No transcript for this section.
[ఆరంప] రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు 1984 ఆగస్టు, సెప్టెంబరు నెలలలో భగవద్గీత పై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో మరో దివ్యోపన్యాసం. సాయికుల్వంత్ సభా మండపంలో మే 6, 2011న నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సాయి అవతార వైభవం, పుట్టపర్తి క్షేత్ర మహిమ అన్న అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగం. ముందుగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు 1984 ఆగస్టు, సెప్టెంబరు నెలలలో భగవద్గీత పై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో మరో దివ్యోపన్యాసం వినండి. [భాగం] దేహం అనిత్యము, అశాశ్వతము. దేహి నిత్యము, సత్యము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతనః. సనాతనమై, నిత్యమై, సత్యమై ఉండిన ఆత్మతత్వానికే దేహి అని పేరు. ఈ దివ్యోపన్యాసం లో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు దేహిని ఏ విధంగా గుర్తించగలమో వివరించారు. ఇందుకై శాస్త్ర ప్రమాణాలను ఆధారం చేసుకుని స్వప్రయత్నంతో ముందుకు కొనసాగాలని బోధించారు. అస్తి, భాతి, ప్రియం, రూపం, నామం అనే ఐదు తత్వాల సమ్యక్ అవగాహన చేత ఆత్మతత్వాన్ని ఏ విధంగా చేరుకోగలమో విశదీకరించారు. సర్వత్ర సర్వాణి భూతాని దేహి. సర్వభూతముల యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి. దేహము అనిత్యము, అశాశ్వతము. దేహి నిత్యము, సత్యము. కేవలం దేహము నందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు. విరాట స్వరూపం కూడనూ దేహమే. విశ్వమనేటువంటి దేహము నందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతనః. సనాతనమై, నిత్యమై, సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమేంకై దేహి అని పేరు. ఇట్టి దేహిని గుర్తించుటకై శాస్త్రములు ప్రమాణములు. శాస్త్ర ప్రమాణం మాత్రమే చాలదు. శాస్త్రం వలనే ఇది మనకు లభ్యము కాదు. శాస్త్ర ప్రమాణమును ఆధారముగా తీసుకుని స్వప్రయత్నంతో, స్వశక్తితో సాధించుటకై ప్రయత్నించాలి. శాస్త్రములు, ఉపనిషత్తులు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఇవన్నీ కూడనూ కేవలము మార్గదర్శకమైనటువంటివి. ఇవి కేవలము ఒక గైడ్ పోస్టు వంటివి. ఇది దిక్కులను చూపగలదు గానీ, నడిపించుటకు ప్రయత్నించదు. గమ్యమును చేరగోరినటువంటి వ్యక్తులు దీనిని ఆధారంగాని తమ ప్రయాణము తామే సాగించాలి. భగవద్గీత సమస్తమును బోధించినది. ఇది సెకండ్ అధ్యాయం లోపల న సోచ్య నవే సోచః అని పదకొండవ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత. న సోచ్య కానీ ఇది ఎక్కడికి అంతమవుతుంది? ఇది క్రమక్రమీలా దుఃఖనివృత్తి మాత్రమే కలిగింపజేస్తుంది. ఈ దుఃఖనివృత్తికి మార్గం ఏమిటి? అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడము మంచిది కాదు అన్నాడు. దుఃఖించ తగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున. ఇందులో ప్రతి పదార్థం నందు కూడనూ అస్తి, భాతి, ప్రియం, రూపం, నామం. ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి. ఈ అస్తి, భాతి, ప్రియం కే సంస్కృత పదముల నందు సత్ చిత్ ఆనందము అన్నారు. ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి. ఇవి దైవత్వంతో కూడినటువంటివి. దీనికి పుట్టుక చావులు లేవు. కనుక ఇవియే దైవత్వమునకు ధైర్యమునకు చిహ్నములు. రూప నామములు కల్పనలు. ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రమున్నదో పోవుటకు కూడనూ ఆ స్వతంత్రము ఉంటుంటాయి. ఇవి కేవలము బంధువుల వంటివి. బంధువులు వచ్చి పోయేటువంటి వారే కానీ స్థిరముగా ఇంట్లో నిల్చేటువంటి వారు కాదు. అదేవిధముగనే సుఖములు, దుఃఖములు కూడనూ బంధువులతో చేరినటువంటివి. కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూప నామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశ పెట్టకూడదు. ఇవి ఏనాటికైనా కూడనూ వెళ్ళునవే, మార్పు చెందునవే, నశ్వరమైనవే. అలాంటి స్థితికై నీవు శోకించడము ఇది సరియైనటువంటి తత్వం కాదన్నాడు. అయితే ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకొనుటకై ఏ ద్యాన్ని మనం ఆశ్రయించాలి? కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి. భక్తి యోగంలో చెప్పినట్టుగా ఇరవై ఆరు సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని. ఆస్వనిర్మామే ప్రియో నరః ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడనూ కృష్ణుడు చెప్పాడు. ఈ ఇరవై ఆరు గుణములు కూడనూ మనకు ఉండనక్కర్లేదు. అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి. అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు. ఒక్క పుల్లను గీసి కావలసినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.సద్గుణమును కొన్నింటినే అయినా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్న ఇది ఎంతైనా కూడను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు. నిన్నటి దినము ఓర్పును గురించి మనం తెలుసుకున్నాము. ఈనాడు అసూయ ద్వేషం. ఈ అసూయ ద్వేషం అనేటువంటివి తోడు దొంగలు. ఇవి ఒకరిని ఒకరు వదలిపెట్టి ఉండలేరు. ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయము కలిగినటువంటివి. కొన్ని విషయములో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి. ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది. ద్వేషము అనేటువంటిది చీడపురుగు వంటిది. ఒకటి వేరు పురుగు రెండవది చీడపురుగు. ఇవి రెండు కూడాను వృక్షమును నాశనం చేయునటువంటివి. నవనవలాడుతూ పువ్వులు పూచి కాయలు కాచి చూచుటకు అందముగా ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణము నుండి ఇది వాడిపోతుంది వృక్షం. ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది. ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది. చీడపురుగు పై భాగంలో సంచరిస్తుంది. వేరును కొట్టటం వేరు పురుగు. అనగా ప్రాణమును తివ్వటమే వేరు పురుగు. అలంకారమును వినాశము చేయటమే చీడపురుగు. ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి. ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు. ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాడో అక్కడ కనిపించనటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాది. అసూయకు రూపం లేదు. ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది. కనుకనే ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి. ఈ అసూయ లేని మానవుడు జగత్తు నందు కానరాడని చెప్పవచ్చు. ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడను ఈ అసూయకు అవకాశం కల్పించి ఉంటుంది. కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరుచుకోవాలి. ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు. ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే. ఈ ఆనందమునకు అందం అనేటువంటిది దీని స్వభావం. ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడను మనకు లభిస్తుంది. A thing of beauty is a joy forever ఏ పదార్థము నందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందము మనలో ఉప్పొంగిపోతుంది. ఈ అందం ఏమిటి? పదార్థమా అందము? ఇవన్నీ మార్పు చెందినవే కదా! మార్పు చెందినది ఎంత కాలం అందము? కనుక శాశ్వతమైనది ఏదియో అదియే అందం. కనుకనే శాశ్వతమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతుడే సౌందర్యవంతుడు. కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు. ఆ అందములో కలిగేటువంటి ఒక మకరందమనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారము. ఈ సద్గుణములను మనం పెంపొందించుకొనుటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి. దైవత్వము నందు కూడను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది. అర్జునుడు రథములో కూర్చున్నాడు. కృష్ణుడు రథమును నడుపుతున్నాడు. కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థం చేసుకొనలేకపోయినప్పటికినీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జునుని యందు ఉంటుంది. కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడను వింటున్నాడే కానీ తినటం లేదు. అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించటం లేదు. ఈ విషయములందు ఒక చిన్న ఆదర్శం, ఒక ఉపమానం. యుద్ధము జరుగుతున్నది. మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడను ఇతని పైన ప్రయోగిస్తున్నారు. ఆనాడు భీష్ములతో యుద్ధం జరుపుటం. భీష్ముడు క్రింద కూలిపోయాడు. ఆనాడు మహా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడను ఆ రథములో ప్రవేశించాయి. ఈ అర్జునునకు ఏమాత్రం కూడను ఒక విధమైనటువంటి ఒక భగవత్ విశ్వాసం ఉండినప్పటికినీ ఆ యుద్ధము నందు సాధించినదంతా కూడను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది. సూర్యాస్తమయం జరిగింది. రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు. కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కానీ యుద్ధంలో విజయాన్ని సాధించేటటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించి ఉంది అర్జునునిలో. తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే "అర్జునా! నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళు" అన్నాడు కృష్ణుడు. ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునునకు నేను యజమానుడను. కృష్ణుడు డ్రైవర్. కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి. "బావా! నీవు ముందు దిగిపో" అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి. "లేదు లేదు అర్జునా! నీవు ముందు దిగి వెళ్ళు" అన్నాడు. ఈ విధంగా వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. కొంత కృష్ణుడి పైన అసూయ కూడను వచ్చింది. తను గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ. సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి. మొదలే కృష్ణునితో ద్వేషం చేసుకుంటే రేపు ప్రజలం ఏమైపోతుందో అని కొంత భయపడి అర్జునుడు దిగాడు. నిలిచాడు ఆ రథం దగ్గర అర్జునుడు. కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు. "నీవు వెళ్ళు లోపలికి వెళ్ళు" అన్నాడు. చేయల్సలేక వెళ్ళిపోయాడు లోపల. తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు. తక్షణమే రథం భస్మం అయిపోయింది. ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు. అర్జునా! దైవతత్వం కానీ దైవలీలలు కానీ దైవత్వాన్ని ఎవ్వరు కూడను అర్థం చేసుకొనలేరు. దైవమునకు స్వార్థం లేదు. భక్త రక్షణే అనే అతని యొక్క ప్రతిజ్ఞ. భక్తోద్ధారమే అతని కర్తవ్యం. ఈ రథమునకు బేసిండు వేసినటువంటి అంబులన్నీ కూడనునా కాలి కింద తొక్కుకొని అణిగి తొక్క ఉన్నాను కనుకనే ఆ అస్త్రములు నీ పైన ఏమాత్రం కూడాను పని చేయలేకపోయాయి. నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడాను భస్మం చేసి ఉండేది. ఈ స్థితిలో నీవు కూడా నువ్వు భస్మమై ఉండేటువంటి వాడవు. ఈ సత్యాన్ని గుర్తించుకోలేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు. ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు. దైవము నందు కూడను దోషములు కనిపెట్టడం కూడను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు. ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి. తమకంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది. తనకంటే అధిక సంపద కలిగినటువంటి వానిపైన అసూయ కలుగుతుంది. అతని కంటే కొంత అందంగా ఉండేటువంటి వానిపైన అసూయ కలుగుతుంది. అతని కంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది. ఇదే విధంగానే తనకంటే ఏ విషయము నందైనా కూడను అందము నందు కానీ, అధికారము నందు కానీ, ఇంకేమిటి సంపదల యందు కానీ, గౌరవము నందు కానీ, ప్రతిష్టల యందు కానీ అధికంగా ఉంటూ ఉండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుని యొక్క బలహీనత. ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకున్నటువంటి సద్గుణములు కూడను భస్మమైపోతాయి. ఈ అసూయ ఊరికే వదిలేటువంటిది కాదు. మానవుని యందు ఉన్నటువంటి సమస్త సద్గుణములు కూడను నాశనం చేస్తుంది. రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది. మానవత్వాన్ని మాయం చేస్తుంది. పశుత్వాన్ని బలపరుస్తుంది. ముందు వెనుక యోచన చేయదు. కనుక మొట్టಮೊదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి. ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు. ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు. ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు. ఇదే నిజమైనటువంటి సద్గుణం. ఇత్తి పరోపకారార్థం ఇదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరియైన సద్గుణం అని కూడను భగవద్గీత బోధిస్తూ వచ్చింది. మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయనే. కనుకనే తొమ్మిదవ అధ్యాయము నందు భగవద్గీత యందు అర్జునా! నీవు అనసూయుడవు కమ్ము అసూయుడవు కాకు. అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు. అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది. ఆమె అనసూయ. ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడను పసిపాపలుగా చేసుకుంది. అనగా మన యొక్క గుణములను కూడను మనం వశం చేసుకోవచ్చును. సత్రజూతము గుణములను కూడను మనం జయించవచ్చును. ఈ అనసూయ వల్ల ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది. కనుక అసూయనే ఉంటే మన సమస్తమును కూడను నాశనం చేస్తుంది. ఇది పరులను నాశనం చేయటమే కాదు తనను కూడా తాను నాశనం చేసుకుంటుంది. అసూయాపరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు. కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడను తినడు. ఈ అసూయ ఏ విధమైన రోగము లేకపోయినప్పటికినీ మనిషిని క్షీణింపజేస్తుంది. ఇది అంతర్ఛాయ అని చెప్పుకోవడానికి దీనికి ఒక పేరు. ఛాయా రోగము అనేటువంటిది దేహాన్ని క్రమక్రమేణా కనిపించే రీతిగా తగ్గిస్తుంది. కానీ ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడను అతన్ని భస్మం చేస్తుంది. ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడను చెప్పుకోవచ్చు. మనము తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీన్ని కూడను అనుగ్రహిస్తాడు. తనకు లేదని ఉన్నవారిని చూచి మనం అసూయ పడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది. ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి ఈ అసూయ. యోగి యందు, భోగి యందు, జోగి యందు, విరాగి యందు, వైరాగి యందు, సర్వుల యందు కూడను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి. కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు. ఒకానొక సమయం లోపల బుద్ధుడు విచ్చాటనమై బయలుదేరి వెళ్తున్నాడు. తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తూ ఉండాలి. ఆ గ్రామము లోపల అందరు కూడను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతనిని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు. కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు. నాయనా! మీరు నన్ను దూషించుటలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు. దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు. సరే ఎంత సేపు మీకు ఇష్టంగా ఉంటుంటాదో దూషించమని తాను కూర్చున్నాడు. సరే వారు తిట్టి తిట్టి నోరు నొప్పు వచ్చేసింది. వారు ఇంకా వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉంటున్నారు. అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు. నాయనా! రాబోయేటువంటి గ్రామము లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుండాదో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంత సేపు నేను ఇక్కడ కూర్చున్నాను. మిమ్మల్ని సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమ పడాలి. ధనం వ్యయం చేయాలి. కనుక నేను ఈనాడు ఏ నయాపైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా మీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను. ఎంత హాయి నాకీ నాడు అన్నాడు. నన్ను దూషించుట మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం. ఏదో ఒక విధముగా నీకు తృప్తి కలిగించాను కాబట్టి ఈ తృప్తి కలిగించుట చేత నాకు చాలా ఆనందం అనుకున్నాడు. పరులను సంతృప్తి పెట్టే కోసమని అనేకమంది చత్రాలు కట్టిస్తారు. పాములు కొగ్గిస్తారు. ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైనటువంటి కర్మలు ఆచరిస్తారు. కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోషపెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడినే అన్నాడు. మరి ఇంకా ఒక విషయమైనటువంటిది ఈయన్ని వారికి చక్కగా హృదయానికి అత్తుకునేటట్టు బోధించాడు.నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు "భవతి బిచ్చాందేహి" అని అడిగాడు. నీవు బిచ్చం తీసుకొని వచ్చావు కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు మరొక బిచ్చం తెచ్చావు. అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చం ఏం చేస్తావ్ అన్నాడు. నేను తీసుకోకపోతే నేను వెనుక తీసుకుపోతాను ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు. అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు దాన్ని నేను తీసుకోలేదు అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది? రీడైరెక్ట్ నీకే చేరుతుంది. కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు. మనం ఒక రిజిస్టర్డ్ కవర్ కిని రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే ఆ ఫ్రెండ్ ఆ రిజిస్టర్ కవర్ ని తీసుకోకుండా పోతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏమవుతుంది ఆ కవర్? అది రీడైరెక్ట్ ఎవరు పంపించారో వారికి చేరుతుంది. అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది. కనుక ద్వేషం అనేటువంటిది అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నాం అనుకోవటం కేవలం అల్ప తృప్తి. కనుక ఈ అసూయ అనేటువంటిది మానవున్ని అనేక విధములుగా తనంతట తానే హింసిస్తుంది. ఒక మహాఋషి అనేక ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు. కానీ అతని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయల్దేరింది. అహంకారం బయల్దేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది. అహంకారం అసూయ రెండూ చేరేటప్పటికి ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది. చేరిపోయింది. ఒకానొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు. సన్యాసి వస్త్రం ధరించాడు. వేషం చూస్తే కాషాయం హృదయం చూస్తే కషాయం. దీన్ని ఏదైనా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు. ఒక చెట్టు దగ్గరికి పోయాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. ఆహా! ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది. ఈ ఫల పుష్పములు ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడటానికి. దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి. ఈ తోటను పెంచిన వారు ఎవరు? అని ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు. వైకుంఠ ఏకాదశి వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమా! రాత్రింబవళ్లు బిడ్డలను పెంచినట్టు పెంచినాను. కంటి రెప్పలా కాపాడుతూ వచ్చాను. ఈ మొక్కను నాటింది నేను, ఇది అభివృద్ధి పరిచింది నేను, దీనికి కీడ పడితే తీసేసింది నేను, వేరుపురు కొడితే కొట్టేసింది నేను, ఈ రోడ్డు వేసింది నేను, ఈ అలంకారం చేసింది నేను, కటింగ్స్ చేసింది అన్నీ నేను నేను నేను అనుకుంటూ వచ్చాడు పాపం. ఈ తోటని నా ప్రాణంగా చూసుకుంటున్నాను. ఒక్క తోటమాలి లేడు. నీరు తోడటం నేనే, ఎరువు వేయటం నేనే, రోడ్డంతా clean చేయటం నేనే, ఈ ఫల పుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు. సరే కొంత సేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు. కొంత సేపట్లో ఒక గోవు వచ్చింది. ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తను చొక్కి అన్ని విధాలా చిన్నాభిన్నం చేస్తుంటుండాలి. ఈ పుష్ప గుచ్ఛులనంతా కూడాను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూచి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు. ఆ కర్ర తగిలిందో లేదో ఆ గోవు కింద పడి మరణించింది. సరే గోహత్య పాపం ఈ సన్యాసిని చుట్టుకుంటుందేమోని లోపల భయపడుతున్నాడు. మరి కొంత సేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. అదే దారిని నడుచుకుంటూ వచ్చి అయ్యో పాపం గోవును చంపినటువంటి వారు ఎవరు ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు. అప్పుడు ఈ సన్యాసి దగ్గరికి వచ్చి ఎవరయ్యా ఈ గోవును చంపిన ఆరు ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు. అంతా దైవేచ్ఛ. దైవేచ్ఛనే లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా? ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు. తోటను పెంచింది నువ్వు, పూలు విప్పించి చేసింది నీవు, గోవును చంపింది మాత్రం దైవం. కనుక మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు. చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు. ఈ అహంకారం కూడాను కేవలం అసూయ యొక్క ప్రధమ భాగం అన్నాడు. అప్పుడే చెప్పాడు. అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు. నీ అహంకారాన్ని అతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను. నేను భగవంతుడిని అని అతను తెలుపుకున్నాడు. కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు. కనుక మొట్టమొదటినే మనం అసూయ ద్వేషము అహంకారములకు అవకాశమివ్వకుండా చూచుకోవాలి. ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథ పఠనం చేత లభించేటువంటిది కాదు నాశనం చేసుకోవటానికి. ఇది స్వప్రయత్నంతో సాధనలు సలిపి హృదయము నందు పరివర్తనలు రావించుకొని, పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని, దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను అతమార్చుకోవాలి. అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనల్ని ఏమాత్రం కూడాను రాణింపజేయదు. మనలో సమస్త సద్గుణములు కూడాను అది అతమార్చి వేస్తుంది. కానా మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటం ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత. నిత్య జీవితం లోపల ఆదర్శవంతమైనటువంటి గుణములతో అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములను మనం పోషించుకొనకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము. ఆత్మ యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటూ ఉండాలి. ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు. ఇది ప్రకాశంగా ఈ hall అంతా కూడాను వెలుతురుగా ఉంటుండాలి. ఈ వెలుతురుకు కారణం ఏమిటి? ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తూ ఉంటది. జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు. కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది. ఈ ప్రకాశానికి ఒక రూపమూ ఒక నామమూ లేదు. ఏ రూపమైనా ఏ నామమైనా ధరించవచ్చు. ఉపాధిని ఆధారం చేసుకునే ఈ రూప నామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.బల్బులో light వస్తుండాలి fan లో గాలి వస్తుండాలి stove లో వంట చేస్తుండాలి machine లో పని చేస్తుండాలి machine చేసే పనికి fan చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి బల్బు ఇచ్చేటువంటి light కును stove చేసే వంటకు విత్యాసం ఉంటుండాలి. ఈ machine యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి. ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి. యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి కానీ current ఒక్కటిగానే ఉంటుంది. అదే విధముగానే భిన్న భిన్న ఉపాదుల యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్త్వము అనేకత్వాన్ని నిరూపించేస్తు ఉండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడనూ బోధిస్తూ ఉండాలి. బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తూ ఉండాలి. ట్యూబ్ light ఇంకొక రీతిగా కనిపిస్తూ ఉంటది. dining room బల్బు అనేటువంటిది చాలా bright గా ఉంటది. bedroom బల్బు చాలా dim గా ఉంటది. కానీ అంతా ఒకే current అయితే అక్కడ dim ఏమిటి ఇక్కడ bright ఏమిటి ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం. ఈ బల్బుల్లో వ్యత్యాసం ఉంటుండాలి కానీ current లో వ్యత్యాసం లేదు. నీ యొక్క హృదయము యొక్క ప్రేమతత్వం అనే యొక్క capacity difference ఉంటుండాలి. పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటి గారు పొందుతుంది. ఇది సంపూర్ణత వైపుకుంటే ప్రేమగా ఉంటుంటే ఇది bedroom బల్బు మాదిరి dim గా ఉంటది. కనుక నీవు bulbs మార్చుకో కానీ current ని మార్చడానికి వీలు కాదు. కనుకనే అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా dim గా ఉంటుంటాది. ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే thousands of volts easily గా ఉంటుంటాది. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో. ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలు అవుతుంది. చంద్రుణ్ణి నీవు చూడాలంటంటే ఒక torch light ఓ petromax light ఓ or any lantern తీసుకురా అనక్కర్లేదు. చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుణ్ణి చూడాలి. కనుక ప్రేమ స్వరూపుణ్ణి నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి చూడాలి. ద్వేషముతో ప్రేమ స్వరూపుణ్ణి చూడ్డానికి వీలు కాదు. ద్వేషం ఎలాంటిదంటే blindness ఒక కన్ను లేని గ్రుడ్డి వాని వంటిది. గ్రుడ్డి వాని ఎదురుగా ఎంత powerful అయిన light పెట్టినా మటుకిని వీడికి చీకటే గాని వెలుతురు కాదు. అట్టి గ్రుడ్డి వాడు తన ప్రక్కనే ఉండేటువంటి యొక్క పదార్థాన్ని కూడను ఎక్కడెక్కడో వెదుకుతాడు. అతనే అజ్ఞాని, అతనే అసూయవంతుడు, అతనే ద్వేషిణి, అతనే అహంకారి. ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడను సమీపమునందు ఉన్నటువంటి దైవత్వాన్ని కూడను తాను గుర్తించలేడు. ఎవడు సత్యముతో, ప్రేమతో, అనసూయతో, నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన వెతకడానికి కూడను ప్రయత్నం చేయకుండా direct గా దానిని పట్టేస్తాడు. జ్ఞాన నేత్రములు తెరిచినటువంటి వానికి ఇట్టి పదార్థం లభ్యమవుతుంది. అజ్ఞానం అనేటువంటి నేత్రములు మూసుకున్నటువంటి వానికి ఏమాత్రం కూడను కనిపించదు. కళ్ళు నేను మూసుకుంటే towel ఎక్కడ ఎక్కడ ఎక్కడ అని ఇటు అటు తిరుగుతాను. కళ్ళు తెరచుకుంటే direct గా దాన్ని తీసుకుంటాను. కనుక జ్ఞాని direct గా దైవమును చేరుతాడు. ఇదే సద్గుణము కలిగినటువంటి వాడు. దుర్గుణములతో, సంశయాలతో, అనుమానాలతో అలమటించేటువంటి మానవులకు ఏమాత్రం కూడను ఒక్కటి కూడ కనిపించదు. కనుకనే death is sweeter than the blindness of ignorance అన్నారు. మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు. ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ. కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, మున్ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు, ఈ అసూయకు ఏమాత్రం కూడను లోపల అవకాశమివ్వకుండా చూసుకోండి. ఎవరైనా మీ class లో first rank వచ్చినారంటే వాణ్ణి చూసి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి. నా class లో ఎవరో ఒక నా సోదరుడు first rank వచ్చింది అని నీవు ఆనందపడు రేపటి రోజు ఈ సంవత్సరం నీకు first rank వస్తుంది. లేక నేను కూడ first rank రావాలి నా సోదరునితో పాటని నీవు కష్టపడి చదువు. నీవు చదవకుండా చదివిన వాడు first rank వచ్చినాడు అంటే వాడి పైన అసూయ పట్టడము చదవకుండా పోవడం ఒక తప్పు అసూయ పట్టడం రెండవ తప్పు. నాకు రాలేదే అని ఏడ్చడం మూడవ తప్పు. కనుక వచ్చిన వారిని, బాగున్నవారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉన్న కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నాభిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు. అదే విధంగానే దుర్యోధనుని యొక్క గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడరనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు. పాండరనింప జనించినారు. కార్చిత్తయి రేడు సూతసుతు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయకుడు. ఈ అసూయపరులకు దుర్మార్గులు తోడు నీడ అవుతారు. దానిపై కచ్చిలుడి ఆ శకుని గారు. వాడు కూడనూ అసూయపరుడే. ఈ గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు. ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి? ఎవరి అసూయ వారిని హతమార్చింది. ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలా క్షీణింపజేసింది. కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడను మనం పెంచుకోవాలి. సద్గుణములను మనం పెంచుకున్నప్పుడే భగవద్గీత సలక్షణంగా మనకు అర్థమవుతుంది. లేకపోతే ఒక్క శ్లోకమైనా కూడను మనం అర్థం చేసుకోలేం. ఇది అనంతమైన అర్థాలతో కూర్చినటువంటిది ఈ భగవద్గీత. ఇది కల్పవృక్షంతో సమానమైనటువంటి భగవద్గీత. ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది. కానీ ఈనాడు మనం అనర్థాలు తీసుకుని యదార్థాన్ని కప్పివేస్తున్నాం. కోరి అనర్థాన్ని ఒకటి తీసుకున్నా ಪರವಾಗಿಲ್ಲ అనర్థానికి నానర్థాలు పెంచుతున్నాము. కనుకనే భగవద్గీత వ్యర్థం అయిపోతున్నది. కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు తమ దివ్యోపన్యాసంలో మరొకసారి అసూయాద్వేషాల వల్ల కలిగే భయంకర పరిణామాలను వివరిస్తూ ఈ రెండూ తోడుదొంగలని, ఇది ఆక్రమించిన మనిషికి సుఖశాంతులు దూరమవుతాయని హెచ్చరించారు. అసూయాద్వేషాలను హతమార్చుకోవటానికి దైవార్పితమైన బుద్ధి, పరిపూర్ణమైన ప్రేమ అవసరమని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ మున్ముందు ఎంతో అభివృద్ధి కావలసిన మీరు మీ లేత హృదయాలలో అసూయకు ఏమాత్రం చోటు కల్పించవద్దని హితబోధ చేశారు.భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు 1984 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో భగవద్గీత పై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలిక లో మరో దివ్యోపన్యాసం విన్నారు తరువాత సాయి కుల్వంట్ సభా మండపంలో మే 6, 2011న నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సాయి అవతార వైభవం పుట్టపర్తి క్షేత్ర మహిమ అన్న అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారి ప్రసంగం వినండి. సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు దివ్య మహా స్మృతికి దివ్యాంజలి ప్రేమాంజలి ఘటిస్తూ సత్యసాయి భగవానుడి కన్నతల్లి ఈశ్వరమ్మ వర్ధంతి. ఈశ్వరమ్మ గారిని 1965 లో నేను దర్శనం చేశాను. ఈశ్వరుడికి తల్లి అయినప్పటికీ కూడా ఆమె స్వామికి భక్తురాలు స్వామికి భక్తురాలు అయినప్పటికీ కూడా స్వామి కార్యకలాపాల యందు విశేషమైనటువంటి ఆసక్తి, అభిలాష, ఉత్సాహం ఉన్నటువంటి ఒక పూర్ణ సేవాకృతి ఈశ్వరమ్మ గారి దివ్య స్మృతికి మరొక్కసారి నమస్కరిస్తూ ఆమె ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేది "అందరూ బాగుండాలి" అని స్వామిని అడగండి ఇది నాకు బాగా గుర్తున్నది మాకు ఇది కావాలి అది కావాలి అని అడగటం ఆపేసి అందరూ బాగుండాలని మన స్వామిని అడుగుతూ ఉండండి అందరం బాగుంటే స్వామి బాగుంటాడు అప్పుడు స్వామి బాగుంటే మనందరం బాగుంటాము ఏ సింపుల్ ఈక్వేషన్ పరమాద్భుతమైనటువంటి సన్నివేశం ఇది పరమేశ్వరుడు ఒక మానవ దేహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చే ముందే తల్లిని నిర్ణయించుకుంటాడు భాగవతంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంటుంది కశ్యపుడు అదితి పరమేశ్వరుడిని ప్రార్థించినప్పుడు ఏమని అడిగారంటే "నీవంటి కొడుకు కావాలి, నీవంటి కొడుకుకి నేను తల్లిని కావాలి" అని పరబ్రహ్మ స్వరూపమైన నారాయణుడు ఏమన్నాడంటే "నావంటి వాడు మరొకడు లేడు గనుక నేనే నీ గర్భంలో జన్మిస్తాను" అన్నాడు అట్లా కపిలుడు దేవహుతి, రాముడు కౌసల్య, కృష్ణుడు దేవకి, అధునాతన కాలంలో మన స్వామి ఈశ్వరమ్మ పోలికలు ఉన్నాయా విచారణ చేసినట్లయితే కపిలుడిని అంటే తన బిడ్డని దేవహుతి ఏమడిగింది ఆత్మవిచార మార్గం చెప్పమని అడిగింది సాంఖ్యం బోధించమని అడిగింది అలాగే చెరసాలలో ప్రభవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దేవకి వేడుకున్నది ఏమని ఇట్లా చతుర్భుజాలతో కౌస్తుభమణితో దివ్య శరీరంతో కనుక నువ్వు ఇట్లాగే ఉన్నట్లయితే నీ మేనమామ నా అన్న కంసుడు నిన్ను వధిస్తాడు లోక కల్యాణం కోసం వచ్చినటువంటి నీవు ఆ రూపాన్ని ఉపసంహరించుకొని సామాన్య బాలుడి వలే నాకు కనిపించు అని అడిగింది ఇది మాయలో ఒక భాగమైన లోక కల్యాణ దృష్టిలో ఇది ఒక దైవ కార్యం. అలాగే సత్యసాయి భగవానుడు కూడా మాయ అనేటువంటి ఒక మాట నుంచి తన ఇంటి నుంచి తన తల్లిదండ్రుల నుంచి దూరం అయిన తర్వాత గృహమ్మాయి గృహబ్బాయి అని పిలవటంలోనే తాను ఎంతగా దేహాత్మ భావాన్ని దాటి ఒక పూర్ణమైనటువంటి యోగైక స్థితిలో నిలకడ చెందారో మనకు అర్థమవుతుంది ఇది ఐదేళ్ల వాడు ఎనిమిదేళ్ల వాడు అనే అనగలిగినటువంటి మాటలు మాత్రం కావు పరాపురుషుడు అయినటువంటి ఈశ్వరుడి నోట మాత్రమే ఈ మాటలు మనకి వస్తాయి అందుకే స్వామి అనేక సార్లు "నేను ఏది చెప్పినా చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది తోలునోరు కాదు కదా తాలు మాటలు రావటానికి ఏది వచ్చినా శుద్ధ చైతన్యం లో నుంచి వస్తుంది" అని స్వామి పదే పదే మనకు చెప్తూ ఉండేవారు స్వామి చెప్తారు చెప్తున్నారు నుంచి చెప్పే వారిలోకి మనల్ని సిద్ధం చేశారు స్వామి అయితే సత్యసాయి భగవానుడి యొక్క 86 సంవత్సరాల సుదీర్ఘ అవనీ సంచారంలో తొలి 14 ఏళ్లు పక్కన పెట్టినట్లయితే 72 సంవత్సరాల ఒక బోధలో మూడు విషయాలు ఎప్పుడూ చాలా స్పష్టంగా పునః పునః మరల మరల మనకి గుర్తు చేస్తుండేవారు ఒకటి మాతృదేవత అంటే తల్లి, మాతృభూమి నీవు పుట్టిన ప్రదేశము, మాతృభాష ఏ భాషలో నీవు మాట్లాడవలసి ఉన్నదో దేనికి ఎక్కడైతే నీవు ఉన్నామో అది ఈ మూడింటిని నువ్వు కనుక సమృద్ధంగా గౌరవించి.