచ్చాను. నిశ్శబ్దంలో నుంచి ఒక శబ్ద భూమికను తీసుకున్నాను. నిరాకారంలో నుంచి సాకారం తీసుకున్నాను. త్రైగుణ్యోత్తరుడైనటువంటి మూడు గుణాలకి అతీతమైనటువంటి నేను ఆ మూడు గుణాలని తీసుకుని మీ మధ్య నడయాడుతూ రాముడు, శివుడు, మాధవుడు, కేశవుడు వీళ్లందరూ కూడా ఒక్కటే. అనేకంగా కనిపిస్తున్నదంతా ఏకమే అన్నటువంటి భావనలో కేవలం హైందవ మతానికి మాత్రమే కాక, కేవలం వేద మతానికి సంబంధించినదే గాక, ప్రపంచంలో ఇవాళ విలిగిపోతున్నటువంటి అన్ని మతాలని కూడా స్వామి భక్తి యోగం చేత పరమాత్మ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి భావనతో యోగించిన కారణంగా సమన్వయం చేసిన కారణంగా ఇవాళ కుల్వంత్ హాల్లో మానస భజరే గురు చరణం నుంచి మళ్ళీ ఈ క్షణం విచారణ వరకు ఎన్నెన్ని రకాలు, ఎన్నెన్ని రకాల భజనలు, ఎన్నెన్ని విధానాలు, ఎన్నెన్ని గుణ సంకీర్తనాలు, కులమతాతీతమైన, గుణాతీతమైనటువంటి పరమాత్మ యొక్క సమ్యక్ సంకీర్తనాన్ని స్వామి భక్తిగా ఈ జగత్తుకు బోధించారు. కాస్త పాత రోజులు తెలిసిన వాళ్ళు అయినట్లయితే మందిరం లోపల స్వామి భజన లీడ్ చేసేవారు. తాను సాక్షాత్తు రాముడై, తానే కృష్ణుడై, తానే శివుడై ఉన్నప్పటికీ కూడా ఆ శివ పరమైనటువంటి, రామ పరమైన, కృష్ణ పరమైనటువంటి వాటిని తాను స్వయంగా పాడుతూ అందరి చేత పాడించేవారు. అంటే ఏమవుతున్నది? ఎవరు భజనలో కూర్చున్నారో అంటే భక్తిలో ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆత్మలన్నింటినీ కూడా పరమాత్మతో అనుసంధానం చేశారు. "పూజాతే విషయోపభోగ రచన" అంటారు శంకర భగవత్పాదులు. స్వామి సాక్షాత్తు ఆ మాటకి అనుసరణీయంగా పూజ, దానం, ధర్మం, యాగం, యజ్ఞం, కర్మకాండలైతే భజన జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనం. అది సమ్మిశ్రితం. రెండూ ఒక్కచోట కూడి దానిని చూసి ఇది, దీనిని చూసి అది పరవశించేటువంటిది భక్తి. అందుకే స్వామి అనేక ఉపన్యాసాల్లో మనకు బోధ చేశారు భక్తి యోగంలో. భగవంతుడు లేక భక్తుడు లేడు. భక్తుడు లేక భగవంతుడు కూడా లేడు. అంటే మీకు నాకు ఏమున్నదయ్యా అంటే అసలు మీరే నేను. మీరే నేను ఒకటైతే నేనే మీరుగా ఏ ఏది ఒకటిగా ఉన్నదో అనేకమైనటువంటి భక్త సమూహాలుగా కనిపిస్తున్నాయ్ అన్నటువంటి పూర్ణాద్వైత భావనలో పరమాత్మ మనల్ని భక్తి యోగంలో నిలబెట్టారు. కనుకనే ఇవాళ ఏ మతం గొప్ప ఏ మతం తక్కువ అన్న విచారణ సాయి భక్తులకు ఎవరికీ కలగనే కలగదు. ఎందుకంటే స్వామి స్వయంగా అనుష్ఠాన పూర్వకంగా ఈ జగత్తులో ఆ భక్తి యోగాన్ని ఎంత పరమాద్భుతంగా ప్రదర్శన చేసి మనందరికీ అలవాటు చేశారంటే రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి, మరొకడైతేనేమి, ఎవరైతేనేమి అంతా సాయిత్యమే. పోనీ స్వామిని గురించే ఒక భజన చేద్దాం, ఒక మాట మాట్లాడుదాం అంటే ఆ స్వామి మాటల్లో అనేకమైన మహాత్ముల యొక్క మాటలన్నీ వాటంతట అవి వచ్చి ఒక లైన్ లో పడిపోతాయే. అంటే సర్వమూ ఆత్మే, సర్వమూ పరమాత్మే, సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మము తప్ప అన్యము ఈ జగత్తులో లేదు అనేటువంటి ఆ భక్తి భావన ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే హృదయం పల్లవిస్తుందో, ఎక్కడైతే మనస్సు అణగి ఉంటుందో, ఎక్కడ సంస్కారాలు పుంజీభూతం అవుతాయో, ఎక్కడ సంసార పరమైనటువంటి యాతనలన్నీ కూడా వెనక్కి వెళ్లి పరమాత్మ యొక్క భావనలో ఆనంద రస తుందిలాలై, బిందువై చిందితూ ఉంటాయో అది భక్తి యోగంగా స్వామి మనందరి చేత కొన్ని ఏళ్లు, ఒకరోజా, రెండు రోజుల పొద్దున్న, సాయంత్రం ప్రతిరోజూ కూడా కలిసిన అన్నివేళలా భక్తి యోగంలో భజనలు నేర్పారు, నగర సంకీర్తన చేశారు, సామూహిక భజనలు నేర్పారు. అనేకమైనటువంటి సంస్కారము, సంస్కృతి, సాహిత్యము, సంగీతము సమన్వయం చేస్తూ రాగ, భావ, తాళ, లయాత్మకమైనటువంటి రీతిలో మనస్సులను రాగరంజితము, అనురాగరంజితము, ప్రేమ పరిపూతము చేస్తూ భక్తి యోగాన్ని ఈ జగత్తుకి ప్రతిపాదన చేశారు. అందుకనే మతం ఎప్పుడూ కూడా మానవుణ్ణి ఆపకూడదు. మానవుణ్ణి ఒక ఊర్ధ్వమైనటువంటి ఒక హైయెస్ట్ లెవెల్ కి, ఒక శిఖర స్థాయికి తీసుకు వెళ్ళాలి. భక్తుడికి, భగవంతుడికి ఉన్నటువంటి బంధమే నిత్యమూ, అది సత్యమూ, అది శాశ్వతమూ, అది నవ్యమూ, అది దివ్యమూ, అది భవ్యమూ. ఇంతే. ఇది భక్తి యోగం. ఇక జ్ఞాన యోగమా? ఏది రాని, ఏది పోని స్వామి అంటారు. నేలమీద పుట్టినటువంటి ఒక కొండ ఎన్ని పెనుగాలులు వీచినా, సుడిగాలులు వీచినా అదరక, వెదరక, చెదరక, కదలక ఎట్లా నిలబడుతున్నదో నిజమైనటువంటి జ్ఞాని అంటే ఒక ఎరుకలో ఉన్నటువంటి వాడు. నేను ఆత్మను అన్నటువంటి స్ప్రుహలో ఉన్నవాడు దేనికి లొంగడు, దేనికి ఒంగడు, దేనికి పొంగడు, దేనికి కుంగడు. ఈ దేనికి లొంగని, పొంగని, కుంగనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది జ్ఞానైక స్థితి. దీనినే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు స్థితప్రజ్ఞ అనేటువంటి మాట వాడాడు. ఇది ప్రపంచం. ప్రపంచం పేరే ఇది సంసార సాగరం. సాగరము అనగానే అలలు లేకుండా, కెరటాలు పుట్టకుండా, పుట్టిన కెరటం విరగకుండా, విరిగిన కెరటం మళ్ళీ మూలంలో కలవకుండా ఎట్లా ఉండదో సంసారంలో ఉన్నటువంటి జీవుడు అనేకమైన దైహిక, మానసిక అనేకమైనటువంటి భావనలకి, యాతనలకు గురై, అనేక జాడ్యాలకు గురై, అనేక వ్యాధులకు గురై ఎన్ని పడుతున్నా, ఎంత ఎంత అనుభవిస్తున్నా అయ్యో ఈ కష్టం వచ్చింది అంటే కర్మ నిష్ఠలో ఉండాలన్నమాట. ఈ కష్టాన్ని నేను ఎలా దాటాలి? అసలు దాటిస్తున్న వాడెవడు? ఈ కష్టం అంటే ఏమిటి? దాటటం అంటే ఏమిటి? ఈ దాటుతున్నది ఎవరు? దాటిస్తున్నది ఎవరు? అంతా కలిపితే ఒకటే ముద్ద అన్నటువంటి భావనలో గనక ఉన్నట్లయితే అది జ్ఞాన యోగం. స్వామిని చూడండి.