Skip to content
Transcript తెలుగు
[సాయి బాబా భజన] ఓం శ్రీ సాయిరాం! రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. ఈరోజు మనమందరం ఒక పుణ్యప్రదమైన పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. అది సత్యసాయి భగవానుని యొక్క అవతార ప్రకటనకు డెబ్బైఐదు ఏళ్ళు. పందొమ్మిది వందల నలభై అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఐదులోకి ప్రవేశిస్తున్నాం. డెబ్బైఐదు ఏళ్ళలో రెండువేల పదకొండవ సంవత్సరంలో అంటే మూడు సంవత్సరాలు మినహాయించినట్లయితే డెబ్బైరెండు సంవత్సరాలు స్వామి నిరంతరంగా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిక్షణం కూడా మన మానవ జాతిని ధర్మ మార్గంలో, ప్రేమ మార్గంలో, శ్రేయోమార్గంలో అలాగే సేవా మార్గంలో నడిపించడానికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ, ప్రబోధం చేస్తూ, సనాతనమైన ధర్మాన్ని ఆచరించమని బోధిస్తూ, ప్రశాంతి నిలయం కేంద్రంగా సర్వ ప్రపంచానికి కూడా ఆధ్యాత్మికం చేసినటువంటి అతి మంగళప్రదమైనటువంటి కాలం కాలం. ఈరోజు ప్రతిజ్ఞ చేసి ప్రపంచానికి ప్రమాణం చేశారో, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ, వేదోద్ధరణ అనేటటువంటి మూడు పాయలుగా సాగిన కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో అనేక రీతులలో శాఖోపశాఖలై సర్వ ప్రపంచాన్ని కూడా నడిపిస్తుంది. ఇది భక్తులుగా మనందరి విశ్వాసం. అయితే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, చిరకాల భక్తులు శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు రేడియో సాయి కోటి సమితి ప్రాంగణంలో రోజున దిశానిర్దేశం చేస్తూ సందేశాన్ని మనకు అందించారు. సందేశం స్వామి భావనకు అద్దం పట్టేలా, స్వామి ఆలోచనలకు అనుగుణంగా మనందరినీ సన్మార్గంలో నడిపించే దిశగా సాగిన ప్రవచనాన్ని విందామా? [సాయి బాబా భజన] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శిలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాంమే. పరమ మహేశ్వర స్వరూపుడు, సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, పరమ పవిత్రమైనటువంటి కాలంలో సత్యసాయి భగవానుడి యొక్క అవతరణ జరిగి అంటే అవతార ప్రకటన జరిగి డెబ్బై నాలుగు ఏళ్లు పూర్తయి డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. పందొమ్మిది వందల నలభైలో మే ఇరవై మూడున "నేను సాయిబాబాను" అని ప్రకటించినటువంటి స్వామి పందొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైవ తారీఖున తమ అవతార ముఖ్య ఉద్దేశ్యాన్ని, ప్రణాళికని ప్రపంచానికి బహిర్గత పరిచారు. స్వామి కంటే ముందు వచ్చినటువంటి అవతారాలు ఏవీ కూడా తాము ఎందుకు వచ్చామో చెప్పలేదు. ఎందుకు వచ్చారో వారికి తెలుసు గనుక వారి కార్యకలాపాలని సాగిస్తూ తమ అవతార వైభవాన్ని ఒక తరం నుంచి, ఒక యుగం నుంచి మరొక యుగానికి అందిస్తూ ధర్మ సంస్థాపన చేశారు, ధర్మాచరణ చేశారు, ధర్మాసక్తి