తదనుగుణంగా గనుక నువ్వు జీవించగలిగినట్లయితే దాని వలన కలిగేటువంటి ఆనందమే ఆనందము. అయితే స్వామి చెప్పి చేయించినవారా? చేసి చెప్పినవారా? అంటే ఈ అవతారం ప్రధానంగా మనకి చెప్పి చేయించినది మాత్రమే కాదు తాను చేసిన తర్వాత మాత్రమే మనకి చెప్పి మనతో ఉంటూ మన వెంట ఉంటూ ఈ డెబ్బై రెండు సంవత్సరాల స్వామి అధ్యాత్మ అవతార కార్యక్రమం అంతా కూడా ఒక పూర్ణమైనటువంటి ఒక క్షణం ఇది. ఈ క్షణంలో మాతృదేవత తల్లికి జీవుడికి ఉండేటువంటి బంధం ప్రత్యక్ష బంధం. తండ్రికి జీవుడికి ఉండేటువంటి బంధం పరోక్ష బంధం. కనుకనే తల్లికి మనం పదహారు రకాల తర్పణాలు ఇవ్వాలి. రాముడు గాని కృష్ణుడు గాని ఇవన్నీ అలాగే చేశారు. ఇప్పటికీ మనము అదే చేస్తున్నాం. కానీ పరమేశ్వరుడే మానవ దేహం తీసుకుని వస్తే ఏం చేస్తాడు అని. తల్లి ఆజ్ఞను పాటిస్తాడు. తల్లి ఆజ్ఞను పాటించడమంటే ఆ పదహారు తర్పణాలకి ఆమెకు అర్హత నివ్వటమే. ఇవాళ ఇక్కడున్న విద్యాలయాలు కానీ సూపర్ స్పెషాలిటీ కానీ స్వామి తన తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానం "పుటపర్తి వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను" అన్నటువంటి వాగ్దానాన్ని కానీ పరిపూర్ణంగా తూ.చా. తప్పకుండా ఆచరించినటువంటి పరమాత్మ పరిపూర్ణ అవతారి. సత్య సాయి భగవానుడు తన దివ్య అవతారాన్ని ఎక్కడ ప్రారంభించారో ఈ ఎనభై ఆరు సంవత్సరాలు ఇక్కడే ఉండి దానిని ఇక్కడే ముగించటం ఒక విశిష్టమైనటువంటి విశేషణం. ఎందుకంటే స్వామి యొక్క ప్రతి అణువు స్వామి యొక్క ప్రతి భావన స్వామి యొక్క ప్రతి సంకల్పము ఇక్కడి నుంచే సర్వ జగత్తుకి కూడా ఆదేశంగా సందేశంగా ఉపదేశంగా అది చేరుతూనే ఉన్నది. ఈ పరమాత్మ తన తల్లికి సాధన ఏదైనా ఇచ్చారా అని. ఒక మౌన సాధన నిరంతరమైన సాధన ఇచ్చిన కారణంగా ఈశ్వరమ్మ తదనంతర కాలంలో స్వామిని స్వామిగా అనుభవించగలిగిన ఒక స్థాయికి వెళ్ళింది. అలాగే ఇటువంటి ఈ రోజున ఆమె ఆర్తితో కూడినటువంటి ఒక పిలుపు పరమాత్మ యొక్క ఉత్సాహము అనుగ్రహము కలిసి ఒక మోక్ష వరదానం జరిగినటువంటి రమణీయ సన్నివేశం స్వామి అవతారంలోనే మనం చూస్తాం. మాతృమూర్తి ఎడల మాతృ భక్తి విశేషాన్ని ప్రపంచానికి అనేక రీతులలో స్వామి బోధించారు. మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత పంచ పాండవులని కుంతిని ద్రౌపదిని వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడు వెళితే ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరూ కూడా ఆవేశంతో ఊగిపోతున్న వేళ గాంధారి శ్రీకృష్ణ పరమాత్ముని అడిగింది, "నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు శాంతం ఏర్పడిందా? నూరుగురు బిడ్డలను నేను కన్నానే ఒక్కడినన్నా మా ఆనందం కోసం మిగల్చటానికి నీ మనసు అంగీకరించలేదా? అందరినీ ఇందరినీ కన్నాను ఏ ఒక్కరినీ నిలపాలని నీకు అనిపించలేదా? నువ్వు దేవుడివేనా?" అని ప్రశ్నించింది. ప్రశ్నించడమే కాదు శపించబోయింది. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మమైనటువంటి మన స్వామి చెప్పిన మాట, "గాంధారి, నిజమే నూరుగురు బిడ్డలను నీవు కన్నావు కానీ ఒక్కడినైనా కంటితో కన్నావా? వాడు ఎట్లా పెరుగుతున్నాడు? ఎట్లా ఉన్నాడు? ఎప్పుడన్నా నువ్వు చూశావా? నీ ప్రేమని ఆ బిడ్డలలో ఏ ఒక్కడైనా పొందగలిగాడా? తల్లి ప్రేమని పొందనటువంటి వాడు దైవ ప్రేమని పొందలేడు. కనుక వారికి దైవానుగ్రహం దొరకలేదు." అని స్వామి చక్కగా దానిని వ్యాఖ్యానం చేశారు. అయితే ఇక్కడ మాతృదేశం మాతృదేశం అంటే మనం పుట్టినటువంటి ఈ ప్రదేశం. సత్య సాయి భగవానుడు ఏ సేవా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభం చేసినా పుటపర్తిలో తాను ఉన్నటువంటి ప్రదేశంలో పరిపూర్ణంగా దానిని ఆచరించి దాని ఫలితాలు "ఇదిగో నేను ఇట్లా చేశాను మీరందరూ ఇలా చేయండి" అని ప్రపంచానికి అందించారు. అందుకని ఇవాళ సర్వ ప్రపంచము కూడా పుటపర్తిలో ఈ విషయాలన్నీ ఎలా జరిగినయి? ఎట్లా జరిగినయి? ఎలా చేయగలిగారు వీళ్ళంతా? చిన్న కుగ్రామం లేదు తర్వాత నెమ్మదిగా చిన్న పట్టణ వాటిక. ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఏమిటి? resources ఏమిటి? విచారణ చేస్తే ఇక్కడ ఉన్నది ఒక్కటే. సంకల్పము పరమాత్మది, అనుగ్రహము పరమాత్మది, కర్తవ్యము పరమాత్మది, కర్త స్వామి, భర్త స్వామి, భోక్త స్వామి. కనుక ఇందులో మరి మనందరము ఎవరమంటే స్వామి తన అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి వీలుగా ఒక అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళంగా మనం భావించినట్లయితే ఇంతకాలము స్వామి... అయితే ఇవాళ మనం కన్నా అదృష్టం ఏమిటి? ఒకే ఒక అదృష్టం. ఒక మహా పరిపూర్ణ అవతారి పదహారు కళల శక్తి స్థానంగా పుటపర్తిని ప్రశాంతి నిలయాన్ని మార్చి ఇక్కడికి వచ్చి ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో డెబ్బై రెండు సంవత్సరాల దివ్య ప్రబోధంలో కొన్ని దశాబ్దాలుగా స్వామి యొక్క దర్శనాన్ని అనుభవించాం. స్వామి యొక్క స్పర్శని అనుభవించాం. స్వామి మాట్లాడగా గంటలు గంటలు మాట్లాడగా విన్నాం. ప్రత్యేకమైనటువంటి సంభాషణలు interviews లో విన్నాం.ఎన్ని సార్లు స్వామి మైమరచి దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తుంటే చేసుకో పాద నమస్కారం అన్నప్పుడు దాన్ని అనుగ్రహంగా మనం పొందాం. స్వామి కార్యకలాపాలు చూశాం. స్వామిని పరమాత్మగా అనుభవించాం. అటువంటి స్వామి అవతారమూర్తిగా, మానవతా మూర్తిగా మనకు సచివుడుగా, బాంధవుడుగా, ఇంటి పెద్దగా, ఒక గురువుగా, జగద్గురువుగా, సద్గురువుగా, మహా పరిపూర్ణ అవతారమూర్తిగా మనల్ని చేసిన ప్రభావం, మన మీద చూపిన ప్రభావం ఇది అనన్యం. ఆ ప్రభావాన్ని ఏం చేయాలి మనం తర్వాత విచారణ చేద్దాం. స్వామి మనకి అపారమైనటువంటి వాంగ్మయాన్ని మనకిక్కడ వదిలిపెట్టారు. ఏ అవతారమూర్తి చేయనట్టుగా వాహినులన్నీ రాశారు. వాహినులన్నీ ఒక ఎత్తు అది పూర్వ రంగం. సత్య సాయి భగవానుడు స్వయంగా ప్రబోధించినటువంటి కొన్ని వేల ఉపన్యాసాలన్నీ కూడా వేద సమానాలు, ఉపనిషత్ సమానాలే. మనకో చిన్న హెచ్చరిక చేశారు లేదా ఒక సూచన చేశారు. ఎవడు గురువు? ఎవడు స్నేహితుడు? ఏం పుస్తకం చదవాలి? ఎక్కడికి వెళ్ళాలి? అని అన్నప్పుడు "అంతరంగము కన్న జాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమగురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే" ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని. బయట ఉన్నదంతా వస్తు ప్రపంచమని స్వామి ఉపన్యాసాలన్నీ 1960-65 వరకు ఆ ఉపన్యాసాలన్నీ కూడా అచల బోధ, అమృత