Skip to content
Transcript తెలుగు
[సాయి music] రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా భరతుడి భాతృప్రేమ అనే అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగం వింటాం. శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరు గత నలభై ఏడు సంవత్సరాలుగా స్వామికి భక్తులు. అంతేకాక, తమ ప్రసంగాల ద్వారా స్వామి తత్వాన్ని రాష్ట్రమంతటా అందిస్తున్నారు. తరువాత ఆంధ్రప్రదేశ్ మహిళా యువ సమన్వయకర్త కుమారి సాయి అరుణ గారితో interview వింటారు. కుమారి సాయి అరుణ గారు స్వామి వారి అనంతపురం మహిళా కళాశాలలో 1984, 1989 సంవత్సరాల్లో విద్యాభ్యాసం చేశారు. interview మా విశాఖపట్నం studio లో record చేశారు. ఇప్పుడు ముందుగా భరతుడి భాతృప్రేమ అనే అంశంపై వి.ఎస్.ఆర్. మూర్తి గారి ఉపన్యాసం విందాం. [సాయి music] ఓం శ్రీ సాయిరామ్. స్వామి భగవంతుడు లేక భక్తుడు లేడు. అలాగే భక్తుడు లేక భగవంతుడు లేడు అన్నారు స్వామి. నిజమా? విచారణ చేయాలి మనం. ఎందుకంటే శ్రీమద్రామాయణం గనక తీసుకున్నట్లయితే రామ, భరత, లక్ష్మణ, శతృఘ్న అది వరుస. శ్రీరామచంద్రుడు తన శక్తిని నాలుగు భాగాలు చేసుకొని నలుగురుగా అవతరించినటువంటి మహా పరిపూర్ణ అవతారం. అదే సమయంలో ఇంకో ఇద్దరు సోదర ద్వయాలు ఉన్నాయి. అవేంటంటే ఇటు రామా భరతా ఒక aspect అయితే వాలి సుగ్రీవ రెండు. మరి ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సాక్షాత్ నారాయణ మూర్తి అయినటువంటి రాముడు, రామ తత్వంలో నుంచి నారాయణ తత్వంలో నుంచి వచ్చినటువంటి భరతుడు పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానంగా ఉన్నారు. రజస్తమో గుణాలు దాటినటువంటి పూర్ణ పురుషులు ఇద్దరూ కూడా లేదా ఇద్దరుగా కనిపిస్తున్న ఒకరు ఎలా? వైనం ఏమిటి? విచారణ చేద్దాం. భగవంతుడి దగ్గర భక్తుడు ఉండటం సహజం. భక్తుడి కోసం భగవంతుడు ఆరాటపడటం సహజం. కానీ అన్నదమ్ములై ఉండి రాజ్యాధికారం కోసం కుటుంబాలను సంహారం చేసుకొని కేవలం సింహాసనం కోసం ఐహిక భోగం కోసం వావి వరుసలు, రకమైన బాంధవ్యాలు విలువ లేనటువంటి రోజుల్లో రామ భరతులిద్దరూ కూడా మనకొక నీతిని ఒక పాఠాన్ని చక్కగా వాళ్ళ జీవితం ద్వారా వారి అవతార కార్యక్రమం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. రాముడు ప్రాజాపత్య పురుషుడు యొక్క యజ్ఞ పాయసం లో నుంచి నారాయణుడు కౌసల్య గర్భంలోకి ప్రవేశించాడు. సుమిత్రా గర్భంలో లక్ష్మణ శత్రుఘ్నులు, కైక గర్భంలో భరత స్వామి. భరత స్వామి అని ఎవరన్నారంటే రాముడే అన్నాడు. ఆయన స్వామి అంటే జ్ఞాని అని అర్థం. స్వామే స్వామి అన్నాడు భరతుడిని. ఎట్లా అనిపించుకోగలిగాడు? శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడని, దశరథుడు మరణించాడని తెలుసుకున్నప్పుడు తల్లి దగ్గరకు వెళ్ళి భరతుడు తీవ్రంగా మందలించాడు, నిందించాడు, ఆగ్రహించాడు. "నా అన్నని కారడవులకు పంపుతావా?" అన్నాడు. అది దైవ నిర్ణయం అని తెలియక. సరే కారణం ఏదైతే ఏమి వశిష్టుల వారు కూడా, "పట్టాభిషేకం చేసుకొని అయినా, తండ్రి లేడు, మీ అన్నగారు లేరు, తర్వాత వాడివి నువ్వు కాబట్టి నువ్వు రాజ్యార్హత ఉన్నది. పైగా నీ తల్లి కోరిక అదే. కోరికని వరదానం ఇచ్చిన వాడు నీ తండ్రి. కాబట్టి లోకం నిన్ను ఏమి అనదన్నప్పుడు, నా జేష్ఠ భ్రాత, నా పెద్ద అన్న రాముడు ఇక్కడ ఉండగా సింహాసనం మీద నేను కూర్చోగలనా? ఏమనుకుంటున్నారు? నేను కేవలం రాముడికి తమ్ముడిని మాత్రమే కాదు, శ్రీరామచంద్రుడి యొక్క భక్తుడిని." అన్నాడు. అని ఎలా వెళ్లారు అరణ్యవాసానికి అంటే నారచీరలు కట్టుకొని రామలక్ష్మణులు, అమ్మవారు వెళ్లారన్నప్పుడు, "అయితే నేను కూడా ముని వేషంలోనే వెళ్తా, రాజు వేషాన్ని నేను ఇక్కడే వదిలి పెడతాన"న్నాడు. ముని వేషంలో శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఇది కథంతా మనకు తెలుసు. అయితే పట్టాభిషేకానికి వచ్చిన రాముడితో భరతుడు ఒక మాటన్నాడు. "అన్నా! ఇదిగో కోశాగారం, ఇదిగో ధాన్యాగారం, ఇదిగో అస్త్రాగారం." అంటే అస్త్రాలు రాజులకు కావాలి, ధాన్యం కావాలి, సంపదలు కావాలి. "అన్నీ కూడా పధ్నాలుగు సంవత్సరాలు నేను తాకలేదన్నా, అవి అక్కడే ఉన్నాయి. భద్రంగా నువ్వు చూసుకోవచ్చును." అన్నాడు. అంటే ఎంత కౌటుంబికమైన, సామాజికమైన, రాజరిక ధర్మాన్ని భరతుడు ప్రతిపాదన చేశాడో చూడండి. అంతే కాదు వశిష్టుల వారితో ఒక మాటన్నాడు భరతుడు. "నేను రాజ్య కాముడిని కాదు, రామ కాముడిని." అన్నాడు. "నాకు ఒకే ఒక్క కోరిక, నా శరీరంలో ప్రతి అణువు కూడా నిండిపోయింది. అది రాముడు రాముడు రాముడు కావాలన్న కోరిక. నేను రాముడికి చెందాలన్న కోరిక తప్ప అన్యాయం నాకు తెలియదు." అన్నాడు భరతుడు. అసలు భరత శబ్దం ఏమిటి అంటే భగవంతుని యందు రతి గలవాడు భరతుడు. భా అంటే ప్రకాశం, వెలుగు మూలం అది. అందుకనే భగవంతుడు రాముడా, కృష్ణుడా, భగవాన్ సత్య సాయి అంటే ఇవన్నీ కూడా ఒక ఉపాధి, ఒక రూపం, ఒక నామంతో వచ్చినాయి గాని మన స్వామిని కూడా శరీరాన్నిఈ రూపాన్ని సత్య సాయి నామాన్ని దాటి చూడగలిగినట్లయితే స్వామి కూడా ఒక వెలుగు పుంజం అది వెలుగు మూలం అసలు వెలుగులకే వెలుగైన అటువంటి మూలమైన వెలుగు గనుక వెలుగుని దర్శనం చేసుకునేవాడు కనుక ఆయనకి భా అంటే ప్రకాశం ప్రకాశము నందు రతి ఇష్టము కలిగినటువంటి వాడు గనుక ఆయన భరతుడు అయినాడు. భరత శబ్దంలోనే ఆయనకి భక్త శబ్దం కూడా ఉన్నది. తర్వాత పరమ భాగవతోత్తముడు అయినటువంటి భరతుడు శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కుడు అయినటువంటి అంటే అన్ని వేళలా రామ పాదము రామనామము రామ రూపము రామ తత్వము రామ భావం తప్ప అన్యమెరగని వాడు భరతుడు. సరే వెళ్ళాడు మనందరికీ తెలుసు పాదుకలనన్నా అనుగ్రహించవయ్యా అని అడిగాడు అట్లాగేలే అన్నాడు రాముడు భరతులు కాసేపు మాట్లాడుకున్నారు పాదుకలు ఏం చేస్తాయి నువ్వెళ్లి రాజ్యం ఏలుతూ ఉండు సరేలే నీ మాట మన్నిస్తాను పధ్నాలుగు ఏళ్ళు అక్కడ ఉండి నేను రానే వస్తా కదా అన్నాడు అయినా లేదు నువ్వున్నావు అంటే నీ ప్రతినిధిగా నీ పాదుకలను నా ఇవ్వమన్నాడు. పాదుకలే ఎందుకు అడిగాడు? ఏదో ఉంగరమో ఏదో ఇవ్వచ్చు కదా అంటే భారతీయ గురు సాంప్రదాయంలో పాదుకలకు చాలా విశిష్టత ఉన్నది. పాదుకల అడుగున అగస్త్య రేఖలుంటాయి అగస్త్య రేఖాదభిరంచితాభ్యం శ్రీ గురు పాదుకాభ్యం అని కదా శ్లోకం అంటే గురువు యొక్క పాదముల అడుగున అగస్త్య రేఖలుంటే మానవుడు అంటే సాధకుడి యొక్క అరచేత కర్మ రేఖలున్నాయి. కర్మ రేఖలు వెళ్ళి గురువు యొక్క పాదాన్ని స్ప్రుశించినప్పుడు అగస్త్య రేఖలు కర్మ రేఖలు సంయోగించి మన కర్మలన్నీ కూడా నశించి పుణ్యాల మాలగా తయారవుతాయి. అందుకే స్వామి అంటారు చూడండి మీకు తెలుసో తెలియకో కర్మ మాల బరువు మాల కంఠమాలగా చేసుకొని వచ్చారు నా దగ్గరకు రండి పుణ్యాల మాల చేస్తాను అన్నారు. అంటే శ్రీరామచంద్రుని యొక్క పాదుకల యందు ఏమున్నది అంటే శ్రీరాముడి శక్తి నిక్షిప్తమై ఉన్నది. శ్రీరాముడి స్పర్శ ఉన్నది అందుకనే గురు పాదుకా స్పర్శ గురు పాద స్పర్శ స్వామి యొక్క పాద