కలిగించారు. ధర్మాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరినీ కూడా రక్షించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ "యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అని "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని ప్రపంచానికి అభయవరదానం చేశాడు. అయితే మన కాలం అంటే కలికాలానికి మహా పరిపూర్ణ అవతారి అయినటువంటి సత్యసాయి భగవానుడు ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ, వేదోద్ధరణ ప్రధానమైనటువంటి అంశాలుగా తమ అవతార కార్యక్రమాన్ని ప్రకటించి డెబ్బై ఐదు సంవత్సరాలు అప్రతిహతంగా, అనాహతంగా దేశాలు ఎల్లలు దాటి, ఖండ ఖండాంతరాలు దాటి సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడా శాంతిని, ప్రేమను పొందే మార్గాన్ని సూచిస్తూ ఆదర్శవంతమైనటువంటి, ఆచరణాత్మకమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి శ్రీకారం చుట్టి, ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి మారటమే అధ్యాత్మ అని కొన్నాళ్ళు, ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావటం అధ్యాత్మ అని మరికొన్నాళ్ళు, కడగా మానవుడు మానవుడిగా జీవించగలిగితే అది అధ్యాత్మ అని ప్రకటన చేసి మానవుడు తనలో దాగి ఉన్నటువంటి దానవత్వ, దీనత్వ, మానవత్వ, దివ్యత్వ అనబడేటువంటి నాలుగు అంశాలని కూడా ఒక క్రమ పరిణామ దశలో తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్లాలని, దానికి మానవ జీవితాన్ని మించినటువంటి వేదిక లేదనిజీవితం విసిరేటువంటి ప్రతి సవాలుని స్వీకరించి ప్రతి వ్యక్తి తన లక్ష్య గమ్యాలను నిర్దేశించుకొని సంపూర్ణ మానవీయతతో మానవ జీవితాన్ని గడపాలి అని ప్రబోధించినటువంటి స్వామి జాతి మత వర్గ వర్ణములకు అతీతంగా పరమాత్మ తత్వాన్ని భారతీయ తత్వ సిద్ధాంతాన్ని సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని అందరికీ పరిచయం చేస్తూ సేవామగ్నుడు గనుక కాగలిగినట్లయితే మానవ జీవితం పూర్ణంగా ధన్యవంతమవుతుంది అని ప్రవచించి సమస్త మానవాళిని కూడా ప్రేమతో కూడిన సేవ సేవతో కూడిన ప్రేమ అనేటువంటి ఏకైక ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి మహోన్నతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు అయితే దానికి స్వామి ఎంచుకున్నటువంటి మార్గము విభిన్నమైనది విలక్షణమైనది. సనూతనంగా అనిపించిన అది బహు సనాతనమైనది శ్రీరాముడి వలె శ్రీకృష్ణుడి వలె తదాదిగా గలగినటువంటి అవతార మూర్తుల వలె అనేక లీలలు సాగిస్తూ మానవుడికి భగవంతుని యందు ఉన్నటువంటి శక్తిని పరిచయం చేస్తూ చమత్కార సంస్కార పరోపకార సాక్షాత్కార అనబడేటువంటి నాలుగు అంశాలతో మానవుణ్ణి దివ్యత్వం వైపు నడిపించినటువంటి సనాతన సారథి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అయితే ప్రాపంచికమైనటువంటి అన్ని వస్తువులు దగ్గర ఉన్నా అంతరిక్షం దాకా తన మనస్సుని తన ప్రజ్ఞని మానవుడు తీసుకు వెళ్లగలిగిన అంతరంగంలోకి తొంగి చూడగలిగినటువంటి సౌభాగ్యానికి