బోధ, ఆనంద బోధ, పూర్ణాద్వైత బోధ. అయితే అందుకునే స్థాయి నెమ్మదిగా తగ్గుతున్న కారణంగా, భక్త సమూహాలు పెరిగిన కారణంగా మధ్యలో మధ్యలో చిన్న చిన్న చిన్న కథలు చెప్తూ వచ్చారు. మనమేం చేశామంటే చిన్న కథలతో సంతృప్తి పడ్డాం, స్వామి బోధించిన అచల బోధను వెనక్కి నెట్టుకున్నాం. నిజానికి స్వామి యాభై యాభై ఐదు సంవత్సరాల దేహానికి వచ్చేప్పటికి చేయవలసినటువంటి పూర్ణ బోధ చేసేశారు. ఒక మానవుడు తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని, దివ్యత్వాన్ని ఏకకాలంలో ఎట్లా అనుభవించవచ్చునో స్వామి చిన్నగా సూత్రీకరించారు. దానవత్వాన్ని, దీనత్వాన్ని రెండు వదిలిపెట్టగలిగితే మానవత్వమూ, దివ్యత్వమూ ఏకకాలంలో పరిమళిస్తాయి. సాధన చేయాలి. ఈ రోజున సత్య సాయి భగవానుడు దేహంలో ఉన్నారా లేరా అన్న ప్రశ్న స్వామి అంటే తెలియని వారికి, స్వామి అంటే ప్రత్యక్ష అనుభవం లేనివారికి ఎక్కడో లోక లోకాంతరాలలో ప్రాణాలలో పుట్టవచ్చునేమో కానీ స్వామితో ప్రత్యక్ష అనుభవం ఉన్నటువంటి మన బోటి వారికి స్వామి లేరో లేదో, స్వామి ఉన్నది లేదు. స్వామి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇకపై కూడా ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ప్రైవేటు సంభాషణలో స్వామి చెప్పిన మాట ఇప్పుడు గుర్తొస్తున్నది. ఎవరి ఇంట నా చిన్న చిత్రపటం ఉంటుందో, ఎవరు ప్రతిరోజూ నా నామ భజన చేస్తారో, ఎవరి మనస్సు సంకీర్తన యత్తమై ఉంటుందో, ఎవరు స్వామి యందు విశ్వాసము చేత అన్నీ వదిలిపెట్టి నాయందే భారం వదిలి పెడతారో వారిని, వారి రాబోయే ఇరవై ఒక్క తరాలని నేను కాచుకుంటాను, చూచుకుంటాను అని స్వామి అభయం. [చప్పట్లు] కుల, మత, జాతి, గుణ, దేశ అన్నీ అవధులు ఎల్లలు దాటి దాటి విశ్వాత్మకమైనటువంటి సత్య సాయి ప్రబోధమే అధునాతన మానవుడికి దివ్య ప్రబోధంగా మనం భావన చేయాలి. మనల్ని అందరివేళ మాములు వాడి నుంచి బాగా చదువుకున్న వాడు కూడా అడిగే ప్రశ్న ఇకపై ఏమి అని. ఇక ముందు ఏమున్నదో, ఇప్పటిదాకా ఏమున్నదో, ఇకపై కూడా ఇదే ఉంటుంది, ఇంతకంటే ఒక లక్ష రెట్లు ఉంటుంది ఇది సమాధానం. అంతే కాదు పర్వ దినాలలో ఇది పుణ్యక్షేత్రం అవుతుందో ఇవన్నీ దృశ్య మాధ్యమంలో, టీవీలో ఎదుర్కొన్న ప్రశ్నలు గనుక మీ ముందుంచుతున్నాను. పుణ్యక్షేత్రం అవుతుందా కాదా, అవుతుందా కాదానా ఇది పుణ్యక్షేత్రమే, ఇది దివ్య క్షేత్రమే. కారణం ఏమిటంటే షిరిడీ సాయినాథుడి జీవిత చరిత్ర సత్య సాయి భగవానుడు వచ్చి చెప్పేదాకా ఎవరికీ తెలియదు. అది నా పూర్వ శరీరమని, షిరిడీ నా పాత మందిరమని స్వామి అనేకమైనటువంటి విషయాలు. షిరిడీ బాబా తన ముప్పై తొమ్మిదవ సంవత్సరం వచ్చేదాకా తానెవరో ఈ ప్రపంచానికి చెప్పలేదు. కనుక షిరిడీ బాబా గురించి ఎవరు చెప్పాలి అంటే దాన్ని కొనసాగింపుగా వచ్చిన మహా పరిపూర్ణ అవతారమైన స్వామి మాత్రమే చెప్పాలి. స్వామే ఆ చరిత్ర గుట్టు విప్పారు. స్వామి అనుగ్రహం చేత, స్వామి సంకల్పం చేత ఈ అవతారానికి మాత్రమే కాక తన పూర్వ అవతారానికి కూడా పరిపూర్ణ వైభవాన్ని తెచ్చారు. అందుకనే ఆంధ్రదేశంలో రామాలయాలు ఉన్న ప్రతిచోటా సాయి ఆలయాలు ఏర్పడ్డాయి. సాయి ఆలయాలు ఉన్న ప్రతిచోటా సత్య సాయి మందిరాలు ఏర్పడ్డాయి. అంటే సాకేత రాముడు, షిరిడీ సాయి, సత్య సాయి ఒక్కరే. దీన్లో మనకేం సందేహం లేదు. కాబట్టి ఇది పుణ్యక్షేత్రం కావటానికి ఎక్కువ సమయం ఏం లేదు. షిరిడీ బాబా స్వామి వచ్చిన తర్వాత ఆ వైభవాన్ని సంతరించుకున్న కారణంగా ఆనాటి ఆ శరీరంలో నుంచి చెప్పినటువంటి మాట ఇప్పటికీ యధాతథంగా కొనసాగుతున్నది.ఇక ఈ దివ్య క్షేత్రం ఈ పుణ్యక్షేత్రం పర్వదినాలలో ఎట్లా పరవళ్ళు తొక్కబోతున్నదో దివ్యమైనటువంటి స్వామి పరిమిత దేహంలో ఉండి అపరిమితమైన మానవాతీతమైన దివ్యమైనటువంటి అనేకమైనటువంటి పరమాద్భుతాలు ఈ ప్రపంచం చుట్టూ ఎట్లా పరచి తరచి ఉంచారో అలాగే స్వామి సమాధి నుంచి కూడా దానికి మించి ఒక కోటి రెట్లు మనకు అనుభవాలు ఇవ్వబోతున్నారు. ఈ అనుభవాలు మనకి ఇప్పటికే ప్రారంభమైనాయి స్వామి శరీరము వదిలిపెట్టారన్నారు పటాలలో నుంచి తేనె పటాలలో నుంచి విభూతి అనేకమైనటువంటి స్వప్న దర్శనాలు అనేకమైనటువంటి పరమాద్భుత మహిమలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే సమాధి అంటే మనం కట్టిన masonry work కాదు దానికి మనం వేసే బంగారు పూత కాదు సమాధి అంటే సమధి అన్నింటినీ కూడా తన ధీశక్తితో తన యందు తన చేతుల యందు తన సంకల్పం నందు నిక్షిప్తం చేసుకొని సర్వ జగత్తుని కూడా ఒక సమ అధీనమైనటువంటి స్థాయిలో దీన్ని నడిపిస్తారు కనుక స్వామి సమాధి పలికేదో ఉలికేదో కాదు స్వామి నడిపించే మహా చైతన్య శక్తి. కేవలం పరిమిత శరీరంలో నుంచే ఇంత చేయగలిగారే అపరిమితమైన విశ్వాత్మగా రూపుదిద్దుకున్నటువంటి ఈ వేళ రాబోయేటువంటి ఆ వైనాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఈవేళ ప్రధానంగా స్వామి భక్తులుగా మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి ఇది విచారణ చేయాలి. స్వామి దేవుడే స్వామి పరమాత్మే స్వామి సర్వదేవతాతీత స్వరూపులే దీనిలో ఏం పేచీ లేదు. కానీ మనమేం చేయబోతున్నాం ఇదిగో ఇట్లా చేయి అట్లా చేయి అనటానికి భౌతికంగా స్వామి మన దగ్గర లేరు. మన దగ్గర లేరు గాని మానసికంగా ఉన్నారు హృదయంలో ఉన్నారు బాగుంది కానీ మనం ఏం చేయాలి అంటే సత్యసాయి భగవానుడు ఏ సంకల్పం చేసి తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించారో వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ ఈ మూడు ప్రధానంగా ప్రేమా సేవ అనేటువంటి రెండు యోగాలు వీటన్నింటినీ కూడా మనం సాకల్యంగా అర్థం చేసుకుని ఇప్పటివరకు కాస్త ఉదాసీనంగా ఉన్నా అప్పుడప్పుడు వీలు చూసుకుని ఇక్కడికి వచ్చాం మనం. వీలు చూసుకుని ఇక రావటానికి వీల్లేదు ఇక్కడికి వీలు చేసుకుని ఇక్కడికి రావాలి వచ్చి సేవ ఎవరిస్తేనో మనం తీసుకునేది కాదు నాకు సేవాదానం చేయమని మనం అడిగేటువంటి స్థాయికి రావాలి. ఏ స్వామి వజ్ర సంకల్పం ఏ స్వామి అవతార పరమార్థం ఏ స్వామి అవతార వైభవం ఈ సర్వ జగత్తుని కూడా కదిలించిందో దానిని ఇంకా మహోద్వేగంగా మహోత్సాహంతో పరమ రమణీయమైనటువంటి ఆర్ద్రమైనటువంటి హృదయంతో సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అవతారాన్ని మనంతట మనమే స్వీయ నాయకత్వాన్ని వహించాలి. స్వామి ఆదేశాలు అన్నీ లిఖితంగా ఉన్నాయి అన్నింటినీ కూడా సత్యసాయి సేవా organization అనబడేటువంటి ఒక engine కి మనమందరం కూడా బోగీలుగా తయారు కావాలి. పరమాత్మ యొక్క తత్వ ప్రచారం జరగాలి సత్యసాయి భగవానుడి యొక్క మహా మహిమోపేతమైనటువంటి ఈ దివ్య జీవన విధానం అంతా దేశంలో నలుమూలలా ప్రతి భాష వారు ప్రతి మతం వారు ప్రతి కులం వారు అందరూ కూడా స్వామికి మహోత్కృష్టమైనటువంటి ఉదాత్తమైనటువంటి నివాళిగా దానిని సమర్పించాల్సిందిగా నేను భావన చేస్తూ స్వామి నిన్నటిదాకా మనతో ఉన్నారు. ఇరవై నాలుగు రెండు వేల పదకొండు ఏప్రిల్ నుంచి