నమస్కారాన్ని మనం కోరుకోవటం వెనుక అర్థం ఇంత ఉన్నది గనుక భరతుడు కూడా మనవలెనే ఏం కోరాలో అదే కోరాడు పాదుకలిమ్మన్నారు. అందుకనే స్వామి పాదుకా ఉత్సవం అనుగ్రహం చేసినప్పుడు పాదుకలిమ్ము పావన నామా పరమపదమిమ్ము నెమ్మది నా హృదిని పాదాల పాదుకననిమ్ము అట్లా అడగాలి స్వామిని. పాదుకలు సంకేతం పాదుకలు ప్రతీకలు స్వామి యొక్క దివ్యమైనటువంటి పాదాలకి అవి ప్రతినిధులు గనుక అట్లాగే భరతుడు కూడా శ్రీరామచంద్ర పాదుకలని శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదాలుగా గ్రహించాడు తీసుకువచ్చాడు సింహాసనంలో కూర్చోబెట్టాడు వాటిని. ఎక్కడో ప్రత్యేకమైన మరొక సింహాసనం కాదు ఎక్కడ రాముడు రాజ్యపట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యం ఏలబోతున్నాడో అక్కడే వాటిని కూర్చోబెట్టాడు. ఎలా కూర్చోబెట్టి ఏం చేశాడు పాదుకలని అంటే జంకారాకృతి సామగానములతో శైలాలిని గీతికలం కర్మీణ మనోజ్ఞ దానములతో లావణ్య రేఖా నిరాతంకంబై చను పాదుకా యుగమున్ ప్రొజ్జత్సింహ పదంబునన్ శంకాపేతముగా గనుంచి రఘువంశ స్వామిగా చూచుచున్. ఏం చేశాడు భరతుడు అంటే జంకారాకృతి సామగానములతో రోజూ వేదం చదివేవాడట. సామగానం చేసేవాడు ఎట్లా జంకారాకృతి అంటే ఒక భ్రమరం ఒక తుమ్మెద ఎట్లాగైతే జంకారం చేస్తుంటుందో భ్రమర కీటక న్యాయంలో రాముడికి తనకి అభేదం కలిగించేటువంటి అద్వైత స్థితిలోకి వెళ్ళేట్లుగా పాదుకల దగ్గర ప్రతిరోజూ సామ వేదం చదివేడాయన. సామవేదం చదవటం అంటే సామగానం చేయటమే. శైలాలిని గీతికాలం కర్మీణ మనోజ్ఞ దానములతో అనేకమైనటువంటి గీతాలాపాలు రామ సంకీర్తనం చేశాడు గుణగాన సంకీర్తనం చేశాడు. లావణ్య రేఖా నిరాతంకంబై చను పాదుకాయుగమున్ శ్రీరాముడి యొక్క దివ్య పాదుకల యొక్క ఆకారం ఎట్లా ఉన్నదో రాముని యొక్క రూపాన్ని భావాన్ని తత్వాన్ని పరమ భక్తి పారమ్యంతో రోజూ అనుగ్రహిస్తూ దానిని చూస్తూ ఏం చేశాడయ్యా అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దానిని ఎలా చూస్తున్నాడు రఘువంశ స్వామిగా చూచుచున్ రెండు పాదుకలు మా అన్నగారు రాముడే అయోధ్యా నగర రాజుని చూసినట్టుగా చూశాడు. అంటే పాదుకలకి రాముడికి అభిన్నాన్ని పాటించాడు. అయితే భరతుడు ఒక మాట రాముడికి చెప్పి వెళ్ళాడు ఏం చెప్పాడయ్యా అంటే పధ్నాలుగు ఏళ్ళ వనవాసం ఎప్పుడు ముగుస్తుందో వశిష్టుల వారు నాకు చెప్పారు నేను సమయం కోసం నీ ఆజ్ఞ ప్రకారం మళ్ళీ వెనక్కి వెళ్తున్నా తండ్రి ఆజ్ఞ పాటించి నువ్వు వనానికి వచ్చావు తండ్రి లేడు మనకి తండ్రి తర్వాత పెద్దన్నవి నీవు తండ్రివి గనుక నీ ఆజ్ఞ పాలించి నేను వెనక్కి వెళ్తున్నా నిజానికి నాకు వెళ్ళటం ఇష్టం లేదు ఎలాగూ నార చీరలతో వచ్చాను నీతో పాటే పధ్నాలుగు ఏళ్ళు గడుపుదామనుకున్నా కానీ నువ్వు వెళ్ళు అన్నావు కదా తిరిగి వెళ్తున్నా పాదుకలతో కానీ రామచంద్రా! నీవు గనక రావటంలో ఎన్ని ఘడియలు విఘడియలలో తేడా వచ్చినా నేను అగ్ని ప్రవేశం చేస్తా. శరీరాన్ని నిప్పుకి అర్పించి నేను మళ్ళీ పాదుకల దగ్గర అయోధ్యా నగరంలో మాత్రం ఉండను. అంటే నా మనస్సు నీ రాకకై ఎంత తహతహలాడుతున్నదో ఎరిగి సమయానికి రావయ్యా అని అడిగాడు. రాముడు సరేనన్నాడు. ఇక్ష్వాకు వంశంలో మాట ఇస్తే మడమ తిప్పేది లేదు మాట తప్పేది లేదు. కనుక శ్రీరామచంద్రుడు అట్లే సరే నాయనా వెళ్ళమన్నాడు. ప్రేమగా ముదమార పంపించాడు. అప్పుడు రాముడంటాడుఅన్నివేళలా నీవు గురువు యందు భగవంతుని యందు నీ మనస్సు లగ్నమై ఉన్నదో కన్నుమూసే వరకు కూడా దాని యందు మాత్రమే నీ మనస్సును లగ్నం చేసుకో భరతా అన్నాడు. అని రాముడు ఒక మాట చెప్పాడు. మానవుడు అంటే జీవుడి యొక్క ఆయువు ఎటువంటిది అంటే ఆకు కొసన నిలిచిన నీటి బిందువు వంటిది. చిన్న గాలి కదలిక చేత ఆకు కదలిక చేత క్షణానైనా బిందువు నేల రాలవచ్చు తమ్ముడు. కనుక ఆయువు ఉన్నంతవరకు పరమాత్మనే ఆకుని పట్టుకున్నావే. పరమాత్మ యొక్క దివ్య పాదాలు పట్టుకున్న వాడివి వదిలిపెట్టకుండా ఉండు అన్నారు. స్వామి రాముడి మాటలే పట్టిన పట్టు పట్టనే పట్టితివి పట్టు విడునందాక అట్టే ఉండు అన్నారు స్వామి. సాకేత రాముడు అట్లా సాయి రాముడు ఇట్లా. కాబట్టి భరతుడు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళాడు. నామ రూప భావ తత్వాతీతమైనటువంటి ఆత్మ ఏమిటో ఎరగమన్నారు. ఆత్మకి రూపం లేదు కానీ ఆత్మ సహిత రూపానికి మాత్రం ఆత్మ ఉన్నది శరీరానికి ఆత్మ ఉన్నది ఆత్మకు శరీరం లేదు భరతా అని అద్వైత స్థితిని కూడా తమ్ముడికి బోధించాడు. ఇక్కడ రాజ్య లాలసను దాటాడు. తండ్రి యందు, తల్లి యందు, మిగతా తల్లుల యందు, అన్నదమ్ముల యందు, పౌరుల యందు, అయోధ్యా నగరం పట్ల అన్నింట్లో కూడా భరతుడికి అపారమైనటువంటి ఒక ప్రేమ, అపారమైనటువంటి ఒక భక్తి, ఒక వినయము ఇవన్నీ ఉన్నాయి గనుక ఆయన భక్తుడిగానే ఉండటానికి ఇష్టపడ్డాడు. భక్తుడు భగవంతుడు అనగానే భ్రమర కీటక న్యాయం గుర్తు రావాలి. కీటకం అంటే తుమ్మెద ఎలా తయారవుతుంది అంటే ఎక్కడో ఒక పురుగును తెస్తుంది గూట్లో పెడుతుంది. పెట్టి అసలు తుమ్మెద దాని చుట్టూ జంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. రొద జంకార స్వరం విని, విని, విని పురుగు ఒకరోజున తుమ్మెదై రెక్కలు పుచ్చుకొని పారిపోతుంది. అలా తుమ్మెద తయారవుతుంది. తుమ్మెదకి అసలు పుట్టుక పురుగే. సీతాకోకచిలుక యొక్క పూర్వరూపం ఏమిటి గొంగళి పురుగు. మెటమార్ఫసిస్ అంటామే పరిణామ క్రమంలో గొంగళిపురుగే సీతాకోకచిలుక అయింది. ఎట్లా? తన మనోవృత్తులు, తన చిత్తవృత్తులు నశింపజేసుకొని, తనకున్నటువంటి అనేకానేకమైన బలహీనతలను అధిగమించి, రూపంలో ఉన్న వికారాలను దాటి అన్నింటినీ దాటి దాటి వర్ణ వర్ణాంచితమైన రంగురంగుల సీతాకోకచిలుకగా అది ఒక కేవల కీటకంగా, పురుగుగా వచ్చినది తుమ్మెదగా జంకారం చేసే నాద ప్రక్రియకి అనువాదమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంది గనుక భక్తుడు భగవంతుడు నిజానికి భ్రమర కీటక న్యాయమే. సంఘటన ఉన్నది రామాయణంలో. రాముడు వచ్చాడు. ఇదిగో అన్నట్లుగా సమయానికి రాలేకపోయినాడు. తిరిగి వస్తూ వస్తూ భరద్వాజ ఆశ్రమంలో దిగాడు రాముడు అందరితో పాటు. కానీ రాముడికి తెలుసు సమయానికి వెళ్ళకపోతే తనతో పాటే పుట్టిన భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడు అని. ఇందులో ఎవరిని పంపించాలి అనుకున్నాడు. మళ్ళీ మన హనుమే ఆయనకి గుర్తొచ్చారు. హనుమా! నువ్వు వెళ్ళి నందిగ్రామంలో ఉన్నటువంటి భరతుడికి చెప్పు శ్రీరామచంద్ర ప్రభువు కొన్ని నిమిషాలలో అక్కడికి చేరుకోబోతున్నాడు. ప్రాయోపవేశం అవసరం లేదు. ఈలోగా అక్కడ జరిగినటువంటి రావణ వధ అంతా కూడా కథా కథన రీతిలో చెప్తూ ఉండు. ఈలోగా నేను అక్కడికి వచ్చి చేరుకుంటాను లేకపోతే మా వాడు అనంత పని చేస్తాడు అన్నారు. అనగానే హనుమ కావలసింది ఒకటే రాముడు పని చెప్తాడా ఎదురు చూడటమే ఆయన తపస్సు. ఆయన కర్మ యోగం అంతా రాముడు చెప్పిన పని perfect గా చేయటమే ఆయన కర్మ యోగం. నేను చేస్తున్నానన్న భావన కాకుండా రాముడే నా చేత చేయిస్తున్నాడన్న భక్తి యోగంలో చేయటం అది హనుమ యొక్క తత్వం. చేసిన తర్వాత చేయబడినది, చేస్తున్నది, చేయించిన వాడు మూడూ ఒకటే అని అద్వైత స్థితిలో ఉంటాడు హనుమ. కనుక హనుమ భరతుడి దగ్గరకు వెళ్ళాడు. ప్రాయోపవేశానికి చితి పేర్చుకున్నాడు భరతుడు. అప్పటికే సమయం ఆసన్నమవుతున్నది ఇంకా రాముడి జాడే లేదు. విమానంలో వస్తాడని అనుకుంటున్నారు, ఎక్కడ వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని. హనుమ వాలినప్పుడు భరతుడు కూడా శంకించాడు. వీడెవడో లంక నుంచి తప్పించుకొని వచ్చిన రాక్షసుడు అనుకున్నాడు. అప్పుడు అన్ని వివరాలు చెప్పి మధుర వచోవీచితో చల్లని చక్కని మాటలతో ఆత్మీయమైనటువంటి పలకరింపుతో భరతుడి గురిం-- భరతుడికి రాముడి గురించి అన్ని విషయాలు చెప్పాడు. సరే ఇంతలోకే రాముడు రావటం, శాలంకృతమైనటువంటి రథం చక్కగా అందరికీ కనపడేలాగా రాముడు రావటం అంటే ఏమిటి? దైవం మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కదా! అరణ్యవాసం, జయకేతనం ఎగరవేసి, రావణ సంహార కాండ పూర్తి చేసి శ్రీమన్నారాయణుడు రామచంద్ర ప్రభువై రాజ్యాన్ని ఏలటానికి వచ్చే మనోజ్ఞ మధుర సన్నివేశం అది. అయోధ్యా నగర ప్రజలంతా బారులు తీరి ఉన్నారు. రాముడు, భరతుడు ఇద్దరూ రథం మీద నుంచుని ఉన్నారు. నుంచుంటున్నారు రథం సాగిపోతున్నది. అంతఃపురం స్త్రీలు, అయోధ్యా ప్రజలు అందరూ కూడా పూలదండలన్నీ కూడా వేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు అంటే భరతుడికి వేస్తున్నారు. భరతుడు సిగ్గుపడిపోతున్నాడు. రాముడి మెడలో ఒక్క పూదండ కూడా లేదు. ఎందుకని భరతుడు సిగ్గుపడి రాముడి వైపు తిరిగి, "అన్నా! ఇవన్నీ నీకు చెందవలసిన దండలన్నీ నాకు వేస్తున్నారే" అని అంటే రాముడు మాట అన్నాడు. "నిజమే భరతా! అన్ని పూలదండలు పొందటానికి నీవు అర్హుడివి. కారణం ఏంటంటే పధ్నాలుగు సంవత్సరాల వనవాసం లో నా మనస్సంతా రావణ సంహారంతోనూ, రాక్షస సంహారంతోనూ, ధర్మకాండలో ధర్మాన్ని నిర్వర్తించటంలోనూ, ధర్మసంస్థాపన చేయటంలోనూ, యజ్ఞాలను కాపాడటంలోనూ, అపహరింపబడిన సీతను మళ్ళీ తలచుకొని తలచుకొని ఎప్పుడు తేవాళ అన్న ఆలోచనతోనూ, లంకానగరాన్ని తమస్సు నుంచి తపస్సు వైపు నడిపించే విముక్త స్థాయిలోనూ పధ్నాలుగేళ్ళు నా మనస్సు ప్రాపంచికమైపోయింది భరతా!"కానీ పాదుకలు తీసుకువెళ్లి సింహాసనం మీద పెట్టుకున్న క్షణం నుంచి ఇదిగో మన ఇద్దరం మళ్ళీ కలుసుకున్న క్షణం వరకూ పధ్నాలుగేళ్ళు నీ మనసంతా రామనామంతో నిండిపోయింది రామ తలపుతో నిండిపోయింది రాముడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు అన్న ఆర్తితో నిండిపోయి భ్రమర కీటక న్యాయంలో నీవు రాముడివైపోయినావు నీకూ నాకూ తేడా లేదు తమ్ముడు అన్నాడు అంటే అప్పుడు వాళ్ళిద్దరూ అలా అనుకోవటానికి కూడా కారణం ఏంటంటే లక్ష్మణ శతృఘ్నుల యొక్క రూపురేఖలన్నీ సమానంగా ఉంటాయి రామ భరతులిద్దరివి కూడా ఒకే రూపుగా ఉంటాయి నీలమేఘ శ్యాములు ఎత్తు ఒడ్డు పొడుగు అంతా ఇద్దరూ ఒక్కటే గర్భాలు వేరైనప్పటికీ కూడా ఎందుకని అంటే అసలు భరతుడు ఎంత దగ్గర రాముడికి అంటే స్వామీ చక్కగా దీన్ని రామకథా రసవాహినిలో కూడా మనకి చెప్పారు అలాగే విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో కూడా చాలా అందంగా వర్ణించారు కౌసల్య దగ్గర స్నానం చేసేవాడు రాముడు స్నానం చేసి కైక మందిరానికి పరిగెత్తుకు వెళ్ళేవాడు రోజు కౌసల్య రాముడిని పట్టుకుంది ఏమిరా వరపుత్రుడిగా నిన్ను కన్నానే రామా నీతో ముద్దు ముచ్చట ఎప్పుడు నాకు తీరేది ఇక్కడ స్నానం చేస్తావ్ కైక మందిరంలోకి మీ పెనతల్లి మందిరంలోకి తుర్రుమని వెళ్ళిపోతావే అక్కడ అన్నీ బొట్లు పెట్టించుకుంటావ్ అలంకారం చేయించుకుంటావ్ బట్టలు కట్టించుకుంటావ్ అక్కడే భరతుడితో ఆడుకుంటావ్ ప్రేమని నాకు ఇవ్వవా అని అడిగితే నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల బాలుడు రాముడు ఒక మాటన్నాడు అమ్మా నువ్వు సత్వగుణ ప్రధానమైనటువంటి మాతృమూర్తివి నన్నే నీ గర్భాలయంలో పెట్టుకున్నావ్ నీకు మిగతా వాటితో అవసరం లేదు ఇక కైక కాస్త తామసంలో ఉన్నది పరమాత్మ సంస్పర్శ చేత పరమాత్ముడిని అలంకారం చేయటం చేత పరమాత్మతో కూడి ఉన్న కారణం చేత ఆమె తపస్సు కూడా తొలగాలి కదా అసలు నేను వచ్చిందే తమస్సు చీకటి పోగొట్టడానికి కదా నా అవసరం నీకంటే కైక దగ్గరే ఎక్కువ ఉన్నది అన్నాడు ఇది అత్యద్భుతమైన విశ్లేషణ కారణంగా భరతుడితో రాముడు ఎక్కువ కాలం గడిపాడు నిజానికి అరణ్యవాసం లో మాత్రం లక్ష్మణస్వామికి పూర్ణమైనటువంటి association అనుగ్రహించాడు కనుకనే భరత శతృఘ్నులిద్దరూ మేనమామలై ఉంట ఉన్నారు వనవాసానికి రాముడు వెళ్ళేటువంటి వేళ అలాగే రామలక్ష్మణులిద్దరూ వనవాసానికి వెళ్లారు శ్రీరామచంద్రుడి యొక్క హృదయము భరతుడు శ్రీరామచంద్రుడి యొక్క పూర్వ పూర్వ స్వరూపమైనటువంటి నారాయణ స్వరూపంలో శంఖం చక్రం గద కదా ఆదిశేషువు లక్ష్మణస్వామి అయితే భరతుడు ఎవరయ్యా అంటే శంఖం శంఖము అంటే అత్యద్భుతమైనటువంటి ధ్వని శ్రీరామచంద్రుడు శబ్ద బ్రహ్మమయుడు శబ్ద బ్రహ్మమయుడు ఆయనే నిశ్శబ్ద బ్రహ్మమయుడు కూడా ఆయనే గనుక శబ్దానికి ఒక ప్రతీకగా శంఖం ఉండాలి గనుక భరతుడు ఎవరు అంటే రామ హృదయం పధ్నాలుగు సంవత్సరాలు ఇటు భరతుడు ఏలలేదు అటు రాముడు లేడు కానీ రామరాజ్యం అనేటువంటి మాట పధ్నాలుగేళ్ళకే ఏర్పడింది రాముడు లేకుండా అంటే రాజు లేని రాజ్యం అందుకనే గోదావరి తీరంలో కూడా రాముడు ఒక సందేశం ఇచ్చాడు నేను వచ్చి పాలించటం కాదు నేను లేనప్పుడు కూడా మీరు నేను ఉన్నట్లుగా ఉండాలి స్వామి అదే చెప్తారు కదా నేను లేనిది ఎక్కడ నేను ఉన్నానని అనుకొని మీ పనులు చేస్తూ ఉండండి రాముడు చెప్పిన మాటే భిన్నమేం కాదు ఇది కనుక భరతస్వామి రాముడి యొక్క ఆజ్ఞని రాముడి యొక్క అభిప్రాయాన్ని రాముడి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు గనుక ఆయన పరమ భాగవతోత్తముడు అయినాడు ఎప్పుడైతే రాముడు వచ్చాడో ధాన్యాగారాన్ని కోశాగారాన్ని అస్త్రాగారాన్ని ఇచ్చాడు అనేకమైన సంభాషణలలో భరత హృదయం మనకు ఏం తెలుస్తుంది అంటే భగవంతుడి అనుగ్రహం పొందటం కంటే ఐశ్వర్యం మరొకటి లేదు భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ప్రాపంచికమైన కోరికలు ఉండవు భగవంతుడే మన వాడైన తర్వాత దాని కంటే ఉన్నతమైనది గాని మించినది గాని లేదు గనుక భగవంతుడు మన వాడైన తర్వాత కోరుకోదగినది ఏమీ లేదు అందుకనే స్వామి ఒకసారి ఒక interview లో ఒక మాట చెప్పారు అడిగావా అడిగిందంతా ఇస్తా అడక్కపోయినావా అంతా నీదే అంతా నీదే అయినప్పుడు అడగటానికే ఉన్నది అన్నారు ఇది కాబట్టి అడగటానికి ఇంకేదో ఉన్నది అంటే మనం ఇంకా స్వామికి దగ్గర కానట్టు లెక్క ఆయన ఏదో ఇవ్వాలని మనం పుచ్చుకోవాలని అనుకుంటాం అసలు స్వామే మన వారైన తర్వాత కల్పవృక్షమే మన పెరటి చోట ఉన్న సమయంలో పరమాత్మని అనుగ్రహం కోరాలి పరమాత్మనే కోరుకున్నట్లయితే అన్నీ ఏర్పడతాయి అని భరతుడిది మనకి చెప్తుంది అలాగే పాదుకా పూజ పాదుకా ఉత్సవం పాదుక అంటే అటు వైష్ణవ సాంప్రదాయంలో ఇటు స్మార్త సాంప్రదాయంలో ఇటు అద్వైత భావనలో ప్రతీకాత్మకమైనటువంటి విశేషణలతో పాదుకలు అంటే