నోచుకోనటువంటి ఆధునిక మానవుడికి స్వామి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి ఇది ప్రధానం ఎందుకంటే అవతార ప్రవాహంలో అనేకమైనటువంటి రూపాలుగా నామాలతో ఒక పరమాత్మ తనను తాను పరిచ్ఛిన్నం చేసుకుని ఒక యుగంలో రాముడిగా మరొక యుగంలో కృష్ణుడిగా వచ్చినట్లే కలియుగంలో పూర్ణ అవతార మూర్తిగా సత్యసాయి భగవానుడు అవతరించటం జాతి సృష్టి చేసుకున్నటువంటి ఒక పుణ్య తమ విశేషంగా మనం భావన చేయాలి అయితే స్వామి సూచించిన మార్గం ఏమిటి సేవ చేయాలి సేవ చేయాలి అంటే మానవుడు అహంకార మమకారాలు రెండు తగ్గించుకోవాలి తగ్గించుకుని నెమ్మదిగా సేవా కృతిగా గనుక మారినట్లయితే తనవారు పెరవారు అన్నటువంటి భేదం లేకుండా అందరినీ ఒకే దృష్టితో అందరి యందు ఉన్నటువంటి ఆత్మను సమ దృష్టితో సమ్యక్ దర్శనాన్ని చేయగలిగినటువంటి ఒక మహాద్భాగ్యాన్ని పొందగలడు అని చెప్పడానికి సేవా యోగ ప్రతిపాదన చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి అలాగే ప్రపంచం అంతా కూడా ప్రాపంచికమైనటువంటి అనేకమైన అనుకూలాలు ఉన్నప్పటికీ కూడా చిత్తశాంతి కరువైనటువంటి వేళ సంపద అపారంగా పెరిగినప్పటికీ దాతృత్వం కనుమరుగైనటువంటి వేళ పరస్పరమైనటువంటి జాతులన్నీ కూడా కులం చేత మతం చేత భాష చేత వర్గం చేత భావన చేత విడిపోతున్నటువంటి వేళ సమస్త ప్రపంచాన్ని ఐక్యం చేసేటువంటి ఒక మహాద్భుత కార్యక్రమానికి ప్రణాళికకి సత్యసాయి భగవానుడు శ్రీకారం చుట్టారు నిజానికి ఆధునిక మానవుడికి ఇంటెలిజెంట్ కోషెంట్ లో లోపం లేదు ఏం తక్కువ లేదు నిజానికి గతించినటువంటి అనేక తరాల కంటే ఆధునిక మానవుడు మేధా సంపత్తిలో సమున్నతుడు అట్లాగే వైజ్ఞానిక భూమికలో అతను అందుకోలేనటువంటి అంశాలు లేవు అంగారక గ్రహాన్ని చేరగలడు చందమామను తాకగలడు సూర్యగోళం వైపు పయనించగలడు రాబోయే కాలంలో భూగోళాన్ని ఖగోళాన్ని ఏకం చేయగలిగినటువంటి ఒక వైజ్ఞానిక ప్రజ్ఞా భూమికను సంతరించుకున్నటువంటి ఆధునిక మానవుడు చిత్తశాంతికి దూరమై తాను దేనిని పొందవలసి ఉన్నదో దానిని పొందలేక ఆనందానికై అర్రులు చాస్తూ ఎడారి జీవితాన్ని గడుపుతున్నటువంటి వేళ స్వామి ప్రేమ అనేటువంటి ఒక దివ్య ఆధ్యాత్మిక బీజాలు నాటి "ప్రేమ బినా నిర్వాణ నహి సేవ బినా నిర్వాణ నహి" అనేటువంటి ఒక మోక్ష మార్గాన్ని నిర్వాణము అంటే మరణానంతర సుఖం కాదు పునరావృత్తి రహితమైన అంటే మళ్ళీ మరల మరల జన్మ రానటువంటి ఒక పతాక స్థాయికి చెందినటువంటి భావనని సమాజానికి సంఘానికి ప్రపంచానికి సమస్త మానవాళికి చాలా సులభంగా సూటిగా గంభీరంగా ఉత్తమంగా ఉన్నతంగా ఉదాత్తంగా ఉత్కృష్టంగా హచ్చంగా స్వచ్చంగా యదార్థంగా అనుగ్రహించారు మానవుడు సాధనా మార్గంలో గనుక ప్రవేశించినట్లయితే తన అహంకార మమకారాలు రెండింటినీ తగ్గించుకుంటూ తన spiritual intelligence ని spiritual quotient ని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రజ్ఞని తన యందు ఉంచుకొని కూడా ఒక కస్తూరి మృగం ఎట్లాగైతే మదము ఇచ్చేటువంటి పరిమళాన్ని ఎక్కడెక్కడో