సుమారుగా ఓ యాభై ఏళ్ల అనుబంధం ఉన్నటువంటి మన బోటి వాళ్ళం గనుక విచారణ చేసినట్లయితే స్వామి ఆడారు, పాడారు, కూడారు. ఇవేళ స్వామి ఏం మాట్లాడటం లేదు. నిజానికి స్వామి మాట్లాడిన రోజులకు పోల్చినట్లయితే మాట్లాడని ఈ రోజులు చాలా profound గా ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి అంటే మౌన వ్యాఖ్య పరమోత్కృష్టమైనది. ఏదైనా ఒక శాస్త్రాన్ని ఒక బోధను చెప్పాలంటే జీవుడు సంస్కారవంతమైన ఒక భాషని భావాన్ని ఆశ్రయించాలి. అమనస్కమైనటువంటి మనోలయమైనటువంటి పరమాత్మ మనసే లేని పరమాత్మ గనుక మనకు బోధించవలసి వచ్చినట్లయితే ఒక దక్షిణామూర్తి స్వరూపంగా ఘనీభవించినటువంటి మౌనంగా కూర్చుని ఉంటారు. ఇవాళ మనం కులువంత హాలులో మనం కూర్చుని ఉన్నాం స్వామి సింహాసనంలో కూర్చుని ఉన్నారు. ఈ జ్ఞాన యోగంలో మనకి ఇవాళ కలుగుతున్నటువంటి పరమ అద్భుతమైనటువంటి అనుభవం ఏమిటంటే స్వామి యొక్క మూలాలు, స్వామి యొక్క తత్వాలు, స్వామి యొక్క భావార్ధాలు, స్వామి ఇచ్చేటువంటి అనేక ఆంతరంగికమైనటువంటి సంకేతాలు, అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు, అనేకమైనటువంటి సందేహాలకు సమాధానాలు మౌనం ద్వారా చాలా గట్టిగా చాలా దృఢంగా కానీ మృదువుగా కానీ నెమ్మదిగా కానీ ఎంతవరకు మనం అర్థం చేసుకోగలమో దానికి తగినటువంటి మోతాదులో రీతిలో స్వామి మౌన బోధాకృతిగా ఉన్నారు. జ్ఞాని అంటే మాటలు వల్లిస్తూ మాట ద్వారా బోధించినప్పుడు ఆయన బోధ గురువే. ఆచరించి చూపించినప్పుడు ఆచార్యవర్యుడే. కానీ అనేక గురు స్వరూపాలు లో మహోత్కృష్టమైనటువంటి గురుభావన కారణ గురువు. కారణ గురువు ఎవరు అంటే నువ్వు ఎందుకు వచ్చావో తెలియజెప్పే వాడు. మాట ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, కదలిక ద్వారా, మెదలిక ద్వారా అసలు ఇవేవీ లేకుండా కేవలం తన ఉనికి ద్వారా. ఈ రోజున స్వామి యొక్క ఈ అవతార వైభవంలో మనం అనుభవించవలసింది ఒకటే. స్వామి మౌనం ద్వారా మనకిస్తున్న సందేశాలని, ఆదేశాలని, స్వామి ఇస్తున్నటువంటి అనుగ్రహాలని మనం కూడా మౌనంగానే పొందే స్థితికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే ఈ శబ్ద నిశ్శబ్దాలకు అభేదం పోయి శబ్దమే ఆగిపోతే దాని పేరు నిశ్శబ్దం అని శబ్దమే కాస్త సేపు మాట్లాడినట్లయితే అది నిశ్శబ్దము మాట ఆగినట్లయితే అది నిశ్శబ్దం అని ఈ శబ్ద నిశ్శబ్దాలకు అభేదాన్ని మనం పాటిస్తూ పరమేశ్వరుడు ఈ జ్ఞాన యోగాన్ని ఇవాళ అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. సంవత్సరాలు గడవటం అంటే జీవితం గడవటం. ఆ జీవితం గడవటం అంటే అనేక అనుభవాలు మనం పొందటం. ఆ అనుభవాలు కొన్ని ఆనందాన్ని ఇచ్చినయి, కొన్ని సుఖాన్ని ఇచ్చినయి, కొన్ని సంతోషాన్ని ఇచ్చినయి, కొన్ని మహా దుఃఖాన్ని మిగిల్చినయి. ఇవన్నీ అనుభవించాం కదా కానీ వీటన్నింటికీ కూడా మనం అతీతంగా నేను అన్నటువంటి ఎరుకలో మనం ఉండగలిగామా లేదా? స్వామి ఉన్నారా లేదా? స్వామి కేవల మానవుడిగా గనుక భావించి విచారణ చేసినట్లయితే స్వామి ఈ అవతారంలో ఈ ఎనభై నాలుగు సంవత్సరాలలో కూడా ప్రాపంచిక పరమైనటువంటి అనేకమైనటువంటి ఆటుపోట్లన్నీ కూడా స్వామి చూశారు. అది మహా సముద్రం గనుక దానిని