Skip to content
Transcript తెలుగు
[ఉపోద్ఘాత సంగీతం] ఓం శ్రీ సాయిరాం! రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా డిసెంబర్ ఇరవై ఐదు, రెండువేల తొమ్మిదిన స్వామివారి దివ్య సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి క్రిస్మస్ పర్వదిన విశేషాలను మీరు వింటారు. తదుపరి శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి చెందిన పదిహేను వందల మంది పూర్వ విద్యార్థులు ఆంగ్ల నూతన సంవత్సరాన తమ సాయిమాత ఒడికి చేరి ప్రేమపూర్వకంగా సమర్పించిన కార్యక్రమాలు మరియు వారి మనోభావాలను గూర్చి మీరు వింటారు. తదుపరి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు లీలా కైవల్యం పేరిట స్వామి యొక్క ప్రేమతత్వం మరియు మానవాళికి స్వామి అందించిన సేవల పైన ప్రసంగిస్తారు. ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు, రెండువేల తొమ్మిదిన స్వామివారి దివ్య సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి క్రిస్మస్ పర్వదిన విశేషాలను మీరు వింటారు. [ఉపోద్ఘాత సంగీతం] రెండువేల తొమ్మిదవ సంవత్సరంలో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య సన్నిధిలో జరిగిన క్రిస్మస్ వేడుకలపై నివేదిక వింటారు. ఓం శ్రీ సాయిరాం! ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య సన్నిధిలో జరుపుకునే అనేక పండుగలలో క్రిస్మస్ ఒకటి. ప్రతి సంవత్సరం జరిగినట్టే రెండువేల తొమ్మిదవ సంవత్సరంలో కూడా అత్యంత వైభవోపేతంగా వేడుకలు జరిగాయి. స్వామి దివ్య సన్నిధిలో ప్రతిక్షణం నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని నిరూపించాయి. సంవత్సరం క్రుంగోత్త కార్యక్రమాలతో, వినూత్నమైన రీతిలో క్రిస్మస్ జరుపుకోవటం వల్ల భక్తులు ముఖ్యంగా విదేశీయులు అమితంగా ఆనందించారు. క్రిస్మస్ సమయంలో రాష్ట్రంలో ఉద్యమాలు, అలజడులు చెలరేగడం వల్ల రోడ్డు రవాణా సౌకర్యాలు కుంటుపడ్డాయి. చాలా మంది భక్తులకు ప్రశాంతినిలం చేరుకోవటం కష్టతరమైంది. అయినా ఎంతో ఉత్సాహంతో ఆరువేల మందికి పైగా విదేశీ భక్తులు ప్రశాంతినిలం చేరుకున్నారు. రోడ్డు రవాణా వ్యవస్థ కుంటుపడినా, భక్తుల భక్తి విశ్వాసాల కారణంగా సాయికుల్వంత సభా మంటపం ఎప్పటిలా భక్తజన సందోహంతో నిండిపోయింది. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా సాయికుల్వంత సభా మంటపాన్ని నయన మనోహరంగా అలంకరించారు. అలంకరణ బాధ్యతను అలంకరణలో అత్యంత ప్రతిభావంతుడైన అమెరికా నివాసి మహేష్ రాయ్ కి అప్పగించారు. విశేషం ఏమిటంటే ఒకమారు స్వామి మహేష్ రాయ్ కి స్వప్నంలో సాక్షాత్కరించి తన నివాసాన్ని అలంకరించమని ఆదేశించారట. అందువల్లనేనేమో సంవత్సరం సాయికుల్వంత సభా మంటపం అలంకరణ సర్వాంగ సుందరంగా ఉంది. డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంకాలం క్రిస్మస్ ఈవ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే క్రిస్మస్ క్యారల్స్ బృందగానం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సుమారు తొమ్మిది వందల మంది కళాకారులు సామూహికంగా భక్తజన సందోహాన్ని ఉర్రూతలూగించేలా క్యారల్స్ పాడారు. ఇవే కాక మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు. డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ పవిత్ర క్రిస్మస్ పర్వదినం. స్వామి అశేష భక్తజన వాహినికి తమ దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. స్వామి దివ్యోపన్యాసానికి ముందు ఇద్దరు విదేశీ వక్తలు తమ అనుభవాలను వివరించారు. ముఖ్యంగా స్వామి తన దివ్య ప్రేమతో జన బాహుళ్యంలో, సంఘంలో విధంగా నిశ్శబ్దంగా పరివర్తన తీసుకొస్తున్నారో చెప్పారు. మొదటి వక్త పద్దెనిమిదేళ్ల అమ్మాయి జూలియనా ఫుల్లర్. కోస్టారికా దేశ నివాసి. ఆమె కోస్టారికా మెడికల్ స్కూల్లో చదువుకుంటోంది. తన ఆరవ ఏట తన ఇంగ్లీష్ టీచర్ వద్ద బాబా ఫోటో చూడటం జరిగిందని, ఒక్కసారి స్వామిని చూడగానే స్వామి కన్నులలోని ఆకర్షణతో తన మనసంతా నిండిపోయిందని, ఆనాటి నుండి ప్రేమ, దయ వంటి సాత్విక భావాలు తనలో చిగురించాయని ఆమె చెప్పింది. తత్ఫలితంగా ఎంతో కుతూహలంతో, శ్రద్ధతో స్వామి బోధనలు చదివి ఉత్తేజితురాలై మాంసాహారాన్ని కూడా త్యజించింది. ఒక హఠ యోగ పాఠశాలను ప్రారంభించి అందులో ఎడ్యుకేర్ కి సంబంధించిన విషయాలను కూడా బోధించసాగింది. స్వామి తనను అనేక విధాల ఆదుకుంటున్నారని, తన విద్యాభ్యాసానికి కూడా స్వామి దయ వల్లే ధనం ఏర్పాటవుతుందని, తాను అనుక్షణం స్వామి దివ్య ప్రేమను అనుభవిస్తున్నానని చెప్పింది. స్వామిని నమ్మిన తరువాత ఎవరన్నా బాధపడితే తన హృదయం ద్రవిస్తోందని, సంతానం లేనివారు బాధపడుతూ ఉంటే సానుభూతితో తాను ప్రార్థిస్తే వారికి బిడ్డలు కూడా కలిగారని జూలియనా చెప్పింది. స్వామి ఆశీస్సుల వల్ల అనూహ్యంగా ధనం చేకూరి మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించడానికి 2007వ సంవత్సరంలో ఇండియా వచ్చింది. ఆమెకు ప్రశాంతి నిలయం ఒక భూలోక స్వర్గంలా తోచింది. కోస్టారికాకు వెళ్ళిన తరువాత Love in Action అనే రేడియో సాయి కార్యక్రమానికి స్పానిష్ భాషలో తన సహాయ సహకారాలు అందించింది. మనిషి అంటే భౌతిక శరీరం కాదని, శరీరం అస్థిరమని బాబా వారు చెప్పే మాట ఎన్నడూ మరవక స్మరిస్తానని, విషయంలోనైనా స్వామిని సర్వస్వ శరణాగతి పొంది సైర్యనే సూచనలు పొందుతానని, తన భక్తి పరిపూర్ణమై పన్నెండు సంవత్సరాల స్వల్ప కాలంలో తాను పూర్తిగా మారిపోయానని, స్వామికి అసాధ్యం అన్నది లేదని, Nothing is impossible for Swami అని తన జీవితంలో అపురూపమైన మార్పుకు కారణమైన స్వామికి మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని జూలియనా ఫుల్లర్ చెప్పింది. తరువాత వక్త న్యూజిలాండ్ నివాసి డగ్లస్ సాండర్స్. నాస్తికుడనైన నేను స్వామి ప్రేమ వల్ల ప్రేమ విశ్వాసులు కలబోసిన ఒక మంచి క్రైస్తవుడిగా మారాడని అతను చెప్పాడు. 1989వ సంవత్సరంలో ఆక్లాండ్ సాయి సెంటర్లో అతని భార్య శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని చిత్రీకరించిన చలనచిత్రాన్ని చూసింది.ఆమె నిర్మల హృదయ. ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలకి ఎదురు చూసేది. చరణ చిత్రంలో స్వామిని చూసి, వారి దివ్యోపన్యాసం విన్న తర్వాత, "ఈయనే, ఈయనే నా ప్రశ్నలకు జవాబు" అని ఉద్వేగంగా చెప్పింది. వెంటనే మాంసాహారం, మద్యపానం మానివేసింది. సాయి సెంటర్ కు తరచూ వెళుతూ స్వామి బోధనలు త్రికరణ శుద్ధిగా పాటించేది. ఆమె స్వామి గురించి తన భర్తతో ఏనాడూ చర్చించలేదు. స్వర్గంలో ఉండవలసిన దైవం భారతదేశంలో భూమి మీద మానవ శరీరంలో ఎలా నడుస్తున్నారనేది ఆమె భర్త ఊహకందని విషయం. 1993వ సంవత్సరంలో ఆమె స్వామిని ప్రశాంతి నిలయంలో దర్శించి స్వామి ఆలోచనల్లో లీనమై పూర్తిగా పరివర్తన చెందిన వ్యక్తిగా తిరిగి వచ్చింది. తన భర్తకు స్వామి ప్రేమ గురించి, వైభవం గురించి చెప్పసాగింది. ఆమె చెప్పేదంతా సత్యం కాకపోవచ్చునని ఆమె భర్త ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. ఆమెను మార్చడం వీలు కాక, అదే సంవత్సరం తాను కూడా భారతదేశానికి వచ్చి, తాను నమ్మిన విషయాన్ని తన భార్యకు నిరూపించడానికి మూడు వారాలు ప్రశాంతి నిలయంలో గడిపాడు. తన ఉనికిని పట్టించుకోవాలని ఎంత ప్రార్థించినా స్వామి అతని ముఖమైనా చూడలేదు. ఆఖరి రోజున తన ఆశలన్నీ వదులుకుని అసలు ప్రశాంతి నిలయం రాకుండా ఉండవలసిందేమో అని విచారించాడు. రోజు దర్శన సమయంలో స్వామి ఆరవ వరుసలో కూర్చున్న అతన్ని దాటి వెళ్ళిపోయి హఠాత్తుగా వెనక్కి తిరిగి వచ్చి అతని కళ్ళలోకి సూటిగా చూసి అందమైన చిరునవ్వు చిందించారు. చిన్న చిరునవ్వు అతనికి మహా వరప్రసాదమై అతని హృదయం ఆనంద డోలికల్లో తేలిపోయింది. అతని జీవన సరళి మార్చివేసింది. మద్యపానం, మాంసాహారం ఇరవై ఐదు సంవత్సరాలుగా అతన్ని పట్టి పీడిస్తున్న ధూమపాన వ్యసనాన్ని మానివేయగలిగాడు. సత్యసాయి సాహిత్య పఠనంతో అతని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఎప్పుడో వదిలిన బైబిల్ ని చేత పట్టి పఠించడం ప్రారంభించాడు. స్వామి సంస్థలో చేరి అనతికాలంలోనే న్యూజిలాండ్ సాయి organization కి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. క్రమక్రమంగా పరివర్తన చెందుతున్నానని స్వామి దయా ప్రేమల వల్ల క్రమంగా సత్ క్రైస్తవుడిగా మారుతున్నానని తన ఉపన్యాసం ముగించాడు. రెండు ప్రసంగాల తర్వాత స్వామి తమ దివ్యోపన్యాసంలో ప్రతి వ్యక్తి ముందు తనను తాను తెలుసుకోవాలని, దైవం నామ రూపాలకు అతీతుడని సర్వాంతర్యామి అని చెప్పారు. దైవమే ప్రేమ, ప్రేమే సత్యం అని అందరూ ప్రేమమయమైన జీవితం గడుపుతూ శాంతిని అనుభవించాలని చెప్పారు. డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ విదేశాల నుండి వచ్చిన చిన్నారుల జీవితాల్లో సువర్ణాధ్యాయం. చిన్నారులు తమ మృదు మధురమైన పాటల ద్వారా తమ హృదయాంతరాళాల్లో పొంగిన భక్తి గంగను స్వామి సమక్షంలో ఆవిష్కరించారు. తర్వాత ఏసుప్రభువు అపురూప త్యాగాన్ని తెలియజేసే చక్కని సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. వారి కళా ప్రతిభకు స్వామి వేదిక దిగి చిన్నారులందరితో అనుగ్రహ సంభాషణ చేసి వారికి జ్ఞాపికలు అందించి, వారితో ఫోటోలు తీయించుకుని ఎంతో సేపు వారికి ఆనందాన్ని, ప్రేమను పంచి ఇచ్చారు. డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం యూరప్ లోని సెర్బియా, క్రొయేషియా, మాసిడోనియా, స్లోవేనియా, బోస్నియా దేశాల నుండి వచ్చిన భక్త బృందం తమ మృదు మధురమైన గానంతో స్వామిని మైమరిపింపజేశారు. ఆయా భాషల్లో పాడినా అది హృదయ భాష కాబట్టి వారి భక్తి ప్రపత్తులు స్వామికి అంది. స్వామి వారిని ఇంకా పాడమని సెలవిచ్చారు. అనంతరం స్వామి వారంతా చాలా బీద దేశాల నుండి వచ్చారని స్వామిపై అచంచల విశ్వాసం, ప్రేమ కలవారు కాబట్టి అనేక కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడికి వచ్చి ఎంతో భక్తితో పాటలు పాడి స్వామిని సంతోష పెట్టారని స్వామి ఆదేశంతో అనిల్ కుమార్ గారు ప్రకటించారు. స్వామి వారందరి మధ్య తిరుగుతూ ప్రతి ఒక్కరికీ నూతన వస్త్రాలు, విభూతి ప్రసాదాన్ని తమ అమృత హస్తాలతో స్వయంగా అందించారు. వారిలో ప్రతి ఒక్కరూ కూడా స్వామి దివ్య ప్రేమకు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సందర్భంగా క్రిస్మస్ పర్వదినం నాడు రాత్రి సెర్బియా, క్రొయేషియా, మాసిడోనియా, స్లోవేనియా, బోస్నియా మరియు ఇండోనేషియా నుండి సాధనా శిబిరం నిర్వహించుకునేందుకు ప్రశాంతి నిలయం వచ్చిన నాలుగు వందల ముప్పై మంది భక్తులు కలిసి western canteen లో వంటలు వండి, వడ్డనలు చేసి ఎంతో ఉత్సాహంగా ప్రేమా సేవా భావాలతో సేవ చేశారు. విధంగా 2009వ సంవత్సరపు క్రిస్మస్ వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. తమ చుట్టూ సంరంభాన్ని, ఆనందాన్ని చూసిన వారికి సుదూర దేశాల నుండి వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు స్వచ్ఛందంగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రశాంతి నిలయం చేరుకుని కనీస వస్తువులు మాత్రమే కలిగి జన సంభ్రంతో నిండిన గదులలో ఉంటూ, అలవాటు లేని ఆహారం తింటూ, గంటల తరబడి కటిక నేల మీద కూర్చుని స్వామి రాక కోసం నిరీక్షిస్తూ కూడా అత్యంత ఆనందోత్సాహాలతో రసజ్ఞ మనోజ్ఞమైన ప్రదర్శనలు ఇవ్వడంలో రహస్యం దాగి ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు. ఒకవైపు నిర్మలమైన, దివ్యమైన స్వామి ప్రేమ యొక్క ఆకర్షణ, మరొకవైపు స్వామి పట్ల హృదయాలు నిండి పొంగి పరవళ్ళు తొక్కిన వారి ప్రేమ వాహిని. ఇవే కారణాలు. ప్రేక్షకులే కాదు దేవతలు కూడా దర్శించవలసిన అలౌకికమైన సన్నివేశం ఇది. ఇవి పరితప్త ఆత్మలు, దయాసాగరుడైన పరమాత్ముని అపురూప సంగమం. పవిత్రమైన క్రిస్మస్ అంతరార్థం బహుశా ఇదే అయి ఉంటుంది. [పాట] ఇంతవరకు డిసెంబర్ ఇరవై ఐదు, రెండు వేల తొమ్మిదిన స్వామి వారి దివ్య సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి క్రిస్మస్ పర్వదిన విశేషాలను మీరు విన్నారు.ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల పది శ్రీ సత్య సాయి University కి చెందినటువంటి పదిహేను వందల మంది పూర్వ విద్యార్థులు స్వామి వారి దివ్య సన్నిధిలో సమర్పించినటువంటి కార్యక్రమాలు మరియు వారి మనోభావాలను మీతో పంచుకుంటారు. ఓం శ్రీ సాయిరాం! సత్ప్రవర్తన సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమ శిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమైన బాట సాయి మాట ఇటువంటి విద్యని శ్రీ సత్యసాయి విద్యార్థులకు అనుగ్రహించిన చల్లని తల్లి సాయిమాత ఒడిలో వారందరూ గడిపిన మధుర క్షణాల గురించి ఇప్పుడు విందాం. సాయిమాత సన్నిధిన శ్రీ సత్యసాయి విద్యార్థుల అపూర్వ సమాగమం. సరిగ్గా మూడు సంవత్సరముల క్రితం నూతన సంవత్సర శుభ ఆరంభ పర్వదినాన భగవాన్ తమ పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రతి నూతన సంవత్సర శుభారంభం స్వామి సమక్షంలో ఒక పర్వదినంగా జరుపుకోమ్మని అత్యంత ప్రేమతో సెలవిచ్చారు. అందుకే సంవత్సరం కూడా మూడు రోజుల ముందు నుండి ప్రశాంతి నిలయానికి వందల సంఖ్యలో శ్రీ సత్యసాయి విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో సహా రావడం ప్రారంభించారు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ సాయిమాత వేల తల్లుల ప్రేమతో తన పిల్లల నిమిత్తం మందిరంలో తగిన వసతులు కలిగిన గదులను, కార్యక్రమాల ప్రణాళికల నిమిత్తం, సాంస్కృతిక కార్యక్రమాలకై అభ్యాసం చేసుకునే నిమిత్తం Book Trust వద్ద గల డబల్ డెక్కర్ భవనాన్ని కేటాయించవలసిందిగా ఆదేశించారు. అంతేకాక అపార కృపతో భగవాన్ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన నాటక ప్రదర్శనకు, జనవరి ఒకటవ తేదీ సాయంత్రం స్వామి వారి సన్నిధిన వివిధ వేడుకలు జరుపుకునే మహద్భాగ్యం, రెండవ తేదీ సాయంత్రం తన విద్యార్థులకు, వారి కుటుంబాలకు పూర్ణచంద్ర సభా మంటపాన ప్రత్యేక దర్శన స్పర్శన సంభాషణల అపూర్వ అవకాశం ప్రసాదించారు. అందులో వక్తలను సహితం స్వామి ఎంపిక గావించి పూర్వ విద్యార్థులను తమ సంపూర్ణ ప్రేమతో ముంచి తేల్చారు. ముఖ్యంగా ముప్పై ఒకటవ తేదీ ఉదయభాగంలో సాయి విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి చైతన్య జ్యోతిని సందర్శించి అపూర్వ అనుభూతులను పొందవలసిందని తమ మాటగా చెప్పి పంపారు. ఎంతటి ప్రేమ! ఎంతటి దయ! ఎన్ని జన్మల పుణ్య ఫలమో శ్రీ సాయి నీ పద సన్నిధి దొరికెను. సత్యసాయి నీ పద సన్నిధి దొరికెను అని ప్రతి సాయి విద్యార్థి హృదయాంతరాళాల నుండి భగవానుని అనుగ్రహానికి కృతజ్ఞతలను అర్పించారు. ఇక కార్యక్రమాల వివరాల్లోకి మనం వెళ్లినట్లయితే ముప్పై తేదీ డిసెంబర్ ఉదయం ఎనిమిది గంటలకే విద్యార్థులందరూ గ్రామ సేవ నిమిత్తం కొత్తచెరువు, తలమర్ల గ్రామాలకు తరలి వెళ్లడం జరిగింది. కొత్తచెరువు నందు నిర్వహించిన ఉపాధి కల్పన మరియు ఉపాధి శిక్షణ కార్యక్రమానికి దాదాపుగా వెయ్యి మంది నిరుద్యోగ యువతీ యువకులు తరలి వచ్చారు. అదేవిధంగా తలమర్ల మరియు చుట్టుపక్క గ్రామాల్లో నారాయణ సేవ, బాల వికాస్, పశు చికిత్సా శిబిరం, మొక్కలు నాటడం మున్నగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రోజంతా ఎంతో ఉత్సాహంగా సేవలో నిమగ్నమైన శ్రీ సత్యసాయి విద్యార్థులు నాడు సాయంకాలం దర్శనానికి వచ్చి స్వామికి తమ కృతజ్ఞతలను అందించారు. ఇక రెండవ రోజు కార్యక్రమాలలో భాగంగా 'ఇదియే ప్రేమ బంధం' అన్న యదార్థ గాథల సంకలనంగా ఒక చక్కని నాటిక పూర్వ విద్యార్థులు ప్రదర్శించారు. భగవాన్ తన పిల్లలను అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉండి విధంగా రక్షిస్తూ వచ్చారో, రక్షిస్తున్నారో అత్యంత వాస్తవికంగా ప్రదర్శన కొనసాగింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం నేడు దాదాపు పదమూడు వందల పైచిలుకు విద్యార్థులు తమ తల్లి సాయిమాత ప్రేమచే రప్పింపబడి వారి ఆశి అనుగ్రహ పాత్రులైనారు. వారందరి కుటుంబ సభ్యులతో కలిపితే దాదాపు నాలుగు వేల మంది పిల్లలు పెద్దలు అంతా ప్రేమమయుని కరుణాంబుధిలో తనివి తీరా తరించాలని ఏతెంచారు. ప్రపంచంలో ఎక్కడా ఇట్టి అపూర్వ అనుబంధం, అనిర్వచనీయ ప్రేమ బంధం కనబడదనడం అతిశయోక్తి కాదేమో! ఇక ఆనాటి నాటిక ప్రదర్శన చూసినట్లయితే చక్కని LCD తెరమీద వేషానికి తగ్గ వస్త్రధారణ, అలంకారాలతో, పరిపక్వత కలిగిన నటనా చాతుర్యంతో, చక్కని భావపూరిత సంభాషణలతో, నాట్యంతో, పాటలతో, హాస్యంతో, చతురతతో వెరసి సర్వ సమ్మిళిత కళా నైపుణ్యంతో నాటిక సభికులను ఆద్యంతం ఆకట్టుకుంది. అవ్యాజ ప్రేమమూర్తి అయిన భగవాన్ తమ ఆశీస్సులను పూర్వ విద్యార్థులపై దండిగా కురిపించి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారందరికీ గ్రూప్ ఫోటోను అనుగ్రహించారు. పూర్వ విద్యార్థులందరినీ స్వామి అనుగ్రహంతో ఎంతో చక్కగా తీర్చిదిద్దిన గురు బ్రహ్మలందరూ పొందిన ఆనందం ఇంతా అంతా అని చెప్పలేం.ఈ ప్రదర్శనలో ముఖ్యంగా తొమ్మిది ప్రాంతాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అత్యంత స్వల్ప వ్యవధిలో అభ్యాసం చేసుకొని అనూహ్యంగా అపూర్వ ప్రదర్శనను అందించారు. ఇదంతా భగవాన్ తో గడిపిన మధుర క్షణాలలో సాయి మాట నేర్పిన సుశిక్షణ అనుభవంతో స్వామి వారి పరిపూర్ణ ఆశీస్సుల ఫలితమే కానీ మరొకటి కానే కాదని ప్రతి పూర్వ విద్యార్థి ఏకకంఠంతో వివరించారు. ఇక జనవరి ఒకటి, రెండువేల పది నూతన సంవత్సర ఆరంభ శుభదినాన ఉదయభాగ ప్రదర్శనలు ప్రస్తుతం శ్రీ సత్య సాయి యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న శ్రీ సాయి విద్యార్థులచే మనోహరంగా కన్నుల పండుగగా జరిగింది. నాటి సాయంకాలం వేడుక చేసుకునే భాగ్యం పూర్వ విద్యార్థులకు దక్కింది. స్వామిని ఎదురు మందిరం నుండి పూర్ణకుంభ స్వాగతంతో విజయశంఖారావం పూరించి మార్చిపాస్ట్ తో విద్యార్థులు లయబద్ధంగా ముందుకు నడవగా బ్యాండ్ విద్యార్థులు వివిధ స్వాగత స్వరాల సుమాహారం సమర్పించుకోగా, వింజామరలతో, ఛత్ర చామరాలతో, సువర్ణ వర్ణ సింహాసనంపై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన మన సాయి భగవానుని తన పిల్లలందరినీ తనివితీరా వీక్షిస్తూ సభాస్థలికి వచ్చి ఆసీనులైనారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలనం, అనంతరం వివిధ రకాల కేకులను విద్యార్థులు స్వామి చే కట్ చేయించారు. ప్రదర్శన ఆరంభ సూచకంగా గణేష్ పాటతో ప్రారంభించిన బ్యాండ్ విద్యార్థులు మధ్య మధ్యలో