మనతో నుంచి మనలో ఉన్నారు. ఇవాళ మనలో ఉన్నది సాయి శక్తి తప్ప అన్యమైన శక్తి లేదు మన శక్తులు ఈ ప్రపంచానికి ఎంతగా పెద్దగా పనికొచ్చేవి మాత్రం కాదు. జీవ ప్రజ్ఞని దైవ ప్రజ్ఞతో గనక జోడించి పరమేశ్వరుడు నా యందు ఉన్నాడు అనగానే నా ఆలోచనలు నా భావనలు నా మానవీయ సంబంధాలు సమాజం పట్ల నాకున్నటువంటి దృష్టి ఇదంతా కూడా స్వామి ఎలా భావించారో అలా భావించినప్పుడే స్వామి మనలో ఉన్నట్లుగా మనం భావన చేయాలి. ఆయన నాకు బాగా గుర్తు ఒక చిన్న సంఘటన చెప్తాను చాలా ఏళ్ల క్రితం పందొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాంతంలో బొంబాయి నుంచి ఒకాయన వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చారు ఆ అమ్మాయి great dancer stretchers మీద ఆ రోజుల్లో అక్కడ ఇసుకలో పడుకోబెట్టారు బొంబాయి నుంచి తీసుకొస్తే వాళ్లకు ఒక్కతే అమ్మాయి అప్పటికే షణ్ముఖానంద హాల్లో కనీసం ఒక ఇరవై ముప్పై performances ఇచ్చింది. Tata research cancer center ఏం రాసిచ్చిందంటే ఈ అమ్మాయి జీవితం కేవలం రెండు నెలలు మాత్రమే అని certificate ఇచ్చారు. ఆ certificate తీసుకుని వాళ్లేమి స్వామి devotees కారు ఆ క్షణం వరకు పుట్టపర్తికి as a last resort వచ్చారు. ఆ రోజున మేమంతా ఇక్కడే ఉన్నాం స్వామి దర్శనానికి వచ్చి పొద్దున ఏడు నలభై ఐదు ఎనిమిది గంటల ప్రాంతంలో sick bay దగ్గరికి వచ్చారు అక్కడ front row లో నేనే కూర్చొని ఉన్నాను. స్వామి నన్ను ఇలా pick up చేసి 'వీళ్ళని తీసుకుని లోపలికి రా' అన్నారు. 'స్వామి! ఆమె నడవలేదు' 'నడుస్తుంది నువ్వు తీసుకురా' 'ఎలా నడుస్తుంది? విన్న ముఖానికి cancer ఉంది అని దాని report' అప్పటికే ఆమె మంచం మీద పడుకొని సుమారుగా పదహారు నెలలు. ఏమో స్వామి అన్నారు అచంచలమైన విశ్వాసంతో అక్కడికి వెళ్లి streatcher ముట్టుకోబోతున్నాం ఆ అమ్మాయి ఏమన్నదంటే 'నేను కొంత ప్రయత్నం చేస్తాను' అన్నది. ప్రయత్నం చేయగానే ఆ ప్రయత్నం అవగానే మేము కాస్త చేయూతనిచ్చాం ఇదే verandah లో నుంచి స్వామి interview roomలోకి తీసుకెళ్ళాం. మేమందరం కూర్చున్నాం స్వామి ఆ అమ్మాయిని కూర్చోమనరు నుంచోమనరు చూడరు పలకరించరు no attention. ఆ అమ్మాయి ఎక్కడ పడిపోతుందో అని మా భయం.స్వామి ఒక ఐదు నిమిషాలు మా అందరి భావాలు ఇట్లా కాస్త పెడదారి పట్టే దాకా ఆగి ఆ అమ్మాయి వైపు నువ్వు dancer కదా అని నన్నే బయటకొచ్చి ఒక కుర్చీ తెచ్చి వెయ్యమన్నారు. నేనే వేశాను ఆ కుర్చీ. sit down అన్నారు స్వామి. చక్కగా కూర్చుంది. నేను చెప్పేదాకా కూర్చో మళ్ళీ తర్వాత లేదు గానివి అన్నారు. మిగతా వాళ్ళతో interview ఏదో మాట్లాడేది మాట్లాడారు. ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. స్వామి ఏమన్నారంటే మూడు రోజులు ఉండు, మూడు రోజులకు రెండు పూటలా రా అన్నారు. సరే మనకు తెలియంది ఏముంది రెండో రోజు ఒక నాట్య భంగిమలో ఒక భంగిమ చెప్పి నువ్వు అది చెయ్యి అన్నారు. చాలా critical భంగిమ అది. కానీ చేసింది. చేస్తే స్వామి ఇంకేమీ dance చేయచ్చు కదా అన్నారు నవ్వుతూ. కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసినాయి ఆ అమ్మాయికి. స్వామి మీ life కి నాకు అవకాశం లేదు I cannot dance. మీ అనుగ్రహం ఉంటే కాస్త బతకగలుగుతానేమో అంది. లేదు లేదు బతుకుతావు పెళ్లి చేసుకుంటావు dance చేస్తావ్ నేనున్నాగా అన్నారు. [అందరూ ఒకేసారి చప్పట్లు] మూడో రోజు సుమారుగా ఐదున్నర ప్రాంతంలో స్వామి మా అందరినీ మళ్ళీ పిలిచారు. ఆ మూడు రోజులు మా అందరికీ ఆ అమ్మాయి కారణంగా ప్రతిరోజూ interview అయింది. మూడో రోజు సాయంకాలం లేచి హాయిగా flight ఎక్కి నీ ఊరెళ్ళు బంగారు అని ఆ తండ్రి వైపు చూసి ఈ అమ్మాయి బతకదని తెలిసి కూడా మీ flat లో పైన ఉన్నాడే షా ఆ అబ్బాయి, ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని ఇచ్చి చెయ్యి సుఖపడుతుంది అన్నారు. ఆశ్చర్యపోయినారు వాళ్ళు. ఎక్కడ బొంబాయి, ఎక్కడ మన ఇల్లు, ఆ పైన షా, ఎలా స్వామికి తెలుసు, ఎవరు చెప్పారు? స్వామి సర్వాంతర్యామి. అయింది. అయిన తర్వాత ఆయనతో ఏమన్నారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం తాతవై తిరిగి రా అన్నారు తెలుగులో. ఆయన అలాగే ఆ అమ్మాయి అతన్నే పెళ్లి చేసుకున్నది. పిల్లవాడిని కన్నది. పిల్లవాడిని తీసుకుని అందరూ వస్తే స్వామి మళ్ళీ morning interview ఇస్తూ స్వామి ఏం పేరు పెట్టావ్ అని అడిగారు. ఏం పెట్టలేదు స్వామి మీ gift ఇది నాకు మీరే పెట్టాలి అంటే సాయి కరుణ అని పేరు పెట్టుకో అన్నారు. అప్పుడు ఆ తండ్రి ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతున్నది. పద్నాలుగు లక్షల రూపాయల DD తీసుకొచ్చి స్వామి పాదాల మీద పెట్టబోయినాడు. స్వామి మామూలుగా వ్యత్యస్తంగా పాదం మీద పాదం వేసి కూర్చునే స్వామి రెండు కాళ్ళు వెనక్కి వితురులా చేసి ఏమిటా cover లో అన్నారు. పద్నాలుగు లక్షలు స్వామి అన్నారు. I have come to give not to take, you can take home. నీకు మనవడు పుట్టాడు. వాడి పేరు మీద వేసుకో. నాకేమి సంబంధం అన్నారు. అది పరమాత్మ. ఈ దివ్యానుభవాలన్నీ [అందరూ ఒకేసారి చప్పట్లు] ఇవాళ శేష జీవితం ఏం చేయాలి అన్నప్పుడు ఏ ఏ రంగాలలో ఉన్నటువంటి ప్రజ్ఞామూర్తులందరూ కూడా సత్యసాయి దివ్య అవతార వైభవాన్ని నలుదిశల సర్వ ప్రపంచంలోనూ చాటించేటువంటి విధేయంగా ప్రజ్ఞను చూపించాలి. అలాగే నిత్య జీవితంలో స్వామి మనల్నించి ఏమి ఆశించారు? మనకు ముక్తిని ఇస్తాననలేదు స్వామి, మోక్షం ఇస్తాననలేదు. పరిణామం జరగాలి transformation. సత్యసాయి అవతారంలో అటువంటిది జరగాలి. మనం కూడా స్వామికి అటువంటి దివ్యమైనటువంటి నివాళి సమర్పిస్తూ మన జీవితాలన్నీ ధన్యవంతం చేసుకోవాలని ఆశిస్తూ సత్యసాయి భగవానుడు మనల్ని అన్నివేళలా నడిపించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం. [పాట] సాయి కుల్వన్ సభా మండపంలో మే ఆరు, రెండువేల పదకొండున నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సాయి అవతార వైభవం పుట్టపర్తి క్షేత్ర మహిమ అన్న అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు కార్యక్రమం సమాప్తం. [పాట]
SSSMC · audio
Telugu Broadcast - 555
Telugu Broadcast - 555
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 58:33
More in this series
Telugu Broadcasts
- 57 min 394
Telugu Broadcast - 394
- 1 hr 396
Telugu Broadcast - 396
- 58 min 402
Telugu Broadcast - 402
- 58 min 420
Telugu Broadcast - 420
- 56 min 424
Telugu Broadcast - 424
- 57 min 427
Telugu Broadcast - 427
- 57 min 490
Telugu Broadcast - 490
- 56 min 491
Telugu Broadcast - 491
- 56 min 498
Telugu Broadcast - 498
- 58 min 555
Telugu Broadcast - 555
Now playing - 57 min 560
Telugu Broadcast - 560
- 58 min 561
Telugu Broadcast - 561