పరమాత్మే అంటే ఆపాదమస్తకం అన్నాం శిరస్సు నుంచి పాదం దాకా అనలే పాదం నుంచి శిరస్సు దాకా అంటే కింద నుంచి పైదాకా అనం కింద నుంచి ఇందాక చెప్పినట్లుగా అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పాద నమస్కారం ఒక గురువుకి నమస్కరించేటువంటి విధానం కూడా చెప్పబడింది అది భరతుడు పాటించాడు ఎట్లా అంటే అడుగున అగస్త్య రేఖలు ఉంటే మన అరచేతులు అరికాళ్ళ కిందకి ఎలా వెళతాయి అని అందుకనే గురువు కానీ అవతార పురుషుడు యొక్క బొటనవేళ్ళ కింద మన చేతులు పెట్టాలి పెట్టినట్లయితే కర్మ రేఖలన్నీ కూడా పుణ్య రేఖలుగా మారి పునరావృత్తి రహితమైనటువంటి ఒక జీవితం ఒక అదృష్టం ఒక యోగం కలుగుతుంది గనుక రాముడు తాను ఎంచుకున్నటువంటి శంఖమే భరతుడు గనుక భరతుడు రాముడి యొక్క గుండె లయ గుండె యొక్క ప్రతిధ్వని అది రాముడు బింబం అయితే భరతుడు ప్రతిబింబం రాముడు తాను ధరించిన శంఖం తన శబ్దం అయినట్లయితే శబ్దానికి ఒక సాకార స్వరూపమే భరతుడు ఆయన ధర్మ ప్రతినిధికనుకనే పాదుకా పూజ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే భరతుడి నుంచి. పరమాత్మ యందు అచంచల విశ్వాసంతో పాటు అమిత భక్తి ఉండాలి. విశ్వాసం ఒక్కటే కాదు స్వామి చెప్తారే, భక్తి ఒక్కటే చాలదు బంగారు. భక్తితో పాటు వినయం ఉండాలి, వినయంతో పాటు సమర్పణ ఉండాలి, సమర్పణతో పాటు శరణాగతి ఉండాలి, శరణాగతితో పాటు అస్తిత్వ-వ్యక్తిత్వ వినాశనం జరగాలి. అంటే నేను అన్నటువంటి అహంకారం గనుక తొలగిపోతే నేను అన్నటువంటి అహం వెలుగుతుంది అని. అహం వెలగటం అంటే ఆత్మ వెలగటం. వెలుగులో మనం వెలిగిపోవటం కాబట్టి శ్రీరామ భరతులిద్దరూ కూడా రెండుగా కనిపిస్తున్నటువంటి అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ కథ కోసం, కథని దాటగలిగినట్లయితే, అంతరార్థంలోకి వెళ్ళినట్లయితే శబ్ద నిశబ్దాలు ఏకమైనట్లు పరిపూర్ణమైనటువంటి రెండు హృదయాలు రెండుగా-- ఒకటే ఒక హృదయం రెండుగా చీలి ప్రపంచానికి ధర్మబోధ, భగవద్భక్త సంయోగము, దాని విశిష్టత స్పష్టంగా చెప్పటానికి అలాగే ఒక కుటుంబ వ్యవస్థలో జ్యేష్ఠుడైనటువంటి అంటే పెద్దవాడైనటువంటి అన్నగారికి తండ్రి అంతటి స్థాయిని ఇవ్వమని చెప్పినటువంటి వాడు భరతుడు. చెప్పిన వాడే కాదు అట్లాగే తాను ఆచరించాడు పధ్నాలుగు ఏళ్ళు. సింహాసనం మీద కూర్చోటానికి అన్ని అవకాశాలు ఉన్నా, అన్ని అర్హతలు ఉన్నా, "నా రాముడు ఉండగా అసలు నాకివి అక్కర్లేదు" అన్నాడాయన. ఇది ఈనాటి రాజులు, ఈనాడు రాజ్యమేలేవారు కూడా భరతుడు ఆదర్శప్రాయమైనటువంటి మహావ్యక్తి. అంతేకాదు ఒక దివ్యమైనటువంటి శక్తి, పరమాత్మ స్వరూపం. కనుకనే వాలి సుగ్రీవులలో చూడండి యుద్ధం జరిగింది. వాలి నశించాడు సుగ్రీవుడు ఒక్కడే మిగిలాడు. లంక నశించింది, రావణుడు నశించాడు. లంకానగర పునర్నిర్మాణం జరిగింది, విభీషణుడు ఏలుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరిలో ఒక్కడే మిగిలాడు. ధర్మాన్ని ఆచరించినవాడు, ధర్మస్వరూపుడైనటువంటి రాముడితో కూడి ఉన్నవారు మిగిలారు. ఇక్కడ రాముడితో కూడని భరతుడు రాముడు రాజ్యమేలనంత కాలం పక్కనే ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కూడా రామరాజ్యాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని అరవై నాలుగవ రాజు శ్రీరామచంద్ర ప్రభువు. కానీ అరవై ఐదవ వాడు కుషుడే అయినాడు తప్ప రాముడు తర్వాత భరతుడు, భరతుడు తర్వాత లక్ష్మణుడు అన్నదమ్ముల కలహాలు లేవు. ఏం నేర్పుతున్నాడయ్యా భరతుడు అంటే ఇంట్లో ఉన్న పెద్దన్నని తండ్రి వలె గౌరవించండి. ఆయన ఆజ్ఞను పాటించండి. ఆయన పరమాత్మ అన్న భావనతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. అట్లాగే ఆయన అప్పజెప్పినటువంటి కార్యాన్ని, కర్తవ్యాన్ని ఆయనకు సంతోషం కలిగించే రీతిలో, ఆయనకు ఆనందం కలిగించే రీతిలో దాన్ని చక్కగా నిర్వర్తించండి. పరమేశ్వర స్వరూపమైనటువంటి అన్న ఆజ్ఞను పాటించటం కంటే ఉత్తమోత్తమ విద్యుక్త ధర్మం లేదని చెప్తున్నాడు భరతుడు. భగవంతుని యందు విశ్వాసం, భగవంతుని యందు అనేక లక్ష్యాలు, ఇవన్నీ ఉన్న కారణంగా భరతుడు ఆదర్శప్రాయుడైనాడు. భరతుడు అంటే భగవద్భక్తుడే. ఆయన మౌనిగా ఉన్నాడు, ముని వేషంలో ఉన్నాడు. పధ్నాలుగు ఏళ్ళు కాషాయం కట్టుకున్నాడు. పధ్నాలుగు ఏళ్ళు నారచీరలు ధరించాడు. మళ్ళీ రాముడు వచ్చేదాకా రాముడికి ఆయన ఆస్తిని, రాజ్యాన్ని, ప్రజలని పూర్ణమైనటువంటి క్షేమంతో అప్పజెప్పే దాకా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఇది శ్రీరామ భరత సమన్వయంలో మనం నెరవేర్చవలసింది. ఇక రాముడు ఎటువంటి వాడు? ఆయనకు తెలుసు. ఎందుకంటే సర్వాంతర్యామి గనుక, నిజానికి అంతర్యామి గనుక. ఇదిగో భరతుడున్నాడే రాజ్యం ఏలటానికి వచ్చాడు గనుక పాదుకలను అనుగ్రహించాడు. పాదుకలను రాజ ప్రతినిధిగా పెట్టుకున్నాడు భరతుడు. అలాగే ప్రజలు కూడా పధ్నాలుగు సంవత్సరాలు భరతుడిని చూడలే. అందువల్లనే భరతుడెవడో రాముడెవడో తెలుసుకోలేకపోయినారు చివరి నిమిషంలో. కానీ ఇద్దరూ కూడా భ్రమర కీటక న్యాయంలో భరతుడు రాముడైనాడు. రాముడు ఎప్పుడూ రాముడే. ఆయన నిత్య కళ్యాణమూర్తి, స్ఫూర్తి ప్రదాత. భరతుడి నుంచి మనం నేర్వవలసిన అనేకమైనటువంటి విషయాలలో వినయం, సమర్పణ, శరణాగతి ఇవన్నీ ఉత్తమోత్తమమైనటువంటి భావాలు. భావాలన్నింటినీ కూడా మనం పుణికిపుచ్చుకొని మన అన్నని కూడా మనం గౌరవించినట్లయితే అప్పుడు మన స్వామికి వీడు రామాయణం చదివినందుకు, నా సద్భక్తుడైనందుకు, నిజంగా భక్తుడిగా జీవించాడు అని స్వామికి ఆనందము, సంతోషము కలిగించినవారమవుతాం. అలాగే ఆదర్శప్రాయమైన భరతుడి వేళ మన ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో స్వామి పాదుకలున్నాయి. మళ్ళీ స్వామి పాదుకలు వేరు, స్వామి ఫోటో వేరు, స్వామి వేరు అనుకోకూడదు. స్వామి యొక్క దివ్య పాదాలు మన వాకిట్లో, మన ఇంట్లో ఉన్నాయి. ఆయన అన్నివేళలా మన దగ్గరే ఉన్నారని ధర్మ కర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని భరతుడి వలె శ్రీరామచంద్ర కార్యక్రమంలో దీన్ని పరిపూర్ణం చేసుకోవాలి, మహత్తరం చేసుకోవాలి. అటువంటి యోగాన్ని స్వామి మనకు అన్నివేళలా అనుగ్రహ వరదానం చేస్తారు. సాయిరాం. [భాగం] ఇప్పటివరకు భరతుడి భ్రాతృ ప్రేమ అనే అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు కుమారి సాయి అరుణ గారి ఇంటర్వ్యూ విందాం. [భాగం] ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్య సాయి సేవా సంస్థల మహిళా యూత్ కోఆర్డినేటర్ కుమారి కె. సాయి అరుణ గారిని విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియో స్వాగతం పలుకుతోంది. వారు సంస్థ పరంగా స్వామితో వారికున్న అనుభవాలను, స్వామివారి ఎనభై ఐదవ జన్మదిన సందర్భంగా జరగబోయే సేవా కార్యక్రమాల గురించి మనతో సంభాషించబోతున్నారు. సాయిరాం అరుణ గారు. సాయిరామండి. మీరు అనంతపురం లో శ్రీ సత్య సాయి మహిళా కళాశాలలో చదువుకున్నారు కదమ్మా. విద్యార్థినిగా మీ అనుభవాలు మాకు కొంచెం తెలుపుతారా? తప్పకుండా. ముందుగా నేను అనంతపురం కాలేజీలోఇంటర్మీడియట్ నుండి B.Ed వరకు చదివాను. అదొక దేవాలయం. ఎప్పుడైనా గానీ college లో గానీ మనం వింటూ ఉంటాం. ముందు రోజు మొదటి రోజు college కి వెళ్ళాలంటే ఎంతో భయపడుతూ ఉంటారు. seniors ఏమంటారో, ఎవరేమి tease చేస్తారో, ragging ఉంటదేమో అని అనుకుంటాం. అసలు మనం అనంతపురం college లో hostel లోకి వెళ్తుంటే ఎదురొచ్చి మన seniors, ఉమ్ ఎంతో ప్రేమగా వాళ్ళు మన rooms కి తీసుకువెళ్లడం, దగ్గరుండి ప్రతి విషయాన్ని వివరించడం. అసలు మనం అడుగు పెట్టాము అని అంటేనే freshers స్వామి ప్రసాదంగా భావిస్తారు. అబ్బా! అది నాకు కనబడుతూ ఉంటుంది. అహర్నిశలు శ్రమిస్తారు. పిల్లలందరూ స్వామి కోసం వచ్చారు. వాళ్ళు ఒకటే అనేవాళ్ళు మాతో, "మీరు మా కోసం రాలేదు. పాఠ్య చదువులు మీ ఇళ్ళల్లో ఉండే మీకు రావా? కాదు, మీరందరూ కూడా స్వామి పట్ల భక్తి విశ్వాసాలతో వచ్చారు. స్వామికి అయితే గనక శ్వాసమైతే మీరు వచ్చారో స్వామి ఆశయాలకు అనుగుణంగా మేము తీర్చిదిద్దుతాము." అని చెప్పి చెప్పేవాళ్ళు. అట్లాగే youth age, correct age లో మనం hostel కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణతో వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతారు. విధంగా అయితే గనక ఒక తోటమాలి ఒక మొక్కను నాటి దాన్ని దాని పోషణ కోసం నీళ్ళు పోస్తూ, ఎరువు వేస్తూ, ఎప్పటికప్పుడు పురుగులు పట్టకుండా దాన్ని జాగ్రత్త చేస్తూ ఉంటాడో, అదే రకంగా ప్రతి విద్యార్థిని కూడా అక్కడ ఉన్న teachers అందరూ కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలా అని తలమునకలై ఉంటారన్నమాట. అంత మంచి staff అక్కడ ఉంటారు. అందుకే స్వామి అంటారు, "ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ confidence ఉండాలి." అంటారు. మనందరికీ confidence ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి నుంచి వచ్చింది. నాకు స్వామి ఉన్నాడు. స్వామి అంటారు, "స్వామి ఉన్నాడంటే సరిపోదు. స్వామి ఆశయాలకు తగినట్టుగా మీరు మీ జీవితాలని అన్వయించుకుంటూ అలాంటి ఆచరించుకుంటూ వెళితే స్వామి మనకి ఎప్పుడూ అండగా ఉంటాడు." పొద్దున్నే లేస్తారు. మన పనులు మనమే చేసుకోవడం, ఇతరుల మీద ఆధారపడకుండా. అట్లాగే చదువు కూడా ఎంతో ఆసక్తిగా చెప్పడం, అలాగే విలువల్ని జోడించి చెప్పడం అక్కడ. అది చాలా మంచిది. రోజుల్లో మనం చూస్తూ ఉంటాం విలువలు లేవు, మానవతా విలువలు లేవు. అవన్నీ కూడా మనం పిల్లలకు బోధించాలి అని. ఎలాగైతే గనక అత్తి పండును ఒలిచి తల్లి పిల్లకు తినిపిస్తుందో అదే రకంగా విలువలన్నీ కూడా inculcate చేస్తారన్నమాట. అక్కడ foundation పడుతుంది. ప్రతి విద్యార్థిని జీవితంలో వాళ్ళెంటో character building కి ఎక్కువ importance ఇస్తారు. ఇస్తూ మన పనులు చేసుకోవడం, అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా స్వంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కట్టుబాట్లకి లొంగి ఉండడం, అలాగే discipline కి అలవాటు పడటం, దాని ద్వారా physical గానూ mental గానూ- అమ్మ చాలా బాగుందమ్మ ఇదంతా వింటుంటేను. తర్వాత మీరు ఈనాటి యువతకి మీరిచ్చే సూచనలు ఏమి? ఈనాటి యువత సత్యసాయి సంస్థకి విధంగా ఉపయోగించుకోగలదు? అన్నది మీరు కొంచెం వివరించి చెప్పగలరా? ఇప్పుడు మనం college గురించి అనుకుందాం. college age చాలా precious age అనమాట. ఏదైనా సరే ఒక life లో పైకి వెళ్లాలన్నా, మంచి మార్గంలో ముందుకు వెళ్లాలన్నా age ని గనక మనం జాగ్రత్తగా ఒక నిర్దేశించిన రీతిగా మనం మలుచుకున్నట్లయితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటే గనక మీరు వెంటనే అడగొచ్చు, "కోట్లు వచ్చేస్తాయా? నేను పెద్ద buildings లు కడతాన?" అని. స్వామి అన్నారు, "తృప్తికి మించిన ఆనందం". అది తప్పకుండా కలుగుతుంది. ఏదైతే గనక ఏది-ఏది సంపాదిస్తే మనం ఆనందంగా ఉంటామో ఆనందం, peace of mind దొరుకుతుంది. అట్లాగే స్వామి ఏం చేస్తారంటే, ఎప్పుడైతే గనక ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో అన్నింటినీ ఉద్దేశించి స్వామి, "youth ని మన సమాజ సేవలో పాల్గొనేట్టుగా చూడండి. వాళ్ళ శక్తి సామర్థ్యాలని సమాజానికి ఉపయోగపడేట్టుగా చూడండి." అన్నప్పటి నుంచి గత నాలుగైదు సంవత్సరాలుగా, అంటే నేను Krishna district మహిళా youth coordinator కింద ఉన్నప్పుడు మా మహిళా incharge గారి ఆధ్వర్యంలో, వారి యొక్క guidance లో, ఆహ్ మనకు వచ్చిన రీతిగా గ్రామ సేవలు, local గా సేవలు చేసుకుని స్వామి యొక్క అనుగ్రహం కోసం స్వామికి మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అంత మంచి సేవలు చేసుకునే అవకాశం ఇచ్చారుగా స్వామి అని స్వామికి ప్రణామాలు తెలుపుకోవడానికి వెళ్ళినప్పుడు స్వామి అద్భుతమైన రీతిలో రెండు-మూడు సార్లు చక్కగా ఒక చక్కగా ఒకచోట కూర్చోబెట్టి కృష్ణుడి విగ్రహం ఉంటుంది మహిళల వైపు, ఇచ్చి స్వామి interview ఇవ్వడం, అంటే public interview, open interview అనమాట. నలభై అయిదు నిమిషాలు మాట్లాడటం, పాద నమస్కారాలు ఇవ్వడం. చూసినప్పుడు అనిపించింది. అప్పుడు మా incharge అన్నారు, "ఈ అమ్మాయి మా youth coordinator స్వామి" అని. స్వామి ఒకే ఒక్క మాట అన్నారు ఆరోజు, నాకిప్పటికీ బాగా గుర్తు. "youth అంటే సరిపోదు. youth కి బాగా పని పెట్టాలి." అని అన్నారు. మనం అనుకుంటాం, empty mind is a devil's workshop. అట్లాగా స్వామికి తెలుసు అనమాట. మనం ఖాళీగా ఉండే youth కి ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళకి మంచి services, మంచి సేవల పట్ల అవగాహన కల్పించినట్లయితే వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోగలుగుతారు. సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. స్వామి వారు ఇచ్చే guidelines follow అయ్యి youth అంతా కూడా- అవును ఆహ్ మంచి, వాళ్ళ ఖాళీ time అనే సమయాన్ని పూర్తిగా సేవలో ఉపయోగించుకున్నట్లయితే గనుక చాలా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. ఎట్లాగనండీ? మనం చూస్తూ ఉంటాం. interview లో స్వామి అదే మాటలు చెప్పారు.