తాము పొందిన అనుభవాలను, అనుభూతులను మరొక్క మారు ఆనందంగా నెమరువేసుకోవడం జరిగింది. కార్యక్రమం జరుగుతున్న ఆద్యంతం ఎదురుగా ఉన్న ఎల్సీడీ తెరపై స్వామి తాలూకు ఛాయాచిత్రాలను, వివిధ సందర్భాలను గుర్తు చేస్తున్న వాటిని ప్రదర్శించడం జరిగింది. మధ్య మధ్య పూర్వ విద్యార్థులు తాము చేస్తున్న వివిధ కార్యక్రమాలను స్వామికి విన్నవించి ఆశీస్సులు అందుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారు తయారుచేసుకున్న saistudents.org అన్న వెబ్ సైట్ ను స్వామితో లాంఛనంగా ప్రారంభింప చేయడం, Bridge Across Time అన్న పదిహేను మరియు పదహారు volumes భజన క్యాసెట్లను inaugurate చేయించుకోవడం, విద్యుల్లేఖ అన్న ఒక త్రైమాసిక విద్యార్థి పత్రిక విడుదలవరించుకోవడం ఇత్యాదులు ఎన్నో స్వామి సమక్షానికి తెచ్చి వారి ఆశీస్సులను అందుకోవడం ఆనాటి కార్యక్రమంలోని ప్రత్యేక విశేషం. సందర్భంగా స్వామి ఒక విద్యార్థికి స్వర్ణ అంగుళీయకం సృష్టించి అందించడం జరిగింది. నేడు స్వామి సమక్షంలో ఇచ్చిన ప్రదర్శనతో శ్రీ సత్యసాయి విద్యార్థుల బ్యాండ్ బృందం తమ రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీనిని స్వామి 1985వ సంవత్సరంలో ప్రారంభించారని, ఏమీ రాని విద్యార్థి కూడా నేడు ఒక వృత్తి కళాకారుని కంటే అద్భుతంగా ప్రదర్శించగలుగుతున్నాడంటే అదంతా స్వామి చలవే అని తెలియజేశారు పూర్వ విద్యార్థి బృందం. ఇక జనవరి రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి పూర్ణచంద్ర సభా ప్రాంగణం పూర్వ విద్యార్థులతో, వారి కుటుంబ సభ్యులతో కళకళలాడుతూ కనబడింది. వివిధ జిల్లాల నుండి వచ్చే పర్తి యాత్రలను దృశ్యం తలపింపజేసింది. సరిగ్గా నాలుగు గంటల ప్రాంతంలో విచ్చేసిన స్వామికి వేద ఘోషతో విద్యార్థులు ఎదురేగి ఘనస్వాగతం అందించారు. అనంతరం స్వామి అనుమతితో శ్రీ చక్రవర్తి గారు తొలి పలుకులు నివేదించి శ్రీ వెంకటరామన్ గారిని మరియు శ్రీ శ్రీనివాసన్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరారు. ముందుగా మాట్లాడిన శ్రీ వెంకటరామన్ శ్రీ సత్యసాయి యూనివర్సిటీ పూర్వపు Vice Chancellor గారు స్వామి వజ్ర సంకల్పాలతో భూతో భవిష్యతి అన్న చందాన నేడు మన కళ్ళ ముందు సాక్షరంగా గోచరిస్తున్న వివిధ మానవ సేవా పథకాలను స్వామి ఎట్లా పూర్తి గావించింది, ఎట్లా నడిపిస్తున్నది వీడియో ద్వారా చూపి అట్టి సర్వ శక్తిమంత సాయిమాత స్ఫూర్తి మనందరిలో నిండేలా దీవించమని వారు స్వామిని ప్రార్థించారు. అనంతరం శ్రీ శ్రీనివాసన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల All India President వారు మాట్లాడుతూ తిరిగి జన్మంటూ ఉంటే అది స్వామి కళాశాల విద్యార్థిగా పుట్టాలని కోరుకున్నారు. స్వామి దయతో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను, వాటికి సంబంధించిన గణాంకాలను కూడా సభకు వివరించారు. స్వామి 85వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూ పూర్వ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములు కమ్మని, మరింత ఉపయుక్తమైన సలహాలను అందించాలని వారు కోరడం జరిగింది. వక్తల ఉపన్యాసాల అనంతరం విద్యార్థులు వివిధ రాష్ట్రాలలో, వివిధ ప్రాంతాలలో, ఇతర దేశాలలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన వ్రతులను, ఫోటో ఆల్బమ్స్ లను స్వామికి చూపించారు. అంతేకాక అనంత ప్రేమా వాత్సల్యాలతో స్వామి చేయించిన ఏర్పాట్లకు, స్వామి చూపిన కరుణకు విధంగా కృతజ్ఞతలు అందించాలో తెలియడం లేదని విద్యార్థులు స్వామికి విన్నవించుకున్నారు. కొంత తడవు అనంతరం భగవాన్ స్వయంగా విద్యార్థులు అందరి మధ్యకు వచ్చి అందరినీ నిండుగా, దండిగా, మెండుగా ఆశీర్వదించి ఆనంద పరవశాల గావించారు. అపూర్వ సమాగమం రాబోయే శ్రీ సత్యసాయి సచ్చరిత్ర గాథలో ఒక స్వర్ణమయ గాథగా ఉంటుందనడంలో ఎట్టి సందేహం లేదు.తల్లి తండ్రివి నీవే గురు నేస్తము నీవే కరుణించి కాపాడు దైవమీవే నీదు బిడ్డలమమ్ము పాలింపవో యమ్మా సకల లోక జనని సాయి మాత సకల లోక జనని సాయి మాత జై సాయి రామ్ [సంగీతం] ఇంతవరకు జనవరి ఒకటి రెండు వేల పదిన శ్రీ సత్య సాయి యూనివర్సిటీకి చెందినటువంటి పదిహేను వందల మంది పూర్వ విద్యార్థులు స్వామి వారి దివ్య సన్నిధిలో సమర్పించినటువంటి కార్యక్రమాలు మరియు వారి మనోభావాలను మీతో పంచుకున్నారు ఇప్పుడు శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు లీలా కైవల్యం పేరిట స్వామి యొక్క ప్రేమతత్వం మరియు మానవాళికి స్వామి అందించిన సేవల పైన ప్రసంగిస్తారు సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్బ్రహ్మ స్ఫురతాం మే మహా పరిపూర్ణావతారి భగవాన్ సత్య సాయి బాబా వారు పాంచభౌతిక దేహాన్ని ధరించి అవని సంచారానికి వచ్చి ఎనభై నాలుగు సంవత్సరాలు ఇది ఒక పుణ్యకాలం ఇది ఒక యోగ కాలం ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మే గురు స్వరూపంగా రావటం అరుదైన సన్నివేశం గురువుగానే కాదు ఆచార్యవర్యులుగా కూడా స్వామి వచ్చారు ఆచార్యుడు అంటే తాను ఏది బోధించాడో దానిని ఆచరించి చూపించిన వాడు ఆచార్యుడు గనుక ఎనభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వామి అవతార వైభవాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసినట్లయితే పరమాత్మ ప్రపంచానికి చేయనిదే ఉన్నది ఎంత చేశారు ఎంత చేశారు అబ్బుర పడిపోతాం ఆశ్చర్యపడిపోతాం అయితే భగవాన్ చేసిన దానిలో నుంచి వారు చేశారే అని ఆశ్చర్యపడేకంటే వారు చేసినట్లుగా మనం ఏం చేయాలి అని ప్రశ్న వేసుకోవటానికి ఇది ఒక గొప్ప సందర్భం కాబట్టి స్వామి యొక్క అవతార వైభవాన్ని తత్వాన్ని స్వామి యొక్క అవతార పరిపూర్ణతని సమగ్రంగా విచారణ చేద్దాం భగవాన్ సత్య సాయి పాంచభౌతిక దేహాన్ని ధరించి ఎనభై నాలుగు సంవత్సరాలు సర్వ జగత్తుని అధ్యాత్మ మార్గంలో నడిపించినటువంటి ఒక అత్యద్భుతమైన రమణీయమైనటువంటి సన్నివేశం ఆధ్యాత్మిక చరిత్రలో కృతయుగం నాటి సత్యము త్రేతాయుగం నాటి ధర్మము ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమ కలియుగంలో ఉన్న అహింస సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా స్వరూపంగా