ఉన్నదని అడవంతా తిరిగి తిరిగి అది తన యందే దాగి ఉన్నదని తెలుసుకున్నట్లుగా ఆత్మ అంటే ఎక్కడో ఉన్నదని ఆత్మం పరాయి వస్తువని మరణానంతరం పొందవలసినటువంటి అనుభూతి అని అజ్ఞాన భూమికలో ఉన్నటువంటి మానవుడికి ఆత్మం తన యందే ఉన్నదని దానిని ఎరుకతో తెలుసుకోవాలని దానికి కావలసినటువంటి ఏకైక మార్గం సేవా మార్గం కనుక పరస్పరమైనటువంటి ప్రేమ భావాలతో జీవించాలని unity purity divinity అనబడేటువంటి మూడింటిని స్వామి సమన్వయం చేస్తూ "మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః" అన్న దానిని unity గాసర్వోత్తమమైనటువంటి ఆత్మవంతుడు అయినటువంటి మానవుడు దివ్యాత్మ స్వరూపుడై ప్రేమాత్మ స్వరూపుడై తన నిజస్థితి ఆత్మస్థితి అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఎరుకలో జాగృతమైన స్థితిలో జీవించగలిగినట్లయితే దాని పేరు శుద్ధత్వమని మానవుడు శుద్ధ చైతన్య స్వరూపుడని దేహము జడమని అశాశ్వతమని అనిత్యమని కానీ నిత్య సత్య శాశ్వతమైనటువంటి విభూతి ఆత్మగా లోపల నేను నేను అని వెలుగుతున్నదని purity అనేటువంటి ఒక పదానికి ఒక పరమాద్భుతమైన వైదాంతిక నిర్వచనాన్ని అనుగ్రహించారు. ఎక్కడైతే purity ఎక్కడైతే unity ఉన్నదో దాని పేరే divinity అని దివ్యత్వం అంటే వేరే లేదని ఉన్నదంతా మరయందే ఉన్నదని అది ఇప్పుడే ఇక్కడే ఇహమేవా అన్నటువంటి వేద ప్రామాణికమైనటువంటి మాటకు అనుసరణీయంగా Now and here అని దానిని ఇక్కడే తెలుసుకోవాలని అన్ని శబ్దాలు పుట్టని శబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితమ్ము మానవ జన్మ ఎందుకు వచ్చింది? నారాయణున్ని అన్వేషించాలి. ఎక్కడున్నాడు నారాయణుడు? తనయందే ఉన్నాడు. మానవుడి అంతర్గతమైనటువంటి చైతన్య శక్తిని ఆత్మగా భావించగలిగిననాడు మానవుడు దేహాభిమానాన్ని తగ్గించుకొని ఆపై నెమ్మదిగా వదులుచుకొని తాను ఆత్మ స్వరూపుడై అఖండమైన చిద్ఘనమైన అనాహతమైనటువంటి ఒక నిలకడ చెందినటువంటి ఆత్మతత్వంలో సర్వానందమయ భూమికని అనుభవించగలడని చెప్తూ దానికి సమాజహితమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మానవుడు తనను తాను సంబాళించుకోవాలని తనను తాను refine చేసుకోవాలని redefine చేసుకోవాలని తనను తాను సమున్నతుడిగా తీర్చిదిద్దుకోవాలని సర్వ జగత్తుకి కూడా ఆనంద సంధాయకమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి సోదాహరణంగా ఉండాలని చెప్తూ ఏనకేన ప్రకారేన ఏష కష్యాపి దేహిన సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం అన్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకానికి భావానికి నిర్వచనంగా అంటే ఏమున్నది శ్లోకంలో ఎవరైనా సరే తమ తమ ప్రజ్ఞల ద్వారా తాము సాధించుకున్నటువంటి జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారందరికీ గనక ఆనందాన్ని కలిగించగలిగినట్లయితే అది మాత్రమే ఈశ్వర పూజ అనేటువంటి ఒక దివ్య భావనని ప్రపంచానికి అందించారు స్వామి. అంటే పూజ, వ్రతం, దానం, యాగం, యోగం, యజ్ఞం ఇవన్నీ కూడా