మనందరం కూడా స్వామి ఇట్లాగ ఆయన కులవంత హాల్లో ఉన్న బల్బ్స్ చూపించారు. స్వామికి మనందరం ఒక చిన్న పిల్లల పసిపిల్లలకి ఎలా అయితే గనక ప్రతిదీ దగ్గరుండి చేస్తామో అట్లా నేర్పించారు మన ఇలా కులవంత హాల్లో ఉన్న బల్బ్స్ అన్ని చూపించి "బల్బులు వేరు, లోపల ప్రవేశించే కరెంటు ఒక్కటే. అట్లాగే మీరందరూ కూడా, అందరూ చూట్టానికి వేరువేరు రూపాల్లో ఉన్నారు. మీ అందరిలోనూ ప్రవహించే ఒకే ఆత్మతత్వం ఒక్కటే" అని చెప్తూ స్వామి అన్నారు. "మీరు ఎటువండి తరతమ భేదాలు లేకుండా అక్కాచెల్లెళ్ళా ఉండాలి. మీకెప్పుడైనా ఎవరి మీదైనా కోపం వచ్చింది అనుకో, మీరే ఎదురు వెళ్లి 'హాయ్ సిస్టర్' అని పలకరించండి. వాళ్లే మారిపోతారు" అన్నారు. సో స్వామి ఏంటండీ యువతకి ఏది చేస్తే కోపం వస్తుంది, ఏది చేస్తే కోపం పోతుంది? అన్నప్పుడు స్వామి అన్నారు "బాగా యువతకు పని పెట్టాలి" అని. దానికోసమే ఇప్పుడు గత మూడు, నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్, సేవా దళ్ మహిళా కోఆర్డినేటర్ అయిన వసుమతమ్మ గారితో కలిసి అలాగే పెద్దల మన సంస్థ యొక్క పెద్దల అనుమతితోటి ప్రతి జిల్లాలోనూ యూత్ ను encourage చేయడానికి కొందరిని మనం train up చేసుకుని అక్కడికి వెళ్లి వాళ్ళని encourage చేద్దాము. అంటే encouragement అంటే ఏమంటానంటే, సేవా కార్యక్రమాలు ఉన్నాయి. సేవ చేస్తే మనలో ఇంత మంచి మార్పు వస్తుంది. మన జీవితాలు బాగుంటాయి అనే సందేశాల్ని ఇచ్చినప్పుడు, స్వామి చెప్పిన సందేశాల్ని వాళ్ళ హృదయానికి హత్తుకునేలాగా చెప్పినప్పుడు, అసలు మన organization లో వేల సంఖ్యలో ఇప్పుడు యూత్ ఉన్నారు. అసలు స్వామి దగ్గర సేవ ఉంది అనంటే పరిగెత్తుకుంటూ సేవ అందిపుచ్చుకునే యూత్ మనకు తయారయింది. అంటే యూత్ కి ఏదైనా specific గా సేవ ఏదైనా కేటాయించడం జరిగిందా అమ్మ? కేటాయించడం అంటే ఇప్పుడు మనకి ఆడపిల్లలున్నారు. ఆడపిల్లలు యూత్ కి కొంతమంది చదువుకుంటూ ఉంటారు. అందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆ-నీడలో వాళ్ళ యొక్క fold లో ఉంటూ బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటాం అంటే మన organization ఒక మంచి platform. ఎందుకనంటే మన organization లో మనం చేసే సేవా కార్యక్రమాలన్నీ పెద్దల యొక్క అండదండలతోటి, సహాయ సహకారంతోటి వాళ్ళతో పాటు ఉంటారు. అందుకే మనకి ఎటువంటి భయం లేకుండా యూత్ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. మరి వీళ్ళకంటూ separate గా మనం, మనం ఎటువంటి సేవా కార్యక్రమాల్ని నిర్దేశించడానికి కుదరదు. ఎందుకనంటే వాళ్ళు independent కాదు. ఆడపిల్లల్ని ఒక group గా మనం ఎక్కడికి పంపించలేం. మనం ఏమంటామండి already మనకి state నుంచి గాని మన country నుంచి మన state అలాగే మన all India president దగ్గర నుంచి గాని కొన్ని సేవా కార్యక్రమాల direction వస్తది. కొన్ని guidelines ఇస్తారు. guidelines ని base చేసుకుని మన పిల్లలకి, మన సమితిలకి కార్యక్రమాల్ని ఎలా చేయొచ్చో మహిళా సేవాదళ్ సభ్యులతోటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే మన యూత్ చేయాల్సింది. ఇంకా బాగుంటుందని మన పెద్దల యొక్క సూచనతో ఏం చేశామంటే మన స్వామి దగ్గరికి 85వ జన్మదినోత్సవం అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కూడా మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ఒక plan ప్రకారం భగవాన్ బాబా వారి దర్శన భాగ్యం కోసం, భగవాన్ యొక్క అనుగ్రహం కోసం ఒక plan ప్రకారంగా వస్తున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ నాకిప్పుడే ఒక స్వామి చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. ఇలా group గా మేము స్వామి వారి దర్శనం కోసం, అనుగ్రహం కోసం వెళ్ళినప్పుడు స్వామితో "స్వామి గ్రామ సేవలు చేసుకొని వచ్చాము స్వామి" అని అన్నప్పుడు స్వామి ఒకటే మాట అన్నారు. "అందరూ చేయలేదు కదా" అని అన్నారు. అప్పుడు మాకు స్ఫురణకు వచ్చింది. లేదు స్వామికి ఎంత సేవ చేస్తే స్వామికి అంత ఆనందం. అందుకే అనుకున్నామా మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళిక, ఒక plan తయారు చేసుకుని మన రాష్ట్రంలో ఉన్న ఇరవై మూడు జిల్లాల యూత్ coordinators కి ఒక plan పంపించినట్లయితే వాళ్ళు ప్రతి వారం ఏదో ఒక సేవా కార్యక్రమంలో వాళ్ళకి తోచిన విధంగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోటి plan ప్రచురించడం జరిగింది. అందులో మూడు విభాగాలు మనందరికీ తెలుసు. మన సంస్థల్లో ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, సేవా విభాగం. మూడు విభాగాల యొక్క కలయికే మన సత్యసాయి organization. అందుకే మనం ఏం చేశామండి మనం plan లో కొన్ని ఆధ్యాత్మిక విభాగానికి సంబంధించిన కార్యక్రమాలు, అలాగే కొన్ని విద్యా విభాగానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు, అలాగే exclusive గా సేవల గురించి కొన్ని సేవా కార్యక్రమాలు యూత్ కి interest కలిగేట్టుగా, వాళ్ళకి encouragement గానూ అలాగే ఒక guideline గా కొన్ని guidance తోటి వాళ్ళకి కొన్ని సేవలు పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళు అది చూసుకుని వాళ్ళకి అది చేతనైతే, ఇష్టమైతే సేవ చేయొచ్చు. అదే సేవా కార్యక్రమాన్ని modify చేసి ఇంకా బాగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనమంటామా మనం ఏం చేశామంటే ఒక general instruction ఇచ్చాం. ఒక general గా ఒక సూచన. మీరు కొన్ని training లు, tailoring, కుట్లు, అల్లికలు అలా నేర్పించి అలాగే తోటి మహిళలకి, తోటి మహిళా యూత్ కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ఉపాధి నిమిత్తం కొన్ని శిక్షణలు ఇవ్వండి అన్నాం. దాన్ని తీసుకుని ఎన్నో జిల్లాల వాళ్ళు, వాళ్ళు అనుకున్నారు రోజున కుట్లు, అల్లికలే కాదు technology స్వామి అంటారు technology అంటారు స్వామి. అట్లాంటి technology మనకెంతో అవసరం. అందుకే ఏం చేశారంటే కొంచెం స్థాయిని పెంచుకుని వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళెంచో computer శిక్షణ తరగతులు ఉచితంగా మన సత్యసాయి organization లో యువత చేయబడి గాని ఎవరికి చేయబడినా అంతా ఉచితం, ఉచితం, ఉచితం.ఈ సేవా కార్యక్రమాల్లో అంటే training ఇవ్వడం కూడా ఒక సేవే. దాని వల్ల ఏమవుతుందంటే, సేవ ద్వారా మనం శిక్షణను పొందాము అని లబ్ధిదారులు ఆలోచిస్తారు. అదే సేవాభావాన్ని వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్వస్థలాల నుంచి ఇంకొక పది మందికి సేవా భావంతో సేవలు చేస్తారన్నమాట. అట్లాగే మనం ఒక ప్రణాళిక అందించాము. అలాగే ప్రణాళికకి ఎంతో స్పందన లభించింది. ప్రతి జిల్లా వాళ్ళు ఎంతో బాగుంది, ఇలాంటి ప్రణాళికాబద్ధంగా మన స్వామి యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంది అని అనుకుంటున్నారన్నమాట. ఇది మనం youth కోసం especially దాన్ని design చేశామన్నమాట. అమ్మ మీరు youth coordinator గా ఎన్నో కార్యక్రమాలు పాల్గొని ఎంతో మంది యువతకి ఉపన్యసించి ఉంటారు. వారి స్పందన విధంగా ఉందో మీరు కొంచెం వివరించగలరా? ఆ, తప్పకుండా. దీనికి అసలు ముందుగా నేను స్వామి వారి స్పందన ఏంటో చెప్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇట్లాగే group గా మనం స్వామి కృష్ణా జిల్లా తరఫున అంటే నేను ఊరు నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. రోజున మేము group గా స్వామి వారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్వామి అపార కృపతోటి ఇట్లాగే మనం అందరం చూస్తూ ఉంటాం. దేనికోసం అయితే మనం తపస్సు అయి పడుతూ ఉంటామో, అహర్నిశలు కలగంటూ ఉంటామో, ఏదైతే మనం ఎప్పటికప్పుడు అది మళ్లీ మళ్లీ దొరకాలనుకుంటామో అదే వారి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం అంతా పొందిన తర్వాత స్వామి ఇంకా ఆడపిల్లల మనసు తెలుసేమో స్వామికి బాగా, అప్పుడేం చేశారంటే స్వామి చైర్లు