భగవాన్ సత్య సాయి జగత్తులోకి వచ్చారు ఒక్కొక్క అవతారి ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా తన అవతార పరమార్థాన్ని కొనసాగిస్తూ అవతార వైభవాన్ని జగజ్జేగీయంగా వెలిగిస్తూ అప్రతిహతంగా సాగిపోయే ఒక ఆధ్యాత్మికమైన మధురానుభూతి ఇది రోజున కొంత భగవాన్ సత్య సాయి జగత్తుకి ఏం చేశారు ఎందుకని సర్వ దేశాలు సర్వ సృష్టి పరమాత్మ సాయి యొక్క దివ్య పాదాల దగ్గరకు చేరుకోవాలని పరమాత్మ సాయి భావనలో పరవశించాలని పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రేమని కరుణని తదనుభూతంగా చేసుకుని దివ్యమైనటువంటి ఒక జీవన విధానానికి శ్రీకారం చుట్టాలని తహతహలాడుతున్నదో మనందరం కూడా స్థాలీపులాక న్యాయంగా కొంత విచారణ చేయాలి అవతారి అయినా జగత్తులోకి వచ్చినప్పుడు తనలోని దివ్యత్వాన్ని జగత్తుకి ప్రకటన చేయటానికి ఆయన ముందు ఎంచుకునేది లీల లీల మహిమ అనుగ్రహము అనేక పదాలుగా మనకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నా నిజానికి స్థూల సూక్ష్మ విచారణ గనక చేసినట్లయితే మూడు ఒక్కటే శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు నిజానికి ఆయన తొలినాళ్లలో చేసినటువంటి దివ్యమైనటువంటి లీల అహల్య శాపవిమోచనం అపురూపమైనటువంటి మహిమ శివధనుర్భంగ సన్నివేశం అనుగ్రహం సర్వ సృష్టిలో ఉన్నటువంటి దౌష్ట్యాన్ని కాలుష్యాన్ని నివారణ చేసి అహంకరించి మదోన్మత్తులైన వారందరినీ అణచి ధర్మసంస్థాపన చేసి ధర్మానుగ్రహంగా ధర్మ నిగ్రహంగా ధర్మ విగ్రహంగా సాగింది రామావతారం అయితే రాముడు మాయామానుష వేషధారి మానవుడిగా ఉండటానికి మానవుడికి పరిమితమైనటువంటి కొన్ని విధానాలకు లోబడి ప్రకృతికి లోబడి సంచారం చేయాలని నిర్ణయించుకొని వచ్చిన కారణంగా రామావతారం అంతా మాయామానుష వేషం సామాన్య మానవుడి వలె పొందాడుపోగొట్టుకున్నాడు, విలపించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, శిక్షించాడు. అనేక రకాలుగా సామాన్య మానవుడి యొక్క జీవనం ఎట్లా ఉన్నదో రామాయణం అంతా అట్లా సాగింది. కానీ ఎక్కడా ధర్మ విరుద్ధమైనటువంటి ఆలోచన కానీ, ధర్మ విరుద్ధమైనటువంటి చర్య గాని, ధర్మ విరుద్ధమైనటువంటి సన్నివేశము లేకుండా త్రేతాయుగంలో శ్రీమద్రామాయణం అంతా కూడా అంటే రామకథ అంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఒక యోగ స్థితిలో సంచారం చేసింది. అయితే కాలానుగుణంగా యుగ ప్రభావం చేత ద్వాపర యుగంలో అదే చైతన్యం శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు బాలకృష్ణుడైనాడు, యవ్వన కృష్ణుడైనాడు, ప్రౌఢ కృష్ణుడైనాడు, యోగీశ్వర కృష్ణుడైనాడు. రాబోయే కలియుగానికి లీలా మానుష విగ్రహ స్వరూపంగా యోగీశ్వర స్వరూపంగా భగవద్గీతను ఉపదేశనం చేశాడు. అంటే రామాయణంలో ఉన్నటువంటి రాముడంతా మాయా మానుష విగ్రహం అయితే కృష్ణావతారం అంతా కూడా లీలా మానుష విగ్రహం. లీలా అంటే లీనం చేసుకొని లయం చేయటం. రకంగా? తనలో లీనం చేసుకొని సర్వ జగత్తుని లయం చేసుకునేటువంటి ఒక విధానం ఇది. లీలా నిజానికి ఒక విభూతి. మరి మహిమ అంటే అది ఒక స్థితి. సామాన్య మానవుడు బయట నుంచి చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మహిమలుగా, అసంబద్ధంగా, అసహేతుకంగా, అర్థం కానట్లుగా మానవుడి యొక్క మేధ అందుకోలేనంత స్థితిలో ఉన్న కారణంగా ఇది నమ్మదగినదేనా అని ప్రశ్న వేసుకొని జవాబు దొరికే దాకా అవిశ్రాంతంగా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యం నుంచి చిట్టచివరి మహాభినిష్క్రమణ వరకు సాగిందంతా లీలా కాండే. అయితే లీల ఎందుకు చేయాలి? ధర్మవర్తనుడు అయినటువంటి మానవుడికి లీల అక్కరలేదు. అధర్మ ప్రవర్తనుడు అయినటువంటి జీవుడికి పరమాత్మ తన యొక్క శక్తిని, తనలో ఉన్నటువంటి సమస్త శక్తులని పరిచయం చేయటానికి ఇదిగో పరమేశ్వరుడు దేనినైనా సృష్టించగలడు, దేనినైనా లయం చేయగలడు. కానీ రాముడైనా, కృష్ణుడైనా మరి ఎవరైనా మానవ దేహాన్ని మాత్రమే తీసుకుని జగత్తులోకి రావాలి. ఎందుకంటే అన్ని జన్మలలోనూ ఉత్తమోత్తమమైనటువంటి జన్మ, ఉత్కృష్టమైన జన్మ, సమున్నతమైనటువంటి జన్మ మానవ జన్మ కనుక. అంతేకాదు మానవ జన్మలోనే అనేకమైనటువంటి పరమార్థాలు సాధించుకోగలడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం అంతా లీలా వైభవంగా సాగింది. ద్వాపర ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో ప్రధానంగా దత్తావతారాలలో ప్రప్రథమ పూర్ణ దత్తావతారం షిరిడి బాబా. తర్వాత భగవాన్ సత్యసాయి. ఈరోజున పరమ పురుషుని గురించి మనమందరం కూర్చొని విచారణ చేస్తున్నామో పరమ పురుషుని యొక్క ప్రాదుర్భావం అంతా నాలుగు యుగాల సమ్మేళనంగా ఒకటిగా రూపొంది ఇక్కడికి వచ్చింది. రూపొందింది కానీ భౌతికమైనటువంటి దేహంలోనే ఉన్నది. అయితే దీనిలో విచారణ చేసినప్పుడు భగవాన్ సత్యసాయి జీవితమంతా క్షణం వరకు మహిమాకాండగానే సాగలేదు. లీలాకాండగా సాగింది, మహిమాకాండగా సాగింది, సామాజిక చైతన్య స్ఫూర్తిగా సాగింది. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలు, దానిని శాసిస్తున్న, దానిలో జీవిస్తున్నటువంటి అనేకమంది జీవుల యొక్క డొల్లతనాలు కోకొల్లలుగా ఉన్నప్పుడు వీటన్నింటినీ ఒక సమస్థానంలో తీసుకురావటానికి, పరమాత్మ యందు నిరంతరమైనటువంటి ఒక అనురక్తి, ఒక ఆరాధన కలగటానికి, పరమాత్మ శక్తి యందు ఒక విశ్వాసం కలగటానికి ఎనభై నాలుగు సంవత్సరాల భగవాన్ సత్యసాయి అధ్యాత్మ చరిత్ర ఒక నిలువుటద్దం. ఏం చేశారు బాబా? మహిమ చూపించారు. తన ఆవరణంలోకి సాధకుడైన వాణ్ని, యోగ్యుడు అయినటువంటి వాణ్ని, పరిపక్వతకు సిద్ధంగా ఉన్నవాణ్ని, శుద్ధుడు అయినటువంటి వాణ్ని కేవలం మహిమ ద్వారా ఆకర్షించారు. ఆకర్షించి అశాంతము మహిమలే చేయలేదు, అశాంతము లీలలే చేయలేదు. ఒక్కొక్క వ్యక్తిలో, ఒక్కొక్క సాధకుడిలో లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలన్నింటినీ సమసింపజేసి జ్ఞానము చేత, యోగము చేత, భావన చేత, భక్తి చేత, సేవ చేత, ప్రేమ చేత, శాంతి చేత మానవుడు ఎంత దివ్యుడో, ఎంత పూర్ణుడో, ఎంత వైభవంగా జీవితాన్ని కొనసాగించవచ్చునో పరమాత్మ సాయి ఇన్నాళ్లుగా మనకు బోధిస్తూ వచ్చారు. అయితే పరమాత్మ సాయి అన్ని అవతారాల కంటే