బహిరంగ క్రతువులేనని కానీ ఇవన్నీ మానవుడికి సాధనా సంపత్తులని అవసరమని కానీ కడగా effortless effort అంటామే ప్రయత్నమే అక్కరలేని ఒకానొక ప్రయత్నం వైపు మానవుడు అడుగు వేయాలని అప్రయత్నంగా కాక సప్రయత్నంగా గంభీరంగా ఉదాత్తంగా బలంగా ధృడంగా సత్యంగా తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళాలి అని అనేకమైనటువంటి ప్రాచీన వాంగ్మయాన్ని అనేకమైనటువంటి దివ్య భావనలని ఋషి భావనలని అన్నింటినీ కూడా సూత్రీకరించి వాహినీ స్వరూపంగా స్వామి ప్రపంచానికి అందించారు. నిజానికి ఒక అవతార మూర్తి అవని మీద సంచారం చేసింది భౌతికంగా కేవలం ఎనభై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ అందున డెభై ఐదు సంవత్సరాల అవతార ప్రణాళికలో స్వామి ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేశారు, చేయించారు. అలాగే మానవుణ్ణి విద్యా వైద్య రంగాలతో పాటుగా తమ ప్రజ్ఞనంతా కూడా సమాజహితం చేయాలని సమాజం గనక లేకపోతే వ్యక్తి పూర్ణ వ్యక్తి కాలేడని పూర్ణ వ్యక్తి లేనటువంటి సమాజం సభ్య సమాజం కాలేదని సమాజానికి వ్యక్తికి ఒక synonym అంటే అభిన్న అద్వితీయ అద్వైతమైనటువంటి భావనని దీనికి దానికి బింబ ప్రతిబింబ భావనగా చేసి సమాజంలో హితకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని రకంగానే మానవుడు సమున్నతుడు కాగలడని ఒక నది ఎక్కడో పుట్టి నెమ్మదిగా ఒక చినుకుగా మొలకగా ప్రారంభమై తన దారంతా ఎత్తు పల్లాలని అధిగమిస్తూ తనను తాను శుభ్రపరచుకుంటూ పవిత్రీకరించుకుంటూ రూపాంతరీకరణం చెందకుండా అమలినమైనటువంటి అంటే మాలిన్యం లేనటువంటి భావనతో సాగరుడితో ఎట్లాగైతే సంగమిస్తున్నదో జీవుడు కూడా తన జీవన మహాప్రస్థానంలో ఎక్కడ పుట్టినా, చోట పుట్టినా తన జీవితమంతా కూడా నదీ ప్రవాహంతో సరిపోల్చుకుంటూ తనలో ఉన్నటువంటి చెడు గుణాలని, దౌర్బల్యాలని, అల్పత్వాలని, అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అనాచారాన్ని అన్నింటినీ వైదొలగింప చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా స్వస్వరూపానుసంధానం వైపు వెళ్లాలని పరమేశ్వరుడు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అని కదా! ఇక్కడ నమస్కారం మాత్రమే కాదు నదులన్నీ కూడా ఒక సాగరాన్ని ఎట్లా సంగమిస్తున్నాయో జీవులన్నీ కూడా సత్య సాయి భగవానుడు అనబడేటువంటి ఒక మహాక్షీర సాగరంలోకి సంగమించాలని దానికై మానవుడు నిరంతరమూ అహర్నిశమూ కృషి చేయాలని అనేకమైన దౌర్బల్యాలను వదులుచుకోవాలని ప్రాపంచికమైన ఆకర్షణ నుంచి బయటపడి మనస్సు హృదయము అందించేటువంటి సంపూర్ణమైనటువంటి హిరణ్యగర్భానందాన్ని పొందాలని ఇటు భౌతిక, అటు ఆదిభౌతిక, అటు ఆధ్యాత్మిక అంటే physical, metaphysical and spiritual మూడు స్థాయిలలో మానవుడు పూర్ణ మానవుడు కావాలని ఆకార మానవుడు ప్రపంచానికి బరువైతే ఆచార మానవుడు ప్రపంచానికి పరువని చిన్న చిన్న మాటలతో అచ్చమైనటువంటి తెలుగు శబ్దాలతో ఒక సమున్నతమైనటువంటి భావాన్ని అందరికీ అందించినటువంటి పరమాత్మ నిజానికి ఒక పరమోన్నతమైనటువంటి బౌద్ధగా మనం అనుభవించాలి. బౌద్ధ అంటే బోధించేవాడు అని. స్వామి కేవలం బోధించి ఆగలేదు ఆచార్యత్వాన్ని స్వీకరించారు. సర్వ ప్రపంచానికి ఒక గురు స్థానంలో నిలబడి ఆచార్యత్వాన్ని అధివసించి సర్వ మానవ జాతిని కూడా ప్రేమ మార్గం వైపు సేవా మార్గం వైపు నెమ్మదిగా మళ్ళించి అనేకమైనటువంటి క్షేత్రాలని సుసంపన్నం చేస్తూ...విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞాన అనబడేటువంటి మూడు భూమికలలో కూడా ముందు విజ్ఞాన భూమిక ఉండాలి. విజ్ఞాన భూమికలో information కావాలి. ప్రజ్ఞాన భూమిక కావాలి skill కావాలి. అట్లాగే సుజ్ఞాన కావాలి మనకి knowledge ఎప్పుడు ఎంతవరకు అవసరమో దానిని ఎట్లా apply చేయలో అంటే అనుష్టాన వేదాంత భూమిక. అందుకే స్వామి దీనన్నింటిని కూడా రెండు పదాలలో కూర్చి "చెప్పుట సులభము చేయుట కష్టము" అనేటువంటి రెండు అందమైన పదాలలో దానిని పొదిగి వదిగించి చెప్పటం నెమ్మదిగా ఆపాలి, చేయటం మొదలు పెట్టాలి. చేయటం మొదలు పెడుతున్నప్పుడు అది సర్వోన్నతమైన అటువంటి ఆనంద రేఖని అతిశయింపజేసేటువంటి దిశగా మానవుణ్ణి పరమ పావన మూర్తిగా తయారు చేస్తుంది గనుక ఇక్కడ స్వామి ముక్తిని ఇవ్వడానికో, మరణానంతర సుఖాన్ని ఇవ్వడానికో వచ్చిన అవతార మూర్తి కాదు. స్వామి ఒక పరిణామానికి చిహ్నం అంటే నిన్నటికంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు ప్రతి వ్యక్తి తనను తాను self audit చేసుకోవాలి. నిన్నటికంటే ఉత్తమంగా గనక వేళ జీవించలేకపోతే కారణాలు వెతకాలి. ఉన్నతంగా జీవించటానికి గల మార్గాలను అన్వేషించాలి. మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో నుంచి మానవుడు తననుతాను తీర్చిదిద్దుకోవాలి. ఇది సత్యసాయి భగవానుడి యొక్క అవతార లక్ష్యమిది. ఇక్కడ ప్రపంచం అంతా అసమానతతో కూడి ఉంటుంది. సృష్టి రహస్యమే ఇది. అంటే కలిగిన ప్రతి వాడు నలిగిన వాణ్ణి ఆదుకోవాలి. అందరి కన్నీరు తుడవగలిగినటువంటి ఒక స్థాయికి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలి. సమాజ సేవ చేయాలి అంటే తన చేతులు, చేతలు, తలుపులు, తలపులు అన్నీ కూడా బలంగా, దృఢంగా చేసుకోవాలి. దానికి మహాత్ములను సమాశ్రయించాలి. అనేకమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి భావనలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకోవాలి. జీవితం మనకు పరచి తెరచి ఉంచినటువంటి అనేక మార్గారులు ఎదురయ్యేటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా పవిత్రీకరించుకోవాలి. positive గా మలుచుకోవాలి. energy మనలో ఏదైతే ఉన్నదో శక్తివంతమైనటువంటి భూమికని అనేక కోణాలలో మూడు వందల అరవై degreeలలో దాన్ని సమున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని సంతరింపజేసే దిశగా మానవుడు ప్రయత్నం చేయాలి. ఇది సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అవతార ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు ముచ్చటించుకుందాం. ఒకటి విద్య. విద్యారంగం కలుషితమై చదువు అమ్మబడుతున్నటువంటి వేళ "చదువులన్నీ చదివి చావంగానేటికి చావులేని చదువు చదువవలయు" అని మానవతా విలువలతో కూడినటువంటి ఒక విద్యా విధానానికి స్వామి శ్రీకారం చుట్టారు. కనుకనే పుట్టపర్తి వంటి ఒక కుగ్రామాన్ని ప్రపంచ పటంలోకి తీసుకొచ్చి ఎక్కడా లేనట్లుగా ఒక పరమాద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని స్వామి స్థాపన చేశారు. అలాగే ఒకనాటి జాతి "వైద్యో నారాయణో హరిహి" అని అనిపించుకున్నటువంటి ఒక జాతి కర్తవ్యాన్ని మరచినటువంటి వేళ మళ్ళీ మరొక్కసారి దయా, కరుణ, జాలి, సానుభూతి, ప్రేమ అన్నీ కలబోసుకున్నటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వైద్య విధానానికి శ్రీకారం చుట్టి super speciality hospital కట్టించారు. అట్లాగే మానవ శరీరంలో సుమారు డెబ్బై ఎనిమిది percent నీరు అయినట్లయితే దానిలో శాతం తగ్గినా మానవుడు నిర్వీర్యుడవుతాడు. అంటే మానవుడి యొక్క మనుగడకి ప్రాణాధారమైనటువంటి నీరు స్వామి ఎవరెవరికి ఎంతెంత ఎప్పుడెప్పుడు ఎట్లా అందించాలో సమయపాలన చేస్తూ నిర్ణీత సమయంలో ఇది అసాధ్యం అనుకున్న దానిని స్వామి సుసాధ్యం చేసి మానవ జీవితానికి దాహార్తి తీర్చారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్లినట్లయితే స్వామి చేయనిది లేదు, చెప్పనిది లేదు. నిజానికి చెప్పటానికి ఇంకా మిగిలింది లేదు. చేయవలసిన కర్తవ్యం మాత్రం మనకప్పజెప్పారు. ఇవాళ సాయి భక్తులుగా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మనందరం కూడా దీక్షా కంకణము బద్ధులై మళ్ళీ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆదేశాన్ని, సందేశాన్ని, ఉపదేశాన్ని ఆచరణాత్మకమైనటువంటి భూమికలో ప్రపంచానికి మన-మన జీవితాల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన-మన భావనల ద్వారా, మనం ప్రపంచాన్ని చూసేటువంటి ఒక దృష్టి ద్వారా, సమభావన ద్వారా, సహజీవన సౌందర్య సాధన ద్వారా మనం ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని మన జీవితాన్ని స్వామి సందేశంగా మార్చుకోవలసిన ఒక తరుణం ఆసన్నమైనదిగా భావిస్తూ డెబ్బై ఐదవ అవతార ప్రకటన పర్వదిన సందర్భాన చేస్తున్నటువంటి తొలి ప్రసంగం సాయి భక్తులందరికీ, సాయి సోదరులందరికీ కూడా ఒక ఉద్దీపన కలిగించేటువంటి రీతిగా సాగాలని అట్లాగే స్వామి కార్యకలాపాలలో మనందరం కూడా ఏకోన్ముఖంగా పూర్ణమైనటువంటి ఐకమత్యంతో ఎటువంటి అరమరికలు లేకుండా, మానసికమైనటువంటి ఎటువంటి barriers లేకుండా సీమోల్లంఘనం చేస్తూ మనందరం కూడా సత్యసాయి కుటుంబంగా భావన చేసి ప్రపంచానికి మార్గోపదేశనం చేయగలిగినటువంటి ఒక మహత్తర జాతి నిర్మాణానికి మనం ఇవాళ పునరంకితం కావాలని భావనలో స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎప్పుడో చెప్పినట్లుగా స్వామి మన వెంటా జంటా ఉంటారనేది మనందరికీ తెలిసినదే. కానీ ఇవాళ తెలుసుకోవలసిన ఒక్క విషయం ఏమిటంటే స్వామి వెంటా జంట మాత్రమే కాదు