ఇప్పించారు. చైర్లు ఇచ్చిన తర్వాత అందరం ఏం చేశామో చక్కగా చైర్లు కట్టుకుని స్వామివారికి కనబడేలాగా స్వామికి ఇష్టం కదా వారు ఇచ్చిన ప్రసాదాన్ని మేము ఎంతో ఆనందంతో స్వీకరించామని స్వామి వచ్చిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నారు, ఎంతో మృదువుగా "బాగున్నాయా?" అని అన్నారు. అసలు మా ఆనందానికి అవధులు లేకపోయింది. స్వామి నడుము "స్వామి చాలా బాగున్నాయి thank you స్వామి" అనంటే స్వామి అన్నారు "I am not third person, I am not third person, don't say thanks" అని అన్నారు. అప్పుడనిపించింది స్వామి మన వాడు, మనం స్వామి వాళ్ళం, మనందరం కూడా స్వామి బిడ్డలమే అని అన్నప్పుడు "స్వామి వెళ్ళొస్తాం స్వామి బయలుదేరుతున్నాం" అని కన్నీళ్లతోటి ఆనందంతోటి వీళ్లందరూ చెబుతుంటే స్వామి ఒక మాట అన్నారు. "ఆ, మీ ఊళ్లకు వెళ్ళండి, పెళ్లిళ్లు చేసుకోండి, మీ భర్తలను కూడా సేవకు తీసుకురండి" అని అన్నారు. అప్పుడనిపించింది సేవకి స్వామి ఎంత పెద్ద పీట వేశారు. అప్పుడు అప్పటి నుంచి ఎప్పుడు చూసినా మా ఆలోచనలు అంటే స్వామి అనుగ్రహం ద్వారానే ఇప్పుడు మేము మాట్లాడుతున్న mic లో నుంచి మాట్లాడుతున్న మాకనిపిస్తుంది స్వామి పలికిస్తున్నారు. అంతే కదా mic ఉంది current లేకపోతే ఉపయోగం ఏంటి? గొంతు ఉంది మాటలు రాకపోతే ఉపయోగం ఏంటి? అదే అనుకుంటాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఆయన పలికిస్తున్నారు. ఆయన అలా పలికిస్తుంటే మేము మాట్లాడగలుగుతున్నాం. అది ఆయన అనుగ్రహం. మరి అటువంటప్పుడు మీరన్నారు, ఇట్లాగా మీరు visit చేస్తున్నప్పుడు ప్రతి జిల్లా యువత స్పందన ఏంటి? స్పందన ఆయనకి ప్రసాదంగా, ఆయనకి నైవేద్యంగా పెడుతున్నాను. రోజున గాని గత రెండు మూడు నెలలుగా గాని అసలు గత రెండు మూడు సంవత్సరాలుగా కానీ అసలు ప్రతి జిల్లాకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారా మనకు అనిపించిందన్నమాట, అరె చాలా ఆలస్యం చేశామే మనం, ఇన్నాళ్ళు మనం ఎందుకు ఊరుకున్నాం యువతని రకంగా motivate చేయాలని అననుకుంటాం. మనం చేయవలసిందల్లా స్వామి ఇచ్చిన అవకాశాన్ని మనం స్వామి పలికిన పలుకులని అర్థం చేసుకోవడం. స్వామి యొక్క పలుకు పలుకుగారంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. మనకేమన్నారో అది తెలియడానికి ఎన్నో యుగాలు పట్టవచ్చు. కానీ మనకు తెలుసుకున్న విషయాన్ని మనకు ఇష్టమైన విషయాన్ని వెంటనే చేయాలి. అసలు మనం జిల్లాలకు వెళ్తున్నప్పుడు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారంటే "ఇవ్వండి, చేస్తాము we are ready ready ready" అని ఉన్నారన్నమాట. స్వామి అన్నారు, "దేనికన్నా ready, రేపు యమదేవుడు వస్తాడు ready అంటాడా? లేదు." కానీ స్వామి యొక్క యువత, యువతులు ఎంత ready గా ఉన్నారంటే స్వామి ఎనభై ఏడో జన్మదినోత్సవం వస్తుంది, స్వామిని ఎలా ఆనందపరచాలి, తోటి మానవులకు ఎలా సేవ చేయాలి, ఎలా తరించాలి. ఎనభై ఏడో జన్మదినోత్సవానికి ప్రపంచమంతా స్వామి దగ్గరికి వచ్చేస్తోంది. రోజుల్లో మనకు ఎలాంటి సేవ ఇస్తారు, మనం ఎలా చేయాలి, వచ్చిన భక్తుల్ని ఎలా ఆనందపరచాలి, వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా ఎంత ఔసా-ఔత్సాహికులైన యువతీ యువకులంటారే అట్లాంటి వాళ్ళు మన సమితిలో ఉన్నారు. వాళ్ళందరూ అసలు స్థానికంగా గాని ఎన్నో సేవలు చేసుకుంటున్నారు. వాళ్ళు తద్వారా నేనేమననంటే సేవ చేయడం ఎవరైనా చేస్తారు కానీ స్వామి అన్నట్లు సేవ చేస్తూ అందులో ఉన్న మాధుర్యాన్ని తద్వారా లభించే ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా youth లోకి వస్తాము youth లోకి వస్తాం కొత్త వాళ్ళని తీసుకొస్తాము ఇంకా సేవలు చేస్తాము అని ముందుకు వస్తున్నారు. మహిళా youth coordinator గా మీ అనుభవాలు అలాగే యువతకి స్వామి ఇచ్చిన సూచనలు, స్వామి వారి సంస్థ విధంగా యువత ఉపయోగించుకోవాలన్న విషయాలు మీరు చాలా చక్కగా విడమరచి చెప్పారమ్మా. స్వామి వారి ఎనభై ఏడవ జన్మదిన వేడుకలకి ప్రపంచమంతా వైభవంగా, ఉత్సాహంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అనేక సేవా కార్యక్రమాలు ఆయా ప్రదేశాల్లో తలపెట్టారు. ఉమ్ రాష్ట్ర మహిళా youth coordinator గా మీరు మాకు విషయాలు తెలుపుతారా? స్వామి mission ని మనం ముందుకు తీసుకెళ్లాలి. స్వామి అన్నారు, "students are my property". మనమేమనుకున్నామండి? మన సత్యసాయి మహిళా కళాశాల పూర్వ విద్యార్థులందరూ కూడా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొని స్వామి ఆదేశాల్ని, ఆశయం కోసం స్వామి మనకోసంఅహర్నిశలు శ్రమిస్తూ ఆయన భూమి పైన మనలాగ ఒక మానవుడిగా మన మధ్య ఉంటూ మనతో సంభాషిస్తూ మనతో మనల్ని ఆనందింప చేస్తూ ఉన్నారో ఆనందాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి స్వామి చెప్పినట్లుగా సాయి బాటలో మనం పయనించాలి మరి ఎనభైఏడవ జన్మదిన ఉత్సవానికి అందరం కూడా సన్నద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము అట్లాగే మనందరం already ఇప్పుడు నేను ఒకటే మాట అంటున్నా youth అందరూ కూడా వాళ్ళు college ల్లోనూ అట్లాగే ఉద్యోగులనైనా youth members వీళ్ళందరూ కూడా వాళ్ళ leaves ని వాళ్ళ leaves ని అన్నీ కూడా save చేసుకుని పెట్టుకున్నారు ఎప్పుడు పిలుపు వస్తుందా పుట్టపర్తి నుండి స్వామి ఎప్పుడు అవకాశం ఇస్తారా లాజ అసలు ఎప్పుడు చెప్తారా ఆదేశం ఎప్పుడు వస్తుందా అని ready గా ఉన్నారు రావాలి ఒక్క మాట వేల సంఖ్యలో పుట్టపర్తి వస్తారు ఎందుకు వస్తున్నారు అనంటే భక్తులందరినీ సేవించడం కోసం భక్తుడు అంటాడు ఇప్పుడు నిజమైన భక్తుడు ఏమంటాడు నిజమైన సేవకుడు ఏమంటాడు నీ దాసానుదాసుడిని కావాలయ అంటాడు స్వామిని దర్శించుకుండడానికి స్వామి దర్శనం తోడి మన జన్మ దరిస్తుంది అడవాణ్ణి దరించడానికి వచ్చే భక్తుల్ని సేవించడానికి అసలు యువత అంతా సిద్ధంగా ఉన్నారు స్వామి దగ్గర నుంచి ఒక్క పలుకు చాలు ఉహు బాగుందమ్మా యువత ఇంటి-ఇంటి పరంగానూ బయట వివిధ పాత్రలు పోషిస్తూ స్వామి వారి సేవకి సమయాన్ని కేటాయించుకోవడానికి మీరేమైనా మార్గాలు సూచిస్తారా? తప్పకుండా అసలు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మనందరం చూస్తూ ఉంటాం అసలు రోజుల్లో విద్యార్థులు అంటే youth అనంటే గనక నేనేం అంటానంటే మన సత్యసాయి organization లో కొంచెం వెసులుబాటు కోసం ఒక common understanding కోసం ఇరవై సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులందరినీ కూడా youth విభాగం అని అంటారు అసలు నిజంగా ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా మన పిల్లలు అందరూ కూడా career అని అట్లాగే ఉద్యోగ అన్వేషణలో అని మంచి చదువుల్లో రాణించాలని వాళ్ళు తాపత్రయంగా ఉంటూ ఉంటారు ఉంటున్నప్పుడు మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు చక్కగా పాల్గొని అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకటే common complaint మీకు తెలుసు ఏముంటుంది మీరే చూసి ఉంటారు no time అంటారు