ప్రత్యేకమైనది, విశిష్టమైనది, భిన్నమైనది, చిత్రాతిచిత్రమైనటువంటి అవతారం ఇది. ఎందుకని ఇది చిత్రమైనది అంటే చిత్రావతి నదీ తీరంలో అది వచ్చింది కనుక ఒకటి. చిత్రవిచిత్రమైనటువంటి రీతులలో బోధనాకృతి సాగించింది కనుక. అంతేకాదు మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లటానికి, తన లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలను జయించటానికి, తనలో ఉన్నటువంటి షడైశ్వర్య సంపదని అంతా కూడా సంపత్తిని సాధనామయం చేసుకొని ఒక శక్తివంతమైనటువంటి దివ్య స్వరూపుడుగా వెలిగిపోవటానికి గలిగినటువంటి అన్ని మార్గాలని ధర్మబద్ధంగా తెరచి పరచి జగత్తుకి ఆవిష్కృతం చేశారు స్వామి. అంతేకాదు వేదాలలోని సారము, ఉపనిషత్ సారము, ప్రస్థానత్రయము, పద్దెనిమిది పురాణాలలో ఉన్నటువంటి సారమంతా సారభూతం చేసి మానవుడికి సేవ, ప్రేమ అనేటివి రెండు సాధనా యోగాలని, సాధనా మార్గాలని బాబా ప్రతిపాదన చేశారు. ఇందులో ప్రధానంగా షడైశ్వర్యాలు చాలా ఉత్తమోత్తమమైనవి. ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, ధర్మంతో కూడిన అర్థం ఉండాలి, కీర్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సంపద ఉండాలి. ఆరు ఐశ్వర్యాలు మానవుడు ఎప్పుడైతే తనలోనే ఉన్నాయి వాటిని బహిర్గతం కనుక చేసి, సమాజహితం కనుక చేసినట్లయితే అధో జగత్ సహోదరులందరికీ ఆర్థిక, పారమార్థిక స్థితులలో పరమార్థంలో నుంచి యదార్థంలోకి ఒక ప్రస్థానం చేయటానికి అనువైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికని, ఒక కురుక్షేత్రాన్ని, ఒక కర్మక్షేత్రాన్ని, ఒక ధర్మక్షేత్రాన్ని పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా భగవాన్ తీర్చిదిద్దారు.చాలా ఉత్తమోత్తమమైనటువంటి సనుతనమైన సనాతనమైనటువంటి వేదిక పుట్టపర్తి. అక్కడ అధిష్టాన దైవము పూర్ణ పురుషుడైనటువంటి భగవాన్ సత్యసాయి. వారు మానవుడు తనను తాను పోగొట్టుకోకుండా తనను తాను నిర్మించుకుంటూ అనుక్షణము పునర్నిర్మాణం చేసుకుంటూ సర్వ జగత్తుకి ఎంత సహాయకారిగా ఉండవచ్చునో, సర్వ జగత్తులో ధర్మబద్ధాన్ని ఎట్లా ప్రతిపాదించవచ్చునో, రకంగా మానవుడు ఉత్తీర్నుడు కావచ్చునో అనేక రకాలుగా అనేక పాయలుగా అనేక రీతులలో అనేక స్థాయిలలో విచారణ చేస్తూ బోధిస్తూ మానవుణ్ణి దారిలో నడిపిస్తూ ధర్మవర్తనులైనటువంటి ఒక జీవన విధానాన్ని కేవలం ఆంధ్రదేశానికి ఆపై కేవలం భారతదేశానికే కాక సుమారు నూట ఎనభై దేశాలలో దివ్య ప్రభాసంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రాచబాటను నిర్మాణం చేశారు బాబా. సగటు మానవుడి జీవితంలోనైనా ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక లెక్కలో ఉన్నటువంటిది కాదు. ఎందుకంటే అరవై ఎనిమిది సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు జీవించిన సామాన్య సాధారణ మానవుడు ఎవరూ చేయలేనన్నటువంటి అచ్చుత్తమమైనటువంటి పనులు అన్నీ సమాజహితమైనటువంటి పనులు స్వామి చేసినందువలననే పరిపూర్ణమైనటువంటి శాంతిధామంగా సర్వ సృష్టిని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఈరోజు నూట ఎనభై దేశాలలో ఉన్న భక్తులే కాదు నూట ఎనభై దేశాలలో ఉన్న మేధావులు, చదువుకున్నవారు, చదువులేనివారు సమస్తమైనటువంటి జీవరాశులు కూడా భగవాన్ సత్యసాయి యొక్క దివ్య పాదముల దగ్గరకు రావటానికి ఒక పూర్ణ ప్రయత్నం చేసేటువంటి ఒక మహా సంమంగళ వేళ ఇది. ఇది ఒక యోగ కాలం, ఇది ఒక యాగ కాలం. ఎందుకంటే ఆగం పోతే గాని యాగం రాదు. ఆగయాగాలు పోతే తప్ప యోగం రాదు. అందుకనే ప్రధానంగా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అంశ తీసుకుని వస్తే భగవాన్ సత్యసాయి విభూతి యోగాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. పరమమూ చరమమూ అయినటువంటి ఒక విభూతిని సర్వ సృష్టికి ఇవ్వటానికి పరమేశ్వరుడు అయినటువంటి సాయి సంకల్పం చేశారు. ఏమిటి వి-విభూతి? ఆర్తులకు ఇది రక్షణ. శారీరకమైనటువంటి రోగం ఉన్నట్లయితే దాని నుంచి కాపాడేటువంటి ఒకానొక శక్తివంతమైనటువంటి సాధన. దేహ రోగానికి జాజ్జానికి సంబంధించి ఉంది ఒక ఎత్తయితే భవరోగానికి సంబంధించింది మరొక ఎత్తు. మళ్ళీ జన్మరానటువంటి ఒకానొక విభూతి స్థాయికి సాధకుణ్ణి చేరుకోమని పదే పదే బాబా విభూతి సృష్టి చేయటం విభూతి ఇవ్వటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే సామాన్య మానవుడు కేవలము శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవాడు హేతుబద్ధంగా తనదైనటువంటి మనసుతో ఆలోచించేటువంటి వాడికి ఇది అర్థం కాదు. ఎందుకంటే విజ్ఞాని అయినటువంటి వాడు శాస్త్ర జ్ఞానాన్ని పెడగా జ్ఞానాన్ని పరంగా చూస్తాడు. రెండింటిని సమన్వయించేయమంటున్నారు బాబా. విజ్ఞానమూ జ్ఞానమూ రెండుగా కనిపిస్తున్నటువంటి విభూతి రేఖలే. విభూతి రేఖల రెండింటిని సమన్వయం చేసినప్పుడు సైన్స్ ద్వారా spirituality ని spirituality ద్వారా సైన్స్ ని రెండూ సమన్వయం గనక చేయగలిగితే మానవ జీవితంలో శాంతి దానంతట అదే నెలకొంటుంది అనేది స్వామి జగత్తుకి ప్రతిపాదించినటువంటి ఒక వినూత్న స్థితి. అయితే ఎలా సాధించారు దీన్ని. విభూతి అంటే ఏమిటి? ఇది పరమార్థం. మానవ జీవితానికి కొలికి పూసా పరమార్థం ఏది అంటే తన్ను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళటమే. నేను దేహాన్ని మాత్రమే కాదు నేను ఆత్మనన్న భావనలో నిలకడ చెందటమే పరమార్థం గనుక బాబా అందరికీ అనుగ్రహించేటువంటి విభూతి పరమార్థము. పూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం వైపు నడిపించేది. వస్తువైనా నిరంతరమూ పరిణామశీలంగా ఉంటుంది, పరిణామ సహంగా ఉంటుంది, మార్పు చెంది చెంది మరణిస్తుంది ఇక మళ్ళీ మార్పు చెంది పునః రావటానికి వీలు లేని ఒకానొక విభూతి స్థాయికి వెళ్ళమంటున్నారు. అంటే జన్మ రాహిత్యాన్ని ఇప్పుడే ఇక్కడే సాధించుకోమంటున్నారు. అంతే కాదు దీనిలో అనేక కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోగా మిగిలినటువంటిది ఒట్టిది ఊధి అయినట్లయితే విభుడు ఇచ్చాడు గనుక అది విభూధి అయింది. విభూతి ఎందుకైనది అంటే అది ఎ-ఎట్టి పరిస్థితులలోనూ మళ్ళీ తిరిగిరాని మరలి రానటువంటి ఒక జన్మ స్థితి గనుక విభూతిని