స్వామి మన నరనరాల్లో అణువణువునా కూర్చొని ఉన్నారని, ఆయన శక్తే ప్రపంచాన్ని నడిపిస్తుందని, ఏది రానీ, ఏది పోనీ సర్వోన్నతమైనటువంటి ఒక మానవ జాతి నిర్మాణం జరగాలని, దిశగా మనందరం కూడా మన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చాలని అట్లాగే స్వామి చెప్పిన నాలుగు మహా వాక్యాలని సాధనా పూర్వకంగా స్వీకరిస్తూ Love all serve all help ever hurt never అనబడేటువంటి మహావాక్య సందేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అణువణువునా నలుమూలలా చాటేటువంటి దిశగా మన ఊపిరి, మన శ్వాస, మన ఆలోచన, మన జీవన విధానం సుసంపన్నం కావాలని స్వామిని మనసా, వచసా, శిరసా ప్రార్థన చేస్తూ శుభ సందర్భాన మళ్ళీ రాబోయేటువంటి తరం గర్వపడేలాగా మనల్ని అనుసరించే రీతిలో మనల్ని role models గా పెట్టుకునేటువంటి దిశగా మనల్ని మనం నిర్మాణం చేసుకోవాలని, యోగాన్ని అనుగ్రహించమని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రార్థన చేస్తూ, వినతి చేస్తూ అందరికీ కూడా సర్వ శ్రేయోదాయకమైనటువంటి మార్గం లభించాలని, శాంతి, ప్రేమ ప్రపంచాన్ని నడిపించాలని, కార్పణ్యమే లేనటువంటి ఒక సభ్య సమాజ నిర్మాణం జరగాలని, సత్య సాయి యుగం అనతికాలంలో ప్రారంభం కావాలని, కలియుగమంతా కూడా భగవన్నామ సంకీర్తనతో సత్యసాయి భగవానుడి ఆదేశానుసారంగా నడిచి సర్వోన్నతమైన స్థితిని అందుకోవాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ సాయిరాం. [ Background music ] ఇంతవరకు మీరు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, చిరకాల భక్తులు శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రవచనాన్ని విన్నారు. కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org కి రాసి పంపండి. ఓం శ్రీ సాయిరాం. [ Background music ]
SSSMC · audio

Talk on the occasion of Avatar Declaration day

Home

Talk on the occasion of Avatar Declaration day

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 26:18

More in this series

Talks

14 episodes · 6 hr 52 min

  1. 24 min 1

    Talk on significance of festival of Sankranthi

  2. 52 min 2

    Talk - on Guru Tatwam

  3. 40 min 3

    Talk - Koti Samithi Hyd

  4. 28 min 4

    Talk - Bharata

  5. 23 min 5

    Talk on Dasara

  6. 6 min 6

    Talk on Rathasaptami

  7. 32 min 7

    Talk on Sri Sathya Sai - Part 05

  8. 33 min 8

    Talk on the character of Draupadi

  9. 30 min 9

    Talk on Gyana Yoga

  10. 29 min 10

    Talk on Hanuman Panchamukham

  11. 23 min 11

    Talk on Leela Kaivalya Vahini

  12. 35 min 12

    Talk on Sathya Sai Sukthamulu

  13. 24 min 13

    Talk on yoga Triveni

  14. 26 min 14

    Talk on the occasion of Avatar Declaration day

    Now playing