సాక్షీభూతంగా చూశారు. మనం ఏం చేశామంటే సాక్షీభూతంగా చూడలే, అయ్యో మనకే కష్టం వచ్చింది, మనకే ఇబ్బంది వచ్చింది, మనమే యాతన పడుతున్నాం అని మరింతగా కుంగిపోయినాం. స్వామి ఆ సాక్షీభూత సర్వస్వం గనుక పూర్ణమైనటువంటి ప్రజ్ఞామూర్తి గనుక అవతార పరమాత్మ గనుక ఆయన సాక్షీభూతంగా చూస్తూ చూస్తూ కదలిపోయే మేఘాల వలె పుట్టిన కెరటం సమసిపోయినప్పుడు ఎట్లాగైతే ఉన్నదో అదే భావనతో ఒక వేదనారహితమైనటువంటి పూర్ణ ప్రశాంతమైనటువంటి మనసుతో దానిని చూడటం మొదలు పెట్టారు. చూడటం మొదలు పెట్టడం అంటే నిజానికి స్వామికి చూపు లేదు, స్వామికి అనుభవము లేదు, స్వామికి బంధనా లేదు, ఉన్నదంతా జీవుడికి గనుక జీవుడికి బోధ చేయాలి గనుక తాను అనుభవించినట్లు తాను ఏదో ఆనంద పడిపోయినట్లు తనకు సంతోషం దుఃఖం రెండు ఉన్నట్లు అభినయించారు గాని స్వామికి అనుభవం లేదు. అనుభవ రాహిత్యం ఎక్కడ అంటే పూర్ణమైనటువంటి పరిణితమైనటువంటి పరమాత్మ గనుక ఈ సర్వ ప్రపంచానికి కూడా కర్మ యోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞాన యోగాన్ని ఏకకాలంలో ఇవాళ ఒక రెండు నిమిషాలు కులువంత హాలులో కూర్చున్నాం. స్వామి దర్శనం మనకి అనుగ్రహించటానికి స్వామి వచ్చారు. స్వామి కూడా సింహాసనంలో కూర్చున్నారు. ఇందులో కర్మ యోగంలో స్వామిని అనుభవించే వాడు ఒకడైతే భక్తి యోగంలో తాను ఏ దేవతను ఉపాసన చేశాడో ఆ దర్శనాన్ని స్వామిలో దర్శనం పొంది ఆ దర్శనం ద్వారా పరిణితి చెందేటువంటి దిశగా భక్తి యోగం సాగితే స్వామి ఎంత దయామయుడివి తండ్రి, ఎంత దయాంబుడివి తండ్రి. ఇచ్చిన ఈ జన్మలోనే జ్ఞానం అంటే ఇదా? నేను అన్న భావన ఆ ఎరుక దేహాత్మని దాటి అంటే శరీరాన్ని దాటి నేను ఆత్మనన్న భావనలో నిలకడ చెందటమే ఆత్మ విచారణ మార్గమా అని ఎప్పుడైతే ఒక సమాధానం దొరుకుతున్నదో ఈ మూడు రకాల యోగులు సాధకులందరూ కూడా పరమాత్మ కొలువులో ఉన్నారు అని. మరి పరమాత్మ ఎలా ఉన్నారు? ఒకడికి కర్మ యోగిగా, ఒకడికి భక్తి యోగిగా, మరొకడికి జ్ఞాన యోగిగా మూడు త్రిపుటీకరణం చెంది యోగత్రయిగా, వేదమాతగా, వేద స్వరూపుడుగా, వేదమే సత్య సాయి భగవానుడిగా ఇవాళ మనకి దర్శనం ఇస్తున్నారు. కాబట్టి పరమాత్మ బోధించటానికి వస్తాడు, శోధించటానికి వస్తాడు, సాధించటానికి వస్తాడు, అనుగ్రహం ఇవ్వటానికి వస్తాడు. ఆ పరమాత్మని ఎట్లా మనకు కావలసిన రీతిలో మన సాధనా మార్గానికి అణువుగా అన్వయించుకుంటామో అదే సంస్కారం కాబట్టి ఆ సంస్కారము అనుగ్రహము పరమాత్మే ఇవ్వాలి గనుక సత్య సాయి భగవానుని యొక్క దివ్యమైన ఉనికిని ఈ మూడు యోగాలలో మనం పరిపూర్ణం చేసుకుంటూ యోగత్రయిగా ఉన్నటువంటి స్వామిని, వేద స్వరూపులైనటువంటి స్వామిని, సర్వ దేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామిని సర్వ భువనాలకు కూడా ఈ మూడు యోగాలు అంటే మనం చిన్న కర్మ చేస్తుంటే స్వామి దీన్ని కర్మ యోగం చేయవయ్యా.