పరమాత్మ జగత్తుకు అందించారు. దీనిలో అణిమాది సిద్ధులు దానినిండా దాగి ఉన్నాయి. విభూతి నిండా అణిమా, లఘిమా, గరిమా, మహిమా, ప్రాప్తి, ప్రాకామ్య, వశీ, తర్వాత కైవల్య సిద్ధి. మానవుడు ఎక్కడ ప్రారంభించాడో చిట్టచివరికి కైవల్యం పొందాలి. కైవల్యము అంటే వైకల్యం లేనటువంటి స్థితి. వాసనారాహిత్యంతో కూడినటువంటి జీవుడు ఎక్కడ నుంచి ప్రారంభమైనాడో ఒక మహిమతో ప్రారంభమై ఒక్క లీలతో ఆకర్షితుడై మహిమతో లీలతో ప్రభావితుడై సుసంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికని సంతరించుకొని తన జీవన విధానాన్ని తానే నిర్మాణం చేసుకొని తనను తాను సంస్కరించుకుంటూ తన తోటి వారందరినీ సంస్కరించుకుంటూ వెళ్ళి నేను స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మాత్రమే కాదు, మనోబుద్ధి చిత్ అహంకారములు మాత్రమే కాదు, నేను కూడా అమృతస్య పుత్రాహ అమర లోకం నుంచి పరమాత్మ వలె జగత్తులోకి నేను వచ్చాను. నేను వచ్చి ఏం చేస్తున్నాను? అన్ని శబ్దాలు పుట్టని శబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితమ్ము. నారాయణుణ్ణి అన్వేషించటానికి ఉత్తమోత్తమమైనటువంటి జీవితాన్ని నేను పొందాను గనుక నారాయణుణ్ణి బయట వెతికి వెతికి ఎక్కడా దొరక్క చిట్టచివరకు మనసుని స్థిమిత పరచుకొని లీనం చేసుకొని లయం చేసుకొని లీలా మాత్రంగా గనుక జీవన విధానం గనుక సాగించినట్లయితే పరమాత్మ లోపలే ఉన్నాడన్న భావన కలగటమే కైవల్యం. ఇక్కడ ఉండగానే మోహము క్షయమైతే అది మోక్షమవుతున్నది. అంతేగాని మోక్షం మరణానంతర స్థితి కాదు. మానవుడు జీవించి ఉండగానే ఆనంద స్వరూపుడుగా, శాంత స్వభావుడుగా, పరమోత్కృష్టమైన జీవన విధానం సాగించేటువంటి ఒక ద్రష్టగా, ఒక యోగిగా తన జీవితాన్ని తాను కొనసాగించాలి.పరమాత్మ సాయి లీలా కైవల్య విభూతి లో విభూతిని కేవలం సంకేతంగా ఇస్తున్నారు. అంతే కాదు ఆది వ్యాధులు, బాధలు, మానసిక వ్యాధులు అనేక వాటికి ఇది సమాధానం అయి మన ముందు అనేకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. అన్ని సందర్భాలలోనూ సత్యం మాత్రం ఒక్కటే. పరమేశ్వరుడు విభూతి ద్వారా నీకు ఆయుష్షుని, ఆరోగ్యాన్ని ఇచ్చాడా? దానిని దేనికై వాడుకోబోతున్నావ్? మళ్ళీ ప్రాపంచికమైన సంపాదన కోసమా? కాదు కాదు. నిన్ను నీవు ఉద్ధరించుకునేటువంటి, నిన్ను నీవు ఎరిగేటువంటి, నిన్ను నీవు తెలుసుకునేటువంటి, నిన్ను నీవు చూసుకోగలిగినటువంటి పూర్ణ అద్వైత సాధన లోకి ప్రయాణం చేయటానికే విభూతి మంత్రాన్ని, విభూతి పదార్థాన్ని పరమాత్మ పారమార్థికంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఆత్మను ఎరగాలి, లీలను అనుభవించాలి, మహిమను ఆనందించాలి. కానీ అన్నీ కలిసి అనుగ్రహం వైపు దారి తీయాలి. అనుగ్రహం ఎవరు ఇస్తారు? ఇచ్చేది కాదు. అనుగ్రహానికి అర్హతను సంపాదించాలి. మానవుడు మనిషి, మనీషి కావాలి, మనీషి ఋషి కావాలి, ఋషి మహర్షి కావాలి, మహర్షి బ్రహ్మర్షి కావాలి. అంటే సర్వ జగత్తు బ్రహ్మీమయమైనది, బ్రహ్మము కంటే అన్యమైన మరొక వస్తువు లేదని సమస్త బ్రహ్మీమయమైనటువంటి జగత్తులో నేను కూడా బ్రహ్మమునే అనేటువంటి స్థాయికి రమ్మంటున్నారు భగవాన్ బాబా. అందుకే "త్వమేవాహం సంశయః" నువ్వు నీకూ నాకూ తేడా లేదన్న దానిని ఆధునిక మానవుడు అర్థం అయ్యే రీతిలో, చేసుకోగలిగిన రీతిలో, అనుభవించవలసినటువంటి రీతిలో "You are me, I am you" అంటున్నారు బాబా. నీలోనూ దేవుడున్నాడు ఎరుకలోకి రా. నీలో భగవంతుడే గనుక ఉన్నాడని నీకు అర్థం అయినట్లయితే, నీవు ఎలా ప్రవర్తించాలి? భగవంతుడి వలె ప్రవర్తించాలి. భగవంతుడి వలె కరుణని జాలువార్చాలి. ప్రపంచానికి నీవు అన్నివేళలా అందుబాటులో ఉండాలి. నిన్ను నీవు పోగొట్టుకుంటూనే సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి ఒక మహోత్తమమైనటువంటి జీవుడిగా సార్ధకత చెందినట్లయితే, జీవ ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ రెండూ కలిసినప్పుడు సమాజానికి, దేశానికి, ప్రపంచానికి, సర్వ సృష్టికి కూడా అది ఆనంద సంధాయకం అవుతుంది. అది ఆనంద రసతుండిల స్థాయికి వెళుతుంది అంటున్నారు భగవాన్. అందుకనే ఆయన విద్యా, వైద్య రంగాలు అన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసి ఒక ఇంజనీర్ కావటం, ఒక డాక్టర్ కావటం, ఒక యాక్టర్ కావటం లేదా ఒక టీచర్ కావటం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ దీనిలో పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని, పరసనా, Divinity గనక లేకపోయినట్లయితే, Divinity లేని వాడు కేవలం ఒక ఇంజనీర్‌గా మాత్రమే ఉంటాడు, ఒక డాక్టర్‌గా మాత్రమే ఉంటాడు. దివ్యమైనటువంటి, మానవీయమైనటువంటి కరుణని జగత్తుకు గనక అందించక పోయినట్లయితే, ప్రజ్ఞలన్నీ కూడా వృధా అయి-- అవుతాయని చెప్తూ, "భగవాన్ బాబా దేవుడా? కాదా?" అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు "అరయ సత్యసాయి దేవుడే అయినతో ఆయన మానవీయతకు అంజలింతు, అరయ సత్యసాయి నరమాత్రుడైనతో ఆయన దివ్య గరిమకు అంజలింతు" అన్నాడు ఒక మహాకవి. అంటే, ఆయన గనక దైవం అయినట్లయితే, దైవం నాకు రోజూ కనబడుతున్నాడు. దైవం నాతో మాట్లాడుతున్నాడు. దైవం నన్ను సరైనటువంటి మార్గంలో నడవమని చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. ఎక్కడికక్కడ శిక్షణ ఇస్తున్నాడు. కనుక దివ్యత్వంలో ఉన్నటువంటి మానవత్వానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని నిష్ఠూరాలు, మానవుడి యాతనలు, సంక్లిష్టమైనటువంటి అన్ని పరిస్థితుల నుంచి పరమాత్మ బయటకు పడవేస్తున్నటువంటి కారణంగా, మానవీయమైనటువంటి ఒక మహా కోణం ఆవిష్కృతమైన కారణంగా, దివ్యుడైనటువంటి పరంధాముడైన పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నా. అవేం లేవయ్యా, ఆయన కేవలము నరమాత్రుడే, మన బోటి వాడే అని గనక అనుకున్నట్లయితే, నరమాత్రుడే గనక అయితే ఎనభై నాలుగు సంవత్సరాల అధ్యాత్మ చరిత్రను ఒక్కసారి గమనించినట్లయితే ఎక్కడ పుట్టబట్టి, పుట్టలు, పాములు తప్ప ఇల్లు తక్కువ పుట్టలు ఎక్కువ, మనుషులు తక్కువ పాములు ఎక్కువ, నీటి చుక్క లేనటువంటి ప్రదేశాన్ని పరమాత్మ ఎన్ను-- ఎంచుకున్నాడు. రాముడు కూడా అయోధ్యలో