వాళ్ళందరికీ నేనొక ప్రశ్న వాళ్ళ friend పెళ్ళో ఇంట్లో function లేదే వాళ్ళ సొంత వాళ్ళకి ఏదో అవసరం వచ్చో మరి వాళ్ళకి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి సమయం దొరుకుతుంది మరి సేవా కార్యక్రమాలకి దొరుకుతుందా లేదా అన్నది వాళ్ళు యోచన చేసుకోవాలి చిన్నపిల్లలు youth పిల్లలు వాళ్ళు మనసు చంచలంగా ఉంటుంటుంది నేనేమంటానండి మన సంస్థలోని పెద్దలందరూ కూడా వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకి సేవ ద్వారా ఏదైతే పార్టీల వలన ఆనందం లభిస్తుందో దాని కంటే కొన్ని లక్షల రెట్లు సేవ ద్వారా లభిస్తుంది అనే దాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా చూపించినట్లయితే వాళ్ళు తప్పకుండా మన కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి సమయాన్ని కేటాయించుకుంటారు నిజం చెప్పాలంటే స్వామి mission స్వామి అనుగ్రహం స్వామి దయ ఎంత spread అయిపోయిందంటే అసలు మధ్య కల్లా కొన్నాళ్ళ క్రితం వరకు నిజంగానే ఇలాంటి సమాధానాలు విన్నాము time లేదు అని ఇప్పుడు ఎక్కడ చూసినా మేము వస్తాం మేము వస్తాం సేవా కార్యక్రమానికి అంటాం నేను ఇంకో విషయం అంటాను ఇప్పుడు నా చేతికి ఒక ఉంగరం ఉంది ఉంగరం ఇక్కడ నేను road మీద నడుతున్నప్పుడు పక్కన కుప్ప మీద పడింది అరే కుప్ప మీద పడింది కదా అని చెప్పి నేను ఉంగరాన్ని తీసుకోవడం మానేస్తానా? మానను కదా ఎందుకంటే దానికున్న విలువ కుప్ప మీద ఉన్నా ఒకటే నా చేతికున్నా ఒకటే విలువ విలువే అందుకే నేను youth కి ఏమంటానంటే మీరు భజనలకు రాకపోయినా సేవా కార్యక్రమాలు లేకపోయినా మీరు మీకు సమయం దొరకకపోయినా ఎక్కడ ఉన్నా అన్నింటికంటే విలువైన నామస్మరణ చేసుకోండి నామస్మరణ మనల్ని connected గా ఉంచుతుంది ఎవరితోటి? పరమాత్ముడి తోటి అందుకే నేను అంటాను స్వామి మనందరికీ మహిళలకు కూడా అదే చెప్తారు మీరు ఇంట్లో వంటింట్లో పనులు చేసుకుంటూ అయ్యో నేను భజనలకు వెళ్ళలేకపోతున్నానే అని కోపాన్నంతా కూరలు cut చేస్తున్నప్పుడు చూపించొద్దు cut చేస్తున్నప్పుడు నాలో ఉన్న దుర్గుణాలన్నీ cut చేస్తున్నాను స్వామి పాడికి భావన అంటారు స్వామి భావం కావాలి స్వామి పాటికి ఏం చేస్తూ ఉంటారు? స్వామి దర్శనానికి వచ్చి ఉంటారు అందరినీ ఆశీర్వదిస్తున్నారు స్వామి భజనలు వింటూ ఆనందిస్తున్నారు స్వామికి అందరినీ ఆనంద పరుస్తున్నారు అనే భావన గనక మనం పుట్టపర్తికి తీసుకెళ్ళిపోతే మన మనసుని మన స్వామితో contact పెరిగిపోయినట్టే అట్లాగే మనం అటువంటి heart to heart contact మనం పెంచుకోవాలి అలాగే సమయం అదే వస్తుంది మనసుంటే మార్గం ఉందనుకున్నాం అట్లాగే వస్తుందన్నమాట అలాగే నేను విషయంలో నాకొక ఒక incident నేను చదివిన ఒక experience గుర్తుకొస్తుంది స్వామి దగ్గర మనం పుట్టపర్తిలో ఎందరో అంటే అది చదివిన తర్వాత నాలో భావన తెలిసిందన్నమాట వాళ్ళందరూ బాధపడుతున్నారంట కూలీ పనులు చేసుకుని పొలం పనులు చేసుకునే వాళ్ళందరూ స్వామిని అడిగారంట ఎంతో బాధతోటి స్వామి మరి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మీ సేవ కోసం మీ దర్శనం కోసం అందరూ వస్తున్నారు మరి మేమేమా కూలీ వాళ్ళం ఇట్లాంటి కూలీ పనులు చేయకుండా మాకేమో పొట్ట గడవదు ఇల్లు గడవదు మరి మేమెలా మిమ్మల్ని సేవించాలి అనంటే స్వామి చెప్పిన సమాధానం నిజంగా నేనెప్పటికీ మర్చిపోను స్వామి అన్నారు మీరు పొలం పనులు చేసుకుంటూ దారిన పోయే వాళ్ళందరికీ కూడా ఎవరినన్నా అడుగుతారు మీ దగ్గరికి వచ్చి సత్యసాయి బాబా గారు ఎక్కడ ఉంటారు?అని అన్నప్పుడు అదిగో అక్కడ ప్రశాంతి నిలయం ఉందే అని direct చేస్తారే అది నా గురించి చెప్తున్నప్పుడు అది నామస్మరణ అవుతుంది. నా గురించి చెప్తారు అలాగే మీరు పలమర్లు చేసుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అదే నామస్మరణ అదే అన్నింటికంటే సేవ. దాని వల్ల మనకు ఏంటంటే ఎంత దూరంలో ఉన్నామని కాకుండా ఎంత-- మానసికంగా మనం స్వామికి ఎంత దగ్గరలో ఉన్నామో చూసుకోవాలి. అదే అంట మనం ఎప్పటికప్పుడు స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి, వేడుకుంటూ ఉండాలి, అర్జీ పెట్టుకుంటూ ఉండాలి. భగవంతుడా! నేను చదువుకుంటున్నాను నాకు సెలవుల్ని నువ్వే ఇప్పించు, భగవంతుడా! నాకు ఆహ్ leave దొరికేట్టుగా నువ్వే చెయ్యి, నాకు ticket లేదు నువ్వే తెప్పించు. అట్లా Swami wants that kind of దాన్నే శరణాగతి total surrender అనమాట. surrendernees ని మనం కనుక ప్రతి పిల్లలను మనం దాన్ని-- అదంటారు స్వామి అనుగ్రహం కావాలి మన ప్రార్థన ఉండాలి. అది చేసినట్లయితే ఆటంకాల్ని అధిగమిస్తూ మనం వెళ్తామో మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. మనం పురాణాలన్నీ చదువుతూ ఉంటాం స్వా-- ఎన్నో miracles వింటూ ఉంటాం. అవన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి youth. రోజున అహల్యని స్వా-- దైవ-దైవం అనుగ్రహించలేదా? రోజున స్వామి చుట్టూతా ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇబ్బందులున్నాయి. అయినా సరే అధిగమించి సేవల్లోకి వస్తున్నారు కదా. అయన్నీ ఎవరు చేశారు? That is his miracle. miracle మనకు కూడా జరగాలి అని అట్లాంటి అనుగ్రహం మనం కూడా-- మనకు కూడా కావాలి అని youth ఎప్పుడూ కూడా మన స్వామిని ప్రార్థించుకుంటూ ఉండాలి. నేను చూశాను youth పిల్లలు వేల సంఖ్యలో వాళ్ళందరూ వాళ్ళ leaves అన్నీ save చేసుకుని ఎంతో జాగ్రత్తగా ఉంచుకుంటారు. అది వాళ్ళకి స్వామి పట్ల ఉన్న ప్రేమ. ప్రేమ అంటే కాళ్ళు వత్తి స్వామికి సపర్యలు చేయడం కాదు కదా. స్వామి అదే అంటారు భావం ఉంది చూసారా నేను ఆయన కోసం చేస్తున్నాను అని. భావమే మనల్ని ఆరంద పరుస్తుంది. స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యేట్టు చేస్తుంది. చేయాల్సిందల్లా ప్రార్థన. ఆయనే మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటారు. [నవ్వు] ఇప్పటివరకు కుమారి సాయి అరుణ్ గారి interview విన్నాము. ఇంతటితో ఈరోజు మా తెలుగు కార్యక్రమాలు సమాప్తం. ఓం శ్రీ సాయి రామ్. [నవ్వు]
SSSMC · audio

Telugu Broadcast - 490

Home

Telugu Broadcast - 490

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 57:06

More in this series

Telugu Broadcasts

12 episodes · 11 hr 32 min

  1. 57 min 394

    Telugu Broadcast - 394

  2. 1 hr 396

    Telugu Broadcast - 396

  3. 58 min 402

    Telugu Broadcast - 402

  4. 58 min 420

    Telugu Broadcast - 420

  5. 56 min 424

    Telugu Broadcast - 424

  6. 57 min 427

    Telugu Broadcast - 427

  7. 57 min 490

    Telugu Broadcast - 490

    Now playing
  8. 56 min 491

    Telugu Broadcast - 491

  9. 56 min 498

    Telugu Broadcast - 498

  10. 58 min 555

    Telugu Broadcast - 555

  11. 57 min 560

    Telugu Broadcast - 560

  12. 58 min 561

    Telugu Broadcast - 561