నేను భక్తి మార్గంలోనే ఉన్నా నాకు, నాకు రాముడు అంటే ఇష్టం సాయి రాముడి వలె కనిపించు, నాకు కృష్ణుడు అంటే ఇష్టం సాయి కృష్ణుడి వలె కనిపించు, నాకు మహేశ్వరుడు అంటే ఇష్టం సాయి మహేశ్వర స్వరూపంగా దర్శనమై, నాకు అమ్మవారు అంటే ఇష్టం అమ్మవారే వలె కనిపించు స్వామి అని ఆ భక్తి యోగంలో ఆ పారమ్యంలో ఎక్కడైతే జీవాత్మ పరమాత్మలు రెండూ కలిసి ఉంటాయో అది యోగ నిష్ఠ కాబట్టి జ్ఞాన యోగంలో నిజానికి ఇక్కడ ఏమీ లేదు మనదంటూ ఏమీ లేదు మనక్కూడా ఏమీ లేదనేటువంటి నిత్య వైరాగ్య వైభోగంలో స్వామి మనందరినీ కూడా ఈ మూడు యోగాలని ఏకకాలంలో అనుభవించే దిశగా నడిపించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ స్వామి ఎలా ఈ మూడు యోగాలని తమ అవతార కాలంలో చక్కగా పరిపూర్ణం చేశారో ఎలా demonstrate చేశారో ఈ జగత్తుకి నిదర్శన పూర్వకంగా సోదాహరణ ప్రాయంగా పరచినటువంటి ఎనభై నాలుగు సంవత్సరాల జీవితాన్ని సర్వ ప్రపంచం ముందు చక్కగా తెరచిన పుస్తకంలా ఉంచారో మనం కూడా open గా ఉండాలి transparent గా ఉండాలి సాధ్యమైనంత వరకు కాదు అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసుకొని వర్తమాన జీవితాన్ని చాలా transparent గా చాలా పరిపూర్ణంగా ఎక్కడా తెరలేనటువంటి శుద్ధ మనస్కులుగా ఉన్నప్పుడు మాత్రమే స్వామి బోధించిన సత్యం ఆచరించినప్పుడు మాత్రమే స్వామి బోధించిన ధర్మం అనుభవించినప్పుడు మాత్రమే స్వామి బోధించిన శాంతి అనుభవించినప్పుడు మాత్రమే స్వామి బోధించినటువంటి ప్రేమ వీటన్నింటినీ కూడా మనం ఒక అనుభవ రస సిద్ధం చేసుకోవటానికి కర్మ భక్తి యోగ జ్ఞానాల ఒక మహా త్రివేణి సంగమంగా సాగిన సత్య సాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో మనం కూడా ఉన్నాం. ఉంటామంటే ఆచరణ అనుష్ఠానం చేయాలి అనుష్ఠానంలో నుంచి అనుభవాన్ని పొందాలి అనుభవంలో నుంచి అనుభూతి విభూతి స్థాయికి వెళ్ళాలి ఆ దిశగా పరమాత్మ మనలను నడిపించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయి రామ్. [భాగం] ఇంతవరకు స్వామి వారి చిరకాల భక్తుడైనటువంటి శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు యోగ త్రివేణి పై ప్రసంగించారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం సాయి రామ్.
SSSMC · audio
Telugu Broadcast - 427
Telugu Broadcast - 427
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 57:46
More in this series
Telugu Broadcasts
- 57 min 394
Telugu Broadcast - 394
- 1 hr 396
Telugu Broadcast - 396
- 58 min 402
Telugu Broadcast - 402
- 58 min 420
Telugu Broadcast - 420
- 56 min 424
Telugu Broadcast - 424
- 57 min 427
Telugu Broadcast - 427
Now playing - 57 min 490
Telugu Broadcast - 490
- 56 min 491
Telugu Broadcast - 491
- 56 min 498
Telugu Broadcast - 498
- 58 min 555
Telugu Broadcast - 555
- 57 min 560
Telugu Broadcast - 560
- 58 min 561
Telugu Broadcast - 561