జన్మ ఎత్తినా అరణ్యానికి వెళ్ళటానికే సిద్ధపడ్డాడు. కారాగారంలో జన్మ ఎత్తిన పరమాత్మ సర్వ జగత్తులోకి వచ్చాడు సాలోక్య, సామీప్య, సాన్నిధ్య సాయుజ్యాలు అనుగ్రహించటానికి. అట్లాగే భగవాన్ సత్యసాయి లోకంలో ఉన్నటువంటి సర్వ మతాలని కూడా సమన్వయం చేస్తున్నటువంటి మహా విభూతి యోగము, భగవాన్ సత్యసాయి యొక్క దివ్య చరిత్రే ఒక లీలా కైవల్య విభూతి. ఏం చేయాలి మానవుడు? ఆయన దేవుడే మనం-మనమేం చేయాలి? దివ్యత్వంలో నుంచి ఎయిత్త్ స్టాండర్డ్ కూడా పాస్ కానటువంటి భగవాన్ సత్యసాయి ప్రపంచ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి Institute of Higher Learning ప్రారంభించినప్పుడు ఉత్తమ మానవుడు ఎట్లా తయారు కావాలి, దేనివలన ఏది తెలుసుకున్నందువలన మానవత్వం పరిమళిస్తుందో విద్యా విధానం ద్వారా, కరుణ ఎట్లా ప్రవహించవలసి ఉన్నదో వైద్య విధానం ద్వారా, సమాజమైనటువంటి సేవ ద్వారా పరమేశ్వరుడు తన సర్వ శక్తులని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తూ తనదైనటువంటి దివ్య భావనాసీమని మహా విస్తృత పరుస్తూ అనేక క్షేత్రాలను పరివర్తన చేస్తూ వెళుతున్నారు. అవతారంలో, భాగంలో మనం కూడా రెండు అంగుళాలు, రెండడుగులు వేయటానికి జన్మ ఎత్తాం. ఒక సమకాలీనుడిగా, ఒక పరమాత్మకి సమకాలీనుడిగా పుట్టడమే ఒక యోగం. అందునా వారు జన్మ తీసుకున్నటువంటి ఆంధ్రదేశంలో పుట్టటం రెండవ యోగం. పరమాత్మని దైహికంగా చూడటం మూడవ యోగం. చూసి ఆయన పరమాత్మీ అని నమ్మగలగటం నాలుగవ యోగం. పరమాత్మీ అని నమ్మిన తర్వాత దానిని నడవటం ఐదవ యోగం. కనుక మహా విస్తృతమైనటువంటి ఒక సాగర సదృశమైనటువంటి పరమాత్మని సంసార సదృశమైనటువంటి జీవుడు కొలవలేడు, తలచలేడు, అనుకోలేడు. గనుక ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవించిన దానిని నిష్టగా ఆచరించాలి. సర్వ మానవులు కూడా సమస్తమైనటువంటి శాంతి కాముకులుగా, శాంతి ప్రియులుగా, శాంత పుంభావులుగా జీవించేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ సాయి మనందరిపై నెండుగా, దండిగా తన అనుగ్రహాన్ని మహామృత వృష్టి వలె కురిపించు గాక అని భగవాన్ సత్యసాయిని ప్రార్థిస్తూ...ఆయన ద్విజుడు కాడు పుట్టినవాడు కాదు ఎవరయ్యా అజుడు జన్మలేని వాడు జన్మ ఎత్తినట్టుగా వచ్చినవాడు వైదిక సాంప్రదాయంలో ఉన్న అనేక అవతారాలలో శిరోమాణిక్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మహావతాది భగవాన్ సత్యసాయి దివ్య చరణారవందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ దివ్యమైనటువంటి మహాపుణ్య కాలాన పరమేశ్వరుడైనటువంటి స్వామి సమస్త మానవాళిని పద్నాలుగు భువనాల్లో ఉన్నటువంటి సమస్త జీవరాసులని ఆత్మవైపు ప్రస్థానం చేసే దిశగా వడివడిగా అడుగులు వేసేటటువంటి ఒక దశగా ఆశీర్వదించవలసిందిగా భగవాన్ని ప్రార్థిస్తున్నాను సాయి రామ్. ఇంతవరకు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు లీలాలైవల్యం పేరిట స్వామి యొక్క ప్రేమ తత్వం మరియు మన వాళ్ళకి స్వామి అందించిన సేవలపైనా ప్రసంగించారు. [ఇంట్రో సంగీతం]లేబాలు నివలె మాపల్లెను పుట్టావు లేపల్లె బాలుని వలె మా పల్లెను పుట్టావు గోపాలుడివా నీవో గోవిందుడివా లేపల్లె బాలుని వలె మాపల్లెను పుట్టావు గోపాలుడివా నీవో గోవిందుడివా గోపాలుడివా నీవో గోవిందుడివా నారాయణా శార్ష్ట నారాయణా నారాయణా శార్ష్ట నారాయణా.అక్షయ సంవత్సరాన కార్తీక మాసాన శివునికి ప్రియమైన సోమవారాన పుట్టినావు అక్షయ సంవత్సరాన కార్తీక మాసాన శివునికి ప్రియమైన సోమవారాన పుట్టినావు నారాయಣ వ్రతవేళలో నోవ్వులు చిందించినావు నారాయణ వ్రతవేళలో నోవ్వులు చిందించినావు నాగతాయి నా దర్శనం ఇచ్చినావు తండ్రీ!పరమశివుడివా నీవో పరమాత్ముడివా పరమశివుడివా నీవో పరమాత్ముడివా నారాయణా శర్ష నారాయణా నారాయణా శర్ష నారాయణా లేపల్లె బాలుని వలె మాపల్లెను పుట్టావు గోపాలుడివా నీవో గోవిందుడివా కరుణారణ కాంతులు నీ కన్నులలో విరిసెను భువనమోహనమ్ము గా చిరునోవులు చిందిను కరుణారుణ కాంతులు నీ కన్నులలో విరిసెnuభుvanamohanammuga chirunovulu chindenu దివ్య ప్రేమ సౌరభాలు నీ పలుకుల నిండెను దివ్య ప్రేమ సౌరభాలు నీ పలుకుల నిండెను శ్రీవత్సము నీ యెదపై అందముగా మెరసెను జనార్ధనుడివా ನೀವು జగన్మూలిನಿವಾ ಜನಾರ್ಧನುಡಿವ ನೀವೂ ಜಗನ್ಮೂಲಿನಿವಾ ನಾರಾಯಣ ಶರಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಶರಣ ನಾರಾಯಣ ಪ್ರೇಪಲ್ಲೆ ಬಾಲು ನಿವಲ್ಲೆ ಮಾ ಪಲ್ಲೆನ ಪುಟ್ಟಾವು ಗೋಪಾಲುಡಿವಾ ನೀವು ಗೋವಿಂದುಡಿವಾ [అౌత్రో సంగీతం]ఇంతటితో ఈనాటి మా తెలుగు కార్యక్రమాలు సమాప్తం. ఇప్పటివరకూ మీరు విన్న కార్యక్రమాన్ని radiosai.org website నుంచి download చేసుకోవచ్చు. కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను మాకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. మా చిరునామా Radio Sai Global Harmony, ప్రశాంతి Digital Studio, ప్రశాంతి నిలయం, అనంతపూర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ 515134. మా email address listener@radiosai.org. ప్రతి సోమ, బుధవారాల్లో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రోతలు మా తెలుగు కార్యక్రమాలను వినవచ్చు. జై సాయిరాం!
SSSMC · audio

Telugu Broadcast - 420

Home

Telugu Broadcast - 420

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 58:13

More in this series

Telugu Broadcasts

12 episodes · 11 hr 32 min

  1. 57 min 394

    Telugu Broadcast - 394

  2. 1 hr 396

    Telugu Broadcast - 396

  3. 58 min 402

    Telugu Broadcast - 402

  4. 58 min 420

    Telugu Broadcast - 420

    Now playing
  5. 56 min 424

    Telugu Broadcast - 424

  6. 57 min 427

    Telugu Broadcast - 427

  7. 57 min 490

    Telugu Broadcast - 490

  8. 56 min 491

    Telugu Broadcast - 491

  9. 56 min 498

    Telugu Broadcast - 498

  10. 58 min 555

    Telugu Broadcast - 555

  11. 57 min 560

    Telugu Broadcast - 560

  12. 58 min 561

    Telugu Broadcast - 561